united andhrapradesh
-
' ఇరు ప్రాంతాలకు కేంద్రం అన్యాయం చేసింది'
విభజనతో కేంద్రం అటు తెలంగాణ ఇటు సీమాంధ్ర ప్రాంతాలకు అన్యాయం చేసిందని విశాలాంధ్ర మహాసభ నేతలు శుక్రవారం న్యూఢిల్లీలో ఆరోపించారు. విభజన ద్వారా జల వనరులపై కేంద్రం పెత్తనం చెలాయించాలని చూస్తోందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి కేంద్రం ఆమోదించి తెలుగు ప్రజలకు ద్రోహం చేసేదిగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటునే సమస్యలు పరిష్కారం అవుతాయన నేతలు అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా ఉంచేందుకు తమ ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని విశాలాంధ్ర మహాసభ నేతలు పేర్కొన్నారు. -
సమైక్యమే రాష్ట్ర ప్రజలకు శ్రేయస్కరం: కావూరి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమే దేశానికి, రాష్ట్ర ప్రజలకు శ్రేయస్కరమని కేంద్రమంత్రి, ఏలూరు లోక్‌సభ సభ్యుడు కావూరి సాంబశివరావు అభిప్రాయపడ్డారు. ఏలూరులో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర విభజనపై అవసరమైతే ఎటువంటి త్యాగాలకైనా సిద్ధమని ఆయన స్ఫష్టం చేశారు. రాష్ట్ర విభజనపై సీడబ్ల్యూసీ జులై 30న తీసుకున్న నిర్ణయం రాష్ట్ర ప్రజలకు ఎంతమాత్రం శ్రేయస్కరం కాదన్నారు. 2009 డిసెంబర్లో ఆంధ్రప్రదేశ్ విభజనపై కేంద్ర ప్రకటన తొందరపాటు చర్య అని తాను కేంద్రానికి ముందే చెప్పానని కావూరి సాంబశివరావు ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే కేంద్రమంత్రి కావూరి సాంబశివరావుకు సొంత నియోజకవర్గమైన ఏలూరులో మంగళవారం సమైక్య సెగ తగిలింది. పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరుకు వస్తున్న కావూరిని కలపర్రు చెక్‌పోస్ట్ వద్ద దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో సమైక్యవాదులు అడ్డుకున్నారు. దాంతో కావూరి తన ఎస్కార్ట్ వాహనంలో బయలుదేరి ఏలూరు నగరాన్ని చేరుకున్నారు. -
సమైక్య రాష్ట్రంలోనే జగన్ సీఎం అవుతారు
వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు సమైక్యరాష్ట్రంలోనే జరుగుతాయని తాము భావిస్తున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లో వెల్లడించారు. సమైక్య రాష్ట్రంలోనే వైఎస్ జగన్ సీఎం అవుతారన్నారు. ఎన్నికల అనంతరం దేశ రాజకీయాల్లో జగన్ కీలకపాత్ర పోషిస్తారని ఆయన జోస్యం చెప్పారు. జగన్ త్వరలోనే జైలు నుంచి బెయిల్‌పై విడుదల అవుతారన్నారు. తమ పార్టీకి భారత న్యాయ వ్యవస్థపై సంపూర్ణ విశ్వాసం ఉందని తెలిపారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రజల్లోకి రాకూడదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కోరుకుంటున్నారని మేకపాటి ఈ సందర్బంగా పేర్కొన్నారు. -
'జగన్ దీక్షకు మద్దతుగా పోరాటం ఉధృతం'
రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా వైఎస్ జగన్ చేపట్టిన ఆమరణ దీక్షకు మద్దతుగా తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని అనంతపురం జిల్లాకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు శంకర్ నారాయణ, విశ్వేశ్వరరెడ్డి, ఎర్రుస్వామిరెడ్డిలు సోమవారం ఇక్కడ తెలిపారు. ఈ నెల 27న రహదారులను దిగ్బంధం చేస్తామన్నారు. అలాగే 28న నగరంలోని విద్యార్థులతో అతిపెద్ద ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు. అలాగే 29న ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తామని పేర్కొన్నారు. 30వ తేదీన జైలోభరో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వారు చెప్పారు. అయితే అనంతపురం జిల్లాలో సమైక్యాంధ్రకు మద్దతుగా చేపట్టిన ఆందోళనలు రోజురోజూకు ఉధృతం అవుతున్నాయి. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమైనాయి. విద్యాసంస్థలకు యాజమాన్యం స్వచ్ఛందంగా సెలవులు ప్రకటించాయి.