‘పెళ్లికాని ప్రసాద్‌’ మూవీ రివ్యూ | Pelli Kani Prasad Movie Review And Rating In Telugu | Sakshi
Sakshi News home page

Pelli Kani Prasad Review: కమెడియన్‌ సప్తగిరి హీరోగా చేసిన ‘పెళ్లికాని ప్రసాద్‌’ హిట్టా? ఫట్టా?

Mar 21 2025 10:53 AM | Updated on Mar 21 2025 4:25 PM

Pelli Kani Prasad Movie Review And Rating In Telugu

కమెడియన్ గా పీక్స్ లో ఉన్న సమయంలోనే సప్తగిరి హీరోగా టర్న్ తీసుకున్నాడు. ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత ఆయన చేసిన సినిమాలేవి బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. దీంతో కాస్త గ్యాప్‌ తీసుకొని ‘పెళ్లికాని ప్రసాద్‌’అనే సినిమాతో మళ్లీ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ చిత్రంతో సప్తగిరికి హిట్‌ పడిందా లేదా? సినిమా ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.

‘పెళ్లికాని ప్రసాద్‌’ కథేంటంటే..?
ప్రసాద్(సప్తగిరి) కి 38 ఏళ్లు. మలేషియాలో మంచి ఉద్యోగం.. భారీ జీతం. అయినా ఆయనకి పెళ్లి కాదు. దానికి ఒక కారణం వాళ్ళ నాన్నే(మురళీధర్‌). రెండు కోట్ల కట్నం ఇచ్చే అమ్మాయినే చేసుకోవాలని కండిషన్ పెడతాడు. చివరకు ఓ సంబంధం సెట్ అయి ప్రసాద్ ఇండియాకు తిరిగి వస్తాడు. అయితే ఆ సంబంధం క్యాన్సిల్ అవుతుంది. కట్ చేస్తే... ప్రియా(ప్రియాంక శర్మ) ఎప్పటికైనా పెళ్లి చేసుకుని విదేశాల్లో సెటిల్ కావాలనుకుంటుంది. ఆమెతోపాటు అమ్మ నాన్న లను, బామ్మను కూడా విదేశాలకు తీసుకెళ్లాలనుకుంటుంది. 

ప్రియ ఫ్యామిలీ మొత్తం ఓ ఎన్నారై సంబంధం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ప్రసాద్ గురించి తెలిసి.. ఫ్యామిలీ మొత్తం డ్రాప్ చేసి పెళ్లి చేయిస్తారు. పెళ్లి తర్వాత ప్రసాద్ ఇండియాలోనే ఉండాలనుకుంటాడు. ఈ విషయం ప్రియకి తెలిసిన తర్వాత ఏం జరిగింది? అసలు ప్రసాద్ పెళ్లి తరువాత ఇండియాలోనే ఎందుకు ఉండాలనుకున్నాడు? పెళ్లి తర్వాత ప్రసాద్‌కి ఎదురైన సమస్యలు ఏంటి? విదేశాలకు వెళ్లాలనుకున్న  ప్రియ ఫ్యామిలీ కోరిక నెరవేరిందా? లేదా? అనేదే తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే.. 
ఏజ్ బార్ అవుతున్న హీరోకి పెళ్లి కాదు. పెళ్లి కోసం నానా కష్టాలు పడడం.. ఈ కాన్సెప్ట్ తో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. పెళ్ళికానీ ప్రసాద్ సినిమా కథ కూడా ఇదే. దర్శకుడు ప్రెజెంట్ బర్నింగ్ టాపిక్ ని కథగా ఎంచుకున్నారు. ఉద్యోగం, ఆస్తి ఉన్నా అబ్బాయిలకు పెళ్లి కావడం కష్టంగా ఉంది. అలాంటి సమయంలో హీరో తండ్రి కట్నం కోసం వెంపర్లాడుతూ ఉంటాడు. ఇదంతా మనకి తెలిసిన..చూసిన కథే. అయితే  తెరపై చూస్తే మాత్రం... కొంతమేర ఎంటర్‌టైన్‌ అవుతాం. కొన్ని చోట్ల కామెడీ అతిగా అనిపించినా.. మరికొన్ని చోట్ల మాత్రం బాగా పేలింది.

హీరోయిన్‌ ఫ్యామిలీ ఎందుకు విదేశాలల్లో సెటిల్‌ కావాలనుకుంటుందో తెలియజేస్తూ కథను ప్రారంభించాడు దర్శకుడు. ఆ తర్వాత హీరో మలెషియా నుంచి పెళ్లి కోసం ఇండియాకు రావడం..పెళ్లి చూపులు..ఇవన్నీ పాత సినిమాలను గుర్తు చేస్తాయి. హీరో హీరోయిన్లు కలిసినప్పటి నుంచి కథనం కాస్త ఆసక్తికరంగా సాగుతుంది. ప్రసాద్‌ని ట్రాప్‌ చేయడానికి ఖుషీ సీన్‌ రిపీట్‌ చేయడం.. అలాగే అర్జున్‌ రెడ్డి స్టోరీ చెప్పడం.. ఇవన్నీ ఆకట్టుకుంటాయి.  ఇంటర్వెల్‌ సీన్‌ సెకండాఫ్‌పై ఆసక్తి పెంచుతుంది. అయితే ద్వితియార్థంలో కథనం సాగదీతగా అనిపిస్తాయి.  

నవ్వించడానికే పెట్టిన కొన్ని సీన్లు.. అంతగా వర్కౌట్‌ కాలేదనిపిస్తుంది. సెకండాఫ్‌ కథను ఇంకాస్త బలంగా రాసుకొని.. క్లైమాక్స్‌ విషయంలో జాగ్రత్త పడితే సినిమా ఫలితం మరోలా ఉండేది.  ఓవరాల్‌గా ఈ సినిమాలో కథ పెద్దగా లేకపోయినా.. సిచువేషనల్ కామెడీతో ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం చేశారు. 

ఎవరెలా చేశారంటే..
సప్తగిరి వన్ మాన్ ఆర్మీగా నవ్వించే బాధ్యతలు తీసుకున్నాడు. వయసు పైపడుతున్న ఇంకా పెళ్లి కాక, తండ్రిని ఎదిరించలేక ఇబ్బంది పడే కుర్రాడిగా ఆకట్టుకున్నాడు. డ్యాన్స్‌ కూడా బాగానే చేశాడు. సప్తగిరి తర్వాత ఈ సినిమాలో బాగా పండిన పాత్ర మురళీధర్ గౌడ్ ది. పూర్వికుల ఆచారాన్ని పాటిస్తూ కట్నం కోసం కన్నకొడుకు జీవితాన్నే ఇబ్బందులకు గురి చేసే నాన్న పాత్రకి పూర్తి న్యాయం చేశాడు.హీరోయిన్‌ ప్రియాంక్‌ శర్మ పాత్రకి నటన పరంగా పెద్దగా స్కోప్‌ లేదు కానీ కథ మొత్తం ఆమె చుట్టునే తిరుగుతుంది. అన్నపూర్ణమ్మ, ప్రమోదిని, పాషా ట్రాక్ ఆకట్టునేల ఉంది. మిగతా నటీనట్లు అందరూ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

టెక్నికల్ టీం విషయానికి వస్తే .. శేఖర్ చంద్ర అందించిన నేపథ్య సంగీతం బాగుంది. ముఖ్యంగా చాలా సీన్స్ లో ఇప్పటి ట్రెండ్ కి తగ్గట్టుగా వాడిన మీమ్ కంటెంట్ బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది.  పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ జస్ట్‌ ఓకే. ఇంట్రడక్షన్ సాంగ్ తో పాటు కొన్ని సాంగ్స్ చిత్రీకరణ చాలా బాగుంది. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సెకండాఫ్‌లో కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్‌ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. 
 

‘పెళ్లికాని ప్రసాద్‌’ టీమ్‌ వివరాలు
దర్శకత్వం: అభిలాష్ రెడ్డి గోపిడి
నిర్మాతలు: K.Y.బాబు (విజన్ గ్రూప్), భాను ప్రకాష్ గౌడ్, సుక్కా వెంకటేశ్వర్ గౌడ్, వైభవ్ రెడ్డి ముత్యాల
బ్యానర్: థామ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్స్
సమర్పణ: చాగంటి సినిమాటిక్ వరల్డ్ 
డిఓపి: సుజాత సిద్దార్థ్
సంగీతం: శేఖర్ చంద్ర
ఎడిటర్: మధు
- రేటింగ్‌: 2.5/5

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement