Sapthagiri
-
అడవికే పాఠాలు చెప్పడానికి వస్తే!
విష్ణు మంచు హీరోగా రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్ వంటి వారు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. మంచు మోహన్ బాబు ఈ చిత్రం నిర్మిస్తున్నారు. కాగా ప్రతి సోమవారం ‘కన్నప్ప’ నుంచి ఆయా పాత్రలను రివీల్ చేస్తున్నారు మేకర్స్. అందులో భాగంగా ప్రముఖ నటుడు బ్రహ్మానందం, సప్తగిరి పాత్రల ఫస్ట్ లుక్స్‌ని విడుదల చేశారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం పిలక పాత్రలో నటించగా, సప్తగిరి గిలక పాత్రను పోషించారు. ‘చేపకు ఈత, పులికి వేట, కోకిలకి పాట.. నేర్పిన గుగ్గురువులు.. అడవికే పాఠాలు చెప్పడానికి వస్తే..’ అంటూ వీరి పాత్రలను పరిచయం చేసింది చిత్రయూనిట్. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న ఈ సినిమా డిసెంబరులో విడుదల కానుంది. -
ఓటీటీలోకి వచ్చేసిన 'అన్‌స్టాపబుల్' మూవీ
'పిల్లా నువ్వు లేని జీవితం', 'సీమ శాస్త్రి', 'ఈడోరకం ఆడోరకం' తదితర కామెడీ సినిమాలతో రచయితగా పేరు తెచ్చుకున్న డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహించిన కామెడీ ఎంటర్టైనర్ 'అన్‌స్టాపబుల్'. 'అన్లిమిటెడ్ ఫన్' అనేది ఉపశీర్షిక. బిగ్ బాస్ విన్నర్ వీజే సన్నీ, సప్తగిరి హీరోలుగా నటించిన ఈ చిత్రంలో నక్షత్ర, అక్సాఖాన్ హీరోయిన్లు. ఏ2బీ ఇండియా ప్రొడక్షన్లో రజిత్ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. జూన్ 9న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి స్పందన అందుకుంది. IMDBలోనూ 7.8 రేటింగ్ , బుక్ మై షోలో 8.2 రేటింగ్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదలైంది. థియేటర్స్‌లో మిస్ అయిన ప్రేక్షకులు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయొచ్చు. చక్కటి హాస్యంతో కూడిన ఈ సినిమాని కుటుంబం మొత్తం కలిసి వీక్షించవచ్చు. (ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి' గ్లింప్స్‌లో కమల్‌హాసన్.. ఎక్కడో గుర్తుపట్టారా?) -
'సలార్' అప్డేట్.. స్టార్ కమెడియన్ అలా అనడంతో!
ఈ ఏడాది.. చాలామంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సినిమాల్లో 'సలార్' ఒకటి. ప్రభాస్ హీరో కావడం, ఈ మధ్య రిలీజైన 'ఆదిపురుష్' ఘోరంగా ఫ్లాప్ కావడం.. దీనికి కారణాలు అని చెప్పొచ్చు. ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇలాంటి టైంలో ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని ఇదే చిత్రంలో నటించిన ఓ స్టార్ కమెడియన్ బయటపెట్టాడు. అతడి చెప్పింది వింటే మీరు కూడా నిజమే అనుకుంటారు. (ఇదీ చదవండి: తొమ్మిదో నెల ప్రెగ్నెన్సీ.. హీరోయిన్ ఇలియానా ఇబ్బందులు!) కేజీఎఫ్ రెండు పార్ట్స్ తర్వాత ప్రశాంత్ నీల్ తీస్తున్న సినిమా 'సలార్'. దీన్ని కూడా రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఈ మధ్య తొలి పార్ట్ కి సంబంధించిన టీజర్ విడుదల చేశారు. ఇందులో హీరో ప్రభాస్ ని 10 సెకన్ల కంటే తక్కువగా చూపించారు. అయినాసరే 100 మిలియన్స్ కి పైగా వ్యూస్ తో ఇప్పటికే ఇది సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమా ట్రైలర్ ని ఆగస్టులో రిలీజ్ చేస్తామని స్వయంగా నిర్మాతలే ప్రకటించారు. ఇక ఈ సినిమాలో కమెడియన్ సప్తగిరి కూడా నటించాడు. స్వయంగా అతడే ఈ విషయాన్ని బయటపెట్టాడు. తన డబ్బింగ్ కూడా పూర్తయినట్లు ఓ ఫొటోని ట్వీట్ చేశాడు. అలానే 'సలార్'.. వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర రూ.2000 కోట్ల మార్క్ క్రాస్ చేస్తుందని వేరే లెవల్ ఎలివేషన్ ఇచ్చాడు. గతంలో బాహుబలి 2 (రూ 1788.06 కోట్లు), కేజీఎఫ్ 2 (రూ.1230 కోట్లు), ఆర్ఆర్ఆర్ (రూ.1275 కోట్లు) మాత్రమే పాన్ ఇండియా స్థాయిలో ఎక్కువ వసూళ్లు సాధించాయి. మరి వీటిని 'సలార్' అధిగమిస్తుందో లేదా అనేది చూడాలి? #SALAAR 🔥🔥🔥Today, I finished dubbing for my role in the highly anticipated film #Salaar. it's going to be a #doubleblockbuster. I'm confident that it will surpass the ₹2000cr mark at the box office. Thanks to #Panworld⭐️ Our #RebelStar #Prabhas #Garu & Director #Prashanthneel… pic.twitter.com/l2TMTyHf6w — Sapthagiri (@MeSapthagiri) July 8, 2023 (ఇదీ చదవండి: గే రిలేషన్షిప్లో కొడుకు? నా నిర్ణయం అదే: 'అదుర్స్' విలన్) -
Unstoppable: ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తారు: వీజే సన్నీ
‘బిగ్ బాస్’ ఫేమ్ వీజే సన్నీ, సప్తగిరి, నక్షత్ర, అక్సాఖాన్ హీరో హీరోయిన్లుగా డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అన్‌స్టాపబుల్’. రజిత్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని ‘బేబీ బేబీ’ సాంగ్‌ను విడుదల చేశారు. భీమ్స్ సిసిరోలియో స్వరకల్పనలో కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించిన ఈ పాటను ఇంద్రావతి చౌహాన్ పాడారు. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్లో వీజే సన్నీ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలోని ప్రతి సీన్ ఎంజాయ్ చేసేలా ఉంటుంది’’ అన్నారు. ‘‘సినిమాలో నా, వీజే సన్నీ టైమింగ్ అదిరిపోతుంది’’ అన్నారు సప్తగిరి. ‘‘రిలీజ్ తర్వాత చిన్న సినిమాల పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. అందుకే చిన్న సినిమాలు తీస్తున్న ప్రతి నిర్మాత నాకు ఓ హీరోయే. ఈ సినిమా తర్వాత నన్ను ‘అన్‌స్టాపబుల్’ డైరెక్టర్ డైమండ్ రత్నబాబు అని పిలుస్తారని ఆశిస్తున్నాను’’ అన్నారు డైమండ్ రత్నబాబు. ‘‘మంచి సినిమాలు తీయాలని ఇండస్ట్రీకి వచ్చాను. ‘అన్‌స్టాపబుల్’ చిన్న సినిమా కాదు. అన్నీ ఉన్న సినిమా’’ అన్నారు రజిత్ రావు. -
హీరోయిన్ ఫోన్ నెంబర్ చెప్పి ఒక ఆట ఆడుకున్న సప్తగిరి
-
హీరోయిన్ ఫోన్ నెంబర్ చెప్పి ఒక ఆట ఆడుకున్న సప్తగిరి
-
ఓటీటీలోకి వచ్చేస్తున్న గూడుపుఠాణి, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
సప్తగిరి, నేహా సోలంకి జంటగా నటించిన చిత్రం గూడుపుఠాణి. కె.యమ్. కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఎస్ఆర్ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్లో రియల్ ఎస్టేట్ కింగ్స్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ నిర్మించారు. ఈ సినిమా గతేడాది డిసెంబర్ 25న థియేటర్లలో విడుదలై మంచి విజయం సాధించింది. సప్తగిరి కామెడీ డైలాగులు, మంచి కథ కథనంతో ప్రేక్షకులని ఎంటర్టైన్ చేసింది. నిర్మాతలైన పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ లకు మంచి డబ్బు సంపాదించి పెటింది. ఇప్పుడు ఈ "గూడుపుఠాణి" చిత్రం జీ 5 ఓ టి టి లో రేపు అనగా 8 జులై నా విడుదల కానుంది. నిర్మాతలు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ లు మాట్లాడుతూ "మా గూడుపుఠాణి చిత్రం మంచి విజయం సాధించింది. థియేటర్ లో చుసిన ప్రతి ప్రేక్షకుడు సినిమా చాలా బాగుందని కొనియాడాడు. మా చిత్రానికి మంచి రివ్యూస్ వచ్చాయి. IMDB లో 8.8 రేటింగ్ వచ్చింది. మా చిత్రాన్ని జీ5 వాళ్ళు మంచి రేట్‌కు కొన్నారు. రేపు జీ5లో విడుదల అవుతుంది. థియేటర్లో మిస్ అయినా ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు జీ 5లో లభిస్తుంది, చూసి ఆనందించండి" అని తెలిపారు. చదవండి: మైనర్ బాలికల పట్ల అసభ్య ప్రవర్తన.. పోక్సో చట్టం కింద నటుడు అరెస్ట్ నేను ఇంతకాలం నటించకపోవడానికి కారణం ఇదే.. -
‘గూడుపుఠాణి ’ మూవీ రివ్యూ
టైటిల్: గూడుపుఠాణి నటీనటులు: సప్తగిరి, నేహా సోలంకి, రఘు కుంచే తదితరులు నిర్మాణ సంస్థ: ఎస్ఆర్ఆర్ ప్రొడక్షన్స్ నిర్మాతలు: పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ దర్శకత్వం: కెయమ్ కుమార్ సంగీతం: ప్రతాప్ విద్య విడుదల తేది: డిసెంబర్ 25, 2021 తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎంతోమంది హాస్య నటులు హీరోలుగా మారి సినిమాలు చేశారు. కానీ కొంతమంది మాత్రమే సక్సెస్‌ని అందుకున్నారు. అలాంటి కమెడియన్స్‌లో సప్తగిరి ఒకరు. ఇప్పటికే సప్తగిరి ఎల్ ఎల్ బి, సప్తగిరి ఎక్సప్రెస్ లాంటి చిత్రాలలో హీరోగా నటించి ప్రేక్షకులను అలరించారు. తాజాగా ఈ యంగ్ కమెడియన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గూడుపుఠాణి ’.ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కి మంచి స్పందన రావడంతో పాటు మూవీపై అంచనాలను పెంచింది. ఓ మోస్తారు అంచనాల మధ్య క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదల అయిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. సప్తగిరి తొలి చూపులోనే నేహా సొలంకి ప్రేమలో పడతాడు. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవుతారు. ఓ పూరాతన అమ్మవారి దేవాలయంలో తమ వివాహాన్ని ఘనంగా జరుపుకోవాలనుకుంటారు. అదే సమయంలో దేవాలయాల్లో వరుసగా అమ్మవారి నగలు దొంగిలించబడతాయి. పోలీసులు ఈ కేసుని సీరియస్‌గా తీసుకొని దొంగలను పట్టుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తుంటారు. ఈ క్రమంలో సప్తగిరి పెళ్లి చేసకునే గుడిలో కూడా దొంగలు పడతారు. అసలు ఆ దొంగలు ఎవరు? ఆ గుడిలో ఏం జరిగింది? చివరకు సప్తగిరి, సొలంకిల పెళ్లి జరిగిందా? లేదా? అనేదే మిగతా కథ. ఎవరెలా చేశారంటే..? ఎప్పటి మాదిరే సప్తగిరి మరోసారి తనదైన నటనతో అలరించాడు. తనదైన కామెడీతో నవ్విస్తూనే.. కొన్ని కీలక సన్నివేశాల్లో భయపెడతాడు. హీరోయిన్ నేహా సోలంకి అందం, అభినయంతో ఆకట్టుకుంది. విలన్‌గా రఘు కుంచె నటన సినిమాకే హైలెట్ అని చెప్పొచ్చు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే..? తెలిసిన కథనే అద్భుతమైన కథనంతో మంచి ట్విస్ట్‌లతో ఆసక్తికరంగా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు కుమార్. సప్తగిరి నుంచి మంచి నటనను రాబట్టుకున్నాడు. కామెడీతో పాటు మంచి కథ, కథనం, అద్భుతమైన డైలాగులు, అందమైన లొకేషన్స్‌తో పూర్తి ఎంటర్టైన్మెంట్ చిత్రాన్ని ప్రేక్షకులకి అందించారు. అయితే ఫస్టాఫ్‌లో కొన్ని సీన్స్ మాత్రం కాస్త బోరింగ్ అనిపిస్తాయి. అమ్మవారి నగలు దొంగిలించిది ఎవరనే విషయాన్ని చివరి వరకు చెప్పకుండా ప్రేక్షకులను క్యూరియాసిటీ కలిగించడంతో దర్శకుడు సఫలం అయ్యాడు. ఇక సాకేతిక విషయాలకొస్తే.. ప్రతాప్ విద్య సంగీతం పర్వాలేదు. నేపథ్య సంగీతం బాగుంది. మున్నా (ఫణి ప్రదీప్) మాటలు, పవన్ చెన్నా సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్. ఎడిటర్ బొంతల నాగేశ్వర రెడ్డి తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
సప్తగిరి హీరో స్థాయికి ఎదగడం గర్వకారణం: తలసాని
‘‘తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది సినీ వారసులు ఇండస్ట్రీలోకి వచ్చారు. కానీ ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేని సప్తగిరి తన ప్రతిభతో హీరో స్థాయికి చేరుకోవడం చాలా గర్వకారణం. ‘గూడుపుఠాణి’ సినిమా పెద్ద విజయం సాధించాలి’’ అని తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సప్తగిరి, నేహా సోలంకి జంటగా కె.యమ్. కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గూడుపుఠాణి’. పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ నిర్మించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో దర్శకుడు మారుతి మాట్లాడుతూ– ‘‘గూడుపుఠాణి’ ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది.. సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను’’ అన్నారు. ‘‘మా ఎస్ఆర్ఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్‌లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన మేము ఇప్పుడు సినిమా రంగం వైపు వచ్చాం. సప్తగిరి కెరీర్లో ‘గూడుపుఠాణి’ సినిమా ఒక మైలురాయిగా నిలిచిపోతుంది’’ అన్నారు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్. ‘‘సూపర్‌స్టార్ కృష్ణగారి ‘గూడుపుఠాణి’ టైటిల్‌తో నేను సినిమా చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. తొలిసారి థ్రిల్లర్ సినిమాలో హీరోగా నటించాను’’ అన్నారు సప్తగిరి. ‘‘నా కథకు మంచి నిర్మాతలు, హీరో దొరకడం నా అదృష్టం’’ అన్నారు కుమార్ కె.ఎం. తెలంగాణ శాసనమండలి ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి, ఆదోని ఎం.ఎల్.ఎ. క్రాంతి కుమార్, సంగీత దర్శకుడు ప్రతాప్ విద్య తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: పవన్ చెన్న. చదవండి :అలాంటివాళ్లు పోటీకి అర్హులు కాదు 'ఫోటోలు,వీడియోలు తీసినచో సెల్‌ఫోన్ పగలగొట్టబడును' -
కమెడియన్ చేసిన పనికి నెటిజన్ల ప్రశంసలు
ప్రస్తుతం భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ విలయ తాండవం సృష్టిస్తుంది. ఇప్పటికే సామన్యులు సహా కొందరు సెలబ్రిటీలు కూడా కోవిడ్ బారిన పడుతున్నారు. తాజాగా సినీ దర్శకుడు, రచయిత నంద్యాల రవికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఆరోగ్యం విషమించడంతో చికిత్స కోసం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. ఇప్పటికే ఆయన కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా సోకి ప్రైవేటు ఆసుపత్రిలో చేరాల్సి రావడంతో ఆసుపత్రి బిల్లు 6నుంచి 7 లక్షల దాకా అయినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న కమెడియన్ సప్తగిరి వెంటనే తన వంతు సాయంగా రవి కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. ఇక గతంలోనూ కరోనా నేపథ్యంలో సినీ కార్మికుల కోసం ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ)కి కూడా సప్తగిరి తన వంతు విరాళంగా 2 లక్షల రూపాయలు అందించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు రవి కుటుంబానికి కూడా తన వంతు సాయాన్ని అందించి మరోసారి సప్తగిరి మానవత్వాన్ని చాటుకున్నారంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. చదవండి : అడివి శేష్ పెద్ద మనసు.. వారికోసం ఏకంగా వాటర్ ప్లాంట్.. -
టీటీడీ సప్తగిరి మాసపత్రిక విషయంలో కుట్ర
-
కొత్త కథలైతే విజయం ఖాయం
‘‘తాగితే తందానా’ ఫస్ట్ లుక్ పోస్టర్ ఎగై్జటింగ్‌గా అనిపించింది. ఈ చిత్రనిర్మాతలు చాలా కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్నారు. కొత్త కాన్సెప్టులతో వస్తే కచ్చితంగా విజయం సాధిస్తారు. ఆదిత్, మధు, సప్తగిరి లుక్స్ చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి’’ అని దర్శకుడు మారుతి అన్నారు. ఆదిత్, సప్తగిరి, మధునందన్, సిమ్రాన్ గుప్తా, రియా ముఖ్యపాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘తాగితే తందానా’. శ్రీనాథ్ బాదినేని దర్శకత్వం వహిస్తున్నారు. రైట్ టర్న్ ఫిలిమ్స్ పతాకంపై వి.మహేష్, వినోద్ జంగపల్లి నిర్మిస్తున్న ఈ సినిమా మొదటి లుక్‌ని మారుతి, బ్యానర్ లోగోని నిర్మాత దామోదరప్రసాద్ విడుదల చేశారు. దామోదరప్రసాద్ మాట్లాడుతూ– ‘‘కొత్తవాళ్లు సరైన ప్లానింగ్‌తో వస్తే కచ్చితంగా సక్సెస్ అవుతారు. ఈ నిర్మాతలు పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో అనుకున్న టైమ్‌లో సినిమా పూర్తి చేయడంలో సక్సెస్ అయినట్టు తెలుస్తోంది’’ అన్నారు. ‘‘ఇప్పటివరకు నేను 16 చిత్రాలు చేశాను. వాటిలో 13 చిత్రాలు కొత్త దర్శకులతోనే చేశాను’’ అన్నారు ఆదిత్. ‘‘కమెడియన్‌గా మంచి చిత్రాలు వస్తే చేద్దామనుకుంటున్న తరుణంలో శ్రీనాథ్ చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా చేశా’’ అన్నారు సప్తగిరి. ‘‘ముగ్గురు కుర్రాళ్లు తాగిన మత్తులో ఒక సమస్యలో ఇరుక్కుంటారు.. దాని నుంచి వారు ఎలా బయటపడ్డారనేది చిత్రకథ’’ అన్నారు శ్రీనాథ్ బాదినేని. ‘‘అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు వినోద్ జంగపల్లి. చిత్రనిర్మాత వి.మహేష్, లైన్ ప్రొడ్యూసర్ అనిల్, మధునందన్, సిమ్రాన్ గుప్తా, రియా, సంగీత దర్శకుడు శ్రవణ్ భరద్వాజ్, ఎడిటర్ బి.నాగేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: బాల్ రెడ్డి. -
ఇండస్ట్రీలో నిర్మాతలది దైవస్థానం
‘‘మా సినిమాకి తొలిరోజు మిక్డ్స్ టాక్ వచ్చింది. తర్వాత వెంటనే యావరేజ్ అన్నారు. చిన్నవాళ్లం.. అందరూ ఆశీర్వదించండి. మరిన్ని సినిమాలు చేసేలా ప్రోత్సహించండి’’ అని సప్తగిరి అన్నారు. ఆయన హీరో గా, వైభవీజోషి కథానాయికగా నటించిన చిత్రం ‘వజ్ర కవచధర గోవింద’. అర్చన కీలక పాత్రలో నటించారు. అరుణ్ పవార్ దర్శకత్వంలో నరేంద్ర, జి.ఎన్.రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదలైంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్‌మీట్‌లో సప్తగిరి మాట్లాడుతూ– ‘‘మన బడ్జెట్‌ను, మన టార్గెట్‌ను రీచ్ అయ్యామని డిస్ట్రిబ్యూటర్ బ్రహ్మయ్యగారు చెప్పడంతో హ్యాపీ. పరిశ్రమలో నిర్మాతలది దైవస్థానం. మా నిర్మాతలు జి.ఎన్.రెడ్డి, నరేంద్రగారికి ధన్యవాదాలు. సెకండాఫ్‌లో 10 నిమిషాలు తగ్గిస్తున్నాం. ఇక 100 శాతం గ్రాండ్ సక్సెస్ అవుతుంది’’ అన్నారు. ‘‘ఈ సినిమా భారీ హిట్ అవ్వాలని మేం కోరుకోలేదు. కానీ మా శ్రమకు తగ్గ ప్రతిఫలం కావాలని మాత్రం కోరుకున్నాం.. అది దక్కినందుకు అందరం తృప్తిగా ఉన్నాం. సప్తగిరిలాంటి హీరోను నమ్ముకుంటే కచ్చితంగా 200 కుటుంబాలు బతుకుతాయి’’ అన్నారు నిర్మాత నరేంద్ర. ‘‘వజ్ర కవచధర గోవింద’ సినిమాని 400 థియేటర్లలో విడుదల చేశాం. 2 రోజులకు రూ.90లక్షల గ్రాస్ వసూలు చేసింది’’ అన్నారు బ్రహ్మయ్య. ‘‘కాలేజ్, స్కూల్ ఓపెనింగ్ టైమ్‌లోనూ మా సినిమా ఇంత బాగా ఆడుతోంది. థియేటర్లలో జనాలు నవ్వుతుంటే ఆనందంగా ఉంది’’ అని అరుణ్ పవార్ అన్నారు. ‘‘ఈ సినిమాలో నల్లూరి ప్రసన్నలక్ష్మీ అనే ఎమ్మెల్యేపాత్ర చేశాను’’ అన్నారు అర్చన. -
హీరోగానే కాదు... కామెడీ పాత్రలూ చేస్తా
‘‘హాస్యనటులు హీరోగా సక్సెస్ కాలేరనే మాటలను అంతగా నమ్మను. మంచి కథ, ఆలోచనా విధానం, సరైన ప్రణాళిక ఉంటే సక్సెస్ కావొచ్చు’’ అని సప్తగిరి అన్నారు. అరుణ్ పవార్ దర్శకత్వంలో సప్తగిరి హీరోగా నటించిన చిత్రం ‘వజ్ర కవచధర గోవింద’. వైభవి జోషి కథానాయికగా నటించారు. నరేంద్ర యడ్ల, జీవీఎన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూటర్ బ్రహ్మయ్య తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 14న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా సప్తగిరి చెప్పిన విశేషాలు... ►కథ బాగాలేకపోతే ఏ సినిమా ఆడే పరిస్థితి లేదు. కథపై నమ్మకంతోనే ఈ సినిమా చేశా. ఇందులో గోవింద అనే దొంగ పాత్ర పోషించాను. క్యాన్సర్ బాధితులకు న్యాయం చేయాలనే ఓ దొంగ కథ ఇది. ఓ వజ్రం చుట్టూ కథ అంతా తిరుగుతుంది. ఇందులో మూడు గెటప్స్‌లో కనిపిస్తాను. కుక్క, పాము పాత్రలు ఈ చిత్రంలో ఆసక్తికరంగా ఉంటాయి. కర్నూలులోని బెలూన్గుహల్లో ప్రాణాలకు తెగించి సన్నివేశాలను చిత్రీకరించాం. ►హీరోగా ఇది నా మూడో సినిమా. ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్, సప్తగిరి ఎల్ఎల్బీ’ సినిమాలు సందేశాత్మకం. ఈ సినిమాలోనూ క్యాన్సర్ బాధితుల సమస్యలను ప్రస్తావించాం. ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ తీసిన అరుణ్ పవార్‌తో ఈ సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. ఓ సెంటిమెంట్లా కూడా భావిస్తున్నాను. ►నా గత సినిమాల్లో కామెడీ కంటెంట్ కాస్త తక్కువగా ఉండటానికి కారణం నాలోని అసిస్టెంట్ డైరెక్టరే. నా సినిమాలో ఏదో ఒక సందేశం ఉండాలని కోరుకుంటాను. అలాగని డైరెక్షన్లో ఇన్వాల్వ్ కాను. నా అభిప్రాయాలు, సూచనలు పంచుకుంటానంతే. ఈ సినిమాలో సందేశంతో పాటు మంచి కామెడీ ఉంది. ఇంటర్వెల్ తర్వాత ‘జబర్దస్త్’ టీమ్ హంగామా ఉంటుంది. ►నిజానికి నేను కమెడియన్ అవుదామని ఇండస్ట్రీలోకి రాలేదు. ‘సింధూరం, భారతీయుడు’ సినిమాలు చూసి ప్రేరణ పొంది వచ్చాను. అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేశాను. కానీ నాకు కమెడియన్‌గా అవకాశాలు వచ్చాయి. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ చిత్రం ఒక్కటే నాలో మంచి కమెడియన్ ఉన్నాడని నాకు తెలిసేలా చేసింది. హీరోగా మారిన తర్వాత నేను హాస్య పాత్రలు చేయనని వారే (దర్శక–నిర్మాతలను ఉద్దేశిస్తూ) డిసైడ్ అయ్యారు. కమెడియన్ పాత్రలు చేయడానికి సిద్ధంగానే ఉన్నాను. ఇక సునీల్ అన్నగురించి నేను ప్రస్తావించలేను. అందరి జీవితాలు ఒకేలా ఉండవు. నాకు చేతనైనంతలో మా ఊరికి ఏదో సాయం చేస్తున్నాను. ఒక ఊరిని దత్తత తీసుకునేంత స్థాయికి రాలేదు. రావాలని కోరుకుంటున్నాను. ►ప్రస్తుతం సందీప్‌కిషన్ సినిమాలో హాస్య నటుడిగా చేస్తున్నాను. నేను హీరోగా ‘దెయ్యం పట్టింది, దెయ్యం పట్టింది 2’ సినిమాల్లో నటించబోతున్నాను. మరో రెండు సినిమాలకు చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే వివరాలు వెల్లడిస్తా. -
మా ఇద్దరి విజన్ ఒక్కటే
‘‘మన లక్ష్యం మంచిది అయినా వెళ్లేదారి కరెక్టుగా ఉన్నప్పుడే దేవుడి ఆశీస్సులు ఉంటాయని చెప్పే చిత్రం ‘వజ్ర కవచధర గోవింద’. ఈ సినిమా కథ వజ్రం చుట్టూ తిరుగుతుంది. గోవిందు అనే దొంగ తన ఊరికోసం ఏం చేశాడన్నదే కథ. దీనికితోడు గోవింద అన్నది దేవుడి పేరు కావడంతో ‘వజ్ర కవచధర గోవింద’ అనే టైటిల్ పెట్టాం’’ అని డైరెక్టర్ అరుణ్ పవార్ అన్నారు. సప్తగిరి, వైభవీ జోషీ జంటగా నటించిన చిత్రం ‘వజ్ర కవచధర గోవింద’. ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ ఫేమ్ అరుణ్ పవార్ దర్శకత్వం వహించారు. నరేంద్ర యడ్ల, జీవీఎన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్ బ్రహ్మయ్య ఈనెల 14న విడుదల చేస్తున్నారు. అరుణ్‌పవార్ మాట్లాడుతూ– ‘‘మాది నెల్లూరు.. ఇంటర్ తర్వాత హైదరాబాద్ వచ్చి విజువల్ ఎఫెక్ట్స్ కోర్సు చేశా. డైరెక్టర్ త్రివిక్రమ్‌గారి వద్ద ‘అతడు’ చిత్రం నుంచి ‘అ..ఆ’ సినిమా వరకూ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో పనిచేశా. దర్శకత్వంపై ఇష్టంతో ‘బెస్ట్ యాక్టర్స్’ సినిమాని తీశా. అది అనుకున్నంత హిట్ అవలేదు. ఆ తర్వాత తీసిన ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ మంచి హిట్ అయింది. అందుకే ఈ చిత్రాన్ని నా తొలి సినిమాగా భావిస్తా. నేను ఏ డైరెక్టర్ వద్ద అసిస్టెంట్‌గా పనిచేయలేదు. పదేళ్లలో దాదాపు 100 సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ చేశా. షూటింగ్టైమ్లో డైరెక్టర్స్‌తో కలిసి ఉండటంతో మేకింగ్, డైరెక్షన్‌పై అవగాహన ఉంది. నేను చేసిన ఓ షార్ట్ ఫిల్మ్ నచ్చిన త్రివిక్రమ్‌గారు భవిష్యత్తులో మంచి డైరెక్టర్ అవుతావన్నారు. అంతేకాదు.. మేకింగ్ టెక్నిక్స్, కథలు రాసుకోవడం ఎలాగో చెప్పారాయన. పైగా మా ఇద్దరి విజన్ ఒక్కటే. అందుకే నా గురువుగా ఆయన్ని భావిస్తాను. వినోదాత్మకంగా రూపొందిన ‘వజ్ర కవచధర గోవింద’ చిత్రంలో భావోద్వేగ సన్నివేశాలు కూడా ఉన్నాయి. విజువల్ ఎఫెక్ట్స్ అన్నవి ఓ హాబీలా చేస్తా. విజువల్ ఎఫెక్ట్స్ కంటే డైరెక్షన్ మోస్ట్ చాలెంజింగ్ విజన్ అనుకుంటున్నా. ఓ ప్రేమ కథ రెడీ చేశా. డైరెక్టర్ బాబీగారు ఆ సినిమా నిర్మిస్తారు. ఇందు లో సాయిధరమ్ తేజ్ హీరో అనుకుంటున్నాం’’ అన్నారు. -
రెండింతలు భయపెడతాం
‘అభినేత్రి’ చిత్రంతో తమన్నా, ప్రభుదేవా ప్రేక్షకులను భయపెట్టారు. మొదటిసారి కంటే రెట్టింపు భయపెట్టడానికి ‘అభినేత్రి’ సీక్వెల్ ‘అభినేత్రి 2’తో రెడీ అయ్యారు. ప్రభుదేవా, తమన్నా జంటగా ఏ.ఎల్. విజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన హారర్ థ్రిల్లర్ ‘అభినేత్రి 2’. సోనూ సూద్, నందితా శ్వేత, సప్తగిరి కీలక పాత్రల్లో నటించారు. అభిషేక్ నామా, ఆర్. రవీంద్రన్ నిర్మించారు. ఈ చిత్రాన్ని మే 31న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘థ్రిల్ చేస్తూనే మనసును ఆకట్టుకునే సన్నివేశాలు ఈ సినిమాలో చాలా ఉంటాయి. టీజర్, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ప్రభుదేవా, తమన్నా, నందితా శ్వేతల నటన ఈ సినిమాకు హైలైట్’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: అయాంకా బోస్, సంగీతం: శ్యామ్ సీఎస్. -
ప్రాణాలకు తెగించి చేశాం
‘‘వజ్రం చుట్టూ తిరిగే కథ ‘వజ్ర కవచధర గోవింద’. ఇందులో నా పాత్ర పేరు గోవింద. వజ్రం వల్ల గోవిందకు నష్టం జరిగిందా? లాభం జరిగిందా? అన్నదే కథ. క్లీన్ ఎంటర్టైనర్గా ఉంటుంది’’ అని సప్తగిరి అన్నారు. ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్, సప్తగిరి ఎల్ఎల్బీ’ చిత్రాల తర్వాత సప్తగిరి హీరోగా నటించిన చిత్రం ‘వజ్ర కవచధర గోవింద’. వైభవీ జోషీ కథానాయికగా నటించారు. ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ ఫేమ్ అరుణ్ పవార్ దర్శకత్వం వహించారు. శివ శివమ్ ఫిలింస్ పతాకంపై నరేంద్ర యెడల, జీవీఎన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా మే 17న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సప్తగిరి మాట్లాడుతూ– ‘‘మన లక్ష్యం మంచిది అయినా వెళ్లేదారి కరెక్టుగా ఉన్నప్పుడే దేవుడి ఆశీస్సులు ఉంటాయని చెప్పే చిత్రమిది. కర్నూలు వద్ద ఉన్న బెలూన్ గుహల్లో ఆక్సిజన్ తక్కువ ఉన్న ప్రాంతంలో ప్రాణాలకు తెగించి కొన్ని సన్నివేశాలు తీశాం. ఈ సన్నివేశాల్లో వైభవీ జోషీ కూడా ధైర్యంగా పాల్గొన్నారు. తొలుత ఈ చిత్రానికి ‘సప్తగిరీశా గోవింద’ అని టైటిల్ అనుకున్నాం. ప్రస్తుతం సమాజంలో క్యాన్సర్ వ్యాధి బాధితులు ఎక్కువ మంది ఉన్నారు. పేద, మధ్య తరగతి వారు ఖరీదైన వైద్యం చేయించుకోలేక చనిపోతున్నారు. వీళ్లందరికీ తక్కువ ధరకే వైద్యం అందాలంటే మండలానికి ఒక క్యాన్సర్ ఆస్పత్రి ఉండాలని మా చిత్రం ద్వారా చూపిస్తున్నాం’’ అన్నారు. ‘‘వజ్రాన్ని గోవింద కవచంలా ఎలా ధరించాడు? దాంతో తన ఊరును ఏ విధంగా కాపాడుకున్నాడు? అన్నదే చిత్రకథ. వినోదం, ఎమోషన్స్, యాక్షన్, ఫాంటసీ.. ఇలా అన్ని అంశాలు ఉన్నాయి. ఈ పాత్రకి సప్తగిరి కాకుండా వేరెవరూ సరిపోరు’’ అన్నారు అరుణ్ పవార్. ‘‘సీడెడ్‌లో ఇప్పటి వరకూ ఎన్నో సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేసిన నేను తొలిసారి ‘వజ్ర కవచధర గోవింద’ చిత్రం ప్రపంచవ్యాప్త విడుదల హక్కులను సింగిల్ పేమెంట్‌తో సొంతం చేసుకున్నా’’ అని డిస్ట్రిబ్యూటర్ బ్రహ్మయ్య అన్నారు. ‘‘మాకిది తొలి చిత్రం. సినిమా చేస్తే ఎంత డబ్బులొస్తాయో? రావో? తెలియదు. కానీ, సప్తగిరి చెప్పడంతో, తనపై ఉన్న నమ్మకంతో ఈ సినిమా చేశాం’’ అని నిర్మాత జీవీఎన్ రెడ్డి అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: విజయ్ బుల్గానిన్, కెమెరా: ప్రవీణ్ వనమాలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : సలాన బాలగోపాలరావు. -
కథకు తగ్గ టైటిల్
‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్, సప్తగిరి ఎల్ఎల్బీ’ చిత్రాల తర్వాత సప్తగిరి హీరోగా నటిస్తున్న చిత్రం ‘వికెజి’. (వజ్రకవచధర గోవింద). అరుణ్ పవార్ దర్శకత్వం వహించారు. శివ శివమ్ ఫిలిమ్స్ పతాకంపై నరేంద్ర యెడల, జీవీఎన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఏప్రిల్ 6న సినిమాని విడుదల చేయనున్నారు. అరుణ్ పవార్ మాట్లాడుతూ– ‘‘సప్తగిరి నుంచి ప్రేక్షకులు ఆశించే అంశాలన్నీ మా సినిమాలో ఉంటాయి. తన బాడీలాంగ్వేజ్‌కు పర్ఫెక్ట్గా సూటయ్యే కథ ఇది. కథ డిమాండ్ మేరకే ‘వజ్రకవచధర గోవింద’ అనే టైటిల్ పెట్టాం. ఫన్నీ దొంగకు, ‘వికెజి’ టైటిల్‌కు సంబంధమేంటనే అంశం సినీ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది’’ అన్నారు. నరేంద్ర యెడల, జీవీఎన్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘అరుణ్ పవార్–సప్తగిరి కాంబినేషన్లో వచ్చిన ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ చిత్రానికి ఏమాత్రం తగ్గకుండా మా ‘వికెజి’ ఉంటుంది. సినిమా అవుట్‌పుట్ బాగా వచ్చింది. విజయ్ బుల్గానిన్ సంగీతం సినిమాకి స్పెషల్ ఎట్రాక్షన్‌గా ఉంటుంది. త్వరలోనే పాటల్ని విడుదల చేయనున్నాం’’ అని తెలిపారు. వైభవీ జోషీ, అర్చనా వేద, ‘టెంపర్’ వంశీ, అప్పారావు, అవినాష్, రాజేంద్ర జాన్ కొట్టోలి, వీరేన్ తంబిదొరై తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: ప్రవీణ్ వనమాలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సలాన బాలగోపాలరావు. -
నవ్వులు పంచే దొంగ
అతని పేరు గోవిందు. పేరుకి ఫన్నీ దొంగ అయినా అతనికో లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్య సాధన కోసం ఏం చేశాడనే కథతో రూపొందుతోన్న చిత్రం ‘వజ్ర కవచధర గోవింద’. సప్తగిరి, వైభవీ జోషీ జంటగా అరుణ్ పవార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. శివ శివమ్ ఫిలిమ్స్ పతాకంపై నరేంద్ర యెడల, జీవీఎన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. అరుణ్ పవార్ మాట్లాడుతూ–‘‘సప్తగిరితో నేను తెరకెక్కించిన ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. తాజాగా రూపొందిస్తున్న ‘వజ్ర కవచధర గోవింద’ సినిమా అంతకు మించి సక్సెస్ కావాలనే తపనతో కృషి చేస్తున్నాం. కడుపుబ్బా నవ్వించే అంశాలతోపాటు, మంచి యాక్షన్, ఎమోషన్, ఇతర వాణిజ్య అంశాలు మెండుగా ఉంటాయి. మా నిర్మాతలు కొత్తవారైనా ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు’’ అన్నారు. ‘‘హిలేరియస్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రమిది. 80 శాతం షూటింగ్ పూర్తయింది. మిగిలిన సన్నివేశాలను కర్ణాటకలోని ఒక గుడిలో తెరకెక్కిస్తాం’’ అని నరేంద్ర యెడల, జీవీఎన్ రెడ్డి అన్నారు. ఈ చిత్రానికి కథ: జిటిఆర్ మహేంద్ర, సంగీతం: విజయ్ బుల్గానిన్, కెమెరా: ప్రవీణ్ వనమాలి, ఎడిటింగ్: కిషోర్ మద్దాలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సలాన బాలగోపాలరావు. -
దొంగ లక్ష్యం ఏంటి?
హాస్య నటుడి నుంచి హీరోగా మారిన వారిలో సప్తగిరి ఒకరు. ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్, సప్తగిరి ఎల్ఎల్బీ’ చిత్రాలతో హీరోగా తనకంటూ ఓ రూట్‌ని ఏర్పరచుకున్న ఆయన నటిస్తోన్న తాజా చిత్రం ‘వజ్ర కవచధర గోవింద’. ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ ఫేమ్ అరుణ్ పవార్ దర్శకత్వం వహిస్తున్నారు. వైభవీ జోషీ కథానాయికగా నటిస్తున్నారు. శివ శివమ్ ఫిలింస్ పతాకంపై నరేంద్ర యెడల, జీవీఎన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘వజ్ర కవచధర గోవింద’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సందర్భంగా అరుణ్ పవార్ మాట్లాడుతూ– ‘‘ఇందులో సప్తగిరి పాత్ర పేరు గోవిందు. పేరుకి చిలిపి దొంగ అయినా ఓ లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్య సాధన కోసం అతనేం చేశాడన్నదే ఈ సినిమా కథాంశం. కడుపుబ్బా నవ్వించే అంశాలతోపాటు, యాక్షన్, ఎమోషన్, ఇతర వాణిజ్య అంశాలు ఉన్నాయి’’ అన్నారు. ‘‘ఇదొక హిలేరియస్ యాక్షన్ ఎంటర్టైనర్. 60 శాతం చిత్రీకరణ పూర్తయింది’’ అని నరేంద్ర యెడల, జీవీఎన్ రెడ్డి అన్నారు. అర్చనా వేద, ‘టెంపర్’ వంశీ, అప్పారావు, అవినాష్, రాజేంద్ర జాన్ కొట్టోలి, వీరేన్ తంబిదొరై తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ: జి.టి.ఆర్. మహేంద్ర, సంగీతం: విజయ్ బుల్గానిన్, కెమెరా: ప్రవీణ్ వనమాలి, ఎడిటింగ్: కిషోర్ మద్దాలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : సలాన బాలగోపాలరావు, స్క్రీన్‌ప్లే–దర్శకత్వం: అరుణ్ పవార్. -
డైరెక్షన్ అంటే చాలా ఇష్టం
సాక్షి, చాగల్లు: దర్శకుడు అవుదామని చిత్ర పరిశ్రమకు వచ్చి నటుడిని అయ్యానని హీరో, హాస్యనటుడు సప్తగిరి అన్నారు. గణపతి నవరాత్రుల సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా చాగల్లు తెలగా సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. తెలగా సంఘం వినాయకుడి ఆలయంలో పూజలు, అభిషేకాలు చేశారు. అనంతరం సప్తగిరి విలేకరులతో మాట్లాడుతూ తాను పరువు సినిమా ద్వారా చిత్రపరిశ్రమకు పరిచయమయ్యానని.. ఇప్పటివరకు 80 సినిమాల్లో హాస్యనటుడిగా నటించానని చెప్పారు. కమెడియన్‌గా మంచి గుర్తింపు లభించిందన్నారు. పరువు, ఎక్స్‌ప్రెస్ రాజా, ప్రేమకథా చిత్రం, మనం చిత్రాలు మంచి గుర్తింపును తెచ్చాయన్నారు. సప్తగిరి ఎల్ఎల్బీ, సప్తగిరి ఎక్స్‌ప్రెస్ సినిమాల్లో హీరోగా నటించానన్నారు. తొలుత సినీ ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసినట్టు చెప్పారు. ఎ ఫిల్మ్ బై అరవింద్, బొమ్మరిల్లు, పరుగు చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశానన్నారు. డైరెక్షన్ అంటే తనకు చాలా ఇష్టమని, డైరెక్టర్ అవుదామనే ఈ పరిశ్రమలోకి వచ్చానని చెప్పారు. నిర్మాత దిల్‌రాజు తననెంతగానో ప్రోత్సహించారన్నారు. ఎక్స్‌ప్రెస్ రాజాలో నటనకు నంది అవార్డు వచ్చిందని చెప్పారు. చిత్ర పరిశ్రమకు రావాలనుకునే యువత బాగా కష్టపడాలని, కష్టపడిన వారికి తగిన గుర్తింపు ఉంటుందన్నారు. టాలెంట్ చాలా మందికి ఉంటుందని, అయితే వ్యక్తిత్వం, మంచి గుణాలు ఉన్నవారు తప్పనిసరిగా విజయం సాధిస్తారన్నారు. తన సొంతూరు తిరుపతి అని చెప్పారు. ప్రేక్షకుల ఆదరాభిమానాలే నటులకు నిజమైన గుర్తింపు అన్నారు. చాగల్లులో దర్శకుడు వీవీ వినాయక్ నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించగా పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. సప్తగిరిని చూసేందుకు ఆయనతో ఫొటోలు దిగేందుకు ఎగబడ్డారు. మాజీ సర్పంచ్ గండ్రోతు సురేంద్రకుమార్, జుట్టా కొండలరావు, గవర సర్వారాయుడు, తెలగా సంఘం పెద్దలు సప్తగిరి వెంట ఉన్నారు. -
దొంగలకు దొంగ.
‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్, సప్తగిరి ఎల్.ఎల్.బి’ చిత్రాలతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సప్తగిరి లేటెస్ట్గా ‘గజదొంగ’గా మారనున్నారు. సప్తగిరి హీరోగా డి.రామకృష్ణ దర్శకత్వంలో నంద నందనా బ్యానర్‌పై శర్మ చుక్కా, యెడల నరేంద్ర, జి.వి.యన్. రెడ్డి నిర్మించనున్న చిత్రం ‘గజదొంగ’. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ –‘‘సప్తగిరికి కరెక్ట్‌గా సూట్ అయ్యే సబ్జెక్ట్ ఇది. ఆడియన్స్‌ను అలరించే అంశాలన్నీ ఇందులో ఉన్నాయి. ఎన్టీఆర్ ‘గజదొంగ’ సినిమాకు, మా చిత్రానికి ఏ సంబంధం ఉండదు. సప్తగిరిది దొంగలకు దొంగలాంటి పాత్ర. ఆగస్ట్ ఫస్ట్ వీక్‌లో చిత్రీకరణ మొదలుపెడతాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్ వనమాలి, లైన్ ప్రొడ్యూసర్: ఆర్వీవీవీ ప్రసాద్. -
ఈ సినిమాకి ముగ్గురు హీరోలు
‘‘కమెడియన్ అయిన నేను ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ చిత్రంలో చేసిన సెంటిమెంట్, ఎమోషన్స్‌కు ప్రేక్షకులు కనెక్ట్ అయ్యి హిట్ చేశారు. అందుకే మళ్లీ మరో మెసేజ్ ఓరియంటెడ్ సినిమా చేయాలనుకుని ‘సప్తగిరి ఎల్.ఎల్.బి’ చేశా ’’ అని సప్తగిరి అన్నారు. ఆయన హీరోగా కశిష్ వోహ్రా కథానాయికగా చరణ్ లక్కాకుల దర్శకత్వంలో డా. రవికిరణ్ నిర్మించిన ‘సప్తగిరి ఎల్.ఎల్.బి’ ఈ రోజు విడుదలవుతోంది. ఈ సందర్భంగా సప్తగిరి చెప్పిన విశేషాలు. ► భారతదేశంలో ప్రతి పౌరుడుకీ న్యాయం దక్కాలని మన రాజ్యాంగం చెబుతుంది. అలాంటి న్యాయం ప్రతి ఒక్కరికీ దక్కడం కోసం పోరాడే ఓ చిన్న లాయర్ కథే ‘సప్తగిరి ఎల్.ఎల్.బి.’. ► ‘జాలీ ఎల్.ఎల్.బి’ రీమేక్ ఆలోచన నాది, రవికిరణ్గారిదే. ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ చిత్రాన్ని కానిస్టేబుల్స్‌కు అంకితం ఇచ్చాం. ‘సప్తగిరి ఎల్.ఎల్.బి.’ని నిజాయితీ గల లాయర్స్‌కు అంకితం ఇస్తున్నాం. ► ఈ సినిమా ఎమోషన్స్‌తో నడిచినా, నా కామెడీ అలరిస్తుంది. చివరి 45 నిమిషాలు ప్రేక్షకులను కట్టిపడేసే సన్నివేశాలుంటాయి. కమెడియన్‌గా 75 సినిమాలు చేసినా అన్నిటిలో కనపడేది ఒకేలానే కదా? అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఏడేళ్లు కష్టపడ్డాను. అనుకోకుండా కమెడియన్‌గా మారా. అలాగే హీరోగా మారా. ఇప్పుడు ఆ ఆలోచనలను ప్రెజెంట్ చేస్తూ నిజాయితీతో సినిమాలు చేయాలనేదే నా ప్రయత్నం. ► చరణ్ లక్కాకులగారు సీనియర్ మోస్ట్ కో–డైరెక్టర్. నేను అనుకున్న టైమ్‌లో సినిమా పూర్తి కావాలనే ఆయన్ని కలిశా. రవికుమార్‌గారు నిర్మాణంలో ఎక్కడా రాజీ పడలేదు. ► జాలీ ఎల్.ఎల్.బి’ చిత్రంలో బొమన్ ఇరానీగారు చేసిన పాత్రని సాయికుమార్‌గారు చేశారు. సౌరవ్ శుక్లాగారు చేసిన క్యారెక్టర్‌ను శివప్రసాద్‌గారు చేశారు. ఈ సినిమాలో నేను, శివప్రసాద్‌గారు, సాయికుమార్‌గారు ముగ్గురు హీరోల్లా చేశాం. -
ప్రతి రైతు.. ప్రతి లాయర్ చూడాల్సిన సినిమా
సప్తగిరి హీరోగా చరణ్ లక్కాకుల దర్శకత్వంలో సాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ ప్రై లిమిటెడ్ పతాకంపై డా. రవికిరణ్ నిర్మించిన ‘సప్తగిరి ఎల్ఎల్బి’ చిత్రం గురువారం విడుదల కానుంది. ఇందులో కశిస్ వోహ్రా కథానాయిక. ఈ సినిమా ప్రీ–రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. పరుచూరి బ్రదర్స్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా రిలీజ్ తర్వాత చాలామంది రచయితలు సప్తగిరి కోసం డిఫరెంట్ కథలు రాస్తారు. రామానాయుడుగారు బతికి ఉంటే చరణ్ లక్కాకులకు చాన్స్ ఇచ్చేవారు. మంచి లీగల్ పాయింట్ ఉన్న సినిమా ఇది. ప్రతి రైతు, ప్రతి లాయర్ చూడాల్సిన సినిమా. చివరి 45 నిమిషాలు ఆకట్టుకుంటాయి’’ అన్నారు. ‘‘మా సినిమా ట్రైలర్లు, పాటలను విడుదల చేసిన సెలబ్రిటీలందరికీ థ్యాంక్స్. వారి వల్ల సినిమాకు హైప్ వచ్చింది. సినిమా హిట్ అవుతుందని అందరూ అంటుంటే ఆనందంగా ఉంది. పరుచూరి బ్రదర్స్‌గారు మంచి డైలాగ్స్ రాశారు’’ అన్నారు. ‘‘నేను పరుచూరి బ్రదర్స్గారి దగ్గర వర్క్ చేశాను. నా తొలి సినిమాకు వాళ్లు డైలాగ్స్ రాయడం ఆనందంగా ఉంది’’ అన్నారు చరణ్ లక్కాకుల. ‘‘సాయికుమార్‌గారు, శివప్రసాద్‌గారు హీరోలుగా చేసిన ఈ సినిమాలో నేను చిన్న పాత్ర చేసినట్లు అనిపిస్తోంది. పరుచూరి బ్రదర్స్ మా సినిమాకు వర్క్ చేయడం ఆనందంగా ఉంది. నిర్మాతకు రుణపడి ఉంటా’’ అన్నారు సప్తగిరి. -
చెర్రీ చేతుల మీదుగా ‘సప్తగిరి ఎల్ఎల్బి’ ట్రైలర్
కమెడియన్ నుంచి హీరోగా మారిన సప్తగిరి తొలి చిత్రం ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’తో మంచి విజయం అందుకున్నారు. ఆ సినిమా నిర్మించిన సాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ అధినేత డా. రవికిరణ్ ప్రస్తుతం సప్తగిరి హీరోగా ‘సప్తగిరి ఎల్ఎల్బి’ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో కాశిష్ వోరా కథానాయిక. ఈ సినిమా ట్రైలర్‌ను హీరో రామ్‌చరణ్ విడుదల చేయనున్నారు. డా. రవికిరణ్ మాట్లాడుతూ– ‘‘టీజర్‌కి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ని మించిన విజయం ‘సప్తగిరి ఎల్ఎల్బి’ సాధిస్తుంది’’ అన్నారు. ‘‘సప్తగిరి ఎల్ఎల్బి’ ట్రైలర్‌ను రామ్‌చరణ్‌గారు విడుదల చేస్తుండటం ఆనందంగా ఉంది’’ అన్నారు సప్తగిరి.