Guduputani Movie OTT Release Date Confirmed, Know Streaming Platform Details - Sakshi
Sakshi News home page

Guduputani OTT Release: ఓటీటీలో గూడుపుఠాణి, ఎప్పుడు? ఎక్కడంటే?

Published Thu, Jul 7 2022 6:03 PM | Last Updated on Thu, Jul 7 2022 7:18 PM

Guduputani Movie OTT Release Date Confirmed - Sakshi

సప్తగిరి, నేహా సోలంకి జంటగా నటించిన చిత్రం గూడుపుఠాణి. కె.యమ్. కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఎస్ఆర్ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రియల్ ఎస్టేట్ కింగ్స్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ నిర్మించారు. ఈ సినిమా గతేడాది డిసెంబర్ 25న థియేటర్లలో విడుదలై మంచి విజయం సాధించింది. సప్తగిరి కామెడీ డైలాగులు, మంచి కథ కథనంతో ప్రేక్షకులని ఎంటర్టైన్ చేసింది. నిర్మాతలైన పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ లకు మంచి డబ్బు సంపాదించి పెటింది. ఇప్పుడు ఈ "గూడుపుఠాణి" చిత్రం జీ 5  ఓ టి టి లో రేపు అనగా 8 జులై నా విడుదల కానుంది. 

నిర్మాతలు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ లు మాట్లాడుతూ "మా గూడుపుఠాణి చిత్రం మంచి విజయం సాధించింది. థియేటర్ లో చుసిన ప్రతి ప్రేక్షకుడు సినిమా చాలా బాగుందని కొనియాడాడు. మా చిత్రానికి మంచి రివ్యూస్ వచ్చాయి. IMDB లో 8.8 రేటింగ్ వచ్చింది. మా చిత్రాన్ని జీ5 వాళ్ళు మంచి రేట్‌కు కొన్నారు. రేపు జీ5లో విడుదల అవుతుంది. థియేటర్‌లో మిస్ అయినా ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇప్పుడు జీ 5లో లభిస్తుంది, చూసి ఆనందించండి" అని తెలిపారు.

చదవండి: మైనర్‌ బాలికల పట్ల అసభ్య ప్రవర్తన.. పోక్సో చట్టం కింద నటుడు అరెస్ట్‌
నేను ఇంతకాలం నటించకపోవడానికి కారణం ఇదే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement