Neha Solanki
-
Game On Movie Review Telugu: సైకలాజికల్ థ్రిల్లర్ ‘గేమ్ ఆన్’ మూవీ ఎలా ఉందంటే..
టైటిల్: గేమ్ ఆన్ నటీనటులు: గీతానంద్, నేహా సోలంకి, ఆదిత్య మీనన్, మధుబాల, వాసంతి, కిరీటీ, శుభలేఖ సుధాకర్ తదితరులు నిర్మాత: రవి కస్తూరి దర్శకత్వం: దయానంద్ సంగీతం: అభిషేక్ ఏఆర్(బీజీఎం), నవాబ్ గ్యాంగ్, అశ్విన్ అరుణ్(పాటలు) సినిమాటోగ్రఫీ: అరవింద్ విశ్వనాథన్ ఎడిటర్: వంశీ అట్లూరి విడుదల తేది: ఫిబ్రవరి 2, 2024 కథేంటంటే.. గౌతమ్ సిద్ధార్థ్ అలియాస్ సిద్ధు(గీతానంద్) ఓ గేమింగ్ కంపెనీలో పని చేస్తుంటాడు. అదే సంస్థలో పని చేసే మోక్ష(వాసంతి)తో ప్రేమలో ఉంటాడు. టార్గెట్ సరిగా పూర్తి చేయకపోవడంతో అతన్ని ఉద్యోగం పోతుంది. అదే సమయంలో మోక్ష కూడా సిద్ధుకి బ్రేకప్ చెప్పి.. అతని ఫ్రెండ్ రాహుల్(కిరీటీ)తో వెళ్లిపోతుంది. ఉద్యోగం కోల్పోవడం.. స్నేహితుడు మోసం చేయడంతో సిద్దు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. అదే సమయంలో ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి సిద్ధుకి ఫోన్ వస్తుంది. ‘నీ ముందు తిరుగుతున్న ఈగను చంపేస్తే లక్ష రూపాలయను అకౌంట్లో వేస్తాం’అని చెబుతాడు. సిద్ధు ఈగను చంపగానే..అకౌంట్లోకి రూ.లక్ష క్రెడిట్ అవుతుంది. దీంతో సిద్ధు ఆత్మహత్య ఆలోచనను విరమించి ఇంటికెళ్తాడు. ఆ తర్వాతి మళ్లీ కాల్ చేసి..‘ఇదొక సైకలాజికల్ గేమ్ షో అని, చిన్న పిల్లను ఏడిపిస్తే..రూ.మూడు లక్షలు పంపిస్తామని చెబుతారు. అలా వరుసగా చిన్న చిన్న టాస్క్‌లు ఇస్తూ డబ్బులు పంపించడంతో సిద్ధు జీవితమే మారిపోతుంది. అతని జీవితంలోకి తార(నేహా సోలంకి) వస్తుంది. ఇలా లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్న సమయంలో గేమ్‌లో భాగంగా ఓ వ్యక్తిని చంపాలని ఫోన్ కాల్ వస్తుంది. సిద్ధు ఆ టాస్క్‌ని పూర్తి చేయలేనని చెబుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు సిద్ధుకి టాస్క్‌లు ఇస్తున్నదెవరు? ఎందుకు ఇస్తున్నారు? సైకాలజిస్ట్ మదన్ మోహన్(ఆదిత్య మీనన్)కు ఈ గేమ్‌తో ఉన్న సంబంధం ఏంటి? సిద్ధు గతమేంటి? తాత సూర్య నారాయణ(సుభలేఖ సుధాకర్) ఎలా చనిపోయాడు? అమెరికా నుంచి ఇండియాకు వచ్చిన అర్చన(మధుబాల)కి సిద్ధుకి మధ్య ఉన్న సంబంధం ఏంటి? సిద్ధు జీవితంలోకి తార ఎలా వచ్చింది? అసలు ఆమె నేపథ్యం ఏంటి? రియల్ టైమ్ గేమ్‌లోకి వెళ్లిన తర్వాత సిద్ధు జీవితంలో ఎలాంటి మలుపులు వచ్చాయి? ఫైనల్‌గా ఏం జరిగింది? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే... ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ. ఏమి సాధించలేక ఆత్మహత్య చేసుకోవనుకున్న ఓ యువకుడు.. అనుకోకుండా రియల్ టైమ్ గేమ్‌లోకి ప్రవేశిస్తాడు. ఆ ఆట అతని జీవితంలో ఎలాంటి మలుపులు తిప్పింది? అసలు ఆ గేమ్ ఎంచుకోబడడానికి కారణం ఏమిటి, ఈ గేమ్ ఎవరు ఆడుతున్నారు? ఫైనల్‌గా ఏం జరిగింది? అనేది ఈ సినిమా ఇత్తివృత్తం. హీరో లూజర్ నుంచి విన్నర్ గా ఎలా మారాడు అనేది కాస్త ఆసక్తికరంగా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు దయానంద్. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో నెక్స్ట్ ఏం జరుగుతుందో అన్న సస్పెన్స్‌ని చివరి వరకు బయటపడకుండా జాగ్రత్త పడుతూ కథనాన్ని ముందుకు నడిపే ప్రయత్నం చేశాడు. అయితే ఈ ప్రయత్నంలో దర్శకుడు కొంత వరకు మాత్రమే సఫలం అయ్యాడు. కాన్సెప్ట్ కాస్త డిఫరెంట్‌గా ఉన్నా.. కథనంలో మాత్రం ఆ కొత్తదనం కనిపించలేదు. సినిమా మొత్తంలో తొమ్మిది టాస్క్‌లు ఉంటాయి. వాటిని మరింత బలంగా చూపిస్తే బాగుంటుంది. ఎంత సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నా..తెరపై చూస్తే కొంచెం అయినా రియాలిటీకి దగ్గరగా ఉండాలి. గేమ్ ఆన్‌లో అది మిస్ అయింది. అయితే కొన్ని చోట్ల మాత్ర ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయింది. అలాగే యూత్‌ని ఆకట్టుకునే రొమాంటిక్ సన్నివేశాలు కూడా బాగానే ఉన్నాయి. ఓ క్రైమ్ సీన్‌తో సినిమా ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత కథ పదేళ్లు ముందుకు జరుగుతుంది.ఓ లూజర్‌గా హీరోని పరిచయం చేయించాడు దర్శకుడు. ఉద్యోగం పోవడం.. స్నేహితుడు మోసం చేయడంతో హీరో క్యారెక్టర్‌పై జాలీ కలిగించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఒక్కసారి ఆన్లైన్ గేమ్ ప్రారంభం అవ్వగానే.. ప్రేక్షకులకు కూడా థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. ఈజీ టాస్కులకు పెద్ద మొత్తంలో డబ్బులు రావడంతో..ఏదో జరగబోతుందనేది ప్రేక్షకుడికి తెలిసినా.. అది ఏంటనే క్యూరియాసిటీ మాత్రం చివరి వరకు ఉండేలా జాగ్రత్త పడ్డాడు దర్శకుడు. ఫన్నీ టాస్క్‌లు.. రొమాంటిక్ సన్నివేశాలతో ఫస్టాఫ్ సాఫీగా సాగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. సెకండాఫ్‌లో కథనం కాస్త నెమ్మదిగా సాగుతుంది.హీరో ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ ఎమోషనల్‌కు గురి చేస్తుంది. క్లైమాక్స్ రొటీన్‌గా ఉంటుంది. గేమ్‌లోని టాస్క్‌ని మరింత ఆసక్తికరంగా తీర్చిదిద్ది ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. ఏది ఏమైనా..గేమ్ ఆన్ మాత్రం కాస్త డిఫరెంట్ మూవీ అనే చెప్పొచ్చు. ఎవరెలా చేశారంటే.. గౌతమ్ సిద్ధార్థ్ పాత్రలో గీతానంద్ ఒదిగిపోయాడు. యాక్షన్‌తో పాటు ఎమోషనల్ సన్నివేశాలలోనూ చక్కగా నటించాడు. తారగా నేహా సొలంకి తెరపై కాస్త హాట్‌గా కనిపించింది. ఆమె పాత్ర ఇచ్చే ట్విస్ట్ అదిరిపోతుంది.గీతానంద్, నేహ సొలంకిల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా పండింది. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ మధుబాల డిఫరెంట్ పాత్ర పోషించి మెప్పించింది. ఫస్టాఫ్‌లో ఆమె పాత్రకు ఎలాంటి సన్నివేశాలు ఉండవు. సైకాలజిస్ట్ మదన్ మోహన్‌గా ఆదిత్య మీనన్ అదరగొట్టేశాడు. శుభలేఖ సుధాకర్ పాత్ర నిడివి తక్కువే అయినా.. ఉన్నంతలో చక్కగా నటించాడు. వాసంతి, కిరిటీతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాకేంతికంగా ఈ సినిమా బాగుంది. అభిషేక్ ఏఆర్ నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయింది. నవాబ్ గ్యాంగ్, అశ్విన్ అరుణ్ పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతి ఫ్రేమ్‌ని తెరపై రిచ్‌గా చూపించాడు. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. -
పూరి జగన్నాథ్ స్ఫూర్తితో డైరెక్టర్ అయ్యా: దయానంద్
‘స్కూల్ డేస్ నుంచి సినిమాలపై ఇంట్రెస్ట్ ఉండేది. హ్యాపీ డేస్ సినిమా చూశాక అది మరింత ఎక్కువైంది. ఏం మాయ చేసావే సినిమా చూశాక మేకింగ్ నాచురల్ గా చేయొచ్చు అనిపించింది. పూరి జగన్నాథ్ గారి స్ఫూర్తితో డైరెక్టర్ రావాలనుకున్నా. అన్నపూర్ణ ఫిలిం స్కూల్లో ఆరు నెలలుకోర్స్ చేశాను. కొంతమంది రైటర్స్ తో ట్రావెల్ చేశాక మంచి కథ రాయాలనిపించింది. అలా రాసిన కథే ‘గేమ్ ఆన్’. ఇదిరెగ్యులర్ కమర్షియల్ సినిమాలా కాకుండా.. అన్నీ ఉంటూనే డిఫరెంట్ గా ఉంటుంది’అని అన్నారు యంగ్ డైరెక్టర్ దయానంద్. ఆయన దర్శకత్వంలో గీతానంద్, నేహా సోలంకి హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘గేమ్ ఆన్’. సీనియర్ నటులు మధుబాల, ఆదిత్య మీనన్, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం ఫిబ్రవరి 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు దయానంద్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► గేమ్ ఆన్ మూవీ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. మొదటి చిత్రంతోనే నా మార్క్ ఉండేలా ప్రయత్నించాను. చచ్చిపోదాం అనుకునే వ్యక్తి జీవితంలోకి ఒక గేమ్ ప్రవేశిస్తే అతని జీవితం ఎలా మారింది అనేది సినిమాటిక్ గా చూపించాం. ఒక్కొక్క టాస్క్ దాటుకుంటూ ముందుకు వెళ్తాడు. ఇలాంటి టాస్క్ లు తొమ్మిది ఉంటాయి. సెకండాఫ్ లో వచ్చే టాస్క్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒక ట్రోమాలోకి వెళ్ళిపోయిన వ్యక్తికి ఈ గేమ్ ఏ విధంగా హెల్ప్ చేసిందనేది మెయిన్ కాన్సెప్ట్. ► ఈ మూవీ యూత్ ను ఎట్రాక్ట్ చేస్తూనే ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా చాలా ఉంటాయి. వాటిని టీజర్, ట్రైలర్ లో రివీల్ చేయలేదు. మధుబాల గారి క్యారెక్టర్ చాలా కొత్తగా, ఐకానిక్ గా ఉంటుంది. ఆదిత్యామీనన్ గారిది చాలా స్మార్ట్ క్యారెక్టర్. ఇందులో సైకలాజికల్ డాక్టర్ గా ఆయన నటించారు. ఆయన యాక్టింగ్ లో చాలా షేడ్స్ కనిపిస్తాయి. శుభలేఖ సుధాకర్ గారు మరో ఇంపార్టెంట్ రోల్ చేశారు. వీరంతా సినిమాకు చాలా ప్లస్ అయ్యారు. ► నేహా సోలంకి పాత్ర చాలా మాసీగా ఉంటుంది. ఆమె క్యారెక్టర్ లో చాలా సర్ప్రైజ్లు ఉంటాయి. సెకండ్ హీరోలా ఆమె పాత్ర ఉంటుంది. నిర్మాత రవి కస్తూరి గారికి స్క్రిప్ట్ నచ్చి నాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. క్రియేటివ్ పరంగా ఆయన నాకు చాలా సపోర్ట్ చేశారు. ► ఫస్ట్ షెడ్యూల్ అయ్యాక మాలో కాన్ఫిడెంట్ పెరిగింది. దీంతో సెకండ్ షెడ్యూల్ నుంచి బడ్జెట్ పెంచి ఇంకా బాగా తీయాలనుకున్నాం. చాలా రియలిస్టిక్ గా సినిమా సాగుతుంది. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా ఇది. తక్కువ ధియేటర్లో విడుదలైనా నెమ్మదిగా థియేటర్లు పెరిగే అవకాశం ఉంటుందని నమ్మకం ఉంది. ఇప్పటికే వేసిన కొన్ని ప్రివ్యూ లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎక్కడ బోర్ కొట్టకుండా ఫ్యామిలీ అంతా కలిసి హాయిగా చూడొచ్చు. -
సినిమానే మాట్లాడుతుంది
గీతానంద్, నేహా సోలంకి జంటగా దయానంద్ దర్శకత్వంలో రవి కస్తూరి నిర్మించిన చిత్రం ‘గేమ్ ఆన్’. ఈ చిత్రం ఫిబ్రవరి 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం రవి కస్తూరి విలేకరులతో మాట్లాడుతూ– ‘‘ఆస్ట్రేలియాలో నాకు వ్యాపారాలున్నాయి. నిర్మాతగా నాకు ఇది తొలి చిత్రం. గీతానంద్ హీరోగా, నేను నిర్మాతగా సినిమాలు చేయాలనుకున్నాం. కథ సెట్ కావడంతో ‘గేమ్ ఆన్’ స్టార్ట్ చేశాం. ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ. జీవితాన్ని చాలించాలనుకునే ఓ వ్యక్తి దాన్ని ఎలా అధిగమించాడు? అనేది గేమ్ థీమ్‌లో చూపించాం. ఫ్యామిలీ ఆడియన్స్‌కు నచ్చే సినిమా కూడా. ఓ సినిమాకు మనం ఎంత పబ్లిసిటీ చేసినా మార్నింగ్ షోకు ఆడియన్స్ వెళ్లేంతవరకే. ఆ తర్వాత సినిమానే మాట్లాడుతుంది’’ అని చెప్పుకొచ్చారు. -
మా గేమ్ ను ప్రేక్షకులే గెలిపించాలి : హీరో గీతానంద్
గీతానంద్, నేహా సోలంకి జంటగా నటించిన చిత్రం ‘గేమ్ ఆన్’. సీనియర్ నటులు మధుబాల, ఆదిత్య మీనన్ శుభలేఖ సుధాకర్ కీలక పాత్రలు పోషించారు. కస్తూరి క్రియేషన్స్ అండ్ గోల్డెన్ వింగ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై దయానంద్ దర్శకత్వంలో రవి కస్తూరి ఈ సినిమాను నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 2న గ్రాండ్ గా విడుదలకు సిద్దమవుతోంది.శనివారం హైదరాబాదులోని ప్రసాద్ లాబ్స్ లో ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో గీతానంద్ మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం చాలా రీసెర్చ్ చేశాం. మంచి కాన్సెప్ట్ రాసుకుని దానికి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించాం. ఇదొక హై ఆక్టేన్ యాక్షన్ డ్రామా. గేమింగ్ కంపెనీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా పని చేసే ఒక ఎంప్లాయ్ జీవితంపై విరక్తి చెంది ఒక గేమ్ లో పడితే ఎలా ఉంటుందనేది ఈ సినిమాలో ఆసక్తికరంగా చూపించాం. మధుబాల గారు ఆదిత్య మీనన్ గారు ఇందులో ఉండడం ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ కు వెళ్లింది. గేమ్ స్టార్ట్ చేసాం . మా గేమ్ ను ప్రేక్షకులే గెలిపించాలి. ఈ సినిమా తర్వాత మా తమ్ముడైన డైరెక్టర్ దయానంద్ యాక్షన్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకుంటాడు. నేను కూడా నటుడుగా పేరు తెచ్చుకోవాలని ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాను’ అని అన్నారు ‘మంచి కథతో ఈ సినిమాను స్టార్ట్ చేసాం. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా దీన్ని రూపొందించాం. ప్రతి విషయంలో క్వాలిటీ ఉండేలా చూసుకున్నాం. ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా సినిమా ఉంటుంది’అని నిర్మాత రవి కస్తూరి అన్నారు. ‘కమర్షియల్ స్క్రిప్ట్ ని రా అండ్ రస్టిక్ గా చిత్రీకరించాను. పూరి జగన్నాథ్ ఫ్యాన్ గా ఈ సినిమాను డైరెక్ట్ చేశాను. ఈ చిత్రంలో పాత్రలన్నీ గ్రే షేడ్‌లో ఉంటాయి. ప్రతి పాత్రకు ప్రాధాన్యం ఉంటుంది. కచ్చితంగా మా సినిమా ప్రేక్షకులకు కొత్త ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది’ అని దర్శకుడు దయానంద్ అన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ నేహా సోలంకి, నటులు ఆదిత్య మీనన్,కిరిటీ, సినిమాటోగ్రాఫర్ అరవింద్ విశ్వనాథ్, నవాబ్ గ్యాంగ్, అశ్విన్ అరుణ్, మ్యూజిక్ డైరెక్టర్ అభిషేక్ ఏఆర్ తదితరులు పాల్గొన్నారు. -
ఓటీటీకి వచ్చేసిన 'భాగ్ సాలే'.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా?
సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు శ్రీసింహా కోడూరి, నేహా సోలంకి హీరోహీరోయిన్లుగా నటించిన మూవీ ‘భాగ్ సాలే’. ఈ చిత్రానికి ప్రణీత్ బ్రాహ్మాండపల్లి దర్శకత్వం వహించారు. సురేష్ బాబు సమర్పణలో వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై బిగ్ బెన్, సినీ వ్యాలీ మూవీస్ వారి అసోసియేషన్ తో అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కళ్యాణ్ సింగనమల నిర్మించారు. జులై 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం థియేటర్లలో నవ్వులు పూయించింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. (ఇది చదవండి: అందమైన అనన్య.. 'తంత్ర' అంటూ భయపెట్టేస్తోంది! ) థియేటర్లలో నవ్వులు పూయించిన ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఆగస్టు 4వతేదీ నుంచే స్ట్రీమింగ్ అవుతోంది. రిలీజైన నెల రోజుల కాకముందే భాగ్ సాలే డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో అభిమానులను అలరిస్తోంది. కాగా.. ఈసినిమాలో జాన్ విజయ్, రాజీవ్ కనకాల, వెన్నెల కిషోర్, నందినీరాయ్, సుదర్శన్, వంశీ నెక్కంటి, వైవా హర్ష, కిడ్ చక్రి, జయవాణి, బాష, యాదం రాజు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. కాలభైరవ సంగీతమందించారు. థియేటర్లో చూడలేని వారు ఎంచక్కా ఓటీటీలో చూసేయండి. (ఇది చదవండి: ఆ రింగ్ ఉంటే లైఫ్ రిచ్.. ఆసక్తికరంగా ‘భాగ్ సాలే’వీడియో గ్లింప్స్ ) -
‘భాగ్ సాలే’మూవీ రివ్యూ
టైటిల్: భాగ్ సాలే నటీనటులు: శ్రీ సింహా ,నేహా సోలం, జాన్ విజయ్, రాజీవ్ కనకాల, నందిని రాయ్, హర్ష, సుదర్శన్ తదితరులు నిర్మాతలు: అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కల్యాణ్ సింగనమల దర్శకత్వం: ప్రణీత్ బ్రహ్మాండపల్లి సంగీతం: కాళ భైరవ విడుదల తేది: జులై 7, 2023 ‘భాగ్ సాలే’ కథేంటంటే.. మధ్య తరగతి కుటుంబానికి చెందిన (శ్రీసింహా) ఓ చెఫ్. ఎప్పటికైనా ఓ స్టార్ హోటల్ని స్థాపించాలని అతని ఆశయం. కానీ హోటల్ని స్థాపించేంత డబ్బు అతని దగ్గర ఉండదు. తాను రాయల్ కుటుంబానికి చెందిన కోటీశ్వరుడిని అని అబద్దం చెప్పి మాయ(నేహా సోలం)ని ప్రేమలో పడేస్తాడు. మరోవైపు శ్యాముల్ (జాన్ విజయ్) అనే రౌడీ ఓ డైమండ్ రింగ్ కోసం మాయ తండ్రిని కిడ్నాప్ చేస్తాడు. రూ.25 కోట్లు విలువ చేసే ఆ రింగ్‌ని తీసుకొచ్చి ఇస్తేనే అతన్ని వదిలేస్తానని కండీషన్ పెడతాడు. ఆ రింగ్ తీసుకొచ్చి ఇస్తేనే పెళ్లికి ఓకే చెబుతానని నళిని(నందిని రాయ్) శ్యాముల్కి కండీషన్ పెడుతుంది. అసలు ఆ రింగ్ నేపథ్యం ఏంటి? నళినికి ఆ రింగే ఎందుకు కావాలి? ఆ రింగుకు మాయ ఫ్యామిలీకి ఉన్న సంబంధం ఏంటి? మాయ కోరిక మేరకు ఆ రింగ్‌ని తీసుకురావడానికి అర్జున్ పడిన కష్టాలేంటి? అర్జున్ రిచ్ పర్సన్ కాదని తెలిసిన తర్వాత మాయ ఏం చేసింది? ఈ కథలో రమ్య(వర్షిణి), ఎస్సై ప్రామిస్రెడ్డి(సత్య) దంపతుల పాత్ర ఏంటి? చివరకు ఆ రింగ్ ఎవరికి దక్కింది? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే... ఇదొక క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ ఇది. ఇలాంటి చిత్రాల్లో క్రైమ్ బలంగా ఉండాలి. అది లేకపోతే సినిమాపై అంత ఆసక్తి ఉండదు. బాగ్సాలే విషయంలో బలమైన క్రైమ్ లేదు. కానీ కామెడీ సన్నివేశాలు మాత్రం చాలా ఉన్నాయి. దర్శకుడు ప్రణీత్ కామెడీపైనే ఎక్కువ దృష్టిపెట్టి, క్రైమ్, స్క్రీన్‌ప్లే గాలికొదిలేశాడు. రింగ్ నేపథ్యాన్ని తెలియజేస్తూ కథ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత ఒకేసారి రెండు యాంగిల్స్‌లో నడుతుంది. ఒకపైపు హీరోహీరోయిన్ల ప్రేమ, పెళ్లి గోల, మరోవైపు రింగ్ కోసం విలన్ చేసే ప్రయత్నాలను చూపిస్తూ కథనం సాగుతుంది. విలన్ హీరోయిన్ తండ్రిని కిడ్నాప్ చేసిన తర్వాత కథలో వేగం పుంజుకుంటుంది. ప్రియురాలి కోసం ఆమె తండ్రిని విడిపించడానికి హీరో పడే పాట్లు, చెప్పే అబద్దాలు నవ్వులు పూయిస్తాయి. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక సెకండాఫ్ మొత్తం రింగ్ చుట్టే తిరుగుతుంది. హీరో ఆ రింగ్‌ని దొంగిలించి ఒక చోట పెట్టడం..అది వేరు వేరు వ్యక్తుల చేతికి వెళ్లడం .. దాని కోసం విలన్ గ్యాంగ్, హీరో పడే తిప్పలు అన్నీ కామెడీగా సాగుతాయి. ప్రామిస్ రెడ్డి గా సత్య చేసే కామెడీ నవ్వులు పూయిస్తుంది. అయితే సినిమా చూస్తున్నంతసేపు చాలా సన్నివేశాలను ఇంతకు ముందెప్పుడో చూశామనే ఫీలింగ్ కలుగుతుంది. ఎలాంటి అంచనాలు లేకుండా కేవలం నవ్వుకోవడానికి మాత్రమే వెళ్తే ఈ సినిమా అలరిస్తుంది. ఎవరెలా చేశారంటే.. అర్జున్ పాత్రకి శ్రీసింహా న్యాయం చేశాడు. అయితే ఈ తరహా పాత్రలు ఆయనకు కొత్తేమి కాదు. గత సినిమాల మాదిరే ఇందులో కూడా పక్కింటి కుర్రాడిలా కనిపిస్తాడు. మాయ పాత్ర పోషించిన నేహా సోలంకి రెగ్యులర్ హీరోయిన్లలా కేవలం పాటలకే పరిమితం కాకుండా సినిమా మొత్తం కనిపిస్తూ తనదైన నటనతో ఆకట్టుకుంది. తమిళ నటుడు జాన్ విజయ్ విలన్ పాత్రలో ఒదిగిపోయాడు. విలన్ బామ్మర్థి జాక్సన్‌గా వైవా హర్ష చేసే కామెడీ నవ్వులు పూయిస్తుంది. రాజీవ్ కనకాల, సత్య, వర్షిణి సౌందర్ రాజన్, నందిని రాయ్, సుదర్శన్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే ఈ సినిమాకు ప్రధాన బలం కాల భైరవ సంగీతం. పాటలు పర్వాలేదు. నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచింది. సినిమాటోగ్రాఫర్, ఎడిటర్ల పనితీరు బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కళ్యాణ్ సింగనమల ఎక్కడా రాజీ పడలేదని సినిమా చూస్తే అర్థమవుతుంది. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
రాజమౌళిని సినిమా ఛాన్స్ అడగలేను.. ఎందుకంటే: శ్రీ సింహా
'ప్రేక్షకులకు సందేశం ఇవ్వాలనో, భావోద్వేగాలతో ఏడిపించాలనో ‘భాగ్ సాలే’ సినిమా తీయలేదు. ప్రేక్షకులు రెండు గంటల పాటు థియేటర్లో నవ్వుకోవాలని తీశాం' అని హీరో శ్రీ సింహా కోడూరి అన్నారు. ప్రణీత్ బ్రహ్మాండపల్లి దర్శకత్వంలో శ్రీ సింహా కోడూరి, నేహా సోలంకి జంటగా నటించిన చిత్రం ‘భాగ్ సాలే’. అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కల్యాణ్ సింగనమల నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో శ్రీ సింహా మాట్లాడుతూ–'భాగ్ సాలే' కథని ప్రణీత్ ఎప్పుడో చెప్పాడు. కానీ, ‘తెల్లవారితే గురువారం, దొంగలున్నారు జాగ్రత్త, ఉస్తాద్’ సినిమాల కమిట్మెంట్స్ వల్ల ‘భాగ్ సాలే’ ఆలస్యం అయింది. ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ వల్ల లాభాలు, నష్టాలుంటాయి. కథల ఎంపిక అనేది పూర్తిగా నా నిర్ణయమే. నాకు స్క్రిప్ట్ విషయంలో ఏదైనా డౌట్ వస్తే నాన్న (కీరవాణి), బాబాయ్ (రాజమౌళి) సలహాలు తీసుకుంటాను. ‘భాగ్ సాలే’ బడ్జెట్ ఎక్కువైనా నిర్మాతలు రాజీ పడలేదు. ‘రంగస్థలం’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేసిన అనుభవం నాకు యాక్టింగ్‌లో ఉపయోగపడింది. రాజమౌళిగారితో సినిమా చేయాలనేది అందరికీ ఓ కల. అలాగని ఆయన్ను నేను ఛాన్స్ అడగలేను. నేనింకా చాలా నేర్చుకోవాలి. ఆ తర్వాత ఆయనే పిలిచి నాకు అవకాశం ఇవ్వాలి. ప్రస్తుతం ‘ఉస్తాద్’ సినిమా చేస్తున్నాను' అన్నారు. -
కొత్త కామెడీ టైమింగ్‌ను చూస్తారు
‘‘భాగ్ సాలే’ సినిమాను నేను నిర్మించాల్సింది.. కానీ కుదరలేదు. శ్రీసింహాలో మంచి టైమింగ్ ఉంది. ఈ సినిమాలో కొత్త కామెడీ టైమింగ్‌ను చూస్తారు. దర్శకుడు ప్రణీత్‌తో నేను, విష్ణు కలిసి ఓ సినిమాను నిర్మించనున్నాం’’ అని డైరెక్టర్ హరీష్ శంకర్ అన్నారు. శ్రీ సింహా కోడూరి, నేహా సోలంకి జంటగా ప్రణీత్ బ్రహ్మాండపల్లి దర్శకత్వం వహించిన చిత్రం ‘భాగ్ సాలే’. అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కల్యాణ్ సింగనమల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో శ్రీ సింహా మాట్లాడుతూ–‘‘ఈ సినిమాతో అందర్నీ నవ్విస్తాం’’ అన్నారు. ‘‘భాగ్ సాలే’ ప్రేక్షకులను అలరిస్తుంది’’ అన్నారు ప్రణీత్. ‘‘మంచి క్రైమ్ కామెడీ ఫిల్మ్ ఇది’’ అన్నారు అర్జున్ దాస్యన్ . ‘‘ఈ తరహా చిత్రాలు చాలా తక్కువగా వస్తాయి’’ అన్నారు యష్ రంగినేని. -
సినిమా సక్సెస్ అని రాజమౌళి అన్నారు
శ్రీ సింహా కోడూరి, నేహా సోలంకి హీరో హీరోయిన్లుగా నటించిన క్రైమ్ కామెడీ ఫిల్మ్ ‘భాగ్ సాలే’. ప్రణీత్ బ్రహ్మాండపల్లి దర్శకత్వంలో అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కళ్యాణ్ సింగనమల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో ప్రణీత్ బ్రహ్మాండపల్లి మాట్లాడుతూ – ‘‘భాగ్ సాలే’ కల్పిత కథ. నిజాంకు ఉంగరాలపై ఆసక్తి ఉండేదంటారు. ఈ సినిమా కథ కూడా ఓ ఉంగరం చుట్టూ తిరుగుతుంది. అందుకే హైదరాబాద్ నేపథ్యం ఎంచుకున్నాం. ఇందులో శ్రీ సింహా ΄ాత్ర కాస్త స్వార్థంతో కూడి ఉంటుంది. సినిమా అంతా పరిగెత్తడమే. అందుకే ‘దౌడ్’, ‘పరుగు’ వంటి టైటిల్స్ అనుకున్నాం. కానీ సౌండింగ్ బాగుందని ‘భాగ్ సాలే’ ఫిక్స్ చేశాం. ట్రైలర్ చూసి, శ్రీ సింహాతో రాజమౌళిగారు ఈ సినిమా సక్సెస్ అవుతుందని చె΄్పారట. దీన్ని నేను పెద్ద కాంప్లిమెంట్‌గా భావిస్తున్నాను. ఇక దర్శకుడు హరీష్ శంకర్‌గారి అసోసియేషన్‌తో ఓ స్పోర్ట్స్ ఫిల్మ్ చేయాలనే ఆలోచనలో ఉంది’’ అన్నారు. -
ఇకపై భాగ్ సాలే సినిమా గుర్తొస్తుంది
‘‘భాగ్ సాలే ట్రైలర్ వినోదాత్మకంగా ఉంది. ఇప్పటిదాకా భాగ్ సాలే అంటే మహేశ్ బాబుగారి పాట గుర్తుకొచ్చేది. ఇకపై భాగ్ సాలే అంటే ఈ సినిమా గుర్తొస్తుంది. శ్రీ సింహాకి ‘భాగ్ సాలే’ పెద్ద హిట్ ఇవ్వాలి’’ అని హీరో కార్తికేయ అన్నారు. శ్రీ సింహా కోడూరి హీరోగా, నేహా సోలంకి, నందినీ రాయ్ హీరోయిన్లుగా ప్రణీత్ బ్రహ్మాండపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భాగ్ సాలే’. అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కల్యాణ్ సింగనమల నిర్మించిన ఈ చిత్రం జూలై 7న విడుదలకానుంది. హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో ఈ చిత్రం ట్రైలర్‌ను కార్తికేయ విడుదల చేశారు. ‘‘క్రైమ్ కామెడీగా రూపొందిన చిత్రమిది’’ అన్నారు అర్జున్ దాస్యన్. ‘‘ఇది హైదరాబాద్ బేస్డ్ మూవీ. మంచి ఇరానీ చాయ్లాంటి సినిమా’’ అన్నారు ప్రణీత్ బ్రాహ్మాండపల్లి. ‘‘ఈ చిత్రంలో అర్జున్ అనే టక్కరి దొంగ పాత్ర చేశాను. విలువైన ఉంగరం దొరకడం వల్ల అర్జున్ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? అనేది ఆసక్తిగా ఉంటుంది’’ అన్నారు శ్రీ సింహా. -
ఓ యువకుడి పోరాటం
అనుకున్నది సాధించడానికి ఓ యువకుడు ఎలాంటి సాహసాలు చేశాడు? అతను ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి? అనే అంశాల నేపథ్యంలో తెరకెక్కిన క్రైమ్ కామెడీ ఫిల్మ్ ‘భాగ్ సాలే’. శ్రీ సింహా కోడూరి, నేహా సోలంకి జంటగా అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కల్యాణ్ సింగనమల నిర్మించారు. ఈ సినిమాను జూలై 7న విడుదల చేయనున్నట్లు శనివారం యూనిట్ వెల్లడించింది. ‘‘లక్ష్యాన్ని సాధించాలనుకునే ఒక యువకుడి పాత్ర చుట్టూ తిరిగే ఈ కథ ఆద్యంతం థ్రిల్లింగ్‌గా ఉంటుంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: కాలభైరవ, కెమెరా: రమేష్ కుషేందర్. -
'గేమ్ ఆన్' టీజర్.. దసరా థియేటర్స్‌లో సందడి
గీతానంద్, నేహా సోలంకి హీరో, హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘గేమ్ ఆన్’. కస్తూరి క్రియేషన్స్, గోల్డెన్ వింగ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై దయానంద్ దర్శకత్వంలో రవి కస్తూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు . తమ్ముడి దర్శకత్వంలో అన్న హీరోగా నటించడం ఇందులో విశేషం. మధుబాల, ఆదిత్య మీనన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన రెండు పాటలకు చక్కని స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. దసరా సినిమా విడుదలైన థియేటర్లలో టీజర్‌ను ప్రదర్శించారు. నిర్మాత రవి కస్తూరి మాట్లాడుతూ..' గతంలో విడుదల చేసిన ‘గేమ్ ఆన్’ టైటిల్, ఫస్ట్ లుక్ మంచి రెస్పాన్స్ వచ్చింది. నాని హీరోగా నటించిన దసరా సినిమాతో మా టీజర్ విడుదల చేయడం ఆనందంగా ఉంది. స్పందన అద్భుతంగా ఉంది. త్వరలో ట్రైలర్ విడుదల చేస్తాం. ఈ సినిమాకు ఇద్దరు అన్న దమ్ములు పని చేస్తున్నారు. ఒకరు హీరోగా, ఒకరు డైరెక్టర్‌గా ఈ సినిమా చెయ్యడం విశేషం. అందరూ ఎంతో కష్టపడి పనిచేశాం. అరవింద్ విశ్వనాథన్ అద్భుతంగా విజువల్స్ ఇచ్చాడు. నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసి విడుదల తేదీని ప్రకటిస్తాం.' అని అన్నారు. దర్శకుడు దయానంద్ మాట్లాడుతూ..' రొటీన్ సినిమాలకు భిన్నంగా ఉండే కథ. తెలుగులో ఇప్పుడు డిఫరెంట్ సినిమాలు రావడమే కాదు.. సక్సెస్ కూడా అవుతున్నాయి. సరికొత్త ట్విస్టులతో ఆద్యంతం ఆసక్తిగా సాగుతుంది. ముఖ్యంగా మా బ్రదర్‌పై నమ్మకం పెట్టి ఈ కథ రాసుకుని డైరెక్ట్ చేస్తున్నా. ఈ సినిమాలో యాక్షన్, రొమాన్స్. ఎమోషన్స్... అన్ని రకాల ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.' అని అన్నారు. -
మొన్న నేను.. ఈరోజు గీత్!
‘‘కష్ట్టపడితే సక్సెస్ సాధిస్తాం. ఇందుకు ఉదాహరణ మేమే. మొన్న నేను ఇండస్ట్రీకి వచ్చాను.. ఈ రోజు గీత్ ఆనంద్ వచ్చాడు.. రేపు ఎవరో ఒకరు వస్తారు. ‘గేమ్ ఆన్’ని ప్రేక్షకులు హిట్ చేయాలి’’ అని హీరో విశ్వక్ సేన్ అన్నారు. గీత్ ఆనంద్ హీరోగా, నేహా సోలంకి, వాసంతి హీరోయిన్లుగా దయానంద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గేమ్ ఆన్’. వెంకటేశ్వరరావు కస్తూరి, సాక్షి రవి సమర్పణలో రవి కస్తూరి నిర్మించారు. ఈ సినిమా టీజర్‌ని విశ్వక్ సేన్ రిలీజ్ చేశారు. ‘‘ఈ సినిమా నిరుత్సాహపరచదు’’ అన్నారు దయానంద్. ‘‘2023లో సౌత్ నుంచి వచ్చిన మంచి సినిమాల్లో ‘గేమ్ ఆన్’ తప్పకుండా ఉంటుంది’’ అన్నారు గీత్ ఆనంద్. ‘‘మా సినిమా కొత్త ట్రెండ్ సెట్ చేస్తుంది’’ అన్నారు రవి కస్తూరి. -
ఓటీటీలోకి వచ్చేస్తున్న గూడుపుఠాణి, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
సప్తగిరి, నేహా సోలంకి జంటగా నటించిన చిత్రం గూడుపుఠాణి. కె.యమ్. కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఎస్ఆర్ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్లో రియల్ ఎస్టేట్ కింగ్స్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ నిర్మించారు. ఈ సినిమా గతేడాది డిసెంబర్ 25న థియేటర్లలో విడుదలై మంచి విజయం సాధించింది. సప్తగిరి కామెడీ డైలాగులు, మంచి కథ కథనంతో ప్రేక్షకులని ఎంటర్టైన్ చేసింది. నిర్మాతలైన పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ లకు మంచి డబ్బు సంపాదించి పెటింది. ఇప్పుడు ఈ "గూడుపుఠాణి" చిత్రం జీ 5 ఓ టి టి లో రేపు అనగా 8 జులై నా విడుదల కానుంది. నిర్మాతలు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ లు మాట్లాడుతూ "మా గూడుపుఠాణి చిత్రం మంచి విజయం సాధించింది. థియేటర్ లో చుసిన ప్రతి ప్రేక్షకుడు సినిమా చాలా బాగుందని కొనియాడాడు. మా చిత్రానికి మంచి రివ్యూస్ వచ్చాయి. IMDB లో 8.8 రేటింగ్ వచ్చింది. మా చిత్రాన్ని జీ5 వాళ్ళు మంచి రేట్‌కు కొన్నారు. రేపు జీ5లో విడుదల అవుతుంది. థియేటర్లో మిస్ అయినా ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు జీ 5లో లభిస్తుంది, చూసి ఆనందించండి" అని తెలిపారు. చదవండి: మైనర్ బాలికల పట్ల అసభ్య ప్రవర్తన.. పోక్సో చట్టం కింద నటుడు అరెస్ట్ నేను ఇంతకాలం నటించకపోవడానికి కారణం ఇదే.. -
సైకలాజికల్, రొమాంటిక్ డ్రామాగా 'గేమ్ ఆన్'..
Game On Movie Launch By Director Praveen Sattaru: సైకలాజికల్, రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న చిత్రం 'గేమ్ ఆన్'. గీతానంద్, నేహా సోలంకి, వసంతి, కిరిటీ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి దయానంద్ దర్శకత్వం వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌లో పూజా కార్యక్రమాలతో వైభవంగా ప్రారంభమైంది. ఈ వేడుకకు డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హీరోహీరోయిన్లు గీతానంద్, నేహా సోలంకిలపై చిత్రీకరించిన ముహుర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మూవీ డైరెక్టర్ దయానంద్ మాట్లాడుతూ '2020 నుంచి స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాం. ప్రేక్షకులకు నెక్స్ట్ లెవల్ ఫీల్ అయ్యేలా స్క్రిప్ట్ రెడీ చేశాం. సినిమా చూస్తున్న ప్రతి ప్రేక్షకుడు ఎదో ఒక ఎమోషన్ సీన్ లో కచ్చితంగా కనెక్ట్ అవుతాడు. ఇలాంటి మంచి సినిమాకు దర్శకత్వం చేసే అవకాశం కల్పించిన నిర్మాతలకు ధన్యవాదాలు.' అని తెలిపారు. 'ఈ 'గేమ్ ఆన్' చిత్రం సైకాలజికల్ యాక్షన్ డ్రామా. ఈ సినిమాలో చాలా డీప్ ఎమోషనల్ లేయర్స్ ఉంటాయి. ఇందులో ట్విస్ట్‌లు చాలా ఉంటాయి. ఈ సినిమా స్క్రిప్ట్ కోసం దర్శకుడు దయానంద్ చాలా కష్టపడ్డారు. మంచి కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమా 2022లో బెస్ట్ సినిమా అవుతుంది. అని హీరో గీతానంద్ పేర్కొన్నారు. లూజర్‌గా ఉన్న యువకుడు విన్నర్ ఎలా అయ్యాడనే కథాంశంతో రూపొందించామని నిర్మాతలు వెల్లడించారు. చదవండి: ఆ వెబ్ సిరీస్ చూసి గర్ల్‌ఫ్రెండ్‌పై హృతిక్ రోషన్ వ్యాఖ్యలు.. చదవండి: నేరుగా ఓటీటీలోకి కీర్తి సురేష్ సినిమా.. ఎప్పుడు ? ఎక్కడంటే ? var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4261450729.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
‘ఛలో ప్రేమిద్దాం’ మూవీ రివ్యూ
టైటిల్ : ఛలో ప్రేమిద్దాం నటీనటులు : సాయి రోనక్, నేహా సోలంకీ, పొసాని కృష్ణమురళి, హేమ, అలీ, బాహుబలి ప్రభాకర్, సూర్య తదితరులు నిర్మాణ సంస్థ : హిమాలయ స్టూడియో మేన్సన్స్ నిర్మాతలు : ఉదయ్ కిరణ్ దర్శకత్వం : సురేష్ శేఖర్ రేపల్లే సంగీతం : భీమ్స్ సిసిరోలియో ఎడిటింగ్ః ఉపేంద్ర జక్క సినిమాటోగ్రఫీ: అజిత్ వి.రెడ్డి, జయపాల్ రెడ్డి విడుదల తేది : నవంబర్ 19, 2021 `బ్లాక్ అండ్ వైట్`, ప్రియుడు సినిమాలతో టాలీవుడ్ లోకి నిర్మాతగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కుమార్ తాజాగా హిమాలయ స్టూడియో మేన్సన్స్ పతాకంపై నిర్మించిన చిత్రం `ఛలో ప్రేమిద్దాం`. `ప్రెజర్ కుక్కర్` ఫేమ్ సాయి రోనక్, `90 ఎమ్ ఎల్` ఫేమ్ నేహ సోలంకి జంటగా నటించారు. సురేష్ శేఖర్ రేపల్లె దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. అందమైన ప్రేమకథతో పాటు, థ్రిల్లింగ్ అంశాలతో ఈ మూవీ తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్‌కు పాజిటివ్ రెస్సాన్స్ రావడంతో పాటు సినిమాపై అంచనాలను పెంచింది. ఎన్నో అంచనాల మధ్య ఈ శుక్రవారం(నవంబర్ 19)థియేటర్స్ ద్వారా ప్రేక్షకులను పలకరించిన ‘ఛలో ప్రేమిద్దాం’ఏ మేరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం. ‘ఛలో ప్రేమిద్దాం’కథేంటంటే.. వైజాగ్‌కు చెందిన ఆత్మరావు అలియాస్ రావు (సాయి రోనక్) ఇంజనీరింగ్ చదువు కోసం హైదరాబాద్‌కు వస్తాడు. అదే కాలేజీలో చదువుతున్న మధుమతి(నేహా సోలంకీ)తో ప్రేమలో పడతాడు. మధుమతికి కూడా రావు అంటే ఇష్టం ఉన్నప్పటీ ఆ విషయం అతనికి చెప్పదు. చిత్తూరులో ఉన్న తన మామయ్య, ఊరిపెద్ద పెద్దప్ప(నాగినీడు), సోదరుడు శివుడు(సూర్య)లకు నచ్చితేనే తన ప్రేమను ఆత్మరావుకు చెప్పాలని ఫిక్స్ అవుతుంది. తన సోదరి పెళ్లికి ఆత్మరావుతో పాటు మిగతా స్నేహితులను ఇంటికి ఆహ్వానిస్తుంది మధుమతి. కట్ చేస్తే.. మధుమతి కిడ్నాప్‌కి గురవుతుంది. ఈ వ్యవహారంలో ఆత్మరావుతో పాటు అతని స్నేహితులను పోలీసులు అరెస్ట్ చేస్తారు. అసలు మధుమతిని కిడ్నాప్ చేసిందేవరు? ఎందుకు చేశారు? ఈ కేసులో ఆత్మరావును పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు? ప్రియురాలి కోసం ఆత్మరావు చేసిన సాహసం ఏంటి? చివరకు మధుమతి తన ప్రేమ విషయాన్ని ఆత్మరావుకు చెప్పిందా లేదా? అనేదే మిగతా కథ. ఎవరెలా చేశారంటే.. కాలేజ్ స్టూడెంట్ ఆత్మరావు పాత్రలో సాయి రోనక్ ఒదిగిపోయాడు. డాన్స్‌తో పాటు ఫైట్ సీన్స్ కూడా అదరొట్టాడు. ఇక అల్లరి పిల్ల మధుమతిగా నేహా సోలంకీ తనదైన నటనతో మెప్పించింది. హే భగవాన్ అల్లా జీసస్ అంటూ నవ్వులు పూయించడంతో పాటు తెరపై అందంగా కనిపించింది. `ఫోన్ ఎక్కువ మాట్లాడకండి.. మ్యాటర్ పనిచేయదు` అని హీరోయిన్ చెప్పే డైలాగ్ బాగా పేలింది. గ్రామపెద్దగా నాగీనీడు, అతనికి నమ్మదగిన వ్యక్తి శివుడు పాత్రలో సూర్య అద్భుత నటనను కనబరిచారు. కారుమంచి రఘు కామెడీ ఆకట్టుకుంటుంది. మరోవైపు ఫ్రెండ్స్ గా భరత్,పవన్ ఫర్వాలేదనిపించారు.హీరో తండ్రిగా పోసాని, తల్లిగా హేమతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. ఎలా ఉందంటే.. సరదాగా జాలీగా ఉండే అమ్మాయి, అబ్బాయి ప్రేమలో పడిన తరువాత వారి ప్రేమ ఎన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నది. ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి, వాటిని ఎలా ఎదుర్కొని నిలబడ్డారు అనేదే ‘ఛలో ప్రేమిద్దాం’కథ. యూత్‌కు నచ్చే పాయింట్‌ని ఎంచుకున్న దర్శకుడు సురేష్ శేఖర్ రేపల్లే.. అనుకున్నది అనుకున్నట్లు తెరపై చూపించాడు. యూత్‌ఫుల్ డైలాగ్స్, కథ, కథనంతో లవ్ అండ్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా సినిమాను తెరకెక్కించాడు. ఒకపక్క కాలేజీ లవ్‌స్టోరి చూపిస్తూనే.. మరోపక్క యాక్షన్ ఎపిసోడ్‌ని నడిపిస్తూ ప్రేక్షకుడికి క్యూరియాసిటీని పెంచాడు. అయితే సినిమా నిడివి మాత్రం ప్రేక్షకుడి సహనానికి పరీక్షగా మారుతుంది. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్స్ సాగదీతగా అనిపిస్తాయి. ‘అత్తారింటికి దారిది’హోటల్ ఎపిసోడ్ నవ్వులు పూయిస్తుంది. అలాగే సెకండాఫ్‌లో గేతో వచ్చే సన్నీవేశాలు కూడా యూత్‌ని నవ్విస్తాయి. క్లైమాక్స్ మాత్రం మరింత క్రిస్పిగా రాసుకోవాల్సింది. ఎక్కువ సేపు క్లైమాక్స్ ఎపిసోడ్ ఉండటంతో ఆడియెన్స్ సహనం పరీక్షించేలా అనిపిస్తుంది.ఇక సాంకేతిక విషయానికొస్తే.. భీమ్స్ సిసిరోలియో సంగీతం బాగుంది. సురేష్ గంగుల రాసిన‘ఏమైందిరో’,‘జిందగి’పాటలలో పాటు మిగిలిన సాంగ్స్ కూడా ఆకట్టుకుంటాయి. ఎడిటర్ ఉపేంద్ర జక్క తన కత్తెరగా ఇంకాస్తా పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
ఈ సినిమాతో క్లారిటీ వచ్చింది – కార్తికేయ
‘‘90 ఎంఎల్’ కథ ఎంపిక చేసుకున్నప్పుడు ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో అనుకున్నా. ప్రేక్షకులు నన్ను వైవిధ్యంగా చూడటానికి ఇష్టపడుతున్నా రని ఈ సినిమాతో క్లారిటీ వచ్చేసింది’’ అని కార్తికేయ అన్నారు. శేఖర్ రెడ్డి ఎర్ర దర్శకత్వంలో కార్తికేయ, నేహా సోలంకి జంటగా నటించిన చిత్రం ‘90 ఎంఎల్’. అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 6న విడుదలైంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సినిమా సక్సెస్ మీట్లో కార్తికేయ మాట్లాడుతూ– ‘‘శుక్రవారం విడుదలైన మా సినిమా సక్సెస్ అయ్యిందని సోమవారంతో పూర్తిగా అర్థమైంది. ప్రతి సినిమాతో ప్రేక్షకుల్ని అలరించడానికి వంద శాతం కష్టపడతా’’ అన్నారు. ‘‘మా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా బి,సి సెంటర్ల నుంచి మంచి స్పందన వస్తోంది’’ అన్నారు శేఖర్ రెడ్డి. సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, కథానాయిక నేహా సోలంకి పాల్గొన్నారు