Director Harish Shankar Interesting Comments At Bhaag Saale Pre Release Event, Deets Inside - Sakshi
Sakshi News home page

కొత్త కామెడీ టైమింగ్‌ను చూస్తారు

Published Tue, Jul 4 2023 3:28 AM | Last Updated on Tue, Jul 4 2023 10:57 AM

Director Harish Shankar Speech At Bhaag Saale Pre Release Event - Sakshi

అర్జున్‌ దాస్యన్, శ్రీసింహా, వశిష్ఠ, దశరథ్, హరీష్‌ శంకర్, ప్రణీత్, కాలభైరవ

‘‘భాగ్‌ సాలే’ సినిమాను నేను నిర్మించాల్సింది.. కానీ కుదరలేదు. శ్రీసింహాలో మంచి టైమింగ్‌ ఉంది. ఈ సినిమాలో కొత్త కామెడీ టైమింగ్‌ను చూస్తారు. దర్శకుడు ప్రణీత్‌తో నేను, విష్ణు కలిసి ఓ సినిమాను నిర్మించనున్నాం’’ అని డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ అన్నారు. శ్రీ సింహా కోడూరి, నేహా సోలంకి జంటగా ప్రణీత్‌ బ్రహ్మాండపల్లి దర్శకత్వం వహించిన చిత్రం ‘భాగ్‌ సాలే’.

అర్జున్‌ దాస్యన్, యష్‌ రంగినేని, కల్యాణ్‌ సింగనమల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్‌ వేడుకలో శ్రీ సింహా మాట్లాడుతూ–‘‘ఈ సినిమాతో అందర్నీ నవ్విస్తాం’’ అన్నారు. ‘‘భాగ్‌ సాలే’ ప్రేక్షకులను అలరిస్తుంది’’ అన్నారు ప్రణీత్‌. ‘‘మంచి క్రైమ్‌ కామెడీ ఫిల్మ్‌ ఇది’’ అన్నారు అర్జున్  దాస్యన్ . ‘‘ఈ తరహా చిత్రాలు చాలా తక్కువగా వస్తాయి’’ అన్నారు యష్‌ రంగినేని.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement