
సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు శ్రీసింహా కోడూరి, నేహా సోలంకి హీరోహీరోయిన్లుగా నటించిన మూవీ ‘భాగ్ సాలే’. ఈ చిత్రానికి ప్రణీత్ బ్రాహ్మాండపల్లి దర్శకత్వం వహించారు. సురేష్ బాబు సమర్పణలో వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై బిగ్ బెన్, సినీ వ్యాలీ మూవీస్ వారి అసోసియేషన్ తో అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కళ్యాణ్ సింగనమల నిర్మించారు. జులై 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం థియేటర్లలో నవ్వులు పూయించింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది.
(ఇది చదవండి: అందమైన అనన్య.. 'తంత్ర' అంటూ భయపెట్టేస్తోంది! )
థియేటర్లలో నవ్వులు పూయించిన ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఆగస్టు 4వతేదీ నుంచే స్ట్రీమింగ్ అవుతోంది. రిలీజైన నెల రోజుల కాకముందే భాగ్ సాలే డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో అభిమానులను అలరిస్తోంది. కాగా.. ఈసినిమాలో జాన్ విజయ్, రాజీవ్ కనకాల, వెన్నెల కిషోర్, నందినీరాయ్, సుదర్శన్, వంశీ నెక్కంటి, వైవా హర్ష, కిడ్ చక్రి, జయవాణి, బాష, యాదం రాజు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. కాలభైరవ సంగీతమందించారు. థియేటర్లో చూడలేని వారు ఎంచక్కా ఓటీటీలో చూసేయండి.
(ఇది చదవండి: ఆ రింగ్ ఉంటే లైఫ్ రిచ్.. ఆసక్తికరంగా ‘భాగ్ సాలే’వీడియో గ్లింప్స్ )
Comments
Please login to add a commentAdd a comment