Sri Simha
-
మురళీమోహన్ మనవరాలితో కీరవాణి కొడుకు పెళ్లి...ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
కీరవాణి ఇంట్లో పెళ్లి సందడి.. ప్రీ వెడ్డింగ్ ఫొటో వైరల్
టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి కొడుకు, హీరో శ్రీ సింహా పెళ్లికి సిద్ధమయ్యాడు. సీనియర్ నటుడు, రాజకీయ నాయకుడు మురళీమోహన్ మనవరాలు రాగ మాగంటితో కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని గోల్కోండ రిసార్ట్స్ లో ఆదివారం రాత్రి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.(ఇదీ చదవండి: ఆ విషయంలో నన్ను క్షమించండి.. అల్లు అర్జున్ రిక్వెస్ట్)మురళీ మోహన్‌కు కూతురు, కొడుకు ఉన్నారు. కూతురు విదేశాల్లో సెటిలైంది. కుమారుడు రామ్ మోహన్.. ఈయన వ్యాపారాలను చూసుకుంటున్నారు. రామ్ మోహన్- రూపల కుమార్తెనే 'రాగ'. విదేశాల్లో బిజినెస్‌లో మాస్టర్స్ పూర్తి చేసింది. ప్రస్తుతం రాగ కూడా తన కుటుంబానికి సంబంధించిన వ్యాపార వ్యవహారాలే చూసుకుంటోంది.శ్రీసింహ విషయానికి వస్తే 'యమదొంగ' సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేశాడు. 'మత్తు వదలరా' రెండు చిత్రాలతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తెల్లవారితే గురువారం, దొంగలున్నారు జాగ్రత్త, ఉస్తాద్ తదితర సినిమాల్లోనూ హీరోగా నటించాడు. కీరవాణి పెద్దబ్బాయి కాలభైరవకు ఇంకా పెళ్లి కాలేదు. ఈలోపే చిన్నబ్బాయికి పెళ్లి జరగనుంది. దీంతో ఇదేమైనా ప్రేమ పెళ్లి అని మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: నాగచైతన్య-శోభిత పెళ్లి కార్డ్ ఇదే.. డేట్ ఫిక్స్) 👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
మత్తువదలరా 2 : ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న.. రియా ఎక్కడ? (ఫొటోలు)
-
ఓటీటీలో 'మత్తువదలరా 2' స్ట్రీమింగ్
శ్రీ సింహా, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన చిత్రం ‘మత్తువదలరా 2’ ఓటీటీ ప్రకటన వచ్చేసింది. 2019లో వచ్చిన మత్తువదలరా చిత్రానికి కొనసాగింపుగా ఈ మూవీని తెరకెక్కించారు. బాక్సాఫీస్ వద్ద మంచి ఫన్ చిత్రంగా గుర్తింపు పొందింది. కలెక్షన్ల పరంగా కూడా లాభాలను తెచ్చిపెట్టిన ఈ మూవీని రీతేష్ రానా దర్శకత్వం వహించారు. కామెడీ ఎంటర్టైనర్గా విజయం సాధించిన ఈ చిత్రంలో శ్రీ సింహ, ఫరియా అబ్దుల్లా జంటతో పాటు సత్య, వెన్నెల కిషోర్ నటించారు.సెప్టెంబర్ 13న విడుదలైన ‘మత్తువదలరా 2’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణే వచ్చింది. అయితే, తాజాగా ఓటీటీలో ఈ మూవీని విడుదల చేస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. అక్టోబర్ 11 అంటే శుక్రవారం అర్దరాత్రి నుంచి స్ట్రీమింగ్కు రానున్నట్లు పేర్కొంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది.కథేంటంటే.. ‘మత్తు వదలరా’సినిమా ముగింపు నుంచి ఈ కథ ప్రారంభం అవుతుంది. డెలివరీ ఏంజెంట్స్ అయిన బాబు మోహన్(శ్రీ సింహా), యేసు(సత్య)ల ఉద్యోగం పోవడంతో.. వేరే పని కోసం వెతుకుతుంటారు. అదే టైమ్‌లో హీ టీమ్(హై ఎమర్జెన్సీ టీమ్)లో రిక్రూట్మెంట్ జరుగుతున్నట్లు పేపర్ యాడ్ ద్వారా తెలుసుకుంటారు. లంచం ఇచ్చి మరీ ఆ ఉద్యోగం సంపాదిస్తారు. కిడ్నాప్ కేసులను డీల్ చేయడం వీళ్ల పని.వీరిద్దరు జట్టుగా పని చేస్తుంటారు. జీతం డబ్బులు సరిపోవడం లేదని.. కిడ్నాప్ కేసుల్లో దొరికే డబ్బు నుంచి కొంత తస్కరించి, కిడ్నాపర్‌ని పట్టుకునే క్రమంలో పోయిందని వీళ్ల హెడ్ దీప(రోహిణి)కి చెబుతుంటారు. ఓసారి ధనవంతురాలు దామిని(ఝాన్సీ) తన కూతురు రియాని ఎవరో కిడ్నాప్ చేసి రూ. 2 కోట్లు డిమాండ్ చేస్తున్నారని బాబు, యేసులను సంప్రదిస్తుంది. ఈ కేసును తమ టీమ్‌కి తెలియకుండా డీల్ చేసి రూ. 2 కోట్లు కొట్టేయాలని బాబు, యేసు ప్లాన్ చేస్తారు. ఈ క్రమంలో వీరిద్దరు బారు ఓనర్ ఆకాశ్(అజయ్) హత్య కేసులో ఇరుక్కుంటారు. అసలు ఆకాశ్‌ని హత్య చేసిందెవరు? బాబు, యేసును ఆ కేసులో ఇరికించిందెవరు..? రియాని కిడ్నాప్ చేసిందెవరు..? స్టార్ హీరో యువ(వెన్నెల కిశోర్)కి ఈ హత్యకు ఉన్న సంబంధం ఏంటి..? హత్య కేసులో ఇరుక్కున్న బాబు, యేసులకు వాళ్ల సీనియర్ అధికారి నిధి(ఫరియా అబ్దుల్లా) ఎలాంటి సహాయం చేసింది..? చివరకు ఏం జరిగింది అనేదే మిగతా కథ. -
‘మత్తు వదలారా 2’ సక్సెస్ మీట్ ఫోటోలు
-
చిరంజీవి, మహేశ్‌బాబు అభినందించడం ఆనందంగా ఉంది: డైరెక్టర్ రితేష్ రానా
‘‘మత్తు వదలరా’ సినిమా హిట్ కావడంతో సీక్వెల్ చేద్దామని చెర్రీగారు అన్నారు. మేము అనుకున్నట్లే వర్కవుట్ అయ్యింది. ‘మత్తు వదలరా 2’ని ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మేము ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన రావడం చాలా ఆనందాన్ని ఇచ్చింది’’ అని డైరెక్టర్ రితేష్ రానా అన్నారు. శ్రీ సింహా కోడూరి, ఫరియా అబ్దుల్లా, సత్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మత్తు వదలరా 2’. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 13న విడుదలైంది. (చదవండి: రాఘవా లారెన్స్‌తో పూజా హెగ్డే జోడీ!)ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రితేష్ రానా మాట్లాడుతూ– ‘‘నా దృష్టిలో మా సినిమాకి మంచి ప్రశంస అంటే టీమ్ అంతా హ్యాపీగా ఉండటమే. అది నాకు చాలా సంతోషాన్నిచ్చింది. అలాగే చిరంజీవి, మహేశ్బాబుగార్లు అభినందించడం కూడా ఆనందాన్నిచ్చింది. మా సినిమా రాజమౌళిగారికి చాలా నచ్చింది. నేనిప్పటివరకూ అన్ని సినిమాలు చెర్రీగారితోనే చేశాను. నా తర్వాతి చిత్రం కూడా ఆయనతోనే చేస్తాను. ‘మత్తు వదలరా 3’ సినిమా ఉంటుంది’’ అన్నారు. -
‘మత్తు వదలరా- 2’ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
‘మెగా’ రివ్యూ : రాత, తీత, కోత, మోత.. ప్రాసతో ప్రశంసలు!
శ్రీసింహా హీరోగా నటించిన తాజా చిత్రం మత్తు వదలరా 2. ఆయన కెరీర్లో హిట్‌గా నిలిచిన హిట్ ఫిల్మ్ ‘మత్తు వదలరా’కి సీక్వెల్ ఇది. సత్య, ఫరియా అబ్దుల్లా కీలక పాత్రలు పోషించారు. భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. సత్య కామెడీ సినిమాకు ప్లస్ అయింది. అలాగే ఈ మధ్యకాలంలో ఫుల్ కామెడీ ఎంటర్టైన్ చిత్రాలేవి రాకపోవడం కూడా ఈ సినిమాకు కలిసొచ్చింది. తొలి రోజు తక్కువ వసూళ్లే వచ్చినా.. పాజిటివ్ టాక్‌తో రెండో రోజు నుంచి కలెక్షన్స్ పెరిగాయి. ఇదిలా ఉంటే..తాజాగా ఈ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు. ఈ మధ్యకాలంలో ఓ సినిమా చూసి ఇంతలా నవ్వుకోలేదని అన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా మత్తు వదలరా 2 చిత్రంపై ప్రశంసలు కురిపించారు.(చదవండి: మత్తు వదలరా 2 మూవీ రివ్యూ)‘నిన్ననే ‘మత్తు వదలరా 2’ సినిమా చూశాను. ఈ మధ్యకాలంలో మొదటి నుంచి చివరిదాకా ఇంతలా నవ్వించిన సినిమా నాకు కనబడలేదు. ఎండ్ టైటిల్‌ని కూడా వదలకుండా చూశాను. ఈ క్రెడిట్ అంతా డైరెక్టర్ రితేష్ రానాకే ఇవ్వాలి. అతని రాత, తీత, కోత, మోత, ప్రతీది చక్కగా బ్యాలెన్స్ చేస్తూ మనల్ని వినోదపర్చిన విధానానికి అభినందించకుండా ఉండలేం. హాట్సాఫ్ రితేజ్ రానా. నటీనటులు శ్రీసింహాకి, ప్రత్యేకించి సత్యకి నా అభినందనలు. అలాగే ఫరియా అబ్దుల్లా, కాల భైరవతో పాటు మంచి విజయాన్ని అందుకున్న మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ, టీం అందరికి నా అభినందనలు. మత్తు వదలరా 2 మిస్ కాకండి. వందశాతం ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ’ అని చిరంజీవి ఎక్స్‌లో రాసుకొచ్చాడు. నిన్ననే 'మత్తు వదలరా - 2' చూసాను.ఈ మధ్య కాలంలో మొదటి నుంచి చివరిదాకా ఇంతలా నవ్వించిన సినిమా నాకు కనపడలేదు. End Titles ని కూడా వదలకుండా చూసాను. ఈ క్రెడిట్ అంతా రితేష్ రాణా కి ఇవ్వాలి. అతని రాత , తీత , కోత , మోత, ప్రతీది చక్కగా బ్యాలెన్స్ చేస్తూ మనల్ని వినోద పర్చిన విధానానికి…— Chiranjeevi Konidela (@KChiruTweets) September 15, 2024 -
‘మత్తు వదలరా 2’ మూవీ రివ్యూ
టైటిల్: మత్తు వదలరా- 2నటీనటులు: శ్రీ సింహ కోడూరి, సత్య, ఫరియా అబ్దుల్లా, సునీల్, వెన్నెల కిషోర్, అజయ్, రోహిణి, రాజా చెంబోలు, ఝాన్సీ, శ్రీనివాస్ రెడ్డి, గుండు సుదర్శన్ తదితరులునిర్మాణ సంస్థలు: క్లాప్ ఎంటర్టైన్మెంట్ & మైత్రి మూవీ మేకర్స్నిర్మాతలు: చిరంజీవి (చెర్రీ), హేమలతరచన, దర్శకత్వం: రితేష్ రానాసంగీతం: కాల భైరవసినిమాటోగ్రఫీ: సురేష్ సారంగంవిడుదల తేది : సెప్టెంబర్ 13, 2024‘మత్తు వదలరా’ సినిమా తర్వాత హీరో శ్రీసింహాకు ఆ స్థాయి హిట్ ఒక్కటి కూడా లేదు. వరుస సినిమాలు చేస్తున్నా.. ఏవీ వర్కౌట్ కాలేదు. దీంతో తనకు హిట్ ఇచ్చిన సినిమాకు సీక్వెల్‌గా ‘మత్తు వదలరా 2’తొ మరోసారి బాక్సాఫీస్ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వచ్చేశాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘మత్తు వదలరా 2’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(సెప్టెంబర్ 13) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. ‘మత్తు వదలరా’సినిమా ముగింపు నుంచి ఈ కథ ప్రారంభం అవుతుంది. డెలివరీ ఏంజెంట్స్ అయిన బాబు మోహన్(శ్రీ సింహా), యేసు(సత్య)ల ఉద్యోగం పోవడంతో.. వేరే పని కోసం వెతుకుతుంటారు. అదే టైమ్‌లో హీ టీమ్(హై ఎమర్జెన్సీ టీమ్)లో రిక్రూట్మెంట్ జరుగుతున్నట్లు పేపర్ యాడ్ ద్వారా తెలుసుకుంటారు. లంచం ఇచ్చి మరీ ఆ ఉద్యోగం సంపాదిస్తారు. కిడ్నాప్ కేసులను డీల్ చేయడం వీళ్ల పని. వీరిద్దరు జట్టుగా పని చేస్తుంటారు. జీతం డబ్బులు సరిపోవడం లేదని.. కిడ్నాప్ కేసుల్లో దొరికే డబ్బు నుంచి కొంత తస్కరించి, కిడ్నాపర్‌ని పట్టుకునే క్రమంలో పోయిందని వీళ్ల హెడ్ దీప(రోహిణి)కి చెబుతుంటారు. ఓసారి ధనవంతురాలు దామిని(ఝాన్సీ) తన కూతురు రియాని ఎవరో కిడ్నాప్ చేసి రూ. 2 కోట్లు డిమాండ్ చేస్తున్నారని బాబు, యేసులను సంప్రదిస్తుంది. ఈ కేసును తమ టీమ్‌కి తెలియకుండా డీల్ చేసి రూ. 2 కోట్లు కొట్టేయాలని బాబు, యేసు ప్లాన్ చేస్తారు. ఈ క్రమంలో వీరిద్దరు బారు ఓనర్ ఆకాశ్(అజయ్) హత్య కేసులో ఇరుక్కుంటారు. అసలు ఆకాశ్‌ని హత్య చేసిందెవరు? బాబు, యేసును ఆ కేసులో ఇరికించిందెవరు..? రియాని కిడ్నాప్ చేసిందెవరు..? స్టార్ హీరో యువ(వెన్నెల కిశోర్)కి ఈ హత్యకు ఉన్న సంబంధం ఏంటి..? హత్య కేసులో ఇరుక్కున్న బాబు, యేసులకు వాళ్ల సీనియర్ అధికారి నిధి(ఫరియా అబ్దుల్లా) ఎలాంటి సహాయం చేసింది..? చివరకు ఏం జరిగింది అనేదే మిగతా కథ.ఎలా ఉందంటే.. ఒక హిట్ చిత్రానికి సీక్వెల్ అంటే.. కచ్చితంగా ఆ సినిమాపై ప్రేక్షకులు మంచి అంచనాలే పెట్టుకుంటారు. మొదటి భాగం కంటే రెండో పార్ట్ ఇంకా బెటర్‌గా ఉంటుందనే ఆశతో థియేటర్స్‌కి వస్తారు. వారి అంచనాలకు తగ్గట్లుగా సినిమా ఉంటే ఒకే.. ఏ మాత్రం తేడా కొట్టినా అంతే సంగతి. అందుకే సీక్వెల్ తీయడం ఓ రకంగా కత్తి మీద సాము లాంటిదే. డైరెక్టర్ రితేష్ రానా ఆ సాహసం చేశాడు. కానీ పార్ట్ 1ని మించేలా కథనాన్ని నడిపించలేకపోయాడు. కథలో బలమైన పాయింట్ లేకపోవడం.. కథనం మొత్తం ఒక పాయింట్ చుట్టే తిరగడం సినిమాకు పెద్ద మైనస్. స్క్రీన్‌ప్లే కూడా రొటీన్‌గా ఉంటుంది. అయితే ఈ లోపాలన్నింటిని సత్య కామెడీ కొంతవరకు కవర్ చేస్తే.. టెక్నికల్ టీమ్ మరికొంత కవర్ చేసింది. పార్ట్ 1 చూసిన వాళ్లకు ఈ సినిమాలోని ప్రధాన పాత్రలతో మొదటి నుంచే కనెక్ట్ అవుతారు. కానీ చూడని వాళ్లకు మాత్రం కొంతవరకు కన్ఫ్యూజ్ అవుతారు. హీ టీమ్‌లో బాబు, యేసులో జాయిన్ అయ్యే సీన్ నుంచి.. రియా కిడ్నాప్ డ్రామా వరకు ప్రతి సీన్ గత సినిమాలని గుర్తు చేస్తూనే ఉంటుంది. అయితే, ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ మాత్రం ఆకట్టుకుంటుంది. (చదవండి: రావు రమేశ్ హీరోగా చేసిన మూవీ.. ఓటీటీ రిలీజ్ ఫిక్స్)ఇక సెకండాఫ్‌లో కథ మొత్తం మిస్టరీ మర్డర్, హత్య చుట్టే తిరుగుతుంది. ఫరియా, సత్య, శ్రీసింహా కలిసి చేసే యాక్షన్ సీన్ ఆకట్టుకుంటుంది. అయితే, కథకు ఏ మాత్రం సంబంధం లేని ‘ఓరి నా కొడక’ సీరియల్ డ్రామా అయితే నవ్వించకపోవడమే కాకుండా.. ఒకానొక దశలో చిరాకు తెప్పిస్తుంది. చిరంజీవి, పవన్ కల్యాణ్ ఇమేజ్‌ని చక్కగా వాడుకున్నారు. ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి వరకు సాగే కథనం.. ఈ క్రమంలో వచ్చే చిన్న చిన్న ట్విస్టులు సినిమాపై కొంతవరకు పాజిటివ్ ఒపీనియన్‌ని తెప్పిస్తాయి. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాకు ప్రధాన బలం సత్య కామెడీయే. శ్రీసింహా హీరో అయినప్పటికీ.. సత్యనే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు. తనదైన కామెడీ పంచులతో నవ్వులు పూయించాడు. బాబు మోహన్ పాత్రకు శ్రీసింహా న్యాయం చేశాడు. తెరపై శ్రీసింహా, సత్యల కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఇక ఫరియా అబ్దుల్లా ఈ సినిమాలో ఓ డిఫరెంట్ పాత్రను పోషించింది. హీ టీమ్‌లో పని చేసే 'నిధి' పాత్రలో ఒదిగిపోయింది. యాక్షన్ సీన్లో కూడా చక్కగా నటించింది. ఈ సినిమాలో ఓ పాట కూడా పాడి ఆకట్టుకుంది. హీ టీమ్ హెడ్‌గా రోహిణి, మైఖెల్‌గా సునీల్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. కాల భైరవ నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచేసింది. పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి ఫ్రేమ్‌ని చాలా రిచ్‌గా తెరపై చూపించాడు. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నతంగా ఉన్నాయి. -
మత్తు వదలరా-2 ట్విటర్ రివ్యూ.. ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందంటే?
శ్రీ సింహా, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన చిత్రం ‘మత్తువదలరా 2’. 2019లో వచ్చిన మత్తువదలరా చిత్రానికి కొనసాగింపుగా ఈ మూవీని తెరకెక్కించారు. ఈ మూవీకి రీతేష్ రానా దర్శకత్వం వహించారు. పార్ట్-1 హిట్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ రోజు థియేటర్లలోకి వచ్చేసింది. ఇప్పటికే ప్రీమియర్ షోలు పడిపోవడంతో ట్విటర్ వేదికగా ఆడియన్స్ తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు.(ఇది చదవండి: ‘మత్తు వదలరా 2’ ట్రైలర్: శ్రీసింహా, సత్య కామెడీ అదుర్స్)మత్తు వదలరా-2 ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా ఉందంటూ ఆడియన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఫస్ట్ హాఫ్‌లోనే పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకోవడం ఖాయమని అంటున్నారు. నాన్‌స్టాప్ కామెడీ ఎంటర్టైనర్ అంటూ పోస్టులు పెడుతున్నారు. సత్య తన ఫర్మామెన్స్, కామెడీ అదిరిపోయిందని బ్లాక్‌బస్టర్ హిట్ ఖాయమంటున్నారు. అయితే ఇది కేవలం ఆడియన్స్ అభిప్రాయం మాత్రమే. వీటికి సాక్షికి ఎలాంటి బాధ్యత వహించదు. IT’s A BLOCKBUSTER LAUGHING RIOT😂#Mathuvadalara2 pic.twitter.com/EbXyZKXGvL— Prathyangira Cinemas (@PrathyangiraUS) September 13, 2024 Red Carpet Premiere:#MathuVadalara2 first half!🤣🤣😂Pure #Satya Rampage! Potta Noppochesindi. Really gifted comedian👏👏❤️🔥Non-stop entertainment. Second half Ee range lo Vinte Blockbuster guaranteed#MathuVadalara pic.twitter.com/0Qu8BGjAeD— Ungamma (@ShittyWriters) September 12, 2024 Done with my show, thoroughly enjoyed all references, although it has some lag moments. Satya is spot-on with his comic timing!!while other actors did their part. bhairava's music is lit. Overall a complete laugh riot film:) my rating is 2.75 #Mathuvadalara2Oneman show #Satya pic.twitter.com/kRyZ8Bf5Kn— palnadu tweets (@Nazeershaik1712) September 12, 2024 -
మత్తువదలరాని ఫ్రాంచైజీలా కొనసాగిస్తాం: శ్రీ సింహా
‘‘మత్తువదలరా (2019)’ సినిమా తర్వాత నా కెరీర్లో సరైన హిట్ చిత్రం లేదు. అయితే ఓ సినిమా సక్సెస్ కావడానికి చాలా కారణాలు ఉన్నాయి. గతంలో నేను డిఫరెంట్ జానర్స్ సినిమాలు చేశాను. ఇప్పుడు క్యారెక్టర్ బేస్డ్ సినిమాలు ఎక్కువగా చేయాలనుకుంటున్నాను’’ అని శ్రీ సింహా అన్నారు. రీతేష్ రానా దర్శకత్వంలో శ్రీ సింహా, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన చిత్రం ‘మత్తువదలరా 2’. చిరంజీవి, హేమలత పెదమల్లు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 13న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శ్రీ సింహాæ మాట్లాడుతూ–‘‘ఈ చిత్రంలో నేను, సత్య, ఫరియా హై ఎమర్జెన్సీ టీమ్ ఏంజెంట్స్గా కనిపిస్తాం. తొలి భాగంతో పోలిస్తే రెండో భాగంలో యాక్షన్ , ఫన్, థ్రిల్, సర్ప్రైజ్ అంశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రభాస్, రాజమౌళిగార్లు మా సినిమా ట్రైలర్, టీజర్‌ను చూసి అభినందించారు. ‘మత్తువదలరా’ సినిమాని ఓ ఫ్రాంచైజీలాగా కొనసాగించే అవకాశం ఉంది’’ అన్నారు. -
Mathu Vadalara 2 Trailer: శ్రీసింహా, సత్య కామెడీ అదుర్స్
రితేష్ రానా దర్శకత్వంలో శ్రీ సింహా హీరోగా నటించిన తాజా చిత్రం'మత్తువదలారా2'. బ్లాక్ బస్టర్ మూవీ మత్తు వదలరాకి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సత్య కీలక పాత్రలో నటించాడు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్. ఈ నెల 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ని పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రిలీజ్ చేశాడు. మత్తు వదలరా చిత్రం మాదిరే ఈ సినిమా కూడా క్రైమ్ కామెడీ నేపథ్యంలో సాగనుంది. శ్రీసింహా, సత్య మరోసారి తమదైన కామెడీతో అదరగొట్టినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. -
'మత్తు వదలరా 2' మూవీ టీజర్ లాంచ్ (ఫొటోలు)
-
కీరవాణి అబ్బాయితో నా కూతురు పెళ్లి నిజమే: మాగంటి రూప
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో రెండు పెద్ద కుటుంబాలు వియ్యం అందుకోనున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఆస్కార్ గ్రహీత ఎమ్ఎమ్ కీరవాణి తనయుడు, హీరో శ్రీ సింహతో.. నటుడు మురళీ మోహన్ మనుమరాలి పెళ్లి జరగనున్నట్లు రూమర్స్ వచ్చాయి. కొద్దిరోజుల తర్వాత అవన్నీ నిజమేనని మురళీ మోహన్ కూడా ప్రకటించారు. తాజాగా ఆ పెళ్లి వేడుక విషయంపై మురళీ మోహన్ కోడలు మాగంటి రూప కూడా ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఎమ్ఎమ్ కీరవాణి తనయుడు, హీరో శ్రీ సింహతో తన కూతురు 'రాగ' పెళ్లి ఫిక్స్ అయినట్లు ఆమె పేర్కొన్నారు. మురళీ మోహన్ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే 50 వసంతాలు పూర్తి అయిన సందర్భంగా ఆయనతో పాటుగా కోడలు రూప కూడా ఆ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఏడాది చివర్లో పెళ్లి జరగుతుందని ఆమె ప్రకటించారు. మురళీ మోహన్‌కు ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు. అయితే కూతురు విదేశాల్లో సెటిలైంది. కుమారుడు రామ్ మోహన్ మాత్రం ఆయనకు సంబంధించిన వ్యాపారాలను చూసుకుంటున్నారు. రామ్ మోహన్- రూపల కుమార్తెనే 'రాగ'. విదేశాల్లో ఆమె బిజినెస్‌లో మాస్టర్స్ పూర్తి చేసింది. ప్రస్తుతం రాగ కూడా తన కుటుంబానికి సంబంధించిన వ్యాపార వ్యవహారాలే చూసుకుంటుంన్నారట. ఇక శ్రీసింహ విషయానికి వస్తే యమదొంగ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించాడు. మత్తు వదలరా సినిమాతో హీరోగా మారాడు. తెల్లవారితే గురువారం, దొంగలున్నారు జాగ్రత్త, ఉస్తాద్ సినిమాలతో టాలీవుడ్లో హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కీరవాణి పెద్దబ్బాయి కాలభైరవకు ఇంకా పెళ్లి కాలేదు. ఈలోపే చిన్నబ్బాయికి పెళ్లి కుదరడంతో బహుశా ఇది ప్రేమ పెళ్లి కావచ్చని భావిస్తున్నారు. -
కీరవాణి ఇంటి కోడలిగా మురళీ మోహన్ మనవరాలు..
పెళ్లిళ్ల సీజన్ కావడంతో సెలబ్రిటీలు కూడా ఇంతకుమించిన మంచి తరుణం మళ్లీ దొరకదంటూ లైఫ్‌లో ఓ అడుగు ముందుకేస్తున్నారు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్.. అన్ని వుడ్స్‌లోనూ తారలు పెళ్లి సందడితో బిజీగా ఉన్నారు. అయితే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో రెండు పెద్ద కుటుంబాలు వియ్యం అందుకోనున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఆస్కార్ గ్రహీత ఎమ్ఎమ్ కీరవాణి తనయుడు, హీరో శ్రీ సింహ.. నటుడు మురళీ మోహన్ మనుమరాలిని పెళ్లి చేసుకోబోతున్నట్లు రూమర్స్ వచ్చాయి. వచ్చే ఏడాదే పెళ్లి తాజాగా ఈ వార్తలపై మురళీ మోహన్ స్పందిస్తూ అది నిజమేనని క్లారిటీ ఇచ్చాడు. ఆయన మాట్లాడుతూ.. 'నాకు ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు. కూతురు పెళ్లి చేసుకుని విదేశాల్లో సెటిలైంది. తనకు ఓ అమ్మాయి సంతానం. త్వరలో ఆమె పెళ్లి జరగబోతోంది. ఫిబ్రవరి 14న హైదరాబాద్‌లో తన వివాహం జరగనుంది. అలాగే నా కొడుక్కి ఓ కూతురు సంతానం. ఈమె పెళ్లి కూడా దాదాపు ఖాయమైపోయింది. అందరూ ఊహించినట్లుగానే కీరవాణి ఇంటికి కోడలిగా వెళ్లనుంది. పెద్ద మనవరాలి పెళ్లి ఫిబ్రవరిలో అయితే చిన్న మనవరాలి పెళ్లి వచ్చే ఏడాది చివర్లో జరగనుంది' అని పేర్కొన్నాడు. మురళీ మోహన్ మనవరాలు ఏం చేస్తుంది? కాగా మాగంటి మురళీ మోహన్ కొడుకు పేరు రామ్ మోహన్. ఈయన ఏకైక కుమార్తె పేరు 'రాగ'. కొద్దిరోజుల క్రితమే ఆమె బిజినెస్‌లో మాస్టర్స్ పూర్తి చేసింది. ప్రస్తుతం మాగంటి కుటుంబానికి సంబంధించి పెద్ద వ్యాపార సామ్రాజ్యమే ఉంది. 'రాగ' కూడా అందులోనే కీలక బాధ్యతలు నిర్వర్తిస్తోంది. మొదటి నుంచి కూడా మురళీ మోహన్‌కు ఇండస్ట్రీలో మంచి పరిచాయాలే ఉన్నాయి. ఈ క్రమంలోనే కీరవాణి అబ్బాయితో తన మనుమరాలు 'రాగ'ను ఇచ్చి వివాహం చేయాలని భావించినట్లు తెలుస్తోంది. ఇక శ్రీసింహ విషయానికి వస్తే యమదొంగ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించాడు. మత్తు వదలరా సినిమాతో హీరోగా మారాడు. తెల్లవారితే గురువారం, దొంగలున్నారు జాగ్రత్త, ఉస్తాద్ సినిమాలతో టాలీవుడ్లో హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. చదవండి: 18 ఏళ్లకే పెళ్లి, ఐదేళ్లకే విడాకులు.. ముగ్గురు పిల్లలతో.. తెలుగు హీరోయిన్ కన్నీటి కష్టాలు.. -
మాగంటి మురళీ మోహన్ కుటుంబంతో కీరవాణి వియ్యం
టాలీవుడ్లో మంచి గుర్తింపు ఉన్న రెండు పెద్ద కుటుంబాలు వియ్యం అందకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈమేరకు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఆస్కార్ అవార్డ్‌తో తెలుగు పరిశ్రమను ప్రపంచానికి తెలిపిన ఎమ్.ఎమ్ కీరవాణి కుమారుడు హీరో శ్రీసింహ పెళ్లి పీటలు ఎక్కనున్నాడని తెలుస్తోంది. నిర్మాత, సినీ నటుడు,వ్యాపారవేత్త అయిన మురళీ మోహన్ మనుమరాలితో శ్రీసింహ ఏడు అడుగులు వేయనున్నాడని సమాచారం. శ్రీసింహ ఇప్పటికే భాగ్ సాలే, మత్తు వదలరా, ఉస్తాద్ వంటి చిత్రాల్లో నటించి హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అంతేకాకుండా తన బాబాయ్ రాజమోళితో పాటు పలు సినిమాలకు కూడా పనిచేశాడు. మురళీ మోహన్‌కు ఒక అమ్మాయితో పాటు రామ్ మోహన్ అనే అబ్బాయి ఉన్నారు. ఆయన కుమార్తెనే శ్రీసింహకు ఇచ్చి వివాహం చేయాలని అనుకుంటున్నారు. రామ్ మోహన్- రూప మాగంటిలకు జన్మించిన ఏకైక కుమార్తె పేరు 'రాగ' కొద్దిరోజుల క్రితమే ఆమె ఐఎస్బీలో మాస్టర్స్ పూర్తి చేసింది. ప్రస్తుతం మాగంటి కుటుంబానికి సంబంధించి పెద్ద వ్యాపార సామ్రాజ్యమే ఉంది. 'రాగ' కూడా అందులోనే పలు కీలక బాధ్యతల్లో వ్యవహరిస్తున్నారు. మొదటి నుంచి కూడా మురళీ మోహన్‌కు ఇండస్ట్రీలో మంచి పరిచాయాలే ఉన్నాయి. ఈ క్రమంలోనే కీరవాణి అబ్బాయితో తన మనుమరాలు 'రాగ'ను ఇచ్చి వివాహం చేయాలనే ఆలోచనకు ఇరుకుటుంబాలు వచ్చాయని తెలుస్తోంది. కానీ ఈ వివాహం గురించి రెండు కుటుంబాల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం ఈ విషయం ప్రచారంలో మాత్రమే ఉంది. -
మూడు దశలు.. పెద్ద సవాల్
‘‘ఉస్తాద్’ కథ మూడు దశల్లో ఉంటుంది. నా పాత్రలో మూడు వేరియేషన్స్ ఉంటాయి. ఇది పెద్ద సవాల్‌గా అనిపించింది. ముఖ్యంగా కాలేజీ ఎపిసోడ్స్ కోసం బరువు తగ్గాను’’ అన్నారు శ్రీ సింహా కోడూరి. శ్రీ సింహా కోడూరి, కావ్యా కల్యాణ్ రామ్ జంటగా నటించిన చిత్రం ‘ఉస్తాద్’. ఫణిదీప్ దర్శకత్వంలో రజనీ కొర్రపాటి, రాకేష్ రెడ్డి గడ్డం, దువ్వూరు హిమాంక్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా శుక్రవారం జరిగిన విలేకర్ల సమావేశంలో శ్రీ సింహా కోడూరి మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో సూర్య అనే యువకుడి పాత్ర చేశాను. సూర్య కాలేజీకి ముందు ఏం చేశాడు? కాలేజీ లైఫ్ ఎలా సాగింది? పైలట్ ఎలా అయ్యాడు? అనేది ఈ చిత్రకథ’’ అన్నారు. -
శ్రీసింహ, కావ్య కళ్యాణ్ రామ్ తో సాక్షి స్పెషల్ ఇంటర్వ్యూ
-
తెలుగమ్మాయి కావడం నాకు ప్లస్
‘‘తెలుగు పరిశ్రమలో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావటం లేదని ఎందుకు అంటున్నారో అర్థం కావటం లేదు. సావిత్రి, శ్రీదేవి.. వంటి తెలుగు హీరోయిన్లు పెద్ద సక్సెస్‌ను సాధించారు. ఇండియా వైడ్ వాళ్ల కంటే సక్సెస్‌ను ఎవరూ చూడలేదు. నా విషయానికొస్తే తెలుగు అమ్మాయి కావటం నాకు ప్లస్’’ అని కావ్య కల్యాణ్ రామ్ అన్నారు. శ్రీ సింహా కోడూరి, కావ్య జంటగా నటించిన చిత్రం ‘ఉస్తాద్’. ఫణిదీప్ దర్శకత్వంలో రజినీ కొర్రపాటి, రాకేష్ రెడ్డి గడ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదలవుతోంది. ఈ సందర్భంగా కావ్య కల్యాణ్ రామ్ మాట్లాడుతూ– ‘‘ఉస్తాద్’లో సూర్య అనే పాత్రలో శ్రీ సింహా కనిపిస్తారు. తన బైక్‌ను ఉస్తాద్ అని పిలుచుకుంటుంటాడు. ఇందులో సూర్య ప్రేయసి మేఘనగా నటించాను. నా పాత్ర నేటి తరం అమ్మాయిలకు కనెక్ట్ అవుతుంది. ఇవాళ రజనీకాంత్‌గారి ‘జైలర్’, శుక్రవారం చిరంజీవిగారి ‘భోళా శంకర్’, శనివారం మా ‘ఉస్తాద్’ రిలీజవుతున్నాయి. ఆ ఇద్దరు లెజెండ్స్ సినిమాలను చూసే ప్రేక్షకుల్లో సగం మంది అయినా మా సినిమాను చూస్తే చాలు. మా సినిమా హిట్’’ అన్నారు. -
ఓటీటీకి వచ్చేసిన 'భాగ్ సాలే'.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా?
సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు శ్రీసింహా కోడూరి, నేహా సోలంకి హీరోహీరోయిన్లుగా నటించిన మూవీ ‘భాగ్ సాలే’. ఈ చిత్రానికి ప్రణీత్ బ్రాహ్మాండపల్లి దర్శకత్వం వహించారు. సురేష్ బాబు సమర్పణలో వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై బిగ్ బెన్, సినీ వ్యాలీ మూవీస్ వారి అసోసియేషన్ తో అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కళ్యాణ్ సింగనమల నిర్మించారు. జులై 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం థియేటర్లలో నవ్వులు పూయించింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. (ఇది చదవండి: అందమైన అనన్య.. 'తంత్ర' అంటూ భయపెట్టేస్తోంది! ) థియేటర్లలో నవ్వులు పూయించిన ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఆగస్టు 4వతేదీ నుంచే స్ట్రీమింగ్ అవుతోంది. రిలీజైన నెల రోజుల కాకముందే భాగ్ సాలే డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో అభిమానులను అలరిస్తోంది. కాగా.. ఈసినిమాలో జాన్ విజయ్, రాజీవ్ కనకాల, వెన్నెల కిషోర్, నందినీరాయ్, సుదర్శన్, వంశీ నెక్కంటి, వైవా హర్ష, కిడ్ చక్రి, జయవాణి, బాష, యాదం రాజు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. కాలభైరవ సంగీతమందించారు. థియేటర్లో చూడలేని వారు ఎంచక్కా ఓటీటీలో చూసేయండి. (ఇది చదవండి: ఆ రింగ్ ఉంటే లైఫ్ రిచ్.. ఆసక్తికరంగా ‘భాగ్ సాలే’వీడియో గ్లింప్స్ ) -
‘భాగ్ సాలే’మూవీ రివ్యూ
టైటిల్: భాగ్ సాలే నటీనటులు: శ్రీ సింహా ,నేహా సోలం, జాన్ విజయ్, రాజీవ్ కనకాల, నందిని రాయ్, హర్ష, సుదర్శన్ తదితరులు నిర్మాతలు: అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కల్యాణ్ సింగనమల దర్శకత్వం: ప్రణీత్ బ్రహ్మాండపల్లి సంగీతం: కాళ భైరవ విడుదల తేది: జులై 7, 2023 ‘భాగ్ సాలే’ కథేంటంటే.. మధ్య తరగతి కుటుంబానికి చెందిన (శ్రీసింహా) ఓ చెఫ్. ఎప్పటికైనా ఓ స్టార్ హోటల్ని స్థాపించాలని అతని ఆశయం. కానీ హోటల్ని స్థాపించేంత డబ్బు అతని దగ్గర ఉండదు. తాను రాయల్ కుటుంబానికి చెందిన కోటీశ్వరుడిని అని అబద్దం చెప్పి మాయ(నేహా సోలం)ని ప్రేమలో పడేస్తాడు. మరోవైపు శ్యాముల్ (జాన్ విజయ్) అనే రౌడీ ఓ డైమండ్ రింగ్ కోసం మాయ తండ్రిని కిడ్నాప్ చేస్తాడు. రూ.25 కోట్లు విలువ చేసే ఆ రింగ్‌ని తీసుకొచ్చి ఇస్తేనే అతన్ని వదిలేస్తానని కండీషన్ పెడతాడు. ఆ రింగ్ తీసుకొచ్చి ఇస్తేనే పెళ్లికి ఓకే చెబుతానని నళిని(నందిని రాయ్) శ్యాముల్కి కండీషన్ పెడుతుంది. అసలు ఆ రింగ్ నేపథ్యం ఏంటి? నళినికి ఆ రింగే ఎందుకు కావాలి? ఆ రింగుకు మాయ ఫ్యామిలీకి ఉన్న సంబంధం ఏంటి? మాయ కోరిక మేరకు ఆ రింగ్‌ని తీసుకురావడానికి అర్జున్ పడిన కష్టాలేంటి? అర్జున్ రిచ్ పర్సన్ కాదని తెలిసిన తర్వాత మాయ ఏం చేసింది? ఈ కథలో రమ్య(వర్షిణి), ఎస్సై ప్రామిస్రెడ్డి(సత్య) దంపతుల పాత్ర ఏంటి? చివరకు ఆ రింగ్ ఎవరికి దక్కింది? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే... ఇదొక క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ ఇది. ఇలాంటి చిత్రాల్లో క్రైమ్ బలంగా ఉండాలి. అది లేకపోతే సినిమాపై అంత ఆసక్తి ఉండదు. బాగ్సాలే విషయంలో బలమైన క్రైమ్ లేదు. కానీ కామెడీ సన్నివేశాలు మాత్రం చాలా ఉన్నాయి. దర్శకుడు ప్రణీత్ కామెడీపైనే ఎక్కువ దృష్టిపెట్టి, క్రైమ్, స్క్రీన్‌ప్లే గాలికొదిలేశాడు. రింగ్ నేపథ్యాన్ని తెలియజేస్తూ కథ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత ఒకేసారి రెండు యాంగిల్స్‌లో నడుతుంది. ఒకపైపు హీరోహీరోయిన్ల ప్రేమ, పెళ్లి గోల, మరోవైపు రింగ్ కోసం విలన్ చేసే ప్రయత్నాలను చూపిస్తూ కథనం సాగుతుంది. విలన్ హీరోయిన్ తండ్రిని కిడ్నాప్ చేసిన తర్వాత కథలో వేగం పుంజుకుంటుంది. ప్రియురాలి కోసం ఆమె తండ్రిని విడిపించడానికి హీరో పడే పాట్లు, చెప్పే అబద్దాలు నవ్వులు పూయిస్తాయి. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక సెకండాఫ్ మొత్తం రింగ్ చుట్టే తిరుగుతుంది. హీరో ఆ రింగ్‌ని దొంగిలించి ఒక చోట పెట్టడం..అది వేరు వేరు వ్యక్తుల చేతికి వెళ్లడం .. దాని కోసం విలన్ గ్యాంగ్, హీరో పడే తిప్పలు అన్నీ కామెడీగా సాగుతాయి. ప్రామిస్ రెడ్డి గా సత్య చేసే కామెడీ నవ్వులు పూయిస్తుంది. అయితే సినిమా చూస్తున్నంతసేపు చాలా సన్నివేశాలను ఇంతకు ముందెప్పుడో చూశామనే ఫీలింగ్ కలుగుతుంది. ఎలాంటి అంచనాలు లేకుండా కేవలం నవ్వుకోవడానికి మాత్రమే వెళ్తే ఈ సినిమా అలరిస్తుంది. ఎవరెలా చేశారంటే.. అర్జున్ పాత్రకి శ్రీసింహా న్యాయం చేశాడు. అయితే ఈ తరహా పాత్రలు ఆయనకు కొత్తేమి కాదు. గత సినిమాల మాదిరే ఇందులో కూడా పక్కింటి కుర్రాడిలా కనిపిస్తాడు. మాయ పాత్ర పోషించిన నేహా సోలంకి రెగ్యులర్ హీరోయిన్లలా కేవలం పాటలకే పరిమితం కాకుండా సినిమా మొత్తం కనిపిస్తూ తనదైన నటనతో ఆకట్టుకుంది. తమిళ నటుడు జాన్ విజయ్ విలన్ పాత్రలో ఒదిగిపోయాడు. విలన్ బామ్మర్థి జాక్సన్‌గా వైవా హర్ష చేసే కామెడీ నవ్వులు పూయిస్తుంది. రాజీవ్ కనకాల, సత్య, వర్షిణి సౌందర్ రాజన్, నందిని రాయ్, సుదర్శన్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే ఈ సినిమాకు ప్రధాన బలం కాల భైరవ సంగీతం. పాటలు పర్వాలేదు. నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచింది. సినిమాటోగ్రాఫర్, ఎడిటర్ల పనితీరు బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కళ్యాణ్ సింగనమల ఎక్కడా రాజీ పడలేదని సినిమా చూస్తే అర్థమవుతుంది. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
రాజమౌళిని సినిమా ఛాన్స్ అడగలేను.. ఎందుకంటే: శ్రీ సింహా
'ప్రేక్షకులకు సందేశం ఇవ్వాలనో, భావోద్వేగాలతో ఏడిపించాలనో ‘భాగ్ సాలే’ సినిమా తీయలేదు. ప్రేక్షకులు రెండు గంటల పాటు థియేటర్లో నవ్వుకోవాలని తీశాం' అని హీరో శ్రీ సింహా కోడూరి అన్నారు. ప్రణీత్ బ్రహ్మాండపల్లి దర్శకత్వంలో శ్రీ సింహా కోడూరి, నేహా సోలంకి జంటగా నటించిన చిత్రం ‘భాగ్ సాలే’. అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కల్యాణ్ సింగనమల నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో శ్రీ సింహా మాట్లాడుతూ–'భాగ్ సాలే' కథని ప్రణీత్ ఎప్పుడో చెప్పాడు. కానీ, ‘తెల్లవారితే గురువారం, దొంగలున్నారు జాగ్రత్త, ఉస్తాద్’ సినిమాల కమిట్మెంట్స్ వల్ల ‘భాగ్ సాలే’ ఆలస్యం అయింది. ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ వల్ల లాభాలు, నష్టాలుంటాయి. కథల ఎంపిక అనేది పూర్తిగా నా నిర్ణయమే. నాకు స్క్రిప్ట్ విషయంలో ఏదైనా డౌట్ వస్తే నాన్న (కీరవాణి), బాబాయ్ (రాజమౌళి) సలహాలు తీసుకుంటాను. ‘భాగ్ సాలే’ బడ్జెట్ ఎక్కువైనా నిర్మాతలు రాజీ పడలేదు. ‘రంగస్థలం’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేసిన అనుభవం నాకు యాక్టింగ్‌లో ఉపయోగపడింది. రాజమౌళిగారితో సినిమా చేయాలనేది అందరికీ ఓ కల. అలాగని ఆయన్ను నేను ఛాన్స్ అడగలేను. నేనింకా చాలా నేర్చుకోవాలి. ఆ తర్వాత ఆయనే పిలిచి నాకు అవకాశం ఇవ్వాలి. ప్రస్తుతం ‘ఉస్తాద్’ సినిమా చేస్తున్నాను' అన్నారు. -
కొత్త కామెడీ టైమింగ్‌ను చూస్తారు
‘‘భాగ్ సాలే’ సినిమాను నేను నిర్మించాల్సింది.. కానీ కుదరలేదు. శ్రీసింహాలో మంచి టైమింగ్ ఉంది. ఈ సినిమాలో కొత్త కామెడీ టైమింగ్‌ను చూస్తారు. దర్శకుడు ప్రణీత్‌తో నేను, విష్ణు కలిసి ఓ సినిమాను నిర్మించనున్నాం’’ అని డైరెక్టర్ హరీష్ శంకర్ అన్నారు. శ్రీ సింహా కోడూరి, నేహా సోలంకి జంటగా ప్రణీత్ బ్రహ్మాండపల్లి దర్శకత్వం వహించిన చిత్రం ‘భాగ్ సాలే’. అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కల్యాణ్ సింగనమల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో శ్రీ సింహా మాట్లాడుతూ–‘‘ఈ సినిమాతో అందర్నీ నవ్విస్తాం’’ అన్నారు. ‘‘భాగ్ సాలే’ ప్రేక్షకులను అలరిస్తుంది’’ అన్నారు ప్రణీత్. ‘‘మంచి క్రైమ్ కామెడీ ఫిల్మ్ ఇది’’ అన్నారు అర్జున్ దాస్యన్ . ‘‘ఈ తరహా చిత్రాలు చాలా తక్కువగా వస్తాయి’’ అన్నారు యష్ రంగినేని. -
సినిమా సక్సెస్ అని రాజమౌళి అన్నారు
శ్రీ సింహా కోడూరి, నేహా సోలంకి హీరో హీరోయిన్లుగా నటించిన క్రైమ్ కామెడీ ఫిల్మ్ ‘భాగ్ సాలే’. ప్రణీత్ బ్రహ్మాండపల్లి దర్శకత్వంలో అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కళ్యాణ్ సింగనమల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో ప్రణీత్ బ్రహ్మాండపల్లి మాట్లాడుతూ – ‘‘భాగ్ సాలే’ కల్పిత కథ. నిజాంకు ఉంగరాలపై ఆసక్తి ఉండేదంటారు. ఈ సినిమా కథ కూడా ఓ ఉంగరం చుట్టూ తిరుగుతుంది. అందుకే హైదరాబాద్ నేపథ్యం ఎంచుకున్నాం. ఇందులో శ్రీ సింహా ΄ాత్ర కాస్త స్వార్థంతో కూడి ఉంటుంది. సినిమా అంతా పరిగెత్తడమే. అందుకే ‘దౌడ్’, ‘పరుగు’ వంటి టైటిల్స్ అనుకున్నాం. కానీ సౌండింగ్ బాగుందని ‘భాగ్ సాలే’ ఫిక్స్ చేశాం. ట్రైలర్ చూసి, శ్రీ సింహాతో రాజమౌళిగారు ఈ సినిమా సక్సెస్ అవుతుందని చె΄్పారట. దీన్ని నేను పెద్ద కాంప్లిమెంట్‌గా భావిస్తున్నాను. ఇక దర్శకుడు హరీష్ శంకర్‌గారి అసోసియేషన్‌తో ఓ స్పోర్ట్స్ ఫిల్మ్ చేయాలనే ఆలోచనలో ఉంది’’ అన్నారు. -
‘భాగ్ సాలే’ పెద్ద హిట్ కావాలి: చిరంజీవి
సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు శ్రీసింహా కోడూరి, నేహా సోలంకి హీరోహీరోయిన్లుగా నటించిన తాజా మూవీ ‘భాగ్ సాలే’. ప్రణీత్ బ్రాహ్మాండపల్లి దర్శకత్వంలో క్రైమ్ కామెడీ గా తెరకెక్కిన ఈ సినిమా జులై 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ని మెగాస్టార్ చిరంజీవి వీక్షించారు. అనంతరం చిత్ర యూనిట్‌పై ప్రశంసలు కురిపించారు. ‘భాగ్ సాలే సినిమా ట్రైలర్ బాగుంది. శ్రీసింహా తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ఏర్పర్చుకుంటున్నాడు. కామెడీ, మాస్, ఎంటర్ టైనింగ్ తో పాటు క్రైమ్ అంశాలతో సినిమాలు చేస్తూ పేరు తెచ్చుకుంటున్నాడు. శ్రీసింహా కీరవాణి గారి అబ్బాయి అని అతను హీరోగా పేరు తెచ్చుకునే దాకా నాకు తెలియదు. వారసుడిగా కాకుండా తను స్వతహాగా ఎదగాలని ప్రయత్నిస్తున్నాడు. కీరవాణి గారికి పేరు తెచ్చేంతగా గుర్తింపు సంపాదించుకోవాలని కోరుకుంటున్నా. అలాగే కాలభైరవ అంటే చరణ్ కు చాలా ఇష్టం. వీరిద్దరు మత్తు వదలరా సినిమాతో సక్సెస్ అందుకున్నారు. ఇకపైనా మంచి అవకాశాలతో తమ ప్రతిభను చాటుకోవాలి. దర్శకుడు ప్రణీత్ బ్రహ్మాండంగా ఈ సినిమాను రూపొందించాడు. అలాగే నిర్మాత అర్జున్ దాస్యన్ మంచి ప్రయత్నం చేశాడు. ఈ సినిమా జూలై 7న విడుదలవుతోంది. సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను’అని చిరంజీవి అన్నారు.