
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తనయుడు కీరవాణి కుమారుడు, హీరో శ్రీసింహ ఇటీవలే పెళ్లి చేసుకున్నాడు.

నటుడు, రాజకీయ నాయకుడు మురళీమోహన్ మనవరాలు రాగ మాగంటితో ఏడడుగులు వేశాడు.

డిసెంబర్ 14న జరిగిన ఈ వివాహానికి దుబాయ్ వేదికగా మారింది. పెళ్లి తర్వాత శ్రీసింహ తొలిసారి తన భార్య గురించి ఓ పోస్ట్ పెట్టాడు.

ఆరేళ్లయింది. ఇకపై జీవితాంతం కలిసుందాం.. అంటూ సోషల్ మీడియాలో పెళ్లి ఫోటోలు షేర్ చేశాడు. దీనికి రాసిపెట్టుంది అన్న హ్యాష్‌ట్యాగ్ ఇచ్చాడు.

ఇది చూసిన సెలబ్రిటీలు మరోసారి ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక ఈ పోస్ట్‌తో వీరు ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారని ఇట్టే తెలిసిపోతుంది.

యమదొంగ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసిన శ్రీసింహ మత్తు వదలరా సినిమాతో హీరోగా గుర్తింపు సంపాదించాడు.

రాగ మాగంటి.. బిజినెస్‌లో మాస్టర్స్ పూర్తి చేసింది. కుటుంబ వ్యాపార వ్యవహారాలు చూసుకుంటోంది.





