
సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు శ్రీసింహా కోడూరి, నేహా సోలంకి హీరోహీరోయిన్లుగా నటించిన తాజా మూవీ ‘భాగ్ సాలే’. ప్రణీత్ బ్రాహ్మాండపల్లి దర్శకత్వంలో క్రైమ్ కామెడీ గా తెరకెక్కిన ఈ సినిమా జులై 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ని మెగాస్టార్ చిరంజీవి వీక్షించారు. అనంతరం చిత్ర యూనిట్‌పై ప్రశంసలు కురిపించారు.
‘భాగ్ సాలే సినిమా ట్రైలర్ బాగుంది. శ్రీసింహా తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ఏర్పర్చుకుంటున్నాడు. కామెడీ, మాస్, ఎంటర్ టైనింగ్ తో పాటు క్రైమ్ అంశాలతో సినిమాలు చేస్తూ పేరు తెచ్చుకుంటున్నాడు. శ్రీసింహా కీరవాణి గారి అబ్బాయి అని అతను హీరోగా పేరు తెచ్చుకునే దాకా నాకు తెలియదు. వారసుడిగా కాకుండా తను స్వతహాగా ఎదగాలని ప్రయత్నిస్తున్నాడు. కీరవాణి గారికి పేరు తెచ్చేంతగా గుర్తింపు సంపాదించుకోవాలని కోరుకుంటున్నా.
అలాగే కాలభైరవ అంటే చరణ్ కు చాలా ఇష్టం. వీరిద్దరు మత్తు వదలరా సినిమాతో సక్సెస్ అందుకున్నారు. ఇకపైనా మంచి అవకాశాలతో తమ ప్రతిభను చాటుకోవాలి. దర్శకుడు ప్రణీత్ బ్రహ్మాండంగా ఈ సినిమాను రూపొందించాడు. అలాగే నిర్మాత అర్జున్ దాస్యన్ మంచి ప్రయత్నం చేశాడు. ఈ సినిమా జూలై 7న విడుదలవుతోంది. సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను’అని చిరంజీవి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment