Bhaag Saale Movie
-
మరోసారి మోకాళ్లపై 'తిరుమల కొండ' ఎక్కిన తెలుగు హీరోయిన్
సినిమాల కోసం మాత్రమే గ్లామర్ లుక్‌లో కనిపించే నందిని రాయ్(Nandini Rai) సోషల్ మీడియాలో ఎప్పుడూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. కానీ, ఆమెలో ఆధ్యాత్మికత చింతన చాలా ఎక్కువని చెప్పవచ్చు. ఈ క్రమంలో ఆమె చాలాసార్లు తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. గతంలో ఒకసారి మోకాళ్లపై వెళ్లి కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న నందిని.. తాజాగా మరోసారి మోకాళ్లపై అలిపిరి నుంచి తిరుమల కొండ (Tirumala Temple) చేరుకున్నారు. ఇన్‌స్టాలో ఎప్పుడూ ఆమె గ్లామర్‌కు ఫిదా అయిన నెటిజన్లు ఆమెలో దాగివున్న భక్తికి ఫిదా అవుతున్నారు.( ఇదీ చదవండి: గాయం నుంచి ఎప్పుడు కోలుకుంటానో ఆ దేవుడికే తెలియాలి: రష్మిక)టాలీవుడ్లో చాలా సినిమాల్లో హీరోయిన్గా నటించిన నందినీ రాయి.. బిగ్ బాస్ 2 తెలుగు సీజన్‌తో చాలామందికి దగ్గరైంది. అయితే, 2011లోనే 'ఫ్యామిలీ ప్యాక్' బాలీవుడ్ సినిమాతో చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో మాత్రం '040' మూవీతో అడుగుపెట్టింది. కోలీవుడ్‌లో విజయ్ కథానాయకుడిగా దిల్ రాజు నిర్మించిన వారసుడు చిత్రంలో శ్రీకాంత్‌కు జోడిగా నందిని రాయ్ నటించింది. తెలుగులో మాయ,మోసగాళ్లకు మోసగాడు,సిల్లీ ఫెలోస్,భాగ్ సాలే,శివరంజని వంటి చిత్రాల్లో ఆమె మెరిసింది.వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారిని నందిని రాయ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అలిపిరి నుంచి మెట్ల మార్గం ద్వారా వెళ్లారు. మోకాళ్ల పర్వతం వద్ద ఆమె కెమెరాలకు కనిపించారు. అక్కడ మోకాళ్లపై ఎక్కుతూ కనిపించడంతో చాలామంది అభినందించారు. అయితే, సుమారు రెండేళ్ల క్రితం కూడా నందిని రాయ్ మోకాళ్లపై నుంచే కొండ మీదకు వెళ్లి శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. ఆమె ఫోటోల కింద గోవిందా గోవిందా అంటూ చాలామంది కామెంట్లు చేస్తున్నారు.నటి సౌందర్య ఇన్సిపిరేషన్‌తో ..దివంగత నటి సౌందర్య ఇన్సిపిరేషన్‌తో సినిమాల్లోకి వచ్చానని చెప్పిన నందిని రాయ్ పుట్టింది.. పెరిగింది... హైదరాబాద్‌లోనే. ఉన్నత చదువులు విదేశాల్లో అభ్యసించారు. మోడల్‌గా కెరీర్ ప్రారంభించి తక్కువ టైంలోనే అంతర్జాతీయ మోడలింగ్‌గా పేరు సంపాదించుకున్నారు. 2009లో మిస్ హైదరాబాద్ కిరీటం దక్కించుకున్నారు. 2010లో మిస్ ఆంధ్రప్రదేశ్ విన్నర్ కూడా. తెలుగుతోపాటు ఓ తమిళ్, కన్నడ, మళయాళం చిత్రంలో ఆమె నటించారు.అప్పుడు సూసైడ్ చేసుకోవాలనుకున్న నందినిగతంలో తను ఓ ఇంటర్వ్యూలో సూసైడ్ చేసుకోవాలనుకున్నానని ఇలా చెప్పింది. 'కెరియర్ మొదట్లో నా సినిమాలు అంతగా ఆడలేదు. దాంతో చాలా కుంగిపోయా. ఇంటి టెర్రస్‌పై నుంచి దూకి సూసైడ్ చేసుకోవాలనుకున్నా. తర్వాత ఆ ఆలోచన తప్పని గ్రహించా. మిత్రులతో రోజూ మాట్లాడుతూ ధైర్యం తెచ్చుకున్నా. సైకలాజికల్ కౌన్సిలింగ్ తీసుకున్నా. ఆ ప్రాబ్లమ్ నుంచి బయటపడ్డా. జయాపజయాలకు పొంగిపోవడం.. కుంగిపోవడం కరెక్ట్ కాదని తెలుసుకున్నా. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ముందుకు సాగడమే జీవితమని అర్థం చేసుకున్నా' అని చెప్పింది. View this post on Instagram A post shared by Nandini Rai (@nandini.rai) View this post on Instagram A post shared by Nandini Rai (@nandini.rai) -
ఓటీటీలోకి వచ్చేసిన కొత్త సినిమాలు, ఎక్కడ స్ట్రీమింగ్ అంటే?
ఎంటర్టైన్మెంట్ను అన్నివేళలా అందుబాటులోకి ఉంచేందుకు ఓటీటీలు ఉపయోగపడుతున్నాయి. సినిమాలు, వెబ్ సిరీస్‌లు, కామెడీ షోలు, రియాలిటీ షోలు.. ఇలా భిన్నరకాల కంటెంట్‌తో బోలెడంత వినోదాన్ని అందిస్తున్నాయి. అందుకే ప్రేక్షకులు థియేటర్లో రిలీజయ్యేవాటితో పాటు ఓటీటీ రిలీజెస్ మీద కూడా ఓ కన్నేస్తున్నారు. ఈ రోజు శుక్రవారం కావడంతో ఓటీటీలో కొత్త సినిమాలు ప్రత్యక్షమయ్యాయి. నెట్‌ఫ్లిక్స్‌లో రంగబలి టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రంగబలి. పవన్ బాసంశెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యుక్తి తరేజ హీరోయిన్గా నటించింది. జూలై 7న థియేటర్లో విడుదలైన ఈ సినిమా తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది. నేటి(ఆగస్టు 4) నుంచి రంగబలి ఈ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ ఓటీటీలో పరేషాన్ ‘మసూద’ ఫేమ్ తిరువీర్ హీరోగా నటించిన చిత్రం ‘పరేషాన్’. రానా దగ్గుబాటి సమర్పణలో సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించిన ఈ సినిమా జూన్ 2న విడుదలైంది. కామెడీ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. దాదాపు రెండు నెలల తర్వాత ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఆగస్టు 4 నుంచి ఈ చిత్రం సోనీలివ్‌లో అందుబాటులోకి వచ్చింది. దయ సిరీస్ ఎందులో అంటే? ఇకపోతే అటు దయ అనే వెబ్ సిరీస్ హాట్‌స్టార్‌లో ప్రసారం అవుతోంది. ఇందులో జేడీ చక్రవర్తి, ఈషా రెబ్బా, నంబీషన్ రమ్య, కమల్ కామరాజ్ తదితరులు ముఖ్య పాత్రలో నటించారు. పవన్ సాధినేని దర్శకత్వం వహించాడు. అలాగే భాగ్‌సాలే అనే మూవీ సైతం ఓటీటీలోకి వచ్చేసింది. ఇది అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. చదవండి: రీఎంట్రీకి రెడీ అయిన నజ్రియా -
‘భాగ్ సాలే’మూవీ రివ్యూ
టైటిల్: భాగ్ సాలే నటీనటులు: శ్రీ సింహా ,నేహా సోలం, జాన్ విజయ్, రాజీవ్ కనకాల, నందిని రాయ్, హర్ష, సుదర్శన్ తదితరులు నిర్మాతలు: అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కల్యాణ్ సింగనమల దర్శకత్వం: ప్రణీత్ బ్రహ్మాండపల్లి సంగీతం: కాళ భైరవ విడుదల తేది: జులై 7, 2023 ‘భాగ్ సాలే’ కథేంటంటే.. మధ్య తరగతి కుటుంబానికి చెందిన (శ్రీసింహా) ఓ చెఫ్. ఎప్పటికైనా ఓ స్టార్ హోటల్ని స్థాపించాలని అతని ఆశయం. కానీ హోటల్ని స్థాపించేంత డబ్బు అతని దగ్గర ఉండదు. తాను రాయల్ కుటుంబానికి చెందిన కోటీశ్వరుడిని అని అబద్దం చెప్పి మాయ(నేహా సోలం)ని ప్రేమలో పడేస్తాడు. మరోవైపు శ్యాముల్ (జాన్ విజయ్) అనే రౌడీ ఓ డైమండ్ రింగ్ కోసం మాయ తండ్రిని కిడ్నాప్ చేస్తాడు. రూ.25 కోట్లు విలువ చేసే ఆ రింగ్‌ని తీసుకొచ్చి ఇస్తేనే అతన్ని వదిలేస్తానని కండీషన్ పెడతాడు. ఆ రింగ్ తీసుకొచ్చి ఇస్తేనే పెళ్లికి ఓకే చెబుతానని నళిని(నందిని రాయ్) శ్యాముల్కి కండీషన్ పెడుతుంది. అసలు ఆ రింగ్ నేపథ్యం ఏంటి? నళినికి ఆ రింగే ఎందుకు కావాలి? ఆ రింగుకు మాయ ఫ్యామిలీకి ఉన్న సంబంధం ఏంటి? మాయ కోరిక మేరకు ఆ రింగ్‌ని తీసుకురావడానికి అర్జున్ పడిన కష్టాలేంటి? అర్జున్ రిచ్ పర్సన్ కాదని తెలిసిన తర్వాత మాయ ఏం చేసింది? ఈ కథలో రమ్య(వర్షిణి), ఎస్సై ప్రామిస్రెడ్డి(సత్య) దంపతుల పాత్ర ఏంటి? చివరకు ఆ రింగ్ ఎవరికి దక్కింది? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే... ఇదొక క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ ఇది. ఇలాంటి చిత్రాల్లో క్రైమ్ బలంగా ఉండాలి. అది లేకపోతే సినిమాపై అంత ఆసక్తి ఉండదు. బాగ్సాలే విషయంలో బలమైన క్రైమ్ లేదు. కానీ కామెడీ సన్నివేశాలు మాత్రం చాలా ఉన్నాయి. దర్శకుడు ప్రణీత్ కామెడీపైనే ఎక్కువ దృష్టిపెట్టి, క్రైమ్, స్క్రీన్‌ప్లే గాలికొదిలేశాడు. రింగ్ నేపథ్యాన్ని తెలియజేస్తూ కథ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత ఒకేసారి రెండు యాంగిల్స్‌లో నడుతుంది. ఒకపైపు హీరోహీరోయిన్ల ప్రేమ, పెళ్లి గోల, మరోవైపు రింగ్ కోసం విలన్ చేసే ప్రయత్నాలను చూపిస్తూ కథనం సాగుతుంది. విలన్ హీరోయిన్ తండ్రిని కిడ్నాప్ చేసిన తర్వాత కథలో వేగం పుంజుకుంటుంది. ప్రియురాలి కోసం ఆమె తండ్రిని విడిపించడానికి హీరో పడే పాట్లు, చెప్పే అబద్దాలు నవ్వులు పూయిస్తాయి. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక సెకండాఫ్ మొత్తం రింగ్ చుట్టే తిరుగుతుంది. హీరో ఆ రింగ్‌ని దొంగిలించి ఒక చోట పెట్టడం..అది వేరు వేరు వ్యక్తుల చేతికి వెళ్లడం .. దాని కోసం విలన్ గ్యాంగ్, హీరో పడే తిప్పలు అన్నీ కామెడీగా సాగుతాయి. ప్రామిస్ రెడ్డి గా సత్య చేసే కామెడీ నవ్వులు పూయిస్తుంది. అయితే సినిమా చూస్తున్నంతసేపు చాలా సన్నివేశాలను ఇంతకు ముందెప్పుడో చూశామనే ఫీలింగ్ కలుగుతుంది. ఎలాంటి అంచనాలు లేకుండా కేవలం నవ్వుకోవడానికి మాత్రమే వెళ్తే ఈ సినిమా అలరిస్తుంది. ఎవరెలా చేశారంటే.. అర్జున్ పాత్రకి శ్రీసింహా న్యాయం చేశాడు. అయితే ఈ తరహా పాత్రలు ఆయనకు కొత్తేమి కాదు. గత సినిమాల మాదిరే ఇందులో కూడా పక్కింటి కుర్రాడిలా కనిపిస్తాడు. మాయ పాత్ర పోషించిన నేహా సోలంకి రెగ్యులర్ హీరోయిన్లలా కేవలం పాటలకే పరిమితం కాకుండా సినిమా మొత్తం కనిపిస్తూ తనదైన నటనతో ఆకట్టుకుంది. తమిళ నటుడు జాన్ విజయ్ విలన్ పాత్రలో ఒదిగిపోయాడు. విలన్ బామ్మర్థి జాక్సన్‌గా వైవా హర్ష చేసే కామెడీ నవ్వులు పూయిస్తుంది. రాజీవ్ కనకాల, సత్య, వర్షిణి సౌందర్ రాజన్, నందిని రాయ్, సుదర్శన్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే ఈ సినిమాకు ప్రధాన బలం కాల భైరవ సంగీతం. పాటలు పర్వాలేదు. నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచింది. సినిమాటోగ్రాఫర్, ఎడిటర్ల పనితీరు బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కళ్యాణ్ సింగనమల ఎక్కడా రాజీ పడలేదని సినిమా చూస్తే అర్థమవుతుంది. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
రాజమౌళిని సినిమా ఛాన్స్ అడగలేను.. ఎందుకంటే: శ్రీ సింహా
'ప్రేక్షకులకు సందేశం ఇవ్వాలనో, భావోద్వేగాలతో ఏడిపించాలనో ‘భాగ్ సాలే’ సినిమా తీయలేదు. ప్రేక్షకులు రెండు గంటల పాటు థియేటర్లో నవ్వుకోవాలని తీశాం' అని హీరో శ్రీ సింహా కోడూరి అన్నారు. ప్రణీత్ బ్రహ్మాండపల్లి దర్శకత్వంలో శ్రీ సింహా కోడూరి, నేహా సోలంకి జంటగా నటించిన చిత్రం ‘భాగ్ సాలే’. అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కల్యాణ్ సింగనమల నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో శ్రీ సింహా మాట్లాడుతూ–'భాగ్ సాలే' కథని ప్రణీత్ ఎప్పుడో చెప్పాడు. కానీ, ‘తెల్లవారితే గురువారం, దొంగలున్నారు జాగ్రత్త, ఉస్తాద్’ సినిమాల కమిట్మెంట్స్ వల్ల ‘భాగ్ సాలే’ ఆలస్యం అయింది. ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ వల్ల లాభాలు, నష్టాలుంటాయి. కథల ఎంపిక అనేది పూర్తిగా నా నిర్ణయమే. నాకు స్క్రిప్ట్ విషయంలో ఏదైనా డౌట్ వస్తే నాన్న (కీరవాణి), బాబాయ్ (రాజమౌళి) సలహాలు తీసుకుంటాను. ‘భాగ్ సాలే’ బడ్జెట్ ఎక్కువైనా నిర్మాతలు రాజీ పడలేదు. ‘రంగస్థలం’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేసిన అనుభవం నాకు యాక్టింగ్‌లో ఉపయోగపడింది. రాజమౌళిగారితో సినిమా చేయాలనేది అందరికీ ఓ కల. అలాగని ఆయన్ను నేను ఛాన్స్ అడగలేను. నేనింకా చాలా నేర్చుకోవాలి. ఆ తర్వాత ఆయనే పిలిచి నాకు అవకాశం ఇవ్వాలి. ప్రస్తుతం ‘ఉస్తాద్’ సినిమా చేస్తున్నాను' అన్నారు. -
ఆ సినిమాతో బాగా నష్టపోయాం.. ఇప్పట్లో నో రీమేక్: నిర్మాత
శ్రీ సింహా కోడూరి, నేహా సోలంకి జంటగా నటించిన క్రైమ్ కామెడీ ఫిల్మ్ ‘భాగ్ సాలే’. ప్రణీత్ బ్రహ్మాండపల్లి దర్శకత్వంలో అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కళ్యాణ్ సింగనమల నిర్మించిన ఈ చిత్రం సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా ఈ నెల 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం జరిగిన విలేకర్ల సమావేశంలో అర్జున్ దాస్యన్ మాట్లాడుతూ– 'కష్టపడకుండా తక్కువ టైమ్‌లో జీవితంలో ఎదగాలనుకునే అర్జున్ అనే ఓ కుర్రాడి లైఫ్ ఫైనల్‌గా ఏమైంది? అన్నదే కాన్సెప్ట్. అర్జున్ పాత్రలో శ్రీ సింహానటించారు. దర్శకుడు ప్రణీత్ కథ చెప్పినదాని కంటే పదిరెట్లు బాగా తీశాడు. ‘కార్తికేయ 2’లోలా ఈ చిత్రంలోనూ కృష్ణుడి కాన్సెప్ట్ ఉంటుంది. ఆ సినిమాకి ఇచ్చినట్లే ఈ సినిమాకి కూడా కాలభైరవ మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఇక నేను నిర్మించిన ‘డియర్ మేఘ’ చిత్రం కన్నడ ‘దియా’కు రీమేక్. కారణాలు తెలియదు కానీ ‘డియర్ మేఘ’ విడుదలైన రోజే ‘దియా’ యూ ట్యూబ్‌లో విడుదలైంది. మాకు బాగా నష్టం కలిగింది. సో.. ఇప్పట్లో రీమేక్ మూవీ చేయకూడదనుకుంటున్నాను. అలాగే కొందరు నిర్మాతల అసోసియేషన్‌తోనే డైరెక్షన్ చేద్దామని అనుకుంటున్నాను. ప్రియదర్శి హీరోగా ఓ సినిమా తీస్తున్నాం. హిందీలో రెండు ప్రాజెక్ట్‌లు చేస్తున్నాం' అన్నారు. -
కొత్త కామెడీ టైమింగ్‌ను చూస్తారు
‘‘భాగ్ సాలే’ సినిమాను నేను నిర్మించాల్సింది.. కానీ కుదరలేదు. శ్రీసింహాలో మంచి టైమింగ్ ఉంది. ఈ సినిమాలో కొత్త కామెడీ టైమింగ్‌ను చూస్తారు. దర్శకుడు ప్రణీత్‌తో నేను, విష్ణు కలిసి ఓ సినిమాను నిర్మించనున్నాం’’ అని డైరెక్టర్ హరీష్ శంకర్ అన్నారు. శ్రీ సింహా కోడూరి, నేహా సోలంకి జంటగా ప్రణీత్ బ్రహ్మాండపల్లి దర్శకత్వం వహించిన చిత్రం ‘భాగ్ సాలే’. అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కల్యాణ్ సింగనమల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో శ్రీ సింహా మాట్లాడుతూ–‘‘ఈ సినిమాతో అందర్నీ నవ్విస్తాం’’ అన్నారు. ‘‘భాగ్ సాలే’ ప్రేక్షకులను అలరిస్తుంది’’ అన్నారు ప్రణీత్. ‘‘మంచి క్రైమ్ కామెడీ ఫిల్మ్ ఇది’’ అన్నారు అర్జున్ దాస్యన్ . ‘‘ఈ తరహా చిత్రాలు చాలా తక్కువగా వస్తాయి’’ అన్నారు యష్ రంగినేని. -
‘భాగ్ సాలే’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
‘భాగ్ సాలే’ పెద్ద హిట్ కావాలి: చిరంజీవి
సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు శ్రీసింహా కోడూరి, నేహా సోలంకి హీరోహీరోయిన్లుగా నటించిన తాజా మూవీ ‘భాగ్ సాలే’. ప్రణీత్ బ్రాహ్మాండపల్లి దర్శకత్వంలో క్రైమ్ కామెడీ గా తెరకెక్కిన ఈ సినిమా జులై 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ని మెగాస్టార్ చిరంజీవి వీక్షించారు. అనంతరం చిత్ర యూనిట్‌పై ప్రశంసలు కురిపించారు. ‘భాగ్ సాలే సినిమా ట్రైలర్ బాగుంది. శ్రీసింహా తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ఏర్పర్చుకుంటున్నాడు. కామెడీ, మాస్, ఎంటర్ టైనింగ్ తో పాటు క్రైమ్ అంశాలతో సినిమాలు చేస్తూ పేరు తెచ్చుకుంటున్నాడు. శ్రీసింహా కీరవాణి గారి అబ్బాయి అని అతను హీరోగా పేరు తెచ్చుకునే దాకా నాకు తెలియదు. వారసుడిగా కాకుండా తను స్వతహాగా ఎదగాలని ప్రయత్నిస్తున్నాడు. కీరవాణి గారికి పేరు తెచ్చేంతగా గుర్తింపు సంపాదించుకోవాలని కోరుకుంటున్నా. అలాగే కాలభైరవ అంటే చరణ్ కు చాలా ఇష్టం. వీరిద్దరు మత్తు వదలరా సినిమాతో సక్సెస్ అందుకున్నారు. ఇకపైనా మంచి అవకాశాలతో తమ ప్రతిభను చాటుకోవాలి. దర్శకుడు ప్రణీత్ బ్రహ్మాండంగా ఈ సినిమాను రూపొందించాడు. అలాగే నిర్మాత అర్జున్ దాస్యన్ మంచి ప్రయత్నం చేశాడు. ఈ సినిమా జూలై 7న విడుదలవుతోంది. సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను’అని చిరంజీవి అన్నారు. -
ఆ రింగ్ ఉంటే లైఫ్ రిచ్.. ఆసక్తికరంగా ‘భాగ్ సాలే’వీడియో గ్లింప్స్
శ్రీసింహా కోడూరి, నేహా సోలంకి హీరోహీరోయిన్లుగా నటించిన తాజా మూవీ ‘భాగ్ సాలే’. ప్రణీత్ బ్రాహ్మాండపల్లి దర్శకత్వంలో క్రైమ్ కామెడీ గా తెరకెక్కిన ఈ సినిమా జులై 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ‘వరల్డ్ ఆఫ్ భాగ్ సాలే’పేరుతో వీడియో గ్లింప్స్‌ను విడుదల చేశారు మేకర్స్. సిద్ధు జొన్నల గడ్డ వాయిస్ ఓవర్‌తో ఉన్న ఆ వీడియోలో ఓ వజ్రం వెనక ఉన్న కథను చెప్పారు.స్వాతంత్రం రాకముందు ఇండియాలో దొరిగిన ఓ వజ్రం అన్ని దేశాలు తిరిగి..ఒక ముక్క నైజాం రాజు వద్దకు వస్తుంది. దాన్ని నైజాం రాజు ఉంగరంగా మార్చుకొని వేలుకి పెట్టుకుంటే.. ఆ ఉంగరాన్ని కొట్టేసిన ఫ్యామిలీ అంటూ ఓ కథని తన వాయిస్ ఓవర్ తో చెప్పుకొచ్చాడు సిద్ధూ జొన్నలగడ్డ. ఆ వజ్రం చుట్టే ‘బాగ్ సాలే’ సినిమా ఉంటుందని ఈ వీడియో ద్వారా తెలుస్తోంది. (చదవండి: బిడ్డకు జన్మనిచ్చిన బుల్లితెర నటి.. సోషల్ మీడియాలో వైరల్!) సురేష్ బాబు సమర్పణలో వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై బిగ్ బెన్, సినీ వ్యాలీ మూవీస్ వారి అసోసియేషన్ తో అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కళ్యాణ్ సింగనమల నిర్మిస్తున్న ఈసినిమాలో జాన్ విజయ్, రాజీవ్ కనకాల, వెన్నెల కిషోర్, నందినీరాయ్, సుదర్శన్, వంశీ నెక్కంటి, వైవా హర్ష, కిడ్ చక్రి, జయవాణి, బాష, యాదం రాజు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాలభైరవ సంగీతాన్ని అందిస్తున్నాడు. -
శ్రీసింహా ‘ 'భాగ్ సాలే' ఫస్ట్ లుక్ రిలీజ్
ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు శ్రీసింహా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఇటీవల ‘దొంగలున్నారు జాగ్రత్త’తో తెలుగు ప్రేక్షకులను పలకరించిన శ్రీసింహా.. తాజాగా మరో చిత్రం ‘బాగ్ సాలే’ ని రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ప్రణీత్ సాయి దర్శకత్వం వహిస్తున్న ఈ క్రైమ్ కామెడీ చిత్రాన్ని వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్, బిగ్ బెన్, సినీ వ్యాలీ మూవీస్ సినిమా బ్యానర్లపై అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కళ్యాణ్ సింగనమల నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు మేకర్స్. ఈ సందర్భంగా నిర్మాత అర్జున్ దాస్యన్ మాట్లాడుతూ.. ‘ఈతరం ప్రేక్షకులని అలరించే కథతో థ్రిల్లింగ్ క్రైమ్ కామెడీ గా తెరకెక్కుతున్న చిత్రం 'భాగ్ సాలే'. ఏం చేసైనా అనుకున్నది సాధించాలనుకునే ఒక యువకుడి పాత్ర చుట్టూ తిరిగే ఈ కథ ఆద్యంతం థ్రిల్ చేస్తుంది’ అన్నారు. ఈ చిత్రంలో నేహా సొలంకి హీరోయిన్ గా నటించగా, జాన్ విజయ్, నందిని రాయ్ ప్రతినాయక పాత్రలు పోషించారు. కాల భైరవ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, వైవా హర్ష, సత్య, సుదర్శన్, వర్షిణి తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.