Siddu Jonnalagadda Voiceover For Bhaag Saale Raises Expectations For The Film, Deets Inside - Sakshi
Sakshi News home page

Bhaag Saale: ఆ రింగ్‌ ఉంటే లైఫ్‌ రిచ్‌ అవుతుంది..ఆసక్తికరంగా ‘భాగ్ సాలే’వీడియో గ్లింప్స్‌

Published Wed, Jun 21 2023 3:53 PM | Last Updated on Wed, Jun 21 2023 4:16 PM

Siddu Jonnalagadda Voiceover For Bhaag Saale Raises Expectations For The Film - Sakshi

శ్రీసింహా కోడూరి, నేహా సోలంకి హీరోహీరోయిన్లుగా నటించిన తాజా మూవీ ‘భాగ్ సాలే’. ప్రణీత్ బ్రాహ్మాండపల్లి దర్శకత్వంలో  క్రైమ్ కామెడీ గా తెరకెక్కిన ఈ సినిమా జులై 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ‘వరల్డ్ ఆఫ్ భాగ్ సాలే’పేరుతో వీడియో గ్లింప్స్‌ను విడుదల చేశారు మేకర్స్‌. సిద్ధు జొన్నల గడ్డ వాయిస్‌ ఓవర్‌తో ఉన్న ఆ వీడియోలో ఓ వజ్రం వెనక ఉన్న కథను చెప్పారు.స్వాతంత్రం రాకముందు ఇండియాలో దొరిగిన ఓ వజ్రం అన్ని దేశాలు తిరిగి..ఒక ముక్క నైజాం రాజు వద్దకు వస్తుంది. దాన్ని నైజాం రాజు ఉంగరంగా మార్చుకొని వేలుకి పెట్టుకుంటే.. ఆ ఉంగరాన్ని కొట్టేసిన ఫ్యామిలీ అంటూ ఓ కథని తన వాయిస్ ఓవర్ తో చెప్పుకొచ్చాడు సిద్ధూ జొన్నలగడ్డ. ఆ వజ్రం చుట్టే ‘బాగ్‌ సాలే’ సినిమా ఉంటుందని ఈ వీడియో ద్వారా తెలుస్తోంది. 

(చదవండి: బిడ్డకు జన్మనిచ్చిన బుల్లితెర నటి.. సోషల్ మీడియాలో వైరల్!)

సురేష్ బాబు సమర్పణలో వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై బిగ్ బెన్, సినీ వ్యాలీ మూవీస్ వారి అసోసియేషన్ తో అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కళ్యాణ్ సింగనమల నిర్మిస్తున్న  ఈసినిమాలో జాన్ విజయ్, రాజీవ్ కనకాల, వెన్నెల కిషోర్, నందినీరాయ్, సుదర్శన్, వంశీ నెక్కంటి, వైవా హర్ష, కిడ్ చక్రి, జయవాణి, బాష, యాదం రాజు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాలభైరవ సంగీతాన్ని అందిస్తున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement