Rangabali, Pareshan Is Now Streaming On This OTT Platforms - Sakshi
Sakshi News home page

ఓటీటీలో మూడు తెలుగు సినిమాలు, ఒక కొత్త సిరీస్‌.. ఎక్కడ స్ట్రీమింగ్‌ అంటే?

Published Fri, Aug 4 2023 10:27 AM | Last Updated on Fri, Aug 4 2023 12:23 PM

Rangabali, Pareshan Movies Streaming On This OTT Platforms - Sakshi

ఎంటర్‌టైన్‌మెంట్‌ను అన్నివేళలా అందుబాటులోకి ఉంచేందుకు ఓటీటీలు ఉపయోగపడుతున్నాయి. సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు, కామెడీ షోలు, రియాలిటీ షోలు.. ఇలా భిన్నరకాల కంటెంట్‌తో బోలెడంత వినోదాన్ని అందిస్తున్నాయి. అందుకే ప్రేక్షకులు థియేటర్‌లో రిలీజయ్యేవాటితో పాటు ఓటీటీ రిలీజెస్‌ మీద కూడా ఓ కన్నేస్తున్నారు. ఈ రోజు శుక్రవారం కావడంతో ఓటీటీలో కొత్త సినిమాలు ప్రత్యక్షమయ్యాయి.

నెట్‌ఫ్లిక్స్‌లో రంగబలి
టాలీవుడ్‌ యంగ్‌ హీరో నాగశౌర్య ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రంగబలి. పవన్‌ బాసంశెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యుక్తి తరేజ హీరోయిన్‌గా నటించింది. జూలై 7న థియేటర్‌లో విడుదలైన ఈ సినిమా తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది. నేటి(ఆగస్టు 4) నుంచి రంగబలి ఈ ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతోంది.

ఆ ఓటీటీలో పరేషాన్‌
‘మసూద’ ఫేమ్‌ తిరువీర్‌ హీరోగా నటించిన చిత్రం ‘పరేషాన్‌’. రానా దగ్గుబాటి సమర్పణలో సిద్ధార్థ్‌ రాళ్లపల్లి నిర్మించిన ఈ సినిమా జూన్‌ 2న విడుదలైంది. కామెడీ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. దాదాపు రెండు నెలల తర్వాత ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఆగస్టు 4 నుంచి ఈ చిత్రం సోనీలివ్‌లో అందుబాటులోకి వచ్చింది.

దయ సిరీస్‌ ఎందులో అంటే?
ఇకపోతే అటు దయ అనే వెబ్‌ సిరీస్‌ హాట్‌స్టార్‌లో ప్రసారం అవుతోంది. ఇందులో జేడీ చక్రవర్తి, ఈషా రెబ్బా, నంబీషన్ రమ్య, కమల్ కామరాజ్ తదితరులు ముఖ్య పాత్రలో నటించారు. పవన్ సాధినేని దర్శకత్వం వహించాడు. అలాగే భాగ్‌సాలే అనే మూవీ సైతం ఓటీటీలోకి వచ్చేసింది. ఇది అమెజాన్‌ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది.

చదవండి: రీఎంట్రీకి రెడీ అయిన నజ్రియా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement