Rangabali Movie
-
ఓటీటీలోకి వచ్చేసిన కొత్త సినిమాలు, ఎక్కడ స్ట్రీమింగ్ అంటే?
ఎంటర్టైన్మెంట్ను అన్నివేళలా అందుబాటులోకి ఉంచేందుకు ఓటీటీలు ఉపయోగపడుతున్నాయి. సినిమాలు, వెబ్ సిరీస్‌లు, కామెడీ షోలు, రియాలిటీ షోలు.. ఇలా భిన్నరకాల కంటెంట్‌తో బోలెడంత వినోదాన్ని అందిస్తున్నాయి. అందుకే ప్రేక్షకులు థియేటర్లో రిలీజయ్యేవాటితో పాటు ఓటీటీ రిలీజెస్ మీద కూడా ఓ కన్నేస్తున్నారు. ఈ రోజు శుక్రవారం కావడంతో ఓటీటీలో కొత్త సినిమాలు ప్రత్యక్షమయ్యాయి. నెట్‌ఫ్లిక్స్‌లో రంగబలి టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రంగబలి. పవన్ బాసంశెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యుక్తి తరేజ హీరోయిన్గా నటించింది. జూలై 7న థియేటర్లో విడుదలైన ఈ సినిమా తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది. నేటి(ఆగస్టు 4) నుంచి రంగబలి ఈ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ ఓటీటీలో పరేషాన్ ‘మసూద’ ఫేమ్ తిరువీర్ హీరోగా నటించిన చిత్రం ‘పరేషాన్’. రానా దగ్గుబాటి సమర్పణలో సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించిన ఈ సినిమా జూన్ 2న విడుదలైంది. కామెడీ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. దాదాపు రెండు నెలల తర్వాత ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఆగస్టు 4 నుంచి ఈ చిత్రం సోనీలివ్‌లో అందుబాటులోకి వచ్చింది. దయ సిరీస్ ఎందులో అంటే? ఇకపోతే అటు దయ అనే వెబ్ సిరీస్ హాట్‌స్టార్‌లో ప్రసారం అవుతోంది. ఇందులో జేడీ చక్రవర్తి, ఈషా రెబ్బా, నంబీషన్ రమ్య, కమల్ కామరాజ్ తదితరులు ముఖ్య పాత్రలో నటించారు. పవన్ సాధినేని దర్శకత్వం వహించాడు. అలాగే భాగ్‌సాలే అనే మూవీ సైతం ఓటీటీలోకి వచ్చేసింది. ఇది అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. చదవండి: రీఎంట్రీకి రెడీ అయిన నజ్రియా -
ఓటీటీల్లోకి ఈ శుక్రవారం 18 మూవీస్
ఎప్పటిలానే మరో వీకెండ్. ఈసారి థియేటర్లలో దాదాపు 10 వరకు చిన్న చిత్రాలు విడుదల కానున్నాయి. వీటిలో ధోనీ నిర్మించిన 'ఎల్‌జీఎమ్' తప్పితే పెద్దగా చెప్పుకోదగ్గ మూవీస్ లేవు. దీంతో మూవీ లవర్స్ ఓటీటీల వైపు చూస్తున్నారు. వాళ్ల కోసమా అన్నట్లు ఈసారి దాదాపు 18 వరకు కొత్త సినిమాలు-వెబ్ సిరీసులు రిలీజ్ కు సిద్ధమైపోయాయి. దిగువన ఉన్న ఆ జాబితానే. ఇందులో స్ట్రీమింగ్ అవుతున్నాయి అని చెప్పినవన్నీ ఈ రోజు అంటే గురువారం రిలీజ్ అయ్యాయి అని. మిగతావన్నీ శుక్రవారం ఓటీటీల్లోకి రాబోతున్నాయని అర్థం. మరి ఇంకెందుకు లేటు.. ఈ వీకెండ్ ఏం చూడాలో ప్లాన్ ఫిక్స్ చేసుకోండి. వీటిలో రంగబలి, పరేషాన్ సినిమాలకు తోడు 'దయ' వెబ్ సిరీస ఆసక్తి కలిగిస్తున్నాయి (ఇదీ చదవండి: ఓటీటీలోకి ఆ బ్లాక్‌బస్టర్ థ్రిల్లర్.. తెలుగులోనూ) ఈ శుక్రవారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ హాట్‌స్టార్ దయ - తెలుగు వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ ద లాస్ట్ ఫ్లవర్స్ ఆఫ్ ఎలైస్ హర్ట్ - ఇంగ్లీష్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ ఫేటల్ సెడక్షన్ సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్ రంగబలి - తెలుగు సినిమా ద బిగ్ నైల్డ్ ఇట్ బేకింగ్ ఛాలెంజ్ - ఇంగ్లీష్ సిరీస్ ద హంట్ ఫర్ వీరప్పన్ - హిందీ సిరీస్ చూనా - హిందీ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్) హెడ్ టూ హెడ్ - అరబిక్ సినిమా (స్ట్రీమింగ్ అవుతోంది) హార్ట్ స్టాపర్ సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్) ద లాస్ట్ అవర్స్ ఆఫ్ మారియో బ్యూయోండో - స్పానిష్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్) ద లింకన్ లాయర్ సీజన్ 2: పార్ట్ 2 - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్) సోనీ లివ్ ఫటాఫటీ - బెంగాలీ మూవీ పరేషాన్ - తెలుగు సినిమా బుక్ మై షో లాస్ట్ & ఫౌండ్ - ఇంగ్లీష్ చిత్రం సైలెంట్ హవర్స్ - ఇంగ్లీష్ మూవీ టూ క్యాచ్ కిల్లర్ - ఇంగ్లీష్ సినిమా ఆహా హైవే - తమిళ సినిమా సైనా ప్లే డార్క్ షేడ్స్ ఆఫ్ సీక్రెట్ - మలయాళ సినిమా (ఇదీ చదవండి: నా మనసులో ఉన్నది అతడే.. ఆల్రెడీ పెళ్లి!: రష్మిక) -
ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న సినిమాలివే, లిస్ట్ చూసేయండి!
జూలై నెలలో ఎక్కువగా చిన్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. వీటిలో ఒకటీరెండు మాత్రమే సక్సెస్ రుచి చూశాయి. భారీ బడ్జెట్ సినిమాలేవీ దరిదాపుల్లో కూడా లేకపోవడంతో మరిన్ని చిన్న సినిమాలు థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. అలాగే బాక్సాఫీస్ దగ్గర విడుదలైన సినిమాలు అటు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యాయి. మరి ఈ వారం అటు థియేటర్, ఇటు ఓటీటీలో విడుదలయ్యే సినిమాలేంటో చూసేద్దాం.. థియేటర్లో విడుదలయ్యే సినిమాలు.. ⇒ ఎల్జీఎం (తెలుగు) - ఆగస్టు 4 ⇒ కృష్ణగాడు అంటే ఒక రేంజ్ - ఆగస్టు 4 ⇒ రాజుగారి కోడిపులావ్ - ఆగస్టు 4 ⇒ విక్రమ్ రాథోడ్ - ఆగస్టు 4 ⇒ మిస్టేక్ - ఆగస్టు 4 ⇒ మెగ్ 2: రాక్షస తిమింగలం - ఆగస్టు 3 ⇒ దిల్సే - ఆగస్టు 4 ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు, సిరీస్‌లు హాట్‌స్టార్ ⇒ గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ3 - ఆగస్టు 2 ⇒ దయా (తెలుగు సిరీస్)- ఆగస్టు 5 నెట్‌ఫ్లిక్స్ ⇒ చూనా (హిందీ వెబ్ సిరీస్) - ఆగస్టు 3 ⇒ రంగబలి - ఆగస్టు 4 ⇒ ది హంట్ ఫర్ వీరప్పన్ (డాక్యుమెంటరీ సిరీస్) - ఆగస్టు 4 సోనీ లివ్ ⇒ పరేషాన్ (తెలుగు) - ఆగస్టు ⇒ పోర్ తొడిల్ (తమిళ్) - ఆగస్టు 4 చదవండి: తమన్నా కోసం ఆ టాప్ హీరోయిన్ను టార్గెట్ చేసిన అజిత్ -
'రంగబలి' ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఆ రోజే
Rangabali Movie OTT: ఈ మధ్య కొత్త సినిమాలు మరీ త్వరగానే ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. 'సామజవరగమన', 'నాయకుడు' లాంటి మూవీస్ అయితే థియేటర్లలో ప్రేక్షకుల్ని అద్భుతంగా అలరించాయి. హిట్ అనిపించుకున్నాయి. కానీ నెల తిరగకుండానే ఇప్పుడు ఓటీటీల్లోక వచ్చేశాయి. దీని రూట్లో మరో తెలుగు చిత్రం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. (ఇదీ చదవండి: బ్రో మూవీ ఓటీటీలోకి వచ్చేది అప్పుడే!) ఆ రోజు నుంచి స్ట్రీమింగ్ నాగశౌర్య హీరోగా నటించిన 'రంగబలి' జూలై 7న థియేటర్లలోకి వచ్చింది. ఓ మాదిరి అంచనాలతో రిలీజైన ఈ చిత్రం.. బాక్సాఫీస్ దగ్గర ఫెయిలైంది. ఫస్టాప్‌లో కామెడీ బాగానే వర్కౌట్ అయినప్పటికీ.. సెకండాఫ్ తేలిపోవడంతో పెద్దగా కలెక్షన్స్ దక్కించుకోలేకపోయింది. ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ హక్కులు సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్.. ఆగస్టు 4 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. కథేంటి? శౌర్య అలియాస్ షో(నాగశౌర్య) రాజవరం అనే ఊరిలో ఆవారాగా తిరిగే కుర్రాడు. కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల వైజాగ్ వెళ్తాడు. అక్కడ మెడికల్ స్టూడెంట్ అయిన సహజ (యుక్తి తరేజా)తో లవ్‌లో పడతాడు. పెళ్లి కోసం ఆమె తండ్రిని ఒప్పించేందుకు సహజ ఇంటికెళ్తాడు. అక్కడ శౌర్యకు ఓ విషయం తెలుస్తుంది. ఇంతకీ శౌర్య ఊరిలోని రంగబలి సెంటర్‌కు అతడి పెళ్లికి సంబంధం ఏంటి? చివరకు ఏమైందనేదే స్టోరీ. (ఇదీ చదవండి: BRO Movie Review: ‘బ్రో’మూవీ రివ్యూ) -
రంగబలి మూవీ సక్సెస్ మీట్ ఫోటోలు
-
ఛలో తర్వాత రంగబలి
‘‘రంగబలి’ని ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. నాకు ‘ఛలో’ తర్వాత ‘రంగబలి’ మరో బ్లాక్ బస్టర్ ఇచ్చింది. మంచి కథతో సినిమా తీసిన పవన్‌కి, ఈ జర్నీలో సపోర్ట్ చేసిన సుధాకర్‌కి థ్యాంక్స్’’ అన్నారు హీరో నాగశౌర్య. పవన్ బాసంశెట్టి దర్శకత్వంలో నాగశౌర్య, యుక్తి తరేజ జంటగా నటించిన చిత్రం ‘రంగబలి’. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ మూవీ శుక్రవారం (జులై 7న) విడుదలైంది. ఈ సందర్భంగా శనివారం సక్సెస్ మీట్లో పవన్ బాసంశెట్టి మాట్లాడుతూ– ‘‘మా సినిమా కలెక్షన్స్ బాగున్నాయి’’ అన్నారు. -
Rangabali Review: 'రంగబలి' సినిమా రివ్యూ
టైటిల్: రంగబలి నటీనటులు: నాగశౌర్య, యుక్తి తరేజా, సత్య, షైన్ టామ్ చాకో తదితరులు నిర్మాణ సంస్థ: SLV సినిమాస్ నిర్మాత: సుధాకర్ చెరుకూరి దర్శకత్వం: పవన్ బాసంశెట్టి సంగీతం: పవన్ సీహెచ్ సినిమాటోగ్రఫీ: దివాకర్ మణి, వంశీ పచ్చిపులుసు ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ విడుదల తేదీ: 07-07-2023 హీరో నాగశౌర్య పేరు చెప్పగానే మంచి క్లాస్ సినిమాలు గుర్తొస్తాయి. అలానే చాలాకాలం నుంచి సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. 'ఛలో' తర్వాత ఆ స్థాయి సక్సెస్ దక్కట్లేదు. ఇప్పుడు 'రంగబలి' అనే కమర్షియల్ ఎంటర్టైనర్తో బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నామని ప్రీ రిలీజ్ ఈవెంట్లో గట్టిగా చెప్పుకొచ్చాడు. మరి ఈ మూవీ నాగశౌర్య చెప్పినట్లు ఉందా? సినిమా టాక్ ఏంటనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం. కథేంటి? శౌర్య(నాగశౌర్య)ది రాజవరం. ఊరిలో బేవార్స్ గా తిరుగుతూ ఎక్కువగా షో చేస్తుంటాడు అందుకే అందరూ ఇతడిని 'షో' అని పిలుస్తుంటారు. ఊరంటే పిచ్చి ఇష్టం. చచ్చినా బతికినా సొంతూరిలోనే అనేది శౌర్య మనస్తత్వం. అలాంటిది ఓ పనిమీద వైజాగ్ వెళ్తాడు. అక్కడ సహజ(యుక్తి తరేజా)ని చూసి లవ్ లో పడతాడు. ఆమె కూడా ఇతడిని ప్రేమిస్తుంది. దీంతో పెళ్లి గురించి మాట్లాడేందుకు శౌర్య.. సహజ తండ్రి కలవడానికి వెళ్తాడు. తనది రాజవరం అని చెబుతాడు. తన ఊరిలోని 'రంగబలి' సెంటర్ ప్రస్తావన వస్తుంది. దీంతో ఆయన పెళ్లికి నో చెబుతాడు. ఇంతకీ ఆ సెంటర్‌తో శౌర్య పెళ్లికి వచ్చిన చిక్కేంటి? చివరకు శౌర్య ఏం చేశాడు? అనేదే మెయిన్ స్టోరీ. ఎలా ఉందంటే? తెలుగు కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమా అనగానే.. ఎలా ఉంటుందా అనేది మనకు ఓ ఐడియా ఉంది. దానికి ఏ మాత్రం అటు ఇటు కాకుండా 'రంగబలి' తీశారు. ట్రైలర్ లో చెప్పినట్లు.. బయట ఊరిలో బానిసలా బతకడం కంటే సొంతూరిలో సింహంలా బతకాలనేది హీరో క్యారెక్టరైజేషన్. ఫస్టాప్ మొదలవడమే మెల్లగా స్టోరీలోకి వెళ్లిపోయారు. మంచి ఎలివేషన్‌తో హీరో ఎంట్రీ. ఆ వెంటనే ఫైట్. ఆ తర్వాత హీరో చుట్టూ ఉండే వాతావరణాన్ని సీన్ బై సీన్ చూపించారు. తండ్రి విశ్వం(గోపరాజు రమణ)కి ఊరిలో మెడికల్ షాప్. కొడుకు శౌర్యకి దాన్ని అప్పగించాలని ఆయన ఆశ. మనోడేమో ఊరిలో కుర్రాళ్లతో బేవార్స్ గా తిరుగుతుంటాడు. ఓ పనిమీద శౌర్య వైజాగ్ వెళ్లడం, అక్కడ హీరోయిన్ తో హీరో లవ్ లో పడటం, పెళ్లికి ఆమె తండ్రి ఒప్పుకోకపోవడం ఇలా సీన్లన్నీ వెళ్తుంటాయి. అయితే ఇలాంటి సన్నివేశాల్ని ఎక్కడో చూశామే అనిపించినప్పటికీ ఫస్టాప్ మొత్తం హీరో అతడి ఫ్రెండ్ అగాధం క్యారెక్టర్ చేసే కామెడీతో అలా వెళ్లిపోతుంది. పెళ్లి కోసం హీరోయిన్ తండ్రి దగ్గరకు వెళ్లిన హీరోకు తన ఊరిలో 'రంగబలి' సెంటర్ వల్ల ప్రాబ్లమ్ వస్తుంది. ఇంతకీ ఆ సెంటర్ తో హీరోయిన్ తండ్రికి ఉన్న సమస్యేంటి? చివరకు అది పరిష్కారమైందా లేదా అనేదే తెలియాలంటే సినిమా చూడాల్సిందే. దర్శకుడు ఓ పాయింట్ చెప్పాలనుకున్నాడు. దాన్ని కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాగా తీశాడు. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఫస్టాప్ మొత్తాన్ని స్టోరీ సెట్ చేయడానికి ఉపయోగించుకున్నాడు. సెకండాఫ్ లో అసలు విషయాన్ని బయటపెట్టాడు. కానీ అది ఇప్పటికే ఎన్నో సినిమాల్లో చూసేసిన కథలా అనిపిస్తుంది. కరెక్ట్ గా చెప్పాలంటే ఏం కొత్తగా ఉండదు. క్లైమాక్స్ అయితే మరీ సిల్లీగా అనిపిస్తుంది. అప్పటివరకు మారని జనం.. హీరో 5 నిమిషాల స్పీచ్ ఇవ్వగానే మారిపోతారు. కొన్నేళ్ల ముందు వరకు ఈ తరహా స్టోరీలంటే ఓకే గానీ.. ఓటీటీలకు బాగా అలవాటు పడిపోయిన ఈ జమానాలో కూడా ఇలాంటి స్టోరీలా బాసూ! ఎవరెలా చేశారు? హీరో నాగశౌర్యకు ఇలాంటి పాత్రలు కొట్టిన పిండి. తనదైన ఈజ్‌తో యాక్టింగ్, కామెడీ, డ్యాన్సులు అలా చేసుకుంటూ వెళ్లిపోయాడు. యాక్షన్ హీరో కావాలనే ఆరాటం ఈ సినిమాలో బాగానే కనిపించింది. అవసరం లేకున్నా సరే కొన్నిచోట్ల బాడీని చూపించాడు. ఫైట్లు కూడా చేశాడు. స్టోరీకి తగ్గట్లు అవి కాస్త లాజిక్‌గా ఉండుంటే బాగుండేది. హీరోయిన్ యుక్తి తరేజాకు పెద్దగా స్కోప్ దక్కలేదు. హీరోతో లవ్ సీన్లు, రెండు మూడు పాటల్లో కనిపించింది. ఓ పాటలో అయితే కిస్, స్కిన్ షోతో రెచ్చిపోయింది! మిగిలిన వాళ్లలో సత్య గురించి కచ్చితంగా చెప్పుకోవాలి. ఫస్టాప్ ని తన కామెడీతో లాక్కొచ్చాడు. ఒక రకంగా చెప్పాలంటే ఫస్టాప్ కి సత్యనే హీరో. లేకపోయింటే సినిమా బలైపోయేది! గోపరాజు రమణ హీరో తండ్రిగా నటించి ఆకట్టుకున్నాడు. సత్య, గోపరాజు రమణ పాత్రలకు ఫస్టాప్ లో దొరికిన స్పేస్.. సెకండాఫ్ లోనూ ఉండుంటే బాగుండేది. మలయాళ నటుడు షైన్ టామ్ చాకో.. ఇందులో విలన్‌గా చేశాడు. అతడి పాత్ర పరిచయం ఓకే కానీ ఎండింగ్ పేలవంగా ఉంది. నటుడిగా ఏ మాత్రం ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. అసలు అతడి పాత్రకు సరైన సీన్లు ఒక్కటంటే ఒక్కటీ పడలేదు. సెకండాఫ్ లో శరత్ కుమార్, శుభలేఖ సుధాకర్ పర్వాలేదనిపించారు. మిగిలినవాళ్లు ఓకే. టెక్నికల్ విషయాలకొస్తే.. పవన్ సీహెచ్ అందించిన పాటలు పెద్దగా గుర్తుండవు. అవి కూడా సందర్భం లేకుండా వస్తుంటాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. నిర్మాణ విలువలు స్టోరీకి తగ్గట్లు ఉన్నాయి. రైటర్ అండ్ డైరెక్టర్ పవన్ బాసంశెట్టికి ఇది తొలి సినిమా. కొన్ని సీన్లనీ బాగానే హ్యాండిల్ చేశాడు గానీ సినిమా కథ, సీన్లపై ఇంకాస్త దృష్టి పెట్టి ఉండాల్సింది. ఓవరాల్‌గా చెప్పుకుంటే 'రంగబలి'.. కాస్త ఫన్ కాస్త ఎమోషన్ ఉండే రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైనర్. -చందు, సాక్షి వెబ్‌డెస్క్ -
అతనికి ఏ సాయం కావాలన్నా చేస్తానని ముందే చెప్పా: నాగశౌర్య
‘‘రంగబలి’ మంచి మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్. ఈ సినిమా చూస్తున్నంత సేపు సొంత ఊరు గుర్తొస్తుంది. ఆ ఊరిని మిస్ అవుతున్నామనే ఫీలింగ్ కలిగి ఓసారి ఊరెళ్లి వద్దామనే ఆలోచన కలుగుతుంది’’ అని హీరో నాగశౌర్య అన్నారు. పవన్ బాసంశెట్టి దర్శకత్వంలో నాగశౌర్య, యుక్తి తరేజ జంటగా నటించిన చిత్రం ‘రంగబలి’. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) విడుదలకానుంది. ఈ సందర్భంగా నాగశౌర్య చెప్పిన విశేషాలు. ► నటుడికి దర్శకుడు స్పేస్ ఇవ్వాలి. ఆ స్పేస్‌ని పవన్ నాకు ఇచ్చాడు. దర్శకునిగా తనకు తొలి సినిమా కాబట్టి ఏ విషయంలోనూ ఒత్తిడి తీసుకోవద్దని, ఏ సాయం కావాలన్నా చేస్తానని ముందే చెప్పాను. నా అనుభవాన్ని, పవన్ విజన్‌ని జోడించి అనుకున్నది అనుకున్నట్లుగా ‘రంగబలి’ లాంటి ఓ మంచి సినిమా తీశాం. ► ‘రంగబలి’ ప్రివ్యూ చూశాకే ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తానని దర్శక–నిర్మాతలకు చెప్పాను. చూసిన తర్వాత చాలా మంచి మూవీ చేశామనే అనుభూతి కలిగింది. అందుకే సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని ప్రేక్షకులకు నమ్మకంగా చెప్పగలుగుతున్నాను. సుధాకర్‌గారు ఎక్కడా రాజీ పడకుండా ‘రంగబలి’ తీశారు. ఈ మూవీతో పవన్‌కి మంచి పేరొస్తుంది. యుక్తి తరేజ మంచి యాక్టర్ అండ్ డ్యాన్సర్. తెలుగులో లీడింగ్ హీరోయిన్ అయ్యే అవకాశాలు తనకు చాలా ఉన్నాయి. పవన్ సంగీతం, నేపథ్య సంగీతాన్ని ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు. ► ఇప్పుడున్న పోటీలో హీరోలందరూ అద్భుతమైన నటన, డ్యాన్స్, యాక్షన్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో నేనూ ది బెస్ట్ ఇవ్వాలి. ఈ క్రమంలో ఒక్కోసారి గాయాలవుతాయి. కష్టపడితేనే సక్సెస్ వస్తుంది. ► ఏప్రొడక్షన్ హౌస్‌లోనైనా పది హిట్స్ పడిన తర్వాత కూడా ఒక సినిమా నిరాశ పరిస్తే దాన్ని రికవర్ చేయడం అంత తేలిక కాదు. సినిమా అంటే మాకు పిచ్చి.. ఫ్యాషన్‌తోనే మా ఐరా క్రియేషన్స్ బ్యానర్లో సినిమాలు నిర్మిస్తున్నాం తప్ప డబ్బులు సంపాదించుకోవాలని కాదు. మాకు సినిమా తప్పితే వేరేది తెలియదు. ప్రస్తుతానికి దర్శకత్వం ఆలోచన లేదు. నేను నటిస్తున్న 24వ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. -
నాగశౌర్యతో కమెడియన్ సత్య స్పెషల్ ఇంటర్వ్యూ
-
‘గెటౌట్ ఆఫ్ మై స్టూడియో’.. నవ్వులు పూయిస్తున్న ‘రంగబలి’ కామెడీ ఇంటర్వ్యూ
నాగశౌర్య, యుక్తి తరేజ జంటగా నటించిన తాజా చిత్రం ‘రంగబలి’.పవన్ బాసంశెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎస్ఎల్వీ సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఈ నెల 7న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్‌ని వైవిధ్యంగా ప్లాన్ చేసింది చిత్రబృందం. కమెడియన్ సత్యతో కలిసి ఓ ఫన్ని ఇంటర్వ్యూని షూట్ చేసింది. టాలీవుడ్లో ఇంటర్వ్యూ చేసే పలువురు ప్రముఖులను అనుకరిస్తూ కమెడియన్ సత్య అలరించాడు. రిపోర్టర్ ‘గ్రాఫర్’గా, అలాగే లేడీ యాంకర్ ‘వల్లీ’గా సత్య చేసే సందడి నవ్వులు పూయిస్తోంది. ఈ ఫన్నీ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి. -
'రంగబలి' బ్యూటీ రాకింగ్ స్టిల్స్.. చూస్తే అంతే! (ఫోటోలు)
-
అల్లు అర్జున్‌తో డ్యాన్స్ చేయాలని ఉంది: హీరోయిన్
'నా మాతృ భాష హిందీ. ‘రంగబలి’ కోసం తెలుగులో పెద్ద పేరా గ్రాఫ్ డైలాగులు నేర్చుకొని చెప్పడం సవాల్‌గా అనిపించింది. ఈ విషయంలో డైరెక్షన్ టీమ్‌కి థ్యాంక్స్. అలాగే దర్శకుడు పవన్‌గారు స్క్రిప్ట్‌ని ముందే నాకు ఇవ్వడంతో కొంచెం సులభం అయింది' అని హీరోయిన్ యుక్తి తరేజ అన్నారు. నాగశౌర్య హీరోగా పవన్ బాసంశెట్టి దర్శకత్వం వహించిన చిత్రం ‘రంగబలి’. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ యుక్తి తరేజ మాట్లాడుతూ–'మాది హరియాణ. ఢిల్లీ యూనివర్శిటీలో గ్రాడ్యుయేషన్ చేశాను. ఆ తర్వాత మోడలింగ్ మొదలుపెట్టాను. అనంతరం యాక్టింగ్ ఆడిషన్స్ ఇచ్చాను. ‘లుట్ గయ్..’ అనే పాట మంచి పేరు తీసుకొచ్చింది. పవన్‌గారు ఆడిషన్ చేసి ‘రంగబలి’ కి ఎంపిక చేశారు. ఇందులో మెడికల్ స్టూడెంట్ సహజగా కనిపిస్తా. నా మొదటి సినిమాకే నాగశౌర్యగారితో పాటు మంచి నిర్మాణ సంస్థలో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. తెలుగులో నాకు ఇష్టమైన హీరో అల్లు అర్జున్. ఆయనతో కలిసి డ్యాన్స్ చేయాలని ఉంది. హీరోయిన్స్‌లో అనుష్క శెట్టిగారు అంటే ఇష్టం. ప్రస్తుతం తెలుగులో కొన్ని కథలు వింటున్నాను' అన్నారు. -
రంగబలితో బ్లాక్‌బస్టర్ కొడుతున్నాం
‘‘సుధాకర్‌గారు, నేను ఎప్పటి నుంచో ఓ సినిమా చేయాలనుకున్నాం. పవన్ చెప్పిన ‘రంగబలి’ కథ మా ఇద్దరికీ నచ్చడంతో ఈ మూవీ చేశాం. చాలా నమ్మకంగా చెబుతున్నాను.. ‘రంగబలి’తో కచ్చితంగా బ్లాక్ బస్టర్ కొడుతున్నాం’’ అని హీరో నాగశౌర్య అన్నారు. పవన్ బాసంశెట్టి దర్శకత్వంలో నాగశౌర్య, యుక్తి తరేజ జంటగా నటించిన చిత్రం ‘రంగబలి’. ఎస్ఎల్వీ సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 7న విడుదలకానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకకి యాంకర్ సుమ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నాగశౌర్య మాట్లాడుతూ–‘‘ఇప్పటి వరకూ సుధాకర్‌గారికి వచ్చిన లాభాల కంటే ‘రంగబలి’ కి వచ్చే లాభాలు ఎక్కువగా ఉంటాయి. ‘రంగబలి’తో పవన్ చాలా పెద్ద డైరెక్టర్ అవుతారు’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో నాగశౌర్య హీరోయిజం, ఎమోషన్ కొత్తగా చూస్తారు. సుధాకర్‌గారు ఎక్కడ రాజీపడకుండా తీశారు’’ అన్నారు పవన్ బాసంశెట్టి. ‘‘రంగబలి’ టీమ్‌తో పని చేయడాన్ని చాలా ఎంజాయ్ చేశాను’’ అన్నారు యుక్తి తరేజ. ‘‘రంగబలి’ పెద్ద విజయం సాధించాలి’’ అన్నారు డైరెక్టర్స్ కిషోర్ తిరుమల, శ్రీకాంత్ ఓదెల. -
నాగశౌర్య 'రంగబలి' మూవీ ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
మీమర్స్‌కి ఫుల్ స్టఫ్ ఇస్తున్న 'దసరా' విలన్
మార్కెట్లోకి కొత్త సరుకొచ్చింది! అవును మీరు కరెక్టేగానే విన్నారు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఎవరో ఒకరు ట్రెండ్ అవుతుంటారు. ముఖ్యంగా తెలుగు యాక్టర్స్ ఏదో ఓ పనిచేస్తారు. దానికి సంబంధించిన వీడియో బయటకొస్తుంది. మీమర్స్ అలెర్ట్ అయిపోతారు. ఫన్నీగానే తెగ ట్రోల్ చేస్తారు. అలా ఇప్పుడు వాళ్లంతా 'దసరా' విలన్ మీద పడ్డారు. అతడివి పాత వీడియోలన్నీ బయటకు తీసి తెగ ఆడేసుకుంటున్నారు. ఇంతకీ ఈ నటుడు ఏం చేశాడు? (ఇదీ చదవండి: రామ్‌చరణ్-ఉపాసన కూతురు పేరుకి అర్థమేంటో తెలుసా?) ఎవరితడు.. బ్యాక్‌గ్రౌండ్? షైన్ టామ్ చాకో.. కేరళలోని త్రిసూర్‌లో పుట్టి పెరిగాడు. కామర్స్ లో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఇండస్ట్రీలోకి వచ్చాడు. కమల్ అనే దర్శకుడి దగ్గర దాదాపు పదేళ్లపాటు అంటే 2002-12 మధ్య పనిచేశాడు. ఇదే డైరెక్టర్ తీసిన 'గడ్డమ్మ' మూవీతో నటుడిగా మారాడు. యాక్టర్ గా రెండు మూడేళ్లపాటు చిన్న చిన్న పాత్రలు చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఓ వైపు విలన్ గా చేస్తూ, మరోవైపు లీడ్ రోల్ లో నటిస్తూ తనకంటా ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. తెలుగులో కూడా లాక్డౌన్లో తెలుగు ప్రేక్షకులు ఓటీటీల్లో మలయాళ సినిమాలు చాలా చూశారు. అలా షైన్ టామ్ చాకో మనవాళ్లకు పరిచయమే. గతేడాది విడుదలైన విజయ్ 'బీస్ట్'తో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ ఏడాది మార్చిలో వచ్చిన 'దసరా'తో తెలుగులోకి వచ్చాడు. ప్రస్తుతం ఇతడు విలన్ గా చేసిన 'రంగబలి' విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు ఎన్టీఆర్ 'దేవర'లోనూ కీలకపాత్రలో నటిస్తున్నట్లు ఇతడే బయటపెట్టాడు. (ఇదీ చదవండి: 'ఆదిపురుష్' ఓటీటీ రిలీజ్.. అనుకున్న టైమ్ కంటే ముందే?) విచిత్రమైన ప్రవర్తన! నటుడిగా షైన్ టాక్ చాకోని వంకపెట్టడానికి ఏం లేదు. విలన్‌గా అదరగొట్టేస్తున్నాడు. సినిమాల్లో ఇతడి పాత్రలో సీరియస్ గా భయపెట్టేలా ఉండోచ్చేమో కానీ బయటమాత్రం ఇతడు ఫుల్ కామెడీ చేస్తున్నాడు. ఈ మధ్య 'రంగబలి' ప్రమోషన్స్ లో లేడీ యాంకర్ షర్ట్ బాగుందని చెప్పగనే.. అక్కడే విప్పి ఇచ్చేయడానికి రెడీ అయిపోయాడు. ఈ వీడియో దెబ్బకు గతంలో షైన్ ఫన్నీగా ప్రవర్తించిన వీడియోలన్నీ బయటకొస్తున్నాయి. ఆ యాంకర్‌తో ఎక్కువగా తెలుగులో ఒక్క వీడియోతో షైన్ టామ్ చాకో వైరల్ అయ్యాడు గానీ మలయాళంలో షైన్- లేడీ యాంకర్ పార్వతి బాబుది హిట్ కాంబినేషన్. వీళ్లిద్దరూ కలిసి వీడియో చేశారంటే ఫుల్ ఎంటర్ టైన్మెంట్ గ్యారంటీ. ఇప్పుడు తెలుగులోనూ అలానే ఫన్ జనరేట్ చేస్తూ మీమర్స్‌కి ఫుల్ స్టప్ ఇస్తున్నాడు. ఇతడిని చూస్తున్న నెటిజన్స్.. 'ఎవర్రా బాబు నువ్వు, ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్' అని కామెంట్స్ చేస్తున్నారు. దిగువన అతడి వీడియోలు ఉన్నాయి. మీరు ఓసారి చూసేయండి. Vurey vid evad ra ila unadu 😂🤣🤣 Koru mawoo jagrathaa 🤣#Devara #NTR30 pic.twitter.com/XKRBTAqEk9 — Gsv VamsiTarak (@GsvVamsi) June 28, 2023 Tom bayya swag bolthe 😎 pic.twitter.com/ZRpEgYK6Me — Rishi (@Telugu_abbayii) June 28, 2023 Tweets are crazy on Actor #ShineTomChacko especially in Telugu audience on his off screen mannerisms..#Devarapic.twitter.com/wx76dF3Cc9 — Arjun 🪓 (@ArjunVcOnline) June 29, 2023 (ఇదీ చదవండి: సీఎం కొడుకు సినిమా హిట్ అయ్యిందా?)