'Rangabali' Movie OTT Release Date, OTT Platform Confirmed - Sakshi
Sakshi News home page

Rangabali OTT: నాగశౌర్య సినిమా.. నెల తిరక్కుండానే ఓటీటీలోకి

Published Fri, Jul 28 2023 2:47 PM | Last Updated on Fri, Jul 28 2023 3:01 PM

Rangabali Movie OTT Release Date  - Sakshi

Rangabali Movie OTT: ఈ మధ్య కొత్త సినిమాలు మరీ త్వరగానే ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. 'సామజవరగమన', 'నాయకుడు' లాంటి మూవీస్ అయితే థియేటర్లలో ప్రేక్షకుల్ని అద్భుతంగా అలరించాయి. హిట్ అనిపించుకున్నాయి. కానీ నెల తిరగకుండానే ఇప్పుడు ఓటీటీల్లోక వచ్చేశాయి. దీని రూట్‌లో మరో తెలుగు చిత్రం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది.

(ఇదీ చదవండి: బ్రో మూవీ ఓటీటీలోకి వచ్చేది అప్పుడే!)

ఆ రోజు నుంచి ‍స్ట్రీమింగ్
నాగశౌర్య హీరోగా నటించిన 'రంగబలి' జూలై 7న థియేటర్లలోకి వచ్చింది. ఓ మాదిరి అంచనాలతో రిలీజైన ఈ చిత్రం.. బాక్సాఫీస్ దగ్గర ఫెయిలైంది. ఫస్టాప్‌లో కామెడీ బాగానే వర్కౌట్ అయినప్పటికీ.. సెకండాఫ్ తేలిపోవడంతో పెద్దగా కలెక్షన్స్ దక్కించుకోలేకపోయింది. ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ హక్కులు సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్.. ఆగస్టు 4 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ప్రకటించింది.

కథేంటి?
శౌర్య అలియాస్ షో(నాగశౌర్య) రాజవరం అనే ఊరిలో ఆవారాగా తిరిగే కుర్రాడు. కొన్ని అనుకోని పరిస్థితుల వల‍్ల వైజాగ్ వెళ్తాడు. అక్కడ మెడికల్ స్టూడెంట్ అయిన సహజ (యుక్తి తరేజా)తో లవ్‌లో పడతాడు. పెళ్లి కోసం ఆమె తండ్రిని ఒప్పించేందుకు సహజ ఇంటికెళ్తాడు. అక్కడ శౌర్యకు ఓ విషయం తెలుస్తుంది. ఇంతకీ శౌర్య ఊరిలోని రంగబలి సెంటర్‌కు అతడి పెళ్లికి సంబంధం ఏంటి? చివరకు ఏమైందనేదే స్టోరీ.

(ఇదీ చదవండి: BRO Movie Review: ‘బ్రో’మూవీ రివ్యూ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement