Naga Shaurya
-
నా రెస్టారెంట్ లో jr ఎన్టీఆర్ కి బాగా నచ్చిన ఫుడ్ ఇదే..
-
సినిమా వాళ్ళు చాలా మంది వస్తారు. నాగ సౌర్య సపోర్ట్ చేయలేదు..
-
బ్యాడ్ బాయ్‌గా వస్తోన్న నాగ శౌర్య.. ఆసక్తిగా ది డెవిల్స్ ఛైర్ పోస్టర్!
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య నటిస్తోన్న తాజా చిత్రం 'బ్యాడ్ బాయ్ కార్తీక్'. ఈ మూవీ విధి హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రానికి రామ్ దేశినా (రమేష్) దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్‌పై శ్రీనివాసరావు చింతలపూడి నిర్మిస్తున్నారు. ఇవాళ నాగశౌర్య పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.ఈ చిత్రానికి 'బ్యాడ్ బాయ్ కార్తీక్' అనే పవర్ ఫుల్ టైటిల్ ఖరారు చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్ చూస్తే హీరో నుదిటిపై రక్తంతో కూడిన "మూడు గోవింద నామాలు", చేతులపై రక్తపు మరకలు కనిపిస్తున్నాయి. ఈ మూవీ ఫుల్ యాక్షన్ థ్రిల్లర్‌గానే తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో సముద్రఖని, సీనియర్ నరేష్, సాయికుమార్, వెన్నెల కిషోర్, మైమ్ గోపి, శ్రీదేవి విజయ్ కుమార్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు హారిస్ జయరాజ్ సంగీతమందిస్తున్నారు.ది డెవిల్స్ ఛైర్ ఫస్ట్ లుక్ పోస్టర్..జబర్దస్త్ అభి, ఛత్రపతి శేఖర్, స్వాతి మందల్ ప్రధాన పాత్రల్లో వస్తోన్న చిత్రం ది డెవిల్స్ చైర్ (The Devils chair). ఈ సినిమాను గంగ సప్త శిఖర దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని బాబీ ఫిలిమ్స్, ఓం సాయి ఆర్ట్స్, సీఆర్ఎస్ క్రియేషన్స్ బ్యానర్లపై కేకే చైతన్య, వెంకట్ దుగ్గి రెడ్డి, చంద్ర సుబ్బగారి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం మొదటి పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.ఈ సందర్భంగా దర్శకుడు గంగ సప్త శిఖర మాట్లాడుతూ..'సరైన హారర్ చిత్రం వచ్చి చాలా రోజులు అయింది. తెలుగు ప్రేక్షకులు కూడా మంచి హారర్ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు. హారర్ చిత్రాలు ఇష్టపడే ప్రేక్షకులకు ది డెవిల్స్ చైర్ పర్ఫెక్ట్ సినిమా. సరికొత్త పాయింట్‌తో అద్భుతంగా ఉండే చిత్రాన్ని రూపొందిస్తున్నాం. మా చిత్రం మంచి హిట్ అవ్వాలి" అని కోరుకుంటున్నట్లు తెలిపారు.అనంతరం చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ..'ది డెవిల్స్ చైర్ చిత్రం మంచి కంటెంట్ ఉన్న చిత్రం. అద్భుతమైన ఏఐ టెక్నాలజీతో సరికొత్త కథతో నిర్మిస్తున్నాం. ప్రతి సీన్ అద్భుతంగా రిచ్ విజువల్స్ తో రూపొందిస్తున్నాం. షూటింగ్ అంతా పూర్తయింది. మా చిత్రాన్ని ఫిబ్రవరి చివరి వారంలో విడుదల చేస్తాం" అని తెలిపారు. -
నాగశౌర్యకు ఆస్తమా! వాడి కూతుర్ని వీడియో కాల్లో చూస్తున్నా: హీరో తల్లి భావోద్వేగం
రోజూ ఇంట్లో ఉండి ఏదో ఒకటి అనుకునే బదులు వారానికి ఒకసారి కలుసుకుని హ్యాపీగా ఉందాం.. సంసారం ఒక చదరంగం సినిమాలో ఈ మాట నా మనసుకు కనెక్ట్ అయిందంటోంది హీరో నాగశౌర్య తల్లి ఉషా ముల్పురి. నాగశౌర్య పెళ్లి తర్వాత వేరే కాపురం పెట్టాడు. పెళ్లవగానే కొడుకు, కోడలు వేరుగా ఉండటం గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి లోనైంది ఉషా.చిన్నప్పుడే అన్నాడుతాజాగా ఉషా (Usha Mulpuri) ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నాగశౌర్య (Naga Shourya) చిన్నప్పుడే.. పెళ్లయ్యాక మాత్రం నేను కలిసుండను అనేవాడు. ఎందుకురా అంటే ఇద్దరు మంచివాళ్లు ఒక్క దగ్గర ఉండకూడదని చెప్పేవాడు. మొదటి నుంచి అదే అనుకున్నాం కాబట్టి పెళ్లయ్యాక కొడుకు-కోడలు వేరే ఇంట్లో ఉంటున్నారు. నాగశౌర్యకు గతేడాది పాప పుట్టింది. గత నవంబర్లోనే మనవరాలి ఫస్ట్ బర్త్‌డే సెలబ్రేట్ చేశాం. తనను చాలా మిస్ అవుతున్నాను. వీడియో కాల్లో చూస్తుంటాను. బాధగా ఉంటుందిఅదొక్కటే బాధేస్తుంది. ఇటీవల తను నాతో పాటు నెలన్నర రోజులుంది. రెస్టారెంట్ పనుల వల్ల బిజీగా ఉండటంతో తన దగ్గరకు తరచూ వెళ్లలేకపోతున్నాను. చాలామంది పిల్లలే ప్రపంచంగా బతుకుతారు. వాళ్లు పెళ్లిళ్లు చేసుకుని వెళ్లిపోయాక జీవితం శూన్యంగా మారుతుంది. పిల్లల పెళ్లయ్యాక మనమెలా ఉండాలనేది కూడా యూట్యూబ్‌లో చూసి నేర్చుకున్నాను. ఎక్కువ మాట్లాడకూడదు, ఎవరికీ ఏ సలహా ఇవ్వకూడదు, వాళ్లేం చెప్పినా మనం ఓకే చెప్పాలి.. ఇవన్నీ తెలుసుకుని అలవాటు చేసుకున్నాను.చదవండి: తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పిన దిల్ రాజుశౌర్య కంటే పెద్దోడే నచ్చుతాడుఅలాగే మనం వద్దని చెప్పినంత మాత్రాన పిల్లలు వాళ్లు చేసే పనిని ఆపేయరు. కాబట్టి మనం.. సరేనని తలూపితే మన గౌరవం నిలబడుతుంది. నేను అదే పాటిస్తున్నాను. శౌర్య.. ఎప్పుడు కూడా తన మనసులో మాట చెప్పడు. చిన్నప్పటి నుంచి వాడు అలాగే ఉన్నాడు. సంతోషంగా ఉన్నప్పుడు ఏదీ చెప్పకపోయినా పర్లేదు కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు చెప్పాలి. అప్పుడే కదా మనం ఏదో ఒకటి చేయగలుగుతాం. నా పెద్దబ్బాయి చిన్న విషయమైనా నాతో పంచుకుంటాడు. అందుకనే నాకు శౌర్య కంటే పెద్ద కుమారుడే నచ్చుతాడు.ఇలాంటి రోజు వస్తుందని తెలుసుచిన్నప్పుడు ఇద్దరికీ ఆస్తమా ఉండేది. ఆ కారణంగా ఎక్కువగా స్కూలుకు వెళ్లేవారు కాదు. ఇంట్లోనే చదివించేదాన్ని. రోజంతా వారితోనే ఉండేదాన్ని. అలాంటిది పిల్లల పెళ్లయ్యాక ఇల్లంతా బోసిపోయినట్లనిపించింది. ఇలాంటి రోజొకటి వస్తుందని తెలుసు. దాన్నుంచి బయటపడటానికి కొంత సమయం పట్టింది అని ఉషా చెప్పుకొచ్చింది.చదవండి: గేమ్ ఛేంజర్ సినిమాకు షాక్.. ఇకపై అది లేనట్లే! -
యాక్షన్ స్టార్ట్
నాగశౌర్య హీరోగా నటిస్తున్న కొత్త సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. దర్శకులు గౌతమ్ వాసుదేవ్ మీనన్, వైవీఎస్ చౌదరి, శ్రీను వైట్ల వద్ద దర్శకత్వం విభాగంలో పని చేసిన రామ్ దేశిన (రమేశ్) ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమవుతున్నారు. శ్రీ వైష్ణవి ఫిల్మ్స్‌పై శ్రీనివాసరావు చింతలపూడి ఈ సినిమా నిర్మిస్తున్నారు.‘‘యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న చిత్రమిది. పలు విజయవంతమైన చిత్రాలకు సహ రచయితగా చేసిన రామ్ దేశిన అద్భుతమైన కథను సిద్ధం చేశారు. శనివారమే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. రాజేంద్ర ప్రసాద్, సాయికుమార్, సముద్ర ఖని, మైమ్ గోపి తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి కెమెరా: రసూల్ ఎల్లోర్, సంగీతం: హారిస్ జైరాజ్. -
జైలులో హీరో దర్శన్.. ఇతడికి సపోర్ట్‌గా టాలీవుడ్ హీరో
హత్య కేసులో దర్శన్ అరెస్ట్ అయి దాదాపు 20 రోజులు అవుతోంది. తన ప్రేయసి పవిత్ర గౌడకు అసభ్య సందేశాలు, వీడియోలు పంపాడనే కారణంతో రేణుకాస్వామిని హీరో దర్శన్ హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో పోలీసులు ఇతడితో పాటు ఏకంగా 17 మంది అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం విచారణ జరుగుతోంది. కానీ బయటకొస్తున్న రోజుకో ఫొటో, న్యూస్ దర్శన్ అంటే అసహ్యం కలిగేలా చేస్తోంది. ఇలాంటి టైంలో దర్శన్‌కి సపోర్ట్ చేస్తూ టాలీవుడ్ హీరో నాగశౌర్య పోస్ట్ పెట్టడం చర్చనీయాంశమైంది.'చనిపోయిన వ్యక్తి (రేణుకాస్వామి) కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. అయితే ఈ కేసులో అందరూ అప్పుడే ఓ అభిప్రాయానికి వచ్చేయడం నాకు చాలా నచ్చేలేదు. ఎందుకంటే దర్శన్ అన్న ఎవరికీ ఎలాంటి హానీ తలపెట్టే వ్యక్తి కాదు. కలలో కూడా అలాంటి పనిచేయరు. ఇతరులకు సహాయం చేసే విషయంలో ఆయన ఎంత మంచివాడో పరిచయమున్న వాళ్లకు తెలుసు. చాలామందికి కష్టకాలంలో తోడున్నాడు. కానీ నేను ఈ వార్తల్ని అస్సలు నమ్మలేకపోతున్నాను. న్యాయ వ్యవస్థపై నాకు నమ్మకముంది. త్వరలోనే నిజం బయటపడుతుంది'(ఇదీ చదవండి: పేరు మార్చుకున్న ప్రభాస్.. 'కల్కి'లో ఇది గమనించారా?)'ఈ కేసు వల్ల మరో కుటుంబం (దర్శన్ ఫ్యామిలీ) కూడా బాధపడుతోందని మనం గుర్తుంచుకోవాలి. వాళ్లకు ఇలాంటి పరిస్థితుల్లో కాస్త ప్రైవసీ కావాలి. మీపై నాకు నమ్మకముంది అన్న. మీరు అమాయకుడు అనేది తేలుతుంది. అసలు నేరస్థుడు ఎవరనేది త్వరలోనే బయటపడుతుంది' అని నాగశౌర్య ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.దర్శన్ నిందితుడు అని ఇంకా నిర్ధారణ కాలేదు. కానీ దొరికిన ఆధారాలు బట్టి అభిమానిని ఎంత దారుణంగా హత్య చేశాడో ప్రతి ఒక్కరికీ అర్థమవుతోంది. ఇలాంటి టైంలో హీరో నాగశౌర్య పోస్ట్ పెట్టడం కరెక్ట్ కాదని పలువురు నెటిజన్లు అంటున్నారు. ఎంత అభిమానం ఉన్నాసరే కొన్నిసార్లు దాన్ని దాచుకోవాల్సి ఉంటుంది. ఇలా రాంగ్ టైంలో పోస్ట్ పెడితే లేనిపోని ట్రోల్స్ తప్ప ఇంకేం ఉండవనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.(ఇదీ చదవండి: ఎంతోమంది దర్శన్‌ను మోసం చేశారు.. ఆయనెవర్నీ మోసగించలేదు) View this post on Instagram A post shared by Naga Shaurya (@actorshaurya) -
పెళ్లయ్యాక నాగశౌర్య వేరేకాపురం పెట్టాడు: హీరో తల్లి
టాలీవుడ్ హీరో నాగశౌర్య గతేడాది పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. కర్ణాటకకు చెందిన ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టిని ఆయన పెళ్లాడారు. బెంగళూరులోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో వీరి వివాహం ఘనంగా జరిగింది. అయితే పెళ్లయిన కొంతకాలానికే శౌర్య వేరు కాపురం పెట్టాడట! ఈ విషయాన్ని అతడి తల్లి బయటపెట్టింది. కూతురిలా చూసుకుంటా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాగశౌర్య తల్లి ఉషా ప్రసాద్ మాట్లాడుతూ.. 'అనూష నాకు మూడేళ్ల క్రితమే తెలుసు. ఆమెను కోడలిగా కాకుండా కూతురిలా చూసుకుంటాను. నన్ను మమ్మా అని పిలుస్తుంది. నా భర్తను డాడీ అని పిలుస్తుంది. తను చాలా మంచి అమ్మాయి. తనకు చాలా మెచ్యూరిటీ ఉంది. శౌర్య-అనూష మేడ్ ఫర్ ఈచ్ అదర్. పెద్ద కోడలు అమెరికాలో సెటిలైంది. యాపిల్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. చిన్న కోడలు అనూష ఇంటీరియర్ డిజైనర్‌గా ఫుల్ బిజీగా ఉంది. ఎంత బిజీగా ఉన్న అన్ని పనులను బాగా చక్కబెట్టుకుంటుంది. అది ఎప్పుడో అనుకున్నాం.. నాగశౌర్య-అనూష పెళ్లవగానే వేరే కాపురం పెట్టారు. దూరంగా ఉండి అప్పుడప్పుడు కలుసుకుంటేనే బాగుంటుంది. ఇది ఇప్పుడనుకున్నది కాదు.. పిల్లలు పుట్టినప్పుడు, పెరిగినప్పుడే అలా దూరం ఉండాలని అనుకున్నాం.. ఇప్పుడున్న జనరేషన్‌కు ఎవరి స్వాతంత్య్రం వారికిస్తే బాగుంటుంది. ఇది మాకు మొదటి నుంచీ ఉన్న అభిప్రాయం.. అంతే! ఇందులో అంతగా ఆలోచించాల్సింది ఏమీ లేదు' అని చెప్పుకొచ్చింది. కాగా ఉషా ప్రసాద్.. నిర్మాతగా నాగశౌర్యతో నాలుగు సినిమాలు చేసింది. ఇటీవల రెస్టారెంట్ బిజినెస్ సైతం ప్రారంభించింది. చదవండి: విజయకాంత్ అంత్యక్రియలు.. విజయ్‌పైకి చెప్పు విసిరిన వ్యక్తి.. -
'రంగబలి' ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఆ రోజే
Rangabali Movie OTT: ఈ మధ్య కొత్త సినిమాలు మరీ త్వరగానే ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. 'సామజవరగమన', 'నాయకుడు' లాంటి మూవీస్ అయితే థియేటర్లలో ప్రేక్షకుల్ని అద్భుతంగా అలరించాయి. హిట్ అనిపించుకున్నాయి. కానీ నెల తిరగకుండానే ఇప్పుడు ఓటీటీల్లోక వచ్చేశాయి. దీని రూట్లో మరో తెలుగు చిత్రం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. (ఇదీ చదవండి: బ్రో మూవీ ఓటీటీలోకి వచ్చేది అప్పుడే!) ఆ రోజు నుంచి స్ట్రీమింగ్ నాగశౌర్య హీరోగా నటించిన 'రంగబలి' జూలై 7న థియేటర్లలోకి వచ్చింది. ఓ మాదిరి అంచనాలతో రిలీజైన ఈ చిత్రం.. బాక్సాఫీస్ దగ్గర ఫెయిలైంది. ఫస్టాప్‌లో కామెడీ బాగానే వర్కౌట్ అయినప్పటికీ.. సెకండాఫ్ తేలిపోవడంతో పెద్దగా కలెక్షన్స్ దక్కించుకోలేకపోయింది. ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ హక్కులు సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్.. ఆగస్టు 4 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. కథేంటి? శౌర్య అలియాస్ షో(నాగశౌర్య) రాజవరం అనే ఊరిలో ఆవారాగా తిరిగే కుర్రాడు. కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల వైజాగ్ వెళ్తాడు. అక్కడ మెడికల్ స్టూడెంట్ అయిన సహజ (యుక్తి తరేజా)తో లవ్‌లో పడతాడు. పెళ్లి కోసం ఆమె తండ్రిని ఒప్పించేందుకు సహజ ఇంటికెళ్తాడు. అక్కడ శౌర్యకు ఓ విషయం తెలుస్తుంది. ఇంతకీ శౌర్య ఊరిలోని రంగబలి సెంటర్‌కు అతడి పెళ్లికి సంబంధం ఏంటి? చివరకు ఏమైందనేదే స్టోరీ. (ఇదీ చదవండి: BRO Movie Review: ‘బ్రో’మూవీ రివ్యూ) -
రంగబలి మూవీ సక్సెస్ మీట్ ఫోటోలు
-
ఛలో తర్వాత రంగబలి
‘‘రంగబలి’ని ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. నాకు ‘ఛలో’ తర్వాత ‘రంగబలి’ మరో బ్లాక్ బస్టర్ ఇచ్చింది. మంచి కథతో సినిమా తీసిన పవన్‌కి, ఈ జర్నీలో సపోర్ట్ చేసిన సుధాకర్‌కి థ్యాంక్స్’’ అన్నారు హీరో నాగశౌర్య. పవన్ బాసంశెట్టి దర్శకత్వంలో నాగశౌర్య, యుక్తి తరేజ జంటగా నటించిన చిత్రం ‘రంగబలి’. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ మూవీ శుక్రవారం (జులై 7న) విడుదలైంది. ఈ సందర్భంగా శనివారం సక్సెస్ మీట్లో పవన్ బాసంశెట్టి మాట్లాడుతూ– ‘‘మా సినిమా కలెక్షన్స్ బాగున్నాయి’’ అన్నారు. -
ఎవరినైనా బాధపెట్టి ఉంటే సారీ: నాగశౌర్య
హీరో నాగశౌర్య, హీరోయిన్ యుక్తి తరేజ జంటగా నటించిన చిత్రం రంగబలి. పవన్ బాసంశెట్టి డైరెక్ట్ చేసిన ఈ సినిమా జూలై 7న విడుదలైంది. సినిమా రిలీజవడానికి ముందు చిత్రయూనిట్ వేరే లెవల్లో ప్రమోషన్స్ చేశారు. టాలీవుడ్లో సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసే పలువురు ప్రముఖులను అనుకరిస్తూ స్పూఫ్ చేశారు. కమెడియన్ సత్య చేసిన ఈ స్పూఫ్ వీడియోకు విశేష స్పందన వచ్చింది. కానీ కొందరు మాత్రం హర్టయినట్లు తెలుస్తోంది. తాజాగా ఇదే విషయాన్ని ఓ జర్నలిస్టు హీరో నాగశౌర్య దృష్టికి తీసుకెళ్లాడు. మీడియా మీద సెటైర్ వేయాలన్న ఆలోచన ఎవరిది? అని అడిగాడు. దీనికి నాగశౌర్య స్పందిస్తూ.. 'మీడియా, మేము ఒకటే ఫ్యామిలీ. మేమైతే అలాగే అనుకుంటున్నాం. అదే మీడియా వాళ్లు చంద్రబాబు, కేసీఆర్‌లను డూప్‌లు పెట్టి వీడియోలు చేస్తారు. మేము సినిమా తీసి దాన్ని ప్రమోట్ చేయడానికి ఎవరినీ హర్ట్ చేయకుండా మీ అందరికీ తెలిసిన వ్యక్తులను సెలక్ట్ చేసుకున్నాం. ఒక హీరోను వాళ్లు తమదైన శైలిలో ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉంటుందని సరదాగా చూపించాం. అంతేతప్ప ఎవరినీ ఎగతాళి చేయలేదు. ఇది ముందుగా అనుకుని కూడా చేయలేదు. ఒకవేళ దీనివల్ల ఎవరైనా హర్ట్ అయితే నన్ను క్షమించండి. ఎవరి మీదైతే స్పూఫ్ చేశామో వాళ్లేమైనా హర్ట్ అయ్యారేమో అని అడిగి తెలుసుకున్నాం. చాలామంది ఎంజాయ్ చేశామన్నారు. కానీ ఒకరిద్దరు హర్ట్ అయ్యారంటూ వేరే ఎవరో ప్రచారం చేయడం వల్లే అది ఫేమస్ అయింది తప్ప ఎవర్నీ హర్ట్ చేయలేదు, ఎవరూ హర్ట్ అవలేదు' అని చెప్పుకొచ్చాడు. చదవండి: నటనే రాదు కానీ స్టార్ హీరో... ప్రభాస్‌పై అనుచిత వ్యాఖ్యలు -
Rangabali Review: 'రంగబలి' సినిమా రివ్యూ
టైటిల్: రంగబలి నటీనటులు: నాగశౌర్య, యుక్తి తరేజా, సత్య, షైన్ టామ్ చాకో తదితరులు నిర్మాణ సంస్థ: SLV సినిమాస్ నిర్మాత: సుధాకర్ చెరుకూరి దర్శకత్వం: పవన్ బాసంశెట్టి సంగీతం: పవన్ సీహెచ్ సినిమాటోగ్రఫీ: దివాకర్ మణి, వంశీ పచ్చిపులుసు ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ విడుదల తేదీ: 07-07-2023 హీరో నాగశౌర్య పేరు చెప్పగానే మంచి క్లాస్ సినిమాలు గుర్తొస్తాయి. అలానే చాలాకాలం నుంచి సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. 'ఛలో' తర్వాత ఆ స్థాయి సక్సెస్ దక్కట్లేదు. ఇప్పుడు 'రంగబలి' అనే కమర్షియల్ ఎంటర్టైనర్తో బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నామని ప్రీ రిలీజ్ ఈవెంట్లో గట్టిగా చెప్పుకొచ్చాడు. మరి ఈ మూవీ నాగశౌర్య చెప్పినట్లు ఉందా? సినిమా టాక్ ఏంటనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం. కథేంటి? శౌర్య(నాగశౌర్య)ది రాజవరం. ఊరిలో బేవార్స్ గా తిరుగుతూ ఎక్కువగా షో చేస్తుంటాడు అందుకే అందరూ ఇతడిని 'షో' అని పిలుస్తుంటారు. ఊరంటే పిచ్చి ఇష్టం. చచ్చినా బతికినా సొంతూరిలోనే అనేది శౌర్య మనస్తత్వం. అలాంటిది ఓ పనిమీద వైజాగ్ వెళ్తాడు. అక్కడ సహజ(యుక్తి తరేజా)ని చూసి లవ్ లో పడతాడు. ఆమె కూడా ఇతడిని ప్రేమిస్తుంది. దీంతో పెళ్లి గురించి మాట్లాడేందుకు శౌర్య.. సహజ తండ్రి కలవడానికి వెళ్తాడు. తనది రాజవరం అని చెబుతాడు. తన ఊరిలోని 'రంగబలి' సెంటర్ ప్రస్తావన వస్తుంది. దీంతో ఆయన పెళ్లికి నో చెబుతాడు. ఇంతకీ ఆ సెంటర్‌తో శౌర్య పెళ్లికి వచ్చిన చిక్కేంటి? చివరకు శౌర్య ఏం చేశాడు? అనేదే మెయిన్ స్టోరీ. ఎలా ఉందంటే? తెలుగు కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమా అనగానే.. ఎలా ఉంటుందా అనేది మనకు ఓ ఐడియా ఉంది. దానికి ఏ మాత్రం అటు ఇటు కాకుండా 'రంగబలి' తీశారు. ట్రైలర్ లో చెప్పినట్లు.. బయట ఊరిలో బానిసలా బతకడం కంటే సొంతూరిలో సింహంలా బతకాలనేది హీరో క్యారెక్టరైజేషన్. ఫస్టాప్ మొదలవడమే మెల్లగా స్టోరీలోకి వెళ్లిపోయారు. మంచి ఎలివేషన్‌తో హీరో ఎంట్రీ. ఆ వెంటనే ఫైట్. ఆ తర్వాత హీరో చుట్టూ ఉండే వాతావరణాన్ని సీన్ బై సీన్ చూపించారు. తండ్రి విశ్వం(గోపరాజు రమణ)కి ఊరిలో మెడికల్ షాప్. కొడుకు శౌర్యకి దాన్ని అప్పగించాలని ఆయన ఆశ. మనోడేమో ఊరిలో కుర్రాళ్లతో బేవార్స్ గా తిరుగుతుంటాడు. ఓ పనిమీద శౌర్య వైజాగ్ వెళ్లడం, అక్కడ హీరోయిన్ తో హీరో లవ్ లో పడటం, పెళ్లికి ఆమె తండ్రి ఒప్పుకోకపోవడం ఇలా సీన్లన్నీ వెళ్తుంటాయి. అయితే ఇలాంటి సన్నివేశాల్ని ఎక్కడో చూశామే అనిపించినప్పటికీ ఫస్టాప్ మొత్తం హీరో అతడి ఫ్రెండ్ అగాధం క్యారెక్టర్ చేసే కామెడీతో అలా వెళ్లిపోతుంది. పెళ్లి కోసం హీరోయిన్ తండ్రి దగ్గరకు వెళ్లిన హీరోకు తన ఊరిలో 'రంగబలి' సెంటర్ వల్ల ప్రాబ్లమ్ వస్తుంది. ఇంతకీ ఆ సెంటర్ తో హీరోయిన్ తండ్రికి ఉన్న సమస్యేంటి? చివరకు అది పరిష్కారమైందా లేదా అనేదే తెలియాలంటే సినిమా చూడాల్సిందే. దర్శకుడు ఓ పాయింట్ చెప్పాలనుకున్నాడు. దాన్ని కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాగా తీశాడు. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఫస్టాప్ మొత్తాన్ని స్టోరీ సెట్ చేయడానికి ఉపయోగించుకున్నాడు. సెకండాఫ్ లో అసలు విషయాన్ని బయటపెట్టాడు. కానీ అది ఇప్పటికే ఎన్నో సినిమాల్లో చూసేసిన కథలా అనిపిస్తుంది. కరెక్ట్ గా చెప్పాలంటే ఏం కొత్తగా ఉండదు. క్లైమాక్స్ అయితే మరీ సిల్లీగా అనిపిస్తుంది. అప్పటివరకు మారని జనం.. హీరో 5 నిమిషాల స్పీచ్ ఇవ్వగానే మారిపోతారు. కొన్నేళ్ల ముందు వరకు ఈ తరహా స్టోరీలంటే ఓకే గానీ.. ఓటీటీలకు బాగా అలవాటు పడిపోయిన ఈ జమానాలో కూడా ఇలాంటి స్టోరీలా బాసూ! ఎవరెలా చేశారు? హీరో నాగశౌర్యకు ఇలాంటి పాత్రలు కొట్టిన పిండి. తనదైన ఈజ్‌తో యాక్టింగ్, కామెడీ, డ్యాన్సులు అలా చేసుకుంటూ వెళ్లిపోయాడు. యాక్షన్ హీరో కావాలనే ఆరాటం ఈ సినిమాలో బాగానే కనిపించింది. అవసరం లేకున్నా సరే కొన్నిచోట్ల బాడీని చూపించాడు. ఫైట్లు కూడా చేశాడు. స్టోరీకి తగ్గట్లు అవి కాస్త లాజిక్‌గా ఉండుంటే బాగుండేది. హీరోయిన్ యుక్తి తరేజాకు పెద్దగా స్కోప్ దక్కలేదు. హీరోతో లవ్ సీన్లు, రెండు మూడు పాటల్లో కనిపించింది. ఓ పాటలో అయితే కిస్, స్కిన్ షోతో రెచ్చిపోయింది! మిగిలిన వాళ్లలో సత్య గురించి కచ్చితంగా చెప్పుకోవాలి. ఫస్టాప్ ని తన కామెడీతో లాక్కొచ్చాడు. ఒక రకంగా చెప్పాలంటే ఫస్టాప్ కి సత్యనే హీరో. లేకపోయింటే సినిమా బలైపోయేది! గోపరాజు రమణ హీరో తండ్రిగా నటించి ఆకట్టుకున్నాడు. సత్య, గోపరాజు రమణ పాత్రలకు ఫస్టాప్ లో దొరికిన స్పేస్.. సెకండాఫ్ లోనూ ఉండుంటే బాగుండేది. మలయాళ నటుడు షైన్ టామ్ చాకో.. ఇందులో విలన్‌గా చేశాడు. అతడి పాత్ర పరిచయం ఓకే కానీ ఎండింగ్ పేలవంగా ఉంది. నటుడిగా ఏ మాత్రం ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. అసలు అతడి పాత్రకు సరైన సీన్లు ఒక్కటంటే ఒక్కటీ పడలేదు. సెకండాఫ్ లో శరత్ కుమార్, శుభలేఖ సుధాకర్ పర్వాలేదనిపించారు. మిగిలినవాళ్లు ఓకే. టెక్నికల్ విషయాలకొస్తే.. పవన్ సీహెచ్ అందించిన పాటలు పెద్దగా గుర్తుండవు. అవి కూడా సందర్భం లేకుండా వస్తుంటాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. నిర్మాణ విలువలు స్టోరీకి తగ్గట్లు ఉన్నాయి. రైటర్ అండ్ డైరెక్టర్ పవన్ బాసంశెట్టికి ఇది తొలి సినిమా. కొన్ని సీన్లనీ బాగానే హ్యాండిల్ చేశాడు గానీ సినిమా కథ, సీన్లపై ఇంకాస్త దృష్టి పెట్టి ఉండాల్సింది. ఓవరాల్‌గా చెప్పుకుంటే 'రంగబలి'.. కాస్త ఫన్ కాస్త ఎమోషన్ ఉండే రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైనర్. -చందు, సాక్షి వెబ్‌డెస్క్ -
Naga Shaurya Family Photos: హీరో నాగ శౌర్య ఫ్యామిలీ అరుదైన ఫోటోలు
-
అతనికి ఏ సాయం కావాలన్నా చేస్తానని ముందే చెప్పా: నాగశౌర్య
‘‘రంగబలి’ మంచి మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్. ఈ సినిమా చూస్తున్నంత సేపు సొంత ఊరు గుర్తొస్తుంది. ఆ ఊరిని మిస్ అవుతున్నామనే ఫీలింగ్ కలిగి ఓసారి ఊరెళ్లి వద్దామనే ఆలోచన కలుగుతుంది’’ అని హీరో నాగశౌర్య అన్నారు. పవన్ బాసంశెట్టి దర్శకత్వంలో నాగశౌర్య, యుక్తి తరేజ జంటగా నటించిన చిత్రం ‘రంగబలి’. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) విడుదలకానుంది. ఈ సందర్భంగా నాగశౌర్య చెప్పిన విశేషాలు. ► నటుడికి దర్శకుడు స్పేస్ ఇవ్వాలి. ఆ స్పేస్‌ని పవన్ నాకు ఇచ్చాడు. దర్శకునిగా తనకు తొలి సినిమా కాబట్టి ఏ విషయంలోనూ ఒత్తిడి తీసుకోవద్దని, ఏ సాయం కావాలన్నా చేస్తానని ముందే చెప్పాను. నా అనుభవాన్ని, పవన్ విజన్‌ని జోడించి అనుకున్నది అనుకున్నట్లుగా ‘రంగబలి’ లాంటి ఓ మంచి సినిమా తీశాం. ► ‘రంగబలి’ ప్రివ్యూ చూశాకే ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తానని దర్శక–నిర్మాతలకు చెప్పాను. చూసిన తర్వాత చాలా మంచి మూవీ చేశామనే అనుభూతి కలిగింది. అందుకే సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని ప్రేక్షకులకు నమ్మకంగా చెప్పగలుగుతున్నాను. సుధాకర్‌గారు ఎక్కడా రాజీ పడకుండా ‘రంగబలి’ తీశారు. ఈ మూవీతో పవన్‌కి మంచి పేరొస్తుంది. యుక్తి తరేజ మంచి యాక్టర్ అండ్ డ్యాన్సర్. తెలుగులో లీడింగ్ హీరోయిన్ అయ్యే అవకాశాలు తనకు చాలా ఉన్నాయి. పవన్ సంగీతం, నేపథ్య సంగీతాన్ని ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు. ► ఇప్పుడున్న పోటీలో హీరోలందరూ అద్భుతమైన నటన, డ్యాన్స్, యాక్షన్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో నేనూ ది బెస్ట్ ఇవ్వాలి. ఈ క్రమంలో ఒక్కోసారి గాయాలవుతాయి. కష్టపడితేనే సక్సెస్ వస్తుంది. ► ఏప్రొడక్షన్ హౌస్‌లోనైనా పది హిట్స్ పడిన తర్వాత కూడా ఒక సినిమా నిరాశ పరిస్తే దాన్ని రికవర్ చేయడం అంత తేలిక కాదు. సినిమా అంటే మాకు పిచ్చి.. ఫ్యాషన్‌తోనే మా ఐరా క్రియేషన్స్ బ్యానర్లో సినిమాలు నిర్మిస్తున్నాం తప్ప డబ్బులు సంపాదించుకోవాలని కాదు. మాకు సినిమా తప్పితే వేరేది తెలియదు. ప్రస్తుతానికి దర్శకత్వం ఆలోచన లేదు. నేను నటిస్తున్న 24వ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. -
‘గెటౌట్ ఆఫ్ మై స్టూడియో’.. నవ్వులు పూయిస్తున్న ‘రంగబలి’ కామెడీ ఇంటర్వ్యూ
నాగశౌర్య, యుక్తి తరేజ జంటగా నటించిన తాజా చిత్రం ‘రంగబలి’.పవన్ బాసంశెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎస్ఎల్వీ సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఈ నెల 7న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్‌ని వైవిధ్యంగా ప్లాన్ చేసింది చిత్రబృందం. కమెడియన్ సత్యతో కలిసి ఓ ఫన్ని ఇంటర్వ్యూని షూట్ చేసింది. టాలీవుడ్లో ఇంటర్వ్యూ చేసే పలువురు ప్రముఖులను అనుకరిస్తూ కమెడియన్ సత్య అలరించాడు. రిపోర్టర్ ‘గ్రాఫర్’గా, అలాగే లేడీ యాంకర్ ‘వల్లీ’గా సత్య చేసే సందడి నవ్వులు పూయిస్తోంది. ఈ ఫన్నీ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి. -
అల్లు అర్జున్‌తో డ్యాన్స్ చేయాలని ఉంది: హీరోయిన్
'నా మాతృ భాష హిందీ. ‘రంగబలి’ కోసం తెలుగులో పెద్ద పేరా గ్రాఫ్ డైలాగులు నేర్చుకొని చెప్పడం సవాల్‌గా అనిపించింది. ఈ విషయంలో డైరెక్షన్ టీమ్‌కి థ్యాంక్స్. అలాగే దర్శకుడు పవన్‌గారు స్క్రిప్ట్‌ని ముందే నాకు ఇవ్వడంతో కొంచెం సులభం అయింది' అని హీరోయిన్ యుక్తి తరేజ అన్నారు. నాగశౌర్య హీరోగా పవన్ బాసంశెట్టి దర్శకత్వం వహించిన చిత్రం ‘రంగబలి’. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ యుక్తి తరేజ మాట్లాడుతూ–'మాది హరియాణ. ఢిల్లీ యూనివర్శిటీలో గ్రాడ్యుయేషన్ చేశాను. ఆ తర్వాత మోడలింగ్ మొదలుపెట్టాను. అనంతరం యాక్టింగ్ ఆడిషన్స్ ఇచ్చాను. ‘లుట్ గయ్..’ అనే పాట మంచి పేరు తీసుకొచ్చింది. పవన్‌గారు ఆడిషన్ చేసి ‘రంగబలి’ కి ఎంపిక చేశారు. ఇందులో మెడికల్ స్టూడెంట్ సహజగా కనిపిస్తా. నా మొదటి సినిమాకే నాగశౌర్యగారితో పాటు మంచి నిర్మాణ సంస్థలో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. తెలుగులో నాకు ఇష్టమైన హీరో అల్లు అర్జున్. ఆయనతో కలిసి డ్యాన్స్ చేయాలని ఉంది. హీరోయిన్స్‌లో అనుష్క శెట్టిగారు అంటే ఇష్టం. ప్రస్తుతం తెలుగులో కొన్ని కథలు వింటున్నాను' అన్నారు. -
రంగబలితో బ్లాక్‌బస్టర్ కొడుతున్నాం
‘‘సుధాకర్‌గారు, నేను ఎప్పటి నుంచో ఓ సినిమా చేయాలనుకున్నాం. పవన్ చెప్పిన ‘రంగబలి’ కథ మా ఇద్దరికీ నచ్చడంతో ఈ మూవీ చేశాం. చాలా నమ్మకంగా చెబుతున్నాను.. ‘రంగబలి’తో కచ్చితంగా బ్లాక్ బస్టర్ కొడుతున్నాం’’ అని హీరో నాగశౌర్య అన్నారు. పవన్ బాసంశెట్టి దర్శకత్వంలో నాగశౌర్య, యుక్తి తరేజ జంటగా నటించిన చిత్రం ‘రంగబలి’. ఎస్ఎల్వీ సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 7న విడుదలకానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకకి యాంకర్ సుమ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నాగశౌర్య మాట్లాడుతూ–‘‘ఇప్పటి వరకూ సుధాకర్‌గారికి వచ్చిన లాభాల కంటే ‘రంగబలి’ కి వచ్చే లాభాలు ఎక్కువగా ఉంటాయి. ‘రంగబలి’తో పవన్ చాలా పెద్ద డైరెక్టర్ అవుతారు’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో నాగశౌర్య హీరోయిజం, ఎమోషన్ కొత్తగా చూస్తారు. సుధాకర్‌గారు ఎక్కడ రాజీపడకుండా తీశారు’’ అన్నారు పవన్ బాసంశెట్టి. ‘‘రంగబలి’ టీమ్‌తో పని చేయడాన్ని చాలా ఎంజాయ్ చేశాను’’ అన్నారు యుక్తి తరేజ. ‘‘రంగబలి’ పెద్ద విజయం సాధించాలి’’ అన్నారు డైరెక్టర్స్ కిషోర్ తిరుమల, శ్రీకాంత్ ఓదెల. -
నాగశౌర్య 'రంగబలి' మూవీ ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
శ్రీలీల బదులు రష్మిక.. సూపర్ ఛాన్స్ కొట్టేసింది!
టాలీవుడ్లో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు శ్రీలీల. ఒకటి, రెండు కాదు ఏకంగా 8 సినిమాలు ఈ బ్యూటీ చేతిలో ఉన్నాయి. మరో 2-3 చిత్రాలు అనౌన్స్మెంట్కి సిద్ధంగా ఉన్నాయి. నేషనల్ క్రష్ రష్మిక కూడా పలు సినిమాలు చేస్తున్నప్పటికీ ఈమెపై దర్శకనిర్మాతలు ఎందుకో అంతగా ఆసక్తి చూపించట్లేదు. ఇలాంటి సమయంలో ఈ భామలు ఇద్దరి గురించి హీరో నాగశౌర్య ఓ రహస్యాన్ని బయటపెట్టాడు. (ఇదీ చదవండి: అక్కడ ప్లేట్స్ కడిగిన స్టార్ హీరోయిన్.. కారణం అదే!) శ్రీలీల బదులు రష్మిక 'మేం మొదట 'ఛలో' సినిమాలో హీరోయిన్ గా శ్రీలీలనే అనుకున్నాం. ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నప్పుడు కూడా చివరివరకు శ్రీలీలనే హీరోయిన్. కానీ చివరి నిమిషంలో కొన్ని కారణాలతో శ్రీలీల స్థానంలో రష్మికని తీసుకోవాల్సి వచ్చింది' అని నాగశౌర్య చెప్పాడు. ఈ విషయం శ్రీలీల అభిమానుల్ని డిసప్పాయింట్ చేయగా, రష్మిక ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషీ చేస్తోంది. ఒకవేళ చేసుంటే? హీరో నాగశౌర్య చెప్పినట్లు శ్రీలీల.. 'ఛలో' సినిమాలో హీరోయిన్ గా చేసుంటే ఇప్పుడు దక్కుతున్న క్రేజ్ 2018లోనే వచ్చేది. ఈ పాటికే తెలుగుతో పాటు మిగతా భాషల్లోనూ నటించేసి, పాన్ ఇండియా స్టార్ అయిపోయిండేది. ఒకవేళ ఇలా జరుగుంటే రష్మిక మందన్న తెలుగు ఎంట్రీకి మరికాస్త సమయం పట్టుండేది. ఏదైతేనేం ప్రస్తుతం ఇద్దరు బ్యూటీస్ చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. (ఇదీ చదవండి: మెగాడాటర్ నిహారిక భర్త సంచలన పోస్ట్!) -
నాగశౌర్య 'రంగబలి' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఆ రోజు గొడవలో అమ్మాయిదే తప్పు: హీరో నాగశౌర్య
సాధారణంగా సెలబ్రిటీలు బయట కనిపించరు. ఒకవేళ కనిపించినా సరే ఎవరితోనూ మాట్లాడకుండా, వచ్చిన పని చూసుకుని వెళ్లిపోతారు. హీరో నాగశౌర్య మాత్రం ఈ ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్ లోని రోడ్డుపై ఓ అమ్మాయి-అబ్బాయి గొడవ పడుతుంటే మధ్యలోకి దూరాడు. వాళ్లకు ఏదో సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. అదేమంత పెద్దగా వర్కౌట్ కాలేదు. దీంతో ఎందుకులేరా బాబు అని వచ్చిన దారిలోనే వెళ్లిపోయాడు. ఇప్పుడు సందర్భం రావడంతో అసలు ఆ రోజు ఏం జరిగిందనేది బయటపెట్టాడు. (ఇదీ చదవండి: ట్రైలర్ బాగుంది కానీ ఆ బూతు డైలాగ్ ఎందుకు పెట్టారో?) ఏంటి గొడవ? ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన సంఘటన ఇది. హైదరాబాద్ రోడ్డుపై ఓ అబ్బాయి-అమ్మాయి గొడవ పడుతున్నారు. అటుగా కారులో వెళ్తున్న హీరో నాగశౌర్య.. ఈ గొడవ చూసి ఆగిపోయాడు. వాళ్లిద్దరితో మాట్లాడే ప్రయత్నం చేశాడు. కానీ పెద్దగా ఫలించలేదు. ఆ వీడియో అప్పట్లో తెగ వైరల్ అయింది. ఇది మూవీ ప్రమోషన్ కోసమని కొందరు అంటే.. ఏం జరిగిందా అని మరికొందరు ఆసక్తి చూపించారు. తాజాగా నాగశౌర్య హీరోగా నటించిన 'రంగబలి' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో ఇదే ప్రశ్న అడగ్గా... ఆరోజు అసలేం జరిగిందనేది నాగశౌర్య బయటపెట్టేశాడు. జరిగింది ఇదే! 'నేను పనిమీద కూకట్పల్లి నుంచి వెళ్తున్నాను. ఆ సమయంలో ఓ అబ్బాయి తన లవర్ ని కొట్టడం చూశాను. వెంటనే కారు ఆపి అతడి దగ్గరికి వెళ్లి ఎందుకు కొడుతున్నావ్, ఆమెకు సారీ చెప్పమని అడిగాను. అతడి రియాక్ట్ అయ్యేలోపు ఆ అమ్మాయి మాట్లాడింది. 'నా భాయ్ ఫ్రెండ్ నన్ను కొడతాడు, చంపుతాడు నీకేంటి?' అని నాకు కౌంటర్ వేసింది. ఆ అమ్మాయి అలా అడిగితే మనం మాత్రం ఏం చేస్తాం. ఆ రోజు జరిగిన సంఘటనలో అబ్బాయిది కాదు అమ్మాయిదే తప్పు. ఇంకో రూమర్ ఏంటంటే.. ప్రచారం కోసం ఆ గొడవని నేనే ప్లాన్ చేశానన్నారు. కానీ వాళ్లెవరో కూడా నాకు తెలియదు' అని నాగశౌర్య చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: ఒక్కో పాట కోసం రూ.3 కోట్లు.. ఆ సింగర్ ఎవరో తెలుసా?) -
ట్రైలర్ బాగుంది కానీ ఆ బూతు డైలాగ్ ఎందుకు పెట్టారో?
'బయటి ఊళ్లో బానిసలా బతికినా తప్పులేదు భయ్యా.. కానీ సొంతూరిలో మాత్రం సింహంలా ఉండాలి'.. ఈ ఒక్క డైలాగ్ తో 'రంగబలి' స్టోరీ ఏంటనేది దాదాపుగా చెప్పేశారు. నాగశౌర్య హీరోగా నటించిన ఈ సినిమా.. జూలై 7న థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ ప్రారంభించిన చిత్రబృందం తాజాగా ట్రైలర్ ని విడుదల చేసింది. హీరో- సొంతూరు అంటే ఇష్టం అనే కాన్సెప్ట్ ఆధారంగా తీసిన ఈ చిత్రానికి పూర్తి ఫన్నీగా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. అందుకు తగ్గట్లే ట్రైలర్ ఉంది. (ఇదీ చదవండి: జెట్ స్పీడ్‌లో శ్రీలీల కెరీర్.. ఆ అంశాలే కలిసొచ్చాయా?) ట్రైలర్ లో ఏముంది? సొంతూరంటే ఇష్టం, ప్రేమ, పిచ్చి ఉన్న ఓ కుర్రాడు.. పండగ, పబ్బం ఏదైనా సరే ఇక్కడి ఉండి చేసుకునే రకం. ఆడుతూ పాడుతూ హ్యాపీగా ఉన్న హీరో లైఫ్ లోకి కొన్ని సమస్యలు రావడం వరకు ట్రైలర్ లో చూపించారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది బిగ్ స్క్రీన్ పై చూడాలి. ఈ ట్రైలర్ లోనే హీరోయిన్ తో ఓ లవ్ ట్రాక్ కూడా ఉన్నట్లు చూపించారు. అంతా చూస్తుంటే చాలావరకు తెలిసిన కథలానే అనిపిస్తుంది కానీ సినిమాలో కామెడీతో ఏమైనా మాయ చేస్తారేమో చూడాలి? బూతు డైలాగ్ మర్చిపోయారా? 'రంగబలి' ట్రైలర్ అంతా బాగానే ఉంది కానీ 'దింపి..' అనే ఓ బూతు డైలాగ్ ని అలానే ఉంచేశారు. ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరినీ ఇది అవాక్కయ్యేలా చేసింది. ఎందుకంటే ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్ ల్లో ఇలాంటి డైలాగ్స్ అంటే పర్లేదు కానీ బిగ్ స్క్రీన్ పై చూసే సినిమాల్లో ఇలాంటి డైలాగ్ చెప్పడం కాస్త వింతగా అనిపించింది. సెన్సార్ కి వెళ్తే.. దీన్ని కచ్చితంగా బీప్ చేసే అవకాశముంది. ఇందులో నాగశౌర్యకి హీరోయిన్ గా యుక్తి తరేజా నటించింది. సత్య కామెడీతో నవ్వులు పూయించాడు. 'దసరా' ఫేమ్ షైన్ టామ్ చాకో విలన్ గా సందడి చేయబోతున్నాడు. (ఇదీ చదవండి: ఒక్కో పాట కోసం రూ.3 కోట్లు.. ఆ సింగర్ ఎవరో తెలుసా?) -
మాయ నాలో జరిగెనే!
‘అందరిలోనూ ఒక్కడు కాను... నేను వేరే తీరులే, కలిసే తాను.. వెలిగే మేను.. మాయ నాలో జరిగెనే...’ అంటూ మొదలవుతుంది ‘కల కంటూ ఉంటే..’ అనే పాట. నాగశౌర్య, యుక్తితరేజ జంటగా నటించిన ‘రంగ బలి’ చిత్రంలోని పాట ఇది. పవన్ బాసంశెట్టి దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం జూలై 7న విడుదల కానుంది. పవన్ సీహెచ్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘కల కంటూ ఉంటే..’ అంటూ సాగే పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు. కృష్ణకాంత్ సాహిత్యం అందించిన ఈ పాటను సార్థక్ కల్యాణి, వైష్ ఆలపించారు. సత్య, సప్తగిరి కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు కెమెరా: దివాకర్ మణి. -
ఊపిరి నువ్వే ఊరికి..
‘‘తూరుపు పడమర ఏ దిక్కు పడవుర.. నువ్వే మాకు దిక్కు రా...’, ‘గోపురం గుడికి రా... అక్షరం బడికి రా.. ఊపిరి నువ్వే ఊరికి రా’’ అంటూ సాగే పాట ‘రంగబలి’ చిత్రం నుంచి విడుదలైంది. నాగశౌర్య హీరోగా పవన్ బాసంశెట్టి దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రంలో యుక్తి తరేజ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. విలేజ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా జూలై 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని ‘తూరుపు పడమర..’ లిరికల్ వీడియోను బుధవారం విడుదల చేశారు. సంగీత దర్శకుడు సీహెచ్ పవన్ స్వరపరచిన ఈ పాటకు పవన్ బాసంశెట్టి, శ్రీ హర్ష సాహిత్యం అందించగా అనురాగ్ కులకర్ణి పాడారు. జానీ మాస్టర్ నృత్యరీతులు సమకూర్చారు. ఈ చిత్రానికి కెమెరా: దివాకర్ మణి. -
నాగశౌర్య హీరోగా రంగబలి, స్పెషల్ పోస్టర్ రిలీజ్
నాగశౌర్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రంగబలి’. ఈ చిత్రం ద్వారా పవన్ బాసంశెట్టి దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఎస్ఎల్వీ సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ‘రంగబలి’ని జూలై 7న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. నాగశౌర్య ట్రెండీ గెటప్‌లో కనిపిస్తున్న ఓ పోస్టర్ ద్వారా రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేశారు. ‘‘పల్లెటూరి నేపథ్యంలో సాగే కథతో ‘రంగబలి’ ఫన్ రైడ్ (సరదా ప్రయాణం) గా ఉండబోతోంది. ఇందులో నాగశౌర్య విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు.. ఇందుకు ప్రత్యేకంగా మేకోవర్ అయ్యారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. హీరోయిన్, ఇతర వివరాలను త్వరలోనే తెలియజేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: పవన్ సీహెచ్, కెమెరా: దివాకర్ మణి. -
కొత్త సినిమాను అనౌన్స్ చేసిన నాగశౌర్య
నాగశౌర్య హీరోగా పవన్ బాసంశెట్టి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి ‘రంగబలి’ టైటిల్ ఖరారు చేశారు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఉగాది సందర్భంగా టైటిల్‌ను ప్రకటించారు మేకర్స్. ‘‘విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే వినూత్నమైన కథ ఇది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: పవన్ సీహెచ్, కెమెరా: దివాకర్‌మణి. -
PAPA Review: 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' రివ్యూ
టైటిల్: 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' నటీనటులు - నాగ శౌర్య, మాళవిక నాయర్, శ్రీనివాస్ అవసరాల, మేఘ చౌదరి, అశోక్ కుమార్, అభిషేక్ మహర్షి, శ్రీ విద్య తదితరులు నిర్మాణ సంస్థలు : పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ నిర్మాతలు: టీజీ విశ్వ ప్రసాద్, పద్మజ దాసరి దర్శకుడు: శ్రీనివాస్ అవసరాల సంగీతం: కళ్యాణి మాలిక్, వివేక్ సాగర్(కాఫీఫై సాంగ్) సినిమాటోగ్రఫీ: సునీల్ కుమార్ నామ ఎడిటర్ : కిరణ్ గంటి విడుదల తేది: మార్చి 17, 2023 Rating: 2.5/5 Phalana Abbayi Phalana Ammayi Review: 'ఊహలు గుసగుసలాడే', 'జ్యో అచ్యుతానంద' లాంటి బ్లాక్‌బస్టర్స్ తర్వాత నాగశౌర్య, శ్రీనివాస అవరాల కాంబినేష్లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నేడు(మార్చి 17) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన లభించడంతో పాటు సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. ఈ సినిమా కథంతా 2000 నుంచి 2010 మధ్యకాలంలో సాగుతుంది. బీటెక్‌లో జాయిన్ అయిన సంజయ్‌ని సీనియర్స్ ర్యాగింగ్ చేస్తుంటే.. అతన్ని సేవ్ చేస్తుంది అనుపమ(మాళవికా నాయర్). అప్పటి నుంచి ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడుతుంది. ఇక ఎంఎస్ కోసం ఇద్దరు కలిసి యూకేకి వెళ్తారు. అక్కడ ఇద్దరు ప్రేమలో పడతారు. సహజీవనం కూడా చేస్తారు. ఎంఎస్ పూర్తవ్వగానే అనుపమకు వేరే సిటీలో ఉద్యోగం వస్తుంది. తనకు చెప్పకుండా ఉద్యోగానికి అప్లై చేసిందని అనుపమపై కోపంగా ఉంటాడు సంజయ్. అదే సమయంలో అతనికి పూజ(మేఘా చౌదరి)దగ్గరవుతుంది. ఆమె కారణంగా సంజయ్, అనుపమల మధ్య దూరం పెరుగుతుంది. ఇద్దరు విడిపోతారు. కొన్నాళ్ల తర్వాత అనుకోకుండా ఇద్దరు కలుస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? పూజ ప్రేమను సంజయ్ అంగీకరించాడా? అనుపమ జీవితంలోకి గిరి(అవసరాల శ్రీనివాస్) ఎలా వచ్చాడు? చివరికి సంజయ్, అనుపమలు కలిశారా? లేదా? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. సినిమా భాషలో కాంబినేషన్ అనే మాటకి విలువెక్కువ. ఓ హీరో, డైరెక్టర్ కలిసి చేసిన సినిమా హిట్ అయితే.. అదే కాంబోలో వస్తున్న కొత్త చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడటం సహజం. కానీ ఆ అంచనాలను దర్శకుడు అవసరాల శ్రీనివాస్ నిలబెట్టుకోలేకపోయాడు. ‘ఉహాలు గుస గుస లాడే , జ్యో అచ్యుతానంద’ బ్లాక్‌బస్టర్స్ తర్వాత నాగశౌర్యతో కలిసి చేసిన హ్యాట్రిక్ మూవీ ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ ఆ స్థాయిలో ఆకట్టుకునేలా తెరకెక్కించడంలో దర్శకుడు విఫలమయ్యాడు. కథలో చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. ఎలాంటి ట్విస్టులు లేకుండా చాలా రొటీన్‌గా కథనం సాగుతుంది. కొన్ని సీన్లలో శ్రీనివాస అవసరాల మార్క్ కామెడీ కనిపిస్తుంది. కానీ మొత్తంగా ఎక్కడో క్లారిటీ మిస్ అయిందనే ఫీలింగ్ కలుగుతుంది. సినిమాలో మొత్తం ఏడు చాప్టర్లు ఉంటాయి. ఒక్కో చాప్టర్ ఒక్కో థీమ్ తో ఉంటుంది. ప్రేమ, ద్వేషం, హాస్యం ఇలా అన్ని భావోద్వేగాలు ఉంటాయి. కానీ వాటిని ఆకట్టుకునే విధంగా తెరకెక్కించడంతో దర్శకుడు విఫలమయ్యాడు. కాలేజీలో హీరోహీరోయిన్ల స్నేహం.. ప్రేమ.. సహజీవనం తదితర సన్నివేశాలతో ఫస్టాఫ్ ముగుస్తుంది. ఇక సెకండాఫ్ ఇద్దరి మధ్య మనస్పర్థలు.. విడిపోవడం.. ఇలా భావోద్వేగాల చుట్టూ తిరుగుతుంది. అయితే కలిసి జీవించాలనుకున్న ఈ జంట.. విడిపోవడానికి గల కారణాలను బలంగా చూపించలేకపోయారు. పార్ట్ పార్ట్‌లుగా చూస్తే కొన్ని సీన్స్ ఆకట్టుకుంటాయి. కానీ ఓవరాల్‌గా మాత్రం అంతగా మెప్పించదు. ఎవరెలా చేశారంటే... సంజయ్గా నాగశౌర్య మెప్పించాడు. లుక్స్ పరంగా చాలా మార్పులు ఉన్న పాత్ర తనది. ఇలాంటి రొమాంటిక్ ఫీల్ గుడ్ సినిమాలు.. పాత్రలు నాగశౌర్యకు కొత్తేమి కాదు. గత సినిమాల్లో మాదిరే లవర్ బాయ్‌గా సంజయ్ చక్కగా నటించాడు. ఇక అనుపమగా మాళవికా నాయర్ తనదైన నటనతో ఆకట్టుకుంది. సినిమా మొత్తం వీరిద్దరి పాత్రల చుట్టే తిరుగుతుంది. గిరిగా అవసరాల శ్రీనివాస్ ఉన్నంతలో మెప్పించాడు. వాలెంటైన్ గాఅభిషేక్ మహర్షి తనదైన కామెడీతో నవ్వించాడు, కీర్తిగా శ్రీవిద్య, పూజగా మేఘ చౌదరితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. కళ్యాణి మాలిక్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు కథకి తగ్గట్టుగా ఉన్నాయి. సునీల్ కుమార్ నామ సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నాయి. -అంజి శెట్టి, సాక్షి వెబ్‌డెస్క్ -
ఈ సినిమాలో వచ్చే ఎమోషన్ ఏ తెలుగు సినిమాలోనూ చూడలేదు: అవసరాల
నాగశౌర్య, మాళవికా నాయర్ జంటగా అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. టీజీ విశ్వప్రసాద్, దాసరి పద్మజ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ప్రెస్మీట్లో నాగశౌర్య మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా కోసం మేం చాలా కష్టపడ్డాం. మా కష్టం థియేటర్స్‌లో తెలుస్తుంది. నా కెరీర్లో ‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ సినిమాల గురించి ఎలా చెప్పుకున్నానో ‘ఫలానా..’ సినిమా గురించి అంతే బాగా చెప్పుకుంటాను. ఈ సినిమా విజయం పట్ల నమ్మకంగా ఉన్నాం’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలోని పాత్రలు నిజజీవితంలో చూసినట్లుగా ఉంటాయి. ఎమోషనల్ మూవీ ఇది. నటనపై ఆధారపడ్డ సినిమా కాబట్టే సింక్ సౌండ్ ఉండాలని నిర్ణయించుకున్నాను. ఈ సినిమాలోని సంజయ్ పాత్రకు నాగశౌర్య బాగా సరిపోయాడు. ఏడు చాప్టర్లు ఉండే ఈ సినిమాలోని నాలుగో చాప్టర్ నాకు చాలా ఇష్టం. ఇంటర్వెల్‌కి ముందు వచ్చే ఈ చాప్టర్లో వచ్చే ఎమోషన్ ఇంతవరకు నేను తెలుగు సినిమాల్లో చూడలేదనేది నా అభిప్రాయం’’ అన్నారు అవసరాల శ్రీనివాస్. ‘‘నాగశౌర్య, మాళవికల సహజ నటన కోసం ఈ సినిమా చూడొచ్చు’’ అన్నారు చిత్ర సహనిర్మాత వివేక్ కూచిభొట్ల.‘‘ఇంత మంచి సినిమాలో మమ్మల్ని భాగం చేసిన విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్లగారికి థ్యాంక్స్’’ అన్నారు దాసరి ప్రసాద్. -
ముద్దు సీన్ కావాలని చేసింది కాదు: మాళవిక నాయర్
‘ఎవడే సుబ్రమణ్యం’తో టాలీవుడ్ పరిచయమైన మలయాళ ముద్దుగుమ్మ మాళవిక నాయర్. ప్రస్తుతం నాగశౌర్యకు జంటగా ఫలానా అబ్బాయి- ఫలానా అమ్మాయి సినిమాలో నటిస్తోంది. అవసరాస శ్రీనివాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మాళవిక సినిమాకు సంబంధించి పలు ఆసక్తిసకర విషయాలను పంచుకున్నారు. సినిమాల్లో బోల్ట్ సీన్ అంటే హీరోయిన్లకు కాస్తా కష్టంగానే ఫీలవుతారు. ఈ సినిమాలో అలాంటి సీన్లలో నటించడంపై మాళవిక స్పందించింది. ఈ చిత్రంలో బోల్డ్ సీన్స్ చేసి ఆడియన్స్‌ను ఆశ్చర్యానికి గురి చేసింది ముద్దుగుమ్మ. ఈ సినిమాలో తొలిసారి మాళవిక ముద్దు సీన్లలో నటించడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. ముద్దు సీన్‌పై మాళవిక మాట్లాడుతూ..'ముద్దు సీన్లో నటించినందుకు నాకు ఎలాంటి ఇబ్బందిగా లేదు. ఎందుకంటే అది కావాలని పెట్టిన సీన్ కాదు. కథలో భాగమే. ఆ సీన్ కథకు చాలా అవసరమైన సన్నివేశం. అందుకే ముద్దు సీన్లో నటించాల్సి వచ్చింది. సాధారణ ప్రేమ కథా చిత్రాల కంటే ఈ సినిమా భిన్నంగా ఉంటుంది. ఇందులో అన్ని రకాల భావోద్వేగాలు ఉంటాయి. ఈ సినిమాలో నా అనుపమ పాత్ర ఎంతో నచ్చింది. నటిగా నన్ను నేను నిరూపించుకునే పాత్రలో నటించడం ఆనందంగా ఉంది.' అని అన్నారు. -
‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' నుంచి బ్యూటిఫుల్ మెలోడి సాంగ్ రిలీజ్
నాగశౌర్య నటిస్తున్న తాజా చిత్రం ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మాళవికా నాయర్ హీరోయిన్గా నటిస్తుంది. శ్రీనివాస్ అవసరాల కథ, స్క్రీన్ ప్లే దర్శకత్వం వహిస్తున్నాడు. ఈనెల 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రమోషన్స్ జోరు పెంచిన చిత్ర బృందం తాజాగా ఈ సినిమాలోని లిరికల్ సాంగ్స్‌ని రిలీజ్ చేస్తోంది. తాజాగా ‘నీతో ఈ గడిచిన కాలం .. నడిచిన దూరం ఎంతో ఇష్టం’ అంటూ సాగే మెలోడి పాటను విడుదల చేశారు. గీతా మాధురి ఆలపించిన ఈ సాంగ్ అలరిస్తుంది. Groove to this Magical Melody #NeethoeeGadichinaKalam Out now😍🎼 Watch Full lyrical👇https://t.co/1hhz90TtEd#PAPA#PAPAOnMarch17@IamNagashaurya @iamMalavikaNair#SrinivasAvasarala @vishwaprasadtg@vivekkuchibotla@PSrividya53 pic.twitter.com/RQT4cb82S0 — People Media Factory (@peoplemediafcy) March 10, 2023 Feel the vibe of Magical Melody #NeethoeeGadichinaKalam Out now😍🎼 Watch Full lyrical👇https://t.co/aRUeMLm9cb#PAPA#PAPAOnMarch17@IamNagashaurya @iamMalavikaNair#SrinivasAvasarala @vishwaprasadtg@vivekkuchibotla@PSrividya53 pic.twitter.com/9wpLw1qPnz — People Media Factory (@peoplemediafcy) March 9, 2023 -
అవార్డులపై నమ్మకం పోయింది : మ్యూజిక్ డైరెక్టర్
‘‘ఓ సినిమా సంగీతం విషయంలో అధిక భాగం దర్శకుల పాత్ర ఉంటుంది. దర్శకుడి అభిరుచిని బట్టే సినిమా, సంగీతం ఉంటాయి. నా సంగీతం బాగుందంటే అందులో ఎక్కువ క్రెడిట్ నా దర్శకులకే ఇస్తాను’’ అన్నారు సంగీత దర్శకుడు కళ్యాణీ మాలిక్. నాగశౌర్య, మాళవికా నాయర్ జంటగా శ్రీనివాస్ అవసరాల దర్శకత్వం వహించిన చిత్రం ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. టీజీ విశ్వప్రసాద్, పద్మజ దాసరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 17న రిలీజవుతోంది. ఈ సందర్భంగా చిత్ర సంగీత దర్శకుడు కళ్యాణీ మాలిక్ మాట్లాడుతూ– ‘‘2003లో నా తొలి సినిమా ‘ఐతే’ రిలీజైంది. ఈ 20 ఏళ్లలో ‘ఫలానా అబ్బాయి..’ నా 19వ సినిమా. సంవత్సరానికో సినిమా చేస్తున్నాను. ఈ ప్రయాణంలో నా సంగీతానికి ఎన్నో ప్రశంసలు దక్కాయి. ఆ విషయంలో సంతృప్తిగా ఉన్నాను. నా కెరీర్లో ‘ఫలానా అబ్బాయి..’ లోని ‘కనుల చాటు మేఘమా..’ ఉత్తమ పాట అని చెప్పగలను. ఈ పాటకు జాతీయ అవార్డు వస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశాను. కానీ జాతీయ అవార్డులు ఎవరికి ఇస్తారో, అవి ఎలా వస్తాయో ఈ మధ్య ఓ ఫ్రెండ్ చెప్పాడు. దాంతో అవార్డులపై నమ్మకం పోయింది. నాకిప్పటివరకూ ఒక్క అవార్డు కూడా రాలేదు. ‘ఊహలు గుసగుసలాడే’లోని ‘ఏం సందేహం లేదు..’ పాటని నేను, సునీత పాడాం. సునీతకు అవార్డు వచ్చింది కానీ నాకు రాలేదు. అప్పటి నుంచి అవార్డుల గురించి పట్టించుకోవడం మానేశా. నా సినిమా, నా పాట నచ్చి ఎవరైనా నిర్మాత నాకు మరో చాన్స్ ఇస్తే అదే పెద్ద అవార్డుగా భావిస్తాను. మా అన్నయ్య (కీరవాణి) స్వరపరిచిన ‘నాటు నాటు..’ ఆస్కార్ బరిలో నిలవడం గర్వంగా ఉంది. ఇక నేను సంగీతం అందించిన ‘ఇంటింటి రామాయణం’, ‘విద్య వాసుల అహం’ చిత్రాలు రిలీజ్‌కి రెడీగా ఉన్నా యి. రెండు వెబ్ సిరీస్‌లు చేస్తున్నా’’ అన్నారు. -
ఇవాళే కలిశారు తొలిసారిగా..
నాగశౌర్య, మాళవికా నాయర్ జంటగా శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. టీజీ విశ్వ ప్రసాద్, పద్మజ దాసరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 17న రిలీజ్ కానుంది. కళ్యాణీ మాలిక్ సంగీతం అందించారు. ఈ చిత్రం నుంచి ‘ఫలానా అబ్బాయ్ ఫలానా అమ్మాయ్.. ఫలానా అబ్బాయ్ ఫలానా అమ్మాయ్.. ఇవాళే కలిశారు తొలిసారిగా..’ అంటూ సాగే రెండో పాటని సోమవారం విడుదల చేశారు. గాయని నూతన మోహన్, కళ్యాణీ మాలిక్ పాడిన ఈ పాటకి భాస్కరభట్ల రవికుమార్ సాహిత్యం అందించారు. ‘‘హీరో, హీరోయిన్ల పరిచయ గీతం ఇది. ఈ చిత్రంలో మూడు పాటలు రాశాను’’ అన్నారు భాస్కరభట్ల రవికుమార్. ఈ చిత్రానికి సహనిర్మాత: వివేక్ కూచిభొట్ల, కెమెరా: సునీల్ కుమార్ నామ, సంగీతం: కళ్యాణీ మాలిక్, వివేక్ సాగర్ (కాఫీఫై సాంగ్). -
ముద్దు సీన్ గురించి మాళవికకు ముందే చెప్పాను: అవసరాల శ్రీనివాస్
‘‘నటీనటుల నుంచి సహజమైన నటనను రాబట్టుకోవడం అనేది దర్శకుడిగా నాకున్న బలం. ఫ్రేమ్‌లో నటీనటులు ఎలా యాక్ట్ చేస్తున్నారనే విషయాన్నే నేను ముందు చూస్తాను. నన్ను, నా కథను, నా కొత్త ప్రయోగాన్ని మా నిర్మాతలు నమ్మారు. ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ సినిమా విజయం సాధిస్తుంది’’ అన్నారు రచయిత, దర్శక–నటుడు అవసరాల శ్రీనివాస్. నాగర్య హీరోగా అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. ఈ చిత్రంలో మాళవికా నాయర్ హీరోయిన్గా నటించారు. టీజీ విశ్వప్రసాద్, దాసరి పద్మజ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శనివారం విలేకర్ల సమావేశంలో చిత్రదర్శకుడు అవసరాల శ్రీనివాస్ పంచుకున్న విశేషాలు. ► ఈ సినిమాలో ఏడు అధ్యాయాలు ఉన్నాయి. ప్రతి అధ్యాయం నిడివి దాదాపు 20 నిమిషాలు ఉంటుంది. కథ రీత్యా 18 ఏళ్ల నుంచి 28 ఏళ్ల వయసు వరకు నాశౌర్య, మాళవిక పాత్రల ప్రయాణం ఉంటుంది. ఏడు చాప్టర్లూ ఈ పదేళ్ల వ్యవధిలోనే జరుగుతాయి. ► వయసుకి తగ్గట్లుగా పాత్ర తాలూకు ప్రవర్తన, ఆహార్యంలో వ్యత్యాసం చూపించడానికి నాగశౌర్య ఎంతో కష్టపడ్డారు. నిజజీవితంలో నేను చూసిన కొన్ని ఘటనల ఆధారంగా ఈ సినిమా కథ రాసుకున్నాను. పాత్రలు, సంభాషణలు చాలా సహజంగా ఉంటాయి. మనకు తెలిసిన కథలా, మనలో ఎవరో ఒకరి కథలా ఈ సినిమా ఉంటుంది. ► నాకు ఇష్టమైన యాక్టర్స్‌లో నాగశౌర్య ఒకరు. ఈ సినిమా యూకే షెడ్యూల్ కోసం 40 మందికి వీసాలు అప్లయ్ చేస్తే పదిమందికే ఓకే అయ్యాయి. దీంతో షూటింగ్ కోసం కొన్ని ఇబ్బందులు పడ్డాం. కానీ సెట్స్‌లో తన యాక్టింగ్‌తో నాగశౌర్య ఆ ఇబ్బందులను మర్చిపోయేలా చేసేవారు. ఈ సిని మాలో నాగశౌర్య పెర్ఫార్మెన్స్ ఎంత బాగుందనేది థియేటర్స్‌లో చూస్తారు. అలాగే ఈ సినిమాలో ముద్దు సీన్ ఉన్నట్లు మాళవికకు ముందే చెప్పాను. ఓ సన్నివేశానికి సరైన కారణాలు ఉంటే, కథకి ఖచ్చితంగా అవసరం అనిపిస్తే నటీనటులు ఆ సీన్లో యాక్ట్ చేయడానికి ఓకే అంటారన్నది నా అభిప్రాయం. ‘అష్టా చమ్మా’ చిత్రం నుంచే నాకు సంగీత దర్శకుడు కళ్యాణీ మాలిక్ తెలుసు. ఈ సినిమాకు ఆయన మంచి మ్యూజిక్ ఇచ్చారు. ‘కనుల చాటు..’ పాటను కీరవాణిగారు మెచ్చుకోవడంతో కళ్యాణీగారు ఇంకా సంతోషంగా ఉన్నారు. ► హిందీ ‘బ్రహ్మాస్త్రం’ టీమ్ ఓ సారి నాకు ఫోన్ చేసి తెలుగు డైలాగ్స్ రాస్తారా? అని అడిగారు. అప్పటికే ఆ సినిమా గురించి నాకు అవగాహన ఉండటంతో సరే అన్నాను. అలా ‘అవతార్ 2’కూ అవకాశం వచ్చింది. అయితే ఇంగ్లిష్ సినిమాలకు తెలుగు డైలాగ్స్ రాయడం చాలా కష్టం. కానీ చాలెంజ్‌గా తీసుకుని రాశాను. ఇక నటుడిగా ‘కన్యాశుల్కం’ వెబ్ సిరీస్ చేశాను. దర్శకుడిగా నా తర్వాతి చిత్రం గురించి త్వరలో అధికారికంగా చెబుతాను. -
అమ్మాయిని కొడతావా? నడిరోడ్డుపై యువకుడిపై నాగశౌర్య ఆగ్రహం
యంగ్ హీరో నాగశౌర్య రియల్ హీరో అనిపించుకున్నారు. నడిరోడ్డుపై ఓ యువతిపై యువకుడు చేయి చేసుకోగా, ఎందుకు కొట్టావంటూ నాగశౌర్య నిలదీశాడు. అంతేకాకుండా అమ్మాయిని కొట్టడం తప్పు అని ఆమెకు క్షమాపణలు(సారీ)చెప్పాల్సిందే అని శౌర్య సదరు యువకుడితో గొడవకు దిగాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. రోడ్డు మీద ఇద్దరు ప్రేమికులు గొడవ పడ్డారు. ఈ క్రమంలో అబ్బాయి అమ్మాయిని లాగిపెట్టి చెంప మీద కొట్టాడు. అదే సమయంలో అట్నుంచి కారులో వెళుతున్న నాగశౌర్య ఇది గమనించి 'ఆ అమ్మాయిని ఎందుకు కొట్టావ్ అంటూ నిలదీశాడు. దీనికి అతను ఆమె నా లవర్, నా ఇష్టం అంటూ ఓవర్యాక్షిన్ చేయగా అబ్బాయిని గట్టిగా పట్టుకొని మర్యాదగా ఆ అమ్మాయికి సారీ చెప్పు అంటూ శౌర్య వాదించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు శౌర్య చేసిన పనికి మెచ్చుకుంటున్నారు. -
నడిరోడ్డుపై యువకుడిపై నాగశౌర్య ఆగ్రహం
-
కనుల చాటు మేఘమా...
నాగశౌర్య, మాళవికా నాయర్ జంటగా నటించిన చిత్రం ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. శ్రీనివాస్ అవసరాల దర్శకత్వం వహించారు. టీజీ విశ్వ ప్రసాద్, పద్మజ దాసరి నిర్మించిన ఈ సినిమా మార్చి 17న రిలీజ్ కానుంది. కళ్యాణీ మాలిక్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘కనుల చాటు మేఘమా..’ అంటూ సాగే మొదటి పా టను విడుదల చేశారు మేకర్స్. ఈ పా టకు లక్ష్మీ భూపా ల సాహిత్యం అందించగా ఆభాస్ జోషి పా డారు. రఘు మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. శ్రీనివాస్ అవసరాల మాట్లాడుతూ– ‘‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ కథ అనుకున్నాక కళ్యాణీ మాలిక్గారితో ‘ఒక లవ్ స్టోరీ చేస్తున్నాం.. దానికి మంచి పా ట కావాలి’ అన్నాను. ఆయన అద్భుతమైన మెలోడీని స్వరపరిచారు’’ అన్నారు. ‘‘కనుల చాటు మేఘమా..’ పా ట ఇచ్చిన తృప్తి నా 20 ఏళ్ల సినీ జీవితంలో ఏ పా టా ఇవ్వలేదు’’ అన్నారు కళ్యాణీ మాలిక్. -
'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' ఫస్ట్ లుక్ రిలీజ్
‘ఊహలు గుసగుసలాడే, జ్యో అచ్యుతానంద’ వంటి చిత్రాల తర్వాత హీరో నాగశౌర్య, దర్శకుడు శ్రీనివాస్ అవసరాల కాంబినేషన్లో రూపొందుతోన్న మూడో చిత్రం ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. నాగశౌర్య, మాళవికా నాయర్ జంటగా టీజీ విశ్వప్రసాద్, పద్మజ దాసరి నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే పూర్తయింది. ఈ సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. శ్రీనివాస్ అవసరాల మాట్లాడుతూ– ‘‘పదేళ్ల పాటు ఓ జంట మధ్య సాగే ప్రేమ ప్రయాణమే ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. 18 ఏళ్ల నుండి 28 సంవత్సరాల వయస్సు వరకు హెచ్చు తగ్గులతో సాగే వారి ప్రయాణం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది’’ అన్నారు. ‘‘ఈ సినిమా విడుదల తేదీతో పాటు మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం’’ అన్నారు టీజీ విశ్వప్రసాద్, పద్మజ దాసరి. ఈ చిత్రానికి కెమెరా: సునీల్ కుమార్ నామ, సంగీతం: కళ్యాణీ మాలిక్, వివేక్ సాగర్ (కాఫీ ఫై సాంగ్), ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుజిత్ కుమార్ కొల్లి, అసోసియేట్ ప్రొడ్యూసర్స్: సునీల్ షా, రాజా సుబ్రమణియన్, సహనిర్మాత: వివేక్ కూచిభొట్ల. -
బిజినెస్ విమెన్‌తో పెళ్లి.. నాగశౌర్యకు కట్నం ఎంత ఇచ్చారో తెలుసా?
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య ఓ ఇంటివాడు అయిన సంగతి తెలిసిందే. బెంగళూరుకు చెందిన అనూష శెట్టితో నవంబర్ 20న ఏడడుగులు వేసి వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. బెంగళూరులోని ఓ స్టార్ హోటల్లో అతి కొద్ది మంది సన్నిహితులు, బంధువుల సమక్షంలో ఆదివారం వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అయితే నాగశౌర్య భార్య అనూష శెట్టి ఒక బిజినెస్ విమెన్ అనే విషయం తెలిసిందే. సొంతంగా ఆమె ఇంటీరియర్ డిజైన్ కంపెనీ రన్ చేస్తోంది. బిజినెస్ విమెన్‌గా అనూష అవార్డును సైతం అందుకుంది. ఇదిలా ఉంటే నాగశౌర్య చేసుకున్న అనూష ఫ్యామిలీ బ్యాగ్రౌండ్, ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటని అంత ఆరా తీస్తున్నారు. అంతేకాదు ఇండస్ట్రీకి సంబంధంలేని అమ్మాయిని చేసుకున్న నాగశౌర్య ఎంత కట్నం తీసుకున్నాడనేది కూడా ఆసక్తిని సంతరించుకుంది. ఈ నేపథ్యంలో నాగశౌర్య తీసుకున్న కట్నం, అనూష శెట్టి ఆస్తుల వివరాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ తాజా బజ్ ప్రకారం.. నాగశౌర్యకు భారీగా కట్నకానుకలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అనూష తండ్రి బెంగళూరులో ప్రముఖ వ్యాపారవేత్త అని, ఆయనకు అక్కడ పలు వ్యాపారాలు ఉన్నట్లు సమాచారం. బిజినెస్‌లో ఆయన బాగానే సంపాదించినట్లు సమాచారం. అంతేకాదు అనూష కూడా తన తండ్రికి సంబంధించిన వ్యాపారాల్లో చురుగ్గా ఉంటుందట. మరోవైపు సొంతంగా పెట్టుకున్న ఇంటిరియర్ బిజినెస్ కూడా కోట్లలో టర్నోవర్ ఉంటుందని వినికిడి. అయితే వివాహం సందర్భంగా నాగశౌర్య నగదు రూపంలో ఎలాంటి కట్నం ఇవ్వలేదని తెలుస్తోంది. కానీ అనూష శెట్టి పేరు మీద ఉన్న ఆస్తులను నాగశౌర్య పేరు మీదకు మార్చనున్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. అనూష పేరు మీద దాదాపు రూ. 50 నుంచి 80 కోట్ల ప్రాపర్టీస్ ఉన్నాయని, అందులో కొన్ని నాగశౌర్య పేరు మీదకు ట్రాన్స్ఫర్ చేయన్నారని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియదు. దీనిపై నాగశౌర్య, అతని కుటుంబ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే నాగశౌర్య, అతని కుటుంబ సభ్యుల స్పందించేవరకు వేచి చూడాల్సిందే. ఇక నాగశౌర్య సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతానికి అతని చేతిలో మూడు ప్రాజెక్ట్స్ ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: షారుక్ ఇంటికి డైమండ్ నేమ్ ప్లేట్, మెరిసిపోతున్న మన్నత్ జబర్దస్త్ ‘పంచ్’ ప్రసాద్ ఆరోగ్యంపై డాక్టర్లు ఏమన్నారంటే? -
ప్రత్యేక ఆకర్షణగా నాగశౌర్య పెళ్లి భోజనాలు, అరేంజ్మెంట్స్ చూస్తే షాకవ్వాల్సిందే
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య తన ప్రియురాలు అనూష శెట్టితో ఏడడుగులు వేసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. నవంబర్ 20న బెంగళూరుకు చెందిన ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టితో నాగశౌర్య వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇరు కుటుంబ పెద్దలు, సన్నిహితులు, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించారు. బెంగళూరులోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్ నాగశౌర్య-అనూష శెట్టిల రాయల్ వెడ్డింగ్‌కి వేదికైంది. ప్రస్తుతం నాగశౌర్య పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియో నెట్టింట వైరల్‌గా మారాయి. వీరి గ్రాండ్ వెడ్డింగ్ ఫొటోలు, వీడియోలు నెటిజన్లను వీపరితంగా ఆకట్టుకుంటున్నాయి. చదవండి: ప్రేమించిన అమ్మాయితో నాగశౌర్య వివాహం.. ఫోటోలు వైరల్ ఇక నాగశౌర్య పెళ్లి వేడుకల్లో ఏర్పాటు చేసిన విందు భోజనాలు కూడా ప్రత్యేకాకర్షణగా నిలిచాయి. పెళ్లికి వచ్చిన అతిథులందరికీ రాచరికపు స్టైల్లో భోజనాలు పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. సంప్రదాయం ప్రకారం కంచాల్లో బంతి భోజనాలు వడ్డించారు. అయితే ఒక్కో అతిథికి ప్రత్యేకంగా ఒక్కో టేబుల్ ఏర్పాటుచేశారు. ఈ టేబుల్స్ అష్టభుజ ఆకారంలో చాలా అందంగా ఉన్నాయి. విందులో భాగంగా 12 రకాల వంటలు, 4 రకాల స్వీట్స్, పెట్టినట్టు తెలుస్తోంది. కాగా టాలీవుడ్ సెలబ్రిటీల కోసం త్వరలో హైదరాబాద్‌లో ఘనంగా రిసెప్షన్‌ను ఏర్పాటు చేసేందుకు నాగాశౌర్య ప్లాన్ చేసినట్లు సమాచారం. @IamNagashaurya 👌 pic.twitter.com/71NdpGjuAE — devipriya (@sairaaj44) November 20, 2022 Royal Lunch Arrangement @ #NagaShaurya wedding 👌👌#LetsGoShaan ❤️ #AnushaShetty pic.twitter.com/KqX3lUMmO6 — 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) November 20, 2022 -
ప్రేమించిన అమ్మాయితో నాగశౌర్య వివాహం.. ఫోటోలు వైరల్
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య ఓ ఇంటివాడయ్యాడు. ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టితో ఏడడుగులు వేసి వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. నేడు(ఆదివారం) 11:25 గంటలకు బంధుమిత్రులు, కుటుంబసభ్యుల సమక్షంలో నాగశౌర్య-అనూషల వివాహం అత్యంత వైభవంగా జరిగింది. బెంగళూరులోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరిగింది. చదవండి : పెళ్లి కొడుకుగా నాగశౌర్య.. ప్రీ వెడ్డింగ్ ఫోటోలు వైరల్ టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు కూడా నాగశౌర్య వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఇక శౌర్య పెళ్లికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. దీంతో పలువురు సెలబ్రిటీలు సహా నెటిజన్ల నుంచి కొత్తజంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా అనూష శెట్టి ఇంటీరియర్ డిజైనర్‌గా పలు అవార్డులను అందుకుంది. కొన్నాళ్లుగా ఆమెకు నాగశౌర్యతో పరిచయం ఉంది. ఆ పరిచయం ప్రేమగా మారడంతో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
పెళ్లి కొడుకుగా నాగశౌర్య.. ప్రీ వెడ్డింగ్ ఫోటోలు వైరల్
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య ఇంట్లో పెళ్లి వేడుకులు మొదలయ్యాయి. నేడు(ఆదివారం) కర్ణాటక కుందాపూర్‌కు చెందిన ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టిని ఆయన పెళ్లి చేసుకోనున్నారు. బెంగళూరులో ఓ స్టార్ హోటల్లో వీరి వివాహ వేడుక జరగనుంది. ఈ క్రమంలో ప్రీ వెడ్డింగ్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇందులో వధూవరులిద్దరూ ట్రెడిషనల్ అవుట్‌ఫిట్‌లో మెరిసిపోయారు. హల్దీ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించిన నాగశౌర్య కుటుంబం అనంతరం కాక్టైల్ పార్టీను కూడా ఏర్పాటు చేశారు. ఈ పార్టీలో నాగశౌర్య తనకు కాబోయే భార్య అనూషకు రింగ్ తొడిగి తన ప్రేమను వ్యక్తపరిచారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ముందుగా నిశ్చయించిన సమయం ప్రకారం.. నేడు ఉదయం 11.25గంటలకు హీరో శౌర్య వధువు అనూష మెడలో బంధు, మిత్రుల సమక్షంలో మూడు ముళ్లు వేయనున్నారు. ఈ వేడుకకు టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు కూడా హాజరు కానున్నట్లు తెలుస్తుంది. Lovely Clicks from the Pre Wedding Ceremony of the Adorable Couple #NagaShaurya & #AnushaShetty 👩🏻❤️👨🏻💕🤩 LINK : https://t.co/SBmJWuYpOZ#NagaShauryaWedsAnushaShetty 💍@IamNagashaurya #KrackFlicks #tollywood #telugucinema — Krack Flicks (@KrackFlicks) November 20, 2022 -
Telugu Top News: ఈవెనింగ్ హైలైట్ న్యూస్
1. అప్రమత్తంగా ఉండాలి.. సీఎం జగన్ కీలక ఆదేశాలు ఆదాయార్జన శాఖలపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. విద్యుత్, అటవీ పర్యావరణ, భూగర్భ గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, ఉన్నతాధికారులు హాజరయ్యారు. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అరెస్ట్ ఉప ఎన్నిక ముగిసి వారం రోజులు దాటినా కానీ మునుగోడులో రాజకీయ కాక మాత్రం తగ్గలేదు. మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ధర్నాకు దిగారు. గొర్రెల పంపిణీ డబ్బులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన రెండు గంటలకుపైగా రోడ్డుపై బైఠాయించారు. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. లోకేష్ వ్యవసాయం గురించి మాట్లాడటం మన కర్మ: మంత్రి కాకాణి ప్రభుత్వంపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, లోకేష్ వ్యవసాయం గురించి మాట్లాడటం మన కర్మ అంటూ ఎద్దేవా చేశారు. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. 'కాంగ్రెస్‌కి వేసి ఓట్లను వృధా చేయకండి': అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్ ప్రజలను కాంగ్రెస్‌కి ఓటు వేసి ఓట్లను వృధా చేయకండి అన్నారు. అందుకు బదులుగా ఆప్‌కి ఓటు వేసి గెలిపించండి అని ప్రజలను అభ్యర్థించారు. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. భర్తను చంపేందుకు ఆరుసార్లు యత్నం...మహిళకు 50 ఏళ్లు జైలు శిక్ష మురికవాడలో పెరిగిన ఒక నిరుపేద మహిళను పెళ్లి చేసుకుని మంచి జీవితం ఇచ్చాడు. రాజకీయ నాయకురాలిగా ఎదిగేలా చేశాడు. అందుకు ప్రతిఫలంగా భర్తనే కడతేర్చేందుకు యత్నించి కటకటాల పాలయ్యింది. ఈ ఘటన బ్రెజిల్లో చోటు చేసుకుంది. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. యువతితో సహజీవనం, హత్య, ముక్కలుగా నరికి.. ఢిల్లీ అంతటా 18 రోజుల్లో.. ఢిల్లీలో సహజీవనం చేస్తున్న ప్రియురాలిని యువకుడు అత్యంత క్రూరంగా హత్య చేసిన ఘటన యావత్ దేశాన్ని కలవరానికి గురిచేస్తోంది. యువతితో పరిచయం, సహజీవనం, హత్య, మృతదేహాన్ని ముక్కలుగా కోయడం, ఎవరికి అనుమానం రాకుండా మృతదేహాన్ని భద్రపరిచిన తీరు విస్మయానికి గురి చేస్తోంది. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. ఓటమి బాధలో ఉన్న పాకిస్తాన్‌కు మరో భారీ షాక్! ‘ఆర్నెళ్ల పాటు..!’ టీ20 ప్రపంచకప్-2022 ఫైనల్లో ఓటమి బాధలో ఉన్న పాకిస్తాన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇంగ్లండ్‌తో మ్యాచ్ సందర్భంగా పాక్ స్టార్ పేసర్ షాహిన్ ఆఫ్రిది కుడి మోకాలికి గాయమైన విషయం విదితమే. ఈ గాయం తీవ్రతరం కావడంతో అతడు స్వదేశంలో ఇంగ్లండ్, న్యూజిలాండ్‌తో సిరీస్‌లకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. Naga Shaurya: యంగ్ హీరో నాగశౌర్యకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు యంగ్ హీరో నాగ శౌర్య అస్వస్థతకు గురయ్యారు. షూటింగ్లో పాల్గొన్న ఆయన ఒక్కసారిగా సొమ్మసిల్లి కింద పడిపోయారు. అత్యవసర చికిత్స నిమిత్తం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. షాకింగ్,ఎలాన్ మస్క్ భారీ షాక్.. మరోసారి వేల మంది ట్విటర్ ఉద్యోగుల తొలగింపు మల్టీమిలియనీర్, ట్విటర్ సీఈవో ఎలాన్ మస్క్ ఉద్యోగులకు మరోసారి భారీ షాక్ ఇవ్వనున్నారు. గత వారంలో ట్విటర్లో పనిచేసే మొత్తం ఉద్యోగుల్లో 50 శాతం అంటే సుమారు 3500 మందిపై వేటు వేశారు. అయితే ఈ వారం ముగిసేలోపే భారీ ఎత్తున ఉద్యోగుల్ని తొలగిస్తున్నారంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. Children's Day 2022: పిల్లలవాణి.. స్కూల్ రేడియో! అంతా వాళ్లిష్టమే బడి అంటే పాఠాల బట్టీ కాదు.. వినోదం.. విజ్ఞానం కూడా! వాటిని పంచే ఓ సాధనం రేడియో! ఎస్.. ఆకాశ వాణి! కాకపోతే ఇది పిల్లల వాణి.. దీనికి కేంద్రం స్కూల్! అనౌన్సర్లు, రైటర్లు, స్టోరీ టెల్లర్లు, ఆర్టిస్టులు, ప్రోగ్రామ్ డిజైనర్లు.. స్టేషన్ డైరెక్టర్లు అందరూ పిల్లలే! అంటే విద్యార్థులే!! మరి శ్రోతలు..? 👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
హీరో నాగశౌర్యకు అస్వస్థత
-
యంగ్ హీరో నాగశౌర్యకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
యంగ్ హీరో నాగ శౌర్య అస్వస్థతకు గురయ్యారు. షూటింగ్లో పాల్గొన్న ఆయన ఒక్కసారిగా సొమ్మసిల్లి కింద పడిపోయారు. అత్యవసర చికిత్స నిమిత్తం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అదే కారణమా?: ఆరు నెలలుగా సిక్స్ ప్యాక్ కోసం డైట్లో ఉన్నట్లు సమాచారం. అదే సమయంలో సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల ఇవాళ షూటింగ్లో కళ్లు తిరిగి పడిపోయినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. మరికాసేపట్లో ఆసుపత్రి నుంచి నాగ శౌర్య డిశ్చార్జ్ అవుతారని సమాచారం. ఇటీవల విడుదలైన కృష్ణ వ్రింద విహారి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నాగశౌర్య తాజాగా మరో చిత్రంలో నటిస్తున్నారు. అరుణాచలం దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను వైష్ణవి ఫిలింస్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు. ప్రొడక్షన్ నెం 1గా శ్రీనివాసరావు చింతలపూడి, విజయ్ కుమార్ చింతలపూడి, డాక్టర్ అశోక్ కుమార్ చింతలపూడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం షూటింగ్ కూడా ప్రారంభించారు. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ సమయంలోనే అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. నాగశౌర్య కెరీర్లో ఇది 24వ చిత్రంగా నిలవనుంది. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాకు ఇంరా టైటిల్ ఖరారు చేయలేదు. త్వరలోనే పెళ్లి: ఇటీవలే నాగశౌర్య త్వరలోనే వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. బెంగళూరుకు చెందిన ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టి అనే అమ్మాయితో ఆయన వివాహం ఖరారైంది. ఈనెల 20న 11:25 గంటలకు వీరి వివాహం బెంగళూరులోని ఓ హోటల్లో ఘనంగా జరగనుంది. ఇప్పటికే నాగశౌర్య ఇంట పెళ్లిసందడి మొదలైంది. శుభలేఖలు కూడా పంచుతున్నారు. -
అనూషశెట్టితో నాగశౌర్య ప్రేమ వివాహం!.. ఇంతకీ ఆమె ఎవరంటే
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. బెంగళూరుకు చెందిన ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టి అనే అమ్మాయితో ఆయన వివాహం ఖరారైంది. ఈనెల 20న 11:25 గంటలకు వీరి వివాహం బెంగళూరులోని ఓ హోటల్లో ఘనంగా జరగనుంది. ఇప్పటికే నాగశౌర్య ఇంట పెళ్లిసందడి మొదలైంది.శుభలేఖలు కూడా పంచుతున్నారు. పెళ్ళికి భారతీయ సాంప్రదాయ దుస్తుల్లో రావాల్సిందిగా నాగశౌర్య ఫ్యామిలీ ఆహ్వానితులను కోరుతున్నారు. ఇదిలా ఉండగా నాగశౌర్య పెళ్లి చేసుకునే అనూష శెట్టి ఎవరు? ఆమె ఏం చేస్తుంటుంది? అంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు. కర్ణాటకకు చెందిన అనూష శెట్టిది మంగళూరు దగ్గరలోని కుందాపూర్. ఇంటీరియర్ డిజైనింగ్‌లో ఎంతో టాలెంట్ ఉన్న అనూష ఉమెన్ అచీవర్స్‌లో ఒకరుగా గుర్తింపు సంపాదించుకున్నారు. 2019-2020లో ది బెస్ట్ డిజైనర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అనూష అందుకున్నారు. ఆర్కిటెక్ట్ గా కర్ణాటక స్టేట్ విన్నర్ అయిన అనూషతో నాగశౌర్యకు కొన్నాళ్లుగా పరిచయం ఉందట. ఆ పరిచయం ప్రేమగా మారడంతో పెద్దలు వారి పెళ్లికి అంగీకరించినట్లు సమాచారం. నాగశౌర్య పెళ్లి కబురు తెలియడంతో అభిమానులు సహా సెలబ్రిటీలు ఆయనకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. -
పెళ్లి పీటలెక్కబోతున్న నాగశౌర్య.. వధువు ఎవరంటే..?
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈ నెల 20న బెంగళూరులో అనూష అనే యువతిని వివాహం చేసుకోబోతున్నాడు. నవంబర్ 19న మెహందీ ఫంక్షన్ ఉండటంతో ఇప్పటికే నాగశౌర్య ఇంట పెళ్లి సందడి మొదలైంది. శుభలేఖలు కూడా పంచుతున్నారు. పెళ్ళికి భారతీయ సాంప్రదాయ దుస్తుల్లో రావాల్సిందిగా నాగశౌర్య ఫ్యామిలీ ఆహ్వానితులను కోరుతోంది. నవంబర్ 20న ఉదయం 11.25 గంటలకి అనుష మెడలో మూడు ముళ్లు వేయబోతున్నాడు. నాగ శౌర్య వివాహం జరగబోతున్న సంగతి బయటికి వచ్చింది కానీ అది ప్రేమ వివాహమా? లేక పెద్దలు కుదిరించిన వివాహమా? అనే విషయం మీద మాత్రం క్లారిటీ లేదు. పెళ్లి విషయం తెలియడంతో నాగశౌర్యకు అభిమానులతో పాటు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ఇటీవల నాగశౌర్య తన 24వ సినిమాను ప్రారంభించాడు. ఈ సినిమాకు అరుణాచలం దర్శకత్వం వహిస్తున్నాడు. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని వైష్ణవి ఫిలిమ్స్ మీద శ్రీనివాసరావు, విజయ్ కుమార్, అరుణ్ కుమార్ సంయుక్తంగా నిర్మించనున్నారు. ప్రస్తుతానికి ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. -
గ్రాండ్‌గా నాగశౌర్య కొత్త సినిమా ప్రారంభం
నాగశౌర్య హీరోగా ఎస్ఎస్ అరుణాచలం దర్శకత్వంలో కొత్త సినిమా షురూ అయింది. బేబీ అద్వైత, భవిష్య సమర్పణలో వైష్ణవి ఫిలింస్‌పై శ్రీనివాసరావు చింతలపూడి, విజయ్ కుమార్ చింతలపూడి, డా.అశోక్ కుమార్ చింతలపూడి నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత అభిషేక్ అగర్వాల్ కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు వీవీ వినాయక్ క్లాప్ కొట్టారు. డైరెక్టర్ తిరుమల కిషోర్ దర్శకత్వం వహించారు. న్యూరో హాస్పిటల్ సాంబ శివారెడ్డి, ఫ్రాటెక్ సంతోష్ కుమార్ స్క్రిప్ట్‌ను యూనిట్‌కి అందజేశారు. ‘‘యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రమిది. యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌కి నచ్చే అంశాలున్నాయి. నాగశౌర్య కెరీర్లో 24వ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీలో విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు శౌర్య’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: హారిస్ జయరాజ్, కెమెరా: వెట్రి పళనిసామి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బండి భాస్కర్. -
కొత్త సినిమాను అనౌన్స్ చేసిన హీరో నాగశౌర్య
యంగ్ హీరో నాగశౌర్య రీసెంట్గా కృష్ణ వ్రింద విహారి చిత్రంతో మంచి హిట్ అందుకున్నాడు. తాజాగా ఆయన తన తర్వాతి సినిమాను ప్రకటించాడు. అరుణాచలం దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను వైష్ణవి ఫిలింస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం 1గా శ్రీనివాసరావు చింతలపూడి, విజయ్ కుమార్ చింతలపూడి, డాక్టర్ అశోక్ కుమార్ చింతలపూడి నిర్మిస్తున్నారు. నాగశౌర్య కెరీర్లో ఇది 24వ చిత్రం.యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాకు ఇంరా టైటిల్ ఖరారు చేయలేదు. త్వరలోనే గ్రాండ్‌గా ఈ సినిమాను లాంచ్ చేయనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను నాగశౌర్య ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. You gotta fight for it every single day!👍👍 Here's the beginning of an Action Extravaganza #NS24 ❤️🔥 Happy to be collaborated with @vaishnavi_films for their #ProductionNo1 & My Director @Arunachalam_SS 😊✨ Produced by #SrinivasaRao, #VijayKumar & Dr.#AshokKumar pic.twitter.com/I6oyNpdfqx — Naga Shaurya (@IamNagashaurya) November 3, 2022 -
రెండో రోజు కలెక్షన్లతో అదరగొట్టిన 'కృష్ణ వ్రింద విహారి'
యంగ్ హీరో నాగశౌర్య నటించిన తాజా చిత్రం 'కృష్ణ వ్రింద విహారి'. న్యూజిలాండ్ గాయని, నటి షిర్లే సెటియా ఈ సినిమాతో హీరోయిన్గా పరిచయం అయ్యింది. అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఐరా క్రియేషన్స్‌పై ఉష ముల్పూరి నిర్మించారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలిరోజు నుంచే మంచి కలెక్షన్లను రాబట్టిందీ చిత్రం. అయితే తాజాగా తొలిరోజు కంటే రెండోరోజు ఎక్కువ వసూళ్లను రాబట్టినట్లు మేకర్స్ తెలిపారు. అటు అమెరికాలోనూ ఈ సినిమా కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది. ఇప్పటివరకు అక్కడ లక్షడాలర్లకు పైగా వసూళ్లను రాబట్టింది. కాగా నాగశౌర్య ఇందులో సంప్రదాయ కుటుంబానికి చెందిన యువకుడి పాత్రలో కనిపించాడు.బ్రహ్మాజీ, సత్య మరియు వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రల్లొ నటించారు. Thanks to all the Overseas Audience for the Immense LOVE for our #KrishnaVrindaVihari 😊✨ $100k+ US Gross in 2 Days! ❤️🔥 Watch our #HilariousBlockbuster In Cinemas now! 🎟️ https://t.co/ZN7BGCyB6k#KVV @ShirleySetia #AnishKrishna @mahathi_sagar @ira_creations @saregamasouth pic.twitter.com/tHMigqo57b — Naga Shaurya (@IamNagashaurya) September 25, 2022 -
‘కృష్ణ వ్రింద విహారి’ మూవీ రివ్యూ
టైటిల్: కృష్ణ వ్రింద విహారి నటీనటులు: నాగశౌర్య, షిర్లే సేథియా , రాధిక, బ్రహ్మాజీ, వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ, సత్య తదితరులు నిర్మాణ సంస్థ: ఐరా క్రియేషన్స్ నిర్మాత: ఉషా ముల్పూరి దర్శకత్వం : అనీష్ ఆర్. కృష్ణ సంగీతం: మహతి స్వరసాగర్ సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్ విడుదల తేది: సెప్టెంబర్ 23,2022 ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు నాగశౌర్య. తొలి మూవీతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్నాడు. నిర్మాతగా మారి ‘ఛలో’చిత్రంతో భారీ హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత ఆయన నటించిన అశ్వథ్థామ మొదలు.. గతేడాదిలో విడుదలైన ‘వరుడు కావలెను’, ‘లక్ష్య’ వరకు వరుసగా అన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డాయి. దీంతో ఈ సారి ఎలాగైన హిట్ కొట్టాలనే కసితో ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘కృష్ణ వ్రింద విహారి’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు , పాటలకు మంచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్‌ని గ్రాండ్‌గా చేయడంతో ఈ చిత్రంపై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(సెప్టెంబర్ 23)విడుదలైన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. కృష్ణ(నాగశౌర్య)..పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ సాంప్రదాయ బ్రాహ్మిణ్ యువకుడు. అతని తల్లి అమృతవల్లి(రాధిక) మాటని ఊరంతా గౌరవిస్తుంది. ఆమె ఏం చెప్పినా..అది కచ్చితంగా జరిగి తీరుతుందని గ్రామస్తుల నమ్మకం. కొడుకుని ఉద్యోగం రిత్యా హైదరాబాద్‌లో ఉన్న అల్లుడు (బ్రహ్మాజీ) ఇంటికి పంపిస్తుంది. అక్కడ ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ అవుతాడు కృష్ణ. అక్కడ వర్క్ చేసే నార్త్ అమ్మాయి వ్రిందా(షీర్లే సేథియా)తో తొలి చూపులోనే ప్రేమలో పడిపోతాడు. ఆమెను మెప్పించడానికి చాలా ప్రయత్నాలు చేసి..చివరకు ప్రేమలో పడేస్తాడు. వ్రిందాకు ఓ ఆరోగ్య సమస్య ఉంటుంది. దానిని దాచిపెట్టి, కుటుంబ సభ్యులకు ఓ అబద్దాన్ని చెప్పి వ్రిందాను పెళ్లి చేసుకుంటాడు కృష్ణ. అసలు వ్రిందాకు ఉన్న ఆరోగ్య సమస్య ఏంటి? కుటుంబ సభ్యులతో కృష్ణ చెప్పిన అబద్దం ఏంటి? దాని వల్ల ఎదురైన సమస్యలు ఏంటి? విభిన్నమైన అలవాట్లు ఉన్న కృష్ణ, వ్రిందాల వైవాహిక జీవితం ఎలా సాగింది? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. 'కృష్ణ వ్రింద విహారి' క్లీన్ ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ. ఈ చిత్రం కథ..ఇటీవల నాని నటించిన ‘అంటే సుందరానికీ’సినిమాను గుర్తు చేస్తుంది. ఆ సినిమాలో మాదిరే ఇందులో హీరో ఓ బ్రహ్మిణ్ కుర్రాడు. హీరో, హీరోయిన్ల ఫ్యామిలీ నేపథ్యం కూడా అలానే ఉంటుంది. అయితే కథనం మాత్రం వేరుగా ఉంటుంది. తెలిసిన కథే అయినప్పటికీ.. ప్రతి సీన్ చాలా ఫ్రెష్‌గా, కామెడీగా ఉండడం ఈ సినిమాకు కలిసొచ్చింది. సినిమా ప్రారంభంలోనే కృష్ణ ఫ్యామిలీ నేపథ్యం, వారు పాటించే సంప్రదాయలను చూపించిన దర్శకుడు... కాసేపటికే కథను హైదరాబాద్‌కు తరలించాడు. అక్కడ హీరోయిన్‌తో ప్రేమలో పడడం.. ఆమెను మెప్పించడానికి హీరో నానా కష్టాలు పడడం..ఇలా సాదా సీదాగా ఫస్టాఫ్ సాగుతుంది. ఫస్టాఫ్‌లో కొంతమేర కామెడీ పండించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. కానీ అది అంతగా వర్కౌట్ కాలేదు. కానీ సెకండాఫ్‌లో మాత్రం వినోదాన్ని బాగా పండించాడు. కృష్ణ, వ్రిందాల పెళ్లి తర్వాత వచ్చే సన్నీవేశాలు, అత్త, కోడళ్ల మధ్య జరిగే పంచాయితీ నవ్వులు పూయిస్తుంది. తల్లి, పెళ్ళాం మధ్య హీరో నలిగే సన్నివేశాలకు కొత్తగా పెళ్లైన భర్తలు కనెక్ట్ అవుతారు. అలాగే కోమాలోకి వెళ్లిన వెన్నెల కిషోర్‌తో సత్య, రాహుల్ రామకృష్ణ, నాగశౌర్య కలిసే చేసే కామెడీ కూడా బాగా వర్కౌట్ అయింది. కథలో కొత్తదనం లేకున్నా.. కామెడీతో ప్రేక్షకులను కొంతమేర ఎంగేజ్ చేయడంలో దర్శకుడు సఫలం అయ్యాడనే చెప్పాలి. ఎవరెలా చేశారంటే.. కృష్ణ పాత్రలో నాగ శౌర్య మెప్పించాడు. ఈ చిత్రంలో నాగశౌర్య ఒక పల్లెటూరి కుర్రాడిగా, బ్రాహ్మిణ్ కుర్రాడిగా, సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా,అత్తా కోడళ్ల మధ్య నలిగే భర్తగా.. ఇలా భిన్నమైన కోణాల్లో కనిపిస్తాడు. వ్రిందా పాత్రకి షిర్లే సేథియా న్యాయం చేసింది. ఆమెకిది తొలి తెలుగు సినిమా. తెరపై అందంగా కనిపించింది. బ్రహ్మాజీ, సత్య, వెన్నెల కిశోర్ కామెడీ బాగా వర్కౌట్ అయింది. హీరో నాన్నగా జయప్రకాశ్, నాన్నమ్మగా అన్నపూర్ణమ్మతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. మహతి స్వరసాగర్ పాటలు అంతగా ఆకట్టుకోలేవు కానీ.. నేపథ్య సంగీతం మాత్రం చాలా బాగుంది. సాయి శ్రీరామ్ కెమెరా పనితనం బాగుంది. నాగ శౌర్య, షెర్లీని చక్కగా చూపించారు. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లు ఉన్నతంగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
ట్రైలర్ చాలా నచ్చింది
‘‘కృష్ణ వ్రింద విహారి’ రెండున్నరేళ్ల ప్రయాణం. కోవిడ్ కారణంగా చాలా ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పటికీ ఈ సినిమా నిర్మాతలైన మా అమ్మానాన్న ధైర్యంగా నిలబడి సినిమాని గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.. ఇలాంటి అమ్మానాన్నకు కొడుకుని కావడం నా అదృష్టం’’ అని నాగశౌర్య అన్నారు. అనీష్ ఆర్. కృష్ణ దర్శకత్వంలో నాగశౌర్య, షిర్లే సేథియా జంటగా నటించిన చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’. శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 23న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకకి ముఖ్య అతిథిగా హాజరైన దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా ట్రైలర్ చాలా నచ్చింది. ఫ్యామిలీ అంతా కలిసి చూసి నవ్వుకునేలా ఉంది. ఈ సినిమా శౌర్య కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అవుతుంది’’ అన్నారు. నాగశౌర్య మాట్లాడుతూ– ‘‘అనీష్ కృష్ణ నాకో మంచి సినిమా ఇవ్వబోతున్నారనే నమ్మకం ఉంది. ఈ సినిమా చాలా బాగా వచ్చింది.. ఫలితం ఏదైనా శిరస్సు వంచి తీసుకుంటా.. మీ (ప్రేక్షకుల) నమ్మకం పోగొట్టుకోను’’ అన్నారు. ‘‘ఈ సినిమాని నాగశౌర్యగారు బలంగా నమ్మారు కాబట్టే పాదయాత్ర చేశారు’’ అన్నారు అనీష్ ఆర్. కృష్ణ. -
Shirley Setia: తెలుగు సినిమాలో కివీస్ బ్యూటీ.. డబ్బింగ్ కూడా తానే..!
టాలీవుడ్లో కథానాయికలు కొత్తగా ఎంట్రీ ఇస్తూనే ఉంటారు. సాధారణంగా బాలీవుడ్ లేదా కోలీవుడ్ నుంచి ఎక్కువగా తెలుగు తెరకు పరిచయమవుతుంటారు. ఎక్కువశాతం కోలీవుడ్ నుంచే టాలీవుడ్‌కు రావడం సహజం. కానీ నాగశౌర్య తాజా చిత్రం 'కృష్ణ వ్రింద విహారి' సినిమా కోసం ఏకంగా విదేశీ భామనే తెరకు పరిచయం చేశారు దర్శక, నిర్మాతలు. న్యూజిలాండ్‌కు చెందిన ప్రముఖ సింగర్ షిర్లీ సెథియా ఈ సినిమాలో నాగశౌర్యకు జోడీగా నటించారు. (చదవండి: హీరో అయిన తర్వాతే ఇల్లు, కారు కొనుక్కున్నా: నాగశౌర్య) నాగశౌర్య హీరోగా దర్శకుడు అనీష్ ఆర్.కృష్ణ రూపొందించిన 'కృష్ణ వ్రింద విహారి'. సినిమా ఈ నెల 23వ తేదీన థియేటర్లలో ప్రేక్షకుల పలకరించనుంది. ఐరా క్రియేషన్స్ బ్యానర్‌పై ఉషా మూల్పురి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి మహతి స్వరసాగర్ సంగీతమందిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. అయితే విదేశీ నటి షిర్లీ సెథియాను అనీష్ కృష్ణ టాలీవుడ్‌కు పరిచయం చేశారు. బాలీవుడ్ భామలే తెలుగు మాట్లాడటం చాలా అరుదు. కానీ ఈ కివీస్ భామ హిందీ రాకపోయినా సినిమా కోసం తెలుగు నేర్చుకుంది. అంతే కాదండోయ్ తన పాత్రకు తానే డబ్బింగ్‌తో పాటు డైలాగ్స్‌తో అదరగొట్టింది. ఏది ఏమైనా విదేశీ నటి తెలుగు నేర్చుకుని సినిమాలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవడం ఆమె అంకితభావానికి నిదర్శనమని దర్శకుడు అనీష్ కృష్ణ ప్రశంసించారు. -
హీరో అయిన తర్వాతే ఇల్లు, కారు కొనుక్కున్నా: నాగశౌర్య
యంగ్ హీరో నాగశౌర్య నటించిన తాజా చిత్రం ‘కృష్ణ వ్రిందా విహారి’. అనీష్ ఆర్. కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాతో ప్రముఖ సింగర్ షిర్లీ సేథియా హీరోయిన్గా పరిచయం కానుంది. శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా ముల్పూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు ఈనెల 23న విడుదల కానుంది. ఈనేపథ్యంలో హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో నాగశౌర్య మాట్లాడుతూ.. రెండేళ్లు కష్టపడి ఈ సినిమా చేశాం. కోవిడ్ కారణంగా ఇబ్బందులు వచ్చినా థియేటర్లలోనే సినిమా రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యాం. చాలామంది నా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి సినమాలు చేస్తున్నా అనుకుంటారు..కానీ హీరో అయ్యాకే నేను కారు, ఇల్లు కొనుక్కున్నా. కష్టపడితే ఎవరైనా తమ కలలు నిజం చేసుకోవచ్చు అంటూ చెప్పుకొచ్చారు. -
‘కృష్ణా వ్రిందా విహారి’ ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
‘నా ఫ్రెండ్ లైఫ్‌లో జరిగిన ఓ ఘటన ఆధారంగా ‘కృష్ణా వ్రిందా విహారి’ తీశా’
‘‘నాకు ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ లేదు. నా దర్శకత్వంలో వచ్చిన తొలి సినిమాను నా స్నేహితుడే నిర్మించడంతో సులభంగానే దర్శకుడిని అయ్యాను. ఈ ఎనిమిదేళ్లలో మూడు సినిమాలు తీశాను. ఈ అనుభవంతో చాలా నేర్చుకున్నాను. ఇకపై పక్కా ప్రణాళికతో ఎక్కువ సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తాను’’ అన్నారు అనీష్ ఆర్. కృష్ణ. నాగశౌర్య, షిర్లే సేథియా జంటగా నటించిన చిత్రం ‘కృష్ణా వ్రిందా విహారి’. శంకర్ ప్రసాద్ ప్రసాద్ సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 23న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రదర్శకుడు అనీష్ కృష్ణ మాట్లాడుతూ – ‘‘నా స్నేహితుడి జీవితంలో జరిగిన ఓ ఘటన ఆధారంగా ఈ సినిమా కథ రెడీ చేసుకున్నాను. ఇందులో నాగశౌర్య బ్రాహ్మణ యువకుడు కృష్ణ పాత్ర చేశారు. శౌర్యలో ఒక రకమైన అమాయకత్వం, అల్లరి, కొంటెతనం ఉన్నాయి. అందుకే కృష్ణ పాత్రకు సరిపోయారు. కథలో హీరోయిన్ పాత్ర చాలా కీలకం. బయటకు సరదాగా, చలాకీగా కనిపిస్తున్నా అంతర్లీనంగా ఆమెకో సమస్య ఉంటుంది. ఈ సమస్యే కథను ముందుకు నడిపిస్తుంటుంది. అది వెండితెరపైనే చూడాలి’’ అన్నారు. -
తిరుపతిలో ‘కృష్ణ వ్రింద విహారి’ చిత్రబృందం హీరో నాగ శౌర్య పాదయాత్ర (ఫొటోలు)
-
అందుకే నాగశౌర్య సినిమాకి ‘కృష్ణ వ్రిందా విహారి’ టైటిల్ పెట్టాం : నిర్మాత
‘నేను ఇండస్ట్రీకి ఒక లక్ష్యంతో రాలేదు. అనుకోకుండా రావాల్సివచ్చింది. ఎప్పటికప్పుడు సినిమా అయిపోయిన తర్వాత వెళ్ళిపోదామా అనే ఆలోచనలోనే ఉన్నాను కాబట్టే వేరే హీరోలను అప్రోచ్ అవ్వలేదు. కానీ ‘కృష్ణ వ్రింద విహారి' తర్వాత నా నిర్ణయాన్ని మార్చుకున్నాను. స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు మరిన్ని చిత్రాలు నిర్మిస్తాను’అన్నారు హీరో నాగశౌర్య తల్లి, నిర్మాత ఉషా మూల్పూరి. నాగశౌర్య హీరోగా అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఉషా మూల్పూరి నిర్మిస్తున్న చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి'. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్, పాటలకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది.సెప్టెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా చిత్ర నిర్మాత ఉషా మూల్పూరి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► ‘కృష్ణ వ్రింద విహారి' కమర్షియల్ ఎంటర్ టైమెంట్ ఫ్యామిలీ మూవీ. ఈ కథకి ఒక తల్లిగా కనెక్ట్ అయ్యాను. అలాగే పిల్లల ప్రేమ, మా పెద్దబ్బాయి సాఫ్ట్ వేర్, ఇలా అన్ని ఎలిమెంట్స్ కి కనెక్ట్ అయ్యాం. ►ఈ చిత్రంలో నాగశౌర్య ఒక పల్లెటూరి కుర్రాడిగా, బ్రాహ్మిన్ కుర్రాడిగా, సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా, కొడుకుగా, ప్రేమికుడిగా, భర్తగా, స్నేహితుడిగా ఇలా భిన్నమైన కోణాల్లో కనిపిస్తాడు. ఆయన కెరీర్లో ‘కృష్ణ వ్రింద విహారి' ఒక బెస్ట్ మూవీ అవుతుందని భావిస్తున్నాను. ►ఈ చిత్రంలో 200 మంది డ్యాన్సర్‌తో కలిసి చేసిన పాటకు మంచి స్పందన లభించింది. సినిమాలో ఓ మంచి సందర్భంలో ఈ పాట వస్తుంది. విజయ్ మాస్టర్ చక్కని కొరియోగ్రఫీ చేశారు. డీవోపీ సాయిశ్రీరామ్ కూడా చాలా అందంగా ఆ పాటని చిత్రీకరీంచారు. రిలీజ్ అయిన తర్వాత ఈ పాటకు మరింత పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. 95 శాతం సినిమా పూర్తయింది. ఇప్పటివరకూ వచ్చిన అవుట్ పుట్ పై ఒక నిర్మాతగా చాలా ఆనందంగా ఉన్నాను. ►టాలీవుడ్ కి హీరోయిన్ల కొరత ఉంది. షిర్లీ సెటియా ఆ కొరతని తీరుస్తుందనే నమ్మకం ఉంది. చాలా మంచి నటి. అద్భుతంగా ఫెర్ఫార్మ్ చేసింది. ఇందులో హీరోయిన్ పేరు వ్రిందా. హీరో పేరు కృష్ణ. అందుకే చిత్రానికి కృష్ణ వ్రిందా విహారి అనే టైటిల్ పెట్టాం. ►ఈ సినిమా చేస్తున్నపుడు నిర్మాతగా నేను ఎలాంటి ఒత్తిడి లేదు. అద్భుతమైన కథ. ఆ కథకు తగ్గట్టు నటీనటులు, సాంకేతిక నిపుణలని ఎంపిక చేసుకున్నాం. ఈ సినిమాపై మాకు చాలా నమ్మకం ఉంది. సినిమా చాలా ఫ్రెష్ గా ఉంటుంది. శౌర్య అద్భుతంగా చేశాడు. రాధిక, వెన్నెల కిషోర్, బ్రహ్మజీ, రాహుల్ రామకృష్ణ, సత్య అందరి పాత్రలు బావుంటాయి. దర్శకుడు అనీష్ తనదైన శైలిలో ఈ చిత్రాన్ని అద్భుతంగా డీల్ చేశారు. సినిమా అందరికీ నచ్చుతుంది. ఎవరినీ నిరాశ పరచదు. మా బ్యానర్ ఇది చాలా మంచి చిత్రమౌతుంది. ► ఇప్పటికే కొన్ని కథలు విన్నాం. అయితే ఇప్పుడు కొత్త సినిమా ఆలోచన లేదు. నిండు గర్భిణి బిడ్డని కన్న తర్వాతే మరో బిడ్డ గురించి ఆలోచిస్తుంది. ప్రస్తుతం ఆ పరిస్థితిలో వున్నాను. ప్రస్తుతం నా దృష్టి అంతా ఈ చిత్రం విడుదలపైనే ఉంది. -
టైటిల్ పాజిటివ్‌గా ఉంది
‘‘హైవే’ టైటిల్ పాజిటివ్‌గా ఉంది. ట్రైలర్ చూడగానే ‘ఆవారా, రాక్షసుడు’ చిత్రాలు చూసినట్టుంది. ఇలాంటి మంచి సినిమాలు తీస్తున్నందుకు నిర్మాత వెంకట్‌గారికి థ్యాంక్స్’’ అని హీరో నాగశౌర్య అన్నారు. ఆనంద్ దేవరకొండ, మానస జంటగా కేవీ గుహన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హైవే’. నార్త్‌స్టార్ సమర్పణలో శ్రీ ఐశ్వర్యలక్ష్మి మూవీస్, వెంకట్ తలారి ప్రొడక్షన్స్‌లో రూపొందిన ఈ సినిమా ఈ నెల 19న ‘ఆహా’ ఓటీటీలో రిలీజ్ అవుతోంది. ఈ సినిమా ట్రైలర్‌ను నాగశౌర్య విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘నాకు లవర్ బాయ్ అని ప్రేక్షకులు ట్యాగ్ ఇచ్చారు. కానీ ఆనంద్కి ఎలాంటి ట్యాగ్ లేకపోవడంతో వేర్వేరు జానర్ల సినిమాలను చేస్తున్నారు.. అది చాలా గొప్ప లక్షణం’’ అన్నారు. ‘‘హైవే’ చక్కని ప్రయోగాత్మక చిత్రం’’ అన్నారు ఆనంద్ దేవరకొండ. ‘‘సరికొత్త కథాంశంతో రూపొందిన మా సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తా రని ఆశిస్తున్నాను’’ అన్నారు కేవీ గుహన్. ‘‘అద్భుతమైన థ్రిల్లర్ చిత్రం ఇది’’ అన్నారు నిర్మాత శరత్ మరార్. ‘ఆహా’ మార్కెటింగ్ హెడ్ కార్తీక్, హీరోయిన్ మానస మాట్లాడారు. -
'హైవే'మూవీ ట్రైలర్ లాంచ్ వేడుక (ఫోటోలు)
-
అమ్మాయి లైఫ్ సేవ్ చేయాలంటున్న ఆనంద్ దేవరకొండ
Anand Deverakonda HighWay Trailer Released By Naga Shaurya: 'దొరసాని' సినిమాతో తెలుగు వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన ఆనంద్ 'మిడిల్ క్లాస్ మెలోడీస్'తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఆనంద్ దేవరకొండ. అనంతరం వచ్చిన 'పుష్పక విమానం' చిత్రంతో పర్వాలేదనిపించుకున్నాడు. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. అయితే ఈసారి థియేటర్లో కాకుండా డైరెక్ట్‌గా ఓటీటీ ద్వారా రానున్నాడు ఆనంద్ దేవరకొండ. ఇందులో ఆనంద్ దేవరకొండకు జోడీగా మానస అలరించనుండగా, అభిషేక్ బెనర్జీ కీలక పాత్ర పోషించారు. కె.వి గుహన్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా నిర్మించింది. ఈ సినిమా ఆగస్టు 19న నేరుగా ఆహాలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మంగళవారం (ఆగస్టు 16) మూవీ ట్రైలర్‌ను హీరో నాగశౌర్య విడుదల చేశాడు. 'నగరంలో వరుస హత్యలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న సైకో కిల్లర్' అనే న్యూస్‌తో ప్రారంభమైన ఈ ట్రైలర్ ఆద్యతం ఉత్కంఠంగా సాగింది. చదవండి: నేను పెళ్లి చేసుకునే సమయానికే ఆమెకు ఒక బాబు: బ్రహ్మాజీ Get ready for this spine chilling thriller. #HighwayOnAHA Premieres August 19. ▶️https://t.co/aDUgzFE7Mf@ananddeverkonda @SaiyamiKher @nowitsabhi @kvguhan @simonkking #VenkatTalari pic.twitter.com/rWPm0EKRJE — ahavideoin (@ahavideoIN) August 16, 2022 'ఒక అమ్మాయి లైఫ్ సేవ్ చేసేందుకే నీ హెల్ప్ కావాల్సి వచ్చింది', 'మనతో గడుపుతుంది ఈ కొన్ని గంటలైన, తను నన్ను జీవితాంతం మర్చిపోకుడదురా' వంటి డైలాగ్‌లు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇందులో ఆనంద్ దేవరకొండ లుక్ కొత్తగా ఉంది. ఫొటోగ్రాఫర్ అయిన హీరో ప్రేమలో పడుతాడు. సాఫీగా సాగుతున్న అతని ప్రేమ కథలోకి ఓ సీరియల్ సైకో కిల్లర్ ఎంట్రీతో ఎలాంటి మలుపు తిరిగింది? అనే కథతో ఈ సినిమా రూపొందినట్లు తెలుస్తోంది. చదవండి: బిగ్‌బాస్ బ్యూటీకి లైంగిక వేధింపులు.. ఆవేదనతో పోస్ట్ -
నాగశౌర్య ‘కృష్ణ వ్రిందా విహారి’ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్
యంగ్ హీరో నాగశౌర్య నటించిన తాజా చిత్రం ‘కృష్ణ వ్రిందా విహారి’. అనీష్ ఆర్. కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాతో ప్రముఖ సింగర్ షిర్లీ సేథియా హీరోయిన్గా పరిచయం కానుంది. శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా ముల్పూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సింది. కానీ పలు అనివార్య కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకిటించారు మేకర్స్. ‘కృష్ణ వ్రిందా విహారి’ సినిమాను సెప్టెంబర్ 23న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. రిలీజ్ డేట్ ప్రకటిస్తూ పోస్టర్ విడుదల చేశారు.మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ, రాధికా శరత్‌కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. -
ఘనంగా నాగశౌర్య సోదరుడి వివాహం, ఫొటోలు వైరల్
టాలీవుడ్ యంగ్ హీరో ఇంట పెళ్లి బాజాలు మోగాయి. యువ కథానాయకుడు నాగశౌర్య సోదరుడు గౌతమ్ ఓ ఇంటివాడయ్యాడు. జూన్ 23న నమ్రత గౌడను వివాహమాడాడు. అమెరికాలో ఎంతో గ్రాండ్‌గా వీరి వివాహం జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు సహా అతి కొద్ది మంది మాత్రమే హాజరయ్యారు. అయితే గౌతమ్ తమ్ముడు నాగశౌర్య మాత్రం గైర్హాజరయ్యాడు. అతడు యూకేలో షూటింగ్లో బిజీగా ఉండటంతో పెళ్లికి హాజరు కాలేనట్లు తెలుస్తోంది. దీంతో శౌర్య తల్లిదండ్రులు వీడియో కాల్ ద్వారా గౌతమ్ పెళ్లిని చూపించారు. ప్రస్తుతం గౌతమ్ పెళ్లి ఫొటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. ఇక నాగశౌర్య విషయానికి వస్తే.. ఊహలు గుసగులాడే సినిమాతో సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమా హిట్ కావడంతో అతడి ఐదేళ్ల నిరీక్షణ ఫలించినట్లయింది. ఒక్క ఛాన్స్ అంటూ ఎదురు చూసిన అతడికి అవకాశాలు క్యూ కట్టాయి. ప్రస్తుతం అతడు నటించిన కృష్ణ వ్రింద విహారి రిలీజ్‌కు రెడీగా ఉంది. View this post on Instagram A post shared by Priya Kamath (@priyas_blissful_mehendi) చదవండి: నడిరోడ్డుపై యంగ్ హీరోయిన్ చిందులు.. వీడియో వైరల్ -
‘కృష్ణ వ్రిందా విహారి’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. వచ్చేది అప్పుడే
Krishna Vrinda Vihari Movie New Release Date Announced: యంగ్ హీరో నాగశౌర్య నటించిన తాజా చిత్రం ‘కృష్ణ వ్రిందా విహారి’. అనీష్ ఆర్. కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాతో ప్రముఖ సింగర్ షిర్లీ సేథియా హీరోయిన్గా పరిచయం కానుంది. ఈ చిత్రాన్ని శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా ముల్పూరి నిర్మించారు. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సింది. కానీ పలు అనివార్య కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకిటించారు మేకర్స్. ‘కృష్ణ వ్రిందా విహారి’ సినిమాను ప్రపంచవ్యాప్తంగా మే 20న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. రిలీజ్ డేట్ ప్రకటిస్తూ పోస్టర్ విడుదల చేశారు. ఇందులో నాగశౌర్య ఏదో ఆలోచిస్తూ సూపర్ కూల్‌గా ఉన్నాడు. ఇటీవల విడుదల చేసిన టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగశౌర్య బ్రహ్మణ యువకుడిగా అలరించనున్నాడు. మహతి స్వర సాగర్ సంగీతం అందించిన ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ రాధికా శరత్ కుమార్ ఓ కీలక పాత్ర పోషించనున్నారు. చదవండి: ఎన్టీఆర్ నాగశౌర్యకు ఏమవుతాడు? క్లారిటీ ఇచ్చిన శౌర్య తల్లి Coming to you as Krishna with lots of love & laugh. May 20th - Get Set for Summer treat people🥳#KrishnaVrindaVihari on May 20th🎋 #KVV @ShirleySetia #AneeshKrishna #SaiSriram @realradikaa @ira_creations @mahathi_sagar @saregamasouth #KrishnaVrindaVihariOnMay20 pic.twitter.com/z7CGOV7P0G — Naga Shaurya (@IamNagashaurya) April 23, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1151264010.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
‘కృష్ణ వ్రిందా విహారి’ ఫస్ట్ లిరికల్ సాంగ్ ఎప్పుడంటే
నాగశౌర్య, షిర్లీ సేథియా జంటగా రాధిక కీలక పాత్రలో నటించిన చిత్రం ‘కృష్ణ వ్రిందా విహారి’.అనీష్ ఆర్. కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా ముల్పూరి నిర్మించారు. ఈ సినిమాతో షిర్లే సెటియా కథానాయికగా తెలుగు తెరకి పరిచయమవుతోంది. ఏప్రిల్ 22న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌ని స్టార్ట్ చేసిన చిత్ర యూనిట్ తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేసింది.“వర్షంలో వెన్నెల్లా” అనే సాంగ్‌ని ఏప్రిల్9న విడుదల చేయనున్నట్లు మూవీ టీం పేర్కొంది. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాలో సీనియర్ నటి రాధిక కీలక పాత్రలో కనిపించనున్నారు. వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య, బ్రహ్మాజీ తదితరులు ముఖ్య పాత్రలు పోషించనున్నారు. This will amaze you all .. 🎵 Our First Single #VarshamloVennella Lyrical Video is releasing on April 9th! 💕😊#KrishnaVrindaVihari@ShirleySetia #AnishKrishna @mahathi_sagar #SaiSriram @ira_creations @saregamasouth pic.twitter.com/oA95qm79nM — Naga Shaurya (@IamNagashaurya) April 7, 2022 -
ఎన్టీఆర్ నాగశౌర్యకు ఏమవుతాడు? క్లారిటీ ఇచ్చిన శౌర్య తల్లి
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఊహలు గుసగుసలాడే సినిమాతో ప్రేక్షకులకు దగ్గరైన శౌర్య ఛలో సినిమాతో మంచి హిట్ కొట్టారు. అందంతో పాటు టాలెంట్ కూడా ఈ యంగ్ హీరోకి ఇప్పటివరకు అనుకున్నంతగా సక్సెస్ రాలేదు. తాజాగా కృష్ణ వ్రింద విహారి సినిమాతో త్వరలోనే ప్రేక్షకులను పలకరించనున్నారు.చదవండి: ఎన్టీఆర్‌ను డామినేట్ చేశారా? చరణ్ ఆన్సర్ అదిరిందిగా ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నాగశౌర్య తల్లి ఉషా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇక ఇండస్ట్రీకి అడుగుపెట్టినప్పటి నుంచి శౌర్యకి ఎన్టీఆర్ కుటుంబంతో బంధుత్వం ఉందంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ వార్తలపై నాగశౌర్య తల్లి ఉషా క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..శౌర్యకు ఎన్టీఆర్ అంటే అభిమానం. ఇక తారక్ భార్య లక్ష్మీ ప్రణతి కజిన్‌కు శౌర్య మంచి ఫ్రెండ్. ఆ విధంగా రూమర్స్ వచ్చి ఉండొచ్చు. కానీ వాళ్లు కుటుంబంతో బంధుత్వం లేదు కానీ ఫ్యామిలీ ఫ్రెండ్‌లా ఉంటారు అంటూ చెప్పుకొచ్చింది. దీంతో నాగ శౌర్యకి ఎన్టీఆర్ బంధువు అవుతారన్న వార్తల్లో నిజం లేదని స్పష్టమైపోయింది. చదవండి: ఇదెక్కడి మాస్ మేనియా.. ఎగ్జామ్ పేపర్లో 'పుష్ప' డైలాగులు -
‘కృష్ణ వ్రిందా విహారి’ టీజర్ వచ్చేస్తుంది
నాగశౌర్య, షిర్లీ సేథియా జంటగా రాధిక కీలక పాత్రలో నటించిన చిత్రం ‘కృష్ణ వ్రిందా విహారి’. అనీష్ ఆర్. కృష్ణ దర్శకత్వం వహించారు. శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా ముల్పూరి నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 22న విడుదల కానుంది.ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌ని స్టార్ట్ చేసింది చిత్రయూనిట్. ఇందులో భాగంగా మార్చి 28న టీజర్‌ని విడుదల చేయనున్నట్లు ప్రకటిస్తూ.. కొత్త పోస్టర్ని వదిలింది చిత్రబృందం. ‘‘రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది. నాగశౌర్య బ్రాహ్మణ యువకుడిగా నటించారు. ఈ చిత్రిం షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌లుక్స్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మార్చి 28న విడుదల చేసే టీజర్ తప్పకుండా అందరికి నచ్చుంది’అని చిత్ర యూనిట్ పేర్కొంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో అలనాటి నటి రాధిక ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య, బ్రహ్మాజీ తదితరుల నటిస్తున్న ఈ సినిమాకు మహతి స్వరసాగర్ సంగీతమందిస్తున్నారు. -
నాగశౌర్య 'కృష్ణ వ్రింద విహారి' వచ్చేది అప్పుడే..
Naga Shaurya Krishna Vrinda Vihari Movie Release Date Out: యంగ్ హీరో నాగశౌర్య వరుస పెట్టి సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ బిజీగా ఉన్నాడు. ఇటీవలే వరుడు కావలెను, లక్ష్య, అశ్వథ్థామ వంటి విభిన్న చిత్రాలలో హీరోగా మెప్పించాడు. తాజాగా నాగశౌర్య కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'కృష్ణ వ్రింద విహారి'. అనీష్ ఆర్. కృష్ణ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రముఖ సింగర్ షిర్లే సెటియా హీరోయిన్గా చేస్తోంది. ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా మూల్పూరి నిర్మించగా శంకర్ ప్రసాద్ మూల్పూరి సమర్పిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ విడుదల తేదిని ప్రకటించారు మేకర్స్. 'కృష్ణ వ్రింద విహారి ఏప్రిల్ 22న వస్తున్నాడు' అంటూ ట్విటర్ వేదికగా పోస్టర్ షేర్ చేశారు. ఈ సినిమా కుటుంబంతో చూడదగిన పూర్తి వినోదాత్మక చిత్రమని టాలీవుడ్ వర్గాలు తెలిపాయి. నాగశౌర్య భిన్నంగా, సరికొత్త రోల్ చేస్తున్నట్లు వెల్లడించాయి. ఒక సాంగ్ తప్ప మిగతా షూటింగ్ సుమారు పూర్తయిందని సమాచారం. ఈ సినిమాలో సీనియర్ నటి రాధిక కీలకపాత్ర పోషిస్తున్నారు. వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య, బ్రహ్మాజీ తదితరుల నటిస్తున్న ఈ సినిమాకు మహతి స్వరసాగర్ సంగీతమందిస్తున్నారు. సాయి శ్రీరామ్ ఛాయాగ్రహణం బాధ్యతలు స్వీకరించారు. KRISHNA and VRINDA are ready with Loads of Entertainment !!! 🤩#KrishnaVrindaVihari ❤️ is Arriving to Theatres on APRIL 22nd, 2022🎋@IamNagashaurya @ShirleySetia #AneeshKrishna #SaiSriram @realradikaa @ira_creations @mahathi_sagar @saregamasouth#KrishnaVrindaVihariOnApr22 pic.twitter.com/uYwxi6idQF — Ira Creations (@ira_creations) March 7, 2022 -
Naga Shaurya:బర్త్‌డే గిఫ్ట్ అదిరిందిగా
సాక్షి, హైదరాబాద్: యంగ్ హీరో నాగశౌర్య పుట్టినరోజు కానుకగా తనకొత్త సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది చిత్రబృందం. వరుస ఆఫర్లు దక్కించుకుంటూ. నటుడుగా తన ప్రత్యేకతను చాటుకుంటున్న నాగ శౌర్య ప్రస్తుతం నాలుగు మూవీలతో బిజీబిజీగా ఉన్నాడు. 'కృష్ణ వ్రింద విహారి' సరికొత్త మూవీలో వెరైటీ లుక్‌తో ప్రేక్షకులను అలరించనున్నాడు. తాజాగా విడుదల చేసిన ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ లో శౌర్య ట్రెడిషనల్ లుక్‌లో అదరగొడుతున్నాడు. కృష్ణ వృంద ప్రేమ కథగా ఈ మూవీతెరకెక్కనుంది.(Naga Shaurya: టాలెంటెడ్ హీరో కెరియర్ అండ్ గ్రోత్ ఎలా ఉందంటే!) అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో వస్తున్న మూవీలో షిర్లీ సేతియా హీరోయిన్గా నటిస్తున్నారు. అలాగే ఈ మూవీలో సినియర్ నటి రాధిక ఒక ప్రత్యేక పాత్రలో అలరించనున్నారు. వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య, బ్రహ్మాజీ ఇతర కీలక పాత్రల్లో నటించనున్నారు. కాగా నాగశౌర్య తన లేటెస్ట్ ‘లక్ష్య, వరుడు కావలెను’ మూవీలను ఓటీటీలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. It's a Crazy experience & #Krishna will be Loved by all! ❤️ Here's the First Look Poster of #NS22 #IRA4 😍 ✨ #𝐊𝐫𝐢𝐬𝐡𝐧𝐚𝐕𝐫𝐢𝐧𝐝𝐚𝐕𝐢𝐡𝐚𝐫𝐢 ✨@ShirleySetia #AneeshKrishna #SaiSriram @realradikaa @mahathi_sagar @YEMYENES @ira_creations @UrsVamsiShekar pic.twitter.com/VHbemaEPFv — Naga Shaurya (@IamNagashaurya) January 22, 2022 -
టాలెంటెడ్ యంగ్ హీరో కెరియర్ అండ్ గ్రోత్ విశేషాలు
Happy Birthday Naga Shaurya: వరుస ఆఫర్లతో సక్సెస్‌పుల్‌గా కరియర్‌ను ట్రాక్‌లో నడిపిస్తున్న టాలెంటెడ్ అండ్ హార్డ్ వర్కింగ్ టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య.'చందమామ కథలు' సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టి 'ఊహలు గుసగుసలాడే' అంటూ అమ్మాయిల గుండెల్లో గిలిగింతలు పెట్టాడు. క్యూట్ లుక్స్‌తో, లవర్ బాయ్‌లా ఛలో అంటూ సూపర్ హిట్ కొట్టేశాడు. ఇటీవల ఎయిట్ ప్యాక్ బాడీతో అదరగొట్టి ‘లక్ష్య’న్ని మిస్ చేసుకున్నాడు. ఇపుడిక వరుడు కావలెను అంటూ ఓటీటీలో సందడి చేస్తున్నాడు. జనవరి 22 నాగశౌర్య పుట్టినరోజు సందర్భంగా ఈ లవర్‌బాయ్ గురించిన విశేషాలపై ఓ లుక్కేద్దామా! మాంచి ఒడ్డూ పొడుగుతో అందమైన నవ్వుతో టాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు నాగశౌర్య. తొలి సినిమాతో ఎట్రాక్ట్ చేసి వరుస అవకాశాలు అందిపుచ్చుకున్నాడు. 'కల్యాణ వైభోగమే' 'దిక్కులు చూడకు రామయ్యా' 'జ్యో అచ్యుతానంద' 'ఒక మనసు' చిత్రాతో ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు మాస్ ఆడియన్స్‌కి కూడా దగ్గరయ్యాడు. ఇక అక్కడినుంచి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా వరుస అవకాశాలను దక్కించుకున్నాడు. ముఖ్యంగా రష్మిక మందన్న హీరోయిన్గా నటించిన 'ఛలో' తో సూపర్ హిట్ అందుకున్న నాగశౌర్య ఆ తరువాత దూకుడును మరింత పెంచాడు. నాగశౌర్య ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరులో జన్మించాడు. సినీరంగంలో ప్రవేశానికి ముందుగా టెన్నిస్ ఆడేవాడట. విజయవాడలో ఉంటున్న రోజులనుంచి సినిమాలలో నటించాలనేకోరిక పుట్టింది. అలా తన డ్రీమ్స్ సాకారం కోసం హైదరాబాదు షిప్ట్ అయ్యాడు. ఐదు సంవత్సరాలు నటనలో శిక్షణ కూడా తీసుకున్నాడు. ఇక సినిమాలు మన వల్ల కాదులే అనుకుంటున్న టైంలో అనూహ్యంగా 2011లో సినీ రంగంలోకి ఎంట్రీ దొరికింది. అవసరాల శ్రీనివాస్ నిర్మిస్తున్న ఊహలు గుసగుసలాడే మూవీలో లీడ్ రోల్ పోషించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. కమర్షియల్‌గా సక్సెస్‌ను అందుకున్నాడు. తరువాత దిక్కులు చూడకు రామయ్య, లక్ష్మీ రావే మా ఇంటికి, 2015లో జాదూగాడు, అబ్బాయితో అమ్మాయి మూవీల ద్వారా నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2016లో మెగా డాటర్ నీహారిక కొణిదెలకు జోడీగా ఒక మనసు, మాళవిక నాయర్ హీరోయిన్గా కళ్యాణ వైభోగమే సినిమాలతో ఆకట్టుకున్నాడు. ఇక ఆ తరువాత వరుడు కావలెను, 'లక్ష్య' సినిమాల్లో నటించాడు. కానీ ఛలో మూవీ అంతటి రేంజ్ హిట్ దక్కలేదు. వరుస ఆఫర్లు వస్తున్నా బ్లాక్ బ్టస్టర్ హిట్ కొట్టడంలో మాత్రం విఫలమవుతున్నాడు. అందుకే ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టే తన మూవీలను ఓటీటీ బాట పట్టించాడు. ముఖ్యంగా ఆర్చరీ నేపథ్యంలో తీసిన ‘లక్ష్య’ సినిమాకు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితం దక్కలేదు. కండలు తిరిగిన బాడీతో కసరత్తు చేసినా లక్ష్య టార్గెట్ రీచ్ కాలేదు. నాగశౌర్య, రీతూవర్మ జంటగా నటించిన వరుడు కావలెను, కేతికశర్మ హీరోయిన్గా నటించిన లక్ష్య మూవీలను ఓటీటీద్వారా విడుదల చేసితన అదృష్టాన్ని పరీక్షించు కుంటున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలు గత ఏడాది చివరలో రిలీజయ్యాయి. మరోవైపు నాగశౌర్య బర్త్ డే స్పెషల్‌గా అప్ కమింగ్ మూవీలపై ఇవ్వనున్న అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. -
అప్పుడే ఓటీటీకి నాగశౌర్య లక్ష్య మూవీ, స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
Naga Shaurya Lakshya Movie Streaming On OTT: యంగ్ హీరో నాగ శౌర్య, ‘రొమాంటిక్ మూవీ బ్యూటీ కేతిక శర్మ జంటగా నటించిన చిత్రం లక్ష్య. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 10న థియేటర్లో విడుదలైన సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ డ్రామా తెరకెక్కిన ఈమూవీ బాక్సాఫీసు వద్ద పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. విలువిద్య నేపథ్యంలో సాగే ఈ సినిమా కోసం నాగశౌర్య ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాడు. అంతేగాక సిక్స్ ప్యాక్‌తో అందరిని ఆకట్టుకున్నాడు. ఈ మూవీలో రెండు విభిన్న లుక్‌లో అలరించిన నాగశౌర్య నటనకు మంచి రెస్పాన్స్ వచ్చింది. చదవండి: తన ఫిట్నెస్ సీక్రెట్ రివీల్ చేసిన సామ్, షాకవుతున్న నెటిజన్లు ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో విడుదల కాబోతోంది. మూవీ రిలీజ్ నెల రోజుల కూడా కాకముందే లక్ష్య డిజిటిల్ ప్లాట్‌ఫాంలో సందడి చేయడం విశేషం. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ‘ఆహాలో 2022 జనవరి 7 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆహా ట్విట్టర్ ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించింది. సోనాలి నారంగ్ సమర్ఫణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. కాళ భైరవ సంగీతాన్ని సమకుర్చారు. చదవండి: ఓటీటీ రిలీజ్‌కు రెడీ అవుతోన్న శ్యామ్ సింగరాయ్!, స్ట్రీమింగ్ ఎప్పుడంటే.. గమనమా, గమ్యమా? ఏది ముఖ్యం? Watch sports action drama #Lakshya Jan 7 on aha.@IamNagashaurya #KetikaSharma @IamJagguBhai @SVCLLP @nseplofficial @Santhosshjagar1 @kaalabhairava7 @AsianSuniel @sharrath_marar @RaamDop @adityamusic pic.twitter.com/3xCb5pFrax — ahavideoIN (@ahavideoIN) December 27, 2021 -
‘లక్ష్య’ మూవీ రివ్యూ
టైటిల్ : లక్ష్య నటీనటులు : నాగశౌర్య, కేతిక శర్మ, జగపతిబాబు, సచిన్ ఖేడేకర్, శత్రు, రవిప్రకాశ్, సత్య తదితరులు నిర్మాణ సంస్థ: శ్రీ వెంకటేశ్వర సినిమాస్, నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్ నిర్మాతలు : నారాయణ దాస్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ దర్శకత్వం: ధీరేంద్ర సంతోష్ జాగర్లమూడి సంగీతం : కాలభైరవ సినిమాటోగ్రఫీ :రామ్‌రెడ్డి ఎడిటింగ్: జునైద్ సిద్దిఖీ విడుదల తేది : డిసెంబర్ 10, 2021 Lakshya Movie Review: ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో హీరోగా కెరీర్‌ను స్టార్ట్ చేసిన నాగశౌర్య .. ఆ మూవీతో మంచి గుర్తింపునే సంపాదించుకున్నాడు. ఆ తర్వాత సినిమా సినిమాకూ వైవిధ్యాన్నిచూపిస్తూ టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్నాడు. చాలా తక్కువ సమయంలోనే ఇరవై పైగా సినిమాలను పూర్తి చేసుకున్నాడు. ‘ఛలో’సినిమాతో నిర్మాతగా మారి తొలి చిత్రమే హిట్ కొట్టాడు. ఆ తర్వాత ఆయన నిర్మాతగా, హీరోగా చేసిన నర్తనశాల, అశ్వథ్థామ బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డాయి. దీంతో చాలా గ్యాప్ తీసుకొని ఇటీవల లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘వరుడు కావలెను’తో ప్రేక్షకులను పలకరించాడు. అది కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో మరోసారి ప్రయోగానికి సిద్దమై.. తన కెరీర్లోనే తొలిసారిస్పోర్ట్స్ బేస్డ్ కాన్సెప్ట్‌తో ‘లక్ష్య’ మూవీ చేశాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు కూడా సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. దానికి తోడు ప్రమోషన్స్‌ని కూడా కొత్తగా, చాలా గ్రాండ్‌గా చేయడంతో ‘లక్ష్య’పై హైప్ క్రియేట్ చేశాయి. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(డిసెంబర్ 10) ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఏ మేరకు ఆకట్టుకుంది? మరి ఈ సినిమా నాగశౌర్యను హిట్ ట్రాక్ ఎక్కించిందా? రివ్యూలో చూద్దాం కథేంటంటే.. పార్ధు(నాగశౌర్య) తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవడంతో.. తాతయ్య రఘురామయ్య(సచిన్ ఖేడేకర్)దగ్గరే పెరుగుతాడు. అతని తండ్రి లాగే పార్దుకు కూడా విలువిద్య అంటే చాలా ఇష్టం. అతనిలోని క్రీడాకారుడిని గుర్తించిన తాతయ్య.. ఎలాగైన తన మనవడిని గొప్ప ఆర్చరీ ప్లేయర్ చేయాలని భావిస్తాడు. దాని కోసం ఊరిని వదిలి సిటీకి వస్తాడు. ఆస్తులన్ని అమ్మి మరీ మనవడి కోచింగ్ ఇప్పిస్తాడు. పార్ధు కూడా కష్టపడి స్టెట్ లెవన్ చాంపియన్ అవుతాడు. ఆ తర్వాత వరల్డ్ చాంపియన్ ట్రయల్స్‌కి సన్నద్దం అయ్యే సమయంలో గుండెపోటుతో తాతయ్య మరణిస్తాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన పార్ధు.. మత్తు పదార్ధాలకు బానిస అవుతాడు. డ్రగ్స్ తీసుకుంటేనే అతను వదిలిన బాణం గురి తప్పేది కాదు. ఈ విషయం తెలిసి అకాడమీ అతన్ని సస్పెండ్ చేస్తుంది. అసలు పార్థు మత్తు పదార్ధాలకు బానిస కావడానికి కారణం ఎవరు? అతని జీవితంలో రితికా పాత్ర ఏంటి? చనిపోదామనుకున్న సమయంలో పార్ధుని కాపాడిన సారథి(జగపతిబాబు)..ఎవరు? అతని నేపథ్యం ఏంటి? విలువిద్యకు దూరమైన పార్థు మళ్లీ చేత బాణం పట్టి రాణించాడా? వరల్డ్ చాంపియన్‌గా చూడాలనుకున్న తాతయ్య కోరికను నెరవేర్చాడా? అనేదే మిగతా కథ. ఎవరెలా చేశారు? ఆర్చరీ ప్లేయర్ పార్థుగా నాగశౌర్య చక్కగా నటించాడు. ఈ సినిమాకు కోసం ఎనిమిది పలకల దేహాన్ని తయారు చేశాడు. అతను పడ్డ కష్టం తెరపై కనిపించింది. లుక్ పరంగా నాగశౌర్య చాలా కొత్తగా కనిపించాడు. తాతయ్య చనిపోయినప్పుడు వచ్చిన ఎమోషనల్ సీన్స్‌లో కూడా చక్కగా నటించాడు. ఇక ‘రొమాంటిక్’భామ కేతికా శర్మ.. రితికా పాత్రకు న్యాయం చేసింది. గ్లామర్‌తో కాకుండా నటనతో ఆకట్టుకుంది. హీరో తాతయ్యగా సచిన్ ఖేడేకర్ మరోసారి తన అనుభవాన్ని తెరపై చూపించాడు. సారథిగా జగపతి బాబు నటన బాగుంది. సత్య, భరత్ రెడ్డి, శత్రులతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. ఎలా ఉందంటే.. క్రీడా నేపథ్యం ఉన్న సినిమాలో తెలుగులో చాలానే వచ్చాయి. ఒక్కడు, సై తో పాటు ఈ ఏడాదిలో వచ్చిన నితిన్ ‘చెక్’, సందీప్ కిషన్ ‘ ఏ1 ఎక్స్‌ప్రెస్’ కూడా ఆ నేపథ్యంలో తెరకెక్కినవే. అయితే ‘లక్ష్య’ ప్రత్యేకత ఏంటంటే.. పూర్తిగా విలువిద్య నేపథ్యంలో వచ్చిన తొలి సినిమా ఇది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌తో పాటు తాత మనవడి సెంటిమెంట్ కూడా ఉంది. అయితే అది తెరపై చూపించడంలో దర్శకుడు విఫలమయ్యాడు. ఫస్టాప్ అంతా సింపుల్‌గా, పాత సినిమాలు చూసినట్లుగా సాగుతుంది. ఎక్కడా వావ్ అనే సీన్స్ కానీ, ట్విస్టులు కానీ ఉండవు. కథంతా ముందే తెలిసిపోతుంది. హీరో డ్రగ్స్‌కి బానిస కావడం, దానికి కారణం ఎవరై ఉంటారనేది కూడా సినిమా చూసే సగటు ప్రేక్షకుడు ఇట్టే పసిగట్టగలడు. ప్రేక్షకుడి ఊహకు అనుగుణంగా కథ సాగడం సినిమాకు మైనస్. ఇంటర్వెల్ సీన్ కూడా పెద్దగా ఇంట్రెస్టింగ్ అనిపించదు. సెకండాప్లో జగపతి బాబు ఎంట్రీ తర్వాత కాస్త ఆసక్తి కరంగా సాగుతుంది అనుకుంటే.. అక్కడ కూడా నిరాశే ఎదురవుతుంది. కథ డిమాండ్ మేరకే ఎనిమిది పలకల దేహాన్ని తయారు చేశానని ఇంటర్యూల్లో నాగశౌర్య చెప్పారు. కానీ కథకు అది ఏరకంగా అవసరమే తెరపై చూపించలేకపోయాడు. క్లైమాక్స్ సీన్స్ కూడా చప్పగా సాగుతాయి. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకూ కొత్తగా ఏమీ సాగదు. ఇక కాలభైరవ సంగీతం కూడా అంతంత మాత్రమే అనే చెప్పాలి. గతంలో మంచి పాటలు, నేపథ్య సంగీతం ఇచ్చిన కాలభైరవ లాంటి యంగ్ మ్యూజిక్ డైరక్టెర్ నుంచి దర్శకుడు మంచి సాంగ్స్‌ని రాబట్టుకోలేకపోయాడు. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా వర్కౌట్ కాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లు ఉన్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే.. దర్శకుడు వదిలిన బాణం గురి తప్పింది. కలెక్షన్ల పరంగా ‘లక్ష్య’ లక్ష్యం ఏమేరకు నెరవేరుతుంతో వీకెండ్ వరకు వేచి చూడాలి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
నాగ చైతన్య చేతుల మీదుగా ‘లక్ష్య’ మూవీ సాంగ్
నాగశౌర్య హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘లక్ష్య’. నారాయణ దాస్ నారంగ్.. రామ్మోహన్ రావు.. శరత్ మరార్ ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. విలువిద్య నేపథ్యంలో.. బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఈ కథ నడుస్తుంది. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదలైన సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈమూవీ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ ట్రైలర్ చూసిన హీరో విక్టరి వెంకటేష్ ట్రైలర్ సినిమా విడుదలపై మరింత హైప్ క్రియేట్ చేసిందని, ఊహించిన దానికంటే సినిమా మరో లెవల్లో ఉండబోతుందంటూ మూవీ టీంపై ప్రశంసలు కురిపించాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీలోని పాటను యంగ్ హీరో, అక్కినేని వారసుడు నాగ చైతన్య విడుదల చేశాడు. ‘సయా సయా’ అంటూ సాగే రొమాంటిక్ లిరికల్ సాంగ్‌ను చైతన్య చేతుల మీదుగా మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో ఈ పాటలో నాగశౌర్య-కేతిక శర్మ మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. కృష్ణకాంత్ ఈ పాటకు సాహిత్యం అందించగా..ఎమ్ఎమ్ కిరవాణి వారసుడు కాల భైరవా స్వరాలు సమకుర్చాడు. డిసెంబర్ 10న థియేటర్లోకి రాబోతోన్న ఈ మూవీలో జగపతిబాబు, సచిన్ కేడ్కర్‌లు కీలక పాత్ర పోషిస్తున్నారు. Happy to launch #SayaSaya Song from #Lakshya https://t.co/BSIiz4IXTZ All the best @IamNagashaurya & team ..enjoyed the trailer ! #LakshyaOnDec10th#KetikaSharma @IamJagguBhai @SVCLLP @nseplofficial @Santhosshjagar1 @kaalabhairava7 @AsianSuniel @sharrath_marar @RaamDop — chaitanya akkineni (@chay_akkineni) December 4, 2021 -
రితికలాగే నేను ఉంటా.. భరించడం కష్టం :కేతికా శర్మ
పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ పూరి హీరోగా నటించిన ‘రొమాంటిక్’ చిత్రంతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన ఉత్తరాది భామ కేతికా శర్మ. తొలి చిత్రంతోనే తనదైన అందాలతో కుర్రకారులను కట్టిపడేసింది. అంతేకాదు తెలుగులో వరుస ఆఫర్లు దక్కించుకొని ఫుల్ బిజీ అయింది. ఈ భామ తాజాగా నటించిన చిత్రం లక్ష్య. నాగశౌర్య హీరోగా నటించిన ఈ చిత్రానికి సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించారు. నారాయణ దాస్ నారంగ్.. రామ్మోహన్ రావు.. శరత్ మరార్ ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీ డిసెంబర్ 10వ థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ కేతికా శర్మ గురువారం మీడియాతో ముచ్చటిస్తూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. అలా ‘రొమాంటిక్’కి ఓకే చెప్పా సినిమాల కోసం ట్రై చేస్తున్న సమయంలో పూరి జగన్నాథ్ ఆపీస్ నుంచి కాల్ వచ్చింది. అంత పెద్ద డైరెక్టర్ నుంచి కాల్ రావడంతో.. కథ వినకముందే ‘రొమాంటిక్’ మూవీకి ఓకే చెప్పా. పూరి జగన్నాథ్ కోసమే రొమాంటిక్ మూవీ చేశా. ‘రొమాంటిక్’కి పూర్తి భిన్నమైన పాత్ర కరోనా కారణంగా బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ వచ్చాయి. రొమాంటిక్ సినిమా షూటింగ్ చివరి రోజు.. సంతోష్ వచ్చి ‘లక్ష్య’కథ చెప్పారు. తొలి సినిమా షూటింగ్ అదే రోజు పూర్తవ్వడం.. వెంటనే మరో కథ రావడం ఆనందంగా అనిపించింది. రొమాంటిక్‌లో పూర్తి గ్లామర్ రోల్ అయితే లక్ష్య సినిమాలో పూర్తిగా భిన్నంగా కనిపిస్తాను. నా నటనలోని వైవిధ్యాన్ని చూపించాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమాను రితికలానే నేను కూడా ఉంటాను లక్ష్య సినిమాలో నా పాత్ర పేరు రితిక. పక్కింటి అమ్మాయిలా కనిపిస్తాను. తన మనసుకు ఏమనిపిస్తే అదిచేసే అమ్మాయియే రితిక. రితికలాగే నేను ఉంటాను. నా మనసుకు ఏమనిపిస్తే అదే చేస్తా. నాలాంటి వాళ్లను భరించడం కష్టం. ఆఫర్లు వస్తున్నాయి కోలీవుడ్‌తో పాటు ఇతర లాంగ్వేజ్‌లలో ఆఫర్లు వస్తున్నాయి. కానీ యాక్టింగ్‌కి స్కోప్ ఉన్న పాత్రలనే చేయాలని నిర్ణయించుకున్నా. చిన్నప్పటి నుంచి యాక్టింగ్ చేయాలనేదే నా డ్రీమ్. నాకు నచ్చింది ఇదేనని చెప్పడంతో పేరెంట్స్ ఏడాది టైమ్ ఇచ్చి, నిరూపించుకోమని చెప్పారు. అదృష్టవశాత్తు పూరి జగన్నాథ్ నుంచే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చా. ఇప్పుడు మా పేరెంట్స్ హ్యాపీగా ఉన్నారు. -
ఏపీ టీడీపీ నేతలతో గుత్త సుమన్ చౌదరి కి సంబంధాలు
-
ఫామ్ హౌస్ పేకాట కేసులో గుత్తా సుమన్ చౌదరి రెండోరోజు పోలీస్ కస్టడీ
-
నాగశౌర్య ఫామ్‌హౌస్ కేసు: కస్టడీలోకి ప్రధాన నిందితుడు
హైదరాబాద్: హీరో నాగశౌర్య ఫామ్‌హౌస్ పేకాట కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న గుత్తా సుమన్‌ను నార్సింగి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. వైద్యపరీక్షలు జరిపిన తర్వాత.. నిందితుడు సుమన్ చౌదరిని పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. పేకాట, క్యాసినో ఇతర కేసుల వివరాలపై ఆరాతీస్తున్నారు. కాగా, ఫామ్ హౌజ్దేని కోసం తీసుకున్నారు..? ఎవరెవరి పాత్ర ఉంది..? అనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడి నుంచి కీలక సమాచారం రాబట్టనున్నట్లు తెలుస్తోంది. చదవండి: నాగశౌర్య ఫామ్‌హౌజ్ కేసు: బర్త్‌డే పార్టీ ముసుగులో పేకాట -
పేకాట కేసులో గుత్తా సుమన్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
-
నాగశౌర్య తండ్రికి నోటీసులు ఇచ్చిన పోలీసులు
-
నాగశౌర్య ఫామ్‌హౌజ్ కేసు: బర్త్‌డే పార్టీ ముసుగులో పేకాట
మణికొండ (హైదరాబాద్): నగర శివారులోని ప్రముఖుల ఫాంహౌజ్‌లను అద్దెకు తీసుకొని పేకాట దందా సాగిస్తున్న వ్యవహారాన్ని సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) బట్టబయలు చేసింది. ప్రముఖులకు బర్త్‌డే పార్టీ పేరిట వాట్సాప్‌లో ఆహ్వానాలు పంపి క్యాసినోలు నడిపిస్తున్న ప్రధాన సూత్రదారితోపాటు 30మంది పేకాటరాయుళ్లను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సూత్రధారి సుమన్ చౌదరి గుంటూరు జిల్లాకు చెందిన గుత్తా సుమన్‌కుమార్ చౌదరి ఓ టీవీ చానల్లో డైరెక్టర్‌గా, రియల్టర్‌గా అవతారం ఎత్తాడు. సినిమాల్లో పెట్టుబడులు పెడుతుండటంతోపాటు పేకాట శిబిరాలు నిర్వహిస్తుంటాడు. అతను గతంలో గుంటూరు జిల్లా పెదకాకాని పోలీస్‌స్టేషన్‌లో భూకబ్జాకు పాల్పడి పోలీసులకు చిక్కాడు. పేకాటరాయుళ్లను గ్రూపులుగా చేసి హైదరాబాద్ శివార్లలోని మంచిరేవులకు రప్పించాడు. సినీహీరో నాగశౌర్య తండ్రి వాసవి రవీంద్రప్రసాద్ లీజుకు తీసుకున్న ఫాంహౌస్‌లో పెద్దఎత్తున పేకాట శిబిరాన్ని ప్రారంభించాడు. అది ఎస్ఓటీ పోలీసులకు తెలియటంతో ఆదివారం రాత్రి దాడులు చేసి అరెస్టు చేశారు. ఫాంహౌజ్‌ను లీజుకు తీసుకున్న రవీంద్రప్రసాద్‌కు నార్సింగి పోలీసులు నోటీసులు జారీ చేసి స్టేషన్‌కు రప్పించి విచారించారు. అంతా ప్రముఖులే... ఫాంహౌస్‌లో నిర్వహిస్తున్న పేకాట శిబిరంలో పోలీసులకు చిక్కిన వారిలో రాజకీయ, రియల్ఎస్టేట్ గ్రూపులకు చెందిన ప్రముఖులు ఉన్నారు. మహాబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే శ్రీరాం భద్రయ్యతోపాటు వాసవి డెవలపర్స్ గ్రూప్‌నకు చెందిన రాజారామ్, మద్దుల ప్రకాశ్‌లతోపాటు మరీడు తనున్, గుమ్మడి రామస్వామి చౌదరి, ననదిగ ఉదయ్, సీహెచ్ శ్రీనివాసరావు, టి.శివరామకృష్ణ, బాడిగ సుబ్రమణ్యం, పండిటాగ సురేష్, నాగార్జున, కౌతాపు వెంకటేశ్, మిర్యాల భానుప్రకాశ్, పాతూరి తిరుమల, వీర్ల శ్రీకాంత్, ఎం.మల్లిఖార్జున్‌రెడ్డి, బొగ్గారాపూర్ నాగ, గట్ట వెంకటేశ్వర్రావు, ఎస్ఎస్ఎన్ రాజు, యు.గోపాల్‌రావు, బి.రమేశ్‌కుమార్, కాంపల్లి శ్రీనివాస్, ఇమ్రాన్ ఖాన్, టి.రోహిత్, బొల్లబోడ ఆదిత్య, సీహెచ్ గణేష్, తోట ఆనందకిషోర్, షేక్ ఖదీర్, బి.రాజేశ్వర్ ఉన్నారు. రెడ్‌కాయిన్‌కు రూ.5 వేలు ఫామ్‌హౌజ్‌లో ప్రముఖులతో మూడు ముక్కల ఆట ఆడించినట్టు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. పేకాట శిబిరాల్లో డబ్బు బదులుగా కాయిన్స్‌ను సరఫరా చేస్తారు. రెడ్ కాయిన్‌కు ఐదు వేలు, గ్రీన్ కాయిన్‌కు రెండువేలు, బ్లూ కాయిన్‌కు వెయ్యి రూపాయల లెక్క కడుతున్నారు. పోలీసులకు చిక్కిన 30 మందికి రాజేంద్రనగర్ అడిషనల్ మెజిస్ట్రేట్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు వారిని చర్లపల్లి జైలుకు తరలించారు. కొందరు ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా, వాటిని న్యాయమూర్తి తిరస్కరించారు. చంద్రబాబు, లోకేశ్‌లతో ఫొటోలు మంచిరేవుల ఫాంహౌజ్‌లో క్యాసినో నిర్వహిస్తున్న గుత్తా సుమన్ చౌదరి ప్రముఖులతో కలిసి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌తోపాటు ఓ పత్రిక యజమానితో ఉన్న ఫొటోలు బయటకు వచ్చాయి. చదవండి: సినీ హీరో నాగశౌర్య ఫామ్‌హౌస్‌లో పేకాటరాయుళ్ల పట్టివేత -
సినీ హీరో నాగశౌర్య ఫామ్‌హౌస్‌లో పేకాటరాయుళ్ల పట్టివేత
హైదరాబాద్: హైదరాబాద్ శివార్లలోని ఫామ్‌హౌజ్‌లో భారీ పేకాట వ్యవహారాన్ని ఎస్వోటీ పోలీసులు ఛేదించారు. రెండు, మూడు రోజులు అడ్డావేసి పేకాట ఆడుదామని సిద్ధమైన వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ ఫామ్‌హౌజ్ సినీహీరో నాగÔౌర్యకు చెందినదిగా ప్రచారం జరగడంతో ఈ ఘటన సంచలనం సృష్టించింది. గోవాలోని కాసినోల తరహాలో.. హైదరాబాద్ శివార్లలో నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని మంచిరేవుల వద్ద గ్రీన్లాండ్స్ వెంచర్ ఉంది. అందులో రమణ అనే వ్యక్తి చెందిన ఫాంహౌస్‌ను సినీహీరో నాగశౌర్య ఐదేళ్ల లీజుకు తీసుకున్నారు. అందులో టీవీ సీరియళ్లు, సినిమాల షూటింగ్‌లు, పార్టీలు జరుగుతుంటాయి. అయితే దీపావళి పండుగ వస్తుండటంతో భారీగా పేకాట నిర్వహించేందుకు కొందరు ప్లాన్ చేశారు. నాలుగు రోజుల పాటు ఈ ఫాంహౌజ్‌ను వాడుకుంటామని సుమంత్ చౌదరి అనే పేరిట బుక్ చేసుకున్నారు. తరచూ గోవాలోని కాసినోలకు వెళ్లేవారిని సంప్రదించి ఇక్కడికి ఆహ్వానించారు. కాసినోల తరహాలో టేబుళ్లు, కాసినో కాయిన్లు, వందల పేకాట బాక్సులు, క్యాష్ కౌంటింగ్ మిషిన్లు, మద్యం, భోజన సదుపాయాలు వంటి సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారు. అయితే ఈ వ్యవహారంపై శంషాబాద్ ఎస్వోటీ పోలీసులకు సమాచారం అందడంతో.. ఆదివారం రాత్రి దాడి చేశారు. 30 మంది అరెస్టు ఫామ్‌హౌజ్‌లోని పేకాట స్థావరంలో హైదరాబాద్, కర్నూలు, విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాలకు చెందిన 30మందిని అదుపులోకి తీసుకున్నట్టు నార్సింగి పోలీసులు తెలిపారు. 6.70 లక్షల నగదు, మూడు కార్లు, 33 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. అరెస్టైన వారిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లు, వ్యాపారులు కూడా ఉన్నట్టు సమాచారం. పేకాట స్థావరంలో అదుపులోకి తీసుకున్నవారి పూర్తి వివరాలను సేకరిస్తున్నామని చెప్పారు. వారిని రిమాండ్‌కు పంపే సమయంలో వివరాలు వెల్లడిస్తామని నార్సింగి సీఐ శివకుమార్ తెలిపారు. -
పెద్ద స్టార్ అవ్వాలంటే అన్ని హిట్లు కావాలి: నాగశౌర్య
‘‘ఇండస్ట్రీలో ఎలాంటి నేపథ్యం లేకుండా వచ్చి ఒక్కో మెట్టు ఎక్కుతున్నాను. నాకు ఇక్కడ మంచి సపోర్ట్ దక్కింది. ‘వరుడు కావలెను’ ప్రీ రిలీజ్ వేడుకలో బన్నీగారు (అల్లు అర్జున్) నా గురించి మాట్లాడటం సంతోషంగా అనిపించింది. నేనింకా కష్టపడాలి అనే స్ఫూర్తిని ఆయన మాటలు ఇచ్చాయి’’ అని నాగశౌర్య అన్నారు. లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో నాగశౌర్య, రీతూ వర్మ జంటగా తెరకెక్కిన చిత్రం ‘వరుడు కావలెను’. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా నేడు రిలీజవుతోంది. ఈ సందర్భంగా నాగశౌర్య చెప్పిన విశేషాలు. లక్ష్మీ సౌజన్య అక్క ‘వరుడు కావలెను’ కథ చెప్పినప్పుడు బావుందనిపించింది.. ఫైనల్ అవుట్‌పుట్ చూశాక బ్లాక్‌బస్టర్ అని అర్థమైంది. ఈ సినిమా రిజల్ట్‌లో ఏదన్నా డౌట్‌గా ఉంటే నా ముఖంలో తెలిసిపోతుంది. నేను సినిమాల్లోనే నటించగలను.. బయట కాదు. 30 ఏళ్లు దాటిన అబ్బాయి, అమ్మాయిలను పెళ్లెప్పుడు? అని ఇంట్లో వాళ్లు అడుగుతుంటారు. అబ్బాయి, అమ్మాయిలు పెళ్లికి ఎంతవరకూ రెడీగా ఉన్నారన్నది ఆలోచించరు.. ఇలాంటి పాయింట్ జనాలకు బాగా రీచ్ అవుతుందని ఈ సినిమా చేశాను. మెచ్యూర్డ్ లవ్‌స్టోరీ. ఈ సినిమా కోసం త్రివిక్రమ్‌గారు ఓ సీన్ రాశారు. అందులో నటించడం, డైలాగులు చెప్పడం హ్యాపీగా అనిపించింది. ఈ సినిమాని నా కుటుంబ సభ్యులకు చూపించమని చినబాబుగారు చెప్పారు. ‘సినిమా మీద డౌట్ ఉంటే చూపించొచ్చు.. డౌట్ లేనప్పుడు జనాలతో కలిసి చూస్తేనే బావుంటుంది’ అని చెప్పాను. ఆయన లాంటి నిర్మాతలు అవసరం. నాగవంశీ కూడా ఈ సినిమా విషయంలో రాజీ పడలేదు. గతంలో నేను నందినీ రెడ్డిగారితో పని చేశాను.. ఇప్పుడు లక్ష్మీ సౌజన్య అక్కతో చేశా. మేల్ డైరెక్టర్స్‌తో పోలిస్తే మహిళా దర్శకులకు ఓపిక ఎక్కువ.. అది మనకు అడ్వాంటేజ్. u పెద్ద స్టార్ కావడానికి ఐదు హిట్లు కావాలి. నాకు ‘ఛలో’ పెద్ద హిట్. ‘వరుడు కావలెను’ రెండో పెద్ద హిట్. మరో మూడు హిట్స్ కావాలి. ఒకే రోజు ఎదగడం కంటే ఒక్కో మెట్టు ఎక్కడం బెటర్. ‘నర్తనశాల’ ఫ్లాప్ తర్వాత కూడా నాకు బెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చిన సినిమా ‘అశ్వథ్థామ’. హిట్, ఫ్లాప్ శాశ్వతం కాదు.. వాటి గురించి ఆలోచించను. నా పెళ్లి విషయంలో ప్లాన్స్ లేవు. టైమ్ వచ్చినప్పుడు జరుగుతుంది. నేను చేసిన ‘లక్ష్య’ చిత్రం నవంబర్‌లో విడుదలవుతుంది. అనీష్ కృష్ణ దర్శకత్వంలో చేస్తున్న సినిమా 90 శాతం పూర్తయింది. అవసరాల శ్రీనివాస్‌తో చేస్తున్న ‘ఫలానా అమ్మాయి.. ఫలానా అబ్బాయి’ డ్రీమ్ ప్రాజెక్ట్‌లాంటిది. ఇందులో ఏడు రకాలుగా కనిపిస్తాను. చదవండి: పలు వివాహ వేడుకల్లో ‘వరుడు కావలెను’ నటులు.. సర్ప్రైజ్లో వధూవరులు -
‘వరుడు కావలెను’ మూవీ ట్విటర్ రివ్యూ
యంగ్ హీరో నాగ శౌర్య ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలను రిలీజ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి పక్క ప్లానింగ్‌తో దూసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో నాగ శౌర్య నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ‘వరుడు కావలెను’ ఈ శుక్రవారం(అక్టోబర్ 29)ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే అమెరికా లాంటీ దేశాల్లో ఈ సినిమా ప్రీవ్యూస్ పడడంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.. అసలు కథేంటీ.. కథనం ఎలా ఉంది.. ఏ మేరకు తెలుగు వారిని ఈ సినిమా ఆకట్టుకుంటోంది.. మొదలగు అంశాలను ట్విటర్లో చర్చిస్తున్నారు.. అవేంటో చూద్దాం. #VaruduKaavalenu - Flashback episode is the biggest asset 👉#VaruduKavalenu 15 Minutes flashback in the film which is quite key and will impress everyone with its emotions and story 👉The film has mature emotions which will really impress today's youth#NagaShaurya #RituVarma — PaniPuri (@THEPANIPURI) October 28, 2021 సినిమా ప్లాష్‌బ్యాక్‌లో వచ్చే సీన్స్ హైలెట్ అని చెబుతున్నారు. 15 నిమిషాల పాటు సాగే ప్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ సినిమా స్థాయిని పెంచినట్లు ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. #VaruduKaavalenu Decent ga bane undi movie.....2nd hf kastha slow..... but overall not bad... plot could have been better...Lead pair was good pic.twitter.com/w5PegX8kwU — CineManiac (@sreekar08) October 29, 2021 వరుడు కావలెను యావరేజ్ మూవీ అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. బలహీనమైన కథ, నెరేషన్ సినిమాను ప్రేక్షకుల అంచనాలకు చేరుకోలేకపోయింది. కిషోర్, ప్రవీణ్ కామెడీ, ఫ్లాష్ బ్యాక్ లో సత్య, వెడ్డింగ్ సన్నివేశాలలో సప్తగిరి కామెడీ నవ్వులు పూయిస్తుందట. Outdated to the core, first half 👎👎 #VaruduKaavalenu — SADDY (@king_sadashiva) October 29, 2021 #VaruduKaavalenu Overall an Average Timepass Watch! Music, production values, and a few well written scenes are the highlights. On the flipside, there was very little emotional connect and the narravite and plot was age-old. Rating: 2.5/5 — Venky Reviews (@venkyreviews) October 29, 2021 #VaruduKaavalenu Below Average Movie. Routine stuff and entertaining ga kuda emi ledu🙏🙄 — Shiva (@NTR_Cultt) October 29, 2021 End credits scene ki cut cheppadam marchinattu unnaru. Adhi ayipoyesariki Theatre lo evaduu undadu. Lite. Outdated affair. Neither entertaining nor interesting. #VaruduKaavalenu — Silent GuaRRRdian (@Kamal_Tweetz) October 29, 2021 -
హీరోయిన్ రీతూ వర్మ మూవీ టైటిల్స్‌పై త్రివిక్రమ్ సెటైర్లు
Trivikram Srinivas Satires On Ritu Varma Movie Titles: నాగ శౌర్య, రీతూ వర్మ హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం 'వరుడు కావలెను'. లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల29న విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం(అక్టోబర్28)న హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ హీరోయిన్ రీతూవర్మ సినిమా టైటిళ్లపై సెటైర్లు వేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తుంది. 'వరుడు కావలెను సినిమాను నేను చూశాను. చాలా రోజుల తర్వాత సినిమా మొత్తం చీరకట్టిన హీరోయిన్ను చూశాను. ఆమె సినిమాలన్నీ చూస్తే...పెళ్లిచూపులు, కనులు కనులు దోచాయంటే.. ఇప్పుడు వరుడు కావలెను. తర్వాత షామినా, కేటరింగ్, లాజిస్టిక్ సర్వీసెస్.. ఇలాంటి సినిమాలు తీస్తారేమో. అసలే సినిమావాళ్లకు సెంటిమెంట్లు ఎక్కువ కాబట్టి మిగతావాళ్లు కూడా నీతో ఇలాంటి సినిమాలు తీస్తారు' అంటూ రీతూ సినిమా టైటిళ్లపై సెటైర్లు వేశారు. త్రివిక్రమ్ కౌంటర్లతో హీరోయిన్ రీతూ సిగ్గుతో తలపట్టుకుంది. -
వరుడు కావలెను ప్రీ రిలీజ్ ఈవెంట్లో సందడి చేసిన అల్లు అర్జున్
-
నాగశౌర్య అందగాడు, మంచి మనసున్న వ్యక్తి : అల్లు అర్జున్
‘‘కరోనా వల్ల సినిమా ఇండస్ట్రీ ఇబ్బందులు ఎదుర్కొంది. సినిమా రిలీజ్‌ల సీజన్ ఇండస్ట్రీకి చాలా ముఖ్యం. తెలుగులో ‘వరుడు కావలెను, రొమాంటిక్’, తమిళ్లో రజనీకాంత్‌గారి ‘అన్నాత్తే’, కన్నడలో ‘భజరంగీ 2’, హిందీలో ‘సూర్య వన్షీ’.. సినిమాలు విడుదలవుతున్నాయి.. అన్ని సినిమాలూ హిట్ అవ్వాలి’’ అని హీరో అల్లు అర్జున్ అన్నారు. నాగ శౌర్య, రీతూ వర్మ జంటగా లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వరుడు కావలెను’. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో ముఖ్య అతిథి అల్లు అర్జున్ మాట్లాడుతూ–‘‘ అన్ని ఇండస్ట్రీల్లోనూ ఇప్పుడిప్పుడే జనాలు థియేటర్లకు వస్తున్నారు.. ఇదే పాజిటివిటీ కొనసాగాలి.. అన్ని ఇండస్ట్రీల వారు బాగుండాలి. ఈ డిసెంబరు 17న ‘పుష్ప’ తో మేము కూడా వస్తున్నాం.. మా సినిమా మీకు నచ్చాలని కోరుకుంటున్నా. ఎంటైర్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఆల్ ది బెస్ట్. ఈ దీపావళికి భారతీయ సినిమా మునుపటిలా ప్రేక్షకులను అలరించి మంచి బిజినెస్ చేస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘వరుడు కావలెను’లోని ‘దిగు దిగు నాగ’ పాట మా ఇంట్లో ప్లే అవుతూనే ఉంటుంది. ఈ పాటకి తమన్ మంచి సంగీతం ఇచ్చాడు. నాగశౌర్య సినిమాలన్నీ చూశా.. చాలా అందగాడు. తనలో ఒక ఇన్నోసెన్స్, స్వీట్నెస్ ఉంటుంది. అంత మంచి మనసున్న వ్యక్తి కచ్చితంగా పెద్ద హీరో అవుతాడు.. అవ్వాలని కోరుకుంటున్నా. ఇండస్ట్రీలో ఎలాంటి నేపథ్యం లేకుండా వచ్చి స్వయం కృషితో ఎదిగేవారంటే నాకు చాలా ఇష్టం.. శౌర్యకూడా తనకంటూ ఓ ప్రత్యేకమైన మార్క్ సంపాదించుకున్నందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. రీతూ వర్మ మంచి నటి. అమ్మాయిల్లో నాకు హుందాతనం అంటే ఇష్టం.. అది రీతూ వర్మ వద్ద చాలా ఉంటుంది. ముంబయ్‌లో షూటింగ్ చేస్తున్నప్పుడు అన్ని విభాగాల్లోనూ సగం మంది మహిళలు ఉన్నారు.. తెలుగులో హీరోయిన్లుగా మాత్రమే వస్తున్నారు. అలా కాకుండా ఇండస్ట్రీలోని అన్ని విభాగాల్లోకి మహిళలు రావాలి.. లక్ష్మీ సౌజన్యకి ఆల్ ది బెస్ట్. ఈ సినిమాకి విశాల్, తమన్ మంచి సంగీతం అందించారు. ఇద్దరు సంగీత దర్శకులు కలిసి చేయడానికి అహం ఉంటుంది.. అలాంటివేమీ లేకుండా చేసినందుకు వారిద్దరికీ అభినందనలు. ఈ వేడుకకి రావడం ‘అల వైకుంఠపురములో..’ సినిమాకి కొనసాగింపుగా ఉన్నట్లు ఉంది. చినబాబు, త్రివిక్రమ్, నవీన్ నూలి, తమన్... ఇలా అందరూ ఉన్నారు. గీతా ఆర్ట్స్ తర్వాత నేను సొంత సంస్థగా భావించేది చినబాబు, నాగవంశీగారి బ్యానరే. ‘జెర్సీ’ కి జాతీయ అవార్డు అందుకున్నందుకు నాగవంశీకి థ్యాంక్స్’’ అన్నారు. త్రివిక్రమ్ మాట్లాడుతూ– ‘‘మన చుట్టుపక్కల ఇళ్లలోని మనకు తెలిసిన ఒక ఆడపిల్ల తాలూకు సినిమా ఇది. ఇలాంటి కథలెప్పుడూ మన మనసుకు దగ్గరగా అనిపిస్తాయి. ఈ కథని ఎంచుకోవడంలోనే సౌజన్య సగం సక్సెస్ అయ్యింది. మంచి నటీనటులు, సాంకేతిక నిపుణులు కుదిరారు కాబట్టి మిగతా సగం కూడా సక్సెస్ అయినట్టే. ఇంట్రవెల్, క్లైమాక్స్ సన్నివేశాల్లో శౌర్య చాలా బాగా చేశాడు’’ అన్నారు. సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసిన రాధాకృష్ణ, వంశీగార్లకు థ్యాంక్స్. ఓ సినిమాకి ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ ఉండటం చాలా కష్టం (నవ్వుతూ). విశాల్ చంద్రశేఖర్ అద్భుతమైన సంగీతం ఇచ్చారు’’ అన్నారు. ఈ వేడుకలో కెమెరామ్యాన్ వంశీ, సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్, ఎడిటర్ నవీన్ నూలి, ‘ఆదిత్య’ మ్యూజిక్ నిరంజన్ పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
వివాహ వేడుకల్లో ‘వరుడు కావలెను’ నటులు.. సర్ప్రైజ్లో వధూవరులు
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య, పెళ్లి చూపులు ఫేమ్ రీతువర్మ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘వరుడు కావలెను’. ఇందులో వారు ఆకాశ్, భూమి పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 29న థియేటర్స్‌లో విడుదల కానుంది. దీంతో ఈ మూవీని ప్రమోషన్ చేసే పనిలో పడింది చిత్ర బృందం. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌లో జరిగిన పలు వివాహ వేడుకలకి హాజరయ్యారు హీరో హీరోయిన్లు నాగశౌర్య, రీతూ వర్మ. ఇలా సెలబ్రిటీలు తమ వివాహ వేడుకకి రావడంతో వధూవరులతో పాటు ఫంక్షన్‌కి వచ్చిన అతిథులు సైతం ఎంతో సర్ప్రైజ్గా ఫీల్ అయ్యారు. అంతేకాకుండా వారితో కలిసి ఫోటోలు దిగారు ఈ నటీనటులు. వీటికి సంబంధించిన ఈ పిక్‌లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ‘వరుడు కావలెను’ సినిమాతో లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయమవుతుండగా.. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. చదవండి: మనసుకు హత్తుకునేలా ‘మనసులోనే నిలిచిపోకే’ మెలోడీ Aakash @IamNagashaurya & Bhoomi @riturv made a surprise visit to a few marriages that happened in Hyderabad. #VaruduKaavalenu In Theatres from 29th Oct 2021! ✨@LakshmiSowG @vamsi84 @Composer_Vishal @ganeshravuri @vamsi84 @vamsi_p1988 @NavinNooli @adityamusic @SitharaEnts pic.twitter.com/MP0PwMTVyA — BA Raju's Team (@baraju_SuperHit) October 25, 2021 -
‘వరుడు కావలెను’ సంగీత్ ఈవెంట్ ఫోటోలు
-
ఒక మహిళ కథను మరో మహిళే చెప్పగలదు: పూజా హెగ్డే
‘‘ఇండస్ట్రీలో మహిళా దర్శకులు చాలా తక్కువమంది ఉన్నారు. ఒక మహిళ కథను మరో మహిళే చక్కగా చెప్పగలదు. లక్ష్మీగారికి ‘వరుడు కావలెను’ సినిమాతో మంచి సక్సెస్ రావాలి. నాగశౌర్య సెల్ఫ్‌మేడ్ యాక్టర్, హార్డ్ వర్కర్. అలా కష్టపడే తత్త్వాన్ని కచ్చితంగా గౌరవించాలి. ఈ సినిమా రూపంలో రీతూకు మరో మంచి హిట్ రావాలి. ‘వరుడు కావలెను’ వంటి సినిమాలను థియేటర్స్‌లో ఫ్యామిలీతో చూడాలి’’ అని హీరోయిన్ పూజా హెగ్డే అన్నారు. నాగశౌర్య, రీతూ వర్మ జంటగా లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వరుడు కావలెను’. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా సంగీత్ ఈవెంట్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న పూజా హెగ్డే మాట్లాడుతూ – ‘‘సితార ఎంటర్టైన్మెంట్స్ నా ఫ్యామిలీ బ్యానర్. ఈ సినిమాతో చాలా డబ్బులు, మరింత గౌరవం రావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘మన కుటుంబం బాగుంటుందని, చాలా మంచిదని మనం ఎంత గర్వంగా చెప్పుకుంటామో.. ఈ సినిమా బాగా వచ్చిందని నేను అంతే గర్వంగా చెబుతున్నాను. ఎన్నో సంవత్సరాలుగా అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన లక్ష్మీ సౌజన్యగారు మంచి కథ రాసుకుని ఈ సినిమా చేశారు. ఆమె కష్టానికి తగిన ఫలితం వస్తుందనే నమ్మకం ఉంది... బ్లాక్బాస్టర్ కొడుతున్నాం. శేఖర్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. నిర్మాతలు చినబాబు, సూర్యదేవర నాగవంశీ.. సినిమాలను ప్రేమించే వ్యక్తులు. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్కు టైమ్ పడుతుంది. అందుకే ఈ సినిమాను థియేటర్స్‌లో చూడండి’’ అన్నారు నాగశౌర్య. ఈ కార్యక్రమంలో నిర్మాత చినబాబు, నటుడు సప్తగిరి తదితరులు పాల్గొన్నారు. -
వరుడు కావలెను నుంచి 'వడ్డాణం' సాంగ్ రిలీజ్
Vaddaanam Song From Varudu Kaavalenu: టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య, పెళ్లి చూపులు ఫేమ్ రీతువర్మ జంటగా నటించిన చిత్రం ‘వరుడు కావలెను’ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ‘దిగు దిగు దిగు నాగ, మనసులోనే నిలచిపోకే పాటలు సూపర్‌హిట్‌గా నిలిచాయి. తాజాగా 'వడ్డాణం' అనే ఫన్ అండ్ పెప్పీ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఎస్ఎస్ థమన్ ఈ పాటను సంగీతం అందించారు. 'వడ్డాణం చుట్టేసి వచ్చారే భామలు..వయ్యారం చిందేసే అందాల బొమ్మలు'..అంటూ సాగే ఈ సాంగ్ ఆకట్టుకుంటుంది. రిలీజ్ అయిన కాసేపటికే వ్యూస్ పరంగా దూసుకెళ్తుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమా అక్టోబర్ 15న విడుదల కానుంది. లక్ష్మీ సౌజన్య ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయమవుతోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. -
నవంబర్ 12కి బాణం గురిపెట్టిన నాగశౌర్య
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఆయన నటించిన తాజా చిత్రం ‘లక్ష్య’. ఈ మూవీని నవంబర్ 12వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కేతికా శర్మ కథానాయికగా నటిస్తోంది. సోనాలి నారంగ్ సమర్పణలో నారాయణ దాస్ కె. నారంగ్, పుస్కర్ రామ్మోహన్ రావ్, శరత్ మరార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల ‘లక్ష్య’ రిలీజ్ డేట్ ఏమై ఉంటుందో గేస్ చేయండంటూ ప్రేక్షకులకి పజిల్ విసిరింది మూవీ టీం. అందులో అక్టోబర్ 15, అక్టోబర్ 22, అక్టోబర్ 29, నవంబర్ 12 తేదీలు ఉండగా, తాజాగా నవంబర్ 12ని ఖరారు చేసింది చిత్రబృందం. ఆర్చరీ బ్యాక్ డ్రాప్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగశౌర్య రెండు విభిన్న పాత్రలతో అలరించనున్నాడు. అందులో సిక్స్ ప్యాక్, పోనీ టెయిల్‌తో ఉన్న లుక్ ఆకట్టుకుంటోంది. జగపతిబాబు, సచిన్ ఖేడ్కర్ కీలక పాత్రలు పోషిస్తుండగా కాలభైరవ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. అయితే ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈ యంగ్ హీరోగా, రీతూ వర్మ హీరోయిన్గా చేస్తున్న మూవీ దసరా సందర్భంగా అక్టోబర్ 15న విడుదల అవుతున్న విషయం తెలిసిందే. చదవండి: తన ‘లక్ష్యా’న్ని పూర్తి చేసుకున్న నాగశౌర్య Finally the time is here to lift my Recurve☺️ All set to let fly my arrow on, 12th of November 🎯#Lakshya🏹#LakshyaonNov12th #KetikaSharma @IamJagguBhai @SVCLLP @nseplofficial @Santhosshjagar1 @kaalabhairava7 @AsianSuniel @sharrath_marar @RaamDop @adityamusic pic.twitter.com/GRJIRRF1Es — Naga Shaurya (@IamNagashaurya) September 27, 2021 -
దసరా రేసులో 'వరుడు కావలెను' మూవీ
Varudu Kaavalenu Movie Release Date: టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య, పెళ్లి చూపులు ఫేమ్ రీతువర్మ జంటగా నటించిన చిత్రం ‘వరుడు కావలెను’. లక్ష్మీ సౌజన్య ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయమవుతోంది. ఇప్పటికే దసరా రేసులో పలు చిత్రాలు ఉన్నాయి. తాజాగా వరుడు కావలెను చిత్ర బృందం కూడా దసరా కానుకగా అక్టోబర్ 15న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్, టీజర్ సినిమాపై పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. Love, Fun & Emotions packed & ready to entertain you! Our #VaruduKaavalenu coming to theatres near you from 15th October, 2021.#VaruduKaavalenuFrom15thOct @IamNagashaurya @riturv @LakshmiSowG @vamsi84 @Composer_Vishal @ganeshravuri @vamsi84 @NavinNooli @adityamusic pic.twitter.com/xNhgrKh2ci — Sithara Entertainments (@SitharaEnts) September 25, 2021 -
మనసుకు హత్తుకునేలా ‘మనసులోనే నిలిచిపోకే’ మెలోడీ
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య, పెళ్లి చూపులు ఫేమ్ రీతువర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘వరుడు కావలెను’. లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి పోస్టర్, టీజర్‌తో పాటు విడుదలైన ‘కోలా కల్లే ఇలా’, ‘దిగు దిగు’ పాటలు సైతం ప్రేక్షకాదరణని పొందాయి. తాజాగా ఆ సినిమా మూడో సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్. ‘మనసులోనే నిలిచిపోకే.. మైమరుపులా మధురిమ’ అంటూ పల్లవితో సాగే ఈ మెలోడీ మనసుకు హత్తుకునేలా ఉంది. పాట తీసిన లోకేషన్స్ ఎంతో ఆహ్లాదంగా ఉన్నాయి. పాటలో హీరోయిన్ ఎక్స్ప్రెషన్స్ అదిరిపోయాయి. నాగ శౌర్య, రీతూ వర్మ జంట అందంగా, చూడముచ్చటగా ఉంది. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ మూవీకి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు. ‘మనసులోనే నిలిచిపోకే’ పాటకి సిరివెన్నెల సీతారామ శాస్త్రి లిరిక్స్ అందించగా, గాయనీ చిన్మయి మనసుకు హత్తుకునేలా ఈ పాటను ఆలపించిందని మేకర్స్ తెలిపారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్న ఈ చిత్రాన్ని అక్టోబర్‌లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోంది చిత్రబృందం. చదవండి: ‘వరుడు కావలెను’ టీజర్ వచ్చేసింది -
Varudu Kaavalenu Teaser: అమ్మా.. వీళ్లెవరు నాకు కనెక్ట్ అవ్వట్లేదే
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య తాజాగా నటిస్తున్న చిత్రం ‘వరుడు కావలెను’. ఈ సినిమాలో పెళ్లి చూపులు ఫేమ్ రీతువర్మ హీరోయిన్గా నటిస్తున్నారు. లక్ష్మీ సౌజన్యను దర్శకురాలిగా పరిచయం చేస్తూ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్, టీజర్‌తో పాటు పాటలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. (చదవండి: కార్తికేయ-2 : హీరోయిన్ను రివీల్ చేశారు.. ) తాజాగా శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని ఈ చిత్రం నుంచి టీజర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. టామ్ అండ్ జెర్రీలా నిత్యం గొడవపడే ఓ యువతి, యువకుడి మధ్య ప్రేమ ఎలా పుట్టిందనేదే ఈ మూవీ నేపథ్యం అని టీజర్ చూస్తే అర్థమవుతుంది. ‘అమ్మా.. వీళ్లెవరు నాకు కనెక్ట్ అవ్వట్లేదే’, ఆ అందం.. పొగరు.. ఆర్డర్ ఇచ్చి చేయించినట్టు ఉంటుంది. ‘ఎవ్రీ బాల్ సిక్స్ కొట్టే బ్యాట్‌మెన్ చూశావా.. మా వాడు కొడతాడు.. ప్రతి బాల్ నోబాల్ అని ఇచ్చే అంపైర్‌ని చూశావా.. ఆవిడ ఇస్తది’ లాంటి డైలాగ్స్ యూత్‌ని ఆకట్టుకునేలా ఉన్నాయి. యూత్ ఫుల్ ఎంటర్టైనర్గాగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. -
తన ‘లక్ష్యా’న్ని పూర్తి చేసుకున్న నాగశౌర్య
నాగశౌర్య తన లక్ష్యాన్ని పూర్తి చేసుకున్నారు. ఆ లక్ష్యం ఏంటి? అనేది ‘లక్ష్య’ సినిమాలో చూడాల్సిందే. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కేతికా శర్మ హీరోయిన్. సోనాలి నారంగ్ సమర్పణలో నారాయణ్‌దాస్ నారంగ్, పుస్కూరు రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మించారు. (చదవండి: విజయకాంత్‌కు అనార్యోగం? చికిత్స కోసం అమెరికాకు..) చిత్రనిర్మాతలు మాట్లాడుతూ– ‘‘భారతదేశ ప్రాచీన విలువిద్య నేపథ్యంతో తెరకెక్కిన చిత్రం ‘లక్ష్య’. ఆసక్తికి గురి చేసే అంశాలతో వినోదభరితంగా, ఉత్కంఠగా సాగుతుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: రామ్ రెడ్డి, సంగీతం: కాల భైరవ. -
Varudu Kaavalenu: ‘దిగు దిగు దిగు నాగ’పై నిరసన గళం
సాక్షి, హైదరాబాద్ (నిజాంపేట్) : ‘వరుడు కావలెను’ సినిమాను బ్యాన్ చేయాలని కోరుతూ శనివారం బాచుపల్లి మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద రాష్ట్రీయ ధర్మ రక్షాదళ్ ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు నరేంద్ర చౌదరి మాట్లాడుతూ ఈ సినిమాలో ‘దిగు దిగు దిగు నాగ’ పాట హిందువుల మనోభావాలను కించపరిచేలా ఉందని, ఆ పాటను వెంటనే తొలగించి బేషరుతుగా చిత్ర దర్శక, నిర్మాతలు క్షమాపణలు చెప్పాలని, లేనిపక్షంలో సినిమా రిలీజ్‌ను అడ్డుకుంటామని హెచ్చరించారు. అనంతరం తహసీల్దార్ సరితకు మెమోరాండమ్ అందజేసి తమ నిరసనను తెలియజేశారు. బాచుపల్లి మండల అధ్యక్షుడు నరేష్గుప్త ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శివ కోటేశ్వరావు, జిల్లా అధ్యక్షుడు శ్రీ చింతకింది వంశీకృష్ణ, సోషల్ మీడియా కన్వీనర్ శివ కుమార్, మాతృశక్తి విభాగం మండల నాయకురాలు ధర్మపురి అనిత తదితరులు పాల్గొన్నారు. -
దుమ్మురేపుతున్న ‘దిగు దిగు దిగు నాగ’ సాంగ్
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య తాజాగా నటిస్తున్న చిత్రం ‘వరుడు కావలెను’. ఈ సినిమాలో పెళ్లి చూపులు ఫేమ్ రీతువర్మ హీరోయిన్గా నటిస్తున్నారు. లక్ష్మీ సౌజన్యను దర్శకురాలిగా పరిచయం చేస్తూ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్, టీజర్‌తో పాటు ఓ మెలోడీ సాంగ్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి మరో పాటను విడుదల చేసింది చిత్రబృందం. ‘దిగు దిగు దిగు నాగ’అంటూ సాగే ఈ పాటకు అనంత శ్రీరామ్ లిరిక్స్ రాయగా… శ్రేయ ఘోషల్ ఆలపించారు. తమన్ సంగీతం అందించారు. తెలంగాణలో చాలా పాపులర్ అయిన ఫోక్ సాంగ్ దిగు దిగు దిగు నాగ’మాదిరి, చాలా హుషారుగా సాగే పాట ఇది. 'కొంపకొచ్చిపోరో కోడెనాగ .. కొంప ముంచుతాందోయ్ ఈడు బాగా' వంటి పదప్రయోగాలు బాగున్నాయి. మాస్ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయ్యే పాట ఇది. -
ఇకపై ప్రతి శుక్రవారం ‘లక్ష్య’ అప్డేట్స్
Lakshya Movie : సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో హీరో నాగశౌర్య ‘లక్ష్య’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. నాగశౌర్య కెరీర్లో 20వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగశౌర్య డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నారు. నారాయణదాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో నాగశౌర్యకు జోడీగా కేతిక శర్మ హీరోయిన్గా నటిస్తుంది. తాజాగా ‘లక్ష్య’ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ను ఇకపై సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ప్రతి శుక్రవారం అనౌన్స్ చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. #LAKSHYASFRIDAY హ్యాష్ ట్యాగ్‌తో ఇకపై ప్రతి వారం కొత్త అప్డేట్స్ రానున్నాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి విడుదల తేదీని ప్రకటిస్తామని మేకర్స్ వెల్లడించారు.ప్రేక్షకుల మనసు గెలుచుకునే విధంగా ఈ క్లైమాక్స్ ఎపిసోడ్‌ని లావీష్‌గా తెరకెక్కించినట్టు నిర్మాతలు తెలిపారు. నిజానికి ఏప్రిల్ నెలాఖరులోనే ‘లక్ష్య’ విడదుల కావాల్సి ఉండగా కరోనా కారణంగా బ్రేక్ పడింది. ఇక ఈ చిత్రంలో జగపతి బాబు, సచిన్ ఖేడేకర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. -
తమ్ముడు బ్రహ్మాజీకి సపోర్ట్ కావాలి.. నాగశౌర్య ట్వీట్ వైరల్
యంగ్ హీరో నాగశౌర్య వరుస సినిమాలో దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే ఆయన వరుడు కావాలి, ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి, లక్ష్య, పోలీస్ వారి హెచ్చరిక, నారీనారీనడుమ మురారీతో పాటు అనీష్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇటీవల ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లింది. ఈ సినిమాతో షెర్లీ సెటియా హీరోయిన్గా పరిచయమవుతోంది. ఒక ముఖ్యమైన పాత్రలో బ్రహ్మాజీ నటిస్తున్నాడు. కొన్ని రోజుల నుంచి హైదరాబాదులో ఈ సినిమా షూటింగు జరుగుతోంది. నాగశౌర్య .. బ్రహ్మాజీ తది తరులపై కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. తాజాగా షూటింగ్ సెట్లో బ్రహ్మాజీతో దిగిన ఓ ఫోటోని నాగశౌర్య సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇందులో నాగశౌర్య నుదుటున కుంకుమరేఖను ధరించి కనిపిస్తూ ఉండగా, బ్రహ్మాజీ నుదుటున నామాలు ధరించి ఉన్నాడు. అయితే ఈ ఫొటోను పోస్ట్ చేసిన నాగశౌర్య ఫన్నీగా ఒక కామెంట్ పెట్టాడు. ‘నా తమ్ముడు బ్రహ్మాజీ ఇండస్ట్రీకి కొత్తగా వచ్చాడు .. మీ అందరి సపోర్టు కావాలి .. దయచేసి యంగ్ టాలెంట్ ను ప్రోత్సహించండి’అంటూ సరదాగా రాసుకొచ్చాడు. బ్రహ్మాజీ ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలమే అయింది. అయినా ఆయన ఇప్పటికీ కుర్రాడిలా చాలా ఫిట్ నెస్ తో ఉంటాడు. ఈ విషయంపై సన్నిహితులు ఆయనను ఆటపట్టిస్తూనే ఉంటారు. అలాగే నాగశౌర్య కూడా, ఆయనను తమ్ముడు అంటూ అలా ఆటపట్టించాడు. ప్రస్తుతం నాగశౌర్య ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. Na thammudu @actorbrahmaji kothaga industry ki vachadu. Mi andari support thanaki undali. Please support young talent 💪😜#NS22#IRA4 pic.twitter.com/OIgx5UFkSK — Naga Shaurya (@IamNagashaurya) July 23, 2021 -
జిమ్‌లో తెగ కష్టపడుతున్న నాగశౌర్య.. ఫోటో వైరల్
ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ర్టీలో సత్తా చాటుతున్న యంగ్ హీరోల్లో నాగశౌర్య ఒకరు. ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి మంచి క్రేజ్ సంపాదిచుకున్నాడు. ఈ చిత్రం కమర్షియల్‌గా మంచి విజయాన్ని సాధించడంతో అతడు వెనుదిరిగి చూసుకోలేదు. వైవిధ్యభరితమైన కథలను ఎంపిక చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇటీవలే హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ అనౌన్స్ చేసిన మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ 2020లో నాగశౌర్య 5వ స్థానాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ యంగ్ హీరో జిమ్ వర్కవుట్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇందులో నాగ శౌర్య మాచో రిప్డ్ లుక్‌లో కండలు కండలు తిరిగిన దేహదారుఢ్యంతో కనిపిస్తున్నాడు. ఇక గతంలోనూ లక్ష్య సినిమా కోసం 8 ప్యాక్ బాడీతో పాటు పోనీ టెయిల్‌తో ఉన్న శౌర్య లుక్ ఒకటి వైరల్ అయిన సంగతి తెలిసిందే. పాత్రకు తగ్గట్లు శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకునేందుకు జిమ్‌లో తెగ కసరత్తులే చేస్తున్నాడు నాగశౌర్య. ప్రస్తుతం ఈ యంగ్ హీరో వరుడు కావలెను, లక్ష్య, ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి చిత్రాల్లో నటిస్తున్నాడు. చదవండి : రెమ్యునరేషన్ బీభత్సంగా పెంచిన యంగ్ హీరో నితిన్ డేరింగ్ స్టెప్: షూటింగ్ మొదలు -
కోట్లు కావాలంటున్న నాగశౌర్య!
ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండానే వెండితెర మీద అడుగు పెట్టాడు హీరో నాగశౌర్య. తనను తాను నిరూపించుకోవడానికి దాదాపు ఐదేళ్లు కష్టపడ్డాడు. ఒకానొక సమయంలో ఈ ఫీల్డ్ చుట్టూ తిరగడం మాని పెట్టేబేడా సర్దుకుని ఇంటికి వెళ్లిపోదాం అనుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో వారాహి చలన చిత్రం నటీనటులు కావలెను అన్న యాడ్ చూశాడు. తన ఫొటో, వివరాలు పంపాడు. అయినా తనకెందుకు వస్తుందీ అవకాశం అని దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ అనూహ్యంగా ఊహలు గుసగుసలాడే సినిమా నుంచి అతడికి పిలుపు వచ్చింది. అది కూడా ప్రధాన హీరోగా. ఇది కమర్షియల్‌గా మంచి విజయాన్ని సాధించడంతో అతడు వెనుదిరిగి చూసుకోలేదు. వైవిధ్యభరితమైన కథలను ఎంపిక చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఈ క్రమంలో తాజాగా అశ్వథ్థామతో పలకరించిన అతడు ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయాడు. అయినప్పటికీ నాగశౌర్యకు డిమాండ్ ఏమాత్రం తగ్గనట్లు కనిపిస్తోంది. అతను సినిమాకు సంతకం చేయాలంటే నాలుగు కోట్ల రూపాయలు అడుగుతున్నాడట. దానికి ఒక్క పైసా తక్కువైనా ఒప్పుకునేదే లేదని కరాఖండిగా చెప్తున్నాడట. దీంతో కథ చెప్పడానికి వెళ్లిన దర్శకులు ఈ యంగ్ హీరో డిమాండ్ చేస్తున్న రెమ్యూనరేషన్ విని ఒక్కసారిగా షాకవుతున్నట్లు సమాచారం. నాగశౌర్య ఉన్నట్టుండి తన పారితోషికాన్ని ఇంతలా పెంచాడేంటని తలలు పట్టుకుంటున్నారు. ఇదిలా వుంటే ప్రస్తుతం ఈ హీరో 'లక్ష్య' సినిమా మీద ఫోకస్ చేశాడు. ఇందుకోసం శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకునేందుకు తీవ్ర కసరత్తులే చేస్తున్నాడు. ఈ చిత్రంలో కేతిక శర్మ హీరోయిన్గా నటిస్తోంది. మరాఠీ, బాలీవుడ్ నటుడు సచిన్ ఖడేకర్ హీరో తాతయ్యగా కనిపించనున్నాడు. సుబ్రహ్మణ్యపురం ఫేమ్ సంతోష్ జాగర్లపూడి దీనికి దర్శకత్వం వహిస్తుండగా నారాయణ్‌దాస్ నారంగ్, శరత్ మరార్, పీ రామ్మోహన్రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరి ఈ లక్ష నాగశౌర్యను హిట్ ట్రాక్ ఎక్కిస్తుందేమో చూడాలి! చదవండి: నాగశౌర్య సరసన హాట్ బ్యూటీ ఎంట్రీ అలా మొదలైంది అంత హిట్టవ్వాలి -
కోలకళ్ళే ఇలా గుండే గిల్లే ఎలా ..
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య తాజాగా నటిస్తున్న చిత్రం ‘వరుడు కావలెను’. ఈ సినిమాలో పెళ్లి చూపులు ఫేమ్ రీతువర్మ హీరోయిన్గా నటిస్తున్నారు. లక్ష్మీ సౌజన్యను దర్శకురాలిగా పరిచయం చేస్తూ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రేమికుల రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఓ మెలోడీ సాంగ్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ‘కోలకళ్ళే ఇలా గుండే గిల్లే ఎలా.. నీలి మబ్బుల్లో నేనే తేలేతంలా’ అంటూ సాగే ఈ పాట సంగీత ప్రియుల్ని అలరిస్తోంది. రాంబాబు గోసాల సాహిత్యం అందించిన ఈ పాటను ప్రముఖ గాయకుడు సిద్ శ్రీరామ్ ఆలపించాడు. ఈ గీతానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. -
నాగశౌర్య సరసన హాట్ బ్యూటీ ఎంట్రీ
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ యంగ్‌హీరో నాగశౌర్య సరసన టాప్ పాప్ సింగర్ తెలుగులో అడుగుపెడుతోంది. నాగ శౌర్య సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ బ్యానర్ తెరకెక్కనున్న మూవీలో యూట్యూబర్, నటి షిర్లీ సెటియా (25) ఎంట్రీ ఇస్తోంది. ఈ విషయాన్ని షిర్లే స్వయంగా ట్విటర్లో ధృవీకరించింది. అటు ఇంకా టైటిల్ కాని ఫిక్స్ కాని ఈ చిత్రంలో నాగశౌర్యకు జోడీగా నటిస్తున్నట్టు ఆమె అధికారికంగా ప్రకటించారు. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా వస్తోన్న ఈ చిత్రాన్ని నాగశౌర్య తల్లిదండ్రులు ఉషా, శంకర్ ములుపూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. లవర్, అలా ఎలా ఫేం అనీష్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ షురూ కానుంది.మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు.కాగా ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో "మాస్కా" చిత్రంతో యాక్టింగ్ కరియర్ ఆరంభించిన సెటియా పాప్ సింగర్‌గా రాణించారు.. I am super excited to announce my launch in Telugu film Industry with @IamNagashaurya, directed by #AneeshKrishna and produced by #Ushamulpuri Garu under banner @ira_creations . A @mahathi_sagar 🎹, 🎥#SaiSriram #IRA4 #NS22 🌈🌸🙌🏻💫 pic.twitter.com/vrWWphtFjh — Shirley Setia (@ShirleySetia) November 21, 2020 -
ఆ సినిమా చూశాక ధైర్యం వచ్చింది : నాగశౌర్య
‘‘పలాస 1978’ లాంటి కథలు చేయాలని ఉన్నా లోపల చాలా భయం ఉంటుంది. ఇలాంటి కథలు నిర్మించాలంటే నిర్మాతకు చాలా ధైర్యం ఉండాలి. అయితే ఈ సినిమా చూశాక చాలా ధైర్యం వచ్చింది’’ అన్నారు హీరో నాగశౌర్య. రక్షిత్, నక్షత్ర జంటగా కరుణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పలాస 1978’. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ చిత్రం సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా ఈ నెల 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ– ‘‘నా 40 ఏళ్ల సినీ కెరీర్లో ‘పలాస 1978’ మంచి సినిమా అని నమ్మకంగా చెప్పగలను. ఈ సినిమా పోస్టర్‌పై నా పేరు ఉన్నందుకు గర్వపడుతున్నాను’’ అన్నారు. ‘‘తమిళంలో వెట్రిమారన్లాంటి దర్శకుల్ని చూసి స్ఫూర్తి పొందుతుంటాం.. కానీ మనకూ అలాంటి దర్శకులున్నారని కరుణ్‌కుమార్ గుర్తు చేశాడు’’ అన్నారు దర్శకుడు మారుతి. ‘‘పలాస’ నా ఫస్ట్ సినిమాగా చేద్దామనుకోలేదు. నాకు చాన్స్ ఇచ్చిన ప్రసాద్‌గారికి, తమ్మారెడ్డి భరద్వాజగారికి రుణపడి ఉంటాను’’ అన్నారు కరుణ్‌కుమార్. నిర్మాతలు రాజ్ కుందుకూరి, ‘మధుర’ శ్రీధర్, సంగీత దర్శకులు రఘు కుంచె, కళ్యాణీ మాలిక్, పాటల రచయిత భాస్కర భట్ల, సిరాశ్రీ తదితరులు మాట్లాడారు. -
నాగశౌర్య కొత్త చిత్రం ప్రారంభం
-
50 శాతం పూర్తి.. వీసా కోసం వెయిటింగ్
కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చి తరువాత దర్శకుడిగా మారిన యువ నటుడు అవసరాల శ్రీనివాస్. అష్టా చమ్మా సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన అవసరాల కొద్ది రోజుల్లోనే ఊహలు గుస గుసలాడే సినిమాతో దర్శకుడిగా మారాడు. రెండో ప్రయత్నంగా జ్యో అచ్చుతానంద సినిమా డైరెక్ట్ చేసిన అవసరాల శ్రీనివాస్ లాంగ్ గ్యాప్ తర్వాత యంగ్ హీరో నాగశౌర్యతో మరో సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఆగిపోయిందంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో అనేకవార్తలు వస్తున్నాయి. బడ్జెట్ పెరిగిపోవడం, ఇప్పటివరకు వచ్చిన అవుట్‌పుట్‌పై దర్శకనిర్మాతలు అసంతృప్తిగా ఉండటంతో సినిమాను ఆపేసినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తమ అధికారిక ట్విటర్ ద్వారా స్పందించింది. ‘నాగశౌర్య, అవసరాల శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్ర షూటింగ్ 50 శాతం పూర్తయింది. చాలా అద్భుతంగా సినిమా రూపొందుతోంది. మిగతా షూటింగ్ యూఎస్ఏలో ప్లాన్ చేశాం. వీసాల కోసం వేచి చూస్తున్నాం. యూఎస్ఏ షెడ్యూల్ కూడా త్వరగానే పూర్తిచేస్తాం. ఈ సినిమా ఆగిపోయిందంటూ వస్తున్న వార్తలు నిరాధారమైనవి. పుకార్లను నమ్మకండి’అంటూ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, నిర్మాత వివేక్ కూచిభొట్ల ట్వీట్ చేశారు. ఇక అశ్వథ్థామతో హిట్ ట్రాక్‌లో వచ్చిన యంగ్ హీరో నాగశౌర్య వరుస సినిమాలో జోరుపెంచాడు. అవసరాల శ్రీనివాస్‌తో ఓ సినిమా రూపొందుతుండగానే.. లక్ష్మీసౌజన్య అనే కొత్త దర్శకురాలితో మరో సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. చదవండి: ‘అశ్వథ్థామ’ మూవీ రివ్యూ 'ముద్దు సన్నివేశం నాకు తెలియకుండానే తీశారు' -
దర్శకురాలిగా ‘లక్ష్మీ సౌజన్య’
గ్యాప్ తర్వాత ‘అశ్వథ్థామ’తో విమర్శకుల ప్రశంసలు అందుకున్న యంగ్ హీరో నాగశౌర్య వరుస సినిమాలతో వేగం పెంచాడు. నాగశౌర్య, ‘పెళ్లి చూపులు’ ఫేమ్ రీతు వర్మ జంటగా ఓ సినిమా ప్రారంభమైంది. సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్యదేవర నాగవంశి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా సినీ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ఈ చిత్ర షూటింగ్ గురువారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. టాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరై చిత్ర యూనిట్‌కు బెస్ట్ విషెస్ తెలియజేశారు. రెగ్యులర్ షూటింగ్ ఈ నెల19 నుంచి ప్రారంభంకానుంది. చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని నిర్మాత సూర్యదేవర నాగవంశి తెలిపారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతమందిస్తున్న ఈ చిత్రానికి వంశి పచ్చి పులుసు సినిమాటోగ్రపీ అందిస్తున్నారు. ఇక ఛలో తర్వాత అంతటి హిట్ అందుకోని నాగశౌర్య ‘అశ్వథ్థామ’ వంటి మంచి కంటెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు నాగశౌర్యనే కథను అందించడం విశేషం. సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్‌పై నాగశౌర్య తల్లి ఉష మూల్పురి ఈ చిత్రాన్ని నిర్మించారు. డిఫరెంట్ కాన్పెప్ట్‌తో వచ్చిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక రీతు వర్మ కూడా పెళ్లి చూపులు తర్వాత చెప్పుకోదగ్గ సినిమాలు చేయలేదు. అయితే ఈ సినిమాలో రీతువర్మ క్యారెక్టర్ స్పెషల్‌గా ఉంటుందని దర్శక నిర్మాతలు పేర్కొంటున్నారు. చదవండి: ‘అశ్వథ్థామ’ మూవీ రివ్యూ 'చావుకబురు చల్లగా’ చెప్పిన కార్తికేయ -
బ్రేక్ ఈవెన్‌ను క్రాస్ చేసిన ‘అశ్వథ్థామ’
అమ్మాయిల ఫాలోయింగ్ ఉన్న యంగ్ హీరో నాగ శౌర్య నటించిన తాజా చిత్రం అశ్వథ్థామ. ఇప్పటి వరకు లవర్ బాయ్‌గా కనిపించిన నాగ శౌర్య ఈ సినిమాతో యాక్షన్ అవతారం ఎత్తారు. రమణ తేజను దర్శకుడిగా పరిచయం చేస్తూ సొంతంగా కథ రాసుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. యాక్షన్, ఎమోషనల్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాలో మెహరీన్ శౌర్యకి జోడిగా నటించింది. జనవరి 31 న విడుదలైన ఈ సినిమా మిశ్రమ స్పందనతో ముందుకు కొనసాగుతోంది. (‘అశ్వథ్థామ’ మూవీ రివ్యూ) సంక్రాంతి సీజన్లో వచ్చిన అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరూ వంటి సినిమాల హమా మెల్లగా తగ్గుతుండటం.. అశ్వథ్థామ కలెక్షన్స్‌కు ప్లస్ అవుతుందని చెప్పవచ్చు. నాగశౌర్య నటనకు ప్రేక్షకులు మంచి మార్కులు వేయడంతో ఈ సినిమా స్థిరమైన కలెక్షన్లు రాబడుతోంది. నిన్నటి వరకు రూ. 10 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి బ్రేక్ ఈవెన్‌కు చేరువగా నిలవగా.. తాజాగా అందిన రిపోర్ట్స్ ప్రకారం రిలీజ్ అయిన అయిదు రోజుల్లోనే అన్ని ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ. 13.65 కోట్లను రాబట్టి బ్లాక్బాస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది. -
కర్నూలులో ‘అశ్వథ్థామ’ విజయోత్సవ యాత్ర
-
సమంత సందేశం
-
‘అశ్వథ్థామ’ సక్సెస్ సెలబ్రేషన్స్
-
‘అశ్వథ్థామ’ మూవీ రివ్యూ
టైటిల్: అశ్వథ్థామ జానర్: యాక్షన్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ నటీనటులు: నాగశౌర్య, మెహరీన్, ప్రిన్స్, సత్య, జిష్షు సేన్ గుప్తా, పోసాని కృష్ణమురళి, తదితరులు కథ: నాగశౌర్య దర్శకత్వం: రమణతేజ సంగీతం: శ్రీచరణ్ పాకాల నిర్మాత: ఉషా మూల్పూరి ‘ఛలో’ చిత్రంతో సూపర్ డూపర్ హిట్ అందుకున్న యువ హీరో నాగశౌర్య ఆ తర్వాత అదే జోరును కొనసాగించలేపోయాడు. యూత్ హీరోగా ముఖ్యంగా అమ్మాయిల్లో ఫుల్ ఫాలోయింగ్ ఉన్న ఈ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరోకు హిట్టు పడి చాలా కాలమే అయింది. దీంతో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చి బలమైన స్క్రిప్ట్‌తో పాటు సందేశాత్మక చిత్రాన్ని అందించేందుకు స్యయంగా నాగశౌర్యనే కథా రచయితగా మారాడు. తన లవర్ బాయ్ ఇమేజ్ను పక్కకు పెట్టి ఫుల్ యాక్షన్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ కథ ‘అశ్వథ్థామ’ తో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నాగశౌర్య. మరి ఈ సినిమాతో నాగశౌర్యకు యాక్షన్ అండ్ మాస్ ఇమేజ్ను తెచ్చిపెట్టిందా? మళ్లీ ఈ యువ హీరో హిట్ ట్రాక్ ఎక్కాడా? డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించారా? అనేది మన సినిమా రివ్యూలో చూద్దాం. కథ: నగరంలోని యువతులు మిస్సవడం.. రెండు మూడు రోజులు తర్వాత అపస్మారక స్థితిలో ఆసుపత్రిలో కనిపించడం.. కొన్ని నెలల తర్వాత ఆ యువతులు ప్రెగ్నెంట్ కావడం.. చేసింది ఎవరో తెలీదు. కొంత మంది పాత్ర ధారులతో ఓ సూత్రధారి నిర్మించుకున్న పద్మ వ్యూహం లాంటి సామ్రాజ్యంలోకి అశ్వథ్థామ ప్రవేశిస్తాడు. పద్మవ్యూహంలోకి వెళ్లిన అశ్వథ్థామ చిక్కుకున్నాడా? లేక ఆ వ్యూహాన్ని ఛేదించాడా? శత్రు సంహారం జరిగిందా అనేదే అశ్వథ్థామ కథ. గణ (నాగశౌర్య)కు కుటుంబం అన్నా తన చెల్లెలు ప్రియ అన్నా ఎంతో ఇష్టం. చెల్లెలు ప్రియ ఎప్పుడు కంటతడి పెట్టకుండా అండగా, ధైర్యంగా ఉంటానని గణ తన తల్లికి చిన్నప్పుడే మాటిస్తాడు. అయితే రవి (ప్రిన్స్)తో ప్రియ పెళ్లికి కొద్ది రోజుల ముందు ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించడాన్ని గణ చూస్తాడు. ఇందుకు గల కారణాలను తెలుసుకొని ప్రియకు బాసటగా నిలుస్తాడు. తన చెల్లితో పాటు ఇంకెదరో యువతులు ఇలాంటి ఘటనలే ఎదుర్కోవడాన్ని గణ తన ఇన్వెస్టిగేషన్లో తెలుసుకుంటాడు. ఇదంతా చేస్తుంది ఎవరు? నేహ (మెహరీన్)కు గణ కుటుంబానికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? ఈ కథలోకి డాక్టర్ మనోజ్‌కుమార్ (జిష్షు సేన్ గుప్తా), సత్య, పోసాని, తదితరలు ఎందుకు ఎంటర్ అవుతారు? చివరికి ఈ మిస్టరీ వెనుక ఉన్నది ఎవరో గణ తెలుసుకుంటాడా? చివరికి ఏమైంది? అనేదే అసలు సినిమా కథ నటీనటులు: నటీనటులు విషయానికి వస్తే ఈ సినిమా మొత్తాన్ని వన్ మ్యాన్ షోతో నాగశౌర్య ముందుండి నడిపించాడు. ఇప్పటివరకు ఉన్న లవర్ బాయ్ ఇమేజ్ను తొలగించుకునేందుకు ఈ పవర్ ఫుల్ యాక్షన్ చిత్రంలో నటించిన నాగశౌర్య ఫుల్ ఎనర్జీతో సూపర్బ్ అనిపించాడు. యాక్షన్ సీన్స్‌లలో హై వోల్టేజ్ పెర్ఫార్మెన్స్తో అదరగొట్టాడు. తన శైలికి భిన్నంగా చేసిన ఈ సినిమాతో అటు మాస్ ఆడియన్స్‌ను సొంతం చేసుకోవడం పక్కా. సినిమా తొలి అర్థభాగంలో కొన్ని సీన్లలలో కాస్త క్లాస్ లుక్‌లో కనిపించినా.. ఆ తర్వాత ఫుల్ మాస్ అండ్ రఫ్ లుక్‌లో కనిపిస్తాడు. సైకో విలన్‌గా జిష్షు సేన్ గుప్తా కొన్ని చోట్ల భయపెట్టిస్తాడు. క్లాస్ అండ్ రిచ్ విలన్‌గా చక్కగా ఒదిగిపోయాడు. రబ్బరు బొమ్మగా పేరు తెచ్చుకున్న హీరోయిన్ మెహరీన్‌కు ఈ చిత్రంలో మంచి పాత్ర లభించినప్పటికీ హావభావాలు పలికించడం తడబడింది. అంతేకాకుండా తన పాత్రలో జీవించడం మరిచిపోయినట్టుగా అనిపిస్తుంది. ప్రిన్స్, నాగశౌర్య చెల్లెలి పాత్రలో కనిపించి అమ్మాయి సందర్భానుసారంగా స్క్రీన్ పై వచ్చి పోతుంటారు. భారీ తారాగణం ఉన్నప్పటికీ కొన్ని సీన్లలో వచ్చిపోతుంటారు తప్ప కథకు వారు పెద్ద ప్లస్ కాదు. విశ్లేషణ: ఈ సినిమాకు ప్రధాన బలం కథ, కాన్సెప్ట్. దీంతో తెరపైనే కాకుండా తెరవెనక కూడా ప్రధాన హీరో నాగశౌర్యనే. ఇక హీరో అందించిన కథను దర్శకుడు రమణ తేజ చాలా చక్కగా ప్రజెంట్ చేశాడు. సినిమా ప్రారంభమైన తొలి పదిహేను నిమిషాల్లోనే అసలు కథలోకి ప్రవేశిస్తుంది. ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా, నెక్ట్స్ ఏంజరుగుతుంది అనే కుతూహలం సగటు ప్రేక్షకుడికి ఏర్పడే విధంగా ఫస్టాఫ్ సాగుతుంది. అయితే హీరోయిన్‌తో వచ్చే సీన్లు, పాటలు ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెట్టే విధంగా ఉంటాయి. ఇంటర్వెల్ వరకు బాగానే ఉన్న సెకండాఫ్ దర్శకుడు ఎలా తీస్తాడా? అనే అనుమానం అందరిలోనూ తలెత్తడం ఖాయం. అయితే సెకండాఫ్‌లో కూడా కథను ఎక్కడా డీవియేట్ కాకుండా? అనవసర హంగుల జోలికి వెళ్లకుండా రెండో అర్థభాగాన్ని చాలా బాగా హ్యాండిల్ చేశాడు దర్శకుడు. ఈ విషయంలో దర్శకుడి ప్రతిభకు నూటికి నూరు మార్కులు వేయాల్సిందే. ఎలాంటి గందరగోళం లేకుండా స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. యాక్షన్ సీన్స్ వావ్ అనిపిస్తాయి. అయితే అన్నా చెల్లెలి మధ్య వచ్చే ఎమోషన్స్ సీన్స్ అంతగా పండలేదు. దీనిపై కాస్త శ్రద్ద పెట్టాల్సింది. ఇక అసలు సూత్రధారి ఎవరో కనిపెట్టిన హీరో.. చిన్న ఫైట్‌తో సినిమా ముగించడంతో సినిమా అయిపోయిందా అనే భావన సగటు ప్రేక్షుకడికి కలగడం ఖాయం. మనోజ్ రెడ్డి కెమెరా పనితనం తెరపై కనిపిస్తుంది. హీరోయిన్ అందాలు, యాక్షన్ సీన్లలో మనోజ్ తన సినిమాటోగ్రఫీతో మైమరిపించాడు. ఈ సినిమాకు మరో ప్రధాన బలం జిబ్రాన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్. కొన్ని సీన్లలో సైలెంట్ మ్యూజిక్.. మరికొన్ని చోట్ల హార్ట్ బీట్‌ను పెంచే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందించాడు. ముఖ్యంగా హీరో ఈల వేసేటప్పుడు థియేటర్ మొత్తం నిశ్శబ్బ వాతావరణం అలుముకుటుంది. ఇక శ్రీచరణ్ పాకాల పాటలు పర్వాలేదనిపించాయి. కానీ గుర్తుండిపోయే పాటలు మాత్రం కాదు. ఇక ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టు ఉన్నాయి. ఇక ‘గోపాల గోపాల’ సినిమాలో ధర్మం గురించి పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగ్‌తో సినిమా ఆరంభం అవడం ‘అశ్వథ్థామ’కు బూస్టప్‌ను ఇచ్చే అంశం. ఆకట్టుకునే డైలాగ్‌లు: ‘ఏ తల్లి కన్నదో వంద మంది కౌరవుల క్రూరత్వాన్ని ఈ ఒక్కడిలోనే కనింది’, ‘మనిషికి ఉండేది కోరిక, మృగాడికి ఉండేది వాంఛ. మరి మృగాడి వాంఛను తీర్చుకోవడానికి బతికుంటే ఏంటి? చచ్చిపోతే ఏంటి?’, ‘రావణాసురుడు చనిపోయింది సీతను ఎత్తుకపోయినందుకు కాదు.. జాటాయువును పూర్తిగా చంపనందుకు.. పూర్తిగా చంపుంటే సీతమ్మను ఎత్తుకపోయింది రావణుడని, దక్షిణం వైపు వెళ్లారని రాముడికి తెలిసేదా? రావణుడు చనిపోయేవాడా?’, ‘లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ షిప్లో ఏదో మ్యాజిక్ ఉంది’, ‘ప్రస్తుత కాలంలో ఆడపిల్లను కని, పెంచి ఏ గొడవ లేకుండా పెళ్లి చేయడం అంటే సాధారణ విషయం కాదు’ అంటూ సినిమాలో వచ్చే డైలాగ్‌లు ఆకట్టుకోవడంతో పాటు ఆలోచించే విధంగా ఉంటాయి. ప్లస్ పాయింట్స్: కథ, కథనం నాగశౌర్య నటన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మైనస్ పాయింట్స్: కొన్ని సాగదీత సీన్స్ పాటలు క్లైమాక్స్ సాదాసీదాగా ఉండటం - సంతోష్ యాంసాని, సాక్షి వెబ్‌డెస్క్ -
‘అశ్వథ్థామ’ ఆడియో ఫంక్షన్
-
అశ్వథ్థామ: చివర్లో విజిల్.. అదిరిపోయింది
ఓ ప్రేమ కథ.. లేదంటే, రెండు వర్గాల మధ్య గొడవలు.. ఎప్పుడూ ఇదే కథేనా అనుకునే వారికి రొటీన్ కథతో కాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ముందుకు వస్తున్నాడు హీరో నాగశౌర్య. అతను తాజాగా నటించిన చిత్రం ‘అశ్వథ్థామ’. ఈ సినిమా ట్రైలర్‌ను దర్శకుడు పూరీ జగన్నాధ్ గురువారం సాయంత్రం రిలీజ్ చేశారు. సస్పెన్స్, యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతోంది. ఇక ట్రైలర్ ప్రకారం అమ్మాయిల మిస్సింగ్‌తోపాటు, వారిని దారుణంగా చంపుతున్న వారికోసం హీరో వేట మొదలు పెడతాడు. అయితే వీళ్లందరినీ ఆడిస్తున్న ప్రధాన సూత్రధారిని పట్టుకోడానికి హీరో తన ప్రయత్నాలు కొనసాగిస్తాడు. (అశ్వథ్థామ టీజర్) ఈ క్రమంలో నాగశౌర్య ఫైట్లు కూడా చేస్తాడు. అయితే శౌర్య లవర్‌బాయ్ ఇమేజ్ నుంచి ఒక్కసారిగా మాస్ యాంగిల్లో కనిపించడం కాస్త కొత్తగా ఉన్నా అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇక ట్రైలర్ చివరలో శౌర్య విజిల్ వేసుకుంటూ కనిపించే సీన్ అభిమానులతో ఈల వేయించేట్లు కనిపిస్తోంది. బీజీఎమ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ‘ఎటువైపు వెళ్లినా మూసుకుపోతున్న దారులు.. ఒకరితో ఒకరికి సంబంధంలేని వ్యక్తులు... వేట కుక్కల్లా వెంటపడే జాలర్లు.. శకునిలాంటి ఓ ముసలోడు.. వీరందరినీ ఒకే స్టేజ్ మీద ఆడించే ఆ సూత్రధారి ఎవరు?’ వంటి డైలాగ్స్ బాగున్నాయి. నాగశౌర్య ఈ సినిమాతో తప్పకుండా హిట్ ట్రాక్‌లోకి వస్తాడని అభిమానులు మక్తకంఠంతో చెప్తున్నారు. ఇక శౌర్య ఈ సినిమా పేరుని తన ఛాతిపై పచ్చబొట్టుగా పొడిపించుకున్న విషయం తెలిసిందే. కాగా సమాజంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా నాగశౌర్య సొంతంగా కథ రాసుకున్నాడు. ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా మూల్పూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31న విడుదలవుతోంది. -
వాస్తవ సంఘటనల అశ్వథ్థామ
నాగసౌర్య, మెహరీన్ జంటగా నటించిన చిత్రం ‘అశ్వథ్థామ’. ఈ చిత్రంతో రమణ తేజ దర్శకునిగా పరిచయమవుతున్నారు. శంకర్ ప్రసాద్ మూల్పూరి సమర్పణలో ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా మూల్పూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 31న విడుదలవుతోంది.ఈ సినిమా ట్రైలర్‌ను డైరెక్టర్ పూరి జగన్నాధ్ రేపు (గురువారం) సాయంత్రం 5.04 గంటలకు విడుదల చేయనున్నారు. ‘‘సమాజంలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనలతో నాగశౌర్య ఈ సినిమా కథని రాసుకున్నారు. హీరోయిన్ సమంత ఇటీవల విడుదల చేసిన మా సినిమా టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. ట్రైలర్ కూడా అందరి అంచనాలకు తగ్గట్టు ఉంటుంది’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి కెమెరా: మనోజ్ రెడ్డి, సంగీతం: శ్రీచరణ్ పాకాల, లైన్ ప్రొడ్యూసర్: బుజ్జి. -
నెట్టింట్లో దూసుకుపోతున్న ‘అశ్వథ్థామ’ టీజర్
రమణ తేజని డైరెక్టర్‌గా పరిచయం చేస్తూ నాగశౌర్య, మెహరీన్ జంటగా నటించిన చిత్రం ‘అశ్వథ్థామ’. ఐరా క్రియేషన్స్ బ్యానర్‌పై శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మించారు. ఇప్పటివరకు క్లాస్ అండ్ లవర్‌బాయ్‌గా ముద్ర పడిన నాగశౌర్య ఈ చిత్రంతో ఆ ఇమేజ్ను చెరిపేసుకునే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తోంది. ఇక ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్, టీజర్, సాంగ్స్‌తో సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. ముఖ్యంగా ఈ టీజర్ మాస్ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయింది. దీంతో అశ్వథ్థామ టీజర్ నెట్టింట్లో తెగ వైరలవుతోంది. కేవలం 24 గంటల్లోనే 4 మిలియన్‌కు పైగా డిజిటల్ వ్యూస్‌ను సొంతం చేసుకున్న ఈ టీజర్ సరికొత్త ఘనతను సొంతం చేసుకుంది. అంతేకాకుండా ప్రస్తుతం యూట్యూబ్‌లో తెగ ట్రెండ్ అవుతోంది. టీజర్, సాంగ్స్‌కు వస్తున్న రెస్పాన్స్‌తో చిత్రం ఘనవిజయం సాధించడం ఖాయమని చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేస్తోంది. ఇక ఈ సినిమాకు కథను నాగ శౌర్యనే అందించిన విషయం తెలిసిందే. శ్రీచరణ్ పాకాల సంగీతాన్నందిస్తున్న ఈ చిత్రం జనవరి 31న విడుదలకానుంది. -
అశ్వథ్థామ టీజర్ విడుదలయ్యేది అప్పుడే
ఛలో తర్వాత హిట్ అందుకోవడమై గగనమైపోయిన నాగశౌర్య వరుస సినిమాలు చేసుకుంటూ పోయాడు. కానీ మళ్లీ హిట్ అందుకోలేకపోయాడు. దీంతో ఈసారి ఆయనే నేరుగా ‘అశ్వథ్థామ’ కథ సిద్ధం చేసుకోగా నూతన దర్శకుడు రమణ తేజ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అటు క్లాస్, ఇటు మాస్ ఆడియన్స్ అందరికీ నచ్చేలా సినిమా ఉంటుందని చిత్రబృందం పేర్కొన్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన నాగశౌర్య ఫస్ట్‌లుక్ మాస్ ఆడియన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. ఇందులో నాగశౌర్యకు జోడీగా హీరోయిన్ మెహరీన్ నటిస్తోంది. ఈ సినిమా టీజర్‌ను డిసెంబర్ 27న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా జనవరి 31న విడుదల కానుంది. -
అశ్వథ్థామ నుంచి అందమైన పాట..
యంగ్ హీరో నాగశౌర్య హిట్ ఫ్లాఫ్లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఛలో సినిమా విజయం తర్వాత నాగశౌర్యకు మళ్లీ హిట్ అందుకోవడమే గగనమైపోయింది. ఓ బేబీ విజయాన్ని సొంతం చేసుకున్నప్పటికీ ఆ క్రెడిట్ హీరోయిన్ సమంత అకౌంట్లో పడిపోయింది. దీంతో మళ్లీ విజయాన్ని అందుకునేందుకు పరుగు మొదలుపెట్టాడీ యంగ్ హీరో. సమాజంలో జరుగుతున్న వాస్తవ సంఘటనల ఆధారంగా నాగశౌర్య సొంతంగా రాసుకున్న కథే ‘అశ్వథ్థామ’. నూతన దర్శకుడు రమణ తేజ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నాగశౌర్యకు జోడీగా మెహరీన్ నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి ‘నిన్నే నిన్నే.. ఎదలో నిన్నే.. చెలియా నీకై నే వేచానులే’ అనే పాటను చిత్రబృందం విడుదల చేసింది. శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని సమకూర్చిన ఈ పాటను అర్మన్ మాలిక్, యామిని ఘంటసాల ఆలపించారు. ఈ పాట అతని అభిమానులతో పాటు ప్రేమికులను అలరిస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ చిత్రం జనవరి 31న విడుదల కానుంది. -
ఓ మై గాడ్ అంటున్న సమంత..
యంగ్ హీరో నాగశౌర్య.. జిమ్‌లో భారీగానే కసరత్తులు చేస్తున్నాడు. సినిమాలో లుక్కు సంబంధించి.. బాడీని అనువుగా మార్చుకునేందుకు ఆయన తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన లుక్‌ను ఆయన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘డాడీ నన్ను ఈ పిక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయమన్నారు. నేను క్యాప్షన్ పెట్టి పోస్ట్ చేసేలోపు నన్ను తిట్టి.. ఏ క్యాప్షన్ లేకుండా పోస్ట్ చేపించారు’ అని నాగశౌర్య పేర్కొన్నారు. అయితే ఈ ఫొటోపై ప్రముఖ హీరోయిన్ సమంత స్పందించారు. ఓ మై గాడ్.. వాట్ ఈస్ దిస్ క్రేజీనెస్ అంటూ నాగశౌర్య పోస్టుపై కామెంట్ చేశారు. ప్రస్తుతం నాగశౌర్య షాకింగ్ లుక్ ఫొటో వైరల్‌గా మారింది. కాగా, ఈ ఏడాది నాగశౌర్య, సమంత జంటగా నటించిన ‘ఓ బేబీ’ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం తన సొంత బ్యానర్లో.. రమణ తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అశ్వథామ చిత్రంలో ఆయన నటిస్తున్నారు. షూటింగ్ చివరిదశకు చేరుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో తెరకెక్కుతున్న చిత్రంలో కూడా ఆయన నటిస్తున్నారు. ఈ సినిమాతో లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. -
నాగశౌర్య కొత్త చిత్రం ప్రారంభం
-
క్లాసిక్ టైటిల్‌తో యంగ్ హీరో!
ప్రస్తుతం తన సొంత బ్యానర్లో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న యంగ్ హీరో నాగశౌర్య, తదుపరి చిత్రాన్ని కూడా లైన్లో పెట్టాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాతో లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు ఓ ఓల్డ్ క్లాసిక్ టైటిల్‌ను ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నారట. గత జన్మల నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా కావటంతో అదే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన అక్కినేని నాగేశ్వరరావు సూపర్ హిట్ సినిమా ‘మూగ మనసులు’ టైటిల్‌ను ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నారట. ఇప్పటికే చాలా మంది హీరోలు ఇలాంటి క్లాసిక్ టైటిల్స్‌ను తీసుకొని చేతులు కాల్చుకున్నారు. మరి నాగశౌర్య ఆ టైటిల్‌కు ఎంతవరకు న్యాయం చేస్తాడో చూడాలి. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్‌లో ప్రారంభించి వచ్చే ఏడాది మేలో సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. -
సింగిల్ షాట్లో ‘అశ్వద్ధామ’ పోరాటం
ఈ జనరేషన్ దర్శకులు కథా కథనాల్లోనే కాదు మేకింగ్ పరంగా కూడా ప్రయోగాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇటీవల విడుదలైన డియర్ కామ్రేడ్ సినిమాలోని ఓ పాటను పూర్తిగా ఒకే షాట్లో తెరకెక్కించారు. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న కొబ్బరిమట్ట సినిమాలో సంపూర్ణేష్ బాబు మూడు నిమిషాల డైలాగ్‌ను ఒకే టేక్‌లో చెప్పి ఆశ్చర్యపరిచాడు. ఫలక్‌నుమా దాస్ సినిమాలో ఏకంగా 10 నిమిషాల క్లైమాక్స్ సీన్‌ను ఒకే షాట్లో చిత్రీకరించారు. తాజాగా ఇలాంటి ప్రయోగానికే సిద్ధమవుతున్నాడు మరో యంగ్ హీరో నాగశౌర్య. తన సొంత బ్యానర్లో రమణ తేజను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ సినిమాలో నటిస్తున్నాడు నాగశౌర్య. ఈ సినిమాల కీలక సమయంలో వచ్చే ఓ పోరాట సన్నివేశాన్ని ఒకే షాట్లో చిత్రీకరిస్తున్నారు. 3 నిమిషాల నిడివితో రూపొందుతున్న ఈ షాట్ ఆడియన్స్‌ను థ్రిల్ చేస్తుందంటున్నారు చిత్రయూనిట్. ఈ సన్నివేశానికి అన్బు అరివులు యాక్షన్ కొరియోగ్రాఫీ అందిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాకు అశ్వద్ధామ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. -
సీన్లో ‘పడ్డారు’
ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది. కెమెరా క్లోజప్ నుంచి లాంగ్ షాట్‌కు మారుతుంది. అంటే డూప్ వచ్చాడని అర్థం. అంతవరకూ క్లోజప్‌లో హీరో ఒక స్పీడ్‌తో చేస్తుంటాడు. లాంగ్ షాట్లో డూప్ అంతకు మించిన స్పీడ్‌తో చేస్తుంటాడు. ప్రేక్షకులకు హీరో ఎవరో డూప్ ఎవరో తెలిసిపోతూ ఉంటుంది. అయినప్పటికీ డూప్‌తో పాటుగానే హీరోని యాక్సెప్ట్ చేసేవారు. కాని రాను రాను రోజులు మారాయి. సొంతంగా ఫైట్స్ చేసుకునేవారికి విలువ పెరిగింది. తెలుగులో చిరంజీవి ఇలాంటి ధోరణికి తెర తీశారు. ‘గూండా’ సినిమాలో ఆయన రైలు కింద కడ్డీ పట్టుకుని ఒరిజినల్‌గా చేసిన స్టంట్ అప్పట్లో న్యూస్కెక్కింది. యాక్షన్ కింగ్ అర్జున్ కూడా ఫైట్స్‌లో డూప్ లేకుండా తన సత్తాను చూపించారు. సుమన్, భానుచందర్‌లాంటి హీరోలు రియల్ ఫైట్స్‌తో జనాన్ని ఆకర్షించారు. రాను రాను స్టంట్స్‌లో సేఫ్టీ మెజర్స్ పెరిగాయి. చాలా జాగ్రత్తలు తీసుకొని ఫైట్స్‌ను కంపోజ్ చేస్తున్నారు. కనుక హీరోలు కూడా డూప్‌ల అవసరం లేకుండా తామే ఫైట్స్ చేస్తామని ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా ఇటీవలి కుర్ర హీరోలు కయ్యానికి ఒరిజినల్‌గా కాలు దువ్వుతున్నారు. ‘నా స్టంట్స్ నేనే చేసుకుంటా’ అని బిల్డింగులు దూకుతున్నారు. అయితే ఇలాంటి రిస్క్‌తో కూడుకున్న యాక్షన్ సన్నివేశాలకు ఊహించని ప్రమాదం ఎప్పుడూ పొంచే ఉంటుంది. జాగ్రత్తలు పాటించినా అనుకున్నది అనుకున్నట్లుగా జరగకపోతే, కట్టిన తాడు గట్టిగా నిలవకపోతే గాయాలతో బెడ్ మీద పడాల్సిందే. అనుకోకుండా ఈ ఏడాది మన టాలీవుడ్లో చాలా మంది యంగ్ హీరోలు గాయాలపాలయ్యారు. వారం వ్యవధిలోనే నలుగురు హీరోలు ప్రమాదాలకు గురయ్యారు. విలన్లను దెబ్బ తీయాల్సిన వీళ్లు ఇలా దెబ్బలు తగిలించుకోవడం ఇటు అభిమానులకు, అటు ఇండస్ట్రీకూ కలవరమే. గాయాల గూఢచారి శత్రువుల రహస్యాలను చేధించడానికి గూఢచారి ప్రాణాలకు తెగించాల్సి ఉంటుంది. ప్రమాదం ఏ దిక్కు నుంచి వస్తుందో ఊహించలేం. ప్రస్తుతం అలాంటి గూఢచారి పాత్రనే ‘చాణక్య’ సినిమాలో పోషిస్తున్నారు గోపీచంద్. తిరు దర్శకత్వం వహి స్తున్న ఈ స్పై సినిమా కోసం పాకిస్తాన్–ఇండియా బోర్డర్లో షూటింగ్ చేశారు. అక్కడ ఓ యాక్షన్ సన్నివేశాన్ని చేస్తూ గోపీచంద్ గాయపడ్డారు. గాయం తీవ్రమైంది కావడంతో 45 రోజులు విశ్రాంతి తీసుకుని, మళ్లీ షూటింగ్లో జాయిన్ అయ్యారు. ఆర్ఆర్ఆర్ టీమ్ కంగార్ మనకున్న టాప్ కమర్షియల్ డైరెక్టర్స్‌లో అతి పెద్ద హింసావాది రాజమౌళి. ఆయన సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలు చూస్తే ఆ మాట అనకుండా ఉండలేం. ‘మగధీర’లో వందమందితో ఫైట్, ‘విక్రమార్కుడు’ ఇంటర్వెల్ సీన్, ‘బాహుబలి’లో యుద్ధ సన్నివేశాలు ఒక్కసారి గుర్తుచేసుకోండి. తాజాగా ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ అనే పీరియాడికల్ మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ మొదలైన కొన్ని రోజుల్లోనే చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ గాయపడ్డారు. జిమ్‌లో కసరత్తులు చేస్తూ చరణ్ గాయపడగా, ఫైట్ సీన్ చేస్తున్న సమ యంలో ఎన్టీఆర్ చేతికి గాయం అయింది. దీంతో ఈ భారీ బడ్జెట్ చిత్రానికి చిన్న బ్రేక్ వచ్చింది. ఇటీవలే కోలుకున్న ఈ హీరోలు మళ్లీ షూట్లో జాయిన్ అయ్యారు. రాజమౌళి హీరోలు గాయపడటం చాలా సాధారణమే. ‘మగధీర’లో రామ్‌చరణ్, ‘బాహుబలి’లో ప్రభాస్ గాయాలపాలయ్యారు. గ్యాంగ్‌లీడర్‌కు గాయం ‘మనం’, ‘24’ ఫేమ్ విక్రమ్ కె.కుమార్ ప్రస్తుతం నానీని ‘గ్యాంగ్‌లీడర్’గా మార్చారు. ఈ సినిమాలో ఓ యాక్షన్ సన్నివేశం చిత్రీకరణలో భాగంగా నాని గాయపడ్డారు. ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్న నాని త్వరలోనే షూటింగ్‌కు సిద్ధమవుతారు. ‘జెర్సీ’లోనూ క్రికెట్ ఆడుతూ ముక్కుకి గాయం చేసుకున్నారు నాని. వారం గ్యాప్‌లో నలుగురు హరీశ్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ ‘వాల్మీకి’గా మారిన సంగతి తెలిసిందే. షూటింగ్లో పాల్గొన డానికి హైదరాబాద్ నుంచి కర్నూల్ వెళుతున్నప్పుడు ఆయన ప్రయాణం చేస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో పెద్ద గాయాలేమీ అవలేదని టీమ్ తెలిపింది. గతంలో ‘మిస్టర్’ షూటింగ్ సమయంలోనూ కాలికి గాయం చేసుకున్న సంగతి తెలిసిందే. విలన్లను పట్టుకోవడానికి వైజాగ్ వీధుల్లో పరిగెడుతున్నాడు నాగశౌర్య. అతçను హీరోగా నూతన దర్శకుడు రమణ తేజ తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం కోసం బిల్డింగ్ మీద నుంచి జంప్ చేసే సీన్లో డూప్, రోప్ ఏదీ లేకుండా స్వయంగా దూకారు శౌర్య. దాంతో కాలికి బలమైన గాయం కావడంతో 25 రోజులు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. తెనాలికి తగిలింది మాటల్ని మెలికలు తిప్పడం తెనాలి రామకృష్ణుని పని. కానీ మాటలు సరిపోవని యాక్షన్‌లోకి దిగారు. కామెడీ చిత్రాల దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా చేస్తున్న సినిమా ‘తెనాలి రామకృష్ణ ఎల్.ఎల్.బి’. కర్నూల్లో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్న సమయంలో బాంబ్ బ్లాస్ట్‌లో జరిగిన తప్పిదం వల్ల గాజు పెంకులు సందీప్ కిషన్ ఛాతీకి, చేతికీ గుచ్చుకున్నాయి. కంటి కింద కూడా గాజు పెంకులు గుచ్చు కున్నాయని తెలిసింది. ‘96’ రీమేక్ షూటింగ్ కోసం థాయ్‌ల్యాండ్‌లో స్కై డైవింగ్‌కు సంబంధించిన శిక్షణ తీసుకుంటున్నారు శర్వా. మూడు రోజులు ప్రాక్టీస్ బాగానే సాగింది. డైవ్ చేసి, నేల మీదకు ల్యాండవుతూ గాయపడ్డారు శర్వా. భుజం దగ్గర ఫ్రాక్చర్ అయింది. సోమవారం సర్జరీ విజయవంతంగా పూర్తయిందని, విశ్రాంతి తర్వాత షూట్లో జాయిన్ అవుతారని శర్వా సన్నిహితులు తెలిపారు. కామ్రేడ్ కూడా విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘డియర్ కామ్రేడ్’. ఈ సినిమాలో వేగంగా వెళ్లే రైలుని ఎక్కే సన్నివేశం చిత్రీకరిస్తున్న సమయంలో స్లిప్ అయ్యి ప్లాట్‌ఫామ్ మీద పడటంతో విజయ్ గాయపడ్డారు. ‘జీవితంలో ఏదీ ఊరికే రాదు. చివరికి గాయాలు కూడా. వాటిని కూడా మనం సెలబ్రేట్ చేసుకోవాలి’ అంటూ స్పిరిట్ చూపించారు విజయ్. కల్కికీ దెబ్బలు తగిలాయి రాజశేఖర్ లేటెస్ట్ చిత్రం ‘కల్కి’. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ పీరియాడికల్ మూవీను ప్రశాంత్ వర్మ తెరకెక్కించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో రాజశేఖర్ తలకు, భుజానికి గాయమైంది. సీన్ కంప్లీట్ చేసిన తర్వాతే డాక్టర్ దగ్గరికి వెళ్లారాయన. గతంలో ‘మగాడు’ షూటింగ్ సమయంలో పెద్ద ప్రమాదం ఏర్పడటంతో చాలా కాలం విశ్రాంతి తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక సుందర్ సి. దర్శకత్వంలో సినిమా చేస్తున్న విశాల్ ఇటీవల ఒక పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కొన్నారు. టర్కీలో ఓ గ్రాండ్ చేజింగ్ సీన్ చిత్రీకరణ సమయంలో విశాల్ బైక్ స్కిడ్ కావడంతో కాలికి పెద్ద గాయం అయి, షూటింగ్‌కు బ్రేక్ పడింది. ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్తే... ‘బాహుబలి’ చిత్రీకరణలో ప్రభాస్ రెండుసార్లు గాయపడ్డారు. ‘లక్ష్మీ కల్యాణం’ సినిమా షూటింగ్లో కాలికి గాయం చేసుకున్నారు కల్యాణ్‌రామ్. ‘ఆచారి అమెరికా యాత్రలో’ కోసం మలేషియాలో యాక్షన్ సీన్ తీస్తున్నప్పుడు బైక్ కంట్రోల్ తప్పడంతో మంచు విష్ణు తీవ్రంగా గాయపడ్డారు. ఇంకా ఇతర హీరోలందరూ ఏదో ఒక షూటింగ్లో గాయాలపాలైనవారే. ఎన్టీఆర్ – ఏయన్నార్ – కృష్ణ ఎద్దుతో ఫైట్ చేయాలి. హీరో అంటే రిస్క్ అవుతుందేమో. డూప్‌తో చేయిద్దామంటే హీరో ఒప్పుకోవాలి కదా. నిజమైన ఎద్దుని తీసుకు రండి అన్నారు ఎన్టీఆర్. ఫైట్ మొదలైంది. ఎద్దు కొమ్ములతో ఫైట్. ఆ పోరాటంలో ఎన్టీఆర్ కుడి చెయ్యి విరిగింది. పుత్తూరు కట్టు కట్టారు. ఆ తర్వాత ‘లక్ష్మీ కటాక్షం’ షూటింగ్లో ఇదే చెయ్యికి దెబ్బ తగిలింది. ఎన్టీఆర్, జగ్గారావు మీద ఫైట్ సీన్ తీయడానికి రెడీ అవుతోంది యూనిట్. జగ్గారావు కత్తి ఫైట్ ప్రాక్టీస్ చేస్తున్నారు. అనుకోకుండా కత్తి ఎన్టీఆర్ కుడి చేతికి తగిలింది. ఇంకోసారి ‘సర్దార్ పాపారాయుడు’ షూటింగ్‌లోనూ ఇదే చేతికి ప్రమాదం జరిగింది. మోటార్ బైక్‌పై ఎన్టీఆర్ వెళ్లే సీన్ తీస్తుండగా కింద పడి పోయారు. విశ్రాంతి తీసుకోవాల్సినంత గాయమే అయినా అప్పటొకే ‘గజదొంగ’తో పాటు మరికొన్ని సినిమాలు ఒప్పుకుని ఉండటంతో మొండిగా షూటింగ్ చేశారు. కుటుంబ కథలతో పోల్చితే అక్కినేని నాగేశ్వరరావు యాక్షన్ సినిమాలు చేసింది తక్కువ. అందుకని పెద్దగా ప్రమాదాలు ఎదుర్కోలేదు. కానీ ‘అదృష్టవంతులు’ సినిమా కోసం ట్రైన్ మీద ఫైట్ తీస్తున్నప్పుడు ఆయనకు గాయమైంది. ఇక సూపర్ స్టార్ కృష్ణ విషయానికొస్తే.. ‘సిరిపురం మొనగాడు’ అప్పుడు ఆయనకు పెద్ద ప్రమాదం జరిగింది. ఊటీలో ఓ ఫైట్ సీన్లో భాగంగా కృష్ణ ఫిరంగి గొట్టంలోంచి చూస్తూ పేల్చాలి. పేల్చారు. అయితే అది రివర్స్‌లో పేలింది. కృష్ణ ఒక్కసారిగా వెనక్కి జరిగారు. లేకపోతే ముఖం ఛిద్రం అయ్యుండేది. అయితే గుండు వెళ్లి ఛాతీకి తగిలింది. అప్పటికప్పుడు ఆయన్ను చెన్పైలోని ఆస్పత్రికి తరలించి శస్త్ర చికిత్స చేశారు. దాదాపు నెల రోజులు కృష్ణ విశ్రాంతి తీసుకుకోవాల్సి వచ్చింది. ఆ తరంలో ఇతర హీరోలకు కూడా అడపా దడపా ఇలాంటి ప్రమాదాలు జరిగిన దాఖలాలు ఉన్నాయి. చిరంజీవి–బాలకృష్ణ–నాగార్జున–వెంకటేశ్ ‘బావగారు బాగున్నారా’లో బంగీ జంప్ చేయడం నుంచి అంతకుముందు, ఆ తర్వాతి సినిమాల కోసం చిరంజీవి రిస్కులు తీసుకున్న సంఘటనలు చాలానే ఉన్నాయి. ‘సంఘర్షణ’ సినిమా సమయంలో ఓ ఫైట్ సీన్ తీస్తున్నప్పుడు ఆయన నడుముకి దెబ్బ తగిలింది. డూప్ లేకుండా ఫైట్స్ చేయడానికే బాలకృష్ణ మొగ్గు చూపుతారు. ‘బాబాయ్ అబ్బాయ్’ సినిమాలో హీరోయిన్ అనితా రెడ్డి హీరో బాలకృష్ణను కారుతో ఢీ కొట్టే సీన్ ఆ సినిమా చూసినవారికి గుర్తుండి ఉంటుంది. అనితాకి కారు నడపడం తెలియదు. అప్పటికప్పుడు నేర్చుకుని నడిపింది. కానీ సీన్ తీసేటప్పుడు నిజంగానే బాలకృష్ణను ఢీ కొడితే అమాంతం ఎగిరి పడ్డారు. అలాగే ‘భార్యా భర్తల బంధం’ సినిమాలో గోడ మీద నుంచి దూకే సీన్లో స్లిప్ అవ్వడంతో కాలు ఫ్రాక్చర్ అయింది. ఆ తర్వాత ‘విజయేంద్ర వర్మ’ షూటింగ్ అప్పుడు కూడా కాలు ఫ్రాక్చర్ కావడంతో దాదాపు రెండు నెలలు ఆస్పత్రిలో ఉండాల్సి వచ్చింది. నాగార్జున, వెంకటేశ్‌లు కూడా అప్పుడప్పుడూ చిన్న చిన్న ప్రమాదాలకు గురయ్యారు. ఎక్కువగా యాక్షన్ సీన్స్ చేయడంతో నాగార్జున మోకాలి నొప్పి ఉండేది. అలాగే సినిమాలు కంటిన్యూ చేస్తూ తర్వాత ఎప్పుడో శస్త్ర చికిత్స చేయించుకున్నారు. వెంకటేశ్‌కి కూడా చిన్న చిన్న ప్రమాదాలు ఉన్నాయి. దెబ్బకు క్లైమాక్స్ మార్చేశారు 1983లో ‘కూలీ’ చిత్రంలో అమితాబ్ బచ్చన్ తీవ్ర ప్రమాదానికి గురయ్యారు. ప్రాణం పొయేంత. ఫైట్ చేస్తూ టేబుల్ మీద జంప్ చేయాలి అమితాబ్. జంప్ చేసేటప్పుడు జరిగిన రాంగ్ క్యాలిక్యులేషన్ వల్ల టేబులు అంచు అమితాబ్ పొట్టలో గుచ్చుకుంది. పేగులను చీల్చేసింది. కొన్ని సర్జరీలు తర్వాత మళ్లీ స్పృహలోకి వచ్చారాయన. ఆ సంఘటనను ఉద్దేశిస్తూ ‘మరో జన్మ’ అంటారు బిగ్ బి. విశేషం ఏంటంటే ముందు అనుకున్న స్క్రిప్ట్ ప్రకారం అమితాబ్ పాత్ర క్లైమాక్స్‌లో చనిపోతుంది. ఈ ప్రమాదం తర్వాత హీరో పాత్ర చనిపోతే బావుండదని చిత్రబృందం క్లైమాక్స్‌ను మార్చేసింది. సూపర్ కారు తెచ్చిన ప్రమాదం నూటొక్క జిల్లాల అందగాణ్ణి అనేది ఓ సినిమాలో నూతన్ ప్రసాద్ పంచ్ డైలాగ్. అదే కాదు ‘దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది’ అనేది కూడా పాపులర్. అయితే ‘బామ్మ మాట బంగారు బాట’ సినిమాలో చేసిన సూపర్ కార్ విన్యాసం ఆయన్ను వీల్ చైర్‌కి పరిమితం చేసింది. సూపర్ కార్ గాల్లో తేలే సన్నివేశంలో క్రేన్ కేబుల్ కట్ అవడంతో ఈ ప్రమాదం జరిగింది. నడుము కింద భాగం పక్షవాతానికి గురై వీల్‌చైర్‌లో స్థిరపడ్డారు. ఆ తర్వాత పలు సినిమాల్లో అతిథి పాత్రల్లో మెరిశారాయన. హీరోయిన్లు కూడా స్క్రిప్ట్ కోరితే సుకుమారాన్ని పక్కన పెట్టి స్టంట్స్‌ను ఓ పట్టు పట్టడానికి రెడీ అంటున్నారు హీరోయిన్లు. ఆ స్టంట్స్ చేస్తూ గాయాల పాలవుతున్నారు. లేడీ ఓరియంటెడ్ మూవీ ‘మణికర్ణిక’ షూటింగ్ సమయంలో చాలాసార్లు గాయపడ్డారు కంగనా రనౌత్. ఆమె ముఖానికి గాయం అయింది. గుర్రపు స్వారీ సన్ని వేశాల్లో కాలు ఫ్రాక్చర్ చేసుకున్నారు. ‘అదో అంద పరవై పోల’ అనే అడ్వెంచర్ డ్రామా చేస్తున్న అమలా పాల్ చిత్రీకరణ సమయంలో చేతి వేళ్లను విరగ్గొట్టుకున్నారు. ‘బ్రహ్మాస్త్రా’ సినిమా షూటింగ్ సమయంలో మోచేతిని ఫ్రాక్చర్ చేసుకున్నారు ఆలియా భట్. ‘భారత్’లో దిశా పాట్నీ సర్కస్ ట్రూప్‌లో పని చేసే పాత్రలో కనిపించారు. ఈ పాత్ర కోసం చాలా శిక్షణ తీసుకున్నారు. ఈ సీన్లు చిత్రీకరిస్తున్నప్పుడు మోకాలికి గాయం చేసుకొని కొన్ని రోజులు రెస్ట్‌లో ఉన్నారు. ‘హాఫ్ గాళ్‌ఫ్రెండ్’ షూటింగ్లో శ్రద్ధాకపూర్ కాలికి గాయం అయింది. ‘స్పైడర్’ షూటింగ్ సమయంలో రకుల్ వేలికి గాయం అయింది. ‘కబాలి’లో రజనీకాంత్ కుమార్తెగా నటించిన ధన్సికకు ఫైట్ సన్నివేశాల్లో బీర్ బాటిల్ గాజు ముక్క గుచ్చుకుంది. హన్సిక తాజా చిత్రం ‘మహా’. ఈ సినిమాలోని ఫైట్ సన్నివేశంలో సమ్మర్‌సాల్ట్ కొడుతూ స్లిప్ అయి కాలికి గాయం చేసుకున్నారు హన్సిక. ఏది ఏమైనా కట్టిన కట్టు విడిచి, పట్టిన పట్టు విడవకుండా మన హీరోలు మరింత స్ట్రాంగ్‌గా తిరిగి రావాలని, మరిన్ని స్టంట్స్‌తో మనల్ని ఎంటర్టైన్ చేయాలని కోరుకుందాం. అభిమానుల చప్పట్లు, విజిల్సే హీరో హీరోయిన్ల దెబ్బలు నయం చేసే సంజీవని. – గౌతమ్ మల్లాది -
నాగశౌర్య, సందీప్ కిషన్‌లకు గాయాలు
ఆరిలోవ (విశాఖ తూర్పు)/ కర్నూలు సీక్యాంప్: రెండు సినిమా చిత్రీకరణల్లో ఇద్దరు తెలుగు హీరోలు నాగశౌర్య, సందీప్ కిషన్ గాయాలపాలయ్యారు. విశాఖ, కర్నూలు జిల్లాల్లో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. విశాఖ జిల్లా ఆరిలోవలో షూటింగ్ చేయడానికి హీరో నాగశౌర్య, చిత్ర బృందం శుక్రవారం అక్కడికి చేరుకుంది. అదే రోజు అంబేడ్కర్‌నగర్‌లో రెండు అంతస్తులు ఉండే ఓ భవనం పైనుంచి హీరో నాగశౌర్య కిందకు దూకే సీన్ చిత్రీకరిస్తుండగా.. అదుపుతప్పి ఆయనకు కాలు బెణికింది. పెద్దగా వాపు వచ్చి నడవలేకపోవడంతో వెంటనే షూటింగ్ బృందం నాగశౌర్యను హెల్త్‌సిటీలో ఉన్న పినాకిల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ కాలుకు కట్టువేసిన వైద్యులు సుమారు 30 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అలాగే జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో వారం రోజులుగా కర్నూలు నగరంలో సందీప్ కిషన్ హీరోగా తెనాలి రామకృష్ణ చిత్రం షూటింగ్ జరుగుతోంది. శనివారం బాంబ్ బ్లాస్టింగ్ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా ఫైట్ మాస్టర్ చేసిన తప్పిదం వల్ల సందీప్ కిషన్ ఛాతీ, కుడిచేతిపై గాజుముక్కలు గుచ్చుకున్నాయి. వెంటనే అక్కడి సిబ్బంది సందీప్‌ను నగరంలోని మైక్యూర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. -
నాగశౌర్యకు మరో షాక్!
ఊహలు గుసగుసలాడే, ఛలో సినిమాల సక్సెస్ తో ఫాంలోకి వచ్చినట్టుగా కనిపించిన నాగశౌర్య తరువాత ఆ ఫాంను కంటిన్యూ చేయలేకపోయాడు. వరుస పరాజయాలతో మరోసారి ఇబ్బందుల్లో పడ్డాడు. ఛలో సక్సెస్ తరువాత వరుస అవకాశాలతో బిజీ అయినట్టుగా కనిపించినా ఇప్పుడు ఒక్కో సినిమా చేజారుతోంది. ఇప్పటికే సుకుమార్ నిర్మాణంలో తెరకెక్కాల్సిన సినిమా ఆగిపోయింది. తాజాగా భవ్య క్రియేషన్స్ బ్యానర్లో ఆనంద్ ప్రసాద్ దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా ప్రారంభమైన సినిమా కూడా ఆగిపోయిందన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న లేడి ఓరియంటెడ్ సినిమాగా సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఓ బేబిలో నటిస్తున్నాడు ఈ యంగ్ హీరో. -
సుకుమార్ మరో సినిమా కూడా ఆగిపోయిందా!
రంగస్థలం లాంటి ఘన విజయం తరువాత దర్శకుడు సుకుమార్ ఫుల్ బిజీ అవుతాడని అంతా ఊహించారు. సుకుమార్ కూడా అదే జోరులో సూపర్‌స్టార్ మహేష్‌తో సినిమా ఓకె చేయించుకొని ఫుల్ ఫాంలో కనిపించాడు. కానీ ప్రస్తుతం సీన్ పూర్తిగా మారిపోయినట్టుగా అనిపిస్తోంది. సుకుమార్‌తో సినిమా లేదని మహేష్ స్వయంగా ప్రకటించాడు. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో సినిమా ఉంటుందన్న ఎనౌన్స్మెంట్ వచ్చినా ఆ ప్రాజెక్ట్ ఇప్పట్లో పట్టాలెక్కేలా లేదు. దర్శకుడిగా ఇలా ఉంటే నిర్మాతగానూ సుకుమార్ కెరీర్ అంతా ఆశాజనకంగా కనిపించటం లేదు. ఇప్పటికే కుమారి 21ఎఫ్, దర్శకుడు లాంటి సినిమాలను నిర్మించిన సుక్కు తరువాత కూడా వరుససినిమాలకు ప్లాన్ చేశాడు. మెగా హీరో వైష్ణవ్ తేజ్‌ను పరిచయం చేసే బాధ్యత తీసుకున్నాడు. ఈ సినిమాతో పాటు నితిన్ హీరోగా ఓ సినిమా ప్లాన్ చేసినా వర్క్ అవుట్ కాలేదు. నాగశౌర్య హీరోగా కాశీ విశాల్‌ను దర్శకుడి పరిచయం చేస్తూ మరో సినిమాను ప్లాన్ చేశాడు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కూడా ఆగిపోయినట్టుగా ప్రచారం జరుగుతోంది. మరి బ్యాడ్ ఫేజ్ నుంచి సుకుమార్ ఎప్పుడు బయటికి వస్తాడో చూడాలి. -
మరో ఇంట్రస్టింగ్ టైటిల్‌తో అవసరాల
కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చి తరువాత దర్శకుడిగా మారిన యువ నటుడు అవసరాల శ్రీనివాస్. అష్టా చమ్మా సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన అవసరాల కొద్ది రోజుల్లోనే ఊహలు గుస గుసలాడే సినిమాతో దర్శకుడిగా మారాడు. రెండో ప్రయత్నంగా జ్యో అచ్చుతానంద సినిమా డైరెక్ట్ చేసిన అవసరాల శ్రీనివాస్ లాంగ్ గ్యాప్ తరువాత మూడో సినిమాకు రెడీ అవుతున్నాడు. నాగశౌర్య హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు కూడా తన మార్క్ ఇంట్రస్టింగ్ టైటిల్‌ను ఫిక్స్ చేశాడు. అచ్చమైన తెలుగు టైటిల్స్‌ను ఎంచుకున్న ఈ యువ దర్శకుడు తదుపరి చిత్రాన్ని పలానా అబ్బాయి.. పలానా అమ్మాయి అనే టైటిల్‌ను ఫిక్స్ చేశాడు. ఈ సినిమాలో నాగశౌర్యకు జోడిగా మాళవిక నాయర్ నటిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. -
సుకుమార్-నాగశౌర్య-నార్త్‌స్టార్ కాంబోలో మూవీ!
రంగస్థలంతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన దర్శకుడు సుకుమార్.. తన సొంత సంస్థలో చిన్న సినిమాలకు ప్రాణం పోస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్‌ను స్థాపించి తన వద్ద పనిచేస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్లను డైరెక్టర్లుగా మార్చేస్తున్నారు. తాజాగా ఈ సంస్థ నుంచి మరో ప్రాజెక్ట్ ఖరారైంది. ఛలో సినిమాతో సందడి చేసిన నాగశౌర్యకు మళ్లీ ఆ రేంజ్లో సక్సెస్ లభించలేదు. అయితే నాగశౌర్య హీరోగా.. తన దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసిన కాశీ విశాల్‌ను దర్శకుడిగా పరిచయం చేయబోతున్నారు మన లెక్కల మాష్టారు.ఈ చిత్రాన్ని నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ అధినేత శరత్ మరార్ నిర్మిస్తున్నారు. మిగతా వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. -
‘నర్తనశాల’ టీజర్ విడుదల
-
‘నర్తనశాల’ టీజర్ విడుదల
-
హీరోలు అవమానంగా భావిస్తున్నారు
టీ.నగర్: హీరోలతో తనకు ఎటువంటి విభేదాలు లేవని నటి సాయి పల్లవి అంటోంది. ‘ప్రేమం’ మళయాల చిత్రంలో తన అసమాన నటన ద్వారా అభిమానుల హృదయాలను కొల్లగొట్టారు సాయి పల్లవి. అభిమానుల ఆదరణకు తగిన విధంగా అనేక చిత్రాల అవకాశాలు క్యూ కడుతున్నాయి. అయినప్పటికీ అన్ని చిత్రాలను ఒప్పుకోవడం లేదు. మణిరత్నం దర్శకత్వంలో ‘కాట్రు వెలియిడై’ చిత్రాన్ని మొదట ఒప్పుకుని, తర్వాత గ్లామర్ పాత్రలో నటించనని చెప్పి విరమించుకున్నారు. అంతేకాకుండా కొంత మంది ప్రముఖ హీరోల చిత్రాల్లోను నటించేందుకు నిరాకరించారు. విజయ్ దర్శకత్వం వహించిన ‘దియా’ చిత్రం ద్వారా తమిళంలో పరిచయమయ్యారు. ఇందులో హీరోగా నటించిన నాగ శౌర్యతో సాయిపల్లవికి విభేదాలు ఏర్పడ్డాయి. దీని గురించి నాగ శౌర్య బహిరంగంగానే తన ఇంటర్వ్యూలో వెల్లడించారు. తనను సాయి పల్లవి అవమానించినట్లు చెప్పుకున్నారు. అలాగే ‘నాన్ ఈ’ చిత్రం హీరో నానితో తెలుగు చిత్రంలో నటిస్తుండగా ఇరువురి మధ్య గొడవ జరిగింది. ఎంగేయుం ఎప్పోదుం చిత్రం హీరో శర్వానంద్‌తో ప్రస్తుతం ఒక తెలుగు చిత్రంలో నటిస్తున్నారు సాయిపల్లవి. ఆయనతోను ఘర్షణ పడినట్లు సమాచారం వెల్లడైంది. చిత్రం షూటింగ్ సమయాల్లో సన్నివేశం ముగియగానే సాయిపల్లవి ఎవరితోనూ మాట్లాడకుండా తన కారవాన్లోనే గడపడం జరుగుతోంది. హీరోలు కుర్చీలలో కూర్చుంటున్నప్పటికీ వారితోపాటు కూర్చోకుండా నివారిస్తున్నారు. దీన్ని కొందరు హీరోలు అవమానంగా భావిస్తున్నారు. సాయిపల్లవి ఈ వైఖరి చర్చనీయాంశంగా మారింది. దీనిగురించి కొందరు విలేకరులు సాయి పల్లవి వద్ద ప్రశ్నించగా షూటింగ్ సమయంలో తన పనిని తాను వంద శాతం ప్రత్యేక శ్రద్ధతో చేసి ముగిస్తానని, ఎవరితోను తనకు విభేదాలు లేవని స్పష్టం చేసింది. -
‘‘నర్తనశాల’కు మచ్చరానివ్వం’
ఛలో సక్సెస్‌తో నిర్మాతగానూ విజయం అందుకున్న యంగ్ హీరో నాగశౌర్య త్వరలో నర్తనశాల సినిమాలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. నాగశౌర్య స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో యామిని, కశ్మీరా హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీనివాస్ చక్రవర్తి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను అభిమానుల సమక్షంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో నాగశౌర్య మాట్లాడుతూ ‘ఎన్టీఆర్ ‘నర్తనశాల’ ఒక క్లాసిక్. అయినా ఆ టైటిల్ ను తీసుకునే ధైర్యం చేశాం. ఆ పేరుకున్న స్థాయి తగ్గకుండా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాం. ఇక ముందు చేయబోయే సినిమాల్లోనూ మంచి ఎంటర్టైన్మెంట్ఉండేలా ప్లాన్ చేస్తాం’ అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు శ్రీనివాస్ చక్రవర్తి, నిర్మాత ఉషా ముల్పూరిలతో పాటు నటుడు శివాజీ రాజా, చిత్ర సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. -
‘అమ్మమ్మగారిల్లు’ ప్రి రిలీజ్ వేడుక
-
థ్రిల్లింగ్ పల్లవి
-
ఆ రోజు సినిమాలు మానేస్తా
‘‘కణం’ హారర్ సినిమా అనగానే ఫస్ట్ నో చెప్పా. విజయ్ గారు స్టోరీ పంపించారు. నేను చదవలేదు. అమ్మ చదివి, ఇలాంటి మంచి కథని ఎలా వదులుకుంటున్నావ్? అంది. అప్పుడు కథ పూర్తీగా చదివా. నచ్చడంతో ఓకే చెప్పా’’ అని సాయిపల్లవి అన్నారు. నాగశౌర్య, సాయిపల్లవి జంటగా ఎ.ఎల్. విజయ్ దర్శకత్వంలో ఎన్.వి.ఆర్. సినిమా సమర్పణలో లైకా ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన ‘కణం’ ఈనెల 27న విడుదలవుతోంది. ఈ సందర్భంగా సాయిపల్లవి పంచుకున్న చిత్ర విశేషాలు... ► ‘కణం’ కంటే ముందు కూడా హారర్ కథలు విన్నా. అయితే.. చేయలేనని వాళ్లతో డైరెక్ట్‌గా చెప్పలేదు. ఇంకో 2, 3 సినిమాల తర్వాత చేద్దామని చెప్పా. కానీ ‘కణం’ విషయంలో నో చెప్పినా తర్వాత ఎస్ చెప్పాను. లవర్‌గా, కూతురిగా యాక్ట్ చేయొచ్చు. కానీ, ఒక తల్లిగా నటించడం చాలా కష్టం. ప్రాక్టికల్‌గా నాకు అలాంటి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి, చేయగలనా? అనిపించేది. ► ఈ సినిమా చేసేటప్పుడు వెరోనికాతో నిజంగానే ఒక తల్లిలా కనెక్ట్ అయిపోయా. ప్రతి పేరెంట్ ఈ సినిమాకి కనెక్ట్ అవుతారనడంలో అనుమానం లేదు. ఇలాంటి సినిమాలు ఇంకా చాలా రావాలి. ఈ స్టేజ్ ఆఫ్ కెరీర్లో తల్లిగా నటించాననే ఫీలింగ్ లేదు. తల్లిగా ఎప్పుడైతే చేయగలిగానో చాలా హ్యాపీ. ఇలాంటి పాత్రలు చేయడానికి ఏజ్‌తో, ఇమేజ్‌తో సంబంధం లేదు. ఎలా నటించామన్నదే ముఖ్యం. ► ‘ప్రేమమ్’ చిత్రానికి ముందు నేను జార్జియాలో ఉన్నప్పుడు మొటిమలు పోగొట్టుకోవడానికి చాలా చేసేదాన్ని. కానీ, అవి పోలేదు. అందుకే ‘ప్రేమమ్’ టైమ్‌లో కొంచెం భయపడ్డా. అందరూ నన్ను నాలా యాక్సెప్ట్ చేశారు. దాంతో నాకే కాదు.. అందరమ్మాయిలకు మంచి మెసేజ్ రీచ్ అయింది. ► ‘ప్రేమమ్, ‘ఫిదా, కణం’ చిత్రాల్లో నావి వేటికవే ప్రత్యేక పాత్రలు. ప్రస్తుతం నా ఆలోచన సినిమాల గురించే. డాక్టర్‌గా నా కెరీర్ బిగిన్ చేయాలనుకున్న రోజు సినిమాలు మానేస్తా. నాగశౌర్య గొప్ప నటుడు. ఈ చిత్రంలో కొన్ని సీక్వెన్సెస్‌లో తను ఇచ్చిన హావభావాలు ఇంటికెళ్లాక ట్రై చేసేదాన్ని. -
'కణం' మూవీ స్టిల్స్
-
నాగశౌర్యతో సరదాగా కాసేపు
-
కాలేజీలో సందడి చేసిన హీరో నాగ శౌర్య
-
'ఛలో' స్టిల్స్
-
‘అసలేంటి భయ్యా ఈ ఊరి గొడవ’
ఒకప్పుడు వరుస సినిమాలతో అలరించిన యంగ్ హీరో నాగశౌర్య ఇటీవల కాస్త స్లో అయ్యారు. వరుసగా ఫెయిల్యూర్స్ పలకరిస్తుండటంతో సినిమాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ యువ కథానాయకుడు రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. తమిళ దర్శకుడు విజయ్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ‘కణం’ సినిమాతో పాటు తెలుగులో వెంకీ కుడుముల అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న ‘ఛలో’ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ‘ఛలో’ సినిమాను నాగశౌర్య అమ్మనాన్నలు ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఫిబ్రవరి 2న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా థియట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. తెలుగు, తమిళ రాష్ట్రాల మధ్య ఉన్న ఓ ఊరి గొడవ నేపథ్యంలో ఎంటర్టైనింగ్ సినిమాను రూపొందించారు. నాగశౌర్య సరసన రష్మిక మందన హీరోయిన్గా నటిస్తున్నారు. మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ సంగీతమందిస్తున్నారు. -
'ఛలో' మూవీ స్టిల్స్
-
కుర్ర హీరోలతో పూరి మల్టీ స్టారర్
జెట్ స్పీడుతో సినిమాలు చేసే దర్శకుడు పూరి జగన్నాథ్.. మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ హీరోగా ఇజం సినిమాను తెరకెక్కిస్తున్న పూరి, ఆ తరువాత మహేష్ బాబుతో జనగణమన సినిమా చేయాల్సి ఉంది. ఎన్టీఆర్ కూడా పూరి జగన్నాథ్‌తో మరో సినిమా చేయడానికి అంగీకరించాడు. ఇలా స్టార్ హీరోలతో సినిమాలు ఉన్నా.. ఈ గ్యాప్‌లో ఓ చిన్న సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు పూరి. ఒక్క అమ్మాయి కోసం పోటి పడే ఇద్దరు అబ్బాయిల కథగా ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామాను తెరకెక్కించనున్నాడు. యంగ్ జనరేషన్ మల్టీ స్టారర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగశౌర్యతో పాటు పెళ్లిచూపులు ఫేం విజయ్ దేవరకొండలను హీరోలుగా ఫైనల్ చేసే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతానికి చర్చల దశలోనే ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలోనే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రానుంది. -
ఈ సినిమా చూశాక కచ్చితంగా మార్పు వస్తుంది!
బుల్లితెర వ్యాఖ్యాతగా నటుడు నాగబాబు కూతురు నీహారిక ఇప్పటికే మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఆమె కథానాయికగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘ఒక మనసు’. రామరాజు దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా ‘మధుర’ శ్రీధర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా నీహారిక ప్రత్యేకంగా మాహిళాభిమానులు కలిశారు. ‘‘నా మొదటి సినిమాకే మంచి సబ్జెక్ట్ దొరకడం నా లక్. ఈ చిత్రం తర్వాత ఆడపిల్లల ప్రేమల్లో కచ్చితంగా మార్పు వస్తుంది. ఫ్యామిలీ అంతా కలిసి చూసే విధంగా ఉంటుంది. నేనే సినిమా చేసినా అభిమానులు ఇబ్బందిపడే విధంగా ఉండదు’’ అని చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
'కళ్యాణ వైభోగమే' ట్రాక్ ఎక్కిస్తుందా..?
ఇండస్ట్రీలో సక్సెస్ సాధించటమే కాదు ఆ సక్సెస్‌ను కొనసాగించటం కూడా చాలా ముఖ్యంగా. తొలి సినిమాతోనే సంచలనాలు నమోదు చేసిన చాలా మంది ఆ సక్సెస్‌ను కొనసాగించలేక వెనకపడిపోతున్నారు. తొలి సినిమాతో ఆకట్టుకున్న నందినీ రెడ్డి, నాగశౌర్యలు, ఆ తరువాత ఆశించిన స్ధాయిలో మెప్పించలేకపోయారు. అందుకే ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. అలా మొదలైంది సినిమాతో దర్శకురాలిగా పరిచయం అయిన నందినీ రెడ్డి, తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా తరువాత సిద్ధార్ద్ హీరో తెరకెక్కించిన జబర్థస్త్ సినిమాతో తీవ్రంగా నిరాశపరిచింది నందిని. దీంతో లాంగ్ గ్యాప్ తీసుకొని కళ్యాణ వైభోగమే సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తోంది. ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగశౌర్య, ఆ తరువాత ఆ సక్సెస్‌ను కొనసాగించలేకపోయాడు. మాస్ టర్న్ తీసుకొని చేసిన జాదుగాడు కూడా వర్క్ అవుట్ కాకపోవటంతో, తనకు హిట్ ఇచ్చిన రొమాంటిక్ జానర్నే మరోసారి నమ్ముకున్నాడు. నందినీ రెడ్డి, నాగశౌర్యలు కలిసి కళ్యాణ వైభోగమే సినిమా కోసం పనిచేశారు. ఇద్దరి కెరీర్‌కు ఈ సినిమా సక్సెస్ కీలకం కావటంతో ఇండస్ట్రీ వర్గాలు కూడా రిజల్ట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎవడే సుబ్రమణ్యం ఫేం మాళవిక నాయర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను ఈ నెల మూడో వారంలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. -
కళ్యాణం..కమనీయం...
ప్రేమ, పెళ్లి వంటి బంధాలపై ప్రస్తుతం యువతలో ఎటువంటి అభిప్రాయాలున్నాయనే నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘కళ్యాణ వైభోగమే’. శ్రీ రంజిత్ మూవీస్ పతాకంపై నందినీరెడ్డి దర్శకత్వంలో నాగశౌర్య, మాళవికా నాయర్ జంటగా కె.ఎల్. దామోదర్ ప్రసాద్ ఈ సినిమా నిర్మించారు. ఈ చిత్రవిశేషాలను నిర్మాత తెలియజేస్తూ - ‘‘ప్రేమ, పెళ్లి విలువలను చాటి చెప్పే కుటుంబ కథా చిత్రమిది. పాటలు బాగా కుదిరాయి. త్వరలో పాటలను, చిత్రాన్ని విడుదల చేస్తాం. ‘అలా మొదలైంది’ తర్వాత నందినీరెడ్డి మా సంస్థలో చేస్తున్న చిత్రం ఇది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: కళ్యాణ్ కోడూరి, కెమెరా: జీవీఎస్ రాజు, సహ నిర్మాతలు: వివేక్ కూచిభొట్ల, జగన్మోహన్ రెడ్డి. -
జాదూ...
లోన్ రికవరీలో అతను కింగ్. ఎలాంటి వాళ్లనైనా ముప్పుతిప్పలు పెట్టి బాకీ వసూలు చేయగల సమర్థుడు. అలాంటి జాదూగాడినే ఓ ఆటాడిస్తుందో అమ్మాయి. ఆ కథ ఏంటో తెలియాలంటే ‘జాదూగాడు’ చూడాల్సిందే. నాగశౌర్య, సోనారిక జంటగా ‘చింత కాయల రవి’ ఫేం యోగేశ్ దర్శకత్వంలో వి.వి.ఎస్ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘జాదూగాడు’. ఈ నెలలోనే ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. దర్శకుడు మాట్లాడుతూ - ‘‘నాగశౌర్య చేసిన గత చిత్రాలకు భిన్నంగా ఇది ఉంటుంది. మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఈ చిత్రాన్ని రూపొందించాం’’ అని చెప్పారు. సాగర్ మహతి స్వరాలందించిన పాటలకు ఇప్పటికే మంచి స్పందన లభిస్తోందని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: సాగర్ మహతి, కథ మాటలు: మధుసూదన్. -
'జాదూగాడు' ఆడియో లాంచ్
-
10న వస్తున్న 'దిక్కులు చూడకు రామయ్య'
నాగ శౌర్య, సనా ముక్బుల్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం దిక్కులు చూడకు రామయ్య. ఈ చిత్రం అక్టోబర్ 10న విడుదల కానుంది. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి శిష్యుడు త్రికోటి దర్శకత్వం వహించారు. మంచి కథతో రోమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కించి ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమంలో పలువురు ప్రముఖులు వెల్లడించిన సంగతి తెలిసిందే. కోర్రపాటి సాయి నిర్మాతగా వరాహి చలన చిత్రం బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. మరో విశేషం ఏమిటంటే ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి తండ్రి శివ శక్తి దత్తా ఈ చిత్రంలోని పాటలను రచించారు. ఈ చిత్రంలో అజయ్, ఇంద్రజా కూడా నటించారు.