Hero Naga Shaurya Pre Wedding Celebrations Photos Viral - Sakshi
Sakshi News home page

Naga Shaurya : నాగశౌర్య ఇంట పెళ్లి సందడి.. కాబోయే భార్యకు రింగ్‌తో ప్రపోజ్‌

Published Sun, Nov 20 2022 9:01 AM | Last Updated on Sun, Nov 20 2022 11:41 AM

Naga Shaurya Pre Wedding Celebrations Photos Viral - Sakshi

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నాగశౌర్య ఇంట్లో పెళ్లి వేడుకులు మొదలయ్యాయి. నేడు(ఆదివారం) కర్ణాటక కుందాపూర్‌కు చెందిన ప్రముఖ ఇంటీరియర్‌ డిజైనర్‌ అనూష శెట్టిని ఆయన పెళ్లి చేసుకోనున్నారు. బెంగళూరులో ఓ స్టార్‌ హోటల్‌లో వీరి వివాహ వేడుక జరగనుంది. ఈ క్రమంలో ప్రీ వెడ్డింగ్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇందులో వధూవరులిద్దరూ ట్రెడిషనల్‌ అవుట్‌ఫిట్‌లో మెరిసిపోయారు. హల్దీ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించిన నాగశౌర్య కుటుంబం అనంతరం కాక్‌టైల్‌ పార్టీను కూడా ఏర్పాటు చేశారు. ఈ పార్టీలో నాగశౌర్య తనకు కాబోయే భార్య అనూషకు రింగ్‌ తొడిగి తన ప్రేమను వ్యక్తపరిచారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

ముందుగా నిశ్చయించిన సమయం ప్రకారం.. నేడు  ఉదయం 11.25గంటలకు  హీరో శౌర్య  వధువు అనూష మెడలో బంధు, మిత్రుల సమక్షంలో  మూడు ముళ్లు వేయనున్నారు. ఈ వేడుకకు టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు కూడా హాజరు కానున్నట్లు తెలుస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement