anusha
-
డ్యూటీ... డ్యాన్సుల్లో ట్రాక్ రికార్డ్
విశిష్ట రైల్వే సేవా పురస్కారానికి ఎంపికైన ఉద్యోగిగా గుంటూరుకు చెందిన జవ్వాది వెంకట అనూష వార్తల్లో నిలిచింది. దిల్లీ ప్రగతి మైదాన్ లో జరిగిన 69వ రైల్వే సేవా పురస్కారాల కార్యక్రమంలో అతి విశిష్ట రైల్వే సేవా పురస్కారాన్ని అందుకున్న అనూష కూచిపూడి నృత్యకారిణి కూడా. మనసు ఉంటే మార్గం ఉన్నట్టే... ఒక్క పడవ అని ఏమిటి ఎన్ని పడవల మీద అయినా ప్రయాణం అద్భుతంగా సాధ్యం అవుతుంది!నేర్చుకోవడానికి వ్యక్తులకు మించిన పాఠశాలలు ఉంటాయా?అనూషకు నాన్న ఒక పాఠశాల. ఆయన రైల్వేలో ఇంజినీర్. వృత్తిపట్ల అంకితభావం తండ్రి నుంచే నేర్చుకుంది. తాను కూడా నాన్నలాగే రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంది. జవ్వాది వెంకట నాగ సుబ్రమణ్యంతో అనూషకు వివాహం జరిగింది. ఆయన అప్పుడు కేరళ ఐపీఎస్ అధికారిగా ఉన్నారు. 2008లో మళ్లీ సివిల్స్ రాసి ఐఎఎస్‌కు ఎంపిక అయ్యారు. ‘మరింత కష్టపడాలి’ అనే పాఠాన్ని భర్త నుంచి నేర్చుకున్న అనూష ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ ఇంజినీర్ (ఐఆర్ఎస్ఈ)గా ఎంపిక అయింది.ఇక కళలకు సంబంధించి అమ్మ తనకు పాఠశాల.తల్లి స్ఫూరితో కూచిపూడి నేర్చుకుంది. సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత వేదాంతం రామలింగశాస్త్రి శిష్యురాలైన అనూష యూరోపియన్ తెలుగు అసోసియేషన్, అమెరికన్ తెలుగు అసోసియేషన్ కార్యక్రమాలలో చిన్నప్పుడే ప్రదర్శనలు ఇచ్చింది. ఈ ఏడాది జూన్ లో మధ్యప్రదేశ్ ప్రభుత్వం, సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో భోపాల్‌లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరై కూచిపూడి నృత్య ప్రదర్శన ఇచ్చింది.నృత్యంలో ‘భేష్’ అనిపించుకున్న అనూష ఉద్యోగ జీవితంలో ‘ది బెస్ట్’ అనిపించుకుంది.‘గుంటూరు డివిజన్ కు 2022లో వచ్చాను. కృష్ణకెనాల్ జంక్షన్ నుంచి కృష్ణా నదివైపు ఉన్న ట్రాక్ వీక్‌గా ఉండేది. దీనికోసం ప్రతి ఏటా 50 లక్షలు ఖర్చు చేయాల్సి వచ్చేది. జియో టైల్స్, జియో బ్రిడ్జెస్ వేసి కొత్త తరహాలో ట్రాక్‌ను పటిష్టపరిచాము. దీనివల్ల ఇప్పుడు ఏడాదికి రెండు లక్షలు కూడా ఖర్చు అవ్వడం లేదు. పెద్ద పెద్ద యంత్రాలు వాడకుండా ఎన్నో పనులను వినూత్న రీతిలో పూర్తి చేశాము. దీనికి కూడా జీఎం నుంచి ప్రశంసలు అందుకున్నాను. ఈ ప్రయోగాలు గుంటూరు డివిజన్ కు బోలెడంత పేరు తీసుకొచ్చాయి. ఈ నేపథ్యంలోనే రైల్వేబోర్డు నన్ను గుర్తించింది. అతి విశిష్ట రైలు సేవా పురస్కారం దక్కింది. మన కష్టం వల్ల వచ్చిన ఫలితాన్ని చూసినప్పుడు వృత్తిపట్ల అంకితభావం మరింతగా పెరుగుతుంది’ అంటుంది అనూష. వృత్తి జీవితంలో, కూచిపూడి నృత్యకారిణిగా ఆమె మరిన్ని పురస్కారాలు అందుకోవాలని ఆశిద్దాం.ఎన్నో అడ్డంకులు... అయినా సరే ముందుకు వెళ్లాం!నా భర్త అస్సాం కేడర్ ఐఏఎస్ కావడంతో నాకు కూడా నార్త్ ఈస్ట్ రైల్వేలో పోస్టింగ్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్‌గా వచ్చింది. అక్కడ తీవ్రవాదంతో పాటు బ్రహ్మపుత్ర వరదల సమస్య ఎక్కువగా ఉన్న కారణంగా ఏడాదిలో ఎనిమిది నెలలు ΄్లానింగ్, నాలుగు నెలలు మాత్రమే ఎగ్జిక్యూషన్ ఉండేది. అక్కడ ఉన్న పరిస్థితుల్లో రైలు నడిచేలా చర్యలు తీసుకోవడంతోపాటు సిబ్బందిని కాపాడుకోవడం కూడా ఒక పెద్ద టాస్క్‌లా ఉండేది. ఎన్నో ఇబ్బందులను అధిగమిస్తూ ముందుకు సాగాము. రెండు వర్గాల మద్య పెద్ద ఎత్తున ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ సమయంలో రైల్వే కూడా రాష్ట్ర పరిధిలోకి వచ్చింది. మేం కూడా వారితో కలిసి ప్రశాంతత నెలకొల్పే విషయంలో గట్టిగా పనిచేశాం. గౌరీపూర్ నుంచి బిలాస్పూర్ వరకూ కొత్త రైల్వేలైన్ వేసిన సమయంలో బ్రహ్మపుత్రపై పెద్ద పెద్ద బ్రిడ్జీల నిర్మాణం విషయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాము. భూసేకరణ కూడా చాలా ఇబ్బందికరంగా మారింది. అన్నింటిని అధిగమించి రైల్వే లైన్ పూర్తి చేయడం పెద్ద అచీవ్మెంట్. దీనికి గుర్తింపుగా రైల్వే జీఎం అవార్డు వచ్చింది.– జవ్వాది వెంకట అనూష– దాళా రమేష్‌బాబు, సాక్షి ప్రతినిధి గుంటూరుఫోటోలు: షేక్ సుభానీ, లక్ష్మీపురం -
వాజేడు ఎస్సై ఆత్మహత్యకు అనూషే కారణం
వాజేడు: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ములుగు జిల్లా వాజేడు ఎస్సై హరీశ్ ఆత్మహత్య కేసు మిస్టరీ వీడింది. ఎస్సై ఆత్మహత్యకు కారణమైన యువతిని శనివారం అరెస్టు చేసినట్టు వెంకటాపురం(కె) సీఐ బండారి కుమార్ వెల్లడించారు. ఈ మేరకు కేసు వివరాలు, అరెస్ట్ చూపిన ఫొటోలను మీడియాకు ఒక ప్రకటన రూపంలో పంపారు. వాజేడు ఎస్సై రుద్రారపు హరీశ్(29) ఈ నెల 2వ తేదీ తెల్లవారుజామున తన సర్వీస్ పిస్టల్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అదేరోజు అతని తల్లిదండ్రులు రుద్రారపు రాములు, మల్లికాంబలు వాజేడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసును ఛేదించడానికి దర్యాప్తు ముమ్మరం చేశారు. పూర్తి ఆధారాలను పోలీసులు, క్లూస్‌టీమ్ సభ్యులు సేకరించారు. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం దుదియతండాకు చెందిన బానోత్ అనసూర్య (అనూష) కారణమని గుర్తించారు. ఈ మేరకు ఆమెను వెంకటాపురం(కె) సీఐ బండారి కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు అరెస్టు చేశారు. పెళ్లి చేసుకోవాలని..అనూష హైదరాబాద్‌లోని వీబీఐటీ కాలేజీలో అడ్మిన్ స్టాఫ్‌గా పనిచేస్తోంది. ఏడు నెలల క్రితం రాంగ్ నంబర్ కాలింగ్ ద్వారా వాజేడు ఎస్సై రుద్రారపు హరీశ్‌ను అనూష పరిచయం చేసుకుంది. ఎస్సై కావడంతో అతడిని పెళ్లి చేసుకుంటే జీవితం బాగుంటుందని భావించింది. తరచూ ఫోన్ చేసి సాన్నిహిత్యం పెంచుకోవడంతోపాటు పెళ్లికి ఒప్పించాలని నిర్ణయానికి వచ్చింది. ఆ దిశగా ప్రయత్నాలను ముమ్మరం చేసి తనను పెళ్లి చేసుకోకపోతే శారీరకంగా వాడుకున్నట్టు మీడియాతోపాటు పైఅధికారులకు ఫిర్యాదు చేస్తానని బ్లాక్ మెయిల్ చేయడంతోపాటు బెదిరించింది. ఇలా ఎస్సై హరీశ్‌పై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చింది. ఈ క్రమంలో ఈ నెల 1వ తేదీ రాత్రి వాజేడు మండలం పూసూరు గ్రామ సమీపంలోని గోదావరి బ్రిడ్జి వద్ద ఉన్న ఓ రిసార్ట్‌లో హరీశ్‌తోపాటు అనూష ఉన్నారు. తనను పెళ్లి చేసుకోవాలి లేదా చచ్చిపోవాలని ఒత్తిడి తెచ్చింది. దీంతో భావోద్వేగానికి లోనైన హరీశ్.. 2వ తేదీ తెల్లవారుజామున ఆమెను బయటకు పంపి తన సర్వీస్ రివాల్వర్‌తో గదువ కింది భాగంలో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పూర్తి ఆధారాలను సేకరించిన పోలీసులు అనూష ప్రమేయం ఉండడంతో ఆమెను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చనున్నట్టు వెల్లడించారు. -
పిడుగుపాటుకు ముగ్గురు బలి
దమ్మపేట/హుజూరాబాద్ రూరల్/లోకేశ్వరం: భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్ జిల్లాల్లో పిడుగుల కారణంగా ముగ్గురు మృత్యువాతపడ్డారు. భద్రాద్రిజిల్లా దమ్మపేట మండలం జగ్గారం పంచాయతీ పరిధి బూర్గుగుంపు గ్రామానికి చెందిన కట్టం నాగశ్రీ (21), సున్నం అనూష (23) మరికొందరితో కలిసి జగ్గారం శివారు అరటి తోటలో కూలి పనికి వెళ్లారు. మధ్యాహ్నం నుంచి కుండపోతగా వర్షం కురుస్తుండటంతో త్వరగా పనులు ముగించుకొని బయలుదేరిన క్రమంలో వారు నిల్చున్న చోటే పిడుగు పడింది.దీంతో నాగశ్రీ, అనూష ఒక్కసారిగా కుప్పకూలిపోయి అక్కడికక్కడే మృతి చెందారు. సీతమ్మ, ఊకే రత్తమ్మ, కల్లూరి రాజమ్మ తీవ్ర అస్వస్థతకు గురికాగా సత్తుపల్లి ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అనంతరం ఖమ్మం తరలించారు. మరోఘటనలో కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం పోతిరెడ్డిపేట గ్రామానికి చెందిన రైతు కంకణాల కృష్ణకుమార్ (33) పిడుగుపాటుతో మృతిచెందాడు. కృష్ణకుమార్ తన పాడి గేదెలను తీసుకొని గ్రామ శివారులోని మైదానంలో మేపుతుండగా ఒక్కసారిగా పిడుగుపాటుకు గురికావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. పిడుగుపాటుకు కాడెడ్లు మృతి నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం రాయాపూర్ కాండ్లీకి చెందిన రైతు ఆరె లింగురాం పటేల్‌కు చెందిన కాడెడ్లు, లేగదూడ సోమవారం రాత్రి పిడుగుపాటుతో మృతిచెందాయి. లింగురాం తనకున్న ఐదెకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న, సోయా పంటలు సాగుచేశాడు. సోమవారం ఉదయం కాడెడ్లను చేను వద్దకు తీసుకెళ్లాడు. పనులు పూర్తయ్యాక సాయంత్రం ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటిపక్కనే వాటిని కట్టేసి రాత్రి నిద్రపోయాడు. అర్ధరాత్రి పిడుగు పడటంతో కాడెడ్లతోపాటు లేగదూడ మరణించాయి. ఆర్ఐ బాలకిషన్ పంచనామా నిర్వహించారు. -
యుద్ధానికి శరీరాన్ని సిద్ధం చేస్తున్నట్టుగా.. ఈ వారియర్పోజ్!
యుద్ధానికి శరీరాన్ని సిద్ధం చేస్తున్నట్టుగా ఈ యోగా భంగిమలు ఉంటాయి. అందుకే, దీనిని వారియర్ పోజ్ అంటారు. ఈ యోగ భంగిమలో ఒక కాలి తుంటి భాగం ముందుకి ఉంటుంది. మరొక కాలు వెనక్కి చాపి, మునివేళ్ల మీద ఉంచాలి. చేతులను తలమీదుగా నిటారుగా ఉంచి, నమస్కారం చేసినట్టుగా కలపాలి. దృష్టి రూఫ్ వైపుగా ఉండాలి. కొద్దిగా వెనక్కి వంగడం వల్ల వెన్నెముక సాగుతుంది. భుజాలు, ఇరువైపులా శరీర కదలికలు ఈ భంగిమలో ఉంటాయి.అంతర్గత సామర్థ్యానికి ప్రతీకగా చెబుతుంటారు కాబట్టి దీనిని వీరభద్ర ఆసనం అని కూడా అంటారు. దీనిని రోజూ సాధన చేయడం వల్ల తుంటి, కాళ్లు, చీలమండలం, పాదాల ఎముకలకు బలం చేకూరుతుంది. కండరాలను టోనింగ్ చేస్తుంది. కాళ్లలో శక్తి సమకూరుతుంది. బలం, ఏకాగ్రత, ధైర్యం వంటి మానసిక స్థైర్యం ఈ ఆసన సాధన వల్ల కలుగుతాయి. శ్వాస తీసుకుంటూ, నెమ్మదిగా వదులుతూ ఐదు సార్లు ఈ ఆసనాన్ని సాధన చేయాలి. అన్ని వయసుల వారు చేయచ్చు. ఆర్థరైటిస్ మోకాళ్ల నొప్పులు ఉన్నవాళ్లు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.– జి.అనూష, యోగా నిపుణులు -
ఈ యోగా.. సీతాకోక చిలుక రెక్కల్లా మన కాలి కదలికలు..
టీనేజ్ అమ్మాయిల నుంచి నడి వయసు స్త్రీల వరకు.. ఒత్తిడిని తగ్గించి, మానసిక ప్రశాంతతను పెంపొందిస్తూ, అధికబరువును నియంత్రించేలా చేస్తుంది బద్ధకోణాసనం. ఈ యోగా భంగిమలో సీతాకోక చిలుక రెక్కల్లా మన కాలి కదలికలు ఉంటాయి. కాబట్టి బటర్‌ఫ్లై ఆసనంగా కూడా దీనికి పేరు. ఉదయం లేదా సాయంత్రం రోజూ పది నిమిషాలు ఈ బటర్‌ఫ్లై ఆసనాన్ని సాధన చేస్తే మెరుగైన ప్రయోజనాలను పొందుతారు.కంప్యూటర్‌తో పని చేసేవాళ్లు వెన్ను, మెడ, తలనొప్పి వంటి సమస్యలతో బాధపడుతుంటారు. ఇలాంటి వారు సులువైన, తేలికైన సీతాకోక చిలుక ఆసనం ద్వారా ప్రయోజనాలు పొందవచ్చు.20 నుంచి 30 సార్లు..ముందుగా నేల మీద సుఖాసనంలో కూర్చోవాలి. రెండు పాదాలను మధ్యలోకి తీసుకొచ్చి, చేతులతో కాళ్ల వేళ్లను పట్టుకోవాలి. ఈ భంగిమలో కళ్లు మూసుకొని, శ్వాసపై దృష్టి కేంద్రీకరిస్తూ ఐదుసార్లు దీర్ఘశ్వాస తీసుకుంటూ, వదలాలి. తర్వాత కళ్లు తెరిచి, కాళ్లను మెల్లగా పైకి, కిందకు 20 నుంచి 30 సార్లు కదుపుతూ ఉండాలి.రోజూ ఉదయం ఇలా చేస్తుంటే వెన్నెముక దృఢంగా అవుతుంది. లోయర్ హిప్స్, బ్యాక్ కండరాల బలం పెరుగుతుంది. ΄÷ట్ట కండరాలలోనూ మార్పులు వస్తాయి. ఒత్తిడి తగ్గి మైండ్, బాడీ విశ్రాంతి పొందుతాయి. కాళ్ల ఎముకల సామర్థ్యం పెరుగుతుంది. రక్తసరఫరా మెరుగై వెన్ను, మెడ, తలనొప్పి సమస్యలకు చక్కటి పరిష్కారం లభిస్తుంది.– జి. అనూషా రాకేష్, యోగా ట్రైనర్ -
దర్శన్‌కి ఆ సమస్య.. అందుకే అతడితో జాగ్రత్తగా మాట్లాడతారు!
కొన్నిరోజుల క్రితం కన్నడ హీరో దర్శన్ అరెస్ట్ కావడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తనని అభిమానించే ఓ వ్యక్తిని అత్యంత కిరాతకంగా చంపాడనే ఆరోపణలతో పోలీసులు అరెస్ట్ చేశారు. జైల్లో పెట్టి దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సంచలన నిజాలు బయటకొస్తున్నాయి. మరోవైపు దర్శన్‌తో కలిసి పనిచేసిన కొందరు లేడీ యాక్టర్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు. మొన్నీ మధ్యే హీరోయిన్ సంజనా గల్రానీ దర్శన్ ప్రవర్తన గురించి చెప్పగా, తాజాగా నటి అనూష రాయ్.. దర్శన్ ఇతరులతో ఎలా ఉంటాడో చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి'.. ఎవరెవరికీ ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారు?)'హత్య కేసులో దర్శన్ అరెస్ట్ కావడం ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఎందుకంటే ఆయన(దర్శన్) అందరినీ కేరింగ్‌గా చూసుకుంటాడు. కాకపోతే ఆయనకు అప్పుడప్పుడు కోప్పడటం లాంటి సమస్య ఉంది. దీంతో అందరూ చాలా జాగ్రత్తగా మాట్లాడతారు. నేను మాట్లాడినప్పుడు కూడా నా ఫరిది దాటకుండా మాట్లాడాను. తనకు ఈ సమస్య ఉందని దర్శన్ గతంలో ఓ ఇంటర్వ్యూలోనే చెప్పాడు. అయితే దర్శన్‌కి సంబంధం ఉందనే విషయం మాత్రం నాకు తెలియదు. దర్శన్‌పై కోపం ఉంటే ఏమైనా అనుకోండి గానీ ఆయన భార్య, కొడుకుని మాత్రం తిట్టడం కరెక్ట్ కాదు.' అని అనుష రాయ్ చెప్పుకొచ్చింది.కర్ణాటకలోని చిత్రదుర్గకి చెందిన రేణుకాస్వామి.. దర్శన్‌కి వీరాభిమాని. అయితే తన అభిమాన హీరో కుటుంబంలో కలహాలకు కారణం పవిత్ర గౌడనే అని భావించిన రేణుకాస్వామి.. ఆమెకు అసభ్య వీడియోలు పంపించాడు. ఈ విషయాన్ని పవిత్ర దర్శన్‌కి చెప్పగా.. ఇతడు దారుణంగా టార్చర్ పెట్టి మరీ చంపేశాడు. పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ప్రకారం రేణుకాస్వామి శరీరంపై 15కి గాయాలు, కరెంట్ షాక్ ఇచ్చినట్లు గుర్తులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ కేసులో దర్శన్, పవిత్రతో పాటు దాదాపు 11 మందికి పైగా జైల్లో ఉన్నారు.(ఇదీ చదవండి: కాబోయే భర్తకు కారు గిఫ్ట్ ఇచ్చిన బిగ్‌బాస్ శోభాశెట్టి.. రేటు ఎంతో తెలుసా?) -
అనుమానాస్పదంగా వివాహిత మృతి
గజపతినగరం రూరల్: మండలంలోని బంగారమ్మపేట గ్రామానికి చెందిన తాడితూరి అనూష (అలియాస్ తనూజ20) ఆదివారం రాత్రి మృతి చెందగా.. తమ కుమార్తె మృతిపట్ల అనుమానాలున్నాయంటూ మృతురాలి తండ్రి రమణ గజపతినగరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు బొబ్బిలి డీఎస్పీ పి.శ్రీనివాస్ సోమవారం తన బృందంతో గ్రామంలోని సంఘటనా స్ధలానికి చేరుకుని విచారణ చేపట్టారు. గ్రామంలో మృతురాలి బంధువులు, తోటి స్నేహితులను వాకబు చేశారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ నాలుగుమాసాల క్రితం ఇదే గ్రామానికి చెందిన సీఆర్పీఎఫ్ జవాన్‌తో అనూషకు వివాహమైంది. కాపురం ఆనందంగానే సాగుతోందని, అయితే ఆమె వివాహానికి ముందు ఇదే గ్రామానికి చెందిన బోనివెంకటదుర్గాప్రసాద్ అనూషను ప్రేమించాడని, వివాహమైన తరువాత కూడా చీటికీమాటికీ వేధింపులకు గురిచేసినట్లు తెలిసిందన్నారు. ఈ వేధింపులు ఇటీవల బాగా అధికమవడం, తనతో పాటు బయటకు వచ్చి కోరిక తీర్చాలని, లేకుంటే నీతో తీసుకున్న సెల్ఫీలు, ఆడియో, వీడియో కాల్స్ గ్రామంలోని అందరికి చూపిస్తానని పదేపదే బెదిరించడంతో ఏం చేయాలో తెలియక అనూష ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోందన్నారు. చనిపోయేముందు స్నేహితురాలికి, తన అన్నయ్యకు ఫోన్ చేసి అనూష ఈ సమాచారం పంపించిందని, ఈ సమాచారం ఆధారంగా ఈవిషయాలను తెలుసుకున్నామన్నారు.పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని విజయనగరం కేంద్రాస్పత్రికి తరలించి కేసు నమోదుచేసి దర్యాప్తు ముమ్మరం చేస్తామన్నారు. నివేదిక ఆధారంగా పూర్తిస్ధాయి వివరాలను తరువాత వెల్లడించనున్నామని తెలిపారు. ఈ పరిశీలనలో సీఐ ప్రభాకర్, ఎస్సై యు.మహేష్, తదితరులు పాల్గొన్నారు -
బ్రేకప్‌కు అదే కారణమన్న నటుడు.. అబద్ధమన్న నటి
కలిసున్నప్పుడు ఎక్కడలేని ప్రేమ చూపించుకుంటారు. విడిపోయాక ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోస్తారు. ఇక్కడ చెప్పుకునే జంట విషయంలో ఇదే నిజమైంది. బాలీవుడ్ జంట వీజే అనుష దండేకర్- జేసన్ షా విడిపోయి చాలా రోజులవుతోంది. జేసన్ షా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బ్రేకప్ గురించి మాట్లాడుతూ.. అవతలి వ్యక్తి తనను పూర్తిగా అర్థం చేసుకోలేదన్నాడు. వారికి నచ్చినట్లు ఉండేలా మలుచుకోవాలని చూశారని ఆరోపించాడు. అది అబద్ధంతాజాగా ఈ వ్యాఖ్యలపై అతడి మాజీ ప్రేయసి అనుష స్పందించింది. నా పేరును గూగుల్‌లో సెర్చ్ చేస్తే.. మొదట కనిపించే వార్త ఏంటంటే.. నేను ఎవరినో నాకు నచ్చినట్లు ఉండాలని ఆంక్షలు పెట్టానట! అది పూర్తిగా అబద్ధం. ఇప్పుడేమో బిగ్‌బాస్ ఓటీటీ మూడో సీజన్లో పార్టిసిపేట్ చేయబోతున్నట్లు మరో ప్రచారం జరుగుతోంది. నా ఆన్సరేంటో వారికి బాగా తెలుసుఇందులో కూడా ఏమాత్రం నిజం లేదు. అసలు ఆ షో నిర్వాహకుల నుంచి నాకు ఎటువంటి ఫోన్ కాల్ రాలేదు. ఎందుకంటే నా సమాధానమేంటో వారిక్కూడా స్పష్టంగా తెలుసు. నేను ఎప్పటికీ బిగ్‌బాస్ షోలో పాల్గొనను. ఏంటో, అందరూ నా పేరు వాడుకుంటున్నారు.. అందుకు పొంగిపోతున్నాను అని వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ఇకపోతే అనుష.. ఇటీవల రిలీజైన 'జూనా ఫర్నీచర్' సినిమాలో కనిపించగా జేసన్.. 'హీరామండి' వెబ్ సిరీస్‌లో విలన్‌గా మెప్పించాడు.చదవండి: రజనీకాంత్ ఇంట్లో శరత్‌కుమార్ కుటుంబం.. పెళ్లికి రమ్మని ఆహ్వానం -
ఎండకు గొడుగు పట్టారు..
మండుతున్న ఎండల్లో రోడ్డు మీద పుచ్చకాయ ముక్కలు కనిపిస్తే వెంటనే ఆగిపోతాం.ఓ కప్పు తాజా పుచ్చకాయ ముక్కలు తిని సేదదీరుతాం. ఇంటి నుంచి బయటకు వచ్చిన పని పూర్తి చేసుకుని తిరిగి ఇల్లు చేరేలోపు ఏర్పడే అవసరం అది. మరి అదే ఎండలో ఉదయం నుంచి సాయంత్రం వరకు భానుడి ప్రకోపాన్ని భరిస్తూ పుచ్చకాయ ముక్కలమ్ముకునే వ్యక్తి పరిస్థితి ఏంటి? 52.9 డిగ్రీలకు చేరిన ఎండలో ఎన్ని పుచ్చకాయలు తింటే అతడికి సాంత్వన దొరుకుతుంది. తనకు, తన తల మీద నాట్యమాడుతున్న సూర్యుడికి మధ్య ఏ అడ్డూ లేదు. వర్షాకాలంలో మొక్కజొన్న కండెలు కాలుస్తూ, ఎండాకాలంలో పండ్ల ముక్కలమ్ముకుంటూ... బతుకు బండి ఈడ్చడానికి ఏ ఎండకా గొడుగు పట్టే తనకు గొడుగుపట్టేదెవరు? ఎండనే గొడుగు చేసుకుని బతుకీడుస్తున్న ఇలాంటి వాళ్లకు గొడుగులు పంచుతున్నారు ఢిల్లీలోని నలుగురు యువతులు అనూష అత్రీ, భావని సింగ్, ఖుషీ సింగ్, వశిఖా మెహతా.‘సమాజంలో సహాయం అవసరమైన వాళ్లు అనేకమంది ఉన్నారని కరోనా సమయంలో తెలిసింది’ అంటూ తమ సేవా ప్రస్థానాన్ని వివరించారు. ‘సేవ’ అవసరం ఉంది! ‘‘మా సర్వీస్ కరోనా సమయంలో మాస్క్‌లు పంచడంతో మొదలైంది. కరోనా కరాళనృత్యం చేస్తున్న రోజుల్లో కూడా శ్రామికులు కొంతమంది మాస్కు కూడా లేకుండా పనులకు వెళ్లడం మమ్మల్ని ఆందోళన పరిచింది. తమ ఆరోగ్యభద్రత కోసం కనీసంగా కూడా జాగ్రత్తలు తీసుకోలేకపోతున్నారు. వాళ్ల అలసత్వం, నిర్లక్ష్యానికి కారణం చైతన్యం లేకపోవడంతోపాటు జాగ్రత్తలు తీసుకోవడానికి తగిన వెసులుబాటు లేకపోవడం. కనీసం మాస్కు అయినా ఇవ్వగలిగితే మంచిది కదా అనుకున్నాం. మా పేరెంట్స్ మాకు ఖర్చుల కోసం ఇచ్చిన డబ్బులో కొంత తీసి మాస్కులు కొని పంచాం. ఒకసారి మురికి వాడల్లోకి అడుగుపెట్టిన తర్వాత ఆశ్చర్యం కలిగించే ఎన్నో విషయాలు తెలిశాయి. వాళ్లు ఆరోగ్యం పట్ల కనీస జాగ్రత్తలు కూడా పాటించడం లేదని తెలిసి హెల్త్ క్యాంపులు పెట్టి ఉచితంగా మందులిచ్చాం. సమాజానికి చేయాల్సిన సేవ చాలా ఉందని తెలిసి ‘వారియర్స్ వితవుట్ ఏ కాజ్’ పేరుతో ఎన్జీవో ్రపారంభించాం. చదువు అవసరాన్ని తెలియచేయాల్సిన పరిస్థితి ఇంకా దేశంలో నెలకొని ఉందంటే నమ్ముతారా? చదువు జీవితాన్ని మెరుగుపరుస్తుందని వివరించినప్పటికీ వారిలో ఏదో నిర్లిప్తత. హెల్త్ అవేర్నెస్, ఎడ్యుకేషన్ అవేర్‌నెస్‌తోపాటు రుతుక్రమ పరిశుభ్రత కూడా నేర్పించాల్సిన అవసరం ఉంది. వీటితోపాటు ఫైనాన్షియల్ లిటరసీ కోసం వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నాం. మేము సర్వీస్ అందిస్తున్న వాళ్లలో చాలామందికి తమకు చేతనైన పని చేసి ఓ వంద రూపాయలు సంపాదించుకోవడం తెలుసు. కానీ పని దొరకని రోజు కూడా భోజనం చేయాలంటే ఈ రోజు సంపాదించిన వందలో ఓ పది రూపాయలు దాచుకోవాలని తెలియదు. పని దొరక్కపోతే పస్తులుండడమే ఇంతవరకు వాళ్లకు తెలిసిన జీవితం. అలాంటి కుటుంబాలలో మహిళలను సమీకరించి వాళ్లు చేసే పనులతోనే డబ్బు సంపాదించుకునే వెసులుబాటు కల్పించాం. ఉత్తరాది రాష్ట్రాల్లో ఆడవాళ్లందరికీ ఊలుతో స్వెట్టర్లు, టోపీలు అల్లడం వచ్చి ఉంటుంది. వాళ్లను సంఘటిత పరిచి క్రోషియో నిట్టింగ్ బ్యాగ్‌లు, ఊలు ఉత్పత్తుల తయారీని ్రపోత్సహించాం. ఆ మహిళలను స్థానికంగా ఎగ్జిబిషన్లు నిర్వహించే సంస్థలతో అనుసంధానం చేయగలిగాం. ఈ ఏడాది ‘బీట్ ద హీట్’ క్యాంపెయిన్ చేపట్టాం. ఇందులో భాగంగా రోడ్డు పక్కన బండి పెట్టుకుని పుచ్చకాయ ముక్కలమ్మేవాళ్లు ఇతర చిన్న చిన్న వస్తువులమ్ముకునే వాళ్లకు మొత్తం ఐదువేల మందికి గొడుగులిచ్చాం. పండ్లు, సోడాలమ్ముకునే వాళ్ల కంటే స్టవ్ పెట్టి వండే వాళ్ల పరిస్థితి ఇంకా ఘోరం. ఎర్రటి ఎండలో బండి మీద స్టవ్ పెట్టుకుని బ్రెడ్ ఆమ్లెట్, బజ్జీలు వేసే వాళ్ల తల కూడా పెనంతో సమానంగా వేడెక్కి పోతుంటుంది. అలాంటి ఎందరో మేమిచ్చిన గొడుగును వాళ్ల బండికి కట్టుకుని రోజంతా హాయిగా పని చేసుకుంటున్నారు. మా సర్వీస్‌ని ఢిల్లీ, నోయిడాల నుంచి దేశంలోని బెంగళూరు, చండీగర్, ముంబయి, హైదరాబాద్‌లకు విస్తరించాం. ఇంకా అన్ని రాష్ట్రాల్లో మా నెట్‌వర్క్‌ను విస్తరిస్తాం’’ అని చెప్పారు. -
బయట కాపుకాసి.. కాళ్లు, చేతులు కట్టేసి..
సంచలనం సృష్టించిన పిల్లల విక్రయం కేసు వెనుక ముగ్గురు ధీర వనితల పోరాటం దాగి ఉంది. అక్షర జ్యోతి ఫౌండేషన్‌ను నిర్వహించే అక్కాచెల్లెళ్లు ధైర్య సాహసాలతో ఈ మానవ అక్రమ రవాణా బాగోతాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. పీర్జాదిగూడలో ఆర్ఎంపీ శోభారాణితో పాటు స్వప్న, షేక్ సలీంలను పట్టుకున్నారు. ఈ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించిన తీరును అక్కాచెల్లెళ్లు అనూష, శ్రీవైష్ణవి, ప్రత్యూషలు ‘సాక్షి’తో పంచుకున్నారు. మహిళ ఇచ్చిన సమాచారంతో.. అక్షర జ్యోతి ఫౌండేషన్ తరఫున కార్యక్రమాలు నిర్వహిస్తున్న క్రమంలో ఓ మహిళ అనూషను సంప్రదించింది. తనకు పిల్లల్లేరని, శోభారాణి పిల్లలను విక్రయిస్తున్నట్టుగా తెలిసిందని, ఈ విషయంలో తనకు సహాయం చేయాలంటూ శోభారాణి ఫోన్ నంబర్ ఇచ్చింది. షాక్‌కు గురైన అక్కాచెల్లెళ్లు శోభారాణి కార్యకలాపాలపై స్టింగ్ ఆపరేషన్ చేయాలని నిర్ణయించుకున్నారు. వీరికి యూట్యూబ్ చానల్ విలేకరి సాయికుమార్ సహకరించారు. సీక్రెట్ కెమెరాలతో క్లినిక్‌లోకి..: ఈనెల 21న శ్రీవైష్ణవి పిల్లల్లేని తల్లిగా నటిస్తూ తనకో బిడ్డ కావాలని శోభారాణిని కలిసింది. దీంతో ఆమె వాట్సాప్‌లో అబ్బాయి, అమ్మాయి ఫొటోలను పంపించింది. బాబును కొనేందుకంటూ రూ.4.50 లక్షలకు డీల్ కుదుర్చుకున్నారు. అడ్వాన్స్‌గా కొంత మొత్తాన్ని చెల్లించారు. ఆ మరుసటి రోజు ఉదయమే పీర్జాదిగూడలోని క్లినిక్‌కు వచ్చి బాబును తీసుకెళ్లాలని శోభ సూచించింది.దీంతో ముగ్గురు అక్కాచెల్లెళ్లు, సాయికుమార్‌తో శివ, శ్రీనివాస్ అనేవారు బృందంగా ఏర్పడి, సీక్రెట్ కెమెరాలను ధరించి క్లినిక్ లోపలికి వెళ్లారు. ఒకవేళ నిందితులు అనుమానంతో తమపై దాడి చేసినా, పారిపోయేందుకు ప్రయత్నించినా పట్టుకునేందుకు వీలుగా క్లినిక్‌కు వెళ్లే రెండు మార్గాలలో మరో 10 మందిని కూడా ఏర్పాటు చేసుకున్నారు. క్లినిక్ లోపల నిందితులు శోభారాణి, స్వప్నలతో జరిగే సంభాషణలు, వారి కదలికలను ఎప్పటికప్పుడు బయట ఉన్న బృందానికి వాట్సాప్ మెసేజ్‌లలో చేరవేస్తూ ఏమాత్రం తేడా వచి్చనా వారు సహాయపడేలా రంగం సిద్ధం చేసుకున్నారు. ఆల్టో కారులో బాబును తెచ్చి.. వారు క్లినిక్‌లోకి వెళ్లిన అరగంటలో మరో నిందితుడు షేక్ సలీం తెలుపు రంగు ఆల్టో కారులో బాబును తీసుకొచ్చాడు. క్లినిక్ ఫస్ట్ ఫ్లోర్లో ఉండే భవనం యజమాని ఇంట్లోకి వెళ్లాడు. కాసేపటి తర్వాత శోభరాణి వెళ్లి బాబును తీసుకుని క్లినిక్ లోపలికి వచ్చింది. రెండు నకిలీ ఆధార్ కార్డులను ఇస్తూ వీళ్లే బాబు తల్లిదండ్రులు అని చెప్పింది. ఇంకో రూ.20 వేలు అదనంగా ఇస్తే బాబు బర్త్ సరి్టఫికెట్ కూడా ఇస్తానని, దీంతో మీరే సొంత తల్లి అయిపోతారని శ్రీవైష్ణవికి శోభ సూచించింది. ఒప్పందం మేరకు మిగతా డబ్బును అందించాలని కోరింది. దీంతో బయటికెళ్లి తీసుకొస్తానని శ్రీవైష్ణవి తలుపులు తెరవడంతో అప్పటికే బయట ఉన్న వారిని చూసిన శోభ, ఇతర నిందితులు ఇదంతా ట్రాప్ అని గ్రహించారు. చున్నీతో కాళ్లు, చేతులు కట్టేసి.. శోభారాణి, స్వప్న, సలీంలు క్లినిక్ నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. కానీ బయట ఉన్న బృందం కాపు కాస్తుండటంతో వారికి చాన్స్ లేకుండా పోయింది. సలీం గోడ దూకి పారిపోయేందుకు ప్రయత్నించగా.. ప్రత్యూష బలంగా అతన్ని పట్టుకొని, చున్నీతో అతని కాళ్లు, చేతులు కట్టేసింది. అతన్ని పక్కన ఉన్న పిల్లర్‌కు కట్టిపడేసింది. ఇదంతా స్టింగ్ ఆపరేషన్ తెలిసిపోవడంతో శోభారాణి ఏడుపు మొదలుపెట్టింది.పోలీసులకు ఫోన్ చేయవద్దని సెటిల్మెంట్ చేసుకుందామంటూ ఆఫర్ ఇచ్చింది. ఈలోగా డయల్ 100కు ఫోన్ చేయడంతో మేడిపల్లి పోలీసులు వచ్చారు. నిందితులను ఠాణాకు తరలించి, బాబును చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అధికారులకు అప్పగించారు. నిందితులను పోలీసులు విచారించగా.. ఢిల్లీకి చెందిన కిరణ్, ప్రీతి, పుణేకు చెందిన కన్నయ్యల నుంచి పసికందులను కొనుగోలు చేసి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విక్రయిస్తున్న అంశం వెలుగులోకి వచ్చింది. లింగ నిర్ధారణ, గర్భస్రావాలు కూడా.. శోభారాణి 20 ఏళ్లుగా పీర్జాదిగూడలో ఫస్ట్ ఎయిర్ సెంటర్ పేరుతో క్లినిక్‌ను నిర్వహిస్తోంది. ఇందులో ముందు గదిలో క్లినిక్ ఉండగా.. వెనుక గది అంతా చీకటిగా ఉంది. ఇందులో శస్త్ర చికిత్సల కత్తెర్లు, క్లాంప్స్, బోన్ కట్టర్స్, సూదులు వంటి సర్జికల్ పరికరాలున్నాయి. డస్ట్ బిన్లో కనిపించకుండా దాచిపెట్టారు. శోభారాణి అక్రమంగా గర్భస్రావాలు, లింగ నిర్ధారణ పరీక్షలు కూడా నిర్వహిస్తున్నట్లు అక్షర ఫౌండేషన్ విచారణలో తేలింది. (ఆడెపు శ్రీనాథ్) -
మహిళా పోలీస్‌కే రక్షణ లేదు..
దర్శి: విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేసిన టీడీపీ నాయకులకు వత్తాసు పలకడమే కాకుండా, కేసు నమోదు చేయడంలో పోలీసులు తాత్సారం చేసిన ఉదంతమిది. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలోని ముండ్లమూరు మండలం ఉమామహేశ్వరపురం బూత్ నం.213లో మే 13న మహిళా పోలీస్ కట్టా అనూష బీఎల్వోగా విధులు నిర్వర్తిస్తున్నారు. పోలింగ్ బూత్‌లో టీడీపీ కార్యకర్తలు దొంగ ఓట్లు వేశారనే విషయమై వివాదం చెలరేగింది.ఓటు వేసి ఇంటికి వెళ్లకుండా అక్కడే కూర్చున్న టీడీపీ నాయకులను ఓ కానిస్టేబుల్ వెళ్లిపోవాలని సూచించినా లెక్క చేయలేదు. అదే సమయంలో బీఎల్వో కల్పించుకుని మీరంతా ఇక్కడే ఉంటే ఇబ్బంది కలుగుతుందని చెబుతుండగా టీడీపీ నాయకుడు జిల్లెళ్లమూడి రామకృష్ణ, మరో 12 మంది ఒక్కసారిగా రెచ్చిపోయారు. అనూషను అసభ్యకరంగా తిడుతూ జుట్టు పట్టుకుని లాగారు. గొంతు పట్టుకుని కింద పడేసి కొట్టారు. కులం పేరుతో తిడుతూ కాలితో తన్నబోతుండగా అక్కడే ఉన్న కానిస్టేబుల్, బస్ డ్రైవర్ వచ్చి పక్కకు నెట్టినా ఆవేశంతో ఊగిపోయారు. పట్టించుకున్నవారు లేరు.. తనపై టీడీపీ నేతలు దాడి చేసిన విషయాన్ని మహిళా పోలీస్ అనూష మే 13వ తేదీ సాయంత్రం 5 గంటల సమయంలో రిటర్నింగ్ ఆఫీసర్‌కు ఫోన్ చేసి చెప్పగా, దర్శి సీఐ షమీఉల్లాను కలవాలని సూచించారు. ఆ రోజు సీఐ, ఎస్ఐకి విషయం చెప్పినా పట్టించుకోలేదు. 14న ఎస్ఐ సెలవులో ఉన్నారని చెప్పి ఫిర్యాదు తీసుకున్నారు. కానీ ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. 16న కేసు ఎందుకు కట్టలేదని ఏఎస్ఐని ప్రశ్నించగా ఉన్నతాధికారులను అడగాలని సమాధానమిచ్చారు.కేసు నమోదు చేయాలని అనూష నిలదీయడంతో నిందితులుగా ఉన్న కోటేశ్వరరావు, మరి కొందరిని స్టేషన్‌కు పిలిపించారు. వారు ఏఎస్ఐ ఎదుటే మహిళా పోలీస్‌ను బెదిరించారు. కాగా, మే 17న దర్శి సీఐని కలిశానని, అయితే టీడీపీ నేతలను పిలిపించి రాజీ చేసుకోవాలని ఆయన సలహా ఇచ్చారని, అందుకు తాను అంగీకరించలేదని అనూష చెబుతోంది. అదే రోజు మధ్యాహ్నం ఆమె ఒంగోలులో ఎస్పీని కలిసేందుకు ప్రయత్నించగా.. ఎస్పీ ఉన్నప్పటికీ లేరని చెప్పి వెనక్కు పంపారు. 17న కలెక్టర్ దినేష్‌కుమార్ ఎదుట అనూష తన గోడు వెళ్లబోసుకున్నారు.వెంటనే కేసు నమోదు చేయాలని ఎస్పీ కార్యాలయానికి కలెక్టర్ ఆదేశాలిచ్చారు. దీంతో ముండ్లమూరు ఏఎస్ఐ వెంకటేశ్వర్లు 13 మంది టీడీపీ నాయకులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అదేరోజు బాధితురాలు అనూషపైనా టీడీపీ నేతల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేయడం గమనార్హం. అట్రాసిటీ కేసుపై దర్శి డీఎస్పీ విచారణ చేపట్టినా ఇప్పటి వరకు ఏమీ చర్యలు తీసుకోలేదు. -
ఆమెతో బ్రేకప్‌కు కారణం అదే.. హీరామండి నటుడు!
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ తెరకెక్కించిన హిస్టారికల్ వెబ్ సిరీస్ హీరామండి: ది డైమండ్ బజార్. ఈ నెల 1న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన ఈ వెబ్ సిరీస్‌కు ఆడియన్స్ నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. పాక్‌లోని లాహోర్‌లో స్వాతంత్య్రానికి ముందు జరిగిన చారిత్రాత్మక కథనంతో ఈ సిరీస్‌ను తీసుకొచ్చారు. హీరామండి ప్రాంతంలో ఉండే వేశ్యల ఇతివృత్తమే ప్రధానంగా చూపించారు.అయితే ఈ సిరీస్‌లో బ్రిటీష్ పోలీస్ అధికారి పాత్రలో మెప్పించిన నటుడు జాసన్ షా. ఈ వెబ్ సిరీస్‌లో కార్ట్‌రైట్ పాత్రలో మెప్పించారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాసన్ షా.. నటి అనూషా దండేకర్‌తో బ్రేకప్ గురించి మాట్లాడారు. ఆమెతో విడిపోవడానికి గల కారణాలను జాసన్ షా పంచుకున్నారు. అనూషతో విడిపోవడం పెద్ద ఆధ్యాత్మిక మార్పునకు దారితీసిందని జాసన్ చెప్పుకొచ్చారు. ఆమె తనను సరిగా అర్థం చేసుకోలేదని అన్నారు. నన్ను తన నియంత్రణలో పెట్టుకునేందుకు ప్రయత్నించిందని వెల్లడించారు. అది జరగని పని కావడంతో విడిపోవాల్సి వచ్చిందన్నారు. ముఖ్యంగా ఈ రోజుల్లో ఒకరి మాట మరొకరు వినకపోవడమే బ్రేకప్‌కు కారణమని జాసన్ షా తెలిపారు. అవతలి వ్యక్తి చెప్పేది.. మీరు వింటే మీ రిలేషన్ ఎక్కువ కాలం ఉంటుందని సూచించారు. తనను తప్పుగా అర్థం చేసుకోవడంతోనే తమ బంధం విచ్ఛిన్నానికి కారణమని తెలిపారు. కాగా.. హీరామండి కంటే ముందు జాన్సీకి రాణి, బిగ్ బాస్ వంటి టీవీ షోలలో జాసన్ కనిపించాడు. అతను 2021లో అనూషా దండేకర్‌తో విడిపోయారు. -
స్వర్ణ పతకాలు నెగ్గిన ఆంధ్రప్రదేశ్ అథ్లెట్లు అనూష, రష్మీ
ఫెడరేషన్ కప్ జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తొలి రోజు ఆంధ్రప్రదేశ్‌కు రెండు స్వర్ణ పతకాలు లభించాయి. భువనేశ్వర్‌లో ఆదివారం మొదలైన ఈ టోర్నీలో మహిళల ట్రిపుల్ జంప్‌లో మల్లాల అనూష... మహిళల జావెలిన్ త్రోలో కె.రష్మీ పసిడి పతకాలను సొంతం చేసుకున్నారు. అనూష 13.53 మీటర్ల దూరం గెంతి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. షీనా (కేరళ; 13.32 మీటర్లు) రజతం... గాయత్రి శివకుమార్ (కేరళ; 13.08 మీటర్లు) కాంస్యం గెల్చుకున్నారు. ఇక జావెలిన్ త్రో ఫైనల్లో రష్మీ జావెలిన్‌ను 54.75 మీటర్ల దూరం విసిరి విజేతగా నిలిచింది. నాలుగు రోజులపాటు జరిగే ఈ టోర్నీలో ఒలింపిక్ చాంపియన్, ప్రపంచ చాంపియన్ అయిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ప్రధాన ఆకర్షణ కానున్నాడు. మూడేళ్ల తర్వాత స్వదేశంలో పోటీపడుతున్న నీరజ్ మంగళవారం జావెలిన్ త్రో క్వాలిఫయింగ్ రౌండ్లో, బుధవారం జరిగే ఫైనల్లో బరిలోకి దిగుతాడు. -
కీచకుడికే జేసీ ప్రభాకర్ అండ!
సాక్షి, అనంతపురం: తాడిపత్రి టీడీపీ నేత, కౌన్సిలర్ మల్లికార్జున కీచక పర్వం నియోజకవర్గంలో కలకలం రేపింది. ప్రేమ పేరుతో తనను శారీరకంగా వాడుకున్నాడని.. తనకు న్యాయం చేయాలంటూ అనూష అనే యువతి పోరాటానికి దిగింది. ఈ క్రమంలో ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. మల్లికార్జున్ వ్యవహారంపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డికి ఫిర్యాదు చేసేందుకు బాధితురాలు ప్రయత్నించింది. మున్సిపల్ కార్యాలయం వద్దకు చేరుకున్న ఆమెను సిబ్బంది అడ్డుకున్నారు. అయితే ఆమె అప్పాయింట్మెంట్ కోసం యత్నించగా.. జేసీ అందుకు నిరాకరించారు. ఆమెను లోనికి రానియొద్దంటూ సిబ్బందికి సూచించారు. దీంతో గేటు వద్దే ఆమె చాలాసేపు ఉండిపోయింది. బాధితురాలికి న్యాయం చేయాల్సిందిపోయి.. కీచకుడికే అండగా నిలబడడం ఏంటని? జేసీ తీరుపై మండిపడుతున్నారు పలువురు. టీడీపీ కౌన్సిలర్ మల్లికార్జున తనను శారీరకంగా వాడుకున్నాడని, రెండు సార్లు అబార్షన్ చేయించాడని, పెళ్లి చేసుకోమంటే నిరాకరిస్తున్నాడని, తనను చంపుతానని టీడీపీ నేత మల్లికార్జున బెదిరిస్తున్నాడని బాధితురాలు అనూష వాపోతోంది. ఈ క్రమంలో ఎస్పీని కలిసి ‘స్పందన’లో తన గోడును సైతం వెల్లబోసుకుందామె. సంబంధిత వార్త: మల్లికార్జున కీచక పర్వమిది! -
పెళ్లింట విషాదం
భూత్పూర్: పెళ్లి జరిగి వారం రోజులు గడవక ముందే, పసుపు పారాణి ఆరకముందే ఆ ఇంట చావు డప్పు మోగింది. వివాహ రిసెప్షన్ అనంతరం వధువు ఇంటికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో నవ వరుడుతో సహా ముగ్గురు చనిపోగా, షాక్‌కు గురైన వధువు అపస్మారక స్థితిలోకి వెళ్లింది. మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం అన్నాసాగర్ వద్ద హైవేపై చోటుచేసుకున్న ఈ ప్రమాద ఘటనకు సంబంధించి పోలీసుల కథనమిలా... ఏపీలోని అనంతపురం జిల్లా కేంద్రానికి చెందిన నంబూరి వెంకటరమణ, వాణి దంపతులకు అనూష ఒక్కగానొక్క కూతురు. ఈమెకు ఈ నెల 15న హైదరాబాద్‌కు చెందిన పవన్సాయితో అనంతపురంలో వివాహం కాగా హైదరాబాద్‌లోని పవన్‌సాయి ఇంట్లో రెండురోజుల కిందట రిసెప్షన్ నిర్వహించారు. బుధవారం హైదరాబాద్ నుంచి కారులో అనంతపురానికి తిరుగు ప్ర యాణమయ్యారు. నంబూరు వెంకటరమణ(55), కూ తు రు అనూష, అల్లుడు పవన్‌సాయి(25), డ్రైవర్ చంద్ర (27) ప్రయాణిస్తున్న కారు అన్నాసాగర్ వద్ద ముందు వెళ్తున్న కంటైనర్‌ను ఓవర్‌టెక్ చేసే క్రమంలో అదుపు తప్పింది. కారు రోడ్డు పక్కన ఉన్న ఇనుప రాడ్‌ను బలంగా ఢీకొని 10 ఫీట్ల వరకు గాలిలో ఎగిరి చెట్టును ఢీకొంది. దీంతో వెంకటరమ ణ, పవన్‌సాయి, డ్రైవర్ చంద్ర అక్కడికక్కడే మృతిచెందగా.. అనూష తీవ్రంగా గాయపడింది. క్షతగాత్రురాలిని జిల్లాకేంద్రంలోని ఎస్వీఎస్ ఆస్పత్రికి తరలించారు. నంబూరు వెంకటరమణ నంద్యాల జిల్లా ప్యాపిలి ఎస్ఐగా పనిచేస్తున్నారు. కళ్ల ముందే తండ్రి, భర్త మృత్యువాత.. కారు ముందు సీట్లో కూర్చున్న తండ్రి వెంకటరమణ, పక్కనే కూర్చున్న భర్త పవన్ మృతి చెందడంతో అనూష షాక్‌కు గు రైంది. ప్రమాద విషయాన్ని వెనకాల కారులో వస్తున్న తల్లి వాణికి ఫోన్లో చెప్పి అపస్మారక స్థితికి వెళ్లిపోయింది. అతివేగమే కారణం.. కారు డ్రైవర్ అజాగ్రత్త, అతివేగం కారణంగా ప్రమాదం జరిగిందని, ప్రమాద సమయంలో కారు వేగం 120– 140 కిలోమీటర్లు ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కారు నుజ్జునుజ్జయింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. -
వేధింపులు తాళలేక బీఫార్మసీ విద్యార్థిని బలవన్మరణం
మహబూబ్‌నగర్: నాగర్‌కర్నూల్ జిల్లా చారకొండకు చెందిన విద్యార్థిని రౌతు అనూష (23) సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. హైదరాబాద్‌లోని శ్రీఇందు కళాశాలలో అనూష బీఫార్మసీ మూడవ సంవత్సరం చదువుతుంది. ఆదివారం ఆమె సోదరుడితో కలిసి స్వగ్రామానికి వచ్చింది. హాస్టల్లో తనను స్నేహితులు ఇబ్బంది పెడుతున్నారని కుటుంబ సభ్యులకు చెప్పగా.. తాము మాట్లాడుతామని ఆమెకు సర్దిచెప్పారు. హాస్టల్ నుంచి వచ్చిన మరుసటి రోజే ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి యాదయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. కాగా విద్యార్థిని ఆత్మహత్య విషయం తెలుసుకున్న వెల్దండ సీఐ సోమనర్సయ్య చారకొండకు చేరుకొని వివరాలు సేకరించారు. -
Senior Women T20: సౌత్‌జోన్ జట్టులో త్రిష..
Senior Women’s Inter-Zone T20 Trophy: సీనియర్ మహిళల ఇంటర్ జోనల్ టి20 క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనే సౌత్‌జోన్ జట్టును ప్రకటించారు. 15 మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో హైదరాబాద్ నుంచి గొంగడి త్రిష, భోగి శ్రావణి ఎంపికయ్యారు. అదే విధంగా ఆంధ్ర నుంచి బారెడ్డి అనూష, ఎస్.అనూష, నీరగట్టు అనూష ఈ జట్టులో స్థానం సంపాదించారు. ఇక ఈ టోర్నీ ఈనెల 24 నుంచి డిసెంబర్ 4 వరకు లక్నోలో జరుగుతుంది. ఈ జట్టుకు శిఖా పాండే కెప్టెన్‌గా వ్యవహరించనుంది. సౌత్‌జోన్ జట్టు: శిఖా పాండే (కెప్టెన్), గొంగడి త్రిష, డి.బృందా, జి.దివ్య, ఎల్.నేత్ర, పూర్వజ వెర్లేకర్, దృశ్య, ఎంపీ వైష్ణవి, మిన్ము మణి (వైస్ కెప్టెన్), అనూష బారెడ్డి, ఎస్.అనూష, ఎండీ షబ్నం, బూగి శ్రావణి, ఎన్.అనూష, యువశ్రీ. సెమీస్‌లో అభయ్ నిష్క్రమణ న్యూఢిల్లీ: నియోస్ వెనిస్ వెర్టె ఓపెన్ స్క్వాష్ టోర్నీలో భారత ప్లేయర్ అభయ్ సింగ్ సెమీఫైనల్లో ని్రష్కమించాడు. ఫ్రాన్స్‌లో జరుగుతున్న ఈ టోరీ్నలో శుక్రవారం రెండో సీడ్ రోరీ స్టీవర్ట్ (స్కాట్లాండ్)తో జరగాల్సిన సెమీఫైనల్లో అభయ్ గాయం కారణంగా బరిలోకి దిగకుండా తన ప్రత్యర్థికి వాకోవర్ ఇచ్చాడు. క్వార్టర్ ఫైనల్లో అభయ్ 11–1, 7–11, 19–17, 8–11, 11–6తో ఆరో సీడ్ విక్టర్ బైర్టస్ (చెక్ రిపబ్లిక్)పై గెలిచాడు. -
అనూష షా...విల్ పవర్ ఉన్న సివిల్ ఇంజనీర్
‘నా వృత్తిలో నేను రాణిస్తే చాలు. అదే పదివేలు’ అని సంతృప్తి పడి, సర్దుకుపోయేవాళ్లే ఎక్కువమంది కనిపిస్తారు. ‘నా వృత్తి వల్ల పర్యావరణానికి ఏ మేరకు హాని జరుగుతోంది?’ అని ఆలోచించేవాళ్లు అరుదుగా కనిపిస్తారు. అలాంటి అరుదైన వ్యక్తి... అనూష షా. పచ్చటి ప్రకృతి ప్రపంచంలో పుట్టి పెరిగిన అనూషకు పర్యావరణ విలువ తెలుసు. సివిల్ ఇంజనీర్‌గా అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న అనూష వృత్తి విజయాలను చూసి ΄÷ంగిపోవడం కంటే వృత్తికి సామాజిక బాధ్యతను జోడించడానికే అధికప్రాధాన్యత ఇచ్చింది. తన వంతుగా వివిధ వేదికలపై పర్యావరణ హిత ప్రచారాన్ని విస్తృతం చేసింది. తాజాగా... బ్రిటన్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ (ఐసీయి)కి అధ్యక్షురాలిగా ఎంపికైంది అనూష షా. రెండు శతాబ్దాల చరిత్ర ఉన్న ప్రతిష్ఠాత్మకమైన ‘ఐసీయి’ అధ్యక్షత బాధ్యతలు స్వీకరించిన తొలి భారతీయురాలిగా అనూష షా చరిత్ర సృష్టించింది... ‘వాటర్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్’లో అనూష షాకు రెండు దశాబ్దాలకు పైగా అనుభవం ఉంది. డిజైనింగ్, మేనేజింగ్లో, ప్రాజెక్ట్స్–ప్రొగ్రామ్‌లను లీడ్ చేయడంలో అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంది. ‘నిర్మాణం వల్ల నిర్మాణం మాత్రమే జరగడం లేదు. ప్రకృతికి ఎంతో కొంత నష్టం జరుగుతుంది’ అనేది ఒక సామాజిక సత్యం. దీన్ని దృష్టిలో పెట్టుకొని వృత్తికి సామాజిక బాధ్యత కూడా జోడించి ముందుకు వెళుతోంది అనూష. ‘నా వృతి వల్ల నాకు ఆర్థికంగా మేలు జరగడం మాట ఎలా ఉన్నా, చేటు మాత్రం జరగవద్దు’ అంటోంది అనూష. అందుకే తన వృత్తిలో పర్యావరణ హిత విధానాలను అనుసరిస్తోంది. ‘సివిల్ ఇంజనీరింగ్‌ను పీపుల్–పాజిటివ్ ప్రొఫెషన్‌గా చూడాలనేది నా కల. మౌలిక వసతులు, ప్రకృతికి మధ్య ఉండే అంతఃసంబంధాన్ని అర్థం చేసుకోవడంలో మొదట్లో మేము విఫలమయ్యాం. ఆ తరువాత మాత్రం ప్రకృతికి హాని జరగని విధానాలను అనుసరించాం’ అంటుంది అనూష. అందమైన కశ్మీర్లో పుట్టి పెరిగిన అనూషకు ప్రకృతి విలువ తెలుసు. కశ్మీర్‌లోని దాల్ సరస్సు సంరక్షణ కోసం దిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ఒక సంస్థ కోసం ఇరవై మూడు సంవత్సరాల వయసులో కన్సల్టింగ్ప్రాజెక్ట్ ఇంజనీర్‌గా పనిచేసింది. ఆ తరువాత కామన్వెల్త్ స్కాలర్‌షిప్‌తో బ్రిటన్ వెళ్లి ‘వాటర్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్’లో ఎంఎస్సీ చేసింది. ‘΄్లాన్ ఫర్ ఎర్త్’ అనే క్లైమెట్ ఛేంజ్ కన్సెల్టెన్సీని మొదలు పెట్టి పర్యావరణ సంరక్షణకు సంబంధించిన ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. వివిధ పరిశ్రమలకు సంబంధించిన ‘నెట్‌జీరో అండ్ క్లైమెట్ ఛేంజ్’ బృందాలతో సమావేశమై విలువైన సూచనలు ఇచ్చింది. చర్చాకార్యక్రమాల్లో పాల్గొన్నా, వ్యాసాలు రాసినా, టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చినా, సమావేశాల్లో ఉపన్యాసం ఇచ్చినా...ప్రతి అవకాశాన్ని పర్యావరణ హిత ప్రచారానికి ఉపయోగించుకుంది. ‘మన గురించి మాత్రమే కాదు భవిష్యత్ తరాల గురించి కూడా ఆలోచించాలి. ఉన్నతమైన విలువలతో ప్రయాణించినప్పుడే మన గమ్యస్థానం చేరుకోగలం’ అంటుంది అనూష. ‘క్లైమెట్ చేంజ్ ఇన్ ఇంజనీరింగ్’ అంశానికి సంబంధించి అనూష చేపట్టిన అవగాహన కార్యక్రమాలకు గానూ ‘యూనివర్శిటీ ఆఫ్ ఈస్ట్ లండన్’ నుంచి గౌరవ డాక్టరేట్ స్వీకరించింది. కొన్ని సంవత్సరాల క్రితం బ్రిటన్ నుంచి ముంబైకి వచ్చింది అనూష. ఆ సమయంలో తన స్వస్థలం కశ్మీర్‌ను వరదలు ముంచెత్తాయి. ఎంతోమంది చనిపోయారు. ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. ఇది అనూషను బాగా కదిలించింది. ‘విషాదం నుంచి కూడా నేర్చుకోదగినవి చాలా ఉంటాయి. ఇది అలాంటి విషాదమే’ అని గతాన్ని గుర్తు తెచ్చుకుంటుంది అనూష. ‘ముందుచూపు, ముందు జాగ్రత్త ఉన్న వాళ్ల వైపే అదృష్టం మొగ్గు చూపుతుంది’ అనేది అనూష షాకు బాగా ఇష్టమైన మాట. ‘మన వల్ల ఏమవుతుంది అనే భావన కంటే ఔట్ ఆఫ్ బాక్స్‌లో ఆలోచించి, ధైర్యంగా ముందుకు వెళ్లడం వల్లే ఎక్కువ మేలు జరుగుతుంది. సంకల్పబలం ఉన్న చోట అద్భుతమైన ఫలితాలు వస్తాయి’ అనేది ఆమె బలంగా చెప్పే మాట. -
పండుగ వేళ విషాదం..! రోడ్డు ప్రమాదంలో తండ్రీకూతురు..
సాక్షి, వరంగల్: పండగకు ఇంటికి వస్తున్న తండ్రీకూతురు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఈ ఘటన శనివారం రాత్రి మండలంలోని కిష్టాపురంలో జరిగింది. ఎస్సై విజయ్‌కుమార్ కథనం ప్రకారం మండలంలోని మొరిపిరాల గ్రామానికి చెందిన ఓరుగంటి వెంకన్న(50)కు కూతురు అనూష(33) ఉంది. పండుగ నిమిత్తం కూతురు అనూష, అల్లుడు ముంజపల్లి రాజు.. హైదరాబాద్ నుంచి తొర్రూరు చేరుకున్నారు. తొర్రూరు బస్టాండ్‌లో ఉండగా వెంకన్న బైక్‌పై వెళ్లి వారిని తీసుకొస్తున్నాడు. ఈ క్రమంలో వరంగల్ వైపు నుంచి వస్తున్న కారు కిష్టాపురం క్రాస్ వద్ద బైక్‌ను ఢీకొంది. దీంతో వెంకన్న అక్కడికక్కడే మృతిచెందగా తీవ్రగాయాలపాలైన అనూష, రాజును తొర్రూరులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ అనూష చికిత్స పొందుతూ మృతిచెందింది. రాజు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. దీంతో పండగపూట ఆ కుటుంబలో విషాదం నెలకొంది. ఈ ఘటనపై కుటుంబీల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై విజయ్‌కుమార్ తెలిపారు. -
ఆసియా క్రీడల్లో సత్తా చాటారు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో రాణించి పతకాలు సాధించేలా ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. ఇటీవల చైనాలోని హాంగ్జౌ నగరంలో జరిగిన 19వ ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన కోనేరు హంపి (చెస్), జ్యోతి యర్రాజీ (అథ్లెట్), బి.అనూష (క్రికెట్) శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. ప్రపంచ క్రీడా వేదికలపై తెలుగువారి ఖ్యాతిని నిలబెడుతూ రాష్ట్రానికి, దేశానికి గుర్తింపు తెచ్చారని సీఎం జగన్ వారిని అభినందించారు. ఈ సందర్భంగా క్రీడాకారులు తాము గెలుచుకున్న పతకాలను సీఎంకు చూపించారు. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించేలా క్రీడాకారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని సీఎం భరోసా ఇచ్చారు. ఏపీకి 11 పతకాలు.. ఆసియా క్రీడల్లో మన దేశం తొలిసారిగా 107 పతకాలను సాధించింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 13 మంది క్రీడాకారులు దేశం తరఫున వివిధ క్రీడాంశాల్లో ప్రాతినిధ్యం వహించారు. వీరిలో ఎనిమిది మంది క్రీడాకారులు 11 పతకాలను (5 గోల్డ్, 6 సిల్వర్) సాధించారు. రాష్ట్ర స్పోర్ట్స్ పాలసీ ప్రకారం ఆసియా క్రీడల్లో పతకాల విజేతలకు ప్రభుత్వం రూ.2.70 కోట్ల నగదు ప్రోత్సాహకాలను విడుదల చేసింది. వీటితో పాటు గతంలోని ప్రోత్సాహక బకాయిలతో కలిపి మొత్తం రూ.4.29 కోట్లు క్రీడాకారుల ఖాతాల్లో జమ చేయడం గమనార్హం. ఈ కార్యక్రమంలో పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్విసులు, క్రీడా శాఖల మంత్రి ఆర్కే రోజా, ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ఎండీ హెచ్.ఎం.ధ్యానచంద్ర, శాప్ అధికారి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
అంతర్జాతీయ క్రికెట్లో అదరగొడుతున్న అనంతపురం అమ్మాయి
సాక్షి, అనంతపురం డెస్క్: క్రికెట్లో ఉన్నత స్థాయికి ఎదగడమంటే ఆషామాషీ కాదు. ఎంతో నైపుణ్యంతో పాటు నిలకడగా రాణించాలి. అప్పుడు మాత్రమే అవకాశాలు అందివస్తాయి. మరీ ముఖ్యంగా మహిళలు ఈ క్రీడలో రాణించాలంటే ఎన్నో సవాళ్లను అధిగమించాలి. అయితే..అన్నింటినీ అధిగమించి అంతర్జాతీయ క్రికెటర్‌గా సత్తా చాటుతోంది బారెడ్డి అనూష. ప్రస్తుతం చైనాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో స్వర్ణపతకం సాఽధించిన భారత మహిళా క్రికెట్ జట్టులో అనూష కూడా సభ్యురాలు కావడం విశేషం. పల్లెటూరి నుంచి... అనూష స్వగ్రామం నార్పల మండలం బండ్లపల్లి. తల్లిదండ్రులు లక్ష్మిదేవి, మల్లిరెడ్డి. వీరిది సాధారణ రైతు కుటుంబం. రెక్కల కష్టాన్నే నమ్ముకున్న వారు. అయినప్పటికీ కుమార్తె ఆకాంక్షను కాదనలేదు. సాధారణంగా ఆడపిల్లలు క్రికెట్ ఆడతామంటే తల్లిదండ్రులు అంగీకరించరు. అది కూడా గ్రామాల్లో అయితే ‘మగపిల్లల్లా ఏమిటీ ఆటలు’ అంటూ అభ్యంతరం చెబుతారు. కానీ అనూష తల్లిదండ్రులు వెన్నుతట్టి ప్రోత్సహించారు. తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహంతో ఆమె కూడా పట్టుదలతో రాణించి ఉన్నతస్థాయికి చేరింది. మలుపు తిప్పిన ‘స్పిన్’ అనూష కెరీర్ ప్రారంభంలో ఎడమ చేతి మీడియం పేస్ బౌలింగ్ చేసేది. బంతిని కూడా బాగా స్వింగ్ చేసేది. కానీ పేస్‌బౌలర్‌గా రాణించాలంటే మంచి ఎత్తు అవసరం. అనూషకు అందుకు తగ్గ ఎత్తు లేకపోవడంతో 2018–19 సీజన్లో ఆమె బౌలింగ్ శైలిని మార్చేందుకు కోచ్ నిర్ణయం తీసుకున్నాడు. ఎడమచేతి వాటం స్పిన్నర్‌గా మార్పు చేశాడు. ఆ సమయంలో ఆంధ్ర ప్రదేశ్ జట్టుకు కూడా ఎడమచేతి వాటం స్పిన్నర్ అవసరం ఉండడం, అందుకు తగ్గట్టుగానే అనూష రాణించడంతో ఆమె కెరీర్‌నే మలుపు తిప్పింది. అనూష మంచి స్పిన్నర్ మాత్రమే కాదు..అద్భుతమైన ఫీల్డర్. అలాగే డెత్ ఓవర్లలో ధాటిగా బ్యాటింగ్ చేయగలదు. ఆల్‌రౌండ్ నైపుణ్యాలు ఉండడం టీమిండియాలో చోటు దక్కడానికి దోహదపడ్డాయి. ఉమ్మడి జిల్లాలో తొలి ప్లేయర్ ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి క్రికెట్ (పురుషులు/మహిళలు)లో ఇదివరకు ఎవరూ అంతర్జాతీయస్థాయికి ఎదగలేదు. రాష్ట్ర, జోనల్ స్థాయికే పరిమితమయ్యారు. కానీ అనూష టీమిండియాలో చోటు సంపాదించి..జిల్లాలో తొలి అంతర్జాతీయ క్రికెటర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అలాగే రాయలసీమలో అంజలి శర్వాణి (ఆదోని, కర్నూలు జిల్లా) తర్వాత ఆ ఘనత సాధించిన రెండో ప్లేయర్ అనూష కావడం గమనార్హం. ఆర్డీటీ సహకారం ఉమ్మడి అనంతపురం జిల్లాలో అనేకమంది క్రీడాకారులకు రూరల్ డెవలప్మెంటు ట్రస్టు (ఆర్డీటీ) అండగా నిలుస్తోంది. ఈ కోవలోనే అనూషకు కూడా అన్నివిధాలా సహాయ సహకారాలు అందించింది. క్రికెట్లో అనూష నైపుణ్యాన్ని గుర్తించిన ఆర్డీటీ తన అకాడమీలో చేర్చుకుని ప్రత్యేక శిక్షణ ఇప్పించింది. ఆంధ్ర క్రికెట్ జట్టు మొదలుకుని టీమిండియాలో చోటు సంపాదించే వరకు..ప్రతి దశలోనూ అండగా నిలిచింది. అంతర్జాతీయ క్రికెట్ ఆడతానని అనుకోలేదు అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ ఆడతానని ఎన్నడూ ఊహించలేదు. అంకితభావం, నిరంతర కృషితో అవకాశాలు దక్కాయి. అమ్మానాన్న వ్యవసాయంతో పాటు కూలి పనులకు వెళ్తూ నన్ను ఉన్నత స్థానంలో చూడాలని ఆశించారు. వారి ఆకాంక్షను నెరవేర్చడం ఎంతో సంతోషంగా ఉంది. ఆర్డీటీ, అనంతపురం, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్లు, మా పీఈటీ సార్.. ఇలా ఎందరో ప్రోత్సాహం, సహకారం వల్ల ఈ స్థాయికి రాగలిగాను. అందరికీ కృతజ్ఞతలు. ఆసియా క్రీడల్లో స్వర్ణపతకం సాధించిన టీమిండియాలో నేనూ ఉండడం అదృష్టంగా భావిస్తున్నాను. మరింతగా రాణించి దేశానికి, జిల్లాకు మంచి పేరు తెస్తాను. –బి. అనూష, భారత క్రికెటర్ -
సర్జరీ చేయించుకున్న ప్రముఖ నటి.. వారి కోసం ఓ సలహా!
ప్రముఖ టీవీ హోస్ట్, నటి అనూషా దండేకర్ బీటౌన్‌లో పరిచయం అక్కర్లేని పేరు. గతేడాది నటుడు కరణ్ కుంద్రాతో బ్రేకప్ చెప్పి వార్తల్లో నిలిచింది. కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్న వీరిద్దరు మనస్పర్థలు రావడంతో విడిపోయారు. ప్రస్తుతం టీవీ షోలకు హోస్ట్‌గా పనిచేస్తున్న అనుషా మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమయ్యారు. తాజాగా ఆమె తన ఇన్‌స్టాలో చేసిన పోస్ట్ వైరలవుతోంది. ( ఇది చదవండి: పెళ్లికి ముందే వరుణ్‌కు లావణ్య కండీషన్.. మెగా ఫ్యామిలీ గ్రీన్ సిగ్నల్!) ఆమె తన అండాశయానికి శస్త్ర చికిత్స చేయించుకున్నట్లు ఇన్‌స్టాలో షేర్ చేసింది. అండాశయంలో ఉన్న గడ్డలు వైద్యులు విజయవంతంగా తొలగించారని వెల్లడించింది. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని.. పూర్తిగా కోలుకునేందుకు మరిన్నీ రోజులు పడుతుందని తెలిపింది. ఈ విషయాన్ని మహిళలు, యువతుల కోసం చెబుతున్నట్లు పేర్కొంది. ఈ విషయంలో నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపింది. ఇన్‌స్టాలో రాస్తూ.. 'నా అండాశయంలో గడ్డలు ఉండడంతో శస్త్రచికిత్స జరిగింది. కోలుకోవడం కాస్త టైం పడుతుంది. కానీ నేను నిజంగా అదృష్టవంతురాలిని. ప్రస్తుతం అంతా బాగానే ఉంది. నేను ఈ విషయాన్ని అమ్మాయిలందరికీ చెప్పాలనుకుంటున్నా. మీకు ఇలాంటి సమస్య ఏదైనా ఉంటే క్రమం తప్పకుండా ఏడాది ఒకసారైనా గైనకాలజిస్ట్‌ను కలవండి. నేను నా 17 ఏళ్ల వయసు నుంచి డాక్టర్‌ను కలుస్తున్నా. మీ ఆరోగ్యమే ముఖ్యమని తెలుసుకోండి. తనకు చికిత్స అందించిన ఆసుపత్రి సిబ్బందికి కృతజ్ఞతలు. నిజంగా నేను అదృష్టవంతురాలిని.' అంటూ పోస్ట్ చేసింది. ( ఇది చదవండి: పెళ్లికి సిద్ధమైన బాలీవుడ్ క్వీన్.. సోషల్ మీడియాలో వైరల్!) కాగా.. అనూషా దండేకర్ 2003లో 'ముంబయి మ్యాట్నీ' సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'విరుద్ధ్', 'ఢిల్లీ బెల్లీ' వంటి చిత్రాలలో నటించింది. అంతేకాకుండా 'హౌస్ ఆఫ్ స్టైల్', 'లవ్ స్కూల్', 'తీన్ దివా' వంటి అనేక రియాల్టీ షోలకు కూడా హోస్ట్‌గా పనిచేసింది. ప్రస్తుతం 'బాప్ మనుస్'సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తోంది. View this post on Instagram A post shared by Anusha Dandekar (@vjanusha) -
అయ్యో అనూషా.. ఎంత పని చేశావమ్మా?
అన్నమయ్య : అత్తింటి ఆరళ్లకు ఓ అబల బలైంది. మండలంలోని పొన్నూటిపాళ్యం పంచాయతీ భువనేశ్వరినగర్‌లో నివాసం ఉంటున్న అనూష అదనపు కట్నం కోసం అత్తింటివారి వేధింపులు భరించలేక సోమవారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తాలూకా సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. రామసముద్రం మండలం పెద్దకురప్పల్లెకు చెందిన అమ్ములు, చిన్నస్వామి కుమార్తె అనూష(22)కు కర్ణాటకలోని రాయల్పాడు మండలం శునకల్ ప్రాంతానికి చెందిన అశోక్‌తో రెండేళ్ల క్రితం వివాహమైంది. భార్యాభర్తలిద్దరూ వివాహం తర్వాత భువనేశ్వరినగర్‌లో నివాసం ఉంటున్నారు. వివాహ సమయంలో అనూషా తల్లిదండ్రులు అశోక్‌కు రూ.2 లక్షల నగదు, 150 గ్రాముల బంగారు ఇచ్చి వివాహం చేశారు. అలాగే కారు తీసుకోవాలంటే రూ.2 లక్షలు ఇచ్చారు. ఇది చాలక మళ్లీ అదనంగా డబ్బు కావాలని భర్త అశోక్, అత్తామామలు రెడ్డెమ్మ, కృష్ణప్పలు వేధింపులకు గురిచేస్తుండటంతో సోమవారం రాత్రి అనూష ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన భర్త వెంటనే ఆమెను కిందకు దించి మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి చేరేటప్పటికే మృతి చెందడంతో మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. అనూష మృతి చెందిన విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు ఆస్పత్రి వద్దకు చేరుకుని విగతజీవిగా పడి ఉన్న కూతురిని చూసి దుఃఖసంద్రంలో మునిగిపోయారు. తమ కుమార్తె అదనపు కట్నం తేలేదని అత్తింటివారే తమ బిడ్డను పొట్టన పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వరకట్న వేధింపులతోనే తమ బిడ్డ చనిపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మదనపల్లె డీఎస్పీ కేశప్ప ఆస్పత్రి వద్దకు చేరుకుని ఇరు వర్గాల వారిని విచారణ చేశారు. అనూష తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మృతురాలి భర్త అశోక్, అత్తామామలపై వరకట్న కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సత్యనారాయణ, ఎస్ఐ సుధాకర్ తెలిపారు. -
పీటలపై పెళ్లికొడుకు వేషాలు.. బండి కొనిస్తేనే పెళ్లి చేసుకుంటా!
శంకరపట్నం (మానకొండూర్): పెళ్లికూతురు మెడలో తాళికట్టే సమయానికి బండి కొనిస్తేనే పెళ్లి చేసుకుంటా.. అని వరుడు మొండికేయడంతో అతిథిగా వెళ్లిన ఎమ్మెల్యే తానుబండి కొనిస్తా అని డబ్బులు ఇచ్చి వివాహంజరిపించిన ఘటన కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూర్‌లో చోటుచేసుకుంది. శంకరపట్నం మండలం అంబాల్‌పూర్ మాజీ సర్పంచ్ గాజుల లచ్చమ్మ, మాజీ ఉపసర్పంచ్ మల్లయ్య కూతురు అనూష వివాహం సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామానికి చెందిన సంఘాల వినయ్‌తో కుదిరింది. రూ.5 లక్షల కట్నంతో పాటు మోటార్ సైకిల్ కొనిస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. కట్నం డబ్బులు ముట్టచెప్పారు. మొలంగూర్ శివారులోని ఓ ఫంక్షన్హాల్లో శుక్రవారం పెళ్లి మండపానికి వధువు, వరుడి బంధువులు చేరుకున్నారు. కొత్తజంటను ఆశీర్వదించేందుకు మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కూడా హాజరయ్యారు. తీరా.. తాళికట్టే సమయంలో మోటార్ సైకిల్ కొనిస్తేనే పెళ్లి చేసుకుంటా.. అని వరుడు వినయ్ మొండికేశాడు. దీంతో వరుడు, వధువు బంధువులు గొడవకు దిగడంతో ఎమ్మెల్యే రసమయి జోక్యం చేసుకుని పెళ్లి కొడుకు వినయ్‌తో మాట్లాడి మోటార్ సైకిల్ కొనుక్కోమని సొంత డబ్బులను (సుమారు రూ.50వేలు) అప్పటికప్పుడే పందిట్లోనే అందించారు. మిగతా సొమ్ము కూడా తానే ఇస్తానని హామీ ఇచ్చారు. అనంతరం దగ్గరుండి వివాహం జరిపించి నూతన జంటను ఆశీర్వదించారు. తోడబుట్టిన అన్నగా పెళ్లి మండపంలో పరువు కాపాడావని మాజీ సర్పంచ్ గాజుల లచ్చమ్మ కన్నీరు పెట్టుకుంది. -
ప్రత్యేక ఆకర్షణగా నాగశౌర్య పెళ్లి భోజనాలు, అరేంజ్మెంట్స్ చూస్తే షాకవ్వాల్సిందే
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య తన ప్రియురాలు అనూష శెట్టితో ఏడడుగులు వేసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. నవంబర్ 20న బెంగళూరుకు చెందిన ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టితో నాగశౌర్య వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇరు కుటుంబ పెద్దలు, సన్నిహితులు, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించారు. బెంగళూరులోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్ నాగశౌర్య-అనూష శెట్టిల రాయల్ వెడ్డింగ్‌కి వేదికైంది. ప్రస్తుతం నాగశౌర్య పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియో నెట్టింట వైరల్‌గా మారాయి. వీరి గ్రాండ్ వెడ్డింగ్ ఫొటోలు, వీడియోలు నెటిజన్లను వీపరితంగా ఆకట్టుకుంటున్నాయి. చదవండి: ప్రేమించిన అమ్మాయితో నాగశౌర్య వివాహం.. ఫోటోలు వైరల్ ఇక నాగశౌర్య పెళ్లి వేడుకల్లో ఏర్పాటు చేసిన విందు భోజనాలు కూడా ప్రత్యేకాకర్షణగా నిలిచాయి. పెళ్లికి వచ్చిన అతిథులందరికీ రాచరికపు స్టైల్లో భోజనాలు పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. సంప్రదాయం ప్రకారం కంచాల్లో బంతి భోజనాలు వడ్డించారు. అయితే ఒక్కో అతిథికి ప్రత్యేకంగా ఒక్కో టేబుల్ ఏర్పాటుచేశారు. ఈ టేబుల్స్ అష్టభుజ ఆకారంలో చాలా అందంగా ఉన్నాయి. విందులో భాగంగా 12 రకాల వంటలు, 4 రకాల స్వీట్స్, పెట్టినట్టు తెలుస్తోంది. కాగా టాలీవుడ్ సెలబ్రిటీల కోసం త్వరలో హైదరాబాద్‌లో ఘనంగా రిసెప్షన్‌ను ఏర్పాటు చేసేందుకు నాగాశౌర్య ప్లాన్ చేసినట్లు సమాచారం. @IamNagashaurya 👌 pic.twitter.com/71NdpGjuAE — devipriya (@sairaaj44) November 20, 2022 Royal Lunch Arrangement @ #NagaShaurya wedding 👌👌#LetsGoShaan ❤️ #AnushaShetty pic.twitter.com/KqX3lUMmO6 — 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) November 20, 2022 -
ప్రేమించిన అమ్మాయితో నాగశౌర్య వివాహం.. ఫోటోలు వైరల్
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య ఓ ఇంటివాడయ్యాడు. ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టితో ఏడడుగులు వేసి వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. నేడు(ఆదివారం) 11:25 గంటలకు బంధుమిత్రులు, కుటుంబసభ్యుల సమక్షంలో నాగశౌర్య-అనూషల వివాహం అత్యంత వైభవంగా జరిగింది. బెంగళూరులోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరిగింది. చదవండి : పెళ్లి కొడుకుగా నాగశౌర్య.. ప్రీ వెడ్డింగ్ ఫోటోలు వైరల్ టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు కూడా నాగశౌర్య వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఇక శౌర్య పెళ్లికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. దీంతో పలువురు సెలబ్రిటీలు సహా నెటిజన్ల నుంచి కొత్తజంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా అనూష శెట్టి ఇంటీరియర్ డిజైనర్‌గా పలు అవార్డులను అందుకుంది. కొన్నాళ్లుగా ఆమెకు నాగశౌర్యతో పరిచయం ఉంది. ఆ పరిచయం ప్రేమగా మారడంతో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
పెళ్లి కొడుకుగా నాగశౌర్య.. ప్రీ వెడ్డింగ్ ఫోటోలు వైరల్
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య ఇంట్లో పెళ్లి వేడుకులు మొదలయ్యాయి. నేడు(ఆదివారం) కర్ణాటక కుందాపూర్‌కు చెందిన ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టిని ఆయన పెళ్లి చేసుకోనున్నారు. బెంగళూరులో ఓ స్టార్ హోటల్లో వీరి వివాహ వేడుక జరగనుంది. ఈ క్రమంలో ప్రీ వెడ్డింగ్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇందులో వధూవరులిద్దరూ ట్రెడిషనల్ అవుట్‌ఫిట్‌లో మెరిసిపోయారు. హల్దీ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించిన నాగశౌర్య కుటుంబం అనంతరం కాక్టైల్ పార్టీను కూడా ఏర్పాటు చేశారు. ఈ పార్టీలో నాగశౌర్య తనకు కాబోయే భార్య అనూషకు రింగ్ తొడిగి తన ప్రేమను వ్యక్తపరిచారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ముందుగా నిశ్చయించిన సమయం ప్రకారం.. నేడు ఉదయం 11.25గంటలకు హీరో శౌర్య వధువు అనూష మెడలో బంధు, మిత్రుల సమక్షంలో మూడు ముళ్లు వేయనున్నారు. ఈ వేడుకకు టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు కూడా హాజరు కానున్నట్లు తెలుస్తుంది. Lovely Clicks from the Pre Wedding Ceremony of the Adorable Couple #NagaShaurya & #AnushaShetty 👩🏻❤️👨🏻💕🤩 LINK : https://t.co/SBmJWuYpOZ#NagaShauryaWedsAnushaShetty 💍@IamNagashaurya #KrackFlicks #tollywood #telugucinema — Krack Flicks (@KrackFlicks) November 20, 2022 -
అనూషశెట్టితో నాగశౌర్య ప్రేమ వివాహం!.. ఇంతకీ ఆమె ఎవరంటే
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. బెంగళూరుకు చెందిన ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టి అనే అమ్మాయితో ఆయన వివాహం ఖరారైంది. ఈనెల 20న 11:25 గంటలకు వీరి వివాహం బెంగళూరులోని ఓ హోటల్లో ఘనంగా జరగనుంది. ఇప్పటికే నాగశౌర్య ఇంట పెళ్లిసందడి మొదలైంది.శుభలేఖలు కూడా పంచుతున్నారు. పెళ్ళికి భారతీయ సాంప్రదాయ దుస్తుల్లో రావాల్సిందిగా నాగశౌర్య ఫ్యామిలీ ఆహ్వానితులను కోరుతున్నారు. ఇదిలా ఉండగా నాగశౌర్య పెళ్లి చేసుకునే అనూష శెట్టి ఎవరు? ఆమె ఏం చేస్తుంటుంది? అంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు. కర్ణాటకకు చెందిన అనూష శెట్టిది మంగళూరు దగ్గరలోని కుందాపూర్. ఇంటీరియర్ డిజైనింగ్‌లో ఎంతో టాలెంట్ ఉన్న అనూష ఉమెన్ అచీవర్స్‌లో ఒకరుగా గుర్తింపు సంపాదించుకున్నారు. 2019-2020లో ది బెస్ట్ డిజైనర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అనూష అందుకున్నారు. ఆర్కిటెక్ట్ గా కర్ణాటక స్టేట్ విన్నర్ అయిన అనూషతో నాగశౌర్యకు కొన్నాళ్లుగా పరిచయం ఉందట. ఆ పరిచయం ప్రేమగా మారడంతో పెద్దలు వారి పెళ్లికి అంగీకరించినట్లు సమాచారం. నాగశౌర్య పెళ్లి కబురు తెలియడంతో అభిమానులు సహా సెలబ్రిటీలు ఆయనకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. -
Anusha Shetty: లక్షల జీతం వచ్చే ఐటీ ఉద్యోగాలు వదిలేసి.. భార్యాభర్తలిద్దరూ..
సాధారణంగా చాలామంది కెరీర్లో ఎదిగేందుకు చేస్తోన్న ఉద్యోగాన్ని వదిలేసి... స్టార్టప్ పెట్టడమో, ట్రెండ్‌కు తగ్గట్టుగా సేంద్రియ వ్యవసాయాన్ని ఎంచుకోవడం వంటిదో చేస్తుంటారు. అయితే కర్ణాటకకు చెందిన అనుషాశెట్టి మాత్రం వీటన్నింటికి భిన్నం. తనకు నచ్చిన డ్యాన్స్ కోసం బంగారంలాంటి ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలేసి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా రాణిస్తూ యువతరానికి ప్రేరణగా నిలుస్తోంది. ఉడిపి జిల్లాలోని కుందాపూర్ అనే చిన్న గ్రామంలో ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది అనుషాశెట్టి. అనుష తల్లి ప్రభుత్వ ఉద్యోగి, తండ్రి వ్యాపార రీత్యా బెంగళూరులో ఉండేవారు. తల్లి ఉద్యోగం గ్రామంలో కావడంతో అనుష అమ్మ దగ్గర ఉంటూ చక్కగా చదువుకునేది. చిన్నప్పటినుంచి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌లోనూ, క్రీడల్లోనూ చాలా చురుకుగా ఉండేది. దీంతో తల్లిదండ్రులు ఆమెను ప్రోత్సహిస్తుండేవారు. ఇంటర్మీడియట్ అయ్యాక సెట్ ఎంట్రన్స్ పరీక్షలో మంచి ర్యాంక్ రావడంతో బెంగళూరులోనే టాప్–2 కాలేజీలో ఇంజినీరింగ్ సీటు వచ్చింది. దురదృష్టవశాత్తూ తండ్రికి వ్యాపారంలో నష్టాలు రావడంతో ఆమెను చదివించలేక గ్రామానికి దగ్గరల్లోని కాలేజీలో చేరమన్నారు. అయినా అనుష ఏ మాత్రం వెనక్కు తగ్గకుండా ధైర్యంగా ముందుకు సాగింది. కష్టపడి చదివి ఇంజినీరింగ్ పూర్తి చేసి, క్యాంపస్ సెలక్షన్స్‌లో మంచి ఐటీ ఉద్యోగాన్ని సంపాదించింది. ఉద్యోగం వదిలేసి.. కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ తన ప్రతిభాపాటవాలతో ఐటీ ఉద్యోగిగా ఎదిగిన అనుషకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే ఎంతో మక్కువ. టీవీ, స్టేజిషోల మీద జరిగే డ్యాన్స్ కార్యక్రమాన్ని చూసి డ్యాన్స్ నేర్చుకునేది. డ్యాన్స్‌పై ఉన్న ఆసక్తి రోజురోజుకి పెరగడంతో డ్యాన్స్ సాధన మరింతగా చేయాలనుకున్నప్పటికీ, ఉద్యోగరీత్యా డ్యాన్స్ ప్రాక్టీస్ చేసే తీరిక ఉండేది కాదు. మరోపక్క కుటుంబ అవసరాలకు ఆర్థికంగా అండగా ఉండాల్సిన పరిస్థితి. దీంతో కొన్నిరోజులు డ్యాన్స్‌ను పక్కన పెట్టింది. 2015లో ఓ ప్రోగ్రామ్‌లో సౌరభ్ పరిచయమయ్యాడు. సౌరభ్ ఐటీ ఉద్యోగిగా పనిచేస్తూనే డ్యాన్స్ టీచర్‌గా చేసేవాడు. అభిరుచులు ఒకటే కావడంతో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి, పెళ్లితో ఒకటయ్యారు. తర్వాత ఇద్దరూ కలిసి 2020లో ‘జోడీ అనురాభ్’ పేరుతో యూట్యూబ్ చానల్‌ను ప్రారంభించారు. వారాంతాల్లో ఇద్దరూ వివిధ రకాల డ్యాన్స్ చేసి, వీడియోలను పోస్టు చేసేవారు. వీటికి వీక్షకుల నుంచి మంచి స్పందన లభించేది. ఇలా కొంతకాలంపాటు చేశాక ఇద్దరూ తమ తమ ఉద్యోగాలను వదిలేసి పూర్తి సమయాన్ని డ్యాన్స్‌కు కేటాయించారు. వీరి నిర్ణయాన్ని కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. అయినా వెనక్కి తగ్గలేదు. తమ నిర్ణయానికి కట్టుబడి డ్యాన్స్ వీడియోలు పోస్టు చేస్తూ నాలుగు లక్షలమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. రకరకాల డ్యాన్స్ స్టెప్పులతో లక్షల వ్యూస్, అభిమానులతో ఇన్‌ఫ్లుయెన్సర్స్‌గా రాణిస్తున్నారు. లక్షల జీతం లేకపోయినప్పటికీ తమను అభిమానించే వారు లక్షల్లో ఉన్నారని ఈ జోడీ తెగ సంతోష పడిపోతోంది. చదవండి: Paranoia: రోజూ రాగానే ఇల్లంతా వెతకడం.. వాడిని ఎక్కడ దాచావ్ అంటూ భార్యను తిట్టడం! ఈ పెనుభూతం వల్ల.. View this post on Instagram A post shared by anoosha shetty (@chandukibiwi) -
పదవి నుంచి చింతపల్లి ఎంపీపీ తొలగింపు
చింతపల్లి రూరల్ (అల్లూరి సీతారామరాజు జిల్లా) : చింతపల్లి ఎంపీపీ వంతాల బాబూరావును పదవి నుంచి తొలగించాలని ఉమ్మడి విశాఖ జిల్లా ఎన్నికల అథారిటీ నుంచి గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. పరిషత్ ఎన్నికల సమయంలో ఎంపీపీ ఎన్నికల్లో 20 మంది ఎంపీటీసీల్లో 9 మంది ఇండిపెండెంట్లు బాబూరావును బలపర్చగా, మరో 9 మంది వైఎస్సార్సీపీ అభ్యర్థి అనూషదేవిని బలపర్చారు. ఇద్దరికీ సమానంగా సభ్యుల మద్దతు రావడంతో ఎన్నికల రిటర్నింగ్ అధికారి రవీంద్రనాథ్ లాటరీ తీశారు. డ్రాలో బాబూరావుకు ఎంపీపీ పదవి వరించింది. ఎన్నికల నామినేషన్ దాఖలు సమయంలో బాబూరావు ఆయనపై ఉన్న కేసుల వివరాలను నమోదు చేయలేదని అనూషదేవి కోర్టును ఆశ్రయించడంతో పాడేరు సబ్ కలెక్టర్ విచారణ జరిపారు. బాబూరావుపై కేసులు ఉన్నట్టు తేలడంతో పదవికి అనర్హుడిగా పేర్కొంటూ ఎంపీపీ పదవి నుంచి తొలగించాలని ఎన్నికల అథారిటీ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వైఎస్సార్సీపీ ఎంపీటీసీ కోరాబు అనూషదేవిని ఎంపీపీ పదవి వరించనుంది. (క్లిక్ చేయండి: విచ్చలవిడిగా రంగురాళ్ల తవ్వకాలు.. ప్రమాదం అని తెలిసినా..) -
పురుగుల మందు తాగి విద్యార్థిని..
నల్గొండ (చింతపల్లి): చింతపల్లి మండలం వింజమూరు గ్రామానికి చెందిన మట్ట అనూష(20) మాల్ వెంకటేశ్వరనగర్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. బుధవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగింది. బంధువులు గమనించి చింతపల్లి ఆస్పత్రికి, అక్కడి నుంచి మాల్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అనూష మృతిచెందిందని ధ్రువీకరించారు. మృతికి గల కారణాలు తెలియరావాల్సి ఉండగా ఈ విషయమై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
మామిడి ఒరుగులు: 15 వేల రూపాయలు పెడితే లక్ష ఆదాయం.. అప్పటి నుంచి!
సీజనల్‌గా ప్రకృతి ఇచ్చే వరాల్లో మామిడి ఒకటి. మామిడి కాయలనే ఉపాధిగా మార్చుకుంది ఖమ్మం జిల్లా మండాలపాడు వాసి రావిలాల అనూష. ఏడేళ్ల క్రితం 15 వేల రూపాయలతో మామిడి ఒరుగుల వ్యాపారాన్ని మొదలుపెట్టిన అనూష నేడు 30 మంది మహిళలకు ఉపాధి ఇస్తోంది. వేసవిలో రెండు నెలలు మాత్రమే చేసే ఈ తయారీ మార్కెట్ రంగంలో తనకో కొత్త మార్గాన్ని చూపింది అని వివరించింది అనూష. ‘మాది వ్యవసాయ కుటుంబం. నేను డిగ్రీ వరకు చదువుకున్నా. పెళ్లై, ఇద్దరు పిల్లలు. ఎకరంన్నర భూమిలో పత్తి సాగు చేస్తున్నాం. ఏడేళ్ల క్రితం మార్కెట్లో పత్తి అమ్ముతున్నప్పుడు మామిడి ఒరుగుల వ్యాపారం గురించి తెలిసింది. సాధారణంగా ప్రతి వేసవిలో ఇంట్లో మామిడి ఒరుగులను తయారుచేసుకుంటాం. వాటిని వర్షాకాలంలో వంటల్లో వాడుకుంటాం. అలాంటి ఈ ఒరుగులను పొడి చేసి, ఉత్తరభారతదేశంలో పెద్ద మార్కెట్ చేస్తున్నారని తెలిసింది. పులుపుకు బదులుగా వంటల్లో ఆమ్చూర్ పొడిని వాడుతుంటారని, ఈ బిజినెస్‌లో మంచి లాభాలు చూడవచ్చని తెలుసుకొని, దీని తయారీనే పెద్ద ఎత్తున చేయాలనుకున్నాం. పదిహేనువేల రూపాయలతో మొదలు మొదటి ఏడాది మావారు రామకృష్ణ నేను కలిసి 15వేల రూపాయలతో మామిడికాయలను కొనుగోలు చేశాం. మా బంధువుల నాలుగు మామిడి చెట్ల నుంచి 2 టన్నుల వరకు మామిడి కాయలు సేకరించి, ముక్కలు కోసి ఎండబెడితే ఏడు సంచులు అయ్యాయి. వాటిని అమ్మాం. ముందు మా కుటుంబమే ఈ పనిలో నిమగ్నమైంది. తర్వాత తర్వాత పనికి తగినట్టు ఇతరులను నియమించుకున్నాం. ఆ యేడాది లక్ష రూపాయల ఆదాయం చూశాం. తర్వాత ఏడాది ఇంకాస్త ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి, ఇరవై క్వింటాళ్ల ఒరుగులు తయారుచేసి నిజామాబాద్ తీసుకెళ్లి మార్కెట్ చేశాం. నష్టం వచ్చినా వదల్లేదు ప్రతి యేటా పనిని పెంచుతూనే వస్తున్నాం. ఐదేళ్లుగా ప్రతియేటా 50 క్వింటాళ్ల ఒరుగులు తయారుచేస్తున్నాం. ఒకసారి లాభం వచ్చిందంటే, మరోసారి తీవ్రమైన నష్టం కూడా చూస్తున్నాం. మామిడికాయ నుంచి ముక్క కట్ చేసి, ఆరబెట్టాక బాగా ఎండాలి. ఏ మాత్రం వర్షం వచ్చినా, ఒరుగులు పాడైపోతాయి. అమ్ముడుపోవు. వాతావరణం మీద ఆధారపడే తయారీ విధానం కాబట్టి, సమస్యలు తప్పవు. మా ఇంటిపైన, ఖాళీగా ఉన్న రోడ్డువారన మామిడి ముక్కలను ఎండబెడుతుంటాం. దాదాపు ఎండల్లోనే పని అంతా ఉంటుంది. రెండు నెలల పాటు టెంట్లు వేసి, ఈ పని చేస్తుంటాం. ఈ పనిలో అంతా మహిళలే పాల్గొంటారు. రోజూ 30 మందికి పైగా పాల్గొనే ఈ పని రెండు నెలల పాటు కొనసాగుతుంది. మా వర్క్ చూసి డీఆర్డీఎ, వి–హబ్ వాళ్లు రుణం ఇచ్చి సాయం చేశారు. కారం, పసుపు మిషన్లను కూడా కొనుగోలు చేశాం. ఒరుగులను పొడి చేసి అమ్మాలనుకున్నాం. ‘కృషి’ పేరుతో లేబుల్ కూడా వచ్చింది. కానీ, ఒరుగులను పొడి చేసే మిషన్లతో పాటు, లేబుల్ ప్రింట్కు, ప్యాకింగ్‌కి లక్షల్లో ఖర్చు అవుతుంది. వచ్చే ఏడాది ఆమ్చూర్ పొడిని మా సొంత లేబుల్‌తో అమ్మాలని ప్రయత్నాలు చేస్తున్నాను’ అని వివరించింది అనూష. – నిర్మలారెడ్డి -
Hyderabad: నగరంలో వివాహిత అదృశ్యం..
సాక్షి, హైదరాబాద్: ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ వివాహిత అదృశ్యమైంది. ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన సంఘటన వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంకు చెందిన సురేష్ అదే ప్రాంతానికి చెందిన అనూషను 6 నెలల క్రితం పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నాడు. జీవనోపాధి కోసం కొద్ది రోజుల క్రితం నగరానికి వచ్చి ఎస్ఆర్నగర్లోని పద్మావతి అపార్ట్మెంట్లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 15న అనూష తల్లి, పిన్ని వీరి వద్దకు వచ్చి మూడు రోజులు ఉన్నారు. కాగా శనివారం ఉదయం సురేష్ పనిమీద బయటకు వెళ్లి వచ్చేసరికి భార్య అనూషతో పాటు ఇద్దరు మహిళలు కనిపించలేదు. వారి ఆచూకీ కోసం పలు చోట్ల వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చదవండి: (బుల్లితెరపై చూద్దామనుకుంటే.. శాశ్వతంగా వెళ్లిపోయింది!) -
కర్కశ తల్లి లక్ష్మీ అనూష అరెస్టు.. వివాహేతర సంబంధాల నేపథ్యంలోనే
సాక్షి, కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరంలో కన్న బిడ్డలను కర్కశంగా హతమార్చిన లక్ష్మీ అనూషను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. బిడ్డలను హత్య చేసిన రోజే నిందితురాలు ఈ సంఘటనను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. తర్వాత తానే హత్య చేసినట్లు చెప్పింది. ఈ నేపథ్యంలో అనూష మానసిక స్థితి సరిగా లేకపోవడంతో చికిత్స కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆమె ఆరోగ్యం కుదుటపడిందని తెలుసుకున్న పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. పిల్లలను హత్య చేస్తూ తీసుకున్న సెల్పీ వీడియోను స్వాధీనం చేసుకున్నారు. వివాహేతర సంబంధాల నేపథ్యంలో ఈ అఘాయిత్యానికి పాల్పడిందని నిందితురాలి తాత మీడియాకు చెప్పారు. కొన్నాళ్లు పిల్లలను చాలా బాగానే చూసుకునేదని, ఇటీవలే ఆమెలో మార్పు వచ్చిందని కన్నీటి పర్యంతమయ్యాడు. చదవండి: (రాజమహేంద్రవరంలో దారుణం..) -
రాజమహేంద్రవరంలో దారుణం..
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతల్లే తన పిల్లలను ఉరి వేసి హతమార్చిన దారుణ ఘటన ఆదివారం రాత్రి 11.30 గంటలకు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. స్థానిక మల్లయ్యపేటకు చెందిన పూలేటి లక్ష్మీ అనూష తన కుమార్తె చిన్మయి (8), కుమారుడు మోహిత్ శ్రీసత్య (5)ను హత్య చేసింది. ఆ తర్వాత ఈ విషయాన్ని తన తమ్ముడికి ఫోన్ చేసి చెప్పింది. ఆయన హుటాహుటిన వచ్చి పిల్లలను ఆస్పత్రికి తీసుకెళ్లినా అప్పటికే మృతి చెందారని వైద్యులు తెలిపారు. త్రీటౌన్ సీఐ మధుబాబు ఆస్పత్రికి చేరుకుని నిందితురాలి నుంచి వివరాలు సేకరించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన పూలేటి రాముకు 11 ఏళ్ల క్రితం సీతానగరానికి చెందిన లక్ష్మీ అనూషతో వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. అయితే కుటుంబంలో కలహాలు రావడంతో రాము గతంలో ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి లక్ష్మీ అనూష మల్లయ్యపేటలో నివాసం ఉంటోంది. ఆమె తన పిల్లలను చిత్రహింసలకు గురిచేసేదని స్థానికులు చెబుతున్నారు. శనివారం రాత్రి కూడా రక్తం వచ్చేటట్టు కొట్టిందని తెలిపారు. అయితే.. తన కుటుంబ పరిస్థితి బాగోలేదని, పిల్లలకు తిండిపెట్టలేక చంపేశానని అనూష చెబుతోంది. కానీ ఆమెకు ఆర్థిక ఇబ్బందులు లేవని, ఈ హత్యలకు వేరే కారణం ఉంటుందని స్థానికులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అనూష కుటుంబానికి ప్రభుత్వం అండదండలు
ముప్పాళ్ల (సత్తెనపల్లి): డిగ్రీ విద్యార్థిని కోట అనూష కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా అన్ని విధాలా ఆదుకుంటామని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం గోళ్లపాడులో అనూష తల్లిదండ్రులను ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌తో కలిసి ఆయన బుధవారం పరామర్శించి ధైర్యం చెప్పారు. ఎంపీ మాట్లాడుతూ అనూషను హత్య చేసిన నిందితుడికి కఠిన శిక్షపడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉండేందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశ చట్టాన్ని తెచ్చారని వివరించారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో భాగంగా రూ.10 లక్షల చెక్కును తల్లిదండ్రులకు అందించారు. బాధితులు కోరుకున్న విధంగానే నరసరావుపేటలో ఇంటిస్థలం అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కుటుంబంలోని ఒకరికి ఉద్యోగం ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. -
అనూష కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది
సాక్షి, గుంటూరు: డిగ్రీ విద్యార్థిని అనూష సంఘటన అందర్నీ కలచివేస్తోందని మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. ఆమె గురువారం ముప్పాళ్ళ మండలం గోళ్లపాడులో అనూష కుటుంబ సభ్యులను మహిళా పరామర్శించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఇలాంటి ఘటనలు పునరావతం కాకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అనూష కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీరియస్‌గా స్పందించారని తెలిపారు. నిందితుడికి శిక్ష వెంటనే పడేందుకు దిశ చట్టాన్ని అమలు చేస్తున్నామని వ్యాఖ్యానించారు. నిందితుడికి కఠిన శిక్ష పడాలని సమాజమంతా కోరుకుంటుందని, అనూష కుటుంబానికి ధైర్యం చెప్పామని వాసిరెడ్డి పద్మ తెలిపారు. బుధవారం డిగ్రీ విద్యార్థిని అనూష (19) హత్యకు గురైన విషయం తెలిసిందే. సహ విద్యార్థి మేడా విష్ణువర్ధన్‌రెడ్డి ఆమెను గొంతు నులిమి దారుణంగా హత్యచేశాడు. మృతదేహాన్ని కాలువలో పడేసి అనంతరం పోలీసులకు లొంగిపోయాడు. చదవండి: అనూష కేసు: రెండేళ్లు గా వేధిస్తున్నాడు! -
కిరాణా షాపు బాకీ.. గర్భిణి అని చూడకుండా
రామగుండం: గోదావరిఖని సీతానగర్‌లో కిరాణం షాప్ నిర్వహించే కురుము అనూష అనే గర్భిణిపై ఆదివారం అదే ప్రాంతానికి చెందిన దాసరి శ్రీకాంత్ అలియాస్ పింటూ అనే యువకుడు కత్తితో దాడికి యత్నించాడు. వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అనూషకు చెందిన కిరాణా షాపులో శ్రీకాంత్ సామాన్లు తీసుకెళ్లి వాటి మొత్తాన్ని చెల్లించే విషయంలో బాకీ పడ్డాడు. ఆదివారం షాపు దగ్గరికి వెళ్లి ఉద్దెర అడగగా పాత బాకీ చెల్లించకుండా ఇచ్చేది లేదని అనూష తేల్చిచెప్పింది. దీంతో శ్రీకాంత్ కత్తి చూపించి తననే డబ్బు చెల్లించమని అడుగుతావా అంటూ బెదిరించడంతో బాధితురాలి భర్త శ్రీనివాస్ ఇంట్లో నుంచి బయటికి వచ్చి అడ్డుకున్నాడు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో ఆమె కిందపడడంతో స్వల్పగాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి ఎస్సై ఉమాసాగర్ చేరుకొని విచారణ జరిపి బాధితుల ఫిర్యాదు మేర కు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. చదవండి: క్రూరత్వం: గొలుసులతో కట్టేసి ఏనుగుపై దాడి -
3వేల కోసమే అనూష హత్య
పశ్చిమగోదావరి, ఏలూరు టౌన్: ఈనెల 7న పెదవేగి మండలం మొండూరు గ్రామం పోలవరం కుడికాలువ గట్టు వద్ద కనుగొన్న గుర్తుతెలియని మహిళ మృతదేహం కేసును ఏలూరు రూరల్ సర్కిల్ పోలీసులు ఐదు రోజుల్లోనే ఛేదించారు. నిందితుడు గుజ్జుల సందీప్‌కు మృతురాలు అనూషకు మధ్య రూ.3 వేల విషయమై ఏర్పడిన వివాదం కాస్తా హత్యకు దారితీసినట్లు పోలీసు విచారణ వెల్లడైంది. నిందితుడు సందీప్‌ను అరెస్టు చేసి జైలుకు పంపారు. ఈ హత్య కేసుకు సంబంధించిన వివరాలను ఏలూరు డీఎస్పీ దిలీప్‌కిరణ్ విలేకరులకు వివరించారు. ఈ సమావేశంలో రూరల్ సీఐ అనసూరి శ్రీనివాసరావు, రూరల్ ఎస్సై చావా సురేష్, పెదవేగి ఎస్సై నాగ వెంకటరాజు, ట్రైనీ డీఎస్పీ హర్షిత ఉన్నారు. దెందులూరు మండలం నాగులదేవుపాడు గ్రామానికి చెందిన గుజ్జుల సందీప్ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి దెందులూరు మండలం అక్కిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన మృతురాలు జానపూడి అనూష(30)తో శారీరక సంబంధం ఉంది. (అనూష భర్త గతంలో చనిపోయాడు). కొద్దిరోజుల క్రితం అనూషకు డబ్బులు అవసరం కావటంతో వారం రోజుల్లో తిరిగి ఇస్తానంటూ రూ.3 వేలు అప్పుగా అడిగింది. తాను ఆటో వాయిదా కట్టేందుకు దాచిన సొమ్ము రూ.3 వేలు అనూషకు ఇచ్చాడు. అనంతరం సందీప్ డబ్బులు అడుగుతూ ఉండగా ఆమె ఏదో ఒక కారణం చెబుతూ తప్పించుకుంటోంది. లాక్డౌన్ కారణంగా ఆటో కిరాయిలు లేక ఇబ్బందులు పడుతున్న సందీప్ కొన్ని రోజుల నుంచి డబ్బులు కావాలంటూ ఒత్తిడి చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో జూలై 1న మధ్యాహ్నం 12 గంటల సమయంలో అనూష ఫోన్ చేసి సందీప్‌ను 7వ మైలు దగ్గరకు రమ్మని చెప్పటంతో అతను ఆటో వేసుకుని అక్కడికి వెళ్ళాడు. ఇద్దరూ కలిసి ఆటోలో మొండూరు వద్ద పోలవరం కుడికాలువ గ్రావెల్ రోడ్డులోకి వెళ్ళి ఆటోను పక్కగా పెట్టి మట్టిదిబ్బల వద్దకు వెళ్ళారు. ఇద్దరూ ఇష్టపూర్వకంగానే శారీరకంగా కలిశారు. అనంతరం సందీప్ ఆమెను డబ్బులు గురించి అడగటంతో ఇరువురి మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో సందీప్ కోపంతో అనూషను గట్టిగా కొట్టాడు. అనంతరం ఆమె ముక్కు, నోటిని తన రెండు చేతులతో గట్టిగా అదిమిపట్టాడు. అనూష మెడలోని చున్నీతో బలంగా లాడి ముడివేశాడు. ఆమె చనిపోవటంతో అనూష మొబైల్ ఫోను, ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, ఓటర్ కార్డు తీసుకుని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ఈ హత్య కేసును ఛేదించటంలో ఏలూరు రూరల్ సర్కిల్ పోలీసు అధికారులతో పాటు పోలీసు సిబ్బంది హెచ్‌సీ వై.ఏసేబు, కానిస్టేబుల్స్ కిషోర్, ఎస్కే నాగూర్, సురేష్, డీ.సురేంద్ర, టీ.జయకుమార్‌లను డీఎస్పీ దిలీప్‌కిరణ్ అభినందించారు. -
ఆత్మహత్యనా.. ఇతర కారణమా..?
కరీంనగర్‌క్రైం/కొత్తపల్లి(కరీంనగర్): మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గబ్బిలాలపేటలో ఇద్దరు మహిళలు, చిన్నారి మృతి ఘటన కరీంనగర్ పట్టణంతోపాటు కొత్తపల్లి మండలం చింతకుంటలో విషాదం మిగిల్చింది. మృతికి కుటుంబ కలహాలా, ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లాక్డౌన్ ఉండగా కరీంనగర్ నుంచి ఎలా వెళ్లారు..? ఎందుకు వెళ్లారు..? ఎవరు సహకరించారు..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నెల 10న కొత్తపల్లి మండలం రేకుర్తిలో ఒక సేవా కార్యక్రమంలో పాల్గొన్న వీళ్లు ఏ కారణంతో వెళ్లారనేది మిస్టరీగా మారింది. కరీంనగర్ పట్టణంలో నివాసం ఉంటున్న అనూష(26), సుమతి(29) మృతదేహాలు సోమవారం ఉదయం మేడ్చల్ జవహర్‌నగర్ పరిసరాల్లో వేలాడుతూ కనిపించగా, అనూష కూతురు ఉమామహేశ్వరి(8) బాత్రూం శుభ్రం చేసే రసాయనాలు తాగి మృతిచెంది ఉంది. ఈ నెల 10న పేదకూలీలకు కరీంనగర్ శివారు రేకుర్తిలో మహిళా విభాగం ఆధ్వర్యంలో జరిగిన బియ్యం పంపిణీ వారు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలస్యంగా ఇంటికి వెళ్లడంతో కుటుంబ సభ్యులు మందలించారని తెలిసింది. అదే రోజు సాయంత్రం మేడ్చల్ జవహార్‌నగర్‌కు పయనమైనట్లు సమాచారం. కుటుంబ నేపథ్యం... ఖమ్మం ప్రాంతానికి చెందిన అనూషకు కరీంనగర్ కాపువాడకు చెందిన నాగరాజుతో వివాహం కాగా అదే ప్రాంతంలో నివాసం ఉండేది. ఇటీవల కొత్త ఇంటి నిర్మాణం కోసం అనుమతి ప్రయత్నాలు కొనసాగించినట్లు తెలిసింది. అనూష రెండు నెలల క్రితం హైదరాబాద్ ప్రాంతంలో ఉద్యోగం చేసినట్లు తెలిసింది. అక్కడ పనిచేసే క్రమంలోనే జవహార్‌నగర్‌లోని గబ్బిలాలపేటలో ఒక చర్చి ఫాస్టర్ కొడుకుతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతోనే అనూష కూతురు, ఆమె స్నేహితురాలు సుమతి జవహార్‌నగర్‌కు వెళ్లడానికి కారణమైనట్లు సమాచారం. వెల్గటూర్ మండలం అంబారిపేట గ్రామానికి చెందిన మోతె బానయ్య, నాగమ్మ కుటుంబం కొత్తపల్లి మండలం చింతకుంటలో నివాసం ఉంటోంది. వీరి కూతురు సుమతి డ్రైవర్ శ్యాంను ప్రేమ వివాహం చేసుకుంది. జ్యోతినగర్‌లో ఉండే వీరికి కూతురు, కుమారుడు ఉన్నారు. లాక్డౌన్ ఉండగా కరీంనగర్ నుంచి 160 కిలోమీటర్లు మేడ్చల్‌కు ఎలా వెళ్లారు.. ఎవరి సహకారంతో వెళ్లారు.. ఎందుకు వెళ్లారు.. అక్కడ ఏం జరిగిందనే విషయాలు తెలియరాలేదు. 10న కరీంనగర్ నుంచి వెళ్లిన తర్వాత వీరి కుటుంబ సభ్యులు పోలీసులకు ఎక్కడా ఫిర్యాదు చేయలేదని తెలిసింది. -
ఎంపీటీసీగా ఎంసీఏ విద్యార్థి అనూష
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఉన్నత విద్య అభ్యసిస్తూనే గ్రామ రాజకీయాల్లో కీలకమైన ఎంపీటీసీగా ఎన్నికయ్యారు. సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి ఎంపీటీసీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఎంసీఏ విద్యార్థి పులి అనూష ఘన విజయం సాధించారు. మహిళలకు రిజర్వ్ అయిన ఈ స్థానం నుంచి జరిగిన ముఖాముఖి పోటీలో టీఆర్ఎస్ అభ్యర్థి పడాల శ్రీజపై అనూష 72 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. నాలుగునెలలక్రితం జరిగిన సర్పంచ్ ఎన్నికల్లోనూ పోటీచేసిన అనూష ఓటమి పాలు కాగా, ఈసారి ఎంపీటీసీగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేశారు. సర్పంచ్‌గా పోటీ చేసి ఓడిపోయిన అనూషకు గ్రామస్తులు బాసటగా నిలిచారు. మాజీ ఎంపీటీసీ పులి వెంకటేశం కూతురైన అనూష కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్‌లోని శ్రీ చైతన్య కళాశాలలో ఎంసీఏ తృతీయ సంవత్సరం చదువుతోంది. పిన్న వయసు 23 సంవత్సరాలలోనే గ్రామ ఎంపీటీసీగా, అది కూడా స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తంచేస్తున్నారు. తమ కళాశాల విద్యార్థిని అనూష ఇండిపెండెంట్‌గా పోటీచేసి టీఆర్ఎస్ అభ్యర్థిపై విజయం సాధించడం పట్ల కళాశాల యాజమాన్యం, విద్యార్థులు హర్షం వ్యక్తంచేశారు. -
హాస్టల్లో యువతి అనుమానాస్పద స్థితిలో
అమీర్‌పేట: హాస్టల్లో ఉంటున్న ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లా, నరసారావుపేటకు చెందిన ఆకుల అనూష(23) బీటెక్ పూర్తి చేసి సాఫ్ట్వేర్ కోర్సు నేర్చుకునేందుకు మేనమామ శివప్రసాద్‌తో కలిసి నెల రోజుల క్రితం నగరానికి వచ్చింది. అమీర్‌పేటలోని విజయసాయి మహిళా హాస్టల్లో ఉంటుండగా, శివప్రసాద్ సమీపంలోని హాస్టల్లో ఉంటూ సాఫ్ట్వేర్ కోర్సు నేర్చుకుంటున్నారు. మంగళవారం ఉదయం అనూష శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటాన్ని గుర్తించిన రూమ్మేట్స్ శివప్రసాద్‌కు సమాచారం అందించారు. వెంటనే అక్కడికు చేరుకున్న అతను సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. శివప్రసాద్ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. -
మావోయిస్టు దళ సభ్యురాలి అరెస్టు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ జిల్లా పోలీసులు సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన, మావోయిస్టు అనుబంధ సంఘాలలో పని చేస్తున్న ఆత్మకూరు అనూషను పెదబయలు పోలీస్ స్టేషన్ కేసులలో అరెస్టు చేశారు. ఈ మేరకు పాడేరు డీఎస్పీ పి.బి.రాజ్‌కుమార్ ఒక ప్రకటన విడుదల చేసారు. పాత కేసులలో అరెస్టు కాబడి ఈరోజు బెయిల్‌పై విశాఖపట్నం సెంట్రల్ జైలు నుండి విడుదలకాగా, పాడేరు పోలీసులు ఇతర కేసుల నిమిత్తం అరెస్టు చేసి స్పెషల్ ఏజేఎఫ్సీఎం కోర్టుకు తరలించగా ఈనెల 20 వరకు కోర్టు రిమాండ్ విధించింది. ఆత్మకూరు అనూష(24) తండ్రి రమణయ్య చైతన్య మహిళా సంఘంలో పనిచేస్తూ , సీపీఐ మావోయిస్టు పార్టీలో దళ మెంబర్‌గా కొనసాగుతోంది. ఈమెకు పెదబయలుపోలీస్ స్టేషన్ పరిధిలో రెండు కేసులతో సంబంధం ఉన్నట్టు విచారణలో తేలినందున అరెస్టు చేసినట్టు సమాచారం. గత ఏడాది ఏప్రి ల్ నెలలో ఈమె సీపీఐ మావోయిస్టులు అక్కిరాజు హరగోపాల్,ఉదయ్, చలపతి మరికొంత మంది మావోయిస్టు సభ్యులు గ్రామంలో స్థానిక గిరిజనులుతో బెదిరించి బలవంతంగా ప్రజాకోర్టు నిర్వహించారు. అలాగే జుండాం అటవీ ప్రాంతంలో పోలీసులు వస్తున్నారని ముందస్తు సమాచారంతో మందుపాత్రలు అమర్చిన సంఘటనలో మావోయిస్టులతో కలిసిప్రత్యక్షంగా పాల్గొంది. -
బావ కిరాతకం
యశవంతపుర: ఇటీవల కెంగేరి సమీపంలోని సన్‌సిటీలో హత్యకు గురైన వివాహిత అనూషా హత్య కేసును కెంగేరి పోలీసులు ఛేదించారు. ఇంటిస్థలం కోసం మరదలును దారుణంగా హత్య చేసినట్లు బావ వివేక్ప్రతాప్ అగర్వాల్‌తో పాటు అరుణాచలప్రదేశ్కు చెందిన థాయ్హేల్ను అరెస్ట్ చేశారు. పోలీసులు అందించిన సమాచారం మేరకు కోల్‌కతాకు చెందిన వివేక్ ప్రతాప్ అగర్వాల్ నేత్రావతిని వివాహం చేసుకుని కెంగేరి ఉపనగర సన్‌సిటీలో నివాసం ఉంటున్నారు. తన భార్య నేత్రావతి వద్దనున్న బంగారు అభరణాలను తాకట్టుపెట్టి ఆ నగదును షేర్ మార్కెట్లో పెట్టాడు. అది దివాళా తీయడంతో మళ్లీ డబ్బులు కావాలంటూ అత్తమామలను వేధించటం మొదలు పెట్టాడు. మరదలు అనుషా పేరుపై బిడిది వండర్లా సమీపంలో ఇంటిస్థలం ఉంది దానిని భార్య నేత్రావతి పేరుపై రాసి ఇవ్వాలని అత్తమామలపై ఒత్తిడి పెంచాడు. విషయం మరదలు అనుషా ఎట్టి పరిస్థితుల్లోను తాను ఇంటి స్థలం రాసి ఇచ్చేది లేదని తెల్చి చెప్పింది. తన భార్య పేరుపై స్థలం రాసివ్వకపోతే హత్య చేస్తానని బెదిరించాడు. ఇంటి స్థలం దక్కదని భావించిన వివేక్ మరదలును హత్య చేయడానికి పథకం వేశాడు. తనకు పరిచయం ఉన్న సెక్యూరిటీ గార్డు థాయ్‌హేల్ సహాయం తీసుకున్నాడు. ఒక రాత్రి సహాయం చేస్తే రూ. లక్ష ఇస్తానని మాట ఇచ్చాడు. అతడికి పీకలదాక మద్యం తాపించాడు. మరుసటి రోజు మరదలు అనూషా ఉంటున్న కెంగేరి ఉపనగర సన్‌సిటీ 14వ క్రాస్ ఇంటిని చూపించాడు. భర్త సనత్ విధులకు వెళ్లిన సమయంలో థాయ్హేల్తో పాటు ఈనెల 18న అర్ధరాత్రి అనూషా ఇంటికి వచ్చిన వివేక్ ఎలాగో తలుపు తీయించి లోనికి వెళ్లాడు. ముందుగానే తెచ్చుకున్న తాడుతో ఇద్దరు కలిసి అనూషా గొంతు బిగించి హత్య చేశారు. ఎవరూ గుర్తించకుండా తలుపులకు తాళం వేసి అక్కడి నుంచి జారుకున్నారు. మరుసటి రోజు భర్త సనత్ ఫోన్ చేసినా స్పందింకపోవడంతో అదే మేడపై ఉన్న తన అక్కకు ఫోన్ చేసి చూడమని చెప్పాడు. ఆమె వచ్చి చూడగా హత్యకు గురైనట్లు సమాచారం ఇచ్చారు. అనంతరం అనూషా తల్లిదండ్రులకు కూడా సమాచారం ఇచ్చారు. కేసు దర్యాప్తు చేపట్టిన కెంగేరి పోలీసులు విచారణ చేపట్టి ఇంటి స్థలం కోసమే అనూషాను వివేక్, థాయ్‌హేల్ హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. -
పవర్ గర్ల్
పూటగడవని కుటుంబంలో పుట్టిన అనూషకు ఆర్థిక పరిస్థితులు అవరోధంగా నిలిచాయి. అయితే పతకం సాధించి దేశానికి ఖ్యాతి తీసుకురావాలన్న తపన ఆ అవరోధాలను అధిగమించేలా చేసింది. అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నా మొక్కవోని ఆత్మ సై ్థర్యంతో పతకాలను సాధిస్తూ పవర్ గర్ల్‌గా, వేమన విశ్వవిద్యాలయ మహిళా శక్తిగా ఖ్యాతి గడించి.. ప్రపంచక్రీడాపటంలో తనకంటూ ఓ స్థానం ఏర్పరచుకుని ముందుకు సాగుతున్నారు అనూష. యోగివేమన విశ్వవిద్యాలయం క్రీడాకారిణి పవర్‌లిఫ్టింగ్ క్రీడలో రాణిస్తూ తెలుగు మహిళల సత్తా ప్రపంచానికి చాటుతోంది. వైవీయూ అనుబంధంగా గల బద్వేలు పట్టణంలోని ఎస్.బి.వి.ఆర్. డిగ్రీ కళాశాలలో తృతీయ సంవత్సరం చదువుతున్న డొంకెన అనూష స్వస్థలం కృష్ణా జిల్లా మైలవరం మండలం పొందగల గ్రామం. ఫిబ్రవరి 16 నుంచి 18వ (నేడు) వరకు కేరళలోని కాలికట్లో నిర్వహించనున్న అఖిల భారత అంతర్ విశ్వవిద్యాలయ పోటీల్లో పాల్గొనేందుకు వెళ్లే ముందు అనూషను ‘సాక్షి’ పలకరించినప్పుడు.. ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయని.. ఆర్థిక చేయూతనిస్తే కామన్వెల్త్లో పతకం సాధించి దేశఖ్యాతిని ప్రపంచక్రీడాపటంలో చాటిచెబుతానని ఆమె ఆత్మవిశ్వాసంతో అన్నారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే...‘‘నాన్న కల్లుగీత కార్మికుడు. ఎంత కష్టమైనా సరే నన్ను చదివించాలనుకున్నారు. నాకు మాత్రం చదువుతో పాటు ఆటలంటే ఎంతో ఆసక్తి. చిన్నతనం నుంచి రకరకాల ఆటల్లో పాల్గొనేదాన్ని పాఠశాలస్థాయిలో కబడ్డీ క్రీడలో రాణించాను కూడా. మగరాయుడిలా వేషాలేంటన్నారు మా ఊర్లో ఆడపిల్లలంటే చిన్నచూపు. దానికి కారణం నిరక్షరాస్యత అయితే.. రెండో కారణం ఆటలపై అవగాహన లేకపోవడమే. నేను పదోతరగతి చదువుతున్నప్పుడు మైలవరంలో ఓ శిక్షణ శిబిరం జరిగింది. అక్కడకు వెళ్లినప్పుడు నాకు పవర్‌లిఫ్టింగ్ మీద ఆసక్తి పెరిగింది. నాకూ శిక్షణ తీసుకోవాలనిపించింది. దీని కోసం ప్యాంట్లు వేసుకోవాల్సి వచ్చేది. మా గ్రామంలో చాలామందికి నచ్చలేదు. నేను అలా వేసుకుని వెళ్లినప్పుడల్లా మగరాయుడిలా ఆ బట్టలేంటి.. వేషాలేంటి.. ఆటలేంటి అని అనేవారు. నేనేదో చేయకూడని పని చేస్తున్నట్లుగా చూసేవారు. దాంతో మానసికంగా కుంగిపోయేదాన్ని. రాత్రిళ్లు నిద్రపట్టేది కాదు. ఎవరేమనుకుంటే నాకేం అనే పరిణతి చాలా రోజులకు వచ్చింది. ఎంతకష్టమైనా సరే ఆట, చదువుని నిర్లక్ష్యం చేయకూడదనుకున్నా. నా కోసం.. నా తమ్ముడు కూలీపనులకు వెళ్లాడు పదోతరగతి పరీక్షల కోసమని కొన్నాళ్లు పవర్‌లిఫ్టింగ్ నుంచి విరామం తీసుకోవాల్సి వచ్చింది. ఇంటర్లో చేరాక శిక్షణ మీద దృష్టి పెట్టాను క్రమంగా జిల్లాస్థాయి పోటీలకు వెళ్లాను. పతకాలు వచ్చేవి. శిక్షణ తీసుకోవడం తేలికైంది. కానీ.. ఆ సమయంలో ఆర్థికంగా సమస్యలు తప్పలేదు. పవర్‌లిఫ్టింగ్ కోసం ఫిట్‌గా ఉండాలి. మంచి పౌష్టికాహారం తీసుకోవాలి.. నిపుణుల ఆధ్వర్యంలో వ్యాయామాలు చేయాలి. ఇంట్లో చూస్తేనేమో నాన్న మా పోషణకు, చదువులకే కష్టపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్లను అడగడం భావ్యం కాదనిపించింది. అందుకే పవర్‌లిఫ్టింగ్ వదిలేసి.. ఓ ప్రైవేట్ స్కూల్లో వ్యాయామ ఉపాధ్యాయురాలిగా చేరా. నా మనసు మాత్రం పవర్‌లిఫ్టింగ్‌పై ఉండేది. కొన్నాళ్లకు అమ్మానాన్నలకి విషయం చెప్పా, వాళ్లు అప్పులైనా ఫర్వాలేదు.. నువ్వు అనుకున్నది చెయ్ అంటూ ప్రోత్సహించారు. అయితే కొన్ని రోజులకే నాన్న (శ్రీనివాసరావు) కు పక్షవాతం వచ్చింది. ఏమి చేయాలో అర్థం కాలేదు. అప్పుడే మా తమ్ముడు వంశీ నా గురించి ఆలోచించి చదువు మానేశాడు. కూలీ పనులకు వెళ్లడం మొదలుపెట్టాడు. అమ్మ మల్లేశ్వరి కూడా నా కోసం పనులకు వెళ్లేది. అలా కుటుంబసభ్యుల సహకారంతో 2016లో మళ్లీ పవర్ లిఫ్టింగ్ వైపు వెళ్లా. చదువుకుంటూనే.. తొలుత హైదరాబాద్‌లోని ఉస్మానియాలో ఎల్ఎల్బీ చదివేందుకు వెళ్లినా.. ఇబ్బందుల దృష్ట్యా వెనుదిరగాల్సి వచ్చింది. అదే సమయంలో ఎవరో శ్రేయోభిలాషులు చెప్పడంతో వైవీయూలో పతకాలు సాధించిన క్రీడాకారులకు ఉచితంగా విద్యనందిస్తారని తెలిసి కృష్ణా జిల్లా నుంచి వైవీయూకు వచ్చాను. వైవీయూ పరిధిలోని బద్వేలులోని ఎస్.బి.వి.ఆర్. డిగ్రీ కళాశాలలో 2016లో డిగ్రీ బీఏ (హెచ్ఈపీ)లో చేరిపోయా. కళాశాల యాజమాన్యం ఉచిత విద్యతో పాటు నెలకు రూ.5 వేలు నా భోజన ఖర్చులకు వెచ్చిస్తూ చక్కటి ప్రోత్సాహం ఇస్తున్నారు. దీంతో పాటు మెరుగైన శిక్షణ కోసం చెన్నైలోని అంజుకర్ పవర్‌లిఫ్టింగ్ అకాడమీలో చేరా. కోచ్ ప్రోత్సాహంతో జాతీయస్థాయి పోటీలకు వెళ్లగలిగా. దక్షిణాఫ్రికాలో 2018 సెప్టెంబర్ 2 నుంచి 10వ తేదీ వరకు ప్రపంచ పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ పోటీలు నిర్వహించారు. దాదాపు 50 దేశాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. మనదేశం నుంచి 18 మంది వెళితే అందులో నేను ఉన్నా. జూనియర్స్ 84 కిలోల విభాగంలో పోటీపడ్డా. స్క్వాట్ విభాగంలో 190 కిలోలు, బెంచ్ ప్రెస్ విభాగంలో 110 కిలోలు, డెడ్‌లిఫ్ట్ విభాగంలో 182.5 కిలోలు ఎత్తి మొత్తం మీద 482.25 కిలోల బరువు ఎత్తి రజత పతకం సాధించా. ఈ పోటీలకు వెళ్లడానికి ముందు నా చేతిలో చిల్లిగవ్వ లేదు. నా గురించి తెలిసి చాలా మంది దాతలు ఆర్థికంగా సాయం చేశారు. పతకం సాధించాలి.. అప్పులూ తీర్చాలి.. ప్రస్తుతానికి నా ముందు రెండు లక్ష్యాలు ఉన్నాయి. ఒకటి కామన్వెల్త్లో దేశానికి పతకం తీసుకురావడం ఒక లక్ష్యమైతే నాకోసం మా కుటుంబసభ్యులు చేసిన అప్పులు తీర్చడం మరో లక్ష్యంగా భావిస్తున్నా. ప్రపంచ పతకం సాధించిన సమయంలో ప్రభుత్వం రూ.10 లక్షలు, డీఎస్పీ స్థాయి ఉద్యోగం ప్రకటించింది. అయితే అది ఇంకా చేతికి అందలేదు. వస్తే నా కష్టాలు తీరతాయని భావిస్తున్నా. నాగరాజు, సాక్షి, కడప వైవీయూ అధికారుల ప్రోత్సాహం అఖిల భారత అంతర్ విశ్వవిద్యాలయ పోటీల్లో పాల్గొనేందుకు సన్నద్ధమవుతున్న డొంకెన అనూషకు వైవీయూ అధికారులు అండగా నిలిచారు. ఆమె సాధన చేసుకునేందుకు ప్రపంచస్థాయి పరికరాలను అందుబాటులో ఉంచడంతో పాటు ఆమెకు ఉచితంగా వసతి కల్పించారు. దీంతో పాటు అఖిల భారత అంతర్ విశ్వవిద్యాలయ పవర్‌లిఫ్టింగ్ పోటీల్లో రాణించడంతో పాటు పతకం సాధిస్తే రూ. 30 వేలు నగదు ప్రోత్సాహకంతో పాటు నెలకు రూ.5 వేలు చొప్పున ఉపకార వేతనం ఇచ్చేందుకు వైవీయూ అధికారులు సిద్ధంగా ఉన్నారు. దీంతో పాటు పరీక్షల్లో సైతం 20 శాతం మేర మార్కులు కలిపి ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వైవీయూ అధికారులు స్పష్టం చేశారు’’ అని అనూష తెలిపారు. అనూష సాధించిన పతకాలు ►2012లో ఉదయ్‌పూర్‌లో నిర్వహించిన సబ్‌జూనియర్ పవర్‌లిఫ్టింగ్ పోటీల్లో స్వర్ణం. ►ఎస్జీఎఫ్ నేషనల్ పవర్‌లిఫ్టింగ్‌లో రజతం ►జూనియర్ నేషనల్ పవర్‌లిఫ్టింగ్‌లో రజతం ►2014, 15, 16 జూనియర్ నేషనల్స్‌లో వరుసగా స్వర్ణం సాధించి చాంపియన్‌గా గుర్తింపు ►2014 గోవాలో నిర్వహించిన సీనియర్ నేషనల్స్‌లో కాంస్యం. ►2014లో పఠాన్‌కోట్‌లో నిర్వహించిన ఆలిండియా అంతర్ విశ్వవిద్యాలయ పోటీల్లో కాంస్యం ►2016లో చండీగఢ్‌లో నిర్వహించిన ఆలిండియా అంతర్ విశ్వవిద్యాలయ పోటీల్లో కాంస్యం ►2016లో జమ్మూకశ్మీర్‌లో నిర్వహించిన ఫెడరేషన్ కప్‌లో కాంస్యం. ►2018లో శ్రీకాకుళం రాజాంలో నిర్వహించిన జూనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్ క్యాంపులో ప్రతిభ.. ప్రథమ స్థానంలో నిలవడంతో దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం. ►2018 సెప్టెంబర్ 2 నుంచి 10వ తేదీ వరకు దక్షిణాఫ్రికాలోని కొచెస్ట్రామ్లో నిర్వహించిన ప్రపంచ జూనియర్ పవర్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో రజత పతకం. -
నిశ్చితార్థం చేసుకుని ముఖం చాటేసి..
బంజారాహిల్స్: తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి నిశ్చితార్థం కూడా చేసుకొని ఇప్పుడు ముఖం చాటేశాడని యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే... బంజారాహిల్స్ రోడ్ నెం. 14లోని నందినగర్‌కు చెందిన సీహెచ్. అనూష(21), సమీపంలోని ఓం సిమ్రాన్ అనే దుస్తుల షాపులో మేనేజర్‌గా పని చేస్తోంది. ఏడాదిన్నర క్రితం ఆమెకు ఎస్ఆర్ నగర్‌కు చెందిన అరుణ్ సింగ్(23) అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని ఇటీవల ఇద్దరూ నిశ్చితార్థం పేరుతో పెద్దలకు తెలియకుండా దండలు మార్చుకున్నారు. గత సెప్టెంబర్ 23న బాధితురాలి కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరుపుకొని అదే నెల 25న పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. అయితే సెప్టెంబర్ 24న అరుణ్ సింగ్ ఆమె ఇంటికి వచ్చి పెళ్లి వాయిదా వేయాల్సిందిగా కోరాడు. అక్టోబర్ 20న మరోసారి ఆమె ఇంటికి వచ్చిన అరుణ్ తనకు రూ.10 వేలు కావాలని తీసుకెళ్లాడు. ఆ తర్వాత అరుణ్ మళ్లీ తిరిగి రాకపోగా ఆమెతో సంబంధాలు కూడా తెంచుకున్నాడు. ఆమె ఫోన్ నంబర్‌ను బ్లాక్ లిస్టులో పెట్టాడు. పెళ్లి మాట ఎత్తేసరికి ముఖం చాటేశాడంటూ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బంజారాహిల్స్ పోలీసులు అరుణ్సింగ్పై కేసు నమోదు చేసి శుక్రవారం అరెస్ట్ చేశారు. -
కథనం హైలైట్
‘పైసామే పరమాత్మ’ అన్నది సామెత. ఇప్పుడు ‘పైసా పరమాత్మ’ అనే పేరుతో ఓ సినిమా రూపొందింది. సంకేత్, సుధీర్, క్రిష్ణ తేజ, రమణ, అనూష, అరోహి నాయుడు, బనీష ముఖ్య తారలుగా విజయ్ కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఇది. లక్ష్మీ సుచిత్ర క్రియేషన్స్ పతాకంపై టి.కిరణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. కిరణ్ కుమార్ మాట్లాడుతూ– ‘‘యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది. కథపై నమ్మకంతో తెరకెక్కించాం. నేటి ట్రెండ్‌కి తగ్గట్టుగా విజయ్ కిరణ్ చక్కగా తీశారు. మా సినిమా మోషన్ పోస్టర్, ఫస్ట్‌లుక్‌కి మంచి స్పందన వచ్చింది’’ అన్నారు. ‘‘యూత్, ఫ్యామిలీస్ మెచ్చే ఆసక్తికర కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. కథనం హైలైట్‌గా ఉంటుంది. రామ్ పైడిశెట్టి సాహిత్యం, కనిష్క్ అందించిన సంగీతం సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయి’’ అని విజయ్ కిరణ్ అన్నారు. -
కోడుమూరు మిథాలీ
ప్రతిభ ఉంది.. గుర్తింపు లభించింది. ఉత్సాహం ఉంది.. ప్రోత్సాహం దొరికింది. లక్ష్యం ఉంది.. రాణింపునకు కొదవేముంది?! నిరుపేద కుటుంబంలో పుట్టి.. తల్లిదండ్రులు, గురువుల ప్రోత్సాహంతో గ్రామీణ క్రికెట్ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి, ఏపీ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తూ, తాజాగా ఇండియా రెడ్ జట్టుకు ఎంపికయ్యారు కర్నూలు జిల్లా కోడుమూరుకు చెందిన అనూష. అనూష తండ్రి వెంకటేష్ టీ దుకాణం నడుపుతుండగా, తల్లి లక్ష్మీదేవి ఇంటి పని చూసుకుంటోంది. అనూష నాల్గవ తరగతి చదువుతుండగా కోడుమూరు మహిళా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు డా.ఎ.రçఘురామిరెడ్డి అనూషలో క్రికెట్ పట్ల ఉన్న పట్టుదలను, ఉత్సాహాన్ని గమనించి శిక్షణ ఇచ్చారు. అనుకున్నట్లుగానే అనూష క్రికెట్లో రాణిస్తూ జిల్లా, రాష్ట్ర, దేశ స్థాయి క్రికెట్ పోటీల్లో అత్యద్భుతంగా రాణిస్తూ నేడు అండర్–23, సీనియర్ ఆంధ్ర మహిళా క్రికెట్ జట్లకు కెప్టెన్‌గా వ్యవహరిస్తూ ఇండియన్ రెడ్ జట్టుకు ఎంపికయ్యారు. క్రికెట్‌తో పాటు చదువును బాగా ఇష్టపడే అనూష కోడుమూరు సాయిరాం డిగ్రీ కళాశాలలో ప్రస్తుతం బీకామ్ సెకండియర్ చదువుతున్నారు. తన కూతురు దేశం తరపున ఆడితే చూడాలన్నదే నా కోరిక అని అనూష తండ్రి వెంకటేష్ అన్నారు. అందుకోసం ఎంత కష్టాన్నైనా భరిస్తానన్నారు. టీ దుకాణం నడుపుకుంటూ అందులో వచ్చే సంపాదనతోనే కుటుంబాన్ని పోషించుకుంటూ రెండవ కుమార్తె అయిన అనూష క్రికెట్లో రాణించేలా ప్రోత్సహిస్తున్నారు. ఆయన ఆశ, ఆకాంక్షల మేరకు అనూష కూడా ఇండియా మహిళా క్రికెట్ జట్టు తరపున ఆడాలన్న లక్ష్యంతోనే ముందుకు సాగుతున్నారు. ‘‘చిన్నప్పటి నుంచి క్రికెట్‌నే జీవితంగా భావించి ఆడుతున్నా. క్రికెట్ పరంగా, చదువుపరంగా నన్ను అన్ని విధాలా ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులు, మహిళా క్రికెట్ అసోసియేషన్ సభ్యుల సహకారం మరువలేనిది’’ అని అనూష అన్నారు. – హంపిరెడ్డి, ‘సాక్షి’, కోడుమూరు రూరల్ అనూష అత్యధిక స్కోర్లు అండర్ 16, అండర్ 19, రంజీ ట్రోఫీ, ఇండియన్ రైల్వేస్, రంజీ నుంచి సీనియర్ సౌత్ ఇండియా జట్టు, ఇండియా గ్రీన్ జట్ల తరపున ఆడిన అనూష ప్రతి ఈవెంట్లోనూ అత్యధిక పరుగులు సాధించి జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించింది. అండర్ 16 పోటీల్లో భాగంగా గోవా జట్టుపై 105 పరుగులు తీసింది. మహిళల అండర్ 19 సౌత్ జోన్ లీగ్ టోర్నమెంట్లో తమిళనాడు జట్టుపై 168 పరుగుల నాటౌట్, తొలి వికెట్‌కు మరో ఓపెనర్‌తో కలిసి 50 ఓవర్లలో 302 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జాతీయ రికార్డు సృష్టించింది. అండర్ 23 పోటీల్లో హైదరాబాద్ జట్టుపై 100 పరుగులు నమోదు చేసింది. జార్ఖండ్‌లో జరిగిన అండర్ 19 జాతీయ స్థాయి పోటీల్లో హర్యానాపై 124 పరుగులు, ఉత్తరప్రదేశ్‌పై 84పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. 2017 సంవత్సరంలో అండర్ 23 ఏపీ జట్టు తరపున గోవా జట్టుపై 115 పరుగులు, తమిళనాడు జట్టుపై 47 పరుగులు సాధించి జట్టును గెలిపించింది. సీనియర్ విభాగంలో ఏపీ జట్టు తరపున హిమాచల్‌ప్రదేశ్ జట్టుపై 65 పరుగులు చేసి జట్టు విజయానికి తోడ్పడింది. ఉత్సాహాన్ని గమనించాను చిన్నప్పుడు అనూషలో క్రికెట్‌పై ఉన్న ఇష్టాన్ని ఉత్సాహాన్ని చూసి ప్రోత్సహించా. రోజుకు ఐదు నుంచి ఆరు గంటల పాటు మైదానంలో కష్టపడి క్రికెట్ ప్రాక్టీస్ చేసేది. సాధన చేస్తే ఏదైనా సాధించవచ్చు అనే తత్వం అనూషలో చూశా. అనుకున్నట్లుగా క్రికెట్లో అద్భుతంగా రాణిస్తూ అనూష అంచెలంచెలుగా ఎదిగి నేడు ఆంధ్ర జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తూ, ఇండియా రెడ్ జట్టుకు ఎంపికైంది. – డా. రఘురామిరెడ్డి,మహిళా క్రికెట్ తాలూకా అసోసియేషన్ అధ్యక్షుడు, కోడుమూరు -
ప్రేమించడానికి అర్హతలేంటి?
రోషన్, అనూష జంటగా నాగేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘నువ్వెందుకు నచ్చావె శైలజ’. అనుపమ ఆర్ట్స్ పతాకంపై వి.రామకృష్ణ నిర్మిస్తోన్న ఈ సినిమా సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత సి.కల్యాణ్ క్లాప్ ఇవ్వగా, కొమర వెంకటేశ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. కృష్ణమోహన్ గౌరవ దర్శకత్వం వహించారు. నాగేశ్వరరావు మాట్లాడుతూ– ‘‘ఇదొక యాంటీ లవ్ స్టోరీ. ఎలా ప్రేమించాలి.. ఎలా ప్రేమించకూడదన్న కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోంది. ప్రేమించాలంటే ఉండాల్సిన అర్హతలను ఇందులో చూపిస్తున్నాం. నాలుగు పాత్రల మధ్య ఇంట్రెస్టింగ్ కథనంతో ఈ సినిమా ఉంటుంది. నేటి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తున్నాం’’ అన్నారు. ‘‘మా తొలి సినిమానే ఇలాంటి మంచి కథతో చేస్తున్నందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు రోషన్, అనూష. ‘‘కథ నచ్చడంతో ఈ సినిమా చేస్తున్నా. మంచి టీమ్ కుదిరింది’’ అన్నారు నిర్మాత రామకృష్ణ. బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, సాయాజీ షిండే, ఆశిష్ విద్యార్థి, ధనరాజ్, కాదంబరి కిరణ్, సన, మణిచందన, మణి, సూరజ్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి సంగీతం: సాయి కార్తీక్, కెమెరా: యం.జోషి. -
అనూష.. ఏమైపోయింది!
పెనమలూరు : యనమలకుదురు గ్రామానికి చెందిన బాలిక అనూష అదృశ్యం మిస్టరీగా ఉండి పోయింది. ఆమె జాడ కోసం పోలీసులు, రెవెన్యూ అధికారులు వారం రోజులుగా గాలిస్తున్నా ఆచూకీ తెలియలేదు. ఘటన వివరాల్లోకి వెళితే.. యనమలకుదురుకు చెందిన నేలటూరి దుర్గ (36) అపార్టుమెంట్లలో పని చేస్తుంటుంది. భర్త నారాయణరావు ఆమెను వదిలేయడంతో కొద్ది కాలంగా మచ్చా దుర్గాప్రసాద్ (25) తో కలిసి ఉంటోంది. అయితే దుర్గకు అనూష (15) అనే కుమార్తె ఉంది. ఆమె విజయవాడ మొగల్రాజపురంలో 9వ తరగతి చదువుతోంది. ఆమెను స్కూల్ నుంచి తీసుకు వస్తానని దుర్గాప్రసాద్ గత నెల 27వ తేదీన బైక్‌పై వెళ్లాడు. అయితే అతను ఇంటికి తిరిగి రాలేదు. అతనితో పాటు అనూష కూడా ఇంటికి రాలేదు. అయితే అతని బైక్, సెల్‌ఫోన్ యనమలకుదురు చిన్న వంతెన వద్ద దొరికాయి. ఇద్దరూ ఎటు వెళ్లారో తెలియకపోవడంతో అనూష తల్లి దుర్గ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేశారు. కాల్వలో దుర్గాప్రసాద్ శవం.. కాగా చోడవరం గ్రామ పరిధి కేఈబీ కాల్వలో దుర్గాప్రసాద్ శవం లభ్యమైంది. అయితే అనూష ఆచూకీ మాత్రం ఇప్పటికీ తెలియలేదు. దీంతో అనూష జాడ కోసం రెస్క్యూ టీంను రంగంలోకి దించారు. వారు బోట్ల సహాయంతో కాల్వల్లో గాలించారు. అయినా అనూష జాడ తెలియలేదు. ఇప్పటికీ ప్రత్యేక బృందాలు కాల్వ దిగువ ప్రాంతాల్లో గాలిస్తున్నాయి. అయినా, ఆమె ఆచూకీ తెలియడం లేదు. బాలిక ఏమైనట్లు..? స్కూల్‌కు వెళ్లిన అనూష తిరిగి ఇంటికి కాకుండా ఏమైపోయిందనేది పెద్ద మిస్టరీగా మారింది. ఆమెను స్కూల్ నుంచి తీసుకు వస్తానని వెళ్లిన దుర్గాప్రసాద్ కాల్వలో శవమై కనిపించాడు. అనూష ఎక్కడ ఉంది తెలియడం లేదు. కాల్వలో దుర్గాప్రసాద్ శవం దొరకటంతో అనూష కూడా కాల్వలో దూకిందేమోనని పోలీసులు భావిస్తున్నారు. అసలు వీరు కాల్వలో ఎందుకు దూకాల్సి వచ్చిందనే ప్రశ్నకు పోలీసులకు సమాధానం దొరకటం లేదు. ఇప్పటికే అనూష తల్లిని పోలీసులు పలు దఫాలుగా విచారణ చేశారు. ఆమె కూడా ఏమీ చెప్పలేకపోతోంది. కేసు విచారిస్తున్నాం.. అనూష కేసును అన్ని కోణాల నుంచి విచారణ చేస్తున్నాం. దుర్గాప్రసాద్ శవం కాల్వలో దొరకటంతో అనూష కూడా కాల్వ లో దూకి ఉండవచ్చని వెతుకుతున్నాం. దుర్గాప్రసాద్ ఎందుకు చనిపోయాడు, అనూష ఏమైపోయిందనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. – దామోదర్, సీఐ -
వివాహిత అనుమానాస్పద మృతి
వెంకటగిరి: ఓ వివాహిత అనుమానాస్పద రీతిలో మృతిచెందిన ఘటన పట్టణంలోని బొప్పాపురం సాలెకాలనీలో సోమవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరు మండలం బుడ్డగుంటపల్లికి చెందిన శ్రీరాములు, సావిత్రిల కుమార్తె అనుష (26)కు పట్టణంలోని బొప్పాపురం సాలెకాలనీకి చెందిన పసుపులేటి కిషోర్‌తో తొమ్మిది సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి అనీష్, చక్రధర్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వేసవి సెలవులకు పిల్లలు బుడగుంటపల్లికి వెళ్లారు. దీంతో ఇంట్లో అనుష, కిషోర్‌లు మాత్రమే ఉంటున్నారు. సోమవారం ఉదయం తన భార్య ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని కిషోర్ కేకలు వేశాడు. చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు. స్థానికులు ద్వారా విషయం తెలుసుకున్న అనుష కుటుం బసభ్యులు, బంధువులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కిషోర్‌ను ఎస్సై కొండపనాయుడు విచా రించగా ఆదివారం రాత్రి తాను, అనుష ఒకేచోట నిద్రించా మని, తెల్లవారుజామున లేచి చూ సేసరికి ఆమె ఇం ట్లో ఉరివేసుకుని ఉందని చెప్పాడు. మృతదేహాన్ని పోలీసులు పరిశీలించగా వీ పు భాగంలో గాయాలు, గొంతు వద్ద గాట్లు ఉన్నా యి. దీంతో వారు కిషోర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా తమ కుమార్తె మృతిపై అనుమానం ఉందని ఆమె తండ్రి శ్రీరాములు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ వ్యవహారంపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్‌మర్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతురాలి కు మారులు విలపించడం స్థానికులను కలచివేసింది. -
అనూషను బతికించండి
చిట్యాల: బ్లడ్ క్యాన్సర్‌తో ఓ వెటర్నరీ విద్యార్థిని చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. మండల కేంద్రానికి నాగుల రాజమణి, రమేష్ దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. రెండో కుమార్తె అనూష(23) హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ పశువైద్య కళాశాలలో ఫైనలియర్ చదువుతోంది. ఉన్నట్టుండి అనూష గత నెల రోజుల కింద అనారోగ్యానికి గురైంది. హన్మకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యపరీక్ష చేయించగా బ్లెడ్ క్యాన్సర్ ఉందని నిర్ధారించారు. దీంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. అపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు. రూ. 40 లక్షలు ఉంటే ఆపరేషన్ చేసి బ్రతికిస్తామని వైద్యులు చెప్పినట్లు తల్లిదండ్రులు రాజమణి, రమేష్ తెలిపారు. మానవతావాదులు, దాతలు స్పందించి అనూషను బతికించాలని వారు వేడుకుంటున్నారు. చిట్యాల ఆంధ్రాబ్యాంకులో తన అకౌంట్ నంబర్ 0096100250250197కు తమ ఆర్థిక సాయం పంపించాలని రమేష్ ప్రాధేయపడుతున్నాడు. -
ఒంటరి మహిళలే టార్గెట్
జోగిపేట(అందోల్): వరుస చైన్ స్నాచింగ్‌లతో జోగిపేట పట్టణ ప్రజలు బెంబేలెత్తుతున్నారు. స్థానిక వాసవీనగర్ కాలనీలో గత నెల 26న అనూష అనే మహిళ మెడలో నుంచి చైన్‌ను బైక్‌పై వచ్చి ఎత్తుకెళ్లిన సంఘటన మరవకముందే ఆదివారం ఉదయం 8:30 ప్రాంతంలో మూడు చోట్ల ఒకేసారి చైన్ స్నాచింగ్ సంఘటనలు జరిగాయి. ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లే మహిళలనే టార్గెట్‌గా చేసుకొని చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్నారు. ఘటనలు జరిగిన తీరును గమనిస్తే కేవలం 5 నిమిషాల వ్యత్యాసంతో జరగడంతో వేర్వేరు వ్యక్తులు ఈ సంఘటనలో పాల్గొన్నట్లు అర్థమవుతుంది. అంతే కాకుండా ఒక బైక్ నడిపే వ్యక్తి క్యాప్ పెట్టుకోగా, మరో ఘటనలో టోపీ పెట్టుకోలేదని బాధితులు చెబుతున్నారు. వెనుక ఉన్న వారు మాత్రం ముఖానికి కర్చీఫ్‌ను కట్టుకున్నట్లు ప్రత్యక్ష సాక్షుల కథనం. ఒక ముఠానే జోగిపేటను ఎంచుకొని ఈ సంఘటనలకు పాల్పడుతోందని స్థానికులు భావిస్తున్నారు. వారం రోజుల్లో నాలుగు సంఘటనలు జరగడంతో పోలీసులు కూడా విమర్శలకు గురవుతున్నారు. భయం...భయం జోగిపేటలో ఆదివారం జరిగిన సంఘటన దావానలంలా వ్యాపించడంతో మహిళలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా కొందరు మహిళలు భయంతో బంగారు గొలుసులను ఇంట్లో పెట్టి రోల్డ్‌గోల్డ్ వేసుకుంటున్నారు. పోలీసులు వీధుల్లో మఫ్టీలో తిరిగి ఇలాంటి నేరాలపై నిఘా ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. పని చేయని సీసీ కెమెరాలు పాఠశాల యాజమాన్యం బయట సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినా ఆదివారం కావడంతో వారు బంద్ చేసి ఉంచారు. ఎస్ఐ రమణ పోలీసు సిబ్బందితో వచ్చి పరిశీలించారు. పక్కనే ఉన్న శ్రీ బాలాజీ ఆసుపత్రి కెమెరాలను పరిశీలించినా లాభం లేకుండా పోయింది. పోలీస్ స్టేషన్ వైపు పారిపోయినట్లు బాధితులు చెప్పడంతో స్టేషన్ ముందు ఉన్న కెమెరాలో పరిశీలించాలని రజకులు కోరగా వైరు తెగిపోయిందని చెప్పడంతో వారంతా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీంతో వారంతా పోలీస్ స్టేషన్ ముందు రాస్తారోకో చేశారు. ఎస్పీకి సమాచారం ఇచ్చిన ఎంపీ జోగిపేటలో రజకులు రాస్తారోకో చేస్తుండడంతో అదే సమయంలో అటువైపుగా వెళుతున్న జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ వాహనం కూడా నిలిచిపోయింది. బాధితులంతా ఎంపీ వద్దకు వెళ్లి జరిగిన విషయాన్ని తెలియజేశారు. బాధితురాలు లక్ష్మి కూడా ఎంపీ వద్దకు వెళ్లి తనకు న్యాయం జరిగేలా చూడాలని వేడుకుంది. పోలీసులు తగిన చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతూ ఎస్పీకి ఫోన్లో ఎంపీ సమాచారం ఇచ్చారు. స్థానిక పోలీసు అధికారుల ద్వారా సంఘటనల వివరాలను ఎస్పీ తెలుసుకున్నట్లు సమాచారం. రెండు తులాల చైన్ ఎత్తుకెళ్లారు వాసవీనగర్ కాలనీలో బైకుకు నేను సైడ్ ఇవ్వడానికి పక్కకు జరిగిన. ఆ బైకు నా దగ్గర వరకు వచ్చి నా మెడలోని రెండు తులాల బంగారు గొలుసును తెంపుకొని పోలీస్ స్టేషన్ వైపే పారిపోయాడు. బైక్ నడిపే వ్యక్తిది చిన్న వయస్సు. ఎర్రగా ఉన్నాడు. వెనుక ఉన్న వ్యక్తి ముఖానికి దస్తీ కట్టుకట్టుకొని ఉన్నాడు. కొన్ని క్షణాల్లోనే ఇదంతా జరిగిపోయింది. ఆ వ్యక్తిని చూస్తే గుర్తు పడతాను. పోలీసులు నా గొలుసు నాకు ఇప్పించాలి. ఎంపీ గారికి కూడా నా బాధ చెప్పుకున్నా. నేను రూ. 60వేలు ఎప్పుడు సంపాదించుకోగలను. –గంగన్నోల్ల లక్ష్మి (బాధితురాలు), జోగిపేట వెనుక నుంచి వచ్చి లాగారు నేను మా అత్తకు టిఫిన్ ఇచ్చి ఇంటికి తిరిగి వస్తున్నా. వెనుక నుంచి బైక్ వస్తుండడంతో పక్కకు జరిగి తోవ ఇస్తుండగా నా దగ్గరకు వచ్చి చైన్‌ను పట్టుకున్నారు. నేను కూడా చైన్‌ను పట్టుకొని అరవడంతో చుట్టు పక్కల వాళ్లు వచ్చారు. వాళ్లను చూసి నన్ను తోసేసి పారిపోయారు. గొలుసు తెగిపోయింది. నేను గర్భవతిని కావడంతో చురుకుగా కదలలేకపోయాను. కాలనీ వాళ్లు రావడంతో నా గొలుసు నాకు దొరికింది. పోలీసులు వీరిపై నిఘా పెట్టాలి. – రజిత (బాధితురాలు), జోగిపేట చైన్ స్నాచింగ్ ఘటనలపై నిఘా జోగిపేటలో జరిగిన చైన్‌స్నాచింగ్ ఘటనలపై నిఘా ఏర్పాటు చేస్తాం. ఎవరైనా పట్టణంలో అనుమానాస్పదంగా తిరుగుతుంటే 9490619661, 9440901831 నంబర్లకు సమాచారం ఇవ్వాలి. ప్రధాన రహదారుల పక్కన ఉన్న వ్యాపారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. ప్రధాన చౌరస్తాల్లో ఏర్పాటు చేసేందుకు వ్యాపారులు పోలీసులకు సహకరించాలి. వారం రోజుల్లో నాలుగు సంఘటనలపై విచారణ చేపడతాం. వాహనాలను బాధితులు గుర్తిస్తే బాగుండేది. ఇలాంటి సంఘటనలను పునరావృతం కాకుండా చూస్తాం. ప్రజలు కూడా మాకు సహకరించాలి. – తిరుపతి రాజు, సీఐ జోగిపేట -
వివక్షే అతి పెద్ద నేరం
సాక్షి, సిద్దిపేట: ‘పిల్లలకు ఎంత ఆస్తి ఇవ్వాలి.. వారి భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దాలి.. అని తల్లిదండ్రులు ఆలోచిస్తుంటారు. కానీ, మా అమ్మానాన్నలు అందుకు విరుద్ధం. తమ వారసులను ఎలా తయారుచేయాలో ఆలోచించారు. స్థిరచరాస్తులకే కాదు.. ఇంట్లోని గది నిండా ఉండే పుస్తకాలకూ వారసులు ఉండాలని భావించారు. ఈక్రమంలో అమ్మానాన్నల నుంచి అందిపుచ్చుకున్న న్యాయశాస్త్ర పరిజ్ఞానం, భర్త ప్రోత్సాహం.. నన్ను న్యాయమూర్తిగా నిలబెట్టింది. అమ్మే నాకు ఆదర్శం.. నాన్న పుస్తకాలకు వారసురాలిగా నా న్యాయవాద వృత్తిని ప్రారంభించా..’ అని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి గూడ అనూష తెలిపారు. అమ్మానాన్నల కలలను సాధించడం నుంచి మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తిగా సక్సెస్ అయిన వైనం.. తల్లిదండ్రుల పెంపకం.. మహిళా సాధికారత.. బాధ్యతలు మొదలైన అంశాలపై ఆమె సోమవారం ‘సాక్షి’తో మాట్లాడారు.. ఆమె మాటల్లోనే వివరాలు.. గది నిండా పుస్తకాలే.. మాది వరంగల్ పట్టణం. అమ్మ అమృతమ్మ, నాన్న యాదగిరిశర్మ న్యాయవాదులే. చిన్నప్పటి నుంచి ఇంటి వద్ద చట్టాలు, న్యాయాలు, కేసులు పరిష్కారాలు మాకు వినిపించేవి. కొత్త పుస్తకాలు వస్తే చాలు అమ్మానాన్నలు పోటీ పడి కొని మరీ ఇంటికి తెచ్చేవారు. ఇలా ఇంటి నిండా పుస్తకాలు చేరాయి. అయితే, వాటికి వారసులు ఎవరు? అనేది వారి ప్రశ్న. నేను, తమ్ముడు రవిశర్మ.. ఇద్దరం ఇతర చదువులతో పాటు న్యాయవాద కోర్సు పూర్తి చేశాం. అమ్మానాన్నలు మమ్మల్ని జడ్జీలుగా చూడాలని అనుకునేవారు. ఈ విషయం అమ్మ నాకు చెబుతూ ఉండేది. వారి కోరిక తీర్చడంతో పాటు పుస్తకాలకు వారసురాలిగా ఉంటానని ఏదో సరదాగే చెప్పేదాన్ని. కానీ, అవే మాటలు ఇప్పుడు నిజమయ్యాయి. నా ఆలోచనకు భర్త ప్రోత్సాహం నా భర్త అనికుమార్ సాఫ్ట్వేర్ ఇంజినీర్. సమాజాన్ని చదివిన మనిషి. నేను బీటెక్ చదివి లా కోర్సు చేసిన వెంటనే వివాహమైంది. ఆయనది బెంగుళూర్లో ఉద్యోగం. మా కుటుంబ పరిస్థితి.. వాతావరణం చూసిన ఆయన న్యాయమూర్తి కావాలనే నా ఆలోచనకు ఏనాడు అడ్డు చెప్పలేదు. నన్ను మరింత ప్రోత్సహించారు. నా పెద్ద కుమారుడు సాయిసిద్దార్థ 18 నెలల వయస్సునప్పుడు ఆయాతో కలిసి హైదరాబాద్‌కు కోచింగ్‌కు వచ్చా. నేనెలా చదువుతున్నానో? ఆయన ప్రతిరోజు ఆరా తీసేవారు. నాకు ధైర్యం చెప్పేవారు. ఆయన ఇచ్చిన సపోర్ట్ వల్లే నేను న్యాయమూర్తి పోటీ పరీక్షలో రాష్ట్రంలో ఐదో ర్యాంక్ సాధించగలిగాను. సంస్కృతి, సంప్రదాయాలతో ఆత్మవిశ్వాసం సంస్కృతి, సంప్రదాయాలు మనలోని ఆత్మవిశ్వాసాన్ని, శక్తిని పెంచుతాయి. పూజలు, ఉపవాసాలు, పండుగలు ఏకాగ్రత పెంచేందుకు ఉపయోగపడుతాయి. వాటిని ఏనాడు విస్మరించవద్దు. అయితే, అందులో ఉన్న మంచిని మాత్రమే మనం స్వీకరించాలి. సర్వమానవాళి అభివృద్ధికి దోహదపడేందుకు ఎందరో మహానుభావులు చెప్పిన మాటలు, సూక్తులు స్వీకరించాలి. వాటిని మన జీవన మనుగడకు, తోటివారికి సహాయం చేసేందుకు వినియోగించాలి. అలాగే కట్టుబాట్లు, సామాజిక ఆచారాల ద్వారా ఇతరులను నొప్పించడం, ఇబ్బంది పెట్టకూడదు. అమ్మే నా రోల్ మోడల్ అమ్మే నా రోల్ మోడల్. పేరెంట్స్ ఇద్దరు న్యాయవాదులే. వారి కుటుంబ పరిస్థితి.. పడిన కష్టాలు.. సమాజంలో గుర్తింపులు.. మొదలైన విషయాలు మాకు ఎప్పుడు చెబుతుండేది. వారి న్యాయమూర్తుల గురించి చెబుతూ.. వారిచ్చిన తీర్పులు చర్చించే సమయంలో మేము కూడా న్యాయమూర్తులు అయితే బాగుంటుందని నాన్న పదేపదే చెప్పేవారు. ఆయన మాటలే నన్ను న్యాయమూర్తి పరీక్ష రాసేందుకు సిద్ధం చేశాయి. దీనికి తోడు స్వామి వివేకానంద ‘హన్మంతుడు’ పుస్తకం, పాల్కో రచించిన ‘ది ఆల్కమిస్ట్’ పుస్తకాలు నన్ను ప్రభావితం చేశాయి. సమయం దొరికనప్పుడు పుస్తకాలు చదవడం నా హాబీ. అందులో మనకు కావాల్సిన అంశాలుంటే రాసుకుంటాను. వివక్ష ఎక్కడ ఉన్నా నేరమే.. వివక్ష ఎక్కడ ఉన్నా నేరమే. నేను, తమ్ముడు ఇద్దరం పోటీ పడి చదివేవాళ్లం. మా పెంపకంలో ఎక్కడా తల్లిదండ్రులు వివక్ష చూపలేదు. తల్లిదండ్రులు తమ బిడ్డలను సమానంగా చూడాలి. ప్రస్తుతం మగవారి కన్నా ఆడపిల్లలే బాధ్యతగా చదువుతున్నారు. వారు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారు. ఇంకెందుకు ఈ వివక్ష. పిల్లలు తమ తల్లిదండ్రులను రోడ్ల మీద వదిలేసిన సంఘటనలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. వీరి రక్షణ కోసం ప్రభుత్వం చట్టాలు చేసింది. అంతేకాదు తల్లిదండ్రుల బాధ్యతలు విస్మరించిన వారిపైనా చట్టం కఠినంగా వ్యవహరిస్తుంది. పట్టుదల ఉంటే విజయం ఆడపిల్లలు.. మహిళలు ఎక్కడా తక్కువ కాదు. మేం తక్కువ అనే భావన తీసేయాలి. ఆడవాళ్లను భూమాతతో పోల్చుతారు. అంటే అంత సహనం ఉంటుందని అర్థం. అందుకే ఓపికతో పెంచుకోవాలి. లక్ష్యం ఎన్నుకొని.. దానిని సాధించే వరకు శ్రమించాలి. అంతేకానీ, నిరాశతో ఉంటే విజయం సాధించలేవు. కుటుంబసభ్యుల సహకారం తీసుకోవాలి. తల్లిదండ్రులు, పుట్టిన ఊరి రుణం తీర్చుకోవాలి. అంతేకాదు ఎన్నుకున్న రంగంలో రాణించాలి. -
ఆడపిల్ల భారమన్నారు..!
హిమాయత్‌నగర్: ఆ బాలికలు ఎన్నో ఆశలు... ఆశయాలతోచదువుకుంటున్నారు. భవిష్యత్తుపై ఆకాంక్షలతో కలల సౌధాన్ని నిర్మించుకున్నారు. కానీ... ఆ ఆశలు అడియాసలయ్యాయి. కలల సౌధం కుప్పకూలింది. ఆర్థిక ఇబ్బందులు అడ్డొచ్చాయి. ఇక ఈదరిద్రాన్ని మేం భరించలేమని కుటుంబసభ్యులు తీసుకున్ననిర్ణయానికి ఆ చిన్ని హృదయాలు తల్లడిల్లాయి. బాలల హక్కుల సంఘం సహాయంతో బాల్య వివాహం బారి నుంచి బయటపడిన ఆ చిన్నారులు... అవమానాలను దిగమింగి, ఆటుపోట్లను అధిగమించి ఇప్పుడు చదువు, ఆటల్లో రాణిస్తున్నారు. చదువూ సంధ్య.. ‘తమ్ముడు.. నీ కూతుర్ని ఇంకెంత కాలం చదివిస్తావ్ రా? చదివించింది చాలు... ఇక పెళ్లి చేసేయ్. మంచి సంబంధం చూద్దాం. ఈ దరిద్రాన్ని ఎన్ని రోజులు ఇంట్లో పెట్టుకుంటావ్. ’ – ఇదీ సంధ్యకు మేనత్త నుంచి ఎదురైన పరిస్థితి హయత్‌నగర్ మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన వగ్లాపురం మల్లేష్, సూర్యకళల పెద్ద కుమార్తె సంధ్య. ‘మాకు ఆస్తి లేదు. పెళ్లి చేసి నన్ను వదిలించుకోవాలని మా మేనత్త, మామయ్యలు.. మా నాన్నకు చెప్పారు. 2016 ఏప్రిల్ 20న వివాహం నిశ్చయించారు. బాలల హక్కుల సంఘం ప్రతినిధులు అడ్డుకొని హోమ్‌కు తీసుకెళ్లారు. అయితే పెళ్లి ఆగిపోవడంతో మనస్తాపానికి గురై నాన్న చనిపోయారు. బంగారం లాంటి మనిషిని నువ్వే చంపేశావ్.. చదువుకొని ఏం సాధిస్తావ్ అంటూ సూటిపోటి మాటలతో నన్ను కుంగదీశార’ని ఆవేదన వ్యక్తం చేసింది సంధ్య. తిట్టినోళ్లే మెచ్చుకున్నారు... ‘నాకు ఏప్రిల్ 3న ఎంగేజ్మెంట్ నిశ్చయించారు. అప్పుడు పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. పెళ్లి చేసుకుంటాను అంటేనే.. నువ్వు పరీక్షలకు వెళ్లేది అంటూ ఇంట్లో షరతు పెట్టారు. నేను ఇప్పుడే పెళ్లి చేసుకోనని సోషల్ పేపర్–1 పరీక్ష రాయలేదు. బాలల హక్కుల సంఘం కృషితో సోషల్ పేపర్–2 రాశాను. ఒక్క పేపర్ రాయకపోయినప్పటికీ 7.5 జీపీఏ సాధించాను. అప్పుడు అందరూ మెచ్చుకున్నారు. నన్ను తిట్టిన వాళ్లే.. నీలో ప్రతిభ ఉందని ప్రోత్సహించారం’టూ చెప్పింది సంధ్య. ఈమె ప్రస్తుతం బీఎన్‌రెడ్డినగర్‌లోని ఎన్ఆర్ఐ కళశాలలో ఇంటర్ చదువుతోంది. ఆటా అనూష... ‘తల్లి.. మీ నాన్న మిమ్మల్ని వదిలేశాడు. వేరే ఆమెతో ఉంటున్నాడు. అన్నీ చూసుకోవాల్సిన మీ నాన్న.. మిమ్మల్ని మాపై వదిలేశాడు. అందుకే నీకు పెళ్లి చేసేస్తాం. మా బరువు, బాధ్యత తీరిపోతుంది’ – ఇదీ అనూషకు అమ్మమ్మ–తాతయ్యల నుంచి ఎదురైన పరిస్థితి సరూర్‌నగర్‌లో నివసించే బొడ్డుపల్లి శ్రీను, అరుణల కుమార్తె అనూష. శ్రీను లారీ డ్రైవర్, అరుణ గృహిణి. ‘మా నాన్న మమ్మల్ని వదిలేశాడు. వేరే ఆమెతో కాపురం పెట్టాడు. ఇల్లు గడవడం కూడా కష్టమవడంతో నాకు త్వరగా పెళ్లి చేసి పంపేయాలనే ఆలోచన అమ్మమ్మ, తాతయ్యలకు వచ్చింది. గతేడాది మే 4న వివాహం చేసేందుకు సిద్ధమవగా, బాలల హక్కుల సంఘం ప్రతినిధులు అడ్డుకున్నారు. కాచిగూడలోని హోమ్‌లో 20 రోజులు ఉన్న తర్వాత ఇంటికి తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను. పెళ్లి చేసుకోకుండా ఇంకెంత కాలం ఉంటావే.. అంటూ తిట్టారు. వాటన్నింటినీ దిగమింగుతూ కాలేజీకి వెళ్తున్నాను. ప్రస్తుతం ఇంటర్ చదువుతున్నాన’ని వివరించింది అనూష. క్రికెట్, రగ్బీలో మేటి.. ‘నాకు ఆటలంటే ఇష్టం. మా పీఈటీ రాఘవరెడ్డి సార్ నన్నెంతో ప్రోత్సహించారు. క్రికెట్ బాగా ఆడడం నేర్చుకున్నాను. ఇప్పుడు స్టేట్ టీమ్‌లో నేనొక ఫాస్ట్ బౌలర్‌ని. మధ్యప్రదేశ్, గుజరాత్, మన రాష్ట్రంలోని గుర్రంగూడలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచాను. భారత్ తరఫున అంతర్జాతీయ స్థాయిలో ఆడాలనేది నా కోరిక. క్రికెట్‌తో పాటు రగ్బీ అంటే కూడా నాకిష్టం. ఇటీవల నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నాన’ని చెప్పింది. -
పెళ్లి నుంచి తప్పించుకొని.. జాతీయ జట్టుకు ఆడుతూ
సాక్షి, హైదరాబాద్ : బాల్యవివాహం నుంచి తప్పించుకున్న హైదరాబాద్‌కు యువ క్రీడాకారిణి నేడు జాతీయ రగ్బీ జట్టుకు ఎంపికైంది. వివరాల్లోకి వెళ్తే గత ఏడాది హైదరాబాద్‌కు చెందిన బి అనూష అనే విద్యార్థి పదో తరగతి చదువుతున్న సమయంలో పెళ్లి చేయాలని కుటుంబసభ్యులు నిర్ణయించారు. వివాహం ఇష్టం లేని అనూష చైల్డ్‌లైన్ అధికారులను ఆశ్రయించింది. పెళ్లికి పదిరోజుల ముందు చైల్డ్‌లైన్ అధికారులు, స్థానిక పోలీసుల సహకారంతో అనూష వివాహాన్ని అడ్డుకున్నారు. బాల్య వివాహం నేరమౌతుందని తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. బాల్యవివాహం నుంచి బయటపడిన అనూష ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతోంది. అంతే కాకుండా మహిళల రగ్బీఆటలో ప్రతిభ చూపింది. జాతీయ జట్టుకు ఎంపికైంది. అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడటం తన లక్ష్యం అని అనూష తెలిపింది. గతంలో మధ్యప్రదేశ్ ఇండోర్‌లో జరిగిన మహిళల అండర్-19 క్రికెట్ టోర్నమెంట్లో తెలంగాణ తరపున ఆడింది. -
ప్రియుడు మోతీలాలే హత్య చేశాడు
-
అనూషలో మార్పు భరించలేక చంపేశా..
సాక్షి, హైదరాబాద్ : అనూష తాను 2013 నుంచి ప్రేమించుకున్నాం అని ఆమెను హత్య చేసిన ప్రియుడు మోతీలాల్ చెప్పాడు. తమ ప్రేమ వ్యహారంపై తమ ఇంట్లో ఒప్పకోక పోయినా అనూష ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకునేందుకు నిశ్చితార్థం చేసుకున్నామని తెలిపాడు. అనూష చదువుకు అయ్యే ఖర్చు కూడా తానే భరించానని, కానీ, ఆమె ప్రవర్తనలో గత కొద్ది రోజుల్లో చాలా మార్పు వచ్చిందని చెప్పాడు. అనూష ఫోన్ పరిశీలిస్తే చాలామందితో చాటింగ్ చేసినట్లు గుర్తించానని, తన స్నేహితుడు కూడా అనూషతో చాటింగ్ చేయడంతో తనకు అనుమానం ఎక్కువైందన్నాడు. ఈ వ్యవహారంపై అనూషను నిలదీయడంతోనే తమ ఇద్దరి మధ్య గొడవ జరిగిందని, తాగిన మైకంలో క్షణికావేశంతో అనూషను బండ రాయితో మోది హత్య చేశానని అంగీకరించాడు. కాగా, ఎల్బీ నగర్ డీసీపీ కార్యాలయం ముందు అనూష బందువులు ఆందోళనకు దిగారు. తమ కూతురిని హత్య చేసింది మోతిలాల్ ఒక్కడే కాదని, వారి ముగ్గురు అన్నదమ్ములు ప్రమేయం ఉందని వారు ఆరోపిస్తున్నారు. మలక్‌పేటలో పని చేసే ఎస్ఐ రామ్ లాల్‌కు ఈ హత్య కేసులో ప్రమేయం ఉందని, ఆయనతోపాటు చిన్నా, శంకర్ ను కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అనూష గర్భవతి అనే అంశంపై మరోసారి పోస్ట్‌మార్టం చేస్తే నిజానిజాలు బయటకొస్తాయని వారు కోరుతున్నారు. -
ప్రియుడే అనూషను హత్య చేశాడు
-
‘అనూషను హత్యచేసింది ఆమె ప్రియుడే’
సాక్షి, హైదరాబాద్: నగరంలోని హయత్ నగర్ శివారు ప్రాంతాల్లో జరిగిన యువతి అనూష హత్య కేసును పోలీసులు చేదించారు. అనూష తల్లిదండ్రులు అనుమానించినట్లుగానే ఆమె ప్రియుడు మోతీలాలే ఈ హత్యకు పాల్పడ్డాడు. గత తొమ్మిది నెలల కిందటే అనూషతో మోతీలాల్‌కు నిశ్చితార్థంకాగా ఆమెపై అనుమానం పెంచుకొని ఈ హత్య చేశాడని పోలీసులు తెలిపారు. ఐదు రోజుల తర్వాత ఈ కేసును పోలీసులు పరిష్కరించారు. నల్లగొండ జిల్లా దేవరకొండ సమీపంలోని కొండాభీమన్ పల్లి గ్రామానికి చెందిన అనూష బీటెక్ పూర్తి చేసింది. తండ్రి లేకపోయినా ఆమె తల్లే కష్టపడి చదివించింది. ఈ క్రమంలోనే ఉన్నత చదువుతో ఉద్యోగం సంపాధించాలని అనూష హైదరాబాద్‌కు వచ్చింది. నగరంలోని ఆమె సోదరి ఇంట్లోనే ఉంటూ పై ఉద్యోగం కోసం చదువుతోంది. ఈ క్రమంలోనే నాగర్ కర్నూల్‌కు చెందిన మోతిలాల్ అనే వ్యక్తితో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే, ఇరు కుటుంబాలు అంగీకరించి వారికి నిశ్చితార్థం చేశారు. అయితే, తాను ఉద్యోగం సాధించాకే పెళ్లి చేసుకుంటానని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే హయత్ నగర్‌లోని మిథాలి నగర్లో ఉన్న తన సోదరి ఇంటికి వచ్చి అక్కడే ఉంటుండగా దారుణ హత్యకు గురైంది. పక్కా పథకం ప్రకారం అనూషను మోతీలాల్ హత్య చేశాడు. ఓ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఆ రోజు రాత్రి ఉండాలని చెప్పి ఆమెను తలపై బండరాయితో కొట్టి హత్య చేశాడు. -
యువతి కిడ్నాప్ కలకలం
-
అనంతలో యువతి కిడ్నాప్ కలకలం
సాక్షి, అనంతపురం: అనంతపురంలో డిగ్రీ విద్యార్థిని కిడ్నాప్ అయిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో కేశవరెడ్డి, తన కూతురు అనూషతో ఉన్నారు. అదే సమయంలో అక్కడికి కారులో వచ్చిన దుండగులు అనూషను కారులోకి బలవంతంగా లాక్కుని పరారయ్యారు. ఈ హఠాత్తు పరిణామం నుంచి తేరుకుని అనుష తండ్రి కేశవరెడ్డి గట్టిగా కేకలు వేస్తూ కారును వెంబడించినా ఫలితం లేకపోయింది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కిడ్నాపర్ల కోసం గాలిస్తున్నారు. అనూష క్షేమం... కిడ్నాప్‌కు గురైన యువతి ఉదంతం కొద్ది గంటల్లోనే సుఖాంతమైంది. యువతి అనూష క్షేమంగా ఉన్నట్లు సమాచారం. ముగ్గురు కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారి నుంచి కారును స్వాధీనం చేసుకున్నారు. కిడ్నాప్‌కు గల కారణాలు తెలియాల్సి ఉంది. -
ఇంగ్లీష్ మీడియం ఇష్టం లేకే..
కనగల్ (నల్లగొండ) : ఉరేసుకుని విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మండలంలోని తేలకంటిగూడెం పరిధి తిమ్మన్నగూడెంలో బుధవారం చోటుచేసుకుంది. చండూరు సీఐ రమేశ్‌కుమార్, కనగల్ ఎస్ఐ డి.నర్సింహులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన నల్లబోతు సైదులు, లక్ష్మమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తెకు వివాహం చేయగా.. చిన్న కుమార్తె అనూష(17) హైదరాబాద్‌లోని ఈస్ట్ మారేడ్‌పల్లిలోని పాలిటెక్నిక్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది. చిన్నప్పటి నుంచి చదువులో చురుగ్గా ఉండే అనూష పదో తరగతి వరకు కనగల్ జెడ్పీహెచ్ఎస్లో తెలుగు మీడియంలో చదివి స్కూల్ టాపర్‌గా నిలిచింది. పదో తరగతి మార్కుల శాతం ఆధారంగా పాలిటెక్నిక్‌లో సీటు రావడంతో ఆంగ్ల మాధ్యమంలో చేరింది. అయితే పది వరకు తెలుగు మీడియంలో చదవడం.. దానికితోడు కుటుంబ నేపథ్యం గ్రామీణ వ్యవసాయ కుటుంబం కావడంతో పైచదువుల్లో ఆంగ్ల మాధ్యమంలో రాణించలేకపోయింది. పాలిటెక్నిక్‌లో మార్కులు తక్కువగా వచ్చాయి. దీం తో తాను ఇంగ్లీష్‌లో చదువలేనని తల్లిదండ్రులకు చెప్పింది. ఈ క్రమంలో దసరా సెలవులకు ఇంటికి వచ్చిన అనూష మంగళవారం రాత్రి పొద్దుపోయే వరకు గదిలో చదువుకుంది. ఇంటి వరండాలో తల్లిదండ్రులు నిద్రకు ఉపక్రమించిన తర్వాత తెల్లవారుజామున ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బుధవారం ఉదయం ఎంతకూ గది తలుపులు తీయకపోవడంతో ఇంటి పైకుప్ప తొలగించి చూసేసరికి అనూష ఉరేసుకుని మృతిచెందింది. ఉన్నత చదువులు చదివి ప్రయోజకురాలు అవుతుందనుకున్న కూతురు అనంతలోకాలకు వెళ్లిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. తండ్రి సైదులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
యువతి మౌనపోరాటం
బాపట్లలో భర్త ఇంటి ఎదుట నిరాహార దీక్ష చేపట్టిన అనూష బాపట్ల : ప్రేమించి పెళ్లి చేసుకుని ఇప్పుడు కాపురానికి రానివ్వడంలేదంటూ ఓ వివాహిత తన భర్త ఇంటి ఎదుట శుక్రవారం రాత్రి నుంచి నిరాహార దీక్ష చేపట్టింది. తాను కాపురానికి వెళ్లినప్పటికి అత్త, మామ, భర్త నువ్వు ఇక్కడ ఉండవద్దంటూ మళ్లీ తీసుకువచ్చి పుట్టింటి వద్దే వదిలేస్తున్నారంటూ భోరున విలపించింది. బాధితురాలి కధనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని వివేకానందకాలనీలో కాపురం ఉంటున్న దేవూరి పిచ్చియ్య, వేలంగిణి కుమారుడు వికాస్ చీరాల మండలం రామానగర్‌కు చెందిన పి.నాగేశ్వరరావు,చిన్నమ్మాయిల కుమార్తె అనూష ప్రేమించుకున్నారు. వీరికి పెళ్లి చేసేందుకు వికాస్ తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో పెద్దలు రాజీ చేసి కట్నం క్రింద రూ.10 లక్షలు, 25 సవర్ల బంగారం ఇచ్చేందుకు ఒప్పించారు. గతేడాది ఏప్రియల్ 28న విజయవాడలో వివాహం చేశారు. తొలివిడతగా కట్నంలో రూ.4లక్షలు 25 సవర్లు బంగారం ఇచ్చారు. ఐదునెలలు తరువాత మిగతా సొమ్ము కూడా ఇచ్చేశారు.అప్పటి నుంచి అత్తింటివారు అనూషపై వేధింపులు మొదలు పెట్టి పుట్టింటికి పంపించివేశారు. పోలీసులను ఆశ్రయించినా ఫలితం శూన్యం అనూష తనకు న్యాయం చేయాలంటూ చీరాల పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కౌన్సెలింగ్‌లు ఇచ్చినా ఫలితం లేకుండాపోయింది. చివరికి ఈనెల 16న కౌన్సెలింగ్‌లో తాను అనూషతో కాపురం చేసేదిలేదని, జైలుకైనా పంపండంటూ వికాస్ చెప్పి రావడంతో అనూష మనస్తాపానికి గురైంది. బాపట్లలో అత్తింటి వద్దే తేల్చుకుంటానంటూ వచ్చి నిరాహార దీక్ష చేపట్టింది. అనూష బంధువులు కూడా అనూషతో పాటు పిచ్చియ్య ఇంటి వద్దనే నిరాహారదీక్ష చేపట్టారు. దీంతో అత్తమామ, భర్త అక్కడ నుంచి పరారయ్యారు. న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తామని అనూష బంధువులు చెబుతున్నారు. -
అమ్మ, నాన్న తిట్టారని..
చందుర్తి: పాఠశాలకు వెళ్లమని మందలించినందుకు విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చందుర్తి మండలం బండపల్లిలో బుధవారం చోటుచేసుకుంది. చందుర్తి ఎస్సై శివకేశవులు కథనం ప్రకారం మండలంలోని బండపల్లి గ్రామానికి పల్లపు అనూష(14) స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదోతరగతి చదువుతోంది. వారంరోజులుగా పాఠశాలకు వెళ్లకపోవడంతో తల్లి లక్ష్మి మందలించింది. అనంతరం వ్యవసాయ పనులకు వెళ్లిపోయింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో దూలానికి చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు ఒడిగట్టింది. చుట్టు పక్కల వారు గుర్తించి కిందకు దించి వేములవాడకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు తెలిపారు. అనూష తండ్రి జీవనోపాధికోసం మస్కట్‌కు వెళ్లాడు. బాలిక తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వివరించారు. -
ప్రేమ లేదని..ప్రియుడు రాడని!
ఆత్మహత్య చేసుకున్న యువతి వలేటివారిపాలెం: ప్రేమించినవాడు దక్కడన్న అనుమానంతో యువతి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని శింగమనేని పల్లి గ్రామంలో ఆదివారం జరిగింది. కసుకుర్తి అనూషా(18) అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు ప్రేమలో ఉన్నారు. అయితే కొంతకాలంగా అతను అనూషాతో సరిగా ఉండక పోవడంతో మనస్తాపానికి గురైంది. తనను వివాహం చేసుకోడనే అనుమానంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న కందుకూరు డీఎస్పీ ప్రకాశరావు మృతదేహాన్ని పరిశీలించి వివరాల సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కందుకూరు రూరల్ ఎస్సై ప్రభాకర్ తెలిపారు. -
వివాహిత ఆత్మహత్య
బ్రహ్మసముద్రం (కళ్యాణదుర్గం) : బ్రహ్మసముద్రం మండలం ఎస్.కోనాపురంలో అనూష(20) అనే వివాహిత గరువారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ అబ్దుల్ రహిమాన్ తెలిపారు. కొంతకాలంగా మానసిక వేదనతో సతమతమవుతున్న ఆమె జీవితంపై విరక్తి చెంది ఇంట్లోనే ఉరేసుకుని తనువు చాలించినట్లు వివరించారు. మృతురాలి తల్లి లింగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. -
తెగిన బంధం
- రోడ్డు ప్రమాదంలో అన్నా, చెల్లెలు దుర్మరణం - బైక్‌లో వెళ్తుండగా వేగంగా వచ్చి ఢీకొన్న టిప్పర్ - ఎస్కేయూ సమీపంలో ఘటన మృత్యువు వికృతమైంది. దానికి బంధాలు, అనుబంధాలు పట్టవు. ఎంతటి వారినైనా ఇట్టే కబళిస్తుంది. ఈ విషయం మరోసారి రుజువైంది. మృత్యువు వికటాట్టహాసానికి అన్నాచెల్లెలు బలయ్యారు. రక్తం పంచుకుపుట్టిన ఇద్దరూ ఒకేసారి నడి రోడ్డుపై విగతజీవులుగా మారడం చూసి కన్నవారు కన్నీరుమున్నీరయ్యారు. ఇక తమ కడుపుకోత ఎవరు తీరుస్తారని వారు ప్రశ్నించడం అందరి హృదయాలను పిండేసింది. - ఎస్కేయూ అనంతపురం-కదిరి జాతీయ రహదారిలోని ఎస్కేయూ సమీపంలోని ఢాబా వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన అన్నా, చెల్లెలు దుర్మరణం చెందారు. బైక్‌లో వెళ్తున్న వారిద్దరినీ అతి వేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొనడంతో వారు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇటుకలపల్లి ఎస్ఐ అబ్దుల్ కరీం కథనం ప్రకారం.. అనంతపురం రూరల్ మండలం మన్నీల గ్రామానికి చెందిన కుళ్లాయప్ప(ఎస్కేయూ సమీపంలోని ఢాబాలో దినసరి కూలీ)కు మహమ్మద్ ఆలీ(18), కూతురు అనూష (16) ఉన్నారు. అనూషకు ఆరోగ్యం బాగో లేకపోవడంతో అనంతపురంలోని ఆస్పత్రిలో చికిత్స చేయించి తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు. మార్గమధ్యం యూనివర్సిటీ వద్దకు రాగానే మృత్యురూపంలో ఎదురొచ్చిన టిప్పర్ ఢీకొనడంతో బైక్ నుజునుజ్జు అయింది. అన్నాచెల్లి ఇద్దరూ అంతేసి దూరంలో ఎగిరిపడి ప్రాణాలు కోల్పోయారు. ఫలితాలు రాకనే... అనూష ఇంటర్ మొదటి సంవత్సరం చదివేది. మంగళవారంతో ఆమె పరీక్షలు పూర్తయ్యాయి. ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఆస్పత్రిలో చికిత్స చేయించుకుని అన్నా, చెల్లి కలసి వస్తూ ఒకేసారి ఇద్దరూ ఇలా అర్ధంతరంగా మరణించడంతో వారి కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. ప్రమాదం జరిగిన తీరు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. రాయలచెరువు సమీపంలో మరొకరు.. యాడికి (తాడిపత్రి రూరల్) : యాడికి మండలం రాయలచెరవు సమీపంలోని జాతీయ రహదారిలో బుధవారం గుర్తు తెలియని వాహనం ఢీకొని బెళుగుప్ప మండలం తగ్గుపర్తి గ్రామానికి చెందిన గోపాల్‌నాయుడు(40) అనే వ్యక్తి మృతి చెందినట్లు ఎస్ఐ కత్తి శ్రీనివాసులు తెలిపారు. బళ్లారికి చెందిన గోపాల్నాయడు బైక్‌లో కర్ణాటకలోని బళ్లారి నుంచి బైక్‌లో తాడిపత్రి మండలం తేరన్నపల్లికి బయలుదేరారు. మార్గమధ్యంలో రాయలచెరువు సమీపానికి రాగానే గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఆయన అక్కడికక్కడే మరణించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. -
అనూషా.. నీకు మరణం లేదు
రోడ్డు ప్రమాదంలో మరణించిన అనూష అవయవదానానికి అంగీకరించిన తల్లిదండ్రులు అవయవదానం మనిషికి రెండో జీవితం. ఒక వ్యక్తి అవయవదానం ద్వారా ఎంతో మందికి పునర్జన్మ ఇవ్వొచ్చు. ఈ అందమైన నినాదాలను నిజం చేశారు అనూష తల్లిదండ్రులు. అనూష మరణించినా ఆమె కళ్లు ఈ లోకాన్ని చూస్తాయి. ఆమె హృదయం స్పందిస్తుంది. ఆమె సమాజంలో జీవిస్తూనే ఉంటుంది. – పాతపోస్టాఫీస్(విశాఖపట్నం) విధి రాతను ఎవ్వరూ తప్పించుకోలేరన్నది నిజం. కొన్ని జీవితాల్లో అది వెలుగులు నింపితే.. మరికొన్ని జీవితాల్లో చీకట్లు కమ్మేలా చేస్తుంది. చిన్న ప్రాయంలోనే మృత్యు ఒడిని చేరి మరొకరి జీవితంలో వెలుగులు నింపిన రాజమండ్రి బొమ్మూరు గ్రామానికి చెందిన మేడిబోయిన అనూష కథ ఇది. ఆమె తండ్రి రాజమండ్రిలో కలాసీగా పనిచేస్తున్నాడు. తల్లి ఇంటి వద్దనే ఉంటూ ఇద్దరు పిల్లల ఆలనాపాలన చూస్తోంది. కూతురి మరణంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న తల్లిదండ్రులు తమ దుఃఖాన్ని దిగమింగుకొని అవయవదానానికి సమ్మతించారు. ఆమె మరణించినా.. మరికొందరి రూపంలో ఈ లోకంలో బతికే ఉంటుంది. ఈ నెల 22న శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో అనూష తీవ్ర గాయాలపాలైంది. తలకు తీవ్రగాయం కావడంతో... ప్రమాదం జరిగిన స్థలానికి సమీపంలో ఉన్న బరంపురంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆమె పరిస్థితి ప్రమాదకరంగా ఉండటంతో విశాఖ తీసుకువెళ్లాలని వైద్యులు సూచించారు. విశాఖలో తొలుత అపోలోకు తీసుకువెళ్లగా వివరాలు సక్రమంగా లేవంటూ వారు చేర్చుకోలేదు. దీంతో అదే రోజు రాత్రి 10 గంటలకు ఆమెను రాంనగర్ కేర్‌లో చేర్పించారు. ఆదివారం ఉదయం ఆమె బ్రెయి¯ŒS డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. వారి సూచన ప్రకారం ఆమె తల్లిదండ్రులు అవయవదానానికి అంగీకరించారు. నగరంలోని మొహిసి¯ŒS ఐ బ్యాంకుకు కళ్లను, సెవ¯ŒS హిల్స్‌కు ఒక కిడ్నీని, కేర్‌కు మరో కిడ్నీని, విజయవాడ మణిపాల్ ఆస్పత్రికి లివర్‌ను అందజేయడానికి అంగీకరించారు. ప్రమాదం వెనుక కథేంటి? అనూష మృతిపై పలు పలు అనుమానాలున్నాయని ఆమె తల్లిదండ్రులు మేడిబోయిన కళావతి, శ్రీను ఆరోపిస్తున్నారు. వారు చెప్పిన వివరాల మేరకు...శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం జమేదారుపుట్టుగకు చెందిన కె. యోగేశ్వరరావు అదే మండలం కొత్త కొజ్జిరియా ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఆరేళ్ల కిందట రాజమండ్రిలో ఉపాధ్యాయ శిక్షణ తీసుకున్నాడు. ఆ సమయంలో బొమ్మూరులో గది అద్దెకు తీసుకొని అక్కడ విద్యార్థులకు ట్యూష¯ŒS చెప్పేవాడు. ట్యూష¯ŒS కోసం అతని వద్దకు అనూష వెళ్లేది. ఇద్దరి మధ్య పరిచయం పెరిగి అది ప్రేమగా మారింది. శిక్షణ పూర్తి చేసుకుని యోగేశ్వరరావు తన స్వగ్రామానికి వెళ్లిపోయినా వారిమధ్య ప్రేమ మాత్రం తరగలేదు. తరచూ ఫోన్లలో సంభాషించుకునేవారు. అతను అప్పుడప్పుడు బొమ్మూరు వచ్చి ఆమెను కలుసుకునేవాడు. ఈ నెల 10వ తేదీన అనూష అతనికి ఫో¯ŒS చేయగా ఒక మహిళ ఫో¯ŒS లిఫ్ట్‌చేసి తను యోగేశ్వరరావు భార్యనని, తన భర్తకు ఫో¯ŒS చేయవద్దని హెచ్చరించింది. ఆ మాటలకు అనూష హతాశురాలైంది. విషయం తెలుసుకునేందుకు ఈ నెల 22న తనకు అన్న వరసైన వ్యక్తితో కొత్త కొజ్జిరియా వెళ్లి.. నేరుగా అతన్ని కలుసుకుంది. ఫో¯ŒSలో జరిగిన సంభాషణ చెప్పింది. తప్పనిసరి పరిస్థితుల్లో రెండు నెలల క్రితం భర్త చనిపోయి ఇద్దరు పిల్లలున్న మహిళను వివాహం చేసుకున్నానని యోగీశ్వరరావు చెప్పడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. ఐదు నిముషాల్లో తీసుకువస్తానని ఆమెతో వచ్చిన వ్యక్తికి చెప్పి, అనూషను ద్విచక్రవాహనం ఎక్కించుకొని ఇచ్ఛాపురం తీసుకెళ్లాడు. అక్కడ జరిగిన ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆమెను బరంపురం, అక్కడి నుంచి విశాఖలో అపోలోకు తీసుకొచ్చి, చివరకు కేర్‌లో జాయి¯ŒS చేశాడు. ఆమె తల్లిదండ్రులకు జరిగిందని చెప్పి ఆస్పత్రికి రప్పించాడు. బిల్లు చెల్లించేందుకు డబ్బులు తీసుకువస్తానని చెప్పి 23న యోగేశ్వరరావు పరారయ్యాడు. ఈ విషయం గ్రహించిన ఆమె తల్లిదండ్రులు ఇచ్ఛాపురం పోలీస్‌స్టేçÙ¯ŒSలో ఫిర్యాదు చేశారు. యోగేశ్వరరావు తమ అమ్మాయిని ప్రేమించి మోసగించాడని, జరిగిన ప్రమాదంపై పలు అనుమానాలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. -
జాతీయ స్థాయి బాల్ బ్యాడ్మింటన్ కు అనూష
లింగసముద్రం: జాతీయ స్థాయి అండర్–17 బాల్ బ్యాడ్మింటిన్ పోటీలకు పెదపవని భళేరావు ఉన్న త పాఠశాల విద్యార్థిని పల్లెకొండ అనూష ఎంపికైనట్లు పాఠశాల హెచ్ఎం మాధవరావు గురువారం తెలిపారు. ఈ నెల 8, 9, 10 తేదీల్లో పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లులో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో విశేష ప్రతిభ కనబరచి రాష్ట్ర జట్టుకు ఎంపికైందన్నారు. ఈ నెల 19న చెన్నైలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటుందని చెప్పారు. విద్యార్థినిని జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రటరీ వై శీనయ్య, ఎంఈఓ కె సూర్యప్రకాశరావు, హెచ్ఎం యూ మాధవరావు, వ్యాయామ ఉపాధ్యాయుడు మురళిమోహన్, ఉపాధ్యాయ సిబ్బంది అభినందించారు. -
ఆమె కథేంటి?
బాలు, కౌశిక్, అనూష, రవళి ముఖ్య పాత్రల్లో రూపొందుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘దమయంతి’. స్వీయ దర్శకత్వంలో నౌండ్ల శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ముహూర్తపు సన్నివేశానికి ఎమ్మెల్యే జి.కమలాకర్ కెమెరా స్విచాన్ చేయగా, మరో ఎమ్మెల్యే జి.కిశోర్ క్లాప్ ఇచ్చారు. దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ గౌరవ దర్శకత్వం వహించారు. నౌండ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ- ‘‘దమయంతి ఎవరు? ఆమె కథ ఏంటి? అన్నది సస్పెన్స్. మూడు షెడ్యూళ్లలోనే షూటింగ్ పూర్తి చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: కృష్ణ వొంటెల, కెమేరా: ఎమ్ఎస్ కిరణ్ కుమార్, సంగీతం: ఎస్ఎస్ ఆత్రేయ. -
`అనూషను భర్తే చంపాడు`
మృతదేహంతో ఆందోళన కొలగానివారిపాలెం (నగరం): అనుమానాస్పద స్థితిలో ఆదివారం తెల్లవారు జామున మృతి చెందిన అనూషను భర్త చంద్రబాబే హత్యచేశాడని బంధువులు సోమవారం మండలంలోని కొలగానివారిపాలెం గ్రామంలో చంద్రబాబు ఇంటి వద్ద అందోళన దిగారు. అనూష మృతదేహాన్ని చంద్రబాబు ఇంటి ముందు ఉంచి నిరసన చేపట్టారు. అనూషను చంద్రబాబే చంపి ఆత్మహత్యగా చిత్రీకరించారని అనూష బాబాయి సురేష్ పేర్కొన్నారు. అనూష మృతి చెంది మూడు రోజులు గడుస్తుందని ఇప్పటివరకు పోలీసులు చంద్రబాబు జాడ కనిపెట్టకపోవడం పలు అనుమానాలకు తావిస్తుందన్నారు. చంద్రబాబు వచ్చేంత వరకు అనూష మృతదేహాన్ని అతని ఇంటి వద్ద ఉంచుతామన్నారు. కొలగానివారిపాలెం గ్రామంలో అందోళన చేస్తున్న కనీసం పోలీసులు రాలేదని ఆయన వాపోయారు. పోలీసుల వ్యవహర శైలి చూస్తుంటే కేసును పక్కదారి పట్టిస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా పోలీస్ ఉన్నతాధికారులు స్పందించి అనూష మృతి కేసులోని మిస్టరీని ఛేదించాలని కోరారు. -
శ్రీవాణిపై చర్యలు తీసుకుంటాం: సీఐ
-
శ్రీవాణిపై చర్యలు తీసుకుంటాం: సీఐ
వికారాబాద్ : అన్న భార్యపై దాడి చేసిన కేసులో పోలీసుల విచారణకు బుల్లితెర నటి శ్రీవాణి గైర్హాజరు అయింది. ఈ సందర్భంగా వికారాబాద్ మహిళాa పోలీస్ స్టేషన్ సీఐ నిర్మల మాట్లాడుతూ విచారణకు హాజరు కావాలని శ్రీవాణికి ఫోన్ చేశామన్నారు. అయితే ఆమె రాలేదని, విచారణకు శ్రీవాణి సహకరించడం లేదన్నారు. శ్రీవాణిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు. అవసరం అయితే అరెస్ట్ తప్పదన్నారు. మరోవైపు పోలీసుల విచారణకు అనూష హాజరు అయ్యింది. కాగా షూటింగ్ ఉన్నందునే విచారణకు హాజరు కాలేకపోయానని శ్రీవాణి తెలిపింది. కాగా రంగారెడ్డి జిల్లా పరిగికి చెందిన అనూష, శ్రీవాణి ఇంటి స్థలం విషయంలో గొడవకు దిగడంతో పాటు ఘర్షణ పడి పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడంతో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఐ నిర్మల నిన్న వివాదాస్పద ఇంటి స్థలాన్ని పరిశీలించి విచారణ జరిపారు. స్థానికులతో మాట్లాడి ఆరా తీశారు. నటి శ్రీవాణి పలుమార్లు సదరు ఇంటి స్థలాన్ని సందర్శించిందని, వదిన అనూషపై బెదిరింపులకు పాల్పడిందని సీఐకి వివరించారు. దీంతో వారందరి వాంగ్మూలాలను సీఐ నమోదు చేశారు. -
ఇల్లు కూల్చివేతలో నా ప్రమేయం లేదు
టీవీనటి శ్రీవాణి తాండూరు: తనపై తప్పుడు కేసు పెట్టారని, టీవీ నటినైనందునే తనను అప్రతిష్ట పాలు చేస్తున్నారని బుల్లి తెర నటి శ్రీవాణి స్పష్టం చేశారు. గురువారం రంగారెడ్డి జిల్లా తాండూరులో ఆమె మీడియాతో మాట్లాడారు. తన అన్న బాబ్జీ గత నెలలో చనిపోయాడని, నాన్న కోటేశ్వర్రావుకు ఐదుగురు కూతుళ్లమని, తమకు పరిగిలో ఇల్లు, ఒక ఎకరం భూమి ఉందన్నారు. తాము ఆ ఇల్లు కూల్చివేసినట్టు వస్తున్న ఆరోపణలు అవాస్తవమన్నారు. తన వదిన అనూషను వేధింపులకు గురి చేశానని ఆరోపించడంలో నిజం లేదన్నారు. ఇల్లు కూల్చివేతలో తన ప్రమేయమే లేదని, అది ఏడాది క్రితమే జరిగిందన్నారు. ఇతరులను తీసుకువచ్చి దాడి చేయించాననడం అబద్ధమని, తనపైనే దాడి జరిగిందని చెప్పారు. శ్రీవాణి తండ్రి కోటేశ్వర్రావు మీడియాతో మాట్లాడుతూ పరిగిలో ఐదారు కోట్ల ఆస్తి తన పేరుతో ఉందన్నారు. శ్రీవాణితోపాటు తన కుటుంబసభ్యులపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని చెప్పారు. ఆస్తిలో ఐదుగురు కూతుళ్లతో పాటు కోడలుకు సమానంగా వాటా ఉంటుందని చెప్పారు. -
నాపై అనవసర ఆరోపణలు: శ్రీవాణి
వికారాబాద్: రంగారెడ్డి జిల్లా పరిగి గ్రామంలో స్థల వివాదం విషయంలో తనపై వచ్చిన ఆరోపణలను బుల్లితెర నటి శ్రీవాణి ఖండించింది. తాను ఎవరిపైనా దాడి చేయలేదని ఆమె స్పష్టం చేసింది. వదిన అనూష తమపై అనవసర ఆరోపణలు చేస్తోందని శ్రీవాణి వ్యాఖ్యానించింది. తండ్రి ఆస్తిలో తమకు హక్కుందని ఆమె తెలిపింది. పోలీసులు విచారణకు సహకరిస్తానని శ్రీవాణి పేర్కొంది. మరోవైపు శ్రీవాణి వదిన అనూషకు స్థానికులు మద్దతుగా నిలిచారు. అనూషపై శ్రీవాణి దౌర్జన్యం చేస్తోందని పరిగి సర్పంచ్ సుదర్శన్ అన్నారు. గతంలో కూడా అనూషపై దాడికి యత్నించడమే కాకుండా వేధింపులకు గురి చేసినట్లు దాడికి యత్నించిందని తెలిపారు. తనను ఎవరూ ఏమీ చేయలేరనే అహంకారంతో శ్రీవాణిని ఉందన్నారు. శ్రీవాణి తండ్రి గతంలోనే ఐదెకరాల భూమిని అమ్మి ఆమెకు డబ్బులు ఇచ్చారని, మళ్లీ ఇప్పుడు ఆస్తిని కాజేయాలని చూస్తోందని సుదర్శన్ అన్నారు. కాగా మరోవైపు ఈ కేసుపై సీఐ నిర్మల మాట్లాడుతూ అనూష ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరుపుతున్నామన్నారు. శ్రీవాణి దౌర్జన్యం చేసినట్లు స్థానికులు చెబుతున్నారన్నారు. గతంలో కూడా అనూషను శ్రీవాణి వేధించారని సీఐ తెలిపారు. చదవండి... (బుల్లితెర నటి శ్రీవాణి విలనిజం) -
బుల్లితెర నటి శ్రీవాణి విలనిజం
-
బుల్లితెర నటి శ్రీవాణి విలనిజం
పరిగి: రీల్ లైఫ్‌లోనే కాదు...రియల్ లైఫ్‌లోనూ బుల్లితెర నటి తన విలనిజాన్ని చూపించింది. సోదరుడి ఆస్తిపై కన్నేసిన ఆమె...వదినపై అమానుషంగా ప్రవర్తించింది. అన్నచనిపోవడంతో వదిన ఉంటున్న ఇల్లును జేసీబీతో కూల్చేసింది. ఆస్తి తమకే దక్కుతుందని అనుచరులతో వీరంగం సృష్టించింది. టీవీ సీరియల్ ఎపిసోడ్‌కు ఏమాత్రం తీసిపోలేదు. చంద్రముఖి సీరియల్ ఫేం శ్రీవాణి సోదరుడు బాబ్జీ అనారోగ్యంతో కొంతకాలం క్రితం మరణించాడు. అయితే సోదరుడికి పిల్లలు లేకపోవడంతో తమ తండ్రి ఆస్తిలో తమకు వాటా వస్తుందంటూ శ్రీవాణి తన సోదరి శ్రీకన్యతో కలిసి సోమవారం రంగారెడ్డి జిల్లా పరిగిలో హల్చల్ చేశారు. వేరే వారిని ఆ స్థలాన్ని విక్రయించేందుకు యత్నించగా అందుకు బాబ్జీ భార్య అనూష అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా శ్రీవాణి అసభ్య పదజాలం ఉపయోగించడమే కాకుండా, తన భర్త ఆదిత్యరెడ్డి సాయంతో ఆ ఇంటిని కూల్చివేసింది. దీంతో అనూష పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరిగి పోలీసులు శ్రీవాణిపై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరోవైపు అనూషపై శ్రీవాణి కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం అనూష ఉంటున్న ఇంటి స్థలంలో తమకు కూడా వాటా ఉందని అడిగేందుకు వెళితే తమపై దాడికి యత్నించిందని శ్రీవాణి తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయమై పోలీసులను వివరణ కోరగా ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేశారని, ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. విచారణకు హాజరు కావాలని శ్రీవాణిని సమాచారం ఇచ్చినట్లు చెప్పారు. మరోవైపు అనూషకు స్థానికులు బాసటగా నిలిచారు. అనూష భర్త చనిపోయి బాధలో ఉంటే వేధించడమేంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అమాయకురాలైన అనూషకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలోనూ ఇంటి స్థలం కోసం శ్రీవాణి యత్నించిందని, అయితే ఆ ప్రయత్నాలను తాము అడ్డుకున్నట్లు స్థానికులు తెలిపారు. చదవండి....(బుల్లితెర నటి శ్రీవాణిపై ఫిర్యాదు) -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
అచ్చంపేట మండల కేంద్రంలోని గురుకుల పాఠశాల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. బైక్‌పై గంగమ్మపల్లి తిరునాళకు వెళ్లి తిరిగి వస్తుండగా లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అత్త లింగమ్మ(45), అల్లుడు గోపి(24) మృతిచెందగా.. గోపి భార్య అనూషకు తీవ్రగాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన అనూషను సత్తెనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరంతా బెల్లంకొండ మండలం వన్నాయిపాలెం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఎస్సై రెండో ఇంటి ముందు భార్య ఆందోళన
నల్లకుంట(హైదరాబాద్): ఓ ఎస్సై తన భార్యపై వేధింపులకు గురి చేసిన ఘటన అంబర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. అదనపు కట్నం తేవాలని డిమాండ్ చేయడంతో పాటు, మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుని తనను పట్టించుకోవటం లేదంటూ ఎస్సై రెండో ఇంటి వద్ద భార్య ఆందోళనకు దిగింది. వివరాల్లోకి వెళితే... హైదరాబాద్‌లో ఎస్సైగా పనిచేస్తున్న నల్గొండ జిల్లా గరిడేపల్లి మండలం కొత్తగూడంకు చెందిన ఎన్.కరుణ కుమార్‌తో అదే జిల్లా హుజూర్‌నగర్‌కు చెందిన నందిపాటి సాల్మన్, లలితల కుమార్తె విజయరాణితో 2011లో వివాహం జరిగింది. వివాహ సమయంలో కరుణ కుమార్‌కు కట్నంగా రూ. 15 లక్షల నగదు, రూ. 3 లక్షల బంగారంతో పాటు రూ. 2 లక్షలు బ్యాంక్‌లో డిపాజిట్ చేశారు. ఏడాదిన్నర పాటు వారి సంసారం సాఫీగానే సాగింది. కాగా, వారికి కూతురు అక్షయ(3) ఉంది. ఇదిలా ఉండగా, 2013 నుంచి కిమ్స్ ఆస్పత్రిలో నర్స్ గా పనిచేస్తున్న అనూషతో కరుణ కుమార్ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. అప్పటి నుంచి భార్యను కట్నం కోసం వేధించటంతోపాటు పట్టించుకోవటం మానేశాడు. ఈ విషయమై 2014లో గాంధీనగర్ పోలీస్ స్టేషన్ లో బాధితురాలు ఫిర్యాదు చేయగా... ఎస్సైని విధుల్లోంచి సస్పెండ్ చేశారు. తిరిగి విధిల్లో చేరిన అతను ప్రస్తుతం అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా పనిచేస్తున్నాడు. అయినా వేధింపులు మానక పోవడంతో బాధితురాలు సంతోష్‌నగర్ పోలీస్ స్టేషన్ లో మరోమారు ఫిర్యాదు చేసింది. అక్కడి అధికారులు కౌన్సెలింగ్ ఇచ్చినప్పటికీ అతనిలో మార్పు రాలేదు. ఏడాది కాలంగా ఇంటికి సరిగా రాకుండా డీడీ కాలనీ జయరాజ్ అపార్ట్మెంట్లో ఉంటున్న నర్స్ అనూష వద్దకు వెళుతున్నాడు. దీంతో బాధితురాలు కూతురు అక్షయను తీసుకుని, ఎమ్మార్పీఎస్ నాయకులతో కలిసి బుధవారం ఉదయం కరుణ కుమార్, అనూష ఉంటున్న ఇంటి వద్ద ఆందోళనకు దిగింది. తనకు న్యాయం జరిగి, భర్త తన వద్దకు వచ్చే వరకు న్యాయ పోరాటం కొనసాగిస్తానని విజయరాణి పేర్కొంది. విషయం తెలుసుకున్న అంబర్‌పేట పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని, బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తనకు న్యాయం చేయాలని విజయరాణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా, తన ఇంటిపై దాడి చేసి అసభ్యంగా ప్రవర్తించారంటూ అనూష.. విజయరాణిపై అంబర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ రవీందర్‌రెడ్డి తెలిపారు.