
సాక్షి, గుంటూరు: డిగ్రీ విద్యార్థిని అనూష సంఘటన అందర్నీ కలచివేస్తోందని మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. ఆమె గురువారం ముప్పాళ్ళ మండలం గోళ్లపాడులో అనూష కుటుంబ సభ్యులను మహిళా పరామర్శించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఇలాంటి ఘటనలు పునరావతం కాకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అనూష కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీరియస్‌గా స్పందించారని తెలిపారు.
నిందితుడికి శిక్ష వెంటనే పడేందుకు దిశ చట్టాన్ని అమలు చేస్తున్నామని వ్యాఖ్యానించారు. నిందితుడికి కఠిన శిక్ష పడాలని సమాజమంతా కోరుకుంటుందని, అనూష కుటుంబానికి ధైర్యం చెప్పామని వాసిరెడ్డి పద్మ తెలిపారు. బుధవారం డిగ్రీ విద్యార్థిని అనూష (19) హత్యకు గురైన విషయం తెలిసిందే. సహ విద్యార్థి మేడా విష్ణువర్ధన్‌రెడ్డి ఆమెను గొంతు నులిమి దారుణంగా హత్యచేశాడు. మృతదేహాన్ని కాలువలో పడేసి అనంతరం పోలీసులకు లొంగిపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment