
సాక్షి, గుంటూరు: బీటెక్ విద్యార్ధిని హత్య కేసులో నిందితుడ్ని మీడియా ముందు పోలీసులు ప్రవేశపెట్టారు. ఇన్‌ఛార్జ్ డీఐజీ రాజశేఖర్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. బీటెక్ విద్యార్ధిని హత్య దురదృష్టకరమన్నారు. ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే నిందితుడిని పట్టుకున్నామని తెలిపారు. రమ్య హత్య కేసులో శశికృష్ణను అరెస్ట్ చేశామని వెల్లడించారు. శశికృష్ణ ఇన్‌స్టాగ్రాం ద్వారా రమ్యకు పరిచయం అయ్యాడని.. శశికృష్ణ వేధించడంతో రమ్య దూరం పెట్టిందన్నారు.
ప్రేమించకుంటే చంపుతానని శశికృష్ణ బెదిరించాడు. ప్రేమించలేదన్న కోపంతో రమ్యను హత్య చేశాడని తెలిపారు. సోషల్ మీడియాలో పరిచయాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని ఇన్‌ఛార్జ్ డీఐజీ సూచించారు. మహిళల రక్షణే మా ప్రథమ కర్తవ్యమని, మహిళల రక్షణకై అహర్నిశలు శ్రమిస్తున్నామని ఇన్‌ఛార్జ్ డీఐజీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment