Ramya
-
కోర్టుకు నటి రమ్య హాజరు
దొడ్డబళ్లాపురం: ప్రముఖ నటి, మాజీ ఎంపీ రమ్య మంగళవారంనాడు బెంగళూరులోని కమర్షియల్ కాంప్లెక్స్ కోర్టు ముందు హాజరయ్యారు. హాస్టల్ హుడుగరు బేకాగిద్దారె అనే సినిమా విడుదలను ఆపాలని గతంలో రమ్య కోర్టును ఆశ్రయించారు, ఈ కేసులో విచారణకు వచ్చారు. 2024 జూలైలో రమ్య ఆ సినిమా నిర్మాతపై కేసు వేశారు. తన అనుమతి తీసుకోకుండా సినిమాలో తన దృశ్యాలను వాడుకున్నారని ఆమె చెబుతున్నారు. కాబట్టి సినిమా విడుదల ఆపాలని, తనకు రూ.1 కోటి పరిహారం ఇప్పించాలని కోరారు. విచారణ తరువాత వాయిదా వేశారు. -
చీరలో అనసూయ గ్లామర్.. క్యూట్‌గా యంగ్ హీరోయిన్ రమ్య!
చీరలో చాన్నాళ్ల తర్వాత అనసూయ గ్లామర్ షోనాభి చూపిస్తూ క్యూట్ అండ్ స్వీట్ లుక్‌తో రమ్యశ్రద్దా దాస్ వింత పోజులు.. చూస్తే చాలా ఫన్నీబాడీ బెండ్ తీసేలా మాళవిక శర్మ స్టిల్స్'పుష్ప' వైల్డ్ ఫైర్ అంటూ రచ్చ చేసిన పాయల్ రాజ్పుత్సన్నీ లియోన్ హాట్ అండ్ బ్లడీ గ్లామరస్ వీడియో View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Divyabharathi (@divyabharathioffl) View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) View this post on Instagram A post shared by Malvika Sharma (@malvikasharmaofficial) View this post on Instagram A post shared by Sai Ramya Pasupuleti (@ramyaapasupuleti) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by neha sargam (@nehasargam) View this post on Instagram A post shared by swathishta R (@swathishta_krishnan) View this post on Instagram A post shared by Sai Ramya Pasupuleti (@ramyaapasupuleti) View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) -
దర్శన్‌తో పాటు ఆ ముగ్గురిని ట్యాగ్ చేస్తూ హీరోయిన్ రమ్య కామెంట్
కర్ణాటక రాష్ట్రంలో ఇటీవల కాలంలో పలు కేసులు సంచలనం సృష్టిస్తున్నాయి. హీరో దర్శన్, మాజీ సినీ నిర్మాత యడ్యూరప్ప, మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ, సూరజ్ రేవణ్ణ వంటి ప్రముఖులు నేడు పలు కేసుల్లో నిందితులుగా ఉన్నారు. వీరందరినీ ఉద్దేశించి కన్నడ హీరోయిన్, మాజీ ఎంపీ రమ్య విమర్శలు ఎక్కుపెట్టారు.అనేక సందర్భాల్లో చట్టాన్ని ఉల్లంఘించే ధనవంతులు, సెలబ్రిటీలు, ప్రభావవంతమైన వ్యక్తులు నేటి సమాజంలో ఉన్నారు. వారు చేసిన ఘోర తప్పిదానికి రాష్ట్ర ప్రజలు దిగ్భ్రాంతి చెందారు. ఈ నేరాలను బయటపెట్టిన పోలీసులకు, మీడియాకు హ్యాట్సాఫ్. కేసులను సక్రమంగా విచారణ జరిగేలా న్యాయస్థానం చూడాలి. ఒక్కోసారి న్యాయం జరగకపోతే సాధారణ ప్రజలకు న్యాయస్థానం ఏం సందేశం ఇచ్చినట్లు చెప్పాల్సి ఉంటుంది.' అని రమ్య సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టయిన నటుడు దర్శన్, లైంగిక వేధింపుల కేసులో నిందితులుగా ఉన్న ప్రజ్వల్ రేవణ్ణ, సూరజ్ రేవణ్ణతో పాటు పోక్సో కేసులో విచారణ ఎదుర్కొంటున్న మాజీ సీఎం యడ్యూరప్ప పేరును తన సోషల్ మీడియాలో ట్యాగ్ చేస్తూ.. రమ్య పోప్ట్ చేయడం విశేషం.రేణుకాస్వామిని హత్యకేసులో విచారణ ఎదుర్కొంటున్న దర్శన్ గురించి గతంలో ఆమె ఒక పోస్ట్ చేశారు. తప్పు చేసిన వారు ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే శిక్ష అనుభవించాల్సిందేనని ఆమె కోరింది. దీంతో ఆమెపై ఆయన అభిమానులు విరుచకపడ్డారు. ట్రోల్స్ చేస్తూ రమ్యను బూతులు తిట్టడం ప్రారంభించారు. దానిని కూడా ఆమె తప్పబట్టారు. హత్య కేసులో ఉన్న వ్యక్తికి సపోర్ట్ చేస్తున్న సమాజంలో జీవించడం సిగ్గుచేటు అని తెలిపారు. ఈ క్రమంలో చట్టం కంటే ఎవరూ గొప్పవారు కాదని ఆమె గుర్తుచేశారు. సెలబ్రిటీ అయితే సాధారణ ప్రజలను కొట్ట చంపేస్తారా..? అంటూ ఆమె స్వరాన్ని పెంచారు. ఇలాంటి కేసుల విషయంలో ఏ రాజకీయ పార్టీ ఒత్తిడికి తలొగ్గకుండా పోలీసులు పనిచేస్తారని ఆశిస్తున్నట్లు ఆమె తెలిపారు. చట్టంపై ప్రజలు విశ్వాసం ఉంచుతారనే నమ్మకం ఉందని రమ్య సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.తెలుగు వారికి కూడా రమ్య పరిచయమే నందమూరి కళ్యాణ్‌రామ్ 'అభిమన్యు' సినిమాతో పాటు సూర్య హీరోగా నటించిన 'సూర్య సన్నాఫ్ కృష్ణన్' సినిమాలో రమ్య మెప్పించారు. 20 సంవత్సరాల పాటు కన్నడ సీమలో టాప్ హీరోయిన్గా చెరగని ముద్ర రమ్య వేశారు.The ones breaking the law who have been in the news are the rich and powerful and the ones at the receiving end of their violent actions are the poor, women & children. The common people of Karnataka. Hats off to the police and media for bringing these crimes out. Justice will…— Ramya/Divya Spandana (@divyaspandana) June 22, 2024 -
పాపం పసిపాప ఏమైందో ?
ప్రకాశం: ఐదేళ్లు కూడా నిండని పసిపాప మనుబ్రోలు రమ్య అదృశ్యమైంది. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం మద్దులూరు గ్రామంలో శుక్రవారం ఈ సంఘటన జరిగింది. రమ్య తన అక్కతో పాటు మద్దులూరులోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు వెళ్తోంది. బడి ఈడు వయస్సు లేకపోయినా తన అక్క ఐదో తరగతి చదువుతుంటే అక్కతో కలిసి రోజులాగే శుక్రవారం కూడా బడికి వెళ్లింది. సాయంత్రం ఇంటర్వెల్లో రమ్య ఇంటికి వెళ్తానంటే బడిలో ఉన్న టీచర్ పంపించాడు. రోడ్డు మీద వేరే పేరెంట్ వెళ్తుంటే ఆ పేరెంట్‌తో కలిసి రమ్య వెళ్లింది. కానీ పేరెంట్ ఇల్లు మధ్యలోనే ఉండటంతో అక్కడి నుంచి రమ్య ఒక్కతే వెళ్లినట్లు స్థానికులు చెబున్నారు. తీరా సాయంత్రం 4 గంటలకు బడి వదిలినప్పుడు రమ్య అక్క ఇంటికి రాగానే రమ్య ఏదని తల్లి కోటేశ్వరి అడగటంతో ఇంటర్వెల్లోనే ఇంటికొచ్చిందని అక్క చెప్పటంతో రమ్య అదృశ్యమైనట్లు తల్లి గుర్తించి తల్లిదండ్రుల ద్వారా గ్రామంలోని పరిసరాలను వెతికి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఒంగోలు రూరల్ సీఐ శ్రీనివాసరెడ్డి, సింగరాయకొండ సీఐ రంగనాథ్, సంతనూతలపాడు, నాగులుప్పలపాడు, మద్దిపాడు, టంగుటూరు, కొండపి ఎస్సైలతో పాటు ఒంగోలు పోలీస్ హెడ్‌క్వార్టర్స్ నుంచి మరో ముగ్గురు ఎస్సైలు కలిసి అదృశ్యమైన పాప ఆచూకీ కోసం మద్దులూరు గ్రామాన్ని జల్లెడ పట్టారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి పాఠశాల, బాత్రూములు, అనకర్లపూడి వైపు ఉన్న ఆక్వా పరిశ్రమలు, మూసీ నదివైపు స్థానిక గ్రామస్థులతో పాటు పోలీసులు పాప ఆచూకీ కోసం తీవ్రంగా గాలించారు. అయినా రాత్రి 10 గంటల గడిచినా పాప ఆచూకీ లభించకపోవడంతో పాప తల్లి కోటేశ్వరి, బంధువులు కన్నీరు మున్నీరయ్యారు. పాప తండ్రి రామాంజనేయులు స్వస్థలం చీమకుర్తి మండలం ఇలపావులూరు అయితే డెలివరీ కోసం కోటేశ్వరి అమ్మగారి ఊరైన మద్దులూరు వచ్చింది. కోటేశ్వరికి ముగ్గురు ఆడపిల్లలు, ఒక బాబు ఉన్నారు. అదృశ్యమైన పాప రమ్య రెండో కుమార్తె. తండ్రి హైదరాబాద్‌లో బేల్దార్ పనులకని వెళ్లాడు. కోటేశ్వరి డెలివరీకని వచ్చి మద్దులూరులోని తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. పాప ఆచూకీ తెలియాల్సి ఉందని ఎస్సై ఆంజనేయులు తెలిపారు. -
‘పూజారమ్మా... అర్చన చెయ్యి’.. ఇక అక్కడ ఇదే మాట వినపడుతుంది
‘పూజారి గారూ... అర్చన చెయ్యండి’ అనే మాట ప్రతి గుడిలో వినపడేదే. కాని తమిళనాడులో ఒక మార్పు జరిగింది. పూజారులుగా స్త్రీలు నియమితులయ్యే ప్రయత్నం మొదలయ్యింది. ‘పూజారమ్మా... అర్చన చెయ్యి’ అనే ఇకపై మాట వినపడనుంది. రమ్య, కృష్ణవేణి, రంజిత అనే ముగ్గురు మహిళలు అర్చకత్వం కోర్సును ముగించి త్వరలో పూజారులుగా నియమితం కానున్నారు. ‘మహిళలు పైలెట్లుగా, వ్యోమగాములుగా దిగంతాలను ఏలుతున్నప్పుడు దేవుని అర్చనను ఎందుకు చేయకూడదు’ అనే ప్రశ్న తమిళనాడు ప్రభుత్వం లేవనెత్తింది. అంతేకాదు దానికి సమాధానం కూడా వెతికింది. జవాబును ప్రజల ముందుకు తెచ్చింది. గతంలో ఛాందస దృష్టితో బహిష్టు కారణాన స్త్రీలను ‘అపవిత్రం’ అని తలచి గర్భగుడి ప్రవేశానికి, అర్చనకు దూరంగా ఉంచేవారు. గ్రామదేవతల అర్చనలో స్త్రీలు చాలా కాలంగా ఉన్నా ఆగమశాస్త్రాలను అనుసరించే దేవాలయాలలో స్త్రీలు అర్చకత్వానికి నిషిద్ధం చేయబడ్డారు. ఇప్పుడు ఆ విధానంలో మార్పును తెచ్చింది తమిళనాడు ప్రభుత్వం. మహిళా అర్చకులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వనుంది. అందులో భాగంగా ముగ్గురు మహిళలు ఒక సంవత్సరం కోర్సును ముగించి సహాయక అర్చకులుగా శిక్షణ పొందనున్నారు. ఒక సంవత్సరంపాటు ఆలయాల్లో శిక్షణ పొందాక ప్రధాన అర్చకులు కానున్నారు. అందరూ యోగ్యులే డి.ఎం.కె నేత కరుణానిధి 2007లో అర్చకత్వానికి అన్ని కులాల వాళ్లు యోగ్యులే అనే సమానత్వ దృష్టితో తమిళనాడులో ఆరు అర్చక ట్రైనింగ్ స్కూళ్లను తెరిచారు. అయితే ఆ కార్యక్రమం అంత సజావుగా సాగలేదు. ఇప్పుడు స్టాలిన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని కులాల వాళ్లు అర్చకత్వం కోర్సు చేసి పూజారులుగా నియమితులు కావచ్చన్న విధానాన్ని ప్రోత్సహించింది. దాంతో గత సంవత్సరం నుంచి చాలామంది ఈ కోర్సుల్లో చేరుతున్నారు. అయితే తిరుచిరాపల్లిలోని అర్చక ట్రైనింగ్ స్కూల్లో ముగ్గురు మహిళలు ఈ కోర్సులో చేరడంతో కొత్తశకం మొదలైనట్టయ్యింది. రమ్య, కృష్ణవేణి, రంజిత అనే ముగ్గురు మహిళలు ఒక సంవత్సరం కోర్సులోని థియరీని విజయవంతంగా పూర్తి చేసి ప్రభుత్వ హిందూ ధార్మిక మంత్రిత్వ శాఖ నుంచి తాజాగా సర్టిఫికెట్లు పొందారు. ప్రాక్టికల్స్‌లో భాగంగా ఒక సంవత్సరం పాటు వివిధ ఆలయాల్లో సహాయక అర్చకులుగా పని చేసి తదుపరి అర్చకులుగా నియమితులవుతారు. కోర్సు చదివిన కాలంలో వీరికి 3000 రూపాయల స్టయిపెండ్ లభించింది. దేవుడు కూడా బిడ్డడే ‘దేవుడు కూడా చంటిబిడ్డలాంటివాడే. గర్భగుడిలో దేవుణ్ణి అతి జాగ్రత్తగా ధూపదీపాలతో, నైవేద్యాలతో చూసుకోవాలి. స్త్రీలుగా మాకు అది చేతనవును’ అంది రమ్య. కడలూరుకు చెందిన ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ ఉద్యోగం మాని మరీ అర్చకత్వం కోర్సులో చేరింది. మరో మహిళ కృష్ణవేణి ఇంటర్ వరకూ చదివి ఈ కోర్సు చేసింది. మూడో మహిళ రంజిత బి.ఎస్సీ చదివింది. ‘మా బ్యాచ్‌లో మొత్తం 22 మంది ఉంటే మేము ముగ్గురమే మహిళలం. కాని గత నెలలో మొదలైన కొత్తబ్యాచ్‌లో 17 మంది అమ్మాయిలు చేరారు. రాబోయే రోజుల్లో ఎంతమంది రానున్నారో ఊహించండి’ అంది రమ్య. తమిళనాడులో మొదలైన ఈ మార్పును మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తాయో లేదో ఇప్పటికైతే సమాచారం లేదు. కాని స్త్రీలు దైవాన్ని కొలిచేందుకు ముందుకు వస్తే ఇకపై వారిని ఆపడం అంత సులువు కాకపోవచ్చు. -
దివ్యస్పందన మృతి అంటూ వార్తలు.. మండిపడ్డ నటి
కన్నడ నటి రమ్య(దివ్య స్పందన) మృతి చెందారంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్‌గా మారింది. నేడు ఉదయం రమ్య గుండెపోటుతో కన్నుమూశారంటూ ఓ ట్వీట్ ప్రత్యక్షం కావడంతో అభిమానులు ఆందోళన చెందారు. అయితే వెంటనే సదరు వ్యక్తి నాలుక్కరుచుకుని తన ట్వీట్ డిలీట్ చేసినప్పటికీ అప్పటికే ఆమె మరణించారంటూ వార్తలు వైరలయ్యాయి. అయితే రమ్య మరణించారంటూ వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు. ఆమె ఆరోగ్యంగా ఉన్నారు. జెనీవాలో ప్రస్తుతం తన వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని పలువరు సోషల్ మీడియా వేదికగా ధ్రువీకరిస్తున్నారు. 'జెనీవాలో ఆమె హాయిగా నిద్రిస్తున్నారు. ఇంతలో ఈ ఫేక్ న్యూస్ బయటకు రావడంతో ఆమె సన్నిహితులు తనకు వరుస పెట్టి ఫోన్లు చేస్తున్నారు. అసలు బతికున్న మనిషి చనిపోయిందంటూ ప్రకటించిన వ్యక్తికి, అది నిజమని ప్రచారం చేస్తున్నవారికి కాస్తైనా బుద్ధి లేదు' అని మండిపడుతున్నారు. మొదట ఈ వార్త విని ఆందోళనకు లోనైన జర్నలిస్ట్ ధన్య రాజేంద్రన్ సైతం దివ్య స్పందనకు కాల్ చేసింది. ఈ విషయాన్ని ఆమె ట్విటర్లో వెల్లడించింది. 'దివ్య స్పందనకు నేను ఫోన్ చేస్తూనే ఉన్నాను. మొదట తను కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో కంగారుపడ్డాను. చివరగా నా ఫోన్ ఎత్తడంతో హమ్మయ్య, నీకేం కాలేదు.. నువ్వు బతికే ఉన్నావన్నాను. తనేమో కాస్త కోపంగా అసలు నేను చనిపోయానని ఎవరు చెప్పారు?' అని ఆగ్రహం వ్యక్తం చేసింది అని రాసుకొచ్చింది. 'అభి' సినిమాతో చిత్రపరిశ్రమలో అడుగుపెట్టారు రమ్య. ఆ మరుసటి ఏడాదే కుట్టు చిత్రంతో తమిళ్లో ఎంట్రీ ఇచ్చారు. కేవలం తమిళ భాషలోనే కాకుండా కన్నడ, హిందీలో సినిమాలు చేశారు. తెలుగులో అభిమన్యు అనే ఒకే ఒక్క సినిమాలో నటించారు. 2012లో రాజకీయాల్లో ప్రవేశించిన ఆమె ప్రస్తుతం పాలిటిక్స్‌కు దూరంగా ఉన్నారు. It was really the strangest conversation, kept calling @divyaspandana and she didnt pick first few times and naturally I was panicking. Finally she did and I had to say-I am glad you are alive, She is like who the hell is saying I died! #DivyaSpandana — Dhanya Rajendran (@dhanyarajendran) September 6, 2023 చదవండి: అడల్ట్ సినిమాలు చేస్తే తప్పేంటి? టేస్టీ తేజకు షకీలా కౌంటర్ -
ఒక స్త్రీ జీవితం ఆధారంగా కేరాఫ్ దెయ్యం...
ఒకప్పడు గ్రామాల్లో మాతంగులుగా జీవించిన వారిలో ఒక స్త్రీ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘భయం.. కేరాఫ్ దెయ్యం’. మాతంగిగా రమ్య, మాంత్రికుడిగా నటుడు–దర్శకుడు రవిబాబు, తాంత్రికుడిగా నటుడు సత్యప్రకాష్ ముఖ్యపాత్రలు చేశారు. సీవీఎస్ఎం వెంకట రవీందర్ నాథ్ దర్శకత్వంలో పెదారికట్ల చేనెబోయిన్న నరసమ్మ, వెంకటేశ్వర్లు నిర్మించారు. ‘‘హారర్, థ్రిల్లర్ అంశాలు జోడించి ఈ చిత్రాన్ని రూపొందించాం. ఇటీవల జరిపిన రెండో షెడ్యూల్లో రవిబాబుపై సీన్స్ తీశాం. కన్నడ, తెలుగు భాషల్లో నిర్మించిన ఈ చిత్రం విడుదల తేదీని త్వరలో తెలియజేస్తాం’’ అని దర్శక–నిర్మాతలు అన్నారు. -
అభిమానితో ఇంత సాదాసీదాగా ఉన్న ఈ హీరోయిన్ గురించి తెలిస్తే..
కన్నడ దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ 'అభి' సినిమాతో చిత్రపరిశ్రమలో అడుగుపెట్టారు రమ్య (దివ్య స్పందన). ఆ మరుసటి ఏడాదే కుట్టు చిత్రంతో తమిళ్లో ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో బోలెడన్ని అవకాశాలు ఆమె తలుపు తట్టాయి. అలా తమిళ, కన్నడ, హిందీలో సినిమాలు చేశారు. అలా 20 సంవత్సరాల పాటు కన్నడ సీమలో తను చెరగని ముద్ర వేశారు. తెలుగులో కూడా నందమూరి కళ్యాణ్‌రామ్ అభిమన్యు సినిమాతో పాటు సూర్య హీరోగా నటించిన 'సూర్య సన్నాఫ్ కృష్ణన్' సినిమాలో రమ్య అభినయం అందరినీ ఆకట్టుకున్నారు. (ఇదీ చదవండి: నాడు విజయ్ పేరుతో వైరల్.. నేడు మళ్లీ ఇలా ట్రెండింగ్‌లో) కన్నడలో స్టార్ హీరోయిన్ ఇమేజ్ను క్రియేట్ చేసుకుని భారీగా అభిమానులను సొంతం చేసుకున్నారు. సినిమాలే కాకుండా.. ఆమె రాజకీయాల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కాంగ్రెస్ ఎంపీగా మాండ్య ప్రజలకు సేవలందించించారు. అయితే బీజేపీ అధికారంలోకి వచ్చాక రాజీనామా చేశారు. కాగా సినిమాలు, రాజకీయాలకు దూరంగా ఉంటోన్న రమ్య సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటున్నారు. తన పర్సనల్ విషయాలతో పాటు ఫొటోలను తరచూ ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. చాలా ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న శాండల్‌వుడ్ క్వీన్ రమ్య మళ్లీ తెరపైకి వచ్చారు. దీంతోపాటు 'యాపిల్ బాక్స్ స్టూడియోస్' అనే నిర్మాణ సంస్థ ద్వారా కొత్త సినిమాలను నిర్మించడం మొదలుపెట్టారు. చాలా ఏళ్లుగా తెరపై కనిపించకపోయినా ఆమెకున్న క్రేజ్ మాత్రం తగ్గలేదు. తాజాగా రమ్య ఓ అభిమానితో ఫోటో దిగారు. అదే సమయంలో అభిమానితో రమ్య పలకరించిన తీరు అక్కడి వారందరిని మెప్పిస్తుంది. ఆ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. (ఇదీ చదవండి: రాజకీయాల్లోకి కీర్తి సురేష్.. గతంలోనూ ఇదే చర్చ) తన అభిమానులతో ఇంత సాదాసీదాగా వ్యవహరించడమే కాకుండా ఎంతో ఆప్యాయంగా పలకరించడం ఆమె అభిమానులకు సంతోషాన్నిచ్చింది. రమ్య సింప్లిసిటీని అభిమానులతో పాటు పలువురు మెచ్చుకుంటున్నారు. View this post on Instagram A post shared by Raone Pavan (@raone_pavan) -
ఆరు నెలల క్రితం ప్రేమ వివాహం: రమ్యతో బంధం తెంచుకోవాలని..
అన్నానగర్: గర్భిణిని హత్య చేసిన కేసులో ఆమె భర్త, అత్తమామలను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వివరాలు.. మదురై జిల్లా తిరుమంగళానికి చెందిన సతీష్ కుమార్ (31) డ్రైవర్. తేని జిల్లా కడమల కుందూకు చెందిన నర్సు రమ్య(25)ను ఆరు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. అనంతరం వేళాచ్చేరి మునియంతిపురంలోని కురింజినగర్‌లో కాపురం పెట్టారు. ఈ క్రమంలో రమ్య గర్భం దాల్చింది. అయితే సతీష్‌కుమార్, రమ్య మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. రమ్య ఇంటి నుంచి బయటకు వెళ్లిపోవడంతో బంధువులు ఆమెకు నచ్చజెప్పి తిరిగి ఇంటికి పంపించారు. శనివారం సతీష్ కుమార్ మరోసారి రమ్యతో గొడవపడ్డాడు. ఆగ్రహంతో నిర్మాణ పనులకు ఉపయోగించే దుంగతో కొట్టాడు. రమ్య తీవ్ర రక్తస్రావంతో మృతిచెందింది. తిరుపరంగున్రం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సతీష్‌కుమార్ తల్లిదండ్రులు రమ్యతో బంధాన్ని తెంచుకోవాలని ఒత్తిడి చేశారని.. ఈ క్రమంలోనే ఆమైపె దాడి జరిగిందని తెలిసింది. ఆదివారం రాత్రి రమ్య మృతదేహాన్ని మదురై ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లేందుకు ఆమె తల్లిదండ్రులు నిరాకరించారు. సతీష్‌కుమార్ (31), అతని తండ్రి సెల్వం (55), తల్లి పంచవర్ణంను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. -
కర్ణాటక ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షిస్తున్న సినీ గ్లామర్
-
ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు బుల్లితెర నటి ప్లాన్, చివరికి..
తమిళ సీరియల్ నటి రమ్య ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే చంపాలనుకుంది. పోలీసుల విచారణలో రమ్య కుట్ర బట్టబయలు కావడంతో నటిని, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడఘలోని నల్లగౌండన్‌కు చెందిన నటి రమ్య దంపతులు బైక్‌పై వెళుతున్నారు. ఇంతలో ఓ గుర్తు తెలియని వ్యక్తి తన వాహనంతో వీరి బైక్‌ను ఢీ కొట్టాడు. వెంటనే సదరు వ్యక్తి.. కిందపడిన రమేశ్‌ను తన దగ్గరున్న బ్లేడుతో గొంతు కోసి అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్ర గాయంతో ఆస్పత్రిలో చేరిన రమేశ్ ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణలో పోలీసులు అడిగిన ప్రశ్నలకు రమ్య పొంతన లేని సమాధానాలు చెప్తుండటంతో తనపై అనుమానం పెరిగింది. పోలీసులు ఆమె సెల్‌ఫోన్ పరిశీలించగా తనే భర్తను హత్య చేసేందుకు ప్లాన్ వేసినట్లు వెల్లడైంది. దంపతుల మధ్య దూరం పెరిగిందిలా.. రమ్య, రమేశ్‌ల మధ్య కొంతకాలం కిందట బేధాభిప్రాయాలు వచ్చాయి. రమ్య సీరియల్స్‌లో నటించడం తనకు ఇష్టం లేదని రమేశ్ చెప్పాడు. కానీ రమ్య అతడి మాట వినిపించుకోలేదు. ఈ క్రమంలో వీరి మధ్య తగాదాలు చోటుచేసుకున్నాయి. మాటామాటా పెరిగి గొడవలు పెద్దవి కావడంతో కొద్ది నెలలుగా వీరు కలిసి ఉండటం లేదు. నటిగానే కెరీర్ కొనసాగించాలనుకున్న రమ్య.. 'సుందరి', 'కన్నేదిరే తొండ్రినాల్' వంటి సీరియల్స్‌లో నటించింది. అదే సమయంలో సహనటుడు డేనియల్ (చంద్రశేఖర్)తో సన్నిహితంగా మెలగసాగింది. అతడితో కలిసి భర్త అడ్డు తొలగించుకోవాలనుకుంది. అటు చంద్రశేఖర్ కూడా రమేశ్ ఇల్లును పది లక్షలకు కొనుగోలు చేసుకోవాలనుకున్నాడు. అంత తక్కువ మొత్తానికి ఇల్లు అమ్మడం కుదరదన్నాడు రమేశ్. దీంతో ఇద్దరూ కలిసి రమేశ్‌ను అంతమొందించాలని ప్లాన్ చేశారు. చివరికి ప్లాన్ ఫెయిలవడంతో ఇద్దరూ కోయంబత్తూరు సెంట్రల్ జైలులో ఊచలు లెక్కబెడుతున్నారు. -
అమ్మానాన్న తర్వాత నాకు రాహుల్ గాంధీయే..: కన్నడ నటి
దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ అభి సినిమాతో చిత్రపరిశ్రమలో అడుగుపెట్టారు రమ్య (దివ్య స్పందన). ఆ మరుసటి ఏడాదే కుట్టు చిత్రంతో తమిళ్లో ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో బోలెడన్ని అవకాశాలు ఆమె తలుపు తట్టాయి. అలా తమిళ, కన్నడ, హిందీలో సినిమాలు చేశారు. తెలుగులో అభిమన్యు అనే ఒకే ఒక్క సినిమాలో నటించారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలోని చేదు సంఘటనల గురించి చెప్పుకొచ్చారు. 'నా తల్లిదండ్రులే నా ప్రాణం. నాన్న చనిపోయిన రెండు వారాలకే నేను పార్లమెంటులో అడుగుపెట్టాల్సి వచ్చింది. కానీ పార్లమెంటు కార్యకలాపాల గురించి నాకు ఏమీ తెలియదు. అయినా ప్రతీదీ నేర్చుకున్నాను. నేను నా బాధను పనివైపు మళ్లించాను. అంతటి శక్తిని నాకు మాండ్యా ప్రజలే ఇచ్చారు. జీవితంలో నన్ను ఎక్కువ ప్రభావితం చేసిన వ్యక్తుల్లో అమ్మానాన్నల తర్వాత రాహుల్ గాంధీ ఉన్నారు. నాన్న మరణంతో తీవ్ర దుఃఖంలో ఉన్న నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. మరోవైపు ఎన్నికల్లో ఓడిపోయాను. అలాంటి కష్ట సమయంలో రాహుల్ గాంధీ నాకు అండగా నిలబడి సహాయం చేశారు. మానసికంగా ధైర్యాన్ని నూరిపోసి సపోర్ట్ చేశారు' అని చెప్పుకొచ్చారు. కాగా 2012లో రాజకీయాల్లో ప్రవేశించిన ఆమె 2013లో మాండ్య లోక్ సభ స్థానానికి ఉప ఎన్నికల్లో గెలిచారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షురాలిగా పని చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తర్వాత ఆ పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆమె ఇటీవలే ఉత్తరకాండతో సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించారు. -
నటుడు నరేష్ ఇంటిపై దాడి.. మూడో భార్య చేయించిందని ఆరోపణ
సినీ నటుడు నరేష్ ఇంటిపై దుండగులు దాడి చేశారు. గచ్చిబౌలిలోని ఆయన ఇంటి ముందు పార్క్ చేసిన కారుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడి కారును ధ్వంసం చేశారు. ఈ విషయంపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసిన నరేష్.. తన మూడో భార్య రమ్య రఘుపతి దాడి చేయించిందని ఆరోపించాడు. నరేష్ ఫిర్యాదుపై రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. కాగా గత కొన్నిరోజులుగా నిత్యం వార్తల్లో నిలుస్తున్న నరేష్ ఇటీవలె తన మూడో భార్య రమ్యపై సంచలన ఆరోపణలు చేశారు. ఆస్తి కోసం తనను చంపేందుకు రమ్య ప్రయత్నించిందని, ఇంటివద్ద రెక్కీ కూడా నిర్వహించారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఆయన ఇంటిపై దాడి జరగడం పలు అనుమానాలకు తావిస్తుంది. -
నా కొడుకును ఏం చేశారు?: సీఎం కేసీఆర్ అన్న కూతురు
సాక్షి, హైదరాబాద్: తన కుమారుడు, ఎన్ఎన్యూఐ (నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా) తెలంగాణ జనరల్ సెక్రటరీ రేగులపాటి రితేశ్‌రావు ఆచూకీ చెప్పాలని సీఎం కేసీఆర్ అన్న కూతురు రేగులపాటి రమ్యారావు డిమాండ్ చేశారు. ఈమేరకు ఆమె శనివారం శాంతిభద్రతల అడిషనల్ డీజీ సంజయ్‌కుమార్ జైన్‌ను డీజీపీ కార్యాలయంలో కలిశారు. ప్రివెంటివ్ అరెస్టు చేసిన పోలీసులు రితేశ్‌రావు ఎక్కడ ఉన్నాడన్న జాడ చెప్పడం లేదని ఆమె ఆరోపించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ పోలీసులు అర్థరాత్రి తన ఇంటికి వచ్చి దౌర్జన్యం చేశారని చెప్పారు. ఫ్రెండ్లీ పోలీస్.. అంటున్న తెలంగాణ పోలీసులు తన కొడుకును పోలీసులు రక్షిస్తారా.. భక్షిస్తారా..? చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ వాళ్లు ఉద్యమం ముసుగులో ఎన్నో దౌర్జన్యాలు చేశారని, అలాంటి వాళ్లకు ఇప్పుడు అసెంబ్లీలో రక్షణ కల్పిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అసలు హోంమంత్రి ఉన్నారా..? లేరా..? అని ప్రశ్నించారు. పోలీసులు వెంటనే తన కొడుకు రితేశ్‌రావు ఆచూకీ చెప్పడంతోపాటు.. క్షమాపణ చెప్పాలని రమ్యారావు డిమాండ్ చేశారు. -
నరేశ్- రమ్య వ్యవహారంలో ట్విస్ట్.. రూ.10 కోట్ల సెటిల్మెంట్
సీనియర్ నటుడు నరేశ్- రమ్య రఘుపతి వ్యవహారంలో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. తనకు ప్రాణహాని ఉందంటూ కోర్టుకెక్కాడు నరేశ్. తన మూడో భార్య రమ్య సుపారీ ఇచ్చి హత్య చేయించాలని ప్రయత్నిస్తోందన్నాడు. తనను చంపేందుకు రాకేశ్ శెట్టితో ఇంటి దగ్గర రెక్కీ చేయించిందని కోర్టులో పిటిషన్ వేశాడు. తన ఫోన్ హ్యాక్ చేసి బ్లాక్మెయిల్ చేస్తోందన్నాడు. రమ్య వేధింపులను తట్టుకోలేకపోతున్నానని, ఆమె నుంచి విడాకులు కావాలని కోరుతున్నాడు. పెళ్లైన నెల నుంచే తనను వేధించేదని, కనీసం తనకు తినడానికి తిండి కూడా పెట్టేది కాదన్నాడు. ఏదైనా ఫంక్షన్ జరిగితే తాగి రచ్చ చేసేదని చెప్తున్నాడు. తనపై కంటే తన ఆస్తి, డబ్బుపైనే రమ్యకు ప్రేమ ఎక్కువంటున్నాడు. మరోవైపు రూ.10 కోట్ల రూపాయలతో సెటిల్మెంట్ చేసుకునేందుకు రెడీ అంటూ రమ్య మాట్లాడిన ఆడియో లీక్ ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది. చదవండి: ఎన్టీఆర్‌ను జమున కాలితో తన్నడంతో వివాదం -
నరేశ్‌కు పవిత్ర దగ్గరవ్వడానికి కారణం అదే: రమ్య
సినీ నటుడు నరేశ్ కొంతకాలంగా తన మూడో భార్య రమ్య రఘుపతికి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా నటి పవిత్రా లోకేశ్‌కు దగ్గరైన ఆయన ఆమెను పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. ఈ ఏడాది న్యూ ఇయర్ సందర్భంగా ఓ వీడియోను విడుదల చేసిన జంట మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా ఓ ఛానెల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు. రమ్య మాట్లాడుతూ..' నరేశ్ డివోర్స్ కావాలని పిటిషన్ వేశారు. అదే నాకు పెద్ద ఆధారం. నేను కూడా అలిగేషన్స్ వేశా. నేను ఏం అలిగేషన్స్ వేశానో ఆధారాలు ఉన్నాయి. ఆరు నెలలైనా ఇంతవరకు నాపై చేసినా ఆరోపణలు నిరూపించలేకపోయారు. డివోర్స్ కేసు కోర్టులో ఉండగా మాట్లాడటం సరికాదు. చైల్డ్ గార్డియన్ షిప్, నా మీద ఇంజక్షన్ ఆర్డర్ ఫైల్ చేశారు. నాపై రకరకాలుగా కేసులు వేశారు. నేను వీటన్నింటినీ ఎదుర్కొంటున్నా. నేను వేసిన ఒకే ఒక కేసు డొమెస్టిక్ వయోలెన్స్. నాకు, నా కుమారుడికి మెయింటనెన్స్ కావాలని వేశా. నా మీద ఆరోపణలు చాలా వచ్చాయి. ఆస్తి కోసం ఆమె ఇలా చేస్తోంది అని అన్నారు. నాకు నా పిల్లాడి జీవితం ముఖ్యం. అందుకే పోరాటం చేయడానికి నిర్ణయించుకున్నా. ఫైనల్‌గా నాకు విడాకులు వద్దనేదే నా నిర్ణయం.' అని అన్నారు. ఇటీవల వీడియోపై ఆమె మాట్లాడుతూ..' ఒక భార్యగా ఆయన నన్ను టీజ్ చేస్తున్నారు. ఆ వీడియోను రెండుసార్లు మాత్రమే చూశా. నా బాబుకు సెక్యూరిటీ ఇవ్వడమే నా లక్ష్యం. నేను ఎక్కడా తప్పు చేయలేదు. అలాంటప్పుడు నాపై నిందలు వేస్తే సహించను. నరేశ్ దగ్గరికి పవిత్ర రావడానికి కేవలం ఆర్థిక పరమైన కారణాలే. నరేశ్‌ను ఎవరితోనైనా ఉన్నప్పుడు నేను పట్టుకుంటే రెండు నెలలు నాతో బాగా ఉంటారు. ఆ సమయంలో ఇంట్లో అడిగేవారు ఎవరూ లేకపోవడంతో పవిత్ర దగ్గరైంది. గతంలో కూడా ఆయనకు ఎఫైర్స్ ఉండేవి. మా అత్త నాకు సర్ది చెప్పేవారు. నరేశ్ ఎప్పటికైనా మారుతారని చెప్పేది. ఆయన ఎలాంటి వారనేది మా ఫ్యామిలీకి చెప్పలేదు. నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నా. ఇది పూర్తిగా నా సమస్య. నా కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదు. నేను ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకున్నా. న్యాయస్థానంలోనే తేల్చుకుంటా.' అని రమ్య రఘుపతి అన్నారు. -
సుదీప్ చూపు ఆ పార్టీ వైపు.. సంప్రదింపులు జరుపుతున్న మాజీ ఎంపీ
బెంగళూరు: నటుడు కిచ్చ సుదీప్ కాంగ్రెస్‌లో చేరాలని ఆ పార్టీ ఆహ్వానిస్తోంది. ఈ మేరకు పార్టీ మాజీ ఎంపీ రమ్య సుదీప్తో సంప్రదింపులు జరుపుతున్నారు. వచ్చే విధానసభ ఎన్నికల నాటికి ప్రముఖ సినీ నటులను చేర్చుకోవాలని కాంగ్రెస్ యత్నిస్తోంది. ఈ నేపథ్యంలో రమ్య సినీ నటులతో చర్చలు సాగిస్తున్నారు. ఈ చర్చల్లో సుదీప్ స్పందన ఏమిటనేది ఉత్కంఠగా ఉంది. చదవండి: (చింతకాయల విజయ్‌కు షాకిచ్చిన చంద్రబాబు) -
నరేశ్ నా కాళ్లు పట్టుకుని ఏడ్చాడు: రమ్య
సినీ నటుడు నరేశ్ కొంతకాలంగా తన మూడో భార్య రమ్య రఘుపతికి దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో నటి పవిత్రా లోకేశ్‌కు దగ్గరైన అతడు ఆమెను పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో మీడియా ముందుకు వచ్చి సంచలన వ్యాఖ్యలు చేసింది రమ్య. 'మా ఇద్దరికీ విడాకులు మంజూరయ్యాయని వార్తలు వస్తున్నాయి. అది పూర్తిగా అవాస్తవం. కోర్టులో కేసు ఇంకా నడుస్తోంది. తను విడాకులు తీసుకుని ఇంకొకరితో సెటిలైపోదామనుకుంటున్నాడు. కానీ మా బాబు మేమిద్దరం కలిసే ఉండాలని కోరుకుంటున్నాడు. వాడి కోసమైనా నేను విడాకులివ్వను. అతడికి పవిత్రతో పెళ్లి జరగనివ్వను. నరేశ్ ఎన్నోసార్లు అమ్మాయిలతో అడ్డంగా దొరికిపోతే వచ్చి కాళ్లు పట్టుకుని సారీ చెప్పేవాడు, ఏడ్చేవాడు. నేను తల్లిలా క్షమించేదాన్ని. మొన్నటికి మొన్న నరేశ్- పవిత్ర లిప్‌లాక్ చూసి మీ నాన్న పెళ్లంటగా అని బాబును వాడి ఫ్రెండ్స్ ఆటపట్టిస్తున్నారట. పిల్లాడి మనసు గాయపడుతోంది. అతడి తప్పులను కప్పిపుచ్చుకునేందుకు నేను రాఖీ కట్టిన వ్యక్తితో, డ్రైవర్‌తో.. ఇలా చాలామందితో నాకు అక్రమ సంబంధం అంటగట్టాడు. నన్ను బద్నాం చేస్తున్నాడు. ఇన్ని నిందలు పడుతున్నా కూడా నేను బతికున్నానంటే అది నా కొడుకు కోసమే! సమ్మోహనం సినిమా సమయంలో పవిత్ర ఓ సారి ఇంటికి వచ్చింది. పిచ్చిదానిలా నేను ఆమెకు వడ్డించి సరదాగా కలిసిపోయాను. 'మా' ఎలక్షన్స్ సమయంలో నాకు తనమీద కొంత అనుమానం మొదలైంది. అతడి బర్త్‌డే రోజు ఇష్టమైన కేక్ తీసుకొస్తే కట్ చేయకుండా వెళ్లిపోయాడు. తర్వాత పవిత్ర దగ్గరకు వెళ్లి కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నాడు. నా కంట్లో నీళ్లు వస్తే ఆస్తిలో చిల్లిగవ్వ ఇవ్వనని నరేశ్‌ను హెచ్చరించింది అతడి తల్లి. కానీ ఎప్పుడైతే ఆమె మరణించిందో అతడికి హద్దు లేకుండా పోయింది' అని చెప్పుకొచ్చింది రమ్య. చదవండి: నరేశ్‌పై సంచలన ఆరోపణలు చేసిన రమ్య -
Actor Naresh: నరేశ్‌పై సంచలన ఆరోపణలు చేసిన మూడో భార్య
సినీనటుడు నరేశ్, ఆయన మూడో భార్య రమ్య రఘుపతి మధ్య విబేధాలు ఉన్న సంగతి తెలిసిందే! కొంతకాలంగా రమ్యకు దూరంగా ఉంటున్న నరేశ్ నటి పవిత్రతో సన్నిహితంగా ఉంటున్నాడు. దీంతో రమ్య.. భార్యను నేనుండగా వేరొకరితో ఎందుకు తిరుగుతున్నావంటూ రచ్చచేసింది. ఈ క్రమంలో ఇద్దరూ ఒకరిపై మరొకరు ఆరోపణలు గుప్పించుకున్నారు. తాజాగా రమ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నరేశ్ ఎలాంటివాడో చెప్పుకొచ్చింది. 'నరేశ్.. నాకు డ్రైవర్‌తో లింకు పెట్టాడు. ఎవరెవరితోనూ లింకులు కలిపాడు. అంత క్రియేటివిటీ ఆయనకే దక్కుతుంది. నా మీద అతడు నోటికొచ్చిన ఆరోపణలు చేస్తున్నకొద్దీ బాబు చాలా డిస్టర్బ్ అవుతున్నాడు. నిద్ర లేని రాత్రుళ్లు గడుపుతున్నాడు. ఎంతో హర్ట్ అవుతున్నాడు. అతడి గురించి ఒక్కసారి కూడా ఆలోచించడం లేదు. అంతేకాదు, నరేశ్ పోర్న్ వీడియోలు చూస్తాడు. నాన్న డర్టీ వీడియోలు చూస్తున్నాడని నా కొడుకు రణ్వీర్ వచ్చి చెప్పడంతో ఆ విషయం నాకు తెలిసింది. తండ్రిగా ఎంత బాధ్యతగా ఉండాలి? కానీ అతడు ఎంతో చండాలంగా ప్రవర్తిస్తున్నాడు' ఆగ్రహం వ్యక్తం చేసింది రమ్య. కాగా నరేశ్ ప్రస్తుతం నటి పవిత్ర లోకేశ్‌తో ప్రేమలో ఉన్నాడు. త్వరలోనే వీరి పెళ్లి కూడా జరగనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే వీరిద్దరూ తమ ప్రేమ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు. ఇందులో నరేశ్, పవిత్ర లిప్‌లాక్‌తో తమ ప్రేమను ప్రకటించారు. చదవండి: షారుక్ కొడుకే కాదు కూతురు కూడా లవ్‌లో పడింది -
అందుకే అప్పుడు సమంతను.. ఇప్పుడు దీపికాను ట్రోల్ చేస్తున్నారు: నటి రమ్య
బాలీవుడ్ బ్యూటీ క్వీన్ దీపికా పదుకొనె ప్రస్తుతం తీవ్ర వమర్శలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. తన తాజా చిత్రం పఠాన్ చిత్రం నుంచి ఇటీవల విడుదల బేషరమ్ రంగ్ పాటలో దీపికా వస్రధారణపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. పెళ్లయిన దీపికా బికిని దర్శించడంతో మహిళా సంఘాలు, నెటిజన్లు దీపికాను తిట్టి పోస్తున్నారు. ఈ పాటను తీసేయాలని, లేదంటే మూవీని బ్యాన్ చేస్తామంటూ డిమాండ్ వ్యక్తం అవుతున్నారు. అయితే అంతా దీపికా తీరు వ్యతిరేకిస్తూ ఆమెను విమర్శిస్తున్న నేపథ్యంలో ఓ నటి దీపికాకు మద్దతుగా నిలిచింది. చదవండి: విషాదం.. అవతార్ 2 సినిమా చూస్తూ వ్యక్తి మృతి ఆ నటి ఎవరో కాదు ప్రముఖ కన్నడ నటి, లోక్‌సభ మాజీ సభ్యురాలు రమ్య. ఈ మేరకు రమ్య ట్వీట్ చేస్తూ.. స్త్రీ ద్వేషంతోనే పలువురు దీపికాను ట్రోల్ చేస్తున్నారని, స్త్రీ వ్యతిరేకతపై ఎదురు తిరగాల్సిన అవసరం ఉందంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అంతేకాదు ఈ సందర్భంగా రమ్య.. సమంత, సాయి పల్లవి, రష్మీక మందన్నా గురించి కూడా ప్రస్తావించింది. ‘విడాకులు తీసుకుందనే కారణంతో అప్పట్లో సమంతను ట్రోల్ చేశారు. తన అభిప్రాయాన్ని బయటపెట్టిందని సాయి పల్లవిని, ఓ నటుడిని నుంచి విడిపోయిందని రష్మీకను ట్రోల్ చేశారు. ఇప్పుడు కురచ దుస్తులు వేసుకుందని దీపికాను విమర్శిస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మహిళలు ఇలాంటి చిన్న చిన్న కారణాలకే ద్వేషాన్ని ఎదుర్కొంటున్నారు. ఇష్టమైన వాటిని ఎంచుకోవడమే మన ప్రథమ హక్కు. మహిళలు దుర్గాదేవి రూపాలే అంటారు కదా. ఇక స్త్రీ ద్వేషం అనే రాక్షసుడిపై పోరాటం చేయాల్సి అవసరం ఉంది’ అంటూ రమ్య తన ట్వీట్లో రాసుకొచ్చింది. ఇక రమ్య ట్వీట్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. రష్మీకకు ఆమె మద్దతు తెలపడం నెటిజన్లు తీవ్రంగా మండి పడుతున్నారు. చదవండి: సోషల్ హల్చల్: జాన్వీ కపూర్ బ్యూటీ.. రెడ్ డ్రెస్‌లో కియారా లుక్స్ రష్మిక.. రెస్పాక్ట్కు అనర్హురాలని, తనకు అవకాశాలు ఇచ్చి, స్టార్ చేసిన కన్నడ పరిశ్రమ, ప్రొడక్షన్ పేరు చెప్పడానికి ఇష్టపడలేదు, అలాంటి ఆమెకు కన్నడలోనే కాదు ఎక్కడ గౌరవం ఉండదు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే బేషరమ్ రంగ్ పాటలో పూర్తిగా వల్గారిటీ ఉందని ప్రతి ఒక్కరు అంటున్నారని, అది కేవలం స్ట్రీ ద్వేషంతో వస్తుందని కాదంటూ’ కామెంట్స్ చేస్తున్నారు. కాగా కన్నడలో ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించిన రమ్య కళ్యాణ్ రామ్ అభిమన్యుడు మూవీతో టాలీవుడ్‌కు పరిచయమైంది. Samantha trolled for her divorce, Sai Pallavi for her opinion,Rashmika for her separation, Deepika for her clothes and many, many other women for pretty much EVERYTHING. Freedom of choice is our basic right. Women are the embodiment of Maa Durga- misogyny is an evil we must fight — Ramya/Divya Spandana (@divyaspandana) December 16, 2022 -
నరేష్ మూడో భార్యపై ఫిర్యాదు చేసిన పవిత్రా లోకేశ్
సినీ నటుడు నరేష్ మూడో భార్య రమ్య రఘుపతిపై నటి పవిత్రా లోకేశ్ ఫిర్యాదు చేసింది. కొన్ని యూట్యూబ్ ఛానల్స్‌ను అడ్డుపెట్టుకొని తనను కించపరుస్తుందని ఆమె ఆరోపించింది. రమ్య, నరేష్‌ల మధ్య కుటుంబ వివాదాలున్నాయి. రమ్యపై ఇప్పటికే పలు క్రిమినల్ కేసుల్లో జోక్యం చేసుకుంది. నా వ్యక్తిగత జీవితంపై రమ్య అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. నా పరువుకు భంగం కలిగేలా రమ్య వ్యవహరిస్తుంది. యూట్యూబ్ ఛానళ్ల ప్రచారం వెనుక రమ్య హస్తం ఉంది.పలు యూట్యూబ్ ఛానళ్లను రమ్యే వెనుక ఉండి నడిపిస్తుంది.అంతేకాకుండా గతంలో కూడా నాపై దాడి చేసేందుకు ప్రయత్నించింది అంటూ పవిత్రా తన ఫిర్యాదులో పేర్కొంది. కాగా నరేష్ తనకు సంబంధించి యూట్యూబ్ ఛానెళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని పవిత్రా లోకేశ్ పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఫోటోలు మార్ఫింగ్ చేసి అభ్యంతకర పోస్టులు చేస్తూ తన ఇమేజ్ను డ్యామేజ్ చేసేలా వ్యవహరిస్తున్న యూట్యూబ్ ఛానెల్స్, వెబ్సైట్లపై చర్యలు తీసుకోవాలని పవిత్రా తన ఫిర్యాదులో పేర్కొంది. కాగా గతంలో నరేష్, పవిత్ర లోకేశ్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. అనంతరం ఓ హోటల్ రూమ్‌లో నరేష్, పవిత్ర ఉండగా నరేష్ భార్య వచ్చి గొడవ చేశారు. దీంతో ఈ వివాదం వెలుగులోకి వచ్చింది. -
విజయపథం: ఆలోచనే ఆదాయం
చిన్నప్పుడెప్పుడో స్నేహితురాలికి సినిమా కథ చెప్పింది రమ్య. ఆ స్నేహితురాలు మరుసటిరోజే సినిమా చూసింది. ‘ఆ సినిమా కంటే నువ్వు చెప్పిన విధానమే బాగుంది’ అని రమ్యకు కితాబు ఇచ్చింది. ప్రతిభ వృథా పోదు అంటారు. రమ్యలోని ప్రతిభ కూడా అంతే. ఒక అంశాన్ని ఆకర్షణీయంగా చెప్పే ఆమె ప్రతిభ మార్కెటింగ్ రంగంలో తనకు ఎంతో బలాన్ని ఇచ్చింది. ‘రమ్య రామచంద్రన్... యంగ్ ఇన్ఫ్లూయెన్సర్ మార్కెటింగ్ ఎంటర్ప్రెన్యూర్’గా గుర్తింపు తెచ్చుకోవడానికి ఉపయోగపడింది. ‘హుపల్’ పేరుతో ముంబై కేంద్రంగా డిజిటల్ ఇన్ఫ్లూయెన్సర్ కంటెంట్ మార్కెటింగ్ ఏజెన్సీని స్థాపించి విజయం సాధించింది రమ్య. డిజిటల్ ఇన్ఫ్లూయెన్సర్ కంటెంట్ మార్కెటింగ్ రంగంలోకి అడుగు పెట్టడం సులువే కానీ, అక్కడ గెలుపు జెండా ఎగరేయడం మాత్రం సులువు కాదు. ఎంతో పోటీ ఉంటుంది. అందుకే ఆషామాషీగా ఏజెన్సి ప్రారంభించలేదు రమ్య. యాక్టివ్ సోషల్‌మీడియా యూజర్ల సంఖ్య ఎంత, ఏ వయసు వాళ్లు ఎక్కువ మంది ఉన్నారు, వారి స్క్రీన్టైమ్ ఎంత? ఇలాంటి ఎన్నో విషయాలను తెలుసుకొని ఏజెన్సీ ప్రారంభించింది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ల గురించి తెలుసుకుంటూ ఉండేది. ‘వీరి ప్రతిభను మనం ఎలా ఉపయోగించుకోగలమా’ అని ఆలోచించేది. ‘ఈ తరం వాళ్లకు ఏది చెప్పినా ఇది మాకు సంబంధించిన విషయమే అన్నట్లుగా చెప్పాలి. ఉన్న వాస్తవాన్ని పదింతలు పెద్దచేసి చూపించే కంటెంట్‌ను వారు ఇష్టపడడం లేదు’ అంటుంది రమ్య. డిజిటల్ ఇన్ఫ్లూయెన్సర్ కంటెంట్ మార్కెటింగ్‌కు ఉజ్వల భవిష్యత్ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని సరికొత్త భవిష్యత్ వ్యూహాలతో సిద్ధం అవుతుంది రమ్య. ‘విజయం అనేది ఒక ప్రాజెక్ట్ కు మాత్రమే పరిమితం. అది పునరావృతం కావాలంటే బుర్రకు ఎప్పుడూ పదును పెడుతూనే ఉండాలి. ఇతరుల కంటే ఎంత భిన్నంగా ఆలోచిస్తున్నామనేదే మన బలం అవుతుంది. మన విజయానికి ఇంధనం అవుతుంది’ అంటున్న రమ్య రామచంద్రన్ మాటలు నిజం కదా. -
హాట్సాఫ్ రమ్య.. మానవత్వంపై ఆశ కోల్పోయిన వారిలో ఆశలు రేకెత్తించావు
తల్లికి దూరమైన పన్నెండు రోజుల పసిపాప ఆకలితో ఏడుస్తోంది. ఆ ఏడుపు ఎక్కువై పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ‘పాపకు ఏమైనా అవుతుందేమో’ అనే భయం ఆవరించింది. అలాంటి విపత్కర సమయంలో దేవుడు పంపిన మనిషిలా వచ్చింది కానిస్టేబుల్ రమ్య... ఒక మహిళ గట్టిగా ఏడుస్తూ పోలీస్‌స్టేషన్‌కు వచ్చింది. ‘ఏమైంది?’ అని అడిగే లోపే తన బిడ్డను భర్త ఎత్తుకెళ్లిపోయాడని గుండెలు బాదుకుంది. తనకూ, భర్తకు మధ్య తగాదాలు జరుగుతున్నాయి. అతడి కోసం వెదికితే జాడలేదు. ‘పాప ఎన్ని ఇబ్బందులు పడుతోందో!’ అనే ఆందోళన అందరిలో మొదలైంది. ప్రాథమిక దర్యాప్తులో అతడు బెంగళూరుకు పారిపోయే ప్రయత్నంలో ఉన్నాడని తెలుసుకున్నారు. చెక్‌పోస్ట్‌ల దగ్గర నిఘా పెట్టారు. వయనాడ్ (కేరళ) సరిహద్దుల దగ్గర చెక్‌పోస్ట్‌లో బాధితురాలి భర్తను పట్టుకున్నారు పోలీసులు. అతడి చేతుల్లో పాప ఉంది. ఎప్పటి నుంచి ఏడుస్తుందో ఏడుస్తూనే ఉంది. పాపను తల్లి దగ్గరకు చేర్చాలంటే చాలా సమయం పట్టేట్లు ఉంది. ఈలోపు పాప పరిస్థితి ఆందోళనకరంగా మారింది, పాప బతకాలంటే పాలు పట్టాలి. తల్లి ఎక్కడో దూరంలో ఉంది. ఈ పరిస్థితుల్లో దేవుడు పంపిన మనిషిలా ముందుకు వచ్చింది పోలీస్ కానిస్టేబుల్ ఎంఆర్ రమ్య. పాప పరిస్థితి చూసి చలించిపోయింది. ఇంటి దగ్గరున్న తన పిల్లలు గుర్తువచ్చారామెకు. ఈ పాప తన మూడో పాప అనుకుంది. అక్కున చేర్చుకుని అమ్మలా పాలు పట్టింది. దాంతో ప్రమాదం తప్పింది. ‘పాపను తల్లికి అప్పగించి ఊరికి వచ్చేసరికి చాలా పొద్దుపోయింది. విపరీతమైన ఆకలి. ఏదైనా తిందామంటే ఒక్క దుకాణం కూడా తెరిచి లేదు. ఆ భయానకమైన ఆకలి కాస్తా ఈ రోజు నేను ఒక మంచిపని చేశాను అని గుర్తు తెచ్చుకోవడంతో మాయమైపోయింది’ అంటుంది రమ్య. రమ్య చేసిన మంచిపని పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. వారామెను సత్కరించి ప్రశంసించారు. కేరళ హైకోర్టు జడ్జి జస్టిస్ దేవన్ రామచంద్రన్ రమ్యను ప్రశంసిస్తూ ఉత్తరం రాశారు. అందులో ఇలా ఉంది... ‘నువ్వు చేసిన మంచి పని పోలీస్ డిపార్ట్మెంట్ మానవతా దృక్పథానికి అద్దం పడుతుంది. నిబద్ధత ఉన్న ఉద్యోగిగా, చల్లని మనసు ఉన్న తల్లిగా ఒకే సమయంలో రెండు విధులు నిజాయితీ గా నిర్వహించావు. మానవత్వంపై ఆశ కోల్పోయిన వారిలో ఆశలు రేకెత్తించేలా చేశావు...’ కోళికోద్‌కు చెందిన రమ్యకు ఇద్దరు పిల్లలు. భర్త స్కూలు టీచర్. ఒకప్పుడు రమ్య పేరు పెద్దగా ఎవరికీ తెలియదు. అయితే పాపకు పాలు పట్టిన వార్తతో ఆమె పేరు అందరికీ సుపరిచితం అయింది. ఎక్కడికి వెళ్లినా ‘చల్లగా జీవించు తల్లీ’ అనే దీవెనలు లభిస్తున్నాయి. -
వారిద్దరూ కలిసి ఎలా ఉంటారో చూస్తా.. నరేష్ మూడో భార్య రమ్య శపథం
మైసూరు: తాను ఇంకా విడాకులు తీసుకోలేదని, అయినా కూడా పవిత్ర ఎందుకు తన భర్తతో కలిసి తిరుగుతోందని నరేష్ మూడో భార్య రమ్య మండిపడింది. భర్తకు విడాకులు ఇవ్వను, అందరి ముందు ఆయనను పెళ్లి చేసుకున్నాను, నా భర్త మరో మహిళతో కలిసి తిరగడం సరికాదు, వారికి పోలీసులు అండగా ఉండడం ఏమిటి అని ప్రశ్నించింది. వారిద్దరు కలిసి ఎలా ఉంటారో చూస్తానని శపథం చేసింది. చదవండి: వేశ్య పాత్రలో యాంకర్ అనసూయ..! కొన్నిరోజులుగా చర్చనీయాంశమైన సీనియర్ సినీ నటుడు నరేష్, నటి పవిత్ర లోకేష్, నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి మధ్య గొడవ పతాక స్థాయికి చేరింది. ఆదివారం మైసూరులో నరేష్, పవిత్ర ఓ హోటల్లో ఒకే గదిలో ఉండగా, రమ్య అక్కడకొచ్చి ఇద్దరితో గొడవకు దిగింది. హోటల్ సిబ్బంది, పోలీసులు అడ్డుకున్నా ఆమె శాంతించలేదు. నరేష్, పవిత్రలు శనివారం రాత్రి ఆ హోటల్లో దిగారు. ఆదివారం ఉదయం రమ్య వారి గది వద్దకు వచ్చి డోర్ బెల్ నొక్కింది. కానీ, నరేష్ తలుపు తీయలేదు. రమ్య అక్కడే ఉండిపోయింది. హోటల్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారమివ్వడంతో వారు వచ్చి రమ్యకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఆమె ససేమిరా అంది. పోలీసులు ఆమెను అడ్డుకుని పక్కకు తీసుకెళ్లగా నరేష్, పవిత్రలు తలుపు తీసుకుని బందోబస్తు మధ్య బయటకు వచ్చారు. రమ్య గట్టిగా అరుస్తూ చెప్పు తీసుకుని వారి మీద దాడి చేయడానికి యత్నించింది. ఇద్దరు పోలీసులపైనా ఆమె దాడికి దిగింది. నరేష్ పవిత్రను తీసుకుని అక్కడనుంచి వెళ్లిపోయారు. -
హోటల్లో నరేశ్, పవిత్ర జంట.. చెప్పుతో కొట్టబోయిన రమ్య
Actor Naresh And Pavitra Lokesh: సినియర్ నటుడు నరేశ్, పవిత్ర లోకేష్ జంట మైసూర్లో ప్రత్యేక్షమైంది. మైసూర్‌లోని ఓ హోటల్ ఉన్న ఈ జంటను నరేశ్ మూడో భార్య రమ్య అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పవిత్రను చెప్పుతో కొట్టేందుకు రమ్య ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. రమ్యను చూసి నరేశ్ విజిల్స్ వేసుకుంటూ.. పవిత్రతో కలిసి లిఫ్ట్‌లో వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. (చదవండి: దయచేసి నాకు, నరేశ్‌కు సపోర్డు ఇవ్వండి..) గత కొన్ని రోజులుగా నరేశ్, పవిత్ర పెళ్లి చేసుకున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నరేశ్ మూడో భార్య రమ్య తెరపైకి వచ్చి తనకు విడాకులు ఇవ్వకుండానే పవిత్రా లోకేశ్‌ను నరేశ్ పెళ్లి చేసుకుంటున్నాడంటూ ఆరోపించారు. ‘నరేశ్ నన్ను మోసం చేశాడు. కొంతకాలం మేం కలిసి లేము. అలాగని విడాకులు తీసుకోలేదు. మాకు పిల్లలు ఉన్నారు. మళ్లీ నరేశ్ ఎలా పెళ్లి చేసుకుంటాడు?’ అని ప్రశ్నించారు. దీనిపై పవిత్ర లోకేష్ కూడా స్పందించారు. రమ్య కావాలనే తనను బ్యాడ్ చేస్తున్నారని మండిపడ్డారు. ఏదైన ఉంటే హైదరాబాద్‌లో మాట్లాడకుండా.. బెంగళూరు వచ్చి నన్ను చెడ్డగా చూపించడం కరెక్ట్ కాదన్నారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో కూడా విడుదల చేశారు. -
సోషల్ మీడియాలో అశ్లీల కామెంట్స్, పోలీసులను ఆశ్రయించిన హీరోయిన్
మాజీ ఎంపీ, హీరోయిన్ రమ్య తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలు. కన్నడ నటి అయిన రమ్య అభిమన్యు మూవీతో టాలీవుడ్‌కు హీరోయిన్గా పరిచయమైంది. ఆ తర్వాత పలు డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. కన్నడ, తమిళంలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన ఆమె సినిమాలకు గుడ్‌బై చెప్పి రాజకీయాల్లోకి అడుగు పెట్టింది. కాంగ్రెస్ పార్టీ ఎంపీగా చురుకుగా ఉండే రమ్య.. బీజేపీ అధికారంలోకి రావడంతో రాజీనామ చేసింది. చదవండి: అల్లు అర్జున్‌పై కేసు, తప్పుదోవ పట్టించారంటూ పోలీసులకు ఫిర్యాదు ప్రస్తుతం సినిమాలకు, రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆమె సోషల్ మీడియా యాక్టివ్‌గా ఉంటోంది. తన వ్యక్తిగత విషయాలతో పాటు ఫొటోలను తరచూ అభిమానులతో పంచుకుంటుంది. ఈ క్రమంలో రమ్యకు సోషల్ మీడియాలో చేదు అనుభవం ఎదురైంది. సోషల్ మీడియాలో ఓ వ్యక్తి తనని తరచూ ట్రోల్ చేస్తున్నాడని, అసభ్యకర కామెంట్స్ చేస్తూ ఇబ్బంది పెడుతున్నాడంటూ ఆమె పోలీసులను ఆశ్రయించింది. అతడిని అరెస్టు చేయాలని ఆమె బెంగళూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. చదవండి: కడపలో ‘జాతిరత్నాలు’ బ్యూటీ ఫరియా సందడి కాగా కన్నడ హీరో రక్షిత్ శెట్టి నటించిన చార్లీ 777 మూవీ నేడు(జూన్ 10) విడుదలైంది. నిన్న ప్రివ్యూ చూసిన రమ్య సినిమా బాగుందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. దీనికి ప్రీతమ్ ప్రిన్స్ అనే నెటిజన్ అశ్లీలమైన కామెంట్ చేశాడు. దీంతో రమ్య ప్రీతమ్ ప్రీన్స్ తరచూ తనని ట్రోల్ చేస్తున్నాడని, అతడి అరెస్టు చేయాలని కోరుతూ గురువారం బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ప్రీతమ్ ప్రిన్స్ వ్యక్తి ఎవరనేది తెలుసుకునే దిశగా విచారిస్తున్నారు. #Charlie777 is an emotional film that teaches us humans so caught up in our grand position in the chain of being the importance of love & the joie de vivre we need to embrace. Thank you @rakshitshetty @Kiranraj61 for this warm-hearted tearjerker. https://t.co/wzygIxkMFx — Divya Spandana/Ramya (@divyaspandana) June 7, 2022 -
తెలుగులో ‘లక్కీ స్టార్’గా వస్తున్న యశ్, ట్రైలర్ రిలీజ్
కేజీయఫ్ 1, కేజీయఫ్ 2 చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించాడు కన్నడ హీరో యశ్. ఈ మూవీతో అతడు ఒక్కసారిగా నేషనల్ స్టార్‌గా ఎదిగాడు. అయితే యశ్, రమ్య హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన లక్కీ చిత్రం కన్నడలో ఘన విజయం సాధించింది. దీంతో ఈ మూవీని ఇప్పడు తెలుగులో లక్కీ స్టార్‌గా తెలుగులోకి తీసుకువస్తున్నారు. కన్నడలో ఈ చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ నటి రాధికా కుమార్ స్వామి స్వయంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘లక్కీ స్టార్’ చిత్రాన్ని తీసుకువస్తున్నారు. రాధికా కుమారస్వామి సమర్పణలో శ్రీదుర్గా పరమేశ్వరి ప్రొడక్షన్స్ పతాకంపై రవిరాజ్ ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తున్నారు. డా.సూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం లవ్-కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందింది. తాజాగా ఈ మూవీ తెలుగు వెర్షన్ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా తెలుగు నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి టి.ప్రసన్నకుమార్ ‘లక్కీ స్టార్’ ట్రైలర్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కన్నడలో ఘన విజయం సాధించిన ఈ చిత్రం తెలుగులోనూ మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. కాగా ఈ కార్యక్రమంలో నిర్మాత రవిరాజ్, ఈ చిత్రానికి సాహిత్యం సమకూర్చిన గురు చరణ్, సంభాషణల రచయిత సూర్య, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కేశవ్ గౌడ్, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ అప్పాజీ పాల్గొన్నారు. కేజీఎఫ్ స్టార్ యశ్ చిత్రానికి పనిచేసే అవకాశం లభించడం పట్ల గీత రచయిత గురు చరణ్, డైలాగ్ రైటర్ సూర్య సంతోషం వ్యక్తం చేశారు. -
చీరకట్టులో కుర్రకారును కవ్విస్తున్న రమ్య పాండియన్ (ఫొటోలు)
-
నటి రమ్య వ్యాఖ్యలపై ఆగ్రహం
యశవంతపుర(బెంగళూరు): కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌పై నటి రమ్య చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో దుమారం రేపుతున్నాయి. రమ్యా ఆరోపణలు చేయడంపై కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డీకే శివకుమార్‌పై ఆరోపణలు చేసిన రమ్యా... కాంగ్రెస్‌లో ఉన్నారో లేదో తనకు తెలియదని, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మొహమ్మద్ నలపాడ్ తెలిపారు. ఆమెకు తమ పార్టీలో ఏ బాధ్యతలను అప్పగించలేదన్నారు. సమస్యలుంటే మాట్లాడాలి తప్ప ఆరోపణలు చేయటం తగదన్నారు. నలపాడ్ మాటలపై రమ్య స్పందించారు. బెయిల్‌పై ఉన్న వ్యక్తి నాపై ఆరోపణలు చేస్తున్నారంటూ రమ్య శుక్రవారం ట్వీట్ చేశారు. చదవండి: పెళ్లైన వారానికి పుట్టింటికొచ్చి అదృశ్యం.. ఇక్కడే అసలు ట్విస్ట్! -
ఎక్కడికీ పారిపోలేదు.. రాజీనామా చేశా
బెంగళూరు: తాను ఎక్కడికి పారిపోలేదని, వ్యక్తిగత కారణాల వల్లే రాజీనామా చేశానని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మాజీ అధ్యక్షురాలు, నటి దివ్య స్పందన(రమ్య) తెలిపారు. కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. సోషల్ మీడియాలో తనను ట్రోల్ చేయమని కాంగ్రెస్ తన కార్యకర్తలను ఆయన ఆదేశించారని ట్విటర్లో పేర్కొన్నారు. మోసం చేయలేదు ‘నేను బయటికి వచ్చాక నా విశ్వసనీయతను దెబ్బతీసేందుకు, ప్రత్యేకించి కన్నడ వార్తా ఛానళ్లలో ‘ఆమె కాంగ్రెస్ పార్టీని ఎనిమిది కోట్లకు మోసం చేసి పారిపోయింది’ అనే కథనాన్ని నాటారు. నేను పారిపోలేదు. నా వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేశాను. నేను కచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఎనిమిది కోట్లకు మోసం చేయలేదు. నిశ్శబ్దంగా ఉండటమే నా తప్పయింద’ని దివ్య స్పందన ట్వీట్ చేశారు. అసలేంటి వివాదం? పోలీస్ సబ్-ఇన్స్పెక్టర్ రిక్రూట్మెంట్ స్కామ్‌పై డీకే శివకుమార్ చేసిన ప్రకటనతో వివాదం మొదలైంది. పోలీస్ సబ్-ఇన్స్పెక్టర్ రిక్రూట్మెంట్ స్కామ్‌లో బహిరంగ వేదికలపై తనను ప్రశ్నించకుండా రక్షణ కోరుతూ ఉన్నత విద్యాశాఖ మంత్రి సీఎన్ అశ్వత్‌నారాయణన్.. కాంగ్రెస్ నాయకుడు ఎంబీ పాటిల్‌ను కలిశారని శివకుమార్ వెల్లడించారు. దీనిపై రమ్య స్పందిస్తూ.. పార్టీలకు అతీతంగా నాయకులు కలుసుకోవడం తప్పేంటని ప్రశ్నించారు. నిబద్దత కలిగిన కాంగ్రెస్‌వాది అయిన ఎంబీ పాటిల్ గురించి శివకుమార్ చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యాన్ని కలిగించాయని ట్వీట్ చేశారు. ఇన్నాళ్లు ఏమైపోయారు? ఈ నేపథ్యంలో ట్విటర్ వేదికగా శివకుమార్ మద్దతుదారులు రమ్యను ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. ఇన్నాళ్లు ఏమైపోయారని, ఇప్పుడే మేల్కొన్నారా అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. శివకుమార్ ఆదేశాలకు అనుగుణంగానే ఇదంతా జరుగుతోందని రమ్య ఆరోపించారు. ఈ వ్యవహారంపై స్పందించాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను కోరారు. ముందే రాజీనామా నిర్ణయం నటి రమ్య 2012లో యూత్ కాంగ్రెస్ ద్వారా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 2013లో ఆమె మాండ్య లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నికల్లో గెలిచారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో మోదీ వేవ్‌లో ఆమె ఓడిపోయారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షురాలిగా పనిచేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తర్వాత ఆ పదవికి రాజీనామా చేశారు. అయితే ఎన్నికల ఫలితాలు రావడానికి ముందే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్టు రమ్య వెల్లడించారు. ఇటీవల తరచుగా సోషల్ మీడియాలో కనిపిస్తున్నప్పటికీ.. రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. (చదవండి: మత మార్పిడుల నియంత్రణకు ఆర్డినెన్స్) -
Ramya Murder Case: ఉరిశిక్షపై శశికృష్ణ తల్లి స్పందన ఇదే..
సాక్షి గుంటూరు: శశికృష్ణకు ఉరిశిక్ష విధిస్తూ వచ్చిన తీర్పుపై ఏమీ మాట్లాడలేనని.. హైకోర్టుకు వెళ్లే ఆర్థిక స్థోమత మాకు లేదు. తమకు ప్రభుత్వమే న్యాయం చేయాలని శశికృష్ణ తల్లి భూలక్ష్మి అన్నారు. చదవండి: (రమ్య హత్య కేసులో సంచలన తీర్పు: కుటుంబ సభ్యులు ఏమన్నారంటే..) ఆమె మీడియాతో మాట్లాడుతూ.. 'మా అబ్బాయి ఇలా చేస్తాడని అసలు ఊహించలేదు. అసలు వారి మధ్య ఏం జరిగిందో కూడా మాకు తెలియదు. అంతకుముందు వారి ప్రేమ విషయం మాకు చెప్పలేదు. రమ్య తల్లిదండ్రులకు నేనేమీ చెప్పలేను. మావాడికి ఉరిశిక్ష వేస్తే చనిపోయిన పాప తిరిగి రాలేదు కదా?. ఆవేశం మీద మావాడు తప్పు చేశాడు. ఏ తల్లిదండ్రులకు ఇలాంటి బాధ రాకూడదు' అని శశికృష్ణ తల్లి భూలక్ష్మి అన్నారు. చదవండి: (బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసులో సంచలన తీర్పు) -
రమ్య హత్య కేసులో సంచలన తీర్పు: కుటుంబ సభ్యులు ఏమన్నారంటే..
సాక్షి, గుంటూరు: బీటెక్ విద్యార్థి రమ్య హత్య కేసులో గుంటూరు ఫాస్ట్ ట్రాక్ కోర్టు నిందితుడి శశిక్రిష్టకి ఉరిశిక్ష విధిస్తూ తీర్పును ఇచ్చింది. కోర్టు తీర్పుపై రమ్య కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఉరిశిక్ష అమలైన రోజు మరింత సంతోషిస్తామని రమ్య తల్లి అన్నారు. కష్టకాలంలోనూ ప్రభుత్వం పూర్తి అండగా నిలిచిందని తెలిపారు. ఇంత వేగంగా కేసు పూర్తవుతుందనుకోలేదన్నారు. రమ్య సోదరి మౌనిక మాట్లాడుతూ కేసు విచారణలో ఎక్కడా ఏ చిన్న అలక్ష్యం జరగలేదన్నారు. ప్రభుత్వం మొదటి నుంచి మాకు పూర్తి అండగా నిలిచిందని తెలిపారు. ఇదిలా ఉంటే, గతేడాది ఆగస్టు 15న తనను ప్రేమించడంలేదంటూ టిఫిన్ కోసం ఇంటి నుంచి బయటకు వచ్చిన బీటెక్ విద్యార్థి రమ్యను శశికృష్ణ దారుణంగా పొడిచి చంపాడు. ఘటన జరిగిన 9 నెలల్లోనే కేసు విచారణ పూర్తి చేసింది. సుదీర్ఘ వాదనల తర్వాత శశికృష్ణకు కోర్టు ఉరిశిక్ష విధించింది. 28 మంది సాక్షుల నుంచి వాంగూల్మం సేకరించింది. నేర నిర్థారణలో సీసీ ఫుటేజీ కీలకంగా మారిందని, సెక్షన్ 302 కింద ఉరిశిక్షను కోర్టు ఖరారు చేసిందని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. ప్రత్యక్ష సాక్షులతో పాటు డిజిటల్ ఎవిడెన్స్ కీలకంగా మారాయని ఎస్పీ తెలిపారు. పోలీసులు ప్రత్యేక శ్రద్ధతో కేసును పరిష్కరించారన్నారు. చదవండి: (బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసులో సంచలన తీర్పు) కేసు వివరాలిలా.. ►ఆగస్టు 15, 2021న రమ్య హత్య ►సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడి గుర్తింపు ►10 గంటల వ్యవధిలో అరెస్టు ►2 రోజుల్లో ఫోరెన్సిక్, డీఎన్ఏ నిర్ధారణ ►దిశ కింద కొత్త ల్యాబులు, సామర్థ్యం పెంపుతో అత్యంత వేగంగా ఫోరెన్సిక్ ఫలితాలు ►ఘటన జరిగిన వారంరోజుల్లో దిశ ప్రకారం ఛార్జి షీటు దాఖలు ►క్రమం తప్పకుండా కోర్టు విచారణ ►వాదనలు వినిపించిన దిశ ప్రత్యేక న్యాయవాది ►257 రోజుల్లో తీర్పు ఇచ్చిన గుంటూరు కోర్టు ►ఏప్రిల్ 29, 2022న నిందితుడికి ఉరిశిక్ష విధించిన కోర్టు -
T20 Trophy: హైదరాబాద్ శుభారంభం
T20 Cricket Tournament- పుదుచ్చేరి: జాతీయ సీనియర్ మహిళల టి20 క్రికెట్ టోర్నమెంట్లో హైదరాబాద్ జట్టు శుభారంభం చేసింది. ఎలైట్ ‘ఎ’ గ్రూప్‌లో భాగంగా సోమవారం మేఘాలయ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 64 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. మొదట హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 143 పరుగులు చేసింది. కెప్టెన్ రమ్య (44; 4 ఫోర్లు), కె.అనిత (34 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్), జి.త్రిష (20 బంతుల్లో 26; 3 ఫోర్లు) రాణించారు. అనంతరం 144 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మేఘాలయ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 73 పరుగులు చేసి ఓడిపోయింది. హైదరాబాద్ బౌలర్లలో ప్రణవి చంద్ర, భోగి శ్రావణి, అనిత, వంకా పూజ ఒక్కో వికెట్ తీశారు. చదవండి: IPL 2022: బట్లర్ భళా... చహల్ చాంగుభళా -
రమ్య కుటుంబానికి ఐదు సెంట్ల ఇంటిపట్టా అందజేత
-
ఏపీ: రమ్య కుటుంబానికి ఐదు సెంట్ల ఇంటిపట్టా అందజేత
సాక్షి, గుంటూరు: రమ్య కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉందని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. బీటెక్ విద్యార్థిని రమ్య కుటుంబానికి ఐదు సెంట్ల నివాస స్థలానికి సంబంధించిన పట్టాను శనివారం సుచరిత అందజేశారు. హోంమంత్రి వెంట ఎమ్మెల్యేలు మేరుగు నాగార్జున, ముస్తఫా, మద్దాలి గిరిధర్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ ఉన్నారు. (చదవండి: AP: మెడికల్ స్టాఫ్ ఉద్యోగాలు.. అప్లై చేయండి) ఈ సందర్భంగా మంత్రి సుచరిత మాట్లాడుతూ, రమ్య కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారని, రమ్య సోదరి మౌనికకు డిగ్రీ పూర్తయ్యేంత వరకు ఆగకుండా వెంటనే ఉద్యోగం కల్పించాలని సీఎం ఆదేశించారన్నారు. రమ్య హత్య కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. అందరూ దిశ యాప్‌ను ఉపయోగించుకోవాలని సూచించారు. పాలడుగు ఘటనలో పోలీసు విచారణ జరుగుతుందని నిందితులను పట్టుకోగానే మీడియా ముందు పోలీసులు ప్రవేశపెడతారన్నారు. విచారణ దశలో పూర్తి వివరాలను వెల్లడిస్తే నిందితులు తప్పించుకునే అవకాశం ఉందని, ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు జరుగుతోందని మంత్రి సుచరిత వెల్లడించారు. చదవండి: పొలం వివాదం: సెల్ఫీ వీడియోలపై స్పందించిన సీఎంవో -
రమ్య హత్య కేసు: ఏపీ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించారు..
గుంటురు: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారిన బీటెక్ విద్యార్థిని రమ్య హత్య ఘటన దురదృష్టకరమని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... హత్య కేసులో పోలీసులు వెంటనే స్పందించారని తెలిపారు. నిందితుడు శశికృష్ణను అరెస్టు చేసే సమయంలో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించారని పేర్కొన్నారు. ఏపీ పోలీసులు స్పందించిన తీరుపై ఎస్సీ కమిషన్ సైతం ప్రశంసించిందని అన్నారు. కాగా, వార్తలు ప్రచురించే విషయంలో తొందరపాటు వద్దని పేర్కొన్నారు. చదవండి: గుంటూరులో పట్టపగలు దారుణం.. ఇంజనీరింగ్ విద్యార్థిని హత్య చదవండి: మీడియా ముందుకు బీటెక్ విద్యార్థిని హత్యకేసు నిందితుడు -
రమ్య మృతి ఘటన: ప్రభుత్వ చర్యలపై జాతీయ ఎస్సీ కమిషన్ సంతృప్తి
గుంటూరు: రమ్య మృతిపై ప్రభుత్వం ఎలా స్పందిచిందో జాతీయ ఎస్సీ కమిషన్‌ను కలిసి వివరించినట్లు వైఎస్సార్సీపీ నేతలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్సోషల్ జస్టిస్ గవర్నమెంట్ అడ్వైజర్ జూపూడి ప్రభాకర రావు మాట్లాడుతూ.. 24 గంటల్లోపు పోలీసులు నిందితుడిని పట్టుకున్నారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ చట్టం ప్రకారం బాధిత కుటుంబానికి సాయం చేశామన్నారు. ప్రభుత్వ చర్యలకు జాతీయ ఎస్సీ కమిషన్ సంతృప్తి చెందినట్లు పేర్కొన్నారు. చదవండి: అవినీతికి బ్రాండ్ వరదాపురం సూరి సీఎం జగన్ న్యాయం చేశారని రమ్య కుటుంబసభ్యులే చెప్తున్నారని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వాలు స్పందించలేదన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం వెంటనే స్పందించి నాలుగు రోజుల్లో న్యాయం చేసిందని కమిషన్ చెప్పినట్లు తెలిపారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ ఘటనపై చంద్రబాబు నీచ రాజకీయాలు మానుకోవాలని జూపూడి ప్రభాకర్ హితవు పలికారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు డొక్కా మాణిక్య వరప్రసాద్, మేరుగ నాగార్జున, విడదల రజని, లక్ష్మణ్‌రెడ్డి పాల్గొన్నారు. చదవండి: 200 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత -
రమ్య హత్య ఘటన ఇప్పటికీ కలచి వేస్తోంది: సుచరిత
-
రమ్య కుటుంబానికి ఇంటి పట్టా
సాక్షి, గుంటూరు : ప్రేమోన్మాది చేతిలో ఇటీవల హత్యకు గురైన బీటెక్ విద్యార్థిని రమ్య కుటుంబానికి ప్రభుత్వం ఇంటి స్థలం పట్టాను అందజేసింది. గుంటూరు పరమాయకుంటలోని రమ్య ఇంటికి రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత, జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యేలు శుక్రవారం వెళ్లి ఇంటి నివేశన స్థలం పట్టాను అందజేసి పరామర్శించారు. ఈ సందర్భంగా హోం మంత్రి సుచరిత మాట్లాడుతూ రమ్య కుటుంబానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పూర్తిస్థాయిలో అండగా నిలిచారని చెప్పారు. రమ్య కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం చేశామన్నారు. ఏటుకూరులో ఇంటి స్థలాన్ని కేటాయించడంతోపాటు రమ్య సోదరి మౌనికకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని వివరించారు. వేధింపులకు గురయ్యే యువతులు, మహిళలు వెంటనే దిశ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ టీడీపీ నాయకులు శవ రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు.ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, షేక్ మహ్మద్ ముస్తఫా, మద్దాల గిరిధర్, జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ లాల్పురం రాము, తదితరులు పాల్గొన్నారు. చదవండి : అమరుల త్యాగాన్ని స్మరించడమే మొహర్రం : సీఎం జగన్ -
లోకేష్ ఏం మాట్లాడుతున్నారో.. ఆయనకే అర్థం కాదు
తూర్పుగోదావరి: బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసును టీడీపీ రాజకీయం చేస్తోందని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ విమర్శించారు. గురువారం ఆమె మాట్లాడుతూ.. మహిళల రక్షణ కోసం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి దిశా చట్టం తీసుకొచ్చారని గుర్తుచేశారు. ఆడపిల్లలకు అన్యాయం జరిగితే టీడీపీ నేతలు ఎప్పుడైనా పట్టించుకున్నారా..అని ప్రశ్నించారు. నారా లోకేష్ ఏంమాట్లాడుతున్నారో.. ఆయనకే అర్థంకాదని మండిపడ్డారు. -
కష్టంలో జగనన్న అండగా నిలిచారు: రమ్య తల్లి
సాక్షి, అమరావతిబ్యూరో: కన్న కూతురిని కోల్పోయి కష్టాల్లో ఉన్న తనకు జగనన్న అండగా నిలిచి భరోసా ఇచ్చారని ఇటీవల గుంటూరులో హత్యకు గురైన బీటెక్ విద్యార్థిని రమ్య తల్లి జ్యోతి చెప్పారు. గుంటూరులోని తమ నివాసంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఇలాంటి కష్టం ఏ తల్లికి రాకూడదన్నారు. తన కూతురు హత్యకు గురైన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించారన్నారు. నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయడం సంతోషకరమని చెప్పారు. తమ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడానికి ప్రభుత్వం తరఫున రూ.10 లక్షల చెక్కు ఇవ్వడమేకాకుండా మరో రూ.4.5 లక్షల సాయాన్ని తమ బ్యాంకు ఖాతాలో జమచేశారని తెలిపారు. ఇతర కుటుంబ అవసరాల నిమిత్తం మరికొంత నగదు సాయం అందిందన్నారు. ప్రభుత్వం తరఫున ఇంటి స్థలం, వ్యవసాయ పొలం ఇవ్వడానికి అవసరమైన పనులు జరుగుతున్నాయన్నారు. సీఎం ఆదేశాలతో అధికారులు త్వరగా స్పందించి ఆ పనులు పూర్తిచేస్తున్నారని తెలిపారు. తమ పెద్ద కుమార్తెకు ఉద్యోగం ఇస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని చెప్పారు. ఈ సమయంలో తమకు జగనన్న పూర్తి అండగా నిలిచారన్నారు. తమపైన ఒత్తిడి తెచ్చి ఇలా చెప్పిస్తున్నారంటూ బయట దుష్ప్రచారం చేయడం బాధాకరమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తమ కుటుంబానికి న్యాయం చేశారు కాబట్టే ఆయనకు కృతజ్ఞతలు చెబుతున్నామన్నారు. నిందితుడికి త్వరగా ఉరిశిక్ష పడాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. నేనున్నానంటూ భరోసా ఇచ్చారు దుర్ఘటన జరిగిన తర్వాత ఇక నా చెల్లి లేదని నేను మర్చిపోకముందే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మీకు నేనున్నానంటూ అండగా నిలిచారని రమ్య సోదరి మౌనిక చెప్పారు. ఆయన బహుశా తనను కూడా చెల్లిగా భావించి ఉంటారని, అందుకే అంత త్వరగా స్పందించారని పేర్కొన్నారు. ఘటన జరిగిన నాలుగు రోజుల్లోపే అందాల్సిన సహాయం మొత్తాన్ని ప్రభుత్వం అందజేసిందన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో అధికారులు కూడా వెంటవెంటనే స్పందించి తమకు న్యాయం చేశారన్నారు. తమ కుటుంబానికి అండగా ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. రమ్య తండ్రి వెంకట్రావు మాట్లాడుతూ ప్రభుత్వం తమకు పూర్తిగా అండగా నిలిచిందని, నిందితుడికి దిశ చట్టం అమలు చేసి త్వరగా శిక్షపడేలా చూడాలని కోరారు. -
ఒక చెల్లిగా సీఎం జగన్ కు నా మనవి
-
సీఎం జగన్ వెంటనే స్పందించారు: రమ్య తల్లి జ్యోతి
సాక్షి, గుంటూరు: బీటెక్ విద్యార్థిని రమ్య హత్య సంఘటన జరగగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటనే స్పందించారని బాధితురాలి తల్లి జ్యోతి తెలిపారు. తమ కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును అందించారని వెల్లడించారు. మరో రూ.4.5 లక్షల ఆర్థిక సాయాన్ని కూడా అందించారని తెలిపారు. తమ కుటుంబానికి ముఖ్యమంత్రి పూర్తి అండగా నిలిచారని పేర్కొన్నారు. ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం మీడియాతో మాట్లాడారు. తన కూతురిని హత్యచేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆమె ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్‌ను కోరారు. చదవండి: రమ్య హత్యకు ముందు రెక్కీ చదవండి:‘ఈ ప్రభుత్వంలో ఏ ఒక్క దళితుడికి అన్యాయం జరగదు’ నా చెల్లి లేదని నేను మర్చిపోకముందే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేనున్నానని అండగా నిలిచారని రమ్య సోదరి మౌనిక తెలిపారు. బహుశా తనను కూడా ముఖ్యమంత్రి చెల్లిగా భావించి ఉంటారని ఆమె పేర్కొన్నారు. ఈ ఘటన జరిగిన నాలుగు రోజుల్లో ప్రభుత్వం ముందుకొచ్చి సాయం చేసిందన్నారు. అధికారులు కూడా వెంట వెంటనే స్పందించారని తెలిపారు. తమ కుటుంబానికి అండగా ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మౌనిక ధన్యవాదాలు తెలిపారు. -
‘ఈ ప్రభుత్వంలో ఏ ఒక్క దళితుడికి అన్యాయం జరగదు’
సాక్షి, తాడేపల్లి: బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసు విషయంలో ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుందని ఏపీ సోషల్ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ సునీల్ కుమార్ తెలిపారు. ఘటన జరిగిన 12 గంటల్లోనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి 10 లక్షల రూపాయల పరిహారం కూడా ప్రభుత్వం అందించిందని వెల్లడించారు. అయితే నారా లోకేష్‌బాబు, ఆ పార్టీ నేతలు రాజకీయ ఉనికి కోసం ఆందోళనలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ నేతలకు దళితుల గురించి మాట్లాడే అర్హత లేదని దుయ్యబట్టారు. దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారని అన్న చంద్రబాబు ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నాడని మండిపడ్డారు. అప్పుడు లేవని ఆ పార్టీలోని దళిత నాయకుల నోళ్లు ఇప్పుడెందుకు లేస్తున్నాయని ప్రశ్నించారు. ఆ నాడు చంద్రబాబు సహా టీడీపీ నేతలు దళితుల గురించి మాట్లాడిన మాటలు గుర్తులేవా అని, అప్పుడు ఈ దళితుల నోళ్లు ఎందుకు లేవలేదని విమర్శించారు. చంద్రబాబు మెప్పు కోసం పని చేయవద్దని టీడీపీ నాయకులకు సునీల్ కుమార్ హితవు పలికారు. దళితులకు అండగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అంబేద్కర్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వంలో ఏ ఒక్క దళితుడికి అన్యాయం జరగదని భరోసానిచ్చారు. టీడీపీ హయాంలో దళితుల్లో కేవలం ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తే వైఎస్ జగన్ 5 మందికి పైగా మంత్రి పదవులు ఇచ్చారని గుర్తు చేశారు. రాష్ట్రంలోని దళితులంతా జగనన్న వెంటే ఉన్నారని, టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా మమ్మల్ని జగనన్నతో విడదీయలేరని స్పష్టం చేశారు. చదవండి: రమ్య హత్యకు ముందు రెక్కీ పాక్‌లో దారుణం: మహిళా టిక్‌టాకర్‌పై 300 మంది దాడి! -
రమ్య హత్యకు ముందు రెక్కీ
పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): గుంటూరులో ఈ నెల 15న బీటెక్ విద్యార్థిని రమ్యను హత్యచేసిన శశికృష్ణ ముందురోజు రెక్కీ నిర్వహించినట్లు తెలిసింది. అతడిని పోలీసులు విచారించినప్పుడు మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఈ ఏడాది జనవరిలో ఇన్‌స్ట్రాగామ్‌లో రమ్యకు, వట్టిచెరుకూరు మండలం ముట్లూరు గ్రామానికి చెందిన నిందితుడు కుంచాల శశికృష్ణకు పరిచయం ఏర్పడింది. కొద్దిరోజులు ఇద్దరూ ఇన్‌స్ట్రాగామ్‌లో స్నేహంగా మెలిగారు. తనని ప్రేమించాలంటూ శశికృష్ణ వేధిస్తుండటంతో రమ్య ఇన్‌స్ట్రాగామ్‌తోపాటు, అతడి ఫోన్ నంబరును బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది. ఈ క్రమంలో శశికృష్ణ ఏప్రిల్‌లో రమ్య స్వగ్రామమైన చిలుమూరు వెళ్లి ఇబ్బంది పెట్టాడు. రమ్య కళాశాలకు వస్తోందా.. లేదా అని తెలుసుకునేందుకు ఈ నెల 14న శశికృష్ణ బుడంపాడులోని కళాశాలకు వెళ్లాడు. ద్విచక్ర వాహనంపై తన స్నేహితుడితో కలిసి వెళ్లిన అతడు దూరం నుంచి రమ్యను చూశాడు. బస్సు దిగుతూ శశికృష్ణను గమనించిన రమ్య భయంతో తన స్నేహితురాలితో కలిసి కళాశాలలోకి పరుగులు పెట్టింది. అదేరోజు సాయంత్రం ఇద్దరు స్నేహితులతో కలిసి కాలేజీ వద్దకు వెళ్లాడు. మధ్యాహ్నానికే కాలేజీ అయిపోవడంతో రమ్య అప్పటికే ఇంటికి వెళ్లిపోయింది. తనతో ఉన్న స్నేహితుల్లో ఒకరి వద్ద కత్తిని తీసుకున్న శశికృష్ణ ఈ నెల 15న ఉదయం కాకానిరోడ్డులో రమ్య కోసం మాటేశాడు. ఆ సమయంలో టిఫిన్ కోసం వచ్చిన రమ్యతో.. తనను ఎందుకు ప్రేమించడంలేదంటూ వాదులాటకు దిగాడు. రమ్య ఫోన్ లాక్కున్నాడు. టిఫిన్ ఇంట్లో ఇచ్చి, తన ఫోన్ కోసం వచ్చిన రమ్యను బండి ఎక్కాలని బలవంతం చేశాడు. దీంతో రమ్య శశికృష్ణను నెట్టి ఫోన్ తీసుకుని ఇంటికి వెళుతున్న క్రమంలో అడ్డగించి కత్తితో పొడిచి చంపేశాడు. నిష్పక్షపాత దర్యాప్తు చేయండి రమ్య హత్యపై డీజీపీకి జాతీయ మహిళా కమిషన్ లేఖ సాక్షి, న్యూఢిల్లీ: గుంటూరులో బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసులో నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని ఏపీ డీజీపీకి జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) ఆదేశించింది. ఈ మేరకు ఎన్సీడబ్ల్యూ చైర్పర్సన్ రేఖాశర్మ మంగళవారం డీజీపీకి లేఖ రాశారు. మహిళలపై జరుగుతున్న దాడులు, భద్రత గురించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా సుమోటోగా కేసు స్వీకరిస్తున్నట్లు ఎన్సీడబ్ల్యూ ట్వీట్ చేసింది. -
ప్రేమోన్మాదికి కఠిన శిక్ష పడేలా చర్యలు
సాక్షి, అమరావతి: రమ్య హత్యకేసులో నిందితుణ్ని 24 గంటల్లోనే అరెస్టు చేశామని, ఆ ఉన్మాదికి కఠినశిక్ష పడేలా చర్యలు తీసుకుంటున్నామని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత చెప్పారు. రమ్య కుటుంబానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.10 లక్షల ఆర్థిక సçహాయం అందించి, అండగా నిలిచారని తెలిపారు. దీన్ని మానవత్వమంటారేగానీ చేతులు దులుపుకోవడం అనరని టీడీపీ నేతలకు చురకలు అంటించారు. మానవత్వమే సీఎం వైఎస్ జగన్ మతం అని పునరుద్ఘాటించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. దిశ చట్టం ఎక్కడుందని ప్రతిపక్షాలు మాట్లాడటం సిగ్గుచేటన్నారు. పక్క రాష్ట్రమైన తెలంగాణలో జరిగిన ఓ సంఘటన ఆధారంగా మహిళా భద్రతకు పెద్దపీట వేస్తూ సీఎం వైఎస్ జగన్ దిశ చట్టాన్ని తీసుకొచ్చారని గుర్తుచేశారు. ఈ బిల్లు ఆమోదం పొందాక రాష్ట్రంలో 18 దిశ పోలీస్ స్టేషన్లు, మూడు ఫోరెన్సిక్ ల్యాబ్‌లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దర్యాప్తు వేగం పెరిగిందన్నారు. కేసు దర్యాప్తునకు 2019 నాటికి 100 రోజులు పట్టేదని, 2020లో 86 రోజులు పట్టిందని, 2021లో 42 రోజుల్లోనే పూర్తిచేస్తున్నామని తెలిపారు. కేసు నమోదైన ఏడు రోజుల్లోనే చార్జ్‌షీట్ దాఖలు చేయాలని దిశ బిల్లులో ఉన్నట్లు చెప్పారు. దిశ చట్టం ఇంకా అమల్లోకి రాకపోయినా.. బిల్లు ఆమోదం పొందిన తరువాత మహిళ భద్రతతో పాటు, శిక్షలు అమలు చేయడంలోనూ రాష్ట్ర పోలీస్‌శాఖ ఎంతో వేగంగా పనిచేస్తోందని చెప్పారు. దాన్లో పేర్కొన్న మేరకు రోజుల్లోనే విచారణ పూర్తిచేసి శిక్షలు పడేలా చేస్తున్నామన్నారు. ఈ బిల్లు ఆమోదం పొందాక 1,645 కేసులకు సంబంధించి ఏడు రోజుల్లోనే చార్జ్‌షీట్ దాఖలు చేశామన్నారు. వీటిలో దాదాపు 60 అత్యాచార కేసులు, 92 అత్యాచార, పోస్కో కేసులు, 130 పోస్కో యాక్ట్ కేసులు, 718 వేధింపులు ఉన్నాయని వివరించారు. 1,531 సైబర్ బెదిరింపులు, 2,017 లైంగిక వేధింపుల కేసుల్లో చార్జ్షీట్లు దాఖలు చేశామని చెప్పారు. దాదాపు 2,114 కేసులలో 15 రోజుల్లో చార్జ్‌షీట్ దాఖలు చేశామన్నారు. ఇవన్నీ ‘దిశ’ ద్వారానే జరిగాయని గుర్తుచేశారు. దిశ బిల్లు ఆమోదం పొందిన తరువాత నేరాలు నాలుగు శాతం తగ్గాయని తెలిపారు. 2.11 లక్షలమంది లైంగిక నేరస్తుల వివరాలు జియో ట్యాగింగ్ మొత్తం 2.11 లక్షల మంది లైంగిక నేరస్తుల వివరాలు సేకరించి జియో ట్యాగింగ్ చేసినట్లు చెప్పారు. మహిళలపై దాడిచేసిన 148 మందికి ‘దిశ’ ప్రకారం శిక్షలు పడ్డాయని, వారిలో ముగ్గురికి ఉరిశిక్ష, 17 మందికి జీవితఖైదు, ముగ్గురికి 20 ఏళ్ల జైలుశిక్ష, 10 మందికి పదేళ్ల జైలుశిక్ష పడేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. దిశ యాప్‌ను దాదాపు 39 లక్షలమంది డౌన్లోడ్ చేసుకున్నారన్నారు. 3.10 లక్షలమంది దిశ యాప్‌ను ఉపయోగించుకున్నారని, దానిద్వారా వచ్చిన ఫిర్యాదుల్లో 2,988 కాల్స్‌పై చర్యలు తీసుకుని, 436 కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశామని చెప్పారు. చాలా కేసుల్లో నిందితులు మద్యంతో పాటు, మాదక ద్రవ్యాలు వినియోగించినట్లు కనిపిస్తోందన్నారు. రమ్య హత్యకేసులో నిందితుడు శశికృష్ణ విషయంలో కూడా మాదకద్రవ్యాల వినియోగం దిశగా విచారణ జరుగుతోందని చెప్పారు. తాడేపల్లి ఘటనలో నిందితులను అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. లోకేష్ పరామర్శల పేరుతో శవరాజకీయాలు చేస్తూ గందరగోళం సృష్టించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. విద్యార్థుల్లో సామాజిక చైతన్యం, çస్పృహ కల్పించే విధంగా నూతన విద్యావిధానానికి సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు నైతిక విలువలు నేర్పించేలా చర్యలు తీసుకుంటున్నారన్నారు. అప్పుడేం చేశావ్ చంద్రబాబూ? దిశ యాప్ ప్రచారం కోసమే అని మాట్లాడుతున్న ప్రతిపక్షం.. గతంలో అధికారంలో ఉన్నప్పుడు మహిళల భద్రతకు ఏం చేసిందో చెప్పాలని సుచరిత నిలదీశారు. ఏనాడూ బాధితులకు పైసా సాయం చేయని చంద్రబాబు ఇప్పుడు విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎమ్మార్వో వనజాక్షిపై చేయిచేసుకున్న టీడీపీ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోకపోగా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు వారిమధ్య రాజీచేశారని గుర్తుచేశారు. ర్యాగింగ్ భూతానికి బలైన రిషితేశ్వరి కుటుంబానికి ఏం న్యాయం చేశారని, కాల్‌మనీకి సంబంధించి మహిళలపై అత్యాచారాలు జరిగిన కేసులో ఎవరిపై చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు, ఆయన కేబినెట్లో మంత్రి ఆదినారాయణరెడ్డి దళితుల్ని కించపరిచేలా వ్యాఖ్యానించారని గుర్తుచేశారు. అంబేడ్కర్ ఆశయాలు, ఆలోచనా విధానంతో సీఎం వైఎస్ జగన్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు మంత్రివర్గంలో గౌరవనీయమైన స్థానం కల్పించారని, ముగ్గురు దళిత, గిరిజన మహిళలకు మంత్రివర్గంలో స్థానం కల్పించారని వివరించారు. నామినేటెడ్ పదవుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించారన్నారు. ఇలాంటి ప్రభుత్వంపై కులం పేరుతో ఆరోపణలు చేయడం చంద్రబాబుకు తగదని ఆమె పేర్కొన్నారు. -
రమ్య హత్య కేసు: హెడ్ కానిస్టేబుల్ ధైర్య సాహసాలు
-
రమ్య హత్య కేసు: హెడ్ కానిస్టేబుల్ ధైర్య సాహసాలు
ముప్పాళ్ళ: జిల్లాలో సంచలనం సృష్టించిన బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో నిందితుడైన శశికృష్ణను పట్టుకోవటంలో హెడ్ కానిస్టేబుల్ చాకచక్యం ప్రదర్శించారు. ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటున్నారు. హత్యానంతరం పరారైన నిందితుడు నరసరావుపేట మండలం ములకలూరు గ్రామ సమీపంలో ఉన్నట్టుగా ఫోన్ సిగ్నల్ ద్వారా గుర్తించిన పోలీసు ఉన్నతాధికారులు ముప్పాళ్ల, నరసరావుపేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. ముప్పాళ్లలో స్టేషన్ విధుల్లో ఉన్న హెడ్‌కానిస్టేబుల్ మహ్మద్‌రఫీ తన స్వగ్రామం కూడా పక్కనే ఉన్న పమిడిపాడు కావటంతో హుటాహుటిన నిందితుడిని పట్టుకునేందుకు బయలుదేరారు. చదవండి: గాంధీ ఆసుపత్రి అత్యాచార ఘటనలో ట్విస్ట్ ములకలూరు పొలాల్లో ఉన్నట్లుగా గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకునేందుకు యత్నించే క్రమంలో నిందితుడు తనవద్ద నున్న కత్తితో చేతిపైన, గొంతుపైన గాయపరుచుకొని ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడు. హెడ్‌కానిస్టేబుల్ రఫీని కూడా కత్తితో బెదిరించాడు. అయినా రఫీ వెనుకడుగు వేయకుండా చాకచక్యంగా తోటి సిబ్బంది సాయంతో నిందితుడిని వెనుకవైపుగా వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని పట్టుకోవడంలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన రఫీని ఇన్చార్జ్ డీఐజీ రాజశేఖర్, రూరల్ ఎస్పీ విశాల్‌గున్నీ, అర్బన్ ఎస్పీ ఆరీఫ్ హఫీజ్, అదనపు ఎస్పీ రిశాంత్‌రెడ్డితో పాటు సత్తెనపల్లి డీఎస్పీ విజయభాస్కరరెడ్డి, రూరల్ సీఐ నరసింహారావు ఫోన్లో అభినందించారు. ఇది మా స్టేషన్‌కే గర్వకారణమని ఎస్సై ఎమ్.పట్టాభిరామయ్య ఆనందం వ్యక్తం చేశారు. ఇవీ చదవండి: హైదరాబాద్ నగర వాసులకు తీపి కబురు ఇడ్లీ, పూరీ అంటే ఇష్టం.. దోశ, వడ కూడా.. -
గుంటూరులో టీడీపీ నేతల శవ రాజకీయం
-
టీడీపీ శవరాజకీయాలు
సాక్షి, అమరావతి బ్యూరో/గుంటూరు ఈస్ట్: తెలుగుదేశం పార్టీ శవరాజకీయాలు మరోసారి బయటపడ్డాయి. గుంటూరులో ఆదివారం హత్యకు గురైన బీటెక్ విద్యార్థిని రమ్య మృతదేహానికి సోమవారం ఉదయం పంచనామా పూర్తయింది. మృతురాలి కుటుంబానికి రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత, వేమూరు ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, కలెక్టర్ వివేక్‌యాదవ్ ప్రభుత్వం తరఫున రూ.10 లక్షల చెక్కు అందజేసి, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే మేరుగ, మేయర్ మనోహర్‌నాయుడు, జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ లాలుపురం రాము తదితరులు రమ్య తల్లిదండ్రులను ఓదార్చారు. అనంతరం రమ్య మృతదేహాన్ని తరలిస్తున్న అంబులెన్స్‌ను టీడీపీ నేతలు అడ్డుకున్నారు. రమ్య మృతదేహానికి నివాళులర్పించడానికి మాజీ మంత్రి లోకేశ్ వస్తున్నారని, ఆయన వచ్చేవరకు మృతదేహాన్ని ఇక్కడే ఉంచాలని టీడీపీ నేతలు ఆనంద్‌బాబు, ఆలపాటి రాజా, శ్రావణ్‌కుమార్, నసీర్ అహ్మద్, కార్యకర్తలు అంబులెన్సు ముందు బైఠాయించారు. వారించిన పోలీసులపై తిరగబడటంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొత్తపేట ఎస్ఐ నరసింహపై దాడిచేశారు. అంబులెన్స్‌కు దారిచూపే ప్రయత్నం చేసిన వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ నేతలు దాడికి ప్రయత్నించారు. జీజీహెచ్ నుంచి రమ్య మృతదేహాన్ని తరలిస్తున్న అంబులెన్సును అడ్డుకున్న టీడీపీ శ్రేణులు అక్కడా అంతే.. మృతురాలి ఇంటి వద్ద కూడా టీడీపీ కార్యకర్తలు ఇదే రీతిన ప్రవర్తించి శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని ప్రయత్నించారు. లోకేశ్, ధూళిపాళ్ల నరేంద్ర, శ్రావణ్‌కుమార్, ఆలపాటి రాజా, ఆనంద్‌బాబు మృతురాలి ఇంటి ముందు నిలబడి నినాదాలు చేశారు. అంత్యక్రియల్లో పాల్గొనడానికి వచ్చిన వైఎస్సార్సీపీ నేతలను లోకేశ్ బృందం అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పలువురు పోలీసులు స్వల్పంగా గాయపడ్డారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలకు రక్షణలేదని పేర్కొన్నారు. రమ్య ఇంటివద్ద ఉద్రిక్త పరిస్థితులు సృష్టించటమేగాక పోలీసు విధులకు ఆటంకం కలిగించిన లోకేశ్, మరో 32 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలను అర్బన్, రూరల్ ఎస్పీలు ఆరీఫ్ హఫీజ్, విశాల్ గున్నీ అరెస్టు చేసి ప్రత్తిపాడు పోలీసు స్టేషన్‌కు తరలించారు. లోకేశ్‌ను విడుదల చేయాలంటూ టీడీపీ వారు ప్రత్తిపాడులో రోడ్డుపై బైఠాయించి ఎస్ఐ అశోక్‌తో వాగ్వాదానికి దిగి కవ్వించారు. పాతగుంటూరు పోలీసుస్టేషన్ సీఐ వాసు సోమవారం రాత్రి లోకేశ్‌తో పెదకాకాని పోలీసుస్టేషన్ వద్ద సంతకం చేయించుకుని పంపించారు. రూ.కోటి పరిహారం ఇవ్వాలి: చంద్రబాబు గుంటూరులో హత్యకు గురైన దళిత విద్యార్థిని రమ్య కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు హైదరాబాద్ నుంచి సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. పోలీస్ స్టేషన్ సమీపంలో రమ్య హత్య జరుగుతుంటే దిశ యాప్ ఏం చేస్తోందని ప్రశ్నించారు. గుంటూరు నడిబొడ్డునే సీసీ కెమెరాలు పనిచేయలేదంటే సీఎం జగన్‌కి మహిళల రక్షణపై ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోందని పేర్కొన్నారు. పరామర్శించేందుకు వెళ్లిన తమ పార్టీ నేతలపై పోలీసులు దౌర్జన్యం చేశారని ఆరోపించారు. -
సోషల్‌మీడియా పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలి
-
విద్యార్థిని రమ్య హత్య ఘటన దురదృష్టకరం: సుచరిత
-
మీడియా ముందుకు బీటెక్ విద్యార్థిని హత్యకేసు నిందితుడు
సాక్షి, గుంటూరు: బీటెక్ విద్యార్ధిని హత్య కేసులో నిందితుడ్ని మీడియా ముందు పోలీసులు ప్రవేశపెట్టారు. ఇన్ఛార్జ్ డీఐజీ రాజశేఖర్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. బీటెక్ విద్యార్ధిని హత్య దురదృష్టకరమన్నారు. ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే నిందితుడిని పట్టుకున్నామని తెలిపారు. రమ్య హత్య కేసులో శశికృష్ణను అరెస్ట్ చేశామని వెల్లడించారు. శశికృష్ణ ఇన్స్టాగ్రాం ద్వారా రమ్యకు పరిచయం అయ్యాడని.. శశికృష్ణ వేధించడంతో రమ్య దూరం పెట్టిందన్నారు. ప్రేమించకుంటే చంపుతానని శశికృష్ణ బెదిరించాడు. ప్రేమించలేదన్న కోపంతో రమ్యను హత్య చేశాడని తెలిపారు. సోషల్ మీడియాలో పరిచయాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని ఇన్ఛార్జ్ డీఐజీ సూచించారు. మహిళల రక్షణే మా ప్రథమ కర్తవ్యమని, మహిళల రక్షణకై అహర్నిశలు శ్రమిస్తున్నామని ఇన్ఛార్జ్ డీఐజీ తెలిపారు. -
రమ్య కుటుంబానికి రూ.10 లక్షల చెక్కు అందజేసిన హోంమంత్రి
సాక్షి, గుంటూరు : నిన్న గుంటూరులో హత్యకు గురైన బీటెక్ విద్యార్థిని రమ్య కుటుంబసభ్యులను హోంమంత్రి మేకతోటి సుచరిత పరామర్శించారు. సోమవారం జీజీహెచ్‌లో వారిని కలిసిన ఆమె ప్రభుత్వం తరపున రూ.10 లక్షల చెక్కు అందజేశారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఆమె మాట్లాడుతూ.. ‘‘ తాడేపల్లి ఘటనలో నిందితులను గుర్తించి ఒకరిని పట్టుకున్నాము. సీఎం వెంటనే స్పందించి నిందితులను పట్టుకోమని పోలీసులను ఆదేశించారు. ఒక్క నిందితుడు కూడా తప్పించుకోవడానికి వీలులేదని సీఎం చెప్పారు. పార్లమెంట్లో దిశ చట్టం అయితే ప్రత్యేక న్యాయ స్థానాలు అందుబాటులోకి వస్తాయి. సీసీకెమెరా ఫుటేజ్ ఆధారంగానే నిన్నటి ఘటనలో నిందితుడిని అరెస్ట్ చేశాం. సురక్షితంగా లేని ప్రదేశాలకు వెళ్లకూడదని ప్రజలు భావించాలి. గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసినప్పుడు దిశ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలి’’ అని అన్నారు. -
బీటెక్ విద్యార్థిని హత్య కేసు: నిందితుడు అరెస్ట్
సాక్షి, గుంటూరు: బీటెక్ విద్యార్ధిని రమ్య హత్య కేసులో నిందితుడు శశికృష్ణను అరెస్ట్ చేసినట్లు డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. పోలీసులు పట్టుకునే సమయంలో నిందితుడు ఆత్మహత్యాయత్నం చేశాడని పేర్కొన్నారు. పోలీసులను చూసి శశికృష్ణ గొంతు కోసుకోవడానికి యత్నించాడని చెప్పారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ మీడియాతో మాట్లాడుతూ.. రమ్య హత్యా ఘటన అత్యంత దురదృష్టకరమని, స్థానికులు ఇచ్చిన సమాచారం, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితున్ని గుర్తించామని తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో స్థానికులు అత్యంత కీలక సమాచారాన్ని పోలీసులకు అందించారని పేర్కొన్నారు. హత్యకు పాల్పడిన యువకుడిని గుంటూరు అర్బన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నాని, నిందుతున్ని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. సోషల్ మీడియా పరిచయాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. యువతులు, మహిళలపై దాడులకు యత్నిస్తే కఠిన శిక్షలు తప్పవన్నారు. జరిగిన ప్రతి సంఘటనను రాజకీయ కోణంలో చూడవద్దని కోరారు. సమాజంలో జరుగుతున్న వికృత పోకడలను సమిష్టిగా ఎదుర్కోవాలన్నారు. ఘటన జరిగిన తక్షణం వేగంగా స్పందించి కేసును ఛేదించిన గుంటూరు అర్బన్ పోలీసులకు అభినందనలు తెలిపారు. విచారణ త్వరితగతిన పూర్తి చేసి నిందితుడికి సత్వరం కఠిన శిక్ష పడేలా చూడాలని ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. మహిళల రక్షణ తమ ప్రథమ కర్తవ్యమని, అందుకోసం అహర్నిశలు శ్రమిస్తామని తెలిపారు. బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసు నిందితుడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్న సమయంలో నిందితుడు శశికృష్ణ తన గొంతును కత్తితో కోసుకోవడానికి యత్నించాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం గాయపడిన శశికృష్ణను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. శనివారం కాకాని రోడ్డులో బీటెక్ విద్యార్థిని రమ్యను శశికృష్ణ హత్య చేసిన విషయం తెలిసిందే. విద్యార్థినిని నిందితుడు దారుణంగా రోడ్డు మీదనే కత్తితో పొడిచి చంపాడు. -
రమ్య హత్య ఘటన చాలా బాధాకరం: హోంమంత్రి సుచరిత
సాక్షి, గుంటూరు: జీజీహెచ్‌లో బీటెక్ విద్యార్థిని రమ్య మృతదేహాన్ని హోంమంత్రి మేకతోటి సుచరిత పరిశీలించారు. తర్వాత మంత్రి సుచరిత.. రమ్య కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బీటెక్ విద్యార్థిని రమ్యను హత్య చేయడం బాధాకరమని అన్నారు. హంతకుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారని తెలిపారు. ఘటనకు సంబంధించి కొన్ని ఆధారాలు కూడా సేకరించారని పేర్కొన్నారు. హత్య చేసిన వ్యక్తి కోసం పోలీసు బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నారని వెల్లడించారు. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన వ్యక్తిని కఠినంగా శిక్షిస్తామని, మహిళను హత్య చేసే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. రమ్య కుటుంబానికి న్యాయం చేస్తామని, రమ్య హత్య విషయం తెలియగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చలించిపోయారని తెలిపారు. రమ్య కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. హత్య చేసిన వ్యక్తికి ఉరి వేయాలని అందరూ అంటున్నారని, కచ్చితంగా అలాంటి శిక్షలు పడేటట్లు చర్యలు తీసుకుంటామని మంత్రి సుచరిత తెలిపారు. నిందితుడ్ని కఠినంగా శిక్షిస్తాం: వాసిరెడ్డి పద్మ బీటెక్ విద్యార్థిని రమ్య మృతదేహాన్ని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ జీజీహెచ్‌లో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రమ్య హత్య ఘటన చాలా బాధాకరమని, నిందితుడ్ని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. -
రావమ్మా.. మహాలక్ష్మి!
సాక్షి, కేసముద్రం: నేటి సమాజంలో ఆడపిల్ల పుట్టిందంటే చిన్నచూపు చూడటం సహజం. అయితే.. మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలోని ఓ కుటుంబంలో ఆడపిల్ల పుట్టిందని తెగ సంబరపడిపోయారు. గ్రామానికి చెందిన సవీన్, రమ్య దంపతులకు మూడు నెలల క్రితం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో ఆడపిల్ల (సమస్వి) జన్మించింది. శనివారం కూతురితో రమ్య అత్తవారింటికి వచ్చింది. తమ ఇంట మహాలక్ష్మి పుట్టిందని సంబరపడుతూ.. పూలు చల్లి ఇంట్లోకి ఘనస్వాగతం పలికారు. పూల పాన్పులో శిశువును పడుకోబెట్టి ఆనందంతో గడిపారు. -
బావమరదళ్ల ఆత్మహత్యాయత్నం
సాక్షి, నిజామాబాద్ (గాంధారి): వారిద్దరు ప్రేమించుకున్నారు.. కలిసి బతకాలని నిర్ణయించుకున్నారు. ఇంతలో యువతికి మరో వ్యక్తితో పెళ్లి ఖాయం చేయడంతో ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటనలో యువతి మృతి చెందగా, యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాలు.. గాంధారి మండలం పోతంగల్ కలాన్‌కు చెందిన గాండ్ల సాయికుమార్, కామారెడ్డి మండలం వడ్లూర్ గ్రామానికి చెందిన గాండ్ల రమ్య(19) కొద్దిరోజులుగా ప్రేమించుకుంటున్నారు. వీరు వరుసకు బావమరదళ్లు అవుతారు. అయితే వీరి ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పలేదు. ఈ క్రమంలో రమ్యకు కుటుంబ సభ్యులు ఇటీవల మరో వ్యక్తితో పెళ్లి నిశ్చయించారు. చదవండి: (సహోద్యోగిని స్నానం చేస్తుండగా వీడియో తీసి..) దీంతో ఆందోళన చెందిన ఆ జంట ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. శనివారం ఇద్దరు కలిసి పురుగుల మందు తాగారు. అనంతరం కామారెడ్డికి వెళ్లే ఆర్టీసీ బస్సు ఎక్కారు. ఇద్దరూ బస్సులో అపస్మారక స్థితిలో ఉండటాన్ని గమనించిన ప్రయాణికులు కండక్టర్‌కు తెలపడంతో వారిని చికిత్స నిమిత్తం కామారెడ్డి ఆస్పత్రికి తరలిసంచారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కామారెడ్డికి చేరుకుని మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎంలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం చికిత్స పొందుతూ రమ్య మృతి చెందగా సాయికుమార్ అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతురాలి తండ్రి రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. చదవండి: (గుడికి వెళ్తూ తిరిగిరాని లోకాలకు..) -
రమ్య ఆత్మహత్య.. శివభార్గవ్ కోసం గాలింపు
నెల్లూరు(క్రైమ్): రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన రమ్య ఆత్మహత్య కేసులో నిందితుడు శివభార్గవ్ కోసం వేదాయపాళెం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. రమ్య ఆత్మహత్య చేసుకున్న సమయంలో నిందితుడు స్నేహితులతో కలిసి వారి ఇంటికి సమీపంలోని ఓ కళాశాలలో క్రికెట్ ఆడినట్లు, అనంతరం పరారైనట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. పోలీసులు అతని స్నేహితులను అదుపులోకి తీసుకుని నిందితుడి ఆచూకీ కోసం విచారిస్తున్నారు. ఆదివారం కుటుంబ సభ్యులను, బంధువులను సైతం పోలీసులు విచారిస్తున్నారు. (ఆత్మహత్యకు ముందు యువతి సెల్ఫీ వీడియో ) -
కారు ధ్వంసం.. ఆమె పైనే అనుమానం?
తమిళ సినిమా(చెన్నై): నటుడు విశాల్ కార్యాలయంలో జరిగిన మోసం వ్యవహారం విశ్వరూపం దాల్చుతోందా? ప్రస్తుతం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారిన విషయం ఇదే. విశాల్ దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రముఖ కథానాయకుడు రాణిస్తూ నిర్మాతగా తన వీఎఫ్ఎఫ్ సంస్థ ద్వారా చిత్రాలను నిర్మిస్తున్నారు. స్థానిక వదలాలని, కుమరన్ కాలనీలో కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో పలువురు సిబ్బంది పని చేస్తున్నారు. అలా రమ్య అనే యువతి విశాల్ కార్యాలయంలో అకౌంటెంట్‌గా పనిచేసింది. ఆమె నిధులను దుర్వినియోగం చేసి రూ.45 లక్షల మోసానికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ వ్యవహారంపై విశాల్ కార్యనిర్వాహకుడు హరి కుమార్ స్థానిక విరుగాంబాక్కం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అకౌంట్‌గా పనిచేస్తున్న రమ్య మోసానికి పాల్పడినట్టు వెలుగులోకి వచ్చిందనీ దీని గురించి విచారించి ఆమెపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. (విశాల్ రహస్యాలను బయట పెడతా: రమ్య) పోలీసులు రమ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ వ్యవహారం పై స్పందించిన రమ్య మీడియాతో మాట్లాడుతూ తనపై విశాల్ వర్గం నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, విశాల్ కార్యనిర్వాహకుడు హరి కుమార్ తన అనుచరులను పంపించి తనను బెదిరించినట్లు ఆమె పేర్కొంది. అదేవిధంగా కట్ట పంచాయితీలు చేస్తున్నారంటూ విశాల్‌పై పలు ఆరోపణలు గుప్పించింది. ఈ వ్యవహారం పోలీసుల విచారణలో ఉండగా సోమవారం మరో సంఘటన జరిగింది. స్థానిక కోడంబాక్కంలో నివసిస్తున్న విశాల్ కార్యనిర్వాహకుడు హరికుమార్ కారును కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో హరికుమార్ కోడంబాకం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తన కారును ధ్వంసం చేసిన వ్యవహారంలో అకౌంటెంట్ రమ్యకు సంబంధం ఉందనే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. దీనిపై కూడా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
విశాల్ రహస్యాలను బయట పెడతా: రమ్య
సినిమా : విశాల్ నటుడిగా దక్షిణ సినీ పరిశ్రమలోమంచి పేరుంది. ఈయన నిర్మాతగా కూడా పలు చిత్రాలను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈయన చక్ర అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈయనకు స్థానిక వడపళని, కుమరన్∙కాలనీలోని చిత్ర నిర్మాణ కార్యాలయం ఉంది. అందులో పది మందికి పైగా సిబ్బంది పనిచేస్తున్నారు. నటుడు విశాల్ కొంత కాలంగా ఆదాయ పన్నుశాఖ సంస్థకు టీడీయస్‌ను చెల్లించడం లేదనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ వ్యవహారంపై ఆరా తీయగా తన కార్యాలయంలో రూ.45 లక్షలు మోసం జరిగిందన్న విషయం వెలుగు చూసిందట. విశాల్ కార్యాలయ నిర్వాహకుడు హరి స్థానిక సాలిగ్రామంలోని పోలీస్ స్టేషన్లో ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేశారు. (ఆరేళ్లుగా విశాల్ డబ్బులు కాజేసిన మహిళ!) అందులో తమ కార్యాలయంలో అకౌంటెంట్‌గా పనిచేసే రమ్య ఈ మోసానికి´పాల్పడినట్టు పేర్కొన్నారు. తాను ఆదాయ శాఖకు చెల్లించాల్సిన టీడీయస్‌ను రమ్య ఆమె భర్త బ్యాంక్ అకౌంట్లు,తన బంధువుల బ్యాంకు అకౌంట్లోకి తరలిందని పేర్కొన్నారు. కాబట్టి ఆమెను విచారించాలని కోరారు. ఈ విషయం అలా ఉంటే రమ్య నటుడు విశాల్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె ఒక ఛానల్‌తో మాట్లాడుతూ.. విశాల్ కొన్నేళ్లుగా ప్రభుత్వానికి టీడీయస్‌ను చెల్లించకుండా మోసానికి పాల్పడుతున్నారని, దాని నుంచి తప్పిచుకోవడానికే తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించింది. విశాల్ కార్యనిర్వాహకుడు హరి వర్గం తన ఇంటికి వచ్చి బెదిరించిందని వెల్లడించింది. విశాల్‌కు సంబంధించిన చాలా విషయాలు తనకు తెలుసని చెప్పింది. తనకు పోలీసులు రక్షణ కలిస్తే నటుడు విశాల్‌కు సంబంధించిన మరిన్ని రహస్యాలను బయట పెడతానని రమ్య పేర్కొంది. ఈ వ్యవహారం కోలీవుడ్‌లో కలకలం సృష్టింది. -
తల్లితో గొడవపడి... మూడురోజులకు బావిలో
రామగిరి(మంథని): మూడురోజుల క్రితం తల్లితో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయిన కూతురు మృతదేహం వ్యవసాయ బావిలో తేలిన సంఘటన రామగిరి మండలం బేగంపేటలో ఆదివారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పెరుమాండ్ల రామస్వామి– దుర్గమ్మకు నలుగురు కూతుళ్లు, కొడుకు సంతానం. చిన్న కూతురు రమ్య(21) డిగ్రీ చదువుతోంది. అయితే రమ్య వారం రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. ఎంతకీ తగ్గపోవడంతో ఆసుపత్రికి వెళ్దామని తల్లి దుర్గమ్మ చెప్పగా, తాను రానని గత శుక్రవారం తల్లితో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయింది. రాత్రయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు సమీప బంధువుల ఇళ్లలో వెతికారు. ఈక్రమంలో అదే గ్రామానికి చెందిన తాళ్ల రాజయ్య ఆదివారం గ్రామ శివారులోని కుమ్మరికుంట సమీపంలో గల తన వ్యవసాయ భూమి వద్దకు వెళ్లగా బావి నుంచి దుర్వాసన రావడంతో పరిశీలించగా మృతదేహం కనిపించింది. విషయం గ్రామంలో ప్రచారం కావడంతో రామస్వామి–దుర్గమ్మ సంఘటన స్థలానికి చేరుకుని తమ కూతురు మృతదేహామేనని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేందర్ తెలిపారు.(ప్రేమ పెళ్లి.. అమ్మను కొట్టొద్దు నాన్నా.. ) రాయికల్‌లో.. రాయికల్(జగిత్యాల): రాయికల్ పట్టణంలోని ఒడ్డెరకాలనీకి చెందిన బోదాసు రజిత(40) ఆ దివారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై ఆరోగ్యం తెలిపారు. వివరాలిలా ఉ న్నాయి.. రజిత చిన్నప్పటి నుంచి మూర్చవ్యాధి తో బాధపడుతోంది. వివాహమై కూతురు పుట్టగానే విడాకులయ్యాయి. ఈక్రమంలో అ నారోగ్యంతో మనస్తాపం చెంది ఆదివారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి వెంకవ్వ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
సీఎం ఆదేశాలతో కదిలిన వైద్య యంత్రాంగం
-
త్వరలో మా అమ్మ చనిపోతుంది సార్
-
రమ్య సైలెంట్‌గా ఏం చేసిందో తెలుసా?
సినిమా: మాలీవుడ్, కోలీవుడ్ అంటూ దక్షిణాది సినిమాలో తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్న మలమాళీ చిన్నది రమ్య నంబీశన్. కొన్ని చిత్రాల్లో అందాలారబోసినా, ఎందుకనో ఈ అమ్మడికి పక్కింటి అమ్మాయి ఇమేజ్‌నే ఉండడం లక్కీనే. తమిళంలో నటించిన పిజ్జా చిత్రం తెలుగు అనువాదంతో అక్కడ పరిచయం అయిన ఈ అమ్మడిలో మల్టీటాలెంట్ ఉందన్నది తెలిసిందే. నటి, గాయనిగా రాణిస్తున్న రమ్య తాజాగా మరో ప్రయత్నం చేసింది. అదేంటో చూద్దాం. ఈ అమ్మడు మెగాఫోన్ పట్టింది. దీని గురించి అడిగితే అయ్యయ్యో అది పెద్ద చిత్రం కాదండీ. చాలా చిన్న చిత్రం. దాన్ని లఘు చిత్రం అని కూడా అనవచ్చో లేదో. మూడు నిమిషాలు నిడివితో కూడుకుంది. దానికి అన్హైట్ అనే టైటిల్‌ను పెట్టాను. ప్రేమికుల రోజు సందర్భంగా ఈ నెల 14న విడుదల చేయనున్నాను. తన మనసులో ఉన్న చిన్న కాన్సెప్ట్‌నకు దృశ్య రూపం ఇచ్చే ప్రయత్నం చేశాను అంతే అని చెప్పింది. ప్రస్తుతం చేస్తున్న చిత్రాల గురించి చెబుతూ విజయ్ ఆంటోనికి జంటగా తమిళరసన్ అనే చిత్రంలో నటించాను. ఈ చిత్రంలో కథనం వైవిద్యంగా ఉంటుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో తెరపైకి రానుంది. ప్రస్తుతం సిబిరాజ్‌కు జంటగా రేంజర్స్ చిత్రంలోనూ ప్లాన్ పన్ని పన్ననుమ్ అనే మరో కామెడీ కథా చిత్రం, ప్రభుదేవాకు జంటగా ఒక చిత్రం చేస్తున్నాను. అదేవిధంగా మలయాళంలో ఒక చిత్రం చేస్తున్నాను అని తెలిపింది. మాతృభాషలో కంటే తమిళంలోనే ఎక్కువ చిత్రాలు చేస్తున్నట్లున్నారే అన్న ప్రశకు అవును తమిళంలో సేతుపతి చిత్రం తరువాత మంచి అవకాశాలు వస్తున్నాయి. నాకు భాషా సమస్య లేదు. అందుకే వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నాను. అందులోనూ మంచి కథా పాత్రలనే ఎంపిక చేసుకుంటున్నాను. అయితే మలయాళం మాతృభాష కావడంతో ఆ చిత్రాల్లో నటించేటప్పుడు కలిగే అనుభూతే వేరు. అందుకే మలయాళ చిత్రాల్లోనూ నటిస్తున్నాను అని చెప్పింది. గాయనిగా కెరీర్ ఎలా సాగుతోందన్న ప్రశ్నకు నా జీవితంలో నటనకు, సంగీతానికి సమ ప్రాధాన్యతనిస్తాను. ఇటీవల సల్మాన్‌ఖాన్ నటించిన దబాంగ్ 3 చిత్ర తమిళ వెర్షన్లో ఒక పాట పాడాను. తరువాత యువన్‌శంకర్‌రాజా సంగీతదర్శకత్వంలో ఒక పాట పాడాను. ఇక బుల్లితెర సంగీత కార్యక్రమాల్లోనూ పాల్గొంటూ జీవితం ఆనందంగా సాగిపోతోంది అని రమ్యానంబీశన్ చెప్పుకొచ్చింది. -
నటి రమ్యకు వరకట్న వేధింపులు
యశవంతపుర : అదనపు కట్నం తీసుకురావాలని తనను తన భర్త వేధిస్తున్నాడని తమిళ నటి రమ్య సోమవారం బెంగళూరు కోడిగేహళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు.. 2017లో కొరియోగ్రాఫర్ వరదరాజన్‌తో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో ఇంటి స్థలంతో పాటు బంగారు అభరణాలు, నగదును కట్నంగా ఇచ్చారు. అయితే భర్త వరదరాజన్ డ్యాన్స్ అకాడమీని స్థాపించాలని, దానికి కావాల్సిన డబ్బులు తీసుకురావాలని వేధిస్తున్నట్లు రమ్య పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని తనను హింసిస్తున్నాడని తెలిపింది. -
పాలిటిక్స్‌కు బై : సినిమాల్లోకి ఆ నటి రీఎంట్రీ..
బెంగళూర్ : సినిమాల్లో క్రేజీ నటిగా వెలుగొందుతున్న సమయంలోనే క్రియాశీల రాజకీయాల్లోకి వెళ్లిన కన్నడ నటి రమ్య తిరిగి మూవీల్లో నటించేందుకు సంసిద్ధమనే సంకేతాలు పంపారు. పునీత్ రాజ్‌కుమార్ సరసన అభి మూవీలో నటించడం ద్వారా తన కెరీర్‌ను ప్రారంభించిన రమ్య తక్కువ సమయంలోనే కన్నడ చిత్రసీమలో టాప్ హీరోయిన్గా ఎదిగారు. అయితే ముక్కుసూటిగా మాట్లాడే ధోరణితో ఆమె వివాదాస్పద నటిగా పేరొందారు. 2013లో రాజకీయాల్లో అడుగుపెట్టిన రమ్య 2017లో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా హెడ్‌గా బాధ్యతలు చేపట్టడంతో సినిమాలకు దూరమయ్యారు. ఇక 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయంతో ఆమె సోషల్ మీడియా బాధ్యతల నుంచి వైదొలిగారు. తనకు ఇప్పటికీ ఆఫర్లు వస్తున్నాయని, వాటిని తాను అంగీకరించలేదని, అయితే సినిమాల్లో తిరిగి పనిచేయడం తనకు ఫన్‌గానే ఉంటుందని, దీనిపై ఇప్పడే ఏమీ చెప్పలేనని ఓ ఆంగ్ల దినపత్రికతో మాట్లాడుతూ చెప్పారు. -
రమ్య అనే నేను..
నేరేడ్మెట్: చిన్నతనం నుంచి చలాకీగా తిరుగుతూ..చదువులో చురుకుదనం..ఎప్పుడూ నవ్వుతూ ఉండే ఆ బాలికపై విధి చిన్న చూపు చూసింది. ఉన్నత చదువులు చదివి భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దుకోవాలని ఎంతో ఆశించింది. పోలీస్ కమిషనర్ కావాలనేది ఆమె జీవితాశయం. అయితే ప్రాణాంతక వ్యాధి రూపంలో మృత్యువు ఆమెను కబలిస్తోంది. మరణానికి చేరువలో ఉన్న ఆమె కలను రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్‌భగవత్ నేరవేర్చారు. నేరేడ్మెట్లోని రాచకొండ కమిషనరేట్ ఇందుకు వేదికైంది. వివరాల్లోకి వెళితే... ఓల్డ్ అల్వాల్‌కు చెందిన నర్సింహ, పద్మ దంపతుల కుమార్తె రమ్య(17). స్థానిక చైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్(ఎంపీసీ) ద్వితీయ సంవత్సరం చదువుతోంది. కొంత కాలంగా బ్లడ్ కేన్సర్‌తో బాధపడుతున్న ఆమె నిమ్స్ ఆసుపత్రిలో వైద్యులు(ఆంకాలజీ) కిరణ్ ఆధ్వర్యంలో చికిత్స పొందుతోంది. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న రమ్యకు పోలీసు కమిషనర్ కావాలనేది జీవితాశయం. పోలీసు అధికారులు,మేక్ ఏ విష్ ఫౌండేషన్ ప్రతినిధులతో రమ్య ఆమె తల్లిదండ్రుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న ‘మేక్ ఏ విష్ ఫౌండేషన్’ నిర్వాహకులు రాచకొండ కమిషనర్ మహేష్‌భగవత్‌ను కలిసి రమ్య కోరికను వివరించారు. ఇందుకు సీపీ సానుకూలంగా స్పందించారు. దీంతో మంగళవారం ఫౌండేషన్ ప్రతినిధులు, తల్లిదండ్రులు, రమ్యను కమిషనరేట్‌కు తీసుకువెళ్లి సీపీ మహేష్‌భగవత్‌ను కలిశారు. పోలీస్ యూనిఫాంలో కమిషరేట్‌కు వచ్చిన రమ్యకు కార్యాలయం సిబ్బంది, అధికారులు గౌరవ వందనం చేశారు. రాచకొండ కమిషనర్‌గా మహేష్‌భగవత్ రమ్యకు బాధ్యతలు అప్పగించారు. అనంతరం సీపీ ఆమెను స్వయంగా కమిషనర్ కుర్చీలో కూర్చోబెట్టారు. రిజిస్టర్లో సంతకం చేసి, ఒక రోజు కమిషనర్‌గా రమ్య విధులు నిర్వర్తించారు. 2017లో ఎహ్హాన్ అనే బాలుడు ఇదే తరహాలో ఒక రోజు కమిషనర్‌గా పని చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సీపీ మహేష్‌భగవత్, అడిషనల్ సీపీ సుధీర్‌బాబు మాట్లాడుతూ రమ్య త్వరలోనే కోలుకోవాలని కోరారు. ఆమెకు ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం రమ్య సీపీతో పాటు ఇతర అధికారులకు శెల్యూట్ చేసి, తనకు ఒక రోజు కమిషనర్‌గా అవకాశం కల్పించిందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇందుకు సహకరించిన మేక్ ఏ విష్ ఫౌండేషన్‌కు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీలు శిల్పవల్లి, శామీర్, రమ్య తల్లిదండ్రులు నర్సింహ్మ, పద్మ, ఫౌండేషన్ ప్రతినిధులు ప్రియాజోషి, పవన్ తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది.. ఒక రోజు రాచకొండ కమిషనర్‌గా పని చేయడం చాలా సంతోషంగా ఉంది. నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు కమిషనరేట్‌కు మంచి పేరు తీసుకురావాలి. ఠాణాల్లో 5 ఎస్‌ల అమలు, ఫ్రెండ్లీ పోలీసింగ్ కమిషనరేట్‌కు పేరు తెచ్చాయి. మహిళల భద్రత, రక్షణకు షీటీంలు బాగా పని చేస్తున్నాయి.–రమ్య -
కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న బంధువులు
సాక్షి, రాజమండ్రి: రాయల్ వశిష్ట బోటు ప్రమాద బాధితుల కోసం హెల్ప్ డెస్క్‌ఏర్పాటు చేశారు. పోలీసులు...బాధిత కుటుంబాలతో ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూప్‌లో బంధువులకు సమాచారం ఇచ్చారు. బాధితులకు సమాచారం అందించడంతో వారంతా తమవారిని గుర్తించేందుకు రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి వచ్చారు. మంచిర్యాలకు చెందిన రమ్యశ్రీ తల్లిదండ్రుల ఆవేదన నిలువరించడం ఎవరి తరం కావడం లేదు. అలాగే నల్గొండకు చెందిన రవీందర్‌రెడ్డి తల్లిదండ్రులు కూడా మృతదేహాన్ని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటివరకూ ఆరు మృతదేహాలను వారి బంధువులు గుర్తించారు. కాగా 41వ రోజుల అనంతరం మునిగిపోయిన బోటును ఎట్టకేలకు గోదావరి నుంచి బయటకు తీశారు. బోటు వెలికితీసిన అనంతరం అందులో 8 మృతదేహాలు దొరికాయి. ఆ మృతదేహాలను రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, మార్చరీలో భద్రపరిచారు. మృతేహాలు బోటులోని ఓ గదిలో ఉండిపోవడంతో గుర్తుపట్టలేనంతగా కుళ్లిపోయాయి. అయితే వరంగల్‌కు చెందిన కొమ్ముల రవి ఆధార్ కార్డు లభించడంతో మృతదేహాన్ని బంధువులు గుర్తించారు. వరంగల్ కు చెందిన బస్కే ధర్మరాజును గుర్తించారు. అలాగే రాయలు వశిష్ట బోటు డ్రైవర్లు పోతా బత్తుల సత్యనారాయణ, సంగాడి నూకరాజు, నల్గొండకు చెందిన సురభి రవీందర్, బోట్ హెల్పర్ పట్టిసీమకు చెందిన కర్రి మణికంఠ మృతదేహాలను కూడా కుటుంబీకులు గుర్తుపట్టారు. పోస్ట్‌మార్టం అనంతరం కుటుంబసభ్యులు మృతదేహాలను అప్పగిస్తారు. సెప్టెంబర్ 15న కచ్చులూరు మందం వద్ద గోదావరిలో బోటు మునిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో బోటులో 77మంది ఉన్నారు. వారిలో 26మంది పర్యాటకులు సురక్షితంగా బయటపడగా, 46మంది మృతి చెందారు. మరో అయిదుగురు గల్లంతు అయ్యారు. మరోవైపు ఇంకా లభించాల్సిన అయిదు మృతదేహాల కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు బోటు అడుగు భాగాల్లో గాలిస్తున్నారు. ధర్మాడి సత్యం బృందం తిరుగు పయనం ఆపరేషన్ రాయల్ వశిష్టను పూర్తి చేసుకుని ధర్మాడి సత్యం బృందం తిరుగుపయనం అయింది. ఈ సందర్భంగా ధర్మాడి సత్యం మాట్లాడుతూ.. ప్రతికూల పరిస్థితులు ఉన్నా...తీవ్రంగా శ్రమించి బోటును ఒడ్డుకు చేర్చామన్నారు. గతంలో చాలా బోట్లు వెలికి తీశామని, అయితే రాయల్ వశిష్ట బోటు వెలికితీయడం చాలా కష్టంతో కూడుకుందని అన్నారు. ప్రవాహంతో ఉన్న నదిలో నుండి బోటును ఒడ్డుకు తీయడం మాటలు కాదని, రెండు గంటల్లో మునిగిపోయిన బోటునుఒడ్డుకు తీసేస్తానని చెప్పిన పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన శివ చెప్పిన మాటలకు మీడియా విస్తృత ప్రచారం కల్పించడం విచారకరమన్నారు. అతని వద్ద ఓ తాడు లేదు... సిబ్బంది లేరని ధర్మాడి సత్యం పేర్కొన్నారు. లాంచీలోనే పడుకుని ఉదయం ఆరు గంటలకు లేచి, సాయంత్రం వరకూ బోటు వెలికితీతకు శ్రమించినట్లు చెప్పారు. -
‘డాడీ’ పచ్చబొట్టు ... కానరాదు ఇక ఎప్పటికీ
సాక్షి , రాజమహేంద్రవరం: దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాదంలో గల్లంతైన వారి ఆచూకీ కోసం సంబంధిత బంధువులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు, స్నేహితుల ఆర్తనాదాలతో ప్రభుత్వాసుపత్రిలో ఆవరణలో ఇంకా విషాద వాతావరణం కొనసాగుతూనే ఉంది. ఎటునుంచి ఏ ప్రభుత్వ వాహనం వచ్చినా అందులో తమవారి మృతదేహం వచ్చిందేమోనని ఆశతో పరుగులు తీయడం పలువురిని కలచి వేస్తోంది. ‘డాడీ’ పచ్చబొట్టు ... కానరాదు ఇక ఎప్పటికీ బోటు ప్రమాదంలో మృతి చెందిన మృతురాలు మంచిర్యాల గ్రామానికి చెందిన కాకునూరు రమ్యశ్రీ ఇంజినీర్ చదివి హైదరాబాద్‌లోని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్లో ఇంజినీర్‌గా పని చేస్తోంది. తండ్రిపై ప్రేమతో తన చేతిపై ‘డాడీ’ అంటూ పచ్చబొట్టు పొడిపించుకుంది. దీనిని తలుచుకుంటూ రమ్యశ్రీ తండ్రి సుదర్శన్ విలపిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. ‘ఉద్యోగం వచ్చింది కదా డాడీ...అమ్మ మొక్కుకున్న మొక్కులన్నీ తీర్చుతున్నానని’ చెప్పిన తన చిట్టి తల్లి విహార యాత్రకు వచ్చి కనీసం కడచూపుకు కూడా నోచుకోకుండా చేస్తుందని అనుకోలేదని రమ్యశ్రీ తండ్రి సుదర్శన్ బోరున విలపిస్తున్నారు. ఆదివారం ప్రభుత్వ ఆసుపత్రికి రమ్యశ్రీ తల్లి భూలక్ష్మి, తండ్రి దర్శన్, కలసి కంటతడిపెట్టుకున్నారు. తమ కుమార్తె మృతదేహం కోసం ఎనిమిది రోజులుగా ప్రభుత్వ ఆసుపత్రిలో నిరీక్షిస్తునే ఉన్నారు. చదవండి: రమ్య కోసం ఎదురుచూపులు నా తండ్రి ఆచూకీ తెలపండి బోటు డ్రైవర్ నూకరాజు కుమారుడు ధర్మారావు, బంధువులు, మహిళలు పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద విలపిస్తున్నారు. తన తండ్రికి బోటు నడపడంలో నైపుణ్యం ఉందని, ఇలా జరిగిందని, తమ తండ్రి మృతదేహం ఆచూకీ చెప్పాలంటూ వేడుకుంటున్నారు. మరో డ్రైవర్ పోతాబత్తుల సత్యనారాయణ కుటుంబీకులు కూడా ప్రమాదం జరిగినప్పటి నుంచి ప్రభుత్వ ఆసుపత్రిలో పడిగాపులు కాస్తున్నారు. మా మేనల్లుడేడండీ బోటు ప్రమాదం జరిగిన మొదటి రోజు నుంచీ హైదరాబాద్ ఉప్పల్‌కు చెందిన రాజేంద్ర ప్రసాద్ అనే 70 ఏళ్ల వృద్ధుడు ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఉంటున్నాడు. తన మేనల్లుడు అంకెం పవన్ కుమార్, అతని భార్య అంకెం భవానీల ఆచూకీ తెలియజేయాలంటూ వేడుకుంటున్నాడు. ఆదివారం రమ్యశ్రీ తల్లి భూలక్ష్మి రోదిస్తుండగా అక్కడకు వెళ్లిన రాజేంద్ర ప్రసాద్ తన కుటుంబంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారని, దుఖాన్ని దిగమింగుకోవాలని సముదాయించిన తీరు అక్కడున్నవారికి కన్నీళ్లను రప్పించింది. మా కుమారుడి ఆచూకీ చెప్పరూ బోటులో సహాయకుడిగా పని చేసిన పాతపట్టి సీమకు చెందిన మణికంఠ ఆచూకీ చెప్పరూ అంటూ అతని తండ్రి నరసింహారావు, బాబాయిలు, బంధువులు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పడిగాపులు పడుతున్నారు. అంబులెన్స్ వచ్చిందంటే దానిలో మృతదేహాలు ఉంటాయేమో అని పరుగులు తీసుస్తున్నారు. మేనల్లుడి కోసం... విహారయాత్రలో కుటుంబం మొత్తం గల్లంతుకాగా అందులో బావమరిది, అతని భార్య, కుమార్తెల మృతదేహాలు లభ్యమైనా మేనల్లుడు కర్నూల జిల్లా నంద్యాలకు చెందిన బాచిరెడ్డి విఖ్యాతరెడ్డి(6) మృతదేహం ఇప్పటివరకూ దొరకలేదని అతని మేనమామ చంద్రశేఖరరెడ్డి ఎదురుచూస్తున్నాడు. ఇంటి నుంచి తన మామ అస్తమానూ ఫోన్ చేస్తున్నాడని ఏమి సమాధానం చెప్పాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. -
రమ్య పెళ్లిపై జోరుగా చర్చ
యశవంతపుర : శాండిల్‌వుడ్ నటి, మాజీ ఎంపీ రమ్య రాజకీయాలకు, సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ఆమె త్వరలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయానికి వచ్చారు. తన చిన్ననాటి స్నేహితుడు రఫెల్‌ను వివాహం చేసుకుని దుబాయిలో స్థిరపడాలని నిర్ణయించకున్నట్లు సమాచారం. ఆమె వివాహంపై సామాజిక మాధ్యమాలలో జోరుగా చర్చ సాగుతోంది. కన్నడ చిత్రసీమలో ప్రముఖుల సరసన నటించిన రమ్య 2013లో మండ్య లోకసభకు జరిగిన ఉప ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయిన ఆమె కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా నిర్వాహకురాలిగా పనిచేస్తున్నారు. -
ట్విటర్లో ట్రోల్.. ఖాతాను డిలీట్ చేసిన రమ్య
సాక్షి, బెంగళూరు: కాంగ్రెస్ మాజీ ఎంపీ, ఆ పార్టీ సోషల్ మీడియా వింగ్ నాయకురాలు రమ్య (దివ్యా స్పందన) తన ట్విటర్ ఖాతా తొలగించారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉంటే రమ్య ఆశ్చర్యకరంగా ట్విటర్ నుంచి వైదొలిగారు. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వింగ్‌కు ఆమెకు నాయకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే రెండు రోజుల క్రితం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌పై ఆమె చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లచే తీవ్ర విమర్శల పాలైన విషయం విధితమే. ఆ కామెంట్లకు తట్టుకోలేకనే ఆమె ట్విటర్ నుంచి వైదొలిగినట్లు తెలుస్తోంది. దీనిపై ఆమె ఇప్పటి వరకు అధికారిక ప్రకటన చేయలేదు. ఆమెను ట్విటర్లో 8లక్షలకు పైగా ఫోలోవర్స్ ఉన్నారు. కేబినెట్లో కీలకమైన ఆర్థిక శాఖను చేపట్టిన నిర్మలా సీతారామన్.. దేశంలో తొలి మహిళా ఆర్థిక మంత్రిగా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. దీనిపై దేశ వ్యాప్తంగా నిర్మలకు ప్రశంసలు అందుతున్నాయి. రమ్య కూడా నిర్మలా సీతారామన్‌కు అభినందనలు తెలిపారు. ఈ మేరకు.. ‘1970లో ఇందిరా గాంధీజీ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించి మహిళలను గర్వపడేలా చేశారు. ఇప్పుడు మీరు కూడా ఆ శాఖను చేపట్టినందుకు అభినందనలు. కానీ జీడీపీ అంత గొప్పగా ఏమీ లేదు. అయినప్పటికీ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు మీ వంతుగా తప్పక కృషి చేస్తారని తెలుసు. మీకు ఎల్లప్పుడూ మా సహకారం ఉంటుంది. శుభాకాంక్షలు’ అని రమ్య ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో రమ్య ట్వీట్‌పై స్పందించిన నెటిజన్లు.. దేశ తొలి ఆర్థిక మంత్రి అని నిర్మలా సీతారామన్‌ను పిలవడం కాంగ్రెస్ వాళ్లకు ఇష్టం ఉండదేమో అని విమర్శలు గుప్పిస్తున్నారు. ‘మేడమ్.. ఇందిరాగాంధీ ప్రధాన మంత్రిగా ఉండి, ఆర్థిక శాఖను తన వద్ద పెట్టుకున్నారు. కానీ నిర్మలాజీపై నమ్మకంతో ప్రధాని ఆమెకు కీలక బాధ్యతలు అప్పగించారు. కాబట్టి తొలి ఆర్థిక మహిళా మంత్రిగా ఆమెను పరిగణించాలి. ఇక జీడీపీ అంటారా. మీ దృష్టిలో జీడీపీ అంటే గాంధీ డైనస్టీ పాలిటిక్స్ అనుకుంటా. ఎందుకంటే మీకు ఆ పదానికి వివరణ, అర్థం తెలియదు కదా. అభినందించే క్రమంలో ఇలా రాజకీయాలు చేయడం, ప్రజలను పక్కదారి పట్టించడం సరైంది కాదు’ అంటూ విపరితంగా ట్రోల్ చేస్తున్నారు. -
అభినందనలు నిర్మలాసీతారామన్.. కానీ
న్యూఢిల్లీ : కేంద్రంలో వరుసగా రెండోసారి అధికారం చేపట్టిన మోదీ కేబినెట్లో కీలకమైన ఆర్థిక శాఖను చేపట్టిన నిర్మలా సీతారామన్.. దేశంలో తొలి మహిళా ఆర్థిక మంత్రిగా చరిత్ర సృష్టించారు. ఈ క్రమంలో ఆమెకు అన్ని వర్గాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ‘కీలకమైన ఆర్థిక శాఖను చేపట్టిన నిర్మలాసీతారామన్‌కు శుభాకాంక్షలు. ఆర్థిక మంత్రిగా పూర్తిస్థాయి బాధ్యతలు నిర్వర్తించనున్న ఆమె అన్ని హద్దులను చెరిపేశారు’ అని జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తి ప్రశంసలు కురిపించారు. ఇక కాంగ్రెస్ మాజీ ఎంపీ, సోషల్ మీడియా వింగ్ నాయకురాలు రమ్య(దివ్యా స్పందన) కూడా నిర్మలా సీతారామన్‌కు అభినందనలు తెలిపారు. ఈ మేరకు...‘ 1970లో ఇందిరా గాంధీజీ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించి మహిళలను గర్వపడేలా చేశారు. ఇప్పుడు మీరు కూడా ఆ శాఖను చేపట్టినందుకు అభినందనలు. కానీ జీడీపీ అంత గొప్పగా ఏమీ లేదు. అయినప్పటికీ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు మీ వంతుగా తప్పక కృషి చేస్తారని తెలుసు. మీకు ఎల్లప్పుడూ మా సహకారం ఉంటుంది. శుభాకాంక్షలు’ అని రమ్య ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో రమ్య ట్వీట్‌పై స్పందించిన నెటిజన్లు.. దేశ తొలి ఆర్థిక మంత్రి అని నిర్మలా సీతారామన్‌ను పిలవడం కాంగ్రెస్ వాళ్లకు ఇష్టం ఉండదేమో అని విమర్శలు గుప్పిస్తున్నారు. ‘ మేడమ్.. ఇందిరాగాంధీ ప్రధాన మంత్రిగా ఉండి, ఆర్థిక శాఖను తన వద్ద పెట్టుకున్నారు. కానీ నిర్మలాజీపై నమ్మకంతో ప్రధాని ఆమెకు కీలక బాధ్యతలు అప్పగించారు. కాబట్టి తొలి ఆర్థిక మహిళా మంత్రిగా ఆమెను పరిగణించాలి. ఇక జీడీపీ అంటారా. మీ దృష్టిలో జీడీపీ అంటే గాంధీ డైనస్టీ పాలిటిక్స్ అనుకుంటా. ఎందుకంటే మీకు ఆ పదానికి వివరణ, అర్థం తెలియదు కదా. అభినందించే క్రమంలో ఇలా రాజకీయాలు చేయడం, ప్రజలను పక్కదారి పట్టించడం సరైంది కాదు’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. కాగా దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ తాత్కాలికంగా ఆర్థిక శాఖను నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే పూర్తిస్థాయిలో ఆర్థిక శాఖ మంత్రిగా నియమితులైన మహిళ నిర్మలా సీతారామనే. అంతేకాక గతంలో ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ దగ్గర సహాయ మంత్రిగా పని చేసిన అనుభవం కూడా ఆమెకు ఉంది. అదే విధంగా గత ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా పని చేసిన నిర్మలా రామన్ సమర్థురాలిగా నిరూపించుకున్నారు కూడా. ఇక దేశం వృద్ధిరేటు తిరోగమనంలో ఉండటం,ఉపాధి కల్పన ఆశించిన మేర జరగకపోవడం,ద్రవ్యోల్బణం శృతి మించుతున్న ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో ఆర్థిక శాఖను నిర్వహించడం నిర్మలా సీతా రామన్‌కు సవాలేనని పరిశీలకులు అంటున్నారు. Congratulations @nsitharaman on taking charge of a portfolio that was only last held by another woman, Indira Gandhi ji in 1970-makes us women folk proud! The GDP not looking great, I’m sure you will do your best to revive the economy. You have our support. Best wishes- https://t.co/gOARWiXHJG — Divya Spandana/Ramya (@divyaspandana) May 31, 2019 -
పేదరికం నుంచి పార్లమెంట్‌కు
తిరువనంతపురం: కృషి, పట్టుదల, సంకల్పం ఉంటే ఏదైనా సాధించగలం అని నిరూపించారు కేరళకు చెందిన కాంగ్రెస్ ఎంపీ రమ్య హరిదాస్. పేదరికంలో పుట్టి దేశ అత్యున్నత శాసనవ్యవస్థ పార్లమెంట్ వరకు ఎదగగలిగారంటే మామూలు విషయం కాదు. ఇటీవల వెలువడిన సార్వత్రిక ఎన్నికల్లో ఫలితాల్లో కేరళలోని పాలక్కాడ్ జిల్లా అలత్తూర్ లోక్‌సభ స్థానం నుంచి రమ్య విజయం సాధించి సంచలనం సృష్టించారు. ఇప్పుడు రమ్య పేరు రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగుతోంది. దీనికి కారణం లేకపోలేదు. ఒక సాధారణ దినసరి కార్మికుడి కూతురు కమ్యూనిస్ట్ కంచుకోటలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అంతేకాదు రాష్ట్ర నుంచి ఎన్నికైన ఏకైక మహిళా ఎంపీ రమ్యనే కావడం విశేషం. 32 ఏళ్ల దళిత ఎంపీ అయిన రమ్య.. తనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ పేదలకు సేవ చేస్తానంటోన్నారు. పేదరికం, నిరుద్యోగం, మహిళల సమస్యలపై పార్లమెంట్లో పోరాడుతానని అంటున్నారు. 2010లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ యువ నాయకత్వం కోసం సాగించిన వెతుకులాటలో స్థానిక దళిత సామాజిక వర్గానికి చెందిన 32 ఏళ్ల రమ్య హరిదాస్ రాహుల్‌గాంధీ దృష్టిని ఆకర్షించారు. మంచి వాగ్ధాటి, విషయాలపై అవగాహన, సృజనాత్మకత దళితుల అభివృద్ధి అంశాలపై మంచి పట్టు కలిగిన రమ్యని రాహుల్ తెరపైకి తెచ్చారు. ఈ నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికలు సమీపించడంతో పార్టీ ఆమెకు అవకాశం కల్పించింది. రోజుకూలీ కుటుంబంలో పుట్టి.. రమ్య రోజు కూలీ చేసుకుని బతికే దళిత కుటుంబంలో పుట్టారు. ఆమె తండ్రి హరిదాస్ కోజికోడ్ జిల్లాలోని కున్నామంగళమ్‌లో దినసరి కూలీగా పనిచేస్తున్నారు. మహిళా కాంగ్రెస్ నాయకురాలైన తల్లి రాధ స్ఫూర్తితో ఆమె అడుగుజాడల్లో రమ్య అతి చిన్న వయసులోనే సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనటం ప్రారంభించారు. మొట్టమొదట కేరళ కాంగ్రెస్ విద్యార్థి సంఘంలోనూ, ఆపై యువజన కాంగ్రెస్‌లోనూ గత పదేళ్లుగా చురుకైన కార్యకర్తగా పనిచేసిన రమ్య 2010లో కోజికోడ్ యూత్ కాంగ్రెస్ పార్లమెంటరీ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. యువ నాయకత్వాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో కొంతమంది యువతని ఎంపిక చేసి వారికి విదేశాల్లో శిక్షణనిచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది గత కాంగ్రెస్ ప్రభుత్వం. అందులో భాగంగా మన దేశం నుంచి జపాన్, మలేసియా, సింగపూర్, శ్రీలంక దేశాల్లో జరిగిన వరల్డ్ యూత్ కార్యక్రమాలకి వెళ్లిన పది మంది ప్రతినిధుల్లో రమ్య ఒకరు. కున్నమంగళం పంచాయతీకి ఆమె అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. అంతకన్నా ముఖ్యంగా స్థానికంగా ఆదివాసీలు, దళితుల సమస్యలపై అవగాహనను పెంచుకుని, ప్రస్తుతం వివిధ అంశాలపై శిక్షణనిచ్చే స్థాయికి ఎదిగారు. కొండను ఢీకొట్టారు. స్థానికంగా ఎన్నో ఏళ్లుగా పార్టీలో పనిచేస్తోన్న అనేక మంది సీనియర్ నాయకులున్నా పాలక్కాడ్ జిల్లాలోని అలత్తూర్ లోక్‌సభ స్థానానికి రమ్య పేరు తెరపైకి వచ్చింది. మహిళలకు తప్పనిసరిగా అవకాశం కల్పించాల్సిన పరిస్థితులూ, అలత్తూర్‌లో ప్రత్యామ్నాయం లేకపోవడం, ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం కావడానికి తోడు రమ్య సామాజిక చైతన్యం వెరసి ఆమెకు ఈ అవకాశం వచ్చిందని పార్టీ నేతలు భావిస్తున్నారు. 2009 నుంచి పార్లమెంటు సభ్యుడిగా కొనసాగుతోన్న సీసీఐఎం నేత పీకేబిజూను ఓడించి పార్టీ నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. -
కెనడా పౌరుడిని ఎందుకు వెంట తీసుకెళ్లినట్టు?
న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల సమరం ముగింపు దశకు చేరిన క్రమంలో బీజేపీ- కాంగ్రెస్ పార్టీలు విమర్శలు- ప్రతివిమర్శలతో యుద్ధానికి దిగుతున్నాయి. దివంగత నేత రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో యుద్ధనౌక ఐఎన్ఎస్ విరాట్‌ను గాంధీ కుటుంబం సొంత ట్యాక్సీలా వాడుకుందంటూ ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయనతో పాటు మరికొంత మంది బీజేపీ నేతలు కూడా రాజీవ్ గాంధీతో పాటు నెహ్రూపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. ఇందుకు కాంగ్రెస్ నేతలు కూడా దీటుగా బదులిస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రమ్య(దివ్యా స్పందన) ట్విటర్ వేదికగా నరేంద్ర మోదీపై విమర్శలు ఎక్కుపెట్టారు. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కెనడా పౌరసత్వ వివాదాన్ని ప్రస్తావిస్తూ... ‘ నరేంద్ర మోదీ కెనడా పౌరుడైన అక్షయ్‌కుమార్‌ను ఐఎన్ఎస్ సుమిత్రలో విహారానికి తీసుకువెళ్లారు. ఇది సరైందేనా? ఈ వివాదం గురించి గతంలో వచ్చిన ఆర్టికల్ చూడండి’ అంటూ ఓ వార్తకు సంబంధించిన లింక్‌ను తన ట్వీట్‌కు జత చేశారు. కాగా ఐఎన్ఎస్ విరాట్‌లో ప్రయాణించిన సమయంలో రాజీవ్ గాంధీతో పాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా ఇద్దరు అధికారులు మాత్రమే వారి వెంట ఉన్నారని రిటైర్డ్ వైస్ అడ్మిరల్ వినోద్ పస్రిచా పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇక రమ్య ట్వీట్‌కు నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ‘ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ-2016కు అక్షయ్, కంగనాలను అప్పటి రాష్ట్రపతి, రక్షణ మంత్రి ఆహ్వానించారు. వారిని పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతించారు. ప్రధాని మోదీ కూడా ఒక అతిథిలాగే వెళ్లారు’ అంటూ కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఇక మరికొందరు మాత్రం.. ‘ అవును ఏ పార్టీ నాయకులైనా, ప్రధానులైనా సరే విదేశీ పౌరులను ఇలా మన యుద్ధనౌకల్లో ప్రయాణించేందుకు వీలు కల్పించడం సరికాదు’ అంటూ ట్వీట్లు చేస్తున్నారు. Yeh teek tha? @narendramodi you took a Canadian citizen @akshaykumar with you on-board INS Sumitra. #SabseBadaJhootaModi Here’s the link to the article, most of us have not forgotten this controversy : https://t.co/jrPNUvk2Py pic.twitter.com/SWkl78rA4F — Divya Spandana/Ramya (@divyaspandana) May 9, 2019 -
దివ్య స్పందన కేసులో 50 లక్షల ఫైన్
సాక్షి, న్యూఢిల్లీ : మాజీ ఎంపీ, కన్నడ సినీ నటి దివ్య స్పందన (రమ్య)కు పరువు నష్టం కేసులో 50 లక్షల రూపాయలు చెల్లించాల్సిందిగా ఆసియా నెట్ టీవీ ఛానెల్, దాని అనుబంధ సంస్థ సువర్ణ న్యూస్‌ను బెంగళూరు కోర్టు ఇటీవల ఆదేశించింది. 2013లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో ఆమెను తప్పుగా ఇరికించినట్లు కోర్టు తీర్పు చెప్పింది. ఇక ముందు సరైన సాక్ష్యాధారాలు లేకుండా ఐపీఎల్ ఫిక్సింగ్ స్కామ్‌తో ఆమెకు సంబంధం ఉన్నట్లు ఎలాంటి వార్తలు ప్రసారం చేయరాదని కూడా ఆదేశించినట్లు ‘బార్ అండ్ బెంచ్’ వెబ్సైట్ బుధవారం వెల్లడించింది. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఐపీఎల్ జట్టుకు దివ్య స్పందన బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేశారు. అయితే ఆమె 2013 ఐపీఎల్ ఎడిషన్‌కు పనిచేయలేదు. అప్పుడు జరిగిన మ్యాచ్ ఫిక్సింగ్‌లో ఇద్దరు కన్నడ నటీమణుల హస్తం ఉందంటూ పేర్లు వెల్లడించకుండా దివ్వ స్పందనను చూపిస్తూ ఓ వార్తా కథనం ఆసియానెట్ ఛానెల్‌తోపాటు సువర్ణ న్యూస్ ఛానెల్లో ప్రసారం చేశారు. ఎవరి పేర్లను ప్రస్తావించనందున దివ్వ స్పందన పరువుకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని ఛానెళ్లు వాదించాయి. స్పందనను చూపినందున ఆమెకు నష్టం జరిగిందని కోర్టు భావించింది. -
ఓటు వేయని రమ్య
కర్ణాటక, యశవంతపుర : నటి, కాంగ్రెస్ నాయకురాలు రమ్య ఓటు హక్కును వినియోగించుకోకుండా మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. గురువారం ఆమె ఓటింగ్‌లో పాల్గొనలేదు. ఓటు వేయనందుకు కన్నడిగులు ఆమెకు చీవాట్లు పెట్టారు. ఒకసారి మండ్య నుండి పోటీ చేసి గెలిచిన రమ్య అప్పటి నుంచి కర్ణాటక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. గత విధాన సభ ఎన్నికలలో అభ్యర్థుల తరఫున కూడా ప్రచారం చేయలేదు. ఓటు హక్కును వినుయోగించుకోలేదు. మండ్యలో ఓటు వేయటానికి కూడ రాకపోవటంతో కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు ప్రజలు కూడ రమ్యపై నిప్పులు కక్కుతున్నారు. నటిగా, రాజకీయ నాయకురాలిగా పార్టీలో గుర్తింపు తెచ్చుకున్న రమ్య ఓటు వేయకు పోవటంవల్ల ఇతరులకు ఓటు వేయమని అడిగే హక్కు కూడా రమ్యకు లేదని నిలదీస్తున్నారు. -
మజిలీ
‘రమ్య’. పేరు ఎంత బాగుందో ఆమె కూడా అంతే అందంగా ఉంటుంది. నిజం చెప్పాలంటే, ఓ దేవతలా అనిపిస్తుంది నాకు. ఆమె నవ్వుతుంటే, కొన్ని గంటల్లోనే కొన్ని కోట్లసార్లు చూసి ఉంటా. అంత అందంగా నవ్వుతుంది. నాకందుకే అనిపిస్తూ ఉంటుంది, ఆమె పుట్టగానే నవ్విందేమో అని! ఆమెను నేను మొదటిసారి వరంగల్ గౌతమి ఇంజనీరింగ్ కాలేజీలో చూడటం ఇప్పటికీ అలాగే గుర్తుంది. నా ఫ్రెండ్ వరుణ్ అదే కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఆ రోజు కాలేజీలో పార్టీ ఉంటే నన్ను కూడా బలవంతంగా తీసుకెళ్లాడు.పార్టీ కావడంతో కాలేజీలో చాలా హడావుడిగా ఉంది. నాలుగు స్తంభాలు ఉన్న దగ్గర నేను నిలబడి ఆలోచిస్తున్నా. ఉన్నట్లు ఉండి ఆకాశం చల్లగా మారింది. రాను రానూ వర్షపు జల్లు నవ్వుతూ పడింది. దూరం నుంచి తెల్లటి డ్రెస్‌లో ఆ వర్షపు జల్లులో అలా నడుచుకుంటూ ఒక అమ్మాయి వచ్చింది. ఆ వర్షపు జల్లు తనపై పడుతుంటే, నవ్వుతోంది. బహుశా ఆ వర్షపు జల్లు ఆమె కోసమే పడుతున్నట్లు ఆ నిమిషం నాకనిపించింది.ముఖంపైకి వచ్చి పడుతున్న కురులను తన చేతి వేళ్లతో అందంగా వెనక్కి నెట్టిపడేస్తూ చిన్ని చిన్ని అడుగులు వేస్తోంది. ఇంత అందమైన అమ్మాయిని చూడటానికే ఈ రోజు ఇక్కడికి వచ్చినట్లు నా మాటలు నా గుండెకి తాకాయి. ఇది ఆమెపై కలిగిన ప్రేమో, లేక ఆకర్షణో తెలియదు. కానీ, ఆమెకోసం ఏదైనా చేయొచ్చని మనసుకు అనిపించింది. ఇలా అనిపించడం కూడా నాకే వింతగా ఉంది. నా ఫ్రెండ్ వరుణ్‌ను పిలిచి ఆ అమ్మాయి ఎవరని అడిగాను.పేరు రమ్య. ఫస్ట్ ఇయర్. వరుణ్ ఆ అమ్మాయి గురించి చెబుతుంటే, వెళ్లి పరిచయం చేసుకోవాలనిపించింది. కానీ, ఏమో అప్పుడు ఆ సాహసం చేయలేదు. ఆమెకూ నేను నచ్చాలి కదా. అయినా, నేను ఎవరని ఆమె నాతో మాట్లాడుతుంది! ఒక్కటా.. రెండా.. ఎన్నో ప్రశ్నలు. అన్నీ తన చుట్టే! తనని చూసిన తర్వాత ఆరు గంటలు జరిగిన పార్టీ, అర నిమిషంలో ముగిసినట్లు అనిపించింది. తననివదిలి ఇంటికి వెళ్లాలనిపించలేదు. ఇదే విషయాన్ని వరుణ్‌కి చెప్పాను.‘ప్రేమ ఏంట్రా చరణ్! అయినా ఒక్క రోజులో ప్రేమ పుడుతుందారా? ఇవన్నీ వద్దు. టైం వేస్ట్ చేసుకోకురా. ఇంకో రెండు సంవత్సరాలు అయితే నీ ఇంజనీరింగ్ అయిపోతుంది. మంచి జాబ్ వస్తుంది. అప్పటికి ఆ అమ్మాయి థర్డ్ ఇయర్లోనే ఉంటుంది. అప్పుడు తనకి నీ విషయం చెప్పు. ఏమంటుందో చూడు. తనకీ ఇలాంటి ఫీలింగే ఉంటే, నీ లైఫ్ బాగుంటుంది’ అన్నాడు.‘అంటే ఏంట్రా నువ్వనేది, ప్రేమించిన ప్రతి వాడు చదువుని పక్కనపెట్టి అమ్మాయిల కోసమే తిరుగుతాడా?’‘తిరుగుతాడో లేదో నాకు తెలియదు చరణ్! కానీ నువ్వు ఆ అమ్మాయి కోసం ఇంత రిస్క్ చేయొద్దు. ఎందుకంటే, ఆ అమ్మాయి నిన్ను ప్రేమించట్లేదు కాబట్టి.’‘అయితే రేపు కాలేజ్‌కి వచ్చి నా ప్రేమ విషయం చెప్తా’‘హా. వెళ్లి చెప్పు. చెప్పు ఎలా ఉందో చూశావా అని సినిమా స్టైల్లో రిప్లయ్ ఇస్తుంది’‘ఎందుకు రా వరుణ్, నెగటివ్‌గా ఆలోచిస్తున్నావ్?’‘సారీ రా. కానీ ఆమె నాకు ఇవన్నీ నచ్చవంటే నువ్వు బాధపడతావ్. అది నేను చూడలేను. నా మాట విని నువ్వు ఒక టూ ఇయర్స్ వెయిట్ చెయ్యి’‘సరే రా వరుణ్, నాకు నా మీద కంటే నీ మీద నమ్మకం ఎక్కువ. నువ్వు చెప్పినట్లే నా చదువయ్యాకే ఆమెని కలుస్తా‘ అని వాడికి మాటిచ్చా.’ వాడికి ఇచ్చిన మాట ప్రకారమే, ఆమె నుంచి దూరంగా వచ్చేశా. చాలాసార్లు వరుణ్‌కి చెప్పకుండా ఆమెని చూడాలనిపించేది. కానీ, ఆమెను చూశాక నేను ఇక హైదరాబాద్‌కి మళ్లీ వెళ్లనేమో అనిపించింది. అలా చేస్తే నా ఫ్రెండ్షిప్ పాడైపోతుంది. ఏదేమైనా ఆమె నాకోసమే పుట్టిందన్న ఆ చిన్న నమ్మకంతోనే సంవత్సరం గడిపేశా. తర్వాత వరుణ్‌కి సెలవులని తెలిసి కలవడం కోసం వరంగల్ వెళ్లా. ఆ టైంలో రమ్య గురించి వరుణ్ని చాలాసార్లే అడిగాను. వాడు సమాధానం చెప్పలేదు. ఇక నేను అడగదల్చుకోలేదు. నాలుగు రోజులు ఉండి, తిరిగి హైదరాబాద్ వెళ్లేందుకు బస్టాండ్‌కి వెళ్లా. రాత్రి సరిగ్గా పన్నెండవుతోంది. బస్ టిక్కెట్ తీసుకుని లోపలికి వెళ్లి కూర్చున్నా. బస్ మొత్తం ఫుల్ అయింది కానీ, నా పక్కనున్న సీట్ మాత్రం ఖాళీగానే ఉంది. అప్పుడే వచ్చింది ఓ అమ్మాయి. కళ్లు మాత్రమే కనిపిస్తున్నాయి. ముఖం కనిపించకుండా స్కార్ఫ్ కట్టుకుంది. రాత్రి ఒంటిగంట అవుతోంది. ఆ అమ్మాయి హెడ్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటోంది. ముఖానికున్న స్కార్ఫ్ మాత్రం తీయలేదు. పాటలు వింటూనే నిద్రలోకి జారుకుంది. నేను విండోవైపు తిరిగి పడుకున్నా. ఫోన్ కింద పడిన శబ్దం వినిపించి లేచా. కానీ ఆమె నిద్రలోనుంచి ఇంకా బయటకు రాలేదు. ఫోన్ పైకి తీశా. ఆమె నిద్ర ఎప్పుడు లేస్తుందా అని ఎదురుచూస్తున్నా. సరిగ్గా సగం దూరం వచ్చాక లేచింది. ‘‘ఏంటి అలా చూస్తున్నావ్?’’ అని సీరియస్‌గా అడిగింది. ‘కాదండి. మీ ఫోన్ కింద పడిపోయింది. మీరు లేస్తే ఇద్దామని చూస్తున్నా’ అన్నాను.‘అయ్యో! క్షమించు. నిద్ర పట్టేసింది, చూసుకోలేదు. చాలా థ్యాంక్స్, ఫోన్ ఇచ్చినందుకు.’ అని తన స్కార్ఫ్ వెనక ఉన్నమాటలు కనిపించలేదు కానీ, వినిపించాయి.‘పర్లేదండీ! కానీ చాలాసేపే నిద్రపోయారు మీరు..’‘అదేంటో.. నాకు బస్ ఎక్కిన కొద్దిసేపటికే నిద్ర పట్టేస్తుంది. ఇక రాత్రి సమయాల్లో ప్రయాణం అంటే, ఎక్కువ నిద్ర వచ్చేస్తుంది. సరే, మీరు ఏం చేస్తుంటారు?’‘నేను ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ హైదరాబాద్‌లో. మరి మీరు?’‘నేను ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్. ఇక్కడే వరంగల్‌లో..’‘ఓకే. ఏ కాలేజో తెలుసుకోవచ్చా?’‘ఎందుకు?’‘కాదు. నేనొక అమ్మాయిని ఇష్టపడ్డా. ప్రేమించా. ఆ అమ్మాయి మీ కాలేజేమోనని?’‘ఓ సూపర్. ఏ కాలేజ్ మరి ఆ అమ్మాయి?’‘వరంగల్ గౌతమి ఇంజనీరింగ్ కాలేజ్!’‘అవునా, నేను అరోరా కాలేజ్. ఇంతకీ ఆ అమ్మాయి పేరేంటి?’‘ఆమె పేరు రమ్య. చాలా అందంగా ఉంటుంది. చూడగానే చాలా ఇష్టపడిపోయా. కానీ, నా ఫ్రెండే.. అప్పుడే ఎందుకు లవ్ అని చదువు అయిపోయాక ఆఅమ్మాయిని కలవమని అన్నాడు. కానీ, ఈలోపు ఆ అమ్మాయిని నేను మర్చిపోతానని వాడి నమ్మకం. కానీ, అంత ఈజీగా మర్చిపోలేను. ఇంతకీ మీ పేరు?’‘నా పేరు శ్రీవాణి. ఆ అమ్మాయినిమర్చిపోతావేమో అని నాకు కూడా అనిపిస్తోంది’‘లేదండీ. బీటెక్ అయిపోయిన తర్వాత ఆమెకి నా విషయం చెప్తా’‘అచ్చా! చెప్పగానే ఆ అమ్మాయి ఒప్పుకోదు కదా మిస్టర్’‘అది నిజమే. బట్ వెయిట్ చేస్తా. ఒప్పిస్తా. నన్ను ఒప్పుకుంటుందన్న నమ్మకం ఉంది శ్రీవాణి గారు’‘అది ఓకే. కానీ ఈలోపు ఆ అమ్మాయి వేరే వ్యక్తిని ప్రేమిస్తే?’‘మీరు లేనిపోని భయాలు పెట్టకండి ప్లీజ్’ ‘జస్ట్అడుగుతున్నా. అప్పుడేం చేస్తావ్?’‘అలానే జరిగితే, తను ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటా. కానీ, నాకు నమ్మకం ఉంది. రమ్య నా సొంతం అని’‘సరే, గట్టిగా కోరుకుంటే జరుగుతుంది. నీకు మంచి జరగాలని నేను కూడా కోరుకుంటా’‘చాలా థ్యాంక్స్ అండీ. ఆ అమ్మాయి నా సొంతం’ అని మళ్లీ అనేసి నిద్రలోకి జారుకున్నా. హైదరాబాద్ వచ్చింది. పక్కన మాత్రం శ్రీవాణి లేదు. ఆమె ప్లేస్‌లో ఓ లెటర్ ఉంది. అది చూశాక నేనెంత పెద్ద తప్పు చేశానో నాకు అర్థమయింది.‘హాయ్! నిజం చెప్పాలంటే నీ పేరు కూడా నాకు తెలియదు. ఒక అమ్మాయికి తెలియకుండా ఆ అమ్మాయిని ఇంతగా ఇష్టపడటం నిజంగా గ్రేట్ అనిపిస్తోంది నాకు. ఎందుకు ఇంత సంతోషమంటే, ఆ అమ్మాయిని నేనే కాబట్టి. నువ్వు చదువుతుంది నిజమే. నేనే రమ్యని. నేనేశ్రీవాణీని. నా పూర్తి పేరు రమ్య శ్రీవాణి. నువ్వు నా గురించి చెబుతున్న విషయాలకు నేను చాలా సంతోషపడ్డా. నువ్వు మంచివాడివో కాదో నాకు తెలియదు. కానీ నాకు తెలిసింది ఒకే ఒక్కటి, నువ్వునాకోసం ఎదురుచూస్తున్నావు. నిజం చెప్పాలంటే, బస్సులో నీ మాటలు నా హదయాన్ని కదిలించాయి. ఒక అమ్మాయి కోసం ఆమెకి తెలియకుండా, ఓ అబ్బాయి ఏడాది నుంచి ఇంతలా ఎదురుచూడటం నాకు కొత్తగా అనిపించింది. ఇది నా గురించే కావడం నేను ఇంకా నమ్మలేకపోతున్నా. నా గురించి నువ్వు చెబుతుంటే, నా అనందాన్ని నా స్కార్ఫ్ వెనుక దాచేశాను. ఏ అమ్మాయికైనాకావాల్సింది నిజమైన ప్రేమే. నా గురించి అప్పుడే చెబితే నీ చదువుకు అడ్డం అవుతాననే భయంతోనే నేను అరోరా కాలేజ్, నా పేరు శ్రీవాణీ అని చెప్పాను. నువ్వు నాకోసం అప్పుడే ఒక సంవత్సరం ఎదురుచూశావు. ఇంకా ఒక సంవత్సరం నేను నీకోసం ఎదురుచూస్తాను. నువ్వు నాకు ఎప్పుడు ప్రపోజ్ చేస్తావో అని’.ఆమె పేపర్ మీద రాసిన మాటలు చూసి బస్సులోనే ఎగిరి గంతేశా. ఎప్పుడు రాసిందో, ఎలా రాసిందో అర్థం కాలేదు. కాసేపు గాల్లో తేలాను. ఆ సంవత్సరమంతా ఆ లెటర్లోని మాటలనే తన మనసుగా చూసుకుంటూ గడిపేశా. మధ్యలో ఓ పదిసార్లు వరంగల్ వెళ్లినా తనని చూడలేదు. ఎందుకంటే, తను నాది కాబట్టి. నా ప్రెండ్షిప్, నా ప్రేమ కోసం సర్దిచెప్పుకున్నా.రెండేళ్ల తర్వాత చదువు పూర్తి చేసి విప్రోలో జాబ్ కొట్టి గౌతమి కాలేజ్ ముందు నిలబడ్డా. చాలామంది కాలేజీ నుంచి వస్తున్నారు. రమ్య మాత్రం కనిపించలేదు. ఆ బాధతోనే వరుణ్ దగ్గరకు వెళ్లాను. ‘రారా చరణ్, ఎలా ఉన్నావ్?’ నన్ను చూసి ఆశ్చర్యపోతూ అడిగాడు వరుణ్. ‘వరుణ్, ఈ రోజు మీ కాలేజ్‌కి వెళ్లాను. రమ్య కనిపించలేదు’‘అదేంట్రా కనిపించకపోవడం. సరే, ఈ రోజు రాలేదేమో కాలేజీకి. రేపు వెళ్లి ట్రై చెయ్యి’ఆ మరుసటి రోజు నుంచి దాదాపు నెల రోజులు ఆమె కోసం ఎదురుచూశా. ఏ రోజూ ఆమె కనిపించలేదు. నా మనసుకు గాయం అయినంత పనయింది. ఇదే విషయం వరుణ్‌కి చెప్పాను.అరే చరణ్. నాకు కాలేజ్ అయిపోయి రెండు నెలలవుతోంది. ఈ విషయం నీకు కూడా తెలుసు కదా. అయినా ఆ అమ్మాయిని నేను ఎప్పుడూ పెద్దగా పట్టించుకోలేదు. సరే, నా జూనియర్స్కొందరివి నెంబర్స్ ఉన్నాయి. వాళ్లను అడిగి తెలుసుకుంటా’ అని దాదాపు ఓ ముప్ఫై మందికి కాల్ చేశాడు వరుణ్. అందరూ ఎక్కడికి వెళ్లిందోచెప్పలేదనే చెప్పారు. ఓ ఆరు నెలలు నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ప్రతిసారీ వరుణ్ నాకు ధైర్యం చెబుతూనే ఉన్నాడు. కానీ గుండెల్లో నిండివున్న తనని అంత ఈజీగా మర్చిపోలేను కదా. ఓ ఎనిమిది నెలల తర్వాత.. ఫేస్బుక్లో ఓ పోస్ట్ కనిపించింది. ‘దూరం’ అనే కథ అది. పూర్తిగా చదివాను. నా గురించే రాసినట్లు ఉంది. ఈ కథ రాసిందెవరో అని చూశా. తనే. రమ్య. ఫోటో చుశాక నాపై వర్షపుజల్లు సంతోషంతో పడినట్లు అయింది. ఎన్ని నెలలైంది అయింది తనని చూసి. ఉండబట్టలేక, ఆ పోస్ట్ కిందే ‘కథ చాలా బాగుంది’ అని కామెంట్ పెట్టా. తను నాకు రిప్లయ్ ఇచ్చింది. నంబర్ చెప్పింది.ఫోన్ చేశా.‘హాయ్ రమ్య. ఆ రోజు నువ్వు నా పక్కనే ఉన్నా గుర్తించలేకపోయా. నా మదిలో రమ్య ఉంది. అందుకే నేను నీ కళ్లలోకి చూడలేకపోయాను. కానీ, ఆ రమ్యే నా పక్కన ఉందని తెలుసుకోలేకపోయా’నిజం చెప్పాలంటే, నువ్వు మంచివాడివి. ఇంత మంచితనం నేను ఎవరి దగ్గరా చూడలేదు చరణ్’‘నీ గురించి మీ కాలేజీ ముందు ఎన్నో రోజులు చూశా. చాలా బాధపడ్డా’‘నువ్వు అక్కడికి వెళ్తావని నాకు తెలుసు. కానీ, నీ ప్రేమ కోసం నువ్వు ఎంత ఎదురుచూస్తున్నావో, నీకోసం నేను కూడా అంతే ఎదురుచూస్తున్నా’‘నా ప్రేమ ఫలించింది రమ్యా! నేను ఎదురు చూసినందుకు నువ్వు నా సొంతం అయ్యావ్’‘అది నేను ఒప్పుకుంటా చరణ్. ఇంట్లో పెళ్లి చేస్తాం అన్నారు. అందుకే అక్కడ నుంచి ఢిల్లీ వచ్చేశా. అక్క దగ్గర ఉన్నాను. నెల క్రితమే బావకి జాబ్ హైదరాబాద్ షిఫ్ట్ కావడంతో అక్కడికి వెళ్లిపోయారు.ప్రస్తుతం రూంలో ఒక్కదాన్నే ఉంటున్నాను. కానీ నిన్ను ఎలా కలవాలో.. నీతో ఎలా మాట్లాడాలో అర్థం కాలేదు. ఆ బాధే ఈ ‘దూరం’ కథ. ఈ కథ నీవరకు వస్తుందని.. నువ్వు కచ్చితంగా చదువుతావని అనిపించింది. నా ఆశే నిజమైంది’‘నాకోసం నువ్వు ఎంతో గొప్ప పనిచేశావ్ రమ్యా! నిజంగా ఇప్పుడే నిన్ను పెళ్లి చేసుకోవాలి నేను’ ‘కచ్చితంగా నాకూ అదే కావాలి. నిన్ను మిస్ చేసుకోలేను. నువ్వు నాకోసం ఢిల్లీ వచ్చెయ్’ ‘వస్తా. కచ్చితంగా’నెలరోజులు టైం లేకుండా ఇద్దరం ఫోన్లో మాట్లాడుకున్నాం. ఒకరి గురించి ఒకరం తెలుసుకున్నాం. తన దగ్గరే ఉండేందుకు ఢిల్లీలో కొత్త జాబ్ చూసుకున్నా. ఇది నా జీవితంలో ఎంతో గొప్ప విషయం. నాకు అమ్మ, నాన్న అన్నీ ఇప్పుడు రమ్యనే కాబోతోంది. నాకంటూ ఎవరూ లేరు ఈ జీవితంలో. చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని పోగొట్టుకుంటే, వరుణ్ తల్లిదండ్రులే చదివించారు నన్ను. ఈ ఆనందం ఎన్ని కోట్లు పెడితే వస్తుంది! భగవంతుడు నా మీద దయ చూపాడు. రైల్వే స్టేషన్లో దిగా. బ్యాగ్ ఓ చేత్తో పట్టుకుని నడుస్తున్నా. రమ్య కాల్ చేసింది. ‘హలో’ అనేలోపు నలుగురు దొంగలు, వెనకాల నుంచి వచ్చి బ్యాగ్ లాక్కెళ్లారు. అరసెకను నాకేం జరిగిందో అర్థం కాలేదు. వాళ్ల వెనుకే పరిగెత్తాను. మధ్యలో ఓ బండరాయి కాలికి తగిలి ఫోన్ మ్యాన్‌హోల్‌లో పడిపోయింది. తర్వాత అది కనిపించలేదు. వాళ్లు నాకు ముప్పై అడుగుల దూరంలోనే ఉన్నారు. వాళ్ల వెనుకే పరిగెత్తాను. పరిగెడుతూ పరిగెడుతూ పక్కనుంచి వస్తున్న బస్సుని చూసుకోకుండా రోడ్డు దాటబోయాను. గట్టిగా బస్సు హారన్ శబ్దం. బ్రేక్ పడ్డ చప్పుడు. ’ఎయ్’ అని ఎవరో బలంగా లాగిన విషయమూ. అన్నీ సెకండ్లలో వినిపించి, కనిపించాయి. నా చేతిని అందుకున్న మనిషిని చూశా. ఆమె నోటి నుంచి ఏవో మాటలు అలా వస్తూనే ఉన్నాయి. అవేమీ వినిపించడం లేదు. ఆమెను అలా చూస్తూ ఉండిపోయా. రమ్య. ఆమె నా రమ్య. రమేశ్ రాపోలు -
రమ్యను పాక్‌లో వదిలివేయాలి
కర్ణాటక, బొమ్మనహళ్లి : బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన భజరంగి భాయ్‌జాన్ సినిమాలో చిన్నపాపను పాకిస్తాన్‌కు తీసుకుని వెళ్లినట్లు కన్నడ నటి, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రమ్యను కూడా పాకిస్తాన్లో వదిలి రావాలని కన్నడ ప్రజలు ఆమెపై ట్వీట్లు చేస్తున్నారు. ఏఐసీసీ సోషల్ మీడియా ప్రముఖురాలిగా ఉన్న రమ్య దేశానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల భారత్, పాక్ పరిణామాల నేపథ్యంలో రమ్య భారత్‌కు వ్యతిరేకంగా ట్వీట్లు పెట్టడంపై కన్నడిగులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఆమెను పాకిస్తాన్లో విడిచిపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. -
అసలు కథ
‘యాంకర్ రమ్య భారతి ఇక లేరు.. ఆమె వాక్చాతుర్యం, నవ్వు శాశ్వతంగా మనల్ని వీడి పోయాయి.. గుండెపోటుతో నిద్రలోనే కన్ను మూసిన అందాల తార... బుల్లి తెరకు తీరని లోటు...’ సామాజిక మాధ్యమాల్లో ఈ వార్త హోరెత్తిపోయింది.రమ్య భారతి చాలా ఫేమస్ యాంకర్. నవ్వుతూ సందర్భోచిత వ్యాఖ్యానంతో, పంచ్‌లతో, సునిశిత హాస్యంతో ప్రేక్షకుల మనసులను దోచుకున్న ఆమెకు అభిమానులెందరో ఉన్నారు. ఆమె ఇంటి ముందు జనం బారులు తీరారు. క్యాంపులో ఉన్న భర్త రాజశేఖర్‌కి ఫోన్ చేశారు. వెంటనే వచ్చాడు. వీరి మాటలు నమ్మక, ‘నా బంగారం నన్ను విడిచిపోదు...’ అంటూ ఆశగా డాక్టర్ని పిలిపించాడు. కాని అతని ఆశ నిరాశ చేస్తూ డాక్టర్ ఆమె మరణించిన విషయం ధ్రువపరచి వెళ్ళిపోయాడు. రాజశేఖర్ గుండెలవిసేలా ఏడుస్తున్నాడు. పని మనిషి ‘రాత్రి తొమ్మిది వరకు ఆమె బాగానే ఉంది’ అని చెప్పింది. బంధువులంతా వచ్చారు. దహనానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అకస్మాత్తుగా పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఇది సహజ మరణం కాదని, హత్య అని అనుమానంగా ఉందని రమ్య భారతి తల్లి ఫిర్యాదు చేసిందంటూ వచ్చి, ఆమె భర్తను, పనిమనిషిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ‘రమ్యతో పాటే టీవీ చానల్లో పనిచేసే ప్రదీప్ తరచు ఇంటికి వస్తుండే వాడని, రాజశేఖర్ లేనప్పుడల్లా ఇద్దరూ కలిసి తిరుగుతుండే వాళ్లని, ముందురోజు కూడా రాజశేఖర్ టూర్లో ఉండటంతో అతను రాత్రి చాలా పొద్దు పోయేవరకు ఉన్నాడని’ భయపడుతూ చెప్పింది పనిమనిషి. తెల్లవారి పనిమనిషి వచ్చేసరికి గడియ తెరిచే ఉందని, లోపలికెళ్ళేసరికి రమ్య భారతి ఒక్కతే మంచంపై పడుకుని ఉందని, ఇంకా లేవలేదని లేపబోతే చల్లగా తగిలిందని, ఇంటి పక్క వారికి చెబితే వారు అయ్యగారికి ఫోన్ చేశారని చెప్పింది. సీఐ బెడ్రూమ్ని పరిశీలించాడు. నిజంగానే అక్కడ ఘర్షణ జరిగినట్లు , పగిలిన చేతి గాజు ముక్క, అడ్డం పడి ఉన్న ఫ్లవర్ వాజు, ఆమె వెంట్రుకలు లాంటివి, పెరటి వైపు కారు టైర్ల గుర్తులు, బెడ్ రూమ్‌లో ప్రదీప్ వేలిముద్రలు అనుమానాస్పదంగా కనిపించాయి. కాని కేవలం వాటి వల్ల నిర్ధారణకు రాలేం. పరారవుతున్న ప్రదీప్‌ని అదుపులోకి తీసుకుని వారిదైన శైలిలో ప్రశ్నించారు. అతను ‘నాకూ, ఆమెకూ సంబంధం ఉంది. ఆ రోజు రాత్రి పన్నెండు గంటల వరకు ఆమెతో గడిపి వెళ్లిపోయాను. అంతకు మించి నాకే పాపం తెలీదు’ అన్నాడు.‘నంగనాచి... నా బిడ్డను నాశనం చేసి బుకాయిస్తున్నాడు, బంగారంలా చూసుకునే అల్లుడి నుంచి వల వేసి నా బిడ్డను లోబరుచుకున్నాడు. నాలుగు తగిలించండి... వాడే నిజం కక్కుతాడు... నా బిడ్డ దగ్గర నుంచి డబ్బంతా దోచుకున్నాడు..’ రమ్య భారతి తల్లి ఏడుస్తూ అరుస్తోంది. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి రాజశేఖర్‌కు సంకెళ్ళు వేశారు. అంతా నివ్వెర పోయారు. ‘సర్... నా భార్యను బంగారంలా చూసుకుంటాను.. అసలు నిన్నేం జరిగిందో నాకు తెలీదు.... తప్పు చేసిన వాడిని వదిలి, ఇప్పుడు వచ్చిన నన్ను ఇలా అనుమానించడం అమానుషం...’ గింజుకున్నాడు రాజశేఖర్.‘మిస్టర్... మాకు అన్ని ఆధారాలూ దొరికాయి.. నువ్వు నిన్న రాత్రి వెనక వైపు నుండి ఇంటికి వచ్చి ఆమెను చంపి మళ్ళీ వెళ్ళిపోయావు కదా.... నీ మీద అనుమానం రాకుండా ఉండటానికి అంతా ఫోన్ చేసి చెప్పాక అందరి ముందూ అప్పుడే వచ్చినట్లు బిల్డప్ ఇచ్చావు... ఇంకా బుకాయించకు. నిజాయతీగా ఒప్పేసుకుంటే శిక్ష తగ్గుతుంది..’ సీఐ హూంకరించాడు. షాక్ తిన్న రాజశేఖర్ ఇంకా బుకాయించడం వల్ల లాభం లేదనుకున్నాడు. ‘నిజమే... ఆమెను నా ప్రాణంలా చూసుకున్నా... కాని ఆమె మరొకరి వలలో పడింది. చూచాయగా వాళ్ళు వీళ్ళు ఈ విషయం నా దృష్టికి తీసుకొచ్చినా ఆమెను అనుమానించలేదు.. మీడియాలో ఇది మామూలే అనుకున్నా... ఎప్పుడు టూర్ కెళ్ళినా ఎప్పుడొస్తానో చెప్పేవాడిని. ఈసారి అలాగే రేపు వస్తానని చెప్పాను. కాని ముందు రోజే అంటే నిన్ననే అయిపోవడంతో రాత్రి ఇంటికి వచ్చాను. ఇంటి ముందు ఆగి ఉన్న కారు నాలో అనుమానాన్ని రేకెత్తించింది. ఇంటి వెనుక కారు ఆపి , వెనుక గేట్ గుండా బెడ్ రూమ్ కిటికీ దగ్గర కొచ్చాను. వాళ్ళిద్దరూ తప్పు చేస్తూ కనబడ్డారు. అసహ్యం వేసింది. ఎంత బాగా చూసుకున్నాను తనను, ఏడుపొచ్చింది. ఆ బాధలో ఆ చీకట్లో షాక్‌లో ఉండగానే ప్రదీప్ వెళ్ళిపోయాడు. నేను లోనికెళ్ళాను. కొంచెం కంగారు పడింది. మాటలతో అనవసరం అనిపించింది. రేపటి వరకు టూర్ కాబట్టి ఇప్పటి వరకు ప్రదీప్ ఉన్నాడు కాబట్టి , చంపితే ఎవరికీ అనుమానం రాదనుకున్నాను. అదే బెడ్ రూమ్‌లో దిండుతో ఆమె ముఖంపై అదిమి ఊపిరి ఆడకుండా చేశాను. తర్వాత పక్క సరి చేసి, చక్కగా నిద్రపోయినట్లు పడుకోబెట్టి , కింద పడిన గాజుపెంకులు అవి ఏరి , వెళ్ళిపోయాను. నా బెడ్రూమ్లో నా ఫింగర్ ప్రింట్స్, భర్తనే కాబట్టి అనుమానం రాదు, ప్రదీప్ ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి కాబట్టి ఒకవేళ ఎవరైనా అనుమానించినా అటే అనుమానం వెళుతుంది అనుకున్నా. కాని మీరింత తొందరగా ఎలా కనిపెట్టారో నాకింకా అర్థం కావడం లేదు..’ అయోమయంగా అన్నాడు. ‘దోషి ఎదో ఒక చోట ఎప్పుడైనా చట్టానికి దొరికి పోతాడు. ఇంటి వెనక ఉన్న మీ కారు టైర్ గుర్తులు, వీధి మలుపు పై ఉన్న సీసీ కెమెరా ఫుటేజీలో రాత్రి మీ కారు ఈ వీధిలోకి రావడం వెళ్ళడం రికార్డ్ అయ్యింది. చనిపోయిన సమయం దానికి సరిగ్గా సరిపోయింది. ఇలాంటివెన్నో చూసిన అనుభవం... ఎప్పటికీ డబ్బులిచ్చి, ప్రేమ కురిపించే ఆమెను ప్రదీప్ చంపడానికి కారణం కూడా కనిపించలేదు. భర్త కనుక సహజంగానే మరొకరితో ఉన్న బంధం బాధిస్తుంది, ఆ కోణంలో దర్యాప్తు చేశాం..’ అంటూ ముగించాడు సీఐ. - నామని సుజనా దేవి