బెంగళూర్ : సినిమాల్లో క్రేజీ నటిగా వెలుగొందుతున్న సమయంలోనే క్రియాశీల రాజకీయాల్లోకి వెళ్లిన కన్నడ నటి రమ్య తిరిగి మూవీల్లో నటించేందుకు సంసిద్ధమనే సంకేతాలు పంపారు. పునీత్ రాజ్‌కుమార్ సరసన అభి మూవీలో నటించడం ద్వారా తన కెరీర్‌ను ప్రారంభించిన రమ్య తక్కువ సమయంలోనే కన్నడ చిత్రసీమలో టాప్ హీరోయిన్‌గా ఎదిగారు. అయితే ముక్కుసూటిగా మాట్లాడే ధోరణితో ఆమె వివాదాస్పద నటిగా పేరొందారు. 2013లో రాజకీయాల్లో అడుగుపెట్టిన రమ్య 2017లో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా హెడ్‌గా బాధ్యతలు చేపట్టడంతో సినిమాలకు దూరమయ్యారు.
ఇక 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయంతో ఆమె సోషల్ మీడియా బాధ్యతల నుంచి వైదొలిగారు. తనకు ఇప్పటికీ ఆఫర్లు వస్తున్నాయని, వాటిని తాను అంగీకరించలేదని, అయితే సినిమాల్లో తిరిగి పనిచేయడం తనకు ఫన్‌గానే ఉంటుందని, దీనిపై ఇప్పడే ఏమీ చెప్పలేనని ఓ ఆంగ్ల దినపత్రికతో మాట్లాడుతూ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment