Ex MP, Actress Ramya Files Complaint On Netizen Who Comments Abusively - Sakshi
Sakshi News home page

Actress Ramya: హీరోయిన్‌పై అసభ్య కామెంట్స్‌, పోలీసులకు ఫిర్యాదు

Published Fri, Jun 10 2022 12:01 PM | Last Updated on Fri, Jun 10 2022 1:06 PM

Former MP, Actress Ramya Files Complaint On Netizen Who Comments Abusively - Sakshi

మాజీ ఎంపీ, హీరోయిన్‌ రమ్య తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలు. కన్నడ నటి అయిన రమ్య అభిమన్యు మూవీతో టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత పలు డబ్బింగ్‌ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. కన్నడ, తమిళంలో స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన ఆమె సినిమాలకు గుడ్‌బై చెప్పి రాజకీయాల్లోకి అడుగు పెట్టింది. కాంగ్రెస్‌ పార్టీ ఎంపీగా చురుకుగా ఉండే రమ్య.. బీజేపీ అధికారంలోకి రావడంతో రాజీనామ చేసింది.

చదవండి: అల్లు అర్జున్‌పై కేసు, తప్పుదోవ పట్టించారంటూ పోలీసులకు ఫిర్యాదు

ప్రస్తుతం సినిమాలకు, రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆమె సోషల్‌ మీడియా యాక్టివ్‌గా ఉంటోంది. తన వ్యక్తిగత విషయాలతో పాటు ఫొటోలను తరచూ అభిమానులతో పంచుకుంటుంది. ఈ క్రమంలో రమ్యకు సోషల్‌ మీడియాలో చేదు అనుభవం ఎదురైంది. సోషల్‌ మీడియాలో ఓ వ్యక్తి తనని తరచూ ట్రోల్‌ చేస్తున్నాడని, అసభ్యకర కామెంట్స్‌ చేస్తూ ఇబ్బంది పెడుతున్నాడంటూ ఆమె పోలీసులను ఆశ్రయించింది. అతడిని అరెస్టు చేయాలని ఆమె బెంగళూరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

చదవండి: కడపలో ‘జాతిరత్నాలు’ బ్యూటీ ఫరియా సందడి

కాగా కన్నడ హీరో రక్షిత్‌ శెట్టి నటించిన చార్లీ 777 మూవీ నేడు(జూన్‌ 10) విడుదలైంది. నిన్న ప్రివ్యూ చూసిన రమ్య సినిమా బాగుందంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టింది. దీనికి ప్రీతమ్‌ ప్రిన్స్‌ అనే నెటిజన్‌ అశ్లీలమైన కామెంట్‌ చేశాడు. దీంతో రమ్య ప్రీతమ్‌ ప్రీన్స్‌ తరచూ తనని ట్రోల్‌ చేస్తున్నాడని, అతడి అరెస్టు చేయాలని కోరుతూ గురువారం బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ప్రీతమ్‌ ప్రిన్స్‌ వ్యక్తి ఎవరనేది తెలుసుకునే దిశగా విచారిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement