Disha Patani Sparks Her Nose Or Lip Surgery Rumours at Salman Khan Antim Screening - Sakshi
Sakshi News home page

Disha Patani: దిశ పటానీకి సర్జరీ వికటించిందా?

Published Sat, Nov 27 2021 9:35 AM | Last Updated on Sat, Nov 27 2021 12:28 PM

Disha Patani Sparks Her Nose Or Lip Surgery Rumours at Salman Khan Antim Screening - Sakshi

సినిమా తారలు మరింత అందంగా కనిపించేందుకు శరీరంలో మార్పులు చేయించుకుంటారు. ఇందుకోసం చాలా మంది సర్జరీలు చేయించుకుని వారి అందానికి మెరుగులు దిద్దుకుంటారు. అయితే ఇవి అందరికి కలిసిరాకపోవచ్చు. సర్జరీ వికటించి ఉన్న అందాన్ని పాడు చేసుకున్న హీరోయిన్స్‌ చాలా మంది ఉన్నారు. ఆ మధ్య అయేషా టాకీయా పేదవులకు సర్జరీ చేసుకోగా అది వికటించిన సంగతి తెలిసిందే.

చదవండి: ఎట్టకేలకు విడాకులపై స్పందించిన ప్రియాంక-నిక్‌ జోనస్‌

ఇక ఈ మధ్య రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కూడా సర్జరీ చేయించుకుందని, దాంతో ఆమె ముఖం మరింత అసహ్యంగా మారిందంటూ వార్తలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా బాలీవుడ్‌ బ్యూటీ దిశ పటానీ కూడా ఇవే విమర్శలు ఎదుర్కొంటోంది. బాలీవుడ్‌ భాయిజాన్‌ సల్మాన్‌ ఖాన్‌ నటించిన తాజా చిత్రం అంతిమ్‌ స్పెషల్‌ స్క్రీనింగ్‌ నిన్న(శుక్రవారం) జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి హజరైన దిశ ఎల్లో టాప్‌, డెనిమ్‌ జీన్స్‌తో దర్శనమిచ్చింది. అయితే ఇక్కడ దిశ లుక్‌లో ఎదో తేడాను గమనించారు నెటిజన్లు. ఇంకేముందు దిశ వీడియోను షేర్‌ చేస్తూ ఆమెను ట్రోల్‌ చేయడం ప్రారంభించారు.

చదవండి: పార్టీలో డ్యాన్స్‌తో హీరోయిన్‌ అక్క రచ్చ, ఛీఛీ.. కొంచం పద్దతిగా ఉండండి..

ఈ వీడియోలో దిశ లుక్‌ సాధారణంగా లేదని, తేడాగా ఉందంటూ కామెంట్స్‌ చేస్తుండగా.. మరి కొందరూ ఇంకేముందు తన ముక్కు, పెదాలకు సర్జరీ చేసుకుందంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. దీంతో ఓ నెటిజన్‌ ‘సర్జరీతో ముఖాన్ని పాడు  చేసుకున్న మరో హీరోయిన్‌’ అంటూ కామెంట్‌ చేసి  #waxstaue అనే హ్యాష్‌ట్యాగ్‌ను జోడించాడు. అలాగే ‘సర్జరీతో ఏమొచ్చింది.. అందంగా ఉన్న ముఖాన్ని అసహ్యంగా చేసుకున్నావ్‌’ నెటిజన్లు దిశను ఆటాడేసుకుంటున్నారు. ఇది నిజమో కాదో తెలియాలంటే ఈ రూమర్లపై దిశ స్పందించే వరకు వేచి చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement