cosmetic surgery
-
సర్జరీ చేయించుకున్నా!
ప్రముఖ దివంగత నటి శ్రీదేవి చిన్న కుమార్తె, నటి ఖుషీ కపూర్‌ను కొందరు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఈ ప్రశంసలకు కారణం ఉంది. ఇంతకీ విషయం ఏంటంటే... చిన్నతనంలో తన అమ్మతో కలిసి ఖుషీ కపూర్ ఓ సినిమా వేడుకకు హాజరయ్యారు. అలాగే ఇటీవల తాను నటించిన ‘ది ఆర్చీస్’ ఫిల్మ్ ప్రీమియర్ ఈవెంట్‌కు ఖుషీ వెళ్లారు. ఈ రెండు వీడియోలను గమనించిన కొందరు నెటిజన్లు ఖుషీ కపూర్ ముఖంలో ఏదో మార్పు ఉందని సోషల్ మీడియాలో కామెంట్స్ చేయడం ్రపారంభించారు.వీటిని గమనించిన ఖుషీ కపూర్ తాను కాస్మొటిక్ సర్జరీ చేయించుకున్నానని, ముక్కు ఆకారం మారిందనీ సోషల్ మీడియాలో స్పందించారు. దీంతో ఖుషీ కపూర్ నిజాయితీని కొందరు నెటిజన్లు అభినందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ‘‘చాలామంది హీరోయిన్లు ఇలా సర్జరీలు చేయించుకుంటారు. కానీ బయటకు చెప్పరు... ఒప్పుకోరు. అయితే ఖుషీ ధైర్యంగా చెప్పింది. ఆమె నిజాయితీని మెచ్చుకోవాలి’ అని నెటిజన్లు పోస్ట్‌లు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం తమిళ హిట్ ఫిల్మ్ ‘లవ్ టుడే’ హిందీ రీమేక్‌తో ఖుషీ కపూర్ బిజీగా ఉన్నారని, ఈ చిత్రంలో ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా నటిస్తున్నారని బాలీవుడ్ భోగట్టా. -
Alla Dakshayani: దిద్దుబాటు
జీవితంలో దిద్దుబాటు చాలా అవసరం. అక్షరాలను దిద్దుకుంటాం. నడవడిక దిద్దుకుంటాం. మాటను దిద్దుకుంటాం... చేతను దిద్దుకుంటాం. ఇన్నింటిని దిద్దుకోవడం వచ్చిన వాళ్లం... చెదిరిన రూపురేఖల్ని దిద్దుకోలేమా? కాంతి రేఖల కొత్త పొద్దుల్ని చూడలేమా? సూర్యుడు కర్కాటకం నుంచి మకరానికి మారినట్లే... క్లెఫ్ట్ లిప్, క్లెఫ్ట్ పాలేట్తో పుట్టిన పిల్లలు కూడా మామూలు పిల్లల్లా బతికి బట్టకట్టాలి కదా! అగ్నిప్రమాదానికి గురైన వాళ్లు ముడతలు పడిన చర్మంతో బతుకు సాగించాల్సిన దుస్థితి ఎందుకు? ప్రమాదవశాత్తూ ఎముకలు విరిగి ముఖం రూపురేఖలు మారిపోతే... ఇక జీవితమంతా అద్దంలో ముఖం చూసుకోవడానికి భయపడాల్సిందేనా? వీటన్నింటికీ వైద్యరంగం పరిష్కరిస్తుంది. అయితే ఆ వైద్యం సామాన్యుడికి అందనంత ఎత్తులో ఉంటుంది. ఖర్చుపరంగా ఆకాశమంత ఎత్తులో ఉన్న వైద్యప్రక్రియను అవనికి దించాలంటే పెద్ద మనసు ఉండాలి. అలాంటి సమష్టి కృషిని సమన్వయం చేస్తున్నారు ఆళ్ల దాక్షాయణి. బాధితుల జీవితాల్లో కాంతిరేఖలను ప్రసరింపచేయడానికి ఏటా జనవరి నెలలో ఫ్రీ మెగా ప్లాస్టిక్ సర్జరీ క్యాంప్ నిర్వహిన్నారు. ఈ సందర్భంగా ఆమె సాక్షితో పంచుకున్న వివరాలివి. ‘‘ఒకప్పుడు గ్రహణం మొర్రి కేసుల గురించి తరచూ వినేవాళ్లం. కాలక్రమేణా సమాజంలో చైతన్యం పెరిగింది. గర్భస్థ దశలోనే గుర్తించి, పుట్టిన వెంటనే సర్జరీలు చేసి సరి చేసుకునే విధంగా వైద్యరంగం కూడా అభివృద్ధి చెందింది. అయినప్పటికీ మారుమూల గ్రామాల్లో గ్రహణం మొర్రి బాధితులున్నారు. వాళ్లు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకునే స్థోమత లేని తల్లిదండ్రులు పిల్లల వైకల్యాన్ని సరిచేయలేకపోతున్నారు. ఒక బిడ్డ ఆర్థిక కారణాలతో వైకల్యాన్ని భరించాల్సిన దుస్థితి రావడం దారుణమైన విషయం. అలాగే ఇటీవల అగ్ని ప్రమాద బాధితులు, యాసిడ్ దాడి బాధితులు కూడా పెరుగుతున్నారు. వీటికితోడు వాహన ప్రమాదాల కారణంగా వైకల్యాలు కూడా పెరుగుతున్నాయి. ఈ సమస్యల నుంచి ఆర్థిక వెసులుబాటు ఉన్న వాళ్లు బయటపడగలుగుతున్నారు. ఖరీదైన వైద్యం చేయించుకోలేని వాళ్లు బాధితులుగా మిగిలిపోతున్నారు. అలాంటి వాళ్ల కోసం ఫ్రీ మెగా ప్లాస్టిక్ సర్జరీ క్యాంప్ బాధ్యత చేపట్టాం. నిజానికి ఈ సర్వీస్ మొదలై ఇరవై ఏళ్లు దాటింది. ► ఇద్దరు వైద్యుల చొరవ రెండు వేల సంవత్సరంలో మొదలైన ఈ కార్యక్రమం కోవిడ్ రెండేళ్లు మినహా ఏటా జరుగుతోంది. డాక్టర్ భవానీ ప్రసాద్ అనస్థీషియనిస్ట్, డాక్టర్ సుదర్శన్ రెడ్డి ప్లాస్టిక్ సర్జన్. వీళ్ల ఆలోచనతోనే ఈ సర్వీస్ మొదలైంది. మొదటి ఏడాది హైదరాబాద్‌లోని మహావీర్, మెడ్విన్ హాస్పిటళ్లలో సర్జరీలు నిర్వహించారు. ఆ తర్వాత కిమ్స్, కామినేని హాస్పిటళ్లు సపోర్టు చేశాయి. నార్కెట్ పల్లి, నిజామాబాద్, శ్రీకాకుళంలో క్యాంపులు నిర్వహించారు. గత ఏడాది హైదరాబాద్, సీతారామ్‌బాగ్‌లో డాక్టర్ ఈశ్వర్ చందర్ చారిటబుల్ హాస్పిటల్‌ను వేదిక చేసుకున్నాం. ఇందుకోసం హాస్పిటల్ వాళ్లు రెండు ఆపరేషన్ థియేటర్లతో హాస్పిటల్‌ను సిద్ధం చేశారు. యూఎస్‌లో స్థిరపడిన ఈ డాక్టర్లు ఏటా 45 రోజులు ఇండియాలో ఉండేటట్లు ప్లాన్ చేసుకున్నారు. అందులో కొంత సమయం ఈ సర్వీస్‌కి కేటాయిస్తున్నారు. యూఎస్‌లోని మెర్సీ మిషన్ వేదికగా వారందిస్తున్న సర్వీస్‌కి హైదరాబాద్‌లో ‘లయన్స్ క్లబ్ – గ్రీన్‌ల్యాండ్స్’ సహకారం అందిస్తోంది. రెండేళ్లుగా మా రాంకీ ఫౌండేషన్ కూడా బాధ్యతలు తీసుకుంది. ఇందుకోసం ఫౌండేషన్ ట్రస్టీగా నేను బోర్డు మెంబర్స్ నుంచి అనుమతి తీసుకుని ఈ కార్యక్రమాలను చేపట్టాను. ఈ ఏడాది ఇప్పటివరకు నమోదైన వాళ్లలో రాయలసీమ జిల్లాలు, నల్గొండ జిల్లా వాళ్లు ఎక్కువగా ఉన్నారు. మా ఈ సర్వీస్‌కి ప్రాంత, భాష, ఆర్థికపరమైన ఆంక్షలు ఏమీ లేవు. పేరు నమోదు చేసుకుని వచ్చి వైద్యం చేయించుకోవడమే. ► ఇది సమష్టి దిద్దుబాటు ఈ సర్వీస్ కోసం ఇద్దరు డాక్టర్లు అమెరికా నుంచి వస్తారు. మరికొంతమంది డాక్టర్లు, ఇతర వైద్యసిబ్బంది మొత్తం ముప్పైమంది స్థానికులు ఈ సర్వీస్‌లో పాల్గొంటారు. ఈ హెల్త్ సర్వీస్‌ను రెండు దశాబ్దాలుగా విజయవంతంగా నిర్వహించడంలో పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మధుకర్ స్వామి, లయన్స్ క్లబ్ విద్యాభూషణ్ సేవలు విశేషమైనవి. క్లెఫ్ట్ లిప్, క్లెఫ్ట్ పాలెట్, కాలి ముడుచుకుపోయిన చర్మం, జన్యుపరమైన వైకల్యాలను సరిచేయడం, ప్రమాదవశాత్తూ దవడ, ముక్కు, కాళ్లు, చేతులు విరిగిపోవడం వంటి సమస్యల్లో ప్లాస్టిక్ సర్జరీ ద్వారా సరిదిద్దగలిగిన అన్ని సమస్యలకూ వైద్యం అందిస్తున్నాం. కాస్మటిక్ సర్జరీలు ఈ క్యాంప్‌లో చేపట్టడం లేదు. మా సర్వీస్ గురించి వాల్‌పోస్టర్లు, బ్యానర్లతో జిల్లాల్లో ప్రచారం కల్పించాం. వీలైనంత ఎక్కువమంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనేది నా ఆకాంక్ష’’ అన్నారు దాక్షాయణి. ముఖం మీద ఒత్తైన జుత్తు హయతి అనే ఎనిమిదేళ్ల పాపాయి సమస్య మరీ ప్రత్యేకం. హైపర్ ట్రైకోసిస్... అంటే జుత్తు తల వరకే పరిమితం కాకుండా ముఖం మీదకు పాకుతుంది. తలమీద ఉన్నంత దట్టమైన జుత్తు ఒక చెంప మొత్తం ఉంది. ఆ పాపకు నలుగురిలోకి వెళ్లాలంటే బిడియం. స్కూలుకెళ్లాలంటే భయం. ఆమె సమస్య అంటువ్యాధి కాదని టీచర్లకు తెలిసినప్పటికీ క్లాసులో మిగిలిన పిల్లలతో కలిపి కూర్చోబెడితే వాళ్ల పేరెంట్స్ నుంచి కంప్లయింట్స్ వస్తాయి కాబట్టి హయతిని విడిగా కూర్చోబెట్టేవారు. తరగతి గది, ఇంటి నాలుగ్గోడలు తప్ప మరే ప్రపంచమూ తెలియని స్థితిలో రోజులు గడుస్తున్న హయతి ప్లాస్టిక్ సర్జరీ ద్వారా మామూలైంది. ఫ్రీ మెగా ప్లాస్టిక్ సర్జరీ క్యాంప్ మెర్సీ మిషన్స్∙యూఎస్ఏ, సేవా భారతి, లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్– గ్రీన్ ల్యాండ్స్, రాంకీ ఫౌండేషన్లు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఫ్రీ మెగా ప్లాస్టిక్ సర్జరీ క్యాంప్‌లో ఈ నెల 18వ తేదీ నుంచి స్క్రీనింగ్ జరుగుతుంది. సర్జరీలు 22వ తేదీ నుంచి ఫిబ్రవరి 5వ తేదీ వరకు జరుగుతాయి. ఉచితవైద్యంతోపాటు మందులు, ఆహారం, బస సౌకర్యాలను కూడా కల్పిస్తున్నాం. పేషెంట్ పరిస్థితిని బట్టి కొందరికి సర్జరీ తర్వాత ఫాలోఅప్ కోసం మూడు నుంచి నాలుగు రోజులు బస చేయాల్సి రావచ్చు. గడిచిన డిసెంబర్ 20 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైంది. వైద్యసహాయం అవసరమైన వాళ్లు 78160 79234, 98482 41640 నంబర్లకు ఫోన్ చేసి పేరు నమోదు చేసుకోవాలి. హైదరాబాద్, ఓల్డ్ మల్లేపల్లి, సీతారామ్‌బాగ్‌లోని డాక్టర్ ఈశ్వర్ చందర్ చారిటబుల్ హాస్పిటల్లో వైద్యసహాయం అందిస్తున్నాం. – ఆళ్ల దాక్షాయణి, మేనేజింగ్ ట్రస్టీ, రామ్కీ ఫౌండేషన్ – వాకా మంజులారెడ్డి -
అందం కోసం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న కృతిశెట్టి?
ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన మంగళూరు బ్యూటీ కృతిశెట్టి. ఈ సినిమాతో బేబమ్మగా కుర్రాళ్ల మనసు దోచుకున్న కృతిశెట్టి ఓవర్నెట్లో స్టార్డమ్ దక్కించుకుంది. తొలి సినిమానే బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఊహించని విధంగా పాపులారిటీని సొంతం చేసుకుంది. హ్యాట్రిక్ హిట్స్‌తో రాకెట్లా దూసుకుపోయింది. అయితే ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ వరుస ఫ్లాపులు కృతిని వెంటాడుతున్నాయి. చదవండి: శింబుకి షాక్ ఇచ్చిన దీపికా పదుకొణె.. ఆ కండీషన్స్‌కి దిమ్మతిరిగిపోయిందట చివరగా ఆమె నటించిన నాలుగు సినిమాలు డిజాస్టర్ లిస్ట్‌లో చేరిపోవడంతో కృతి కెరీర్ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇదిలా ఉంటే ఓ వైపు సినిమాల ఫ్లాప్స్‌తో సతమతమవుతున్న కృతికి మరోవైపు ట్రోలింగ్ పేరిట విమర్శలు ఎదుర్కొంటుంది. ఈ మధ్య కృతి ఫేస్‌లో కాస్త మార్పులు కనిపిస్తున్నాయని, ఆమె ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందనే ప్రచారం జరుగుతుంది. తాజాగా ఈ రూమర్స్‌పై స్పందిస్తూ.. 'ఇలాంటివి ఎవరు రాస్తారో, ఎందుకు రాస్తారో కూడా అర్థం కావడం లేదు. మాకు కూడా ఫ్యామిలీస్ ఉంటాయి. ఇలాంటి రూమర్స్ విన్నప్పుడు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఉప్పెనలో ఉన్నట్లు ఇప్పుడు లేను అంటున్నారు. అయినా ఎప్పుడూ ఒకేలా ఉండలేము కదా..ఫీచర్స్ మారుతాయి. అందరిలా నేను కూడా. కొన్నిసార్లు మేకప్, హెయిర్ స్టైల్ వల్ల కూడా మార్పులు కనిపిస్తాయి. అంతమాత్రానా ప్లాస్టిక్ సర్జరీ అంటారా''? అంటూ బేబమ్మ ఫైర్ అయ్యింది. చదవండి: ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు అలాంటి కామెంట్స్ చేశారు: కాజల్ -
సమంత లాగే కాజల్ కూడా ఆ పార్టుకి సర్జరీ చేయించుకుందా?
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు తమ అందాన్ని పెంచుకోవడం కోసం రకరకాల వర్కౌట్లు చేస్తుంటారు. వీటితో పాటు సర్జరీలు చేయించుకోవడానికి కూడా ఏమాత్రం ఎనక్కి తగ్గరు. ఇప్పటికే చాలామంది హీరోయిన్లు ముక్కు, పెదాలు, చిన్ సర్జరీ చేయించుకొని ముఖంలో కొత్త మెరుపులు కొనితెచ్చుకున్నారు. ఇక మొన్నటికి మొన్న సమంత కూడా ముఖానికి సర్జరీ చేయించుకుందని వార్తలు వచ్చాయి. రీసెంట్గా విడుదలైన యాడ్‌షూట్‌లో సామ్ లుక్ కాస్త డిఫరెంట్‌గా కనిపించింది. దీంతో అమెరికాకు వెళ్లి సర్జరీ చేయించుకుందంటూ టాక్ వినిపిస్తుంది. తాజాగా ఈ జాబితాలో మరో స్టార్ హీరోయిన్ కూడా చేరింది. చందమామ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన కాజల్ అగర్వాల్ రీసెంట్గా కాస్మొటిక్ సర్జరీ చేయించుకుందని తెలుస్తుంది. ప్రస్తుతం మాతృత్వపు మాధుర్యాన్ని అనుభవిస్తున్న కాజల్ ముఖంలో ఆ తేడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇంతకుముందు కంటే ముఖం కాస్త బొద్దుగా మారడంతో పాటు లిప్స్ కూడా లావుగా కనిపిస్తున్నాయని, సర్జరీ వల్లే ఇలా అయ్యిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉందన్నది తెలియాల్సి ఉంది. -
పూజా ఆ బాడీ పార్ట్‌కి సర్జరీ చేయించుకుందా? ఆమె టీం క్లారిటీ
దక్షిణాదిలో ప్రస్తుతం పూజా హెగ్డేకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సౌత్‌లో దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి అగ్ర హీరోయిన్గా పేరు తెచ్చుకుంది ఆమె. వరుస ఆఫర్లు, పాన్ ఇండియా చిత్రాలతో పూ కెరీర్లో దూసుకుపోతోంది. అయితే ఇటీవల ఆమె నటించిన రాధేశ్యామ్, ఆచార్య, బీస్ట్‌లు నిరాశ పరిచిన పూజ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం తెలుగులో పలు చిత్రాలతో పాటు హిందీలో రెండు సినిమాలు చేస్తోంది. ఇదిలా ఉంటే పూజకు సంబంధించి ఆసక్తికర విషయం నెట్టింట చక్కర్లు కొడుతోంది. చదవండి: మహేశ్-త్రివిక్రమ్ చిత్రంలో మలయాళ స్టార్ హీరో! తన అందాన్ని మరింత మెరుగుపరుచుకునేందుకు ఈ ‘బుట్టబొమ్మ’ ముక్కుకు సర్జరీ చేసుకునేందుకు సిద్ధమైందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం ఆమె ఇటీవలె విదేశాలకు వెళ్లిందని అంటుండగా.. మరోవైపు సర్జరీ కూడా చేయించుకుందనే టాక్ వినిపిస్తోంది. అయితే తాజాగా ఈ వార్తలపై ఆమె టీం స్పందించింది. పూజా సర్జరీ చేసుకుందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని, అవన్ని వట్టి పుకార్లేనని స్పష్టం చేసింది. హాలిడే వెకేషన్లో భాగంగానే ఆమె విదేశాలకు వెళ్లిందని, పూజ ఎలాంటి సర్జరీ చేయించుకోలేదని ఆమె టీం పేర్కొంది. కాగా పూజా ప్రస్తుతం మహేశ్ బాబు-త్రివిక్రమ్ SSMB28 చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. -
అందం కోసం సర్జరీకి సిద్ధమైన ‘బేబమ్మ’.. ఆ బాడీ పార్ట్‌కు మెరుగులు
‘ఉప్పెన’ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన మంగళూరు బ్యూటీ కృతిశెట్టి. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్న ఈ భామ ఆ తర్వాత ‘శ్యామ్ సింగ రాయ్’, ‘బంగార్రాజు’ సినిమాలతో హ్యాట్రిక్ హిట్ కొట్టేసింది. దీంతో కృతీకి సక్సెస్ ఫుల్ హీరోయినే అనే గుర్తింపు ఇచ్చేశారు. అదే క్రేజ్‌తో ఆమెకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ప్రస్తుతం బేబమ్మ చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది. ఇటీవల ‘ది వారియర్’ మూవీతో ప్రేక్షకులను పలకరించిన ఆమె తొలి ఫ్లాప్ చూసింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ ద్విభాష చిత్రం డిజాస్టార్‌గా నిలిచింది. ఉప్పెన హిట్‌తో కృతిని ఓ రేంజ్లో ఎత్తేసిన ప్రేక్షకులు ఆమె అందం, అభియనంకు ఫిదా అవుతూ ప్రశంసలు జల్లు కురిపించారు. చదవండి: సెట్లో దురుసు ప్రవర్తన.. నటుడు చందన్‌పై నిషేధం అయితే ఇప్పుడు ‘ది వారియర్’ ఫ్లాప్‌తో ఆమెను విమర్శిస్తున్నారు. ఇందులో తన లుక్ అంతగా లేదని పలువురు కృతికి సూచించారట. దీంతో తన అందాన్ని మరింత మెరుగు పరుచుకునేందు పెంచుకునేందుకు ‘బేబమ్మ’ సర్జరీకి సిద్దమైందట. తన పెదాల పరిమాణాన్ని తక్కించుకునేందుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు సన్నిహితవర్గాల నుంచి సమాచారం. ఇందుకోసం ఇప్పటికే ఓ ఫేమస్ డాక్టర్‌ను సంప్రదించి సలహా కూడా తీసుకుందని వినికిడి. ఇదే నిజమైతే సర్జరీతో అందానికి మెరుగులు అద్దుకున్న హీరోయిన్ల జాబితాలోకి ఇప్పుడు ఈ యంగ్ బ్యూటీ కూడా చెరినట్టే. చదవండి: ఉమామహేశ్వరి అంత్యక్రియలు.. సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు -
నటి మృతి కేసులో ఆస్పత్రికి నోటీసులు
యశవంతపుర: కన్నడ టీవీ నటి చేతనారాజ్ మృతికి కారణమైన ప్రైవేట్ ఆస్పత్రికి ఆరోగ్యశాఖ అధికారులు నోటీసులిచ్చారు. కొవ్వును కరిగించడానికి జరిగిన సర్జరీ విఫలమై నటి మూడు రోజుల కిందట మరణించడం తెలిసిందే. దీంతో ఆరోగ్యశాఖ అధికారులు ఆస్పత్రి ముఖ్య వైద్యుడు డాక్టర్ గౌడశెట్టికి నోటీసులిచ్చి ఆస్పత్రిని మూసివేశారు. నటి మృతిపై వివరణ ఇవ్వాలని సూచించారు. కూతురి మృతిపై అనేక అనుమానాలున్నయని మృతురాలి తండ్రి వరదరాజ్ సుబ్రమణ్యనగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆస్పత్రి డాక్టర్ గౌడశెట్టితో పాటు నలుగురిపై కేసు నమోదు చేశారు. చదవండి: Actress Chethana Raj Death: కాస్మోటిక్ సర్జరీ వికటించి టీవీ నటి మృతి -
శ్రీదేవి నుంచి సమంత దాకా ఎవరెవరు సర్జరీ చేసుకున్నారంటే?
‘అందం’ అనే భావన గతంలో ఒకలా ఉండేది. ఇప్పుడు మరోలా ఉంది. ఏవో కొన్ని కొలతల్లో ఇమిడితేనే అందం అంటున్నారు. ఆ కొలతల కోసం ప్రాణాలు కోల్పోయే పరిస్థితి తెచ్చుకుంటున్నారు. గతంలో తెలుగు నటి ఆర్తి అగర్వాల్ అమెరికాలో ఈ కారణం చేతనే మరణించింది. ఇప్పుడు మరో కన్నడ నటి. ఈ భావజాలానికి విరుగుడు కనిపెట్టాలి. దక్షిణాదిలో మొదటగా కాస్మెటిక్ సర్జరీని శ్రీదేవి పరిచయం చేసింది. ఆమె తన ముక్కును ‘సరి చేసుకోవడం’ ద్వారా సగటు గృహిణులకు కూడా అటువంటి సర్జరీలు ఉంటాయని తెలియచేసింది. అంతవరకూ దక్షణాదిలో ‘బొద్దు’గా ఉండటం లేదా సహజ రూపంలో సౌందర్యాత్మకంగా ఉండటం సినీ పరిశ్రమలో సమ్మతంగా ఉండేది. ప్రేక్షకులు అటువంటి హీరోయిన్లు ఆదరించారు. అంజలీదేవి, సావిత్రి, కె.ఆర్.విజయ, బి.సరోజా దేవి, రాజశ్రీ, జయలలిత, దేవిక... వీరందరూ పూల తీవల్లాగా సుకుమారంగా తెర మీద కనిపించేవారు కాదు. ఆరోగ్యంగా, నిండుగా ఉండేవారు. దక్షిణాది స్త్రీలు తమను వారిలో పోల్చుకునేవారు. అయితే శ్రీదేవి ఉత్తరాదికి వెళ్లి నటించాలనుకున్నప్పటి నుంచి, ఉత్తరాదిలో కొత్తతరం వచ్చి ‘కాస్ట్యూమ్స్’ అధునాతనంగా మారి, ఫ్యాషన్ డిజైనర్స్ వచ్చి కొలతలను నిర్థారించడం మొదలెట్టినప్పటి నుంచి ఈ కాస్మెటిక్ సర్జరీల ధోరణి పెరిగింది. నేటికి అది శ్రుతి మించి ప్రాణాలకు ప్రమాదం తెచ్చే స్థాయికి చేరింది. లబ్ధి పొందినవారు ఉన్నారు కాస్మెటిక్ సర్జరీల వల్ల లబ్ధి పొందిన వారు ఉన్నారు. తమను తాము కొత్తగా మార్చుకున్నవారు ఉన్నారు. దానివల్ల కెరీర్లో ఎక్కువ రోజులు ఉండగలిగారు. అయితే సైడ్ ఎఫెక్ట్స్ ఉండే ఇలాంటి సర్జరీలను ఎంతవరకు ఉపయోగించాలో తెలుసుకున్నవారు సఫలం అయ్యారు. మీనాక్షి శేషాద్రి ముక్కును సరి చేసుకుని కొత్త రూపు పొందింది. హేమమాలిని ‘బ్లెఫరోప్లాస్టీ’ (కంటి ముడుతలు, సంచులు తొలగించే సర్జరీ), బొటాక్స్ల ద్వారా వృద్ధాప్య ఛాయలు కనపడకుండా చేసుకోగలిగిందనే వార్తలు ఉన్నాయి. ఇక అమితాబ్ తన తల వెంట్రుకలను, దవడలను ‘కరెక్ట్’ చేసుకుని ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’తో కొత్తరూపులో వచ్చాడు. గతంలో రజనీకాంత్‌కు పెదాల మీద మచ్చలు ఉండేవి. ఆయన కాస్మెటిక్ సర్జరీ ద్వారానే వాటిని పోగొట్టుకున్నాడు. ప్రియాంక చోప్రా నుంచి అనుష్కా శర్మ వరకు ఎందరో ఈ సర్జరీల దారిలో నేటికీ ఉన్నారు. తెలుగులో సమంత మునుపటి రూపానికి ఇప్పటి రూపానికి తేడా చూస్తే ఆమెలో కాస్మటిక్ మార్పులను గమనించవచ్చు. షారూక్ ఖాన్ భార్య గౌరి ఖాన్ కూడా తన రూపం కోసం ఈ ట్రీట్మెంట్ తీసుకుంది. వికటించిన వైనాలు కాని ప్రకృతి సిద్ధంగా వచ్చిన రూపాన్ని ఒకసారి కత్తిగాటు కిందకు తీసుకువచ్చాక అద్దంలో చూసుకున్న ప్రతిసారి ఇంకా మారుద్దాం ఇంకా మారుద్దాం అని అనిపించే మానసిక స్థితి వచ్చి శరీరానికి పెనువిపత్తు, రూపానికి విఘాతం కలిగే అవకాశం ఉంది. మైకేల్ జాక్సన్ తన రూపాన్ని మార్చుకుంటూ మార్చుకుంటూ వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు. శ్రీదేవి లెక్కకు మించిన సర్జరీలతో ‘ఇంగ్లిష్ వింగ్లిష్’ సమయానికి ఎంతో బలహీనంగా తెర మీద కనిపించడం అభిమానులు చూశారు. రాఖీ సావంత్ వంటి వారు ఈ సర్జరీలతో గత రూపం ఏమిటో తెలియనంతగా మారిపోయారు. జూహీ చావ్లా చేయించుకున్న ప్లాస్టిక్ సర్జరీ ఆమె సహజ రూపాన్ని పూర్తిగా దెబ్బ తీసింది. కత్రీనా కైఫ్, వాణి కపూర్లకు ఈ సర్జరీలు అంతగా లాభించలేదు. ఆయేషా టకియాకు ఈ సర్జరీలు బాగా నష్టం చేశాయి. ఊహించని మరణాలు తెర మీద సన్నగా కనిపించడానికి లైపోసక్షన్ చేయించుకున్న పంజాబీ నటుడు వివేక్ షౌక్ 2011లో మరణించాడు. ఇండస్ట్రీలో మరోసారి అదృష్టం పరీక్షించుకోవడానికి అమెరికాలో ఇలాంటి సర్జరీలోనే 2015లో ఆర్తి అగర్వాల్ మరణించింది. తాజా 21 ఏళ్ల కన్నడ నటి చేతనా రాజ్ ఫాట్లాస్ సర్జరీతోనే ప్రాణం కోల్పోయింది. అనుభవం ఉన్న డాక్టర్లు చేయకపోవడం వల్ల కొంత, శరీరాలకు తట్టుకునే శక్తి లేకపోవడం వల్ల ఇలాంటి ఘటనలు సంభవిస్తూ ఉన్నాయి. అలాంటి వీటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి ప్రచారం లేదు. నా రూపమే నా సౌందర్యం తెర మీద నటించాలంటే మొదట నటన కావాలి... తర్వాత రూపం అవసరమవుతుంది అనే భావన చాలా ఏళ్లకు గాని రాలేదు. సీమా బిస్వాస్ వంటి నటీమణులు, నవాజుద్దీన్ సిద్ధఖీ వంటి నటులు నటనను ముందుకు తెచ్చి రూపాన్ని వెనక్కు తీసుకెళ్లారు. ముఖాన మొటిమలు ఉన్నా సాయి పల్లవి తన నటనతో కోట్లాది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఒకప్పుడు వాణిశ్రీ– హీరోయిన్లు బంగారు వర్ణంలో ఉండాలన్న రూలును బద్దలు కొట్టింది. సుజాత, జయసుధ లాంటి వాళ్లు మోడ్రన్ దుస్తులు, విగ్గులు లేకపోయినా సుదీర్ఘ కెరీర్ సాధించవచ్చు అని నిరూపించారు. ఒకవైపు ఈ కాలపు అమ్మాయిలు బాడీ షేమింగ్లతో, ఫ్యాషన్ ఇండస్ట్రీ తెచ్చే కొత్త కొత్త కొలతలతో, కాస్మటిక్ ఇండస్ట్రీ విసిరే కొత్త కొత్త వలలతో సతమతమవుతుంటే తెర మీద కనిపించే నటీమణులు తమ రూపాలు మార్చుకుంటూ ‘ఇలా ఉండటమే కరెక్టేమో’ అనే సందేశాలు ఇవ్వడం మెల్లగా తగ్గాలి. సహజ రూపమే సౌందర్యాత్మకమైనది అనే భావనకు ప్రచారం రావాలి. అత్యంత అవసరమైన, సురక్షితమైన చిన్న చిన్న అవసరాలకు తప్ప ఈ కృత్రిమ రూపాలకు దూరంగా ఉండాలనే చైతన్యం కలగాలి. అప్పుడే ప్రతిభ ముందుకు వచ్చి రూపానికి రెండవ స్థానం లభించగలదు. అందుకు అందరూ ప్రయత్నించాలి. సహజమే... సౌందర్యం... నిజానికి బ్యూటీ కాంటెస్ట్‌లలో కూడా ‘ఇలా కనపడాలి... అలా కనపడాలి’ అంటూ ఏమీ నిబంధనలు ఉండవు. అయినా అమ్మాయిలు ఓవర్ కాన్షియస్ అయిపోయి ఏవేవో లోపాలు వెతుక్కుంటున్నారు. మంచి ఆహారపు అలవాట్లు, వర్కవుట్స్ తోనే గ్లో తెచ్చుకుని అందంగా కనిపించవచ్చు. ఏదైనా సరే సహజమైన పద్ధతులే తప్ప లేజర్ సర్జరీలు, ప్లాస్టిక్ సర్జరీలు వంటివి తప్పనిసరి పరిస్థితుల్లో ఆరోగ్యం కోసం అయితే ఓకే కానీ అందం కోసం చేయించుకోవడం సరైంది కాదు. – అభిమానిక తవి, ఫిట్నెస్ ట్రైనర్, బ్యూటీ పేజెంట్ గ్రూమింగ్ పోల్చుకోవడమే పెద్ద సమస్య... అందంగా కనిపించాలని ముందు మేకప్ చేసుకోవడం నుంచి మొదలుపెడతారు. తర్వాత బ్యూటీషియన్స్‌ని సంప్రదిస్తుంటారు. కాస్మెటిక్స్ ను విపరీతంగా వాడతారు. తర్వాత ప్లాస్టిక్ సర్జరీకి వెళతారు. ఇది బాడీ డిస్మార్ఫిక్ డిజార్డర్. వీరిలో సోషల్ యాంగ్జైటీ ఎక్కువ. నలుగురిలో తామే అందంగా కనిపించాలి. లేదంటే కామెంట్ చేస్తారేమో అని భయపడుతుంటారు కూడా. వేరే ఆలోచన ఉండదు. రోజులో ఎక్కువ మొత్తం ‘అందం’పైనే శ్రద్ధ పెడతారు. ఉన్నదున్నట్టుగా అంగీకరించడం వంటివి నేర్చుకునేలా కుటుంబంలోని వారంతా శ్రద్ధ చూపాలి. అందం ఉండటం కంటే ధైర్యంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, ఆహ్లాదంగా ఉండాలి అనే విషయంలో గైడెన్స్ ఇవ్వాలి. లేదంటే అందం కోసం సర్జరీల వరకు వెళ్లడం అనే ఆలోచన ఒక వైరస్‌లా అంటుకుపోతుంది. సూసైడల్ టెండెన్సీ, ఇంటి నుంచి వెళ్లిపోవడం, ఇతరుల మాటలకు ప్రభావితులు అవడం వంటివి జరుగుతాయి. – గీతా చల్ల, సైకాలజిస్ట్ చదవండి: సీరియల్ నటి వివాహం.. నెట్టింట వీడియో వైరల్ -
సీక్రెట్ రివీల్ చేసిన హెబ్బా పటేల్
‘కుమారి 21ఎఫ్’ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచమైంది ముంబై బ్యూటీ హెబ్బా పటేల్. తొలి చిత్రంతోనే మంచి విజయం సాధించిన ఆమెకు ఆ తర్వాత వరస ఆఫర్లు వచ్చినప్పటికీ అవి పెద్దగా గుర్తింపు పొందలేదు. దీంతో ఆమెకు ఆఫర్లు తక్కువగా ఉండటంతో ఆడపదడపా చిత్రాల్లో నటిస్తూ ఫ్యాన్స్‌ను పలకరిస్తోంది. దీనితో పాటు హెబ్బా సోషల్ మీడియాలో సైతం పుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ తన ఫొటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉంటోంది. చదవండి: తల్లి కాబోతోన్న నయనతార?, బయటికొచ్చిన అసలు విషయం! ఇదిలా ఉంటే ఆ మధ్య హెబ్బా బొద్దుగా మారి అందరికి షాకిచ్చింది. ‘అందుకే హెబ్బాకు అవకాశాలు రావడం లేదని, కాస్తా ఫిజిక్‌పై దృష్టి పెట్టు’ అంటూ ఆమె నెటిజన్ల నుంచి ట్రోల్స్ ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో కొంతకాలంగా సినిమాల్లో కనిపించని హెబ్బా.. రీసెంట్గా లైవ్ చిట్‌చాట్‌కు వచ్చింది. ఇందులో ఆమె సన్నగా మారి అందంగా నాజుగ్గా కనిపించింది. దీంతో ఆశ్చర్యపోయిన ఫ్యాన్స్ ఆమె బ్యూటీ సీక్రెట్ గురించి ఆరా తీశారు. దీనికి అదో పెద్ద సీక్రెట్ అంటూ సమాధానం ఇస్తూనే అసలు విషయం చెప్పేసింది ఈ ముంబై భామ. చదవండి: అభిరాం తీరుకు విసిగిపోయిన తేజ?, ఏం చేశాడంటే! ఇప్పటివరకు ఈ రహస్యం ఎవరికి చెప్పలేదన్న హెబ్బా.. తనకు అందం కొంత దేవుడు ఇస్తే.. మరికొంత డాక్టర్ల చలవ వల్ల వచ్చిందని చెప్పింది. ఇలా తను సర్జరీ చేయించుకున్న విషయాన్ని హెబ్బా చెప్పకనే చెబుతూ తన బ్యూటీ సీక్రెట్ బయటపెట్టేసింది. చూస్తుంటే హెబ్బా బాడీట్రాన్స్ఫామింగ్ సర్జరీ చేసుకుని మరింత సెక్సీగా తయారైంది. కాగా చాలా మంది తారలు సర్జీరీ చేసుకున్న విషయాన్ని బయటకు చెప్పేందుకు ఇష్టపడరు. దీంతో హెబ్బా ఇలా తాను సర్జరీ చేసుకున్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పడంతో ఆమె ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా ప్రస్తుతం ఆమె ఓదెల రైల్వే స్టేషన్, తెలిసివాళ్లు అనే చిత్రాల్లో నటిస్తోంది. -
‘సర్జరీతో అసహ్యంగా మారిన మరో హీరోయిన్’
సినిమా తారలు మరింత అందంగా కనిపించేందుకు శరీరంలో మార్పులు చేయించుకుంటారు. ఇందుకోసం చాలా మంది సర్జరీలు చేయించుకుని వారి అందానికి మెరుగులు దిద్దుకుంటారు. అయితే ఇవి అందరికి కలిసిరాకపోవచ్చు. సర్జరీ వికటించి ఉన్న అందాన్ని పాడు చేసుకున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. ఆ మధ్య అయేషా టాకీయా పేదవులకు సర్జరీ చేసుకోగా అది వికటించిన సంగతి తెలిసిందే. చదవండి: ఎట్టకేలకు విడాకులపై స్పందించిన ప్రియాంక-నిక్ జోనస్ ఇక ఈ మధ్య రకుల్ ప్రీత్ సింగ్ కూడా సర్జరీ చేయించుకుందని, దాంతో ఆమె ముఖం మరింత అసహ్యంగా మారిందంటూ వార్తలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా బాలీవుడ్ బ్యూటీ దిశ పటానీ కూడా ఇవే విమర్శలు ఎదుర్కొంటోంది. బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ఖాన్ నటించిన తాజా చిత్రం అంతిమ్ స్పెషల్ స్క్రీనింగ్ నిన్న(శుక్రవారం) జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి హజరైన దిశ ఎల్లో టాప్, డెనిమ్ జీన్స్‌తో దర్శనమిచ్చింది. అయితే ఇక్కడ దిశ లుక్‌లో ఎదో తేడాను గమనించారు నెటిజన్లు. ఇంకేముందు దిశ వీడియోను షేర్ చేస్తూ ఆమెను ట్రోల్ చేయడం ప్రారంభించారు. చదవండి: పార్టీలో డ్యాన్స్‌తో హీరోయిన్ అక్క రచ్చ, ఛీఛీ.. కొంచం పద్దతిగా ఉండండి.. ఈ వీడియోలో దిశ లుక్ సాధారణంగా లేదని, తేడాగా ఉందంటూ కామెంట్స్ చేస్తుండగా.. మరి కొందరూ ఇంకేముందు తన ముక్కు, పెదాలకు సర్జరీ చేసుకుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఓ నెటిజన్ ‘సర్జరీతో ముఖాన్ని పాడు చేసుకున్న మరో హీరోయిన్’ అంటూ కామెంట్ చేసి #waxstaue అనే హ్యాష్‌ట్యాగ్‌ను జోడించాడు. అలాగే ‘సర్జరీతో ఏమొచ్చింది.. అందంగా ఉన్న ముఖాన్ని అసహ్యంగా చేసుకున్నావ్’ నెటిజన్లు దిశను ఆటాడేసుకుంటున్నారు. ఇది నిజమో కాదో తెలియాలంటే ఈ రూమర్లపై దిశ స్పందించే వరకు వేచి చూడాలి. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
షాకింగ్ : రకుల్‌కు సర్జరీ వికటించిందా? అందుకేనా ఇలా!
Rakul Preet Singh Undergo Lip Surgery?: హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆమె షేర్ చేసిన ఓ ఫోటోలో న్యూలుక్లో కనిపించి అందరికి షాక్ ఇచ్చింది. రకుల్ ముఖంలో మార్పులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందాన్ని మరింత మెరుగుపరుచుకోవడం కోసం రకుల్ పెదాలకు సర్జరీ చేయించుకున్నట్లు టాక్ వినిపిస్తుంది.ఈ ఫోటోను చూసిన నెటిజన్లు అసలు ఆమె రకుల్ ఏనా? ఇలా తయారయ్యింది ఏంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.చదవండి : నామినేషన్ దాఖలు చేసిన ప్రకాశ్ రాజ్ ఇప్పటికే వ్యాయామంతో బక్కచిక్కి కళ తగ్గిపోయిన రకుల్ మరోసారి సర్జరీతో మరింత దారుణంగా మారిపోయిందంటూ నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరేమో ఈ సర్జరీ వికటించడం వల్లే రకుల్ పెదాలు ఇలా మారిపోయాయి అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు. చాలామంది హీరోయిన్లు అందాన్ని మెరుగుపరుచుకోవడం కోసం కాస్మోటిక్ సర్జరీలు చేయించుకుంటారన్న విషయం తెలిసిందే. గతంలో రకుల్ ముక్కకి కూడా సర్జరీ చేయించుకుందనే ప్రచారం ఉంది. దీంతో రకుల్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఎలా తయారైపోయింది అంటూ పలువురు ఆమె పాత ఫోటోలను పోల్చి చూస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే రకుల్ ఈ మధ్య ఎక్కువగా బాలీవుడ్ చిత్రాల పైనే ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న ఒకే ఒక్క తెలుగు సినిమా కొండపొలం. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. చదవండి : ఆర్ఆర్ మూవీ మేకర్స్ వెంకట్ కన్నుమూత View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) -
నా లోపం చాలా చిన్నది, అందుకే వద్దనుకున్న: అలయ
తన లోపం చాలా చిన్నదని, దాన్ని ప్రజలు అంగీకరిస్తారో లేదో తను తెలియదు కానీ సర్జరీకి మాత్రం వెళ్లనంటోంది బాలీవుడ్ భామ అలయ. బాలీవుడ్ సీనియర్ నటి పూజ బేడీ గారాల పట్టి అయిన అలయ జవాని జానేమన్తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అయితే సినీ తారలంతా తమ అందాన్ని మరింత పెంచుకునేందుకు ప్రత్యేక సర్జరీలు చేసుకుంటారనే విషయం తెలిసిందే. పాత తరం నుంచి నేటి తరం హీరోయిన్లు సైతం కాస్మోటిక్ సర్జరీలు చేయించుకుని తమ అందానికి మెరుగులందుకుంటున్నారు. అయితే నేటి తరం హీరోయిన్ అలయ మాత్రం తాను సర్జరీలు చేయించుకోనని తెల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన ముక్కకు కాస్మెటిక్ సర్జరీ చేయించుకోవాలనుకున్నట్లు వెల్లడించింది. ‘అవును నేను నా ముక్కుకు కాస్మెటిక్ సర్జరీ చేయించుకోవాలనుకున్నాను. ఎందుకంటే నా ముక్కు ఒకవైపు ఎత్తుగా ఉంటుంది. మరోవైపు బాగుంటుంది. అయితే ఇది చాలా చిన్న విషయమనిపించింది. అందుకే సర్జరీ చేయించుకోవాలన్న ఆలోచన మానుకున్నాను. ప్రజలు ఇలా చూస్తారో లేదో నాకు తెలియదు.కానీ నేను మాత్రం సర్జరీ చేయించుకోను’ అంటూ చెప్పుకొచ్చింది. అయితే ప్రస్తుతం చాలా మంది హీరోయిన్లు కాస్మెటీకి సర్జరీకి వెళ్లి అందాన్ని మరింత పెంచుకుంటున్నప్పటికి తాను మాత్రం చేయనని చెప్పింది. కాగా నటుడు ఫర్హాన్ ఇబ్రహీం ఫర్నిచర్ వాలా, పూజా బేడి కుమార్తె అయిన అలయ 2020 లో జవానీ జనేమాన్ చిత్రం బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. నితిన్ కక్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్, టబు ప్రధాన పాత్రల్లో నటించారు. అలయ తదుపరి ఏక్ జౌర్ గజాబ్ కహానీలో నటిస్తోంది. చదవండి: షాకింగ్: నటికి సర్జరీ మిస్‌ఫైర్ కావడంతో ఫ్యాట్ సర్జరీ.. సగం రక్తం కోల్పోయా: నటి -
అవును.. నేను ఆ సర్జరీ చేయించుకున్నాను: అనుష్క శర్మ
సినిమా తారలు అంటే చాలు అందానికి ప్రతిరూపాలు అన్నట్లు భావిస్తారు జనాలు. వారిని చూసి.. సమాజంలో చాలా మంది ఆడవాళ్లు తాము కూడా హీరోయిన్ల మాదిరి కనిపించడం కోసం తహతహలాడతారు. ఇందుకోసం పడరాని పాట్లు పడతారు. అయితే హీరోయిన్లు అందరూ పుట్టుకతోనే తీర్చిదిద్దిన శరీర సౌష్టవాన్ని కలిగి ఉంటారా అంటే కాదు. చాలా మంది తమను తాము మరింత అందంగా చూపించుకోవడం కోసం ప్రత్యేకంగా సర్జరీలు చేయించుకుంటారు. పాత తరం నుంచి నేటి వరకు ఉన్న హీరోయిన్లలో పలువురు అందాన్ని పెంచుకోవడం కోసం కాస్మోటిక్ సర్జరీలు చేయించుకున్నారు. అయితే చాలా మంది హీరోయిన్లు దీని గురించి బయటకు వెల్లడించారు. కానీ అనుష్క శర్మ, ప్రియాంక చోప్రాలు వంటి హీరోయిన్లు మాత్రం తాము ఇలాంటి సర్జరీలు చేయించుకున్నామని తెలిపారు. 2016 వోగ్ ఇంటర్వ్యూలో అనుష్క ఈ విషయాన్ని వెల్లడించారు. తాజాగా ఈ వీడియో మరోసారి వైరలవుతోంది. పెదాలు పెద్దగా కనిపించడం కోసం అనుష్క సర్జరీ చేయించుకున్నారు. దీని గురించి ఆమె మాట్లాడుతూ.. ‘‘ఇందులో దాచడానికి ఏం లేదు. బాంబే వెల్వేట్ సినిమాలో భాగంగా పెదాలు పెద్దగా కనిపించడం కోసం నేను సర్జరీ చేయించుకున్నాను. అయితే ఇది తాత్కలికమే. దీని గురించి అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు అనిపించింది. అందుకే ఈ విషయాన్ని బహిరంగంగా వెల్లడించాను’’ అన్నారు. కరణ్ జోహర్ కాఫీ విత్ కరణ్ 2014 ఎపిసోడ్లో అనుష్కని చూసిన వారు ఆమె కాస్మోటిక్ సర్జరీ చేయించుకుంది అంటూ విమర్శించారు. మరోనటి ప్రియాంక చోప్రా తాను కూడా సర్జరీ చేయించుకున్నట్లు వెల్లడించారు. తన ఆటోబయోగ్రఫి అన్ఫినిష్డ్లో ప్రియాంక ఈ విషయాన్ని వెల్లడించారు. 20వ ఏట ఉండగా తన నాసికా కుహరంలో 'పాలిప్' ను కనుగొన్నట్లు తెలిపారు. శస్త్రచికిత్స ద్వారా దాన్ని తొలగించాలని నిర్ణయించుకున్నారు. కానీ సర్జరీలో తప్పు జరగడంతో తన ముక్కు స్వరూపమే మారిపోయిందని.. ఇక అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకుని తాను ఎంతో బాధపడినట్లు వెల్లడించారు ప్రియాంక. ఆ తరువాత దాన్ని సెట్ చేసుకోవడానికి మరో సర్జరీ చేయించుకున్నారు. ఇక ప్రియాంక కొత్త అవతారం చూసిన జనాలు ఆమెని ప్లాస్టిక్ ప్రియాంక అంటూ ట్రోల్ చేశారు. ఇక అందాల తార శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే పలు సర్జరీలు చేయించుకున్నారు. సినిమాల్లోకి రాక ముందు జాన్వీ ఫోటోలు చూస్తే ఈ విషయం క్లియర్‌గా అర్థం అవుతుంది. ఇక కత్రినా కైఫ్, అయేషా టకియా, వాణీ కపూర్, శిల్పా శెట్టి, అదితిరావ్ హైదరీ వంటి పలువురు హీరోయిన్లు కూడా అందాన్ని పెంచుకోవడం కోసం సర్జరీలు చేయించుకున్నారనే వార్తలు విపిపిస్తాయి. వీరు మాత్రం వీటిపై ఇంతవరకు స్పందించలేదు. చదవండి: షాకింగ్: నటికి సర్జరీ మిస్‌ఫైర్ కావడంతో -
షాకింగ్: నటికి సర్జరీ మిస్‌ఫైర్ కావడంతో
బీజింగ్: అందాన్ని పెంచుకోవాలని కాస్మొటిక్ సర్జరీలను ఆశ్రయిస్తారు చాలా మంది సెలబ్రిటీలు. ముఖ్యంగా గ్లామర్ ఫీల్డ్‌లో ఉన్న వారు లైమ్‌లైట్‌లో ఉండాలంటే ఎప్పటికప్పుడు సౌందర్యానికి మెరుగులు దిద్దుకుంటూ ఉండక తప్పని పరిస్థితి. అయితే అంతా సవ్యంగా జరిగితే పర్లేదు కానీ, ఏమాత్రం తేడా వచ్చినా భారీ మూల్యం చెల్లించక తప్పదు. చైనా నటి, సింగర్ గావో లియూ కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. ముక్కుకు సర్జరీ చేయించుకున్న ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. లియూ అక్టోబరులో తన ఫ్రెండ్ సలహా మేరకు గువాంగ్జూలో గల ఓ ప్లాస్టిక్ సర్జన్‌ను కలిసింది. ముక్కును ట్రిమ్ చేయించుకోవాలనుకుంటున్నానని చెప్పగా.. అందుకు సర్జన్ అంగీకరించడంతో సదరు ఆస్పత్రిలో చేరింది.(చదవండి: షాకింగ్: పసుపు రంగులోకి మారిన శరీరం!) అయితే, సర్జరీ తర్వాత ఆమె ముక్కు చివర చర్మం పూర్తిగా నల్లగా మారిపోయింది. కణజాలం పూర్తిగా దెబ్బతిన్నది. ఈ క్రమంలో లియూ చేతిలో ఉన్న అవకాశాలు కూడా చేజారిపోయాయి. మరో ఏడాది పాటు ఆమె స్క్నీన్‌పై కనిపించే అవకాశం లేకుండా పోయింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసిన లియూ.. నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే ఇలాంటి ప్రయోగాలు చేయాలని, లేదంటే భారీగా నష్టపోవాల్సి వస్తుందని నెటిజన్లకు సూచించింది. ప్రస్తుతం తాను చికిత్స తీసుకుంటున్నానని, త్వరలోనే కోలుకుంటాననే ఆశాభావం వ్యక్తం చేసింది. -
ఎత్తు పెరగటానికి రూ. 55 లక్షలు ఖర్చు చేశాడు
వాషింగ్టన్ : దాదాపు మూడు అంగుళాల ఎత్తు పెరగటానికి ఓ వ్యక్తి కాస్మటిక్ సర్జరీని ఆశ్రయించాడు. ఏకంగా 55 లక్షల రూపాయలు ఖర్చుపెట్టి తన కలను నెరవేర్చుకున్నాడు. వివరాలు.. అమెరికాలోని డల్లాస్‌కు చెందిన ఆల్ఫోన్సో ఫ్లోరెస్ అనే 28 ఏళ్ల వ్యకి ఎత్తు ఐదు అడుగుల 11 అంగుళాలు. అయితే ఉన్న ఎత్తుతో అతడు సంతృప్తి పడలేదు. మరింత ఎత్తు పెరగాలనుకున్నాడు. ఇందుకోసం లాస్‌వెగాస్‌లోని డాక్టర్ కెవిన్ డెబీపర్షద్‌ను సంప్రదించాడు. ఆయన అతడికి ‘లింబ్ లెంథనింగ్’ కాస్మటిక్ సర్జరీని చేయించుకోవాల్సిందిగా సూచించారు. ( 63 సంవత్సరాల మహిళకు 43 ఏళ్ల జైలు శిక్ష..! ) ఆల్ఫోన్సో ఇందుకు అంగీకరించాడు. ఆపరేషన్ పూర్తయింది. ఏకంగా 55 లక్షల రూపాయలు ఖర్చు అయింది. అంతకు ముందు కంటే మూడు అంగుళాల ఎత్తు పెరిగాడు. ఐదు అడుగుల 11 అంగుళాలు ఉన్న అతడు ఆరు అడుగుల 1 అంగుళానికి చేరుకున్నాడు. గత ఆగస్టులో ఈ సర్జరీ జరిగింది. ప్రస్తుతం అతడు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్‌కు గురికాకుండా ఆరోగ్యంగానే ఉన్నాడు. అయితే ఇలాంటి కాస్మటిక్ సర్జరీలు కొన్ని సందర్భాల్లో తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్‌ను చూపిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2016లో హైదరాబాద్‌కు చెందిన నిఖిల్ రెడ్డి అనే యువకుడు ఎత్తు పెరగటానికి సర్జరీ చేయించుకుని తీవ్ర ఇబ్బందుల పాలైన సంగతి తెలిసిందే. -
ఫ్యాట్ సర్జరీ.. సగం రక్తం కోల్పోయా: నటి
వాషింగ్టన్: సినిమాలు, యాడ్లు అన్ని స్త్రీని ఓ లైంగిక వస్తువుగా చూపిస్తున్నాయి. ఆమె శరీరానికి ఒక ప్రత్యేక కొలతలు.. రంగును సెట్ చేశాయి. ఇక ప్రపంచంలోని మెజారిటీ మహిళలు ఆ కొలతల్లో సెట్ కాకపోతే.. ఆ రంగు లేకపోతే తాము అసలు మనుషులమే కాదనే భావంలోకి దిగజారిపోయాలా వారి ఆలోచనలను ప్రభావితం చేస్తున్నాయి. అసలు స్త్రీ అంటేనే ఇలా ఉండాలి.. లేదంటే వారి జీవితం ఎంత ప్రమాదంలో పడుతుందో అనే భావాన్ని ప్రచారం చేస్తున్నాయి. అయితే ఇప్పుడిప్పుడే ఈ విషయం పట్ల సమాజంలో చైతన్యం కలుగుతుంది. మహిళలు ఈ బంధనాలు తెంచుకోగలుగుతున్నారు. ఈ నేపథ్యంలో టీవీ నటి, అమెరికన్ ప్రసిద్ధ మ్యాగ్జైన్ ప్లేబాయ్ ఫౌండర్ హ్యూ హెఫ్నర్ మూడో భార్య క్రిస్టల్ హెఫ్పర్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చలామణి అవుతున్న అందం ప్రమాణాల గురించి.. వాటి వల్ల మహిళల్లో పాతుకుపోయిన అభద్రతాభావం గురించి తన ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. ‘గతేడాది అక్టోబర్ 16న నాకు ఫ్యాట్ ట్రాన్స్ఫర్ సర్జరీ జరిగింది. కానీ అది సవ్యంగా కొనసాగలేదు. ఈ శస్త్ర చికిత్స వల్ల నేను నా శరీరంలో సగం రక్తాన్ని కోల్పోయాను. చివరకు రక్తం ఎక్కించకునే పరిస్థితులు తలెత్తాయి. కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. ఇప్పుడిప్పుడే ఆహారం తీసుకోగల్గుతున్నాను. ప్రస్తుతం నాకు బాగానే ఉంది. ఒకప్పుడు అందం అని భ్రమించి.. ఈ ఫీల్డ్‌లో పని చేయడం కోసం తప్పని సరి పరిస్థితుల్లో 2016 సంవత్సరంలో నా శరీరంలోకి కొన్ని విషపూరిత పదార్థాలను, ఇంప్లాట్స్ని పంపించాను. వాటి వల్ల నేను తీవ్ర అనారోగ్యానికి గురయ్యాను. సర్జరీతో వీటన్నింటిని తొలగించాను. ఈ సంఘటనలు తొలిసారి నాకు ఒక పాఠాన్ని నేర్పాయి. మరో విషయం ఏంటంటే మనం నేర్చుకునే వరకు విశ్వం ఈ పాఠాలను పంపుతూనే ఉంటుందని నేను గ్రహించాను. ఈ అనుభవం తర్వాతే నేను సహజంగా మనం మనలా ఉండటమే సరైందని మీతో చెప్పగల్గుతున్నాను’ అన్నారు క్రిస్టల్. (చదవండి: అత్యవసర సర్జరీ చేయించుకుంటున్న నటి) View this post on Instagram A post shared by Crystal Hefner (@crystalhefner) ఇక ప్లేబాయ్ మ్యాగ్జైన్, సైట్లో కనిపించిన క్రిస్టల్.. వీటన్నింటిని విషపూరిత సంస్కృతితో పోల్చారు. ఇక సినిమాలు మహిళలను తమను చూసుకుని తామే భయపడే స్థితికి తీసుకెళ్లాయని వాపోయారు. సినిమాలు, ప్రకటనలు, సోషల్ మీడియా తదితర చెత్త, శారీరకంగా నకిలీ వ్యక్తులు మహిళల పరిస్థితులను మరింత దిగజార్చయని.. వాటిలో తాను కూడా ఉన్నానని అంగీకరించారు. ఇవన్ని మహిళల్ని కేవలం లైంగిక వస్తువుగా మాత్రమే చూపిస్తాయని ఆరోపించారు. ఇక గత పదేళ్లుగా తన బాహ్యరూప అందం మీదనే తన విలువ, జీవనాధారం ఆధారపడ్డాయని తెలిపారు క్రిస్టల్. ఇక ఈ రోజు తన బాహ్యరూపంతో సంబంధం లేకుండా తాను ఎంత విలువైనదో అనే విషయం తెలుసుకున్నానని.. బాహ్యసౌందర్యంతో సంబంధం లేకుండా తనను తాను ప్రేమించుకుంటానని.. గౌరవించుకుంటానన్నారు క్రిస్టల్. (చదవండి: యువతి బద్ధకం ఎంత పని చేసింది!) ఇక తర్వాతి తరాలను తలుచుకుంటే తనకు ఎంతో బాధగా ఉందని... వారంతా కేవలం డబ్బు, మేకప్, ఫిల్టర్స్ అనే నకిలీ ముసుగులతో జీవించబోతున్నారని క్రిస్టల్ వాపోయారు. ఇప్పటికైనా మహిళలు ఈ పద్దతికి స్వస్థి పలకాలని.. బాహ్య రూపం గురించి కాకుండా ఆత్మవిశ్వాసం, తన పట్ల తనకు ప్రేమ, నమ్మకం, గౌరవం కలిగి ఉండటం ఎంత ముఖ్యమో చెప్పాలని కోరుతున్నాను అన్నారు. ఇప్పటికైనా తనకు జ్ఞానోదయం అయినందుకు సంతోషంగా ఉందని వెల్లడించారు. ఇక క్రిస్టల్ 2012లో హ్యూ హెఫ్నర్ని వివాహం చేసుకుని మూడో భార్యగా ఆయన జీవితంలోకి ప్రవేశించారు. అయితే పైళ్లెన ఐదేళ్లకే అంటే 2017లో తన 91వ ఏట హ్యూ మరణించారు. ప్రస్తుతం ఆమె ఒంటరిగా ఉంటున్నారు. -
అందంగా లేనా...అసలేంబాలేనా!
హైదరాబాద్ నగరం చారిత్రక కట్టడాలకే కాదు...‘అందమైన’ సర్జరీలకు కేంద్ర బిందువుగా మారుతోంది. ఒకప్పుడు సినీతారలు, ధనవంతుల పిల్లలు మాత్రమే చేయించుకున్న కాస్మొటిక్ సర్జరీలకు ఇటీవల మధ్య తరగతి యువతీ యువకులు ఆసక్తి చూపిస్తుండటమే ఇందుకు కారణం. ‘ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ ఈస్థటిక్ ప్లాస్టిక్ సర్జరీ’ సర్వే ప్రకారం కాస్మొటిక్ సర్జరీల్లో ప్రపంచంలో మన దేశం ఏడో స్థానంలో ఉంది. దేశంలో ముంబై మొదటి స్థానంలో ఉండగా, బెంగళూరు ద్వితీయ, ఢిల్లీ తృతీయ, హైదరాబాద్ నాలుగో స్థానంలో నిలిచింది. ఇతర దేశాలతో పోలిస్తే ఇక్కడ సర్జరీ ఖర్చులు మూడు నుంచి ఐదు శాతం తక్కువగా ఉండటం, అన్నిరంగాల నిపుణులు, వైద్యులు ఎక్కువ మంది ఉండటంతో విదేశీయులు సైతం అందమైన చికిత్సల కోసం భాగ్యనగరానికే వస్తున్నారు. ఇక ముక్కు, నడుము, ఛాతి, సొట్టబుగ్గల సర్జరీలపై అమ్మాయిలు ఆసక్తి చూపుతుండగా..ముక్కు, బట్టతల, పొట్టను సరి చేసుకునేందుకు అబ్బాయిలు కాస్మొటిక్ సర్జరీల బాటపడుతున్నారు. సాక్షి, సిటీబ్యూరో: అందం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మన శరీరంలో కళ్లు, ముక్కు, పెదాలు, సొట్ట బుగ్గలు, ఛాతి, నడుము కీలక పాత్ర పోషిస్తాయి. వీటిలో ఏ ఒక్కటి సరిగా లేకున్నా మనసుకు బాధ..సొసైటీలో సరిగా మసలలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో కాస్మొటిక్ సర్జరీలకు ఆదరణ పెరుగుతోంది. శరీరంలోని లోపాలను సరిదిద్దుకునేందుకు మధ్యతరగతి సైతం ఆసక్తి చూపుతోంది. ఒకప్పుడు సెలబ్రిటీలకు మాత్రమే పరిచయం ఉన్న ఈ కాస్మొటిక్ సర్జరీలు నేడు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ ఈస్థటిక్ ప్లాసిక్ట్ సర్జరీ సర్వే ప్రకారం కాస్మొటిక్ సర్జరీల్లో మన దేశానిది ఏడో స్థానం. అమెరికా, బ్రెజిల్, జపాన్, ఇటలీ, మెక్సికో, రష్యా వరుస స్థానాల్లో ఉన్నాయి. 50 శాతం సర్జరీలు ఈ దేశాల్లోనే జరుగుతున్నాయి. మనదేశంలో 3.7 శాతం సర్జరీలు జరుగుతున్నాయి. కాస్మొటిక్ సర్జరీల విషయంలో ముంబై మొదటి స్థానంలో ఉండగా, బెంగళూరు, ఢిల్లీ, తర్వాత హైదరాబాద్ నాలుగో స్థానంలో నిలిచింది. గైనకోమాస్టియా(మ్యాన్బూబ్స్), రైనో ప్లాస్టీ(కొటేరు ముక్కు), లైపోసక్షన్ (కొవ్వు తొలగింపు), హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ (బట్టతలపై జుట్టు మొలిపించడం) వంటి సర్జరీలను పురుషులు ఎక్కువగా చేయించుకుంటుంటే, బ్రెస్ట్ అగ్మెంటేషన్, లైపోసక్షన్(నడుము, పొట్ట భాగంలో పేరుకు పోయిన కొవ్వు తొలగింపు చికిత్స ), ఐలైడ్ (కనురెప్పలు సరిచేసుకోవడం) రైనోప్లాస్టి(వంకర తిరిగిన, లావుగా ఉన్న ముక్కును కొటేరుగా తయారు చేయడం, సొట్టబుగ్గల సర్జరీలతో పాటు హెయిర్ రిమూవల్ ప్రొసీజర్లు అధికంగా మహిళలు చేయించుకుంటున్నారు. ఐటీ సంస్థల రాకతో పెరిగిన ఆదాయం ఐటీ సంస్థల రాకతో నగరంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి. యువతీ యువకుల ఆదాయం బాగా పెరిగింది. ముఖ్యంగా 35 ఏళ్ల లోపు అమ్మాయిలు, అబ్బాలు వయసు బయటికి కన్పించకుండా ఉండేందుకు శతవిధాలుగా ప్రయతిస్తున్నారు. కాస్మొటిక్ సర్జరీలు, ప్రొసిజర్లు భారీ ఖర్చుతో కూడినప్పటికీ..వారు చికిత్సలకు వెనుకాడటం లేదు. అందానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఏ చికిత్సకు ఎంత ఖర్చు? రైనోప్లాస్టీ సర్జరీకి సగటున రూ.50 వేల నుంచి 80 వేల వరకు ఖర్చు అవుతుండగా, లైపోసక్షన్‌కు రూ.2 లక్షల నుంచి మూడు లక్షల వరకు వసూలు చేస్తున్నారు. డింపుల్స్ క్రియేషన్స్‌కు రూ.20 వేల నుంచి 40 వేల వరకు వసూలు చేస్తున్నారు. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు రూ.50 వేల నుంచి 1.50 లక్షలు వసూలు చేస్తుండగా, చీక్ అగ్మంటేషన్(ఆకట్టుకునే ముఖాకృతి)కి రూ.50 వేల నుంచి లక్ష వరకు, గైనకోమాస్టియాకు రూ.45 వేల నుంచి 60 వేలు ఖర్చు అవుతుంది. చెవి కమ్మల రంద్రాలు పెద్దగా ఉంటే వాటిని సరి చేసే చికిత్సకు రూ.10వేలు ఖర్చు అవుతుండగా, బైఫరోప్లాస్టీ(నాజుకైన కంటిరెప్పలు)కి రూ.15 వేల నుంచి 20 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఎదుటివారి దృష్టిని ఆకర్షించేందుకే... నాజూకైన శరీర ఆకృతి, కొటేరులాంటి ముక్కు, పెదాలు, సొట్టబుగ్గలు, కనుబొమ్మలు, తలపై జుట్టు మనిషి అందాన్ని నిర్ణయిస్తాయి. పెళ్లికి ముందు యువతీ యువకులు ఒకరినొకరు ఆకర్షించుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తుంటారు. ఇందుకోసం కాస్మొటిక్ సర్జరీలు చేయించుకుంటున్నారు. చికిత్సలకు వచ్చేవారిలో 60 శాతం అమ్మాయిలు ఉంటే, 50 శాతం అబ్బాయిలు ఉంటున్నారు. – డాక్టర్ సుధాకర్ ప్రసాద్,ప్లాస్టిక్ అండ్ కాస్మొటిక్ సర్జన్, అపోలో ఆస్పత్రి బరువు తగ్గడం కోసం... శరీరంలో ఉండాల్సిన బరువు కన్నా 20 శాతం ఎక్కువ ఉంటే ‘అధిక బరువుగా’భావిస్తారు. ఇది ఒక జబ్బు కాక పోవచ్చు కానీ, అనేక ఇతర జబ్బులకు కారణం అవుతోంది. మధ్యతరగతి మగవాళ్లలో మూడో వంతు, ఆడవాళ్లలో సగానికిపైగా అధిక బరువుతో బాధ పడుతున్నట్లు ఓ అంచనా. శరీరంలో పేరుక పోయిన కొవ్వును ‘లైపోసక్షన్, బెరియాట్రిక్’ పద్ధతుల్లో తొలగిస్తారు. సినీ తారలు ఎక్కువగా లైపోసక్షన్‌ను ఆశ్రయిస్తుంటే...మధ్య తరగతి వాళ్లు ల్యాప్రోస్కోపిక్ సహాయంతో చేసే బెరియాట్రిక్ సర్జరీలను ఆశ్రయిస్తున్నారు. – డాక్టర్ లక్ష్మీ, బెరియాట్రిక్ సర్జన్, గ్లోబల్ ఆస్పత్రి 35 ఏళ్లలోపు వారే అధికం.. పెరుగుతున్న వాతావరణ కాలుష్యానికి తోడు తలకు రకరకాల షాంపూలు వాడటం వల్ల పాతికేళ్లకే తలపై జుట్టంతా ఊడిపోతోంది. పెళ్లికి ముందే జుట్టంతా ఊడిపోతుండటంతో అమ్మాయిలు వీరిని పెళ్లిచూపుల్లో నిరాకరిస్తున్నారు. దీంతో చాలా మంది అబ్బాయిలు పెళ్లికి ముందే హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీలు చేయించుకుంటున్నారు. సర్జరీలు చేయించుకుంటున్న బాధితుల్లో 90 శాతం మంది 25 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులే ఉంటున్నారు.– డాక్టర్ వెంకటరమణ,హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జన్ 140 కేజీల నుంచి 78 కేజీలకు తగ్గాను ఉన్నట్టుండి శరీరం బరువు భారీగా పెరిగింది. చాలా ఆందోళనకు గురయ్యాను. సొంతపనులు కూడా చేసుకోలేని దుస్థితి. నాలుగేళ్లక్రితం గ్లోబల్ ఆస్పత్రిలో బెరియాట్రిక్ సర్జరీ చేయించుకున్నా. 140 కేజీల నుంచి 78 కేజీలకు తగ్గాను. ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నాను. – పెసల శ్రీకాంత్,వ్యాపారి, నంద్యాల -
కాటేసే ‘కాస్మొటిక్’!
సాక్షి, హైదరాబాద్: అతిలోక సుందరి దివికేగింది.. మరణానికి కారణం గుండెపోటని వార్తలొచ్చినా సమయం గడుస్తున్న కొద్దీ అనేక అనుమానాలు ముసురుకుంటున్నాయి.. కాస్మొటిక్ సర్జరీలు కారణమని కొందరు.. బరువు తగ్గేందుకు వాడిన మందులని ఇంకొందరు అనుమానిస్తున్నారు.. ఆరోపిస్తున్నారు కూడా.. వాస్తవం రహస్యంగానే ఉండిపోవచ్చుగానీ సౌందర్య శస్త్ర చికిత్సలు, బరువు తగ్గించే మాత్రలు ప్రాణాలు తీసేంత హానికరమైనవే! గ్లామర్ ప్రపంచంలో అందంగా కనిపించడం అనివార్యం. కడుపు కట్టుకోవడం, ద్రవ ఆహారమే తీసుకోవడం, గంటల తరబడి వ్యాయామం చేస్తూ అందాన్ని కాపాడుకోవడం ఓ రకమైతే.. పెరుగుతున్న వయసు, ఒళ్లు దాచుకోడానికి శస్త్ర చికిత్సలు, మందులు మింగి ఆకలిని అణచుకొని నాజూకుగా కనిపించే ప్రయత్నం చేయడం ఇంకో రకం. శ్రీదేవి రెండో రకం వ్యక్తి అని కొన్ని వార్తలు చెబుతున్నాయి. చిన్న వయసులోనే ముక్కు ఆకారం సరిచేసుకోడానికి రైనోప్లాస్టీ చేయించుకున్న శ్రీదేవి.. తరువాత అమెరికా కాలిఫోర్నియాలోని ఓ ఆస్పత్రిలో చిన్నాచితకా కలిపి మొత్తం దాదాపు 29 ఆపరేషన్లు చేయించుకున్నారని వార్తలొస్తున్నాయి. శ్రీదేవికి దగ్గరి స్నేహితురాలు ఒకరు ఈ విషయమై ఫేస్బుక్లో ఓ పోస్ట్ కూడా పెట్టారు. అన్ని సర్జరీలూ ప్రమాదకరమే.. కాస్మొటిక్ సర్జరీలతో అందం మాటేమోగానీ.. ఆరోగ్యం నాశనమవడం ఖాయమన్నది నిపుణుల మాట. రైనోప్లాస్టీ మొదలుకొని.. వక్ష సౌందర్యాన్ని పెంచుకోడానికి చేసుకునే శస్త్ర చికిత్స.. శరీరంలోని కొన్ని భాగాల నుంచి కొవ్వులు తొలగించేందుకు చేసే లైపోసక్షన్, తినే ఆహారం మోతాదును కృత్రిమంగా తగ్గించేందుకు బేరియాట్రిక్ సర్జరీ.. ఇలా అన్ని రకాల సర్జరీలతోనూ దుష్ప్రభావాలు బోలెడు. శస్త్ర చికిత్స జరిగిన ప్రాంతాల్లో రక్తం గడ్డకట్టడం మొదలుకుని.. రెండో గుండెగా చెప్పుకునే పిక్కల్లోని నరాల్లో రక్తప్రసరణ ఆగిపోయేంతగా అడ్డంకులు ఏర్పడటం వీటిల్లో కొన్ని మాత్రమే. కొన్నిసార్లు పిక్కల్లో ఏర్పడిన రక్తపు గడ్డలు పైకి ప్రవహించి ఊపిరితిత్తుల్లోకి చేరి ప్రాణాలూ తీయొచ్చు. వక్ష సంపదను పెంచేందుకు సర్జరీ చేయించుకున్న వారిలో కనీసం 15 శాతం మంది నాడులు దెబ్బతిని కొన్ని స్పందనలు కోల్పోతారని గణాంకాలు చెబుతున్నాయి. శస్త్ర చికిత్సల కోసం తరచూ మత్తుమందులు తీసుకోవాల్సి రావడమూ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. కొవ్వులు తొలగించేందుకు వాడే లైపోసక్షన్‌తో శరీరం లోపల ఉండే అవయవాలు దెబ్బతినేందుకు అవకాశాలెక్కువ. కొవ్వు తొలగించేందుకు ఉపయోగించే పరికరాలు అవయవాలను తాకడం వల్ల ఇలా జరుగుతుంటుంది. మాత్రలతోనూ చిక్కులెక్కువే.. బరువు తగ్గేందుకు హైడ్రాక్సిల్ ఆధారిత మందులు శ్రీదేవి వాడారని వార్తలొచ్చాయి. బరువు తగ్గేందుకు లేదా ఆకలి మందగించేలా చేసేందుకు ఈ రకం మందులు వాడుతుంటారు. అనెరొక్సోరెంట్స్ రకం మందులు తీసుకుంటే కడుపు నిండుగా ఉందన్న భావన కలిగించేలా ఇవి మెదడులో కొన్ని మార్పులు చేస్తాయి. ఇలాంటి మందులతో రక్తపోటు, గుండె కొట్టుకునే వేగం పెరగడం. వాంతులు, అతిసారం, నిద్రలేమి, మలబద్దకం, ఛాతి నొప్పి, చూపు మసకబారడం వంటి దుష్ప్రభావాలు ఉంటాయి. సర్జరీలు చేయించుకోలేదన్న శ్రీదేవి పదిహేనేళ్ల విరామం తరువాత ‘ఇంగ్లిష్ వింగ్లిష్’ సినిమాతో శ్రీదేవి మళ్లీ తెరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. చిత్రం విడుదల సమయంలో తన పెదవుల ఆకారాన్ని మార్చుకోడానికి శ్రీదేవి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారని వార్తలు గుప్పుమన్నాయి. ఈ విషయమై అనేక సందర్భాల్లో విలేకరులు శ్రీదేవిని ప్రశ్నించారు కూడా. అయితే ప్లాస్టిక్ సర్జరీల విషయాన్ని శ్రీదేవి పూర్తిగా ఖండించారు. తనకు ఆ అవసరం లేదని.. మంచి ఆహారం, వ్యాయామాలతోనే ముఖం కళకళలాడుతోందిగానీ.. కృత్రిమ సర్జరీలతో కాదని అప్పట్లో ఆమె వ్యాఖ్యానించారు. ఆమె మరణం తరువాత కూడా.. శస్త్ర చికిత్సలు మాత్రమే మరణానికి కారణం కాకపోవచ్చునని ఓ కాస్మొటిక్ సర్జరీ నిపుణుడు అనడం గమనార్హం. రజనీ కోసం శ్రీదేవి వ్రతం తమిళ సినిమా: సినిమా వాళ్లు ఏం చేసినా స్వార్థంతోనే అనే అపవాదు ఉంది. కానీ ఈ పరిశ్రమలోనూ మానవత్వం ఉన్న వాళ్లు, స్నేహానికి గౌరవం ఇచ్చేవారూ ఉన్నారు. అందుకు నిదర్శనం శ్రీదేవియే. 2011లో రజనీకాంత్ అనారోగ్యానికి గురై చికిత్స నిమిత్తం సింగపూర్‌కు వెళ్లారు. రజనీ త్వరగా కోలుకోవాలని అప్పట్లో శ్రీదేవి వారం రోజులు వ్రతం ఆచరించి పూజలు చేశారట. రజనీ కోలుకున్న తరువాత షిర్డీ సాయిబాబా ఆలయానికి వెళ్లి వ్రతాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమెనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘కమల్, రజనీ ఇద్దరు నాకు మంచి మిత్రులు. రజనీకి మా అమ్మంటే చెప్పలేనంత అభిమానం. రజనీ అంటే మా అమ్మకూ అంతే. కమల్లాగే తానూ పెద్ద స్టార్ కావాలని, అందుకు ఏం చేయాలని రజనీ మా అమ్మను అడిగేవారు. నువ్వు కచ్చితంగా పెద్ద స్టార్‌వి అవుతావని ఆమె చెప్పేది’ అని ఇంటర్వ్యూలో శ్రీదేవి చెప్పారు. రూ.30వేలు పారితోషికం తీసుకోవాలనేది తన ఆశ అని అప్పట్లో రజనీ అంటుండేవారనీ, అది తలచుకుంటే ఇప్పుడూ నవ్వొస్తుందన్నారు. శ్రీదేవి స్వగ్రామంలో విషాద ఛాయలు సాక్షి, చెన్నై: శ్రీదేవి మరణ వార్తతో ఆమె స్వగ్రామమైన తమిళనాడులోని విరుదునగర్ జిల్లా శివకాశి సమీపంలోని మీనంపట్టిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బాల్యంలోనే శ్రీదేవి మీనంపట్టి నుంచి చెన్నైకి వెళ్లినప్పటి ఫొటోను, ఆమె తల్లిదండ్రుల చిత్రపటాలను వీధుల్లో ఉంచి కొవ్వొత్తులు వెలిగించి అక్కడి ప్రజలు నివాళులర్పించారు. శ్రీదేవి గొప్ప నటిగా చెన్నైలో స్థిరపడిన తర్వాత కూడా మీనంపట్టి నుంచి తనను చూడడానికి ఎవరైనా వస్తే మంచి మర్యాదలతో స్వాగతం పలికి ఇంట్లో ఏ లోటూ రాకుండా చూసుకునేవారని గ్రామస్తులు గుర్తు చేసుకుంటూ విలపిస్తున్నారు. శ్రీదేవి జీవిత ఇతివృత్తంతో డాక్యుమెంటరీ తీయడానికి ఆమె అభిమాన సంఘాలు ఇటీవలే అనుమతి తీసుకుని ఆ పనులను వేగవంతం చేశాయి. ఇంతలోనే ఆమె కన్నుమూశారు. చెన్నై ఆళ్వార్‌పేట సీఐటీ కాలనీలోని శ్రీదేవి స్వగృహం ఒకప్పుడు అభిమానుల తాకిడితో నిత్యం కళకళలాడేది. ముంబైకి మకాం మార్చాక కూడా ఆమె ఎప్పుడు చెన్నైకి వచ్చినా ఈ ఇంట్లోనే ఉండేవారు. మాజీ సీఎం జయలలిత మరణం తర్వాత గత ఏడాది జనవరిలో ఆమె చివరిసారిగా చెన్నైకి వచ్చి శశికళను పరామర్శించి వెళ్లారు. ఆ ఇంటి ముందు అభిమానులు శ్రీదేవి చిత్రపటాన్ని ఉంచి నివాళులర్పించారు. రంగీలా.. బాజీగర్! బాలీవుడ్లో బ్లాక్బస్టర్లుగా నిలిచిన రంగీలా, బాజీగర్, మొహబ్బతే, బాఘ్బాన్ చిత్రాల్లోని ప్రధాన పాత్ర కోసం శ్రీదేవినే ఆయా చిత్ర నిర్మాతలు సంప్రదించారు. అయితే ఆమె వాటిని తిరస్కరిం చడంతో ఆ పాత్రలు కాజోల్, ఉర్మిలా మతోండ్కర్, ఐశ్వర్యారాయ్ తదితరుల్ని వరించాయి. గతంలో స్టార్‌డస్ట్ మ్యాగజీన్‌కు శ్రీదేవి ఇచ్చిన ఓ ర్యాపిడ్‌ఫైర్ ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు: ► నేను ప్రేమించేది– పచ్చగా ఉన్న ఈ సుందరమైన ప్రపంచాన్ని ► మర్చిపోవాలనుకునే విషయం– ఈ ప్రపం చాన్ని మనం ఎలా నాశనం చేసుకుంటున్నామో అన్న విషయాన్ని ► నేను సినిమాల్లో కోరుకునేది– మంచి స్క్రీన్‌ప్లే ► నాకు ఆసక్తి కలిగించే అంశం– మంచి స్క్రీన్‌ప్లే ► నాకున్న అతిపెద్ద ఆస్తి– నా కుటుంబం ► నా సెక్స్ అప్పీల్‌కు గల కారణం– జన్యువులే ► నాకు ఇష్టమైనవి– పాంపియన్ కుక్కపిల్లలు, పైనాపిల్ ఐస్‌క్రీం, సినిమా ప్యాకప్ సమయం ► తెలుసుకోవాలనుకునేది– చనిపోయిన తర్వాత అక్కడా మేకప్ రూమ్స్ ఉంటాయా అని. ► నా భయం, బాధ – చనిపోయాక మరో జీవితం అంటూ ఉండదేమోనని ► నా అధీనంలో ఉన్నవాటిలో ఇష్టమైనవి– నా భావోద్వేగాలు ► నా జీవితంలో మర్చిపోలేని అనుభవం– ఛాల్‌బాజ్ సినిమాకు ఫిలింఫేర్ అవార్డు అందుకోవడం ► నా బలం– జీవితంలో జరగబోయేవాటిని ముందుగానే పసిగట్టగలగడం ► నేను అలసిపోయేలా చేసేవి– రీటేక్‌లు, రీమేక్‌లు ► ఎక్కువగా ఆనందపడేది– నా రీమేక్ సినిమా సూపర్‌హిట్ అయినప్పుడు ► నా పుట్టినరోజు– మృత్యువుకు మరో రోజు దగ్గరవ్వడం. గురుగ్రామ్‌లో శ్రీదేవికి నివాళులర్పిస్తున్న నాటకరంగ కళాకారులు -
పాపం.. బ్యూటీ క్వీన్ ప్రాణం తీసిన కాస్మోటిక్ సర్జరీ
రియో డి జెనీరో: బ్రెజిల్‌కు చెందిన మాజీ బ్యూటీ క్వీన్ రక్వెల్ శాంటోస్ (28)కు కాస్మోటిక్ సర్జరీ ప్రాణం తీసింది. నవ్వినప్పుడు ముఖంపై పడే ముడతలను తొలగించుకునేందుకు రక్వెల్.. రియో డి జెనీరో సమీపంలోని నిటెరోయ్లో ఓ క్లినిక్‌లో కాస్మోటిక్ సర్జరీ చేయించుకుంది. సర్జరీ చేయించుకున్న కాసేపటికే ఆమెకు గుండెపోటు రావడంతో మరణించింది. రక్వెల్ బాయ్‌ఫ్రెండ్ గిల్బెర్టో అజెవెడో ఈ విషయాన్ని వెల్లడించాడు. బ్రెజిల్ అందాల పోటీల్లో రక్వెల్ రన్నరప్‌గా నిలిచింది. మోడల్‌గా పనిచేస్తోంది. ముఖంపై ముడతల పడటం, గ్లామర్ తగ్గడంతో ఆమె ప్రత్యేక చర్యలు తీసుకునేది. ఆమె తరచూ పొటినే అనే స్టెరాయిడ్‌ను ఇంజెక్షన్ ద్వారా తీసుకునేది. కాగా దీన్ని ఎక్కువగా బాడీబిల్డర్లు వాడతారు. ఈ స్టెరాయిడ్‌ను వాడటం వల్ల బీపీ లెవెల్ ప్రమాదకర స్థాయికి పెరుగుతుంది. రక్వెల్ సిగరెట్లు తాగడంతో పాటు గ్లామర్ కోసం డ్రగ్స్ తీసుకునేదని గిల్బెర్టో చెప్పాడు. దీనికి తోడు రక్వెల్ అందాన్ని మెరుగులు దిద్దుకునేందుకు తరచూ సర్జరీలు చేయించుకునేంది. ఇది ప్రమాదకరమని కుటుంబ సభ్యులు హెచ్చరించినా వినలేదు. గతంలో ముక్కు, చుబుకం, బుగ్గల ఆకృతి మెరుగుపరుచుకునేందుకు సర్జరీ చేయించుకుంది. చివరకు సర్జరీ పిచ్చే ఆమె ప్రాణం తీసింది. -
మేకప్ లేకుండా చూసి విడాకులిచ్చేశాడు!
దుబాయ్: భార్యను మొదటిసారిగా మేకప్ లేకుండా చూసి విడాకులిచ్చాడు ఓ భర్త. యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్‌కు ఈ కొత్త జంట షార్జాలోని అల్ మంజర్ బీచ్‌లో ఈతకెళ్లింది. స్విమ్మింగ్ అనంతరం మేకప్ లేని తన భార్య సహజమైన ముఖాన్ని చూసి ఆశ్చర్యపోయాడు భర్త. ఆమెను చూసి గుర్తించలేకపోయాడు. పెళ్లి సమయంలో నకిలీ కనురెప్పలు, మేకప్‌తో అందంగా కనిపించిందన్నారు. పెళ్లికి ముందు కాస్మోటిక్ సర్జరీలు చేయించుకోవడమే కాకుండా కృత్రిమ కనురెప్పలు వాడేదానినని భార్య తెలిపింది. భర్తకు ఈ సంగతి చెప్పాలనుకున్నానని, అయితే అంతలోపే విడాకులిచ్చేశాడని వెల్లడించింది. -
అదే పిచ్చితో 19వ సర్జరీ
స్వీడన్: ఆమె వయసు 26 ఏళ్లు. ఇప్పటికి పందొమ్మిది కాస్మోటిక్ సర్జరీలు పూర్తి చేసుకుంది. ఇవన్నీ కూడా ఆమె అందాన్ని మరింత అందంగా చూపించడానికే. స్వీడన్‌కు చెందిన ఈ మోడల్ చేసే హంగామా అంతా ఇంత కాదు.. ఆవివరాలేమిటో పరిశీలిస్తే.. పిక్సీ ఫాక్స్ అనే ఉత్తర కరోలినాకు చెందిన 26 ఏళ్ల మహిళ స్వీడన్ మోడల్‌గా పనిచేస్తోంది. ఆమెకు అందంపై ఉన్న శ్రద్ధ ఒక్కసారి గమనిస్తే ఎంతో ఆశ్చర్యపోతారు. నిత్యం తళుక్కున మెరిసేందుకు ఆమె ఎలాంటి సాహసమైనా చేయలేదు. అందుకోసం ఎంతటి ఖర్చయినా భరించగలదు. ఇప్పటికే ప్రపంచంలోనే అత్యంత సన్నటి నడుంగల యువతిగా పేరు సంపాదించుకోవాలని ఉవ్విళూరుతున్న ఆమె ఇప్పుడు మరో కొత్త సాహసం చేసింది. తన కళ్లు గ్రీన్ కార్టూన్ కలర్ లో మెరిసి పోవాలని దాదాపు 80 వేల ఫౌండ్లు ఖర్చు చేసింది. అయితే, ఇలా చేయడం ఆమెకు కొత్తేం కాదంట. ప్రతి ఏడాది తన కళ్ల రంగును నచ్చినట్లు ఇలా లక్షలు పోసి మార్పించుకుంటానని ఆమె స్వయంగా చెప్పింది. మరింత ఆశ్చరకరమైన విషయం ఏమిటంటే.. ఇసుక గడియారం చూసే ఉంటారుగా.. అచ్చం అంత సన్నగా తన నడుము ఉండాలని ఏకంగా ఆమె ఆరు పక్కటెముకలు తీయించుకుంది. ఇప్పుడేమో కళ్లు. మున్ముందు ఇంకెన్ని సర్జరీలు చేయించుకుంటుందో చూడాలి. (చదవండి.. 'సైజ్ జీరో' కోసం పక్కటెముకలు తీయించుకుంది!) -
పోర్న్ స్టార్ అయ్యేందుకు ప్రెగ్నెన్సీకి నో..
లండన్: వివాదాస్పద మోడల్ జోసి కన్నింగమ్ మరో వివాదంలాంటి అంశాన్ని బయటపెట్టింది. తాను ఫోర్న్ స్టార్‌గా మారేందుకు అడ్డుగా ఉందని పన్నెండు వారాల ప్రెగ్నెన్సీని తీయించుకున్నట్లు చెప్పింది. ప్రస్తుతం తాను ముగ్గురు బిడ్డల తల్లిని అని, మరోసారి తల్లి అవడం ఇష్టం లేదని, పైగా పోర్న్ స్టార్‌గా కెరీర్ ప్రారంభించాలనుకుంటున్న క్రమంలో ఓ ప్లాస్టిక్ సర్జరీ అవసరమైందని, తాను గర్భం దాల్చడం ఆ సర్జరీకి అడ్డుగా ఉందని చెప్పింది. అందుకే బాగా ఆలోచించి అబార్షన్ చేయించుకోవాలని నిర్ణయానికి వచ్చి ఆ పని చేసినట్లు జోసి తెలిపింది. 'నేను తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఎవరు విమర్శలు చేసినా పర్వలేదు. అలా నన్ను తిట్టేవారెవరూ కూడా నా పిల్లలను పోషించరు కాబట్టి వారికి విమర్శించే హక్కు లేదు. ఎవరు ఏమనుకున్నా ఏం పర్వాలేదు' అంటూ వ్యాఖ్యానించింది. తొలుత తాను మరోసారి తల్లినవుతున్నానని తెలిసి చాలా సంతోషం వేసింది కానీ, తాను తీసుకునే నిర్ణయాలపై కొత్తగా జన్మించబోయే బిడ్డ ప్రభావం ఉంటుందని ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. -
అందమా...అందుమా!
నగరంలో కాస్మొటిక్ సర్జరీలపై పెరుగుతున్న మోజు సొట్టబుగ్గలు, నడుము, ఛాతి సర్జరీలపై అమ్మాయిల ఆసక్తి ముక్కు, బట్టతల, పొట్టను సరి చేసుకుంటున్న అబ్బాయిలు అందమంటే అమ్మాయిల సొంతం... ఒకప్పుడు ఈ మాట వింటే అబ్బాయిలు ‘నిజమే’నంటూ మెచ్చుకునేవారు. ఇప్పుడు ఈ రేసులో వారూ ముందుకు వస్తున్నారు. అందమా..అందుమా.. అంటూ తమ శరీరాకృతికి మెరుగులు దిద్దుకుంటున్నారు. మేని మెరుపులు పెంచుకునే క్రమంలో స్త్రీలు, పురుషులు పోటీ పడుతున్నారు. ఎవరికి తోచిన మార్గాల్లో వారు వెళుతున్నా... గమ్యం మాత్రం అందమే. వీరి మనసులో మాటను తెలుసుకొని... ‘మిమ్మల్ని మరింత అందంగా తీర్చిదిద్దేందుకు మేమున్నామ’ంటూ అధునాతన చికిత్సలతో ముందుకొస్తున్నారు వైద్య నిపుణులు. వినూత్న పద్ధతుల్లో..విభిన్న రీతుల్లో సొబగులద్దుతున్నారు. సాక్షి, సిటీబ్యూరో: ఎదుటి వారిని ఆకర్షించడంలో కళ్లు, ముక్కు, పెదవులు, సొట్ట బుగ్గలు, ఛాతి, నడుములది కీలక పాత్ర. వీటిలో ఏ ఒక్కటి సరిగా లేకున్నా మనలో ఏదో తెలియని అసంతృప్తి. ఎంత ఐశ్యర్యవంతులైనా కంటికి అందంగా కనిపించకపోతే చెప్పలేని వెలితి. అందానికి ఉన్న స్థానమది. అందంగా లేనివారు... శారీరకంగా లోపాలు ఉన్న వారు ఒకప్పుడైతే ‘దేవుడిచ్చిన శరీర భాగాలను మనమేం చేయగలంలే’ అని సరిపెట్టుకునే వారు. మరి ఇప్పుడో... ఏదో ఒకటి చేసి... అందంగా కనిపించాల్సిందే అనుకుంటున్నారు. అందాలకు మెరుగులు దిద్దే మార్గాలను వెదుక్కుంటూ వెళుతున్నారు. ఇలాంటి వారికి కాస్మొటిక్ సర్జరీలు వరంగా మారుతున్నాయి. ఒకప్పుడు సెలబ్రిటీలకు మాత్రమే పరిమితమైన ఈ తరహా చికిత్సల వైపు ప్రస్తుతం మధ్య తరగతి వారూ చూస్తున్నారు. ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ ఈస్థెటిక్ ప్లాస్టిక్ సర్జరీ సర్వే ప్రకారం కాస్మొటిక్ సర్జరీల్లో మన దేశానిది నాలుగో స్థానం. అందాలకు మెరుగులు దిద్దుకోవాలని గత ఏడాది శస్త్రచికిత్సలకు క్యూ కట్టిన వారి సంఖ్య 8,94,700గా గణాంకాలు చెబుతున్నాయి. వీరిలో 20-25 శాతం మంది గ్రేటర్ వాసులే ఉండటం గమనార్హం. కోటేరు లాంటి ముక్కు కోసం ముఖం అందాన్ని నిర్ణయించేది ముక్కు. అందుకే ఏమాత్రం తేడా ఉన్నా.. చాలా మంది అమ్మాయిలు...అందులోనూ పెళ్లి కావాల్సిన వారు రైనోప్లాస్టీ సర్జరీని ఆశ్రయిస్తున్నారు. ఈ సర్జరీ చేసుకుంటున్న వారిలో 70 శాతం అమ్మాయిలు, 30 శాతం అబ్బాయిలు ఉంటున్నారు. ఇలా సర్జరీ చేయించుకునే వ్యక్తి శరీరంలోని ఏదో ఒక భాగం నుంచి కణజాలాన్ని సేకరిస్తారు. ఒక వేళ ఆ కణజాలం అతనికి సరిపోకపోతే రక్త సంబంధీకుల నుంచి సేకరించి, అమర్చుతున్నట్లు కేర్ ఆస్పత్రిలోని ఈఎన్టీ, కాస్మొటిక్ సర్జన్ డాక్టర్ విష్ణుస్వరూప్‌రెడ్డి చెప్పారు. నాజుకైన నడుముకు... శరీరంలో ఉండాల్సిన బరువు కన్నా 20 శాతం ఎక్కువ ఉంటే ‘అధిక బరువుగా’ భావిస్తారు. మధ్య తరగతి మగవాళ్లలో మూడో వంతు, ఆడవాళ్లలో సగానికిపైగా అధిక బరువుతో బాధ పడుతున్నట్లు అంచనా. ఓ సర్వే ప్రకారం 2005లో నగరంలో ఈ సంఖ్య ఐదు శాతం ఉంటే.. ప్రస్తుతం 10 శాతానికి చేరుకుంది. శరీరంలోనికొవ్వును‘లైపోసక్షన్, బెరియాట్రిక్’ పద్ధతుల్లో తొ ల గిస్తారు. సినీ తారలు ఎక్కువగా లైపోసక్షన్‌ను ఆశ్రయిస్తుంటే... మధ్య తరగతి వారు ల్యాప్రోస్కోపిక్ విధానం లో చేసే బెరియాట్రిక్ సర్జరీలను ఎంచుకుంటున్నట్లు లివ్లైఫ్ ఆస్పత్రి బె రియాట్రిక్ సర్జన్ డాక్టర్ నందకిషోర్ చెప్పారు. బట్టతలను వదిలించుకోవడానికి... వివిధ కారణాలతో కుర్రాళ్లకు పాతికేళ్లకే తలపై జుట్టంతా ఊడిపోతోంది. పెళ్లికి ముందే ఈ పరిస్థితి ఎదురు కావడంతో అమ్మాయిలు ఇలాంటి వారిని నిరాకరిస్తున్నారు. దీంతో చాలా మంది అబ్బాయిలు హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీలు చేయించుకుంటున్నారు. ఇందు కోసం రూ.లక్ష ఖర్చు చేయడానికి కూడా వెనుకాడటం లేదని కాస్మొటిక్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జన్ డాక్టర్ వెంకటరమణ చెప్పారు. విదేశాలకు పరుగెత్తాల్సిన అవసరం లేదు: డాక్టర్ విష్ణుస్వరూప్‌రెడ్డి, ప్లాస్టిక్ సర్జన్ కాస్మొటిక్ సర్జరీ అనగానే ఖరీదైన వ్యవహారం అనుకుంటారు. తక్కువ ఖర్చుతో లోపాలను సరిచేసుకునే అవకాశం ఉంది. విదేశాలకు పరుగులు తీయాల్సిన అవసరం లేదు. అభివృద్ధి చెందిన దేశాల్లోని యువత సైతం ఇటీవల ఇక్కడికే వస్తున్నారు. నిపుణులు అందుబాటు లో ఉండటం, ఖర్చు తక్కువ ఉండటమే కారణం. అందం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది: డాక్టర్ మురళీ మోహన్‌రెడ్డి, కాస్మొటిక్ సర్జన్, యశోద ఆస్పత్రి అందం మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ప్రస్తుత తరంఈ విషయాన్ని తొందరగా గ్రహించారు. నగరాలు, పట్టణాలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అం దాలకు మెరుగుదిద్దుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. మచ్చుకు కొన్ని ప్లాస్టిక్ సర్జరీలు.. రైనోప్లాస్టీ: అందమైన నాసిక కావాలనుకునే వారి చాయిస్. చప్పిడి ముక్కు, వంకరలు తిరిగిన ముక్కును సరి చేయవచ్చు. బొటాక్స్: ముఖంపై ముడుతలు పోవడానికి చక్కని పరిష్కారం. 30 దాటిన వారు బొటాక్స్ కోసం పరుగులు తీస్తున్నారు. లైపొసక్షన్: పొట్ట, నడుము భాగాల్లోని కొవ్వును కరిగించే శస్త్రచికిత్స. డింపుల్స్ క్రియేషన్స్ సర్జరీ: నవ్వినప్పుడు బుగ్గలపై సొట్టపడేలా చేస్తారు. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్: బట్టతలపై జుట్టు మొలిపిస్తారు. చీక్ అగ్మంటేషన్: ఆకట్టుకునే ముఖాకృతి కోసం చేసే సర్జరీ. గైనకో మాస్టియా: అమ్మాయిల్లా పెరిగిపోయిన మ్యాన్బూబ్స్ తొలగించే శస్త్రచికిత్స. టమ్మీటక్: పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. సిక్స్‌ప్యాక్‌లకు దారి చూపుతుంది. బ్లైఫరోప్లాస్టీ: నాజుకైన కంటిరెప్పల కేరాఫ్ అడ్రస్ ఇది. కాస్మొటిక్ సర్జరీలుచేయించుకుంటున్న వారు... యువతులు- 70 శాతం యువకులు- 30 శాతం 25 ఏళ్ల లోపు వారు- 50 శాతం 35 ఏళ్లలోపు వారు- 30 శాతం ఆపై వయసు వారు- 20 శాతం గ్రేటర్లో ప్రతి నెలా జరుగుతున్న కాస్మొటిక్ సర్జరీలు కాస్మొటిక్ సర్జరీలు- 100 రైనో ప్లాస్టీ- 40-50 మేల్బ్రెస్ట్ సర్జరీస్- 60 లైపొసక్షన్- 150 హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్స్-100