పోర్న్ స్టార్ అయ్యేందుకు ప్రెగ్నెన్సీకి నో..
లండన్: వివాదాస్పద మోడల్ జోసి కన్నింగమ్ మరో వివాదంలాంటి అంశాన్ని బయటపెట్టింది. తాను ఫోర్న్ స్టార్గా మారేందుకు అడ్డుగా ఉందని పన్నెండు వారాల ప్రెగ్నెన్సీని తీయించుకున్నట్లు చెప్పింది. ప్రస్తుతం తాను ముగ్గురు బిడ్డల తల్లిని అని, మరోసారి తల్లి అవడం ఇష్టం లేదని, పైగా పోర్న్ స్టార్గా కెరీర్ ప్రారంభించాలనుకుంటున్న క్రమంలో ఓ ప్లాస్టిక్ సర్జరీ అవసరమైందని, తాను గర్భం దాల్చడం ఆ సర్జరీకి అడ్డుగా ఉందని చెప్పింది. అందుకే బాగా ఆలోచించి అబార్షన్ చేయించుకోవాలని నిర్ణయానికి వచ్చి ఆ పని చేసినట్లు జోసి తెలిపింది.
'నేను తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఎవరు విమర్శలు చేసినా పర్వలేదు. అలా నన్ను తిట్టేవారెవరూ కూడా నా పిల్లలను పోషించరు కాబట్టి వారికి విమర్శించే హక్కు లేదు. ఎవరు ఏమనుకున్నా ఏం పర్వాలేదు' అంటూ వ్యాఖ్యానించింది. తొలుత తాను మరోసారి తల్లినవుతున్నానని తెలిసి చాలా సంతోషం వేసింది కానీ, తాను తీసుకునే నిర్ణయాలపై కొత్తగా జన్మించబోయే బిడ్డ ప్రభావం ఉంటుందని ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది.