
ప్రముఖ దివంగత నటి శ్రీదేవి చిన్న కుమార్తె, నటి ఖుషీ కపూర్‌ను కొందరు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఈ ప్రశంసలకు కారణం ఉంది. ఇంతకీ విషయం ఏంటంటే... చిన్నతనంలో తన అమ్మతో కలిసి ఖుషీ కపూర్ ఓ సినిమా వేడుకకు హాజరయ్యారు. అలాగే ఇటీవల తాను నటించిన ‘ది ఆర్చీస్’ ఫిల్మ్ ప్రీమియర్ ఈవెంట్‌కు ఖుషీ వెళ్లారు. ఈ రెండు వీడియోలను గమనించిన కొందరు నెటిజన్లు ఖుషీ కపూర్ ముఖంలో ఏదో మార్పు ఉందని సోషల్ మీడియాలో కామెంట్స్ చేయడం ్రపారంభించారు.
వీటిని గమనించిన ఖుషీ కపూర్ తాను కాస్మొటిక్ సర్జరీ చేయించుకున్నానని, ముక్కు ఆకారం మారిందనీ సోషల్ మీడియాలో స్పందించారు. దీంతో ఖుషీ కపూర్ నిజాయితీని కొందరు నెటిజన్లు అభినందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ‘‘చాలామంది హీరోయిన్లు ఇలా సర్జరీలు చేయించుకుంటారు. కానీ బయటకు చెప్పరు... ఒప్పుకోరు. అయితే ఖుషీ ధైర్యంగా చెప్పింది. ఆమె నిజాయితీని మెచ్చుకోవాలి’ అని నెటిజన్లు పోస్ట్‌లు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం తమిళ హిట్ ఫిల్మ్ ‘లవ్ టుడే’ హిందీ రీమేక్‌తో ఖుషీ కపూర్ బిజీగా ఉన్నారని, ఈ చిత్రంలో ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా నటిస్తున్నారని బాలీవుడ్ భోగట్టా.
Comments
Please login to add a commentAdd a comment