ఆపరేషన్‌కు ముందు, ఆ తర్వాత
వాషింగ్టన్ : దాదాపు మూడు అంగుళాల ఎత్తు పెరగటానికి ఓ వ్యక్తి కాస్మటిక్ సర్జరీని ఆశ్రయించాడు. ఏకంగా 55 లక్షల రూపాయలు ఖర్చుపెట్టి తన కలను నెరవేర్చుకున్నాడు. వివరాలు.. అమెరికాలోని డల్లాస్‌కు చెందిన ఆల్ఫోన్సో ఫ్లోరెస్ అనే 28 ఏళ్ల వ్యకి ఎత్తు ఐదు అడుగుల 11 అంగుళాలు. అయితే ఉన్న ఎత్తుతో అతడు సంతృప్తి పడలేదు. మరింత ఎత్తు పెరగాలనుకున్నాడు. ఇందుకోసం లాస్‌వెగాస్‌లోని డాక్టర్ కెవిన్ డెబీపర్షద్‌ను సంప్రదించాడు. ఆయన అతడికి ‘లింబ్ లెంథనింగ్’ కాస్మటిక్ సర్జరీని చేయించుకోవాల్సిందిగా సూచించారు. ( 63 సంవత్సరాల మహిళకు 43 ఏళ్ల జైలు శిక్ష..! )
ఆల్ఫోన్సో ఇందుకు అంగీకరించాడు. ఆపరేషన్ పూర్తయింది. ఏకంగా 55 లక్షల రూపాయలు ఖర్చు అయింది. అంతకు ముందు కంటే మూడు అంగుళాల ఎత్తు పెరిగాడు. ఐదు అడుగుల 11 అంగుళాలు ఉన్న అతడు ఆరు అడుగుల 1 అంగుళానికి చేరుకున్నాడు. గత ఆగస్టులో ఈ సర్జరీ జరిగింది. ప్రస్తుతం అతడు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్‌కు గురికాకుండా ఆరోగ్యంగానే ఉన్నాడు. అయితే ఇలాంటి కాస్మటిక్ సర్జరీలు కొన్ని సందర్భాల్లో తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్‌ను చూపిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2016లో హైదరాబాద్‌కు చెందిన నిఖిల్ రెడ్డి అనే యువకుడు ఎత్తు పెరగటానికి సర్జరీ చేయించుకుని తీవ్ర ఇబ్బందుల పాలైన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment