Hight
-
పోలవరం ఎత్తు తగ్గింపుతో రాష్ట్రానికి విఘాతం
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు నిర్ణీత ఎత్తును తగ్గించాలన్న నిర్ణయం రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర విఘాతమని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. సోమవారం ఆయన రాజ్యసభలో ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘పోలవరం ప్రాజెక్టు ఏపీకి జీవనాడి వంటిది. దాని నిల్వ సామర్థ్యాన్ని ఏమాత్రం తగ్గించినా అది రాష్ట్ర దీర్ఘకాల ప్రయోజనాలకు విఘాతమే. పోలవరం ప్రాజెక్టు ఎత్తును 45.72 మీటర్ల ఎత్తు నుంచి 41.15 మీటర్లకు తగ్గిస్తే దాని నిల్వ ఏకంగా 194 టీఎంసీల నుంచి 115 టీఎంసీలకు పడిపోతుంది.ఈ ప్రాజెక్టు కింద మొత్తంగా 7.5 లక్షల ఎకరాలకు నీరివ్వాలి. తాగునీటి అవసరాలు తీర్చాల్సి ఉంది. ఈ ఏడాది బడ్జెట్లో కేవలం రూ.5,936 కోట్లు మాత్రమే కేటాయించారు. ప్రాజెక్టును 2026లోగా పూర్తి చేయాలన్న లక్ష్యాన్ని ఇది దెబ్బతీస్తుంది. ముందస్తు వరదలు, కోవిడ్ వల్ల వచ్చిన అవాంతరాలతో కొంత ప్రతికూలత ఉన్నా.. సీఎం జగన్ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టు పనుల్లో గణనీయ పురోగతి జరిగింది. స్పిల్‌వే, స్పిల్ చానల్, కాఫర్ డ్యామ్ నిర్మాణాలు ఎలాంటి అవాంతరాలు లేకుండా పూర్తయ్యాయి. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టును ప్రాధాన్యతాంశంగా తీసుకుని పూర్తిచేసేందుకు కృషిచేయాలి’ అని కోరారు. రాష్ట్రంలో 21,054 ఎంఎస్ఎంఈలురాష్ట్రంలో 21,054 సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు(ఎంఎస్ఎంఈ) రిజిస్టర్ అయినట్లు ఆ శాఖ సహాయ మంత్రి శోభ కరంద్లాజే తెలిపారు. ఈ మేరకు రాజ్యసభ ప్రశ్నోత్తరాల్లో వైఎస్సార్సీపీ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. ⇒ రాష్ట్రంలో లక్షా 90 వేల 777 జల వనరులున్నట్లు కేంద్ర జలశక్తి సహాయ మంత్రి రాజ్‌భూషణ్ చౌదరి.. వైవీ సుబ్బారెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. మొదటి గణన నివేదిక ప్రకారం 3,920 జల వనరులు ఆక్రమణకు గురైనట్టు తెలిపారు. ⇒ విమాన ప్రయాణికులకు సరసమైన ధరలో భోజనాన్ని అందించేందుకు కలకత్తా విమానాశ్రయంలో ‘ఉడాన్ యాత్రి కేఫ్’ను ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) ఏర్పాటు చేసినట్టు కేంద్ర పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్మోహల్ తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీ నిరంజన్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.⇒ రాష్ట్రంలో 99.72శాతం మంది తమ తమ ఇళ్లలో మరుగుదొడ్లను ఏర్పాటు చేసుకున్నట్టు కేంద్ర జల్‌శక్తి సహాయ మంత్రి వి.సోమన్న తెలిపారు. వైఎస్సార్సీపీ సభ్యుడు గొల్ల బాబురావు అడిగిన ప్రశ్నకు ఆయన రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. -
ప్రపంచంలో అత్యంత ఎత్తయిన వృక్షాలివే!
చెట్లు మానవాళికి ఎంతో మేలు చేస్తున్నాయి. పర్యావరణాన్ని పరిరక్షించడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. అయితే ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన వృక్షం ఏదో తెలుసా? అది ఎక్కడ ఉంది? ఈ జాబితాలో ఇంకేమి వృక్షాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. హైపెరియన్, కోస్ట్ రెడ్‌వుడ్ కాలిఫోర్నియాలోని రెడ్‌వుడ్ నేషనల్ పార్క్‌లో ఉన్న హైపెరియన్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చెట్టు. దీని సగటు ఎత్తు 360 అడుగులు. ఈ చెట్టు 16 అడుగులు (4.94 మీటర్లు) కంటే అధిక వ్యాసాన్ని కలిగి ఉంటుంది. హైపెరియన్ రెడ్వుడ్కు 600 నుంచి 800 ఏళ్ల మధ్య వయస్సు ఉంటుందని అంచనా. హైపెరియన్ కోస్ట్ రెడ్వుడ్లు 2,000 సంవత్సరాలకు పైగా భూమిపై ఉన్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. 2006లో క్రిస్ అట్కిన్స్ , మైఖేల్ టేలర్ అనే ప్రకృతి శాస్త్రవేత్తలు హైపెరియన్ను కనుగొన్నారు. మేనరా, ఎల్లో మెరంటీ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఉష్ణమండల వృక్షం మేనరా. ఇది మలేషియా బోర్నియోలోని సబాలోని డానుమ్ వ్యాలీ పరిరక్షణ ప్రాంతంలో ఉంది. దాని ఖచ్చితమైన ఎత్తుపై భిన్నాభిప్రాయాలున్నాయి. అయితే ఈ వృక్షం ఎత్తును 331 అడుగులు (100.8 మీటర్లు)అని గుర్తించారు. మేనరా ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన యాంజియోస్పెర్మ్ లేదా పుష్పించే మొక్కగా ప్రసిద్ధి చెందింది. సెంచూరియన్, మౌంటైన్ యాష్ సెంచూరియన్ అనేది 330 అడుగుల (100.5 మీటర్లు) ఎత్తులో 13 అడుగుల (4.05 మీటర్లు) ట్రంక్ వ్యాసంతో కూడి ఉంటుంది. ఆస్ట్రేలియాలోని టాస్మానియాలోని ఆర్వ్ లోయలో ఈ వృక్షాల కారణంగా చెలరేగిన టాస్మానియన్ బుష్ఫైర్ల వల్ల ఈ ద్వీప భూభాగంలో దాదాపు మూడు శాతం అంటే 494,210 ఎకరాలు (200,000 హెక్టార్లు) కాలిపోయింది. డోర్నర్ ఫిర్, కోస్ట్ డగ్లస్ ఫిర్ డోర్నర్ ఫిర్ను ఒరెగాన్ కోస్ట్ రేంజ్‌లోని బ్యూరో ఆఫ్ ల్యాండ్ మేనేజ్మెంట్ సంరక్షిస్తోంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన డగ్లస్ ఫిర్. భూమిపై ఉన్న అత్యంత ఎత్తయిన నాన్ రెడ్‌వుడ్ వృక్షం. 327 అడుగుల (99.7 మీటర్లు) ఎత్తుతో, 11.5 అడుగుల (3.5 మీటర్లు) వ్యాసంతో ఇది చూపరులను ఆకట్టుకుంటుంది. 1989లో ఈ భారీ వృక్షాన్ని కనుగొన్నారు. రావెన్స్ టవర్, సిట్కా స్ప్రూస్ రావెన్స్ టవర్ అనేది 317 అడుగుల (96.7 మీటర్లు)ఎత్తు కలిగివుంటుంది. సిట్కా స్ప్రూస్ 2001లో దీనిని కనుగొన్నారు. అతను హైపెరియన్, హీలియోస్, ఐకారస్ లాంటి ఇతర పొడవైన చెట్లను కూడా కనుగొన్నాడు. రావెన్స్ టవర్ ఉత్తర కాలిఫోర్నియాలోని ప్రైరీ క్రీక్ రెడ్‌వుడ్స్ స్టేట్ పార్క్‌లో ఉంది. జెయింట్ సీక్వోయా కాలిఫోర్నియాలోని జెయింట్ సీక్వోయాస్ పొడవైన వృక్షాలుగా పేరొందాయి. సీక్వోయా నేషనల్ ఫారెస్ట్‌లో 314-అడుగుల (95.7 మీటర్లు) ఎత్తుతో ఈ వృక్షం ఉంది. జెయింట్ సీక్వోయాస్ 25 అడుగుల (7.7 మీటర్లు) వ్యాసంతో దృఢమైన ట్రంక్‌ను కలిగి ఉంటుంది. వైట్ నైట్, మన్నా గమ్ టాస్మానియాలోని ఎవర్క్రీచ్ ఫారెస్ట్ రిజర్వ్‌లోని మన్నా గమ్ (యూకలిప్టస్ విమినాలిస్) వృక్షం కనిపిస్తుంది. దీని ఎత్తు 299 అడుగులు (91 మీటర్లు). ఈ చెట్లు కలిగిన ప్రాంతం ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారింది. కాగా ఆఫ్రికాలో పొడవైన చెట్ల జాతులు లేవు అయితే మౌంట్ కిలిమంజారో నేషనల్ పార్క్‌లో 267 అడుగుల (81.5 మీటర్లు) ఎత్తు కలిగిన ఎంటాండ్రోఫ్రాగ్మా ఎక్సెల్సమ్ వృక్షం పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటుంది. -
భారతీయులకు కొత్త సమస్య.. కారణాలేంటి?
ప్రపంచ వ్యాప్తంగా ప్రజల సరాసరి ఎత్తు పెరుగుతున్న తరుణంలో.. భారతీయుల ఎత్తు మాత్రం తగ్గుముఖం పట్టడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా వెల్లడైన నివేదికలోని అంశాలపై పరిశోధకుల సమీక్షలు, కారణాల అన్వేషణ మొదలైంది. భారతీయుల సరాసరి ఎత్తు తగ్గుతోందని తెలిపింది. JNU’s Centre of Social Medicine and Community Health నిర్వహించిన సర్వేలో.. 1998 నుంచి 2015 వరకు భారతీయ వయోజనుల ఎత్తుపై కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 1998-99లో భారతీయుల ఎత్తు కొంచెం పెరిగిందని, అయితే 2005-06 నుంచి 2015-16 మధ్య కాలంలో గణనీయమైన స్థాయిలో ఎత్తు తగ్గిందని వెల్లడించింది. కారణాలపై.. ఇది చాలా ఆందోళన కలిగించే అంశమని, దీనిపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని సూచించింది. భారతీయ జనాభాలో వివిధ సమూహాల మధ్య ఎత్తు అంతరాయంపై కూడా అధ్యయనం జరగాలని చెప్పింది. జన్యుపరమైన అంశాలే కాకుండా, వాటికి సంబంధం లేని కారకాలు కూడా ఎత్తుపై ప్రభావం చూపుతున్నాయని, ఇది చాలా ఆందోళన కలిగించే విషయమని తెలిపింది. జీవన విధానం, పౌష్టికాహారం, సామాజిక, ఆర్థిక తదితర అంశాలు ఉన్నాయని చెప్పింది. కాలుష్యం కూడా ఓ కారణమై ఉంటుందా? అనే అంశాన్ని సైతం పరిశీలిస్తున్నారు. భారత్ లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న వయోజనుల్లో సరాసరి ఎత్తులో తేడాలు ఉన్నాయని చెప్పింది. 15 నుంచి 25 ఏజ్ గ్రూపులో ఉన్న వారిలో ఎత్తు తగ్గుతోందని తెలిపింది. ఈ ఏజ్ గ్రూపులోని మహిళల సరాసరి ఎత్తు 0.42 సెంటీమీటర్లు, పురుషుల్లో 1.10 సెంటీమీటర్ల మేర సరాసరి ఎత్తు తగ్గించదని వెల్లడించింది. ముఖ్యంగా గిరిజన మహిళల్లో ఈ తగ్గుదల మరింత ఎక్కువగా ఉన్నట్లు గమనించినట్లు స్టడీ వెల్లడించింది. చదవండి: కంపెనీ బోర్డుల్లో 'మహిళలు తక్కువే' -
ఎత్తు పెరగటానికి రూ. 55 లక్షలు ఖర్చు చేశాడు
వాషింగ్టన్ : దాదాపు మూడు అంగుళాల ఎత్తు పెరగటానికి ఓ వ్యక్తి కాస్మటిక్ సర్జరీని ఆశ్రయించాడు. ఏకంగా 55 లక్షల రూపాయలు ఖర్చుపెట్టి తన కలను నెరవేర్చుకున్నాడు. వివరాలు.. అమెరికాలోని డల్లాస్‌కు చెందిన ఆల్ఫోన్సో ఫ్లోరెస్ అనే 28 ఏళ్ల వ్యకి ఎత్తు ఐదు అడుగుల 11 అంగుళాలు. అయితే ఉన్న ఎత్తుతో అతడు సంతృప్తి పడలేదు. మరింత ఎత్తు పెరగాలనుకున్నాడు. ఇందుకోసం లాస్‌వెగాస్‌లోని డాక్టర్ కెవిన్ డెబీపర్షద్‌ను సంప్రదించాడు. ఆయన అతడికి ‘లింబ్ లెంథనింగ్’ కాస్మటిక్ సర్జరీని చేయించుకోవాల్సిందిగా సూచించారు. ( 63 సంవత్సరాల మహిళకు 43 ఏళ్ల జైలు శిక్ష..! ) ఆల్ఫోన్సో ఇందుకు అంగీకరించాడు. ఆపరేషన్ పూర్తయింది. ఏకంగా 55 లక్షల రూపాయలు ఖర్చు అయింది. అంతకు ముందు కంటే మూడు అంగుళాల ఎత్తు పెరిగాడు. ఐదు అడుగుల 11 అంగుళాలు ఉన్న అతడు ఆరు అడుగుల 1 అంగుళానికి చేరుకున్నాడు. గత ఆగస్టులో ఈ సర్జరీ జరిగింది. ప్రస్తుతం అతడు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్‌కు గురికాకుండా ఆరోగ్యంగానే ఉన్నాడు. అయితే ఇలాంటి కాస్మటిక్ సర్జరీలు కొన్ని సందర్భాల్లో తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్‌ను చూపిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2016లో హైదరాబాద్‌కు చెందిన నిఖిల్ రెడ్డి అనే యువకుడు ఎత్తు పెరగటానికి సర్జరీ చేయించుకుని తీవ్ర ఇబ్బందుల పాలైన సంగతి తెలిసిందే. -
లాల్ ఎత్తు ఒక సందేహంగా ఉండిపోయింది..
లెఫ్టినెంట్ లాల్ మచ్చువానా భారత సైన్యంలోని శతఘ్నిదళంలోకి ప్రమోట్ అవడం అతడి సొంత రాష్ట్రమైన మిజోరాం ప్రజలకే కాదు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జోరంథంగాకూ ఎంతగానో ఆనందించే విషయం అయింది. అయితే ఆ ఆనందంలో ఆయన ట్వీట్ చేసిన ఫొటో మాత్రం దేశంలోని ఇతర ప్రాంతాల వారికి ఆసక్తిని మాత్రమే కలిగించింది. ఆ ఫొటోలో ఇద్దరు పొడవాటి ఆఫీసర్ల మధ్య ఉన్న లాల్ మచ్చువానా.. సైన్యానికి అవసరమైన కనీస ఎత్తులో కూడా లేనట్లుగా కనిపించడమే అందుకు కారణం. 6.5, 6.3 అడుగుల ఎత్తు ఉన్న ఆ ఇద్దరి మధ్య 5.5 అడుగుల ఎత్తున్న లాల్.. సైన్యానికి ఏమాత్రం తగని వ్యకిలా కనిపిస్తున్నప్పటికీ సైన్యానికి కనీస అర్హత అయిన 5.2 ఎత్తుకు మించి ఉన్నట్లు మీడియా వెళ్లి ఆయన్ని అడిగేవరకు దేశానికి ఒక సందేహంగా ఉండిపోయింది. ముఖ్యమంత్రి పోస్ట్ చేసిన ఆ ఫొటో గతంలో డెహ్రాడూన్ లోని ఇండియన్ మిలిటరీ అకాడమీ పాసింగ్ ఔట్ పరేడ్‌లో లాల్ తన కో–ఆఫీసర్స్ తో కలిసి తీయించుకున్నది. -
ఎత్తుగా కనపడాలంటే...
నడుము దగ్గర బిగుతుగా ఉండే దుస్తులను ధరించటం వలన చూసే వారికి మీరు పొడవుగా స్లిమ్‌గా ఉన్నట్టు కనపడటానికి అవకాశం ఉంది. ముఖ్యంగా డార్క్ లేదా నలుపు రంగు జీన్స్’ని చాలా బిగుతుగా కుట్టిన దుస్తులను వేసుకోవటం వలన మీరు చాలా స్లిమ్’గా ఉన్నట్టు కనపడతారు. వీటిని మీ శరీర కదలికలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలి. -
యాడ్ చూసి ఎత్తు పెరగాలనుకొంటే..
వనపర్తి: ఈ మందులు వాడితే సులభంగా పొడవు పెరగవచ్చు అంటూ టీవీలో ప్రసారమయ్యే ఓ యాడ్‌ను చూసిన ఆ యువకుడు రూ.2 వేలు వెచ్చించి గ్రోత్‌ఆన్ అనే మందుకొని వాడాడు. వారం రోజుల్లోనే.. శరీరమంతా ఇన్ఫెక్షన్ అయ్యింది. అలా రోజురోజుకు అనారోగ్యం పెరుగుతూనే వస్తోంది. డబ్బు సంపాదనే ధ్యేయంగా కొన్ని ప్రైవేటు సంస్థలు యువతను ఆకట్టుకునేందుకు ఇలాంటి ప్రకటనలు చేసి సంస్థ ఉత్పత్తులను విక్రయించి మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. వనపర్తి జిల్లాకేంద్రంలోని ఖాజా నజీర్ అహ్మద్ ప్రస్తుతం అనుభవిస్తున్న నరకయాతనే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. ఎంతో హుషారుగా ఉండే యువకుడు మూడుకాళ్ల వృద్ధుడిలా మంచానపడటంతో ఆ కుటుంబం పరిస్థితి దిక్కుతోచని సంకట స్థితిలోకి జారిపోయింది. గత రెండు నెలల క్రితం ప్రారంభమైన అనారోగ్యం ప్రస్తుతం తీవ్రరూపం దాల్చింది. శరీరంలోని కండ పూర్తిగా కరిగిపోయి ధృడమైన శరీర సౌస్టంతో ఉండాల్సిన పద్దెనిమిదేళ్ల యువకుడు ఎముకలగూడతో పలికేందుకు సత్తువలేనంత నీరసంగా మారిపోయాడు. అస్వస్థత ప్రారంభంలో స్థానిక జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులకు చూపించగా.. అక్కడి వైద్యులు పదిహేనురోజులపాటు వైద్యం అందించి పాలమూరులోని ఎస్వీఎస్ ఆస్పత్రికి సిఫార్సు చేశారు. అక్కడ వైద్య పరీక్షలు చేసి మందులు ఉచ్చారు. కానీ ఎలాంటి పురోగతి లేకపోవడంతో హైదరాబాద్‌లోని మ్యాట్రిక్స్ ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. ప్రభుత్వం ఇచ్చే.. ఆసరా పింఛన్, చిన్న చిన్న పనులు చేసుకుంటూ కుటుంబ పోషణ చేసుకునే తల్లి కుమారుడికి వైద్యం చేయించేందుకు డబ్బులు లేక సాయం చేసే చేతుల కోసం ఎదురుచూస్తున్నారు. ఆస్తులు పంచుకున్న బంధువులు ఆపద సమయంలో జాలి చూపించటం లేదు. పెద్ద మనస్సుతో సాయం చేసి నా కుమారుడి వైద్యం చేయించాలని తల్లి గోరీబీ, అక్క అర్షియా కోరుతున్నారు. -
ఎవరెస్ట్ ఎత్తు ఎంతో తెలుసా?
కఠ్మాండు: భూతాపోన్నతి కారణంగా మంచు కరిగి హిమాలయాల ఎత్తులో మార్పు వచ్చిందా? నేపాల్‌లో 2015లో వచ్చిన పెను భూకంపం వల్ల కొండలు కుంచించుకుపోయాయా? భూమి పొరలు కదలడం వల్ల ఎత్తు మరింత పెరిగిందా? ఈ ప్రశ్నలకు త్వరలోనే సమాధానం దొరకనుంది. ప్రపంచంలోనే ఎల్తైన హిమాలయాలను కొలిపించాలని నేపాల్ ప్రభుత్వం నిర్ణయించింది. మొదటిసారి హిమాలయాలను 1856లో కొలిచారు. బ్రిటీష్ సర్వేయర్ సర్ జార్జ్ ఎవరెస్ట్ బందం దీన్ని కొలచి సముద్ర మట్టానికి 8,840 మీటర్ల ఎత్తున ఉందని తేల్చింది. ఆయన పేరుతోనే హిమాలయాల్లో ఎవరెస్ట్ శిఖరం అనే పేరు వచ్చింది. ఆ తర్వాత 1955లో రెండోసారి కొలచి హిమాలయాల ఎత్తును 8,848 మీటర్లుగా తేల్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే ఎత్తును ప్రమాణంగా తీసుకుంటున్నారు. కాలక్రమంలో హిమాలయాల ఎత్తులో మార్పు వచ్చినట్లు మూడు శాస్త్రీయ పరిశోధనలు తెలియజేస్తున్నాయని, అందుకని ఎత్తును కొలవాల్సిన బాధ్యత నెపాల్కుందని నేపాల్ సర్వే విభాగం డైరెక్టర్ గణేష్ ప్రసాద్ భట్టా తెలిపారు. ఈ సర్వేకు దాదాపు 15 లక్షల డాలర్లు ఖర్చవతాయన్నది ఓ అంచనా. నేపాల్‌లోని ఉదయపూర్ జిల్లాలో సముద్ర మట్టానికి దాదాపు 1500 మీటర్ల ఎత్తులో కొంతమంది సర్వేయర్లు ఎవరెస్ట్‌ను కొలవడం మొదలు పెట్టారని నేపాల్ అధికారులు తెలిపారు. ప్రతి రెండు కిలీమీటర్లకు ఒక స్టేషన్‌ను ఏర్పాటు చేస్తామని, ఒక్క మిల్లీమీటరు కూడా వదలకుండా కొలుస్తామని వారు చెప్పారు. జూలై మధ్యలో అధికారికంగా కొలిచే కార్యక్రమం మొదలవుతుందని, ఆగస్టు నాటికి ఊపందుకుంటుందని, దాదాపు 50 మంది సర్వేయర్లు పాల్గొంటారని వారు వివరించారు. జీపీఎస్ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అమెరికా జాతీయ జియోగ్రఫిక్ సొసైటీ 1999లో ఎవరెస్ట్ ఎత్తును కొలచి 8,850 మీటర్లని తేల్చింది. అయితే సంప్రదాయక పద్ధతుల్లో ఎత్తును కొలవలేదన్న కారణంగా దాన్ని గుర్తించేందుకు నేపాల్ ప్రభుత్వం తిరస్కరించింది. 2005లో చైనా బందం సర్వే జరిపి 8,844 మీటర్లని తేల్చింది. దాన్ని కూడా గుర్తించేందుకు నేపాల్ తిరస్కరించింది. ఎవరెస్ట్ శిఖరం అధికారికంగా నేపాల్ భూభాగంలో ఉన్న విషయం తెల్సిందే. -
‘గుడ్లు’ తేలేయాల్సిందే..!
పాల్వంచ రూరల్: కోడిగుడ్డు ధర..క్రమంగా పెరుగుతూ ఇప్పుడు ఒక్కో ఎగ్ రేట్ రూ.6కు చేరడంతో వినియోగదారులు బాబోయ్..అంటున్నారు. నిన్న, మొన్నటి వరకు ఒక్కోకోడిగుడ్డు ధర రూ.3నుంచి 4 వరకు ఉండేది. కొన్ని చోట్ల రూ.5కు కూడా అమ్మారు. ఇప్పుడు మరో రూపాయి పెరిగి రూ.6కు చేరింది. ప్రస్తుతం మార్కెట్లో 30 కోడిగుడ్లకు రూ.180కు అమ్ముతున్నారు. ఒక్క గుడ్డుకు ఆరు రూపాయలు వెచ్చించాలంటే పేదలు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. -
‘గుడ్లు’ తేలేయాల్సిందే..!
పాల్వంచ రూరల్: కోడిగుడ్డు ధర..క్రమంగా పెరుగుతూ ఇప్పుడు ఒక్కో ఎగ్ రేట్ రూ.6కు చేరడంతో వినియోగదారులు బాబోయ్..అంటున్నారు. నిన్న, మొన్నటి వరకు ఒక్కోకోడిగుడ్డు ధర రూ.3నుంచి 4 వరకు ఉండేది. కొన్ని చోట్ల రూ.5కు కూడా అమ్మారు. ఇప్పుడు మరో రూపాయి పెరిగి రూ.6కు చేరింది. ప్రస్తుతం మార్కెట్లో 30 కోడిగుడ్లకు రూ.180కు అమ్ముతున్నారు. ఒక్క గుడ్డుకు ఆరు రూపాయలు వెచ్చించాలంటే పేదలు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. -
మళ్లీ విఘ్న వివాదం
-
పొడుగరులే ఆరోగ్యవంతులట!
రోజువారీ పనుల్లో పొడుగరులకు తరచు కొన్ని ఇబ్బం దులు తప్పకపోయినా, ఆరోగ్యం విషయంలో మాత్రం పొడగరులే అదృష్టవంతులని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. పొట్టి వారితో పోలిస్తే పొడగరులకు గుండెజబ్బులు, వినికిడి సమస్యలు తలెత్తే అవకాశాలు చాలా తక్కువ అని అమెరికాలోని ఓహయో స్టేట్ వర్సి టీ పరిశోధకులు చెబుతున్నారు. ఈ పరిశోధకులు చేప ట్టిన అధ్యయనంలో పొడగరుల గురించి మరిన్ని ఆసక్తి కరమైన విశేషాలు వెలుగులోకి వచ్చాయి. పొట్టి వారి కంటే పొడగరులే కెరీర్లో బాగా రాణించడమే కాకుం డా, ఎక్కువ సంతోషంగా కూడా ఉంటారని పరిశోధ కులు చెబుతున్నారు. అయితే వీరికి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్లు లేకపోలేదు. వీరికి స్కిన్ కేన్సర్, కోలన్ కేన్సర్, కిడ్నీ కేన్సర్ వంటి కొన్ని రకాల కేన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువని అంటున్నారు.