ప్రపంచ వ్యాప్తంగా ప్రజల సరాసరి ఎత్తు పెరుగుతున్న తరుణంలో.. భారతీయుల ఎత్తు మాత్రం తగ్గుముఖం పట్టడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా వెల్లడైన నివేదికలోని అంశాలపై పరిశోధకుల సమీక్షలు, కారణాల అన్వేషణ మొదలైంది.
భారతీయుల సరాసరి ఎత్తు తగ్గుతోందని తెలిపింది. JNU’s Centre of Social Medicine and Community Health నిర్వహించిన సర్వేలో.. 1998 నుంచి 2015 వరకు భారతీయ వయోజనుల ఎత్తుపై కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 1998-99లో భారతీయుల ఎత్తు కొంచెం పెరిగిందని, అయితే 2005-06 నుంచి 2015-16 మధ్య కాలంలో గణనీయమైన స్థాయిలో ఎత్తు తగ్గిందని వెల్లడించింది.
కారణాలపై..
ఇది చాలా ఆందోళన కలిగించే అంశమని, దీనిపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని సూచించింది. భారతీయ జనాభాలో వివిధ సమూహాల మధ్య ఎత్తు అంతరాయంపై కూడా అధ్యయనం జరగాలని చెప్పింది. జన్యుపరమైన అంశాలే కాకుండా, వాటికి సంబంధం లేని కారకాలు కూడా ఎత్తుపై ప్రభావం చూపుతున్నాయని, ఇది చాలా ఆందోళన కలిగించే విషయమని తెలిపింది. జీవన విధానం, పౌష్టికాహారం, సామాజిక, ఆర్థిక తదితర అంశాలు ఉన్నాయని చెప్పింది. కాలుష్యం కూడా ఓ కారణమై ఉంటుందా? అనే అంశాన్ని సైతం పరిశీలిస్తున్నారు.
భారత్ లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న వయోజనుల్లో సరాసరి ఎత్తులో తేడాలు ఉన్నాయని చెప్పింది. 15 నుంచి 25 ఏజ్ గ్రూపులో ఉన్న వారిలో ఎత్తు తగ్గుతోందని తెలిపింది. ఈ ఏజ్ గ్రూపులోని మహిళల సరాసరి ఎత్తు 0.42 సెంటీమీటర్లు, పురుషుల్లో 1.10 సెంటీమీటర్ల మేర సరాసరి ఎత్తు తగ్గించదని వెల్లడించింది. ముఖ్యంగా గిరిజన మహిళల్లో ఈ తగ్గుదల మరింత ఎక్కువగా ఉన్నట్లు గమనించినట్లు స్టడీ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment