JNU
-
వైరస్ల పనిపట్టే కృత్రిమ ప్రోటీన్.. పరిశోధకుల కీలక విజయం
పరమాణువులపై పరిశోధన చేస్తున్న ఢిల్లీ జవహర్‌లాల్‌నెహ్రూ విశ్వవిద్యాలయ పరిశోధకులు గొప్ప ముందడుగు వేశారు. ముందులకు లొంగకుండా వైరస్లు ‘వ్యాధి నిరోధకత’ను సంతరించుకుంటున్న పరిస్థితికి చెక్‌పెట్టే దిశగా పరిశోధకులు కీలక విజయం సాధించారు. రష్యన్ శాస్త్రవేత్తలతో కలిసి సంయుక్తంగా చేపట్టిన ఒక పరిశోధనలో జేఎన్‌యూ సైంటిస్టులు హెచ్ఎస్పీ70 అనే మానవ ప్రోటీన్‌ను కనుగొన్నారు. మానవల్లో కోవిడ్, మలేరియా వంటి వైరస్ కారక వ్యాధులు ప్రబలడంలో హెచ్ఎస్పీ70 కీలకపాత్ర పోషిస్తోందని గుర్తించారు. వ్యాధికారక వైరస్లు ఇబ్బడిముబ్బడిగా పెరగడానికి హెచ్ఎస్పీ70 ప్రోటీన్ పరోక్షంగా సాయపడుతుంది. వ్యాధికారక ప్రోటీన్ జాడ తెలియడంతో ఈ ప్రోటీన్ చర్య, అభివృద్ధిని కట్టడిచేసే మరో ప్రోటీన్‌ను శాస్త్రవేత్తలు విజయవంతంగా అభివృద్ధిచేశారు. జేఎన్‌యూలో స్పెషల్ సెంటర్ ఫర్ మాలిక్యులార్ మెడిసన్ విభాగ అధ్యయనకారులు ఈ కృత్రిమ ప్రోటీన్‌ను అభివృద్ధిచేశారు. ఇది హెచ్ఎస్పీ70 పనితీరును క్షీణింపజేస్తుంది. దాంతో అది వ్యాధికారక వైరస్‌లకు పూర్తిస్థాయిలో సాయపడటంతో విఫలమవుతుంది. దాంతో మానవశరీరంలో వ్యాధి విజృంభణ ఆగుతుంది. చికిత్సకు, మందులకు లొంగకుండా వైరస్ కనబరిచే ‘వ్యాధినిరోధకత’సామర్థ్యమూ తగ్గుతుంది. హీట్షాక్ ప్రోటీన్ హీట్షాక్ ప్రోటీన్‌కి పొట్టిరూపమే హెచ్ఎస్పీ. వ్యాధికారక వైరస్ ప్రబలినప్పుడు కణాల్లో అవి క్షణాల్లో రెండింతలు, మూడింతలు, ఇలా కోట్ల రెట్లు పెరిగేందుకు హెచ్ఎస్పీ ప్రోటీన్ సాయపడుతుంది. శరీరాన్ని వేడెక్కేలా చేసి వైరస్ల సంఖ్య పెరగడానికి అనువైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. వైరస్ తనలాంటి లక్షలాది వైరస్‌లను తయారుచేయడంలో, అచ్చం అలాగే ఉండటంలో, రెట్టింపు ప్రక్రియలో తప్పులు దొర్లకుండా హెచ్ఎస్పీ ప్రోటీన్ చూసుకుంటుంది. ఇంతటి కీలక ప్రోటీన్ జాడను కనిపెట్టి జేఎన్‌యూ పరిశోధకులు ఘన విజయం సాధించారు. ఈ పరిశోధనా వివరాలు ప్రఖ్యాత బయోలాజికల్ మైక్రోమాలిక్యూల్స్ ఇంటర్నేషనల్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. కోవిడ్ కారక సార్స్ కోవ్–2 వైరస్‌లోని కొమ్ములతో, మానవ కణంలోని ఏస్2 గ్రాహకాలకు మధ్య హెచ్ఎస్పీ అనుసంధానకర్తలా వ్యవహరిస్తోందని పరిశోధనలో తేలింది. కణాల్లోకి వైరస్ చొరబడాలంటే ఏస్2 రిసెప్టార్లదే కీలక పాత్ర. హెచ్ఎస్పీను నిలువరించడం ద్వారా వైరస్ల సంఖ్య పెరగడాన్ని అడ్డుకోగలిగామని జేఎన్‌యూ ప్రొఫెసర్లు ఆనంద్ రంగనాథన్, శైలజా సింగ్ చెప్పారు.‘‘హెచ్ఎస్పీని అడ్డుకునేలా పీఈఎస్–సీఐ అనే కొత్త ప్రోటీన్‌ను అభివృద్ధిచేశాం. దీనిని సార్స్–కోవ్2 సోకిన కణాల్లోకి జొప్పించాం. దీంతో సార్స్–కోవ్2 కణాల రెట్టింపు ప్రక్రియ గణనీయస్థాయిలో మందగించింది. సాంప్రదాయక ఔషధాలు నేరుగా వైరస్‌లపై దాడిచేస్తాయి. కానీ వైరస్‌లకు ఆతిథ్యమిచ్చే కణాలను లక్ష్యంగా చేసుకోవడం వంటి కొత్తరకం విధానాల ద్వారా వ్యాధుల వ్యాప్తిని గణనీయంగా అడ్డుకోవచ్చు. కోవిడ్ సంక్షోభం ముగియడంతో జనం దాదాపు కరోనా గురించి మర్చిపోయారు. కానీ పరిశోధనా ప్రపంచం ఎప్పుడూ రాబోయే కొత్తరకం వైరస్ల గురించి అప్రమత్తంగానే ఉంటుంది’’అని పరిశోధకులు అన్నారు.చదవండి: నిద్రపోతున్నప్పుడే బెల్లీఫ్యాట్‌ని కరిగించే బెడ్‌టైమ్ 'టీ'..!ఢిల్లీలోని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లోని డాక్టర్ ప్రమోద్ గార్గ్, పీహెచ్డీ స్కాలర్ ప్రేరణ జోషి సైతం ఈ పరిశోధనలో పాలుపంచుకున్నారు. హఠాత్తుగా పుట్టుకొచ్చి విజృంభించే కొత్త రకం వైరస్ల కట్టడికి ఈ విధానం ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని ప్రేరణజోషి అన్నారు. అంతర్జాతీయంగా ఆరోగ్య సంక్షోభం తలెత్తినప్పుడు శాస్త్రసాంకేతి రంగం ఏ స్థాయిలో నూతన చికిత్సా విధానాలు, ఆవిష్కరణలతో సంసిద్ధంగా ఉండాలనే అంశాన్ని తాజా పరిశోధన మరోసారి నిరూపిస్తోంది. -
సీతారాం ఏచూరి నివాసానికి పార్థివ దేహం
-
సంస్కరణవాది.. స్థిత ప్రజ్ఞుడు
సాక్షి, నేషనల్ డెస్క్/సాక్షి, హైదరాబాద్: బహుభాషావేత్తగా, కాలమిస్ట్‌గా, రాజకీయవేత్తగా, వామపక్షవాదిగా సీతారాం ఏచూరిది సుదీర్ఘ ప్రస్థానం. అటు పార్టీ అగ్రనేతగా కొనసాగుతూనే ఇటు ఎర్రజెండా పట్టుకుని పలు ప్రజా ఉద్యమాల్లో తలమునకలయ్యారు. సమకాలీన భారత రాజకీయాల్లో అత్యంత కీలకమైన వామపక్ష నేతగా కొనసాగారు. తుదిశ్వాస వరకూ బడుగు, బలహీన, అణగారిన వర్గాల కోసం పాటుపడి నిఖార్సయిన కామ్రేడ్‌గా పేరు నిలబెట్టుకున్నారు. అద్భుతమైన వాక్పటిమతో సంప్రదింపులు జరపడంలో దిట్టగా ఏచూరికి పేరుంది.తెలుగు కుటుంబంలో జననం.. : సీతారాం ఏచూరి 1952, ఆగస్టు 12న చెన్నైలో స్థిరపడిన తెలుగు వాస్తవ్యులు ఏచూరి సర్వేశ్వర సోమయాజి, కల్పకం దంపతులకు జని్మంచారు. స్వస్థలం కాకినాడ కాగా బాల్యం అంతా అక్కడే గడిచింది. రామారావుపేటలో ప్రస్తుతం ఏచూరి పేరుతో ఉన్న అపార్టుమెంట్ స్థలంలోనే ఏచూరి కుటుంబ సభ్యుల ఇల్లు ఉండేది. తండ్రి సోమయాజి బదిలీపై విజయవాడ ఆరీ్టసీలో ఉన్నతాధికారిగా పనిచేసిన సమయంలో ఆరు, ఏడు తరగతులను ఏచూరి విజయవాడలో చదువుకున్నారు. ఏచూరికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన మోహన్ కందా స్వయానా మేనమామ. చెన్నైలోని మేనమామ ఇంట్లో ఆయన జని్మంచారు. హైదరాబాద్ ఆల్ సెయింట్స్‌లో, ఢిల్లీలో హైసూ్కల్ విద్యను అభ్యసించారు. సీబీఎస్ఈ పరీక్షలో జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించారు. సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో బీఏ (ఆనర్స్) ఆర్థిక శాస్త్రం, జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ)లో ఆర్థికశాస్త్రంలో ఎంఏ పట్టా పొందారు. సంకీర్ణ ప్రభుత్వాల్లో కీలక పాత్ర..తన గురు సమానులు హర్కిషన్ సింగ్ సుర్జీత్లాగా 2004–2014 కాలంలో ఏచూరి సంకీర్ణ ప్రభుత్వాల్లో కీలక భూమిక అయ్యారు. 2004లో ప్రధాని పదవిని సోనియా గాంధీ తిరస్కరించాక నాటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌కలాం తర్వాత సోనియా కలిసిన తొలి కాంగ్రెసేతర నేత ఏచూరినే. యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో కనీస ఉమ్మడి కార్యాచరణ రూపకల్పనలో కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరంతో కలిసి పనిచేశారు. యూపీఏ ప్రభుత్వాల కాలంలో కాంగ్రెస్‌కు అత్యంత నమ్మదగ్గ నేస్తంగా ఉన్నారు. నెగ్గిన ఏచూరి బడ్జెట్ సవరణల ప్రతిపాదన..గతంలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలనుద్దేశించి అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేసిన ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానానికి రాజ్యసభలో ఏచూరి సవరణలు ప్రతిపాదించారు. దీనిపై జరిగిన ఓటింగ్‌లో ఆయన చేసిన సవరణల ప్రతిపాదన నెగ్గింది. రాజ్యసభ చరిత్రలో ఇలా జరగటం కేవలం నాలుగోసారి మాత్రమే. ఒబామా రాకను వ్యతిరేకించిన సందర్భం..అమెరికాపై విమర్శలు చేయడంలో ఏచూరికి ఓ ప్రత్యేకత ఉంది. ఇస్లాం ఛాందసవాదం పెరగడానికి అమెరికానే కారణం అంటూ చురుకైన విమర్శలు చేసేవారు. గణతంత్ర వేడుకలకు అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబామా ముఖ్య అతిథిగా రావడాన్ని ఏచూరి వ్యతిరేకించారు. ఇటీవల మోదీ ప్రభుత్వం తీసుకొచి్చన సీఏఏ, ఎన్ఆర్సీ చట్టాలను, జమ్మూ, కాశ్మీర్లో ఆర్టికల్ 370, 35అ రద్దును కూడా ఆయన వ్యతిరేకించారు. ఇండియా కూటమికి కృషి..పార్లమెంట్ వేదికగా సామాన్యుల సమస్యలను ఎలుగెత్తి, ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను దునుమాడారు. విపక్షాలను ‘ఇండియా’ కూటమిగా ఏకతాటి మీదకు తేవడంలో కూడా ఏచూరి పాత్ర కీలకమైంది. లోక్‌సభలో విపక్షనేతగా మోదీ సర్కార్‌ను తూర్పారబడుతున్న రాహుల్‌గాంధీకి రాజకీయ గురువుల్లో ఒకరిగా ఈయనకు పేరుంది. ఇతర భాషల్లోనూ అనర్గళంగా..అచ్చ తెలుగు వ్యక్తి అయిన ఏచూరి హిందీ, తమిళం, బెంగాళీ, మలయాళం సైతం అనర్గళంగా మాట్లాడేవారు. హిందూ పురాణాలను ఔపోసన పట్టిన ఏచూరి సందర్భోచితంగా తన ప్రసంగాల్లో వాటిని ఉదహరిస్తూ బీజేపీకి చురకలంటించేవారు. సాంకేతికతను అందిపుచ్చుకుని సామాజిక మాధ్యమాల్లో తరచూ పోస్ట్‌లు పెట్టేవారు. ప్రకాశ్‌కారత్ నుంచి పార్టీ పగ్గాలు తీసుకున్న ఏచూరి సౌమ్యంగా ఉంటూనే పార్టీలో కఠిన నిర్ణయాలు తీసుకుంటూ ముక్కుసూటిగా వ్యవహరించే నేతగా పేరొందారు. మా భుజాలపై తుపాకులు పెట్టి తప్పించు కుంటారా? తెలంగాణ ఏర్పాటు విషయంలో రాజ్యసభలో చర్చ జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ నాన్చుడు ధోరణితో వ్యవహరిస్తోందన్న విమర్శలు వచ్చాయి. కొన్ని పక్షాలు ఒప్పుకోవడం లేదన్న భావనతోకాంగ్రెస్ పార్టీ వ్యవహరించేది. అలాంటి సందర్భంలో తెలంగాణపై జరిగిన చర్చలో సీతారాం ఏచూరి ‘తెలంగాణపై ఏ పార్టీ అభిప్రాయాలు ఆ పారీ్టకి ఉంటాయి. ఆయా పారీ్టల అభిప్రాయాలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందా? తెలంగాణపై మీరేం చేయాలనుకుంటున్నారో అది చేయండి. అంతేగానీ మా భుజాలపై తుపాకులు పెట్టి పేల్చాలనుకోవడం సరికాదు..’ అని ఏచూరి కాంగ్రెస్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారని పార్టీ నేత జూలకంటి రంగారెడ్డి గుర్తు చేశారు. మూడుసార్లు ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక 2015లో విశాఖలో జరిగిన సీపీఐ(ఎం) సదస్సులో పారీ్టకి ఐదో ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 2018 ఏప్రిల్‌లో హైదరాబాద్‌లో జరిగిన సదస్సులో, 2021 కోజికోడ్ మహాసభలోనూ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం అదే హోదాలో ఆయన మృతి చెందారు. ఏచూరి మొదటి భార్య ఇంద్రాణి మజుందార్ కాగా ప్రముఖ జర్నలిస్టు సీమా ఛిస్తీని రెండో వివాహం చేసుకున్నారు. కుమార్తె అఖిల, ఇద్దరు కుమారులు ఆశిష్, డ్యానిష్ కాగా.. 34 ఏళ్ల పెద్ద కుమారుడు ఆశిష్ 2021లో కోవిడ్‌తో కన్నుమూశారు. అఖిల.. యూనివర్సిటీ ఆఫ్ ఎడెన్‌బర్గ్, యూనివర్సిటీ ఆఫ్ సెయింట్ ఆండ్రూస్‌లో బోధిస్తారు.ఎస్ఎఫ్ఐలో చేరికతో.. 1974లో స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ)లో చేరికతో ఏచూరి రాజకీయ ప్రస్థానం మొదలైంది. 1975లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)లో సభ్యుడు అయ్యారు. పార్టీలో చురుకైన కార్యకర్తగా వ్యవహరించిన ఏచూరి అనేక ఉద్యమాల్లో భాగస్వాములు అయ్యారు. 1975లో దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన సమయంలో అరెస్టై కొన్నాళ్లు జైలు జీవితం గడిపారు. ఆ సమయంలో జేఎన్‌యూలో పీహెచ్డీ చేస్తున్న ఆయన..ఆ కారణంగా డాక్టరేట్ పూర్తి చేయలేకపోయారు. ఎంతోమంది సన్నిహితుల మధ్య తాను డాక్టరేట్ పూర్తి చేయలేకపోయానని ప్రస్తావిస్తూ బాధపడుతుండేవారు.దేశంలో అత్యవసర పరిస్థితిని ఎత్తివేసిన తర్వాత ఏచూరి జేఎన్‌యూ విద్యార్థి నాయకుడిగా మూడుసార్లు ఎన్నికయ్యారు. 1978లో ఎస్ఎఫ్ఐ సంయుక్త కార్యదర్శిగా, ఆ తర్వాత అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. పశి్చమ బెంగాల్, కేరళయేతర వ్యక్తి ప్రెసిడెంట్ కావడం అదే తొలిసారి కావడం విశేషం. కాగా 1984లో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీకి ఆయన ఎన్నికయ్యారు. 1992లో పొలిట్‌బ్యూరో సభ్యుడయ్యారు. రాజ్యసభ సభ్యుడిగా, వివిధ కమిటీల్లో..2005లో పశి్చమబెంగాల్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఇదే ఏడాది హోం వ్యవహారాల కమిటీలో సభ్యుడిగా నియమితులయ్యారు. 2006 రవాణా, పర్యాటకం, సాంస్కృతిక కమిటీలకు చైర్మన్‌గా, సాధారణ ప్రయోజనాల కమిటీలో సభ్యుడిగా, జనాభా, ప్రజా ఆరోగ్యంపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ ఫోరంలో సభ్యుడిగా, విలువల కమిటీలో సభ్యుడిగా, బిజినెస్ అడ్వైజరీ కమిటీలో సభ్యుడిగా నియమితులై సేవలు అందించారు. 2009లో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కాన్సులేటివ్ కమిటీతో పాటు, పార్లమెంట్ హౌస్‌లో దేశ నాయకులు, పార్లమెంటేరియన్ల చిత్రపటాలు, విగ్రహాల ఏర్పాటుకు ఉద్దేశించిన కమిటీలో సభ్యుడిగా నియమితులయ్యారు. 2010లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్‌లో సభ్యుడిగా ఉన్నారు. 2011లో తిరిగి రాజ్యసభకు తిరిగి ఎన్నికయ్యారు. 2012లో వ్యవసాయ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు.గొప్ప రచయిత ఏచూరి గొప్ప రచయితగా కూడా పేరు సంపాదించారు. పారీ్టకి చెందిన వారపత్రిక పీపుల్స్ డెమోక్రసీకి రెండు దశాబ్దాలకు పైగా సంపాదకులుగా పనిచేశారు. సైద్ధాంతిక రంగంలో, హిందూత్వంపై ఆ పుస్తకంలో విమర్శలు చేసేవారు. ఇలా రచయితగా మంచి పేరు, ప్రఖ్యాతులు సంపాదించారు. ‘లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్’ పేరుతో ఆంగ్లపత్రికకు కాలమ్స్ రాసేవారు. ‘క్యాస్ట్ అండ్ క్లాస్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ టుడే’, ‘సోషలిజం ఇన్ ఛేంజింగ్ వరల్డ్’, ‘మోదీ గవర్నమెంట్’, ‘న్యూ సర్జ్ ఆఫ్ కమ్యూనలిజం’, ‘కమ్యూనిలజం వర్సెస్ సెక్యులరిజం’ వంటి పుస్తకాలను రాశారు. ఏచూరికి పాత హిందీ పాటలంటే ఎంతో ఇష్టం. సినిమాలు చూసేందుకు ఏచూరితో కలిసి రఫీ మార్గ్ నుంచి చాణక్య ప్రాంతానికి నడుచుకుంటూ వెళ్లే వాళ్లమని తోటి సీపీఎం నేతలు నాటి సంగతులు చెప్పారు. 1977అక్టోబర్ నెల.. ఓ నూనూగు మీసాల యువకుడి నాయకత్వంలో వందలాది మంది విద్యార్థులు ఢిల్లీ వీధుల్లో కదం తొక్కారు. ఉక్కు మహిళగా పేరొందిన ఇందిరాగాంధీ ఇంటికి వారంతా ర్యాలీగా వెళ్లారు. ఎమర్జెన్సీ అనంతరం జరిగిన ఎన్నికల్లో ఇందిర నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పటికీ ఆమె జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ చాన్స్‌లర్ పదవిని మాత్రం వీడలేదు. దీన్ని వ్యతిరేకిస్తూ వారంతా నినాదాలు చేయడం ప్రారంభించారు. చివరికి ఇందిర తన నివాసం నుంచి బయటకు వచ్చారు. అప్పుడు లేచాడు.. జేఎన్‌యూ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ సీతారాం ఏచూరి. ఇందిర పక్కనే నిల్చుని.. ఆమె రాజీనామానే డిమాండ్ చేస్తూ.. మెమోరాండంను చదివి వినిపించాడు. ఈ ఘటన జరిగిన కొన్ని రోజులకే ఇందిర చాన్స్‌లర్ పదవికి రాజీనామా చేశారు.అసాధారణ నేత..⇒ ఏచూరి మరణం తీవ్ర విషాదకరం. విద్యార్థి నేతగా మొదలై జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారి పార్లమెంటేరియన్‌గా ఉంటూ ప్రజావాణిని వినిపించిన నేతను కోల్పోవడం విచారకరం. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడుతూనే అన్ని రాజకీయపార్టీల నేతలతో మైత్రి కొనసాగించారు. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. –ద్రౌపదీ ముర్ము, రాష్ట్రపతి⇒ ఐదు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో దేశ ప్రజాస్వామ్యం పటిష్టతకు ఏచూరి అవిశ్రాంతంగా కృషి చేశారు. ప్రజాసేవలో అలుపెరగక పనిచేశారు. – జగదీప్ ధన్‌ఖడ్, ఉప రాష్ట్రపతి⇒ వామపక్షాలకు ఏచూరి దారి దీపంగా మారారు. ప్రజా ఉద్యమాలను ముందుండి నడిపించారు. పార్టీలకతీతంగా అందరి నేతలతో కలిసిపోయే సామర్థ్యం ఆయన సొంతం. అలాంటి ఏచూరిని కోల్పోవడం విషాదకరం. పార్లమెంట్ సభ్యునిగా తనదైన ముద్ర వేశారు. ఈ విషాదకాలంలో ఆయన కుటుంబానికి మేమంతా అండగా నిలుస్తాం. – నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి⇒ ఏచూరి మరణం రాజకీయ రంగానికి తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు, పార్టీ నేతలకు నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను –కేంద్ర హోంమంత్రి, అమిత్ షా⇒ లౌకిక చాంపియన్ ఏచూరి. దేశ భిన్నత్వాన్ని పరిరక్షించడంలో తన నిబద్ధత చాటారు. 2004–08 ప్రభుత్వంలో కలిసి పనిచేశాం. చిరకాలం కమ్యూనిస్ట్‌గా ఉన్నా ఆయన మూలాలు ప్రజాస్వామ్య విలువల్లో దాగి ఉన్నాయి. – సోనియాగాంధీ, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్⇒ ఆయన నాకు అత్యంత ఆప్తుడు. దేశాన్ని లోతుగా అర్థం చేసుకున్న నేత. భారతదేశ ఆలోచన (ఐడియా ఆఫ్ ఇండియా)కు రక్షకుడు ఆయన. – రాహుల్ గాంధీ, లోక్‌సభలో విపక్షనేత⇒ సమకాలీన కమ్యూనిస్టు ఉద్యమాలకు సంబంధించిన అసాధారణ నేతల్లో ఏచూరి ఒకరు. దశాబ్దాల క్రితం ఆయన విద్యార్థి సంఘంలో, నేను ఆలిండియా యూత్ ఫెడరేషన్లో పనిచేశాం. ఆయన మరణం ప్రజాస్వామ్య వర్గాలకు తీరని లోటు. –డి.రాజా, సీపీఐ ప్రధాన కార్యదర్శి⇒ ఏచూరి మరణం భారత కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటు. ప్రజా, దేశ సమస్యలు ప్రస్తావించే ఒక గొంతు మూగబోయింది. పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన తర్వాత వామపక్షాల ఐక్యతను విస్తృతం, పటిష్టం చేసేందుకు మంచి కృషి చేశారు. – సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ⇒ కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ, పశ్చిమబెంగాల్, కేరళ సీఎంలు మమతా బెనర్జీ, పినరయి విజయన్, భారత్‌లో చైనా రాయబారి ఫెహోంగ్ తదితరులు ఏచూరి మృతిపై సంతాపం వ్యక్తం చేశారు.⇒ ఏచూరి పోరాటాలు ఎప్పటికీ స్ఫూర్తి దాయకం. ఆయన మరణం దేశ రాజకీయాలకు తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. – ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి⇒ సామ్యవాద భావాలు కలిగిన ఏచూరి.. మరణం భారత లౌకిక వాదానికి, కార్మిక లోకానికి తీరని లోటు. శోకతప్తులైన వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. – బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు ⇒ ఏచూరి భారత దేశ రాజకీయాల్లో అత్యంత గౌరవనీయమైన వ్యక్తుల్లో ఒకరు. ఏచూరి మరణం దేశ రాజకీయాలకు తీరనిలోటు. – ఏపీ సీఎం చంద్రబాబు⇒ దత్తాత్రేయ, కేంద్ర మంత్రుల సంతాపం..: ఏచూరి మృతి పట్ల హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రులు జి.కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు డా.కె.లక్ష్మణ్, బీఏఎల్పీనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి వేర్వేరు ప్రకటనల్లో సంతాపం ప్రకటించారు. ⇒ ప్రముఖుల సంతాపం..: శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్క, అసదుద్దీన్ ఒవైసీ, మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ ముదిరాజ్, తదితరులు ఏచూరి మరణంపై సంతాపం వ్యక్తం చేశారు. -
Malaria Vaccine : సరికొత్త టీకా, జేఎన్‌యూ శాస్త్రవేత్తల కీలక పురోగతి
మలేరియావ్యాధి నిర్మూలనలో పరిశోధకులు గొప్ప పురోగతి సాధించారు. జవహర్లాల్ నెహ్రూ విశ్వ విద్యాలయం (జెఎన్‌యు) శాస్త్రవేత్తల బృందం మలేరియాకు వ్యతిరేకంగా మరింత ప్రభావవంతమైన నివారణ, చికిత్సా వ్యూహాలకు మార్గం సుగమం చేయగల మంచి వ్యాక్సిన్ తయారీలో మరో అడుగు ముందు కేశారు. జెఎన్‌యులోని మాలిక్యులర్ మెడిసిన్ సెంటర్ ప్రొఫెసర్ శైలజా సింగ్, ప్రొఫెసర్ ఆనంద్ రంగనాథన్ నేతృత్వంలోని పరిశోధన, టీకా వ్యూహంలో భాగంగా కొత్త పారాసైట్ ఇంటరాక్టింగ్ కాంప్లెక్స్‌ను గుర్తించింది.మనిషిలోఇన్ఫెక్షన్కు కారణమైన రెండు తటస్థ అణువులు పీహెచ్బీ2-హెచ్ఎస్పీ70ఏ1ఏను గుర్తించినట్లు పరిశోధనలో భాగమైన ప్రొఫెసర్ శైలజ తెలిపారు. ఈ పారాసైట్ ప్రొటీన్ పీహెచ్బీ2 ఓ ప్రభావవంతమైన వ్యాక్సిన్‌కు దోహదం చేయగలదన్నారు.మానవ హోస్ట్ లోపల పరాన్నజీవి ఇన్ఫెక్షన్ పొందడంలో సహాయపడే నవల PHB2-Hsp70A1A రిసెప్టర్ లిగాండ్ జతను తాము గుర్తించామని, పరాన్నజీవి ప్రోటీన్ PHB2 ఒక శక్తివంతమైన టీకా ఇదని ఆమె తెలిపారు. వివిధ సెల్యూలార్ ప్రాసెస్లను నిర్వహించడంలో కీలక పాత్ర పోషించే ప్రొటీన్ల కుటుంబం ప్రొహిబిటిన్స్ ఇవి అని చెప్పారు. పీఎఫ్‌పీహెచ్‌బీ2 యాంటీబాడీల ఉనికిని గుర్తించడం మలేరియా చికిత్సలో గొప్ప మలుపు అని మరో పరిశోధకుడు మనీషా మరోథియా వివరించారు. యాంటీబాడీ చికిత్స పరాన్నజీవుల పెరుగుదలను పూర్తిగా రద్దు చేయడం విశేషమని పేర్కొన్నారు.. అలాగే శాస్త్రవేత్తలుగా, మలేరియా నిర్మూలన పట్ల ఆకాంక్ష ఎప్పటికీ ఆగదని ఇరువురు ప్రొఫెసర్లు పునరుద్ఘాటించారు.మలేరియా ఆడ ఎనాఫిలిస్ దోమ ద్వారా వ్యాపించే వెక్టర్-బోర్న్ వ్యాధి. ప్రధానంగా ఇండియా సహా అనేక దేశాల్లో శతాబ్దాలుగా మిలియన్ల మంది ప్రాణాలను బలితీసుకొంటోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2022 నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 249 మిలియన్ కేసులు మరియు 60,800 మరణాలు సంభవిస్తున్నాయి. యాంటీ మలేరియల్ డ్రగ్స్ ప్రభావాన్ని నిరోధించగలిగే రోగ నిరోధక సామర్థ్యాన్ని దోమలు ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటున్నాయి. మరోవైపు మలేరియాకు సమర్థవంతమైన టీకాలు లేవు. దీంతో ఈ ప్రాణాంతక మహమ్మారితో పోరాటంలో అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయి. దీనిపై అనేక పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే కోవిడ్-19 మహమ్మారి పరిశోధనకు కలిగించిన అంతరాయం ఫలితంగా ఇటీవల కేసులు, మరణాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత అధ్యయన ఫలితం ఆశాజనకంగా భావిస్తున్నారు నిపుణులు. -
మన చదువుకు కీర్తి కిరీటం!
అంతర్జాతీయంగా మన ఉన్నత విద్యారంగం వెలుగులీనుతున్న వైనాన్ని వరసగా మూడో ఏడాది కూడా క్యూఎస్ (క్వాక్వరెలీ సైమండ్స్) జాబితా నిరూపించింది. బుధవారం ప్రకటించిన ఆ జాబి తాలో జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్‌యూ) దేశంలోనే ప్రథమ స్థానం సంపాదించింది. అంతర్జాతీయంగా అభివృద్ధి అధ్యయనాల విభాగంలో 20వ ర్యాంకు సాధించి తనకెవరూ సాటిలేరని నిరూపించింది. వామపక్ష భావజాలం బలంగావున్న విద్యాసంస్థగా ముద్ర వున్న జేఎన్‌యూ ప్రతియేటా విద్యాప్రమాణాల విషయంలో తన సత్తా చాటుతూనే వస్తోంది. ఇక అహ్మదాబాద్ ఐఐఎం 25వ ర్యాంకు, బెంగళూరు, కలకత్తా ఐఐఎంలు 50వ స్థానంలోనూ వున్నాయి. డేటా సైన్స్‌లో, పెట్రోలియం ఇంజనీరింగ్‌లో గువాహటి ఐఐటీ క్యూఎస్ జాబితాలో చోటు సంపాదించుకుంది. పరిశోధనా రంగంలో మన దేశం నాలుగో స్థానంలో వుండటం ఈసారి చెప్పుకోదగిన అంశం. ఈ విషయంలో మనం బ్రిటన్ను అధిగమించటం గమనించదగ్గది. ఒకప్పుడు మన పరిశోధనలకు పెద్ద విలువుండేది కాదు. రెండేళ్లుగా ఈ ధోరణి మారడం మంచి పరిణామం. క్యూఎస్ ర్యాంకుల జాబితా అంతర్జాతీయంగా ప్రతిష్ఠాత్మకమైనది. 96 దేశాల్లోని 1,559 విశ్వవిద్యాలయాల తీరుతెన్నులు 55 శాస్త్రాల్లో ఎలావున్నవో అధ్యయనం చేసి ఈ ర్యాంకులు నిర్ణయిస్తారు. ఇందుకు క్యూఎస్ పెట్టుకున్న కొలమానాలు ఆసక్తికరమైనవి. దేశంలోని విద్యాసంస్థలు వాటిని గమనిస్తే మన విద్యావ్యవస్థ ఎంతోకొంత మెరుగుపడుతుంది. విద్యా విషయక కార్య క్రమాల్లో, పరిశోధనల్లో ఒక విశ్వవిద్యాలయం పనితీరు ఎలావున్నదో అంతర్జాతీయంగా భిన్నరంగాల్లో నిష్ణాతులైనవారి అభిప్రాయాలు తీసుకుంటారు. అలాగే ఫలానా యూనివర్సిటీనుంచి వచ్చే పట్టభద్రుల్లో నైపుణ్యాలూ, సామర్థ్యమూ ఎలావున్నాయో వివిధ కంపెనీలనూ, సంస్థలనూ అడిగి తెలుసుకుంటారు. అధ్యాపకులు, విద్యార్థుల నిష్పత్తి, చదువు విషయంలో విద్యార్థులకు అందుతున్న మద్దతు వగైరాలు ఆరా తీస్తారు. అధ్యాపకుల ప్రమాణాలతోపాటు అధ్యాపకవర్గంలో వైవిధ్యత చూస్తారు. అంతర్జాతీయ నేపథ్యంవున్న అధ్యాపకులు, విద్యార్థులు ఎందరున్నారన్నది లెక్కేస్తారు. శాస్త్ర సాంకేతిక విద్యలో, తత్వశాస్త్ర విద్వత్తులో మన ప్రతిభావ్యుత్పత్తులు సాటిలేనివన్న ఖ్యాతి వుండేది. ఐటీరంగంలో మనవాళ్ల బుద్ధికుశలత వారిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లిన దాఖ లాలు కనబడుతూనే వున్నాయి. అయితే అంతర్జాతీయ ర్యాంకింగ్‌ల విషయంలో మన విశ్వవిద్యాల యాలు వెనకబడివుండేవి. ఆ కొలమానాలు, అందుకనుసరించే పద్ధతులు సక్రమంగా వుండవనీ, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదనీ కొందరు విద్యావేత్తలు అనేవారు. మనకు ఇష్టం వున్నా లేకున్నా ఆ ప్రమాణాలు అందుకోవటం తప్పదు. ఎందుకంటే ప్రపంచం నలుమూలలా వుండే విద్యార్థులు ఉన్నత విద్య కోసం మన గడప తొక్కాలంటే అది తప్పనిసరి. వివిధ దేశాల్లోని విద్యాసంస్థలందించే విద్య ఎలావున్నదో తులనాత్మక అధ్యయనం చేయటంవల్ల ఎవరు ఏ రంగంలో ముందంజలో వున్నారన్న సమాచారం వెల్లడవుతుంది. అది పై చదువులకెళ్లే విద్యార్థులకు మాత్రమే కాదు... పరిశోధకులకూ ప్రయోజనకారిగా వుంటుంది. అలాగే అంతర్జాతీయంగా ఎవరి భాగస్వామ్యం పొందితే మన విశ్వవిద్యాలయాల ప్రమాణాలు మెరుగుపడతాయో విధాన నిర్ణేతలు నిర్ధారించుకుంటారు. అయితే సంపన్న, వర్ధమాన దేశాల విశ్వవిద్యాలయాల మధ్య పోటీ పెట్టడం ఎంత మాత్రమూ సరైంది కాదన్న వాదనలు ఎప్పటినుంచో వున్నాయి. పరిశోధనలకూ లేదా పరికల్పనలకూ సంపన్న దేశాల్లో ప్రభుత్వాలనుంచీ, ప్రైవేటు వ్యక్తులనుంచీ నిధుల రూపంలో అందే ప్రోత్సాహం అంతా ఇంతా కాదు. ఇక్కడ అది చాలా అరుదు. మన విశ్వవిద్యాలయాలు వెనకబడి వుండటానికి అదొక కారణం. ఇక ఇతర విశ్వవిద్యాలయాల గురించి మాట్లాడుకోవాలి. మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని తొలి యూపీఏ ఏలుబడిలో 2005లో దోహాలో జరిగిన డబ్ల్యూటీఓ–గాట్స్ సంభాషణల్లో సూత్రప్రాయంగా అంగీకరించిన పర్యవసానంగా ఇతర రంగాలతోపాటు విద్య కూడా ఖరీదైన వ్యవహారంగా మారింది. విదేశీ వర్సిటీలకు మన దేశం తలుపులు తెరిచింది. 2017లో నైరోబీలో జరిగిన డబ్ల్యూటీఓ సమావేశంలో ఎన్డీఏ సర్కారు సంతకం చేశాక 62 ఉన్నత విద్యాసంస్థలకు ‘ఆర్థిక స్వయంప్రతిపత్తి’ మొదలైంది. ఇది పరిమిత స్థాయిలోనైనా ప్రభుత్వ రంగ ఉన్నత విద్యా సంస్థలను ప్రైవేటీకరించటమే. పర్యవసానంగా ఉన్నత విద్యను అందుకోవటం నిరుపేద వర్గాలకు కష్టమవుతోంది. దానికితోడు అధ్యాపక నియామకాల్లోనూ, మౌలిక సదుపాయాలు కల్పించటంలోనూ ప్రభుత్వాలనుంచి మద్దతు కొరవడుతోంది. ఏతావాతా చాలా విశ్వవిద్యాలయాలు గత వైభవ చిహ్నాలుగా మిగిలాయి. ఇప్పుడు ఉన్నత శ్రేణి ర్యాంకులు పొందిన విద్యాసంస్థలకు దీటుగా ఇతర సంస్థలను కూడా తీర్చిదిద్దకపోతే, అన్ని వర్గాలకూ అందుబాటులోకి రాకపోతే ‘స్కిల్ ఇండియా’ వంటివి నినాదప్రాయమవుతాయని పాలకులు గుర్తించాలి. ఉన్నత విద్యను అందుకోవాలనుకునే పేద వర్గాల పిల్లలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ సదుపాయం కల్పిస్తోంది. ఈ విధానం కింద దేశంలోనే కాదు... అంతర్జాతీయ అగ్రశ్రేణి సంస్థల్లో సీటు సంపాదించుకునేవారికి సైతం భారీ మొత్తాల్లో ఫీజులు చెల్లించటానికి సిద్ధపడుతోంది. వారు చదువుకునే కాలంలో అయ్యే వ్యక్తిగత ఖర్చు కూడా భరిస్తోంది. ఈ మాదిరి విధానం ఇతర రాష్ట్రాల్లో లేదు. క్యూఎస్ ర్యాంకుల జాబితా ఇలాంటి అంశాలపై పాలకులు దృష్టి సారించేలా చేయగలిగితే, లోపాలను సరిదిద్దగలిగితే అది మన విద్యా, వైజ్ఞానిక రంగాలను అత్యున్నత స్థాయికి చేరుస్తుంది. -
ఎన్నికల బరిలో జెఎన్యూ విద్యార్థి సంఘం మాజీ నేత!
దేశంలో లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి బరిలో నిలిచే తమ అభ్యర్థుల జాబితాను వివిధ పార్టీలు విడుదల చేస్తున్నాయి. తాజాగా ప్రతిపక్ష కూటమి ఇండియా బ్లాక్‌లో భాగమైన సీపీఐ (ఎంఎల్) బీహార్‌లోని ఆరా, నలంద, కరకత్ స్థానాల అభ్యర్థులను ప్రకటించింది. వీటిలో నలంద టిక్కెట్‌ను 2013లో జేఎన్‌యూ స్టూడెంట్స్ యూనియన్ జనరల్ సెక్రటరీగా పనిచేసిన సందీప్ సౌరవ్ (36)కు కేటాయించింది. సందీప్ రాజకీయాల్లో చురుకుగా వ్యవహరించేందుకు 2017లో తాను చేస్తున్న హిందీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాన్ని వదిలివేశారు. 2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థిగా పాలిగంజ్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పాట్నా సమీపంలోని మానేర్‌లో నివాసం ఉంటున్న సౌరవ్ 2009లో జేఎన్‌యూలో పోస్ట్ గ్రాడ్యుయేషన్, 2014లో పీహెచ్డీ పూర్తి చేశారు. సౌరవ్ 2013 వరకు రెండుసార్లు ఆల్ ఇండియా స్టూడెంట్స్ యూనియన్ జాతీయ కార్యదర్శిగా ఉన్నారు. నలంద నుంచి ఎన్నికల బరిలోకి దిగిన ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను బీహార్ సీఎం నితీశ్ కుమార్ అవినీతి రాజకీయాలపై పోరాటం చేస్తానన్నారు. ఎన్డీఏ హయాంలో ప్రజాస్వామ్య విలువలపై దాడులు జరుగుతున్నాయని సందీప్ ఆందోళన వ్యక్తం చేశారు. -
జెఎన్యూ విద్యార్థి సంఘం అధ్యక్షునిగా ధనంజయ్
దేశరాజధాని ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఇటీవల జరిగిన స్టూడెంట్స్ యూనియన్ (జేఎన్‌యూఎస్‌యూ) ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో వామపక్ష కూటమి విజయం సాధించింది. ఆదివారం అర్థరాత్రి ప్రకటించిన ఫలితాల్లో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, జాయింట్ సెక్రటరీ పదవుల్లో వామపక్ష అభ్యర్థులు గెలుపొందారు. బీఏపీఎస్ఏ ప్రధాన కార్యదర్శి పదవిని దక్కించుకుంది. శుక్రవారం జరిగిన ఓటింగ్‌లో 73 శాతం ఓట్లు పోలయ్యాయి. జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్షుడిగా బీహార్‌కు చెందిన పీహెచ్డీ విద్యార్థి ధనంజయ్ విజయం సాధించారు. జెఎన్యూఎస్యూ సెంట్రల్ ప్యానెల్లో అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో ఎనిమిది మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో ధనంజయ్ విజయం సాధించారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) అభ్యర్థి ఉమేష్ చంద్ర అజ్మీరాపై ధనంజయ్ 922 ఓట్ల తేడాతో విజయం సాధించారు. కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు ధనంజయ్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ ఈస్తటిక్స్ లో పీహెచ్డీ చేస్తున్నారు. ఆయన బీహార్‌లోని గయ జిల్లాకు చెందిన విద్యార్థి. ధనంజయ్ 1996 తర్వాత జెఎన్యూ స్టూడెంట్స్ యూనియన్‌కి ఎన్నికైన మొదటి దళిత అధ్యక్షుడు. 1996లో బత్తిలాల్ బైరవ విజయం సాధించారు. ధనంజయ్ మీడియాతో మాట్లాడుతూ క్యాంపస్‌లో విద్యార్థినుల భద్రత, స్కాలర్షిప్ పెంపు, మౌలిక సదుపాయాలు మొదలైనవి తన ప్రధాన అజెండా అని పేర్కొన్నారు. #WATCH नवनिर्वाचित JNU अध्यक्ष धनंजय ने कहा, "...अगर कोई है जिसने फीस वृद्धि के खिलाफ लड़ाई लड़ी है तो वह वामपंथी है। यह वामपंथ ही है जिसने सभी के लिए छात्रावास सुनिश्चित किया है और इसके लिए छात्रों ने हम पर अपना भरोसा दिखाया है..." pic.twitter.com/Wjo3X6OHac — ANI_HindiNews (@AHindinews) March 25, 2024 -
ఎన్నికలకు ముందే జేఎన్‌యూలో ఘర్షణ.. పలువురికి గాయాలు!
దేశరాజధాని ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) క్యాంపస్‌లో శుక్రవారం అర్థరాత్రి విద్యార్థుల మధ్య మరోసారి ఘర్షణలు చోటుచేసుకున్నాయి. విద్యార్థి సంఘాల ఎన్నికల నిర్వహణపై జరిగిన సమావేశంలో ఆర్ఎస్ఎస్ అనుబంధ ఏబీవీపీ, వామపక్ష విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో తమ సభ్యుల్లో కొందరికి గాయాలయ్యాయని ఇరువర్గాలు పేర్కొన్నాయి. వార్తా సంస్థ పీటీఐ తెలిపిన ప్రకారం ఈ ఘర్షణపై జేఎన్‌యూ పాలకవర్గం నుంచి ఇంతవరకూ స్పందన లేదు. 2024 జేఎన్‌యూఎస్‌యూ ఎన్నికల కమిషన్ సభ్యులను ఎన్నుకోవడానికి క్యాంపస్‌లో విద్యార్థి సంఘాలు పరస్పరం ఘర్షణ పడ్డాయి. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) సభ్యులు వేదికపైకి ఎక్కి కౌన్సిల్ సభ్యులు, స్పీకర్లతో గొడవకు దిగి, యూజీబీఎంకి అంతరాయం కలిగించారని లెఫ్ట్-అనుబంధ డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ (డీఎస్ఎఫ్) ఆరోపించింది. సోషల్ మీడియాలో రెండు గ్రూపులు షేర్ చేసిన వీడియోలలో, ఏబీవీపీ, జేఎన్‌యూఎస్‌యూ సభ్యులు నినాదాలుచేస్తూ వాదించుకోవడాన్ని చూడవచ్చు. పరిస్థితిని చక్కదిద్దేందుకు విశ్వవిద్యాలయ భద్రతా సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. -
స్ఫూర్తి: ముంబై మురికివాడ నుంచి... యూఎస్ యూనివర్శిటీ వరకు!
దురదృష్టం ఒక ద్వారం మూసిపెడితే, కష్టపడేతత్వం పదిద్వారాలను తెరిచి ఉంచుతుంది... అంటారు. ముంబై పేవ్‌మెంట్స్‌పై పూలు అమ్మిన సరిత మాలికి ‘యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా’లో పీహెచ్‌డి చేసే అవకాశం లభించింది. ఈ విజయానికి కారణం ఆమె ఇష్టపడే కష్టపడేతత్వం... సరిత మాలి తల్లిదండ్రులు ఉత్తర్‌ప్రదేశ్‌లోని మూరుమూల ప్రాంతం నుంచి పొట్ట చేతపట్టుకొని మహానగరం ముంబైకి వచ్చారు. అక్కడి ఘడ్కోపర్ మురికివాడలో పుట్టి పెరిగింది సరిత.స్థానిక మున్సిపల్ స్కూల్లో పదవతరగతి చదువుకుంది. ఆ తరువాత కాలేజి చదువు కొనసాగిస్తూనే ట్యూషన్స్ చెప్పడం మొదలుపెట్టింది. ట్యూషన్స్ చెప్పగా వచ్చిన డబ్బులను జాగ్రత్తగా దాచుకునేది. పై చదువులకు అవి ఎంతో కొంత సహాయపడ్డాయి. ఒకసారి సెలవులలో అమ్మమ్మ వాళ్ల ఊరికి వెళ్లినప్పుడు, బంధువులలో ఒకరు దిల్లీలోని ‘జేఎన్‌యూ’ గురించి గొప్పగా చెప్పారు. ఆ సమయంలోనే అనుకుంది...ఆ యూనివర్శిటీలో ఎలాగైనా చేరాలని! ఆ ఉత్సాహంపై నీళ్లుపోసే మాటలు ఎదురయ్యాయి. ‘జేఎన్‌యూలో అడ్మిషన్ దొరకడం అంతేలికైన విషయం కాదు’ ‘తెలివైన విద్యార్థులు మాత్రమే అక్కడ చదువుకుంటారు’... మొదలైనవి. ఆ తెలివైన విద్యార్థి తాను ఎందుకు కాకూడదు? అని మనసులో గట్టిగా అనుకుంది సరిత. బీఏ మొదటి సంవత్సరం నుంచే ప్రవేశపరీక్షకు ప్రిపేర్ కావడం మొదలుపెట్టింది! ఆమె కష్టం వృథా పోలేదు. ప్రసిద్ధమైన యూనివర్శిటీలో ఎం.ఏ హిందీలో ఆమెకు సీటు వచ్చింది. ‘నేను మరిచిపోలేని రోజు, నా జీవితాన్ని మలుపు తిప్పిన రోజు అది. జేఎన్‌యూలో విస్తృతమైన∙ప్రపంచాన్ని చూశాను. ఎన్నో విషయాల గురించి తెలుసుకోగలిగాను’ అంటుంది సరిత. యూనివర్శిటీలో తనతో ఒక్కొక్కరూ ఒక్కోరకంగా వ్యవహరించేవారు. పేదకుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన యంగెస్ట్ రిసెర్చ్ స్కాలర్‌గా తనను స్ఫూర్తిగా తీసుకున్నవారు కొందరైతే,‘సాఫ్ట్వేర్ సైడ్ వెళ్లకుండా ఈ సాహిత్యం, కవిత్వం వల్ల ఉపయోగం ఏమిటి?’ అని తక్కువ చేసి మాట్లాడిన వారు ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ, తన మాటల్లో చెప్పాలంటే ‘జేఎన్‌యూ’ సరితకు మరోప్రపంచాన్ని చూపింది. జేఎన్‌యూలో ఎంఫిల్ పూర్తి చేసిన సరితకు తాజాగా ‘యూనివర్శిటి ఆఫ్ కాలిఫోర్నియా’లో పీహెచ్‌డి(హిందీ సాహిత్యం) చేసే అవకాశం లభించింది. ‘భక్తి ఉద్యమకాలంలో అట్టడుగు వర్గ మహిళల సాహిత్యం’ అనేది ఆమె పీహెచ్‌డి అంశం. ‘నాకు చిన్నప్పటి నుంచి చదువు అంటే ఎంతో ఇష్టం. అయితే పేదరికం వల్ల ఎన్నోసార్లు చదువు ఆపేయాల్సిన పరిస్థితి వచ్చినా నేను వెనక్కి తగ్గలేదు. ఏదో రకంగా కష్టపడి చదువుకున్నాను. నాకు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయుల సహకారం మరవలేనిది. భవిష్యత్‌లో పేదపిల్లలకు నా వంతుగా సహాయపడాలనుకుంటున్నాను’ అంటుంది 28 సంవత్సరాల సరిత మాలి. -
జేఎన్‌యూ తొలి మహిళా వీసీగా తెలుగు బిడ్డ
న్యూఢిల్లీ/సాక్షి, తెనాలి: దేశ రాజధాని ఢిల్లీలోని ప్రతిష్టాత్మక జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ) నూతన ఉపకులపతి(వీసీ)గా తెలుగు బిడ్డ డాక్టర్ శాంతిశ్రీ ధూళిపూడి పండిట్(59) నియమితులయ్యారు. జేఎన్‌యూ తొలి మహిళా వీసీగా ఆమె రికార్డుకెక్కారు. శాంతిశ్రీ నియామకానికి రాష్ట్రపతి, జేఎన్‌యూ విజిటర్ రామ్‌నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేసినట్లు కేంద్ర విద్యాశాఖ వర్గాలు సోమవారం వెల్లడించారు. మహారాష్ట్రలోని సావిత్రిభా యి ఫూలే పుణే యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న శాంతిశ్రీ జేఎన్‌యూ వీసీ పదవిలో ఐదేళ్లపాటు కొనసాగుతారు. ఆమె గతంలో జేఎన్‌యూ నుంచి ఎంఫిల్, పీహెచ్డీ అందుకున్నారు. ఇప్పుడు అదే వర్సిటీకి ఉపకులపతిగా నియమితులు కావడం గమనార్హం. మరో తెలుగు వ్యక్తి స్థానంలోకి ఆమె వస్తుండడం మరో విశేషం. ఐదేళ్లు జేఎన్‌యూ వీసీగా సేవలందించిన తెలంగాణవాసి ఎం.జగదీష్ కుమార్ గత ఏడాది ఆఖర్లో పదవీ విరమణ పొందారు. అప్పటి నుంచి యాక్టింగ్ వీసీగా వ్యవహరిస్తున్నారు. ఆయన గతవారమే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) చైర్మన్‌గా నియమితులైన సంగతి తెలిసిందే. నూతన వీసీగా బాధ్యతలు చేపట్టనున్న శాంతిశ్రీ ధూళిపూడిని జగదీష్ కుమార్ ప్రశంసించారు. నూతన వీసీగా సోమవారమే ఆమెకు బాధ్యతలు అప్పగించానని వెల్లడించారు. విధి నిర్వహణలో విజయం సాధించాలని ఆకాంక్షించారు. మెడిసిన్ కాదనుకొని హయ్యర్ సెకండరీలో మంచి మార్కులతో శాంతిశ్రీ ఉతీర్ణురాలయ్యాక, సైన్స్‌లో తనకు వచ్చిన మార్కులతో మెడిసిన్‌లో సీటు వచ్చేది. అయినాసరే, ఆమె చరిత్ర, పొలిటికల్ సైన్స్ చదవాలని నిర్ణయించుకున్నారు. శాంతిశ్రీ ధూళిపూడి పండిట్ 1962 జూలై 15న రష్యాలోని (అప్పటి యూఎస్ఎస్ఆర్) సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జన్మించారు. ఆమె తండ్రి డాక్టర్ ధూళిపూడి ఆంజనేయులు రచయిత, జర్నలిస్టు. శాంతిశ్రీ తల్లి మూలమూడి ఆదిలక్ష్మి రష్యాలోని లెనిన్గ్రాడ్ ఓరియంటల్ ఫ్యాకల్టీ డిపార్టుమెంట్లో తమిళం, తెలుగు భాషల ప్రొఫెసర్‌గా పనిచేశారు. ► శాంతిశ్రీ మద్రాసులోని ప్రెసిడెన్సీ కాలేజీ నుంచి 1983లో హిస్టరీ, సోషల్ సైకాలజీలో బీఏ డిగ్రీ అందుకున్నారు. ► 1985లో మద్రాసులోని ప్రెసిడెన్సీ కాలేజీలో పొలిటికల్ సైన్స్‌లో పీజీ(ఎంఏ) డిగ్రీ పొందారు. ► 1990లో జేఎన్యూకు చెందిన స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ నుంచి ‘పార్లమెంట్, ఫారిన్ పాలసీ ఇన్ ఇండియా–ద నెహ్రూ ఇయర్స్’పై పీహెచ్డీ డాక్టరేట్ అందుకున్నారు. ► ఉన్నత విద్యావంతురాలైన శాంతిశ్రీ ధూళిపూడి ఇంగ్లిష్‌తోపాటు తెలుగు, తమిళం, మరాఠీ, హిందీ, సంస్కృత భాషల్లో ప్రావీణ్యం సంపాదించారు. కన్నడం, మలయాళం, కొంకణీ భాషలను అర్థం చేసుకోగలరు. ఎన్నెన్నో పురస్కారాలు.. ► శాంతిశ్రీ పలు అంశాల్లో 200కు పైగా జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు. ► మద్రాసు పెసిడెన్సీ కాలేజీ నుంచి 1980–81, 1981–82, 1982–83, 1983–84, 1984–85లో ఎల్ఫిన్‌స్టోన్ ప్రైజ్. ఈ ప్రైజ్‌ను ఎక్కువసార్లు (ఐదుసార్లు) గెలుచుకున్న రికార్డు ఇప్పటికీ శాంతిశ్రీ పేరిటే ఉంది. ► 1998లో అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్–మాడిసన్‌కు చెందిన సెంటర్ ఫర్ సౌత్ ఆసియన్ డీస్ నుంచి ఫెలోషిప్. ఆస్ట్రియా నుంచి మరో ఫెలోషిప్. విద్యా రంగానికి సేవలు ► 1988లో గోవా యూనివర్సిటీలో బోధనా వృత్తిని ఆరంభించారు. ► 2001 నుంచి 2006 దాకా యూనివర్సిటీ సెనేట్ సభ్యురాలిగా, 2001 నుంచి 2007 వరకూ ఇంటర్నేషనల్ సెంటర్ డైరెక్టర్‌గా, 2001 నుంచి 2006 దాకా యూనివర్సిటీ మేనేజ్మెంట్ కౌన్సిల్ సభ్యురాలిగా బాధ్యతలు. ► చైనాలోని హూనన్ వర్సిటీలో ఆసియన్ అండ్ యూరోపియన్ స్టడీస్ రిసోర్స్‌పర్సన్‌గా విధులు. ► యూజీసీ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్(ఐసీఎస్ఎస్ఆర్) సభ్యురాలిగా పని చేశారు. ఆర్ఎస్ఎస్ మద్దతుదారు! శాంతిశ్రీ ధూళిపూడి పండిట్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)కు బలమైన మద్దతుదారు అని తెలుస్తోంది. హిందుత్వవాదులకు అనుకూలంగా గతంలో ఆమె చేసిన ట్వీట్లను పలువురు ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు. వామపక్షవాదులను, ఉదారవాదులను జిహాదీలుగా ఆమె అభివర్ణించారు. మహాత్మాగాంధీ హత్య పట్ల విచారం వ్యక్తం చేస్తూనే నాథూరామ్ గాడ్సేకు సానుభూతి తెలిపారు. ఇటలీలో పుట్టిన సోనియా గాంధీకి కాదు, బీజేపీ ఓటు వేయాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేసిన పోరాటాన్ని, షహీన్‌బాగ్‌లో సీఏఏ వ్యతిరేక ఉద్యమాన్ని శాంతిశ్రీ తప్పుపట్టారు. ఆమె ట్వీట్లను విద్యార్థులు, జర్నలిస్టులు విస్తృతంగా షేర్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శాంతిశ్రీ తన ట్విట్టర్ ఖాతాను తొలగించినట్లు సమాచారం. 2011లో పుణే యూనివర్సిటీలో విద్యార్థుల ప్రవేశాల విషయంలో ఆమె అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. వీసీ పోస్టు కోసం శాంతిశ్రీతోపాటు ప్రొఫెసర్ గుల్షన్ సచ్‌దేవా, అవినాశ్‌చంద్ర పాండే పేర్లు పరిశీలనకు వచ్చాయి. భావజాలం రీత్యా శాంతిశ్రీ వైపే ప్రభుత్వం మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. గుంటూరు జిల్లా మూలాలు శాంతిశ్రీ తండ్రి ధూళిపూడి ఆంజనేయులు స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని అమృతలూరు మండలంలోని యలవర్రు. ఆయన 1924 జనవరి 10న జన్మించారు. ఉన్నత విద్య అభ్యసించి, పాత్రికేయ రంగంలో స్థిరపడ్డారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్, హిందూ పత్రికల్లో సబ్ఎడిటర్గా చేశారు. ఆకాశవాణి సొంత పత్రిక సంపాదకులుగా పనిచేశారు. హైదరాబాద్‌లో కేంద్ర ప్రభు త్వ సమాచార శాఖలో సమాచార అధికారిగా సేవలందించారు. ఇంగ్లిష్ త్రైమాసిక పత్రిక త్రివేణికి సహసంపాదకులుగా ఉన్నారు. (చదవండి: ప్రభుత్వాలనే కూల్చిన పంచ్ డైలాగులు) (క్లిక్: ఇలాంటి ఆధార్ కార్డును ఎప్పుడైనా చూశారా? సోషల్ మీడియా ఫిదా) -
యూజీసీ చైర్మన్‌గా తెలుగు తేజం జగదీశ్
న్యూఢిల్లీ/సాక్షి, నల్లగొండ: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ)గా ప్రొఫెసర్ మామిడాల జగదీశ్‌కుమార్ నియమితులయ్యారు. ఐదేళ్లపాటు ఈ పదవిలో ఆయన కొనసాగనున్నారు. కమిషన్‌కు ఛైర్మన్‌గా పనిచేసిన ప్రొఫెసర్ డిపి సింగ్ పదవీకాలం ముగియడంతో డిసెంబర్ 7న పదవీ విరమణ చేశారు. అప్పటినుంచి ఖాళీగా ఉన్న పోస్టుకు ప్రకటన ఇవ్వడంతో, 55 మంది దరఖాస్తు చేసుకోగా జగదీశ్ ఎంపికయ్యారు. యూజీసీకి చైర్మన్‌గా నియమితులైన మూడో తెలుగు వ్యక్తి జగదీశ్ కుమార్. 1961లో డాక్టర్ వాసిరెడ్డి శ్రీకృష్ణ, 1991 నుంచి 1995 వరకు జి.రామిరెడ్డి యూజీసీ చైర్మన్లుగా పనిచేయగా, ఇప్పుడు ప్రొఫెసర్ జగదీశ్ కుమార్ నియమితులయ్యారు. 60 ఏళ్ల జగదీశ్ కుమార్ ప్రస్తుతం జేఎన్‌యూ వైస్‌చాన్స్‌లర్‌గా పనిచేస్తున్నారు. వీసీగా పదవీకాలం గతేడాదే ముగిసినా ఆయనను కొనసాగించారు. జేఎన్‌యూలో ఆయన వీసీగా ఉన్నప్పుడు 2016లో విద్యార్థులపై దేశద్రోహం కేసులు నమోదు కావడం, అఫ్జల్ గురు ఉరికి వ్యతిరేకంగా విద్యార్థులు నిర్వహించదలిచిన కార్యక్రమాన్ని వీసీ వద్దనడం, విద్యార్థులు వీసీ కార్యాలయాలనికి తాళాలేయడం, 2019లో జరిగిన స్నాతకోత్సవ వేదికపై దాదాపు ఆరు గంటలపాటు మానవవనరుల శాఖ మంత్రిని నిర్బంధించడం వంటి అనేక వివాదాస్పద సంఘటనలు జరిగాయి. నల్లగొండ వాసి... తెలుగువాడైన జగదీశ్ కుమార్ స్వస్థలం నల్లగొండ జిల్లా తిప్పర్తిమండలం మామిడాల గ్రామం. పాఠశాల విద్యను స్వగ్రామంలో, ఏడవ తరగతి నుంచి ఇంటర్ వరకు మిర్యాలగూడలో చదివారు. డిగ్రీతో పాటు ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్ హైదరాబాద్‌లో చదివారు. ఆ తరువాత ఐఐటీ మద్రాసులో ఎంఎస్, పీహెచ్డీ పూర్తి చేశారు. ఆ తరువాత పోస్ట్ డాక్టో్టరల్ రీసెర్చ్ కోసం కెనడా వెళ్లి 1994లో స్వదేశానికి తిరిగి వచ్చారు. 1995లో ఢిల్లీ ఐఐటీ ప్రొఫెసర్‌గా ఉద్యోగంలో చేరారు. 2013లో ఐఐటీ ఢిల్లీ నుంచి ‘అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ టీచింగ్’ అందుకున్నారు. ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్‌లో నిష్ణాతుడైన ఆయన 2016 ఢిల్లీ జేఎన్‌యూ వైస్ చాన్స్‌లర్‌గా నియమితులయ్యారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ సాంçస్కృతిక మంత్రిత్వ శాఖలోని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియమ్స్ పాలకమండలి చైర్మన్‌గా, నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా, యూజీసీ, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) సభ్యునిగా ఉన్నారు. ఇండియన్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్, ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీర్స్ ఫెలో అందుకున్నారు. సెమీకండక్టర్ డివైజ్ డిజైన్, మోడలింగ్ రంగంలో విశేష కృషికి గాను ఆయనకు 29వ ఐఈటీఈ రామ్‌లాల్ వాధ్వా గోల్డ్ మెడల్ లభించింది. భారతదేశ ఎలక్ట్రానిక్స్ – సెమీకండక్టర్ అసోసియేషన్ అందించే మొట్టమొదటి ఐఎస్ఏ అండ్ వీఎస్‌ఐ టెక్నోమెంటర్ అవార్డును కూడా అందుకున్నారు. ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా 2008 ఐబీఎం ఫ్యాకల్టీ అవార్డును పొందారు. నూతన బాధ్యతలు చాలెంజింగ్‌గా ఉంటాయని భావిస్తున్నా. నూతన జాతీయ విద్యా విధానం ఎంత తొందరగా అమల్లోకి వస్తే దేశానికి అంత మేలు జరుగుతుంది. ఇదే విషయమై త్వరలో అన్ని విశ్వవిద్యాలయాల వీసీలతో సమావేశమవుతాను. మల్టీడిసిప్లినరీ కోర్సుల విషయమై చర్చిస్తాం. ప్రభుత్వం ఇటీవలే బడ్జెట్లో డిజిటల్ యూనివర్సిటీని ప్రకటించింది. విద్యను మరింత సులభతరం చేసే డిజిటల్ సాంకేతికత కూడా ప్రాధాన్య జాబితాలో ఉంటుంది. -
భారతీయులకు కొత్త సమస్య.. కారణాలేంటి?
ప్రపంచ వ్యాప్తంగా ప్రజల సరాసరి ఎత్తు పెరుగుతున్న తరుణంలో.. భారతీయుల ఎత్తు మాత్రం తగ్గుముఖం పట్టడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా వెల్లడైన నివేదికలోని అంశాలపై పరిశోధకుల సమీక్షలు, కారణాల అన్వేషణ మొదలైంది. భారతీయుల సరాసరి ఎత్తు తగ్గుతోందని తెలిపింది. JNU’s Centre of Social Medicine and Community Health నిర్వహించిన సర్వేలో.. 1998 నుంచి 2015 వరకు భారతీయ వయోజనుల ఎత్తుపై కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 1998-99లో భారతీయుల ఎత్తు కొంచెం పెరిగిందని, అయితే 2005-06 నుంచి 2015-16 మధ్య కాలంలో గణనీయమైన స్థాయిలో ఎత్తు తగ్గిందని వెల్లడించింది. కారణాలపై.. ఇది చాలా ఆందోళన కలిగించే అంశమని, దీనిపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని సూచించింది. భారతీయ జనాభాలో వివిధ సమూహాల మధ్య ఎత్తు అంతరాయంపై కూడా అధ్యయనం జరగాలని చెప్పింది. జన్యుపరమైన అంశాలే కాకుండా, వాటికి సంబంధం లేని కారకాలు కూడా ఎత్తుపై ప్రభావం చూపుతున్నాయని, ఇది చాలా ఆందోళన కలిగించే విషయమని తెలిపింది. జీవన విధానం, పౌష్టికాహారం, సామాజిక, ఆర్థిక తదితర అంశాలు ఉన్నాయని చెప్పింది. కాలుష్యం కూడా ఓ కారణమై ఉంటుందా? అనే అంశాన్ని సైతం పరిశీలిస్తున్నారు. భారత్ లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న వయోజనుల్లో సరాసరి ఎత్తులో తేడాలు ఉన్నాయని చెప్పింది. 15 నుంచి 25 ఏజ్ గ్రూపులో ఉన్న వారిలో ఎత్తు తగ్గుతోందని తెలిపింది. ఈ ఏజ్ గ్రూపులోని మహిళల సరాసరి ఎత్తు 0.42 సెంటీమీటర్లు, పురుషుల్లో 1.10 సెంటీమీటర్ల మేర సరాసరి ఎత్తు తగ్గించదని వెల్లడించింది. ముఖ్యంగా గిరిజన మహిళల్లో ఈ తగ్గుదల మరింత ఎక్కువగా ఉన్నట్లు గమనించినట్లు స్టడీ వెల్లడించింది. చదవండి: కంపెనీ బోర్డుల్లో 'మహిళలు తక్కువే' -
జేఎన్‌యూ విద్యార్థి నేతల విడుదల
న్యూఢిల్లీ: ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసులో అరెస్టై గత సంవత్సర కాలంగా జైళ్లో ఉన్న జేఎన్‌యూ విద్యార్థులు నటాషా నర్వాల్, దేవాంగన కలీతా, జామియా మిలియా విద్యార్థి ఆసిఫ్ ఇక్బాల్ తాన్హా గురువారం బెయిల్‌పై తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. తక్షణమే వారిని విడుదల చేయాలని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు వారిని విడుదల చేశారు. రెండు రోజుల క్రితమే హైకోర్టు వారిద్దరితో పాటు ఆసిఫ్ తాన్హాకు బెయిల్ మంజూరు చేసింది. వారి పూచీకత్తులను పరిశీలించడంలో జాప్యం జరగడంతో వారిని విడుదల చేయడం ఆలస్యమైంది. ఈ ముగ్గురు విద్యార్థి నేతలను గత సంవత్సరం మేలో ‘చట్ట వ్యతిరేక కార్యకలాపాల(నిరోధక) చట్టం( యూఏపీఏ– ఉపా)’ కింద అరెస్ట్ చేశారు. వెరిఫికేషన్‌లో జాప్యం వారి విడుదలను నిరోధించడానికి సరైన కారణం కాదని గురువారం నాటి ఆదేశాల్లో హైకోర్టు మండిపడింది. బెయిల్ మంజూరు చేస్తూ మంగళవారం ఢిల్లీ హైకోర్టు నుంచి ఆదేశాలు వచ్చిన తరువాత ముగ్గురు నిందితులు తమను విడుదల చేస్తూ ఆదేశాలివ్వాలని కోరుతూ విచారణ కోర్టును ఆశ్రయించారు. అయితే, వారి పిటిషన్‌ను విచారణ కోర్టు గురువారానికి వాయిదా వేయడంతో వారు మళ్లీ హైకోర్టుకు వెళ్లారు. దాంతో హైకోర్టు వారిని తక్షణమే విడుదల చేయాలని ఆదేశించింది. విచారణ కోర్టు తీరును తప్పుబడుతూ ఈ అంశాన్ని వెంటనే, వేగంగా చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. 2020 ఫిబ్రవరిలో ఢిల్లీలో జరిగిన అల్లర్లకు కుట్ర చేశారన్న ఆరోపణలపై వారిని అరెస్ట్ చేశారు. ఆ అల్లర్లలో 53 మంది చనిపోగా, 200 మందికి పైగా గాయపడ్డారు. ఆ ముగ్గురు విద్యార్థి నేతలకు మంగళవారం బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వ్యతిరేకతను అణచాలన్న అత్యుత్సాహంతో నిరసన తెలిపే హక్కుకు, ఉగ్ర చర్యలకు మధ్య ఉన్న రేఖను ప్రభుత్వం విస్మరించిందని హైకోర్టు నాడు పేర్కొంది. కాగా, ఆ విద్యార్థినేతలకు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాలు చేస్తూ ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. చదవండి: దేశద్రోహం కేసులో ఆయేషాకు బెయిల్ -
రాష్ట్రపతి భవన్ తెరచుకునేది ఎప్పుడంటే..?
సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్–19 కారణంగా గత 11 నెలలుగా మూసివేతకు గురైన రాష్ట్రపతి భవన్ ఈ నెల 6 నుంచి తెరచుకోనుందని అధికారులు తెలిపారు. ప్రభుత్వ సెలవుదినాలు కాకుండా శనివారం, ఆదివారం రోజుల్లో రాష్టపతి భవన్ తెరచే ఉంటుందని స్టేట్మెంట్ ద్వారా చెప్పారు. భౌతిక దూరాన్ని పాటించేందుకుగానూ గరిష్టంగా స్లాట్‌కు 25 మంది చొప్పున మూడు స్లాట్లలో (ఉదయం 10:30, మధ్యాహ్నం 12:30, 2:30) పర్యాటకులను అనుమతించనున్నట్లు చెప్పింది. లోపలికి అనుమతించేందుకు ఒక్కొక్కరికి రూ. 50 చెల్లించాల్సి ఉంటుంది. 8 నుంచి తెరచుకోనున్న జేఎన్‌యూ కరోనా కారణంగా మూతబడిన జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఈ నెల 8 నుంచి తెరచుకోనుందని జేఎన్‌యూ సోమవారం ప్రకటించింది. 4వ సెమిస్టర్ చదువుతున్న ఎంఫిల్, ఎంటెక్ విద్యార్థులు, ఎంబీఏ చివరి సెమిస్టర్‌విద్యార్థులు ఈ నెల 8 నుంచి కాలేజీకి, హాస్టల్‌కు రావచ్చని ప్రకటించింది. జూన్ 30లోగా థీసిస్‌ను సమర్పించాలని చెప్పింది. చదవండి: వింత సంఘటన: దానికదే కదలిన వాహనం ‘డీజిల్‌కి డబ్బులివ్వు.. బిడ్డను వెతుకుతాం’ -
సుప్రీంకోర్టులో త్వరలో ప్రత్యక్ష విచారణ
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ విస్తరణ కారణంగా నిలిపివేసిన కేసుల ఫిజికల్ హియరింగ్ (వీడియోలో కాకుండా కోర్టురూములో న్యాయమూర్తులు, న్యాయవాదుల సమక్షంలో దావా జరపడం) ప్రక్రియను త్వరలో హైబ్రిడ్ పద్ధతిలో ఆరంభిస్తామని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డె చెప్పినట్లు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. కరోనా సంక్షోభం సమసిపోతున్నందున ఫిజికల్ హియరింగ్స్ ఆరంభించాలని పలువురు న్యాయవాదులు డిమాండ చేస్తున్న తరుణంలో బార్ కౌన్సిల్ సభ్యులతో చీఫ్ జస్టిస్, సొలిసిటర్ జనరల్ సమావేశమై ఈ అంశాన్ని చర్చించారు. గత మార్చి నుంచి సుప్రీంకోర్టులో వీడియోకాన్ఫరెన్స్ ద్వారానే కేసుల హియరింగ్ నిర్వహిస్తున్నారు. అయితే ఫిజికల్ హియరింగ్‌కు డిమాండ్ పెరుగుతుండడంతో త్వరలో ఈ ప్రక్రియను హైబ్రిడ్ పద్ధతిలో(కొన్ని కేసులు వీడియో కాన్ఫరెన్సు ద్వారా, కొన్నింటిని భౌతికంగా) నిర్వహించేందుకు చీఫ్ జస్టిస్ చెప్పారని బీసీఐ చైర్మన్ మనన్ కుమార్ చెప్పారు. అయితే అంతకుముందు మెడికల్, టెక్నికల్ సమస్యలపై రిజిస్ట్రీతో చర్చించి నిర్ణయం తీసుకుంటారన్నారు. సాంకేతిక సమస్యలను పరిశీలించి నిర్ణయం చెప్పాలని సెక్రటరీ జనరల్‌ను చీఫ్ జస్టిస్ ఆదేశించారని, కుదిరితే మార్చి మొదటివారం నుంచి ఫిజికల్ హియరింగ్‌లు నిర్వహించ వచ్చని తెలిపారు. కరోనా సమస్య పూర్తిగా అంతమయ్యేవరకు హైబ్రిడ్ పద్ధతిలో హియరింగ్స్ జరపుతారని, ఢిల్లీలో ఉన్న లాయర్లకు మాత్రమే వీడియో హియరింగ్ సౌకర్యం కల్పిస్తారని తెలిపారు. మరోవైపు తక్షణమే ఫిజికల్ హియరింగ్స్ ఆరంభించాలని కొందరు న్యాయవాదులు సుప్రీంకోర్టు ప్రాంగణంలో నిరసన చేపట్టారు. న్యాయవాదుల సంఘాల కోరిక మేరకు లాయర్స్ ఛాంబర్‌ను ఉదయం 9 నుంచి సాయంత్రం 7 వరకు తెరిచిఉంచేందుకు చీఫ్ జస్టిస్ అంగీకరించారు. 6 నుంచి తెరచుకోనున్న రాష్ట్రపతి భవన్ కోవిడ్-19 కారణంగా గత 11 నెలలుగా మూసివేతకు గురైన రాష్ట్రపతి భవన్ ఈ నెల 6 నుంచి తెరచుకోనుందని అధికారులు సోమవారం తెలిపారు. ప్రభుత్వ సెలవుదినాలు కాకుండా శనివారం, ఆదివారం రోజుల్లో రాష్టపతి భవన్ తెరచే ఉంటుందని స్టేట్మెంట్ ద్వారా చెప్పారు. భౌతిక దూరాన్ని పాటించేందుకుగానూ గరిష్టంగా స్లాట్‌కు 25 మంది చొప్పున మూడు స్లాట్లలో (ఉదయం 10:30, మధ్యాహ్నం 12:30, 2:30) పర్యాటకు లను అనుమతించనున్నట్లు చెప్పింది. లోపలికి అనుమతించేందుకు ఒక్కొక్కరికి రూ. 50 చెల్లించాల్సి ఉంటుంది. 8 నుంచి తెరచుకోనున్న జేఎన్‌యూ కరోనా కారణంగా మూతబడిన జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఈ నెల 8 నుంచి తెరచుకోనుందని జేఎన్‌యూ సోమవారం ప్రకటించింది. 4వ సెమిస్టర్ చదువుతున్న ఎంఫిల్, ఎంటెక్ విద్యార్థులు, ఎంబీఏ చివరి సెమిస్టర్‌విద్యార్థులు ఈ నెల 8 నుంచి కాలేజీకి, హాస్టల్‌కు రావచ్చని ప్రకటించింది. జూన్ 30లోగా థీసిస్‌ను సమర్పించాలని చెప్పింది. -
డ్యాషింగ్ అడ్వైజర్
ఐక్యరాజ్య సమితి అంటేనే హై లెవల్. అందులోని ‘హై లెవల్ అడ్వైజరీ బోర్డ్’ (హెచ్.ఎల్.ఎ.బి.) అంటే ఐక్యరాజ్య సమితి కన్నా హై లెవల్! సమితికి ఏ విషయంలోనైనా మార్గదర్శనం చేసేందుకు ఆ బోర్డులోని సభ్యులు తగిన సలహాలు, సూచనలు ఇవ్వగలిగిన మేధావులు, విద్యావంతులు అయి ఉంటారు. ఆ టీమ్‌లో తాజాగా భారతదేశ ఆర్థికవేత్త జయతీ ఘోష్‌కు స్థానం లభించింది! కొన్నాళ్లుగా యూఎస్‌లోనే మసాచుసెట్స్‌లో ఉంటున్నారు జయతి. ఇప్పుడిక సలహా బృందంలో సభ్యురాలు అయ్యారు అట్నుంచటు విమానంలో అరగంట ప్రయాణదూరంలో ఉండే న్యూయార్క్‌లోని సమితి ప్రధాన కార్యాలయానికి త్వరలోనే ఆమె తన బుక్స్ సర్దుకుని వెళ్లబోతున్నారు. ఆ బుక్స్ దేశాల ఆర్థిక వ్యవస్థల్ని అర్థం చేసుకోడానికి జయతి అధ్యయనం చేస్తూ వస్తున్నవి మాత్రమే కాదు, జయతి రూపొందించిన వివిధ దేశాల అభివృద్ధి ప్రణాళికల సమగ్ర నివేదికలు కూడా. ప్రభుత్వాలకు అవి పరిష్కార సూచికలు. ప్రస్తుతం ఆమ్‌హర్ట్స్‌లోని ‘యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్’లో ఎకమిక్స్ ప్రొఫెసర్‌గా ఉన్నారు జయతి ఘోష్. అక్కడికి వెళ్లడానికి ముందు ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జె.ఎన్.యు.) లో 35 ఏళ్ల పాటు ఆర్థికశాస్త్రాచార్యులుగా ఆమె పని చేశారు. ఇప్పుడు సమితి సలహా బృందానికి ఆమె పేరును ప్రతిపాదించినది వేరెవరో కాదు. ఐక్యరాజ్యసమితిలోని ‘డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనమిక్స్ అండ్ సోషల్ అఫైర్స్’! జయతికి హ్యూమనిస్ట్ ర్యాడికల్ అనే పేరు ఉన్నప్పటికీ ఆ ర్యాడికల్ అనే పేరును పక్కన పెట్టి, ఆమెలోని హ్యూమనిస్టుని మాత్రం సమితి తీసుకున్నట్లుంది. లేదా, దేశాల ఆర్థికస్థితిని మెరుగు పరిచి సామాజిక జీవనాలను సరళతరం చేయడానికి జయంతి సూచించే కఠినతరమైన ఆర్థిక వ్యూహాలను అనుసరించాలని నిశ్చయించుకుని ఉండొచ్చు. 2030 నాటికి ప్రపంచంలోని పేద దేశాలన్నీ శుభ్రమైన తిండి, బట్ట కలిగి ఉండాలని సమితి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుంది. అందుకోసం రెండేళ్ల క్రితం ఎకనమిక్స్, సోషల్ అఫైర్స్ విభాగం ‘యు.ఎన్. హై–లెవల్ అడ్వయిజరీ బోర్డు’ను ఏర్పాటు చేసుకుంది. ఆ బోర్డు కాల పరిమితి రెండేళ్లు. అది పూర్తవడంతో ఇప్పుడు రెండో అడ్వయిజరీ బోర్టు అవసరమైంది. ఇందులో ఆర్థిక, సామాజిక అంశాలలో అంతర్జాతీయంగా నిపుణులు, అధ్యయనవేత్తలైన పలు రంగాల ప్రసిద్ధులు మొత్తం 20 మంది సభ్యులుగా ఉంటారు. వారిలో 65 ఏళ్ల జయతీ ఘోష్ ఒకరు. ∙∙ జె.ఎన్.యు.లో చదివి, జె.ఎన్.యు.లోనే పాఠాలు చెప్పారు జయతి. ఎకనమిక్స్‌లో ఎం.ఎ., ఎంఫిల్ ఆమె. పిహెచ్.డిని ఇంగ్లండ్‌లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చేశారు. సలహా బోర్డు సభ్యురాలుగా ఇక ఆమె ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటానియో గ్యుటెరస్‌కు వివిధ దేశాల వర్తమాన, భావి ఆర్థిక పరిస్థితులను మెరుగు పరిచేందుకు అవసరమైన ప్రణాళికా విధానాలను సూచించవలసి ఉంటుంది. అదేమీ ఆమెకు కష్టమైన సంగతి కాబోదు. ప్రజల్లో తిరిగిన మనిషి. విద్యార్థులతో కలిసిమెలిసి ఉన్న ప్రొఫెసర్. డెవలప్మెంట్ ఎకనమిస్ట్. ఆమె భర్త అభిజిత్ భారతదేశ ప్రణాళికా సంఘం మాజీ సభ్యులు. జయతి ఎప్పుడూ కూడా ప్రభుత్వాలవైపు లేరు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు పిడికిలి బిగించిన ప్రతి ఉద్యమంలోనూ జయతి నినాదం ఉంది. మొన్నటి ఢిల్లీ సి.ఎ.ఎ. అల్లర్లలో ప్రేరేపకులుగా పోలీస్‌లు దాఖలు చేసిన అనుబంధ చార్జిషీట్లో సీతారాం ఏచూరి, యోగేంద్ర యాదవ్‌ల పేర్లతో పాటు జయతి పేరు కూడా ఉంది. అలాగని ప్రభుత్వాలు ఆమెకు ఇవ్వవలసిన గుర్తింపును ఇవ్వకుండా ఏమీ లేవు. జెనీవాలోని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐ.ఎల్.ఓ.) 2010 లో ఆమెకు ‘డీసెంట్ వర్క్ రిసెర్చ్ ప్రైజ్’ను అందించింది. యు.ఎన్.డి.పి. ‘ఎక్స్‌లెన్స్ ఇన్ ఎనాలిసిస్’ అవార్డును ప్రకటì ంచింది. సమితి సలహాదారుగా ఇప్పుడు ఆమెకు లభించించీ అవార్డులాంటి ప్రతిష్టే. -
ప్రాణహాని.. షీలాపై తండ్రి సంచలన ఆరోపణ
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) విద్యార్థి సంఘం మాజీ నాయకురాలు షీలా రషీద్‌పై ఆమె తండ్రి అబ్దుల్ సోరా సంచలన ఆరోపణలు చేశారు. తన కూతురు నుంచి ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని ఆరోపించారు. కశ్మీర్ రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు సంఘ విద్రోహ శక్తుల నుంచి పెద్ద ఎత్తను నగదు జమచేస్తోందని పేర్కొన్నారు. తన కూతురుకు చెందిన ఎన్జీవోపై వెంటనే దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు జమ్మూ కశ్మీర్ డీజీసీ దిబాగ్ సింగ్‌కు సోమవారం రాత్రి మూడు పేజీల లేఖను రాశారు. ఆ లేఖలో పలు సంచలన ఆరోపణలు చేశారు. ‘నా కూతురు షీలా, భార్య, చిన్న కూతురు నుంచి నాకు ప్రాణహాని, మా ఇంటి సెక్యూరిటీతో కలిసి నన్ను హతమార్చేందుకు కుట్రపన్నుతున్నారు. సంఘ విద్రోహ శక్తులతో కలిసి షీలా దేశ వ్యతిరేక కుట్రలకు పాల్పడుతోంది. ఆమెకు పెద్ద ఎత్తున డబ్బు కూడా అందుతోంది. ఓ మాజీ ఎమ్మెల్యే, వ్యాపారవేత్త నుంచి ఇటీవల మూడు కోట్ల రూపాయాలు అందాయి. ఆమె నిర్వహిస్తున్న ఎన్జీవో ఎన్నో అక్రమాలకు పాల్పడుతోంది. దీనిపై వెంటనే దర్యాప్తు జరిపించాలి. నన్ను ఇంట్లో బంధించిన గృహహింసకు పాల్పడుతున్నారు. వారి నుంచి నాకు రక్షణ కల్పించండి’ అంటూ డీజీపీకి రాసిన లేఖలో షీలా తండ్రి సోరా పేర్కొన్నారు. సోరా లేఖను స్వీకరించిన పోలీసులు.. దీనిపై త్వరలోనే విచారణ చేపట్టనున్నారు. కాగా జేఎన్‌యూలో విద్యార్థి నేతగా వెలుగులోకి వచ్చిన షీలా.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పలు కార్యక్రమాలు నిర్వహించిన విషయం తెలిసిందే. కశ్మీర్ విభజనకు వ్యతిరేకంగా గళం విప్పి.. నిర్బంధాన్ని ఎదుర్కొన్నారు. గతంలో ఆమెపై దేశద్రోహం కేసు నమోదైంది. మరోవైపు తండ్రి చేసిన ఆరోపణలను షీలా తీవ్రంగా ఖండించారు. తాము సోరాను ఎంతో బాగా చూసుకుంటామని, ఇలాంటి ఆరోపణలు చేస్తారని అస్సలు ఊహించలేదని తెలిపారు. దీనిపై చట్టపరమైన పోరాటం చేస్తానని పేర్కొన్నారు. -
హెచ్‌సీయూ @2
రాయదుర్గం(హైదరాబాద్): నగరంలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఘనతల్లో మరొకటి చేరింది. ఔట్లుక్–ఐసీఏఆర్ఈ ఇండియా యూని వర్సిటీ ర్యాంకింగ్స్–2020లో రెండో స్థానం పొం దింది. ర్యాంకుల జాబితాను ఆదివారం ప్రకటిం చారు. ప్రథమ స్థానంలో ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ) నిలిచింది. మొత్తం 1,000కి గాను జేఎన్‌యూ 931.67 స్కోర్ పొందింది. 887.78 స్కోర్‌తో హెచ్‌సీయూ ద్వితీయస్థానం సాధించింది. దేశంలోని అత్యుత్తమ టాప్–25 వర్సిటీలతో ఈ జాబితా వెలువడింది. ఇందులో రాష్ట్రం నుంచి హెచ్‌సీయూతోపాటు మరో వర్సిటీ ‘మనూ’చోటు దక్కించుకోవడం విశేషం. ‘మనూ’24వ ర్యాంకులో నిలిచింది. ప్రధానం గా అకడమిక్, రీసెర్చ్ ఎక్స్‌లెన్స్, ఇండస్ట్రీ ఇంటర్ఫే స్, ప్లేస్మెంట్, వసతులు, గవర్నెన్స్, అడ్మిషన్లు, డైవర్సిటీ, ఔట్రీచ్ వంటి పరిమితులలో సాధించిన ప్రగతి ఆధారంగా ర్యాంకులు కేటాయించారు. ‘మనూ’కు 24వ స్థానం ఔట్లుక్–ఐసీఏఆర్ఈ ఇండియా ర్యాంకింగ్స్– 2020లో రాష్ట్రం నుంచి చోటు దక్కించుకున్న మరో వర్సిటీ మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం (మనూ). జాబితాలో ‘మనూ’ 24వ స్థానం పొందింది. మొత్తం 1,000 స్కోరుకు గాను 436.88 సాధించింది. ప్రపంచస్థాయి గుర్తింపే లక్ష్యం.. దేశంలోని 25 ఉత్తమ యూనివర్సిటీల్లో హెచ్‌సీయూ రెండో స్థానం పొందడం గర్వంగా ఉంది. ఇది సమష్టి కృషికి నిదర్శనం. వర్సిటీకి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు సాధించడమే లక్ష్యంగా పనిచేస్తాం. దీనికోసం వ్యవస్థీకృత ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంది. ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్‌గా గుర్తింపు పొందడంతోనే మరింత ఉన్నత స్థానానికి ఎదగడానికి దోహదం చేస్తోంది. విద్యార్థులు, అధ్యాపకులు, అధికారులు, సిబ్బంది, పూర్వ విద్యార్థులు కలసి కృషి చేస్తే సాధించలేనిది లేదు. –ప్రొఫెసర్ పొదిలె అప్పారావు, హెచ్‌సీయూ ఉపకులపతి. -
'జేఎన్‌యూ సందర్శనకు దీపికకు రూ.5 కోట్లు'
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలు ఎంతటి హింసాత్మకంగా మారాయో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో ముసుగు ధరించిన దుండగులు కొందరు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ)లోకి ప్రవేశించి విద్యార్థులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దీంతో జనవరి 7న బాధిత విద్యార్థులకు సంఘీభావంగా బాలీవుడ్ అగ్రతార దీపిక పదుకొనే జేఎన్యూకు వెళ్లారు. ఇది అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. తాజాగా ఈ విషయం మరోసారి తెరమీదకు వచ్చింది. జేఎన్‌యూను సందర్శించడానికి ఆమె 5 కోట్ల రూపాయలను తీసుకుందంటూ ట్విటర్లో ప్రచారం జరుగుతోంది. (వివాదాస్పద సన్నివేశంపై స్పందించిన నటి) దీనిపై బాలీవుడ్ హీరోయిన్ స్వర భాస్కర్ స్పందించారు. ఇది పూర్తిగా అర్థం పర్థం లేని తప్పుడు సమాచారమని సదరు వార్తలను కొట్టిపారేశారు. "జేఎన్‌యూలో రెండు నిమిషాలు ఉన్నందుకే దీపిక ఐదు కోట్లు తీసుకుంది. కానీ స్వర భాస్కర్ ఏడాదిగా సీఏఏ కోసం వ్యతిరేకంగా అరిచి గీపెడుతున్నా కేవలం వెబ్ సిరీస్‌లో నటించే అవకాశాన్ని మాత్రమే సంపాదించింది. దేవుడా... మనుషులకు నిరాశను ఇచ్చినా పర్వాలేదు కానీ ఈ కమ్యూనిజాన్ని మాత్రం ఇవ్వకయ్యా" అని ఓ ట్విటర్ యూజర్ వ్యంగ్యంగా రాసుకొచ్చారు. దీనికి స్వర ఘాటుగా రిప్లై ఇస్తూ.. "బాలీవుడ్ గురించి తప్పుగా రాసే ఇలాంటి చెత్త వార్తలను ఎలా నమ్ముతారు అసలు? ఇంతకు మించిన మూర్ఖత్వం లేదు" అని ఆగ్రహం వ్యక్తం చేశారు. (జేఎన్‌యూలో దీపిక) -
‘షెల్టర్ కల్పిస్తామంటే చర్యలు తప్పవు’
న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో పౌరసత్వ సరవణ చట్టం (సీఏఏ)కి వ్యతిరేకంగా, అనుకూలంగా జరిగిన అల్లర్లు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఈ అల్లర్లలో 42 మంది మరణించగా, వందకు పైగా క్షతగాత్రులు వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో జేఎన్‌యూ క్యాంపస్‌లో అల్లర్ల బాధితులకు ‘షెల్టర్’ కల్పిస్తామని విద్యార్ధి సంఘాలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనలపై విశ్వవిద్యాలయ వీసీ జగదీష్ కుమార్ స్పందించారు. ‘ఢిల్లీలోని ప్రజలు శాంతి, సామరస్యంతో ఉండాలని కోరుకుంటున్నాము. బాధితులకు సాధ్యమైనంత సాయం అందించాలనుకుంటున్నాం. కానీ, క్యాంపస్‌లోని కొన్ని విద్యార్థి సంఘాలు క్యాంపస్‌కు సంబంధంలేని వ్యక్తులకు ‘షెల్టర్’ కల్పిస్తామని ప్రకటిస్తున్నాయి. క్యాంపస్‌కు సంబంధంలేని వ్యక్తులు యూనివర్సిటీలోకి పవేశించటం వల్ల జనవరిలో హింసాత్మక ఆందోళనలు జరిగాయని విద్యార్థులు నిరసనలు తెలిపిన విషయాన్ని వీసీ జగదీష్ కుమార్ గుర్తు చేశారు. (కల్లోలం నుంచి క్రమంగా.. 148 ఎఫ్ఐఆర్లు) అల్లర్లలో బాధపడే వారికి సాయం చేయడం వల్ల ఎలాంటి హాని జరగనప్పటికి విశ్వవిద్యాలయ శాంతి, భద్రతల దృష్ట్యా బాధితులకు ‘షెల్లర్’ ఇవ్వకూడదని ఆయన తెలిపారు. దీనిపై విద్యార్థులు ఎంటువంటి ప్రకటనలు చేయొద్దని ఆయన కోరారు. అదేవిధంగా చట్టపరంగా క్యాంపస్‌లో ‘షెల్టర్’ ఇవ్వాలని ఎటువంటి నిబంధన లేదన్నారు. అయిన్పటికీ విద్యార్థి సంఘాలు యూనివర్సిటి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని వీసీ జగదీష్ కుమార్ తెలిపారు.(ఢిల్లీ అల్లర్లపై అంతర్జాతీయ మీడియా దాడి) -
జేఎన్‌యూ విద్యార్థిగా ‘కంచ ఐలయ్య’
సాక్షి, న్యూఢిల్లీ : ఈ మనిషి జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ క్యాంపస్‌లోకి వెళుతుండగా పోలీసులు ఆపి ‘లోపల గొడవలు జరుగుతున్నాయి. ఈ సమయంలో పేరెంట్స్, సంరక్షకులు లోపలికి పోరాదు’ అని చెప్పారు. ‘కానీ నేను జేఎన్‌యూ విద్యార్థిని’ అని ఆ వ్యక్తి సమాధానం ఇచ్చారు. ఆయనకు 47 ఏళ్లు. కేరళకు చెందిన ఆయన పేరు మొహినుద్దీన్. ఉద్యోగం చేయాల్సిన అవసరం లేకుండా 1989 నుంచి జేఎన్‌యూలో చదువుతున్నారు. అనే పోస్ట్ ఫేస్బుక్లో గత కొన్ని రోజులుగా వైరల్ అవుతోంది. జేఎన్‌యూలో హాస్టల్ ఫీజుల పెంపును వ్యతిరేకిస్తూ వామపక్ష, కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తుండగా, ఫీజుల పెంపును బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘాలు సమర్థిస్తున్న విషయం తెల్సిందే. హాస్టల్ ఫీజులు అతి తక్కువగా ఉండడం వల్లనే 47 ఏళ్లు వచ్చిన వారు కూడా ఇప్పటికీ విద్యార్థులుగా హాస్టల్లో ఉంటున్నారన్న ఉద్దేశంతో జేఎన్‌యూ విద్యార్థుల పేరిట ‘శాస్త్రీ కౌశాల్కిషోర్డ్’ పేరిట ఓ అమ్మాయి ఫేస్బుక్లో పోస్ట్ చేయగా, వాసుదేవ్ జీ రామ్నాని, సుశీల్ మిశ్రా, హరిదాస్ మీనన్ తదితరులు రీపోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌ను ఎంతవరకు నమ్మారో తెలియదు. కేరళకు చెందిన మొహినుద్దీన్ అంటూ పెట్టిన ఫొటోను చూసిన వారు మాత్రం ఎవరూ నమ్మడం లేదు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వరంగల్ జిల్లా వాసి ‘కంచ ఐలయ్య’ ఫొటో అది. తెలుగు వారందరికి అతను సుపరికితులే. ‘కంచ ఐలయ్య గొర్రెలకాపరి’ అని గర్వంగా చెప్పుకునే ఆయన ప్రముఖ దళితుల హక్కుల కార్యకర్త. రాజకీయ తత్వవేత్త, రచయిత. ‘వైశ్యాస్: సోషల్ స్మగ్లర్స్’ అంటూ ఆయన రాసిన పుస్తకం వివాదాస్పదమైంది. ఉస్మానియా యూనివర్శిటీలో ‘బుద్దిజం’లో పీహెచ్డీ చేసిన ఆయన హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్శిటీ (ఎంఏఎన్‌యూయూ)లో ‘సెంటర్ ఫర్ సోషల్ ఎక్స్‌క్లూజన్ అండ్ ఇంక్లూజివ్ పాలసీ’ డైరెక్టర్‌గా పనిచేశారు. ప్రస్తుతం జెఎన్యూలో పీహెచ్డీ చేస్తున్న స్కాలర్లలో కూడా 47 ఏళ్ల మొహినుద్దీన్యే కాకుండా అసలు 40 ఏళ్లు దాటిన వారే లేరని వామపక్ష విద్యార్థి సంఘాలు తెలిపాయి. చదవండి: ఆ వీడియోలో ఉన్నది నేను కాదు: కోమల్ జేఎన్‌యూ హింస: ముసుగు ధరించింది ఆమె! ఎందుకు అరెస్టు చేయలేదు? ‘అర్బన్ నక్సల్స్తోనే జేఎన్యూకు అపకీర్తి’ -
కంపెనీలకు నిరసనల సెగ..
న్యూఢిల్లీ: వివాదాస్పద అంశాలపై చెలరేగే నిరసనల్లో అప్పుడప్పుడు అనుకోని విధంగా కంపెనీలు కూడా ఇరుక్కుంటున్నాయి. దీంతో వ్యతిరేకత సెగ వాటికి కూడా గట్టిగానే తగులుతోంది. తాజాగా సీఏఏ–ఎన్ఆర్సీ అంశం, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో విద్యార్థులపై దాడులు, ఆరెస్సెస్ కార్యక్రమాలు తదితర అంశాలపై బ్రాండ్ అంబాసిడర్లు, తమ సంస్థల చీఫ్‌ల వైఖరులు .. టెక్ కంపెనీలకు తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. పాలసీబజార్, జోహో, యాక్సెంచర్ వంటి సంస్థలు ఎవరో ఒకరి పక్షం వహించక తప్పని పరిస్థితుల్లో చిక్కుకుంటున్నాయి. దీంతో వ్యాపార అవకాశాలు కూడా కోల్పోయే సందర్భాలు ఎదురవుతున్నాయి. దీపిక బ్రాండ్‌పై జేఎన్‌యూ ఎఫెక్ట్.. వివాదాస్పద అంశాలపై బ్రాండ్ అంబాసిడర్లు వ్యవహరించే తీరు కంపెనీలకే కాకుండా.. స్వయంగా వారికి కూడా సమస్యలు తెచ్చిపెడుతోంది. ఆగంతకుల చేతిలో దెబ్బలు తిన్న జేఎన్‌యూ విద్యార్థులకు సంఘీభావంగా నిర్వహించిన ఓ నిరసన ప్రదర్శనకు బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణె కూడా హాజరు కావడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో కొన్ని బ్రాండ్స్.. ఆమెతో రూపొందించిన పలు ప్రకటనలను ప్రచురించడం లేదా ప్రసారం చేయడాన్ని సాధ్యమైనంతగా తగ్గించాలని నిర్ణయించుకున్నాయి. వివాదం సద్దుమణిగే దాకా ఓ రెండు వారాల పాటు ఆమె ప్రకటనలు ఆపేయాలంటూ తమ క్లయింట్ నుంచి సూచనలు వచ్చినట్లు ఓ మీడియా ఏజెన్సీ వెల్లడించింది. దేశీయంగా అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటీమణుల్లో పదుకొణె కూడా ఒకరు. ఒకో బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌కు ఆమె రూ. 8 కోట్లు, సినిమాకు రూ. 10 కోట్ల పైగా తీసుకుంటారని టాక్. ఆమె లోరియల్, తనిష్క్, యాక్సిస్ బ్యాంక్ తదితర 23 బ్రాండ్స్‌కు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. పాలసీబజార్‌కు బ్రాండ్ అంబాసిడర్ కష్టం.. ఇక, కంపెనీలపరంగా చూస్తే.. ఆన్లైన్లో బీమా పథకాలు మొదలైనవి విక్రయించే పాలసీబజార్‌కు బ్రాండ్ అంబాసిడర్ కారణంగా కష్టం వచ్చిపడింది. ఈ సంస్థ రాజకీయంగా రెండు భిన్న వర్గాలకు చెందిన నటులైన అక్షయ్ కుమార్, మొహమ్మద్ జీషన్ అయూబ్‌లను తమ ప్రచారకర్తలుగా నియమించుకుంది. అయితే, జేఎన్‌యూ, షహీన్ బాగ్ తదితర నిరసన ప్రదర్శనలకు అయూబ్ బాహాటంగా మద్దతు పలకడం పాలసీబజార్‌ను చిక్కుల్లో పడేసింది. అయూబ్ వైఖరిని పాలసీబజార్ సమర్ధిస్తోందా అన్నది బీజేపీ నేతల ప్రశ్న. ఈ వివాదంతో బాయ్కాట్పాలసీబజార్ హ్యాష్‌టాగ్ బాగా ట్రెండింగ్ అయ్యింది. అయితే, దీనిపై కంపెనీ ఎటువంటి వైఖరీ వెల్లడించలేదు. ఆరెస్సెస్ వివాదంలో జోహో, యాక్సెంచర్.. ఫిబ్రవరి 2న జరగబోయే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కార్యక్రమం.. జోహో, యాక్సెంచర్ ఇండియాకు సమస్యలు తెచ్చిపెట్టింది. రెండు సంస్థల చీఫ్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొంటుండటమే ఇందుకు కారణం. చెన్నైలో జరిగే కార్యక్రమంలో పాల్గొనాలన్న తన నిర్ణయాన్ని జోహో సీఈవో శ్రీధర్ వెంబు సమర్ధించుకున్నారు. అయితే, దీన్ని వ్యతిరేకిస్తున్న నిఖిల్ పహ్వా, ఎ లదఖ్, సచిన్ టాండన్ వంటి çపలువురు యువ వ్యాపారవేత్తలు .. జోహోతో వ్యాపారానికి తెగదెంపులు చేసుకుంటామని స్పష్టం చేశారు. ‘మిగతా వారంతా బాయ్‌కాట్ చేయాలని నేనేమీ పిలుపునివ్వడం లేదు. అది ఎవరికి వారు నిర్ణయం తీసుకోవాల్సిన విషయం. కానీ ఆ కార్యక్రమంలో వెంబు పాలుపంచుకుంటున్నందున.. నేను మాత్రం జోహోతో వ్యాపార లావాదేవీలను ఆపేసే పరిస్థితిలో ఉన్నాను‘ అంటూ టాండన్ .. మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్లో పోస్ట్ చేశారు. మరోవైపు, యాక్సెంచర్ ఇండియా సీఈవో రామ ఎస్ రామచంద్రన్ తీరుపై సొంత సంస్థలోని ఉద్యోగుల నుంచే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. యాక్సెంచర్ నైతిక నియమావళి ప్రకారం ప్రొఫెషనల్ హోదాలో ఉద్యోగులెవరూ ఎలాంటి రాజకీయ కార్యక్రమాల్లోనూ పాల్గొనరాదని కొందరు సిబ్బంది చెబుతున్నారు. తమ ఉద్యోగులు నిర్దిష్ట సిద్ధాంతాల పక్షం వహించడాన్ని యాక్సెంచర్ ఎంతవరకూ సమర్థిస్తుందన్న దానిపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి చర్యలు.. యాక్సెంచర్‌లోని మైనారిటీ సామాజిక వర్గాలకు చెందిన ఉద్యోగులకు ఎలాంటి సంకేతాలు పంపిస్తాయని ట్విట్టర్ యూజర్లు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలంటూ ఏకంగా యాక్సెంచర్ గ్లోబల్ సీఈవో జూలీ స్వీట్‌ను ట్యాగ్ చేస్తూ.. వారు పోస్ట్‌లు చేశారు. అయిదేళ్ల క్రితం స్నాప్‌డీల్ ఉదంతం.. కంపెనీలు ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం ఇదే తొలిసారి కాదు. 2015లో ఈకామర్స్ సంస్థ స్నాప్‌డీల్ కూడా ఇలాంటి సమస్యే ఎదుర్కొంది. అప్పట్లో ఆ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ఆమిర్‌ఖాన్.. దేశంలో నెలకొన్న పరిస్థితులను తనను భయాందోళనలకు గురిచేస్తున్నాయని వ్యాఖ్యానించడం స్నాప్‌డీల్‌కు చిక్కులు తెచ్చిపెట్టింది. ఆమిర్‌ఖాన్‌తో పాటు స్నాప్‌డీల్‌ను కూడా బాయ్‌కాట్ చేయాలంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఆ దెబ్బతో మళ్లీ ఆమిర్‌ఖాన్‌తో కాంట్రాక్టును స్నాప్‌డీల్ .. రెన్యూ చేసుకోలేదు. ఇటీవలే ఆన్లైన్ ఫుడ్ సర్వీసుల యాప్ జొమాటోకూ ఇలాంటి సమస్యే ఎదురైంది. హిందువేతర డెలివరీ బాయ్‌ని పంపించారనే కారణంతో ఓ యూజరు.. ఆర్డరును క్యాన్సిల్ చేశారు. అయితే, జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్.. తమ డెలివరీ బాయ్‌కు మద్దతిచ్చారు. కొన్ని వివాదాలు.. నవంబర్, 2015: భారత్‌లో అభద్రతాభావం పెరిగిపోయిందంటూ బాలీవుడ్ నటుడు, స్నాప్‌డీల్ బ్రాండ్ అంబాసిడర్ ఆమిర్‌ఖాన్ వ్యాఖ్యానించారు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో ఆయనతో స్నాప్‌డీల్ తెగదెంపులు చేసుకోక తప్పలేదు. ఏప్రిల్, 2018: కథువా రేప్ బాధితురాలికి న్యాయం చేయాలంటూ సాగిన ఉద్యమంలో నటి స్వరభాస్కర్ వివాదాస్పద ట్వీట్స్ చేశారు. దీంతో ఈకామర్స్ సంస్థ అమెజాన్.. ఆమెను బ్రాండ్ అంబాసిడర్‌గా తప్పించింది. ఏప్రిల్, 2018: డ్రైవర్ ముస్లిం అనే కారణంతో వీహెచ్‌పీ కార్యకర్త ఒకరు.. ఓలా ట్యాక్సీ రైడ్‌ను రద్దు చేసుకున్నారు. తాము మతసామరస్యానికి ప్రాధాన్యమిస్తామంటూ ఓలా సంస్థ .. సదరు డ్రైవరు పక్షాన నిల్చింది. జూలై, 2019: ముస్లిం డెలివరీ బాయ్ వచ్చారనే కారణంతో జొమాటోలో చేసిన ఆర్డరును ఒక యూజరు క్యాన్సిల్ చేశారు. జొమాటో, దాని వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ .. డెలివరీ బాయ్ పక్షాన నిల్చారు. -
అయిషీని విచారించిన ఢిల్లీ పోలీసులు
న్యూఢిల్లీ: ఈనెల 5వ తేదీన జవహర్లాల్ నెహ్రూ వర్సిటీ(జేఎన్‌యూ)లో హింసాత్మక ఘటనలకు సంబంధించి ఢిల్లీ పోలీసులు సోమవారం విద్యార్థి సంఘం నేత అయిషీ ఘోష్ సహా ముగ్గురిని ప్రశ్నించారు. పోలీసులు గుర్తించిన 9 మంది నిందితుల్లో ఏబీవీపీకి చెందిన ఇద్దరితోపాటు ఆయిషీ ఘోష్ ఉన్నారు. అయితే, సోమవారం నుంచి ప్రారంభమైన సెమిస్టర్‌ను విద్యార్థులు బహిష్కరించారు. వర్సిటీలో ఫీజుల పెంపును ఉప సంహరించుకునే దాకా సెమిస్టర్ రిజిస్ట్రేషన్‌ను సాగనీయబోమని తెలిపారు. ఇలా ఉండగా, వర్సిటీలో పరీక్షల నిర్వహణకు అనువైన వాతావరణం లేదని, చాలా మంది విద్యార్థులు క్యాంపస్‌కు భయంతో రాలేదని జేఎన్‌యూ ప్రొఫెసర్ల బృందం మానవ వనరుల మంత్రిత్వ శాఖకు వివరించింది. విద్యార్థులపై బలప్రయోగం ఏమిటి? నిరసనలు తెలుపుతున్న విద్యార్థులపై బలప్రయోగం చేయడంపై పార్లమెంటరీ సంఘం ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులను ప్రశ్నించింది. రాజ్యసభలో కాంగ్రెస్ ఉపనేత ఆనంద్ శర్మ నేతృత్వంలోని హోం శాఖ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఎదుట కేంద్ర హోం శాఖతోపాటు, ఢిల్లీ, హరియాణా, ఉత్తరప్రదేశ్ పోలీస్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిటీ జవహర్ లాల్ నెహ్రూ వర్సిటీ, జమియా మిలియా ఇస్లామియా హింసాత్మక ఘటనలను నేరుగా ప్రస్తావించకుండా.. విద్యార్థులతో పోలీసులు వ్యవహరించిన తీరును ప్రశ్నించింది. ఆందోళనల సమయంలో 144వ సెక్షన్ కింద విధించే నిషేధాజ్ఞల కారణంగా సామాన్యులు ఇక్కట్లకు గురవుతున్నారని పేర్కొంది. విద్యార్థులపై బలప్రయోగం చేసిన సందర్భాల్లో ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది. ఇలాంటి సందర్భాల్లో విద్యార్థులతో పరిణతితో వ్యవహరించాల్సి ఉందని తెలిపింది. ‘జేఎన్‌యూ’ ఆధారాలపై స్పందించండి ఈ నెల 5వ తేదీనాటి జేఎన్‌యూ హింసాత్మక ఘటనలకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీ తదితర ఆధారాలను భద్రపరచాలంటూ దాఖలైన పిటిషన్‌పై అభిప్రాయాలను తెలపాలని వాట్సాప్, గూగుల్, యాపిల్ కంపెనీలను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. జేఎన్యూకు చెందిన ముగ్గురు ప్రొఫెసర్లు దాఖలు చేసిన పిల్‌పై జస్టిస్ బ్రిజేశ్ సేథి సోమవారం విచారణ చేపట్టారు. ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వం, పోలీస్ శాఖలకు నోటీసులు జారీ చేసి, విచారణను మంగళవారానికి వాయిదా వేశారు. -
మిస్టరీగా మిగిలిన ముసుగు దుండుగులు..!
-
రగడ
-
అనుమానితుల్లో ఆయిషీ!
న్యూఢిల్లీ/చెన్నై/భోపాల్: ఈ నెల 5వ తేదీ రాత్రి జేఎన్‌యూలో హింసాత్మక ఘటనలకు బాధ్యుల్లో జేఎన్‌యూ విద్యార్థి సంఘం నాయకురాలు ఆయిషీ ఘోష్ కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఆ ఘటనకు కారకులుగా భావిస్తున్న 9 మంది ఫొటోలను శుక్రవారం పోలీసులు విడుదల చేశారు. ‘మొత్తం 9 మందిలో ఏడుగురు వామపక్ష విద్యార్థి సంఘాలకు చెందిన వారు కాగా, ఇద్దరు ఇతర సంఘాల వారు. వీరిలో వర్సిటీ విద్యార్థి సంఘం నాయకురాలు ఆయిషీ ఘోష్ ఉన్నట్లు అనుమానిస్తున్నాం. అగంతకులంతా ముసుగులు ధరించి ఉండటంతో గుర్తింపు కష్టంగా మారింది’ అని ఈ కేసును దర్యాప్తు చేస్తున్న డీసీపీ జోయ్ టిర్కే తెలిపారు. వర్సిటీలో వింటర్ సెమిస్టర్ రిజిస్ట్రేషన్ ఫీజు జనవరి 1 నుంచి 5వ తేదీ ఉండాలని ఎక్కువ మంది విద్యార్థులు కోరుతుండగా వామపక్ష విద్యార్థి సంఘాలు అభ్యంతరం తెలపడం దాడులకు దారితీసిందన్నారు. వర్సిటీలోని పెరియార్ హాస్టల్లోని కొన్ని గదుల్లో మాత్రమే దాడులు చోటుచేసుకున్నట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఇంతవరకు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని, కానీ త్వరలోనే వారికి నోటీసులు జారీ చేసి ప్రశ్నిస్తామని ఢిల్లీ పోలీసు ప్రతినిధి ఎంఎస్ రణ్‌ధవా చెప్పారు. సీసీటీవీ ఉంటే నిందితులను గుర్తించడం సులువుగా ఉండేదని, కానీ దురదృష్టవశాత్తు దాడికి ముందు రోజే సర్వర్ రూమును «ధ్వంసం చేశారని ఆయన చెప్పారు. వైఫై డిసేబుల్ చేయడం వల్ల సీసీటీవీ పుటేజీ లభించలేదని చెప్పారు. అందుకే సోషల్ మీడియాలో వచ్చిన వీడియోలు, స్క్రీన్ షాట్ల ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నామని అన్నారు. కాగా, తనపై పోలీసులు చేసిన ఆరోపణలను ఘోష్ ఖండించారు. తనకు వ్యతిరేకంగా ఉన్న ఆధారాలను బహిర్గతం చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు. పోలీసులు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని, తన ఫిర్యాదును ఎఫ్ఐఆర్గా నమోదు చేయలేదని ఆమె ఆరోపించారు. ఇలా ఉండగా ఈ దాడి ఘటనకు సంబంధించిన అన్ని రకాల ఆధారాలను భద్రపరిచేలా ఢిల్లీ పోలీసులు, ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ జేఎన్యూకు చెందిన ముగ్గురు ప్రొఫెసర్లు ఢిల్లీ హైకోర్టులో పిల్(ప్రజాహిత వ్యాజ్యం) వేశారు. హింసాత్మక ఘటనకు కీలక ఆధారాలైన సీసీ టీవీ ఫుటేజీని కూడా ఢిల్లీ పోలీసులు ఇప్పటివరకు సేకరించలేదని వారు అందులో తెలిపారు. ఈ పిల్‌పై 13వ తేదీన విచారణ చేపట్టనున్నట్లు న్యాయమూర్తి జస్టిస్ బ్రిజేష్ సేథి తెలిపారు. హెచ్చార్డీ నిర్ణయాలు యథాతథం: వీసీ జేఎన్‌యూ హాస్టల్ ఫీజులకు సంబంధించి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ(హెచ్చార్డీ) శాఖ గతంలో తీసుకున్న నిర్ణయాలను తుచతప్పకుండా అమలు చేస్తామని వీసీ ఎం.జగదీశ్ కుమార్ స్పష్టం చేశారు. వర్సిటీలో 13వ తేదీ నుంచి తరగతులు తిరిగి ప్రారంభమవుతాయని తెలిపారు. జేఎన్‌యూ పరిపాలన విభాగం, వీసీతో హెచ్చార్డీ అధికారుల భేటీ అనంతరం వీసీ ఈ విషయాలను వెల్లడించారు. అవసరమనుకుంటే సెమిస్టర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆఖరి గడువును పొడిగించే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. దేశ విచ్ఛిన్నకారులకు దీపిక మద్దతు బాలీవుడ్ నటి దీపికా పదుకొణే జేఎన్‌యూ సందర్శనపై కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ స్పందించారు. దీపిక దేశ విచ్ఛిన్నాన్ని కోరుకునే వారికి మద్దతుగా నిలిచారని వ్యాఖ్యానించారు. సీఆర్పీఎఫ్ జవాన్లు చనిపోతే పండగ చేసుకునే వారి పక్కన ఆమె నిలబడ్డారని, ఇది చూసి ఆమెను అభిమానించే వారంతా షాక్‌కు గురయ్యారన్నారు. ప్రధాని పదవికి రాహుల్ గాంధీయే సరైన వ్యక్తి అంటూ పదుకొనే 2011లో ప్రకటించి, తన రాజకీయ అనుబంధాన్ని చాటుకున్నారన్నారు. ‘అక్కడి వారు లాఠీలతో విద్యార్థినులను అభ్యంతరకరమైన రీతిలో కొట్టారు. అలాంటి వారి పక్కన దీపిక నిలబడింది. అది ఆమె హక్కు. ఇతర యువతులపై దాడికి చేసే వారికి కూడా ఆమె మద్దతు తెలుపుతుంది. ఆమెకు ఆ స్వాతంత్య్రం ఉంది. కాంగ్రెస్ పార్టీతో ఆమెకు సంబంధం ఉన్నట్లు 2011లోనే వెల్లడైంది’ అని పేర్కొన్నారు. చెన్నైలో ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి ఇరానీ మాట్లాడారు. ఈ వ్యాఖ్యలను ఆ పత్రిక ట్విట్టర్లో ఉంచింది. -
జేఎన్‌యూ వీసీ జగదీష్ కుమార్‌కు హెచ్ఆర్డీ సమన్లు
-
దీపికా.. ఎవరికి మద్దతిస్తున్నావో తెలుసా!
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని జేఎన్‌యూను సందర్శించిన బాలీవుడ్ నటి దీపికా పడుకోన్‌ను నెటిజన్లు ఓ రేంజ్లో ట్రోల్ చేస్తుంటే తాజాగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ దీపికా చర్యను తప్పుపట్టారు. దేశ విధ్వంసాన్ని కోరుకునే వారికి తాను బాసటగా నిలిచానని దీపికా పడుకోన్ తెలుసుకోవాలని స్మృతి ఇరానీ అన్నారు. వార్తలను ఫాలో అయ్యేవారికి ఇలాంటి వారు ఎటువైపు నిలబడుతున్నారనేది అర్ధమవుతుందని తాను భావిస్తున్నానని ఆమె చెప్పుకొచ్చారు. మరోవైపు హిందూ సంఘాలు దీపిక చర్యను తప్పుపడుతూ ఆందోళన చేపట్టాయి. ముసుగు దుండగుల దాడిలో గాయపడిన జేఎన్‌యూ విద్యార్ధులకు ఆమె బాసట తెలపడంతో దీపికా తాజా చిత్రం చపాక్‌ను బహిష్కరించాలని కొందరు బీజేపీ నేతలు పిలుపు ఇచ్చారు. జేఎన్‌యూలో చెలరేగిన హింసను ఖండిస్తూ దీపికా పడుకోన్ ఆజ్ తక్ టీవీతోనూ మాట్లాడారు. జేఎన్‌యూ దాడిపై తాను తీవ్ర ఆగ్రహంతో ఉన్నానని, దాడికి పాల్పడిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం మరింత దారుణమని ఆమె వ్యాఖ్యానించారు. -
జేఎన్‌యూ విద్యార్థుల ర్యాలీలు భగ్నం
న్యూఢిల్లీ: జేఎన్‌యూలో నాలుగు రోజుల క్రితం విద్యార్థుల దాడి నేపథ్యంలో వైస్ చాన్స్‌లర్ జగదీశ్‌కుమార్‌ను తొలగించాలంటూ వర్సిటీ విద్యార్థులు చేపట్టిన ర్యాలీలను పోలీసులు భగ్నం చేశారు. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ(హెచ్చార్డీ)భవనం వైపు గురువారం ఉదయం విద్యార్థులతోపాటు సీపీఎం నేతలు సీతారాం ఏచూరి, ప్రకాశ్ కారత్, బృందా కారత్, సీపీఐ నేత డి.రాజా ర్యాలీగా తరలిరాగా పోలీసులు అడ్డుకున్నారు. అయితే, సమస్యలపై చర్చించేందుకు హెచ్చార్డీ అధికారులు కొందరు విద్యార్థి నేతలతో భేటీకి అంగీకరించారు. వీసీ తొలగింపునకు మాత్రం అధికారులు అంగీకరించలేదు. ఫీజుల పెంపు సహా ఇతర సమస్యలపై ఈనెల 10వ తేదీన వీసీతో కలిపి మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. వీసీ వైదొలగాలన్న డిమాండ్ నెరవేరేదాకా నిరసన ఆపేది లేదని జేఎన్‌యూ విద్యార్థి నేత ఆయిషీ ఘోష్ పేర్కొన్నారు. అనంతరం రాష్ట్రపతి భవన్ వైపు కొందరు విద్యార్థులు వచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు ఆపారు. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో కొందరు విద్యార్థులు గాయపడినట్లు సమాచారం. ఈ సందర్భంగా 11 మందిని అదుపులోకి తీసుకుని, ఆ తర్వాత విడిచిపెట్టినట్లు పోలీసులు తెలిపారు. ఇలా ఉండగా, హెచ్చార్డీ నిర్ణయించిన మేర ఫీజుల పెంపుపై వెనక్కితగ్గేది లేదని జేఎన్‌యూ వీసీ జగదీశ్ కుమార్ తెలిపారు. -
జేఎన్‌యూలో దారుణ పరిస్థితులు
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: ఢిల్లీలోని జేఎన్‌యూలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయని నేషనల్ అలయెన్స్ ఆఫ్ పీపుల్స్ మూమెంట్ ప్రతినిధి, సామాజికవేత్త మేధా పాట్కర్ ఆవేదన వ్యక్తం చేశారు. భారతదేశంలో ఇప్పుడుస్వేచ్ఛ కోసం అన్ని వర్గాలు పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. గురువారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘కమ్యూనిటీ టు రెసిస్ట్ కమ్యూనలిజం అండ్ ఫాసిజం’ఆధ్వర్యంలో ఎన్ఆర్సీ, సీఏఏ, ఎన్పీఆర్లకు వ్యతిరేకంగా సదస్సు జరిగింది. ఈ సదస్సులో మేధా పాట్కర్ మాట్లాడుతూ.. బీజేపీ రాజ్యాంగ వ్యతిరేక విధానాలపై నేడు అన్ని వర్గాలు ఏకం అవుతున్నాయని చెప్పారు. జనవరి 30న మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని అహింసా దినంగా పాటించాలని పిలుపునిచ్చారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్రకుమార్ మాట్లాడుతూ.. జేఎన్‌యూలో దాడి జరిగి 4 రోజులు కావస్తున్నా ఒక్కరిని కూడా అరెస్టు చేయకపోవటం దారుణమన్నారు. -
వారికి చదువంటే చచ్చేంత భయం
అక్కడ పుస్తకాలు చెల్లాచెదురైనాయి. చదివే మస్తకాలు పగిలాయి. సైలెన్స్ బదులు గ్రంథాలయాల్లో వయొలెన్స్ విలయ తాండవం చేసింది. కలాలు కాదు ఐరన్ రాడ్లు, కంప్యూటర్లు కాదు మొబైల్ ఫోన్లలో వాట్సాప్ కుట్రలు పనిచేసాయి. విద్యార్థులు కాదు విద్యార్థి సంఘాల గూండాలు విజృంభించారు. చంపడం తన్నడం పాఠాలనుకునే వారు, లాఠీతో సరిచేద్దామనుకునే తత్వజ్ఞులు చీకటితో వెలుగు మీద దాడిచేశారు. హాస్టళ్ల అద్దాలు పగిలాయి. బాత్రూంలలో కూడా నెత్తురు చుక్కలు.. వారు ఎవరిమీద ఎక్కడ దాడిచేశారో చెప్పే రుజువులు. కొత్త సంవత్సరం మొదటి ఆదివారం రాత్రి జేఎన్‌యూలో కాళరాత్రి. ఎవరూ రమ్మనకుండానే వచ్చి ఒక యూనివర్సిటీలో జొరబడి విద్యార్థులను శాంతిభద్రతలకోసం చితకబాదిన పోలీసులు ఈసారి వచ్చి కూడా అనుమతి లేదని కొన్నిగంటలు నిశ్చలంగా ఉండిపోయారు. జేఎన్‌యూలోని ముగ్గురు వ్యక్తులు గూండాలను తీసుకువచ్చి ఏయే హాస్టల్ గదుల మీద దాడిచేయాలో చూపారని వార్తలు. ఎవరు చేశారో, ఎందుకు చేశారో తెలిసిన రహస్యమే. ముసుగు పర్వం: పాలకులు ఎవరైనా సరే వారికి చదువంటే భయం. చదువుల నిలయాలంటే భయం. చదువుకునే వారంటే ఇంకా భయం. చదివిన చదువు లక్ష మెదళ్లను కదిలి స్తుంటే భయం. ఆ భయాన్ని పోగొట్టుకోవడానికి వెంట రాడ్లు తెచ్చుకుని, ముసుగులేసుకుంటారు. జాతీయతా పర్వం: భయాన్ని దాచుకోవడానికి జాతీయత, దేశభక్తి వంటి భారీ పదజాలం కప్పుకోవాలి. లైబ్రరీ అయితే నాకేమిటి, పుస్తకాలు నాకెందుకు. అక్కడ ప్రొఫెసర్ ఉంటేనేం, విద్యార్థి అయితేనేం ఎవడైతే నాకేమిటి. లాఠీతో కొడతాను. పుస్తకం చింపేస్తాను. గొంతు నులిపేస్తాను, శరీరాల్ని నలిపేస్తాను. నీవు చదువుకుని ఏం చేస్తావు? మేం పాలిస్తున్నాం. మీకన్నీ ఇస్తాం. నోరుమూసుకుని పడి ఉండు. అనేదే ఫిలాసఫీ. భయపడే పర్వం: ఈ పిరికి మంద పాడైపోవడాన్ని బాగుపడడం అనుకుంటుంది. పాపం జేఎన్ యూను బాగుచేయాలనుకున్నారు పాడైపోయిందనుకుని, కొట్టి భయపెట్టి. తలలు పగిలితే బాగుపడుతుందని నమ్మారు. ఈ మంద భయపడుతూ శరీరాలపై హింసకు పాల్పడి భయపెడుతున్నానుఅనుకుంటుంది. నిజాలంటే భయం, నిలదీయడమంటే భయం. టెర్రరిజం పర్వం: ఎదురుపడలేని పిరికితనమే టెర్రరిజం. సరిహద్దు అవతలనుంచి విసిరే రాకెట్ కన్న దారుణమైంది విశ్వవిద్యాలయం మీద గూండాల దాడి. సంబంధంలేని వాడిని తన్ని గర్వించడమే టెర్రరిజం. కళ్లు కనబడలేదన్నా వదలరు. కదలలేమన్నా వదలరు. వారికి మెదడు ఉండే చోట మరేదో ఉంది. గుండె ఉండేచోట ఇంకేదో ఉండకూడని పదార్థం ఉంది. సంస్కృతి పర్వం: పిరికితనం దాచుకుని గూండాగిరీ చేసేవారు వాడుకునే మరో ఇనుప రాడ్–సంస్కృతి. సంస్కృతి అంటే లాఠీలు పట్టుకుని రాడ్లు పట్టుకుని, వాట్సాప్‌లో తోడున్న గూండాలను, మందలను తరలిం చినట్టు తరలించి, పోలీసులు మనోళ్లే, సర్కార్ మనదే, వీసీ మనోడే, ఇంకెవడో కూడా మనోడే అని సంక్షిప్త సందేశాలిస్తూ, తరువాత దొరికిపోతామన్న ఆలోచన కూడా లేకుండా, ముసుగు దాచదన్న భయం లేకుండా మూర్ఖత్వంతో దాడి చేస్తారు. ఇది సంస్కృతి మీద, సనాతన ధర్మం మీద దాడి. లాఠీ లూటీ పర్వం: రేపటి తరానికి రిజర్వ్ బాంక్ విశ్వవిద్యాలయమే. అది లూటీ చేయడానికి వీలుకాని ధనాగారం. జేఎన్‌యూలో దాడిచేసిన గూండాల ముసుగులను తొలగించే అంశాలు ఒక్కటొక్కటే బయటపడుతున్నాయి. అందుకే కొందరు సిగ్గు లేకుండా మేమే తన్నాం, మేమే గుద్దాం, మేమే దాడి చేశాం, మాది దక్షిణ పక్షమని ఉన్మత్తంగా చెప్పుకుంటూనే ఉన్నారు. జేఎన్‌యూ అయింది. ఇక ఆ యూనివర్సిటీ ఈ యూనివర్సిటీ అని టార్గెట్లు కూడా నిర్ణయించారు. మౌనాంగీకార పర్వం: దీన్ని ఖండించక మౌనంగా ఉండడానికి ఫేస్బుక్లో లైక్‌లు పెట్టడానికి పెద్ద తేడా లేదు. మౌనం అతి భయంకరం. విశ్వవిద్యాలయం శత్రుస్థావరం అనుకునే విజ్ఞానవంతులకు రాజ్యాంగం ఎందుకు? నిర్భయ, దిశ కన్న భయంకర నేరం ఇది. వెలుగుదిశ చూపే నిర్భయ విద్య ఎక్కడ? మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
జేఎన్‌యూ హింసపై స్పందించిన సన్నీలియోన్
సాక్షి, న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీలోని జేఎన్‌యూ హింసపై పలువురు సెలబ్రిటీలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ అగ్రతార దీపిక పదుకొనే జేఎన్‌యూను సందర్శించడంతో దీనిపై స్పందించే వారి సంఖ్య పెరుగుతోంది. వర్సిటీ విద్యార్థులపై దాడిని తీవ్రంగా ఖండించి, వారికి మద్దతుగా నిలుస్తున్నారు. జేఎన్‌యూ హింసపై తాజాగా బాలీవుడ్ నటి సన్నీలియోన్ స్పందించారు. గురువారం ఆమె ఓ సమావేశంలో మాట్లాడుతూ.. ఈ దాడిని ఖండిస్తున్నట్లు ప్రకటించారు. (జేఎన్‌యూలో దీపిక) ‘నాకు తెలిసి అతిపెద్ద సమస్యపై నేను మాట్లాడుతున్నాను. హింసను ఎప్పుడూ సమర్థించలేను. దాడుల వల్ల బాధితురాలు మాత్రమే కాదు.. వారి కుటుంబం కూడా తీవ్ర క్షోభను అనుభవించాల్సి ఉంటుంది. ఇది వారి అభిప్రాయాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. హింసకు చోటులేకుండా సమస్య పరిష్కారం కనుగొనాలి. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా సామరస్యపూర్వకంగా విభేదాలు పరిష్కరించుకోవాలి’ అని అన్నారు. కాగా యూనివర్సిటీ విద్యార్థి సంఘం(జేఎన్‌యూఎస్‌యూ) అధ్యక్షురాలు ఆయిషీ ఘోష్‌పై వర్సిటీలో ముసుగులు ధరించిన దుండుగులు విచ్చలవిడిగా దాడిచేసి పలువురు విద్యార్థులు, టీచర్లను తీవ్రంగా గాయపర్చిన విషయం తెలిసిందే. అనంతరం ఈ ఘటన దేశ రాజధానిలో పెను దుమారాన్నే రేపింది. రాజకీయ, సినీ ప్రముఖులు పరామర్శలు, ప్రకటనతో జేఎన్‌యూ రణరంగంగా మారింది. -
'పై నుంచి ఆదేశాలు వస్తే పోలీసులేం చేయగలరు'
ఢిల్లీ : ఢిల్లీలోని జేఎన్‌యూ యునివర్సిటీలో ప్రొఫెసర్లు, విద్యార్థులపై జరిగిన దాడికి మోదీ ప్రభుత్వానిదే బాధ్యత అని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. కేజ్రీవాల్ గురువారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరులు సమావేశంలో మాట్లాడారు. జనవరి 5న జేఎన్‌యూలో హింసాత్మక వాతావరణం ఏర్పడినా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదని విలేకరులు ప్రశ్నించారు. దీనిపై కేజ్రీవాల్ స్పందిస్తూ.. జేఎన్‌యూ ఘటనపై పోలీసులు ఎటువంటి చర్య తీసుకోకపోవడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలే కారణమని తెలిపారు.(అసలేంటి ఇదంతా.. నాకేం అర్థం కావట్లేదు!) 'పై నుంచి ఆదేశాలు వస్తే ఢిల్లీ పోలీసులు మాత్రం ఏం చేయగలరు. జేఎన్‌యూలో ఎలాంటి హింస జరిగిన, శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడినా మీరెంలాంటి చర్యలు తీసుకోవద్దంటూ కేంద్రమే వారిని ఆదేశించింది. ఒకవేళ కేంద్రం జారీ చేసిన ఆదేశాలను లెక్కచేయకుండా పోలీసులు చర్యలు తీసుకొని ఉంటే వారిని సస్పెండ్ చేయడమో లేక ఉద్యోగాలు ఊడిపోవడమో జరిగేది' అంటూ కేజ్రీవాల్ పేర్కొన్నారు. కాగా, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో జనవరి 5న హింస చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ముసుగులు ధరించిన కొందరు దుండగులు చేతిలో కర్రలతో యూనివర్సిటీలోకి చొరబడి విద్యార్థులు, ప్రొఫెసర్లపై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. వర్సిటీ ఆస్తులను ధ్వంసం చేశారు. వారి దాడిలో యూనివర్సిటీ విద్యార్థి సంఘం(జేఎన్‌యూఎస్‌యూ) ప్రెసిడెంట్ ఆయిషీ ఘోష్ సహా 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. -
ఎవరైనా ఎక్కడికైనా వెళ్లొచ్చు
న్యూఢిల్లీ: జేఎన్‌యూ విద్యార్థులకు సంఘీభావంగా యూనివర్సిటీకి వెళ్లినందుకు గాను దీపికా పదుకొనే రాబోయే చిత్రం చపాక్‌ను ఎవరూ చూడొద్దని బీజేపీలో కీలక నేతలు సహా ఎందరో పిలుపునిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆమెకి అండగా నిలిచింది. ప్రజాస్వామ్య భారత్‌లో నటీనటులే కాదు సామాన్యులెవరైనా ఎక్కడికైనా వెళ్లి తమ అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పవచ్చునని పేర్కొంది. ఏదైనా అంశంపై ఎవరైనా అభిప్రాయాలు చెబితే ఎవరికీ అభ్యంతరం ఉండదని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ బుధవారం విలేకరులతో చెప్పారు. దీపిక చిత్రాన్ని బహిష్కరించాలని కొందరు బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్న విషయంపై విలేకరులు జవదేకర్‌ను ప్రశ్నించగా, తన దృష్టికి అలాంటివేమీ రాలేదని అన్నారు. యూనివర్సిటీ విద్యార్థులతో నిరంతరం మాట్లాడుతూ ఉండాలని, అదే విధంగా అ«ధ్యాపకుల్ని విశ్వాసంలోకి తీసుకోవాలని జేఎన్‌యూ వీసీ జగదీశ్ కుమార్‌కు హెచ్ఆర్డీ మంత్రిత్వ శాఖ సూచించింది. జేఎన్‌యూ విద్యార్థి సంఘం నాయకురాలు ఆయిషీ ఘోష్ పెయింట్ పూసుకొని గాయాలైనట్టు నాటకమాడిందని పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ ఆరోపించారు. నిందితుల గురించి కీలక ఆధారాలు జేఎన్‌యూలో దాడికి దిగిన ముసుగు దుండగులకు సంబంధించి ఢిల్లీ పోలీసులకు కీలక ఆధారాలు లభించాయి. త్వరలోనే వారు నిందితుల్ని గుర్తిస్తారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. క్యాంపస్‌లోకి బుధవారం పెద్ద సంఖ్యలో విద్యార్థులు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. -
ఉనికి లేని వారే ‘పోరాటాలు’ చేస్తున్నారు
కోల్‌కత : బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాంగ్రెస్, వామపక్ష పార్టీలపై విమర్శలు గుప్పించారు. ధర్నాలు, రాస్తారొకోలకతో తమ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు నష్టం కలిగించాలని చూస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. దేశవ్యాప్త ఎన్నార్సీ, పౌరసత్వ చట్టం, కేంద్ర ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా చేపట్టే నిరసనలకు మద్దతు నిస్తామని అన్నారు. అయితే, దేశ వ్యాప్తంగా ఎలాంటి ప్రజా ఉద్యమాలు చేపట్టని కాంగ్రెస్, వామపక్ష పార్టీలు.. బెంగాల్లో మాత్రం అనిశ్చితి పెంచేందుకు ఇతర కారణాలను చూపుతూ ధర్నాలకు దిగుతున్నాయని విమర్శించారు. రాజకీయంగా ఉనికి కోల్పోయిన పార్టీలే ఇక్కడ ‘పోరాట’ పంథా ఎన్నుకున్నాయని ఎద్దేవా చేశారు. తమ ఉనికి నిలుపుకోవడానికే ధర్నాల పేరుతో చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. -
పోలీసుల సమక్షంలోనే ఆ ‘దాడి’
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీ క్యాంపస్‌లోని హాస్టళ్లపై ఆదివారం దుండగులు జరిపిన దాడి పోలీసుల సమక్షంలోనే జరిగిందని, అయినప్పటికీ దాన్ని ఆపేందుకు ఢిల్లీ పోలీసులు ఎలాంటి చర్య తీసుకోలేదని ఆ దాడిపై దాఖలైన ఎఫ్ఐఆర్ను చూస్తే స్పష్టం అవుతోంది. దుండగులలో ఒక్కరిని కూడా పట్టుకునేందుకు ప్రయత్నించక పోవడం ఆశ్చర్యం. ఈ సంఘటనపై ఢిల్లీ పోలీసులు సోమవారం మధ్యాహ్నం ‘గుర్తుతెలియని వ్యక్తుల’ పేరిట హిందీలో ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ఎఫ్ఐఆర్ కథనం ప్రకారం ‘పెరియార్ హాస్టల్ వద్ద కొంతమంది విద్యార్థులు గుమిగూడారని, వారు ఇతరులు కొడుతున్నారని, ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని ఆదివారం సాయంత్రం 3.45 గంటల ప్రాంతంలో క్యాంపస్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ వద్ద పోలీసు సబ్ ఇనిస్పెక్టర్‌కు సమాచారం అందింది. ఎఫ్ఐఆర్ కోసం ఫిర్యాదు చేసిన వసంత్‌కుంజ్ నార్త్ పోలీసు స్టేషన్‌కు చెందిన పోలీసు అధికారి, పోలీసు సబ్ ఇన్స్పెక్టర్, మరి కొంతమంది పోలీసులు పెరియార్ హాస్టల్ వద్దకు వెళ్లగా అక్కడ 50–60 మంది ముసుగులు ధరించి కర్రలతో విద్యార్థులను కొడుతూ కనిపించారు. పోలీసులను చూడగానే వారు అక్కడి నుంచి పారిపోయారు. సాయంత్రం ఏడు గంటలకు సబర్మతి హాస్టల్లోకి కొంత మంది దుండగులు ప్రవేశించి కొడుతున్నారని పోలీసు ఇన్స్పెక్టర్కు సమాచారం అందింది. ఆయన వెంటనే ఫిర్యాదు చేసిన పోలీసు అధికారిని, తన సిబ్బందిని తీసుకొని సబర్మతి హాస్టల్‌కు వెళ్లారు. అక్కడ 50–60 మంది ముసుగులు ధరించి వ్యక్తులు కర్రలతో విద్యార్థులను బాదడం కనిపించింది. వారిని మైకులో హెచ్చరించడంతో ఎక్కడి వారక్కడ వెళ్లిపోయారు. అదే సమయంలో క్యాంపస్‌లో శాంతి భద్రతలను పరిరక్షించాల్సిందిగా క్యాంపస్ అధికారుల నుంచి విజ్ఞప్తి అందడంతో అదనపు బలగాలను పోలీసులు పిలిపించారు. గాయపడిన విద్యార్థులను ఆస్పత్రికి తీసుకెళ్లారు’ ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వుల మేరకు గత కొంతకాలంగా క్యాంపస్ ఆవరణలో పోలీసు పికెట్ ఉంటోంది. ఆ రోజు 3.45 గంటల ప్రాంతంలోనే 50–60 మంది ముసుగు దుండగులను వారు చూసినప్పుడు వారు ఎందుకు స్పందించలేదు? సాయంత్రం కూడా వారు మళ్లీ కనిపించినప్పుడు వారిలో ఒక్కరిని కూడా పట్టుకునేందుకు ఎందుకు ప్రయత్నించలేదు? మొదట్లోనే అదనపు బలగాల కోసం వారు ఎందుకు కోరలేదు? దుండగులు 3.45 గంటల నుంచి రాత్రి ఏడున్నర గంటల వరకు స్వైర విహారం చేసిన క్యాంపస్ అధికారులు ఎందుకు సకాలంలో స్పందించలేదు? అసులు దాడి జరిగినప్పుడు క్యాంపస్‌లో ఎంత మంది పోలీసులు ఉన్నారు? అదనపు బలగాల్లో ఎంత మంది, ఎప్పుడు వచ్చారు? ప్రస్తుతానికి సమాధానంలేని ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు కొత్తగా దర్యాప్తు బాధ్యతలు చేపట్టిన ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులైన కనుక్కుంటారేమో చూడాలి! చదవండి: ఆమె తలపై ఉన్నది రక్తమేనా; కంపరంగా ఉంది జేఎన్‌యూలో దీపిక జేఎన్‌యూ : ఆ పోస్టర్లున్న గదులవైపు వెళ్లలేదు..! ‘జేఎన్‌యూ దాడి మా పనే’ అప్పట్లో తుక్డే-తుక్డే గ్యాంగ్ లేదు: కేంద్ర మంత్రి జేఎన్‌యూ దాడి: ఫాసిస్ట్ సర్జికల్ స్రైక్స్..! -
‘కింద ఉన్న ప్లకార్డు పట్టుకున్న.. వేరే ఉద్దేశం లేదు’
ముంబై : ‘కశ్మీర్‌కు విముక్తి కల్పించండి’అని ప్లకార్డు ప్రదర్శించిన ఓ యువతిపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. జేఎన్‌యూలో విద్యార్థులపై దాడికి నిరసనగా గేట్‌వే ముట్టడికి యత్నించి.. నిరసన తెలిపిన మహక్ మీర్జా ప్రభు.. ‘ఫ్రీ కశ్మీర్’అనే ప్లకార్డును ప్రదరించింది. దీంతో జాతీ సమైఖ్యతను దెబ్బతీసేలా వ్యవహరించారని పేర్కొంటూ ఐపీసీ సెక్షన్ 153B కింద పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. అయితే, ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడంతో కశ్మీరీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. వాటిని పునరుద్ధరించాలని కోరేందుకు ‘ఫ్రీ కశ్మీర్’ ప్లకార్డును ప్రదర్శించానని మహక్ మీర్జా తెలిపారు. కశ్మీరీల సమస్యను ప్రపంచం దృష్టికి తేవాలనే ఉద్దేశంతోనే అలా చేశానని పేర్కొన్నారు. అంతేగానీ, జాతి వ్యతిరేక నినాదాలు చేయడానికి కాదని ఆమె చెప్పుకొచ్చారు. (చదవండి : ఇక వాళ్లు దేశం విడిచి వెళ్లిపోవాల్సిందే..) ఆంక్షలు లేని కశ్మీర్ కావాలని అడగడం తన తప్పా అని ఆమె వాపోయారు. ఉద్దేశపూర్వకంగా తనపై కేసు నమోదు చేసి వేధిస్తే.. తదుపరి పర్యవసానాలకు సిద్ధంగా ఉండాలని ఆమె హెచ్చరించారు.మహక్ మీర్జా మాట్లాడుతూ.. ‘గేట్‌వే నిరసనలో పాల్గొనేందుకు సాయంత్రం 7.30 గంటలకు అక్కడకు చేరుకున్నా. కశ్మీర్లో ఇంటర్నెట్ సేవల పునరుద్ధరణ, భావ ప్రకటనా స్వేచ్ఛను హరించొద్దని అందరి దృష్టికి తెచ్చేందుకు అక్కడ పడి ఉన్న ఫ్రీకశ్మీర్ ప్లకార్డును చేతిలోకి తీసుకున్నా’అని ఆమె చెప్పుకొచ్చారు. మహక్ రచయిత కావడం గమనార్హం. ఇక ఈ ఘటనపై మహారాష్ట్ర ప్రతిపక్షనేత దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. నిరసనలు జరిగేది ఒక అంశంపై అయితే కశ్మీర్‌కు విముక్తి కావాలనే నినాదాలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ముంబైలో వేర్పాటువాదులకు స్థానమెవరిచ్చారని అన్నారు. సీఎం ఉద్ధవ్ నేతృత్వంలోనే దేశ వ్యతిరేక నినాదాలు పుట్టుకొచ్చాయా అని సందేహం వ్యక్తం చేశారు. -
ఆమె తలపై ఉన్నది రక్తమేనా; కంపరంగా ఉంది
కోల్‌కత/న్యూఢిల్లీ : ఢిల్లీలోని ప్రతిష్టాత్మక జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) విద్యార్థులపై దాడి ఘటనను దేశవ్యాప్తంగా ప్రజలు ఖండిస్తుండగా పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జేఎన్‌యూ స్టూడెంట్ లీడర్ ఆయిషీ ఘోష్ తలపై ఉన్నది రక్తమా... లేక పెయింటా..? అని చవకబారుగా మాట్లాడారు. కాగా, ముసుగులు ధరించిన దుండుగులు చేతిలో కర్రలతో యూనివర్సిటీలోకి చొరబడి పలువురు విద్యార్థులు, టీచర్లపై ఆదివారం దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో జేఎన్‌యూ కాంగ్రెస్ విద్యార్థి యూనియన్ ప్రెసిడెంట్ (జేఎన్‌యూఎస్‌యూ) ఆయిషీ ఘోష్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయిషీ ఘోష్ సహా 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనలో వర్సిటీ ఆస్తులు కూడా ధ్వంసమయ్యాయి. (చదవండి : జేఎన్‌యూలో దీపిక) ‘చదువులను గాలికొదిలేసి విద్యార్థులంతా రోజూ ఇదే అంశాన్ని లేవనెత్తుతూ నిరసనలకు దిగుతున్నారు. ఇంతకూ ఆయిషీ ఘోష్ తలపై ఉన్నది రక్తమేనా.. లేక ఎరుపు రంగా..? ఇదంతా కావాలనే చేస్తున్నట్టుగా ఉంది’అని దిలీప్ ఘోష్ మంగళవారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ అన్నారు. కాగా, ఆయిషీ తల్లి షర్మిష్ఠా ఘోష్ మాట్లాడుతూ.. ‘బీజేపీ నేత దిలీప్ వ్యాఖ్యలపై స్పందించాలంటేనే కంపరంగా ఉంది. జేఎన్‌యూలో పరిస్థితులు మెరుగు పడకుంటే.. ప్రస్తుతం ఉన్న వీసీనే ఇంకా కొనసాగితే.. అక్కడ చదువుకోవడానికి పిల్లల్ని అనుమతించం’ అన్నారు. దిలీప్ కాస్త మనిషిగా ఆలోచిస్తే మంచిదని బెంగాల్ విద్యాశాఖ మంత్రి పార్థా ఛటర్జీ హితవు పలికారు. (చదవండి : ‘జేఎన్‌యూ దాడి మా పనే’) జేఎన్‌యూ దాడిలో కొత్త విషయాలు జేఎన్‌యూలో దుండగుల వీరంగం -
జేఎన్‌యూలో దీపిక
న్యూఢిల్లీ: ప్రముఖ బాలీవుడ్ నటి దీపిక పదుకొనే మంగళవారం సాయంత్రం ఢిల్లీలోని జేఎన్‌యూని సందర్శించారు. వర్సిటీలో ఆదివారం ముసుగులు ధరించిన దుండుగులు విచ్చలవిడిగా దాడిచేసి పలువురు విద్యార్థులు, టీచర్లను తీవ్రంగా గాయపర్చిన విషయం తెలిసిందే. బాధిత విద్యార్థులకు సంఘీభావంగా దీపిక జేఎన్‌యూకి వచ్చారు. నలుపు దుస్తులు ధరించి వచ్చిన దీపిక.. దాదాపు 10 నిమిషాల పాటు క్యాంపస్‌లో ఉన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆజాదీ నినాదాలతో ఆమెకు స్వాగతం పలికారు. 7.40 గంటలకు క్యాంపస్‌లోకి వచ్చిన దీపిక అక్కడ జరిగిన ఒక పబ్లిక్ మీటింగ్‌కు హాజరయ్యారు. అయితే, విద్యార్థులనుద్దేశించి దీపిక ఏమీ మాట్లాడలేదు. జేఎన్‌యూలో దీపిక ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దర్యాప్తు ప్రారంభం జేఎన్‌యూలో హింసపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. హింసకు సంబంధించిన ఆడియో, వీడియో తదితర ఆధారాలను అందించాల్సిందిగా ప్రజలకు పోలీసులు విజ్ఞప్తి చేశారు. దాడికి బాధ్యత వహిస్తున్నామని ఒక హిందుత్వ సంస్థ ప్రకటించింది. జేఎన్‌యూ విద్యార్థులపై దాడికి సంబంధించి హిందూ రక్షాదళ్ అనే సంస్థ మంగళవారం ఒక వీడియోను విడుదల చేసింది. పింకీ చౌధరిగా తనను తాను ఆ వీడియోలో పరిచయం చేసుకున్న వ్యక్తి.. జాతి వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడేవారికి జేఎన్‌యూ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు పట్టిన గతే పడ్తుందంటూ హెచ్చరికలు జారీ చేశారు. యూనివర్సిటీ సర్వర్ రూమ్‌ను ధ్వంసం చేసిన ఘటనకు సంబంధించి యూనివర్సిటీ విద్యార్థి సంఘం(జేఎన్‌యూఎస్‌యూ) అధ్యక్షురాలు ఆయిషీ ఘోష్‌పై కేసు నమోదు అయింది. సర్వర్ రూమ్‌ను ధ్వంసం చేయడానికి సంబంధించి ఘోష్ సహా జేఎన్‌యూఎస్‌యూ విద్యార్థి సంఘ కీలక నేతల పేర్లను వర్సిటీ అధికారులు పోలీసులకు ఇచ్చారు. ‘జరిగిన ఘటన దురదృష్టకరం.గతాన్ని పక్కనబెట్టి.. విద్యార్థులంతా తిరిగి క్యాంపస్‌కు రావాలి’ అని జేఎన్‌యూ వీసీ జగదీశ్ కుమార్ కోరారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదలచేశారు. -
జేఎన్‌యూ : ఆ పోస్టర్లున్న గదులవైపు వెళ్లలేదు..!
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలోని జేఎన్‌యూ హాస్టళ్లపై ఆదివారం రాత్రి ఓ పథకం ప్రకారమే దాడి జరిగిందనడానికి అనేక కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. 200 మీటర్ల దూరంలో ఉన్న పెరియార్, సబర్మతి హాస్టళ్లపై దుండగులు దాడులు జరిపారు. సబర్మతి హాస్టల్లోనే ఎక్కువ గదులు ధ్వంసమయ్యాయి. అవన్నీ కూడా వామపక్ష, ముస్లిం విద్యార్థులవే అవడం గమనార్హం. సబర్మతి హాస్టల్లోనే జేఎన్‌యూ విద్యార్థి సంఘం నాయకురాలు ఐశే ఘోష్‌పై దాడి జరిగిందని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని ఓ రీసర్చ్ స్కాలర్ తెలిపారు. కళ్లు కనిపించని ఓ సంస్కత స్కాలర్ గదిపై కూడా దాడి చేశారు. ఆ గది తలుపుపై బీఆర్ అంబేడ్కర్ పోస్టర్ ఉండడమే అందుకు కారణమని తెలుస్తోంది. (చదవండి : ‘జేఎన్‌యూ దాడి మా పనే’) ‘బాబర్ కీ ఔలాద్’ అంటూ తనను చితక బాదినట్లు ఓ కశ్మీర్ విద్యార్థి ఆరోపించారు. ఏబీవీపీ పోస్టర్లు, గుర్తులున్న ఏ హాస్టల్ గదిపై దుండగులు దాడి చేయక పోవడం గమనార్హం. దుండగులు దాడి చేసినప్పుడు పలువురు విద్యార్థులు తమ సెల్ఫోన్ల ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎవరు రాలేదని వారు చెబుతున్నారు. ఆ రోజు హాస్టళ్ల వద్ద సాయంత్రం మూడు గంటల నుంచి రాత్రి పదకొండు గంటలవరకు విధులు నిర్వహించాల్సిన షిప్టులో ఒక్క గార్డు కూడా హాజరుకాక పోవడం ముందస్తు ప్రణాళికను సూచిస్తోంది. ఈ విషయమై మీడియా ముందు స్పందించేందుకు గార్డులు నిరాకరించారు. (చదవండి : భయంతో ఫస్ట్ ఫ్లోర్ నుంచి దూకేశారు...) -
విద్యార్థులే లక్ష్యంగా దాడులా...?
న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరం ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో దుండగుల వీరంగాన్ని భారత క్రీడాలోకం ఖండించింది. ఆదివారం రాత్రి ముఖాలకు ముసుగులు ధరించిన దుండగులు వర్సిటీలోకి చొరబడి విద్యార్థులు, ప్రొఫెసర్లపై విచక్షణ రహితంగా కర్రలు, ఇనుప రాడ్లతో దాడికి పాల్పడ్డారు. ఇందులో విద్యార్థి యూనియన్ అధ్యక్షురాలు ఆయుషి ఘోష్ సహా 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఉదంతంపై భారత మాజీ క్రికెటర్, ప్రస్తుత బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్, ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన ఇర్ఫాన్ పఠాన్, అగ్రశ్రేణి టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న, బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల ట్విట్టర్లో స్పందిస్తూ దాడిని ముక్తకంఠంతో ఖండించారు. ‘వర్సిటీ క్యాంపస్‌లో జరిగిన హింస భారత దేశ సంస్కృతికి విరుద్ధమైంది. కారణాలేవైనా కావొచ్చు... కానీ విద్యార్థులే లక్ష్యంగా దాడి చేయడం హేయమైన చర్య. ఇలాంటి దుండగులను కఠినంగా శిక్షించాల్సిందే’. –గౌతమ్ గంభీర్ ‘జేఎన్‌యూలో ఆదివారం జరిగిన ఘటన దారుణమైనది. ఏకంగా క్యాంపస్‌లోపలే ఉన్న హాస్టళ్లలో చొరబడి ఇలా విచక్షణా రహితంగా దాడిచేయడం మన దేశ ప్రతిష్టను దిగజార్చుతుంది’. –ఇర్ఫాన్ పఠాన్ ‘యూనివర్సిటీ క్యాంపస్‌లో భయానక దాడి జరిగింది. ఇది సిగ్గుచేటు. ఎవరైతే ఈ దురాగతానికి పాల్పడ్డారో వారిని కచ్చితంగా కఠినంగా శిక్షించాలి’. – రోహన్ బోపన్న ‘ఇంత జరిగాక కూడా మౌనమేంటి? విద్యార్థుల్ని ఎలా చావబాధారో చూశాం. దుండగుల్ని ఉపేక్షించడం ఎంతమాత్రం తగదు. పట్టుకొని శిక్షించాల్సిందే’. –గుత్తా జ్వాల -
భయంతో ఫస్ట్ ఫ్లోర్ నుంచి దూకేశారు...
సాక్షి, న్యూఢిల్లీ : జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో ముసుగులు ధరించిన దుండగులు సృష్టించిన బీభత్సానికి విద్యార్థులు భయంతో వణికిపోయారు. దాడి నుంచి తప్పించుకునేందుకు ఇద్దరు విద్యార్థులు మొదటి అంతస్తు నుంచి దూకడంతో గాయాలపాలయ్యారు. ఆదివారం సాయంత్రం కొందరు...ముఖం కనిపించకుండా ముసుగు కట్టుకుని క్యాంపస్‌లోకి ప్రవేశించి విద్యార్ధులు, ప్రొఫెసర్లను హాకీ స్టిక్స్‌తో చితకబాదడంతో పాటు వాహనాలను, ఆస్తులను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. దుండగలు క్యాంపస్‌లోని సబర్మతి హాస్టల్లోకి చొరబడి దొరికిన వారిని దొరికినట్లు చితకబాదారు. ఈ దాడిలో విద్యార్థి సంఘం నేతతో పాటు పలువురు విద్యార్ధులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడికి భయపడి హాస్టళ్లలోని తమ గదుల్లో దాక్కున్నారు. దుండగుల దాడి నుంచి తప్పించుకునేందుకు పలువురు విద్యార్థులు మొదటి అంతస్తు నుంచి కిందకు దూకేశారు. దీంతో పలువురి విద్యార్థుల కాళ్లకు గాయాలు అయ్యాయి. మరోవైపు ఈ ఘటనతో విద్యార్థులకు భద్రత కల్పించలేకపోయామంటూ హాస్టల్ వార్డెన్ ఆర్. మీనా సోమవారం రాజీనామా చేశారు. ఈ మేరకు యూనివర్శిటీ స్టూడెంట్ డీన్‌కు లేఖ రాశారు. తాము దుండగులను అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని, హాస్టళ్లకు భద్రత కల్పించలేకపోయామని తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. కాగా సుమారు 400మంది విద్యార్థులు ఉన్న సబర్మతి హాస్టల్‌తో పాటు మరికొన్ని హాస్టల్స్‌లోకి ప్రవేశించి దుండగులు దాడి చేశారు. దాడి అనంతరం హాస్టల్ భవనంలోని ప్రతి అంతస్తు బీభత్స వాతావరణాన్ని తలపించింది. కిటికీ అద్దాలు, తలుపులు, ఫర్నిచర్ పూర్తిగా ధ్వంసం అయ్యాయి. దుండగులు సమారు మూడు గంటల పాటు జేఎన్‌యూలో విధ్వంస కాండను కొనసాగించారు. ఈ దాడిలో యూనివర్శిటీ విద్యార్థి సంఘం ప్రెసిడెంట్ ఆయిసీ ఘోష్ సహా సుమారు 35మంది ఉపాధ్యాయులు, విద్యార్థులు గాయడ్డారు. దాడికి పాల్పడిన వారిని గుర్తించినట్లు చెబుతున్న పోలీసులు... ఇప్పటి వరకూ ఎవరినీ అరెస్ట్ చేయలేదు. ఇక దాడికి పాల్పడిన వారి వివరాలు బయటపెట్టాలంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే డిమాండ్ చేశారు. చదవండి: జేఎన్‌యూపై దాడి చేసింది వీరేనా! జేఎన్‌యూపై ‘నాజీ’ తరహా దాడి..! జేఎన్‌యూ వీసీ వెంటనే రాజీనామా చేయాలి జేఎన్‌యూ దాడి: దుండగుల గుర్తింపు ఆ ఘటన నన్ను షాక్‌కు గురిచేసింది: కేజ్రీవాల్ నన్ను తీవ్రంగా కొట్టారు ఈరోజు నా కూతురు.. రేపు మీపై కూడా.. సిగ్గుచేటు.. పాశవిక చర్య: మాయావతి సిగ్గుతో తలదించుకుంటున్నా! జేఎన్‌యూలో దుండగుల వీరంగం -
జేఎన్‌యూపై ‘నాజీ’ తరహా దాడి..!
న్యూఢిల్లీ: జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో చోటుచేసుకున్న హింసపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. పలువురు ముఖ్యమంత్రులు, రాజకీయ నాయకులు క్యాంపస్‌లో చోటుచేసుకున్న హింసాత్మక దాడులను ఖండిస్తున్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పందిస్తూ దేశంలో పెరిగిపోతున్న అసహనానికి ఈ దాడులు నిదర్శనమని పేర్కొన్నారు. ‘విద్యార్థులపై జరిగిన భీకరమైన దాడి.. అసహనానికి నిదర్శనం. జేఎన్‌యూ క్యాంపస్‌లో విద్యార్థులు, టీచర్లపై ‘నాజీ స్టైల్’లో దాడి జరిగింది. దేశంలో హింస, అశాంతి సృష్టించాలనుకునేవాళ్లే ఇలాంటి దాడులు చేస్తారు’ అని పినరయి ట్విటర్లో పేర్కొన్నారు. ‘క్యాంపస్‌లో రక్తపాతాలు సృష్టించే ఇలాంటి ప్రమాదకరమైన ఆటలు ఆడటాన్ని సంఘ్ పరివార్ శక్తులు ఇప్పటికైనా ఆపాలి. విద్యార్థుల గొంతు.. ఈ దేశ గొంతుగా వారు ఇప్పటికైనా గుర్తిస్తే మంచిది’ అని అన్నారు. జేఎన్‌యూ క్యాంపస్‌లో దాడుల నేపథ్యంలో క్యాంపస్ విద్యార్థులకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంఘీభావం ప్రకటించారు. విద్యార్థులు సాహసోపేతంగా వ్యవహరిస్తూ.. నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నందుకే వారిని ‘శిక్షించేందుకు’ ఈ క్రూరమైన దాడులు జరిగాయని ఒవైసీ ఆరోపించారు. కేంద్ర మంత్రులు కూడా నిస్సహాయత వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేస్తున్నారని, పోలీసులు ఎందుకు గూండాలకు రక్షణగా ఉన్నారో మోదీ సర్కార్ చెప్పాలని డిమాండ్ చేశారు. జేఎన్‌యూలో దాడులను బీఎస్పీ అధినేత్రి మాయావతి ఖండించారు. ఈ దాడులను కేంద్రం సీరియస్‌గా తీసుకోవాలని, దీనిపై జ్యుడీషియల్ విచారణ జరిపితే మంచిదని ఆమె సూచించారు. -
జేఎన్‌యూ వీసీ వెంటనే రాజీనామా చేయాలి
న్యూఢిల్లీ: జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో ఆదివారం చోటుచేసుకున్న హింస నేపథ్యంలో వర్సిటీ అధికారిక విద్యార్థి సంఘం (జేఎన్‌యూఎస్‌యూ) వీసీని టార్గెట్ చేసింది. క్యాంపస్‌లో జరిగిన దాడులకు జేఎన్‌యూ వీసీ జగదేశ్‌కుమార్ కారణమని నిందించింది. వీసీ ఒక మాబ్‌స్టెర్‌గా వ్యవహరిస్తూ యూనివర్సిటీలో హింసను ప్రేరేపిస్తున్నాడని, తన బాసులను సంతృప్తి పరిచేందుకే ఈ చర్యలను ప్రోత్సహిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదివారం సాయంత్రం ముసుగులు ధరించి చేతిలో కర్రలతో క్యాంపస్‌లోకి చొరబడిన దుండగులు విచక్షణారహితంగా దాడులకు తెగబడ్డారు. ఈ దాడిలో యూనివర్సిటీ విద్యార్థి సంఘం(జేఎన్‌యూఎస్‌యూ) ప్రెసిడెంట్ ఆయిషీ ఘోష్ సహా 20మందికిపైగా గాయపడ్డారు. ఈ దాడులకు ఏబీవీపీ విద్యార్థులే కారణమని వామపక్ష విద్యార్థి సంఘాలతో కూడిన జేఎన్‌యూఎస్‌యూ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో క్యాంపస్‌లో హింసకు వీసీ జగదేశ్ కారణమని, ఆయన తక్షణం తన పదవికి రాజీనామా చేయాలని ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది. జేఎన్‌యూలో సబర్మతి దాబా వద్ద ఆదివారం సాయంత్రం 6.45 గంటలకు అలజడి ప్రారంభమై.. కొద్దిసేపట్లోనే మొత్తం హాస్టల్ అంతా హింస చెలరేగింది. ముసుగులు ధరించిన వ్యక్తులు దాడులు చేయడం, పోలీసులు రావడంతో క్యాంపస్ అంతా ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోయింది. ఏబీవీపీ, ఆరెస్సెస్ గూండాలు తమపై దాడి చేసినట్టు వామపక్షవాద విద్యార్థులు ఆరోపిస్తుండగా.. ఏఐఎస్ఏ, ఎస్ఎఫ్ఐ విద్యార్థులే దాడులకు దిగారని రైట్‌వింగ్ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. -
జేఎన్‌యూ విద్యార్ధులపై లాఠీచార్జ్
సాక్షి, న్యూఢిల్లీ : ఫీజుల పెంపుపై జేఎన్‌యూ విద్యార్ధుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఫీజుల పెంపును నిరసిస్తూ సోమవారం రాష్ట్రపతి భవన్‌కు విద్యార్ధులు చేపట్టిన ప్రదర్శనలో ఘర్షణ చెలరేగగా పోలీసులు వారిని చెదరగొట్టారు. తమ సమస్యలను రాష్ట్రపతికి నివేదించేందుకు పెద్ద సంఖ్యలో ప్రదర్శనగా వెళుతున్న విద్యార్ధులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. కాగా, ఆందోళనకారులు భికాజి కమాప్లేస్ మెట్రో స్టేషన్ వద్ద బారికేడ్లను తోసుకుంటూ ముందుకు చొచ్చుకువచ్చేందుకు ప్రయత్నించగా వారిపై లాఠీచార్జి చేశామని పోలీసులు తెలిపారు. హాస్టల్ చార్జీల పెంపును పూర్తిగా ఉపసంహరించేందుకు వర్సిటీ అధికారులు నిరాకరించడంతో విద్యార్ధులు రాష్ట్రపతి భవన్ వరకూ నిరసన ప్రదర్శనకు పూనుకున్నారు. శాంతియుతంగా రాష్ట్రపతి భవన్‌కు ప్రదర్శనగా వెళుతున్న తమపై ఖాకీలు జులుం ప్రదర్శించారని, లాఠీచార్జ్‌తో విరుచుకుపడ్డారని విద్యార్ధులు ఆరోపించారు. హాస్టల్ ఫీజుల పెంపుపై గత కొన్ని రోజులుగా విద్యార్ధుల ఆందోళనతో జేఎన్‌యూ అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. -
జేఎన్‌యూ విద్యార్థులపై లాఠీచార్జి
న్యూఢిల్లీ: హాస్టల్ ఫీజుల పెంపునకు నిరసనగా జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) విద్యార్థులు సోమవారం చేపట్టిన పార్లమెంట్ మార్చ్ ఉద్రిక్తతలకు దారి తీసింది. ఫీజుల పెంపును నిరసిస్తూ వర్సిటీ నుంచి పార్లమెంట్ వైపు ర్యాలీగా బయలుదేరిన విద్యార్థులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడు ఆయిషీ ఘోష్ సహా దాదాపు 100 మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. పలువురిపై లాఠీ చార్జ్ చేశారు. పోలీసుల దాడిలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. సోమవారం నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకున్నారు. ఫీజులు తగ్గించాలన్న డిమాండ్‌తో జేఎన్‌యూ విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఢిల్లీ వీధుల్లో నినాదాలు చేసుకుంటూ ముందుకుసాగారు. పార్లమెంటు భవనం వద్దకు వెళ్లేందుకు యత్నించడంతో అప్రమత్తమైన పోలీసులు సఫ్దర్‌గంజ్ సమాధి వద్ద వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడే బైఠాయించి విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. పార్లమెంట్ సమీపంలో ఉన్న మూడు మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేశారు. ఉద్యోగ్ భవన్, పటేల్ చౌక్ మెట్రో స్టేషన్లలో రైళ్ల హాల్టింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. నెల్సన్ మండేలా మార్గ్, అరబిందోమార్గ్, బాబా గంగానాథ్ మార్గ్‌లలో పలు ఆంక్షలు విధించారు. విద్యార్థుల ఆందోళనలతో ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. కాగా, పోలీసుల తీరుపై విద్యార్థులు విరుచుకుపడ్డారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పోలీసుల దాడిలో గాయపడిన విద్యార్థుల చిత్రాలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘ఎమర్జెన్సీ ఇన్ జేఎన్‌యూ’పేరుతో ట్యాగ్ చేశారు. ఈ ట్యాగ్ ట్విట్టర్లో ట్రెండ్ అయింది. త్రిసభ్య కమిటీ ఏర్పాటు.. జేఎన్‌యూలో సాధారణ పరిస్థితులు నెలకొల్పే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. దీనిలో భాగంగా ముగ్గురు సభ్యులతో కూడిన హైపవర్ కమిటీని ఏర్పాటుచేసినట్లు కేంద్ర మానవ వనరుల శాఖ కార్యదర్శి ఆర్.సుబ్రహ్మణ్యం వెల్లడించారు. ఈ కమిటీలో యూజీసీ మాజీ చైర్మన్ వీఎస్ చౌహాన్, ఏఐసీటీఈ చైర్మన్ అనిల్ సహస్రబుద్ధ, యూజీసీ కార్యదర్శి రజనీష్ జైన్ సభ్యులుగా ఉండనున్నారు. ఈ కమిటీకి యూజీసీ సహకారం అందించనుంది. -
పార్లమెంట్ ముట్టడి: జేఎన్‌యూలో 144 సెక్షన్
సాక్షి, న్యూఢిల్లీ: సమస్యల పరిష్కారం కోరుతూ దేశ ప్రతిష్టాత్మక విద్యాసంస్థ జేఎన్‌యూ (జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం) విద్యార్థులు పార్లమెంట్ మార్చ్‌కు పిలుపునిచ్చారు. సోమవారం పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయిన నేపథ్యంలో భారీ ధర్నాకు విద్యార్థులు బయలుదేరారు. ఫీజుల పెంపునకు నిరసనగా ఢిల్లీ వీధుల్లో నిరసన ర్యాలీని చేపట్టారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్, జేఎన్‌యూ పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు. యూనివర్సిటీలో 144 సెక్షన్‌ను విధించారు. 1400 మంది అదనపు బలగాలను వర్సిటీకి తరలించారు. దీంతో పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాగా హాస్టల్ గది అద్దె, మెస్ ఛార్జీల పెంపు, డ్రెస్‌కోడ్‌లను విధించేందుకు వీలుగా హాస్టల్ మాన్యువల్‌లో ప్రతిపాదించిన మార్పులను ఉపసంహరించుకోవాలంటూ విద్యార్థులు నిరసనబాట పట్టిన విషయం తెలిసిందే. అయితే జేఎన్‌యూ వ్యవహారాలను చర్చించేందుకు వర్సిటీ మానవ వనరుల శాఖ ఇదివరకే త్రిసభ్య కమిటీని నియమించింది. -
పతనమవుతున్న ఉన్నత విద్యా సంస్థలు
సాక్షి, న్యూఢిల్లీ : ‘విద్యా ఓ ప్రాథమిక హక్కు, కాసులకు కల్పించే ప్రత్యేక సదుపాయం కాదు’. అందుకని ప్రతి పౌరుడికి అందుబాటులోకి విద్యను తీసుక రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆ దిశగా ప్రభుత్వ విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించింది. పైగా ఢిల్లీలోని ప్రతిష్టాకరమైన జవహర్ లాల్ నెహ్రూ (జేఎన్‌యూ) విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న విద్యార్థుల హాస్టల్ ఫీజులను అమాంతం 999 శాతం పెంచింది. దీంతో ఆగ్రహోదగ్రులైన యూనివర్శిటీ విద్యార్థులు సమర శంఖం పూరించడంతో దద్దరిల్లిన కేంద్ర మానవ వనరుల శాఖ కార్యాలయం దిగివచ్చింది. పెంపు ప్రతిపాదనలను భారీగా తగ్గించింది. అయినా అవి ఇప్పటికీ విద్యార్థులకు భారమే అవుతాయి. తగ్గించిన ప్రతిపాదనల మేరకు హాస్టల్ గదులకు నెలకు రెండు కేటగిరీల (దారిద్య్ర రేఖకు దిగువ, ఎగువ) కింద 300, 150 రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది. ఇతర సౌకర్యాలకు అదనంగా మరో 800 రూపాయలు చెల్లించాలి. ఇప్పటి వరకు హాస్టల్ గదుల అద్దె నెలకు 20, 10 రూపాయలు మాత్రమే ఉండింది. అదనపు చార్జీలు ఇంతకుముందు లేవు. భారత ప్రథమ ప్రధాన మంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ విశ్వసించే సామాజిక సమానత్వం, లౌకికవాదం, శాస్త్రీయ దక్పథం, అంతర్జాతీయ అవగాహన ఆశయాలకు అనుగుణంగా ఈ జెఎన్యూ యూనివర్శిటీని 1966లో ప్రారంభించారు. అందుకని అన్నింటిలో నామ మాత్రపు చార్జీలనే కొనసాగిస్తూ వచ్చారు. ఆశయాలకు అనుగుణంగానే కుల మతాలు, వర్గాలు, ప్రాంతీయ తత్వాలకు దూరంగా సామాజిక–ఆర్థిక సమానత్వమే ప్రాతిపదికగా యూనివర్శిటీ ఎదుగుతూ వచ్చింది. సమాజంలో ఎక్కడా ఏ అలజడి జరిగినా దాని ప్రతి ధ్వని జేఎన్‌యూలో వినిపిస్తుంది. పాలకుల నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు దీని ప్రతిష్ట మసక బారుతోంది. పడిపోతున్న యూనివర్శిటీల గ్లోబల్ ర్యాంకులు 2014 సంవత్సరం నుంచి అంతర్జాతీయంగా దేశంలోని అన్ని ప్రతిష్టాత్మక జాతీయ యూనివర్శిటీల ర్యాంకులు పడిపోతున్నాయి. 2014లో భారత జాతీయ యూనివర్శిటీకి 328 గ్లోబల్ ర్యాంకు ఉండగా, అది 2015 నాటికి 341, 2016 నాటికి 354, 2017 నాటికి 397, 2018 నాటికి 420వ ర్యాంకుకు పడిపోయింది. దేశంలో ఏటేటా విద్యా రంగానికి ఆర్థిక కేటాయింపులు తగ్గిపోవడం, ఖాళీ అవుతున్న ప్రొఫెసర్ల పోస్టులను భర్తీ చేయక పోవడం ప్రధాన కారణాలు. విద్యారంగం పెట్టుబడులకు అధిక ప్రాధాన్యత ఇస్తామంటూ అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం 2014–2015 సంవత్సరానికి జీడీపీలో 4.14 శాతం నిధులను కేటాయించగా, అవి 2019–2020 సంవత్సరానికి 3.4 శాతానికి పడిపోయాయి. కేంద్ర విశ్వవిద్యాలయాల్లో 2018, జూలై నాటికి 5,606 ప్రొఫెసర్ల పోస్టులు, అంటే 33 శాతం, ఐఐటీల్లో 2,802 పోస్టులు, అంటే 34 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రి సత్యపాల్ సింగ్ 2018, జూలై 23వ తేదీన లోక్‌సభకు తెలియజేశారు. ఆ పోస్టుల భర్తీకి కేంద్రం ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇక విద్యా సంస్థలను ఆ రాముడే కాపాడాలి. -
కేంద్ర మంత్రిని నిర్బంధించిన విద్యార్థులు!
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) మరోసారి విద్యార్థుల ఆందోళనలతో దద్దరిల్లింది. హాస్టల్ ఫీజులు పెంచడం, నిబంధనలు కఠినతరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున జేఎన్‌యూ విద్యార్థులు సోమవారం ఆందోళనకు దిగారు. జేఎన్‌యూ స్నాతకోత్సవానికి కేంద్ర మానవవరులశాఖ మంత్రి రమేశ్ పొఖ్రియాల్ హాజరవ్వడంతో ఆయనకు వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళనబాట పట్టారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులు జేఎన్‌యూ గేట్‌ను నిర్బంధించి.. కేంద్ర మంత్రి రమేశ్‌ను యూనివర్సిటీ ప్రాంగణ బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. విద్యార్థులు పెద్దసంఖ్యలో ఉండటంతో వారిని నియంత్రించడం పోలీసులకు కూడా కష్టసాధ్యంగా మారినట్టు తెలుస్తోంది. తమ డిమాండ్లు నెరవేరే వరకు మంత్రిని బయటకు వెళ్లనివ్వమని విద్యార్థులు పట్టుబడుతున్నారు. విద్యార్థులు జేఎన్‌యూ గేట్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుండటంతో స్నాతకోత్సవ ప్రాంగణంలోనే మంత్రిని నిర్బంధించినట్టు అయింది. హాస్టల్ మ్యానువల్ విద్యార్థులకు చుక్కలు చూపిస్తోందని, దీనిని మార్చాల్సిందేనని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. -
‘ఆ యూనివర్సిటీకి మోదీ పేరు పెట్టండి’
న్యూఢిల్లీ : బీజేపీ ఎంపీ హన్స్‌రాజ్ హన్స్ సరికొత్త డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. జవహర్లాల్ నెహ్రు యూనివర్సిటీ(జేఎస్‌యూ) పేరును మర్చాలని సూచించారు. దాని పేరును మోదీ నరేంద్ర యూనివర్సిటీగా(ఎంఎన్‌యూ) మార్చాలని కోరారు. శనివారం జేఎన్‌యూను సందర్శించిన హన్స్‌రాజ్ అక్కడ ఆర్టికల్ 370 రద్దుపై మాట్లాడారు. జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులు ప్రశాంతంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్టు హన్స్‌రాజ్ తెలిపారు. పూర్వీకులు చేసిన తప్పులకు ఇప్పుడు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పారు. అలాగే జేఎన్‌యూ పేరును ఎంఎన్యూగా మర్చాలని సూచించారు. మోదీ పేరు మీద కూడా ఏదో ఒకటి ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా, 1969లో ఏర్పాటైన జేఎన్యూకు.. భారత ప్రథమ ప్రధాని జవహరలాల్ నెహ్రు పేరు పెట్టడం జరిగింది. -
‘నా కల నిజమైంది.. మళ్లీ ఆశలు చిగురించాయి’
మనసుంటే మార్గముంటుంది అనడానకి ఈ సంఘటనే నిదర్శనం. అతను ఓ సెక్యూరిటీ గార్డు. నెలకు రూ.15వేల జీతం. బతుకుదెరువు కోసం పని చేస్తున్నాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే. అయితేనేం చదువుకోవాలన్న అతడి ఆకాంక్ష ముందు ఇవన్నీ చిన్నవైపోయాయి. అందుకే పనిచేసే చోటే విద్యార్థిగా నూతన జీవితాన్ని ఆరంభించాడు రాంజల్ మీనా. న్యూఢిల్లీ : రాజస్తాన్‌కు చెందిన రాంజల్ మీనా ఓ దినసరి కూలీ కొడుకు. అతని కుటుంబం నివసిస్తున్న బజేరా గ్రామంలో సరైన విద్యావసతులు లేవు. చదువుకోడానికి 28 నుంచి 30 కిలోమీటర్ల దూరం వెళ్లాలి. దీంతో మీనా చదువుకు ఆటంకం ఏర్పడింది. తన తండ్రికి చేదోడువాదోడుగా ఉందామని పనికి కుదిరాడు. ప్రస్తుతం అతడు ముగ్గురు పిల్లలలకు తండ్రి అయ్యాడు. నేటికీ అతనికి చదువంటే మమకారం పోలేదు. ఆ ఇష్టంతోనే గత సంవత్సరం దూరవిద్య ద్వారా రాజస్తాన్ యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్, హిస్టరీ, హిందీ నుంచి డిగ్రీ పట్టాను పొందాడు. అయినా అతను సంతృప్తి చెందక చదువుపై మరింత ధ్యాస పెంచుకున్నాడు. పని, చదువు రెండూ ఒకటే రాంజల్ మీనా 2014లో సెక్యూరిటీ గార్డుగా జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో అడుగు పెట్టాడు. ఇప్పుడు అదే విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్షలో నెగ్గి తన కల నిజం చేసుకున్నాడు. బిఏ రష్యన్లో సీటు దక్కించుకున్నాడు. ఈ విషయం గురించి మీనా మాట్లాడుతూ.. తాను చదువుకోడానికి జేఎన్‌యూ యాజమాన్యం, విద్యార్థులు అండగా నిలిచారన్నాడు. ఫోన్లు, పత్రికల ద్వారానే పరీక్షకు ప్రిపేర్ అయ్యానన్నాడు. ఎలాగైనా సీటు సంపాదించాలన్న ధ్యేయంతో ఉద్యోగ నిర్వహణకు ఏ ఆటంకం కలగకుండా పరీక్షకు సన్నద్ధమయ్యానన్నాడు. తాను కోరుకున్నది దక్కినందుకు సంతోషంగా ఉందని తెలిపాడు. ఓవర్‌నైట్‌లో ఫేమస్ అయిపోయినట్టుగా ఉందని ఆనందంతో తబ్బిబ్బయిపోయాడు. ‘నేను మళ్లీ చదువుతాననుకోలేదు. కానీ నా కల నిజమయింది, ఇపుడు నాలో మళ్లీ ఆశలు చిగురించాయి. భూగోళాన్ని చుట్టి రావచ్చు అనే ఉద్దేశ్యంతోనే ఫారిన్ లాంగ్వేజ్‌ను ఎంపిక చేసుకున్నాను. దీని ద్వారా సివిల్ పరీక్షలోనూ నా అదృష్టాన్ని పరీక్షించుకుంటాను. ఈ యూనివర్సిటీ ఎందరో విజ్ఙానవంతులను అందించింది. వారిలాగే నేను కూడా ఏదైనా సాధిస్తా’ అంటూ లక్ష్యం దిశగా పయనిస్తున్నాడు. రాత్రి పనిచేస్తూ పగలు చదువు మీనాకు భార్య, ముగ్గురు పిల్లలు. వారింట్లో ఎప్పుడూ సమస్యలు తిష్ట వేసి ఉంటాయి. ఢిల్లీలోని మునిర్కలో ఒక గదిలో వీరి కుటుంబం నివసిస్తోంది. పూట గడవాలంటే పని చేయక తప్పని పరిస్థితి. ఇదే విషయాన్ని అతని భార్య మీనాకు గుర్తు చేసింది. అయితే ఎట్టి పరిస్థితుల్లో వెనుకడుగు వేయకూడదని నిశ్చయించుకున్న మీనా రాత్రిళ్లు పని చేస్తానని చెప్పాడు. రాత్రిళ్లు ఉద్యోగం చేసేలా అవకాశం కల్పించమని యూనివర్సిటీ యాజమాన్యాన్ని అభ్యర్థించాడు. ఎందుకంటే ఆ కుటుంబం గడిచేది అతని ఒక్క జీతంతోనే! అండదండలు మీనా సాధించిన విజయం గురించి జేఎన్‌యూ వైస్ చాన్సలర్ జగదీశ్ మాట్లాడుతూ.. ‘మేం ఎప్పుడూ విద్యార్థుల బ్యాక్‌గ్రౌండ్‌ను పట్టించుకోము. వారు ఏ సామాజిక వర్గానికి చెందిన వారైనా వారిని ఎప్పుడూ ప్రోత్సహిస్తాం. వారికి బోధిస్తూనే మేము కూడా శిక్షణ పొందుతాం’ అని పేర్కొన్నారు. ఇక నవీన్ యాదవ్ అనే ప్రధాన సెక్యూరిటీ అధికారి మాట్లాడుతూ మీనాను చూసి తామంతా గర్వపడుతున్నామన్నారు. కానీ రెగ్యులర్ కళాశాలలో రాత్రిళ్లు డ్యూటీలు వేయటం కష్టమన్నారు. అయితే అతని కల సాకారం కావటం కోసం మావంతుగా ప్రయత్నిస్తామన్నారు. -
ప్రొఫెసర్‌కు మెయిల్ పంపి..
న్యూఢిల్లీ : లైబ్రరీలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో చోటుచేసుకుంది. ప్రొఫెసరుకు ఈ-మెయిల్ చేసిన అనంతరం ఘాతుకానికి పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం.. రిషి థామస్ అనే విద్యార్థి జేఎన్‌యూలో ఎంఏ రెండో సంవత్సరం చదువుతున్నాడు. స్నేహితులతో కలిసి అతడు క్యాంపస్‌లోని మహి మాండ్వీ బాయ్స్ హాస్టల్లో బస చేస్తున్నాడు. ఈ క్రమంలో తాను చనిపోతున్నానంటూ శుక్రవారం ఇంగ్లీషు ప్రొఫెసర్ మెయిల్ చేశాడు. అనంతరం యూనివర్సిటీలోని లైబ్రరీలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు. ఈ విషయం గురించి సౌత్‌వెస్ట్ డీసీపీ మాట్లాడుతూ.. పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని సఫర్జంగ్ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. మృతుడు ఏదో వ్యాధితో బాధపడుతున్నాడని, అందుకోసం చికిత్స కూడా తీసుకుంటున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. ప్రొఫెసర్‌కు పంపిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకుని అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు. -
ప్రచారానికో రూపాయివ్వండి!
కన్హయ్య కుమార్ గుర్తున్నాడా.. దేశ ద్రోహం నేరం కింద 1996లో అరెస్టయిన డిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు. ఇప్పుడాయన బిహార్‌లోని బెగుసరాయ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి సీపీఐ తరఫున పోటీ చేస్తున్నాడు. ఇతర పార్టీల అభ్యర్థులంతా ఎన్నికల ప్రచారానికి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంటే మన కన్హయ్యకు ప్రచారం చేసుకోవడానికి డబ్బులు లేవట. అందుకే ఒక్కొక్కరు కనీసం ఒక్క రూపాయి అయినా విరాళం ఇవ్వాలని ఆయన అడుగుతున్నాడు. ‘బొట్టుబొట్టుతో కుండ నిండినట్టు మీరిచ్చే ఒక్కొక్క రూపాయే నాకు ప్రచారానికి ఉపయోగపడుతుంది’ అంటూ ఓటర్లను వేడుకుంటున్నాడు. తాను గెలిస్తే అణగారిన, దోపిడీకి గురవుతున్న వర్గాల వాణిని పార్లమెంటులో వినిపిస్తానని హామీ ఇస్తున్నాడు. నిధుల సేకరణ కోసం కన్హయ్య ఆన్లైన్లో క్రౌడ్ ఫండింగ్ ఫ్లాట్‌ఫాంను కూడా ప్రారంభించాడు. బెగుసరాయ్ నియోజకవర్గంలో ఆయన బీజేపీ నేత, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్‌తో తలపడుతున్నాడు. ‘ప్రధాని పదవి నుంచి మోదీని తప్పించాలని బిహార్ ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకున్నారు. కాబట్టి ఈ ఎన్నికల్లో తాను గెలవడం ఖాయ’మని అంటున్నాడు. విరాళాల సేకరణ ప్రారంభించిన తొలిరోజే రూ. 38 లక్షలు సమకూరాయి. -
అనుమతుల్లేకుండా చార్జిషీటా?
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వ ఆమోదం లేకుండా జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్, ఇతరులపై చార్జిషీట్ దాఖలు చేయడంపై ఢిల్లీ కోర్టు పోలీసులను తప్పుబట్టింది. ‘ఆమోదం లేకుండా ఎలా మీరు చార్జిషీట్ దాఖలు చేశారు. మీకు న్యాయ సలహాలు ఇచ్చే శాఖ లేదా’ అని పోలీసులను ప్రశ్నించింది. దీనిపై పోలీసులు సమాధానమిస్తూ.. మరో 10 రోజుల్లో ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో అనుమతి తీసుకుంటామని పేర్కొన్నారు. దీంతో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ దీపక్ షెరావత్ ఫిబ్రవరి 6వ తేదీ వరకు పోలీసులకు గడువు ఇచ్చారు. కన్హయ్య కుమార్ 2016 ఫిబ్రవరిలో జేఎన్‌యూలో దేశ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారంటూ ఢిల్లీ పోలీసులు జనవరి 14న చార్జిషీట్ దాఖలు చేశారు. -
కన్నయ్య కుమార్‌పై 1200 పేజీల ఛార్జ్‌షీట్
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ (జేఎన్‌యూ) విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్నయ్య కుమార్‌పై ఛార్జ్‌షీట్ నమోదైంది. దేశ వ్యతిరేక నినాదాలు చేశారన్న ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు 1200 పేజీలతో కూడిన అభియోగ పత్రాన్ని సోమవారం దాఖలు చేశారు. కన్నయ్య కుమార్‌తో పాటు విద్యార్థి సంఘం నాయకులు ఉమర్ ఖలీద్, అనీర్బన్ బట్టాచార్య పేర్లు కూడా ఛార్జ్‌షీట్‌లో ఉన్నట్లు ఢిల్లీ పోలీస్ కమిషనర్ అమూల్య పట్నాయక్ వెల్లడించారు. దేశద్రోహం(124ఎ), క్రిమినల్ కుట్ర(120బీ), అలర్లకు ప్రేరేపణ(147), అనుమతి లేకుండా సమావేశం కావడం(143) వంటి సెక్షన్ల ద్వారా వారిపై అభియోగాలు నయోదు చేశారు. పాటియాల హౌస్ కోర్టు దీనిపై మంగళవారం విచారణ చేపట్టనుంది. పార్లమెంట్‌పై దాడి ఘటనలో సూత్రధారి అప్జల్ గురుకు ఉరిశిక్ష విధించడాన్ని వ్యతిరేకిస్తూ 2016 ఫిబ్రవరి 9న కన్నయ్యతో పలువురు విద్యార్థి నాయకులు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వారు దేశ వ్యతిరేక నినాదాలు చేశారని ఢిల్లీ పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్‌యిన వారికి మద్దతుగా జేఎన్‌యూ సహా, దేశ రాజధానిలో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌పై కన్నయ్య కుమార్ మాట్లాడుతూ.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ తనపై మోదీ ప్రభుత్వం కక్ష్యసారింపుగా అభియోగాలు నమోదు చేసిందని విమర్శించారు. దేశ న్యాయవ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని ఆయన అన్నారు. కాగా ఘటన జరిగిన మూడేళ్ల తరువాత అభియోగాలు దాఖలు చేయడం గమనార్హం. -
జేఎన్‌యూ తీరు చట్టవిరుద్ధం : సుప్రీం
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) విద్యార్థి సంఘం నేత కన్నయ కుమార్‌కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. జేఎన్‌యూ అతనిపై విధించిన జరిమానా అక్రమం, అహేతకమైనదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ మేరకు అతనిపై విధించిన జరిమానాను కొట్టివేస్తూ హైకోర్టు శుక్రవారం తీర్పును వెలువరించింది.. దేశ సమగ్రతను దెబ్బతినే విధంగా నినాదాలు చేశారన్న ఆరోపణలతో కన్నయ కుమార్‌పై పది వేలు ఫైన్‌తో పాటు, క్రమశిక్షణ ఉల్లంఘనపై జేఎన్‌యూ 2016లో చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. యూనివర్సిటీ విచారణ కమిటీ తనపై చేసిన ఆరోపణలను సవాలు చేస్తూ కన్నయ్య ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి జస్టిస్ సిద్ధార్ధ ముద్రుల్.. విచారణ సంఘం సమర్పించిన నివేదికను తప్పపడుతూ తీర్పును వెలువరించారు. అతనితో పాటు జేఎన్‌యూ విద్యార్థులు ఉమర్ ఖలీద్, బట్టాచార్యలపై జేఎన్‌యూ చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. -
జేఎన్యూకు మైనారిటీ కమిషన్ నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ : ఇస్లామిక్ ఉగ్రవాదంపై కోర్సు ప్రారంభించాలనే ప్రతిపాదనకు సహేతుక కారణం వెల్లడించాలని కోరుతూ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) రిజిస్ర్టార్‌కు ఢిల్లీ మైనారిటీ కమిషన్ మంగళవారం నోటీసులు జారీ చేసింది. ప్రతిపాదిత కోర్సుపై వచ్చిన వార్తలపై సుమోటోగా మైనారిటీ కమిషన్ స్పందిస్తూ ఇస్లామిక్ ఉగ్రవాదంపై ఏ ప్రాతిపదికన యూనివర్సిటీ కోర్సు ప్రారంభిస్తుందో వివరణ ఇవ్వాలని రిజిస్ర్టార్‌కు ఇచ్చిన నోటీసులో కమిషన్ పేర్కొంది. జేఎన్యూకు నోటీసులు జారీ చేసిన విషయాన్ని కమిషన్ ఛైర్మన్ జఫరుల్ ఇస్లాం ఖాన్ నిర్ధారించారు. కాగా సెంటర్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ స్టడీస్‌ను ఏర్పాటు చేసి దాని పర్యవేక్షణలో ఇస్లామిక్ ఉగ్రవాదంపై కోర్సును ప్రారంభించాలని జేఎన్‌యూ అకడమిక్ కౌన్సిల్ ప్రతిపాదనను ఆమోదించింది. గత వారం వర్సిటీ కౌన్సిల్ ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపినట్టు సమావేశానికి హాజరైన ఓ ప్రొఫెసర్ పేర్కొన్నారు. అయితే ఈ కౌన్సిల్ భేటీలో ఇస్లామిక్ ఉగ్రవాదం కోర్సును చేర్చేందుకు ఏదైనా సిద్ధాంత పత్రం, నిర్థిష్ట ప్రతిపాదన ముందుకొస్తే వాటి నకలును సమర్పించాలని జేఎన్‌యూను మైనారిటీ కమిషన్ కోరింది. కోర్సుకు సంబంధించిన సమగ్ర వివరాలను, కౌన్సిల్ భేటీ అజెండాను, హాజరైన సభ్యుల వివరాలను తెలపాలని కోరింది. -
లైంగిక వేధింపులు: బుక్కైన మరో ప్రొఫెసర్
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని ప్రఖ్యాత జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో విద్యార్థినులపై లైంగిక వేధింపుల వ్యవహారం దుమారం రేపుతోంది. ఇప్పటికే జేఎన్‌యూ ప్రొఫెసర్ అతుల్ జోహ్రీపై లైంగిక వేధింపుల కేసు నమోదవ్వగా.. తాజాగా మరో ప్రొఫెసర్‌పై కేసు నమోదైంది. ప్రొఫెసర్ అజయ్‌కుమార్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని జేఎన్‌యూ స్కూల్ ఆఫ్ సైన్స్ విద్యార్థిని ఒకరు ఆరోపించారు. ఈ మేరకు ఆమె వసంత్‌కుంజ్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు దాఖలు చేశారు. పోలీసులు సదరు ప్రొఫెసర్‌పై ఐపీసీ సెక్షన్ 354 కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కొద్దిరోజుల కిందట జేఎన్‌యూ ప్రొఫెసర్ అతుల్ జోహ్రీపై లైంగిక వేధింపుల కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఎనిమిది మంది విద్యార్థినులు ఆయనకు వ్యతిరేకంగా కేసు నమోదుచేశారు. ఈ వ్యవహారంపై విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించడంతో పోలీసులు ప్రొఫెసర్‌ను అరెస్టు చేశారు. కానీ, మరునాడే అతను బెయిల్‌పై విడుదలయ్యాడు. -
ఢిల్లీలో కదం తోక్కిన జర్నలిస్టులు
-
ఎట్టకేలకు ప్రొఫెసర్ అరెస్ట్
న్యూఢిల్లీ : విద్యార్థుల ఆందోళనతో ఢిల్లీ పోలీసులు దిగొచ్చారు. లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్‌యూ) ప్రొఫెసర్ అతుల్ జోహ్రీని మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. జేఎన్‌యూ లైఫ్ సైన్స్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న అతుల్‌పై నాలుగు రోజుల క్రితం అదే విభాగానికే చెందిన విద్యార్థినులు తమను వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే నాలుగు రోజులు గడిచిన పోలీసులు అతుల్‌ని అరెస్ట్ మాత్రం చేయలేదు. అతుల్‌ని అరెస్ట్ చేయాలని 54 మంది అధ్యాపకులు డిమాండ్ చేసిన పోలీసులు స్పందించలేదు. దీంతో ఆగ్రహించిన విద్యార్థులు సోమవారం నిరసన ర్యాలీ చేపట్టారు. ఢిల్లీ పోలీసులకు, యూనివర్సిటీకి వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. వీరికి తోడుగా మహిళ హక్కుల సంఘాలు ఆందోళన నిర్వహించాయి. దీంతో సమస్య తీవ్రతను గ్రహించిన పోలీసులు అతుల్‌ని అరెస్ట్ చేశారు. మరికొంత మంది విద్యార్థినులు కూడా అతుల్‌పై ఇదే విధమైన ఆరోపణలతో ఫిర్యాదులు చేశారని, లోతైన దర్యాప్తు చేపడతామని డీసీపీ మౌనిక భరాద్వాజ్ తెలిపారు. -
జేఎన్‌యూలో ప్రొఫెసర్ లైంగిక వేధింపులు
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ జేఎన్‌యూలో ఓ ప్రొఫెసర్ లైంగిక వేధింపులు కలకలం రేపుతున్నాయి. తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ పీహెచ్డీ విద్యార్థిని ఆరోపిస్తూ అదృశ్యమైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. జేఎన్‌యూలో లైఫ్ సైన్స్ మొదటి సంవత్సరం స్కాలర్ పూజ కసానా రెండు రోజుల క్రితం హాస్టల్ విడిచి వెళ్లిపోయింది. ఆమె జాడ తెలియకపోవడంతో స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గురువారం లక్నోలో పూజని గుర్తించి, ఢిల్లీకి తీసుకొచ్చారు. తాను హాస్టల్ విడిచి వెళ్లడానికి తన మెంటర్ ప్రొఫెసర్ అతుల్ కుమార్ జోహ్రీ లైంగిక వేధింపులే కారణమని పూజ పోలీసులకు తెలిపింది. అతుల్‌ను తన ప్రవర్తన మార్చుకోవాలని ఈ మెయిల్ ద్వారా సూచించినా మార్పు రాలేదని తెలిపింది. ‘అతుల్ నువ్వు జేఎన్యూలోనే కాదు, ఇండియాలోనే బెస్ట్ గైడ్ కావచ్చు, ప్రతి ఒక్కరు నీ పర్యవేక్షణలో పీహెచ్డీ చేయాలని ఆశపడవచ్చు, కానీ చదువుకోనివారు కూడా బుద్ధిలో నీ కన్నా నూరుపాళ్లు నయం. నేను పీహెచ్‌డీని వదిలి వెళ్లడానికి నీ ప్రవర్తనే కారణం. నీకు అమ్మాయిలతో ఎలా ప్రవర్తించాలో తెలియదు, నీ ప్రవర్తనతో ఎన్నో సార్లు విసుగు చెందిన తర్వాతే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను’ అని పూజ ఆ మెయిల్లో పేర్కొంది. మరోవైపు పూజ ఆరోపణలపై విచారణ జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు. అనుహ్యంగా గురువారం సాయంత్రం మరో 12 మంది లైఫ్ సైన్స్ విద్యార్థినిలు అతుల్‌పై ఇదే రకమైన ఆరోపణలతో ముందుకొచ్చారు. అతుల్ తమకు అసభ్యకరమైన మెసెజ్‌లు చేయడం, శరీరాకృతి మీద కామెంట్లు చేసేవాడని వారు తెలిపారు. అతుల్‌పై ఫిర్యాదు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని స్టూడెంట్ ఫ్యాకల్టీ కమిటీ మెంబర్ ఒకరు వెల్లడించారు. దీంతో ప్రొఫెసర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. -
నీ కూతురికి అదే గతి పట్టాలి: ఓ విద్యార్థిని
సాక్షి, న్యూఢిల్లీ : 'సార్ మీకు సభ్యత, సంస్కారం లాంటివి లేవు అమ్మాయిలతో ఎలా ప్రవర్తించాలో మీకు తెలియదు. మీ కూతురికి కూడా నాలాంటి పరిస్థితి రావాలని కోరుకుంటున్నా’ అంటూ వేధింపులకు గురిచేస్తున్న ప్రొఫెసర్‌కి ఓ పీహెచ్డీ విద్యార్థిని ఈమెయిల్ చేసింది. ప్రొఫెసర్ ప్రవర్తన నచ్చకనే వర్సీటీ నుంచి తాను పారిపోయానని చెప్పింది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కి చెందిన ఓ 26 ఏళ్ల యువతి జేఎన్‌యూలో ఇంటిగ్రేటెడ్ ఎంఫిల్, పీహెచ్డీ చేస్తోంది. ఇటీవల ఆమె యూనివర్సిటీ నుంచి పారిపోయి బంధువుల ఇంటికి వెళ్లింది. ఈ విషయంపై విద్యార్థిని తండ్రి పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. కాగా గైడ్‌గా ఉన్న ప్రొఫెసర్ ఎ.కె.జోరి దురుసు ప్రవర్తన వల్లే యూనివర్సీటీని వదిలి వెళ్లాలని ఆ విద్యార్థిని లేఖ సారాంశం. ‘ గౌరవనీయులైన ప్రొఫెసర్ గారికి నమస్కారం. మీరు దేశంలోనే గొప్ప గైడ్ (నిర్దేశకుడు) అని అనుకుంటున్నారు. నేను కూడా మొదట్లో ఇలానే అనుకున్నా. మీరు మాకు గైడ్‌గా ఉండడం వరంగా భావించా. కానీ తర్వాత మీ నిజస్వరూపం తెలిసింది. మీకు సభ్యత, సంస్కారాలు తెలియవు. ఒక అమ్మాయితో ఎలా ప్రవర్తించాలో కూడా తెలియదు. నీ దురుసు ప్రవర్తన వల్లే నేను వర్సీటీ వదిలి వెళ్లాను. నాలాగ మరో అమ్మాయి బలి కాకుడదని అనుకుంటున్నాను. మీ కూతురికి కూడా నాలాంటి పరిస్థితే రావాలని దేవున్ని ప్రార్థిస్తున్నాను. కనీసం అప్పుడైనా అమ్మాయిల బాధ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా అంటూ మెయిల్ పంపింది. కాగా ప్రొఫెసర్ ఎ.కె.జోరి తనపై వచ్చిన ఆరోపణల్ని తీవ్రంగా ఖండించారు. తాను గత నెల 27న వరుసగా గైర్హాజరైన తొమ్మిమంది విద్యార్థులను హెచ్చరిస్తూ లేఖలు పంపాను. ‘మీరు సరిగా తరగతులకు హాజరు కావడం లేదు. ఇలా అయితే మీ పీహెచ్‌డీని పూర్తి చేయడం కష్టం. మీరు మరో ల్యాబ్‌ను చూసుకోండి’అని లేఖలో పేర్కొన్నట్లు తెలిపారు. అందరు విద్యార్థుల్లాగే రెగ్యులర్‌గా హాజరు కావాలని కోరానన్నారు. అందరితో ప్రవర్తించినట్లే ఆమెతోను వ్యవహరించానని తెలిపారు. ఆ విద్యార్థిని తనపై ఇలాంటి ఆరోపణలు చేయడం బాధాకరమని ప్రొఫెసర్ ఎ.కె.జోరి అన్నారు. -
‘లాంగ్‌మార్చ్’: ఎవరీ విజూ..!
కేరళలోని మలబార్ రైతులు.. అప్పటి బ్రిటిష్ సామ్రాజ్యవాదులు, ఫ్యూడల్ వ్యవస్థకు వ్యతిరేకంగా 1946లో చరిత్రాత్మక పోరాటాన్ని నిర్వహించారు. ఆ ప్రాంతం ఆకలికి అల్లాడుతున్న సమయంలో వరి పంటను స్మగ్లింగ్ చేసేందుకు బ్రిటిష్ పాలకులు ప్రయత్నించడంతో వారిపై తిరగబడ్డారు. ఈ అద్భుతమైన రైతుపోరాటాన్ని గురించి వింటూ పెరిగిన విజూ కృష్ణన్ (44) అన్నదాతల సమస్యల గురించి తీవ్రంగా మథనపడేవారు... ఇంతకీ ఈ విజూ కృష్ణన్ ఎవరంటే.. తాజాగా మహారాష్ట్రలో 50వేలమంది రైతులు ఏకమై.. నిర్వహించిన ‘లాంగ్‌మార్చ్’ వెనుక ఉన్న ప్రధాన సూత్రధారి.. ఏడు దశాబ్దాల తర్వాత నాటి మలబార్ రైతు తిరుగుబాటును తలపించేరీతిలో నాసిక్ నుంచి ముంబై వరకు అశేషమైన రైతులు నిర్వహించిన పాదయాత్ర యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది. పేద, ఆదివాసీ రైతులు తమ హక్కుల కోసం గర్జిస్తూ.. అరికాళ్లు బొబ్బలు ఎక్కినా లెక్కచేయకుండా ఏకంగా 180 కిలోమీటర్లు పాదయాత్ర చేసి.. సోమవారం ముంబైకి చేరుకున్న సంగతి తెలిసిందే. అకుంఠిత పట్టుదలతో రైతులు చేసిన ఈ లాంగ్‌మార్చ్‌తో దిగొచ్చిన ఫడ్నవిస్ ప్రభుత్వం వారి డిమాండ్లను నెరవేర్చేందుకు అంగీకరించింది. ఈ నేపథ్యంలో అన్నదాతల ఈ మహా పోరాటం వెనుక ఉన్నది ఎవరు.. ఏకంగా 50వేలమంది రైతులను ఏకతాటికిపైకి తెచ్చి.. అత్యంత క్రమశిక్షణతో ముందుకు నడిపించిన శక్తి ఎవరంటే.. అందుకు వచ్చే సమాధానం విజూ కృష్ణన్.. అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) జాయింట్ సెక్రటరీగా ఉన్న ఆయన.. హక్కుల సాధన కోసం పోరాడేందుకు రైతులన్నను ఏకతాటిపైకి తెచ్చారు. 50వేలమంది రైతులను ఒక క్రమశిక్షణ కలిగిన సైన్యంగా, రైతు కార్యకర్తలుగా మలిచి.. ఏకంగా 180 కిలోమీటర్ల పాదయాత్రను విజయవంతంగా నిర్వహించారు. సుదీర్ఘంగా సాగిన ఈ పాదయాత్ర సందర్భంగా ఎక్కడ చిన్న అవాంఛనీయ ఘటన చోటుచేసుకోకపోవడం గమనార్హం. వ్యవసాయ సంక్షోభంతో అష్టకష్టాలు పడుతూ.. దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్న రైతులను కలిసి.. ఏఐకేఎస్ ఆధ్వర్యంలో వారిని కూడగట్టి, సమాయత్తం చేసి.. విజూ కృష్ణన్ ఈ లాంగ్‌మార్చ్‌ను విజయవంతం చేశారు. ఈ లాంగ్‌మార్చ్ సక్సెస్ వెనుక ఏఐఏకేఎస్ పాత్రతో పాటు విజూ కృష్ణన్ నాయకత్వం ఉంది. ఎవరీ విజూ..! కేరళలోని కన్నూర్ జిల్లా కరివెల్లూరు విజూ స్వగ్రామం. ఇక్కడి రైతులే 1946లో బ్రిటిష్ పాలకులకు ఎదురుతిరిగి.. తమ హక్కులకై పోరాటం చేశారు. ఇక్కడి రైతుపోరాటాలను, అన్నదాతల కష్టనష్టాలను వింటూ పెరిగిన విజూ కృష్ణన్ వారి సమస్యలు తనవిగా భావించారు. గతంలో జవహార్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్‌కు అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన.. పలు విద్యార్థి ఉద్యమాలు నడిపించారు. ఎస్ఎఫ్ఐ ఫైర్‌బ్రాండ్ నేతగా పేరొందిన విజూ.. ప్రస్తుతం ఏఐకేఎస్ జాయింట్ సెక్రటరీగా కొనసాగుతూ... రైతుల ‘లాంగ్‌మార్చ్’లో అత్యంత కీలకంగా వ్యవహరించారు. సీపీఎం సెంట్రల్ కమిటీలో అత్యంత పిన్నవయస్సు సభ్యుడు కూడా ఆయనే. ప్రత్యేక ఆహ్వానితుడిగా సెంట్రల్ కమిటీలో సేవలు అందిస్తున్నారు. భారత వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ మార్పులపై డాక్టరేట్ చేసిన ఆయన.. బెంగుళూరు సెయింట్ జోసెఫ్ కాలేజీ పీజీ పొలిటికల్ సైన్స్ విభాగం అధిపతిగా కొన్నాళ్లు పనిచేసి.. అనంతరం రైతు కార్యకర్తగా సేవలు అందించేందుకు ఉద్యోగాన్ని వదిలేశారు. తాజాగా మహా రైతులు చేపట్టిన లాంగ్‌మార్చ్.. వ్యవసాయ రంగంలో తిరుగుబాటుకు ప్రతీక అని ఆయన పేర్కొంటారు. గత రెండేళ్లుగా దేశవ్యాప్తంగా రైతులు ఆందోళనబాట పడుతున్నారని, మహారాష్ట్రతోపాటు రాజస్థాన్, కర్ణాటక, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లోనూ రైతు ఆందోళన జరిగాయని గుర్తుచేశారు. రాజస్థాన్‌లోనూ రైతుల పాదయాత్ర.. దాదాపు మహారాష్ట్ర లాంగ్‌మార్చ్ స్థాయిలో జరిగిందని, ఇది అఖిల భారత కిసాన్ సభ శక్తిని చాటుతోందని ఆయన అన్నారు. మీడియా రైతు సమస్యలను, ఆందోళనలపై దృష్టి సారించాలని అవసరముందని సూచించారు. ఈ రైతుల లాంగ్‌మార్చ్ సీపీఎం పునరుత్థానానికి సంకేతమా? అని ప్రశ్నించగా.. ఇది తమ మనుగడ కోసం రైతులు చేసిన పోరాటం మాత్రమేనని అన్నారు. బీజేపీ అనుసరిస్తున్న విధానాల కారణంగా.. పరిస్థితులు ఆ పార్టీకి వ్యతిరేకంగా మారుతున్నాయని, అయితే, ఈ పోరాటంలో ఎన్నికల రాజకీయ కోణం లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే, బీజేపీని ఓడించాలనుకుంటున్న శక్తులకు ఇది తప్పకుండా బలం చేకూరుస్తుందని అన్నారు. -
కన్హయ్యకు ఢిల్లీ హైకోర్టులో ఊరట
న్యూఢిల్లీ: జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ (జేఎన్‌యూ) విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్‌కు ఢిల్లీ హైకోర్టు ఊరటనిచ్చింది. కన్హయ్యతో పాటు మరో 14 మంది విద్యార్థులపై విశ్వవిద్యాలయం తీసుకున్న క్రమశిక్షణ చర్యలను తప్పుపడుతూ ఇది సహజ న్యాయ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని జస్టిస్ వి.కామేశ్వర్రావు వ్యాఖ్యానించారు. ఈ అంశంపై వర్సిటీ అప్పిలేట్ అథారిటీ పునఃపరిశీలించాలని ఆదేశించారు. విద్యార్థుల నుంచి వివరణ తీసుకుని ఆరువారాల్లోగా విద్యార్థులపై చర్యలకు తగు కారణాలను వెల్లడించాలని సూచించింది. -
విపక్షాన్ని కదిలించే ఒక వీచిక
రెండో మాట వామపక్ష, దళిత విద్యార్థి సంఘాల ఈ విజయాలు భిన్న సదాశయాలతో సాధించినవే. అయినా ఐక్య సంఘటిత శక్తితోనే ఇలాంటి ఫలితాలు సాధ్యమైన సంగతి విస్మరించరాదు. కాబట్టి దేశంలోని వామపక్షాలు సహా, నిర్దిష్ట గమ్యం లేకుండా ప్రయాణిస్తున్న దేశీయ ప్రజాస్వామిక శక్తులకు కూడా ఆ విజయం దిక్సూచి. బిహార్ రాజకీయాలలోనే కాకుండా, దేశ రాజకీయాలలో సైతం పెనుమార్పులకు శ్రీకారం చుట్టగలదని భావించిన మహా ఐక్య సంఘటన విఫలమై మరొక నిరంకుశ పాలనకు, ప్రజా వ్యతిరేక పాలనకు కారణమైంది. ‘కొంతమంది కుర్రవాళ్లు/పుట్టుకతో వృద్ధులు పేర్లకీ పకీర్లకీ/పుకార్లకీ నిబద్ధులు తాతగారి నాన్నగారి/ భావాలకు దాసులు వీళ్లకి కళలన్నా రసమన్నా చుక్కెదురు! గోలచేసి అరవడమొకటే/వాళ్లెరుగుదురు... కొంతమంది యువకులు/రాబోవు యుగం దూతలు పావన నవజీవన/బృందావన నిర్మాతలు బానిస బంధాలను/తలవంచి అనుకరించరు పోనీ అని అన్యాయపు/ పోకడలు సహించరు వారికి నా ఆహ్వానం/వారికి నా శాల్యూట్! – శ్రీశ్రీ ఈ పంక్తులను ఇక్కడ ఉదహరించడానికి కారణం ఉంది. ఇటీవల జరిగిన ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘ ఎన్నికలలో వామపక్షాలతో దీపిస్తున్న మూడు సంఘాల ఐక్య సంఘటన మరోసారి ఘన విజయం సాధించింది. కీలకమైన నాలుగు పదవులు ఈ సంఘటనే కైవసం చేసుకుంది. ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన దుగ్గిరాల శ్రీకృష్ణను (దళిత కుసుమం) ఈ సందర్భంగా ‘ది టెలిగ్రాఫ్’(కోల్‌కతా) ఇంటర్వ్యూ చేసింది. శ్రీశ్రీ రచనలతో ప్రభావితుడై... ఆ ఇంటర్వ్యూలో చాలా అంశాలు వెలుగుచూశాయి. కారల్‌మార్క్స్ ‘కమ్యూనిస్ట్ మ్యానిఫెస్టో’లోని విశేషాంశాలకన్నా, మహాకవి శ్రీశ్రీ విప్లవగీతాలే శ్రీకృష్ణను ఎక్కువగా ప్రభావితం చేశాయని ఆ పత్రిక పేర్కొన్నది. 27 ఏళ్ల శ్రీకృష్ణ బహుముఖ అంశాలతో, జీవనపార్శా్వలతో పరిచయం, అనుభవం ఉన్న వ్యక్తి. ఆఫ్రికాలోని ఇబో ప్రజల విమోచన పోరాటాలను నవలా రూపంలో తీర్చిదిద్దిన చినువా అచుబే ‘చెదిరిన సమాజం’లో కథానాయకుడు ఒకోన్క్వో జీవన పోరాటానికి, లేదా గోర్కీ ‘అమ్మ’నవలలో పావెల్ జీవనపోరాటంలో ఎదుర్కొన్న కష్టాలకు, శ్రీకృష్ణ జీవన పోరాటంలో ఘటనలకు దగ్గర సంబం ధం కనిపిస్తుంది. ధనికవర్గపు చట్రంలో చదువు కోసం ఒక పేద దళితుడు ఎంతగా నలిగిపోవలసి వస్తున్నదో! ఆ వ్యధ స్వయంగా అనుభవించినవారికి గాని బోధపడదు. చిత్ర పరిశ్రమలో నాలుగేళ్లపాటు నటీమణుల మేకప్ ఆర్టిస్ట్‌గా పనిచేసి నాలుగు రాళ్లు సంపాదించుకుంటే గానీ అతడికి చదువుల ప్రాంగణంలోకి ప్రవేశం దొరకలేదు. ఆపై సివిల్ సర్వీసెస్ పరీక్షల తర్ఫీదు కోసం మరో పోరాటం. తృష్ణ ఉన్నా, యాభయ్వేలు చెల్లించుకుంటే గానీ ప్రవేశం దొరకలేదు. ఇందుకోసం హాఫ్‌టోన్ ప్రెస్‌లో నైట్‌షిఫ్ట్‌లో పన్నెండు గంటలు అదనంగా పనిచేయవలసి వచ్చింది. నెలకు ఐదు వేలు జీతం. దానితోనే సివిల్స్ తర్ఫీదు పూర్తికాదు. కనుక జేఎన్‌యూలో ఉన్నత చదువుల కోసం నానారకాలైన 17 కొలువులు చేయవలసి వచ్చింది. కనుకనే, ‘‘నా జీవితంలో ప్రతిరోజు, అడుగడుగునా పోరాటమే’’నని బరువైన గుండెతో శ్రీకృష్ణ ప్రకటించుకోవలసి వచ్చింది. అతడి నాయకత్వంలోనే జేఎన్‌యూలోని మూడు ప్రగతిశీల విద్యార్థి సంఘాలు(కమ్యూనిస్టు పార్టీ, మార్క్సిస్ట్ లెనినిస్ట్ బృందం మద్దతు ఉన్న ఆలిండియా స్టూడెంట్స్ అసోసియేషన్, అఖిల భారత మార్క్సిస్ట్ విద్యార్థి సంఘటన, సీపీఎం విద్యార్థి సంఘం, స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా)ఐక్యమైనాయి. దీని ఫలితమే విజయం. విద్యార్థి నాయకుడు కన్హయ కుమార్‌కు ప్రభుత్వ వేధింపుల ఉదంతం తరువాత వామపక్ష విద్యార్థి ఐక్య సంఘటన సాధించిన విజయమిది. ఇంతకు మించిన స్థాయిలోనిదే హెచ్‌సీయూ విద్యార్థి సంఘ ఎన్నికలలో వామపక్ష, దళిత విద్యార్థి సంఘాల విజయం. రోహిత్ వేముల ఆత్మహత్యకు దారి తీసిన దుర్మార్గపు ఘటనల తరువాత, విశ్వవిద్యాలయం వ్యవహారాలను చక్కదిద్దే పేరుతో బీజేపీ ప్రభుత్వం అనుసరించిన సంస్కృతీ వ్యతిరేక వైఖరి అనంతరం హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఈ విజయం సాధ్యమైంది. ఇది దేశంలో ఏర్పడిన నియంత్రణ వాతావరణానికి సమాధానంగా లభించిన విజయం. వాక్, సభా స్వాతంత్య్రాలకు, పత్రికా స్వేచ్ఛకు, భిన్నాభిప్రాయాల ప్రకటనకు అడ్డు తగులుతున్న కేంద్ర ప్రభుత్వానికి ఈ రెండు విద్యార్థి సంఘాల ఎన్నికల ఫలితాలు హెచ్చరిక కావాలి. వామపక్ష, దళిత విద్యార్థి సంఘాల ఈ విజయాలు భిన్న సదాశయాలతో సాధించినవే. అయినా ఐక్య సంఘటిత శక్తితోనే ఇలాంటి ఫలితాలు సాధ్యమైన సంగతి విస్మరించరాదు. కాబట్టి దేశంలోని వామపక్షాలు సహా, నిర్దిష్ట గమ్యం లేకుండా ప్రయాణిస్తున్న దేశీయ ప్రజాస్వామిక శక్తులకు కూడా విద్యార్థుల ఆ విజయం దిక్సూచి. బిహార్ రాజకీయాలలోనే కాకుండా, దేశ రాజకీయాలలో సైతం పెనుమార్పులకు శ్రీకారం చుట్టగలదని భావించిన 16, 17 పార్టీల మహా ఐక్య సంఘటన విఫలమై మరొక నిరంకుశ పాలనకు, ప్రజా వ్యతిరేక పాలనకు కారణమైంది. సైద్ధాంతిక పునాదులు కొరవడిన పలువురు అవకాశవాదుల కారణంగా ఈ దుస్థితి దాపురించింది. మతతత్వ పాలన ఫలితంగా ప్రబలిన నిరంకుశ ధోరణుల వల్ల ప్రజాస్వామిక వ్యవస్థ మీద కారుచీకట్లు కమ్ముకున్నాయి. ఈ స్థితిలో జేఎన్‌యూ, హెచ్‌సీయూ విద్యార్థి సంఘాల విజయం ఆ కారుచీకట్లలో ఒక కాంతి రేఖగా భావించాలి. ఈ కిరణాలతోనే చిరకాలంగా నిద్రాణమై ఉన్న వామపక్ష రాజకీయ శక్తులు, ప్రగతిశీల దళిత, బహుజన మైనారిటీలు, కార్మిక, రైతాంగాలు మేల్కొనాలి. జేఎన్‌యూలో కొత్త సమీకరణ జేఎన్‌యూ ఎన్నికల సందర్భంగా ఈసారి మరొక పరిణామం జరిగింది. అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ), వామపక్ష విద్యార్థి ఐక్య సంఘటన కూడా చూసిన సరికొత్త సమీకరణ–బీర్సా–అంబేడ్కర్–ఫూలే విద్యార్థి సమాఖ్య (బాప్సా). ఇందులో దళిత, ఆదివాసీ, ఓబీసీ, ముస్లిం విద్యార్థులు భాగస్వాములు. అయినా వామపక్ష విద్యార్థి ఐక్య సంఘటన సాధించిన విజయం వేరు. మున్నెన్నడూ లేని రీతిలో వామపక్ష ఐక్య సంఘటనకు మొదటిసారి బాప్సా నుంచి సవాలు ఎదురుకావడం వేరు. బహుశా ఈ కీలక అంశం ఆధారంగానే ‘ది హిందు’ప్రత్యేక ప్రతినిధి వికాస్ పాఠక్ జేఎన్‌యూ ఫలితాల మీద ఇలా వ్యాఖ్యానించి ఉండవచ్చు. ‘ఇన్నేళ్లుగా సామాజికంగా అణగారిన వర్గాలకు నేడు ప్రాతినిధ్యం అనివార్యమైంది. బాప్సా ఇందుకు అవకాశం కల్పించిందని విద్యార్థి కార్యకర్తలు కొందరు అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో వామపక్షాలు కూడా తమ సంప్రదాయక నినాదం ‘లాల్ సలామ్’ను ‘జై భీమ్!–లాల్ సలామ్’గా మార్చుకున్నారు. బీఆర్ అంబేడ్కర్‌ను సొంతం చేసుకుంటూ ఈ సవరణ చేసింది. కనుకనే బాప్సా అణగారిన ప్రజల సంస్థగా రాజకీయ సవాలు విసిరింది’(20–9–2017). హెచ్‌సీయూ విద్యార్థి సంఘ ఎన్నికలలో (24–9–17) ఎస్ఎఫ్ఐ, అంబేడ్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్, దళిత స్టూడెంట్స్ యూనియన్, భావ సారూప్యత కలిగిన బృందాలు కలసి ‘సామాజిక న్యాయ సాధన సంఘటన(అలయెన్స్ ఫర్ సోషల్ జస్టిస్)గా ఆవిర్భవించాయి. సమాజాన్ని వర్గ పునాదిపై ఏర్పడిన సంకీర్ణ సామాజిక వర్గాల మిశ్రమంగా వామపక్షాలు భావిస్తాయి. కానీ, అణగారిన ప్రజల వాణికే ప్రాధాన్యం ఇవ్వాలని బాప్సా వాదన. వామపక్షాలు పట్టించుకోవలసిన విశ్లేషణ ఇదొక దృక్పథాల సంఘర్షణ. ఈ సంఘర్షణను స్పృశిస్తూ ప్రసిద్ధ రచయిత, వ్యాఖ్యాత ప్రఫుల్ బిద్వాయ్ తన గ్రంథం ‘ఫీనిక్స్ పునర్జన్మ: భారత వామపక్షాలు ఎదుర్కొంటున్న సవాళ్లు’లో చర్చించారు. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలోని రెండు ముక్కలను (సీపీఐ, సీపీఎం) కలిపి బిద్వాయ్ పార్లమెంటరీ లెఫ్ట్‌గా పరిగణించి ఒక సూత్రీకరణ చేశారు. ‘పార్లమెంటరీ లెఫ్ట్ కనుక రాష్ట్రాల ఎన్నికలలో గెలవడం మీదనే తన శక్తియుక్తులన్నింటినీ కేంద్రీకరించకుండా, దేశవ్యాప్తంగా ఏకముఖంగా ఒక మహోద్యమ నిర్మాణం పైన కేంద్రీకరించి ఉంటే ఇప్పటికన్నా చాలా మెరుగైన పరిస్థితులలో ఉండేది’ అన్నారాయన. స్వాతంత్య్రం వచ్చిన తొలిరోజులలో సామాజిక సంస్కరణల వైపు ఉత్సాహంతో ఉరకలేసిన ఈ పార్లమెంటరీ లెఫ్ట్, తాము ప్రాతినిధ్యం వహించవలసిన అసలైన ప్రజాబాహుళ్యాన్ని మరచిపోయిందని కూడా బిద్వాయ్ సూచనప్రాయంగా చెప్పారు. భూస్వామ్య వర్గానికీ, భూమి లేని పేదలకూ మధ్య అధికార చట్రాన్ని బద్దలు కొట్టలేకపోయిందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. పైగా మతతత్వ శక్తులతో మెతక వైఖరితో వ్యవహరిస్తున్నదని కూడా ఆయన భావించారు. సాంఘిక పరివర్తనకు దోహదం చేయవలసిందంటూ వామపక్షానికి ప్రజలు ఇచ్చిన మేండేట్ స్తబ్దతకు గురికావడం ఈ మెతకవైఖరి ఫలితమేనని ఆయన భావన. ఆది నుంచి వేధిస్తున్న ఐదు ప్రాథమిక సమస్యలను వామపక్షం పరిష్కరించుకోవడం మీదనే రాజకీయ శక్తిగా దానికి సంభవించిన పతన దశను నివారించే అంశం ఆధారపడి ఉందని బిద్వాయ్ సూచించారు. పార్టీలో కేంద్రీకృత ప్రజాస్వామ్యం. అధికార కేంద్రీకరణ వామపక్షాలలో భిన్నాభిప్రాయ వ్యక్తీకరణ స్వేచ్ఛను నొక్కేయడం, పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యం గురించి చర్చించే అవకాశాన్ని అణచివేయడం, ఈ తప్పు లోకం కళ్లకు కనపడుతున్నా, ఆ తప్పునే కొనసాగించడం. కులాల సమస్య పరిష్కారంలో వైఫల్యం. అగ్ర నాయకత్వ స్థాయిలో అగ్రవర్ణ (సవర్ణ) కులాలకు చెందని వారిని అంటే దళిత బహుజన వర్గాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించడంలో విఫలం కావడం, దళిత విమోచన పోరాటాలలో తమ శక్తియుక్తులను తగినంతగా వెచ్చించకపోవడం. తన ఆధిపత్యంలో లేని ప్రజా సమీకరణ ఉద్యమాలతో వామపక్షం సన్నిహితంగా ఉండలేకపోవడం (ఉదా: సఫాయి కర్మచారులు, పారిశుధ్య కార్మికులు, ఆదివాసులు వగైరా). వామపక్ష సంఘటనలో మాత్రమే కాదు, ఇలాంటి ఫ్రంట్‌తో కలసి వచ్చే భాగస్వామ్య శక్తుల మధ్య కూడా వ్యూహాత్మక ఐక్యత కొరవడడం. పార్లమెంటరీ మార్గాన్ని అనుసరించడం ద్వారా వామపక్షం సాధించగోరుతున్న లక్ష్యం గురించి స్పష్టమైన రాజకీయ భవిష్యద్దర్శనానికి తగిన నిర్వచనం కొరవడడం. పార్లమెంటరీయేతర వామపక్షాలు నిర్వహిస్తున్న పోరాటాల లక్ష్యాలకు పార్లమెంటరీ పద్ధతులలో వామపక్షాలు సాధించాలనుకుంటున్న లక్ష్యాలకు సమన్వయం సాధించడంలో కూడా లక్ష్య శుద్ధి లేకపోవడం. అన్నింటికీ మించి భారత పాలకుల వర్గ స్వభావాన్ని గురించి స్పష్టమైన రాజకీయ దృక్కోణాన్ని అందించలేకపోవడం. బిద్వాయ్ వంటి విశ్లేషకులు వామపక్షాలతో కొన్ని సందర్భాలలో ఏకీభవించి ఉండవచ్చు. వ్యతిరేకించనూ వచ్చు. కానీ ప్రజల శ్రేయోభిలాషులుగా అలాంటివారు చేసిన విమర్శను సుహృద్భావంతో చూడడం తప్పకాదు. abkprasad2006@yahoo.co.in ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు -
వర్సిటీల్లో పట్టు కోల్పోతున్న బీజేపీ !
-
జేఎన్‌యూ ప్రవేశపరీక్ష షెడ్యూల్ విడుదల
న్యూఢిల్లీ: జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్‌యూ) 2018–19 విద్యా సంవత్సరానికిగాను నిర్వహించనున్న ప్రవేశ పరీక్ష షెడ్యూల్‌ను గురువారం విడుదల చేసింది. ఈ ఏడాది డిసెంబర్ 27 నుంచి 30 వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు జేఎన్‌యూ పాలకమండలి ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ప్రవేశాల్లో భాగంగా ఎంఫిల్ / పీహెచ్డీ కోర్సుల్లో 720 సీట్లు, బీఏ కోర్సుల్లో 459 సీట్లు, ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంటెక్, ఎంపీహెచ్ కోర్సుల్లో 1,118 సీట్లను భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది. పార్ట్ టైమ్(డిప్లోమా, సర్టిఫికెట్) కోర్సులకు 240 సీట్లు అందుబాటులో ఉన్నట్లు పేర్కొంది. -
జేఎన్‌యూలో సమానత్వం లేదు
⇒ ఫేస్బుక్లో ముత్తు కృష్ణన్ ఆఖరి పోస్ట్ ⇒ అతని మరణంపై సీబీఐ దర్యాప్తు కోరిన కుటుంబ సభ్యులు న్యూఢిల్లీ, సాక్షి, చెన్నై: జేఎన్‌యూలో సమానత్వానికి చోటులేదని సోమవారం ఆత్మహత్య చేసుకున్న దళిత పరిశోధక విద్యార్థి ముత్తుకృష్ణన్ మార్చి 1న తన చివరి ఫేస్బుక్ పోస్ట్‌లో ఆవేదన చెందాడు. వర్సిటీ పరిపాలనా కార్యాలయం ముందు నిరసనలను నిషేధిస్తూ ఇటీవల జారీచేసిన ఉత్తర్వులను తప్పుపట్టాడు. సమానత్వాన్ని నిరాకరిస్తే ప్రతీదాన్ని నిరాకరించినట్లేనన్నాడు. పీహెచ్డీ, ఎంఫిల్ కోర్సుల ప్రవేశాల విధానాల్లో చేసిన సవరణలను విమర్శించాడు. ముత్తు కృష్ణన్ మృతదేహానికి పోస్ట్‌మార్టం చేయడానికి ఎయిమ్స్ ఐదుగురు సభ్యులతో కూడిన బోర్డును నియమిస్తూ ఆ ప్రక్రియను వీడియో తీయాలని ఆదేశించింది. ఆయన ఆత్మహత్య చేసుకున్నాడన్న పోలీసుల కథనాలను కుటుంబ సభ్యులు తిరస్కరించారు. తన కుమారుడి మృతికి దారితీసిన కారణాలు తెలుసుకునేందుకు సీబీఐతో దర్యాప్తు జరిపించాలని ఆయన తండ్రి జీవానందం డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరిగే వరకు అతని మృతదేహాన్ని తీసుకునేది లేదని ముత్తు కృష్ణన్ కుటుంబం స్పష్టం చేసింది. ముత్తు కృష్ణన్ మృతి పట్ల తమిళనాడు సీఎం పళనిస్వామి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి రూ. 3 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. రగులుతున్న తమిళనాడు: కుల వివక్షకు మరో విద్యార్థి బలయ్యాడన్న ప్రచారం తమిళనాట ఆగ్రహ జ్వాలలు రగుల్చుతోంది. కుల వివక్షతో ఓ ప్రొఫెసర్ పెడుతున్న వేధింపులు తట్టుకోలేకే ఆయన బలవన్మరణానికి పాల్పడ్డాడని తమిళాభిమాన సంఘాలు, పార్టీలు ఆరోపించాయి. ముత్తు కృష్ణన్ మృతిపై న్యాయ విచారణ జరపాలని సేలంలో రాత్రి నుంచి ఆందోళనలు కొనసాగుతున్నాయి. విద్యార్థి సంఘాలు టీనగర్‌లోని బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించాయి. -
జేఎన్‌యూలో దళిత విద్యార్థి ఆత్మహత్య
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయానికి చెందిన దళిత విద్యార్థి ముత్తుకృష్ణన్ (27) సోమవారం ఆత్మహత్య చేసుకున్నారు. దక్షిణ ఢిల్లీలోని మునిర్కా విహార్‌లో మిత్రుడి గదిలో ఆయన ఉరేసుకున్నారు. సోమవారం మధ్యాహ్నం స్నేహితుల గదికి వచ్చిన ముత్తుకృష్ణన్ (రజినీ క్రిష్).. అనంతరం పక్క గదిలోకి వెళ్లి ఉరేసుకున్నారని పోలీసులు తెలిపారు. వ్యక్తిగత కారణాలతోనే క్రిష్ ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు. ‘కృష్ణన్ గత కొంతకాలంగా మానసిక కుంగుబాటుతో బాధపడుతున్నాడని తెలిసింది’ అని దక్షిణ ఢిల్లీ ఏసీపీ చిన్మయ్ బిస్వాస్ వెల్లడించారు. మృతుని వద్ద ఎటువంటి సూసైడ్ నోట్ లభించలేదన్నారు. తమిళనాడులోని సేలంకు చెందిన ముత్తుకృష్ణన్ జేఎన్‌యూలో సెంటర్ ఫర్ హిస్టారికల్ స్టడీస్‌లో ఎంఫిల్ చేస్తున్నారు. ‘ఎంఫిల్, పీహెచ్డీ అడ్మిషన్లలో సమానత్వం చూపటం లేదు. వెనుకబడిన వర్గాలకు సమానత్వం అందనపుడు మరేమిచ్చినా లాభం లేదు. సమానత్వంపై ప్రొఫెసర్ సుఖ్‌దేవ్ ఇచ్చిన సిఫార్సులనూ తిరస్కరించారు. యూనివర్సిటీలో నిరసనలు చేపట్టేందుకూ అవకాశం లేదు’ అని మార్చి 10న ఫేస్బుక్లో చేసిన చివరి పోస్టులో ముత్తుకృష్ణన్ ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల ఆత్మహత్య నిరసనల్లో ఈయన చురుగ్గా వ్యవహరించారు. అంబేడ్కర్ విద్యార్థి సంఘం(ఏఎస్ఏ) లోనూ ముత్తుకృష్ణన్ కీలకంగా ఉన్నారు. -
ఏబీవీపీకి భయపడను: జవాన్ కూతురు
ఢిల్లీ: బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీకి వ్యతిరేకంగా ఫేస్బుక్లో చేసిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. ఇటీవల రాంజాస్ కాలేజిలో విద్యార్థులపై జరిగిన దాడిని ఖండిస్తూ.. ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజీ విద్యార్థిని గుర్‌మెహార్ కౌర్ ఈ పోస్టు చేసింది. 'నేను ఢిల్లీ యూనివర్సిటి విద్యార్థినిని. ఏబీవీపీకి భయపడను. నేను ఒంటిరిదాన్నికాను. నాకు దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థుల మద్దతు ఉంది' అని రాసిన ప్లకార్డు చేతపట్టుకుని కౌర్ దిగిన ఫోటోను అప్లోడ్ చేసింది. జేఎన్యూకు చెందిన ఉమర్ ఖలీద్ రాంజాస్ కాలేజికి రావడానికి వ్యతిరేకిస్తూ ఏబీవీపీ కార్యకర్తలు చేసిన దాడిలో 20 మంది విద్యార్థులు గాయపడ్డారు. దీనికి నిరసనగా గుర్‌మెహార్ స్పందించింది. కార్గిల్ యుద్దంలో వీరమరణం పొందిన కెప్టెన్ మన్దీప్ సింగ్ కూతురు ఆమె. ఏబీవీపీ దాడి అమాయక విద్యార్థులకు అవాంతరం కలిగించిందని పోస్టులో పేర్కొంది. ఇది నిరసనకారులపై దాడి కాదని, ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని అభిప్రాయపడింది. స్వేచ్చ, ఆదర్శాలు, విలువలు, పౌరుడి హక్కులపై దాడి జరిగినట్లు అభివర్ణించింది. ఈ చర్యతో ప్రతి భారత పౌరుడు బాధపడ్డాడని చెప్పింది. -
అసలు ఓటమి భారతీయతదే!
సందర్భం జేఎన్‌యూలో జరిగిన ఫిబ్రవరి 9 సంఘటనకు ఏడాది పూర్తయిన సందర్భంగా నాకు ఇందోర్ నుంచి వచ్చిన ఒక టెలిఫోన్ కాల్ గుర్తుకొచ్చింది. ఆ రోజుల్లో దేశమంతటా దేశభక్తులకూ, దేశద్రోహులకూ ముద్రలు వేసే క్రమం జోరుగా సాగుతోంది. జేఎన్యూయైట్లూ, భుజానికి జోలెసంచీలు వేలాడేసుకునేవాళ్లూ, గడ్డం కలిగి ఉన్న వాళ్లూ వేధింపులకు గురవుతున్న రోజులవి. నేను కూడా టీవీ చర్చల్లో పాల్గొన్నాను. రెండు బృందాలకు విడిగా మూడో దృక్పథాన్ని ముందుకు తెచ్చే ప్రయత్నం చేశాను. ఆ సమయంలోనే ఆ కాల్ వచ్చింది. ‘నేను మిమ్మల్ని బాగా గౌరవిస్తాను. మీరు చాలా అర్థవంతంగా, గంభీ రంగా మాట్లాడుతారు. మీరు ఏదో ఒక పార్టీ పక్షం వహించడానికి బదులు దేశ ప్రయోజనాలనే పరమావధిగా భావిస్తారు. కానీ జేఎన్‌యూ సమస్యలో మీరు దేశద్రోహుల వైపు ఎందుకు నిలబడ్డారు?‘ ఇదీ అటువైపు నుంచి వచ్చిన ప్రశ్న. కాలర్ నిజంగానే బాధలో ఉన్నారు. నేను ఈ సమస్యకు సంబంధించిన వాస్త వాల్ని ఆయనకు తెలిపాను. ఫిబ్రవరి 9న జేఎన్‌యూలో జరిగిందని చెబుతున్న వాటి పట్ల అంత గట్టి నమ్మకంతో ఎందుకున్నారని ప్రశ్నించాను. కోర్టు ఆవ రణలో కన్హయ్యకుమార్పై దాడి చేసి కొట్టిన సంఘటన గురించి అడిగాను. అట్లాగే జాతీయవాదం విషయంలో జేఎన్యూకు చెందిన చాలా మంది అభిప్రాయంతో నాకు ఏకీభావం లేదని కూడా స్పష్టం చేశాను. అయితే ఆ సంఘటనలకు సంబంధించిన వాస్తవాల ఆధారంగా నేను వాళ్లతో ఏకీభవి స్తాను. ఏం చెప్పినా నా మాటలు కాలర్‌ను సంతృప్తి పర్చలేకపోయాయి. ఎందుకంటే అప్పుడాయన వాస్తవాలను పట్టించుకోవడానికి సిద్ధంగా లేరు. ‘ఒకవైపు భారతమాతకు అవమానం జరుగుతుంటే మీరు అవీ ఇవీ చెబు తున్నారు. అసలు ప్రశ్నపై మీరే వైపు నిలబడి ఉన్నారు?‘ అని సూటిగా అడిగారాయన. ఆయన ఆవేశంతో ఉన్నట్టుగా అనిపించింది. మరెప్పుడైనా శాంతంగా మాట్లాడుకోవచ్చని భావించాను. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ ఆయనతో సంభాషణ జరగలేదు. ఇందోర్ గుర్తుంది కానీ ఫోన్ చేసిన వ్యక్తి పేరు గానీ, అతని ఫోన్ నంబరు గానీ ఏవీ నా దగ్గర లేవిప్పుడు. ఇప్పుడు, ఈ సంఘటన జరిగి సంవత్సరం పూర్తయిన సందర్భంగా నేను మనసులోనే ఆయనతో సంభాషిస్తున్నాను. అదేమిటో మీరూ వినండి. నిరుడు మనం మాట్లాడుకున్నప్పుడు మీరు చాలా ఆవేశంగా ఉన్నారు కదా. కానీ జేఎన్‌యూలో జరిగిన పరిణామాల్లో చివరకు వెల్లడైన వాస్తవాలేమిటో చూడండి. మీరు ఏ వీడియో టేపు గురించి చాలా ఆవేశంగా మాట్లాడారో, చివరకు ఆ టేపు అసలైంది కాదనీ, నకిలీదనీ తేలిపోయింది. దానిని తారుమారు చేసి అందులో రెచ్చగొట్టే మాటల్ని జొప్పించారు. ఇప్పటికి సంవత్సర కాలం గడచిపోయింది కదా. జేఎన్‌యూ విద్యార్థి నేతలు నిజంగానే భారత్‌కు వ్యతి రేకంగా నినాదాలు చేసినట్టయితే పోలీసులు వాటికి సంబంధించిన సాక్ష్యాలను ఇంకా కోర్టుకు ఎందుకు సమర్పించలేకపోయారో మీరే ఆలోచించండి. మరో వైపు, కన్హయ్యకుమార్పై కోర్టు ఆవరణలో పట్టపగలే దాడి చేసి కొట్టారు కదా. సంవత్సరం గడచినా పోలీసులు నేరస్థులపై కేసు నమోదు చేయడానికి కూడా సిద్ధపడడం లేదు. అందుకే ఇదంతా మీ లాంటి వారిలో భావావేశాలను రెచ్చగొట్టడం కోసమే ఒక చిన్న విషయాన్ని అనవసరంగా ఒక పెద్ద వివాదంగా సృష్టించారేమో ఆలోచించండి. వాస్తవాలకు మసిపూసి మారేడుకాయ చేశారేమో? ఆ సంఘటనకు సంబంధించిన వాస్తవాలను లేవనెత్తడం ద్వారా నేను విష యాన్ని పక్కదారి పట్టిస్తున్నానని మీరు భావించవద్దు. విషయం కేవలం వాస్తవ సంఘటనలకు మాత్రమే పరిమితమైంది కాదని మీరన్న మాటలు నాకు గుర్తు న్నాయి. దీన్ని నేను అంగీకరిస్తాను. మీ దృష్టిలో ఇది భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించిన విషయం కూడా కాదు. ప్రస్తుత పరిస్థితిలో బాహాటంగా చేసే దేశ వ్యతిరేక నినాదాలను పట్టించుకోకుండా ఉండగలిగే స్థితిలో మనం లేమన్న విష యాన్ని నేనూ అంగీకరిస్తాను. ఒక పెద్ద దేశం.. ఆత్మవిశ్వాసం తొణకిసలాడే దేశం ఇలాంటి చర్యల పట్ల ఊరకే నవ్వేసి ఉండిపోగలుగుతుంది. కానీ మన మింకా అక్కడి వరకు చేరుకోలేదు. మనం జాతి పట్ల విధేయంగా ఉన్నామా, లేదా అన్నదే అసలు సమస్య అని మీరన్నారు. ఇదే ప్రశ్నను నేను మరో విధంగా అడుగుతాను–జాతి పట్ల మనం ఏ భావాన్ని కలిగి ఉండాలి? దేశంపట్ల అభి మానానికి ఉండాల్సిన ధర్మాలేమిటి? నా అభిప్రాయాలను గౌరవిస్తానని మీరన్నారు. కాబట్టి వాటిని ఒప్పు కున్నా, ఒప్పుకోకున్నా కనీసం వాటిని శ్రద్ధగా విననైతే వింటారుగా! నిజానికి గత సంవత్సరం జేఎన్‌యూ చర్చలో భాగమైన రెండు సమూహాలూ దేశీయ లక్షణాలు కలిగినవి కావు. తమను తాము జాతీయవాదులుగా ప్రకటించుకున్న వాళ్లదీ, జాతివ్యతిరేకులనే ముద్ర పడిన వాళ్లదీ ఇద్దరివీ అరువు తెచ్చుకున్న భావ జాలంపై ఆధారపడినవే. జాతి గురించి డబ్బాకొట్టుకున్న వాళ్లు చెబుతున్న జాతీయవాదపు అవగాహన యూరప్ భావజాలానికి నకలు మాత్రమే. జాతీయ వాదంపై సాగిన ఈ చర్చలో భారతీయత అన్నది పూర్తిగా కనిపించకుండా పోయింది. నిజానికి దేశభక్తులు లేదా జాతీయవాదుల బృందం అంధ భక్తిని డిమాండ్ చేస్తూ వచ్చింది. నా దేశం సరైందేనా, కాదా అన్న ప్రశ్ననే లేవనెత్తగూడదు. దేశం పట్ల అభిమానం అంటే జాతికి సంబంధించిన ఏ విమర్శనైనా వ్యతిరేకించడమే. నా దేశం గొప్పది, ఎందుకంటే ఇది నాది కాబట్టి. భారతదేశాన్ని మాతృ భూమిగా, పితృభూమిగా, శ్రేష్ఠభూమిగా అంగీకరించేవాళ్లే దేశానికి యజమా నులు. మిగిలిన వాళ్లంతా కిరాయికి ఉంటున్న వాళ్లే. నిరుటి చర్చలో ఈ సమూ హం చాలా దూకుడుతనాన్ని ప్రదర్శించింది. గెలుపు తనదేనన్న తీరులో వ్యవహ రించింది. మిగిలిన వారందరి దేశభక్తినీ అది పరీక్షకు పెట్టింది. మరో సమూహానికి అసలు ఏ పేరూ లేదు. దానిని ఓసారి సెక్యులర్ అని పిలిచారు. మరోసారి వారు తమను తాము లిబరల్స్ (ఉదారవాదులు) అని చెప్పుకున్నారు. మొదటి సమూహం వీరిని జాతిద్రోహులని అన్నది. కానీ వారిని జాతి అలీనులు అనడం సరిగ్గా ఉంటుంది. వాళ్ల అభిప్రాయం ప్రకారం జాతి అనేది మన అపరిమిత విధేయతకు హక్కుదారేమీ కాదు. కుటుంబం నుంచి విశ్వాంతరాల దాకా మనమంతా వేర్వేరు విభాగాల్లో సభ్యులం మాత్రమే. ప్రతి స్థాయిలోనూ మనపై బాధ్యతలుంటాయి. ఏదో ఒక విభాగాన్ని మాత్రమే కళ్లు మూసుకొని గుడ్డిగా సమర్థించడమేంటి? ఈ సమూహానికి జాతి పట్ల వ్యతిరేకత ఏమీ లేదు కానీ దానిలో గందరగోళం లేదా సంకోచం ఉందని చెప్పొచ్చు. గత సంవత్సరం జరిగిన చర్చలో ఈ సమూహం ఆత్మరక్షణాయుతంగా, ఓటమికి గురైనట్టుగా వ్యవహరించింది. అయితే జాతీయవాదంపై ఈ రెండు బృందాల అవగాహనా యూరప్ నుంచి అరువు తెచ్చుకున్నదే. 19, 20 శతాబ్దాల్లో జాతీయవాదం అనేది ఒక సంకుచిత భావజాలంగా ఉండింది – ఒక జాతి, ఒక సంస్కృతి, ఒక భాష, ఒక మతం, ఒక రేస్. యూరప్‌కు జాతీయ సమైక్యత అంటే ఏకరూపకత మాత్రమే. నిరుటి చర్చలో తమను తాము జాతీయవాదులుగా చెప్పుకున్న వాళ్లు జర్మనీ, ఇటలీలకు చెందిన ఈ సంకుచిత జాతీయవాదాన్నే భారతదేశంలో కాపీ కొట్టా లని భావించారు. నిరుడు జాతీయవాదాన్ని వ్యతిరేకించిన బృందం జాతీయ వాదం తప్పనిసరిగా సంకుచితత్వమే అవుతుందని భావించింది. ఈ రెండు బృందాలూ అరువు తెచ్చుకున్న భావజాలం, అనారోగ్యకరమైన మనస్తత్వానికి చెందిన రెండు ముఖాలు మాత్రమే. నిజమైన జాతీయ లక్షణాలను అర్థం చేసుకోవడానికి మనం యూరప్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. భారత స్వాతంత్య్ర సంగ్రామానికి చెందిన జాతీయ వాదం దేశాభిమానంపై మనకు మెరుగైన అవగాహనను అందిస్తుంది. ఈ జాతీయవాదంలో జాతీయ సమైక్యత అంటే అర్థం ఏకరూపకత కాదు. మన జాతీయవాదం యూరప్‌కు చెందిన అవగాహన నుంచి వైదొలగుతూ బహు ళత్వానికి పెద్ద పీట వేసింది. భిన్నత్వంలో ఏకత్వం అనే తత్వాన్ని అందించింది. భారతీయ జాతీయవాదం జాత్యహంకారపూరితమైంది కాదు. అది తెల్ల చర్మాన్ని లేదా బైటివారిని వ్యతిరేకించలేదు. అందుకు భిన్నంగా మన జాతీయవాదం మనల్ని ఆఫ్రికా, ఆసియా, మిగతా ప్రపంచంలో బానిసత్వంలో మగ్గుతున్న వారితో జోడించింది. మన జాతీయవాదం మనల్ని ఇతర దేశాలకు వ్యతిరేకంగా నిలబెట్టేది కాదు, దేశం లోపలే ఉన్న వేర్వేరు కులాలను, ప్రాంతాలను, మతా వలంబికులను జోడించేది. నేను ఈ మొత్తం చర్చతో ఏకీభవించడం లేదన్న విషయాన్ని మీతో ఫోన్లో చెప్పింది గుర్తుండే ఉంటుంది. నేనలా ఎందుకన్నానో ఈపాటికి మీకు అర్థమై ఉంటుందని కూడా ఆశిస్తున్నాను. గత సంవత్సరం జరిగిన జేఎన్‌యూ చర్చలో దేశభక్తులు గెలవనూ లేదు, దేశద్రోహులు ఓడిపోనూ లేదు. నిజానికి యూరప్ జాతీయవాదం గెలిచింది. భారత జాతీయవాదం ఓడిపోయింది. నా దగ్గర మీ పేరు గానీ, ఫోన్ నంబరు గానీ ఏవీ లేవు. కానీ దేశాభిమానం అనేది ఊరూ పేరూ తెలియని వ్యక్తుల కలయికతోనే నిర్మితమవుతుంది కదా! - యోగేంద్ర యాదవ్ మొబైల్ : 98688 88986 Twitter : @_YogendraYadav -
మోదీ బొమ్మను ఎందుకు తగలబెట్టారు?
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ, మరికొందరిని రావణుడిగా చిత్రీకరిస్తూ దసరా రోజున వారి దిష్టిబొమ్మను కొందరు విద్యార్థులు క్యాంపస్ ప్రాంగణంలో తగలబెట్టడంపై జవరహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్‌యూ) బుధవారం విచారణకు ఆదేశించింది. గుజరాత్ ప్రభుత్వం, గోరక్షకుల దిష్టిబొమ్మలను దహనం చేసినందుకు సంబంధిత విద్యార్థులకు వర్సిటీ వారం కిందటే షోకాజ్ నోటీసులు జారీచేసి, విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. దసరా రోజున దేశమంతా పాక్ ప్రధాని షరీఫ్‌తోపాటు 26-11 ముంబై దాడుల నిందితుడు హఫీజ్ సయీద్, ఇతర ఉగ్రవాదుల తలలతో కూడిన దిష్టిబొమ్మలను తగలబెట్టగా.. కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘం ఎన్ఎస్యూఐ మాత్రం రావణున్ని ప్రతిబింబించేలా ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా ముఖాలతో ఉన్న చిత్రాలతో ఉన్న దిష్టిబొమ్మను తగలబెట్టింది. చేసిన వాగ్దాలను నిలుపుకోవడంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యం, విద్యా సంస్థలపై వరుస దాడులకు వ్యతిరేకంగా తమ నిరసనను ఇలా వ్యక్తం చేశామని విద్యార్థులు చెప్తున్నారు. దసరా నాటి ఈ కార్యక్రమానికి ముందస్తు అనుమతి లేదన్న వర్సిటీ ప్రకటనపై స్పందిస్తూ.. క్యాంపస్‌లో దిష్టి బొమ్మ దహనం నిత్యకృత్యమేనని, దీనికి అనుమతి అక్కర్లేదని వారు అంటున్నారు. మోదీ, షాలతో పాటు యోగా గురువు బాబా రాందేవ్, బీజేపీ ఎంపీ సాధ్వీ ప్రగ్యా, ఆసాకరాం బాపు, నాథురాం గాడ్సే, జేఎన్‌యూ ఉపకులపతి జగదీష్ కుమార్ల ముఖాలు కూడా తగలబెట్టిన దిష్టిబొమ్మలో ఉన్నాయి -
ప్రముఖ వర్సిటీలో పెరిగిన లైంగిక వేధింపులు
న్యూఢిల్లీ: జవహార్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ)లో ఎన్నడూ లేనంతగా లైంగిక వేధింపుల ఫిర్యాదులు పెరిగిపోయాయి. ఒక్క 2015-16లోనే 39 లైంగిక వేధింపుల ఫిర్యాదులు నమోదైనట్లు విశ్వవిద్యాలయ అధికారులు తెలిపారు. ఇంత పెద్ద మొత్తంలో లైంగిక వేధింపుల సంఘటనలు జరిగినట్లు నమోదుకావడం ఇదే తొలిసారి అని చెప్పారు. వీటిల్లో గ్రాడ్యుయేట్ స్థాయి నుంచి వచ్చిన ఫిర్యాదులే ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. యూనివర్సిటీలో ఎన్ని లైంగిక వేధింపుల ఫిర్యాదులు నమోదయ్యాయనే విషయంపై ప్రతి సంవత్సరం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కు ప్రతి యూనివర్సిటీ ఒక నివేదిక రూపంలో ఇస్తుంది. అందులో భాగంగా గత ఏడాది జేఎన్ యూ ఇచ్చిన నివేదికలో 26 ఫిర్యాదులు, అంతకుముందు 2013-14 లో 25 ఫిర్యాదులు అందగా ఈ 2015-16లో మాత్రం అవికాస్త 39కి పెరిగాయి. -
..అలాగైతే మేం దేశద్రోహులమే : కన్హయ్య
దేశంలో మోదీస్వామ్యం: కన్హయ్య కుమార్ * అణగారిన వర్గాల గురించి గళం విప్పుతుంటే మాపై జాతి వ్యతిరేక ముద్ర * బీఫ్ తినే వారిపై జంతు సంరక్షణ పేరుతో దాడులు, హత్యలు * వర్సిటీల్లో వివక్ష నిర్మూలనకు రోహిత్ చట్టం కోసం కృషి * హైదరాబాద్‌లో ‘థీమాటిక్ సోషల్ ఫోరం’ వర్క్‌షాప్ ప్రారంభం * వివిధ యూనివర్సిటీల నుంచి విద్యార్థి నేతల హాజరు సాక్షి, హైదరాబాద్: మతోన్మాదాన్ని వ్యతిరేకించడమే దేశద్రోహమైతే తామంతా దేశద్రోహులమేనని ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్ అన్నారు. ప్రధాని పాలనలో దేశంలో ప్రజాస్వామ్యం పతనమై మోదీస్వామ్యం నడుస్తోందని... మహిళలు, దళితులు, ముస్లింల అణచివేత విధానాలు కొనసాగుతున్నాయని దుయ్యబట్టారు. అఖిల భారత థీమాటిక్ సోషల్ ఫోరం ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లో (ఆర్టీసీ కల్యాణ మండపంలో) ప్రారంభమైన రెండ్రోజుల వర్క్‌షాప్ (డిగ్నిటీ, డైవర్సిటీ, డెమోక్రసీపై)లో, విలేకరుల సమావేశంలో కన్హయ్య ఇదే అంశంపై మాట్లాడారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రజాస్వామ్య పునాదులను పెకిలించే ప్రయత్నం చే స్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అణగారినవర్గాల గురించి గళం విప్పే వాళ్లందరినీ జాతి వ్యతిరేకులుగా ముద్రవేస్తున్నారని, కానీ తాము ఆ ‘బిరుదు’ అందుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. తిండి విషయంలోనూ ప్రజలకు స్వేచ్ఛ లేని పరిస్థితి దేశంలో నెలకొందని విమర్శించారు. చనిపోయిన జంతువుల కోసం కొందరు మనుషుల ప్రాణాలను తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఫ్ తినడం ఒక ఆహారపు అలవాటు అని, ప్రపంచంలోని అనేక దేశాల్లో బీఫ్ తింటున్నా దేశంలో మాత్రం ధర్మం, జంతు సంరక్షణ పేరుతో బీఫ్ తినే వారిపై దాడులు జరుగుతున్నాయన్నారు. హెచ్‌సీయూ పరిస్థితుల్లో మార్పు రాలేదు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నెలకొన్న జాతి, మనువాద విధానాలు దేశంలోని ప్రధాన యూనివర్సిటీల్లో ఉన్నాయని కన్హయ్య పేర్కొన్నారు. విద్యావ్యవస్థలో సమూల మార్పులు తెచ్చేందుకు పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా జాతి వివక్ష నిర్మూలనకు రోహిత్ చట్టం తెచ్చేలా కృషి చే యాలన్నారు. హెచ్‌సీయూలో మీడియానూ అడ్డుకుంటున్నారని, రోహిత్ ఆత్మహత్య తరువాత కూడా వర్సిటీలోని పరిస్థితుల్లో మార్పు రాలేదన్నారు. విద్యావ్యవస్థలో అవినీతి దేశవ్యాప్తంగా ఉందని, ఎంసెట్-2 పేపర్ లీకేజీ అందులో భాగమేనని కన్హయ్య పేర్కొన్నారు. రోహిత్ ఆత్మహత్యకు కారణమైన హెచ్‌సీయూ వీసీ అప్పారావు, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయలపై ఇప్పటివరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం అమలు చేయకపోవడం మన వ్యవస్థలోని అసమానత్వానికి నిదర్శనమని విమర్శించారు. ఎందరో వివక్ష ఎదుర్కొంటున్నారు: రాధిక వేముల అంతకుముందు థీమాటిక్ సోషల్ ఫోరం కార్యక్రమాన్ని రోహిత్ వేముల తల్లి రాధిక ప్రారంభిస్తూ దేశంలో తన కొడుకు లాంటి బిడ్డలెందరో వివక్ష ఎదుర్కొంటున్నారని, వారందరి పక్షాన పోరాడేందుకు తాను సిద్ధమన్నారు. కార్యక్రమానికి మోహన్ ధరావత్ అధ్యక్షత వహించగా, సీనియర్ జర్నలిస్ట్ మల్లెపల్లి లక్ష్మయ్య స్వాగతోపన్యాసం చేశారు. ప్రొఫెసర్ రమా మెల్కొటే తదితరులు ప్రసంగించారు. కశ్మీర్ లోయలో ఇటీవలి హింసలో ప్రాణాలు కోల్పోయిన వారితోపాటు ప్రముఖ రచయిత్రి మహాశ్వేతాదేవి, రోహిత్ వేముల, ఇతర అమరవీరులకు సభ నివాళులర్పించి రెండు నిముషాల పాటు మౌనం పాటించింది. హిందుత్వ శక్తుల నుంచి వివక్ష: రిచాశర్మ మహిళలు, మైనారిటీలు, దళితులు, ఆదివాసీలను హిందుత్వ శక్తులు వివక్షకు, అణచివేతకు గురిచేస్తున్నాయని అలహాబాద్ యూనివర్సిటీ విద్యార్థి సంఘం తొలి అధ్యక్షురాలు రిచాశర్మ విమర్శించారు. ఇదే జాతీయతైతే దాన్ని ప్రతిఘటించడానికి తామంతా సిద్ధమన్నారు. ఐశ్వర్యం, అధికారంకన్నా స్వాభిమానం కోసమే పోరాటమని చాటిన అంబేడ్కర్ ఆదర్శాల దారిలో తమ ఉద్యమ ప్రస్థానం సాగుతోందని హెచ్‌సీయూ అంబేడ్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దొంత ప్రశాంత్ పేర్కొన్నారు. దేశంలో వేల సంవత్సరాల నుంచి అగ్రవర్ణాలు, వెలివాడల మధ్య సమరం జరుగుతోందని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు నలిగంటి శరత్ అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో జాదవ్‌పూర్ యూనివర్సిటీ విద్యార్థి నాయకురాలు సుధాన్యాపాల్, పుణే ఫిల్మ్ యూనివర్సిటీ విద్యార్థి హరిశంకర్ తదితరులు పాల్గొన్నారు. -
రోహిత్ చట్టం తేవాలి: కన్హయ్య కుమార్
- మోదీ క్రసీ నడుస్తోంది - విద్యావిధానంలో సమూల మార్పులు రావాలి - లౌకిక విద్య కోసం రోహిత్ చట్టం తేవాలి - బీఫ్ తినొద్దని పశువుల కోసం మనుషులను చంపుతున్నారు - మీడియా సమావేశంలో జెఎన్‌ఎస్‌యూ అధ్యక్షుడు కన్హయ్య కుమార్ సాక్షి, హైదరాబాద్ ప్రజాస్వామ్యం పతనమై(డెమోక్రాష్) మోడీక్రసీ నడుస్తోందని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ, ఢిల్లీ) విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్ ధ్వజమెత్తారు. దేశంలో మహిళ, దళిత, ముస్లిం అణిచివేత విధానాలు కొనసాగుతున్నాయని విమర్శించారు. ఒక సెమినార్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన ఆయన ఏఐఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు ఖాద్రీ, రాష్ట్ర అధ్యక్షుడు వేణు, ఇతర విద్యార్థి నాయకులు శంకర్, రాజారాంలతో కలిసి ఆదివారం మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నెలకొన్న జాతి, మనువాద విధానాలు దేశంలోని ప్రధాన యూనివర్సిటీల్లో ఉన్నాయని, విద్యావ్యవస్థలో మార్పు తెచ్చేందుకు పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. రోహిత్ చట్టం తీసుకురావడం ద్వారా అందరికీ విద్య, సమసమాజ స్థాపనకు కషి చే యాలన్నారు. హైదరాబాద్ యూనివర్సిటీలోకి మీడియాను కూడా అడ్డుకుంటున్నారని, రోహిత్ మరణం తరువాత కూడా పరిస్థితుల్లో మార్పు లేదన్నారు. ప్రధానమంత్రి, విద్యా మంత్రుల డిగ్రీల విషయంలో ప్రశ్నలు తలెత్తే పరిస్థితి దేశంలో నెలకొందన్నారు. విద్యావ్యవస్థ పునాదుల నుంచే బలంగా ఉంటే ఎంసెట్ లీకేజీ వంటి దుష్పరిణామాలు పునరావతం కావన్నారు. -
'జేఎన్ యూలో రేప్‌లు నిత్యకృత్యం'
జైపూర్: ఢిల్లీ జేఎన్ యూ క్యాంపస్ లో అత్యాచారాలు నిత్యకృత్యమని గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని రాజస్థాన్ బీజేపీ ఎమ్మెల్యే జ్ఞానదేవ్ అహుజ స్పష్టం చేశారు. నేర కార్యకలాపాలకు జేఎన్ యూ స్థావరంగా మారిందని ఆయన బుధవారం పునరుద్ఘాటించారు. జేఎన్ యూ విద్యార్థులు క్యాంపస్ లో విచ్చలవిడిగా వ్యవహరిస్తారని గతంలో అహుజ వ్యాఖ్యానించారు. జేఎన్ యూ క్యాంపస్ లో ప్రతిరోజు 3 వేల కండోమ్ లు, గర్భనిరోధక ఇంజక్షన్లు వాడతారని ఆరోపించారు. దేశ రాజధాని ఢిల్లీలో 50 శాతం అత్యాచారాలు, లైంగిక వేధింపుల కేసులకు జేఎన్ యూ విద్యార్థులే కారణమని దుయ్యబట్టారు. ఆయన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైనప్పటికీ ఆయన వెనక్కు తగ్గలేదు. -
కన్హయ్య కుమార్ కు ఊరట
న్యూఢిల్లీ: జేఎన్ యూ విద్యార్థి నేత కన్హయ్య కుమార్ కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. కన్హయ్యతో పాటు ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్య ఇతరులపై జేఎన్ యూ విధించిన క్రమశిక్షణ చర్యలపై ఢిల్లీ హైకోర్టు శుక్రవారం స్టే విధించింది. ఈ మేరకు జస్టిస్ మన్ మోహన్ గవే షరతులతో కూడిన స్టే ఇచ్చారు. తమపై నమ్మకముంటే జేఎన్ యూ విద్యార్థులు ఆందోళన విరమించాలని సూచించింది. ఎటువంటి సమ్మెలు, ధర్నాలకు దిగొద్దని కోరింది. క్రమశిక్షణ ఉల్లఘించారనే ఆరోపణలతో కన్హయ్యకు రూ.10 వేలు, ఖలీద్, భట్టాచార్యలకు రూ. 20 వేలు చొప్పున జేఎన్ యూ అధికారులు జరిమానా విధించారు. దీంతో వీరంతా ఆందోళనకు దిగారు. -
ఆమరణ నిరాహార దీక్షకు దిగిన కన్హయ్య
న్యూఢిల్లీ: జేఎన్‌యూ విద్యార్థి సంఘం నాయకుడు కన్హయ్య కుమార్ మరో 19 మంది విద్యార్థులతో కలిసి విశ్వవిద్యాలయంలో ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. కన్హయ్యతోపాటు ఉమర్ ఖలీద్, అనీర్బన్ భట్టాచార్యలపై విశ్వవిద్యాలయం తీసుకున్న క్రమశిక్షణ చర్యలకు వ్యతిరేకంగా విద్యార్థులు బుధవారం అర్థరాత్రినుంచి దీక్షలో కూర్చున్నారు. అత్యున్నత విచారణ కమిటీపై తమకు నమ్మకం లేదనీ అదొక మాయ అని, అందుకే తమకు విధించిన శిక్షలను తిరస్కరిస్తున్నామని వివరించారు. గతంలో కన్హయ్యను పోలీసులు అరెస్టు చేసిన స్థలం వద్దే విద్యార్థులు దీక్షాస్థలిని ఏర్పాటు చేసుకున్నారు. కన్హయ్య మాట్లాడుతూ..‘పరీక్షల సమయంలో క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే విద్యార్థులెవరూ ఆందోళనకు దిగే అవకాశముండదనే విశ్వవిద్యాలయం ఇప్పుడు మాకు శిక్ష విధించింది. పోరాడుతూనే పరీక్షల్ని రాయగలం’ అని అన్నారు. అఫ్జల్‌గురు ఉరికి వ్యతిరేకంగా సమావేశాన్ని నిర్వహించడం, దేశ వ్యతిరేక నినాదాలు చేయడంతో గతంలో వీరు అరెస్టయ్యి బెయిల్ పొందిన విషయం తెలిసిందే. ఇప్పుడ వీరిపై విశ్వవిద్యాలయం క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. -
ఫైన్ కట్టే ప్రసక్తేలేదు... నిరవధిక దీక్ష చేస్తాం
న్యూఢిల్లీ: జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) వివాదం రోజురోజుకూ ముదిరిపోతుంది. వర్సిటీ ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల ఉన్నతస్థాయి కమిటీ విద్యార్థినేత కన్హయ్యకుమార్కు రూ.10 వేల జరిమానా విధించిన విషయంతెలిసిందే. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించాడన్న నేరంతో ఏబీవీపీ నాయకుడు సౌరభ్ శర్మకు కూడా రూ.20 వేల జరిమానా విధించింది. అయితే తాము జరిమానా కట్టే ప్రసక్తేలేదని విద్యార్థులు తేల్చి చెబుతున్నారు. ఉన్నతస్థాయి కమిటీ ఉత్తర్వుల ప్రకారం హాస్టల్ ఖాళీచేసి వెళ్లనున్నట్లు తెలిపారు. ఉత్తర్వులు రద్దుచేయాలంటూ నిరసనగా బుధవారం నుంచి నిరవధిక నిరాహారదీక్ష చేపట్టబోతున్నట్లు విద్యార్థిసంఘం నేత కన్హయ్యకుమార్ మీడియాకు వివరించారు. తమపై జరుగుతున్న విధానాలు, చర్యలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని ఆరోపించారు. ఆఫ్జల్‌గురు ఉరితీతకు వ్యతిరేకంగా గత ఫిబ్రవరి 9న కార్యక్రమం నిర్వహించిన విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ కు జరిమానా విధించడంతో పాటు, ఉమర్, అనిర్బన్ భట్టాచార్యలు వర్సిటీలో మత హింసకు, మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించిన కారణంగా ఉమర్‌ను ఒక సెమిస్టర్, ముజీబ్ గట్టూను రెండు సెమిస్టర్లు, భట్టాచార్యను జూలై 15 వరకు సోమవారం నాడు బహిష్కరించింది. -
అది తప్పుడు రిపోర్ట్: కన్హయ్య కుమార్
న్యూఢిల్లీ: జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సటీ(జేఎన్ యూ) అడ్మినిష్ట్రేషన్ కమిటీ తనకు రూ.10,000 జరిమానా విధించడంపై కన్హయ్య కుమార్ స్పందించారు. కమిటీ నివేదికను ప్రహసనంగా అభివర్ణించారు. యూనివర్సిటీ అధికారులతో కాకుండా మరో ఉన్నత స్థాయి కమిటీతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. జేఎన్ యూ అధికారులు పక్షపాతంతో వ్యవహరించారని దుయ్యబట్టారు. ఆర్ఎస్ఎస్ కు అనుకూలంగా నివేదికను ఇచ్చారని అన్నారు. జేఎన్ యూ అధికారులు క్యాంపస్ లోకి పోలీసులను అనుమతింనచిన రోజే వారు అర్ఎస్ఎస్ విధేయులుగా మారిపోయారని స్పష్టం చేశారు. "విచారణ నిజాయితీ లేకుండా జరిగింది. వర్సిటీ వీసీ జగదీశ్ కుమార్ మీరు గుర్తుంచుకోండి మేము ఎన్నటికీ ఆర్ఎస్ఎస్ విధేయులుగా మారము" అని ఉమర్ ఖలీద్ ఫేస్ బుక్ లో పోస్టు చేశాడు. ఫిబ్రవరి 9న జేఎన్ యూలో అఫ్జల్ గురూకు అనుకూలంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని క్యాంపస్ లో అశాంతికి కారణమయ్యారని కన్హయ్య కుమార్, ఖలీద్ పై వర్సిటీ అధికారులు జరిమానా విధించిన విషయం తెలిసిందే.