అది తప్పుడు రిపోర్ట్: కన్హయ్య కుమార్
Published Tue, Apr 26 2016 8:08 PM | Last Updated on Sun, Sep 3 2017 10:49 PM
న్యూఢిల్లీ: జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సటీ(జేఎన్ యూ) అడ్మినిష్ట్రేషన్ కమిటీ తనకు రూ.10,000 జరిమానా విధించడంపై కన్హయ్య కుమార్ స్పందించారు. కమిటీ నివేదికను ప్రహసనంగా అభివర్ణించారు. యూనివర్సిటీ అధికారులతో కాకుండా మరో ఉన్నత స్థాయి కమిటీతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
జేఎన్ యూ అధికారులు పక్షపాతంతో వ్యవహరించారని దుయ్యబట్టారు. ఆర్ఎస్ఎస్ కు అనుకూలంగా నివేదికను ఇచ్చారని అన్నారు. జేఎన్ యూ అధికారులు క్యాంపస్ లోకి పోలీసులను అనుమతింనచిన రోజే వారు అర్ఎస్ఎస్ విధేయులుగా మారిపోయారని స్పష్టం చేశారు. "విచారణ నిజాయితీ లేకుండా జరిగింది. వర్సిటీ వీసీ జగదీశ్ కుమార్ మీరు గుర్తుంచుకోండి మేము ఎన్నటికీ ఆర్ఎస్ఎస్ విధేయులుగా మారము" అని ఉమర్ ఖలీద్ ఫేస్ బుక్ లో పోస్టు చేశాడు. ఫిబ్రవరి 9న జేఎన్ యూలో అఫ్జల్ గురూకు అనుకూలంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని క్యాంపస్ లో అశాంతికి కారణమయ్యారని కన్హయ్య కుమార్, ఖలీద్ పై వర్సిటీ అధికారులు జరిమానా విధించిన విషయం తెలిసిందే.
Advertisement
Advertisement