kanhaiya
-
ఈ తారల ‘ముందస్తు’ జాతకాలివే..
2024 లోక్‌సభ ఎన్నికల్లో పలువురు సినీ తారలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నించారు. ఎన్నికలు ముగిసిన తరుణంలో ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడయ్యాయి. దీంతో ఏ సెలబ్రిటీ పరిస్థితి ఎలా ఉండబోతోందో ‘ముందస్తు’గా వెల్లడయ్యింది.మనోజ్ తివారీప్రస్తుత ఎన్నికల్లో ఈశాన్య ఢిల్లీ సీటుపైనే ఎక్కువ చర్చ జరిగింది. కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్ సిట్టింగ్ బీజేపీ ఎంపీ మనోజ్ తివారీపై పోటీకి దిగారు. పలు ఎగ్జిట్ పోల్స్‌లో మనోజ్ తివారీ విజయం ఖాయమనే అంచనాలు వెలువడ్డాయి.పవన్ సింగ్భోజ్పురి గాయకుడు పవన్ సింగ్ బీహార్‌లోని కరకట్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగారు. ఆయనపై పోటీకి ఎన్డీఏ ఉపేంద్ర కుష్వాహను రంగంలోకి దింపింది. అయితే కరకట్ సీటు పవన్ సింగ్ ఖాతాలోకి వెళ్లే అవకాశం ఉందని పలు ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.కంగనా రనౌత్హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ లోక్‌సభ స్థానం నుంచి బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ను బీజేపీ పోటీకి దింపింది. ఆమెతో కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్ తలపడ్డారు. ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కంగనా రనౌత్ విజయాన్ని దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.నిర్హువాఉత్తరప్రదేశ్లోని అజంగఢ్ లోక్‌సభ స్థానం నుంచి భోజ్‌పురి గాయకుడు, నటుడు నిర్హువాను బీజేపీ పోటీకి దింపింది. ఇదేస్థానం నుంచి సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి ధర్మేంద్ర యాదవ్ బరిలోకి దిగారు. కొన్ని ఎగ్జిట్ పోల్స్‌లో నిరాహువాదే పైచేయి అని వెల్లడయ్యింది.హేమామాలినిబాలీవుడ్ నటి హేమామాలిని ఉత్తరప్రదేశ్‌లోని మధుర లోక్‌సభ స్థానం నుంచి మూడోసారి పోటీకి దిగారు. పలు ఎగ్జిట్ పోల్స్‌లో హేమ మాలినిదే పైచేయి అని వెల్లడయ్యింది.రవి కిషన్ఉత్తరప్రదేశ్లోని గోరఖ్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి రవికిషన్ పోటీ చేశారు. ఎగ్జిట్ పోల్ ప్రకారం రవికిషన్ ఇక్కడి నుంచి సునాయాసంగా గెలుస్తారు. గోరఖ్‌పూర్ స్థానం బీజేపీకి కంచుకోట. ఇది ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి నాథ్ ఆదిత్యనాథ్ స్వస్థలం. -
కన్నయ్య కుమార్ vs మనోజ్ తివారి.. ఎవరి సత్తా ఎంత?
లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మరో అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఈశాన్య ఢిల్లీ నుంచి కన్హయ్య కుమార్‌ను బరిలోకి దించుతున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. గత కొన్నేళ్లుగా బీహార్ రాజకీయాల్లో యాక్టివ్‌గా కనిపించిన కన్నయ్య కుమార్ ఇప్పుడు రాజధాని ఢిల్లీలో తన హవా చాటేందుకు సిద్ధమయ్యారు. బీజేపీ అభ్యర్థి మనోజ్ తివారీపై కన్నయ్య కుమార్ పోటీకి దిగారు. ఈశాన్య ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం యూపీకి ఆనుకుని ఉండటానికి తోడు ఇక్కడ బీహార్, హర్యానాకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో ఇక్కడ నివసిస్తున్నారు. బీజేపీ వరుసగా మూడోసారి మనోజ్ తివారీని ఇక్కడ నుండి పోటీకి నిలబెట్టింది. 2014, 2019 ఎన్నికల్లో ఆయన ఇక్కడ నుంచి భారీ మెజార్టీతో గెలుపొందారు. మనోజ్ తివారీ భోజ్‌పురి సినిమా నటుడు కావడంతో అతనికి జనాదరణ అధికంగానే ఉంది. ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్ అతనికి పోటీగా బీహార్‌కు చెందిన కన్నయ్య కుమార్‌కు అవకాశం కల్పించింది. ఈయనకు యువత మద్దతు ఉంది. 2020 ఢిల్లీ అల్లర్లు ఈశాన్య ప్రాంతంలోనే మొదలయ్యాయి. ఈ ప్రాంతంలోని సీలంపూర్, ముస్తఫాబాద్, బాబర్పూర్, కార్గిల్ నగర్ తదితర ప్రాంతాల్లో అధిక సంఖ్యలో ముస్లిం జనాభా ఉంటోంది. దీంతో ఇండియా కూటమి అక్కడి ముస్లిం ఓట్లను దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇందుకు కన్నయ్య కుమార్ ప్రసంగాలు ఉపకరిస్తాయని కాంగ్రెస్ భావిస్తోందని సమాచారం. జేఎన్‌యూలో కన్నయ్య కుమార్ విద్యార్థి నేతగా ఉన్నప్పుడు ఆయన ప్రసంగాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. యువతలో అతని పాపులారిటీ తారాస్థాయికి చేరింది. ఇప్పుడు అదే పాపులారిటీని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం కాంగ్రెస్ చేసింది. మరి ఈశాన్య ఢిల్లీ ప్రజలు కాంగ్రెస్ కన్నయ్యను ఆదరిస్తారో, బీజేపీ మనోజ్‌ను అక్కున చేర్చుకుంటారో వేచి చూడాల్సిందే! -
రూ. 251తో 14ఏళ్లకే సాఫ్ట్వేర్ కనిపెట్టిన 'కన్హయ శర్మ' - ఎవరు?
ప్రస్తుతం మొబైల్ ఫోన్ లేకుండా పెద్దవారికైనా, పిల్లలకైనా రోజు గడవదు అంటే అందులో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. పెద్దవారి సంగతి అలా ఉంచితే, పిల్లలు పుస్తకాల్లో కంటే మొబైల్, ఇంటర్నెట్, కంప్యూటర్లలోనే ఎక్కువ కాలం గడిపేస్తున్నారు. ఇది తల్లిదండ్రులకు ఆందోళనగా మారిపోతోంది. అయితే అందుకు భిన్నంగా 'కన్హయ శర్మ' అనే యువకుడు చిన్నప్పుడే అద్భుతాలు సృష్టించి ప్రపంచ వ్యాప్తంగా హ్యాకింగ్‌లో గొప్ప పేరు తెచ్చుకున్నాడు. ఇంతకీ ఇతడెవారు? ఇప్పుడేం చేస్తున్నాడు? అనే మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మధ్యప్రదేశ్ ఇండోర్‌లోని ఒక సాధారణ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన 'కన్హయ శర్మ' కేవలం 14 ఏళ్ల వయసులోనే ఒక సాఫ్ట్వేర్ క్రియేట్ చేసి రూ. 50వేలకు విక్రయించాడు. ప్రస్తుతం దేశంలో మాత్రమే కాకుండా ప్రపంచంలో గొప్ప హ్యాకర్‌గా పేరు తెచ్చుకున్నాడు. కన్హయ శర్మ తండ్రి ఇండోర్ నగరంలో ఉపాధ్యాయ వృత్తిలో తమ కుటుంబాన్ని పోషించేవాడు. కానీ కన్హయ శర్మ తన చిన్నతనంలోనే కేవలం రూ. 251తో ప్రారంభమైన ఇప్పుడు ఐటీ అండ్ లీగల్ సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన కంపెనీలను స్థాపించి ఇప్పుడు కోట్లలో టర్నోవర్ చేస్తున్నాడు. నిజానికి కన్హయ శర్మ ఇండోర్‌లోని సరాఫా విద్యా నికేతన్‌లో 8వ తరగతి చదువుతున్నప్పుడు పాఠశాలలో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఆ సమయంలో ఆ నిర్మాణ పనులకు అవసరమయ్యే సామాగ్రి కోసం కూలీలు ఎంతగానో కష్టపడేవారు. ఇది చూసి కన్హయ ఒక కొత్త సాఫ్ట్వేర్ కనిపెట్టాలని నిర్ణయించుకుని 30 రోజుల్లోనే అనుకున్న విధంగానే సాఫ్ట్వేర్ కనిపెట్టాడు. దానిని సంస్థ వారికి యాభైవేల రూపాయలకు విక్రయించాడు. ఇప్పటికీ వారు సాఫ్ట్‌వేర్‌నే ఉపయోగిస్తుండటం గమనార్హం. (ఇదీ చదవండి: నిండా 18 ఏళ్ళు లేవు..! రూ. కోటి కంటే ఎక్కువ ఖరీదైన కారు కొనేసాడు - వీడియో) తాను 6, 7వ తరగతి చదువుతున్నప్పటి నుంచి కంప్యూటర్లు, ఇంటర్నెట్ ప్రపంచంతో చాలా సంబంధాలు ఉండేవని, కానీ ఏడో తరగతిలో ఆన్లైన్ సర్టిఫికేషన్ పరీక్షలో ఫెయిల్ అయ్యానని కన్హయ తెలిపారు. అయితే ప్రస్తుతం న్యాయ సేవలకు ఐటీ సాఫ్ట్వేర్ అభివృద్ధిని అందించే కంపెనీలను ప్రారంభించినట్లు కూడా తెలిపాడు. (ఇదీ చదవండి: ప్రైవేట్ చేతుల్లోకి ఆధార్ అథెంటికేషన్ - ప్రజలు సమ్మతిస్తారా..?) కన్హయ శర్మ చదువుకునే రోజుల్లో తమ ఇంట్లో కేవలం ఒక సైకిల్ మాత్రమే ఉండేదని, ఇప్పుడు 5 నుంచి 6 లగ్జరీ కార్లు ఉన్నాయని వెల్లడించాడు. అంతే కాకుండా తనకు దేశంలోని ప్రభుత్వ సంస్థలతో అనుబంధం కలిగి ఉన్నట్లు, అక్కడి అధికారులకు, విద్యార్థులకు తానే ట్రైనింగ్ ఇస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: సినిమా హీరోలా ఉంటాడనుకున్నా, తీరా చూస్తే.. భర్తపై సుధా మూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు) కన్హయ శర్మ హ్యాకింగ్ నైపుణ్యాలను చూసి దేశవ్యాప్తంగా అనేక పెద్ద ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు అతనితో చేరడానికి 2.5 కోట్ల వార్షిక ప్యాకేజీ ఆఫర్ చేసినప్పటికీ వాటిని కన్హయ తిరస్కరించారు. ప్రస్తుతం ఇతడు వాప్‌గో అండ్ లీగల్251 వ్యవస్థాపకుడు & CEOగా ఉన్నట్లు సమాచారం. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
హాట్ సీటు: బేగుసరాయి
నాలుగోదశ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న హాట్ సీటు బిహార్ రాష్ట్రంలో బేగుసరాయి. జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ నాయకుడు, ప్రధానమంత్రి నరేంద్రమోదీని నేరుగా ఢీకొంటున్న యువ నేత కన్హయ్యకుమార్ ఈ స్థానం నుంచి సీపీఐ తరఫున పోటీ చేస్తూ ఉండటంతో దీనిపై ఉత్కంఠ నెలకొంది. బేగుసరాయి ఒకప్పుడు సీపీఐకి కంచుకోట.. లెనిన్గ్రాడ్ ఆఫ్ బిహార్‌గా పేరు పొందింది. గత ఎన్నికల్లో మొట్టమొదటి సారిగా బేగుసరాయిలో కాషాయ జెండా ఎగిరింది. బీజేపీ అభ్యర్థి భోలాసింగ్ ఈ స్థానం నుంచి గెలుపొందారు. ఆయన గత ఏడాది మరణించడంతో అప్పట్నుంచి ఈ స్థానం ఖాళీగానే ఉంది. కన్హయ్యకు మద్దతుగా తారాతోరణం ఒక ప్రశ్నించే యువగళం చట్టసభల్లో గొంతు విప్పాలని కోరుకుంటున్నవారెందరో. అందుకే కన్హయ్యకుమార్ నామినేషన్ సమయంలో జనం స్వచ్ఛందంగా వెల్లువెత్తారు. అరాచకశక్తులపై పోరాటం చేసే వీరుడిగా కన్హయ్యకుమార్‌ని నేతలు అభినందించారు. ప్రధాని నరేంద్రమోదీ విధానాల్ని నిరసిస్తూ ఒకే భావజాలం కలిగిన నాయకులు కన్హయ్యకు మద్దతుగా బేగుసరాయిలో ప్రచారం నిర్వహించారు. ఉద్యమకారులు జిగ్నేశ్ మేవానీ, , తీస్తా సెటల్వాద్లు ప్రచారం చేశారు. బాలీవుడ్ రచయిత జావేద్ అక్తర్, ఆయన భార్య షబానాఆజ్మీ, స్వరభాస్కర్, బెంగళూరు సెంట్రల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న నటుడు ప్రకాశ్‌రాజ్ వంటి వారు కన్హయ్యకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు ‘‘పార్లమెంటులో ప్రజాగళం వినబడాలి. కన్హయ్యకుమార్ వంటివారు చట్టసభలకి ఎంతో అవసరం. అందుకే ఆయన తరఫున ప్రచారానికి వచ్చా‘‘అని ప్రకాశ్ రాజ్ చెప్పారు. మరోవైపు కన్హయ్యకు నిరసనలు ఎదురవుతున్నాయి. ప్రచారానికి వచ్చిన కన్హయ్యను చాలా చోట్ల యువకులు నిలదీస్తూ నీకు కావల్సిన స్వేచ్ఛ ఏమిటని ప్రశ్నిస్తున్నారు. 2014లో ఫలితాలు ఇలా వామపక్షాలకు ఇంకా పట్టున్న జిల్లాల్లో బేగుసరాయి కూడా ఒకటి. కానీ గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఈ స్థానాన్ని ఎగరేసుకుపోయింది. అప్పటివరకు కమ్యూనిస్టు నాయకుడిగా సుప్రసిద్ధుడైన భోలాసింగ్ ఆఖరినిముషంలో బీజేపీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత స్థానంలో ఆర్జేడీ అభ్యర్థి తన్వీర్ çహసన్ నిలిచారు. ఇక సీపీఐ అభ్యర్థి రాజేంద్ర ప్రసాద్ మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. త్రిముఖ పోటీలో కన్హయ్య సతమతం సీపీఐ పార్టీ పూర్వ వైభవం సాధించడం కోసం కన్హయ్యకుమార్‌ని రంగంలోకి దింపింది. స్థానికుడు కావడం ఆయనకు కలిసొచ్చే అంశం. అంతేకాదు భూమిహార్ సామాజిక వర్గానికి చెందినవారు. ఈ నియోజకవర్గంలో వారి ఓట్లు అత్యంత కీలకం. 4 లక్షలకు పైగా ఓట్లు వారివే ఉన్నాయి. అందుకే కాషాయదళం భూమిహార్ అయిన కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్‌ను నవాదా నియోజకవర్గం నుంచి మార్చి మరీ కన్హయ్యపై పోటీకి నిలిపింది. గత ఎన్నికల్లో మోదీ హవా దేశాన్ని ఊపేసినా ఆర్జేడీ అభ్యర్థి తన్వీర్ హసన్ 3.69 లక్షల ఓట్లను కొల్లగొట్టారు. అందుకే ఈసారి కూడా లాలూ పార్టీ తన్వీర్ హసన్నే మళ్లీ బరిలో దింపింది. తన్వీర్ హసన్‌ది అందరితోనూ కలిసిపోయే తత్వం. ప్రజలకి ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. బేగుసరాయి నియోజకవర్గంలో ఆయనకి వ్యక్తిగత కరిష్మా ఎక్కువ. ఈ నియోజకవర్గంలో 3 లక్షలకు పైగా ముస్లిం ఓట్లు ఉన్నాయి. 2.5 లక్షల యాదవ్ ఓట్లు ఉన్నాయి. వీరంతా హసన్‌కే ఓటు వేసే అవకాశం ఉంది. మహాగ uŠ‡బంధన్ కన్హయ్యకుమార్కు మద్దతుగా నిల్చొని ఉంటే ఆయన విజయం నల్లేరు మీద బండి నడకే. కానీ త్రిముఖ పోటీలో ఓట్లు చీలి ఎవరికి లాభం చేకూరుతుందో అంచనా వేయలేని పరిస్థితి. కన్హయ్య కుమార్ జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు ►ఎన్నికల ప్రచారాన్ని సాదాసీదాగా నిర్వహిస్తున్నారు. సైకిల్, స్కూటర్, ఓపెన్ టాప్ కారు, ఒక్కోసారి నడుస్తూ కూడా ప్రచారం చేస్తున్నారు ► రైతు బిడ్డ. ఎన్నికల్లో ఖర్చు కోసం ప్రజల దగ్గర నుంచి ఒక్కొక్కరు రూపాయి ఇచ్చినా చాలంటూ నిధులు సేకరించారు ► వామపక్ష భావాలతో స్వేచ్ఛ కోసం గొంతెత్తిన యువగళం. పేదరిక నిర్మూలన, అరాచకాలు, అన్యాయాల్ని పారద్రోలడమే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు. గిరిరాజ్ సింగ్ కేంద్ర మంత్రి ►ప్రచార ఆర్భాటాలు ఎక్కువ. ఎస్యూవీల్లోనే తిరుగుతుంటారు ►బీజేపీ అతివాద నాయకుల్లో ఒకరు. హిందూమత పరిరక్షణ కోసం ఎంతకైనా తెగిస్తానని ప్రచారం చేసుకుంటూ వివాదాల్లో తరచూ చిక్కుకుంటారు. ► అధిష్టానం ఆదేశం మేరకు కన్హయ్య పేరు కూడా కనీసం ప్రస్తావించకుండా ప్రచారం నిర్వహిస్తున్నారు. ►4,28,227 (39.73%) భోలాసింగ్ (బీజేపీ)కు పోలయిన ఓట్లు ►3,69,892 (34.32%) తన్వీర్ హసన్ (ఆర్జేడీ)కు వచ్చిన ఓట్లు ►1,92,639 (17.87%) రాజేంద్ర ప్రసాద్ సింగ్ (సీపీఐ)కు వచ్చిన ఓట్లు -
ఆమరణ నిరాహార దీక్షకు దిగిన కన్హయ్య
న్యూఢిల్లీ: జేఎన్‌యూ విద్యార్థి సంఘం నాయకుడు కన్హయ్య కుమార్ మరో 19 మంది విద్యార్థులతో కలిసి విశ్వవిద్యాలయంలో ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. కన్హయ్యతోపాటు ఉమర్ ఖలీద్, అనీర్బన్ భట్టాచార్యలపై విశ్వవిద్యాలయం తీసుకున్న క్రమశిక్షణ చర్యలకు వ్యతిరేకంగా విద్యార్థులు బుధవారం అర్థరాత్రినుంచి దీక్షలో కూర్చున్నారు. అత్యున్నత విచారణ కమిటీపై తమకు నమ్మకం లేదనీ అదొక మాయ అని, అందుకే తమకు విధించిన శిక్షలను తిరస్కరిస్తున్నామని వివరించారు. గతంలో కన్హయ్యను పోలీసులు అరెస్టు చేసిన స్థలం వద్దే విద్యార్థులు దీక్షాస్థలిని ఏర్పాటు చేసుకున్నారు. కన్హయ్య మాట్లాడుతూ..‘పరీక్షల సమయంలో క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే విద్యార్థులెవరూ ఆందోళనకు దిగే అవకాశముండదనే విశ్వవిద్యాలయం ఇప్పుడు మాకు శిక్ష విధించింది. పోరాడుతూనే పరీక్షల్ని రాయగలం’ అని అన్నారు. అఫ్జల్‌గురు ఉరికి వ్యతిరేకంగా సమావేశాన్ని నిర్వహించడం, దేశ వ్యతిరేక నినాదాలు చేయడంతో గతంలో వీరు అరెస్టయ్యి బెయిల్ పొందిన విషయం తెలిసిందే. ఇప్పుడ వీరిపై విశ్వవిద్యాలయం క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. -
అది తప్పుడు రిపోర్ట్: కన్హయ్య కుమార్
న్యూఢిల్లీ: జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సటీ(జేఎన్ యూ) అడ్మినిష్ట్రేషన్ కమిటీ తనకు రూ.10,000 జరిమానా విధించడంపై కన్హయ్య కుమార్ స్పందించారు. కమిటీ నివేదికను ప్రహసనంగా అభివర్ణించారు. యూనివర్సిటీ అధికారులతో కాకుండా మరో ఉన్నత స్థాయి కమిటీతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. జేఎన్ యూ అధికారులు పక్షపాతంతో వ్యవహరించారని దుయ్యబట్టారు. ఆర్ఎస్ఎస్ కు అనుకూలంగా నివేదికను ఇచ్చారని అన్నారు. జేఎన్ యూ అధికారులు క్యాంపస్ లోకి పోలీసులను అనుమతింనచిన రోజే వారు అర్ఎస్ఎస్ విధేయులుగా మారిపోయారని స్పష్టం చేశారు. "విచారణ నిజాయితీ లేకుండా జరిగింది. వర్సిటీ వీసీ జగదీశ్ కుమార్ మీరు గుర్తుంచుకోండి మేము ఎన్నటికీ ఆర్ఎస్ఎస్ విధేయులుగా మారము" అని ఉమర్ ఖలీద్ ఫేస్ బుక్ లో పోస్టు చేశాడు. ఫిబ్రవరి 9న జేఎన్ యూలో అఫ్జల్ గురూకు అనుకూలంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని క్యాంపస్ లో అశాంతికి కారణమయ్యారని కన్హయ్య కుమార్, ఖలీద్ పై వర్సిటీ అధికారులు జరిమానా విధించిన విషయం తెలిసిందే. -
కన్హయ్య చేసిన నేరమేంటి: దిగ్విజయ్
న్యూఢిల్లీ: విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్‌కు జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) రూ.10 వేల జరిమానా విధించడాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ తప్పుపట్టారు. దయచేసి కన్హయ్య చేసిన నేరమేంటో ఎవరైనా మాకు చెప్పుతారా అంటూ ప్రశ్నించారు. కన్హయ్యను దొషిగా తేల్చడానికి ఎలాంటి ఆధారాలు లేవు, అలాంటప్పుడు ఎందుకు అతన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారిని ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఆఫ్జల్‌గురు ఉరితీతకు వ్యతిరేకంగా గత ఫిబ్రవరి 9న కార్యక్రమం నిర్వహించిన విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్‌కు జేఎన్‌యూ సోమవారం రూ.10 వేల జరిమానా విధించిన విషయం తెలిసిందే. ఉమర్ ఖాలిద్ సహా ముగ్గురు విద్యార్థులను సస్పెండ్ చేసింది. ఫిబ్రవరి 9 నాటి కార్యక్రమంపై దర్యాప్తు జరిపేందుకు వర్సిటీ ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల ఉన్నతస్థాయి కమిటీ.. సాక్ష్యాలు, వీడియో క్లిప్పింగులు తదితరాలను పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది. ఉమర్, అనిర్బన్ భట్టాచార్యలు వర్సిటీలో మత హింసకు, మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించారని పేర్కొంది. ఈ మేరకు ఉమర్‌ను ఒక సెమిస్టర్, ముజీబ్ గట్టూను రెండు సెమిస్టర్లు, భట్టాచార్యను జూలై 15 వరకు బహిష్కరించింది. జేఎన్‌యూలో వచ్చే ఐదేళ్ల వరకు ఎలాంటి కోర్సు చేయకుండా భట్టాచార్యపై నిషేధం విధించింది. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించాడన్న నేరంతో ఏబీవీపీ నాయకుడు సౌరభ్ శర్మకు కూడా రూ.20 వేల జరిమానా విధించింది. మొత్తంగా 14 మందిపై జరిమానా విధించింది. అయితే పరిపాలన శాఖ ఉద్యోగులపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. Kanhaiya fined 10000/-. Would anyone pl tell us what is his crime ? Why is he being persecuted ? There is no evidence against him. — digvijaya singh (@digvijaya_28) 26 April 2016 -
కన్హయ్యకు నో ఎంట్రీ
హైదరాబాద్: జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్ కు హెచ్‌సీయూ అధికారులు వర్సిటీలో ప్రవేశానికి అనుమతి నిరాకరించారు. బుధవారం ఆయన హైదరాబాద్ రానున్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే ‘రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సదస్సు’లో ఆయన ప్రసంగించనున్నారు. అనంతరం రోహిత్ వేముల తల్లిని పరామర్శించిన తర్వాత నగరంలో నిర్వహించే బహిరంగ సభ, హెచ్‌సీయూలో సభ జరిపేందుకు విద్యార్థులు ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారులు అనుమతించకున్నా సభ జరిపి తీరుతామని విద్యార్థులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. -
కన్హయ్యపై మరో దేశద్రోహం కేసు!
మీరట్: జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్షుడు కన్హయ్య కుమార్ ను సమస్యలు చుట్టుముడుతూనే ఉన్నాయి. ఇప్పటికే దేశద్రోహం కేసులో జైలుపాలై, మధ్యంతర బెయిల్ పై బయటకొచ్చిన అతడిపై మరో కేసు నమోదైంది. భారత సాయుధ దళాలను అవమానించాడంటూ కన్హయ్యపై భజరంగ్ దళ్ కార్యకర్త ఫిర్యాదుతో అతడిపై తాజాగా మరో దేశద్రోహం కేసు దాఖలు చేశారు. ఈ నెల 28న కోర్టులో విచారణకు రానుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున కన్హయ్య కుమార్ భారత సైన్యానికి వ్యతిరేకంగా కొన్ని వ్యాఖ్యలు చేశాడని రైట్ వింగ్ కార్యకర్త హేమంత్ సింగ్ ఆరోపించారు. భారత సైనికులు కాశ్మీర్, ఈశాన్య ప్రాంతాల్లోని మహిళలపై అత్యాచారాలతో పాటు, దురాగతాలకు పాల్పడ్డారంటూ కన్హయ్య చేసిన వ్యాఖ్యలు దేశ వ్యతిరేక వ్యాఖ్యలుగా భావించి అతడిపై బులందర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు వెళ్ళామని ఆయన తెలిపారు. అయితే అక్కడి పోలీసులు తమ ఫిర్యాదును స్వీకరించికపోవడంతో బులందర్ ఛీఫ్ జుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించామని హేమంత్ సింగ్ తెలిపారు. సెక్షన్ 124-A (సెడిషన్) తో పాటు.. ఇండియన్ పీనల్ కోడ్ 153-B కింద కేసు నమోదు చేసినట్లు వివరించారు. తమ స్టేట్ మెంట్ రికార్డు చేసేందుకు మార్చి 28న హాజరు కావాలని కోర్టు చెప్పిందని అన్నారు. ఈ సందర్భంలో తాను కోర్టుకు టెలివిజన్ లో ప్రసారమైన కన్హయ్య కుమార్ తప్పుడు వ్యాఖ్యల వీడియో క్లిప్పులను సమర్పించినట్లు తెలిపారు. -
కేజ్రీవాల్ తో ఫోన్ లో మాట్లాడిన కన్హయ్య
న్యూ ఢిల్లీః ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థి యూనియన్ నాయకుడు కన్హయ్య ఫోన్ లో సంభాషించారు. ముందుగా ముఖ్యమంత్రిని కలిసేందుకు ప్రయత్నించిన కన్హయ్య వీలు కుదరకపోవడంతో ఫోన్ లోనే మాట్లాడారని సీపీఐ నాయకుడు డి రాజా తెలిపారు. అయితే విద్యార్థి కార్యకర్త అపరాజితతో కలసి రాజా ముఖ్యమంత్రిని కలవడం ప్రత్యేకత సంతరించుకుంది. తన కుమార్తె... జవహర్ లాల్ నెహ్రూ విశ్వ విద్యాలయం విద్యార్థి కార్యకర్త అపరాజిత తో సహా.. రాజా ఢిల్లీ సచివాలయంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను కలిశారు. ముఖ్యమంత్రిని కలసిన అనంతరం విలేకరులతో మాట్లాడిన ఆయన.. కన్హయ్య ట్రాఫిక్ జామ్ కారణంతో రాలేకపోయాడని, ముఖ్యమంత్రితో టెలిఫోన్ లో సంభాషించాడని తెలిపారు. బహుశా తిరిగి శనివారం వారిద్దరూ కలిసే అవకాశం ఉందని కూడ వెల్లడించారు. అయితే అపరాజిత ముఖ్యమంత్రిని కలిసేందుకు నా కుమార్తెగా రాలేదని, జెఎన్ యు విద్యార్థి కార్యకర్తగా, దేశద్రోహం కేసులో జైలు నుంచి బెయిల్ పై విడుదలైన కన్హయ్య కుమార్ కు మద్దతుదారుగా వచ్చిందని రాజా తెలిపారు. కన్హయ్య కుమార్, అపరాజితలు ఇద్దరూ సీపీఐ ఆధ్వర్యంలోని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ (ఏఐఎస్ ఎఫ్) సభ్యులే. కాగా కన్హైయా కుమార్ విషయంలో సీపీఐకి ఏవైనా భవిష్యత్ రాజకీయ ప్రణాళికలు ఉన్నాయా అన్న విలేకరుల ప్రశ్నకు రాజా అటువంటివేమీ లేవని సమాధానం ఇచ్చారు. -
కన్హయ్యను బహిష్కరించాలి
మరో ఐదుగురిని కూడా; జేఎన్‌యూ ఘటనపై విచారణ కమిటీ సిఫారసు న్యూఢిల్లీ: జవహర్‌లాల్‌నెహ్రూ విశ్వవిద్యాలయంలో గత నెలలో జరిగిన వివాదాస్పద కార్యక్రమంలో పోషించిన పాత్రకు గాను.. జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్షుడు కన్హయ్యకుమార్, ఉమర్‌ఖలీద్, అనిర్బన్ భట్టాచార్యలు సహా ఐదుగురిని బహిష్కరించాలని (రస్టికేషన్) వర్సిటీ ఉన్నతస్థాయి కమిటీ సిఫారసు చేసింది. అయితే.. సిఫారసులను క్షుణ్ణంగా పరిశీలించాక వీసీ ఎం.జగదీశ్‌కుమార్, చీఫ్ ప్రొక్టార్ ఎ.దిమ్రీలు నిర్ణయం తీసుకుంటారని వర్సిటీ వర్గాలు తెలిపాయి. అఫ్జల్‌గురు ఉరితీతకు వ్యతిరేకంగా నిర్వహించిన కార్యక్రమంలో దేశ వ్యతిరేక నినాదాలు చేశారన్న ఆరోపణలతో తీవ్ర దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. నాటి ఘటనపై ఏర్పాటైన విచారణ కమిటీ.. 21 మంది విద్యార్థులు వర్సిటీ క్రమశిక్షణ నిబంధనలను ఉల్లంఘించారని నివేదికలో పేర్కొంది. నివేదికపై సోమవారం చర్చించిన పాలకవర్గం ఆ 21 మందికి షోకాజ్ నోటీసులు జారీచేసి, జవాబిచ్చేందుకు ఈ నెల 16 వరకు గడువు ఇచ్చింది. నేడు పార్లమెంటుకు ర్యాలీ: రాజద్రోహం కేసులో అరెస్టయిన ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్య, ఎస్ఏఆర్ గిలానీల విడుదల కోరుతూ జేఎన్‌యూ విద్యార్థులు మంగళవారం పార్లమెంటు దాకా ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఏది జాతీయవాదమో, ఏది జాతి వ్యతిరేకమో తేల్చేందుకు దీనిపై జాతీయ కమిషన్‌ను ఏర్పాటుచేయాలని జేఎన్‌యూ అధ్యాపక సంఘం డిమాండ్ చేసింది. దళితులు, ముస్లిం అధ్యాపకులు దేశ వ్యతిరేకులంటూ వ్యాఖ్యలు చేసినట్లు చెప్తున్న సెంటర్ ఫర్ లా అండ్ గవర్నెన్స్ విభాగం అధిపతి అమితాసింగ్ను జేఎన్‌యూ పాలకవర్గం వివరణ కోరింది. రోహిత్‌కు ఇరోమ్ షర్మిల స్కాలర్షిప్: హెచ్‌సీయూ స్కాలర్ రోహిత్ వేముల (మరణానంతరం)కు, జేఎన్‌యూ ఎస్‌యూకు సంయుక్తంగా ఇరోమ్ షర్మిల-2016 స్కాలర్షిప్ను ప్రకటించారు. స్కాలర్షిప్ చెక్కులను వీరి తరఫున కన్హయ్య అందుకున్నారు. ఢిల్లీ వర్సిటీ ప్రొఫెసర్ నందిని సుందర్ 2012 నుంచి ఈ స్కాలర్షిప్ను అందిస్తున్నారు. దీనికింద రూ.50 వేలు (ఉమ్మడిగా ఉంటే రూ.60వేలు) ఇస్తారు. -
కన్హయ్యపై మరో ఆరోపణ
యువతితో అసభ్యంగా ప్రవర్తించాడంటూ కొత్త వివాదం * సామాజిక మాధ్యమంలో లేఖల హల్చల్ న్యూఢిల్లీ: రాజద్రోహం కేసులో బెయిల్‌పై బయటకు వచ్చిన కన్హయ్య కుమార్‌పై మరో ఆరోపణ సామాజిక మాధ్యమంలో చక్కర్లు కొడుతోంది. గతేడాది జేఎన్‌యూలో తనకు అడ్డుచెప్పినందుకు ఓ యువతి (ఇప్పుడామె ఢిల్లీ వర్సిటీలో బోధిస్తున్నారు)తో కన్హయ్య అసభ్యంగా ప్రవర్తించాడని.. అందుకు రూ.3000 జరిమానా చెల్లించాలంటూ వర్సిటీ ప్రోక్టర్ పేరుతో ఓ లేఖ వెలుగులోకి వచ్చింది. అయితే ఆ లేఖలో ప్రోక్టర్ సంతకం లేదు. అయితే సదరు యువతి ఈ వివాదం నిజమేనంటూ ఓ బహిరంగ లేఖ కూడా సామాజిక మాధ్యమం ద్వారానే బయటపెట్టారు. సదరు బహిరంగ లేఖలో సదరు యువతి కన్హయ్యపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఆ లేఖలో పేర్కొన్న అంశాల ప్రకారం, 2010 జూన్ 10న కన్హయ్య (అప్పటికి వర్సిటీ విద్యార్థి సంఘం ప్రెసిడెంట్‌గా ఎన్నికవలేదు) బహిరంగంగా మూత్ర విసర్జన చేస్తుండగా అది సరికాదని అటుగా వెళ్తున్న యువతి సూచించారు. దీంతో ఆగ్రహించిన కన్హయ్య.. ఆ అమ్మాయిని మానసికరోగి అని సంబోధించటంతోపాటు.. అసభ్యంగా ప్రవర్తించి, ఈ విషయాన్ని బయటకు చెబితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. దీంతో యువతి వర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన వీసీ.. విచారణ జరపాలంటూ ప్రొక్టోరియల్ కమిటీని ఆదేశించారు. ఈ కమిటీ విచారణ జరిపి కన్హయ్యను దోషిగా తేల్చింది. క్రమశిక్షణారాహిత్యమైన తీవ్రమైన చర్యగా పేర్కొంది. మాజీ విద్యార్థిని కూడా అయిన యువతితో అసభ్యంగా ప్రవర్తించినందుకు కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. అయితే.. కన్హయ్య భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో మరోసారి ఇలా ప్రవర్తిస్తే బాగుండదని హెచ్చరించిన వీసీ కేవలం రూ.3వేల జరిమానా విధించి వదిలేశారని.. 2015 అక్టోబర్ 16న చీఫ్ ప్రోక్టర్ కృష్ణకుమార్ పేరుతో విడుదలైన ఆర్డర్ తెలిపింది. కన్హయ్య తప్పుగా ప్రవర్తించి తనను బెదిరించాడని.. ఇందుకు శిక్ష కూడా పడిందని ఆమె పేర్కొంది. ‘అసత్యపు విప్లవకారుడిని తయారుచేసిన నా జేఎన్‌యూ సమాజాన్ని చూసి ఆవేదన కలుగుతోంది. నీచమైన మనస్తత్వం ఉన్న కన్హయ్య.. మహిళల గౌరవాన్ని మంటగలిపిన వ్యక్తి ఉద్యమాన్ని నడుపుతాడా?’ అంటూ ఆ యువతి బహిరంగ లేఖ రాశారు. అది వాస్తవమే కానీ! దీనిపై స్పందించిన ఏఐఎస్ఎఫ్ ‘యువతి పేర్కొన్న ఘటనపై ఆమెతో కన్హయ్యకు వాగ్వాదం జరిగిన మాట వాస్తవమే.. అయితే.. చాలాసార్లు లింగ సమానత్వం కోసం కన్హయ్య పోరాడారు’ అని ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా, జేఎన్‌యూలో గురువారం ఓ సెమినార్‌కు హాజరైన కన్హయ్య కుమార్‌ను ఓ గుర్తుతెలియని వ్యక్తి చెంపదెబ్బ కొట్టాడు. విద్యార్థులు సెక్యూరిటీ సిబ్బంది ఆగంతకుడిని పట్టుకుని సమీపంలోని పోలీసు స్టేషన్లో అప్పగించారు. -
కన్హయ్యను కాల్చిచంపితే ..11లక్షలు
కన్హయ్య నాలుక కోస్తే 5 లక్షల రూపాయలు కానుక న్యూఢిల్లీ: ఢిల్లీ జవహర్ లాల్ యూనివర్శిటీ విద్యార్థి నేత కన్హయ్య కుమార్ నాలుక కోస్తే బహుమతి ఇస్తామని ప్రకటించడంతో చెలరేగిన వివాదం అలా ముగిసిందో లేదో మరో ప్రకటన కలకలం రేపింది. అతడిని కాల్చి చంపితే రూ. 11 లక్షలు బహుమతి ఇస్తామంటూ ఢిల్లీలోని ఓ సంస్థ ఆధ్వర్యంలో పోస్టర్లు వెలువడ్డాయి. దేశద్రోహి కన్హయ్యకుమార్ ను కాల్చిచంపితే 11 లక్షల రూపాయలు బహుమతిగా ఇస్తామని పూర్వాంచల్ సేన అధ్యక్షుడు ఆదర్శ్ శర్మ కొడుకు పేరుతో ఢిల్లీ వీధుల్లో హిందీలో పోస్టర్లు వెలిశాయి. తాను బిహార్ లోని కన్హయ్యకుమార్ గ్రామం బెగుసరాయ్ గ్రామానికి సమీపంలోనే ఉంటానని అందులో పేర్కన్నారు. మొబైల్ నెంబర్ వివరాలతో సహా ముద్రించిన ఈ తాజా పోస్టర్లు వివిధ బస్లాప్ లు, మెట్రో స్టేషన్ సెంటర్లలో సంచలనంగా మారాయి. మరోవైపు జైలు నుంచి విడుదలైన తర్వాత విద్యార్థి నేత ప్రసంగం తనను చాలా కలిచివేసిందని ఆదర్శ్ శర్మ మీడియాతో తెలిపారు. ప్రాథమికంగా కన్హయ్య కుమార్ నిర్దోషి అని నమ్మానని.. కానీ తదనంతర పరిణామాలతో మాతృభూమికి ద్రోహం చేస్తున్న మనిషిగా అర్థం చేసుకున్నానని తెలిపారు. దీన్నిఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదని శర్మ వ్యాఖ్యానించారు. దీనిపై తమ సంఘ ప్రతినిధులతో మాట్లాడి ఈ రివార్డు నిర్ణయం తీసుకున్నానని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే దాదాపు 1500 పోస్టర్లను వేశామని శర్మ తెలిపారు. భారతీయ జనతా యువమోర్చా బదౌన్ జిల్లా నేత కులదీప్ వార్ష్నే.. కన్హయ్య కుమార్ నాలుక కోస్తే 5లక్షల రూపాయలు కానుకగా ఇస్తానని ప్రకటించి వివాదంలో ఇరుక్కున్నారు. దీనిపై సీరియస్ గా స్పందించిన పార్టీ అతణ్ని పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. కాగా దేశద్రోహం ఆరోపణలపై అరెస్టయిన కన్హయ్య కుమార్ ఈ నెల 3 న తీహార్ జైలు నుంచి విడుదలయ్యాడు. అనంతరం విద్యార్థి నేత ప్రసంగం రాజకీయ విశ్లేషకుల్లో సైతం చర్చకు దారి తీసింది. -
ఎఫ్బీ అకౌంట్ హ్యాక్ చేసి.. మార్ఫింగ్ ఫొటో పెట్టారు!
న్యూఢిల్లీ: దేశద్రోహం ఆరోపణలపై జైలుపాలైన జెఎన్యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్యకుమార్ ఫేస్బుక్ ఖాతాను హ్యాక్ చేసినట్టు తెలుస్తోంది. ఆయన ప్రొఫైల్ పిక్చర్‌ను మార్చి.. దానిస్థానంలో సైనికులు జాతీయ జెండాను ఎగురవేస్తున్న ఫొటోను పెట్టారు. కన్హయ్యకుమార్ ప్రస్తుతం తీహార్ జైలులో ఉండగా.. ఆయన ప్రొఫైల్ పిక్చర్‌ను శనివారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో అప్డేట్ చేసినట్టు చూపిస్తున్నది. ఈ నేపథ్యంలో ఆయన ఫేస్బుక్ అకౌంట్ హ్యాక్ చేశారని భావిస్తున్న ఆయన మద్దతుదారులు ఈ వ్యవహారంపై ఢిల్లీ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. జెఎన్యూ వివాదంలో 'దేశద్రోహం' ఆరోపణలపై అరెస్టయిన కన్హయ్యకుమార్ ఫేస్బుక్ ఖాతాలో జాతీయవాది ముద్రను కలిగించేందుకు దానిని హ్యాక్ చేసి మార్చినట్టు తెలుస్తున్నది. నిజానికి కన్హయ్య అకౌంట్లో సీపీఎం లోగో ముందు ఆయన నిలబడి ఉన్న ఫొటో ప్రొఫైల్ పిక్చర్‌గా ఉండేది. దీని స్థానంలో పెట్టిన భారత జాతీయ జెండా ఫొటో కూడా ఫొటోషాప్ చేసి మార్పులు చేసినది కావడం గమనార్హం. అమెరికా సైనికులు తమ దేశ జెండాను నిలబెడుతున్న బ్లాక్ అండ్ వైట్ ఫొటోను మార్ఫింగ్ చేసి.. కలర్ లో ఉన్న భారత జాతీయ జెండాను అమెరికా జెండా స్థానంలో ఉంచారు. కన్హయ్యకుమార్ అకౌంట్ హ్యాక్ చేసి.. ఈ ఫొటో పెట్టడంపై ఆయనకు మద్దతుదారులైన విద్యార్థులు మండిపడుతున్నారు. కన్హయ్యకుమార్ విడుదల చేయాలని ఆందోళన కొనసాగిస్తున్న వారు.. ఈ అంశాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. -
మోదీ మతోన్మాది: చాడ
హైదరాబాద్: దేశద్రోహం ఆరోపణల కింద అరెస్టు అయిన జవహార్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ పీహెచ్డీ విద్యార్థి కన్హయ్య కుమార్ ను విడుదల చేయాలంటూ సీపీఐ రాజ్ భవన్ ముట్టడికి యత్నించింది. శుక్రవారం ఉదయం సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రాజ్ భవన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. చాడ మాట్లాడుతూ ప్రధాని మోదీ మతోన్మాది అని విమర్శించారు. దేశంలో ప్రజాస్వామ్యం కరువైందన్నారు. కన్హయ్యను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.