ప్రస్తుతం మొబైల్ ఫోన్ లేకుండా పెద్దవారికైనా, పిల్లలకైనా రోజు గడవదు అంటే అందులో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. పెద్దవారి సంగతి అలా ఉంచితే, పిల్లలు పుస్తకాల్లో కంటే మొబైల్, ఇంటర్నెట్, కంప్యూటర్లలోనే ఎక్కువ కాలం గడిపేస్తున్నారు. ఇది తల్లిదండ్రులకు ఆందోళనగా మారిపోతోంది. అయితే అందుకు భిన్నంగా 'కన్హయ శర్మ' అనే యువకుడు చిన్నప్పుడే అద్భుతాలు సృష్టించి ప్రపంచ వ్యాప్తంగా హ్యాకింగ్‌లో గొప్ప పేరు తెచ్చుకున్నాడు. ఇంతకీ ఇతడెవారు? ఇప్పుడేం చేస్తున్నాడు? అనే మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
మధ్యప్రదేశ్ ఇండోర్‌లోని ఒక సాధారణ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన 'కన్హయ శర్మ' కేవలం 14 ఏళ్ల వయసులోనే ఒక సాఫ్ట్‌వేర్ క్రియేట్ చేసి రూ. 50వేలకు విక్రయించాడు. ప్రస్తుతం దేశంలో మాత్రమే కాకుండా ప్రపంచంలో గొప్ప హ్యాకర్‌గా పేరు తెచ్చుకున్నాడు.
కన్హయ శర్మ తండ్రి ఇండోర్ నగరంలో ఉపాధ్యాయ వృత్తిలో తమ కుటుంబాన్ని పోషించేవాడు. కానీ కన్హయ శర్మ తన చిన్నతనంలోనే కేవలం రూ. 251తో ప్రారంభమైన ఇప్పుడు ఐటీ అండ్ లీగల్ సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన కంపెనీలను స్థాపించి ఇప్పుడు కోట్లలో టర్నోవర్ చేస్తున్నాడు.
నిజానికి కన్హయ శర్మ ఇండోర్‌లోని సరాఫా విద్యా నికేతన్‌లో 8వ తరగతి చదువుతున్నప్పుడు పాఠశాలలో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఆ సమయంలో ఆ నిర్మాణ పనులకు అవసరమయ్యే సామాగ్రి కోసం కూలీలు ఎంతగానో కష్టపడేవారు. ఇది చూసి కన్హయ ఒక కొత్త సాఫ్ట్‌వేర్ కనిపెట్టాలని నిర్ణయించుకుని 30 రోజుల్లోనే అనుకున్న విధంగానే సాఫ్ట్‌వేర్ కనిపెట్టాడు. దానిని సంస్థ వారికి యాభైవేల రూపాయలకు విక్రయించాడు. ఇప్పటికీ వారు సాఫ్ట్‌వేర్‌నే ఉపయోగిస్తుండటం గమనార్హం.
(ఇదీ చదవండి: నిండా 18 ఏళ్ళు లేవు..! రూ. కోటి కంటే ఎక్కువ ఖరీదైన కారు కొనేసాడు - వీడియో)
తాను 6, 7వ తరగతి చదువుతున్నప్పటి నుంచి కంప్యూటర్లు, ఇంటర్నెట్ ప్రపంచంతో చాలా సంబంధాలు ఉండేవని, కానీ ఏడో తరగతిలో ఆన్‌లైన్ సర్టిఫికేషన్ పరీక్షలో ఫెయిల్ అయ్యానని కన్హయ తెలిపారు. అయితే ప్రస్తుతం న్యాయ సేవలకు ఐటీ సాఫ్ట్‌వేర్ అభివృద్ధిని అందించే కంపెనీలను ప్రారంభించినట్లు కూడా తెలిపాడు.
(ఇదీ చదవండి: ప్రైవేట్ చేతుల్లోకి ఆధార్ అథెంటికేషన్ - ప్రజలు సమ్మతిస్తారా..?)
కన్హయ శర్మ చదువుకునే రోజుల్లో తమ ఇంట్లో కేవలం ఒక సైకిల్ మాత్రమే ఉండేదని, ఇప్పుడు 5 నుంచి 6 లగ్జరీ కార్లు ఉన్నాయని వెల్లడించాడు. అంతే కాకుండా తనకు దేశంలోని ప్రభుత్వ సంస్థలతో అనుబంధం కలిగి ఉన్నట్లు, అక్కడి అధికారులకు, విద్యార్థులకు తానే ట్రైనింగ్ ఇస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.
(ఇదీ చదవండి: సినిమా హీరోలా ఉంటాడనుకున్నా, తీరా చూస్తే.. భర్తపై సుధా మూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు)
కన్హయ శర్మ హ్యాకింగ్ నైపుణ్యాలను చూసి దేశవ్యాప్తంగా అనేక పెద్ద ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు అతనితో చేరడానికి 2.5 కోట్ల వార్షిక ప్యాకేజీ ఆఫర్ చేసినప్పటికీ వాటిని కన్హయ తిరస్కరించారు. ప్రస్తుతం ఇతడు వాప్‌గో అండ్ లీగల్251 వ్యవస్థాపకుడు & CEOగా ఉన్నట్లు సమాచారం. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి.
Comments
Please login to add a commentAdd a comment