ఉద్యోగం కన్నా ఉపాధి మార్గం ఉత్తమం అని కొందరు అంటుంటారు. ఈ దిశగా పయనిస్తూ చాలామంది విజయం సాధించారు. ఇదే తరహాలో ముందడుగు వేసిన ఒక యువకుడు అందరూ మెచ్చుకునే స్థాయికి ఎదిగాడు. అందరికి స్ఫూర్తిని అందిస్తున్నాడు. మరి ఆ యువకుడు ఎవరో ఏం సాధించాడో ఇప్పుడు తెలుసుకుందాం.
దేశంలో ఇటీవలి కాలంలో పర్యాటకరంగ వ్యాపారం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. దీంతో చాలామందికి ఉపాధి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఈ జాబితాలో గుజరాత్ మొదటి స్థానంలో నిలిచిందని చెబుతుంటారు. పర్యాటకరంగం అభివృద్ధి కారణంగా గుజరాత్‌లోని యువత నూతన స్టార్టప్(New startup)లతో జీవనోపాధి పొందుతున్నారు. అలాంటివాటిలో ఒకటే టాక్సీ సర్వీస్ నిర్వహణ.
కుటుంబంతో సహా ఎక్కడికైనా వెళ్లాలనుకునేవారు టాక్సీ ప్రయాణానికి ప్రాధాన్యతనిస్తుంటారు. టాక్సీ బుక్ చేసుకుని పర్యాటక ప్రదేశాల్లో విహరిస్తుంటారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఒక గ్యారేజీలో పనిచేసే సందీప్ ప్రజాపతి ట్యాక్సీ సర్వీస్ ప్రారంభించాడు. అతనుంటున్న ప్రాంతానికి సమీపంలోని ద్వారకతో పాటు శివరాజ్‌పూర్ బీచ్, సుదర్శన్ సేతు, హర్షద్ అండ్ భన్వాడ్ తదితర పర్యాటక ప్రదేశాలకు(tourist places) ట్యాక్సీని నడపడం ప్రారంభించాడు. దీనికి అనతి కాలంలోనే పరిమితమైన ఆదరణ దక్కింది.
సందీప్ ప్రజాపతి గుజరాత్(Gujarat)లో పర్యాటక ప్రదేశాల అభివృద్ధి, పర్యాటక రంగంలో ఉపాధి అవకాశాల గురించి అధ్యయనం చేశాడు. ‘ఖుషి క్యాబ్’ పేరుతో టాక్సీ సర్వీస్ మొదలుపెట్టాడు. మెల్లమెల్లగా అతని వ్యాపారం(Business) అభివృద్ధి చెందింది. ప్రస్తుతం నాలుగు ట్యాక్సీలు, ఎనిమిది మంది డ్రైవర్లతో సందీప్ ప్రజాపతి వ్యాపారం అందరూ మెచ్చుకునేలా నడుస్తోంది. తన కార్లకోసం గ్యారేజీని ఏర్పాటు చేసిన సందీప్ ఇద్దరు వర్కర్లను కూడా నియమించుకున్నాడు. కిలోమీటరుకు రూ. 10 నుండి రూ. 15 వరకూ ప్రయాణికుల నుంచి వసూలు చేస్తున్నాడు. గతంలో మెకానిక్‌గా పనిచేస్తూ నెలకు రూ. 10 వేలు సంపాదించే సందీప్ నేడు లక్షల్లో ఆదాయాన్ని అందుకుంటున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment