Taxi
-
నాడు నెలకు 10 వేలు.. నేడు లక్షలు.. సందీప్ జీవితం మారిందిలా..
ఉద్యోగం కన్నా ఉపాధి మార్గం ఉత్తమం అని కొందరు అంటుంటారు. ఈ దిశగా పయనిస్తూ చాలామంది విజయం సాధించారు. ఇదే తరహాలో ముందడుగు వేసిన ఒక యువకుడు అందరూ మెచ్చుకునే స్థాయికి ఎదిగాడు. అందరికి స్ఫూర్తిని అందిస్తున్నాడు. మరి ఆ యువకుడు ఎవరో ఏం సాధించాడో ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలో ఇటీవలి కాలంలో పర్యాటకరంగ వ్యాపారం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. దీంతో చాలామందికి ఉపాధి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఈ జాబితాలో గుజరాత్ మొదటి స్థానంలో నిలిచిందని చెబుతుంటారు. పర్యాటకరంగం అభివృద్ధి కారణంగా గుజరాత్‌లోని యువత నూతన స్టార్టప్(New startup)లతో జీవనోపాధి పొందుతున్నారు. అలాంటివాటిలో ఒకటే టాక్సీ సర్వీస్ నిర్వహణ.కుటుంబంతో సహా ఎక్కడికైనా వెళ్లాలనుకునేవారు టాక్సీ ప్రయాణానికి ప్రాధాన్యతనిస్తుంటారు. టాక్సీ బుక్ చేసుకుని పర్యాటక ప్రదేశాల్లో విహరిస్తుంటారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఒక గ్యారేజీలో పనిచేసే సందీప్ ప్రజాపతి ట్యాక్సీ సర్వీస్ ప్రారంభించాడు. అతనుంటున్న ప్రాంతానికి సమీపంలోని ద్వారకతో పాటు శివరాజ్‌పూర్ బీచ్, సుదర్శన్ సేతు, హర్షద్ అండ్ భన్వాడ్ తదితర పర్యాటక ప్రదేశాలకు(tourist places) ట్యాక్సీని నడపడం ప్రారంభించాడు. దీనికి అనతి కాలంలోనే పరిమితమైన ఆదరణ దక్కింది.సందీప్ ప్రజాపతి గుజరాత్(Gujarat)లో పర్యాటక ప్రదేశాల అభివృద్ధి, పర్యాటక రంగంలో ఉపాధి అవకాశాల గురించి అధ్యయనం చేశాడు. ‘ఖుషి క్యాబ్’ పేరుతో టాక్సీ సర్వీస్ మొదలుపెట్టాడు. మెల్లమెల్లగా అతని వ్యాపారం(Business) అభివృద్ధి చెందింది. ప్రస్తుతం నాలుగు ట్యాక్సీలు, ఎనిమిది మంది డ్రైవర్లతో సందీప్ ప్రజాపతి వ్యాపారం అందరూ మెచ్చుకునేలా నడుస్తోంది. తన కార్లకోసం గ్యారేజీని ఏర్పాటు చేసిన సందీప్ ఇద్దరు వర్కర్లను కూడా నియమించుకున్నాడు. కిలోమీటరుకు రూ. 10 నుండి రూ. 15 వరకూ ప్రయాణికుల నుంచి వసూలు చేస్తున్నాడు. గతంలో మెకానిక్‌గా పనిచేస్తూ నెలకు రూ. 10 వేలు సంపాదించే సందీప్ నేడు లక్షల్లో ఆదాయాన్ని అందుకుంటున్నాడు.ఇది కూడా చదవండి: కుంభమేళా నుంచి అయోధ్యకు జనప్రవాహం -
ట్యాక్సీ సేవల యాప్స్‌పై విచారణకు ఆదేశం
ట్యాక్సీ, ఆటో సేవల యాప్‌లు చార్జీల విషయంలో ఒక్కో రకంగా వ్యవహరిస్తున్నాయన్న ఆరోపణలపై విచారణ(inquiry) జరపాలంటూ వినియోగదారుల హక్కుల పరిరక్షణ సంస్థ సీసీపీఏ(CCPA)ను ఆదేశించినట్లు కేంద్ర మంత్రి ప్రల్హాద్ జోషి తెలిపారు. ఆండ్రాయిడ్, యాపిల్(Apple) డివైజ్‌లపై ఒకే తరహా రైడ్‌కి సంబంధించి వేర్వేరు రేట్లు చూపిస్తుండటం అసమంజసమైన వాణిజ్య విధానమే అవుతుందని వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి అయిన జోషి పేర్కొన్నారు. ఇది వినియోగదారులకు లభించాల్సిన పారదర్శకత హక్కులను ఉల్లంఘించడమే అవుతుందని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. ఫుడ్ డెలివరీ, టికెట్ బుకింగ్ యాప్స్ తదితర రంగాలకు కూడా దీని పరిధిని విస్తరించనున్నట్లు వివరించారు.ఇదీ చదవండి: ఆర్థిక దార్శనికుడు.. మన్మోహనుడుఉబర్, ఓలా వంటి క్యాబ్ సర్వీసులు అందుబాటులోకి వచ్చిన తరువాత ఎక్కడికెళ్లాలన్నా వెహికల్ బుక్ చేసుకుని గమ్యాన్ని చేరుకుంటున్నారు. అయితే క్యాబ్ లేదా ఆటో ఛార్జీలు మాత్రం మనం బుక్ చేసుకోవడానికి ఉపయోగించే మొబైల్ ఫోన్లను బట్టి మారుతూ ఉంటున్నాయి. ఇది వినడానికి కొంత ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం. దీనికి సంబంధించిన ఒక ట్వీట్(Tweet), ఫోటో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోను గమనిస్తే.. రెండు వేరువేరు మొబైల్ ఫోన్లలో రెండు వేర్వేరు ధరలను చూడవచ్చు. నిజానికి పికప్ పాయింట్, డ్రాపింగ్ పాయింట్ రెండూ ఒకటే. చేరుకోవడానికి పట్టే సమయం కూడా ఒకటే. కానీ ఆండ్రాయిడ్ ఫోన్లో బుక్ చేస్తే.. ఉబెర్ (Uber) ఆటో రైడ్‌కు రూ.290.79 చూపించింది. యాపిల్ ఐఫోన్లో (Apple iPhone) అదే రైడ్‌కు రూ.342.47 చూపించింది.Same pickup point, destination & time but 2 different phones get 2 different rates. It happens with me as I always get higher rates on my Uber as compared to my daughter’s phone. So most of the time, I request her to book my Uber. Does this happen with you also? What is the hack? pic.twitter.com/bFqMT0zZpW— SUDHIR (@seriousfunnyguy) December 23, 2024 -
దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీ నిర్వహణకు రంగం సిద్ధం
దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీల నిర్వహణకు రంగం సిద్ధమవుతుంది. దుబాయ్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఏరియల్ ట్యాక్సీలు నడిచేందుకు వీలుగా ‘వెర్టిపోర్ట్’(ఎయిర్ టేకాఫ్, ల్యాండింగ్ అయ్యే ప్రదేశం)లను ఏర్పాటు చేసేందుకు అక్కడి స్థానిక ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్‌కు దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ అంగీకారం తెలిపారు. దాంతో దుబాయ్ మొదటిసారి అర్బన్ ఏరియల్ ట్రాన్స్పోర్ట్ సేవలందించే దిశగా ప్రయత్నాలు చేస్తుంది.3,100 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేయబోయే వెర్టిపోర్ట్‌లో టేకాఫ్, ల్యాండింగ్ జోన్లు, ఎయిర్‌క్రాఫ్ట్ ఛార్జింగ్ స్టేషన్లు, టాక్సీ పార్కింగ్ ప్రాంతాలను సిద్ధం చేయనున్నారు. ఏటా సుమారు 1,70,000 మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చాలనే లక్ష్యం పెట్టుకున్నారు. ప్రపంచ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఈ ఎయిర్ కండిషన్డ్ వెర్టిపోర్ట్లను సిద్ధం చేయనున్నారు. ఇందుకోసం అంతర్జాతీయ కంపెనీల సహకారం తీసుకోనున్నారు. జాబీ ఏవియేషన్, సైపోర్ట్ సంస్థలు ఈ ప్రాజెక్ట్‌కు తమ సేవలందించనున్నాయి. జాబీ ఏవియేషన్ విమానాల తయారీ, కార్యకలాపాలకు బాధ్యత వహిస్తుంది. స్కైపోర్ట్ మౌలిక సదుపాయాల రూపకల్పన, నిర్వహణను పర్యవేక్షిస్తుంది. రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టీఏ) కొత్త ప్రాజెక్ట్‌ను ప్రస్తుత రవాణా వ్యవస్థలతో అనుసంధానిస్తుంది. ఈ ఎయిర్‌ట్యాక్సీ సర్వీసులను 2026 ప్రారంభంలో అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు.ఇదీ చదవండి: రూ.199 కోట్లతో ఇవాంకా ఇంటి పనులుజాబీ ఏవియేషన్ తయారు చేసిన ఏరియల్ టాక్సీ ఎస్4 మోడల్ సున్నా ఉద్గారాలతో పర్యావరణ అనుకూలమైన ఎలక్ట్రిక్ వాహనంగా ప్రసిద్ధి చెందింది. అది నిలువుగా టేకాఫ్, ల్యాండ్ అవ్వగలదు. దీని గరిష్ట వేగం 321 కిమీ/గం. ఒకసారి ఛార్జింగ్ చేస్తే 160 కి.మీ వరకు ప్రయాణిస్తుంది. ఎస్4 ఒక పైలట్, నలుగురు ప్రయాణీకులను తీసుకువెళ్లగలదు. సంప్రదాయ హెలికాప్టర్ల కంటే చాలా తక్కువ శబ్దం చేస్తూ ప్రయాణిస్తుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో ఆర్టీఏ జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ (జీసీఏఏ), దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ (డీసీఏఏ), స్కైపోర్ట్, జాబీ ఏవియేషన్‌లు ఏరియల్ టాక్సీ సేవలకు పరస్పరం ఒప్పందం కుదుర్చుకున్నాయి. -
ట్యాక్సీ మాఫియానే ప్రధాన ఓటు బ్యాంకు!
గోవా విదేశీ పర్యాటకుల సంఖ్య తగ్గుముఖం పడుతుందని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌లు వెలుస్తున్నాయి. టాక్సీ మాఫియా, అధిక ధరలే ఇందుకు కారణమని కొందరు నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. గోవాకు రాకపోకలు సాగిస్తున్న పర్యాటకులకు సంబంధించి పారిశ్రామికవేత్త రామానుజ ముఖర్జీ ఎక్స్‌లో డేటాను షేర్ చేశారు. 2019లో గోవా సందర్శకుల సంఖ్య 85 లక్షల నుంచి 2023లో 15 లక్షలకు తగ్గుముఖం పట్టినట్లు డేటాలో వెల్లడించారు.ముఖర్జీ షేర్ చేసిన డేటాపై సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మధుర్ స్పందించారు. ‘గోవాలోని బెనౌలిమ్ బీచ్ వద్ద జర్మనీ నుంచి వచ్చిన నా స్నేహితుడిని పికప్ చేసుకోవడానికి వెళ్లాను. వెంటనే దాదాపు పది మందికి పైగా టాక్సీ డ్రైవర్లు నన్ను చుట్టుముట్టారు. విదేశీ పర్యాటకులు స్థానిక టాక్సీలోనే వెళ్లాలని డిమాండ్ చేశారు. తర్వాత నా స్నేహితుడు 37 కిలోమీటర్ల ప్రయాణానికి రూ.1,800 చెల్లించాల్సి వచ్చింది. గోవాలో టాక్సీ మాఫియా పెరుగుతోంది. గోవా అభివృద్ధికి ఈ మాఫియా ఆటంకంగా నిలుస్తోంది’ అని అన్నారు.Goa’s taxi mafia is responsible for it. 100%I went to pick up a friend (from Germany) from Benaulim Beach and I was accompanied by another friend (a local Goan). A taxi guy (in Benaulim) saw us, he stopped us and in no time there were 10+ taxi drivers ready to beat us up. The… https://t.co/V43IsQXBm9— Madhur (@ThePlacardGuy) November 5, 2024ఇదీ చదవండి: ఎడిట్ చేసిన ఫొటోను షేర్ చేసిన మస్క్వరుణ్ రావు అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఈ పోస్ట్‌కు స్పందిస్తూ టాక్సీ, ఆటో మాఫియా గోవాలో పర్యాటకం వృద్ధిని అడ్డుకుంటున్నాయని చెప్పారు. ‘ట్యాక్సీ డ్రైవర్లు స్థానిక ప్రభుత్వానికి ప్రధాన ఓటు బ్యాంకు. కాబట్టి వారి ప్రవర్తన వల్ల వృద్ధి కుంటుపడుతున్నా, పర్యాటకులు ఇబ్బంది పడుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు చర్య తీసుకునే ధైర్యం చేయరు’ అని అన్నారు. -
టెస్లా .. రోబోట్యాక్సీ..
లాస్ ఏంజెలిస్: వాహనప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రోబోట్యాక్సీ ’సైబర్‌క్యాబ్’ను టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ ఎట్టకేలకు ఆవిష్కరించారు. అటానామస్ వాహనంగా ఉండే రోబోట్యాక్సీలో స్టీరింగ్ వీల్, పెడల్స్ ఉండవు. ఇద్దరు ప్రయాణికులు మాత్రమే పట్టేంత క్యాబిన్ ఉంటుంది. స్వయంచాలిత వాహనాలు మనుషులు నడిపే వాహనాల కన్నా 10–20 రెట్లు సురక్షితంగా ఉంటాయని, సిటీ బస్సులతో పోలిస్తే వీటిలో ప్రయాణ వ్యయాలు కూడా చాలా తక్కువేనని మస్క్ చెప్పారు. సైబర్‌క్యాబ్ ఉత్పత్తి 2026లో ప్రారంభమవుతుందని, ధర 30,000 డాలర్ల లోపే ఉంటుందని మస్క్ తెలిపారు. అలాగే 20 మంది పట్టే రోబోవ్యాన్ను కూడా మస్క్ ప్రవేశపెట్టారు. అటు వివిధ పనులు చేసి పెట్టే ఆప్టిమస్ రోబోను కూడా అభివృద్ధి చేస్తున్నట్లు మస్క్ చెప్పారు. దీని ధర 20,000–30,000 డాలర్ల మధ్యలో ఉంటుందని పేర్కొన్నారు. అటానామస్ వాహనాలు ప్రమాదాలకు దారి తీస్తున్న ఉదంతాలపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో టెస్లా స్వయంచాలిత వాహనాలకు అనుమతులపై సందేహాలు నెలకొన్నాయి. -
ఇకపై ‘కాలీ పీలీ’ ట్యాక్సీలు ఖాళీ!
ముంబైలో పదిహేనేళ్లు పైబడిన ట్యాక్సీలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అక్కడ నలుపు-పసుపు రంగుతో కూడిన ఐకానిక్ టాక్సీ(కాలీ పీలీ) ఇకపై రోడ్లపై కనిపించదనే వార్తలు వచ్చినప్పటి నుంచి ప్రజలతోపాటు ప్రముఖులు ఆ ట్యాక్సీతో తమకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా సోమవారం ముంబైలోని ఐకానిక్ టాక్సీలకు సంబంధించి వ్యాఖ్యలు చేశారు. అవి తీవ్ర శబ్దం చేస్తూ రోడ్లపై వెళ్లేవారికి అసౌకర్యంగా ఉన్నప్పటికీ, అవి చాలా మందికి ఎన్నో జ్ఞాపకాలు మిగిల్చాయని గుర్తుచేశారు. ‘నేటి నుంచి ఐకానిక్ ప్రీమియర్ పద్మిని టాక్సీ ముంబై రోడ్ల నుంచి అదృశ్యమవుతుంది. అవి చేసే శబ్దం అసౌకర్యంగా ఉన్నా, ఎక్కువ మంది ప్రయాణించే వెసులుబాటు లేకపోయినా ప్రజలకు అవి టన్నుల కొద్దీ జ్ఞాపకాలను మిగిల్చాయి. ఇక ఈ కాలీ-పీలీ టాక్సీలకు సెలవు’అని తన ‘ఎక్స్(ట్విటర్)’ ఖాతాలో పేర్కొన్నారు. (ఇదీ చదవండి: 2030 నాటికి పతాకస్థాయికి చేరనున్న శిలాజ ఇంధనాలు) పబ్లిక్ ట్రాన్స్పోర్టర్ బృహన్ముంబయి ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్పోర్ట్ (బెస్ట్) సంస్థ నుంచి డీజిల్‌తో నడిచే డబుల్ డెక్కర్ బస్సులను అధికారులు తొలగించినట్లు ప్రకటించారు. అయితే ఈ ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే ప్రసిద్ధ ప్రీమియర్ పద్మిని మోడల్ కార్లును సైతం ఆపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. నిబంధనల ప్రకారం 15 ఏళ్లు ముగిసిన డబుల్‌డెక్కర్ బస్సులను రద్దు చేశారు. అయితే ఫియట్ కంపెనీ తయారుచేసిన ఈ ప్రీమియర్ పద్మిని కార్లును ముంబయిలో ఎక్కువగా ట్యాక్సీలుగా వాడుతున్నారు. ఇవి నలుపు పసుపు రంగులో ఉండడంతో వాటికి కాలీపీలీ ట్యాక్సీలుగా పేరు వచ్చింది. ఈ ట్యాక్సీలకు కేటాయించిన రన్నింగ్ పీరియడ్ 20 సంవత్సరాలు. అక్టోబర్ 29, 2023తో ఆ సమయం ముగిసింది. From today, the iconic Premier Padmini Taxi vanishes from Mumbai’s roads. They were clunkers, uncomfortable, unreliable, noisy. Not much baggage capacity either. But for people of my vintage, they carried tons of memories. And they did their job of getting us from point A to… pic.twitter.com/weF33dMQQc — anand mahindra (@anandmahindra) October 30, 2023 -
కోల్‌కతాలో భోళా శంకర్ ఇలా..
-
సస్పెన్స్ థ్రిల్లర్ 'టాక్సీ' రివ్యూ
టైటిల్: టాక్సీ నటీనటులు: వసంత్ సమీర్ పిన్నమ రాజు, అల్మాస్ మోటివాలా, సూర్య శ్రీనివాస్, సౌమ్య మీనన్, ప్రవీణ్ యండమూరి, సద్దాం హుస్సేన్, నవీన్ పండిత తదితరులు దర్శకుడు: హరీశ్ సజ్జా సంగీతం : మార్క్ కె రాబిన్ సినిమాటోగ్రఫీ : ఉరుకుండారెడ్డి విఎఫ్ఎక్స్ : ఆనంద్ పల్లకి ఎడిటర్: టి.సి.ప్రసన్న బ్యానర్: హెచ్ అండ్ హెచ్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత: హరిత సజ్జా విడుదల తేదీ: మార్చి 10, 2023 కథ సైంటిస్ట్ ఈశ్వర్ (వసంత్ సమీర్ పిన్నమ రాజు) కాలిఫోర్నియం 252 పై ప్రయోగాలు చేసి సక్సెస్ అవుతాడు. దాన్ని దేశం కోసం ఉపయోగించాలనుకుంటాడు. కాలిఫోర్నియం 252తో భూమి లోతుల్లో ఉన్న బంగారం నిల్వలు కనిపెట్టవచ్చు అని, అప్పుడు మన దేశం నెంబర్ వన్ అవుతుందంటూ గనుల శాఖా మంత్రి ముందు ప్రపోజల్ పెడతాడు. మరిన్ని ప్రయోగాల కోసం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వమని అడుగుతాడు. అయితే కాలిఫోర్నియం 252 ఒక్కో గ్రాము ధర రూ.180 కోట్లు. అంతటి విలువైన సంపదను ఎవరు వదులుకుంటారు? పొలిటీషియన్స్, వారిని అంటిపెట్టుకునే మాఫియా రంగంలోకి దూకుతుంది. ఈశ్వర్ లాంటి నిజాయితీ పరుడిని వంచటం కష్టం. అందుకే అతని కుటుంబంపై కుట్ర పన్నుతారు. అక్కడ నుంచి ఈశ్వర్ పై నేరారోపణలు, అతని భార్య (అల్మాస్ మోటివాలా) మిస్సింగ్ లు జరిగిపోతూ ఉంటాయి. వాటి నుంచి ఈశ్వర్ తప్పించుకోవటానికి తన వంతు ప్రయత్నం మొదలెడతాడు. మరో ప్రక్క ఎథికల్ హ్యాకర్ ఉజ్వల్ (సూర్య శ్రీనివాస్) కు కెరీర్ పరంగా ఎదగటానికి మంచి కాంట్రాక్ట్ వస్తుంది. దాంతో స్నేహితులు, సన్నిహితులు నుంచి అప్పులు చేసి మరీ తన సంస్దను డవలప్ చేస్తూ పై మెట్టు ఎక్కాలనుకుంటాడు. కానీ అనుకోని విధంగా తనకు వచ్చిన కాంట్రాక్ట్ సమస్యల్లో పడటం, ప్రాజెక్టు ఆగిపోవటంతో చివరకు అప్పులపాలవుతాడు. ఇలా వేర్వేరు సమస్యలతో ఉన్న ఈశ్వర్, ఉజ్వల్ అనుకోని పరిస్దితుల్లో ఓ క్యాబ్ ఎక్కుతారు. ఆ క్యాబ్ పై కొందరు ఎటాక్ చేస్తారు. వాళ్లనుంచి తప్పించుకున్న వీళ్లిద్దరు తమపై ఎటాక్ కు ప్లాన్ చేసింది విద్యుత్ (నవీన్ పండిత) అని తెలుసుకుంటారు. అతనెవరు? వీళ్లిద్దరనీ ఎందుకు టార్గెట్ చేస్తాడు? ఎటాక్ జరిగిన తర్వాత నుంచి వాళ్ల జీవితాలు ఎలా టర్న్ తీసుకున్నాయి? మిస్సైపోయిన ఈశ్వర్ భార్య తిరిగి కనపడిందా? అతనిపై పడిన పోలీస్ కేసులు, నేరారోపణలు చివరకు ఏమయ్యాయి? ఈ కథలో టాక్సీ డ్రైవర్ (సద్దాం హుస్సేన్) పాత్ర ఏమిటి? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. విశ్లేషణ సాధారణంగా ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్లు అనుమానాస్పద మృతి లేదా యాక్సిడెండ్స్తో మొదలవుతాయి. ట్యాక్సీ కథని కూడా ఒక మిస్టరీతో మొదలుపెట్టాడు దర్శకుడు. హీరో మీద ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఎటాక్ చేయడం.. ఆ తర్వాత ఓ ఎథికల్ హ్యాకర్ వచ్చి ఈ కథలో జాయిన్ అవడంతో ఈ రెండింటికి మధ్య లింక్ ఉందని ప్రేక్షకుడికి అర్ధమవుతుంది. సినిమా ఫస్ట్ హాఫ్ చాలా టైట్ స్క్రీన్ ప్లేతో నడుస్తుంది. అయితే సెకండ్ హాఫ్‌లో కొంత పట్టు వదిలినట్లనిపించింది. సెకండ్ హాఫ్ కూడా ఫస్ట్ హాఫ్ తరహాలో ఉండి ఉంటే బాగుండేది. సినిమా క్లైమాక్స్ బాగుంది. సినిమాలోని హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లు కథలో భాగంగా వచ్చి వెళ్తాయి. 'లవ్ స్టొరీ' చిత్రానికి ఫైట్స్ కంపోజ్ చేసిన బి జె శ్రీధర్ ఈ చిత్రానికి కూడా ఫైట్స్ కంపోజ్ చేశాడు. ఫైట్ సీక్వెన్స్‌లు సరిగ్గా సరిపోయాయి. కానీ అన్ని వర్గాల వారిని అలరించాలనుకునే క్రమంతో కావాలని మరీ బలవంతంగా కథలో ఇరికించిన లవ్ సన్నివేశాలే విసిగిస్తాయి. ఫస్ట్ హాఫ్ వరకు హీరోని సమస్యలో పడేయటం... సెకండ్ హాఫ్ లో ఆ సమస్య నుంచి బయిటపడటానికి అతను ఏం ప్రయత్నం చేశాడు.. ఎలా తన సమస్యలను అధిగమనించాడు? అన్న ధోరణిలో స్క్రీన్ ప్లే రాసుకున్నాడు డైరెక్టర్. అయితే ఇలాంటి కథకు అవసరమైన భారీతనం లోపించినట్లు అనిపిస్తుంది. నటీనటుల పనితీరు హీరోగా చేసిన వసంత్ సమీర్ పిన్నమ రాజు పెర్ఫార్మన్స్ బాగుంది. ముఖ్యంగా తన డైలాగ్ డెలివరీ మెప్పిస్తుంది. అతని భార్య పాత్రలో అల్మాస్ మోటివాలా చక్కగా నటించింది. సౌమ్య మీనన్ కీలకమైన పాత్రలో మెరిసింది. ఇక ప్రవీణ్ యండమూరి, సద్దాం హుస్సేన్ పర్వాలేదనిపించారు. మార్క్ k రాబిన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగా సూటైంది. ఎడిటింగ్ ఓకే. సినిమాటోగ్రఫీ కూడా పర్వాలేదనిపించింది. -
డైరెక్టర్ క్రిష్ వదిలిన 'టాక్సీ'.. ఆసక్తిగా ట్రైలర్
Director Krish Launched Taxi Movie Trailer: 'కర్త కర్మ క్రియ' సినిమాతో తెలుగు హీరోగా పరిచయం అయ్యాడు వసంత్ సమీర్ పిన్నమరాజు. వసంత్ హీరోగా హెచ్ అండ్ హెచ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై హరిత సజ్జా నిర్మిస్తున్న థ్రిల్లర్ చిత్రం 'టాక్సీ'. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వద్ద డైరెక్షన్ విభాగంలో పనిచేసిన హరీశ్ సజ్జా ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అల్మాస్ మోటీవాల, సూర్య శ్రీనివాస్, సౌమ్యా మీనన్, ప్రవీణ్ యండమూరి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మార్క్ రాబిన్ సంగీతం అందించిన ఈ సినిమాకు బిక్కీ విజయ్ కుమార్ నిర్మాత. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఈ ప్రచార చిత్రాన్ని రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. 1 నిమిషం 59 సెకన్ల నిడివితో ఉన్న ఈ ట్రైలర్ ఆద్యంత ఇంటెన్స్‌గా ఆకట్టుకుంది. కాలిఫోర్నియమ్ 252 అనే అరుదైన హ్యూమన్ మేడ్ మెటల్ నేపథ్యంలో ఈ సినిమా కథ ఉన్నట్లు తెలుస్తోంది. డైలాగ్‌లు ఆకట్టుకునేలా ఉన్నాయి. చదవండి: ప్రముఖ నటుడి ఆత్మహత్య.. చిత్ర పరిశ్రమలో విషాదం నెట్టింట రకుల్ డ్యాన్స్ వీడియో వైరల్.. బాయ్‌ఫ్రెండ్ కామెంట్ ఏంటంటే ? -
దురదృష్టకరమైన ఘటన...పక్షిని రక్షించడమే శాపమైంది: వీడియో వైరల్
రోడ్డుప్రమాదాలు నివారించేందుకు ప్రభుత్వ యంత్రాంగం, ట్రాఫిక్ పోలీసులు ఎంతగా ప్రయత్నిస్తున్నా ప్రమాదాలు జరుగుతూనే ఉంటున్నాయి. నిర్లక్షపూరితమైన డ్రైవింగ్, పక్కవారికి ఏమైన అవుతుందనే భయం లేని స్పీడ్ డ్రైవింగ్ తదితరాలే ఈ ప్రమాదాలకు కారణం. కనీసం ముందున్న కారు ఎందుకు ఆగిందో అని కూడా లేకుండా తమదారి తమదే అన్నట్లుగా ఢీ కొట్టి వెళ్లిపోతున్నారు. కొంతమంది యాక్సిడెంట్ చేసి కేసు నుంచి తప్పించుకునేందుకు ఆగకుండా వెళ్లిపోతున్నారు. అచ్చం అలానే ఇక్కడొక ఒక ప్రబుద్ధుడు వేగంగా ట్యాక్సీ నడుపుతూ.. రోడ్డు పై ఆగి ఉన్న ఇద్దరు వ్యక్తులను ఢీ కొట్టి వెళ్లిపోయాడు. వివరాల్లోకెళ్తే...పోలీసులు తెలపిన కథనం ప్రకారం...ముంబై నేపీన్సీ రోడ్లో వాసం ఉంటున్న వ్యాపారవేత్త అమర్ మనీష్ జరీవాలా తన డ్రైవర్ శ్యామ్ సుందర్ కామత్‌తో కలసి ముంబై బీచ్ హైవైపై మలాడ్ వైపుగా వెళ్తున్నారు. ఐతే ఇంతలో ఒక పక్షి వారి కారుని ఢీకొట్టింది. దీంతో ఆ వ్యాపారవేత్త, అతని డ్రైవర్ గాయపడిన పక్షిని రక్షించేందుకు కారులోంచి దిగారు. ఇంతలో వేగంగా వస్తున్న ఒక ట్యాక్సీ వారిని ఢీ కొట్టి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో ఆ వ్యాపరవేత్త అక్కడికక్కడే చనిపోయాడు, డ్రైవర్ కామత్ మాత్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ ఘటనకు పాల్పడిన ట్యాక్సీ డ్రైవర్ కుమార్ జైశ్వర్గా గుర్తించి అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఐతే ఈ ఘటన హైవే పై ఉన్న సీసీఫుటేజ్‌లో రికార్డు అవ్వడంతో వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. What a tragedy. This is Mumbai’s Bandra Worli Sea Link pic.twitter.com/VSTQz27vqY — Singh Varun (@singhvarun) June 10, 2022 (చదవండి: కసాయి కొడుకు...కన్న తల్లిదండ్రులనే కడతేర్చి... సోదరికి కాల్ చేసి మరీ...) -
గాలిలో ఎగిరే కారు ఉంటే ఎంత బాగుంటుందో.. నిజంగానే రాబోతుందండోయ్
మనం కారులో రోడ్డుపై వెళ్తున్నప్పుడు భారీగా ట్రాఫిక్‌జామ్ అయితే... కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోతే ఏమనిపిస్తుంది? గాలిలో ఎగిరే కారు ఉంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. అలా గాలిలో ఎగిరే కారు నిజంగానే రాబోతోంది. ఇప్పటిదాకా పలు కంపెనీలు ప్రోటోటైప్ ఫ్లయింగ్ ట్యాక్సీని తెచ్చినప్పటికీ వాస్తవరూపంలోకి రాలేదు. కొత్తగా ఆవిష్కరించిన ఎగిరే కారును ఎవరు, ఎక్కడ రూపొందించారు, అది ఎలా ఉంటుందనే విశేషాలు చూద్దాం..! –సాక్షి, సెంట్రల్ డెస్క్ 2027 నాటికల్లా వినియోగంలోకి.. యూరప్ దేశమైన స్లొవేకియాలో ఏరోమొబిల్ కంపెనీ ప్రపంచంలోనే మొదటి ఫోర్‌సీటర్ ఫ్లయింగ్ ట్యాక్సీని ఆవిష్కరించింది. దీని పేరు ఏఎం నెక్ట్స్. మరో ఐదేళ్లలో ఇది వినియోగంలోకి రానుంది. 2027నాటికల్లా 500 మైళ్ల దూరానికి ప్రయాణికులను తీసుకెళ్తుంది. ఈ కంపెనీ రూపొందించిన రెండో ఫ్లయింగ్ కారు ఇది. సూపర్‌కార్, తేలికపాటి విమానాల లక్షణాలుండే ఈ కారు మూడు నిమిషాల వ్యవధిలో తన ‘మోడ్’ను (అంటే రోడ్డుపై నుంచి గాల్లోకి ఎగరడం.. గాల్లో నుంచి రోడ్డు మీదికి దిగడం) మార్చుకోగలదు. హాయిగా వెళ్లొచ్చు... ఈ కారు అందుబాటులోకి వస్తే ప్రయాణికుల విలువైన సమయం చాలా ఆదా అవుతుందని కంపెనీ చెబుతోంది. ముఖ్యమైన నగరాల మధ్య 100 నుంచి 500 మైళ్ల దూరం వెళ్లే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని అంటోంది. ఇందులో వెళ్తే ప్రయాణ బడలిక అస్సలుండదని, ఆడుతూపాడుతూ వెళ్లొచ్చని, అదీగాక భూమ్మీద ఉండే అందాలను వీక్షిస్తూ వెళ్లొచ్చని చెబుతోంది. అయితే ఫ్లయింగ్ ట్యాక్సీ ధర ఎంత అనే విషయాన్ని మాత్రం కంపెనీ ప్రకటించలేదు. అలాగే ప్రయాణికులకు టికెట్ ఎంత ఉంటుందన్నది కూడా వెల్లడించలేదు. తొలుత ఏఎం 4.0 ఈ కంపెనీ మొదట రూపొందించిన టూసీటర్ ఫ్లయింగ్ కారు ఏఎం 4.0 మోడల్‌ను 2017 జూన్‌లో ప్యారిస్‌లో జరిగిన అంతర్జాతీయ ఎయిర్ షోలో ప్రదర్శించారు. గాలిలో గంటకు 360 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ఎగిరేలా దీన్ని రూపొందించారు. రోడ్డుపై దీని గరిష్టవేగం గంటకు 160 కి.మీ. దీని ఖరీదు రూ.9.8 కోట్లు – 12 కోట్ల వరకు ఉంది. ఈ ఫ్లయింగ్ కారును గాలిలో నడపాలంటే మాత్రం పైలట్ లైసెన్స్ తీసుకోవడం తప్పనిసరి. ఈ కారును వచ్చే ఏడాదికి మార్కెట్లోకి తీసుకురావాలని కంపెనీ తొలుత భావించినప్పటికీ.. ఇప్పుడు 2024కు గానీ అందుబాటులోకి రాదని చెబుతోంది. అసలు సిసలు ఫ్లయింగ్ కారు ‘ఇది ఏరోమొబిల్ అసలు సిసలు ఫ్లయింగ్ కారు. ఇది రెండో విప్లవాత్మకమైన మోడల్’ అని కంపెనీ సీఈఓ పాట్రిక్ హెస్సెల్ చెప్పారు. ఒక్క ఉత్తర అమెరికా మార్కెట్లోనే ఏడాదికి 4 లక్షల కోట్ల మేర బిజినెస్ జరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఎగిరే కార్ల వల్ల వ్యక్తిగత రవాణాను మరింత సులభతరం చేయడమే తమ లక్ష్యమని కంపెనీ చెబుతోంది. రోడ్డుపైగానీ, గాలిలో గానీ చాలా సౌకర్యవంతంగా ప్రయాణం చేయడానికి దోహదం చేస్తుందని అంటోంది. ముఖ్యంగా ట్రాఫిక్ జామ్‌లకు దీంతో చెక్ పెట్టవచ్చంటోంది. ఈ ఎగిరే కారు కోసం ప్రస్తుతం అమెరికాలో ఉన్న 10 వేల ల్యాండింగ్ స్ట్రిప్‌లను వినియోగించుకోవాలని కంపెనీ భావిస్తోంది. -
వీడు మామూలోడు కాదు.. అంబులెన్స్‌ను ఫ్రీ ట్యాక్సీలా వాడేశాడు!
రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు, హఠాత్తుగా ఎవరైనా అస్వస్థతకు గురైనప్పుడు వెంటనే అంబులెన్స్‌కు కాల్ చేస్తాం. అయితే చాలా వరకు మెడికల్ ఎమర్జెన్సీకి మాత్రమే అంబులెన్స్ సేవలను ఉపయోగించుకుంటాం. అయితే ఓ వ్యక్తి ఏడాదిలో సుమారు 39 సార్లు స్థానికంగా ఉన్న ఆస్పత్రి అంబులెన్స్‌ను ఫోన్ చేసి.. సేవలను వినియోగించుకున్నాడు. అయితే ఏడాదికి 39 సార్లు ఎందుకని ఆలోచిస్తున్నారా? ఆ వ్యక్తి చేసిన పని తెలిస్తే ఆశ్చర్యపోతారు. తైవాన్‌కు చెందని ఓ యువకుడు సూపర్ మార్కెట్లకు వెళ్లిన ప్రతిసారి తిరుగు ప్రయాణంలో అంబులెస్స్‌కు ఫోన్ చేశాడు. అలా చాలా సార్లు మెడికల్ ఎమెర్జెన్సీ అని కాల్ చేయడంతో అంబులెన్స్ సిబ్బంది స్థానిక ఆస్పత్రిలో చేర్చారు. చదవండి: సిగరెట్ కాల్చే అలవాటే ఆమె ప్రాణాల్ని కాపాడింది అంబులెన్స్‌కు ఫోన్ చేసి ఆస్పత్రిలో చేరినవారు చికిత్స తీసుకుంటారు. కానీ, ఆస్పత్రిలో చేరిన తర్వాత ఆ వ్యక్తి అక్కడ కనిపించకుండా వెళ్లిపోవడాన్ని ఆస్పత్రి సిబ్బంది గమనించారు. మరోసారి ఇలా జరిగినప్పుడు అతన్ని ఆస్పత్రి సిబ్బంది పట్టుకొని ప్రశ్నించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అతను ఆస్పత్రి అంబులెన్స్‌కు పదేపదే కాల్ చేయడానికి కారణం ఏంటని అడగ్గా.. సూపర్ మార్కెట్ నుంచి తన ఇంటికి వెళ్లడానికి అంబులెన్స్‌ను టాక్సీలా వాడుకుంటున్నాని తెలపడంతో ఆశ్చర్యపోవటం ఆస్పత్రి సిబ్బంది వంతైంది. చదవండి: డిసెంబర్ 12న మిస్ యూనివర్స్ పోటీలను నిర్వహిస్తాం..! రద్దు చేయలేం..: విదేశాంగ మంత్రి అయితే ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఆస్పత్రి డాక్టర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోసారి అంబులెన్స్ సేవలను దుర్వినియోగపరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, భారీ జరిమానా కూడా విధిస్తామని పోలీసులు సదరు యువకుడిని హెచ్చరించారు. అయితే అతని ఇల్లు పక్కనే ఆస్పత్రి ఉండటంతోపాటు, సూపర్ మార్కెట్ కూడా కేవలం 200 మీటర్లు దూరంలో ఉండటంపై సోషల్ మీడియాలో ఆ యువకుడి చేసిన పనికి నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. -
సిద్ శ్రీరామ్ పాడిన వేవేల తారలే.. సాంగ్ విన్నారా?
Vevela Taarale Song From Taxi Movie: ఈ మధ్య మెలోడీ పాటలకు కేరాఫ్ అడ్రస్‌గా మారాడు సింగర్ సిద్ శ్రీరామ్. ఆయన పాటలో ఉండే కమ్మదనం ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. తాజాగా అతడు 'టాక్సీ' సినిమాలో పాడిన యూత్‌ఫుల్ మెలోడీ సాంగ్ 'వేవేల తారలే..' శుక్రవారం రిలీజైంది. ''వేవేలా తారలే నా చుట్టూ చేరి మురిసేనా.. మేఘాల పైన తేలుతున్నా'' అంటూ మొదలైన ఈ బ్యూటిఫుల్ మెలోడీ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. ఎప్పటిలాగే సిద్ శ్రీరామ్ తన గొంతుతో మరోసారి మ్యాజిక్ చేశారు. మార్క్ కే రాబిన్ సంగీతం అందించిన ఈ పాటకు కృష్ణ కాంత్ లిరిక్స్ సమకూర్చారు. హెచ్ అండ్ హెచ్ ఎంటర్టెన్మెంట్స్ బ్యానర్‌పై హరిత సజ్జ నిర్మిస్తున్న 'టాక్సీ' సినిమాకు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన హరీష్ సజ్జా దర్శకత్వం వహిస్తున్నారు. బిక్కి విజయ్ కుమార్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వసంత్ సమీర్ పిన్నమ రాజు, అల్మాస్ మోటివాలా, సూర్య శ్రీనివాస్, సౌమ్య మీనన్, ప్రవీణ్ యండమూరి, సద్దాం హుస్సేన్, నవీన్ పండిత తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. -
దీపావళి కానుకగా ‘టాక్సీ’ ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల
వసంత్ సమీర్ పిన్నమ రాజు, అల్మాస్ మోటివాలా, సూర్య శ్రీనివాస్ , సౌమ్య మీనన్ , ప్రవీణ్ యండమూరి, సద్దాం హుస్సేన్, నవీన్ పండిత తదితరులు వారు ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ట్యాక్సీ’,. హెచ్ అండ్ హెచ్ ఎంటర్టెన్మెంట్స్ బ్యానర్‌పై హరిత సజ్జ ఈ మూవీని నిర్మిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన హరీష్ సజ్జా ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. బిక్కి విజయ్ కుమార్ సహ నిర్మాతగా వ్యవరిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను దీపావళి సందర్భంగా విడుదల చేశారు మేకర్స్. వైవిధ్యమైన కథాంశంతో సస్పెన్స్ అండ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ట్యాక్సీ రూపొందుతోంది. ఇందులోని హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లు, థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ ఎన్నో ఉంటాయని తెలిపారు.. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టైటిల్ పోస్టర్‌కు అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ‘లవ్ స్టొరీ’ చిత్రానికి ఫైట్స్ కంపోజ్ చేసిన బీజే శ్రీధర్ కూడా ఫైట్స్ కంపోజ్ చేస్తుండడం మరో విశేషం. థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారికి మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలతో ఈ చిత్రం రూపొందుతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి కావొచ్చాయి. త్వరలోనే ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో ‘ట్యాక్సీ’ టైటిల్ లోగో విడుదల
వసంత్ సమీర్ పిన్నమ రాజు, అల్మాస్ మోటివాలా, సూర్య శ్రీనివాస్ , సౌమ్య మీనన్ , ప్రవీణ్ యండమూరి, సద్దాం హుస్సేన్, నవీన్ పండిత ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ట్యాక్సీ’. హెచ్ అండ్ హెచ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై హరిత సజ్జ ( ఎం.డీ) నిర్మిస్తుండగా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వద్ద పలు చిత్రాలకు పనిచేసిన హరీష్ సజ్జా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. బిక్కి విజయ్ కుమార్ (ఎం.టెక్) సహ నిర్మాతగా వ్యవరిస్తున్న ఈ చిత్రానికి మార్క్ రాబిన్ సంగీతం అందిస్తున్నాడు. వైవిధ్యమైన కథాంశంతో సస్పెన్స్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ మూవీ రూపొందుతోంది. ఇందులోని హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు మరియు థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ ఎన్నో ఉంటాయని చిత్ర బృందం తెలిపింది. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం టైటిల్ లోగో పోస్టర్ ను ఈరోజు ఆవిష్కరించారు. ఈ పోస్టర్ విషయానికి వస్తే.. ఓ గన్ పై కార్ ఉండడం.. అలాగే బ్యాక్‌గ్రౌండ్‌లో వైజాగ్ మ్యాప్ కూడా కనిపిస్తుండడం వంటివి ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించే విధంగా ఉందని చెప్పొచ్చు. థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారు మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలతో ఈ చిత్రం రూపొందుతోందని మూవీ టీం చెప్పింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా వేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది చిత్ర బృందం. చదవండి: ‘అతడు ఆమె ప్రియుడు’ ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేసిన రాఘవేంద్రరావు -
‘వైట్’పై ఎల్లో జర్నీ.. ఏమిటీ వైట్ ప్లేట్..?
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్లో కొన్ని ట్యాక్సీ వాహనాలు, క్యాబ్‌లు మోటారు వాహన నిబంధనలను ఉల్లంఘించి తిరుగుతున్నాయి. పన్నులు ఎగవేసేందుకు ఎల్లో నెంబర్ ప్లేట్ స్థానంలో వైట్ నెంబర్ ప్లేట్ ఉపయోగిస్తున్నాయి. ఆర్టీఏలో వ్యక్తిగత వాహనాలుగా నమోదు చేసుకొని..ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. దీంతో ప్రతి మూడు నెలలకు ఒకసారి క్రమం తప్పకుండా త్రైమాసిక పన్నులు, రాష్ట్రాల సరిహద్దులు దాటినప్పుడు అంతర్రాష్ట్ర పన్నులు చెల్లించి తిరిగే రవాణా వాహనాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ఇప్పటికే కోవిడ్ కారణంగా ట్రావెల్స్ రంగం తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటుండగా ఈ తరహా ఉల్లంఘనల వల్ల మరింత నష్టపోవలసి వస్తోందని ట్రావెల్స్ నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 10 వేల వాహనాలు ఇలా వ్యక్తిగత వాహనాలుగా నమోదు చేసుకొని తిరుగుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొన్ని వాహనాలు రవాణా రంగానికి చెందినవిగానే నమోదు చేసుకున్నప్పటికీ అంతర్రాష్ట్ర పన్నుల ఎగవేత కోసం వైట్ నెంబర్ ప్లేట్‌ను వినియోగిస్తున్నాయి. కోవిడ్‌తో సంక్షోభం... గత 16 నెలలుగా రవాణా రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. పర్యాటక, ఐటీ రంగాలు పూర్తిగా స్తంభించడం, ఇప్పటికీ పునరుద్ధరణకు నోచకపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో ప్రయాణికుల రవాణా కోసం వినియోగించే అన్ని రకాల ట్యాక్సీలు, క్యాబ్‌లు, మ్యాక్సీ క్యాబ్‌లు, మినీబస్సులు, తదితర వాహనాల నిర్వాహకులు త్రైమాసిక పన్నుల నుంచి మినహాయింపు కోసం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈఎంఐలు కూడా చెల్లించలేని స్థితిలో ఉన్న తాము పన్నులు కట్టలేమంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది రవాణాశాఖ త్రైమాసిక పన్ను చెల్లింపు నుంచి మినహాయింపునిచి్చనట్లుగానే ఈ ఏడాది కూడా ఇవ్వాలని కోరుతున్నారు. ఒకవైపు ట్రావెల్స్ సంస్థల ఆందోళన ఇలా కొనసాగుతుండగా కొంతమంది మాత్రం మోటారు వాహన నిబంధనలను ఉల్లంఘించి వైట్ నెంబర్ ప్లేట్‌పై తిరగడం పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్టీఏ నిర్లక్ష్యం... ఎల్లో నెంబర్ ప్లేట్‌పైన తిరగవలసిన వాహనాలు అందుకు విరుద్దంగా వైట్ ప్లేట్‌ను ఏర్పాటు చేసుకొని ప్రయాణికులను తరలిస్తున్నాయి.హైదరాబాద్ నుంచి ఏపీకి రాకపోకలు సాగించే వేలాది వాహనాలు ఇలా తిరుగుతున్నప్పటికీ ఆర్టీఏ అధికారులు మాత్రం నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడం గమనార్హం. ఏమిటీ వైట్ ప్లేట్... వ్యక్తిగత వాహనాల కోసం రవాణాశాఖ వైట్ నెంబర్ ప్లేట్‌ను కేటాయించింది. దీనిపైన నలుపు రంగులో వాహనం నెంబర్ నమోదై ఉంటుంది. ఈ వాహనాలపైన ఒకేసారి జీవితకాల పన్ను రూపంలో చెల్లిస్తారు. ప్రయాణికుల వాహనాలు, సరుకు రవాణా వాహనాలు మాత్రం వాణిజ్య వాహనాలుగా నమోదై ఉంటాయి. వీటికి పసుపు రంగు నెంబర్‌ప్లేట్ (ఎల్లో ప్లేట్)పైన నలుపు రంగంలో నెంబర్లు నమోదై ఉంటాయి. ఈ వాహనాలు ప్రతి 3 నెలలకు ఒకసారి పన్ను చెల్లించాలి. సీట్ల సామర్థ్యాన్ని బట్టి ఈ పన్ను మొత్తం ఉంటుంది. -
అందరికీ మంచి జరగాలి
-
మీ అన్నగా, తమ్ముడిగా సాయం
సాక్షి, అమరావతి: ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ నడుపుతున్న వారందరికీ ఒక అన్నగా, తమ్ముడిగా ఆర్థిక సాయం చేస్తున్నానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ఎవరూ కూడా మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, ట్రాఫిక్ నియమాలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్ వాహన మిత్ర ద్వారా సొంత ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ గల వారికి గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్లో బటన్ నొక్కి రెండవ ఏడాది రూ.10 వేల చొప్పున నగదును జమ చేశారు. మొత్తం 2,62,493 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.262.49 కోట్లు జమ అయింది. గత ఏడాది కంటే ఈ ఏడాది కొత్తగా 37,756 మంది ఈ పథకంలో లబ్ధిదారులయ్యారు. కలెక్టర్లు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌లు నడిపేవారిని ఉద్దేశించి సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. అనంతరం వివిధ జిల్లాల నుంచి ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు సీఎం జగన్‌తో తమ సంతోషాన్ని పంచుకున్నారు. సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే.. అందరికీ మంచి జరగాలి ► గత ఏడాది అక్టోబర్ 4న వైఎస్సార్ వాహనమిత్ర పథకాన్ని ప్రారంభించాం. అయితే ఈ ఏడాది కోవిడ్‌తో లాక్డౌన్ వల్ల బతకడం కష్టమైంది. ఆటోలు, ట్యాక్సీలు తిరగక ఆ కుటుంబాలు ఇబ్బంది పడ్డాయి కాబట్టి వారికి మేలు చేయడం కోసం ఈ ఏడాది జూన్ 4నే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ► ఎక్కడైనా, ఎవరికైనా అర్హత ఉండి ఈ పథకంలో లబ్ధి కలగకపోతే ఆందోళన చెందొద్దు. నాకు ఓటు వేయకపోయినా సరే, అర్హులైతే చాలు పథకం వర్తింప చేయాలని స్పష్టం చేశాం. అవినీతికి తావు లేకుండా ఈ పథకం అమలులో పూర్తి పారదర్శకత పాటిస్తున్నాం. ► ఇంకా అర్హులెవరైనా మిగిలిపోతే గ్రామ సచివాలయాల్లో లేదా స్పందన యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఏమైనా ఇబ్బంది ఉంటే స్పందన హెల్ప్‌లైన్ నంబరు 1902కు కాల్ చేయాలి. అలా దరఖాస్తు చేసుకున్న వారికి అర్హత ఉంటే వచ్చే నెల 4వ తేదీన ఆర్థిక సహాయం చేస్తాం. అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నా. ఆలోచించాను.. అమలు చేశాను.. ► పాదయాత్ర సందర్భంగా 2018 మే నెలలో ఏలూరులో మాట ఇచ్చాను. ప్రతి జిల్లాలో ఆటో డ్రైవర్లు తమ సమస్యలు చెప్పుకున్నారు. ఇన్సూరెన్సు కట్టాలి. అది కడితేనే ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇస్తారు. ప్రీమియం ఎక్కువ కావడంతో డ్రైవర్లు ఇబ్బంది పడే వారు. ఎఫ్‌సీ లేకపోతే రోజుకు రూ.50 జరిమానా విధించే వారు. ► అప్పుడు దాదాపు అన్ని జిల్లాల్లో డ్రైవర్లు వచ్చి నన్ను కలిశారు. ఎఫ్‌సీ కోసం ఒకేసారి దాదాపు రూ.10 వేలు ఖర్చు చేయాలి. లేదంటే రోజుకు రూ.50 ఫైన్ ఎలా కడతారని ఆలోచించాను. ఏలూరు సభలో మాట ఇచ్చాను. అధికారంలోకి వచ్చాక అమలు చేశాను. ఈ సారి మళ్లీ మీ తమ్ముడిగా, అన్నగా సహాయం చేస్తున్నాను. పాత బాకీల కింద జమ చేసుకోరు ► గత ఏడాది ఆటోలు, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌ల డ్రైవర్ల ఖాతాలో నగదు వేస్తున్నప్పుడు, దాన్ని పాత అప్పుల కింద జమ చేసుకోకుండా అన్ ఇన్‌కమ్‌బర్డ్ ఖాతాల్లో వేశాం. అప్పుడు దాదాపు రూ.236 కోట్లు ఖర్చు చేశాం. ► ఈసారి రూ.262 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నాం. గత ఏడాది కంటే ఈసారి 37,756 మంది కొత్త లబ్ధిదారులు చేరారు. డబ్బులు అందిన సంతోషంతో అనంతపురానికి చెందిన రామలక్ష్మి క్యాలెండర్ ప్రకారం సేవలు ► అన్ని వర్గాలకు సేవలందించే విధంగా క్యాలెండర్ ప్రకటించాం. అందులో భాగంగా ఇవాళ (గురువారం) ఈ కార్యక్రమం అమలు చేస్తున్నాం. ► ఈ నెల 10వ తేదీన రజకులు, నాయీ బ్రాహ్మణులు, టైలర్లకు సహాయం అందిస్తాం. ఆ తర్వాత 17న నేతన్న నేస్తం, 24న కాపు నేస్తం, 29న ఎంఎస్ఎంఈలకు రెండో విడత లబ్ధి కలిగిస్తాం. అన్ని వర్గాల వారికి న్యాయం ► పేదలకు న్యాయం చేస్తేనే రాష్ట్రం, దేశానికి చాలా మంచిది. ఇప్పుడు లబ్ధి పొందుతున్న వారిలో అన్ని వర్గాల వారు ఉన్నారు. ఎస్సీలు 61,390 మంది, ఎస్టీలు 10,049 మంది, బీసీలు 1,17,096 మంది, ఈబీసీలు 14,590 మంది, మైనారిటీలు 28,118 మంది, కాపులు 29,643 మంది, బ్రాహ్మణులు 581 మంది, క్రైస్తవులు 1,026 మంది ఉన్నారు. ► అందరూ కలిపి మొత్తం 2,62,493 మందికి ఈ ఏడాది వైఎస్సార్ వాహనమిత్ర పథకంలో లబ్ధి చేకూరుస్తున్నాం. గత ఏడాది లబ్ధి పొందలేకపోయిన వారికీ.. ► గత ఏడాది 8,600 మంది మైనారిటీ కార్పొరేషన్ లబ్ధిదారులు, మరో 3,600 మంది బ్యాంక్ ఖాతాల వివరాలు సక్రమంగా లేకపోవడంతో వారికి ఆర్థిక సహాయం అందలేదని రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు చెప్పారు. అందువల్ల ఆ 12,200 మందికి గత ఏడాది మొత్తంతో పాటు ఈ ఏడాది సొమ్ము కూడా శుక్రవారం సాయంత్రంలోగా జమ చేస్తామని చెప్పారు. ► వైఎస్సార్ వాహనమిత్ర పథకంలో గత ఏడాది 2,36,334 మందికి లబ్ధి చేకూర్చగా, వారిలో 11,595 మంది వాహనాలు అమ్ముకున్నారని ఆయన వెల్లడించారు. దీంతో వారు అనర్హులు కాగా, 2,24,739 మందిని అర్హులుగా గుర్తించామని తెలిపారు. ►ఈ ఏడాది 38,605 మంది దరఖాస్తు చేసుకోగా, వారిలో 849 మంది అనర్హులుగా తేలారని చెప్పారు. మిగిలిన 37,756 మందిని అర్హులుగా గుర్తించామని, దీంతో ఈ ఏడాది మొత్తం లబ్ధిదారుల సంఖ్య 2,62,493 కు చేరిందన్నారు. ►కార్యక్రమం ప్రారంభంలో వైఎస్సార్ వాహనమిత్ర పథకానికి సంబంధించిన వీడియోను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పేర్ని నాని, అవంతి శ్రీనివాస్, సీఎస్ నీలం సాహ్ని, రవాణా శాఖ కమిషనర్ సీతారామాంజనేయులు, పలువురు అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. మీ మేలు మరవలేం నేను ఎంఏ చదివాను. ఉపాధి కోసం ఆటో తోలుతున్నా. ఇంత వరకూ నేను ఎప్పుడూ ప్రభుత్వ పథకాల వల్ల లబ్ధి పొందలేదు. తొలిసారి మీ ప్రభుత్వంలో గవర్నమెంటు సొమ్ము పది వేలు తిన్నాను సార్. గతంలో ఇన్సూరెన్స్, ఫిటినెస్ వంటి వాటి కోసం ఇబ్బంది పడేవాళ్లం. ఇప్పుడు ఆ ఖర్చులు మీరిచ్చిన డబ్బులతో పెట్టగలగుతున్నాం. ఆటో డ్రైవర్లకు కూడా వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. ఇన్సూరెన్స్ కోసం బయట రూ.7,300 చెల్లిస్తున్నాం. ప్రభుత్వం ద్వారా చేయిస్తే ఇంకా తక్కువ మొత్తంతోనే వీలవుతుంది. తక్కువ వడ్డీకి రుణాలిప్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అన్ని వర్గాల వారికి మీరు చేస్తున్న మేలు మరచిపోము. – భాగ్యలక్ష్మి, మహిళా ఆటో డ్రైవర్, అనంతపురం. -
రాష్ట్రంలో ట్యాక్సీ.. ఆటోలకు అనుమతి!
రవాణా సేవల పునరుద్ధరణపై ప్రభుత్వం దృష్టి సారించింది. రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల వైపుగా ట్యాక్సీ, ఆటోలకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. జూన్ ఒకటో తేదీ నుంచి మెట్రో రైలు పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఎంటీసీ బస్సు సేవలకు చర్యలు చేపట్టారు. సాక్షి, చెన్నై: రాష్ట్రంలో నాలుగో విడత లాక్డౌన్ అమల్లోకి వచ్చినానంతరం ఆంక్షల సడలింపులు ప్రజలకు ఊరటగా మారాయి. మాల్స్, థియేటర్లు, వినోద కేంద్రాల తప్పా మిగిలిన అన్ని రకాలు దుకాణాలు దాదాపుగా తెరచుకున్నాయి. పరిశ్రమల్లో ఉత్పత్తులకు శ్రీకారం చుట్టారు. విమానాల సేవలు మొదలయ్యాయి. చెన్నై, కోయంబత్తూరు, తిరుచ్చి, మదురై నుంచి విమానాల రాకపోకలు సాగుతున్నాయి. అయితే ఆశించిన మేరకు ప్రయాణికులు విమానాశ్రయాల వైపు వెళ్లడం లేదు. దీంతో అనేక విమాన సేవలు రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి. ఇక జూన్ ఒకటి నుంచి రైళ్ల సేవలు మొదలు కానున్నాయి. ప్రస్తుతానికి చెన్నై మినహా, మిగిలిన మార్గాల్లో వలస కార్మికుల కోసం ప్రత్యేక రైలు పట్టాలెక్కుతున్నాయి. ఈపరిస్థితుల్లో జూన్ ఒకటి నుంచి చెన్నై వైపుగా రైళ్లు దూసుకొచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. వీటిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం రవాణా వ్యవస్థను పునరుద్ధరించేందుకు తగ్గ చర్యలపై దృష్టి పెట్టింది. ట్యాక్సీ, ఆటోలకు ఒకే.. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు తెరచుకున్న దృష్ట్యా ఈ సేవలు క్రమంగా విస్తృతం అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లకు వచ్చే వారి రవాణా కోసం ట్యాక్సీలు, ఆటోలకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. చెన్నై, మదురై, కోయంబత్తూరు, తిరుచ్చి విమానాశ్రయాల వైపుగా ట్యాక్సీలకు అనుమతి ఇచ్చారు. అలాగే, ఆటోలకే ఓకే చెప్పేశారు. ఇక రైళ్ల సేవలు మొదలు కానున్న దృష్ట్యా ఆయా స్టేషన్లకు సైతం ఆటో, ట్యాక్సీలకు అనుమతి ఇస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే చెన్నై నగరంలో మెట్రో రైలు సేవలకు చర్యలు చేపట్టారు. జూన్ ఒకటో తేది నుంచి మెట్రో రైలు పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ రైళ్లకు ఏసీ సౌకర్యం తప్పని సరి. ఇందుకు ప్రత్యామ్నాయ చర్యలపై మెట్రో వర్గాలు సిద్ధమవుతున్నాయి. ఎంటీసీ బస్సు సేవలు... చెన్నై వంటి నగరాల్లో ఎంటీసీ బస్సుల సేవల పునరద్ధరణ కసరత్తులు మొదలయ్యాయి. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా కొన్ని మార్గాల్లో ఎంటీసీ బస్సులు నడుస్తున్నాయి. చెన్నైలో తొలుత ఎంటీసీ సేవలకు శ్రీకారం చుట్టి, ఆ తదుపరి ఇతర నగరాలపై దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఎంటిసీ బస్సు సేవల కోసం ప్రత్యేక యాప్‌ను ప్రకటించబోతున్నారు. జీపీఎస్ సౌకర్యంతో, స్టాపింగ్ వివరాలను ఎప్పటికప్పుడు తెలిసే రీతిలో బస్సుల్లో అమరికలు సాగుతున్నాయి. యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్న వారికి, ఏ మార్గాల్లో బస్సులు పయనిస్తున్నాయో అన్న వివరాలు తెలుసుకునే అవకాశం ఉంది. ఈ యాప్‌ను ఆండ్రాయిడ్ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకున్న వారికి అనుమతి అన్నట్టుగా కసరత్తులు చేపట్టారు. చెన్నై నగరంలో 3200 బస్సులు ఉన్నా, ఇందులో 500 బస్సుల్లో ఈ ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతుండడం గమనార్హం. -
కోల్‌కతా నగర వీధుల్లోకి ఎల్లో టాక్సీలు
కోలకతా(పశ్చిమ బెంగాల్): తిరిగి తమ సేవలను అందించేందుకు ఎల్లో టాక్సీలు సోమవారం నుంచి కోల్‌కతా నగర వీధుల్లోకి రానున్నాయి. అయితే మీటరుపై ప్రస్తుతం ఉన్న ఛార్జీల కంటే 30 శాతం పెంచినట్లు బెంగాల్ టాక్సీ అసోసియేషన్(బీటీఏ) కార్యదర్శి బిమల్ గుహా శుక్రవారం వెల్లడించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్ రవాణా శాఖ సీనియర్ అధికారులు గురువారం సమావేశం నిర్వహించినట్లు చెప్పారు. ఈ సమావేశంలో ఎల్లో టాక్సీల ప్రస్తుత రేటు కంటే మీటర్ రీడింగులపై 30 శాతం పెంపును అధికారులు ప్రతిపాదించినట్లు ఆయన తెలిపారు. (లాక్డౌన్ : మహారాష్ట్ర కీలక నిర్ణయం) ఇక ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం గరిష్టంగా ఇద్దరు ప్రయాణికులను మీటర్ టాక్సీల్లో ఎక్కడానికి అనుమతిస్తామని, వారు వెనుక సీట్లో కూర్చోవాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. కాగా కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మూడవ దశ లాక్డౌన్ ముగిసిన తరువాత నగరంలో టాక్సీ సేవలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక లాక్డౌన్ విధించినప్పటీ నుంచి అత్యవసర పరిస్థితుల్లో కొన్ని టాక్సీలు మాత్రమే నగరంలో ప్రయాణించడానికి ప్రభుత్వం అనుమతించిందన్నారు. ఇక మే 18 నుంచి చార్జీల పెంపుతో ఎల్లో టాక్సీలు సేవలు అందించనున్నాయని ఆయన వెల్లడించారు. -
మారుతీ.. ట్యాక్సీవాలా..!!
న్యూఢిల్లీ: వాహన విక్రయాలు మందగిస్తున్న నేపథ్యంలో కార్ల అమ్మకాలను పెంచుకునే దిశగా ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా ట్యాక్సీ సేవలకు ఉపయోగపడేలా మరో మోడల్‌ను మార్కెట్లోకి తెచ్చింది. దేశీయంగా అత్యధికంగా అమ్ముడయ్యే ఆల్టో కారు మోడల్లో .. ట్యాక్సీ సెగ్మెంట్ కోసం ప్రత్యేక వేరియంట్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆల్టో హెచ్1గా వ్యవహరిస్తున్న ఈ కారును.. ప్రత్యేకంగా ఓలా, ఉబెర్ తదితర ట్యాక్సీ సంస్థలకు సర్వీసులందించే వారికోసం డిజైన్ చేశారు. 800 సీసీ సామర్థ్యంతో పనిచేసే ఈ కారు ధర రూ.3.64 లక్షలు (చెన్నై ఎక్స్‌షోరూం). ప్రస్తుతానికి దీన్ని తమిళనాడు వంటి ఎంపిక చేసిన కొన్ని మార్కెట్లలోనే మారుతీ విక్రయిస్తోంది. బేసిక్ ఫీచర్లు.. రిటైల్ కస్టమర్లకు విక్రయించే బేస్ వేరియంట్ ఆల్టో ఎస్టీడీ ధరతో పోలిస్తే హెచ్1 రేటు సుమారు రూ. 61,000 అధికంగా ఉంటుంది. ఆల్టో ఎస్టీడీ కారు ధర చెన్నైలో రూ.3.03 లక్షలుగా (ఎక్స్‌షోరూం) ఉంది. ఇందులో ఎయిర్ కండీషనింగ్ గానీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ గానీ, కనీసం బాడీ కలర్ బంపర్స్ కూడా ఉండవు. హెచ్1 డిజైన్ కూడా ఇదే తరహాలో బేసిక్ ఫీచర్స్‌తోనే ఉంది. కానీ దీంట్లో పవర్ స్టీరింగ్, ఎయిర్ కండీషనింగ్ ఫీచర్స్ ఉంటాయి. పవర్ విండోస్, మ్యూజిక్ సిస్టంలాంటివి ఆల్టో హెచ్1లో లేవు. మారుతీ సుజుకీ ఈ ఏడాది ఏప్రిల్‌లో భారత్ స్టేజ్–6 కాలుష్య నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా ఉండే ఆల్టో వెర్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భద్రతకు సంబంధించి అదనపు ఫీచర్లు, కొత్త టెక్నాలజీ పొందుపర్చింది. దీంతో భారత్ స్టేజ్ 6 ప్రమాణాలకు అనుగుణంగా ఉండే తొలి ఎంట్రీ లెవెల్ సెగ్మెంట్ కారుగా ఆల్టో నిల్చింది. మూడో మోడల్... ట్యాక్సీ సర్వీసుల సంస్థలు టార్గెట్‌గా మారుతీ సుజుకీ ప్రవేశపెట్టిన కార్ల మోడల్స్‌లో ఆల్టో హెచ్1 మూడోది. మారుతీ ఇప్పటికే ఉన్న మోడల్స్‌లో డిజైర్ టూర్, సెలీరియో హెచ్2 పేరిట ట్యాక్సీలకు సంబంధించి రెండు వేరియంట్స్‌ను విక్రయిస్తోంది. ట్యాక్సీ ఆపరేటర్లకు మైలేజీ కీలకం కాబట్టి.. లీటరుకు దాదాపు 22 కి.మీ. మైలేజీ ఇచ్చే ఆల్టోకు మంచి డిమాండ్ ఉంటుందని మారుతీ ఆశిస్తోంది. ప్రస్తుతం మారుతీ మొత్తం అమ్మకాల్లో వాణిజ్య అవసరాల కోసం విక్రయించే కార్ల విభాగం వాటా సుమారు 8 శాతంగా ఉంది. పరిశ్రమపరంగా చూస్తే మూడేళ్ల క్రితం కార్ల కొనుగోళ్లలో 10–15 శాతం దాకా ఉన్న ట్యాక్సీ ఆపరేటర్ల వాటా 6–8 శాతానికి పడిపోయింది. ముంబై, ఢిల్లీ వంటి కీలక నగరాల్లో కార్లకు డిమాండ్ సంతృప్త స్థాయికి చేరిందన్న అభిప్రాయం నెలకొంది. దీంతో ఓలా, ఉబెర్ వంటి ట్యాక్సీ ఆపరేటర్ల తరఫున సేవలు అందిస్తున్న డ్రైవర్లు చాన్నాళ్లుగా తమ ఆదాయాలు, లాభాలు తగ్గిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, 2030 నాటికి మొత్తం కొత్త వాహనాల అమ్మకాల్లో ట్యాక్సీ ఆపరేటర్ల వాటా 12 శాతానికి చేరొచ్చని రీసెర్చ్ సంస్థ ఐహెచ్ఎస్ మార్కిట్ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ విభాగంలో అవకాశాలు అందిపుచ్చుకోవడంపై మారుతీ ప్రధానంగా దృష్టి పెడుతోంది. మందగిస్తున్న కార్ల అమ్మకాలు.. గడిచిన కొద్ది నెలలుగా కొత్త వాహనాల అమ్మకాలకు డిమాండ్ తగ్గుతూ వస్తోంది. సంవత్సరం ప్రారంభంలో రెండంకెల వృద్ధి సాధిస్తామని ధీమాగా చెప్పినప్పటికీ గత ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా మారుతీ అమ్మకాల వృద్ధి కేవలం 5.3 శాతానికి పరిమితమైంది. ఇక వార్షిక ప్రాతిపదికన చూస్తే ఏప్రిల్‌లోనూ అమ్మకాలు 20 శాతం క్షీణించి నిరుత్సాహపర్చాయి. పరిశ్రమపరంగా చూసినా కూడా ఆల్టో, రెనో క్విడ్ వంటి ఎంట్రీ స్థాయి కార్లకు డిమాండ్ ఒక మోస్తరు స్థాయికి పరిమితమైపోయిందని ఆటోమొబైల్ రంగ వర్గాలు చెబుతున్నాయి. మార్కెట్ లీడర్‌గా ఉన్న మారుతీ సుజుకీ గతేడాది ప్రతి నెలా సగటున 21,000 కొత్త ఆల్టో కార్లను విక్రయించింది. కానీ 2017–18తో పోలిస్తే పెద్దగా వృద్ధి లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. కొత్త కార్ల కస్టమర్లు .. స్విఫ్ట్ లేదా బాలెనో వంటి మరికాస్త ప్రీమియం కార్ల వైపు మళ్లుతుండటమే ఇందుకు కారణం కావొచ్చని పేర్కొన్నాయి. -
క్రమశిక్షణ లేకుండా పోతుంది... బొత్తిగా!
క్రిస్మస్ పండుగకు ముందటి ఒక జ్ఞాపకమిది: ఇంటికి సున్నాలు, ఒంటికి కొత్త బట్టలూ, పంటి కిందికి కేకులూ, రోజ్ కుకీలూ... అబ్బో సందడే సందడి. కొత్తబట్టలు కొనుక్కోవడానికి విజయనగరం ట్యాక్సీలో వెళ్లడం మరుపురాని అనుభూతైతే, ఆ బట్టలు వైజాగ్‌లో కుట్టించుకోవడం ఇంకో మరిచిపోలేని జ్ఞాపకం. కాని, ఒక్క తలకత్తిరింపు ప్రహసనమే మరచిపోలేని పీడకల మాకు. పండక్కి మూడురోజుల ముందు మా ఆస్థాన క్షురకుడు వెంకటేశ్వర్లు మా ఇంటికి వచ్చి నాన్నకీ, నాకూ, మా తమ్ముడికి వరసగా క్షౌరం చేసి వెళ్ళిపోవడం ఎప్పట్నుంచో ఆనవాయితీగా వస్తున్న సంప్రదాయం. ఆ సంవత్సరం ఆ సంప్రదాయానికి చరమగీతం పాడి, షాపు కెళ్ళి తల కత్తిరించుకోవాలనేది మా తమ్ముడి ప్రయత్నం. ఎందుకంటే అక్కడ అమ్మ ఆజమాయిషీ ఉండదు గనుక వాడిష్టం వచ్చినట్లు కత్తిరించుకోవచ్చని వాడి ఆశ.అదెలా సాధించాలా అనే ఆలోచనలోనే వాడుండగానే ఇరవైరెండో తేదీ వచ్చేసింది. కత్తులూ కత్తెర్లూ చేత్తో పట్టుకొని వెంకటేశ్వర్లు మా ఇంటిముంగిట్లో వాలిపోయాడు మాకు కటింగ్ చేయడానికి. వెంకటేశర్లుని చూడగానే మా వాడి ముఖం బ్రహ్మరాక్షసిని చూసినట్లు భయంతో పాలిపోయింది. సరే, ముందుగా నాన్న కూర్చున్నాడు కత్తిరింపుకి. నాన్న తల కత్తిరిస్తున్నంత సేపూ అక్కడే కూర్చొని వెంకటేశ్వర్లుతో బేరాలాడుతూనే ఉన్నాడు మా తమ్ముడు జుత్తు ఎక్కువ తగ్గించేయవద్దని. వెంకటేశ్వర్లు మాత్రం ఉలుకూ పలుకూ లేకుండా తల కత్తిరించడంలో నిమగ్నమైనట్లు యమ యాక్షన్ చేస్తున్నాడు.నేను కొంచెం దూరంగా కూర్చొని పేపర్ చదువుతున్నట్టు నటిస్తూ జరుగుతున్న ప్రహసనాన్ని గమనిస్తున్నాను.అమ్మకు అర్థమైపోయింది తమ్ముడేదో ప్లాన్ చేస్తున్నట్లు.అందుకే ఆ చుట్టుపక్కలే తచ్చాడుతోంది ఏదో పని ఉన్నట్లు.వాడేమో అమ్మ అక్కడకు వచ్చినప్పుడు నోరుమూసుకొని, కొంచెం అటువైపు వెళ్లగానే మళ్లీ బ్రతిమిలాడడం మొదలుపెడుతున్నాడు జాలిగా దీనంగా. నాన్నేమో ఇవేమీ అస్సలు పట్టించుకోకుండా తల అప్పచెప్సేసి కళ్లు మూసుకు కూర్చున్నారు అలవాటు ప్రకారం.అరగంట గడిచింది భారంగా.నాన్న జుత్తు కత్తిరింపు అయిపోయింది. తర్వాత వంతు మా తిప్పడిదే. తిప్పడు తెగించేవాడు. తాడోపేడో తేల్చుకోవడానికి సిద్దపడిపోయాడు. అందరికీ... ముఖ్యంగా అమ్మకి వినిపించేలా గట్టిగా....‘‘వెంకటేశ్వర్లూ నా జుత్తు ఎక్కువ తగ్గించకు. కొంచెం పైపైన తీసేసి వదిలెయ్యి చాలు. చెవుల మీదకు అసలు తీయవద్దు’’ అన్నాడు. అంతే!అమ్మ రయ్యిమని దూసుకొచ్చేసింది స్పాట్‌లోకి.దూసుకొచ్చి భయంకరమైన హుకుం జారీ చేసింది...‘‘వెంకటేశ్వర్లూ వాడికి కటింగ్ ఎప్పుడూ చేస్తున్నట్టే చెయ్యి. ఏమీ మార్చకు. జుత్తు బాగా పెరిగింది. బాగా చెవుల మీదికి తీసెయ్యి’’ అని.అంతే..మా తిప్పడి ముఖం నల్లగా మాడిపోయింది. కళ్లలోకి సర్రన కోపం, చివ్వున కన్నీరూ ఎగదన్నుకొచ్చేసాయి. విసురుగా లేచిపోయాడు స్టూల్ మీద నుండి జుత్తు చెవుల మీదకి ఉంచుకోవడానికి కుదరకపోతే అసలు జుత్తే కత్తిరించుకోనంటూ. దాంతో అమ్మకు పూనకం వచ్చేసింది. ‘‘ఇంట్లో నా మాటకి విలువేమైనా ఉందా. అసలిదంతా ఆ పెద్దవెధవ వల్లే వచ్చింది. డిగ్రీ చదువుతున్న ఆ గాడిదకెలూగు చెప్పలేను. తొమ్మిదో క్లాసు చదువుతున్న ఆ చిన్నగాడిదకి కూడా...’’ ఇలా సాగిపోతుంది వాక్ప్రవాహం.నాన్న మాత్రం తమ్ముడి బాధ పడలేక...‘‘పోనిలేవే పాపం. క్రిస్మస్ కదా ఈ ఒక్కసారీ వాడి ఇష్టం వచ్చినట్టు కట్ చేయించుకోనివ్వకూడదూ. వాడూ పెద్దోడవుతున్నాడు కదా’’ అని అన్నారో లేదో దాడి మొత్తం ఆయన మీదికి మళ్లింది.‘‘నేను చెప్తూనే ఉన్నాను కదా...మీ వల్లే ఈ గాడిదలు ఇలా భయం, భక్తీ లేకుండా తయారవుతున్నారని. క్రమశిక్షణ లేకుండా పోతుంది బొత్తిగా! (ఇది మాఅమ్మ ఫెవరెట్ డైలాగ్). వీళ్లిలా తయారవడానికి కారణం మీరే. మీ వల్లే ఇదంతా’’ఇక తమాయించుకోవడం నా వల్ల కాలేదు.గట్టిగా నవ్వడం మొదలు పెట్టాను.నాతో పాటు నాన్న కూడా.అంతే మా తమ్ముడి సహనం చచ్చిపోయింది. అమ్మని ఎదిరించి ఇటువంటి విషయాల్లో వాడే కాదు నాన్న కూడా ఏమీ చేయలేరన్న విషయం చాలా స్పష్టంగా ఇంకొకసారి అవగతం అయ్యింది. క్రిస్మస్కి కనీసం చెవుల ఉప్పెనలా నిరాశ, నిస్పృహ ఆవహించి, తల విషయం తన తల రాతకి, భగవంతుడికీ వదిలేసి...‘‘వెంకటేశ్వర్లూ ఇంకా చెక్కేయ్. నీ ఇష్టం వచ్చినట్టు చెక్కేయ్. నేనేమైనా అంటే నీ చెప్పిచ్చుకు కొట్టు. కానీయ్’’ అని తల వంచుక్కూర్చున్నాడు.ఆ మాట కోసమే ఎదురు చూస్తున్న వెంకటేశ్వర్లు తన కత్తెరతో వాడి తల మీద విలయతాండవం చేయించాడు. వాడి జుట్టు గుప్పెటకందనంత పొట్టిగా, చెవులకి అంగులంమీదుగా గొరిగేసాడు. చూస్తుండగానే మా తిప్పడి బుర్ర పంపరపనసకాయలా గుండ్రంగా రూపాంతరం చెందింది. దాన్ని చూసిన అమ్మ ముఖం ఆనందంతో దీపావళి మతాబులా వెలిగితే మా తిప్పడిముఖం మాత్రం చీదేసిన చిచ్చుబుడ్డిలా మాడిపోయింది. వాడి క్రిస్మస్ సర్దా అంతా మా ఊరి ఉప్పుటేట్లో కలిసిపోయింది. – పి.కృపాకర్, హైదరాబాద్ -
వీల్ చైర్ ట్యాక్సీ
అనారోగ్యం వల్లో లేదా రోడ్డు ప్రమాదం కారణంగానో కొంతమంది వీల్ చైర్‌కే పరిమితం అయిపోతుంటారు. అలాంటి వారిని ఆసుపత్రికో, ఏదైనా శుభకార్యానికో లేదా మరో చోటుకో తీసుకెళ్లాలంటే చాలా శ్రమతో కూడుకున్న పని. మరోవైపు మిగతా వాళ్లలాగా తాము అన్నిచోట్లకీ వెళ్లలేకపోతున్నామని, నాలుగు గోడల మధ్య బందీలుగా మారిపోయామని, ఎక్కడికెళ్లాలన్నా మరొకరిపై ఆధారపడాల్సి వస్తుందని మానసికంగానూ వీరు కుంగిపోతుంటారు. అయితే ఈ సమస్యలకు పరిష్కారం చూపుతోంది ‘ఈజీ మూవ్’. వీల్‌చైర్‌కే పరిమితమైన రోగులను అవసరమైన చోటుకి సులభంగా తీసుకెళ్లేందుకు వీల్‌చైర్ ట్యాక్సీలను ఈ సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. ముంబైలో ఇప్పటికే ఈ ట్యాక్సీలు సేవలందిస్తున్నాయి. ఇప్పటి వరకు ఏడువేల మంది ఈ సేవలు ఉపయోగించుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఎలా మొదలైంది ఢిల్లీలో 2015లో దివ్యాంగుల 15వ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పోటీలు జరిగాయి. అయితే అక్కడ వారికి అవసరమైన వీల్‌చైర్ లిఫ్ట్‌లు, ర్యాంపులు అందుబాటులో లేవు. నిర్వాహకులు మెట్లపై ప్లేవుడ్ను మాత్రమే పరిచారు. ఇది ఈ సంస్థ కో ఫౌండర్ రోమియో రవ్వను కదిలించింది. వీల్‌చైర్‌కే పరిమితమైన తన స్నేహితుడి చెల్లెలు ఇతరులకు ఇబ్బంది లేకుండా, ఎవరిపై ఆధారపడకుండా వీల్‌చైర్‌పై కాలేజీకి వెళ్లి రావడం చూశారు. చాలా మందికి ఇలాంటి అవకాశం ఉండదు. మిగతావాళ్లకు కూడా ఇలాంటి సౌకర్యం కల్పిస్తే ఎలా ఉంటుందనే మరో ఇద్దరి ఆలోచనలు తోడయ్యాయి. ..దీంతో ‘ఈజీ మూవ్’ కు అంకురార్పణ జరిగింది. కదలలేని స్థితిలో ఉన్న వాళ్లు గౌరవంగా, హుందాగా అనుకున్న చోటుకి వెళ్లేలా సేవలందించడమే తమ లక్ష్యమని నిర్వహకులు పేర్కొంటున్నారు. ఎలాంటి సేవలందిస్తారు వీల్‌చైర్‌కే పరిమితమైన రోగులను తరలించేందుకు కార్లలో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. హైడ్రాలిక్ లిఫ్ట్ ద్వారా వీల్‌చైర్‌తో సహా కారులోకి వెళ్లిపోవచ్చు. భద్రతాపరంగాను ఎలాంటి ఇబ్బందులు లేకుండా కారులో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. డ్రైవర్‌కు ప్రత్యేకమైన శిక్షణ ఇవ్వడం ద్వారా రోగిని కారులోకి భద్రంగా చేర్చడంతో పాటు అవసరమైన సేవలు అందిస్తారు. ఆసుపత్రి, ఎయిర్‌పోర్టుకు తీసుకెళ్లడం.. తీసుకురావడం, దేవాలయాలు, పెళ్లిళ్లు ఇతర ఫంక్షన్లకు తీసుకెళతారు. అంతేకాదు సర దాగా గడిపేందుకు విహారయాత్రకు వెళ్లాలన్నా ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం ముంబాయిలో అందుబాటులో ఉన్న వీల్ చైర్ టాక్సీ సర్వీసును త్వరలో గోవాలోనూ ప్రారంభించనున్నారు. 2019 నాటికి దేశంలోని అన్ని మెట్రో నగరాలకు విస్తరింపచేయాలని సంస్థ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఎంత చార్జీ చేస్తారు ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి 9 గంటలకు వరకు బేసిక్ చార్జి రూ. 250 గా ఉంది. ప్రతీ నాలుగు కి.మీ కు అదనంగా రూ. 30 వసూలు చేస్తారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు రూ. 350 బేసిక్ చార్జి, ప్రతీ నాలుగు కి.మి. కు అదనంగా రూ. 40 చెల్లించాల్సి ఉంటుంది. నాలుగు, ఎనిమిది గంటల అద్దెకు కూడా లభిస్తాయి. అంతేకాదు సొంతకారు ఉన్న వారు తమ కారులో కూడా మార్పులు చేసుకోవాలంటే ఆ సదుపాయమూ ఇక్కడ అందుబాటులో ఉంది. వృద్ధులు, ప్రత్యేక అవసరాలు కల్గిన వారు సులభంగా ప్రయాణించే విధంగా కారులో మార్పులు చేస్తారు. -సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
టాక్సీలో మేకప్ వేసుకుంటుండగా.. విషాదం
బ్యాంకాక్ : టాక్సీలో ప్రయాణిస్తున్న ఓ యువతి కంటికి ‘ఐలైనర్ పెన్సిల్’ సహాయంతో మెరుగులు దిద్దుతుండగా.. ఐలైనర్ పెన్సిల్ కాస్తా కంటిలో గుచ్చుకుంది. సగానికి పైగా పెన్సిల్ కంటిలోకి చొరబడటంతో భరించలేని నొప్పితో తీవ్ర ఇబ్బందులకు గురైందా యువతి. ఈ సంఘటన సోమవారం థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్ నగరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బ్యాంకాక్‌కు చెందిన 20 ఏళ్ల యువతి టాక్సీలో ప్రయాణిస్తోంది. ట్రాఫిక్ జామ్ కారణంగా వాహనం నిదానంగా కదులుతోంది. స్నేహితులను కలవాలన్న తొందరలో ఉన్న ఆమె బ్యాగులో ఉన్న ఐలైనర్‌ను తీసి కంటికి మెరుగులు దిద్దుకోవటం ప్రారంభించింది. ఇంతలో ఆమె ప్రయాణిస్తున్న టాక్సీ కాస్తా ముందున్న ట్రక్కును ఢీ కొట్టింది. దీంతో ఆమె తల ముందున్న సీటుకు తగిలి ఐలైనర్ పెన్సిల్ కంటిలోకి చొచ్చుకెళ్లింది. పెన్సిల్ కంట్లో గుచ్చుకోవటంతో భరించలేని నొప్పి కారణంగా ఆమె గట్టిగా అరవటం మొదలుపెట్టింది. ఆమె పరిస్థితి గమనించిన టాక్సీ డ్రైవర్ వెంటనే అంబులెన్స్‌కు ఫోన్ చేశాడు. కొద్ది సేపటి తర్వాత అంబులెన్స్‌లో ఆమెను దగ్గరలోని ‘రాజవితి’ హాస్పిటల్‌కు తరలించారు. శస్త్రచికిత్స చేసిన వైద్యులు యువతి కంటి నుంచి పెన్సిల్‌ను తొలగించారు. ‘రాజవతి’ ఆస్పత్రి వైద్యులు మాట్లాడుతూ.. కంటిలోని ముఖ్యమైన భాగాలకు ఎలాంటి నష్టం కలుగకపోవటంతో ఆమె కంటిచూపుకు ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదని తెలిపారు. ప్రయాణాల్లో ఉన్నపుడు మేకప్ వేసుకునే వాళ్లకు ఇదొక గుణపాఠమని, కదులుతున్న కారులో ఇలాంటివి చేయకూడదని హెచ్చరించారు. ఇటువంటి సంఘటనలు ఊహించనివని, అన్నింటికి సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. -
కారు దిగలేదని కొట్టి చంపారు
ముంబై : రోజురోజుకు మనుషుల్లో కోపం, అసహనం ఎంతలా పెరుగుతున్నాయో ఈ సంఘటన చూస్తే అర్థం అవుతుంది. కనీసం 18 ఏళ్లు కూడా నిండని ముగ్గురు మైనర్లు కారు త్వరగా దిగలేదన్న కోపంతో కారులోని వారిపై దాడి చేయడమే కాక ఒకరి మృతికి కారకులయ్యారు. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో మంగళవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సురేంద్ర సింగ్(30) అనే వ్యక్తి మరో ఇద్దరు స్నేహితులతో కలిసి కాబ్లో చెంబూరు వెళ్దామని కాబ్ మాట్లాడుకుని, అందులో ఎక్కి కూర్చున్నారు. ఇంతలో మరో నలుగురు యువకులు అక్కడకు వచ్చి కారులో ఉన్న సురేంద్ర, అతడి స్నేహితులను వెంటనే కాబ్లోంచి దిగమన్నారు. అందుకు సురేంద్ర, అతని స్నేహితులు నిరాకరించడంతో ఘర్షణ ప్రారంభమయ్యింది. అది కాస్తా పెద్దదిగా మారడంతో ఆ నలుగురు యువకులు సురేంద్ర, అతని స్నేహితులను విచక్షణారహితంగా కొట్టారు. ఈ గొడవలో సురేంద్ర తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని వెంటనే సమీప రాజవాడి ఆస్పత్రికి తరలించారు. కానీ ఈలోపే సురేంద్ర మరణించాడు. విషయం తేలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలికి చేరుకుని నలుగురు యువకులపై కేసు నమోదు చేశారు. ‘నిందితుల్లో ముగ్గురు మైనర్లు, ఒకరు మాత్రమే మేజర్. వీరి నలుగురి మీద హత్యానేరం మోపబడింది. ముగ్గురు మైనర్లను డొంగ్రిలోని జూవైనల్ హోమ్‌కు తరలించాము. మరో వ్యక్తి క్రిష్ణ పొమన్న బొయన్న(18)ను చెంబూరు కాంప్ ఏరియాకు తరలించామ’ని పోలీసు డిప్యూటీ కమిషనర్(6 జోన్) షహాజీ ఉంపా తెలిపారు. -
‘వాహనం’ ఎగిరింది..
ఎగిరే ట్యాక్సీలో ఆఫీసుకెళ్లే రోజులు దగ్గరపడ్డాయి. మొన్నటికి మొన్న చైనీస్ కంపెనీ ఎహాంగ్ తొలిసారి ఇద్దరిని తమ ఎయిర్ ట్యాక్సీలో విజయవంతంగా కొంతదూరం వెళ్లేలా చేయగా.. తాజాగా విమాన తయారీ సంస్థ ఎయిర్‌బస్ తన ఎయిర్ ట్యాక్సీ ‘వాహన’ను పరీక్షించింది. అమెరికాలోని ఒరెగాన్ రాష్ట్రంలోని పెండెల్టన్ కేంద్రంలో జరిగిన ఈ పరీక్షలో వాహన దాదాపు నిమిషం పాటు గాల్లోకి ఎగిరింది. ఆ తరువాత సురక్షితంగా నేలకు దిగింది. ట్రాఫిక్ చిక్కులను తప్పించేందుకు ఎయిర్‌బస్ సిద్ధం చేస్తున్న వాహన 50 మైళ్ల దూరం వరకూ ప్రయాణించగలదు. డ్రైవర్ లేదా పైలట్ అవసరం కూడా లేకపోవడం ఇంకో విశేషం. మొత్తం ఎనిమిది ప్రొపెల్లర్ల సాయంతో గాల్లోకి ఎగిరే వాహనంలో ఇంధనం విద్యుత్తే. -
ఇక సాండ్ ట్యాక్సీ !
జిల్లాలో ఇసుకను నదులు, వాగులు తేడా లేకుండా తోడేస్తున్నారు. ఇసుకాసురులు అధికార పార్టీ నేతల అనుచరులే కావడంతో అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. ఈ అక్రమ దందాకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం సాండ్ ట్యాక్సీ విధానం అమలు చేయనుంది. ఇసుక అవసరం ఉన్న వారు ఆన్లైన్లో డబ్బులు చెల్లిస్తే ట్రాక్టర్లు, టిప్పర్లలో ఇసుకను నేరుగా ఇంటికే సరఫరా చేస్తారు. సాక్షిప్రతినిధి, నిజామాబాద్: జిల్లాలో ఇసుక దందా అడ్డూ అదుపు లేకుండా సాగుతోంది. నదులు, వాగులు అన్న తేడా లేకుండా ఇష్టారాజ్యంగా ఇసుకను తోడేస్తున్నారు. అధికారిక క్వారీల్లో ఒక్కో పర్మిట్‌పై పదుల సంఖ్యలో ట్రిప్పులు తరలించడం పరిపాటిగా మారింది. ఆయా నియోజకవర్గాల్లో అధికార పార్టీ నేతల ప్రధాన అనుచరులే ఇసుకాసురులు కావడంతో.. రెవెన్యూ, పోలీసు అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. దీంతో జిల్లాలో విచ్చల విడిగా ఇసుక అక్రమ దందా కొనసాగుతోంది. సొం తింటి కలను సాకారం చేసుకునేందుకు సామాన్యులు కొనుగోలు చేయలేనంతగా ఇసుక ధరలు పెరిగి పోయాయి. ఈ నేపథ్యంలో ఈ అక్రమ దందాకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం మరో ఇసుక విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. సాండ్ ట్యాక్సీ పేరుతో అమలు చేస్తున్న ఈ విధానంలో ఇసుక అవసరం ఉన్న వారు ఆన్లైన్లో డబ్బులు చెల్లిస్తే ట్రాక్టర్లు, టిప్పర్లలో ఇసుకను నేరుగా ఇంటికే సరఫరా చేస్తారు. ఈ సాండ్ ట్యాక్సీని అమలు చేసేందుకు భూగర్భ గనుల శాఖ శ్రీకారం చుట్టింది. ఇందుకోసం సుమారు 30–40 మంది సిబ్బందిని ఈ ప్రక్రియకు వినియోగించాల్సి ఉంటుంది. 23 ఇసుక రీచ్‌ల మ్యాపింగ్ సిద్ధం.. నూతన పాలసీ అమలులో భాగంగా జిల్లాలో ఇప్పటికే గుర్తించిన 23 ఇసుక పాయింట్లను ఎంపిక చేశారు. జిల్లాలోని అన్ని మండలాలకు ఈ పాయింట్ల నుంచి ఇసుకను సరఫరా చేయాలని నిర్ణయించారు. మంజీర, పెద్దవాగు, నీలవాగు, గోదావరి, నాళేశ్వర్వాగు, జన్నెపల్లివాగు, పులాంగ్ వాగు, కప్పల వాగు, కలిగోట్ వాగు, మైలారం వాగు, ఒన్నాజీపేట తదితర వాగులు, నదుల్లో ఉన్న 23 పాయింట్లను గుర్తించారు. ఈ పాయింట్ల నుంచి ఆయా మండలాలకు ఇసుక సరఫరా చేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు గనుల శాఖ మ్యాపింగ్‌ను సిద్ధం చేసింది. ఆయా రీచ్‌ల నుంచి గ్రామాలు ఎంత దూరంలో ఉన్నాయి.. ఎన్ని కిలోమీటర్లు రవాణా చేయాల్సి ఉంటుంది.. అనే అంశాలపై కసరత్తు పూర్తి చేశారు. కలెక్టర్ నేతృత్వంలో కమిటీ నూతన విధానం అమలు కోసం జిల్లా స్థాయిలో సాండ్ మేనేజ్మెంట్ కమిటీని ఏర్పాటు చేస్తున్నారు. ఈ కమిటీకి కలెక్టర్ నేతృత్వం వహించనున్నారు. కమిటీ ఆయా రీచ్‌ల నుంచి ఇసుకను రవాణా చేసేందుకు ట్రాక్టర్ల యజమానులతో ఒప్పందం చేసుకుంటుంది. ఇలా ఇసుక రవాణా చేసే వాహనాలకు జీపీఎస్ పరికరాలు అమర్చుతారు. ఒక్కో రీచ్‌కు రీచ్ ఆఫీసర్ బాధ్యులుగా ఉంటారు. జిల్లా ఉన్నతాధికారిని నోడల్ అధికారిగా నియమిస్తారు. సాఫ్ట్వేర్ కంపెనీతో ఒప్పందం.. ఈ విధానాన్ని ఆన్లైన్లో నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ సాఫ్ట్వేర్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. వెర్టోనిక్స్ అనే కంపెనీతో ఎంఓయూ చేసుకుంది. ఆన్లైన్లో ఇసుక కోసం దరఖాస్తు చేసుకుని.. సంబంధిత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తంలో గనుల శాఖకు చెందాల్సిన సీనరేజీ, ట్రాక్టర్ యజమానికి చెల్లించాల్సిన రవాణా చార్జీలు, ఇలా ఎవరి వాటా మొత్తాన్ని వారికి వెళ్లేలా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. ప్రభుత్వం ఇప్పటికే పలు కొత్త కొత్త ఇసుక విధానాలను అమలు చేస్తూ వచ్చింది.. అయితే, అవేవి అక్రమ దందాకు అడ్డుకట్ట వేయలేక పోయాయి. తాజా విధానంతోనైనా ఇసుక దందాకు చెక్ పడుతుందా.. లేక నూతన విధానాన్ని కూడా ఇసుకాసురులు తమకు అనుకూలంగా మార్చుకుని యథేచ్చగా దోపిడీ కొనసాగిస్తారా..? అనేది వేచి చూడాలి. జిల్లా స్థాయి సాండ్ కమిటీ నియామకం కోసం చర్యలు తీసుకుంటున్నామని భూగర్భ గనులశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బి.సత్యనారాయణ ‘సాక్షి’తో పేర్కొన్నారు. ఇసుక రవాణా చేసే ట్రాక్టర్ల యజమానుల నుంచి కూడా దరఖాస్తులు తీసుకుంటామని ఆయన చెప్పారు. -
తరగని చీకటిరాత్రి
అతగాడిని ఈ వుదయమే చూశాను నేను. అతని మొహం చెమటతో కన్నీటి ధారలతో తడిసిపోయి వుంది. అతని ఇంట్లోంచి ఏడుపు వినపడుతోంది. రోజూ ఉదయాన్నే వాహ్యాళికి వెళ్లడం నాకలవాటు. రోజూ అదే సమయానికి ఆ యింటి ముందుకు వస్తూంటాను. సాధారణంగా నాకతడు కనుపించడు. ఆ రోజు అతగాడినలా కలుస్తాననుకోలేదు. కారణం గత సాయంత్రమే రాజు నన్ను యింటి దగ్గర దింపి కారు తీసుకుని వెళ్లిపోయాడు. కెందుఝర్ రోడ్లో జోడాకు తీసుకువెళ్లి తీసుకువచ్చాడు నన్ను. అక్కడ్నుంచి బయల్దేరేముందు టాక్సీ మీటరు విప్పి అంకెలను తలకిందులుగా చేసి, యజమానిని దెబ్బతీసి నాలుగు డబ్బులు చేసుకున్నాడు. అతనికి తెలుసు, నేనేం పట్టించుకోనని. కారణం టాక్సీకి నేను అద్దె కట్టనవసరం లేదు. నన్ను అతిథిగా తీసుకువెళ్లిన మనుషులే టాక్సీ చార్జి చెల్లిస్తారు. రాజు టాక్సీ నడుపుతాడు. తెల్ల ఎంబాసిడరు డీజిల్ గాడీని బాగానే నడుపుతాడు. నేనెక్కడికి వెళ్లాల్సినా అతనే తీసుకువెళతాడు. గోడనానుకుని అతను నిలబడిపోయాడు. అతనింట్లోంచి ఏడుపులు వినబడుతున్నాయి. చిన్నపిల్లవాడిని గుడ్డకప్పి ఆ మనుషులు మౌనంగా తీసుకుపోయారు. నా కాళ్లూ చేతులూ వణకసాగాయి. నాకు ఎటు చూసినా గోడకానుకుని కళ్లు మూసుకుని నిలబడ్డ రాజు విచార వదనమే గోచరించసాగింది. అతని దుఃఖ సమయంలో అతని పక్కన నిలబడలేకపోయానే అన్న భావన నన్ను దోషిగా నిలబెట్టింది.రాజు నలభై–నలభై అయిదేళ్లవాడు. అతని కొడుకు అంతగా చదువుకోలేదు. ‘వాడికి యేదనా ఓ దారి చూపించండి’ అంటూ నన్ను అడుగుతుండేవాడు. వాడు ఎదరకు చదివేదీ లేదు రాజు చదివించేదీ లేదు.త్రోవలో సంత కనబడితే నాకోసం చవకగా కూరలు తెచ్చిపెట్టాడు. తనకోసం ఓ గుమ్మడికాయ కొని తెచ్చుకున్నాడు. సంసారం పెద్దది గుమ్మడికాయలు, బంగాళదుంపలు ఎన్ని ఉన్నా చెల్లిపోతాయి అంటూ చెప్పేడు.ఇంకా యిలా చెప్పేడు.‘మా చంటాడికి వంట్లో బాగోలేదండి. గాడీ నడపకుంటే రోజు గడవదండి. చంటాడిని కనిపెట్టుకుని ఇంట్లో కూర్చుందుకు నాకు కుదరదండి.’జోడా చేరుకునే వరకూ మౌనంగా కారు నడిపేడు. బహుశా చంటిపిల్లవాడి గురించి అతడు ఆలోచిస్తూండవచ్చు. అతని కుటుంబం అంతా ఆకలి బాధతో మాడిపోతూంది. సహాయం చేసేవారెవరూ లేరు. అదే అతని దుఃఖం. గమ్యానికి చేరుకుని శుభ్రంగా తిన్న తరువాత రాత్రి అయ్యేసరికి అతను మామూలు మనిషి అయ్యాడు. ఇంటికి తిరుగు ముఖం పట్టే సమయంలో అతను ఉల్లాసంగానే కనిపించాడు.మేం ఈ నగర పొలిమేరకు చేరుకునేసరికి బాగా చీకటి పడిపోయింది. నన్ను మా యింటిముందు దించి, నా కూరల సంచి నాకందించి, నమస్కరించి సెలవు తీసుకున్నాడు. తెల్లవారే సరికి యిదంతా ఎలా జరిగింది? రాజు మొహం కళావిహీనమయిపోయింది. బహుశా అతను యింటికి చేరేసరికే సంగ్రామం ప్రారంభమయి ఉండాలి. డాక్టరు రావడం, మందు యివ్వడం, మళ్లా డాక్టరు రావడం, మందు మార్చడం... ఇంజక్షను ఇవ్వడం... రాత్రంతా యిదే వరుస... ఒకటే దుఃఖం... బాధ. భళ్లున తెల్లవారడంతో పాటు అతని బతుకు కూడా తెల్లవారిపోయింది. చంటివాడి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.నేను రోజంతా యిదే విషయం మీద ఆలోచిస్తూ అన్యమనస్కంగా ఉండడాన్ని యింట్లో అంతా గుర్తించారు. ఎలాగో అయిదు గంటల వేళకు నేను అతని యింటికి చేరుకున్నాను. అతను ప్యాంటు షర్టు వేసుకుని పైన ఓ గావంచానుంచుకుని బయటకు వస్తూ కనిపించాడు. ఈ వేళప్పుడు అతను ఎక్కడకు బయల్దేరుతున్నాడు? అతని అడుగులు తడబడుతున్నాయి. బహుశా ఆ మనిషి తాగేసి ఉండవచ్చు. లోపల రగులుతున్న దుఃఖాన్ని చల్లార్చుకుందుకు!నన్ను చూసి అప్రతిభుడయ్యేడు. నమస్కరించి పళ్లు బయటపెట్టి నిలబడ్డాడు. ‘సార్! టాక్సీ కావాలా సార్?’‘నువ్విప్పుడు గాడీ తీస్తావా?’‘ఏం ఫర్వాలేద్సార్. స్టీరింగు పట్టుకుని కూర్చుంటే చాలు, బండి నడుస్తుంది.’‘నే చెప్పేది అది కాదు రాజు! ఇవాళే కదా నీ...’‘ఓ... దానికి ఎవరేం చేస్తారు? దాని గురించి చింతిస్తూ కూర్చుంటే బతికున్నవాళ్లు తినేది ఏవిటి? కాలం కలిసి రాలేదు. లేకుంటే వాడెంతటివాడయి వుండేవాడో? రెండున్నర సంవత్సరాలు వాడికి. వాడి మొహంలో ఎంత కళ ఉండేదని?!’అతని కళ్లలో నిరాశానిస్పృహలు గూడు కట్టుకున్నాయి. అంతలో తృళ్లిపడి, నన్ను చూసి పళ్లుయికిలిస్తూ – ‘నడవండి సార్! మీరెక్కడికో బయల్దేరినట్టున్నారు...’‘లేదు రాజూ! నేను నిన్ను చూసి పోదామనే వచ్చాను.’అతని పెదాలు వణకసాగాయి, కళ్లు చెమ్మగిల్లాయి. నేను అతని యజమాని గారేజీకి దారి చూపిస్తున్నట్టుగా అతగాడిని తీసుకుపోయేను.ఇద్దరం మౌనంగా నడుస్తున్నాం. ‘నువ్వు నన్ను తీసుకుని వెళ్లకుండా వుంటే నీకీ విపత్తి వచ్చి వుండేది కాదు. నువ్విక్కడ వుండి వుంటే పరిస్థితి మరోలా ఉండేది. నాకు కబురుపెట్టావు కాదు!’‘ఏం చెప్పమంటారు సార్! నేనింట్లో అడుగుపెట్టేసరికే అంతా జరిగిపోయింది.’నాకు ఒళ్లు మండింది. ‘ఏమయిందీ? నువ్వెందుకు పనికిరాని ఒట్టి బడుద్దాయివి. ఇంట్లో కుర్రాడు అంత జబ్బుగా వుంటే నువ్వు సారా తాగుతావన్నమాట. మీటరులోని నెంబర్లు తారుమారు చేసి నాలుగు రూకలు దొంగిలించింది యిలా సారాకి తగలెయ్యడానికా?’‘అసలు విషయం అదికాద్సార్...’‘రాత్రంతా తాగిన మత్తులో యింట్లో తొంగుని ఉంటావు.’‘లేద్సార్, నిన్న రాత్రి సంగతి మీకు ఎలా చెప్పను సార్? నా కర్మ... నిన్న రాత్రి నేనసలు యింటికే చేరలేద్సార్!’‘అదేవిటి? ఏమయింది?’ తీవ్రంగా అడిగేను.అతను గారేజి తెరిచి లోపలికి వెళ్లకుండా తలుపుకి జేరపడి నేలకేసి చూస్తూ అన్నాడు.‘‘నేను ఆమెను ఆసుపత్రికి తీసుకుపోక పోయివుంటే చచ్చిపోయి వుండేది. మిమ్మల్ని మీ యింటి వద్ద దించి వస్తూ, రోగంతో వున్న నా కొడుక్కి ఏపిల్సు, ద్రాక్షపళ్లు కొని తీసుకుపోదామనుకున్నాను. బజారులోకి వెళ్లేను. తిరిగి వస్తూంటే ఓ ఎనిమిది పది సంవత్సరాల వయసున్న ఆడపిల్ల నా గాడీకి ఎదురుపడింది. నాకు తెలియకుండానే సడెన్ బ్రేక్ పడి గాడీ ఆగింది, కాబట్టి సరిపోయింది. తృటిలో చావును తప్పించుకుందా పిల్ల. దారికి అడ్డంగా వచ్చిన ఆ పిల్లమీద నాకు కోపం ముంచుకొచ్చి టాక్సీ దిగేను, ఆ పిల్ల చెవి మెలేసి ఆమె తల్లిదండ్రుల దగ్గరకు తీసుకుపోదామని! నేను చీదరించుకుంటూ ఆమె దగ్గరకు వెళ్లేసరికి ఆ పిల్ల యేడుస్తూ చెప్పింది –‘మా అమ్మ చనిపోయేలా ఉంది. మా యింట్లో ఎవరూ లేరు. కళ్లు నులుముకుంటూ యేడుస్తూంది. అంతలో ఓ ముసలావిడ ఒంగిన నడుముతో నడుచుకుంటూ నా దగ్గరకు వచ్చింది. సరిగ్గా మా అమ్మలాగా ఉందామె. ‘పదవా! ఎక్కడున్నావే? నడు... త్వరగా నడు... నాయకా! కాస్తంత ముందుగా రావచ్చు గదా? రా... రా...’ అంటూ నా ముందు నుంచి ఎదరకు నడిచిందామె. ఆమె నన్నలా ఎందుకు పిలిచిందో నాకు అర్థం కాలేదు. ఇంట్లోకి వెళ్లి చూస్తే మా అందరి కొంపల్లాగే దరిద్రం ఉట్టిపడుతూ కనిపించింది. పద్మ తల్లి మంచం మీద గోడకు జేరగిలబడి కూర్చునుంది. ఆమె ఆయాసపడుతూ కనిపించింది. బింది కుండలా ఉన్న నిండు చూలాలు. ‘నడమ్మా నడు. పాపం ఈయన దేవుడిలా వచ్చేడు. నేను నీతో వస్తాను. పద్దవా! నువ్వు తమ్ముడి దగ్గరే ఉండు. మీ నాన్న వస్తే ఆసుపత్రికి పంపు. పద్దవా! నువ్వెళ్లి ఆ బిసియామాని పిల్చుకురా! నేనొంటరిగా దీన్ని తీసుకుపోలేను.’నేను పెదవి విప్పి మాట్లాడలేకపోయాను. నిజంగానే దేవుడున్నాడు, కష్టంలో వున్నవారిని ఆదుకునేందుకు ఎవరినో ఒకరిని ఆయనే పంపుతూంటాడు’’‘అయితే నువ్వామెను ఆసుపత్రికి తీసుకుని వెళ్లాలన్నమాట’‘అదే కదా సార్ చెబుతున్నాను. ఆ ముసలామె, మరో బిసియా మా ఇద్దరూ కలిసి ఎలాగో సాయం పట్టి ఆమెను నా బండిలో కూర్చోబెట్టేరు. ఇద్దరూ చెరొక పక్కా కూర్చున్నారు. ‘పోనీ నాయనా! త్వరగా తీసకునడు’ అంది ముసలామె. ఆసుపత్రికి చేరేసరికి రాత్రి ఎనిమిది గంటలు కావచ్చింది. వాళ్లామెను దించేసుకునుంటే నేను నా యింటికి పోయివుందును కాని ముసలామె అంది –‘మగాడవు నువ్వుంటే కాస్త ధైర్యంగా ఉంటుంది. డాక్టరుగారితో కాస్తంత మాట్లాడి పెట్టు నాయనా.’ విధిలేక ఆమె వెంట వెళ్లాను. డాక్టర్లు ఆసుపత్రుల సంగతి గురించి నేను మీకు చెప్పనవసరం లేదు కానీ ఒక అదృష్టం ఏమిటంటే, ఎంబాసిడరులోంచి దిగిన రోగి కాబోలని అనుకుంటాను వాళ్లు కాస్తంత సానుభూతి చూపేరెందుకనో! ‘తీసుకురండి... తీసుకురండి!’ అన్నారు.చూస్తూనే డాక్టరు, నర్సు ఇద్దరూ అన్నారు –‘వెంటనే పురుడొస్తుంది. ఇంజక్షను, సెలయిన్ బాటిలు వగైరాలు వెంటనే కావాల్సి ఉంటుంది. ఆసుపత్రిలో మందులు నిండుకున్నాయి. ఆమెను వెంటనే స్ట్రెచరు మీదలోపలకు తీసుకు నడవండి’ అంటూ స్టాఫ్‌కి ఆర్డరిచ్చి డాక్టరుగారు నన్ను చూసి తీవ్రంగా చెప్పారు. ‘ఈ చీటిలోని మందుల్ని ‘బస్వారి లాల్ మెడికల్’ నుంచి త్వరగా తీసుకురావాలి అని పురమాయించి డాక్టరు నర్సూ లోపలకు హడావుడిగా నడిచారు. ముసలావిడ నాకు చెప్పింది. ‘వెళ్లు నాయనా ఇంకా అలా చూస్తావేమిటి?’చీటిని వుండచుట్టి ఆమె మొహానవేసి కొట్టి ఉండేవాడినే, దోవే పోయేవాడిని నన్ను యింత దూరం లాక్కొచ్చింది చాలక, ఈ అధికారం ఏమిటి నా మీద? డబ్బెవడిస్తాడు వీళ్ల బాబు..?’అంతలో దీనంగా యేడుస్తూ దారిలో నిలబడ్డ ‘పద్దవా’ మొహం నా కళ్లముందుకొచ్చింది. ‘మా అమ్మ బతకదు. చనిపోయేలా ఉంది’ అన్న ఆమె మాటలు గుర్తుకొచ్చాయి.నేను వెంటనే బండి తీసుకుని బయల్దేరాను. వాటన్నిటికీ రెండొందలు పైన ఖర్చయింది. తీసుకుని వారికందించాను. లోపల ప్రసవం జరుగుతూంది. బయట నేను నిలబడ్డాను. ఎలా వదిలేసి రాగలను? మళ్లా ఏదైనా అవసరం వస్తే, నేను తప్ప అక్కడ యింకెవ్వరున్నారు? రాత్రి పన్నెండు గంటల పది నిముషాలకు మగపిల్లవాడు పుట్టేడు. ఆ బిడ్డడు నా బిడ్డ అయినట్టు. ముసలావిడ నా దగ్గరకు వచ్చి అంది. ‘ఎలాగయితేనేం నాయనా, పుణ్యం కట్టుకున్నావు. నువ్వు యింటికెడతావు యిప్పుడు, కానీ ఆమె ఒంటరిగా నీతో వెళ్లేందుకు భయపడవచ్చు. నేనూ కాస్తంత నడుము వాలుస్తాను. ఉదయాన్నే అయితే నేనూ ఆమె వెంట వస్తాను.’ నేనేమీ మాట్లాడలేదు. ముసలావిడను ‘పద్దవా’ యింటి దగ్గర దింపేశాను. తిరిగి నేను గాడీలో కూర్చుంటూంటే ముసలావిడ అంది.‘మళ్లీ ఎక్కడికి బయల్దేరావు? ఇంట్లోకి రా బాబు!’‘నేను నా యింటికి పోతున్నాను.’‘నీ యింటికేవిటీ?నువ్వు ‘పద్దవా’ బాబాయివి కాదా? నిన్ను వాళ్లు చీటి యిచ్చి పంపారు కదా! నువ్వు పద్మ వూరు నుంచి రాలేదా? ‘పద్దవా’ తండ్రి అయిదారు మాసాలయింది, దేశం పట్టిపోయేడు, నువ్వు ‘పద్దవా’ బాబాయివి కావా ఏమిటి?’‘కాదమ్మా! నేను ‘పద్దవా’కి యేమి కాను. ఈ దారినే పోతూ గాడీని ఆపేను. మీరు పిలిస్తే మీ మాట కాదనలేకపోయాను. సరే నే వస్తాను.’దీపస్తంభం దగ్గర ముసలావిడ బుగ్గలు నొక్కుకుని ‘ఆ’ అంటూ నిలబడి చూస్తూండిపోయింది. నేను అప్పటికీ యింటికి పెందరాళే చేరుకుని ఉండేవాడిని. యోగం లేదు. అది మరో గొడవ. ప్రభుత్వ ఉద్యానవన కాలనీకేసి వెళ్లి చాలా కాలం అయింది. ఆ కాలనీలో మా మావ వరస ఒకరుంటున్నారు. ఆ యింటిని చూసుకుంటూ వస్తున్నాను. ఆ రాత్రివేళ ఆ యింటి ముందు జనం గుమిగూడి ఉన్నారు. ఏవిటయిందని చూద్దును కదా, మా లక్ష్మణ మావ కాలం చేశాడు. నేను గాడీ ఆపుకుని కిందకు దిగాను. మా మావ కొడుకు సుదామ వచ్చి నన్ను వాటేసుకుని భోరుమన్నాడు. మరొక వలలో చిక్కాను. పాడిని లేపుతారు. నేను మోయక తప్పదు. శ్మశానానికి చేరుకునేసరికి రాత్రి మూడు గంటలయింది. తిరిగి వచ్చేసరికి వెలగొచ్చేసింది. తడి గావంచా చుట్టబెట్టుకుని యిల్లు చేరుకునేసరికి యిక్కడ జరగాల్సింది కాస్తా జరిగిపోయింది’’రాజు మొహం వాల్చుకుని నిలబడి ఉన్నాడు. వెర్రివాడు కాకపోతే ఏమిటి? ఆ రాత్రి అతని బతుకులో చిమ్మచీకటిని మిగిల్చింది. తరగని చీకటి రాత్రి అయింది. గాడీ యజమాని తన జమాఖర్చులు తీసుకున్నాక పెద్దగా యేమీ మిగల్లేదు. ‘సార్! మీరు ఎక్కడికైనా వెళ్లాలా సార్?’ నాకేసి ఆశగా చూస్తూ అడిగాడు అతను.నేను రాజు కళ్లలోకి చూడలేక తల కిందకు దించుకున్నాను. నిజం! ఆ దేవుడు కూడా అపరాధ భావంతో రాజు ముందు తలవంచక తప్పదు! ఒడియా కథాసంకలనం తరగని చీకటిరాత్రిసౌజన్యంతో... ‘మా అమ్మ చనిపోయేలా ఉంది. మా యింట్లో ఎవరూ లేరు.’ కళ్లు నులుముకుంటూ యేడుస్తూంది. అంతలో ఓ ముసలావిడ ఒంగిన నడుముతో నడుచుకుంటూ నా దగ్గరకు వచ్చింది. సరిగ్గా మా అమ్మలాగా ఉందామె. ఒడియా మూలం: చంద్రశేఖర్ రథ్ అనువాదం: మహీధర రామశాస్త్రి -
మరోసారి సత్తా చాటిన దుబాయ్
-
మరోసారి సత్తా చాటిన దుబాయ్
దుబాయి: సాంకేతిక అభివృద్ది, వినియోగంలో టాప్ప్లేస్ లో దూసుకుపోతున్న దుబాయ్ మరోఘనతను సాధించింది. ప్రపంచంలోనే మొట్టమొదటి డ్రైవర్ రహిత గగన విహంగ వాహనం (ఫస్ట్ సెల్ఫ్ ప్లయింగ్ టాక్సీ) సోమవారం ప్రారంభించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అటానమస్ ఫ్లయింగ్ ట్యాక్సీ సేవలను ప్రారంభించి ఇన్నోవేషన్ లో అరబ్ ప్రపంచాన్ని శిఖరాగ్రాన నిలిపింది. అటానమస్ ఎయిర్ టాక్సీని (ఏఏటీ) దుబాయ్రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ విజయవంతంగా పరీక్షించింది. అయితే ఎపుడు అందుబాటులోకి వచ్చేది ఇంకా స్పష్టం చేయలేదు. అత్యాధునిక టెక్నాలజీని, ఆనందాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంలో తాము మరో మైలురాయిని అధిగమించామని దుబాయ్ రాజు సంతోషం వ్యక్తం చేశారు. 18 ప్రొపెల్లర్లతో జర్మన్ డ్రోన్ సంస్థ వోలోకాప్టర్ దీన్ని అభివృద్ధి చేసింది. చిన్న, రెండు-సీటర్ హెలికాప్టర్ కాబిన్తో దీన్ని రూపొందించింది. దుబాయ్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మహ్మద్ కోసం ఏర్పాటు చేసిన వేడుకలో తొలి టెస్ట్ రన్ నిర్వహించారు. టెస్ట్ రన్లోఈ వాహనం సుమారు 200 మీటర్ల ఎత్తుకు చేరుకుంది. అలాగే విపత్కర పరిస్థితుల్లో ఆదుకునేలా బ్యాక్బ్యాటరీలు, రోటర్స్, రెండు పారాచూట్లు లాంటిరక్షణ పరికరాలు కూడా జోడించింది. డ్రైవర్ రహిత ఎగిరే ట్యాక్సీ పనితీరును, ఆపరేషన్‌ను గ్రౌండ్ నుండి మానిటర్ చేసే వ్యవస్థ ఉంటుంది. గరిష్టంగా 30 నిమిషాల పాటు ఎగురుతుంది. 2021 నాటికి ఒక మానవరహిత డ్రోన్‌ను మార్స్ మీదికి పంపాలని దుబాయ్ పథకాలు రచిస్తోంది. తద్వారా అంతరిక్షంలో తొలిసారి అడుగుపెట్టబోతోంది. నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడం , కరెంట్ టెక్నాలజీని స్వీకరించడం దేశ అభివృద్ధికి దోహదం చేయడం మాత్రమేకాకుండా భవిష్యత్ తరానికి వంతెన వేస్తుందని దుబాయ్ రాజు షేక్ హందాన్ చెప్పారు. కాగా దుబాయ్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బిల్డింగ్, ప్రపంచపు అతి పెద్ద మానవ నిర్మిత దీవి ఇలా అనేక రికార్డులను సాధించిన సంగతి తెలిసిందే. -
స్పైస్ జెట్ ట్యాక్సీ ఆఫర్..
ముంబై : విమాన ప్రయాణికులు ఎయిర్ పోర్టుకు చేరుకోగానే ట్యాక్సీ కోసం వెతుకులాడుతుంటారు. అలా వెతికే అవసరం లేకుండా విమాన టిక్కెట్ కొనుగోలు చేసినప్పుడే, ట్యాక్సీ ని కూడా బుక్ చేసుకునే సదుపాయం కల్పించనుంది స్పైస్ జెట్. ఈ వినూత్నమైన ఆఫర్ ను విమాన ప్రయాణికుల ముందుకు స్పైస్ జెట్ త్వరలోనే ప్రవేశపెట్టబోతోంది. దీనికోసం క్యాబ్ అగ్రిగేటర్ "మై టాక్సీఇండియా (ఎంటీఐ)" తో ఒప్పందం కుదుర్చుకుంది. స్పైస్ జెట్ మొత్తం దేశంలో 41 గమ్యస్థానాలకు,300 డైలీ విమానాలను నడుపుతోంది. దానిలో ఆరు ఇంటర్నరేషనల్ విమానాలు ఉన్నాయి. టైర్ 2, టైర్ 3 సిటీల నుంచి కస్టమర్లను అధికంగా ఆకట్టుకోవడానికి, రెవెన్యూలను పెంచుకోవడానికి స్పైస్ జెట్ ఈ ఆఫర్ ను ప్రయాణికుల ముందుకు తీసుకురాబోతుంది. ఈ ఆఫర్ తో ప్రయాణికులు గమ్యస్థానానికి చేరుకోగానే ట్యాక్సీ అందుబాటులో ఉంటుంది. అప్పుడు వెతుకునే అవసరం లేకుండానే ప్రయాణికులు ప్రశాంతంగా గమ్యస్థానాలకు చేరిపోయే వీలుంటుంది. ట్యాక్సీ అవసరమైన వారు టిక్కెట్ కొనుగోలు సమయంలోనే ట్యాక్సీని బుక్ చేసుకోవచ్చని స్పైస్ జెట్ ప్రెసిడెంట్ అమిత్ శ్రీవాత్సవ్ తెలిపారు. ఈ ఆఫర్ ను త్వరలోనే ప్రవేశపెడతామన్నారు. టైర్ 2, టైర్ 3 సిటీల్లో మధ్యతరగతి వినియోగదారులను ఎక్కువగా ఆకట్టుకోవడానికి ఈ సర్వీసు ఉపయోగపడుతుందని శ్రీవాత్సవ్ పేర్కొన్నారు. ఎంటీఐ ట్యాక్సీ అగ్రిగేటర్ గా 2013నుంచి తన సేవలు అందిస్తోంది. 119 సిటీల్లో ఈ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. 454 పైగా క్యాబ్ ఆపనేటర్లను ఈ సంస్థ కలిగి ఉంది. -
ఈ రోజుల్లో ఇలాంటి ఆలోచనా..!
టెహ్రాన్: ట్యాక్సీ అనగానే ఇప్పుడు తొలిసారి వేసే ప్రశ్న.. వైఫై ఉందా.. వీడియో కోచా అని.. ఎందుకంటే.. తీరిక లేకుండా చిన్నసైజు నుంచి పెద్ద సైజు ఎలక్ట్రానిక్ మాధ్యమాలకు మన జీవితాన్ని ఎప్పుడో అర్పించేశాం. మంచినీళ్లు లభించకున్నా ఉండగలరేమోగానీ.. చేతిలో ఓ స్మార్ట్ ఫోన్ దానికి డేటా సపోర్ట్ లేకుంటే మాత్రం క్షణమైనా నిజంగా గడ్డుకాలమేనేమో అనిపిస్తుంది. మానసిక అస్తిత్వాన్ని ఇంతగా కోల్పోయి మనం ఫార్వార్డ్ కల్చర్‌లోకి దూసుకెళుతున్నాం అని చెప్పుకుంటున్న ఈ రోజుల్లో.. ఇరాన్లో ట్యాక్సీ డ్రైవర్ మాత్రం తన ప్రయాణీకులకు ఒత్తిడి నుంచి విముక్తి ప్రసాధించే చక్కటి సౌకర్యాన్ని ఏర్పాటుచేశాడు. ఎలాంటి ఒత్తిడినైనా దూరం చేయడమేకాకుండా చక్కటి జ్ఞానం అందించగల పుస్తకాలను తన క్యాబ్‌లో పెట్టాడు. ఇదంతా ఎందుకని అంటే.. పుస్తకాలు ప్రజలను ఒత్తిడి నుంచి దూరం చేయగలవని తన విశ్వాసం అని చెప్పాడు. సాహెల్ ఫిల్సూఫ్ అనే ఈ క్యాబ్ డ్రైవర్ ఏకంగా దాన్ని ఒక మొబైల్ లైబ్రరీగా మార్చేశాడు. దాదాపు 50 పుస్తకాలు అందులో భద్రపరిచాడు. ఈ ట్యాక్సీ ఎక్కిన వారు తమ ఆలోచనకు తగిన పుస్తకాలను తీసుకొని ఏం చక్కా చదువుకోవచ్చు. ఈ పుస్తకాల్లో సైకాలజీ, పిల్లల పుస్తకాలు, చరిత్రకు సంబంధిచిన పుస్తకాలు ఉంచాడు. అందుకే తన ట్యాక్సీని మహిళలు, యువకులు ఎక్కువగా ఇష్టపడతారని అతడు చెప్పుకొచ్చాడు. -
'అలా వసూలు చేస్తుంటే ఏం చేస్తున్నారు?'
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పలు రకాల ట్యాక్సీలు ఇబ్బడి ముబ్బడిగా ఛార్జీలను వసూలు చేస్తుంటే ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉబర్, వోలా వంటి ట్యాక్సీలు ఇష్టం వచ్చినట్లు ఛార్జీలు వసూలు చేస్తుంటే అలా చేయకుండా ఉండేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో వివరాలు అందజేయాలంటూ నోటీసుల్లో పేర్కొంటూ విచారణ ఈ నెల 25కు వాయిదా వేసింది. -
ఇక ఉబర్ బైక్ ట్యాక్సీలు!
బ్యాకాక్: ప్రయాణికులను గమ్య స్థానానికి చేర్చడంలో ఇటీవలి కాలంలో ఆన్లైన్ ట్యాక్సీ సర్వీస్‌ల జోరు పెరిగిపోయింది. అమెరికాకు చెందిన ప్రముఖ ట్యాక్సీ సర్వీస్ సంస్థ ఉబర్.. మోటార్ బైక్ ట్యాక్సీలను సైతం ప్రవేశపెడుతోంది. థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో మోటార్ బైక్ ట్యాక్సీ సర్వీస్‌ను ఉబెర్ బుధవారం ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. ఇప్పటికే వేల మంది బైక్ డ్రైవర్లను ఈ ప్రాజెక్టు కోసం సంస్థ నియమించుకుంది. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ సర్వీస్ ప్రయోజనకరంగా ఉంటుందని ఉబర్ భావిస్తోంది. కారు ట్యాక్సీ సర్వీస్‌తో పోల్చినప్పుడు మోటార్ బైక్ ట్యాక్సీ సర్వీస్ ధరలు తక్కువగా ఉంటాయని సంస్థ ప్రతినిధి డగ్లస్ మా తెలిపారు. త్వరలోనే ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్నటువంటి ఆసియాలోని ఇతర ప్రాంతాల్లోకి సైతం ఈ సేవలను విస్తరించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బైక్ ట్యాక్సీ సర్వీస్‌తో దూసుకుపోతున్న తమ పోటీదారు గ్రాబ్ టాక్సీని ఎదుర్కొనేందుకే ఉబెర్ ఈ నిర్ణయం తీసుకుందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. అయితే, మోటార్ బైక్ ట్యాక్సీల వలన తమ ఉపాధి దెబ్బతింటుందని స్థానికంగా ఉన్నటువంటి ట్యాక్సీవాలాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
2వ అంతస్తు
మిస్టరీ ట్యాక్సీ వచ్చి ఏడంతస్తుల భవంతి ముందు ఆగింది. డ్రైవర్ పక్కన కూర్చున్న శిఖర్ డబ్బులిచ్చి కిందికి దిగాడు. ఓసారి బిల్డింగ్ వైపు చూసి, ట్యాక్సీ వెనుక డోరు తెరిచాడు. కాలికి అడ్డు పడకుండా చీరను కాస్త పైకి లాక్కుని కారు దిగింది, శిఖర్ భార్య పూనమ్. డిక్కీలో ఉన్న లగేజి తీసి కింద పెట్టాడు డ్రైవర్. ట్యాక్సీ వెళ్లిపోయింది. చెరో రెండు బ్యాగులూ పట్టుకుని భవంతి వైపు నడిచారు దంపతులిద్దరూ. ‘‘వావ్... భలే ప్రశాంతంగా ఉంది శిఖర్. మొత్తానికి మంచి చోటు సెలెక్ట్ చేశావ్’’ అంది పూనమ్ ఆనందంగా. ‘‘మరేమనుకున్నావ్ మీ ఆయనంటే. ఇక్కడికి నాకు ఆఫీసు చాలా దగ్గర. నీకు షాపింగ్ కాంప్లెక్సులు, డిపార్ట్మెంట్ స్టోర్లూ అంతకంటే దగ్గర. పైగా బోలెడంత ప్రశాంతత. మీ ఆయన ఏం చేసినా అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది కదా’’ అన్నాడు శిఖర్. ‘‘చాలు చాలు. ఇప్పటికే బాగా ఎక్కువయ్యింది సొంత డబ్బా. ముందు ఫ్లాట్‌కి వెళ్దాం పద. ఈ లగేజీ మోయలేక పోతున్నా’’ అంది పూనమ్ అతి కష్టంగా బ్యాగ్స్ తీసుకెళ్తూ. అంతలో ఓ వ్యక్తి ఎదురొచ్చాడు. ‘‘హలో... కొత్తగా వచ్చినట్టున్నారు. ఏమైనా హెల్ప్ కావాలా?’’ అన్నాడు స్మైల్ ఇస్తూ. శిఖర్, ప్రీతి ముఖాలు చూసు కున్నారు. ఇద్దరిలోనూ సంతోషం. ఏరియా, ఇల్లే కాదు... మనుషులు కూడా బాగున్నారు అనుకున్నారు మనసుల్లో. ‘‘ఫరవాలేదండీ. మేం తీసుకెళ్తాం, థాంక్యూ’’ అన్నాడు శిఖర్. అతను తల అడ్డంగా ఊపాడు. ‘‘మీరేం మొహమాట పడాల్సిన అవసరం లేదండీ. పాపం ఆవిడ్ని చూడండి! ఆ బ్యాగ్స్ మోయలేకపోతున్నారు. నేను తెస్తాలెండి’’ అంటూ పూనమ్ చేతిలోని బ్యాగ్స్‌ని చనువుగా అందుకున్నాడు. ‘‘వద్దండీ. నేను తీసుకెళ్తాను’’ అంది పూనమ్ మొహమాటంగా. ‘‘భలేవారండీ. ఒకచోట ఉండాల్సిన వాళ్లం. ఈమాత్రం సాయం చేసుకోకపోతే ఎలా’’ అంటూ బ్యాగ్స్ పట్టుకుని లోనికి నడిచాడా వ్యక్తి. లిఫ్ట్ సమీపిస్తుండగా అడిగాడు... ‘‘ఏ ఫ్లోర్?’’ ‘‘సెకెండ్ ఫ్లోర్. ఫ్లాట్ నంబర్ 201’’ శిఖర్ చెప్పాడో లేదో... ‘‘సెకెండ్ ఫ్లోరా?’’ అంటూ చేతిలోని బ్యాగ్స్‌ని కింద పెట్టేశాడతను. ‘‘సారీ బ్రదర్. నాకు అర్జంటుగా ఓ పని గుర్తొచ్చింది. వెంటనే వెళ్లాలి. మీరు లిఫ్ట్‌లో పెకైళ్లిపోండి. మళ్లీ కలుస్తా’’ అనేసి వాళ్ల స్పందన కోసం ఎదురు చూడకుండా వడివడిగా వెళ్లిపోయాడు. అతడు ఎందుకంత కంగారు పడ్డాడో, ఉన్నట్టుండి ఎందుకు వెళ్లిపోయాడో అర్థం కాలేదు ఇద్దరికీ. సరేలే మనకెందుకు అనుకుని లగేజ్ తీసుకుని లిఫ్ట్‌లో సెకెండ్ ఫ్లోర్‌కి బయలుదేరారు. ‘‘వావ్... పాలక్ పన్నీర్ అదిరింది డియర్. ఏమైనా నీ వంటే వంట’’... మురిసిపోతూ భార్యను పొగడుతూ తింటున్నాడు శిఖర్. ఆ కాంప్లిమెంట్స్‌ని ఎంజాయ్ చేస్తోంది పూనమ్. ‘‘పాలక్ పన్నీర్ అంటే ఇంత పిచ్చేంటి శిఖర్ నీకు? మూడు పూటలా పెట్టినా తింటావే’’ అంది నవ్వుతూ. శిఖర్ ఏదో అనబోయాడు. అంతలో కాలింగ్ బెల్ మోగింది. శిఖర్ లేవబోయాడు. ‘‘నేను చూస్తాలే ఉండు’’ అంటూ పూనమ్ లేచి వెళ్లి తలుపు తీసింది. ఎదురుగా ఒక మహిళ. ‘‘ఎవరు కావాలండీ?’’ అంది పూనమ్ ఆమెని తేరిపార చూస్తూ. ‘‘మేము 205లో ఉంటామండీ. అంటే లిఫ్ట్ పక్కనుంది కదా... ఆ ఫ్లాట్ అన్నమాట. నిన్ననే మా ఫ్రిజ్ పాడైపోయింది. మీ దగ్గర కొంచెం కూల్ వాటర్ ఉంటే ఇస్తారా?’’ అడిగిందామె మొహమాటపడుతూ. ‘‘దానిదేముంది! ఇప్పుడే తెస్తాను ఉండండి’’ అంటూ లోనికి వెళ్లింది పూనమ్. ఫ్రిజ్‌లోంచి ఓ వాటర్ బాటిల్ తీసుకుని వచ్చి ఇచ్చింది. ‘‘చాలా థ్యాంక్సండీ. మళ్లీ కలుస్తాను’’ అని చెప్పి వెళ్లిపోయిందామె. తలుపేసి వచ్చి భోజనం దగ్గర కూర్చుంది పూనమ్. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ పూర్తి చేసి పడకల మీదకు చేరారు. కాసేపటికి నిద్రలో జారుకున్నారు. అర్ధరాత్రి కావస్తుండగా ఉలిక్కిపడి లేచింది పూనమ్. ‘‘శిఖర్... శిఖర్... త్వరగా లే’’ అంటూ భర్తని పట్టి కుదిపింది. అతడు కంగారుగా లేచాడు. ‘‘ఏమైంది పూనమ్’’ అన్నాడు ఆతృతగా. ‘‘అది విను... కుక్క. ఎక్కడో కుక్క ఏడుస్తోంది. నాకు భయమేస్తోంది’’ అంది బెరుకు బెరుకుగా. శిఖర్ ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. ‘‘కుక్కలు ఒక్కోసారి అలానే ఏడుస్తాయి. వాటికీ భయాలూ బాధలూ ఉంటాయిగా. దీనికే భయపడితే ఎలా? ప్రశాంతంగా పడుకో’’ అంటూ పడుకోబెట్టాడు. పడుకుందే కానీ నిద్ర పట్టడం లేదు పూనమ్‌కి. ఆ కుక్క హృదయ విదారకంగా ఏడుస్తోంది. ఆ ఏడుపు భయానకంగా ఉంది. దానికే బెదిరిపోతుంటే... ఉన్న ట్టుండి ఎవరో నడుస్తున్నట్టుగా అలికిడి. ఘల్లుఘల్లుమంటూ గజ్జల సవ్వడి. ఆ సవ్వడి గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. నిలువెల్లా వణికిపోయింది పూనమ్. భర్తతో చెబుదామనుకుంది. అప్పటికే అతడు నిద్రలోకి జారిపోయాడు. దాంతో గుండె చిక్కబట్టుకుని ఉండిపోయింది. నిండా దుప్పటి కప్పేసుకుని, నిద్రపోయే ప్రయత్నం మొదలుపెట్టింది. మరుసటి రోజు... ‘‘హలో... మీరే కదూ సెకెండ్ ఫ్లోర్‌లోకి కొత్తగా వచ్చింది?’’ ఆఫీసుకు వెళ్తోన్న శిఖర్‌కి సెండాఫ్ ఇవ్వడానికి కిందకు వచ్చిన పూనమ్‌ని పలుకరించింది వైశాలి. అవునన్నట్టు తలూపింది పూనమ్. ‘‘అయినా ఆ ఫ్లోర్లో తీసుకున్నా రెందుకు? ఇంకా వేరే ఫ్లాట్స్ ఉన్నాయిగా ఖాళీగా’’ అందామె. ‘‘ఏం... ఆ ఫ్లోర్లో తీసుకుంటే ఏమయ్యింది?’’ అంది పూనమ్. ‘‘రెండో అంతస్తులో ఎవరూ ఉండరండీ. ఉండలేరు కూడా. అందుకే కదా, అందులో అన్ని ఫ్లాట్లూ ఖాళీగానే ఉన్నాయి!’’ అయోమయంగా చూసింది పూనమ్. ‘‘అదేంటి? వేరేవాళ్లు కూడా ఉన్నారు కదా! రాత్రి ఒకావిడ వచ్చి నన్ను కూల్ వాటర్ కూడా అడిగింది.’’ చురుక్కున చూసింది వైశాలి. ఆ చూపులో ఆశ్చర్యం, భయం, ఆందోళన... ఇంకా ఏవేవో కనిపిస్తున్నాయి. ‘‘ఏ ఫ్లాట్ అని చెప్పింది?’’ అంది కంగారుగా. ‘‘205’’. అంతే... హడలిపోయింది వైశాలి. ‘‘205వ ఫ్లాటా? దయచేసి నా మాట వినండి. మీరక్కడ ఉండొద్దు. వెంటనే వేరే ఫ్లోర్‌కి మారిపోండి.’’ ఆమె ఎందుకంత కంగారు పడుతోందో అర్థం కాలేదు పూనమ్. ఏమయ్యిందంటూ నిలదీసింది. ‘‘రెండేళ్లుగా ఆ ఫ్లాట్‌లో ఎవరూ ఉండటం లేదండీ. మీరు చూసింది మనిషిని కాదు... దెయ్యాన్ని.’’ ఉలిక్కిపడింది పూనమ్. ‘‘దెయ్యమా?’’ అంది అదురుతున్న పెదవులతో. ‘‘అవును... దెయ్యమే’’ అంటూ వైశాలి ఒక్కో విషయం చెబుతుంటే, విని కొయ్యబారిపోయిందామె. ఆ భవంతి రెండో అంతస్తులో ఒకప్పుడు అన్ని ఫ్లాటులూ నిండుగానే ఉండేవి. కానీ అనుకోకుండా జరిగిన ఓ సంఘటన తర్వాత, పరిస్థితులు మారిపోయాయి. ఫ్లాట్ నంబర్ 205లోకి ఇద్దరు దంపతులు అద్దెకు వచ్చారు. భార్య ఎంతో నెమ్మదస్తురాలు. అందరితోనూ ఆప్యాయంగా మాట్లాడేది. కానీ భర్త అందుకు వ్యతిరేకం. ఎప్పుడూ చిటపట లాడుతూ ఉంటాడు. అందరితోనూ అంటీ ముట్టనట్టుగా ఉంటాడు. భార్య కూడా అలాగే ఉండాలంటాడు. కానీ ఆమె అలా ఉండలేదు. అందరితో కలివిడిగా ఉండటం ఆమె నైజం. దాంతో ఇద్దరూ తరచుగా గొడవ పడేవారు. అతడు ఆమెని దుర్భాష లాడేవాడు. చిత్ర హింసలు పెట్టేవాడు. ఒకరోజు మరీ హింసించేసరికి ఆమె తట్టుకోలేక మౌనంగా అయిపోయింది. ఎవరితోనూ మాట్లాడేది కాదు. బయటకు రావడమే మానేసింది. తనలో తనే కుమిలి పోయింది. ఆ బతుకు వద్దనుకుందో ఏమో... ఓరోజు ఆత్మహత్య చేసుకుంది. ఆ సంఘటన అందరినీ షాక్‌కి గురి చేసింది. అయితే అంతకంటే షాకిచ్చిన విషయం మరొకటుంది. ఆమె చనిపోయిన రోజు ఎక్కడి నుంచో ఓ నల్లకుక్క అపార్ట్ మెంట్‌కు వచ్చింది. అది తిన్నగా రెండో అంతస్తులోకి వెళ్లి, ఫ్లాట్ నంబర్ 205 తలుపు దగ్గర కూర్చుంది. దాన్ని తరిమే యాలని ఎంతో ప్రయత్నించారు. అది కదల్లేదు. కొట్టినా పారిపోలేదు. దాంతో అలా వదిలేశారు. దాని ప్రవర్తన విచి త్రంగా ఉండేది. అది మొరిగేది కాదు. ఎవరినీ కరిచేదీ కాదు. అసలక్కడి నుంచి కదిలేది కాదు. ఏం తినేదో, తాగేదో అర్థమయ్యేది కాదు. కానీ అర్ధరాత్రి అయ్యే సరికి భయంకరంగా ఏడవడం మొదలు పెట్టేది. ఆ తర్వాత కాసేపటికి రెండో అంతస్తు అంతటా మువ్వల సవ్వడి వినిపించేది. మొదట్లో ఎవరూ పట్టించు కునేవారు కాదు. ఎవరో ఏ పనిమీదో తిరుగుతున్నారేమోలే అనుకునేవారు. కానీ ఓరోజు ఎవరు తిరుగుతున్నారో చూద్దా మని బయటకు వచ్చిన ఓ వ్యక్తికి జుత్తు విరబోసుకుని తిరుగుతోన్న మహిళ కని పించింది. ఆమె కళ్లు చింతనిప్పుల్లా ఉన్నాయి. ఆమె అతని వైపు రాబోయింది. అతను చప్పున లోనికి వెళ్లి తలుపేసేసు కున్నాడు. దాంతో అక్కడ జరుగుతున్న దేమిటో అందరికీ అర్థమైపోయింది. చని పోయిన మహిళ దెయ్యమై తిరుగుతోందని తెలిసిపోయింది. వెంటనే ఆ అంతస్తులో ఉంటున్నవాళ్లందరూ ఫ్లాట్లు ఖాళీ చేసేశారు. కానీ ఆమె భర్త మాత్రం అక్కడే ఉన్నాడు. అతడు ఓరోజు ఉన్నట్టుండి గుండె నొప్పితో చనిపోయాడు. రెండు రోజులైనా తలుపు తీయడం లేదని పాల వాడు చెబితే తలుపులు బద్దలు కొట్టి చూశారు. కుళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్న అతడి మృతదేహం కనిపించింది. అంతే... ఇక ఆ రోజు నుంచీ రెండో అంతస్తులో నివసించడానికి ఎవరూ సాహసించలేదు. తెలియక ఎవరైనా వచ్చినా... కుక్క ఏడుపు, గజ్జెల శబ్దం విని హడలిపోయేవారు. కొందరైతే దెయ్యాన్ని చూసి జడుసుకుని వెళ్లిపోయారు. ఇవన్నీ తెలియక పూనమ్, శిఖర్‌లు ఓ ఏజెంటు ద్వారా ఆ ఫ్లాట్‌ని అద్దెకు తీసుకున్నారు. చివరికి వారికీ అదే అనుభవం ఎదురయ్యే సరికి అపార్ట్మెంట్ వదిలి వెళ్లిపోయారు. మహారాష్ట్రలో ఆ భవంతి ఇప్పటికీ ఉంది. రెండో అంతస్తులో నేటికీ దెయ్యం తిరుగుతోంది. అయితే ఆమె వివరాలు ఎవరిని అడిగినా చెప్పరు. ఆమె పేరు ఎవరూ నోటితో ఉచ్ఛరించరు. ‘సెకెండ్ ఫ్లోర్ బాబీ (రెండో అంతస్తు వదిన) అంటారు. ఆమె ఎవ్వరికీ చెడు చేయదు. ఎవ్వరి ప్రాణాలనూ హరించదు. కేవలం మౌనంగా సంచరిస్తుంది. చిత్రహింసలు అనుభవించిన చోట ఆవేదనతో తిరుగాడు తుంది. శాడిస్టు భర్తల కారణంగా తనువులు చాలిస్తోన్న ఎందరో అభాగ్య మహిళలకు గుర్తుగా తన ఉనికిని చాటుతోంది! ఆ నల్ల కుక్క ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికీ తెలియదు. ఎందుకు ఆ ఫ్లాట్ దగ్గరే ఉంటోందో, ఎందుకని ప్రతి రాత్రీ ఏడుస్తోందో ఎంతకీ అంతు పట్టదు. దానికీ ఆమెకీ సంబంధం ఏదైనా ఉందా? లేక ఆమె ఆత్మే దానిలో ప్రవేశించిందా? -
చెల్లింపు లావాదేవీలకు ఓలా మనీ యాప్
న్యూఢిల్లీ: పేటీఎం, మొబిక్విక్, ఫ్రీచార్జ్ తదితర డిజిటల్ పేమెంట్ సంస్థలతో పోటీపడేందుకు .. ట్యాక్సీ సర్వీసుల సంస్థ ఓలా తమ మొబైల్ వాలెట్ ‘ఓలా మనీ’ని స్వతంత్ర యాప్‌గా అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటిదాకా ఓలా యాప్‌లో భాగంగా ఉన్న ఓలా మనీ.. ట్యాక్సీ, ఆటో చార్జీల చెల్లింపులకు మాత్రమే ఉపయోగపడేది. ఇకపై దీనితో మొబైల్ రీచార్జీలు, నగదు బదిలీలు కూడా చేయొచ్చని ఓలా సీఈవో భవిష్ అగర్వాల్ తెలిపారు. త్వరలోనే విద్యుత్, నీటి బిల్లులు మొదలైన వాటి చెల్లింపులకు కూడా ఉపయోగపడేలా దీన్ని తీర్చిదిద్దనున్నట్లు ఆయన వివరించారు. ఓలా మనీకి ప్రస్తుతం 4 కోట్ల మంది యూజర్లు ఉన్నారని అంచనా. -
క్యాబ్ సర్వీసులకు విశ్రాంతినిస్తున్నాం!
కోల్ కతా: మండే ఎండలతో ట్యాక్సీ సర్వీసులకు విశ్రాంతి ఇస్తున్నట్లు బెంగాల్ ట్యాక్సీ అసోసియేషన్ శనివారం ప్రకటించింది. ఉదయం 11గం.ల నుంచి సాయంత్రం 4.గం.ల వరకూ ట్యాక్సీ సర్వీసులను ఎట్టిపరిస్థితుల్లోనూ నడపలేమని స్పష్టం చేసింది. భానుడి ఉగ్రరూపంతో ఇప్పటికే ఇద్దరు క్యాబ్ డ్రైవర్లు మృత్యువాత పడటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు ట్రాన్స్ పోర్ట్ సెక్రటరీకి ట్యాక్సీ అసోసియేషన్ ఓ లేఖ రాసింది. ' ఎండ వేడిమి ఎక్కువగా ఉండే సమయంలో మేము ఏ క్యాబ్ ను కూడా రోడ్డుపై తిప్పలేం. ఒకవేళ ఎవరైనా తిప్పడానికి ప్రయత్నిస్తే అడ్డుకుంటాం. ఈ విషయాన్ని పోలీసులు, ప్రయాణికులు అర్ధం చేసుకోవాలి. సర్వీసులను నిలుపదల చేసే క్రమంలో పోలీసులు మాపై ఎటువంటి జరిమానా విధించొద్దు' అని ట్యాక్సీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ బీమల్ గుహ విజ్ఞప్తి చేశాడు. శుక్రవారం ఎండ తాపానికి తాళలేక నగరంలోని ఓ డ్రైవర్ ప్రాణాలు కోల్పోగా, ఈ రోజు జాదవ్ పూర్ ప్రాంతంలో శత్రుఘాన్ పొడ్డార్ అనే ట్యాక్సీ డ్రైవర్ సృహ తప్పిపడిపోయిన అనంతరం ఆస్పత్రితో చికిత్స పొందుతూ మృతి చెందాడు. -
ట్యాక్సీ యాప్ లకు కళ్లెం
న్యూఢిల్లీ:యాప్ ఆధారిత ట్యాక్సీ రంగంలో ఉన్న ఉబర్, ఓలా, ట్యాక్సీ ఫర్ ష్యూర్ వంటి కంపెనీల సేవలకు ఢిల్లీలో కళ్లెం పడింది. ఈ తరహా కంపెనీల యాప్స్‌ను వినియోగించకుండా అడ్డుకట్ట వేయాలని ఢిల్లీ ప్రభుత్వ ప్రతిపాదన నేపథ్యంలో డీవోటీ(డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికాం).. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ (ఐఎస్ పీ)కు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆయా ట్యాక్సీ సర్వీస్ ల యాప్ లపై నిషేధం విధించాలని కోరినట్లు డీవోటీ ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు. గత రెండు రోజుల క్రితమే ట్యాక్సీ యాప్ లపై చర్యలు తీసుకోవాల్సిందిగా లేఖ రాసినట్లు తెలిపారు. ఇన్ ఫార్మమేషన్ టెక్నాలజీ యాక్ట్ 69ఎ, 2000 మరియు ప్రజా రక్షణ నిబంధనలను వర్తింపచేస్తూ డీవోటీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉండగా సాంకేతిక పరమైన సమస్యల వల్లే ఈ యాప్ లపై నిషేధం విధించినట్లు ఐఎస్‌పీఏఐ ప్రెసిడెంట్ రాజేశ్ చారియా స్పష్టం చేశారు. గతేడాది ఓ ప్రయాణికురాలి(25)పై ఉబర్ కంపనీకి చెందిన డ్రైవర్ అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ అత్యాచార సంఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం అనుమతుల్లేని వెబ్ ఆధారిత టాక్సీ కంపనీల సేవలపై నిషేధం విధించింది. అయితే ఉబర్, ఓలా కంపనీలు ఈ నిషేధాన్ని పట్టించుకోకుండా తమ సేవలను కొనసాగించాయి. ఈ సంచలనాత్మక సంఘటన జరిగిన తర్వాత ఉబర్ కంపనీ కొన్ని రోజుల పాటు తన సేవలను నిలిపివేసింది. కానీ, వెనువెంటనే రేడియో టాక్సీ లెసైన్స్ కోసం ఉబర్ కంపనీ దరఖాస్తు చేసుకుని జనవరిలో మళ్లీ సేవలను ప్రారంభించింది. దీంతో గత నాలుగు నెలల క్రితం డీవోటీ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఓ కమిటీ ట్యాక్సీ సర్వీస్ ల యాప్ లపై చర్యలకు శ్రీకారం చుట్టింది. -
యూనివర్సల్ నంబరింగ్ అవశ్యం
హైదరాబాద్ (సాక్షి ప్రత్యేక ప్రతినిధి): ట్యాక్సీ క్యాబుల్లో, హైవేల్లో ప్రయాణించే వారు ఆపదల్లో ఉన్నప్పుడో, అత్యవసర సమయాల్లో పోలీస్ యంత్రాంగానికి తక్షణమే సమాచారాన్ని చేరేవేసేందుకు ఉద్దేశించిన ఇంటిగ్రేటెడ్ ఎమర్జన్సీ కమ్యూనికేషన్ అండ్ రెస్పాన్స్ సిస్టమ్ ఏర్పాటు చేసుకుంటే ఢిల్లీ తరహా సంఘటనలు పునరావృతం కాబోవని నిపుణులు పేర్కొంటున్నారు. వివిధ ఎమర్జన్సీ సేవలకు వివిధ నెంబర్లు అందుబాటులో ఉన్నాయి. వాటికి బదులుగా తేలికగా గుర్తుంచుకునే ఒకటే నెంబర్‌ను ప్రవేశపెట్టడమే యూనివర్సల్ ఎమర్జన్సీ నెంబరింగ్ విధానం. టెలికాం రెగ్యులేరటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) పరిశీలనలో ఉన్న ఈ వ్యవస్థను తక్షణమే అమల్లో పెట్టాల్సిన అవసరం వుందని నిపుణులు చెపుతున్నారు. టెలికాం వినియోగదారుల నుంచి సర్‌ఛార్జి రూపంలో ప్రభుత్వం సమీకరించిన యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ (యూఎస్ఎఫ్ఓ)లో రూ. 16వేల కోట్ల నిధి మగ్గుతోందని, అందులో కొంత సొమ్ము ప్రభుత్వం ఖర్చు చేస్తే టెలికాం ఆపరేటర్లపై భారం కూడా ఉండదంటున్నారు. యూనివర్సల్ సింగిల్ నంబర్ ఆధారంగా పనిచేసే ఇంటిగ్రేటెడ్ ఎమర్జన్సీ కమ్యూనికేషన్ అండ్ రెస్పాన్స్ సిస్టమ్ ప్రధానంగా రెండు రకాల నంబరింగ్ సేవలను అందించగలదు. ఒకటి కాల్ చేసిన వ్యక్తి చిరునామా, వయసు లాంటి వివరాలు, రెండు కాల్ ఏ భౌగోళిక ప్రాంతం నుండి వస్తోందన్న సమాచారం పోలీసు యంత్రాంగానికి వెనువెంటనే చేరిపోతుంది. ఇటీవల ఢిల్లీలో ఒక క్యాబ్‌లో జరిగిన అత్యచార సంఘటన సందర్భంగా బాధితురాలు పలు టెక్ట్స్ మెసేజీలు పంపిన రెండు గంటల తర్వాత మాత్రమే పోలీసు యాంత్రాగానికి కాల్ చేయగలిగింది. ఆ కాల్ ఎక్కడ్నుంచి వచ్చిందో పోలీసులు వెనువెంటనే గుర్తించలేకపోయారు. అటుతర్వాత డ్రైవర్‌ను అరెస్టు చేయడానికి చాలా సమయమే పట్టింది. ప్రతిపాదిత కాలింగ్ వ్యవస్థ అందుబాటులోకి వస్తే ఆపదలో వున్నవారికి తక్షణం సహాయం లభించే అవకాశం వుంటుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సోషల్ మీడియా, జీపీఎస్, బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందుబాటులో ఉండటంతో టెలీకామ్ ఆపరేటర్ల సాయం లేకుండానే అత్యవసర సమాచారాన్ని చేరవేసే అవకాశం ఉంది. బీసేఫ్, ఫ్యామిలీ జీపీఎస్ ట్రాకర్, ఐ వాచ్ లాంటి యాప్స్ అత్యవసర సమాచారాన్ని బంధువులు, స్నేహితులకు చేరవేసే అవకాశం కల్పిస్తున్నాయి. ట్రూకాలర్ యాప్ ఫోన్ చేసిన వ్యక్తి వివరాలను ఖచ్చితంగా ఇవ్వగలుగుతోంది. అయితే ఆ యాప్స్ వినియోగించాలంటే స్మార్ట్‌ఫోన్ తప్పని సరి. దేశంలో స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు 15 శాతం మించి లేరు. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) గతేడాది ఇంటిగ్రేటెడ్ ఎమర్జన్సీ కమ్యూనికేషన్ అండ్ రెస్పాన్స్ సిస్టమ్ వినియోగంపై ఒక చర్చాపత్రాన్ని విడుదల చేసింది. అయితే ఇది తమ ఆదాయంపై ప్రభావం చూపుతుందని టెలికాం ఆపరేటర్లు ట్రాయ్ చర్యను తీవ్రంగా అడ్డుకోవడంతో ఇది అటకెక్కింది. ప్రస్తుతం 2002లో ప్రవేశపెట్టిన కమ్యూనికేషన్స్ కన్వర్జెన్స్ బిల్లుకు కొత్త ఊపిరులు పోయాలని కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో యూనివర్సల్ ఎమర్జన్సీ నంబరింగ్ సేవలను తప్పక ప్రారంభించేలా ప్రభుత్వం ఒక విధాన ప్రకటన చేయాల్సిన సమయం ఇదే అని నిపుణులు పేర్కొంటున్నారు. వివిధ ఎమర్జన్సీ సేవలకు వివిధ నెంబర్లు అందుబాటులో ఉన్నాయి. వాటికి బదులుగా తేలికగా గుర్తుంచుకునే ఒకటే నెంబర్‌ను ప్రవేశపెట్టడమే ఈ యూనివర్సల్ ఎమర్జన్సీ నెంబరింగ్ విధానం. -
మహిళలకు దడపుట్టిస్తున్న ట్యాక్సీ
-
హైదరాబాద్ లో బుక్ మై క్యాబ్ సేవలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: క్యాబ్ సర్వీసుల రంగంలో ఉన్న బుక్ మై క్యాబ్.కామ్ హైదరాబాద్‌లో అడుగు పెట్టింది. భాగ్యనగరికి చెందిన క్యాబ్ ఆన్ క్లిక్.కామ్‌ను కొనుగోలు చేసినట్టు కంపెనీ ప్రకటించింది. 100 కార్లతో సేవలను ప్రారంభిస్తున్నట్టు బుక్ మై క్యాబ్ సీఈవో అవినాశ్ గుప్త తెలిపారు. సీవోవో వినయ్ పాండేతో కలిసి మంగళవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. ముంబై, కోల్‌కత, ఢిల్లీలో 5 వేల వాహనాలతో సర్వీసులు ఇస్తున్నట్టు చెప్పారు. ‘కస్టమర్లు గతంలో ప్రణాళిక ప్రకారం ముందుగా కారు బుక్ చేసేవారు. ఇప్పుడంతా ఇన్స్టాంట్. ప్రయాణానికి 15-45 నిముషాల ముందు కారు కావాలంటున్నారు. హైదరాబాద్, కోల్‌కతలో 50 శాతంపైగా కస్టమర్లు ఆన్లైన్లో క్యాబ్ బుక్ చేస్తున్నారు. ముంబై, ఢిల్లీలో 65 శాతంపైగా కస్టమర్లు కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి క్యాబ్ కోరతారు’ అని వివరించారు. క్యాబ్ డ్రైవర్లు తమ ఆదాయంలో కొంత మొత్తాన్ని వారి పిల్లల చదువుల కోసం దాచుకునేలా సేవింగ్ పథకాన్ని కంపెనీ ప్రవేశపెట్టింది. ఇంటర్నెట్ లేకున్నా ఎస్ఎంఎస్ ద్వారా బుకింగ్ సేవలను త్వరలో పరిచయం చేయనుంది.