
కోలకతా(పశ్చిమ బెంగాల్): తిరిగి తమ సేవలను అందించేందుకు ఎల్లో టాక్సీలు సోమవారం నుంచి కోల్‌కతా నగర వీధుల్లోకి రానున్నాయి. అయితే మీటరుపై ప్రస్తుతం ఉన్న ఛార్జీల కంటే 30 శాతం పెంచినట్లు బెంగాల్ టాక్సీ అసోసియేషన్(బీటీఏ) కార్యదర్శి బిమల్ గుహా శుక్రవారం వెల్లడించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్ రవాణా శాఖ సీనియర్ అధికారులు గురువారం సమావేశం నిర్వహించినట్లు చెప్పారు. ఈ సమావేశంలో ఎల్లో టాక్సీల ప్రస్తుత రేటు కంటే మీటర్ రీడింగులపై 30 శాతం పెంపును అధికారులు ప్రతిపాదించినట్లు ఆయన తెలిపారు. (లాక్‌డౌన్ : మహారాష్ట్ర కీలక నిర్ణయం)
ఇక ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం గరిష్టంగా ఇద్దరు ప్రయాణికులను మీటర్ టాక్సీల్లో ఎక్కడానికి అనుమతిస్తామని, వారు వెనుక సీట్లో కూర్చోవాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. కాగా కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మూడవ దశ లాక్‌డౌన్ ముగిసిన తరువాత నగరంలో టాక్సీ సేవలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక లాక్‌డౌన్ విధించినప్పటీ నుంచి అత్యవసర పరిస్థితుల్లో కొన్ని టాక్సీలు మాత్రమే నగరంలో ప్రయాణించడానికి ప్రభుత్వం అనుమతించిందన్నారు. ఇక మే 18 నుంచి చార్జీల పెంపుతో ఎల్లో టాక్సీలు సేవలు అందించనున్నాయని ఆయన వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment