కోల్‌కత్త: కంటైన్మైంట్ జోన్‌లలో మరో 7 రోజుపాటు లాక్‌డౌన్‌ను పొడిగించనున్నట్లు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. బుధవారం దీదీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్‌లో మంగళవారం ఒక్కరోజే 25 మంది కరోనాతో మరణించడంతో కరోనా ప్రభావం అత్యధికంగా ఉన్న కంటైన్మైంట్ జోన్ల్‌లో లాక్‌డౌన్‌ను పోడగించాలని నిర్ణయించుకున్నామని మమతా తెలిపారు. గురువారం సాయంత్రం 5 గంటల నుంచి లాక్‌డౌన్ అమల్లోకి వస్తుందని దీదీ స్పష్టం చేశారు. (14 రోజుల పాటు లాక్‌డౌన్..!)
COVID-19: Lockdown will be imposed in containment zones in West Bengal for 7 days, starting 5 pm Thursday, says CM Mamata Banerjee
— Press Trust of India (@PTI_News) July 8, 2020
ఇక గడిచిన 24 గంట్లలో జరిపిన కోవిడ్ పరీక్షల్లో 850 మందికి కరోనా పాజిటివ్ రావడంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 23,837కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 7,243 క్రియాశీల కేసులు ఉండగా వాటిలో 555 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో నిన్న చోటుచేకున్న 25 కోవిడ్-19 మరణాలతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 807కు చేరుకుందని ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment