Mamata Benerjee
-
రైలు ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉండొచ్చు: మమతా బెనర్జీ
సాక్షి, పశ్చిమ బెంగాల్: ఒడిశా ఘోర రైలు ప్రమాదంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రైలు ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉందన్నారు. దీని గురించి కేంద్రం సత్వరమే దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. అయితే, ఇది రాజకీయాలు చేసే సమయం కాదని ఈ ఘటన ఎలా జరిగిందో తెలుసుకుని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిన తరుణమని అన్నారు మమత. ఈ మేరకు మమతా ఘటన స్థలికి వెళ్లి పరిస్థితిని దగ్గరుండి సమీక్షించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఒడిశా ప్రభుత్వాన్ని కోరారు. బెంగాల్ తరుఫున క్షతగాత్రులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. (చదవండి: లెక్క తేలని మరణాలు!.. దేశ చరిత్రలో అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాలివే) -
సౌరవ్ గంగూలీకి భద్రత పెంపు
టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి భద్రత పెంచాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయించింది. గంగూలీకి ప్రస్తుతమున్న 'వై' కేటగిరీ భద్రత పదవీకాలం మే 16తో ముగియడంతో మమతా సర్కార్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దాదా భద్రతను 'వై' నుంచి 'జెడ్' కేటగిరీకి అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు మమతా సర్కార్ నిన్న అధికారికంగా వెల్లడించింది. వై కేటగిరీ భద్రత ప్రకారం గంగూలీ నివాసం వద్ద ముగ్గురు స్పెషల్ బ్రాంచ్ పోలీసు అధికారులు, ముగ్గురు లా ఎన్‌ఫోర్సర్స్ (చట్టాన్ని అమలు చేసేవారు) ఉండేవారు. జెడ్ కేటగిరీ భద్రత ప్రకారం ఇకపై గంగూలీ భద్రత దళం సంఖ్య ఎనిమిది నుండి పది మంది పోలీసు అధికారులతో (24 గంటల పాలు) కూడినది ఉండనుంది. గంగూలీ ప్రస్తుతం ఐపీఎల్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌కు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, గంగూలీ సేవలందిస్తున్న ఢిల్లీ జట్టు ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో పేలవ ప్రదర్శనను కనబరుస్తూ అధికారికంగా లీగ్ నుంచి నిష్క్రమించింది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగే విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్లో ఇంకా 2 మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్నా ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఈ సీజన్ ప్రారంభానికి ముందు రెగ్యులర్ కెప్టెన్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడటంతో అతని స్థానంలో డేవిడ్ వార్నర్‌ను కెప్టెన్‌గా నియమించారు. వార్నర్ వ్యక్తిగతంగా రాణించినా.. మిగతా ఆటగాళ్లంతా విఫలం కావడంతో డీసీకి ఈ గతి పట్టింది. చదవండి: నీకు బౌన్సర్లు వేయడం మాత్రమే వచ్చా? నాపై రాహుల్ సీరియస్ అయ్యాడు: సిరాజ్ -
రాష్ట్రపతి ముర్ముపై అనుచిత వ్యాఖ్యలు.. తగ్గేదెలే! అంటున్న బీజేపీ
సాక్షి, న్యూఢిల్లీ: భారత రాష్ట్రపతిపై అభ్యంతరకర వ్యాఖ్యల వివాదంపై పశ్చిమబెంగాల్ బీజేపీ నిరసనలు ఉధృతం చేసింది. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ముపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి అఖిల్ గిరిని పదవి నుంచి తప్పించాలని కాషాయ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఈ అంశానికి సంబంధించి క్షమాపణలు చెప్పాలని బీజేపీ ఎంపీ లాకెట్ ఛటర్జీ డిమాండ్ చేశారు. బహిరంగ సభల్లో ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి కోసమని భారీ స్పీచ్‌లు దంచికొట్టే తృణమూల్ నేతల అసలు స్వరూపం బయటపడిందని ఆమె ధ్వజమెత్తారు. అఖిల్ గిరిపై ఢిల్లీలోని నార్త్ అవెన్యూ పోలిస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి మంత్రిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. బీజేపీ ఎంపీ సౌమిత్రా ఖాన్ కూడా జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. అఖిల్ గిరిని తక్షణమే అరెస్టు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఎమ్మెల్యేగా కూడా ఆయనను డిస్మిస్ చేయాలని అన్నారు. (చదవండి: Prashant Kishor: ఎన్నికల్లో పోటీపై ప్రశాంత్ కిషోర్ క్లారిటీ.. ఏమన్నారంటే?) వివాదమేంటి? సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో క్లిప్ ప్రకారం.. రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు సువేంధు అధికారిపై విమర్శలు చేసే క్రమంలో బెంగాల్ మంత్రి అఖిల్ గిరి.. దేశ రాష్ట్రపతిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘సువేంధు అధికారి నా రూపం గురించి వ్యాఖ్యానిస్తారు. నేను చూడ్డానికి బాగుండనట. నువ్వెంత అందంగా ఉన్నావ్. మనిషి రూపాన్ని బట్టి అంచనా వేయకూడదు. ఎవరెలా ఉన్నా వారికిచ్చే గౌరవ మర్యాదలు వారికివ్వాలి. మన రాష్ట్రపతి చూడ్డానికి ఎలా ఉంటారు.. అయినా ఆమెను గౌరవిస్తున్నాం కదా’ అని వ్యాఖ్యలు చేశారు. దీనిపై తీవ్ర దుమారం రేగింది. అయితే, తన తప్పును తెలుసుకున్న మంత్రి అఖిల్ గిరి బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. కానీ, బీజేపీ నాయకులు మాత్రం తగ్గడం లేదు. మంత్రిని పదవి నుంచి తప్పించాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఇక వివాదం ముదరడంతో గిరి వివరణ ఇచ్చుకున్నారు. భారత రాజ్యాంగాన్ని, రాష్ట్రపతిని గౌరవిస్తానని ఆయన అన్నారు. రాజ్యాంగానికి లోబడి పనిచేస్తానని చెప్పారు. కొన్ని రోజుల క్రితం సువేంధు అధికారి తనను ఉద్దేశించి కొన్ని బాధాకరమైన వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. తన రూపు గురించి మాట్లాడి దారుణంగా అవమానించారని, వయసులో పెద్దవాడిననే కనీస గౌరవం లేకుండా బాధపెట్టారని గిరి చెప్పుకొచ్చారు. ‘బాధ, కోపం వల్లే సువేంధు అధికారిని విమర్శించాలని అనుకున్నా.. ఆ క్రమంలోనే పొరపాటుగా రాష్ట్రపతికి ఇబ్బంది కలిగేవిధంగా మాట్లాడా’ అని పేర్కొన్నారు. ఇక బీజేపీ నాయకుల విమర్శలపై తృణమూల్ జాతీయ అధికార ప్రతినిధి సాకేత్ గోఖలే స్పందించారు. బీజేపీ నేతల తీరు ఆమోదయోగ్యం కాదని అన్నారు. తమ పార్టీ రాష్ట్రపతికి అపారమైన గౌరవం ఇస్తుందన్నారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. (చదవండి: భారీ షాకిచ్చిన కేంద్రం.. 10 లక్షల రేషన్ కార్డులు రద్దు, కారణం ఇదే!) -
కేంద్ర ప్రభుత్వ అధికారులపై విచారణ జరిపిస్తాం! మమత స్ట్రాంగ్ వార్నింగ్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాడులు ఎక్కువైపోతున్నాయంటూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రంపై మండిపడ్డారు. దీన్ని సహించేదిలేదని తేల్చి చెప్పడమే కాకుండా కేంద్ర ప్రభుత్వ అధికారుల పై విచారణ జరిపిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు మమతా తమ పార్టీ విద్యార్థి విభాగం ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతూ... తనపై కూడా సీబీఐ, ఈడీ కేసులు ఉన్నాయని, అలాగే బెంగాల్‌లోని ఇతర కేంద్ర ప్రభుత్వాధికారుల పై కూడా కేసులు ఉన్నాయని చెప్పారు. కేంద్రం తమ అధికారులను ఢిల్లీకి రప్పిస్తే మీ అధికారులను ఇక్కడకు పిలిపిస్తాను అని హెచ్చరించారు. రాష్ట్రంలో సుమారు ఎనిమిది మంది కేంద్ర ప్రభుత్వాధికారులపై కేసులు ఉన్నాయని మమతా తెలిపారు. కేంద్రం సీబీఐ దాడులతో తమ నాయకులను అరెస్టులు చేస్తోందని విరుచుకుపడ్డారు. ఎడ్యుకేషన్ స్కాంలో పార్థ ఛటర్జీపై సీబీఐ జరిపిన దాడులు గురించి ప్రస్తావిస్తూ...ఆ కేసులో ఏదీ రుజువుకాలేదని, కేవలం రాజకీయపార్టీలను మీడియా, న్యాయవ్యవస్థను అడ్డుపెట్టుకుని బీజేపీ భయబ్రాంతులకు గురిచేస్తోందని ఆరోపణలు చేశారు. ఈడీ, సీబీఐ దాడులతో తమ నాయకుల డబ్బులను కొల్లగొడుతోందని చెప్పారు. అంతేకాదు బిల్కిస్ బానో కేసులో దోషులుగా ఉన్నవారిని గుజరాత్ ప్రభుత్వం రిమిషన్ పాలసీ కింద విడుదల చేయడాన్ని కూడా తప్పుపట్టారు. ఆ దోషుల పై కఠిన చర్యలు తీసుకునేలా తమ పార్టీ టీఎంసీ కోల్‌కతాలో 48 గంటల పాటు ధర్నా నిర్వహిస్తుందని మమతా బెనర్జీ తెలిపారు -
బాప్రే.. అర్పిత మరో ఇంట్లోనూ నోట్ల కట్టలే!
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో టీచర్ల నియామకాల కుంభకోణం.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మాజీ విద్యాశాఖ మంత్రి, ప్రస్తుత పరిశ్రమల, వాణిజ్య శాఖ మంత్రి పార్థా ఛటర్జీ, ఆయన సన్నిహితురాలు అర్పితా ముఖర్జీలను ఈడీ అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తోంది కూడా. ఈ తరుణంలో అర్పిత నుంచి కీలక సమాచారం బయటపడుతోంది. తాజాగా ఆమెకు చెందిన మరో ఇంట్లో నుంచి కూడా నోట్ల కట్టలే బయటపడ్డాయి. బుధవారం నాడు బెల్గారియా ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్లో ఆమె ఇంట్లో ఓ గది సెల్ఫ్ నుంచి కోట్ల రూపాయలను గుర్తించారు ఈడీ అధికారులు. ఈ మేరకు బ్యాంక్ అధికారులకు సమాచారం అందించగా.. హుటాహుటిన చేరుకుని కౌంటింగ్ మెషీన్‌తో లెక్కించడం ప్రారంభించారు. దాదాపుగా 20 కోట్లకు పైగా డబ్బు.. బంగారు బిస్కెట్లు.. నగల్ని రికవరీ చేశారు. అంతేకాదు దర్యాప్తునకు ఉపయోగపడే.. కీలకమైన డాక్యుమెంట్లను సైతం సేకరించారు. అందులో పార్థా ఛటర్జీకి చెందిన మరిన్ని ఆస్తులను గుర్తించినట్లు తెలుస్తోంది. రాజ్‌దంగాలోనూ అర్పితా ముఖర్జీకి మరో ఫ్లాట్ ఉన్నట్లు సమాచారం. అర్పితా ముఖర్జీ నివాసాల్లో 18 గంటల పాటు సాగిన ఈడీ సోదాలు ముగిశాయి. కీలక పత్రాలతో పాటు దాదాపు 50 కోట్ల రూపాయల నగదు.. ఐదు కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. పది ట్రంకు పెట్టెల్లో నగదుతో పాటు నగలు, డాక్యుమెంట్లను డీసీఎం వ్యానులో తరలించారు అధికారులు. #WATCH | West Bengal: Hugh amount of cash, amounting to at least Rs 15 Crores, recovered from the residence of Arpita Mukherjee at Belgharia. She is a close aide of West Bengal Minister Partha Chatterjee. pic.twitter.com/7MMFsjzny1 — ANI (@ANI) July 27, 2022 మరో మహిళ ఎవరు? ఇదిలా ఉంటే.. స్కూల్ టీచర్ల నియామకం కుంభకోణానికి సంబంధించిన వ్యవహారం దర్యాప్తులో భాగంగా ఈడీ చేపట్టిన సోదాల్లో.. గత శుక్రవారం అర్పితా ముఖర్జీ ఇంట్లో కోట్ల రూపాయలు బయటపడ్డాయి. అదే సమయంలో మంత్రి పార్థా ఛటర్జీని సైతం ఈడీ ప్రశ్నించింది. ఇక శనివారం మనీలాండరింగ్ కేసులో పార్థా ఛటర్జీతో పాటు అర్పితా ముఖర్జీలను ఈడీ అరెస్ట్ చేసింది. ఆగష్టు 3వ తేదీ వరకూ ఈ ఇద్దరూ ఈడీ కస్టడీలోనే ఉంటారు. ఇక విచారణలో.. అర్పితా ముఖర్జీ మరో మహిళ ప్రస్తావన తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. పార్థ చటర్జీ తన ఇంటితో పాటు మరో మహిళ ఇంటిని మినీ బ్యాంక్‌గా వాడుకునేవారని, పదిరోజులకొకసారి పార్థా ఛటర్జీ, ఆయన అనుచరులు ఇంటికి వచ్చే వాళ్లని, డబ్బు దాచేవాళ్లని అర్పితా ముఖర్జీ అంగీకరించింది. అయితే మరో మహిళ ఎవరనే విషయంపై మాత్రం అధికారులు ప్రకటన చేయలేదు. ఇదీ చదవండి: అర్పిత ముఖర్జీ ఎవరంటే.. రాజీనామానా? దేనికి.. ఇదిలా ఉంటే.. పార్థా ఛటర్జీ బెంగాల్లో సీనియర్ రాజకీయ నేత. టీఎంసీ తరపున ఆయన కేబినెట్‌తో పాటు పలు కీలక భాద్యతలు చేపట్టారు కూడా. కుంభకోణం ఆరోపణల నేపథ్యంలో రాజీనామా చేస్తారా? అనే ప్రశ్న ఎదురైంది ఆయనకు మీడియా నుంచి. దానికి ఆయన మండిపడ్డారు. ఎందుకు? ఏ కారణంతో రాజీనామా చేయాలి? అని అసహనం ప్రదర్శించారు. గవర్నర్‌కు ఫిర్యాదు కేబినెట్ మంత్రిపై ఆరోపణలు.. అరెస్ట్ జరిగినా టీఎంసీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ స్పందించకపోవడంపై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. పార్థా ఛటర్జీని మంత్రి పదవుల నుంచి తొలగించేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలంటూ ప్రతిపక్ష నేత సువేందు అధికారి.. గవర్నర్ లా గణేశన్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఆధారాలు స్పష్టంగా ఉన్నా ఆమె(మమతా బెనర్జీని ఉద్దేశిస్తూ..) ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. తాను మాత్రమే మంచి వ్యక్తినని.. ఎదుటివాళ్లు చెడ్డవాళ్లన్నట్లు వ్యవహరిస్తున్నారు ఆమె అని అధికారి సువేందు గవర్నర్‌నుకలిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. చదవండి: మంత్రి అరెస్టుపై సీఎం మమత కీలక వ్యాఖ్యలు -
ద్రౌపది ముర్ము గెలుపు ఖాయమే: మమతా బెనర్జీ
న్యూఢిల్లీ: రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము గెలుపు ఖాయమని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. బహుశా ఆమె అన్ని రాజకీయ పార్టీల ఏకాభిప్రాయ అభ్యర్థిగా గెలిచే అవకాశం ఉండొచ్చు అని అన్నారు. అయినా బీజేపీ కూడా రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టే ముందు ప్రతి పక్షాలతో కూడా చర్చించి ఉండాల్సిందన్నారు. బీజేపీ ఈ విషయమై తనను సంప్రందించింది కానీ ఎవర్నీ నిలబెడుతున్నామనేది తనకు చెప్పలేదన్నారు. ఎన్డీఏ ఒక మైనారిటీ కమ్యూనిటీకి చెందిన గిరిజన మహిళను నామినేట్ చేస్తున్నారని తెలిసి ఉంటే తాను ఏకాభిప్రాయం గురించి ఆలోచించేదాన్ని అన్నారు. తనకు గిరిజన మహిళల పట్ల గౌరవం ఉందన్నారు. అయితే బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా మాత్రం మమతా బెనర్జీ వైఖరి పై మండిపడుతున్నారు. ఒక గిరిజన మహిళ రాష్ట్రపతి పోటీ చేస్తున్నారనిగా తెలిసే తృణమాల్ కాంగ్రెస్ విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాను బరిలోకి దింపిందా? అని ప్రశ్నించారు. మమతా ముమ్మాటికి గిరిజన వ్యతిరేకి అని, సమర్థించుకోవడానికి ప్రయత్నించకండి అంటూ ట్విట్టర్ వేదికగా దీదీ పై ఆరోపణలు చేశారు. యాదృచికంగా సిన్హా జూన్21న తృణమూల్ కాంగ్రెస్‌కి రాజీనామా చేసి రాష్ట్రపతి ఎన్నికల కోసం ప్రతిపక్షాల అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఆయన గతేడాది మార్చిలో టీఎంసీలో చేరారు. అదే రోజు తర్వాత బీజేపీ నేతృత్వంలోని అధికార ఎన్డీఏ రాష్ట్రపతి అత్యున్నతి పదవికి ద్రౌపది ముర్ముని నామినేట్ చేసింది. అదీగాక ఇప్పటికే జేడీయు, వైకాపా ముర్ముకి మద్దతు ప్రకటించాయి. దీంతో ద్రౌపది ముర్ముకి రోజురోజుకి మద్దతు పెరిగిపోతుంది. తాజాగా అకాలీదళ్ కూడా తన మద్దతు ముర్ముకేనని పేర్కొంది. దీంతో మమతా రాష్ట్రపతి అభ్యర్థిగా ముర్ము గెలిచే అవకాశాలే ఎక్కువుగా ఉన్నాయనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. అయినప్పటికీ మమతా ప్రతిపక్షాల నిర్ణయం ప్రకారమే నడుచుకుంటానని స్పష్టం చేశారు. రాష్ట్రపతి అభ్యర్థిగా ఆమె పేరును ప్రకటిస్తున్నట్లు చెప్పి ఉంటే కచ్చితంగా ఆలోచించి ఉండేదాన్ని అని చెప్పారు. ఏదీఏమైన అందరీ ఏకాభిప్రాయంతో ఎన్నికైన వ్యక్తి రాష్ట్రపతి అభ్యర్థిగా ఉండటం మంచిదని మమతా బెనర్జీ పునరుద్ఘాటించారు. విచిత్రమేమిటంటే.. పోటీలో ఉన్న ఇద్దరూ బీజేపీ పార్టీకి చెందిన మాజీ సభ్యులే కావడం విశేషం. (చదవండి: యశ్వంత్ గెలుస్తారనే ఆశాభావం ఉంది.. మోదీపై సీఎం కేసీఆర్ ఫైర్) -
ఏం చేద్దాం: పీకేతో సీఎం కేసీఆర్ చర్చలు
సాక్షి, హైదరాబాద్: జాతీయ రాజకీయాలు, రాష్ట్రపతి ఎన్నికల్లో ఏం చేయాలనే అంశాలపై ప్రధానంగా.. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చర్చలు జరుపుతున్నారు. ఈ రెండు అంశాలపై ఇప్పుడు సీఎం కేసీఆర్ ప్రధానంగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం గత రెండు రోజలుగా ఎన్నికల వ్యూహకర్త పీకేతో వరుసగా చర్చిస్తున్నారు. అంతేకాదు రాష్ట్రపతి ఎన్నికల ఎజెండాగా మమతా బెనర్జీ పిలుపు ఇచ్చిన భేటీకి వెళ్లే విషయంపైనా పీకే నుంచి అభిప్రాయాన్ని తీసుకుంటున్నారు సీఎం కేసీఆర్. ఎన్డీఏ అభ్యర్థిని ఓడించడమే టార్గెట్.. మమతా బెనర్జీ విపక్షాల తరపున అభ్యర్థి ఎంపికకు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకోసం 22 విపక్షాలకు 15న ఢిల్లీలో మమత ఆహ్వానం పంపారు. అదే సమయంలో జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ పాత్ర కీలకం అని పీకే వెల్లడించారట. రాష్ట్రపతి ఎన్నికల కోసం విపక్షాల అభ్యర్థి ఎంపికలో కేసీఆర్ పాత్ర పై చర్చ వీరిరువురి నడుమ చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. గత రెండు రోజులుగా హైదరాబాద్‌లో ఉన్న పీకే.. ఈ మేరకు సీఎం కేసీఆర్‌తో వరుస భేటీలు జరుపుతున్నారు. -
గవర్నర్‌తో విభేదాలు.. మమత సర్కార్ కీలక నిర్ణయం
కోల్‌కత: పశ్చిమబెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని యూనివర్శిటీలకు ఇకపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీనే ఛాన్సలర్‌గా వ్యవహరిస్తారని ప్రకటించింది. ఈ మేరకు అసెంబ్లీలో సవరణ బిల్లు ప్రవేశపెట్టాలని కేబినెట్ నిర్ణయించింది. బెంగాల్ విద్యాశాఖ మంత్రి బర్త్య బసు ఈ విషయాన్ని వెల్లడించారు. విశ్వవిద్యాలయాల్లో నియామకాలపై గవర్నర్ జగదీప్ ధన్కడ్, మమతా బెనర్జీ సర్కార్ మధ్య పలుమార్లు విభేదాలు తలెత్తాయి. రాజ్‌భవన్‌తో సంబంధం లేకుండా దీదీ సర్కార్ వీసీలను నియమిస్తోందంటూ గవర్నర్ ధన్కడ్ ఆరోపణలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే గవర్నర్‌ను ఛాన్సలర్ హోదా నుంచి తప్పించాలని మమత నిర్ణయించుకున్నారు. తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వం కూడా ఇలాంటి చట్టమే తెచ్చింది. చదవండి👇 మహిళా ఎంపీపై బీజేపీ చీఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు పెళ్లికి తొందరపడాల్సిందే.. ఉరుకులు.. పరుగులు.. ఆలస్యం చేశారంటే! -
Mamata Banerjee: దేశంలో పరిస్థితి ఏం బాగోలేదు
కోల్‌కతా: ప్రస్తుతం కొనసాగుతున్న విభజించు–పాలించు, విభజన రాజకీయాల ఫలితంగా దేశం పరిస్థితి బాగోలేదని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితిని మార్చడానికి ప్రజలంతా ఐక్యంగా ఉండాలని ఆకాంక్షించారు. మంగళవారం ఆమె కోల్‌కతాలోని రెడ్ రోడ్లో రంజాన్ ప్రార్థనల్లో పాల్గొని, మాట్లాడారు. ‘దేశంలో పరిస్థితి బాగోలేదు.. ప్రస్తుతం కొనసాగుతున్న విభజన రాజకీయాలు, విభజించు–పాలించు విధానాలు సరికావు. హిందూముస్లింల మధ్య విభేదాలు సృష్టించేందుకు కొందరు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు’ అని ఆరోపించారు. ‘బెంగాల్ ప్రజల్లో ఐక్యతను చూసి అసూయతోనే వారు నన్ను వేధించారు. కానీ భయపడను. ఎలా పోరాడాలో నాకు తెలుసు’ అన్నారు. -
బెంగాల్‌పై నెత్తుటి మరక
పశ్చిమబెంగాల్లో మరోసారి రక్త చరిత్ర పునరావృతమైంది. ఈనెల 21 రాత్రి అక్కడి బీర్భూమ్ జిల్లాలోని రామ్‌పూర్‌హట్‌లో సాయుధులైన వందమంది దుండగులు చెలరేగి, ఇళ్లకు నిప్పంటించి ఎనిమిది నిండు ప్రాణాలు బలిగొన్నారు. మృతుల్లో ఆరుగురు మహిళలు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రాణాలతో ఉన్నవారు బతుకు జీవుడా అనుకుంటూ ఆ గ్రామం వదిలిపోయారు. దారుణాతి దారుణ హింస పశ్చిమ బెంగాల్‌కు కొత్తగాదు. ఎవరు అధికారంలో ఉన్నా ఇది తప్పడం లేదు. అక్కడ పార్టీల్లో ఏర్పడే అంతర్గత కలహాలు, పార్టీల మధ్య రాజుకునే ఆధిపత్య సమరాలు తరచూ హింసకు దారితీస్తున్నాయి. ఉద్రిక్తతలు చెలరేగుతున్నాయి. నాటు బాంబుల వాడకం రివాజైంది. ముఖ్యంగా బీర్భూమ్ జిల్లా అందుకు పెట్టింది పేరు. గ్రామంపై దుండగులు విరుచుకుపడ్డారన్న భయాందోళనలతో ఇళ్లలో తలదాచుకున్నవారిని బయటకు లాగి గొడ్డళ్లతో తీవ్రంగా గాయపరిచి, ఆ తర్వాత వారిని లోపలికి నెట్టి, ఆ ఇళ్లకు నిప్పంటించారని వస్తున్న కథనాలు వింటే ఒళ్లు గగుర్పొడు స్తుంది. అసలు అక్కడ అధికార యంత్రాంగం సక్రమంగా పనిచేస్తోందా... శాంతిభద్రతల పరిరక్షణ తన ప్రాథమిక కర్తవ్యమన్న సంగతి దానికి గుర్తుందా అన్న సంశయం కలుగుతుంది. హోంశాఖ బాధ్యతలు కూడా చూస్తున్న తృణమూల్ అధినేత, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ గ్రామానికి వెళ్లారు. బాధిత కుటుంబాలతో మాట్లాడాక ఆమె ఆదేశించడంతో స్థానిక తృణమూల్ నాయకుడు అనారుల్ హుస్సేన్‌ను అదుపులోనికి తీసుకున్నారు. మారణకాండ సంగతి తెలిసినా పోలీసులకు సమాచారం ఇవ్వలేదన్న కారణంతో ప్రస్తుతానికి అతన్ని అదుపులోనికి తీసుకున్నారు. దీనికి సూత్ర ధారి కూడా అతగాడేనా అన్నది మున్ముందు తేలాల్సి ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం తాపీ పనిచేసుకుని బతుకీడ్చిన హుస్సేన్ ఇప్పుడు ఖరీదైన మోటార్ బైక్‌లు, కార్లు, ఐఫోన్లతో... కళ్లు చెదిరే రెండంతస్తుల భవంతితో దర్జాగా ఉన్నాడంటే ఆ ప్రాంతంలో ఇన్నాళ్లుగా ఏం జరుగుతున్నదో ఊహించడం కష్టమేమీ కాదు. తృణమూల్ అంతర్గత కలహాల పర్యవసానంగా అంతకుముందు రోజు ఒక నాయకుడు హత్యకు గురికాగా, అందుకు ప్రతీకారంగా ఈ మారణకాండ జరిగింది. హత్య సంగతి తెలిసినా ప్రతీకార దాడులు జరిగే అవకాశం ఉన్నదన్న ఆలోచన పోలీసులకు కలగలేదు. పైగా రాత్రి 9.35కు ఈ రాక్షసకాండ సంగతి తెలిస్తే పది గంటల ప్రాంతంలోగానీ పోలీసులు అక్కడికి చేరుకోలేదు. పోలీస్ స్టేషన్ అక్కడికి కేవలం కిలోమీటర్ దూరంలో ఉంది. అంతేకాదు... స్వయంగా మమతా బెనర్జీ ఆదేశించేవరకూ ప్రధాన సూత్రధారిగా అనుమానిస్తున్న వ్యక్తిని అదుపులోనికి తీసుకోలేదంటే వారి నిర్వాకమేమిటో అర్థమవుతుంది. జనరంజక విధానాలతో, మెరుగైన హామీలతో ప్రజల మనసులు గెల్చుకుని అధికారంలోకి రావాలని విపక్షాలు ఆలోచించడం లేదు. ప్రజానుకూల విధానాలు, సంక్షేమ, అభివృద్ధి పథకాలతో మాత్రమే తిరిగి గద్దెనెక్కడం సాధ్యమవుతుందని పాలకులు ఆలోచించడం లేదు. నయానో భయానో ప్రజల్ని గుప్పెట్లో పెట్టుకునే స్థానిక పెత్తందార్ల అండతో గెలుపు శాశ్వతం చేసుకోవచ్చు నని భావించే ధోరణులు పుట్టుకొస్తున్నాయి. పశ్చిమ బెంగాల్లో అదే సమస్య. ఇంతక్రితం పాలించినవారితో విసుగెత్తి తృణమూల్‌ను గెలిపిస్తే గొర్రెలు తినేవాడు పోయి బర్రెలు మింగేవాడు వచ్చిన తీరుగా అక్కడ పల్లెల్లో కొత్త పెత్తందార్ల హవా మొదలైంది. తమకెదురు తిరిగినవారిని నక్సలైట్ల పేరుమీదనో, మరే ఇతర పార్టీ పేరుమీదనో కేసుల్లో ఇరికించడం సర్వసాధారణంగా మారింది. స్థానికంగా దొరికే వనరులను దోచుకుంటున్న క్రమంలో పంపకాల్లో తేడా రావడం వల్లనో, ఆ దోపిడీని ప్రశ్నించడం వల్లనో కక్షలు బయల్దేరుతున్నాయి. అధికారంలో ఉన్నవారికి ఆగ్రహం కలుగుతుందన్న కారణంతో పోలీసులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. గతంలో లెఫ్ట్ ఫ్రంట్ అధికారంలో ఉన్నప్పుడు సరిగ్గా ఇదే తరహాలో ఆధిపత్య పోరు నడిచేది. అది తరచూ హింసాకాండకు దారితీసేది. దీన్నంతటినీ సమూలంగా మారుస్తానని, పల్లెసీమలు ప్రశాంతంగా మనుగడ సాగించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చి మమత అధికారంలోకి వచ్చారు. కానీ జరిగింది వేరు. పల్లెటూళ్లలో గూండాల ప్రాబల్యం పెరిగింది. సాధారణ పౌరుల బతుకులు పెనం మీంచి పొయ్యిలో పడిన తీరుగా మారాయి. ఇప్పుడంతా అయ్యాక ఈ విషాద ఘటనకు కారకులని భావిస్తున్నవారిని పోలీసులు అరెస్టు చేస్తున్నారు. చట్టవిరుద్ధంగా ఉన్న ఆయుధాలను పదిరోజుల్లోగా స్వాధీనం చేసుకోవాలన్న ప్రభుత్వ ఆదేశాలతో అన్నిచోట్లా గాలింపు మొదలైంది. గ్రామం విడిచి వెళ్లిపోయినవారు వెనక్కొస్తున్నారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారించిన కలకత్తా హైకోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. ఇప్పటికే రాష్ట్రం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అన్ని వివరాలనూ సీబీఐకి అప్పగించాలని హైకోర్టు స్పష్టం చేసింది. కానీ అంతటితో ఆగకూడదు. ప్రభుత్వం చొరవ తీసుకుని ఈ దారుణ విషాద ఘటన మరెక్కడా పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలకు ఉపక్రమించాలి. మారుమూల ప్రాంతాలవరకూ విస్తరించి ఉండే పోలీసు, నిఘా వ్యవస్థల మొద్దు నిద్రను వదిలిం చేలా సమూల ప్రక్షాళన చేయాలి. హింసకు పాల్పడేవారికి రాజకీయ ప్రాపకం లభించబోదన్న సందేశం వెళ్లాలి. ఇలాంటి ఉదంతాలు తన పాలనకు మచ్చ తీసుకురావడమే కాదు... అంతర్జాతీయంగా మన దేశానికి అప్రదిష్ట తెస్తాయని మమత గుర్తించాలి. -
తృణమూల్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు.. వీడియో వైరల్
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం బెంగాల్లో వివాదాన్ని రేకెత్తిస్తోంది. దానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పశ్చిమ బెంగాల్‌లోని ఓ పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొన్న తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎమ్మెల్యే మనోరంజన్ బయాపరి బిహార్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కోల్‌కతాలోని బుక్ ఫెయిర్ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన సభలో టీఎంసీ ఎమ్మెల్యే మనోరంజన్ బయాపరి ప్రసంగిస్తూ.. ‘మీలో బెంగాలీ రక్తం ప్రవహిస్తే, ఖుదీరామ్, నేతాజీ(సుభాష్ చంద్రబోస్)ల రక్తం ప్రవహిస్తే.. మాతృభాషను, మాతృభూమిని ప్రేమిస్తే.. ఒక బీహార్ వ్యక్తి వంద వ్యాధులతో సమానం’ అని గట్టిగా అరవాలని వ్యాఖ్యానించారు. బెంగాలీలకు వ్యాధులు వద్దని, బెంగాల్‌ను వ్యాధి రహితంగా మార్చాలని పేర్కొన్నారు. తృణమూల్ ఎమ్మెల్యే చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను బీజేపీ నేత సువేందు అధికారి తీవ్రంగా తప్పుపట్టారు. ఎమ్మెల్యే మనోరంజన్ బయాపరి మాట్లాడిన వీడియో తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ముందు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ యూపీ, బిహారిలు లేని పశ్చిమ బెంగాల్‌గా మార్చాలని అన్నారు. ఎమ్మెల్యే మనోరంజన్ బయాపరి మొదటిసారిగా 2021 బెంగాల్ ఎన్నికల్లో హుగ్లీ నుంచి గెలిచారు. First his leader @MamataOfficial labels Biharis & UPites as "Bohiragotos" & now this clarion call to make Bengal free of Biharis.@BJP4Bihar @BJP4India @renu_bjp @SanjayJaisw @girirajsinghbjp @BJP4Jharkhand@YashwantSinha @PavanK_Varma — Suvendu Adhikari • শুভেন্দু অধিকারী (@SuvenduWB) March 14, 2022 -
మాపైకి మరో విమానం దూసుకొచ్చింది
కోల్‌కతా: మూడు రోజుల క్రితం చార్టర్డ్ విమానంలో ప్రయాణిస్తుండగా తనకు ఎదురైన భయానక అనుభవాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఎన్నికల ప్రచారం ముగించుకొని కోల్‌కతాకు తిరిగి వస్తుండగా తమ విమానానికి ఎదురుగా మరో విమానం దూసుకొచ్చిందని చెప్పారు. తమ పైలట్ తక్షణమే అప్రమత్తమై చాకచాక్యంగా విమానాన్ని కిందకు దించడంతో పెద్ద ముప్పు తప్పిందని అన్నారు. లేకపోతే మరో 10 సెకండ్ల వ్యవధిలోనే రెండు విమానాలు ఢీకొనేవని తెలిపారు. పైలట్ సమర్థత కారణంగానే తాను ప్రాణాలతో బయటపడ్డానని వెల్లడించారు. మమత ప్రయాణిస్తున్న విమానం భారీగా కుదుపులకు లోనైనట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. విమానం కుదుపుల వల్ల మమతా బెనర్జీ ఛాతీ, వీపు భాగంలో గాయాలైనట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ సంఘటనపై నివేదిక ఇవ్వాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ)ను బెంగాల్ ప్రభుత్వం కోరింది. (చదవండి: బెంగాల్ అసెంబ్లీలో హైడ్రామా) -
తృణమూల్ ప్రభంజనం.. 102 మున్సిపాల్టీలు కైవసం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో 10 నెలల క్రితం జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించి, రెండోసారి అధికారంలోకి వచ్చిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) తాజాగా మున్సిపల్ ఎన్నికల్లోనూ సత్తా చాటింది. 108 మున్సిపాల్టీలకు గాను ఏకంగా 102 మున్సిపాల్టీలను తన ఖాతాలో వేసుకుంది. ప్రతిపక్షాలను చావుదెబ్బ కొట్టింది. పురపాలక సంఘాల ఎన్నికల ఫలితాలు బుధవారం వెలువడ్డాయి. మొత్తం 2,170 వార్డులకు గాను టీఎంసీ 1,870 వార్డులను దక్కించుకుంది. పోలైన మొత్తం ఓట్లలో ఆ పార్టీ 63.45 శాతం ఓట్లను సాధించింది. నాలుగు మున్సిపాల్టీల్లో హంగ్ ఏర్పడింది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆరాటపడుతున్న ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత మమతా బెనర్జీకి ఈ ఫలితాలు మరింత ఉత్సాహాన్ని ఇస్తాయనడంలో సందేహం లేదు. నందిగ్రామ్ ఎమ్మెల్యే, బీజేపీ నేత సువేందు అధికారికి కంచుకోట అయిన కాంతీ మున్సిపాల్టీలో టీఎంసీ విజయం సాధించడం గమనార్హం. కొత్తగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన హమ్రో పార్టీ డార్జీలింగ్ మున్సిపాల్టీని దక్కించుకుంది. తాహెర్‌పూర్ పురపాలక సంఘంలో సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ జెండా ఎగురవేసింది. బీజేపీ కనీసం ఒక్క మున్సిపాల్టీని కూడా దక్కించుకోలేకపోయింది. కాంగ్రెస్ పార్టీకి చేదు అనుభవమే మిగిలింది. వారణాసిలో నేడు, రేపు మమతా ప్రచారం ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)కి మద్దతుగా ప్రచారం నిర్వహించేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం సాయంత్రం కోల్‌కతా నుంచి బయలుదేరి వెళ్లారు. ఆమె రెండు రోజులపాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. వారణాసి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో గురువారం, శుక్రవారం ప్రచారం నిర్వహిస్తారు. -
Sakshi Cartoon: విష్ యూ హ్యాపీ బర్త్‌డే టూయూ!
విష్ యూ హ్యాపీ బర్త్‌డే టూయూ! -
బెంగాల్ బెబ్బులి జాతీయ స్వప్నం
‘యూపీఏనా? అదెక్కడుంది? ఇప్పుడది గత చరిత్ర!’ ఇది కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ గురించి ఏ ప్రత్యర్థి బీజేపీనో అన్న మాట కాదు. బీజేపీకి బద్ధశత్రువుగా యూపీఏతో కలసి నడచిన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్య. మహారాష్ట్రలో శరద్ పవార్‌తో బుధవారం నాటి భేటీ అనంతరం మమత వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం. కేంద్రంలో బీజేపీ సర్కారును గద్దె దించడానికి కాంగ్రెస్ సత్తా సరిపోవట్లేదనేది ఈ బెంగాల్ బెబ్బులి మాటల సారాంశం. ఎనిమిది నెలల క్రితం మార్చి 31న బీజేపీపై ఐక్యపోరాటం అవసరమంటూ కాంగ్రెస్ సహా 15 ప్రతిపక్షాలకు లేఖలు రాసిన దీదీ ఇప్పుడు రూటు మార్చారు. జాతీయ స్థాయిలో పగ్గాలు పట్టాలని ఆమె భావిస్తున్నట్టు ఇటీవలి పరిణామాలతో తేటతెల్లమవుతోంది. శివసేన, శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేతలను కలుసుకొనేం దుకు 3 రోజుల ముంబయ్ పర్యటనకు వచ్చారు మమత. ‘దేశంలోని ఫాసిజమ్ వాతావరణాన్ని ఎదుర్కోవాలంటే, బలమైన ప్రత్యామ్నాయం అవసరం’ అన్నారామె. ‘పోరాడాల్సిన వారు (కాంగ్రెస్) సమర్థంగా పోరాడకపోతే ఏం చేయాలి’ అనడం ద్వారా కాంగ్రెస్‌తో సంబంధం లేని కొత్త ప్రతిపక్ష కూటమి వాదనను పరోక్షంగా తెరపైకి తెచ్చారు. మహారాష్ట్రలో కాంగ్రెస్‌తో పొత్తున్న ఎన్సీపీ నేత పవార్ సైతం ప్రతిపక్షాలకు బలమైన ప్రత్యామ్నాయ నాయకత్వం అవసరమని పునరుద్ఘాటిం చారు. అంటే ఇప్పుడున్న నాయకత్వం బలంగా లేదనీ, దానికి బదులు మరొకటి రావాలనీ ఆయన కూడా స్థూలంగా అంగీకరించారన్న మాట. ఇన్నాళ్ళుగా ప్రతిపక్షాలకు పెద్దన్నలా ఉంటున్న కాంగ్రెస్‌కు ఇది ఊహించని ఎదురుదెబ్బ. ‘రాజకీయాల్లో నిరంతరం శ్రమించాలి. విదేశాల్లో రోజుల తరబడి గడిపితే కుదరదు’ అంటూ రాహుల్‌పై మమత బాణాలు సంధించడం గమనార్హం. కాంగ్రెస్, తృణమూల్ సంబంధాలు దెబ్బతిన్నాయనడానికి ఇలాంటి ఎన్నో సూచనలున్నాయి. ఈ నవంబర్‌లో మమత 4 రోజులు ఢిల్లీలో పర్యటించారు. అక్కడ మోదీని కలిశారే తప్ప, కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాను కలుసుకోలేదు. సరికదా... అసంతృప్త కాంగ్రెస్ నేతల్ని కలిశారు. పైపెచ్చు, ఆమె ఢిల్లీలో ఉన్నప్పుడే మేఘాలయ కాంగ్రెస్ శాఖ నిట్టనిలువునా చీలింది. మాజీ సీఎం ముకుల్ సంగ్మా వచ్చి తృణమూల్ గూటిలో చేరారు. ఒక్క సంగ్మానే కాదు... ఇటీవల ఢిల్లీలో కీర్తీ ఆజాద్, అశోక్ తన్వార్, యూపీలో లలితేశ్ త్రిపాఠీ, గోవాలో లుయిజిన్హో ఫలీరో, అస్సామ్‌లో సుస్మితా దేవ్– ఇలా హస్తం వదిలేసి, దీదీ చేయి పట్టుకున్నవాళ్ళు సమీప గతంలో అనేకులున్నారు. వారిని ఆపి, అసంతృప్తిని తీర్చలేక కాంగ్రెస్ నిస్సహాయంగా మిగిలిపోయింది. భావసారూప్య శక్తులన్నీ జాతీయస్థాయిలో కలసివచ్చి, సమష్టి నాయకత్వం పెట్టుకోవడం మంచిదే. కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ పేరిట ఇంతకాలం జరిగింది ఒకరకంగా అదే. కానీ, ఇప్పుడు టీఎంసీ లాంటివి కొత్త ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నాయంటే, అది కాంగ్రెస్ నాయకత్వ వైఫల్యమే. దాదాపు 135 ఏళ్ళ వయసున్న కాంగ్రెస్‌కు ఏకంగా 18కి పైగా రాష్ట్రాల్లో బలమైన ఉనికి ఉంది. ఇప్పటికీ దేశంలో ప్రధాన ప్రతిపక్షం అదే. అయితే, ప్రస్తుతం పంజాబ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ – ఈ 3 రాష్ట్రాల్లోనే ఆ పార్టీ అధికారంలో ఉంది. మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వంలో, జార్ఖండ్‌లో ద్వితీయశ్రేణి భాగస్వామిగా కొనసాగుతుండడం చేదునిజం. దేశంలో 3 నుంచి 3.5 కోట్ల మంది కార్యకర్తలు ఇప్పటికీ కాంగ్రెస్‌కు ఉన్నారని లెక్క. జాతీయ స్థాయిలో అంత బలం, బలగం ఉన్నప్పటికీ కాంగ్రెస్ బలమైన ప్రతిపక్ష పాత్ర పోషించలేకపోతోంది. నాయకత్వ లేమి, రాహుల్ అపరిపక్వత, పార్టీలో అసంతృప్తి దాన్ని బీజేపీకి దీటుగా నిలపలేకపోతున్నాయి. ఫలి తంగా ప్రతిపక్షంలో శూన్యత ఏర్పడింది. అదే ఇప్పుడు మమతకు కలిసొచ్చేలా ఉంది. రాగల మూడు నెలల్లో పార్టీ రాజ్యాంగాన్నీ, చివరకు పేరును కూడా జాతీయ స్థాయికి తగ్గట్టు మార్చే యోచనలో టీఎంసీ ఉంది. కానీ, జాతీయస్థాయి విస్తరణకు దీదీ వద్ద సమగ్రవ్యూహమే ఏమీ ఉన్నట్టు లేదు. ముప్పుతిప్పలు పెట్టిన బీజేపీపై వ్యక్తిగత లెక్కలు తేల్చుకోవడమే ధ్యేయంగా కనిపిస్తోంది. తగ్గట్టే ఇప్పుడు బీజేపీ పాలిత త్రిపుర, గోవాలలో సైతం తృణమూల్ బరిలోకి దిగింది. ఈ గందరగోళంలో బీజేపీ కన్నా కాంగ్రెస్‌కే దెబ్బ తగులుతోంది. 2016లో కేవలం 3 స్థానాలున్న బెంగాల్లో ఇవాళ బీజేపీ దాదాపు 70 సీట్లకు ఎదిగింది. కానీ, గత పదేళ్ళలో అక్కడి కాంగ్రెస్ కార్యకర్తలు, నేతల్లో అధికభాగం దీదీ వైపు వచ్చేశారు. గతంలో బీజేపీతో, కాంగ్రెస్‌తో దోస్తీ మార్చిన తృణమూల్ నిజానికి సిద్ధాంతాల కన్నా దీదీ ఛరిష్మాపై ఆధారపడుతున్న సంగతీ మర్చిపోలేం. రెండు సార్లు ఎంపీ, వరుసగా మూడుసార్లు బెంగాల్ సీఎం అయిన దీదీకి కావాల్సినంత అనుభవం ఉంది. పోరాటానికి కావాల్సిన దూకుడూ ఉంది. బెంగాల్లో ఈ ఏటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని మట్టి కరిపించిన ఘనతా ఉంది. కానీ, మోదీకి, మమత పోటీ అవగలరా? అసలు కాంగ్రెస్ లేని ప్రతిపక్షం సాధ్యమా? అలాంటి కూటమి విజయం సాధిస్తుందా? బెంగాల్ బయట తృణమూల్ విస్తరణవాదం బీజేపీనేమో కానీ, ప్రతిపక్షాలనే దెబ్బతీసేలా ఉంది. అసలు జాతీయ స్థాయిలో 2014తో పోలిస్తే, 2019లో టీఎంసీకి సీట్లు తగ్గాయనీ, కాబట్టి జాతీయ వేదికపై దాని బలం ఏమంత గొప్పగా లేదనీ కొందరు గుర్తుచేస్తున్నారు. అయినా, పాలకపక్షంతో పోరాడాల్సిన ప్రతిపక్షాలు కొత్త నాయకత్వం కోసం కలహించుకుంటే ఏమవుతుంది? పిట్ట పోరు, పిట్ట పోరు... పిల్లి తీరుస్తుంది. -
సాక్షి కార్టూన్ 29-10-2021
-
భవానీపూర్ ఓటర్లకు ప్రత్యేక ధన్యవాదాలు : మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్: భవానీపూర్ ఉపఎన్నికలలో తృణముల్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ భారీ మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఆమె భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ప్రియాంక టిబ్రివాల్‌పై 58,389 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ.. తనను భారీ మెజార్టీతో గెలిపించిన భవానీపూర్ ఓటర్లకు తన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నందిగ్రామ్‌లో ఓడించడానికి బీజేపీ పెద్ద కుట్ర చేసిందని అన్నారు. పశ్చిమ బెంగాల్లో.. బీజీపీ ప్రభుత్వం తరచు వివాదాలను సృష్టించిందని అన్నారు. తమ ప్రభుత్వంపై బీజేపీ అసత్య ఆరోపణలు చేసిందని మమత మండిపడ్డారు. భవానీపూర్‌లో.. తాను బరిలో దిగకుండా బీజీపీ అనేక కుయుక్తులు పన్నిందని ఆరోపించారు. ప్రజలు నాపై నమ్మకం ఉంచి భారీమెజార్టీతో గెలిపించారని అన్నారు. కేవలం ఆరు నెలల్లోనే ఎన్నికలను నిర్వహించినందుకు కేంద్ర ఎన్నికల కమిషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. భవానీపూర్ విజయంతో తన బాధ్యత మరింత పెరిగిందని సీఎం మమత అన్నారు. చదవండి: Mamata Banerjee: భారీ మెజార్టీతో మమతా బెనర్జీ విజయం -
బెంగాల్ లో మూడు స్థానాలకు ఉపఎన్నిక పోలింగ్
-
బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్‌కు షాక్
సాక్షి, ఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్‌కు షాక్ తగిలింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల అనంతరం చోటు చేసుకున్న హింస ఘటనల కేసులను సీబీఐకి అప్పగించాలని కోల్కత్తా హైకోర్టు మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. హింసాత్మక ఘటనలపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని పేర్కొంది. అత్యాచారం, హత్య కేసులన్నీ సీబీఐకి బదిలీ చేయాలని ఆదేశాలు జారీచేసింది. కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని స్పష్టం చేసింది. ఆరు వారాల్లో సిట్, సీబీఐ తమకు నివేదిక అందించాలని కోల్కత్తా హైకోర్టు ఆదేశించింది. ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ మద్ధతుదారులపై పెద్ద ఎత్తున దాడులు జరిగాయని ఆరోపణలు ప్రచారంలో ఉన్నాయి. అదే విధంగా బీజేపీ సానుభూతిపరులపై హింసకు పాల్పడ్డారని అభియోగాలు ఉన్నాయి. ఇప్పటికే హింసాత్మక ఘటనలు జరిగిన ప్రదేశాలను గవర్నర్ పర్యటించి కేంద్రానికి నివేదిక అందజేశారు. రాష్ట్రంలో భారీస్థాయిలో ఎన్నికల అనంతరం హింస చోటుచేసుకుందని నివేదికలో వెల్లడైంది. -
ఆదివాసీ మహిళలతో కలిసి సీఎం మమత నృత్యం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నృత్యం చేసి, డ్రమ్స్ వాయిస్తూ సందడి చేశారు. సోమవారం బెంగాల్‌లోని ఝార్గ్రామ్లో నిర్వహించిన ఓ వేడుకలో మహిళలతో కలిసి మమత డ్యాన్స్ చేశారు. సోమవారం ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా అధికారులు ఆదివాసీలు, గిరిజనులతో ఓ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం మమతా పాల్గొని, ఆదివాసీ మహిళలతో కలిసి సాంప్రదాయం నృత్యం చేశారు. అదే విధంగా ఆమె డోలు వాయిస్తూ ఆదివాసీ మహిళల్లో ఉత్సాహాన్ని నింపారు. ప్రస్తుతం సీఎం మమతా చేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
‘టీఎంసీ కార్యకర్తలపై దాడుల వెనక అమిత్ షా’
కోల్‌కతా: త్రిపురలో బీజేపీ నియంతృత్వ ప్రభుత్వాన్ని కొనసాగిస్తోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. త్రిపురలోని అగర్తలలో గాయపడిన తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలను ఎస్ఎస్కేఎం ఆస్పత్రిలో మమతా బెనర్జీ సోమవారం పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మమతా మాట్లాడుతూ.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నియంతృత్వ పాలన సాగుతోందని, ముఖ్యంగా త్రిపుర, అసోం, ఉత్తరప్రదేశ్‌లో అడ్డు అదుపు లేకుండా పోయిందని దుయ్యబట్టారు. ఆదివారం త్రిపురలో కొందరు వ్యక్తులు.. సుదీప్, జయ అనే ఇద్దరు బెంగాల్ విద్యార్థులపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చారని మండిపడ్డారు. పోలీసుల ముందే దాడి జరిగినప్పటికీ వారు పట్టించుకోలేదని, కనీసం వైద్య సదుపాయం కూడా కల్పించలేదని విమర్శించారు. ఈ దాడుల వేనక కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఉన్నారని మమతా ఆరోపించారు. అందుకే పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారని అన్నారు. ఇటీవల టీఎంసీ జాతీయ జనరల్ సెక్రటరీ అభిషేక్ బేనర్జీ త్రిపురలోని అగర్తల పట్యటించిన సమయంలో ఆయన కాన్వాయ్‌పై కొంతమంది కర్రలతో దాడి చేసి విషయం తెలిసిందే. ఈ దాడుల వెనుక కేంద్ర మంత్రి అమిత్ షా ఉన్నారని, వాటికి ఆయన బాధ్యతవహించాలని మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. -
త్వరలో ఢిల్లీకి మమతా.. సోనియా గాంధీని కలువనుందా?
ఢిల్లీ: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ త్వరలో ఢిల్లీ పర్యటించనున్నారు. వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభ కానున్న నేపథ్యంలో మమతా హస్తిన పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. తన పర్యటనలలో భాగంగా అపాంట్మెంట్ దొరికితే.. ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్నాథ్కొవింద్ను కలుస్తానని పేరొన్నారు. అదే విధంగా ఆమె కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియా గాంధీతో భేటీ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ‘రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన అనంతరం దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లలేదు. ప్రస్తుతం కరోనా వైరస్ పరిస్థితి నియంత్రణలోకి వస్తోంది. పార్లమెంట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఢిల్లీ వెళ్లి, పలువురు నేతలను కాలవనున్నాను’ అని మమతా బెనర్జీ గురువారం పేరొన్నారు. మమత ఢిల్లీ పర్యటన నేపథ్యంలో 2024లో బీజేపీని ఎదుర్కొవడానికి పలు ప్రతిపక్ష పార్టీలతో కూడిన సంకీర్ణ కూటమీలో ఆమె భాగస్వామ్యం కానున్నట్లు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక మమతాబెనర్జీ జూలై 25న ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. వార్షాకాల పార్లమెంట్ సమావేశాలు జూలై 19 నుంచి ఆగస్టు13 వరకు జరుగుతాయి. ఇటీవల బీజేపీ వ్యకతిరేక కూటమికి చెందిన పలు పార్టీలకు చెందిన ప్రముఖ నేతలు ఎన్సీపీ నేత శరద్ పవర్ నివాసంలో భేటీ అయిన విషయం తెలిసిందే. ఇక, ఇటీవల ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. శరద్ పవార్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలలో వరుసగా భేటీ అవుతున్న నేపథ్యంలో మమత పర్యటనపై కూడా రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. -
గంగూలీకి దీదీ శుభాకాంక్షలు.. ఇంటికెళ్లి మరీ విష్ చేసిన బెంగాల్ సీఎం
కోల్‌కతా: టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ గురువారం తన 49వ పుట్టిన రోజు జరుపుకున్నాడు. ఈ సందర్భంగా బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దాదా ఇంటికి వెళ్లి మరీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గంగూలీ నివాసంలో కొద్దిసేపు గడిపిన దీదీ.. గంగూలీ కుటుంబ సభ్యులతో సరదాగా మాట్లాడారు. ప్రిన్స్ ఆఫ్ కోల్‌కతాగా పిలువబడే గంగూలీని ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రే ఇంటికెళ్లి మరీ విష్ చేయడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గంగూలీ రాజకీయ అరంగేట్రం చేస్తాడని టీఎంసీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. అయితే దాదా బీజేపీతో సైతం క్లోజ్‌గానే మూవ్ అవుతుంటాడు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కుమారుడు, బీసీసీఐ జనరల్ సెక్రెటరీ జై షాతో కలిసి దగ్గరగా పనిచేస్తుంటాడు. ఇదిలా ఉంటే, గంగూలీ.. ఇవాళ ఉదయం కోల్‌కతాలోని తన కార్యాలయంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను నిరాఢంబరంగా జరుపుకున్నాడు. తన సహోద్యోగులు ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొని చిరునవ్వులు చిందుస్తూ కేక్ కట్ చేశాడు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. క్రికెట్, యూరోకప్, కోపా అమెరికా ఫుట్‌బాల్, ఒలింపిక్స్‌కు సంబంధించి విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. మరోవైపు దాదాకు సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు ఆయను విషెస్ తెలియజేశారు. భారత్ తరఫున 113 టెస్ట్‌లు, 311 వన్డేలు ఆడిన దాదా.. రెండు ఫార్మాట్లలో కలిపి 18,575 రన్స్ చేశాడు. మొత్తం 195 మ్యాచ్‌లకు సారథ్యం వహించిన ఆయన.. 97 మ్యాచ్‌ల్లో టీమిండియాకు విజయాలనందించి భారత దేశపు అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడిగా నిలిచాడు. -
బీజేపీ నేతలకు కనీస మర్యాద, సభ్యత లేదు: మమతా
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీపై విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గవర్నర్ జగదీప్ ధన్కర్ ప్రారంభ ఉపన్యాస సమయంలో బీజేపీ ఎమ్మెల్యేల తీరుపై సీఎం మమతా తీవ్రంగా మండిపడ్డారు. గవర్నర్ ఉపన్యాసం అనంతరం ఆయనకు సీఎం మమతా కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్రమంలో సీఎం మమతా బీజేపీ ఎమ్మెల్యేలపై మండిపడ్డారు. తాను బీజేపీకి చెందిన సుష్మా స్వరాజ్ నుంచి రాజనాథ్సింగ్ వంటి నేతలను చూశానని తెలిపారు. కానీ ప్రస్తుతం బెంగాల్లో ఉన్న బీజేపీ నాయకులు చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. ఇక్కడున్న బీజేపీ నేతలకు కనీసం సభా గౌరవ మర్యాదలు, సభ్యత లేదని దుయ్యబట్టారు. ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత చెలరేగిన హింసాత్మక ఘటన కేసులకు సంబంధించి అసెంబ్లీలో నిరసన తెలిపారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రారంభ ఉపన్యాసాన్ని అడ్డుకోవడానికి బీజేపీ ఎమ్మెల్యేలు యత్నించారు. -
దీదీ ఎత్తుగడ: ఏకంగా గవర్నర్‌కే గురి!
పశ్చిమ బెంగాల్ పాలనలో కేంద్రం జోక్యానికి చెక్ పెట్టేందుకు, రివెంజ్ దిశగా మమతా బెనర్జీ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా గవర్నర్ ధన్‌ఖర్‌ను గద్దెదించేందుకు ఏకంగా అసెంబ్లీలో తీర్మానం చేయబోతున్నట్లు సమాచారం. కోల్‌కతా: పాలనాపరంగా పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగ్దీప్ ధన్‌ఖర్‌కు, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మొదటి నుంచే పొసగడం లేదు.ఈ క్రమంలో ఆయన బహిరంగంగానే దీదీ తీరును, పాలనను తప్పుబడుతూ వస్తున్నాడు. ఇంకోవైపు అసెంబ్లీ ఎన్నికల టైం నుంచి ఆ విమర్శలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఈ తరుణంలో ఆయన్ని గవర్నర్ గిరి నుంచి సాగనంపేందుకు దీదీ పాచికలు కదుపుతోంది. ధన్‌ఖర్‌ను సాగనంపే విషయంపై ఇదివరకే మమతా, బిమన్ బెనర్జీతో చర్చించినట్లు సమాచారం. జులై 2 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఆ సమావేశాల్లో మొదటి సెషన్లో.. అది కూడా గవర్నర్ స్పీచ్ అనంతరమే తీర్మానం ప్రవేశపెట్టాలని, తద్వారా తమ పవర్ ఏంటో చూపించాలని టీఎంసీ నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. లోక్‌సభ స్పీకర్‌కీ.. గవర్నర్ ధన్ఖర్ బెంగాల్ అసెంబ్లీ వ్యవహారాల్లో అతిగా జోక్యం చేసుకుంటున్నారంటూ స్పీకర్ బిమన్ బెనర్జీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు మంగళవారం ఫిర్యాదు చేశారు. ‘పెండింగ్ బిల్లులు సంతకం చేయకుండా జాప్యం చేస్తున్నాడని, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా.. అనైతికంగా గవర్నర్ తీరు ఉందని’ ఫిర్యాదులో బిమన్ పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇక టీఎంసీ సీనియర్ నేతలు కూడా గవర్నర్‌ను దించేయడమే ఎజెండాగా పెట్టుకుని అసెంబ్లీలో అడుగుపెట్టాలని నిర్నయించుకున్నారు. ఒక పార్టీకి ప్రతినిధిగా వ్యవహరిస్తున్న గవర్నర్ తీరు హేయనీయంగా ఉందంటూ వరుసగా టీవీ ఛానెల్స్ డిబెట్లలో పాల్గొంటున్నారు. ఇక బెంగాల్లో శాంతిభద్రతలు కాపాడుతున్న గవర్నర్‌ను.. తామూ కాపాడుకునేందుకు ప్రయత్నిస్తామని బీజేపీ స్టేట్ ఛీఫ్ దిలీప్ ఘోష్ చెబుతున్నాడు.