కోల్‌కతా: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఇవాళ(బుధవారం) సాయంత్రం కరోనా సంక్షోభంపై జరగనున్న వీడియో కాన్సిఫెరన్స్‌కు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హాజరుకావడం లేదు. ఈ సమావేశానికి హజరయ్యే ముఖ్యమంత్రుల జాబితాలో మమతా బెనర్జీ పేరు లేకపోవడం గమనార్హం. దీంతో కరోనా సంక్షోభంపై 3 గంటలకు జరిగే ఈ సమావేశానికి ప్రధాన కార్యదర్శి రాజీవ్ సిన్హా హజరు కానున్నట్లు రాష్ట్ర సచివాలయ వర్గాలు నబన్నా తెలిపారు. ('మేము ప్రధాని మోదీని తొలగించాలన్నామా?')
సమావేశానికి హాజరయ్యే ముఖ్యమంత్రుల జాబితాలో మమతా బెనర్జీ పేరు లేకపోవడంపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పార్థా ఛటర్జీ స్పందిస్తూ.. కేంద్ర మరోసారి బెంగాల్‌ను అవమానించింది. రాష్ట్ర సీఎం మమతను మాట్లాడకుండా చేసేందుకే ఆహ్వానం ఇవ్వలేదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రులను తమ సమస్యలను తెలియజేయడానికి అనుమతించకపోతే వీడియో సమావేశాల పేరిట సమావేశాలు వృధా అని ఆయన ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు. అంఫాన్ తుపాను సమయంలో తీవ్రంగా నష్టపోయిన బెంగాల్‌కు కేంద్రం కేవలం రూ. 1000కోట్లు మాత్రమే సాయం చేసిందని, ఇంకా కేంద్రం నుంచి వేల కోట్ల రూపాయలు రావాల్సి ఉందని ఆయన తెలిపారు. (‘అమిత్ షా.. మీరే రంగంలోకి దిగొచ్చుగా?’)
మమత ఈ విషయాన్ని ప్రస్తావిస్తారనే ఉద్దేశంతోనే ఆమెను రాకుండా అడ్డుకున్నారని టీఎంసీ నాయకులు కేంద్రంపై మండిపడుతున్నారు. బీజేపీయేతర పాలిత ప్రాంతాల పట్ల కేంద్రం వివక్ష చూపుతోందని ఆరోపించారు. ఇప్పటికే కరోనా వైరస్‌పై పోరాటం, అంఫాన్ తుపాన్ కారణంగా బెంగాల్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని మమత పేర్కొన్నారు. వలస కార్మికుల విషయంలో కూడా మమత అనేక సార్లు కేంద్రాన్ని విమర్శించిన విషయం తెలిసిందే. ఈ విమర్శలపై బీజేపీ నేత రాహుల్ సిన్హా మాట్లాడుతూ, కేంద్రం తీసుకునే ప్రతి నిర్ణయంలో లోపాలను వెతకడం టీఎంసీ నాయకులకు అలవాటుగా మారిందన్నారు. బెంగాల్‌తో పాటు బీహార్, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, ఉత్తర ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులు కాకుండా ఆయా రాష్ట్రా ప్రతినిధులు మోదీ సమావేశానికి హజరు కానున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment