సాక్షి, న్యూఢిల్లీ : అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మొదటగా ఉదయం 10.30 గంటల నుంచి 12 గంటల వరకు కరోనా కేసులు ఎక్కువగా ఉన్న కేరళ, పశ్చిమబెంగాల్, ఢిల్లీ, హరియానా, రాజస్తాన్, గుజరాత్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సీఎంలతో సమావేశం అయ్యారు. అనంతరం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతినిధులతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.
(చదవండి : సోషల్ మీడియా కింగ్ మోదీ.. రెండో స్థానంలో సీఎం జగన్)
తిరుమల పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దంపతులకు స్వాగతం పలికిన అనంతరం సీఎం జగన్ ప్రధాని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. కోవిడ్ నిరోధక వ్యాక్సిన్‌కు సంబంధించిన వివిధ అంశాలపై ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ చర్చించారు. వ్యాక్సినేషన్ ముందుగా ఎవరికి ఇవ్వాలి? ప్రాధాన్యతలు, క్షేత్రస్థాయిలో అనుసరించాల్సిన విధానాలు, పంపిణీ సందర్భంలో అనుసరించాల్సిన పద్ధతులపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. కరోనా పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచానా వేయాలని సీఎంలకు సూచించారు. కొందరి నిర్లక్ష్యం వల్లే కేసుల సంఖ్య పెరుగుతుందని అసహనం వ్యక్తం చేశారు. కరోనా టెస్టుల సంఖ్యను ఇంకా పెంచాల్సిన అవసరం ఉందని మోదీ అభిప్రాయపడ్డారు.
(చదవండి : రాష్ట్రపతికి సీఎం జగన్ ఘన స్వాగతం)
Comments
Please login to add a commentAdd a comment