సాక్షి, తాడేపల్లి: కరోనా వైరస్ నివారణకు వివిధ రాజకీయ పక్షాలతో కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శుక్రవారం జరిగిన ప్రధాని వర్చ్యువల్ సమావేశంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి సీఎం క్యాంపు కార్యాలయం నుంచి పాల్గొన్నారు. ఈ సమావేశంలో కరోనా నివారణ, వ్యాక్సిన్‌ల పంపిణీపై చర్చించారు. ఈ సందర్భంగా పార్టమెంటరి సభ్యులు విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. టెస్టింగ్ లేని సమయంలోనే తమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అత్యధిక స్థాయిలో పరీక్షల నిర్వహించారన్నారు. దాదాపు 20 శాతం జనాభాకు ఇప్పటి వరకు కరోనా టెస్టులు చేశామని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6వేల యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయని, 0.81 శాతం మరణాల రేటు ఉందన్నారు. దీంతో కరోనా రీకవరి రేటులో ఏపీ దేశంలోనే మూడో స్థానంలో ఉందని తెలిపారు. దీనికి సీఎం వైఎస్ జగన్ కృషితోపాటు ప్రధాని సహకారం కూడా ఉందన్నారు. కాగా వ్యాక్సిన్ తయారీలో ప్రధాని చూపుతున్న కృషి అభినందనీయం ఆయన పేర్కొన్నారు. (చదవండి: సోషల్ మీడియా కార్యకర్తలను విస్మరించం..)
తొలుత ఫ్రాంట్ లైన్ వారియర్స్‌కు ఈ వాక్సిన్ ఇవ్వాలని మీరు తీసుకున్న నిర్ణయం ముదావహం అని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ఆరోగ్య శ్రీ ద్వారా కోవిడ్‌కు ఉచితంగా వైద్యం అందిస్తున్నామని, 150 సూపర్ స్పెషలిటీ ఆస్పత్రుల్లో రీయంబర్స్ చేస్తున్నామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఇందుకోసం సీఎం వైఎస్ జగన్ మొత్తం 432 సంఖ్యలో108, 656 సంఖ్యలో 104 వాహనాల సేవలను అందుబాటులోకి తెచ్చారని చెప్పారు. కోవిడ్ నివారణకు ఏపీలో అధికంగా నిధులు ఖర్చు చేస్తున్నామని, కోవిడ్ నివారణ కోసం తాము రోజుకు 10.18 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. దీనిలో 4.57 కోట్ల రూపాయలు కేవలం టెస్టులకే ఖర్చు చేశామని వెల్లడించారు. కాగా కరోనా నివారణకు ఏపీకి తమ వైపు నుంచి కూడా ఆర్థికంగా సాయం చేయాలని ఆయన ప్రధానిని కోరారు. వాక్సిన్ స్టోరేజీకి కేంద్రం కావాల్సిన మౌలిక వసతుల ఏర్పాటుకు కూడా కేంద్రం సాయం చేయాలని, బీపీఎల్ వారికి ఉచితంగా వాక్సిన్ ఇవ్వాల్సిందిగా ప్రదానిని ఆయన విజ్ఞప్తి చేశారు. (చదవండి: వైఎస్సార్ విగ్రహం అంటే.. బాబుకు నిద్రపట్టట్లేదు)
Comments
Please login to add a commentAdd a comment