కోల్‌కతా: ‘ఓవైపు కరోనా, మరోవైపు అంఫన్‌తో పోరాడుతుంటే కొన్ని పార్టీలు మమ్మల్ని అధికారం నుంచి తొలగించాలని చూస్తున్నాయి. ఇది నిజంగా బాధాకరం. మేం ఏమైనా ప్రధాని పీఠం నుంచి నరేంద్ర మోదీని తొలగించాలని కోరామా?’ అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. కోవిడ్ సంక్షోభ సమయంలో బీజేపీ రాజకీయాలు చేయడంపై ఆమె తీవ్రంగా మండిపడ్డారు. రాజకీయాలు చేసేందుకు ఇది తగిన సమయమేనా అని మమతా సూటిగా ప్రశ్నించారు. మీరంతా గత మూడు నెలలుగా ఏమైపోయారంటూ ప్రశ్నలు సంధించారు. (రైళ్లను అనుమతించడం లేదు.. ఇది అన్యాయం)
తాము క్షేత్రస్థాయిలో పని చేస్తున్నామని, కరోనా వైరస్‌పై పోరాటంతో పాటు, రాజకీయ కుట్రపైనా బెంగాల్ ప్రభుత్వం గెలుస్తుందని పేర్కొన్నారు. కాగా అంఫన్ తుపాను వల్ల రూ.1 లక్ష కోట్ల నష్టం వాటిల్లిందని, దాన్ని భర్తీ చేయాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. దీనిపై ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ వ్యంగ్యంగా స్పందించారు. విపత్తుల్లో ఆదాయం వెతుక్కునేందుకు ఇదో వ్యూహమని పేర్కొన్నారు. సీపీఐ, సీపీఎమ్‌లకు ఇదే వ్యాధి ఉండేదని, ఇప్పుడు అది తృణమూల్ కాంగ్రెస్‌కు పాకిందని విమర్శించారు. వచ్చే ఏడాది రాష్ట్రంలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో బీజేపీ, తృణమూల్ మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. (నేనింతే : లాక్‌డౌన్ నిబంధనలు బేఖాతర్)
Comments
Please login to add a commentAdd a comment