సాక్షి, పశ్చిమ బెంగాల్: ఒడిశా ఘోర రైలు ప్రమాదంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రైలు ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉందన్నారు. దీని గురించి కేంద్రం సత్వరమే దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.
అయితే, ఇది రాజకీయాలు చేసే సమయం కాదని ఈ ఘటన ఎలా జరిగిందో తెలుసుకుని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిన తరుణమని అన్నారు మమత. ఈ మేరకు మమతా ఘటన స్థలికి వెళ్లి పరిస్థితిని దగ్గరుండి సమీక్షించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఒడిశా ప్రభుత్వాన్ని కోరారు. బెంగాల్ తరుఫున క్షతగాత్రులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
(చదవండి: లెక్క తేలని మరణాలు!.. దేశ చరిత్రలో అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాలివే)
Comments
Please login to add a commentAdd a comment