‘దానా’ తుపాన్‌ టెన్షన్‌.. ఏపీకి భారీ వర్ష సూచన | IMD Alert On Cyclone Dana | Sakshi
Sakshi News home page

‘దానా’ తుపాన్‌ టెన్షన్‌.. ఏపీకి భారీ వర్ష సూచన

Published Wed, Oct 23 2024 7:46 AM | Last Updated on Wed, Oct 23 2024 11:29 AM

IMD Alert On Cyclone Dana

సాక్షి విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను ‘దానా’ టెన్షన్‌ పెడుతోంది. బుధవారం ఉదయానికి తుపానుగా, గురువారం తెల్లవారుజామున తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తుపాను ప్రభావంతో ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

దానా తుపాను ముప్పు ఏపీ, ఒడిశా, పశ్చిమబెంగాల్, తమిళనాడుకు పొంచి ఉంది. ఒడిశా, బెంగాల్ వద్ద తీరం దాటే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ భావిస్తోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం తీరం వెంబడి గంటకు 45-65 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. మరో నాలుగు రోజులు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఇక, తమిళనాడులో ఈశాన్య రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో రాయలసీమలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

మరోవైపు.. బెంగాల్‌లో ఏడు జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించారు. రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. దీంతో, అధికారులు అప్రమత్తమయ్యారు. సహయక చర్యలు చేపట్టారు. ఇక, తుపాను నేపథ్యంలో పలు రైలు సర్వీసులను రైల్వే శాఖ రద్దు చేసింది. 23, 24, 25వ తేదీల్లో తూర్పు కోస్తా రైల్వే పరిధిలో పలు రైళ్లను రద్దు చేశారు. గురువారం అత్యధికంగా 37 సర్వీసులు రద్దయ్యాయి. అలాగే, విశాఖ-భువనేశ్వర్‌ మధ్య రాకపోకలు సాగించే వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును 24న రద్దు చేశారు.

24న రద్దు చేసిన రైళ్లు..

  • సికింద్రాబాద్ - భువనేశ్వర్

  • హైదరాబాద్ - హౌరా

  • సికింద్రాబాద్ - హౌరా
  • సికింద్రాబాద్ - మల్దాటౌన్

25న రద్దు చేసిన రైళ్లు:..

  • హౌరా - సికింద్రాబాద్
  • షాలిమార్ - హైదరాబాద్
  • సిల్చార్ - సికింద్రాబాద్
     

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement