
సాక్షి, విశాఖపట్నం: ఈ నెలాఖరులో రాష్ట్రానికి తుపాను ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. ఉత్తర బంగాళాఖాతం, మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఈ నెల 24న ఏర్పడే అల్పపీడనం తీవ్రరూపం దాల్చి తుపానుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.
తుపానుగా మారితే.. ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలుంటాయని తెలిపారు. పశ్చిమ వాయువ్య దిశగా వీస్తున్న గాలుల ప్రభావంతో 20 నుంచి రాష్ట్రంలో వర్షాలు కురిసే సూచనలున్నాయని చెప్పారు.