uttarandhra
-
ఓడిపోతే మా అభ్యర్థి కాదు.. గెలిస్తేనే మా అభ్యర్థి..!
విజయవాడ: టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గట్టి షాక్ తగిలింది. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం బలపరిచిన పాకలపాటు రఘువర్మ ఓడిపోయారు. రఘువర్మపై పీఆర్టీయూ అభ్యర్థి శ్రీనివాసుల నాయుడు గెలుపొందారు. అయితే తమ అభ్యర్థి ఓడిపోగానే టీడీపీ యూటర్న్ తీసుకుంది. అసలు తాము అక్కడ అభ్యర్థినే పెట్టలేదంటూ కొత్త పల్లవి అందుకుంది. ఇక శ్రీనివాసుల నాయుడు గెలుపును కూటమి ఖాతాలో వేసుకునే యత్నం చేస్తోంది టీడీపీ. తమ మద్దతుతోనే శ్రీనివాసుల నాయుడు గెలిచాడని మంత్రి అచ్చెన్నాయుడు వింత ప్రకటన చేశారు.ఓడిపోయిన రఘువర్మ తమ అధికారిక అభ్యర్థి కాదని కొత్త రాగంఅందుకుంది. ఎన్నికల ముందు రఘువర్మని తమ అభ్యర్థి అని ప్రకటించిన టీడీపీ, జనసేనలు.. ఓడిపోగానే మాట మార్చేశారు. కూటమి పార్టీల మద్దతు తోనే విజయం సాధించామని ప్రకటన చెయ్యాలని గాదె శ్రీనివాసులు నాయుడుపై అచ్చెన్ననాయుడు ఒత్తిడి తెస్తున్నారు. ఓడిపోతే తమ అభ్యర్థి కాదని, గెలిస్తేనే తమ అభ్యర్థిని చెప్పుకుంటున్న టీడీపీ వైఖరి చూసి జనం విస్తుపోతున్నారు.ప్రభుత్వంపై ప్రభుత్వ టీచర్ల వ్యతిరేకతఉత్తరాంధ్ర టీచర్ ఎన్నికల ఫలితాలతో 9 నెలలకే ప్రభుత్వంపై టీచర్ల వ్యతిరేకత సుస్పష్టమైంది. ప్రభుత్వంపై ఉపాధ్యాయులు తిరుగుబాటు ప్రకటించారు. అందుకు ఊతం ఇచ్చేలా ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వ టీచర్లు కూటమికి ఓటమి రుచి చూపించారు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పాకలపాటి రఘు వర్మను ఓడించారు. పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడిని గెలిపించారు. చంద్రబాబుకు ఓటమి రుచి చూపించిన ప్రభుత్వ టీచర్లురఘువర్మను కూటమి అభ్యర్థిగా టీడీపీ, జనసేన,బీజేపీలు పోటీకి పెట్టాయి. తొలి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యతలోనూ కూటమి అభ్యర్థి వెనకపడ్డారు. బ్యాలెట్ ఓటింగ్‌లో కూటమి పార్టీ అభ్యర్థికి భంగపాటు ఎదురైంది. దీంతో చరిత్రలో ఏ ప్రభుత్వానికి ఎదురుకాని చేదు అనుభవం కూటమి ప్రభుత్వానికి ఎదురైంది. ఎన్నికల్లో గెలిచాక ఉద్యోగులు, ఉపాధ్యాయులను ప్రభుత్వం మోసం చేసింది. ఉద్యోగులకు కనీసం ఒక్క డీఏ ఇవ్వలేదు. ఉద్యోగులకు ఐఆర్, పీఆర్సీ ఊసెత్తలేదు. దీంతో ప్రభుత్వ టీచర్లలో చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడింది. ఫలితంగా ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పాకలపాటి రఘువర్మకు ఓటమి అనివార్యమైంది. -
విశాఖ, ఏలూరు, గుంటూరులో కొనసాగుతున్న కౌంటింగ్
-
విశాఖలో హైకోర్టు బెంచ్ కోరుతూ సదస్సు
విశాఖ : విశాఖలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలంటూ ఉత్తరాంధ్ర న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు(ఆదివారం) సదస్సు ఏర్పాటు చేశారు. ఏజెన్సీ ప్రజలకి సైతం విశాఖ అందుబాటులో ఉంటుందని ఉత్తరాంధ్రకు చెందిన ఆరు జిల్లాల న్యాయవాదులు కోరుతున్నారు. హైకోర్టు బెంచ్ విశాఖకు ఇచ్చేంత వరకూ తమ పోరాటం కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల న్యాయవాదులతో సదస్సు నిర్వహించారు. విఖాఖలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ గత 20 ఏళ్ల నుంచి కొనసాగుతూ వస్తుందని న్యాయవాదులు అంటున్నారు. విజయవాడలో ఉన్న హైకోర్టుకు వెళ్లాలంటే సుమారు 700 కి.మీ ప్రయాణించాల్సిన కారణంగా ఇక్కడ హైకోర్టు బెంచ్ అనేది అనివార్యమని వారు డిమాండ్ చేస్తున్నారు. -
ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో పది మంది అభ్యర్థులు
సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో పది మంది అభ్యర్థులు ఉన్నారని రిటర్నింగ్ అధికారి, విశాఖ జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్ తెలిపారు. మొత్తం 20 నామినేషన్లు దాఖలు అయ్యాయని.. నాలుగు నామినేషన్లు తిరస్కరించినట్లు పేర్కొన్నారు. 16 నామినేషన్లకు ఆమోదం తెలిపామన్నారు. ఒక్కరు కూడా నామినేషన్‌ను ఉపసంహరించుకోలేదన్నారు. ఈ నెల 27న టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 3న కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటలకు ప్రారంభం అవుతుంది. ఎన్నిక నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు చేశామని.. పటిష్టమైన భద్రత నడుమ ఎన్నికలు నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు. సాధారణ ఎన్నికల మాదిరిగానే ఓటర్ స్లిప్స్ ఇస్తామని ఆయన పేర్కొన్నారు. -
వైఎస్ఆర్సీపీలో నూతన నియామకాలు
-
టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక.. కూటమి నేతల్లో విభేదాలు
సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి నేతల మధ్య విభేదాలు గుప్పుమంటున్నాయి. పార్టీలకు సంబంధంలేకుండా జరిగే ఈ ఎన్నికల్లోనూ టీడీపీ, బీజేపీ నేతలు చెరో అభ్యర్థికి మద్దతు ప్రకటించడం కూటమి శ్రేణులను అయోమయానికి గురిచేస్తోంది. ఏపీటీఎఫ్‌కు చెందిన పాకలపాటి రఘువర్మ నామినేషన్ కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి పాల్గొన్నారు.కూటమి పార్టీలన్నీ రఘువర్మకు మద్దతుగా నిలుస్తున్నట్లు మీడియా ముందు ఎమ్మెల్సీ చిరంజీవి ప్రకటించారు. ఆయనను గెలిపించడానికి టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులు కృషిచేయాలని పిలుపునిచ్చారు. కానీ, శుక్రవారం పీఆర్టీయూకు చెందిన గాదె శ్రీనివాసులనాయుడు నామినేషన్ వేశారు. ఈయనకు బీజేపీ మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ మద్దతు తెలిపారు.శ్రీనివాసులనాయుడికే బీజేపీ మద్దతు..మరోవైపు.. శ్రీనివాసులనాయుడు నామినేషన్ సమర్పించిన అనంతరం మాధవ్ ఉపాధ్యాయ సంఘాల నేతలు, ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. తమ మద్దతు శ్రీనివాసులనాయుడికే ఉంటుందని తేల్చిచెప్పారు. ఈయన విజయానికి ఉత్తరాంధ్రలోని అన్ని జిల్లాల్లో సమావేశాలు నిర్వహిస్తామని ప్రకటించారు. అలాగే, మరో అభ్యర్థికి కూటమి మద్దతు ఉందని ఒకరు ప్రకటించడాన్ని ఖండిస్తున్నామని.. టీడీపీ ఎమ్మెల్సీ చిరంజీవిపై పరోక్షంగా విమర్శలు చేశారు. దీనిపై కూటమి ప్రభుత్వం ఎలాంటి ఆలోచన చేయలేదని ఆయన స్పష్టంచేశారు. -
‘మేమున్నాం మీ వెంట’ అనే భరోసా ఇచ్చేదెవరు?
మహానది–గోదావరి నదుల మధ్య విస్తరించి యున్న భూభాగమే కళింగాంధ్ర. ఈ కళింగాంధ్రలోని అంతర్భాగం ఉత్తరాంధ్ర. ఇది ఇచ్ఛాపురం నుండి పాయకరావుపేట వరకు వ్యాపించి ఉంది. విస్తారమైన కొండకోనలు, అటవీ భూములు గల పచ్చని ప్రాకృతిక ప్రదేశం. ఇక్కడ నివసించే ప్రజలు కష్టపడే తత్వం గలవారు. మైదాన, గిరిజన, మత్స్యకార ప్రజల శ్రమతో సృష్టించబడిన సంపద పెట్టుబడి వర్గాల పరమౌతున్నది. దాంతో ఇక్కడి ప్రజలు అనాదిగా పలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ప్రాంతం వెనుకబడినది అనేకంటే, వెనుకకు నెట్టి వేయబడిందన్నమాట సబబుగా ఉంటుంది.ఒక వ్యక్తి కాని, ఒక సమూహం కాని ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి జీవనోపాధి నిమిత్తం కాల పరిమితితో సంబంధం లేకుండా వెళ్లడాన్ని వలస అనొచ్చు. అనాదిగా ఉత్తరాంధ్ర ప్రజలు అనుభవిస్తున్న ప్రధాన సమస్య ‘వలస’. ఇలా వలస వెళ్లినవారు ఆయా ప్రాంతాల్లో అనేక ఇడుములు పడటం చూస్తున్నాం. వీరికి ‘మేమున్నాం మీ వెంట’ అనే భరోసా ఇచ్చేదెవరు? మరో ముఖ్య సమస్య ఈ ప్రాంత భాష–యాస, కట్టు– బొట్టుపై జరుగుతున్న దాడి. నాగరికులుగా తమకు తాము ముద్రవేసుకొన్నవారు ఆటవికంగా ఉత్తరాంధ్ర జనాన్ని అవహేళన చేస్తున్నారు. తెలంగాణ సాంస్కృతిక భాషోద్యమంలాగా, ఉత్తరాంధ్ర సాంస్కృతిక భాషోద్యమం రావాలి. ఈ ప్రాంత వేషం–భాష అధికారికంగా అన్నిటా చలామణి కావాలి. తగువిధంగా గౌరవం పొందాలి. తెలంగాణ సాహితీవేత్తల వలె ఈ ప్రాంత కవులు, రచయితలు, కళాకారులు తమ మాండలిక భాషా సౌరభాలతో సాహిత్యాన్ని నిర్మించాలి.అనాదిగా ఈ ప్రాంతం పారిశ్రామికీకరణకు చాలా దూరంలో ఉంది. ఒక్క విశాఖపట్నం, పైడిభీమవరం తప్పితే ఎక్కడా పరిశ్రమల స్థాపన లేదు. ఉత్తరాంధ్ర అంతటా వ్యవసాయధారిత ఉత్పత్తుల పరిశ్రమల స్థాపన ఎక్కువగా జరగాల్సి ఉంది. అయితే రెడ్ క్యాటగిరీకి చెందిన కాలుష్య కారక పరిశ్రమల స్థాపన మాత్రం జరుగుతోంది. ఇవి ఉత్తరాంధ్ర ప్రజల జీవనానికి, మనుగడకు సవాల్ విసురుతున్నాయి.ఎన్నో ఉద్యమాలు చేసి సాధించుకున్న విశాఖ స్టీల్ ఇండస్ట్రీని ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకోవాలి. ఉత్తరాంధ్రలో నిర్మించ తలపెట్టిన అనేక నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మాణ దశలోనే ఉన్నాయి. శతశాతం పూర్తయినవి దాదాపుగా లేవు. విశాఖ రైల్వే జోన్ ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్న చందంగా ఉంది. ఉత్తరాంధ్ర అంతట మారుమూల ప్రాంతాలను అనుసంధానం చేస్తూ రహ దారుల నిర్మాణం పెద్ద యెత్తున జరగాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో గిరిజన ప్రాంతం ఉత్తరాంధ్రలోనే ఎక్కువగా ఉంది. ఇక్కడ అడవి బిడ్డలు పౌష్టికాహార లోపంతో రక్తహీనతకు గురై తీవ్ర అనారోగ్యం పాలౌతున్నారు. ఈ కొండకోనల్లో, అడవుల్లో విలువైన అటవీ సంపద ఉంది. అందువల్ల ఈ భూములపై గిరిజనులకు ప్రత్యేక హక్కులు ఉండాలి. 1/70 చట్టం అమలు సక్రమంగా జరగాలి. ఇక్కడ ఖనిజ సంపద అపారంగా ఉంది. దీనితో వచ్చే ఆదాయం గిరిపుత్రుల సంక్షేమానికే వినియోగించాలి. ఇక్కడ భూగర్భ జలాలలో కాల్షియం, ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉంది. కిడ్నీ, ఎముకల వ్యాధులతో తరచూ బాధపడటం చూస్తాం. అందువల్ల ఇక్కడి ప్రజలకు మంచినీరు అందివ్వాలి. నిర్మాణంలో ఉన్న పోర్టులను, హార్బర్లను వేగవంతం చేయాలి.చదవండి: రైతులు అడగాల్సిన ‘మహా’ నమూనాకార్మికులలో 90 శాతానికి పైబడి అసంఘటిత రంగంలోనే పనిచేస్తున్నారు. వీరిలో భవన నిర్మాణ రంగంలోనే అధికంగా ఉన్నారు. వీరి భద్రతకు చర్యలు తీసుకోవాలి. ఈ ప్రాంత ప్రజల జీవనస్థితిగతులు మెరుగవ్వాలంటే, విభజన చట్టం సెక్షన్ 94(3)లో పేర్కొన్న విధంగా ఉత్తరాంధ్రకు ప్రభుత్వాలు ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధికి సహకరించాలి. అది వెనుకబడిన బుందేల్‌ఖండ్, కోరాపుట్, బోలంగిర్, కలహండి తరహాలో ఉండాలి.చదవండి: మంచి పనిని కించపరుస్తారా?ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద పట్టణం విశాఖపట్నం. ఈ పట్టణం ఇతర ప్రాంతాల పెట్టుబడి వర్గాల గుప్పిట ఉంది. విశాఖను మాత్రమే అభివృద్ధి చేస్తే ఒనగూరే లాభమేమిటి? నిజంగా ఈ ప్రాంత ప్రజల పరిస్థితి మెరుగుపడుతుందా అనేది మాత్రం శేషప్రశ్నే. ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధికి గతంలో జరిగిన వివిధ వామపక్ష, అస్తిత్వ జీవన పోరాటాల వలె మరికొన్ని ఉద్యమాలు రావాల్సి ఉందేమో!- పిల్లా తిరుపతిరావు తెలుగు ఉపాధ్యాయుడు -
రేపు తీవ్ర తుపాన్‌గా ‘దానా’
సాక్షి,విశాఖపట్నం:తూర్పుమధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ‘దానా’ తుపాన్ గురువారానికి(అక్టోబర్ 24) బలపడి తీవ్ర తుపాన్‌గా మారుతుందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి కేవీఎస్ శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతానికి పారాదీప్‌కు 520 కిలోమీటర్ల దూరంలో తుపాన్ కేంద్రీకృతమై ఉందన్నారు.‘ తుపాన్ గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాములోపు తీరం దాటే అవకాశం ఉంది.పూరీ-సాగర్ ద్వీపం మధ్య సమీపంలో తీరం దాటనుంది. గంటకు 15 కిలోమీటర్ల వేగంతో తుపాను కదులుతోంది. దీని ప్రభావంతో ఉమ్మడి శ్రీకాకుళం,విజయనగరం జిల్లాలోని తీర ప్రాంతం వెంబడి బలమైన ఈదురుగాలులు వీయనున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో శుక్రవారం భారీ వర్షాలు కురుస్తాయి. బుధ,గురు వారాల్లో సముద్రం అలజడిగా ఉంటుంది. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదు. అన్ని పోర్టులలో రెండో నెంబర్ హెచ్చరిక జారీ చేశాం’అని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.ఇదీ చదవండి: దానా తుపాన్ టెన్షన్ -
ఏపీకి మరో తుపాన్ ముప్పు!
సాక్షి, విశాఖపట్నం: ఈ నెలాఖరులో రాష్ట్రానికి తుపాను ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. ఉత్తర బంగాళాఖాతం, మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఈ నెల 24న ఏర్పడే అల్పపీడనం తీవ్రరూపం దాల్చి తుపానుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. తుపానుగా మారితే.. ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలుంటాయని తెలిపారు. పశ్చిమ వాయువ్య దిశగా వీస్తున్న గాలుల ప్రభావంతో 20 నుంచి రాష్ట్రంలో వర్షాలు కురిసే సూచనలున్నాయని చెప్పారు. -
Updates: ఉగ్రగోదావరి
AP And Telangana Floods News Latest Updates In Teluguరేపు తెలంగాణకు కేంద్ర బృందంతెలంగాణకు రానున్నకేంద్ర బృందంవరద నష్టాన్ని అంచనా వేయనున్న బృందంములుగుగోదావరికి బారీగా పెరుగుతున్న వరద ఉధృతిరామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ15.80 మీటర్ల మేర ప్రవహిస్తున్న గోదావరి వరద ప్రవాహం15.83మీటర్లు దాటితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్న అధికారులుముంపు ప్రాంత ప్రజలను ముందస్తుగా అప్రమత్తం చేస్తున్న అధికార యంత్రాంగంజాతీయ రహదారి పైకి చేరిన గోదావరి వరద నీరుఛత్తీస్గడ్-తెలంగాణ మధ్య రాకపోకలు బంద్ కష్టతరంగా బోట్ల తొలగింపుప్రకాశం బ్యారేజీలో కొనసాగుతున్న బోట్ల తొలగింపు కార్యక్రమంరేపు కూడా కొనసాగనున్న చర్యలుబోట్లను రంధ్రాలు చేసి తొలగించేందుకు చూస్తున్న ఇంజనీర్లుకుదరకపోతే.. బెలూన్ల ద్వారా బోట్లను తరలించే యత్నంభద్రాద్రి కొత్తగూడెంభద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ48 అడుగులకు చేరిన గోదావరి నీటి మట్టంక్రమక్రమంగా పెరుగుతున్న గోదావరి ప్రవాహం53 అడుగులు చేరితే మూడవ ప్రమాద హెచ్చరికఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు నల్లగొండనాగార్జునసాగర్ ప్రాజెక్టు కు పెరిగిన భారీ వరద26 క్రస్ట్ గేట్లు ఎత్తివేతఇన్ ఫ్లో:& అవుట్ ఫ్లో : 234810 క్యూసెక్కులుప్రస్తుత నీటి మట్టం: 589.40 అడుగులుపూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం: 312.0450 టీఎంసీలుప్రస్తుత నీటి నిల్వ: 310.2522 టీఎంసీలుకొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తిఎన్టీఆర్గంపలగూడెం మండలం వినగడప కట్టలేరు వాగుకు తగ్గిన వరద ఉధృతిభారీ వర్షాలకు డైవర్షన్ రహదారిపై మూడుచోట్ల పడ్డ గండ్లుకృష్ణాఅవనిగడ్డ మండలం పులిగెడ్డ గురుకుల పాఠశాలలో వైరల్ ఫీవర్స్ కలకలం విషజ్వరాలతో బాధపడుతున్న 20 మందికి పైగా విద్యార్ధులు జ్వరం తీవ్రత ఎక్కువగా ఉండటంతో పది మంది విద్యార్ధులను ఇళ్లకు పంపించేసిన ప్రిన్సిపల్పాఠశాలలోని విద్యార్ధులందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న వేకనూరు పీహెచ్.సీ వైద్య బృందం వరదల సమయంలో ఇళ్లకు వెళ్లి వచ్చిన వారిలోనే ఎక్కువ జ్వరాల తీవ్రత ఉందంటున్న ప్రిన్సిపల్ కుమార్జ్వరం ఉన్న వారందరికీ టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా పరీక్షలు చేస్తున్న వైద్యులువాటర్ శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపించనున్న వైద్యులుప్రకాశం బ్యారేజ్..ఆ బోట్ల తొలగింపు యత్నంప్రకాశం బ్యారేజ్‌ను ఢీ కొట్టిన బోట్ల తొలగింపు ప్రయత్నాలురెండు భారీ క్రేన్లతో తొలగించేందుకు అధికారుల యత్నంబ్యారేజీకి ప్రమాదం లేకుండా వరదవైపు బోట్లను తిప్పేందుకు ప్రయత్నాలుముగ్గురు గజ ఈతగాళ్లతో పని చేయించిన ఇంజనీర్లుబ్యారేజ్ను ఢీ కొట్టాక బోల్తా పడ్డ పడవలుసంబంధిత వార్త: బ్యారేజ్‌ను ఢీ కొట్టిన బోట్లు టీడీపీ నేతలవే!అల్లూరి సీతారామరాజువరద ముంపు లోనే చింతూరు వాసులుపంపు ప్రాంతాలు ఖాళీ చేయాలని ఆలస్యంగా ప్రకటించిన అధికారులుఉన్నపలంగా చేతి కందిన సామాగ్రితో శబరివంతెనపై చేరి తల దాచుకున్న చింతూరు వాసులుతాత్కాలిక టెంట్లు ఏర్పాటు చేసుకుని కాలం గడుపుతున్న స్థానికులుఅధికారులు , ప్రజాప్రతినిధులు కనీస సదుపాయాలు ఏర్పాటు చేయలేదంటూ తీవ్ర ఆగ్రహ వ్యక్తం చేస్తున్న వరద బాధితులుతాగునీరు పాలు కూడా అందించలేదంటూ ఆవేదనవరద ప్రాంతాల పరిశీలనకే సమయం వెచ్చిస్తున్న అధికారులుచింతూరు మండల పరిధిలో 13 చోట్ల రహదారుల పైకి వచ్చిన వరద నీరువిజయవాడప్రకాశం బ్యారేజ్ ఫ్లడ్ అప్డేట్ప్రకాశం బ్యారేజ్ కు క్రమంగా తగ్గుతున్న వరదఇన్ ఫ్లో ,అవుట్ ఫ్లో 2,02,409 క్యూసెక్కులు2 గేట్లు పూర్తిగా ఎత్తివేత,5 అడుగుల మేర 45 గేట్లు,4 అడుగుల మేర 20 గేట్లు ఎత్తివేతఅల్లూరిచింతపల్లి మండలం చింతలూరు గ్రామాన్ని పట్టిపీడిస్తున్న విష జ్వరాలు.విష జ్వరాలు వాంతులు విరేచనాలతో ఐదుగురు మృతి.వారం రోజుల వ్యవధిలో మృతి చెందిన ఐదుగురువిష జ్వరాలతో ఆందోళన చెందుతున్న గ్రామస్తులుతమను ఎవరూ పట్టించుకోలేదని గ్రామస్తులు ఆవేదనఅధికారులు వెంటనే స్పందించి తమను కాపాడాలంటున్న గ్రామస్తులుచింతపల్లి, నర్సీపట్నం కేజీహెచ్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న మరి కొంతమంది గ్రామస్తులువిజయవాడమాచవరంలో విరిగిపడ్డ కొండచరియలుఒకరి మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలుకొనసాగుతున్న సహాయక చర్యలుమృతుడు రాముగా గుర్తింపుక్షతగాత్రులు దేవినేని నగర్‌కు చెందిన కూలీలుగా గుర్తింపుఅల్లూరి జిల్లా: జలదిగ్బంధంలో విలీన మండలాలుపోటెత్తి ప్రవహిస్తున్న శబరి సిలేరు, కొండబాగులుసీలేరు ప్రాజెక్టు నుండి లక్ష క్యూసెక్కుల నీరు విడుదల కావడంతో ఉదృతంగా ప్రవహిస్తున్న శబరిచింతూరు-వీఆర్‌పురం-కూనవరం-ఎటపాక మండల కేంద్రాల మధ్య నిలిచిపోయిన రాకపోకలునాలుగు మండలాల పరిధిలో అనేక నివాస ప్రాంతాలు జలమయంనీట మునిగిన జాతీయ రహదారి 326ఆంధ్ర ఒరిస్సాల మధ్య రాకపోకలు బంద్చిట్టి వద్ద ఎన్‌హెచ్ 35 చేరుకున్న వరద నీరుఆంధ్ర- తెలంగాణ -ఛత్తీస్‌గఢ్ మధ్య నిలిచిపోయిన రాకపోకలు⇒ఈనెల 20 నుంచి 22వ తేదీ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. 27వ తేదీ నాటికి ఇది తీరం సమీపానికి వచ్చే అవకాశం ఉంటుందని పేర్కొంది. ఇది ఉత్తరాంధ్రకు దగ్గరగా వచ్చినా ఆ తర్వాత ఒడిశా వైపు కదిలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే తుపాను కూడా ఏర్పడవచ్చని, అది ఏపీపై ఎంత ప్రభావం చూపుతుందనేది వారం రోజుల్లో స్పష్టత వస్తుందని అధికారులు పేర్కొన్నారు.⇒అలాగే, ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం సోమవారం ఒడిశాలోని పూరీ వద్ద తీరం దాటింది. ఇది వాయువ్య దిశగా పయనించి తీవ్ర అల్పపీడనంగా బలహీనపడింది. దీని ప్రభావంతో మంగళవారం వరకు ఉత్తరాంధ్ర, ఒడిశా ప్రాంతాల్లో పలుచోట్ల భారీ వర్షాలు, మిగిలిన చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. దక్షిణ కోస్తా జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడతాయని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. తీవ్ర వాయుగుండం తీరం దాటడంతో రాష్ట్రానికి వర్ష ప్రభావం తగ్గుముఖం పట్టింది.⇒మరోవైపు.. తీవ్ర వాయుగుండం ప్రభావానికి ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకూ ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా వై. రామవరంలో ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకూ అత్యధికంగా 13.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. చింతపల్లిలో 13.4, ముంచింగిపుట్టులో 13.3, గంగవరంలో 12.4, అడ్డతీగలలో 11.7 సెంటీమీటర్ల వర్షం పడింది.⇒అనకాపల్లి జిల్లా గోలుగుండలో 11.2, విజయనగరం పూసపాటిరేగలో 11, అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగిలో 10.9, శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో 10.5, అనకాపల్లి జిల్లా నాతవరంలో 10 సెంటీమీటర్ల వర్షం పడింది. అల్లూరి, అనకాపల్లి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, కాకినాడ జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో 5 నుంచి 10 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మరోవైపు.. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం రాజపురలో 6.2 సెంటీమీటర్ల వర్షం పడింది. ఉత్తరాంధ్రలోని మిగిలిన ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. -
AP: బలపడిన వాయుగుండం.. ఏపీలో మళ్లీ భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. ప్రస్తుతం పూరీ సమీపంలో వాయుగుండం తీరం దాటింది. ఈ వాయుగుండం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావారణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.మరోవైపు.. వాయుగుండం కారణంగా భారీ వర్షాలతో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉన్నట్టు అధికారులు హెచ్చరిస్తున్నారు. విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాలో ఫ్లాష్ ఫ్లడ్స్‌కు ఛాన్స్ ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. 24 గంటలపాటు నదీ పరీవాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. These Red marked Rivers will get huge flood inflows in next 24 hours 👍🙏 #AndhraPradeshRains pic.twitter.com/ZMgPyrl7Vd— Vizag weatherman🇮🇳 (@KiranWeatherman) September 9, 2024 వర్షాలకు ఛాన్స్ ఇలా.. వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు.. కోస్తాలోనూ పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం. రెండు రోజుల పాటు కోస్తాంధ్రకు వర్ష సూచన శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.మరోవైపు తీవ్ర వాయుగుండం ప్రభావం వల్ల తెలంగాణలోనూ సోమవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో రెండు రోజుల పాటు అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు తెలిపింది. మంగళవారం కొన్ని జిల్లాల్లో 30కి.మీ నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. As The Depression(వాయుగుండం) Moving North Light To Moderate Rains Expected In Some Parts Of {Vijayawada - Srikakulam} Belt Till Afternoon.Sun 🌞 Will Be Back From Tomorrow In Many Parts Of Coastal AP.Scattered thunderstorms Expected For Next 2 Weeks.#AndhraPradesh pic.twitter.com/Aa8SJCmv5R— ANDHRA WEATHER (@Andhra_weather) September 9, 2024 -
AP: బంగాళాఖాతంలో అల్పపీడనం.. 24 గంటల్లో అతి భారీ వర్ష సూచన
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు.. పశ్చిమ మధ్య బంగాళాఖాతం-వాయువ్య బంగాళాఖాతం సమీపంలో అల్ప పీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో ఉత్తరాంధ్రలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందిఇక, అల్ప పీడనం ఉత్తర దిశగా కదులుతుండటంతో ఏపీలో ఉత్తరాంధ్రలోని కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే, కోస్తాంధ్ర అంతట విస్తారంగా వర్షాలు పడనున్నాయి. ఈ నేపథ్యంలో పార్వతీపురం మన్యం, అల్లూరి, ఏలూరు జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ విధించారు. అల్ప పీడనం కారణంగా తీరం వెంబడి 30-40 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. రానున్న మూడు రోజుల పాటు ఉత్తర కోస్తా మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. -
ఉత్తరాంధ్ర వైపు అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం/అమరావతి: ఉత్తర బంగాళాఖాతంలో గురువారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ శుక్రవారం సాయంత్రానికి మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా ఉత్తరాంధ్ర వైపు దూసుకురానుంది. ఈ నెల 31న విశాఖపట్నం సమీపంలో తీరాన్ని దాటే సూచనలు కనిపిస్తున్నాయి. తీవ్ర అల్పపీడనం తీరం దాటిన తర్వాత.. మరింత బలపడి తెలంగాణ మీదుగా మహారాష్ట్ర వైపు ప్రయాణిస్తూ సెప్టెంబర్ 2 నాటికి వాయుగుండంగా మారే అవకాశాలున్నాయి. దీని ప్రభావంతో శుక్రవారం నుంచి ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. శుక్ర, శనివారాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయన్నారు. కోస్తా జిల్లాల్లో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులెవరూ వేటకు వెళ్లరాదని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ సూచించారు. -
టీడీపీకి తడబాటే.. పచ్చ నేతల్లో కొత్త టెన్షన్!
ఉత్తరాంధ్రలో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేయబోతోంది. ఓటింగ్ జరిగిన తీరు, పెరిగిన ఓటింగ్‌తో తెలుగుదేశం పార్టీ నేతల్లో గుబులు మొదలైంది. పైకి భీకరంగా ఉన్నా.. ఓటమి తప్పదనే నిర్ణయానికి వచ్చేశారు. ఉదయం నుంచే వృద్ధులు, మహిళలు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడాన్ని చూసి టీడీపీకి గుండె జారిపోయింది. దీంతో వారి కంటి మీద కునుకు కరువైంది. ఇంతకీ ఉత్తరాంధ్రలో ఏం జరగబోతోంది?సార్వత్రిక ఎన్నికల్లో భారీ ఎత్తున పోలింగ్ జరగడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. మహిళలు, వృద్ధులు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ వర్గాల నుంచి ఊహించని విధంగా ఓటింగ్ జరగడం వైఎస్సార్సీపీకే అనుకూలమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. విశాఖలో అనేక భారీ పరిశ్రమలు రావడంతో యువత వైఎస్సార్సీపీ వైపు మొగ్గు చూపిందనే చర్చ జరుగుతోంది.ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ఓటర్లను పోలింగ్ కేంద్రాల వైపు నడిపించాయని అంటున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మూలపేట పోర్ట్, ఐటీ రంగం అభివృద్ధితోపాటు, భారీ పరిశ్రమలు ఏర్పాటు, విశాఖ నగర అభివృద్ధి, కొత్త మెడికల్ కాలేజీలు నిర్మాణం వంటివి ఓటర్లను వైఎస్సార్సీపీ వైపు మరింతగా ఆకర్షితులను చేశాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించడంతో ఉత్తరాంధ్రలో ఉన్న వెనుకబాటుతనం పోతుందనే అభిప్రాయానికి అక్కడ ప్రజలు వచ్చారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అంతేకాకుండా అమ్మఒడి, వైయస్సార్ చేయూత, ఆసరా, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన వంటి పథకాలు మహిళలకు ఎంతో అండగా నిలిచాయి. ఈ పథకాలన్నీ మళ్ళీ కొనసాగాలంటే ముఖ్యమంత్రిగా మళ్ళీ జగన్ రావాలనే ఆలోచన మహిళల్లో స్పష్టంగా కనిపించింది.పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ముగిసే వరకు మహిళలు పెద్ద సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొన్నారు. పోలింగ్ కేంద్రాలు తెరవకముందు నుంచే మహిళలు వృద్ధులు బారులు తీరారు. గంటల కొద్దీ ఓపికగా క్యూల్లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉత్తరాంధ్రలో ఉన్న ఆరు జిల్లాలు విశాఖ సిటీ, ఏజెన్సీ, మైదాన ప్రాంతాలు అనే తేడా లేకుండా మహిళలు పెద్ద సంఖ్యలో ఓటు వేశారు. విజయనగరం జిల్లాలో అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా పోలింగ్ 81 శాతానికి పైగా జరగడం విశేషంగా చెబుతున్నారు.ఉత్తరాంధ్ర జిల్లాలో పెరిగిన ఓటింగ్ టీడీపీ నేతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. హేమా హేమీలైన నేతల్లో వణుకు పుడుతోంది. విశాఖ ఎంపీ అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన బొత్స ఝాన్సీని నిలబెట్టడం వైఎస్సార్సీపీకి కలిసి వచ్చింది. తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన మహిళ కావడంతోపాటు, ఆమె పుట్టినఊరు కావడంతో కాపు సామాజిక వర్గంతో పాటు బీసీ సామాజిక వర్గాల ఓటర్లు సైతం బొత్స ఝాన్సీకి బ్రహ్మరథం పట్టారు.టీడీపీ ఎంపీ అభ్యర్థి గీతం భరత్ ఎన్ని కోట్లు కుమ్మరించినా ప్రజలు బొత్స ఝాన్సీవైపే మొగ్గు చూపారు. గీతం భరత్ ఆయన కుటుంబ సభ్యులు అవినీతి అక్రమాలకు పాల్పడడం, గీతం యూనివర్సిటీ ముసుగులో సాగించిన భూకబ్జాలను విశాఖ ప్రజలు మర్చిపోలేదు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పరిస్థితి కూడా ఇదేవిధంగా తయారైంది. ప్రతీ ఎన్నికకు ఒక నియోజకవర్గం మారే గంటాకు ఈసారి ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధమయ్యారు.ప్రతీ ఎన్నికలోనూ రిగ్గింగ్‌తో గెలిచే అచ్చెన్నాయుడుకు ఈసారి టెక్కలిలో చెక్ పడనుంది. అచ్చెన్న గూండాయిజం, అవినీతితో విసిగిపోయిన ప్రజలు ఈసారి ఆయన్ను పక్కన పెట్టాలనే నిర్ణయానికి వచ్చారు. మరో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుది అదే పరిస్థితి. బూతులతో విరుచుకుపడే అయ్యన్నకు మహిళలు బుద్ధి చెప్పడానికి రెడీ అయ్యారు. నర్సీపట్నం నియోజకవర్గంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు, కొత్త రోడ్లు నిర్మాణం, రోడ్లు విస్తరణ వంటి అభివృద్ధి కార్యక్రమాలతో మరోసారి వైఎస్సార్సీపీకి ప్రజలు మొగ్గు చూపించారు. సొంత నియోజకవర్గాల్లో గెలవలేని మాజీ మంత్రులు బండారు సత్యనారాయణమూర్తి, కళా వెంకటరావులు పక్క నియోజకవర్గాలకు తరలి వెళ్లారు.అనకాపల్లి ఎంపీగా ఒకప్పటి నాటు సారా వ్యాపారి, టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సీఎం రమేష్ కూటమి తరపున పోటీ చేశారు. సీఎం రమేష్ నాన్ లోకల్ కావడం, ఓసీ వెలమ కావడంతో స్థానికంగా ఉన్న బీసీ వెలమలు వైఎస్సార్సీపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడుకే మోగ్గు చూపించారు. ఇక్కడున్న కొద్ది రోజుల్లోనే సీఎం రమేష్ రౌడీయిజంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. సీఎం రమేష్ ఎన్నికలపుడే ఇంతటి గుండాయిజం చేస్తున్నాడు. పొరపాటున గెలిస్తే తమ ప్రాణాలతో చెలగాటం ఆడుతాడనే ఆందోళన అనకాపల్లి ప్రజల్లో కనిపించింది. దీంతో రమేష్‌కు మద్దతివ్వడానికి అనకాపల్లి ప్రజలు ఏమాత్రం అంగీకరించలేదు. ప్రస్తుత ఓటింగ్ జరిగిన తీరును బట్టి చూస్తే ఉత్తరాంధ్రలో వైఎస్సార్సీపీకి క్లీన్ స్వీప్ ఖాయం అనే అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. కూటమి తరపున పోటీ చేసిన హేమాహేమీలంతా మట్టి కరుస్తారనే టాక్ నడుస్తోంది. టీడీపీకి గతంలో వచ్చిన కొద్ది సీట్లు కూడా ఈసారి రావనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. -
ఉత్తరాంధ్ర... టీడీపీ ఆశలు గల్లంతేనా..?
ఉత్తరాంధ్రలో వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేయబోతోందని టాక్. ఓటింగ్ జరిగిన తీరు, పెరిగిన ఓటింగ్‌తో తెలుగుదేశం పార్టీ నేతల్లో గుబులు మొదలైంది. పైకి బింకంగా ఉన్నా..ఓటమి తప్పదనే నిర్ణయానికి వచ్చేశారు. ఉదయం నుంచే వృద్ధులు, మహిళలు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడాన్ని చూసి టీడీపీకి గుండె జారిపోయింది. దీంతో నాలుగు రోజుల నుంచి వారి కంటి మీద కునుకు కరువైంది. ఇంతకీ ఉత్తరాంధ్రలో ఏం జరగబోతోంది?సార్వత్రిక ఎన్నికల్లో భారీ ఎత్తున పోలింగ్ జరగడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. మహిళలు, వృద్ధులు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బిసి వర్గాల నుంచి ఊహించినవిధంగా ఓటింగ్ జరగడం వైఎస్సార్సీపీకే అనుకూలమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. విశాఖలో అనేక భారీ పరిశ్రమలు రావడంతో యువత వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపిందనే చర్చ జరుగుతోంది. సీఎం జగన్ అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ఓటర్లను పోలింగ్ కేంద్రాల వైపు నడిపించాయని అంటున్నారు.ఉత్తరాంధ్ర జిల్లాల్లో కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మూలపేట పోర్ట్, ఐటీ రంగం అభివృద్ధితోపాటు, భారీ పరిశ్రమల ఏర్పాటు, విశాఖ నగర అభివృద్ధి, కొత్త మెడికల్ కాలేజీలు నిర్మాణం వంటివి ఓటర్లను వైఎస్సార్సీపీ వైపు మరింతగా ఆకర్షితులను చేశాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించడంతో ఉత్తరాంధ్రలో ఉన్న వెనుకబాటుతనం పోతుందనే అభిప్రాయానికి అక్కడ ప్రజలు వచ్చారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అంతేకాకుండా అమ్మఒడి, వైయస్సార్ చేయూత, ఆసరా, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన వంటి పథకాలు మహిళలకు ఎంతో అండగా నిలిచాయి. ఈ పథకాలన్నీ మళ్ళీ కొనసాగాలంటే ముఖ్యమంత్రిగా మళ్ళీ జగన్ రావాలనే ఆలోచన మహిళల్లో స్పష్టంగా కనిపించింది.పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ముగిసే వరకు మహిళలు పెద్ద సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొన్నారు. పోలింగ్ కేంద్రాలు తెరవకముందు నుంచే మహిళలు వృద్ధులు బారులు తీరారు. గంటల కొద్దీ ఓపికగా క్యూల్లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉత్తరాంధ్రలో ఉన్న ఆరు జిల్లాలు విశాఖ సిటీ, ఏజెన్సీ, మైదాన ప్రాంతాలు అనే తేడా లేకుండా మహిళలు పెద్ద సంఖ్యలో ఓటు వేశారు. విజయనగరం జిల్లాలో అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా పోలింగ్ 81 శాతానికి పైగా జరగడం విశేషంగా చెబుతున్నారు.ఉత్తరాంధ్ర జిల్లాలో పెరిగిన ఓటింగ్ టీడీపీ నేతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. హేమా హేమీలైన నేతల్లో వణుకు పుడుతోంది. విశాఖ ఎంపీ అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన బొత్స ఝాన్సీని నిలబెట్టడం వైఎస్ఆర్సీపీ కలిసి వచ్చింది. తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన మహిళ కావడంతోపాటు, ఆమె పుట్టినూరు కావడంతో కాపు సామాజిక వర్గంతో పాటు బీసీ సామాజిక వర్గాల ఓటర్లు సైతం బొత్స ఝాన్సీకి బ్రహ్మరథం పట్టారు.టీడీపీ ఎంపీ అభ్యర్థి గీతం భరత్ ఎన్ని కోట్లు కుమ్మరించినా ప్రజలు బొత్స ఝాన్సీవైపే మొగ్గు చూపారు. గీతం భరత్ ఆయన కుటుంబ సభ్యులు అవినీతి అక్రమాలకు పాల్పడడం, గీతం యూనివర్సిటీ ముసుగులో సాగించిన భూకబ్జాలను విశాఖ ప్రజలు మర్చిపోలేదు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పరిస్థితి ఇదేవిధంగా తయారయ్యింది. ప్రతి ఎన్నికకు ఒక నియోజకవర్గం మారే గంటాకు ఈసారి ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధమయ్యారు.ప్రతి ఎన్నికలోను రిగ్గింగ్‌తో గెలిచే అచ్చం నాయుడుకు ఈసారి టెక్కలిలో చెక్ పడనుంది. అచ్చం నాయుడు గూండాయిజం, అవినీతితో విసిగిపోయిన ప్రజలు ఈసారి ఆయన్ను పక్కన పెట్టాలనే నిర్ణయానికి వచ్చారు. మరో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుది అదే పరిస్థితి. బూతులతో విరుచుకుపడే అయ్యన్నకు మహిళలు బుద్ధి చెప్పడానికి రెడీ అయ్యారు. నర్సీపట్నం నియోజకవర్గంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు, కొత్త రోడ్లు నిర్మాణం, రోడ్లు విస్తరణ వంటి అభివృద్ధి కార్యక్రమాలతో మరోసారి వైఎస్ఆర్సీపీకి మొగ్గు చూపించారు. సొంత నియోజకవర్గాల్లో గెలవలేని మాజీ మంత్రులు బండారు సత్యనారాయణమూర్తి, కళా వెంకటరావులు పక్క నియోజకవర్గాలకు తరలి వెళ్లారు.అనకాపల్లి ఎంపీగా ఒకప్పటి నాటు సారా వ్యాపారి, టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సీఎం రమేష్ కూటమి తరపున పోటీ చేశారు. సీఎం రమేష్ నాన్ లోకల్ కావడం, ఓసి వెలమ కావడంతో స్థానికంగా ఉన్న బీసీ వెలమలు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడుకే మోగ్గు చూపించారు.ఇక్కడున్న కొద్ది రోజుల్లోనే సీఎం రమేష్ రౌడీయిజంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. సీఎం రమేష్ ఎన్నికలపుడే ఇంతటి గుండాయిజం చేస్తున్నాడు. పొరపాటున గెలిస్తే తమ ప్రాణాలతో చెలగాటం ఆడుతాడనే ఆందోళన అనకాపల్లి ప్రజల్లో కనిపించింది. దీంతో రమేష్‌కు మద్దతివ్వడానికి అనకాపల్లి ప్రజలు ఏమాత్రం అంగీకరించలేదు. ప్రస్తుత ఓటింగ్ జరిగిన తీరును బట్టి చూస్తే ఉత్తరాంధ్రలో వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ ఖాయం అనే అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. కూటమి తరపున పోటీ చేసిన హేమా హేమీలంతా మట్టి కరుస్తారనే టాక్ నడుస్తోంది. టీడీపీకి గతంలో వచ్చిన కొద్ది సీట్లు కూడా ఈసారి రావనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. -
మోసం, దగా, కుట్ర చంద్రబాబు పేటెంట్: బొత్స
సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర అభివృద్ధిలో విశాఖపట్నం చాలా కీలకమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. గత ప్రభుత్వం ఉత్తరాంధ్రను పట్టించుకోలేదని మండపడ్డారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ‘ఉత్తరాంధ్ర అభివృద్ధి కట్టుబడి ఉన్నాం. విశాఖపై ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం.విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ప్రకటించాం. కొన్ని కారణాలతో ఆలస్యమైంది. సీఎం జగన్ మాట తప్పని మనిషి అని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. చెప్పిన మాటమీద నిలబడటం కోసం ఎంత కష్టమైనా మాట నిలబెట్టుకుంటారు. విశాఖ పరిపాలన రాజధానికి సీఎం జగన్ కట్టుబడి ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ గెలిచిన తరువాత విశాఖలోనే సీఎం ప్రమాణ స్వీకారం ఖచ్చితంగా ఉంటుంది. సీఎం జగన్ నిర్ణయాలు ఉత్తరాంధ్ర అభివృద్ధికి తోడ్పడతాయి. చంద్రబాబు ఏనాడూ ఉత్తరాంధ్రను పట్టించుకోలేదు. టీడీపీ వారి దోపిడీ కోసం అమరావతిని తెరపైకి తీసుకొచ్చారు’ అని బొత్స అన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఏమన్నారంటే.. విశాఖలోనే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారోత్సవం ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మాట తప్పని మనిషని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఆయన మాట చెబితే దాన్ని నిలబెట్టుకునేందుకు ఎంత కష్టాన్నైనా భరిస్తారు. ఇచ్చిన మాటకు కట్టుబడి, దానిని నెరవేర్చాలనే మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గారి బిడ్డగా ఆయన నైజం అది. అలాంటి నేపథ్యంలోనే కిందటి సారి విశాఖపట్టణంలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కార్యక్రమంలో ఆయన స్వయంగా పాల్గొని ఓ మాట చెప్పారు. దేవుడి దయతో రాష్ట్ర ప్రజల సహకారంతో మళ్ళీ మనం అధికారంలోకి వస్తున్నాం. 2024లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం విశాఖపట్టణంలోనే చేస్తాను. విశాఖను ఎగ్జిక్యూటివ్ కాపిటల్‌గా తీర్చిదిద్దడమే కాకుండా ఇక్కడ అన్ని మౌలికసదుపాయాలను కల్పించి ఒక హబ్‌గా తయారు చేస్తానంటూ మాట ఇచ్చారు. అప్పట్లో ఆ కార్యక్రమానికి విచ్చేసిన ఇన్వెస్టర్లందరికీ విశాఖపట్టణంలో పెట్టుబడులకు ఓ భరోసా కల్పించారు. - విశాఖ ఇన్వెస్టర్ల మీటింగ్‌లో తాను ఏమైతే మాట ఇచ్చారో.. దానికి నూటికి నూరుశాతం జగన్‌గారు కట్టుబడి ఉన్నారు. అధికారంలోకి రాగానే తాను ఇక్కడికే తన పరిపాలన తెస్తానన్నారు. దీనిపై అప్పట్లో ప్రతిపక్ష పార్టీలు, వాటికి కొమ్ముకాస్తున్న ఎల్లో మీడియా సంస్థలు రోజుకో విధంగా విషం చిమ్మాయి. లేనిపోని గాలికబుర్లు, అభూతకల్పనలతో ఆయనపై దుమ్మత్తిపోస్తున్నప్పటికీ.. తన మాటపై తాను ధృఢంగా నిలబడి ఉన్నారు. రేపటి ఎన్నికల్లో గెలవగానే ఇక్కడ్నే ఆయన ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలోనే విశాఖ అగ్రగామిగా నిలబడుతోంది. ఉత్తరాంధ్ర ప్రాంత మణిహారంగా డిస్నీ ఆఫ్ విశాఖపట్టణం మారనున్నదని చెప్పడానికి మేం గర్విస్తున్నాం. ఇవ్వన్నీ మరోమారు ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలకు గుర్తుచేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఇక్కడ ఎగ్జిక్యూటివ్ కాపిటల్ నెలకొల్పుతారు. అందులో పెద్ద సందేహమేదీలేదు. ఆయన చెప్పినట్లు.. డిస్నీ ఆఫ్ విశాఖకు ఇక్కడున్న సహజ వనరులు, సీకోస్ట్, పోర్టులు, ఏయిర్పోర్టు, హైవే కనెక్టివిటీ తదితర సదుపాయాలన్నీ అనుకూలించనున్నాయి. బెంగుళూరు, ముంబై, చెన్నై తరహాలో విశాఖ పట్టణాన్ని కూడా తీర్చిదిద్దే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. కనుకే, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆ దిశగా ముందుకెళ్లే కృతనిశ్చయంతో మేమున్నాం. భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం కిందటేడాదిన విశాఖకు సుమారు 40 కిలోమీటర్ల దూరమున్న భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయానికి జగన్మోహన్రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. పనులు కూడా అప్పుడే మొదలయ్యాయి. ఏజెన్సీలకు బిడ్స్ అప్పగించడం కూడా జరిగింది. ఇవన్నీ పూర్తిచేసుకుని 6 మిలియన్ల పాసింజర్ల ప్రయాణ రాకపోకలకు విమనాశ్రయాన్ని మొదటి దశలో సిద్ధం చేస్తున్నామనేది అందరికీ తెలిసిన విషయమే. దానికి కనెక్టివిటీ చేస్తూ గాజువాక నుంచి భోగాపురం వరకు మెట్రో ట్రైన్ ఏర్పాటుకు డీపీఆర్ తయారు చేసి త్వరలోనే దాన్ని పూర్తిచేయనున్నాం. వీటన్నిటి పట్ల మా జగన్ గారి కృతనిశ్చయంతో ఉన్నారని మరోమారు గుర్తుచేస్తున్నాను. ఇది మా ప్రభుత్వ తాలూకూ ఆలోచన, ప్రణాళికగా చెబుతున్నాను. వేగంగా పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల పనులు అదేవిధంగా ఈ ప్రాంత వాసులు ఇక్కడ ఫిష్షింగ్ ల్యాండింగ్ సెంటర్లు, ఫిష్షింగ్ హార్బర్లు, శ్రీకాకుళంలో మరో పోర్టు కావాలని ఎప్పట్నుంచో కోరుకుంటున్నారు. దీనివలన మత్స్యసంపదను పెంచుకుని పెట్టుబడులను ఆకర్షిస్తూ వాణిజ్య అవసరాలను తీర్చుకునే వెసులు ఉంటుందన్నది ప్రజల ఆలోచన. వీటిపై గతంలో ఏ ప్రభుత్వాలు కూడా పట్టించుకోలేదు. అదే శ్రీ వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాక మూలపేటలో సుమారు రూ. 430 కోట్లతో గ్రీన్‌ఫీల్డ్ పోర్టు నిర్మాణ పనులు జరుగుతోన్నాయి. విశాఖ ప్రజల చిరకాల వాంఛగా ఉన్న ఒక ఫిష్షింగ్ హార్బర్‌ను కూడా నిర్మిస్తున్నారు. వీటితో పాటు అక్కడ సమీప ప్రాంతాల్లో మరో 10 ఫిష్షింగ్ ల్యాండింగ్ సెంటర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు చేసి పనులు కూడా ప్రారంభించారు. మేం చెప్పేవన్నీ మాటలతో చెప్పి ఊరుకున్నవి కావు.. పనులు కూడా ఇప్పటికే ప్రారంభమయ్యాయి. పనులు వేగంగా జరుగుతున్నాయి. చంద్రబాబులా సెల్ఫ్ డబ్బా కొట్టుకోం ఆనాడు ఐటీ రంగాన్ని విశాఖపట్టణం తెచ్చేందుకు దివంగత మహానేత శ్రీ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గారు కృషి చేశారు. అప్పట్లోనే కొన్ని టవర్ల ఏర్పాటుకు ఆయన శ్రీకారం చుడితే.. ఇవాళ ఇక్కడ ఇన్ఫోసిస్ డెటా సెంటర్ వంటి ప్రముఖ ఐటీ కంపెనీలను జగన్మోహన్రెడ్డి గారు తెచ్చారు. అంతేకాకుండా ఇక్కడ దాదాపు రూ.22 వేల కోట్ల పెట్టుబడులతో ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ కూడా ఏర్పాటు కానుంది. మేము చంద్రబాబు మాదిరిగా చేయని పనులకూ డబ్బాలు కొట్టుకునే రకాలం కాదు. లేనిది ఉన్నట్టు.. ఉన్నది లేన్నట్టు చెప్పుకుని పబ్లిసిటీ చేసుకునే చంద్రబాబు లాంటి తత్త్వం మాది కాదు. మా నాయకుడు జగన్మోహన్రెడ్డి గారు చేసేదే చెబుతారు. చెప్పిందే చేసి చూపుతారు. అదే ఆయన ప్రత్యేకత నైజం. పైశాచికానందంలో రామోజీ, రాధాకృష్ణలు ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణలు కలిసి చంద్రబాబు కోసం ఓ పైశాచిక క్రీడకు తెరలేపారు. ఆ మేరకు జగన్మోహన్రెడ్డి గారి పైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై రోజుకో పైశాచిక వార్తలు రాసి.. వికృతానందం పొందుతున్నారు. వాళ్లకు మా మీద నెగిటివ్ వార్తలు రాయడమే పైశాచికానందం అంట. దీనివల్ల చివరకు వాళ్లు సాధించేదేముంది..? ఆ రెండు పత్రికల్లో వాళ్లు రాసే విషయాల్లో ఒక్కటంటే ఒక్క పర్సంటేజీ నిజాలు కనిపించడం లేదు. పేరెంట్స్ మీటింగ్‌కు రాజకీయం అంటగడతారా..? ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో ఇవాళ ఎలాంటి వార్తలొస్తున్నాయంటే, ఉదాహరణకు నేను మంత్రిగా పర్యవేక్షించే శాఖనే తీసుకుందాం. విద్యా శాఖపై ఇవాళ కూడా మూడు వార్తలు రాశారు. ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్ మీటింగ్స్ కూడా పెట్టకూడదంట. ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలు బాగా చదివి పరీక్షలు రాస్తే.. మార్కులు బాగా రావాలని కోరు కుంటారు. ఆయా విషయాలపై చదువు చెప్పిన ఉపాధ్యాయులతోనూ మాట్లాడాలని కోరుకోవడం సహజమే. అలాంటి సందర్భాల్లో పెట్టే పేరెంట్స్ మీటింగ్‌నూ రాజకీయాలకు ముడిపెట్టి వార్తలెలా రాస్తారు..? ప్రభుత్వ స్కూళ్లల్లో జరిగే పేరెంట్స్ కమిటీ మీటింగ్‌లకు రాజకీయ నేతలుగా మేం అక్కడికెళ్లి పబ్లిసిటీ చేస్తామా..? విద్యార్థికి చదువు చెప్పిన టీచర్, విద్యార్థి తల్లిదండ్రులు కూర్చొని అతని చదువు పరిస్థితిపై మాట్లాడుకునే వాతావరణం అది. దానికి రాజకీయం రంగు పులమడం దేనికి..? మీడియా సంస్థలుగా ఆ రెండు పత్రికలు ఈ వ్యవస్థను ఏం చేద్దామనుకుంటున్నాయి..? మీరు చేసేది చాలా తప్పుకదా..? 18,200 మంది టీచర్లను రిక్రూట్ చేశాం.. స్థానికంగా కూటమి అభ్యర్థి ఒకరు విద్యాసంస్థ నడుపుతున్నాడంట. ఆయన మాట్లాడుతూ.. స్కూళ్లకు రంగులేయడం కాదు. టీచర్లకు ట్రైనింగ్ ఇచ్చి అప్పాయింట్మెంట్లు ఇవ్వాలంటున్నాడు. గత ఐదేళ్ల కాలంలో మా ప్రభుత్వం ఏం చేసిందో ఆయనకేం తెలుసు..? ఇంగ్లీషు మీడియం విద్యాబోధనపై టీచర్లకు ట్రైనింగ్ ఇప్పించాం. ఎప్పటికప్పుడు వాళ్లను మోటివేట్ చేస్తూ లెర్నింగ్ స్కిల్స్ ఏ స్థాయిలో ఉన్నాయో పరిశీలనలు జరుగుతున్నాయి. ఈ విషయాలన్నింటిపై టీచర్లను అడిగితే చెబుతారు కదా..? మా ప్రభుత్వం అధికారంలోకొచ్చాక జగన్ గారు 18,200 మంది టీచర్లను రిక్రూట్ చేసుకుని అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చాం. ఇవన్నీ తెలియక ఎవరంటే వారు మైండ్‌లేని మాటలు మాట్లాడటం మంచిదికాదు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కూటమి అనుకూలమా..? వ్యతిరేకమా..? ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి సంబంధించి జగన్ గారు ఇప్పటికే అనేక ప్రణాళికలు అమల్లోకి తెచ్చి పూర్తిచేస్తున్నారు. రేపు అధికారంలోకి రాగానే విశాఖపట్టణం ఎగ్జిక్యూటివ్ కాపిటల్‌గా తీర్చిదిద్దబోతున్నారు. అందులో భాగంగా ఇప్పటికే ఉత్తరాంధ్రలో అనేక ఐటీ తదితర పరిశ్రమలు, పోర్టులు, హార్బర్లు, ఏయిర్‌పోర్టులు కూడా వచ్చాయి. మరి, కూటమి వీటన్నింటికీ అనుకూలమా..? వ్యతిరేకమా..? దీనిపై సమాధానం చెప్పి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎన్నికల ప్రచారం చేసుకుని ఓట్లు అడగాలని డిమాండ్ చే స్తున్నాం. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ చేయబోమని బీజేపీతో చెప్పించగలరా..? విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు మేం వ్యతిరేకమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో మా విధానం చెప్పింది. దీనిపై మేము ఒక లెటర్ ఇచ్చి ఊరుకున్నామని కూడా ఆ రెండు పత్రికలు రాశాయి. అంటే, గతంలో జరిగిన విషయాలపై బుర్ర ఉండాల్నా.. లేదా..? జగన్మోహన్రెడ్డి గారు ఢిల్లీలో ప్రధాని మోదీగారిని కలిసినప్పుడు.. అదే మోదీ గారు విశాఖకు వచ్చినప్పుడు కూడా స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై మా విధానాన్ని స్పష్టంగా వివరించారు. అదే విధానంపైనే ఇప్పటికీ మేం స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగానే పోరాడుతున్నాం. మరి, ఈ అంశంపై కూటమి సమాధానం ఏంటి..? చంద్రబాబు కొత్తగా కూటమిలో చేరిన సందర్భంగా .. ఆ కూటమితో స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయబోమని చెప్పించమనండి. బీజేపీ పెద్దల నోటివెంట ప్రైవేటీకరణ చేయబోమని చెబితే అందరం వింటాం కదా..? ప్రశ్నలకు సమాధానాలిస్తూ.. నాసిరకం మద్యం అని బాబుకు ఎలా తెలుసు? జగన్ గారు మ్యానిఫెస్టోలో దశలవారీగా మద్యం నిషేధిస్తామన్నారు. అదే విధానాన్ని వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇవాళ ఎక్కడ చూసినా.. మద్యం ధరలపై చంద్రబాబు చెబుతున్నారు. ప్రజల నిత్యావసరాలు, మత్తు కోసం తాగే మద్యం ఒకటేనా..? ధరల పెంపుతో మద్యం వినియోగాన్ని తగ్గించాలనేది మా ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం వ్యవస్థను నడిపిస్తున్నాం. అందులో తప్పేముంది..? ఇక, మద్యం నాణ్యత గురించి కూడా ఆయన చెబుతున్నాడు. అది నాసిరకపు మద్యం అని చంద్రబాబు తాగి చూశాడా..? ఆయనకు మద్యం తాగే అలవాటు లేదనుకుంటాను. మరి, ఆయనేదో మద్యం తాగడంలో ఎక్స్‌పర్ట్‌గా మాట్లాడుతాడే..? లేదంటే, ఏబీఎన్ లిక్కర్ టెస్టింగ్ ల్యాబ్‌లో పరీక్షించారా..? మీకు చేతనైన లేబొరేటరీకి పంపి అందులో ఉండాల్సిన ఏబీసీడీలు ఉన్నాయో.. లేవో తెలుసుకోండి. అంతేగానీ, వ్యసనపరుల బలహీనతలను ఆసరాగా చేసుకుని రాజకీయం నడుపుదామని అనుకోవడం ప్రతిపక్షాలకు మంచిది కాదు -
ఉత్తరాంధ్రలో వైఎస్సార్ సీపీ నేతల ప్రచార హోరు
-
ఉత్తరాంధ్ర టీడీపీలో మూకుమ్ముడి రాజీనామాలు
-
అలర్ట్.. ఉత్తరాంధ్రలో రేపు కూడా వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర జిల్లాల్లో రేపు(గురువారం)కూడా తేలికపాటి వర్షాలు నమోదవుతాయని విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రం డైరెక్టర్ సునంద వెల్లడించారు. రేపు పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. శుక్రవారం నుంచి పూర్తిగా పొడి వాతావరణం ఉంటుందని, ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి చేరుకుంటాయన్నారు. నిన్న గరిష్టంగా విజయనగరం జిల్లా గరివిడిలో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. ఈ రోజు అనకాపల్లిలో ఐదు సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ నెలాఖరు వరకు ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలోనే ఉంటాయి. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని సునంద తెలిపారు. -
ఉత్తరాంధ్ర వైఎస్సార్సీపీ అభ్యర్థులు వీరే
-
చంద్రబాబు కుట్రలు ఫలించవు: వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, తాడేపల్లి: ఉత్తరాంధ్రలో సిద్దం సభకు ఊహించని రెస్పాన్స్ వచ్చిందని వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ, రానున్న రోజుల్లో మరో మూడు సభలను నిర్వహిస్తామని వెల్లడించారు. ఏలూరు, అనంతపురంతో పాటు నెల్లూరు లేదా ఒంగోలులో ఇంకో సభ ఉంటుందన్నారు సీఎం జగన్ కార్యకర్తలను స్వయంగా కలిసి ఎన్నికలకు సిద్దం చేస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమం అనేది సీఎం జగన్‌కి రెండు కళ్లు లాంటివి. గడిచిన ఐదేళ్లలో మా ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలు చూస్తున్నారు. చంద్రబాబు విజన్ కేవలం తన వారిని అభివృద్ధి చేసుకోవటమే’’ అంటూ వైవీ దుయ్యబట్టారు. ‘‘అమరావతి అభివృద్ధి తప్ప రాష్ట్ర ప్రజలతో సంబంధం లేదన్నట్టుగా వ్యవహరించారు. కచ్చితంగా మూడు రాజ్యసభ సీట్లను కైవసం చేసుకుంటాం. చంద్రబాబు చేసే కుట్రలు ఫలించవు. మా ఎమ్మెల్యేలంతా మావైపే ఉన్నారు’’ అని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఇదీ చదవండి: చంద్రబాబుకు టీడీపీ నేత ఆలపాటి షాక్ -
Pongal: భాగ్యవంతులొస్తున్నారు..
ఆశలు మూటలు నెత్తిన మోస్తూ గతంలో తాము నడిచివెళ్లిన బాటల్లో ఆనందపు అడుగులను వెతుక్కుంటూ భాగ్యవంతులు వస్తున్నారు. ఇంకో వారంపదిరోజుల్లో హైదరాబాద్, బెజవాడ..గుంటూరు..నెల్లూరు..నల్గొండ.. ఈస్ట్..వెస్ట్.. జిల్లాలనుంచి వేలమందిని మోసుకుంటూ రైళ్లు బస్సులు మన్యం జిల్లాకు వస్తుంటాయి. వాళ్లంతా వలసకూలీలని సామాజికవేత్తలు అంటుంటారు కానీ నాలాంటి అల్ప సంతోషులు మాత్రం వాళ్ళను భాగ్యవంతులు అంటారు. వాళ్లంతా ఇక్కడ బతకలేని పేదలని మేధావులు అంటారు. నాలాంటి సామాన్యులు మాత్రం వాళ్లంతా తమ బతుకులు బాగుచేసుకునేందుకు జిల్లాల హద్దులు దాటిన శ్రమజీవులని అంటాం భోగి ముందురోజు రాత్రి ఐడ్రా బాడ్ నుంచొచ్చిన అప్పలనాయుడు, లక్ష్మీ, నాయుడి వీరకాడు నారాయణ, ఇరుగుపొరుగు వట్టిగడ్డి కుప్పేసి దమట ముట్టించి సుట్టూ కూకుని కవుర్లు మొదలెట్టారు.. మరేటిబావా ఐడ్రాబాడ్లో అంతా బాగున్నట్టేనా అన్న నారాయణ ప్రశ్న పూర్తి కాకుండానే లక్ష్మీ అందుకుని.. పర్లేదన్నియ్యా ఇద్దరం డూటీకి వెళ్తాం..మాతోబాటే మా మహేసూ వస్తాడు.. ముగ్గురికి బాగానే వస్తాది అదోరం సెలవు.. ఒకలి జీతం అద్దికి.. ఖర్చులకు పోయినా రెండు జీతాలు మిగుల్తాయి.. మరి దాంతోటే కదా ఈ ఇల్లు పునాదులు రేకులు వెయ్యడం.. పెద్దదాని పెళ్లి అప్పు లచ్చన్నర తీర్చడం..చిన్నదాన్ని నర్స్ ట్రైనింగ్.. అంతా దాన్లోంచే అంటున్నప్పుడు ఒకనాడు వంద నోటును అబ్బురంగా చూసిన పేదరికాన్ని కష్టంతో దాటుకొచ్చాము అంటున్న లక్ష్మీ ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. అంతలోనే లక్ష్మీ మళ్ళీ అందుకుని తిండికి.. గుడ్డకు లోటు లేదన్నియ్యా.. మీ బావకు మాత్రం వారానికి మూడ్రోజులు కౌసు ఉండాలి అంటున్నప్పుడు ఆరేడేళ్ళు క్రితం ఇదేఊళ్ళో అడ్డిడు బియ్యం.. తవ్విడు నూకలికి ఇల్లిల్లూ తిరిగిన జ్ఞాపకాన్ని మర్చిపోలేదు అంటూనే ఇప్పుడు మేం అలా లేం. మేం కష్టంతో స్థాయిని పెంచుకున్నాం అంటుంది.. పోన్లేర్రా ఊళ్ళో అయినోళ్ళ ముందు చెడి .. చెయ్యిచాచి బతకడం కన్నా ఊరుదాటి బాగుపడడం మేలని నారాయణ చెబుతుండగా పక్కింది వదిన చేటలో చెత్త పెంటమీద పారేస్తూ దమటకాడికి వస్తూనే ఏటీ నచ్చిమొదినా చెవులోవి కొత్తవా ఏటీ అన్నాది. వెంటనే లక్ష్మీ మొహాన్ని సంతోషం కమ్మేయగా..అవును మంగొదినా ఇన్నాళ్లకు ఆర్తులం సెయిను, ఆర్తులం జూకాలూ చేయించాడు మీ అన్నియ్య అని చెబుతూ భర్తను మురిపెంగా చూస్తుంటే దమట వెలుగులో జూకాలు మరింత మెరుస్తూ కనిపించాయి. ఇదిగో ఈ సీర్లన్నీ సీఎమ్మారులో కొనేసామ్ ఒకేసారి అంటున్నప్పుడు అప్పట్లో పాతచీరలకోసం తెలిసినవాళ్లను అడిగిన లక్ష్మీ గొంతులో మాకిప్పుడా అవసరం లేదన్న భరోసా వినిపించింది.. మొన్నామధ్య యాదగిరి వెళ్ళాము. తిరప్తి కన్నా పెద్దది తెలుసా.. ఇంతంత కాదని చెబుతున్నపుడు మేం విహారయాత్రలకూ వెళ్తాం..మేం అప్పట్లా లేం.. అనే ధీమా ముప్పిరిగొంటుంది. పాత్రల పేర్లు మారతాయేమో కానీ పార్వతీపురం డివిజన్లోని ప్రతిగ్రామంలోనూ ఇలాంటి కుటుంబాలు ఉన్నాయి. ఆరేడేళ్ళ క్రిందట పూటపుటనూ లెక్కించుకుని జీవించే వందలాది కుటుంబాలు.. కాలాన్ని నిందించలేదు. ప్రభుత్వాలను తిట్టలేదు. కష్టాన్ని నమ్ముకుని ట్రైన్..బస్సు ఎక్కి.. ఆ జిల్లాలకు వెళ్లాయి. రైస్ మిల్లులు..నూలు మిల్లులు..టాబ్లెట్స్.. ప్లాస్టిక్ కంపెనీలు..చేపలు..రొయ్యల చెరువులు..ఫామ్ హవుసులు.. కోళ్లఫారాలు..డైరీ ఫారాలు.. ఎక్కడ పనిదొరికితే అక్కడ చేరిపోయారు.. పాపం అమాయకులు..నిజాయితీగా ఒళ్ళోంచి పనిచేస్తారు.. అందుకేనేమో కొద్దిరోజుల్లోనే యజమానులకు ఇష్టులైపోయారు. చాలామందికి..చిన్నపాటి షెడ్.. ఇల్లు..రేషన్ కూడా యజమానులే ఇస్తారు..ఇక ఖర్చేముంది.. మూణ్ణాలుగేళ్ళు తిరిగేసరికి తమ జీవితం మారుతుందన్న.. మారిందన్న తేడా వాళ్ళకే స్పష్టంగా కనిపిస్తోంది. కోట్లు లేకపోవచ్చు..లక్షలూ అక్కర్లేదు. శ్రమే పెట్టుబడి.. మూడేళ్లు తిరిగేసరికి మెల్లగా చేతిలో డబ్బు కనిపిస్తుంది..తమ అభివృద్ధి తమకే తెలుస్తోంది. ఓపికున్నన్నాళ్లు చేద్దాం..ఊళ్ళోకొచ్చి మాత్రం చేసేదేముందన్న ధీమా.. కష్టంలోనే ఆనందం.. వచ్చే జీతంలోనే సంతోషం ..ఆ పక్కనే సంబరం.. ఇంతకన్నా భాగ్యవంతులెవరు.. డబ్బుమాత్రమే ఉన్నోళ్లు ధనవంతులు అవుతారు. జీవితంలో అన్నీ కోణాలూ..అన్ని భావాలూ.. అన్ని ఎత్తుపల్లాలూ చూసి తమను తాము గెలిచినవాళ్ళు భాగ్యవంతులే... ఓ రాసీరాయని పెన్నుతో వీళ్ళ జీవనరేఖలను బ్రహ్మ తన ఇష్టానుసారం రాసేస్తుంటే బ్రహ్మచేతిని ఒడిసిపట్టుకుని అలాక్కాడు.. మా రాత మేం రాసుకుంటాం.. నువ్ పక్కకేళ్లు సామీ అని గదమాయించి తమ రేఖలను భాగ్యరేఖలుగా మార్చుకున్న కుటుంబాలు కోకొల్లలు... వీళ్ళెవరూ పేదలు కారు...అవును పేదలు కారు...అక్షరాలా శ్రామికులు.. కార్మికులు... కృషి..శ్రమ ఉన్నచోట పేదరికం ఉండదు. దానికి వీళ్లంటే భయమెక్కువ.. పారిపోతుంది.. ఎక్కడికి..ఇంకెక్కడికి.. సోమరిపోతుల దగ్గరకు... శ్రమయేవ జయతే కృషితో నాస్తి దుర్భిక్షం. గాంధీ... విజయనగరం -
ఉత్తరాంధ్ర పొలిటికల్ ఇన్చార్జ్ గా దామచర్ల సత్య నియామకం
-
ప్రధాని మోదీతో గేదెల శ్రీనుబాబు భేటీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పల్సస్ సీఈవో డాక్టర్ గేదెల శ్రీనుబాబు భేటీ అయ్యారు. బీసీల సమస్యలు పరిష్కరించాలని కోరారు. గత రెండు దశాబ్దములలో ఉత్తరాంధ్ర నుండి 25 లక్షల మంది జీవనోపాధి కొరకు వలస పోయారని ప్రధానికి తెలిపారు. ముక్యంగా హైదరాబాద్ కు 15 లక్షల మంది వలస పోయారని వివరించారు. 2014 లో తెలంగాణ రాష్ట్రము విడిపోయిని తరువాత తెలంగాణ ప్రభుత్వం బీసీ జాబితా నుంచి తొలగించిన ఉత్తరాంధ్ర మరియు ఆంధ్రకు చెందిన 26 కులాలను బీసీ జాబితాలో మరల వాటిని చేర్పించాలని, కేంద్రం ఓబీసీ సర్టిఫికెట్లు మంజూరు చేయాలని కోరారు. శ్రీనుబాబు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. తెలంగాణ పర్యటనకి వచ్చిన ప్రధాన మంత్రి నరేంద్రమోదీని హైదరాబాద్‌లో కలిసిన తెలుగు రాష్ట్రాల బీసీల నాయకుడు, పల్సస్ సీఈవో డాక్టర్ గేదెల శ్రీనుబాబు బీసీల సమస్యలు ప్రధాని దృష్టికి తీసుకొచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలుగా ఉన్న 26 కులాలను 2014 రాష్ట్ర విభజనతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో తొలగించడంతో వీరంతా సామాజిక, ఆర్థిక అన్యాయానికి గురయ్యారని తెలిపారు. ఈ సమస్యను పునఃపరిశీలించి, సరిదిద్దేందుకు కేంద్రం జోక్యం చేసుకోవాలని ప్రధానిని కోరారు. ఈ 26 కులాలను తెలంగాణలోని వెనుకబడిన తరగతుల జాబితాలో మళ్లీ చేర్పించడం ద్వారా దాదాపు 30 లక్షల మందికి న్యాయం చేసిన వారవుతారని మోదీకి వివరించారు. బీసీల ఆశాజ్యోతి ప్రధానిగా ఉన్న మన దేశంలో బీసీలకి జరుగుతున్న అన్యాయంపై స్పందిస్తారనే భరోసా లభించిందని శ్రీనుబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో బీసీ జాబితాలో చేర్చడంతోపాటు కేంద్రం ఓబీసీలో చేర్చినప్పుడు ఈ 26 కులాలకి జరిగిన అన్యాయం సరిదిద్దినట్టు అవుతుందని ప్రధాని దృష్టికి తీసుకొచ్చారు. ఏళ్లుగా పోరాడుతున్న ఈ 26 కులాలను తెలంగాణలో బీసీ, కేంద్రంలో ఓబీసీ జాబితాలో స్థానం కల్పిస్తే...అత్యంత వెనకబడి, వివక్షకి గురైన ఈ కులాలకు విద్య, విజ్ఞాన, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో మెరుగైన అవకాశాలు లభిస్తాయని ప్రధాని మోదీకి శ్రీనుబాబు వివరించారు. -
ఎల్లుండి నుంచి వైఎస్సార్సీపీ బస్సు యాత్ర
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించబోతున్న బస్సుయాత్రకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా మూడు ప్రాంతాల్లోనూ ఒకేసారి బస్సుయాత్ర ప్రారంభం కాబోతోంది. డిసెంబరు నెలాఖరు వరకు జరిగే ఈ యాత్రకు సామాజిక సాధికార యాత్ర అనే పేరు పెట్టారు. 175 నియోజకవర్గాల్లోనూ గెలుపు లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దూసుకు పోతోంది. ఒకవైపు ప్రభుత్వ కార్యక్రమాలను నిర్వహిస్తూనే మరోవైపు పార్టీ పరమైన కార్యక్రమాలకు కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కార్యాచరణ సిద్ధం చేశారు. గతేడాది మే నెలలో ప్రారంభమైన గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమానికి విశేష స్పందన లభించిన నేపథ్యంలో ఇప్పుడు పార్టీ పరమైన కార్యక్రమాలను కూడా మరింత వేగంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 26 అంటే బుధవారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా మూడు ప్రాంతాల్లోనూ ఒకేసారి బస్సుయాత్రలు ప్రారంభం కాబోతున్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా మూడు బస్సులను రెడీ చేశారు. బస్సుల ముందు భాగంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తు ఫ్యాను ప్రముఖంగా కనిపించేలా స్టిక్కరింగ్ చేశారు. పైభాగాన సామాజిక సాధికార యాత్ర పేరు కనపడేలా చేశారు. ఇక మిగతా మూడు వైపులా మా నమ్మకం నువ్వే జగన్ పేరుతో స్టిక్కర్లు, పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫోటోలను ఏర్పాటు చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రమఖుల చిత్రాలను కూడా బస్సు మీద ఏర్పాటు చేశారు. ఇక బస్సు యాత్రలు తొలిరోజు అంటే ఈ నెల 26న ఉత్తరాంధ్రలోని ఇచ్చాపురం, కోస్తాంధ్రలో తెనాలి, రాయలసీమలో సింగనమల నియోజకవర్గాలలో ప్రారంభం కాబోతున్నాయి. తొలి విడతలో నవంబర్ తొమ్మిదో తేదీ వరకు యాత్రలకు సంబంధించిన వివరాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. దాని ప్రకారం ఉత్తరాంధ్రలో తొలుత ఇచ్చాపురంలో 26వ తేదీన బస్ యాత్ర ప్రారంభం కానుండగా, 27న గజపతినగరం, 28న భీమిలి, 30న పాడేరు, 31న ఆముదాలవలస, నవంబర్ 1న పార్వతీపురం, 2న మాడుగుల, 3న నరసన్నపేట, 4న శృంగవరపుకోట, 6న గాజువాక, 7న రాజాం, 8న సాలూరు, 9న అనకాపల్లె నియోజకవర్గాల్లో బస్సుయాత్ర జరుగుతుంది. ఇక కోస్తాంధ్రలో ఈనెల 26న తెనాలిలో ప్రారంభమయ్యే బస్సుయాత్ర 27న నరసాపురం, 28న చీరాల, 30న దెందులూరు, 31న నందిగామ, నవరంబరు 1న కొత్తపేట, 2న అవనిగడ్డ, 3న కాకినాడ రూరల్, 4న గుంటూరు తూర్పు నియోజకవర్గం, 6న రాజమండ్రి రూరల్, 7న వినుకొండ, 8న పాలకొల్లు, 9న పామర్రు నియోజకవర్గాల్లో కొనసాగుతుంది. ఇక రాయలసీమ విషయానికొస్తే.. తొలుత ఈనెల 26న సింగనమల నియోజకవర్గంలో బస్సుయాత్ర ప్రారంభై 27న తిరుపతి, 28న ప్రొద్దుటూరు, 30న ఉదయగిరి, 31న ఆదోని, నవంబర్ 1న కనిగిరి, 2న చిత్తూరు, 3న శ్రీకాళహస్తి, 4న ధర్మవరం, 6న మార్కాపురం, 7న ఆళ్లగడ్డ, 8న నెల్లూరు రూరల్, 9న తంబళ్లపల్లె నియోజకవర్గాల్లోయాత్ర కొనసాగేలా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. ఈ సందర్భంగా గడిచిన నాలుగున్నరేళ్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రిగా జగన్ చేసిన అభివ్రుద్ది, సంక్షేమ పథకాల గురించి వివరిస్తారని ఈనెల 9న విజయవాడలో జరిగిన పార్టీ ప్రతినిధుల సమావేశంలో పార్టీ అధినేత వైఎస్ జగన్ చెప్పారు. ప్రతి బస్సు యాత్రను ఒకటీమ్ గా భావిస్తే అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన లీడర్లు స్పీకర్లుగా ఉంటారన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఈ యాత్ర కొనసాగుతుందని తెలిపారు. వైనాట్ 175 అనేది ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ నినాదం. ఈ విషయాన్ని ఆయన ఇప్పటికే పలు వేదికల మీద ప్రకటించారు. ఇచ్చిన హామీలను అమలు చేస్తూ మ్యానిఫెస్టోలో ఇప్పటికే 98.5 శాతానికి పైగా అమలు చేసిన ఘనత కూడా వైఎస్ జగన్‌దే. గత ప్రభుత్వాలన్నీ ఇచ్చిన హామాలను తుంగలో తొక్కేస్తే జగన్ మాత్రం మ్యానిఫెస్టో అంటే ఒక భగవద్గీత, ఖురాన్, బైబిల్ లాగా పవిత్రంగా భావిస్తూ అందులోని హామీలను అమలు చేసేందుకు ఎక్కడా వెనక్కు తగ్గలేదు. అంతేకాదు.. మంత్రివర్గంలో కూడా బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారికే 77 శాతం పదవులను కట్టబెట్టారు. స్థానిక పదవుల్లోనైతే మహిళలకు యాభై శాతాకిపైగా కేటాయించారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ, అభివ్రుద్ది కార్యక్రమాలను వారికి పూర్తిస్థాయిలో కల్పించారు. అందుకే జగన్‌ను ఆ వర్గాలన్నీ తమ గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తున్నాయి. రాబోయే ఎన్నికలను మరో కురుక్షేత్ర యుద్దంగా భావిస్తున్న నేపథ్యంలో పేదలు, పెత్తందార్ల మధ్యనే పోటీ జరగబోతున్నదని ఇప్పటికే పేద వర్గాలన్నీ భావిస్తున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేదలకు అండగా నిలిచింది. అందుకే వారంతా తమ జెండా, ఎజెండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయేనని బాహాటంగానే చెప్తున్నారు. మొత్తమ్మీద బస్సు యాత్ర ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మరింత ఉత్సాహం కనిపిస్తోంది. పార్టీ క్యాడర్ మొత్తం ఈ యాత్రలో పాల్గొనబోతోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావారణం కనిపిస్తోంది. చదవండి: అదీ సంగతి.. లోకేష్ ముందుగానే ఫిక్స్ అయిపోయారన్నమాట.. -
YSRCP Bus Yatra: ఉత్తరాంధ్ర నుంచి బస్సు యాత్ర మొదలు.. షెడ్యూల్ ఇదే..
సాక్షి, విజయనగరం: రాజ్యాధికారం అన్ని వర్గాలకు అందించాలన్న ధ్యేయంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం పని చేస్తోందని, అన్ని ప్రధాన పదవులు వెనుకబడిన వర్గాలకు కేటాయించిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అక్టోబర్ 26 నుంచి 9 వరకు ఉత్తరాంధ్రలో బస్సు యాత్ర జరుగుతుందని, ఇచ్ఛాపురం నుంచి యాత్ర మొదలవుతుందని ఆయన వివరించారు. చంద్రబాబు ఆరోగ్యంపై ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. బాబు కుటుంబ సభ్యుల సూచనలు కోర్టు పరిగణలోకి తీసుకుంటే అచరిస్తామని మంత్రి అన్నారు. రానున్న ఎన్నికల్లో గెలిచే పార్టీ వైఎస్సార్సీపీయే. విశాఖ కేంద్రంగా పాలనను ఉత్తరాంధ్ర ప్రజలు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు’’ అని మంత్రి పేర్కొన్నారు. ‘‘ నిన్నటి సభలో సీఎం జగన్ వాస్తవాలే మాట్లాడారు. వ్యక్తి గత దూషణలు చేయలేదు. లోకేష్ అమిత్ షాను కాదు అమితాబ్‌ను కలిసినా మాకు అభ్యంతరం లేదు. చట్ట ప్రకారం చంద్రబాబుపై చర్యలు తీసుకున్నారు కానీ వ్యక్తి గతం కాదు’’ అని మంత్రి బొత్స స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర మంత్రుల సామాజిక బస్సు యాత్ర షెడ్యూల్ ►26- ఇచ్చాపురం ►27-గజపతినగరం ►28-భీమిలి ►30-పాడేరు ►31-ఆముదాలవలస ►నవంబర్ 1-పార్వతీపురం ►నవంబర్ 2 -మాడుగుల ►నవంబర్ 3 -నరసన్నపేట ►నవంబర్ 4 -ఎస్.కోట ►నవంబర్ 6 -గాజువాక ►నవంబర్ 7 -రాజాం ►నవంబర్ 8 -సాలూరు ►నవంబర్ 9 -అనకాపల్లి చదవండి: చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీ డ్రామాలు: సజ్జల -
‘ఉత్తరాంధ్రకు తీరని అన్యాయం చేసిన బాబు సిగ్గుపడాలి’
శ్రీకాకుళంః వంశధార ప్రాజెక్టును డిసెంబర్లో జాతికి అంకితమిస్తున్నట్లు మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు. ఉద్దానం సమస్యను పరిష్కరించిన ఘనత సీఎం జగన్‌దేనని ధర్మాన పేర్కొన్నారు. రూ. 4 వేల కోట్లతో మూలపేట పోర్టు పనులు చకచకా జరుగుతున్నాయని, ఉత్తరాంధ్ర ప్రజలంతా వైఎస్సార్సీపీ వైపే ఉన్నారని మంత్రి తేల్చిచెప్పారు. ధర్మాన ప్రసాదరావు మీడియాతో మాట్లాడుతూ ఇంకా ఏమన్నారంటే ఉత్తరాంధ్రలో సాగునీటి ప్రాజెక్టుల రూపకర్త వైఎస్ఆర్ ప్రతిపక్ష నేత చంద్రబాబుకు రాష్ట్రంలోని ప్రాంతాల అభివృద్ధి పట్ల పూర్తి అవగాహన లోపించినట్లుంది. ఆయన ప్రతిపక్ష నేతగా ఎక్కడికైనా రావచ్చు. పర్యటించి పరిశీలనలు కూడా చేయొచ్చు. కాకుంటే, ఆయన ఉత్తరాంధ్ర ప్రాంతానికి వచ్చినప్పుడు మాట్లాడిన మాటలు మాత్రం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఆయనకు ఈ ప్రాంతం పట్ల ప్రేమ ఉన్నట్లు.. ఈ ప్రభుత్వానికి లేనట్లు చిలుకపలుకులు పలికాడు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో మొట్టమొదటిసారి సాగునీటి ప్రాజెక్టులు మొదలుపెట్టింది మహానేత డాక్టర్ శ్రీ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి. ఆనాడు జలయజ్ఞం పేరిట తోటపల్లి, వంశధార, టెక్కలిలో మహేంద్రతనయ ఆఫ్ షోర్ తదితర మేజర్ ప్రాజెక్టులను ఆ మహానేత ప్రారంభించారు. 14 ఏళ్ళు అధికారంలో ఉండి ఏం చేయలేదని బాబు అంగీకారం చంద్రబాబు ఈరోజు ఇక్కడకొచ్చి ప్రాజెక్టులు పూర్తికాలేదంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, 14 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబునే తనకు తాను ప్రశ్నించుకున్నట్లు ఉంది. నువ్వు పూర్తిచేయాల్సిన ప్రాజెక్టులను 4 ఏళ్ల కిందట వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పూర్తిచేయలేదనడం హాస్యాస్పదం కాదా..? అని చంద్రబాబును ప్రశ్నిస్తున్నాను. శ్రీ వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పూర్తిచేసుకున్న 4 ఏళ్లల్లో రెండేళ్లు కోవిడ్ సంక్షోభం ఉంటే.. మరి, నువ్వు 1995లో ముఖ్యమంత్రి పీఠాన్ని అందుకున్నావన్న సంగతి గుర్తుందా..?. ఈ ప్రాంతం పెద్ద ఎత్తున నీకు, నీ ప్రభుత్వానికి మద్ధతిచ్చి ముఖ్యమంత్రిని చేసింది. 14 ఏళ్లపాటు ఈ ప్రాంతవాసుల ప్రేమతో నువ్వు ముఖ్యమంత్రిగా అధికారాన్ని వెలగబెట్టావు. మరి, నువ్వు ఈ ప్రాంతవాసులపై చూపించిన ప్రేమేంటి..? నీ నిర్లక్ష్యం, నీ అలసత్వాన్ని కప్పిపుచ్చుకుంటూ ఇప్పుడు శ్రీ వై ఎస్ జగన్ గారి ప్రభుత్వాన్ని విమర్శించడానికి సిగ్గనిపించడంలేదా..? అని ప్రశ్నిస్తున్నాను. అసలు, మీరేం చేశారు..? మేము ఈ ప్రాజెక్టు ప్రారంభించి పూర్తిచేశామని ఏ ఒక్కదాన్నైనా చెప్పగలరా..? ప్రజలకు ఆ విధమైన సమాచారం చెప్పుకోలేని మీరు కేవలం 4 ఏళ్ల ముందట పుట్టిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ప్రాజెక్టులు కట్టలేదని.. నాశనం చేశారనడం వంటి చంద్రబాబు మాటలపై అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది. వంశధారను డిసెంబర్లో జాతికి అంకితమిస్తున్నాం ప్రస్తుతం వంశధార ప్రాజెక్టులో 97 శాతం పనులు పూర్తిచేసుకుని, మిగతా 3 శాతాన్ని రేపు డిసెంబర్‌కల్లా పూర్తి చేస్తాం. విజయవంతంగా పూర్తయిన ఈ ప్రాజెక్టు ను డిసెంబర్లో జాతికి అంకింతం చేసేందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్రెడ్డి దీక్షగా కంకణం కట్టుకుని పనిచేస్తున్నారని ఈ సందర్భంగా నేను వెల్లడిస్తున్నాను. వంశధార పూర్తి వెనుక జగన్ కృషి ఉత్తరాంధ్ర ప్రాంతానికి ప్రతిష్టాత్మకమైన ఈ వంశధార ప్రాజెక్టు పూర్తి చేయడానికి జరిగినటువంటి కృషిని ఈ సందర్భంగా నేను వివరిస్తాను. మహానేత శ్రీ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కాలంలో దాదాపు 63 శాతం వంశధార ప్రాజెక్టు పనులు పూర్తయితే.. ఆ తర్వాత ప్రభుత్వం కొంతపనులు పూర్తి చేస్తే.. బాబు 14 ఏళ్లహయాంలో కేవలం 23 శాతం పూర్తి చేశారు. అంటే, 14 ఏళ్లల్లో 23శాతం పనులు చేసిన మీరొచ్చి మమ్మల్ని అడుగుతారా..? ఈ ప్రాజెక్టుకు 19 టీఎంసీల రిజర్వాయర్ నింపడానికి నేరడి బ్యారేజీ వద్ద కట్టాల్సిన అదనపు బ్యారేజీని ఒరిస్సాతో వివాదం ఉందని స్వయాన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడటానికి అక్కడికి వెళ్లి సంప్రదింపులు జరపడం మీకు తెలియదా..?. ఆ తర్వాత ఒరిస్సా ప్రభుత్వం మరలా సుప్రీం కోర్టు వరకు వెళ్లి మరో వివాదం తెచ్చింది. దీంతో రూ.2వేల కోట్లతో పూర్తి కావాల్సిన ఈ ప్రాజెక్టు ముందుకు సాగదేమోనని గొట్టా బ్యారేజీ వద్దనే రూ.170 కోట్లతో మరో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు శాంక్షన్ ఇచ్చి టెండర్ ఖరారు చేసి పనులు ప్రారంభించాము. గొట్టా బ్యారేజీ నుంచి 19 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసి రిజర్వాయర్‌ను నింపుకుందామని చేసిన ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిది. మరో మూడునెలల్లో వంశధార ప్రాజెక్టు పనులన్నింటినీ పూర్తిచేసి జాతికి అంకితం చేయబోతున్నాం. వంశధారకు నువ్వు చేసిందేంటి..? చంద్రబాబు ఒక విషయంపై సమాధానం చెప్పాలి. మీ 14 ఏళ్ల ఏలుబడి కాలంలో అనేక స్వార్థపూరిత ఆలోచనలకు కేటాయించిన సమయాన్ని ఈ ప్రాంతంలో కీలకమైన వంశధార ప్రాజెక్టుకు కేటాయించారా..? ఒక్క శాతం కూడా చంద్రబాబు ఈ ప్రాజెక్టుపై శ్రద్ధచూపలేదు. ఎప్పుడో 1955లో శంకుస్థాపన జరిగిన వంశధార ప్రాజెక్టు ఒరిస్సా ప్రభుత్వంతో వివాదం ఉందని ఆ ప్రాజెక్టును నిలుపుదల చేస్తే నీ 14 ఏళ్ల కాలంలో అటువైపు ఒక్కసారైనా తొంగిచూశావా..? ఒరిస్సా ముఖ్యమంత్రితో ఏనాడైనా నువ్వు మాట్లాడావా..? లేదంటే, ఒక ట్రిబ్యునల్ వేయించుకుని సమస్యను పరిష్కరించుకున్నావా..? అంటే, ఏదీ చేయలేదు. మరి.. ఈ నాలుగేళ్ల ప్రభుత్వం ప్రాజెక్టులను నాశనం చేస్తుందని ఎలా అనగలుతున్నావు చంద్రబాబు..? అని మేము ప్రశ్నిస్తున్నాం. ఉద్దానం సమస్యను పరిష్కరించిన మనసున్న నేత జగన్ ఇక, దేశంలో ఒక ప్రత్యేకమైన సమస్యతో అట్టుడికిన ఉద్దానం ప్రాంతం గురించి మాట్లాడుకుంటే.. గ్రౌండ్‌వాటర్ తాగి కిడ్నీ జబ్బులతో ప్రజలు చనిపోతున్నారని రీసెర్చిలో తేలింది. ఈ చంద్రబాబు 14 ఏళ్ల హయాంలో ఒక్క పనిని కూడా ఉద్దానం ప్రజల కోసం చేయలేదు. కిడ్నీ జబ్బుల సమస్యకు ఎటువంటి పరిష్కారాన్ని బాబు సూచించలేదు. అదే మా ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకొచ్చిన వెంటనే ఇచ్చాపురం, పలాసకు వెళ్లి సమావేశాలు పెట్టి ఉద్దానం ప్రజల ఉపశమనానికి కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. అక్కడి ప్రజలు గ్రౌండ్‌వాటర్ తాగకుండా ఏం చేయాలని ఆలోచించి.. హిరమండలం వద్దనున్న బ్యారేజీ నుంచి పైపులైన్ల ద్వారా ఉద్దానం ప్రాంత ప్రజలందరికీ తాగునీరు ఇవ్వాలని రూ.700 కోట్లతో ప్రాజెక్టు మొదలుపెట్టి.. ట్రయల్‌రన్ కూడా పూర్తిచేసుకుని రేపోమాపో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. ఉద్ధానం సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం అద్భుతం కాదా..? ఈ సందర్భంగా నేను కూడా ప్రజలనుంచి ఒక సమాధానాన్ని కోరుతున్నాను. దశాబ్ధాలుగా అనేకమంది ముఖ్యమంత్రుల కాలంలో పరిష్కారమవని ఒక సమస్యను ఒక ప్రభుత్వ కాలంలో అంటే, కేవలం 4 ఏళ్లకాలంలో పరిష్కరించి ప్రజలకు మేలు చేయడం అద్భుతం కాదా..? అని గుర్తుచేస్తున్నాను. అంతేకాదు, ఉద్దానం సమస్యకు రెండుమూడు రకాల పరిష్కారాలున్నాయి. అందులో ఒకటేమిటంటే.. ఉద్దానం ప్రజలకు ఇక కిడ్నీ వ్యాధులు రాకుండా సర్ఫేస్ వాటర్‌ను పైపులైన్ల ద్వారా అందించడం. రెండోదేమిటంటే, ఇప్పటికే కిడ్నీ వ్యాధి సోకి వైద్యం చేయించుకుంటూ.. ఏ పనిని చేసుకోలేని వారికి నెలనెలా రూ.10వేలు ఆర్థికసాయం అందించి వారి పొట్టగడవడానికి ప్రభుత్వం తోడుగా ఉంటుంది. ఇక మూడోదేమంటే, ఉద్దానంలోనే ఒక ఆస్పత్రిని నిర్మాణం చేయడం. రాబోయే మూడు నాలుగు నెలల్లో ఆ ఆస్పత్రి ప్రారంభోత్సవం కూడా జరగబోతుంది. నాల్గోదేమంటే, రీసెర్చి సెంటర్‌ను పూర్తిచేసి అక్కడికి వైద్యులను, ఇతర సిబ్బందిని విధుల్లోకి తెచ్చేందుకు నియమిస్తున్నాం. వాటికి సంబంధించిన డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేశాం. ఉద్దానం ప్రజలను అన్నిరకాలుగా ఆదుకుంటున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాది. ఒక సమస్యకు కేవలం 4ఏళ్ల కాలంలో ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వం పనిచేస్తే ఈరోజు ఏ ఒక్క మీడియాలోనూ ఒక్క వార్త కనిపించకపోవడం చాలా దారుణం. ఇదికదా.. ఒక ప్రభుత్వం తాలూకూ పనితనం. ఇదికదా.. ఒక ప్రభుత్వపనితీరుకు అద్దంపట్టే వాస్తవమని ప్రజలకు నేను గుర్తుచేస్తున్నాను. ఈ జిల్లాలోనే కాదు. ఈ రాష్ట్రంలో ఇలాంటి ఒక సమస్యపై 14 ఏళ్లకాలంలో చంద్రబాబు ఒక్క సమస్య అయినా పరిష్కరిండాడని ఆయన చెప్పగలరా..? శ్రీకాకుళంలో ఒక్క కేంద్ర సంస్థనైనా పెట్టలేదేం బాబూ..? రాష్ట్రవిభజన తర్వాత నష్టపోయిన ఆంధ్రరాష్ట్రానికి 2014 నుంచి 2019 వరకు 23 పెద్ద సంస్థలను కేంద్రప్రభుత్వం ఇస్తే.. 13 జిల్లాలుంటే.. శ్రీకాకుళంలో ఏ ఒక్క సంస్థనూ చంద్రబాబు పెట్టలేదు కదా..?. దీన్నిబట్టి ఉత్తరాంధ్ర వాసులు మీ పాలనను ఎలా అర్ధం చేసుకోవాలి. ఇప్పుడొచ్చి ఈ ప్రాంతం పట్ల నాకు ప్రేముందని చంద్రబాబు ఎలా చెబుతారు..? అప్పటికి రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలకు సమానంగా పంచితే రెండు పెద్ద సంస్థలు ఉత్తరాంధ్రకు రావాలి కదా..? ఎందుకు తేలేకపోయారు..? అబద్ధాలకైనా ఒక అంతుండాలని.. కన్నార్పకుండా అబద్ధాలాడటం చంద్రబాబుకే సాధ్యమని ఆయన సాహసాన్ని నేను మెచ్చుకోలేకపోతున్నాను. ఉత్తరాంధ్రకు అన్యాయం చేసిన వ్యక్తే ఈ చంద్రబాబు అని మరోమారు నేను గుర్తుచేస్తున్నాను. టెక్కలిలో మహేంద్రతనయ ఆఫ్ షోర్ గురించి చంద్రబాబు మాట్లాడటంలో అర్ధంలేదు. అసలు, ఆ ప్రాజెక్టుతో ఆయనకు సంబంధమేలేదు. ఆఫ్ షోర్ ప్రాజెక్టును మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గారు ప్రారంభించారు. చంద్రబాబు అధికారంలోకొచ్చాక దాన్ని ఆపేశారు. ఆ తర్వాత జగన్‌గారు వచ్చి ల్యాండ్ అక్విజేషన్ చేసి, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అమలు చేసి రూ.700 కోట్లతో ప్రాజెక్టుకు శాంక్షన్ ఇచ్చి పనులు ఇప్పటికే ముమ్మరంగా జరుగుతున్నాయి. ప్రాజెక్టులో ఇప్పటికే 20శాతం పూర్తయ్యాయి. తోటపల్లిలో బాబు పాత్రేమీ లేదు తోటపల్లి రిజర్వాయర్‌కు 2004లో బాబు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసినా పైసా ఖర్చుపెట్టలేదు. అప్పట్నుంచి 2014లో తిరిగి అధికారంలోకి వచ్చినప్పుడు కేవలం 10 శాతం పనులే చేశారు. అంతకుముందే, మహానేత డాక్టర్ వైఎస్ఆర్ గారి హయాంలో 90శాతం ప్రాజెక్టు పనుల్ని పూర్తిచేశారు. కాబట్టి, తోటపల్లి పూర్తిలో బాబు పాత్రేమీలేదని స్పష్టంచేస్తున్నాను. అన్నీ నేనే చేశానని ఆపాదించుకోవడం వలన ఏం ప్రయోజనం పొందుతున్నారని చంద్రబాబును ప్రశ్నిస్తున్నాను. రూ.4వేల కోట్లతో మూలపేట పోర్టు పనులు చకచకా ఉత్తరాంధ్ర ప్రాంతంలో రూ.4వేల కోట్లతో ఒక పోర్టు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తే అందరూ అవహేళన చేశారు. ఈరోజు ఎవరైనా చూడండి.. మూలపేట, విష్ణుచక్రం ప్రాంతంలో పోర్టు పనులు ఎంత శరవేగంగా జరుగుతున్నాయో చూడండి. స్వాతంత్య్రం వచ్చాక ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టి ప్రాజెక్టులును శ్రీకాకుళం జిల్లాకు తెచ్చిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమని మేం గర్వంగా చెప్పుకుంటున్నాం. అలాగే, అక్కడ్నే మరో రూ.400 కోట్లత ఫిష్షింగ్ హార్బర్‌ను కూడా ప్రారంభించి పనులు చేయిస్తున్నాం. మంచినీళ్లపేట దగ్గర ఫిష్‌ల్యాండింగ్ సెంటర్ పనులు చేస్తున్నాం. -ఇవాళ మా పాలనతో కింది స్థాయిలో అవినీతి లేకుండా చేశాం. కానీ మీరు అవినీతిని ప్రోత్సహించారు. మీరు కూడా అవినీతిని నియంత్రించలేం అని ఒప్పుకున్నారు. ఇవాళ గౌరవంగా చెప్పుకునే స్థితికి వ్యవస్థలను తీసుకువచ్చాం. పాలనలో సంస్కరణలు తీసుకు వచ్చాం. పరిపాలన వికేంద్రీకరణను తీసుకుని వచ్చాం. ఇవన్నీ సత్ఫలితాలను ఇస్తున్నాయి. వ్యవసాయంపై మీకు సదభిప్రాయమే లేదు. - బలహీనవర్గాలను అడ్డుపెట్టుకొని చంద్రబాబు అధికారంలోకి వచ్చాడే తప్ప.. బలహీనవర్గాలకు చంద్రబాబు చేసిందేమీ లేదు. - మంత్రివర్గంలో ఏనాడైనా బ్యాక్వర్డ్ క్లాసులకు ప్రాధాన్యం ఇచ్చారా..? పరిపాలనలో ప్రాధాన్యత ఇచ్చిన సందర్భాలు ఉన్నాయా..? ఎలా బలహీనవర్గాలను ఆదుకున్నానని చెప్పలగవు చంద్రబాబూ..? - రూ.150 కోట్లతో నాగావళి నది వద్ద బ్యూటిఫికేషన్ చేశానని చంద్రబాబు చెబుతున్నాడు.. అది ఎక్కడుందో ఎవరైనా చూపించగలరా..? దయచేసి చంద్రబాబు విధ్వంసం అనే మాటను ఉపసంహరించుకొని, శ్రీకాకుళం ప్రాంతానికి ఏదీ చేయలేదని ఒప్పుకొని సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. బాబూ.. విమర్శల్ని వెనక్కితీసుకో.. వీటన్నింటిని ఇంత పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తుంటే.. ఈ చంద్రబాబు మాత్రం నోరుతెరిస్తే అబద్ధాల పుట్టగా కనిపిస్తున్నారు. ఉత్తరాంధ్రపై ఇంత ప్రేమ కురిపిస్తోన్న మా నాయకుడు జగన్మోహన్రెడ్డి గారిని పట్టుకుని ఇష్టానుసారంగా నోరుపారేసుకోవడం మానుకుని.. ప్రాజెక్టుల్ని ఈ ప్రభుత్వం నాశనం చేస్తుందనే నీ అసత్యపు విమర్శల్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. ఇదేవిధంగా ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై నోరుపారేసుకుంటానంటే మాత్రం ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను కొనితెచ్చుకుంటావని బాబును హెచ్చరిస్తున్నాను. -
మూడు రోజులు విస్తారంగా వానలు
సాక్షి, విశాఖపట్నం: వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో సోమవారం ఒడిశా–ఉత్తరాంధ్రకు ఆనుకుని వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో రానున్న 3 రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ శనివారం తెలిపింది. అదే సమయంలో గంటకు 30–40 కి.మీల వేగంతో బలమైన గాలులు కూడా వీస్తాయని తెలిపింది. అల్పపీడనం 2 రోజుల్లో వాయుగుండంగా బలపడ నుందని ఐఎండీ తెలిపింది. అనంతరం పశ్చిమ వాయవ్య దిశగా దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర మీదుగా అది పయనిస్తుందని అంచనా వేసింది. -
ఇవి పవన్ రగిల్చిన ఆగ్రహ జ్వాలలు
సాక్షి నెట్వర్క్: వలంటీర్లపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను నిరసిస్తూ సచివాలయ సేవా సైన్యం రాష్ట్ర వ్యాప్తంగా భగ్గుమంటోంది. పవన్ తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ రెండో రోజైన మంగళవారం కూడా వలంటీర్లు నిరసనలు చేపట్టారు. పవన్ దిష్టి బొమ్మలతో శవయాత్రలు, ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించారు. పవన్‌పై క్రిమినల్ చర్యలు తీసుకో వాలంటూ పోలీసులకు ఫిర్యాదులు చేశారు. గోదావరి జిల్లాల్లో తీవ్ర నిరసన పవన్ వ్యాఖ్యలపై ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా ల్లో మంగళవారం నిరసనలు కొనసాగాయి. ఏలూరు ఫైర్‌స్టేషన్, 12 పంపుల సెంటర్లలో పవన్ దిష్టిబొ మ్మను దహనం చేశారు. టి.నరసాపురం, కొయ్యల గూడెం, ధర్మాజీగూడెం, జంగారెడ్డిగూడెం, ఉంగు టూరు, భీమడోలులో నిరసనలు చేపట్టారు. కైకలూరు, మండవల్లి, నర్సాపురం, ఉండి, కాళ్ల, ఆకివీడు, పాల కోడేరు మండలాల్లో నిరసన చేపట్టారు. తణుకులో పవన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కాకినాడ జిల్లా శంఖవరం, కత్తిపూడి, జి. కొత్తపల్లిలో పవన్ దిష్టి బొమ్మలను దహనం చేశారు. రౌతులపూడిలో వలంటీర్లు ర్యాలీ చేశారు. కొత్తపల్లి మండలం ఉప్పాడ బీచ్ రోడ్డు సెంటర్లో దిష్టి బొమ్మను దహనం చేశారు. సామర్లకోట, పెద్దాపురంలో మానవహారం నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ, రాజానగరంలో ర్యాలీ చేశారు. వేమగిరి, నల్లజర్ల మండలం తూర్పు చోడవరం, దేవరపల్లిలో దిష్టిబొమ్మను దగ్ధపరిచారు. కోనసీమ జిల్లా అమలాపురం, అల్లవరం, తాళ్లరేవు, కాట్రేనికోన, ఐ.పోలవరం, మండపేట, రాయవరం, రాజోలు, మామిడికు దు రు, ఆలమూరు, కొత్తపేట, పి.గన్నవరం, అంబాజీ పేట, అయినవిల్లి మండలాల్లో నిరసనలు చేశారు. ఉత్తరాంధ్రలో నిరసన సెగలు ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా నిరసనలు వెల్లు వె త్తాయి. సీతమ్మధారలోని నక్కవానిపాలెం వద్ద వలంటీర్లు నిరసన ప్రదర్శన చేశారు. తగరపువలసలో పవన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. మధురవాడ వాంబే కాలనీలో పవన్ ఫొటోలను తగులబెట్టారు. ఆరిలోవ, ఎంవీపీ, త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో పవన్‌పై కేసులు నమోదు చేశారు. చినవాల్తేరు 20 వార్డు, అగనంపూడి, 69వ వార్డులో మానవహారం ఏర్పాటు చేశారు. అక్కయ్యపాలెం ఎన్జీవో కాలనీ, కంచరపాలెం నేతాజీ జంక్షన్లో నిరసన తెలిపారు. అనకాపల్లి జిల్లా మాడుగులలో ర్యాలీ నిర్వహించారు. చోడవరం కొత్తూరు జంక్షన్, రావికమతం మండలం కొత్తకోటలో ఆందోళన చేశారు. మునగపాక మండల వలంటీర్లు ర్యాలీగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అల్లూరి జిల్లా పాడేరు, అరకు, చింతపల్లి, రంపచోడవరం, రాజవొమ్మంగి వలంటీర్లు నిరసనలు చేశారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం, ఇ చ్ఛాపురం, ఆమదాలవలసలో పవన్ పై పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. విజయనగరం జిల్లా లోని నెల్లిమర్ల, గజపతి నగరం, రాజాం, ఎస్.కోట, బొబ్బిలి, కురుపాం, పార్వతీపురం, సాలూరు, పాల కొండ, వీరఘట్టం, భామిని మండల కేంద్రాల్లో నిరసన చేపట్టారు. పవన్‌ను అరెస్ట్ చేయాలంటూ సంతకవిటి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ప్రధాన రహదారిపై ర్యాలీ చేస్తున్న వలంటీర్లు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో చెప్పు దెబ్బలు కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని వలంటీర్లు కోనేరు సెంటర్లో పవన్ దిష్టి బొమ్మతో శవయాత్ర చేశారు. పవన్ దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టి దహనం చేశారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోనూ ఆందోళనలు జరిగాయి. బాపట్ల జిల్లాలో పలుచోట్ల పవన్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. పిట్టలవానిపాలెం, కర్లపాలెం, వేమూరు, నిజాంపట్నం, బాపట్లలో ఆందోళనలు చేశారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో.. నెల్లూరు జిల్లా ఉదయగిరి, మనుబోలు మండలంలోని జట్లకొండూరు, చేజర్ల మండలం మాముడూరు, అనంసాగరం, మాముడూరు, అనంతసాగరం మండలం బొమ్మవరంలో పవన్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ప్రకాశం జిల్లా దర్శి, యర్రగొండపాలెం, కనిగిరి, త్రిపురాంతకం, పెద్దారవీడు, పుల్లల చెరువు, బేస్తవారిపేట, తర్లుపాడు, కంభం, తాళ్లూరు, ముండ్లమూరు, వెలిగండ్ల, పీసీపల్లి, పామూరుల్లో నిరసన ప్రదర్శనలు చేశారు. రాయలసీమలోనూ నిరసనల వెల్లువ ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా వలంటీర్లు నిరసనలు తెలిపారు. తాడిపత్రి, పెద్దవడుగూరు, బుక్కరాయసముద్రం, శింగనమల, గుంతకల్లు, రాప్తాడు, హిందూపురం, లేపాక్షి, మడకశిర, గోరంట్ల, పరిగి, చిలమత్తూరు, పెనుకొండ, కంబ దూరు, బొమ్మన హాళ్, కణేకల్లు, విడపనకల్లు, ధర్మవరం, ముదిగుబ్బ, బత్తలపల్లి, కదిరి, తనక ల్లు, ఓడీచెరువు, నల్లమాడ, అమడగూరు తదితర ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించి పవన్ దిష్టిబొమ్మ లను దహనం చేశారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వలంటీర్ల నిరసనలు కొనసాగాయి. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో మానవహారంతో నిరసన తెలుపుతున్న వలంటీర్లు పలుచోట్ల పోలీస్ స్టేషన్లో పవన్‌పై ఫిర్యాదు చేశారు. ఉమ్మడి కర్నూలు జిల్లా పరిధిలోని వలంటీర్లు పవన్‌పై పోలీసులకు ఫిర్యాదులు చేశారు. కర్నూలులోని కల్లూరు చెన్నమ్మ సర్కిల్లో పవన్ దిష్టిబొమ్మకు చెప్పుల దండ వేసి తగులబెట్టారు. తుగ్గలి, ఆత్మకూరు, పాణ్యం, పోలూరులో పవన్ దిష్టి బొమ్మలు దగ్ధం చేశారు. పెద్దకడుబూరు, కౌతాళం, పత్తికొండ, రామాపురంల్లో నిరసనలు వెల్లువెత్తాయి. వైఎస్సార్ జిల్లా పులివెందుల, కమలాపురం, బద్వేలు, బ్రహ్మంగారి మఠం, ఎర్రగుంట్ల, చాపాడు తదితర ప్రాంతాల్లో వలంటీర్లు నిరసన తెలిపారు. -
నిలువునా ముంచిన ముఠా టార్గెట్ ఇక్కడ యువతే..!
-
అభివృద్ధికి చిరునామా
నాలుగేళ్లుగా మీకు ఇంతగా మంచి చేస్తున్న ప్రభుత్వం ఒకవైపు.. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకుంటూ ఏ మంచీ చేయని పెద్దమనిషి మరో వైపు.. పేదవారి ప్రభుత్వం ఒకవైపు.. పెత్తందారులకు మద్దతు తెలిపే పార్టీ, దానికి మద్దతు ఇచ్చే వారు మరో వైపు.. పేద వారికి ఇంగ్లిష్ చదువులు చెప్పించాలని తపనపడే మనం ఒకవైపు.. పేద పిల్లలకు ఇంగ్లిష్ చదువులు అక్కర్లేదని చెప్పే పెత్తందారులు మరోవైపు.. పేద వారికి, నా అక్క చెల్లెమ్మలకు మంచి జరగాలని వివక్ష, లంచాలు లేకుండా నేరుగా బటన్ నొక్కే మీ జగన్ ఒకవైపు.. వీరికి మంచి జరగకూడదని, ఇంటి పట్టాలు ఇవ్వకూడదని ఏకంగా సామాజిక సమతుల్యం దెబ్బ తింటుందని కోర్టుకు వెళ్లి అడ్డుకునే వారందరూ మరో వైపు.. నేను నమ్ముకున్నది ధర్మాన్ని, సత్యాన్ని. దేవుడి దయ, మీ చల్లని ఆశీస్సులనే. అదే చంద్రబాబు నమ్ముకున్నది ఆ ఎల్లో పత్రికలను, ఎల్లో టీవీలను. వారి పునాది అబద్ధం, మోసం. – సీఎం వైఎస్ జగన్ భోగాపురం నుంచి సాక్షి ప్రతినిధి: ‘ఉత్తరాంధ్ర ప్రాంతం అభ్యుదయానికే కాదు.. అభివృద్ధికీ చిరునామా. శ్రీకాకుళం జిల్లాలో కొద్దిరోజుల క్రితం శంకుస్థాపన చేసిన మూలపేట పోర్టు ఉత్తరాంధ్రకు మణిహారమైతే.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కిరీటం’ అని సీఎం వైఎస్ జగన్ అన్నారు. భోగాపురం విమానాశ్రయం నుంచి రానున్న 30 నెలల కాలంలో విమానాల రాకపోకలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. కేవలం ఉత్తరాంధ్రకే కాకుండా రాష్ట్ర వైభవానికీ కేంద్ర బిందువుగా మారనుందని అభిప్రాయపడ్డారు. బుధవారం ఆయన రూ.5 వేల కోట్లతో నిర్మించనున్న భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌కు శంకుస్థాపన చేశారు. అంతకు ముందు జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ గ్రంథి మల్లికార్జునరావుతో కలిసి విమానాశ్రయ నమూనాను పరిశీలించారు. అనంతరం విజయనగరం జిల్లాలో 49 గ్రామాలకు తాగు నీరు, 30 వేల ఎకరాలకు సాగు నీటితో పాటు భోగాపురం విమానాశ్రయానికి తాగునీటి అవసరాలు తీర్చేందుకు రూ.195 కోట్ల అంచనా వ్యయంతో తారకరామ తీర్థ సాగర్ ప్రాజెక్టు పనులకు భూమి పూజ చేశారు. రూ.26 కోట్లతో ఫిష్ హ్యాండ్లింగ్ సెంటర్‌కు.. విశాఖలో అదానీ డేటా సెంటర్‌కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మొదటి దశలో రూ.5 వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ విమానాశ్రయానికి విశాఖ నుంచి 6 లేన్ల రహదారికి నాలుగు నెలల్లో శంకుస్థాపన చేస్తామని హామీ ఇచ్చారు. అదానీ డేటా సెంటర్‌తో విశాఖ టైర్–1 సిటీగా అభివృద్ధి చెందనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బహుశా దేశంలోనే అతిపెద్ద.. 300 మెగావాట్ల డేటా సెంటర్ విశాఖలో ఏర్పాటు కానుండటం గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ఉపాధి కోసం ఇక ఇక్కడికే వలసలు ► మంచి మనసుతో చేస్తున్న మన కార్యక్రమాలను వరుణ దేవుడు ఆశీర్వదిస్తున్నారు. ఉత్తరాంధ్ర చరిత్రను మార్చాలనే సంకల్పంతో మనసా, వాచా, కర్మణా అడుగులు ముందుకు వేస్తున్నాం. సంస్కృతికి, సంప్రదాయానికి, కవిత్వానికి, ఉద్యమాలకు కూడా చిరునామా ఈ గడ్డ. కళింగాంధ్ర భావాల విప్లవానికి గజ్జెకట్టిన నేల కూడా ఇదే. అభ్యుదయానికి చిరునామాగా ఉన్న ఈ ప్రాంతం ఇక మీదట అభివృద్ధికి కూడా చిరునామాగా నిలవనుంది. ► ఇటీవల శ్రీకాకుళం జిల్లాలో శంకుస్థాపన చేసిన మూలపేట పోర్టు రాబోయే రోజుల్లో తలరాతలు మార్చే పోర్టు. మరో 24 నెలల్లో ఇక్కడికి షిప్‌లు రానున్నాయి. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు సమాన దూరంలో రాబోతున్న ఈ ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్రకు.. మొత్తంగా రాష్ట్ర వైభవానికి కేంద్ర బిందువుగా నిలవబోతోందని చెప్పడానికి సంతోషంగా ఉంది. విశాఖలో అదానీ డేటా సెంటర్ ద్వారా వచ్చే సబ్‌మెరైన్ కేబుల్స్‌తో మన రాష్ట్ర ఐటీ ముఖచిత్రం మారుతుంది. ► ఈ మూడు బృహత్తర కార్యక్రమాలతో రానున్న రోజుల్లో స్థానికంగా విస్తృత ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఈ ప్రాంతానికే వలస వచ్చే పరిస్థితులు రానున్నాయి. టూరిజం, మెడికల్ టూరిజం, ఐటీ, పారిశ్రామికంగా ఈ ప్రాంతం అభివృద్ధిలో దూసుకుపోతుంది. 2026లో ఎయిర్‌పోర్టును నేనే ప్రారంభిస్తా.. ► మరో మూడేళ్లలో భోగాపురం ఎయిర్‌పోర్టు పూర్తయితే 2026 నాటికి ఇక్కడి నుంచి విమానాలు ఎగిరే పరిస్థితి రానుంది. ఈ రోజు ఇక్కడ పునాది రాయి వేశాం. 2026లో మళ్లీ మీ బిడ్డ, మీ అన్న, మీ తమ్ముడు ఇక్కడకు వచ్చి.. ఇదే ప్రాంగణం నుంచి ప్రారంభోత్సవం కూడా చేస్తాడని నమ్మకంగా చెబుతున్నా. దేవుని ఆశీస్సులు, మీ అందరి చల్లని దీవెనలతో అది జరుగుతుంది. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా ఏమీ చేయలేరు. – భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి పునాది రాయి వేస్తున్నామంటే జీర్ణించుకోలేని వ్యక్తులందరూ ఎలా మాట్లాడుతున్నారో టీవీల్లో, పేపర్లలో చూశాం. ఆశ్చర్యం అనిపించింది. నిజంగానే వాళ్ల హయాంలోనే ఈ స్థాయి ఉండి ఉంటే.. అప్పుడే ఈ ప్రాజెక్టు ఎందుకు ముందుకు కదలలేదు? ► సుప్రీంకోర్టులో, హైకోర్టులో కేసుల దగ్గరి నుంచి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసుల వరకు అనేక కేసులను పరిష్కరించుకుంటూ వచ్చాం. కేంద్రం నుంచి అనేక అనుమతులు తీసుకొచ్చాం. టెండర్ ప్రక్రియ పూర్తి చేసి.. నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తున్నాం. ► ఎన్నికలకు 2 – 3 నెలల ముందు వాళ్లు ఇక్కడ టెంకాయ కొట్టి, వెళ్లిపోయారు. మళ్లీ నిస్సిగ్గుగా గతంలోనే మేం శంకుస్థాపన చేశామని చెబుతున్నారు. నిజంగా ఇంతకన్నా దారుణమైన పరిస్థితి ప్రపంచ చరిత్రలో ఎక్కడా ఉండదు. ట్రాఫిక్‌కు తగ్గట్లుగా డిజైన్ ► దాదాపుగా రూ.5 వేల కోట్లతో 2026 నాటికి ఏకంగా రెండు రన్‌వేలతో ఈ ప్రాజెక్టు టేకాఫ్ కానుంది. 7 ఏరో బ్రిడ్జిలతో, ప్యాసింజర్ టెర్మినల్, కార్గో టెర్మినల్, విమానాల మరమ్మతు యూనిట్, ఏవియేషన్ అకాడమీ, ఎనిమల్ క్వారంటైన్ తదితర సదుపాయాలతో పూర్తవుతుంది. ట్రాఫిక్ పెరిగే కొద్దీ ఏకంగా 4 కోట్ల జనాభాకు కూడా సరిపోయేలా డిజైన్ చేశారు. ► ఈ విమానాశ్రయంతో భారీ విమానం.. ఏ–380 కూడా (డబుల్ డెక్కర్ ఫ్లైట్.. ప్రపంచంలోనే అతి పెద్ద విమానం) సునాయాసంగా ల్యాండ్ అయ్యేలా 3.8 కిలోమీటర్ల పొడవైన రెండు రన్వేలు నిర్మాణం అవుతున్నాయి. ఎయిర్‌పోర్టు పక్కనే మరో 500 ఎకరాల్లో ఏరోసిటీని కూడా అభివృద్ధి చేయబోతున్నాం. ► ఇదే విమానాశ్రయానికి విశాఖ నుంచి 6 లేన్ల రహదారికి రూ.6,300 కోట్లతో మరో నాలుగు నెలల్లో శంకుస్థాపన చేయబోతున్నాం. దీనికి సంబంధించి ఇప్పుడే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో మాట్లాడాను. పోర్టు, ఎయిర్‌పోర్టులతో.. ఇక్కడే ఉత్తరాంధ్రలో రాబోయే రోజుల్లో లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు రాబోతున్నాయి. 24 నెలల్లో పూర్తి చేయాలని కోరాను ► ఈ రోజు ఎయిర్‌పోర్టు పనులు మొదలు పెట్టేందుకు జీఎంఆర్ గ్రూపు అధినేత గ్రంథి మల్లికార్జునరావు వచ్చారు. ఆయన ఈ ప్రాంతం వాసి. 36 నెలల్లో పూర్తి చేయాల్సిన ఈ ప్రాజెక్టును, అన్నా.. ఏమైనా ముందుకు జరపవచ్చా.. 24 నెలల్లో ఏమైనా చేయగలుగుతారా.. అని అడిగాను. ‘ఇక్కడే పుట్టా. ఇది నాకు కూడా చాలా ఆత్మీయతతో కూడిన ప్రాజెక్టు. శాయశక్తులా కృషి చేసి 30 నెలల్లో పూర్తి చేస్తా’ అని చెప్పారు. 24–30 నెలల్లో ఇక్కడ నుంచి విమానాలు తిరుగుతాయని నాకు గట్టి నమ్మకం ఉంది. ఈ ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేసిన ఫ్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాలకు ధన్యవాదాలు. ► ఆకాశమంత మనసుతో ఈ విమానాశ్రయ నిర్మాణానికి భూములిచ్చిన ప్రతీ రైతన్నకు గుండెల నిండా ప్రేమతో శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఇప్పటికే 4 గ్రామాలకు చెందిన వారిని పునరావాస గ్రామాలకు తరలించాం. ఇందుకోసం దాదాపుగా 50 ఎకరాల్లో సుమారు రూ.80 కోట్లతో 2 గేటెడ్ కమ్యూనిటీలు నిర్మించాం. చంద్రబాబు మీకు మొహం చూపించగలరా! ► మేనిఫెస్టో అంటే చంద్రబాబు హయాంలో మాదిరిగా 600 పేజీల బుక్కులు వేసి ఎన్నికలు అయిపోయాక చెత్తబుట్టలో వేసేది కాదు. మేనిఫెస్టోలో చెప్పిన హామీల్లో 98.5 శాతం నెరవేర్చాం. మేనిఫెస్టోను ఒక భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావించాము కాబట్టే అలా చేశాం. ఇదే మాదిరిగా చంద్రబాబు అడగగలడా? మీకు మొహం చూపించగలడా? (జనం రెండు చేతులు పైకెత్తి చూపలేరని చెప్పారు) ఇలా అడిగే అర్హత, నైతికత చంద్రబాబుకు ఉందా? ► 1995లో అధికారం కోసం కూతురిని ఇచ్చిన సొంత మామకు వెన్నుపోటు పొడిచి.. అధికారంలో ఉన్నన్నాళ్లూ చేసిన మంచి పనులంటూ ఏవీ లేవు. 2019లో సీఎం అయిన మీ బిడ్డ జగన్ వల్ల మీకు, మీ కుటుంబానికి జరిగిన మంచి ఏమిటని ఏ ఇంటి తలుపుతట్టినా ఇలా.. మంచి చేశాడని చెప్పే పరిస్థితి ఉంది. ► ఏ మంచి చేయని చంద్రబాబుకు ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ 5.. వీరికి తోడుగా ఒక దత్తపుత్రుడు ఉన్నారు. గతంలో ఇదే చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీలతో మొదలుపెట్టి ఒక ఈనాడుకు ఇంత.. ఆంధ్రజ్యోతికి ఇంత... దత్తపుత్రుడికి ఇంత అని.. దాచుకో, పంచుకో, తినుకో (డీపీటీ) అని ఈ గజదొంగల ముఠా రాష్ట్ర ప్రజలను, రాష్ట్రాన్ని దోచేసింది. అందుకే ఏ మంచీ చేయని చంద్రబాబుకు ఇంతగా తోడుగా ఉన్నారు. మారుతున్న గ్రామాల రూపురేఖలు ► ఈ రోజు గ్రామాలు మారాయి. ఏ గ్రామంలో చూసినా సచివాలయంతో పాటు 50 మందికో వలంటీర్ కనిపిస్తున్నారు. సచివాలయ వ్యవస్థలో మన పిల్లలే చక్కగా చిరునవ్వుతో లంచాలు తీసుకోకుండా మంచి పనులు చేస్తున్నారు. మరో నాలుగడుగులు వేస్తే నాడు–నేడుతో రూపురేఖలు మారిన ఇంగ్లిష్ మీడియం స్కూల్ కనిపిస్తుంది. కొంచెం ముందుకు వెళ్తే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌తో ఇంటికే డాక్టర్‌ను తీసుకొచ్చిన విలేజీ క్లినిక్.. రైతన్నలను చేయి పట్టుకుని నడిపించే ఆర్బీకే కనిపిస్తుంది. అన్లిమిటెడ్ ఇంటర్నెట్ సౌకర్యంతో ఇంటి వద్ద నుంచే పనిచేసే డిజిటల్ లైబ్రరీల వ్యవస్థ ఏర్పాటు కానుంది. ► ఈ మార్పు మన కళ్లెదుటే కనిపిస్తోంది. అప్పుడూ, ఇప్పుడూ ఇదే బడ్జెట్.. ఇదే రాష్ట్రం. అప్పులు కూడా చంద్రబాబు చేసిన దానికంటే తక్కువ. అయినా ఇవన్నీ చేస్తున్నాం. మీ బిడ్డ ఎలా చేయగలుగుతున్నాడు? ఎందుకు చంద్రబాబు చేయలేకపోయాడని ఆలోచించండి. ఈ విషయాన్ని గ్రామ స్థాయిలో ప్రతీ ఇంటికీ తీసుకెళ్లండి. మీ బిడ్డకు దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలు ఉండాలని మరోసారి కోరుకుంటున్నా. ► ఈ కార్యక్రమంలో జీఎంఆర్ చైర్మన్ గ్రంథి మల్లికార్జునరావు, అదానీ గ్రూప్ ఎండీ, సీఈవోలు రాజేష్ అదానీ, కరణ్ అదానీ, స్పీకర్ తమ్మినేని సీతారాం, డిప్యూటీ సీఎంలు బూడి ముత్యాలనాయుడు, రాజన్నదొర, మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, గుడివాడ అమర్నాథ్, సీదిరి అప్పలరాజు, కలెక్టర్లు మల్లికార్జున, నాగలక్ష్మీ, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, మేయర్ హరివెంకటకుమారి తదితరులు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై దృష్టి ► ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం మనందరి ప్రభుత్వం వేస్తున్న అడుగులను మీకందరికీ గుర్తు చేస్తున్నా. ఉత్తరాంధ్ర అంటే బ్రిటీషర్లను గడగడలాడించిన మన్యం వీరుడు అల్లూరి జన్మించిన పౌరుషాల గడ్డ. అందుకే కొత్త జిల్లాకు అల్లూరి సీతారామరాజు జిల్లాగా నామకరణం చేశాం. మూడు జిల్లాలుగా ఉన్న ఉత్తరాంధ్రను మరింత మెరుగు పరుస్తూ.. ముగ్గురు ఎస్పీలు, ముగ్గురు కలెక్టర్లు సరిపోరని.. 6 జిల్లాలుగా చేశాం. ► కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే తపన, తాపత్రయంతో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ పనులను మొదలుపెట్టి పూర్తి చేశాం. ఈ జూన్‌లో దానిని జాతికి అంకితం చేయబోతున్నాం. ఇచ్చాపురం, పలాస ప్రాంతాలకు తాగునీటిని పైపుల ద్వారా తరలించేందుకు రూ.700 కోట్లతో తాగునీటి ప్రాజెక్టును ప్రారంభించి ఈ జూన్‌లో పూర్తి చేస్తున్నాం. పాతపట్నం నియోజకవర్గానికి మంచి చేస్తూ.. అదే రోజు అక్కడే మరో రూ. 265 కోట్లతో ఇదే తాగునీటి ప్రాజెక్టును విస్తరించే పనులకు కూడా శంకుస్థాపన చేయనున్నాం. ► కురుపాంలో గిరిజన ఇంజనీరింగ్ కాలేజీ పనులు, పాడేరు ట్రైబల్ మెడికల్ కాలేజీ పనులు.. పాతపట్నం, నర్సీపట్నం, విజయనగరంలో మెడికల్ కాలేజీ పనులు వేగంగా జరుగుతున్నాయి. విజయనగరం మెడికల్ కాలేజీని ఈ ఆగస్టు–సెప్టెంబర్‌లో నేనే వచ్చి ప్రారంభిస్తాను. ఈ నాలుగేళ్లలో ఎప్పుడూ జరగని విధంగా ఈ ఉత్తరాంధ్రలో 4 మెడికల్ కాలేజీలను కడుతున్నామని చెప్పేందుకు గర్వపడుతున్నా. సాలూరులో గిరిజన యూనివర్సిటీకి ఈ జూన్–జూలైలో శంకుస్థాపన చేయబోతున్నాం. దానికి సంబంధించి భూసేకరణ పూర్తి చేశాం. ► విజయనగరంలో జేఎన్టీయూ గురజాడ యూనివర్సిటీ ఇప్పటికే నెలకొల్పాం. దశాబ్దాల కల నెరవేరుస్తూ మూలపేట పోర్టుకు శంకుస్థాపన చేశాం. మరో 24 నెలల్లో ఉత్తరాంధ్ర ప్రజలకు అంకితం చేయబోతున్నాం. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి విశాఖనగరం నుంచి అనుసంధానంగా 6 లేన్ల రహదారికి మరో నాలుగు నెలల్లో శంకుస్థాపన చేయబోతున్నాం. ► వీటన్నింటికి మించి పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకే కాకుండా రాజధాని స్థాయికి కూడా తీసుకెళ్లే విధంగా అడుగులు వేస్తున్నాం. రాష్ట్రంలో అతిపెద్దది, రాష్ట్రంలో అందరికీ ఆమోదయోగ్యమైన నగరం విశాఖలో మీ బిడ్డ కాపురం ఉండబోతున్నారని చెప్పేందుకు సంతోష పడుతున్నా. నిజాయితీగా ప్రతి తలుపూ తడుతున్నాం పేదలకు మంచి జరగాలని.. పేదలు, మధ్యతరగతికి అండగా నిలవాలని అడుగులు వేస్తున్నాం. మీ బిడ్డ పాలనలో కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, పార్టీ లేదు. మన పార్టీకి ఓటు వేశారా లేదా అన్నది కూడా చూడటం లేదు. కాబట్టే 47 నెలల కాలంలో దేశ చరిత్రలో ఎక్కడా జరగని విధంగా రూ.2.10 లక్షల కోట్లు.. నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కి అక్కచెల్లెమ్మల అకౌంట్లలోకి వేశారు. ఎక్కడా లంచాలు, వివక్ష లేదు. గతానికి, ఇప్పటికి.. చంద్రబాబుకు, మీ జగన్‌కు మధ్య తేడా మీరే చూడండి. మనందరి ప్రభుత్వంలో మీకు ఇవి అందాయా అంటూ.. రాష్ట్రంలో కోటి 50 లక్షల కుటుంబాలను ప్రేమగా, ఆప్యాయంగా అడుగుతున్నాం. చంద్రబాబు అన్ని ఏళ్ల పాలనలో కన్నా.. మన ప్రభుత్వంలో పథకాలు అందితేనే, మీకు మంచి జరిగిందని భావిస్తేనే నన్ను ఆశీర్వదించండని రైతన్నలు, బడులకు పోయే పిల్లలు, నా అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు.. అన్నదమ్ములను నిజాయితీగా, చిత్తశుద్ధితో అడుగుతున్నాం. -
వలసల ఉత్తరాంధ్ర జాబ్‌హబ్‌గా మారబోతోంది: సీఎం జగన్
సాక్షి, విజయనగరం: అన్ని ప్రాంతాలు బాగాపడాలన్నదే ఈ ప్రభుత్వ లక్ష్యం, అందుకే వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు శంకుస్థాపన చేసిన అనంతరం.. సవరవల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఒకప్పుడు ఉత్తరాంధ్ర అంటే వలసలు గుర్తొచ్చేవి. కానీ, రాబోయే రోజుల్లో జాబ్ హబ్‌గా మారుతుందని సీఎం జగన్ పేర్కొన్నారు. మూలపేటలో ఈ మధ్యే పోర్టుకు శంకుస్థాపన చేశాం. ఇప్పుడు భోగాపురం ఎయిర్‌పోర్టు ఉత్తరాంధ్రకు కేంద్ర బిందువుగా మారనుందని సీఎం జగన్ ఆకాంక్షించారు. ఇవాళే అదానీ డేటా సెంటర్‌కు శంకుస్థాపన చేయబోతున్నాం. డేటా సెంటర్‌తో ఏపీ ముఖచిత్రమే మారబోతోందని సీఎం జగన్ పేర్కొన్నారు. ఓర్వలేకనే.. ఇవాళ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన చేయడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎన్నికలకు నాలుగైదు నెలల ముందు హడావిడిగా కొబ్బరి కాయలు కొట్టారు. పైగా మేమే శంకుస్థాపనలు చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారు. సుప్రీం కోర్టు, ఎన్జీటీలలో కేసులు వేసి అడ్డుపడ్డారు. అన్ని ఆటంకాలు దాటుకుని ఇవాళ ఎయిర్‌పోర్ట్‌కి శంకుస్థాపం చేసుకున్నాం. రైతన్నల వల్లే ఈ ప్రాజెక్టు వచ్చింది. మెడికల్ టూరిజం, ఐటీ, ఇండస్ట్రీస్‌కు కేంద్ర బిందువుగా భోగాపురం ఎయిర్పోర్ట్ మారబోతోంది అని సీఎం జగన్ పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధే లక్ష్యంగా.. 2026లో మీ బిడ్డనే(సీఎం జగన్ తనను ఉద్దేశించుకుంటూ..) వచ్చి ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభిస్తాడని,ప్రజల ఆశీస్సులు ఉన్నంతకాలం ఎవరు ఎన్నికుట్రలు చేసినా ఫలించవని ధీమా వ్యక్తం చేశారాయన. 24 నుంచి 30 నెలల్లోనే ఎయిర్పోర్ట్ పూర్తి చేస్తామని జీఎంఆర్ హామీ ఇచ్చింది. ఏ380 డబుల్ డెక్కర్ ల్యాండ్‌అయ్యేలా.. ఏర్పాట్లు చేస్తాం. మొదటి ఫేజ్‌లో 60 లక్షల జనాభాకు సదుపాయలు సమకూరుస్తాం. చివరి దశకు వచ్చే సరికి నాలుగు కోట్ల ప్రజలకు సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని సీఎం జగన్ తెలిపారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) అందుకే అల్లూరి జిల్లా.. ఉత్తరాంధ్ర పేరు చెప్పగానే.. మన్నెం వీరుడు అల్లూరి గుర్తుకొస్తారు. ఉత్తరాంధ్ర అంటే ఉత్తరాంధ్ర అంటే మన్యం వీరుడి పౌరుషం. బ్రిటీషర్లను గడగడలాడించిన అల్లూరి జన్మించిన గడ్డ ఇది. అందుకే కొత్త జిల్లాకు అల్లూరి పేరు పెట్టుకున్నాం. అభివృద్ధికి సులువుగా ఉండాలనే ఉన్న మూడు జిల్లాలను.. ఆరు జిల్లాలను చేశాం. ఉద్దానంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేశాం. జూన్‌లోనే కిడ్నీ రీసెర్చ్ సెంటర్లను జాతికి అంకితం చేస్తాం. ఇచ్చాపురం, పలాసలకు రక్షిత తాగు నీరు అందిస్తాం. సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాం అని సీఎం జగన్ తెలిపారు. ఈ సెప్టెంబర్ నుంచే విశాఖ నుంచి పాలన నడుస్తుందని మరోసారి భోగాపురం బహిరంగ సభ వేదికగా సీఎం జగన్ స్పష్టం చేశారు. ఇదీ చదవండి: డబుల్ డోస్‌తో ఉత్తరాంధ్ర ముఖచిత్రం మారిపోవాలా! -
ఉత్తరాంధ్రలో సీఎం జగన్ పర్యటన
-
ఉత్తరాంధ్రకు వెలుగు రేఖ.. శ్రీకాకుళం జిల్లాలో పోర్టు నిర్మాణంతో మారనున్న ముఖచిత్రం
సాక్షి, అమరావతి/సంతబొమ్మాళి/ఎచ్చెర్ల క్యాంపస్: శ్రీకాకుళం జిల్లా భావనపాడు వద్ద పోర్టు నిర్మాణంతో ఉత్తరాంధ్ర రూపు రేఖలు త్వరలో మారిపోనున్నాయి. సుదీర్ఘ కాలంగా ఉన్న ఈ ప్రాంత వాసుల కల త్వరలో సాకారం కానుంది. రాష్ట్రంలో సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్నప్పటికీ, అత్యంత కీలకమైన చోట ఈ పోర్టు ఉంది. కేవలం మన రాష్ట్రం నుంచే కాకుండా ఛత్తీస్‌గఢ్æ, జార్ఖండ్, మధ్యప్రదేశ్‌తో పాటు దక్షిణ ఒడిశా రాష్ట్రాల నుంచి ఎగుమతులు, దిగుమతులకు ఈ పోర్టు అత్యంత కీలకం కానుంది. సుమారు రూ.16,000 కోట్ల వ్యయంతో రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న రామాయపట్నం, మచిలీపట్నం, కాకినాడ గేట్‌వే, భావనపాడు పోర్టుల్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందే అవకాశాలు భావనపాడుకే ఉన్నాయని మారిటైమ్ వర్గాలు పేర్కొంటున్నాయి. పలు కీలక పరిశ్రమలకు అవసరమైన ముడి సరుకులు.. థర్మల్ కోల్, కుకింగ్ కోల్, ఎరువులు, ముడి జీడి గింజలు, సున్నపురాయి, వంటనూనెల దిగుమతికి ఈ పోర్టు కేంద్రం కానుంది. ఇక్కడ నుంచి మినరల్ శాండ్, ముడి ఇనుము, జీడిపప్పు, సోయా మీల్, గ్రానైట్.. ఫెర్రో ఉత్పత్తులు, జూట్, ఐరన్ అండ్ స్టీల్ ఉత్పత్తుల ఎగుమతికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇంతటి కీలకమైన భావనపాడు పోర్టు పనులకు ఏప్రిల్ 19న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భూమి పూజ చేయడం ద్వారా ప్రారంభించనున్నారు. తొలి దశలో నాలుగు బెర్తులు తొలి దశలో భావనపాడు పోర్టును నిరి్మంచడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.4,361.91 కోట్ల పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ల్యాండ్ లార్డ్ మోడల్ విధానంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఈ పోర్టు నిర్మాణ పనులను రూ.2,949.70 కోట్లతో కాంట్రాక్టు సంస్థకు అప్పగించారు. నాలుగు బెర్తుల నిర్మాణం, ఇతర మౌలిక వసతుల కల్పనతో తొలి దశ ఉంటుంది. మొత్తం పోర్టు వార్షిక సామర్థ్యం 83.3 మిలియన్ టన్నులు కాగా, తొలి దశలో నాలుగు బెర్తులతో 23.5 మిలియన్ టన్నుల సామర్థ్యంతో పోర్టును అభివృద్ధి చేయనున్నారు. నాలుగు బెర్తుల్లో రెండు జనరల్ కార్గోకు, ఒకటి బొగ్గు, ఇంకొకటి కంటైనర్‌తోపాటు ఇతర ఎగుమతి, దిగుమతులకు వినియోగించనున్నారు. ఈ పోర్టు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం భావనపాడు పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరుతో ప్రత్యేకంగా కంపెనీ ఏర్పాటు చేసింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నిధులను పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రుణ రూపంలో సమకీరించుకుంటున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే సుమారు 25,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. దీంతోపాటు చుట్టుపక్కల ప్రాంతం పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతుంది. పోర్టు సిటీగా శ్రీకాకుళం భావనపాడుతో శ్రీకాకుళం జిల్లా పోర్టు సిటీగా మారుతుంది. ఇప్పటికే ఈ పోర్టు నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ పనులు పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పోర్టు ఆధారిత పారిశ్రామికాభివృద్ధిపై ముఖ్యంగా దృష్టి సారిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే రామాయపట్నం పోర్టు పనులు వేగంగా జరుగుతుండగా, త్వరలో మచిలీపట్నం పనులు కూడా ప్రారంభించనున్నారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి రామాయపట్నం పోర్టుకు తొలి నౌకను తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అదే స్ఫూర్తితో భావనపాడు పోర్టు పనులు కూడా లక్ష్యంలోగా పూర్తి చేస్తాం. – గుడివాడ అమరనాథ్, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి రూ.35 కోట్లతో ఆర్అండ్ఆర్ కాలనీ భావనపాడు పోర్టు నిర్వాసితులు 594 మంది కోసం రూ.35 కోట్లతో 55 ఎకరాల్లో నౌపడలో అధునాతన వసతులతో అర్అండ్ఆర్ కాలనీ నిరి్మంచనున్నామని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్ తెలిపారు. ఈ నెల 19న భావనపాడు పోర్టుకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో శుక్రవారం ఆయన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఇప్పటి వరకు మూలపేట, విష్ణుచక్రంలో రైతుల నుంచి 320 ఎకరాలు సేకరించామని తెలిపారు. రైతులకు 10 శాతం మాత్రమే పరిహారం చెల్లించాల్సి ఉందన్నారు. అప్రోచ్ రోడ్డు కోసం మరో 320 ఎకరాలు సేకరించామని తెలిపారు. దీంతో పాటు మొదటి ఫేజ్‌లో సీఆర్‌జెడ్ భూములు, ప్రభుత్వ భూములు, అటవీ శాఖ భూములు.. మొత్తం 1000 ఎకరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. రెండో ఫేజ్‌లో బృహత్తర పోర్టు డెవలప్మెంట్కు మరికొన్ని భూములు రైతుల నుంచి సేకరించాల్సి ఉంటుందన్నారు. ఆర్అండ్ ఆర్ కాలనీకి ఈ నెల 11న ప్రభుత్వం నుంచి ప్లాన్ అప్రూవల్ వచి్చందన్నారు. జిల్లా ప్రజల పోర్టు కల నెరవేరుతుండడం శుభ పరిణామమన్నారు. వలసల నివారణే ప్రభుత్వ ధ్యేయం మత్స్యకారుల వలసల నిర్మూలనే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర పశు సంవర్థక, మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. రూ.365 కోట్లతో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బుడగుట్లపాలెం తీరంలో నిరి్మంచనున్న ఫిషింగ్ హార్బర్ స్థలాన్ని స్థానిక ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌తో కలిసి శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ నెల 19న సీఎం వైఎస్ జగన్ జిల్లా పర్యటనలో ఈ ప్రాజెక్టును వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో అవసరమైన ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పాదయాత్రలో ఇచి్చన ప్రతి హామీని సీఎం నెరవేర్చారని చెప్పారు. రాష్ట్రంలో 974 కిలోమీటర్ల సముద్ర తీరం ఉన్నా, హార్బర్లు లేక మత్స్యకారులు వలస వెళ్లే పరిస్థితిని సీఎం పూర్తిగా మార్చేస్తున్నారన్నారు. విశాఖపట్నం, కాకినాడ వంటి ప్రాంతాలకు సమానంగా భవిష్యత్‌లో ఇక్కడ తీరం అభివృద్ధి చెందుతుందన్నారు. నెల్లూరులో హార్బర్ నిర్మాణం చివరి దశలో ఉందని, బాపట్ల, మచిలీపట్నం, రామాయపట్నం వంటి ప్రాంతాల్లో నిర్మాణాలు జరగుతున్నాయని తెలిపారు. అనకాపల్లి వద్ద మరో హార్బర్ నిర్మాణంతో పాటు మంచినీళ్లపేట వద్ద ఫిష్ ల్యాండింగ్ సెంటర్‌ను హార్బర్‌గా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. విశాఖపట్నం పరిపాలన రాజధాని అయితే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. మే 3న భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుకు సీఎం శంకుస్థాపన చేయనున్నట్లు వివరించారు. ఉత్తరాంధ్ర భవిష్యత్‌లో పూర్తి స్థాయి ప్రగతి సాధిస్తుందని అన్నారు. పవన్ కల్యాణ్ వంటి వారు అప్పుడప్పుడూ కనిపిస్తూ మత్స్యకారుల కోసం మాట్లాడుతుంటారని, అలాంటి పార్ట్‌టైమ్ నాయకులను నమ్మే పరిస్థితి లేదన్నారు. -
11 నుంచి 13 వరకు మద్యం దుకాణాల బంద్
దొండపర్తి (విశాఖ దక్షిణ): ఉత్తరాంధ్ర జిల్లా పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికలు ఈ నెల 13వ తేదీన జరగనున్న దృష్ట్యా జిల్లాలో మూడు రోజుల పాటు అన్ని రకాల మద్యం దుకాణాలు మూసివేయడం జరుగుతుందని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ శ్రీనివాస్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున ఆదేశాల మేరకు ఈ నెల 11వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు ప్రభుత్వ మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు(స్టార్ హోటళ్లలో సైతం), టూరిజం బార్స్, నేవల్ క్యాంటీన్స్, కల్లు దుకాణాలు, మద్యం డిపోలు కూడా మూసివేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే ఓట్ల లెక్కింపు జరిగే 16వ తేదీన కౌంటింగ్ కేంద్రం పరిసర ప్రాంతాల్లో కూడా మద్యం దుకాణాలు తెరవడం జరగదన్నారు. -
ఇది సెమీ ఫైనల్స్.. ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించాలి
సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్రపై సీఎం జగన్మోహన్రెడ్డి కనబరుస్తున్న ప్రేమకు చిహ్నంగా భారీ మెజార్టీతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలని టీటీడీ చైర్మన్, వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీతంరాజ్ సుధాకర్‌ను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఇది సెమీఫైనల్స్‌గా భావించాలని, ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలవడం ద్వారా వచ్చే ఏడాది ఎన్నికల్లో గెలుపునకు మరింత ఊపు వస్తుందన్నారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ విజయవంతం ద్వారా సీఎం జగన్ చరిష్మా మరోసారి బయటపడిందని తెలిపారు. బీసీలు మేలు చేసిన వారిని మర్చిపోరు: ఆర్ కృష్ణయ్యా రాష్ట్రంలో సంక్షేమ ఫలాలు చూసి ఇతర రాష్ట్రాలు ఆశ్చర్యపోతున్నాయని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్యా అన్నారు. ఇంతలా బీసీలకు ఏ రాష్ట్రంలో మేలు జరగడం లేదని వ్యాఖ్యానించారు. బీసీలు మేలు చేసిన వారిని మర్చిపోరన్న ఆయన.. సీఎం చేసిన మేలు మర్చిపోకుండా వైఎస్సార్సీపీ వెంట వుండాలన్నారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిని మెజార్టీతో గెలిపించాలని కోరారు. బీసీలకు అధిక శాతం సీట్లు ఇచ్చిన చరిత్రకారుడు సీఎం జగన్ అని కొనియాడారు. విశాఖలో సమ్మిట్ ద్వారా విశాఖ పై అంతర్జాతీయ దృష్టి పడిందని, పారిశ్రామిక పెట్టుబడుల ద్వారా ఉత్తరాంధ్రకు మేలు జరిగిందని ఆనందం వ్యక్తం చేశారు. -
విజయం మనదే.. భారీ మెజార్టీకి కృషి
బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): ఉత్తరాంద్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీదే గెలుపని ఆ పార్టీ నాయకులు చెప్పారు. భారీ మెజార్టీ కోసం కలిసి కృషిచేద్దామని పిలుపునిచ్చారు. విశాఖపట్నంలో ఆదివారం ఈ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన వైఎస్సార్సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్, టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి మాట్లాడుతూ పార్టీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ భారీ విజయం సాధించేందుకు అందరూ కలిసి పనిచేద్దామని చెప్పారు. 20 రోజుల పాటు ఆయా నియోజకవర్గ నాయకులు ఓటర్లను కలిసి అత్యధిక మెజార్టీ సాధించే దిశగా పనిచేయాలని కోరారు. బూత్‌స్థాయి సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ఇంకా ఓటు నమోదుకు అవకాశం ఉన్నందున అర్హులంతా ఓటర్లుగా చేరేలా దృష్టి సారించాలని కోరారు. రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ పట్టభద్రులు టీడీపీ, బీజేపీ నాయకుల మాయమాటలను నమ్మవద్దని కోరారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం పరిపాలన వికేంద్రీకరణ చేపట్టిన పార్టీ వైఎస్సార్సీపీ అని చెప్పారు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ తమ పార్టీ ఎక్కడా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించలేదని తెలిపారు. అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, డిప్యూటీ సీఎంలు బూడి ముత్యాలనాయుడు, రాజన్నదొర, మాజీ మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ధర్మాన కృష్ణదాసు, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మేయర్ గొలగాని హరివెంకటకుమారి, వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్‌బాబు, సమన్వయకర్తలు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. -
రెవెన్యూ శాఖ ప్రాంతీయ సదస్సులో ధర్మాన కీలక వ్యాఖ్యలు
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అధ్యక్షతన ఉత్తరాంధ్ర రీజనల్ రెవెన్యూ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ మొదలైంది. శనివారం ఉదయం రుషికొండలోని రాడిసన్ బ్లూ హోటల్లో ఈ సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సుకు ఉత్తరాంధ్ర పరిధిలోని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, జిల్లా రెవెన్యూ అధికారులు, ఆర్డీవోలు, తహసీల్దారులు, ఇతర అధికారులు హాజరయ్యారు. రెవెన్యూ వ్యవహారాలకు సంబంధించిన అంశాలపై సమగ్ర అవగాహన కల్పించేందుకు ఈ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. సీసీఎల్ఏ, రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి, సర్వే అండ్ సెటిల్మెంట్ డైరెక్టర్లు సైతం ఈ సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్బంగా ధర్మాన మాట్లాడుతూ.. ‘రెవెన్యూ శాఖలో సంస్కరణ అమలుపై సదస్సు నిర్వహించాము. వందేళ్ల తర్వాత రాష్ట్రంలో ఆధునిక సాంకేతికతతో సర్వే చేస్తున్నాము. అసైన్డ్ భూములు వ్యవసాయేతర పనులకు వినియోగంపై కమిటీ ఏర్పాటు చేస్తున్నాము. భూములను వినియోగంలోకి తేవడం ద్వారా జీడీపీ పెరుగుతుంది’ అని వ్యాఖ్యలు చేశారు. -
వైభవంగా పోలమాంబ అనుపోత్సవం
మక్కువ(పార్వతీపురం మన్యం): ఉత్తరాంధ్రుల ఇలవేల్పు, భక్తుల ఆరాధ్యదైవం శంబర పోలమాంబ అమ్మవారి అనుపోత్సవం బుధవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 9.45 గంటలకు గ్రామ ప్రధాన రహదారిలో ఉన్న అమ్మవారి గద్దె వద్దకు చేరిన ఘటాలకు భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ప్రధానాలయం సమీపంలో ఉన్న యాత్రాస్థలం వద్ద ట్రస్టు బోర్డుచైర్మన్ పూడి దాలినాయుడు, ట్రస్టుబోర్డు మాజీ చైర్మన్లు గంజి కాశినాయుడు, వసంతుల భాస్కరరావు, ఎంపీటీసీ సభ్యుడు తీళ్ల పోలినాయుడు, ఉపసర్పంచ్ అల్లు వెంకటరమణ, రెవిన్నాయుడు, పూడి, కరణం, కుప్పిలి, గిరిడ కుటంబాల సభ్యులు, గ్రామపెద్దలు, భక్తులు ఘటాలకు పూజలు చేశారు. అమ్మవారి ఉయ్యాలకంబాల ఉత్సవాన్ని నిర్వహించారు. అక్కడ నుంచి వనంగుడికి బయల్దేరిన అమ్మవారి ఘటాలకు దారి పొడవునా భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. చిన్నారులపైనుంచి ఘటాలను దాటించారు. యాత్రాస్థలం నుంచి సుమారు కిలోమీటరు దూరంలో ఉన్న వనంగుడికి కాలినడకన అమ్మవారి ఘటాలను తీసుకెళ్లగా వందలాది మంది భక్తులు తరలివెళ్లారు. తప్పెటగుళ్లు, మహిళల కోలాట ప్రదర్శన, పోతిరాజు వేషధారణలు భక్తులను అలరించాయి. వనంగుడి వద్దకు చేరుకున్న ఘటాలను ఆలయం చుట్టూ మూడుసార్లు ప్రదక్షణ చేశారు. వనంగుడిలో అమ్మవారి ఘటాలను ఉంచిన తర్వాత పూజారి రామారావు గుడి చుట్టూ మూడుసార్లు తిరిగి కట్లువేశారు. ఈ నెల 31వ తేదీన పోలమాంబ అమ్మవారి మారుజాతర నిర్వహించనున్నారు. అమ్మవారి సేవలో భక్తజనం ప్రధానాలయంలో ఉన్న పోలమాంబ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఉదయం నుంచి బారులు తీరారు. గోముఖి నదిలో పుణ్యస్నానాలాచరించి అమ్మవారికి చీరలు, గాజులు, కోళ్లను చూపించి మొక్కుబడులు చెల్లించారు. ఈఓ వి.రా ధాకృష్ణ భక్తులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకున్నారు. ఎంపీడీఓ పి.దేవకుమార్ పర్యవేక్షణలో గ్రామంలో పారిశుద్ధ్య పనులు చురుగ్గా సాగుతున్నాయి. గ్రామంలో ఏర్పాటుచేసిన వైద్యశిబిరాలను అనుపోత్సవం రోజున కూడా కొనసాగించారు. -
‘సాక్షి’ ఎఫెక్ట్: స్టాఫ్ నర్సుల ఎంపిక నిలుపుదల
మహారాణిపేట(విశాఖ దక్షిణ): స్టాఫ్ నర్సుల పోస్టు ల భర్తీని తాత్కాలికంగా నిలుపుదల చేశారు. ఎంపిక జాబితాలో తమకు అన్యాయం జరిగిందని నిరుద్యోగ నర్సులు, వెయిటేజీ మార్కులు కలపలేదని తాత్కాలిక ఉద్యోగులు బుధవారం కూడా తన నిరసన గళం వినిపించారు. దాదాపు 30 నుంచి 40 మందికి వెయిటేజ్ మార్కులు కలపలేదని విషయం బయటకు రావడంతో.. ఈ జాబితాను పునఃపరిశీలన కోసం అధికారులు భర్తీ ప్రక్రియను తాత్కాలికంగా నిలుపుదల చేశారు. స్టాఫ్ నర్సుల ఎంపికలో గందరగోళంపై బుధవారం ‘సాక్షి’లో కథనం రావడంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. తప్పుల తడకలతో కూడిన 172 మంది అభ్యర్థుల జాబితాను మళ్లీ పరిశీలన చేస్తున్నారు. కొంత మందికి అనవసరంగా ఎలా మార్కులు కలిశాయన్న దానిపై యంత్రాంగం దృష్టి పెట్టింది. అమరావతి నుంచి వైద్య ఆరోగ్యశాఖ అధికారులు విశాఖ చేరుకుని జాబితాను పరిశీలిస్తున్నారు. సిబ్బంది తీరుపై మండిపాటు.. స్టాఫ్ నర్సుల పోస్టుల కోసం ఇప్పటివరకు నాలుగు సార్లు వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది జాబితాను తయారు చేశారు. జీఓ ప్రకారం జాబితా తయారు చేస్తున్నామని చెబుతున్నప్పటికీ.. ఎంపికలో సిబ్బంది అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అర్హులను తప్పించడం, అనర్హులను అందలం ఎక్కించడం కోసం సిబ్బంది చేతివాటం ప్రదర్శించారన్న విమర్శలు ఉన్నాయి. ఎంపికైన 172 మందిలో 100 మంది సర్టిఫికెట్లను మంగళవారం పరిశీలించారు. బుధవారం మరో 30 మంది సర్టిఫికెట్ల పరిశీలన జరిగింది. జాబితాను పునఃపరిశీలన చేస్తున్న క్రమంలో ఇందులో ఎంత మంది పేర్లు ఉంటాయో.. ఊడుతాయో తెలియని పరిస్థితి. కాగా.. ఎంపిక జాబితా రూపొందించడంలో సిబ్బంది తీరుపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. తమ జీవితాలతో సిబ్బంది చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి మార్కులు కలపడం, మరోసారి తొలగించడం, ఎంపిక జాబితాలో కొందరి పేర్లు ఇప్పుడు తొలగించడం.. వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది పనితీరుకు అద్దం పడుతోందని విమర్శిస్తున్నారు. అభ్యర్థుల్లో ఉత్కంఠ.. పోస్టుల సంఖ్య పెరగడం, కోవిడ్ సమయంలో పనిచేసిన వారికి అదనపు మార్కులు కలపడం వంటి నిర్ణయాలు రావడంతో మెరిట్ లిస్ట్‌కు వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ డైరెక్టర్ డాక్టర్ ఉమాసుందరి ఆధ్వర్యంలో తుది మెరుగులు దిద్దుతున్నారు. అమరావతి నుంచి వచ్చిన వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది కూడా ఇందుకు సహకారం అందిస్తున్నారు. దీంతో కొత్త జాబితా కోసం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల అభ్యర్థులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. కాగా..అర్హులకు అన్యాయం జరగదని డాక్టర్ ఉమా సుందరి హామీ ఇస్తున్నారు. -
ఆ విషయంపై కొణతాల ఎందుకు క్లారిటీ ఇవ్వలేకపోయారు?
ఉత్తరాంధ్ర అభివృద్ది వేదిక పేరుతో జరిగిన ఒక కార్యక్రమం భవిష్యత్తు రాజకీయ దృశ్యం ఇలా ఉండే అవకాశం ఉందేమో అనిపిస్తుంది. పేరుకు చర్చా వేదిక కాని, పాల్గొన్నవారిలో అత్యధికులు రాజకీయ పార్టీలవారే. అది కూడా తప్పు కాదు. కాని వారంతా అమరావతి 29 గ్రామాల ప్రాంతం మాత్రమే అభివృద్ది చెందాలని కోరుకుంటున్న వారు కావడం విశేషం. రాజకీయాలకు దూరంగా ఉంటూ, అప్పుడప్పుడో, లేక ఎన్నికలప్పుడో తళుకుమంటున్న మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ దీనికి నాయకత్వం వహించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి ఆయన చాలా ఆందోళన చెందారు. మంచిదే. కాకపోతే ఎన్నికల సంవత్సరంలోనే కాకుండా, నిరంతరం దీనిపై ప్రజలలో ఆయన ఉన్నట్లయితే ఒక నమ్మకం ఏర్పడేది. అంతేకాదు. వైఎస్సార్ కాంగ్రెస్‌కు దూరం అయిన కొంత కాలం మౌనంగా ఉండి, సడన్‌గా 2019 ఎన్నికల సమయంలో అప్పటి మంత్రి, టీడీపీ నేత నారా లోకేష్ వెనుక నిలబడి ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా ఉంటే గౌరవంగా ఉండేది. ఒకప్పుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి సన్నిహితుడుగా పేరొందిన రామకృష్ణ మంత్రిగానే కాకుండా, ఎంపీగా కూడా పనిచేశారు. అప్పట్లో ఉత్తరాంధ్రలో ఎంత మేరకు అభివృద్ది జరిగింది, అందులో ఆయన భాగస్వామ్యం ఏమిటి? ఆ తర్వాత ఎప్పటి నుంచి అభివృద్ది ఆగిపోయింది? దానికి కారణాలు ఏమిటి? అన్న కోణంలో ఆయన చెప్పినట్లు అనిపించలేదు. కేవలం ఉత్తరాంధ్ర వెనుకుబాటుతనం, వలసలు, ఉద్దానంలో కిడ్నీ సమస్యలు, ప్రాజెక్టులు తదితర అంశాలకే పరిమితం అయ్యారు. అంతే తప్ప కీలకమైన అమరావతి అంశాన్ని విస్మరించినట్లుగా ఉంది. పత్రికలలో వచ్చిన వార్తలు చూస్తే అలా అనిపించింది. ఒకవేళ ఆయన అమరావతి మాత్రమే కాదు.. ఉత్తరాంధ్ర కూడా అభివృద్ది చెందాలని చెప్పి ఉంటే మంచిదే. తెలుగుదేశం హయాంలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ది మోడల్ అంతా అమరావతి రియల్ ఎస్టేట్ వెంచర్ లాగే సాగిందన్న విమర్శ కొత్తది కాదు. దానివల్లే ఆయన పార్టీ పరాజయం చెందింది. అమరావతి రాజధాని పేరుతో హైకోర్టుతో సహా నవ నగరాలు అన్నీ అక్కడే ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. కాని దానిని జనం వ్యతిరేకించారు. మరి ఈ విషయంలో కొణతాల ఏమి చెబుతున్నారో తెలియదు. ఇప్పుడు కూడా ఆయన తెలుగుదేశంకు మద్దతు ఇస్తున్నట్లయితే, విశాఖ కార్యనిర్వాహక రాజధాని అవసరం లేదని అనుకుంటున్నట్లే అవుతుంది. దీనిపై ఎందుకు క్లారిటీ ఇవ్వలేకపోయారు. విశాఖలో రిషికొండ తదితర ప్రాంతాలలో అభివృద్ది పనులు జరుగుతుంటే అడ్డుపడుతున్న టీడీపీ, జనసేనలతో కలిసి ఆయన ఉత్తరాంధ్రపై చర్చించడం అంటేనే రాజకీయ లక్ష్యం అర్దం అవుతుంది. అన్నిటికి మించి తెలుగుదేశం మీడియా ఈ వేదికకు విస్తారంగా కవరేజీ ఇచ్చిందంటేనే చర్చలో పాల్గొన్న వారిలో అత్యధికులు ఎటువైపు ఉన్నారో తెలిసిపోతుంది. నిజానికి ఈ రాష్ట్రాన్ని ఏలిందే కాంగ్రెస్, టీడీపీలు. వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లే అయింది. మరి ఇప్పుడు ఉత్తరాంధ్ర వెనుకుబాటు తనానికి ఎవరిని తప్పుపడతారు? ముందుగా తమను తాము విమర్శించుకుని, అప్పుడు ఏమైనా మాట్లాడి ఉండాలి. విద్యావేత్తలు కె.ఎస్.చలం వంటి కొద్ది మినహా మిగిలిన వారంతా రాజకీయవేత్తలే. మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ జనసేన పక్షాన ఈ సదస్సులో పాల్గొన్నారు. ఆయన విశాఖ రాజధాని అవడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. విశాఖ రాజధాని అయితే, అక్కడ పలు అభివృద్ది పనులకు ఆస్కారం ఉంటుంది. ఉత్తరాంధ్ర వాసులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఆయన ఏదో గిరిజన డిక్లరేషన్ అనో, మరొకటనో చెబుతున్నారు తప్ప, విశాఖ రాజధాని గురించి మాట్లాడినట్లు లేరు. పైగా విశాఖ రాజధానిగా అవసరం లేదని ప్రచారం చేస్తూ ఉత్తరాంధ్ర అభివృద్దిపై గోష్టికి హాజరవడం గడుసుదనమేనేమో! టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు యథా ప్రకారం నోటికి వచ్చిన ఆరోపణలు చేశారు. స్వయంగా ఆయన మంత్రిగా ఉన్నప్పుడు టీడీపీ నేతలే భూ ఆక్రమణలకు పాల్పడ్డారని సిట్ ముందు చెప్పారు కదా? దాని గురించి కూడా ప్రస్తావించి ఉండవచ్చు. సీపీఐ రామకృష్ణ తెలుగుదేశం ఏమి చెబితే అదే అంటుంటారని అంటారు. ఆయన కూడా అమరావతి రాజధానిలోనే అన్ని వ్యవస్థలు, సంస్థలు కోరుకునే వ్యక్తి అని భావిస్తారు. ఆయన వచ్చి ఉత్తరాంధ్ర గురించి మాట్లాడితే ఎవరు నమ్ముతారు. పైగా ఉత్తరాంధ్రకు పరిశ్రమలు రావని శాపనార్ధాలు పెడుతున్నారు. ఒకసారి అచ్యుతాపురం పారిశ్రామికవాడకు వెళ్లి ఏమైనా పరిశ్రమలు వస్తున్నాయా? రావడం లేదా అని తెలుసుకుంటే మంచిది కదా. ఏదో రొడ్డకొట్టుడు ఉపన్యాసాలు చేయడం కాకుండా అభివృద్దికి సరైన సూచనలు చేయడం వీరు మానేశారు. ఈ మధ్య కాలంలో సీపీఎం కూడా వీరితో శృతి కలుపుతున్నట్లుగా ఉంది. కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ఉత్తరాంధ్ర అభివృద్ది కోసం కాంగ్రెస్ చాలా చేసిందని చెబుతున్నారు. మరి అసలు ఏమి అభివృద్ది జరగలేదన్నట్లుగా మాట్లాడుతున్న వారితో కలిసి చేతులు ఎందుకు ఎత్తినట్లు? సీపీఐ, సీపీఎంలు కేంద్రంలోని బీజేపీని విమర్శించడానికే ఈ సదస్సును సహజంగానే వాడుకుంటాయి. సీపీఐ రామకృష్ణ ఈ విషయంలో ముఖ్యమంత్రి జగన్‌పై మరోసారి తన అక్కసు వెళ్లగక్కారు. ఆచరణాత్మకంగా వీరు మాట్లాడినట్లు కాకుండా, రాజకీయ లక్ష్యంతో ప్రసంగాలు చేసినట్లు అర్దం అవుతుంది. ఇక లోక్స్తతా అధినేత జయప్రకాశ్ నారాయణ ఎక్కువ భాగం జనరల్‌గా మాట్లాడినట్లు అనిపిస్తుంది. కాకపోతే ఆయనకు వామపక్ష కార్మిక సంఘాల నుంచి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో నిరసన ఎదురైంది. అయినా ఆయన తన వైఖరికే కట్టుబడి ఉన్నట్లు ఉన్నారు. అందువల్ల వారికి సమాధానం ఇవ్వలేదు. ఇది సరైన వేదిక కాదని ఆయన చెప్పారు. జేపీ వాదనతో వామపక్షాలు ఏకీభవించడం లేదు. అది వేరే విషయం. నిజంగా ఉత్తరాంధ్ర అభివృద్ది గురించి చర్చించాలంటే బీజేపీ, వైఎస్సార్ కాంగ్రెస్ లకు కూడా అవకాశం ఇచ్చి ఉండాల్సింది. వారి వాదన ఏమిటో కూడా తెలుసుకోవాలి కదా ఆ పని చేయకుండా ఈ రెండు పార్టీలు అధికారంలో ఉన్నాయి కనుక, వచ్చేది ఎన్నికల సంవత్సరం కనుక ఇప్పటి నుంచే వ్యతిరేక ప్రచారం చేయడానికి తెలుగుదేశం పార్టీ ఈ ముసుగులో ఈ వేదికను వాడుకున్నట్లు అనిపిస్తుంది. అయితే టీడీపీ, జనసేన నేతలు బీజేపీని విమర్శించలేరు. వైసీపీపైనే విమర్శలు చేస్తుంటారు. బీజేపీతో పొత్తు కోసం టీడీపీ నానా పాట్లు పడుతోంది. కాని బీజేపీ ఇంత వరకు సుముఖత కనబరచలేదు. అదే ప్రకారం రాజకీయం ఉంటే వచ్చే ఎన్నికలలో టీడీపీ, జనసేన( బీజేపీని వదలిపెడితే), వామపక్షాలు కలిసి పోటీచేయవచ్చు. జేపీ లోక్‌సత్తాకు ఒకటో, అరో సీట్లు ఇచ్చి కలుపుకునే అవకాశం ఉంటుంది. ఇదంతా కొత్త రాజకీయ సమీకరణగా కనిపిస్తుంది. గత కొంతకాలంగా ఈ ప్రయత్నాలు కూడా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ వేదికపై కాంగ్రెస్ పార్టీ ఉన్నా వారిని కలుపుకోవడం కష్టం కావచ్చు. అయితే బీజేపీ, టీడీపీ, జనసేన కలిస్తే వామపక్షాలు దూరం అవుతాయి. ఏది ఏమైనా వచ్చే ఎన్నికలలో తన విజయావకాశాలు పెంచుకోవడం కోసం తెలుగుదేశం అనుసరిస్తున్న వ్యూహాలలో ఇది కూడా ఒకటి కావచ్చు. నిజానికి రాష్ట్రాన్ని ఏలిందే కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు వైసీపీ అధికారంలోకి వచ్చిందే మూడేళ్ల క్రితం. మరి ఈ ప్రాంత వెనుకబాటుతనానికి ఎవరిని తప్పుపట్టాలి? ముందుగా ఆ సంగతి కూడా చర్చించగలిగి ఉంటే బాగుండేది. ఈ ఏడాదంతా ఇలాంటి రాజకీయ విన్యాసాలు ఇంకా చాలా చూడాల్సిందే. -హితైషి -
ఉత్తరాంధ్ర టీడీపీ నేతలకు ఆ భయం పట్టుకుందా?
ఉత్తరాంధ్ర టీడీపీ నేతలకు ఉనికి భయం పట్టుకుందా? అందుకే పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాలను పట్టించుకోవడంలేదా? విశాఖ బ్రాండ్ ఇమేజ్ను నాశనం చేయడానికి చంద్రబాబు చేస్తున్న కుట్రలను టీడీపీ నేతలే అడ్డుకుంటున్నారా? విశాఖ రాజధాని సెంటిమెంట్‌కు భయపడి సైలెంట్ అవుతున్నారా? చదవండి: చంద్రబాబు ‘ఆఖరు మాటలు’ దేనికి సంకేతం? విశాఖకు చేస్తున్నది మేలా? కీడా? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించినప్పటి నుంచి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఏదో ఒక రూపంలో విశాఖ నగరంపై కుట్రలు చేస్తూనే ఉన్నారు. విశాఖపై ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లుగా ఉత్తరాంధ్ర టీడీపీ నేతలతో ప్రచారం చేయిస్తూనే ఉన్నారు. బినామీ రాజధాని అమరావతి కోసం విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయడానికి కుట్రలు కుతంత్రాలు అమలు చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు అంతా కలిసి విశాఖలో భూకబ్జాలు పెరిగిపోయాయంటూ వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు తెలపాలని చంద్రబాబునాయుడు ఆదేశించారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అంశాన్ని తీసుకుని వరుసగా ఆరు రోజులపాటు ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు అంతా సేవ్ ఉత్తరాంధ్ర పేరుతో వివిధ కార్యక్రమాలు చేపట్టాలని హుకుం జారీ చేశారు. రుషి కొండపై విధ్వంసం పేరుతో ధర్నా చేయాలని.. ఆ తర్వాత వరుసగా దస్ పల్లా భూములు, గంజాయి సాగు, ఏజెన్సీలో అక్రమ మైనింగ్, ఉత్తరాంధ్రలో చక్కెర కర్మగారాలు మూసివేత అంటూ ఇలా ఆరు అంశాలపై ధర్నాలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ ఆరు కార్యక్రమాల్లో కేవలం ఒక్క కార్యక్రమాన్ని మాత్రమే నిర్వహించి టీడీపీ నేతలు చేతులు దులుపుకున్నారు. రుషి కొండ వద్ద దీక్షకు బయలుదేరి వెళ్లే సమయాన్ని ముందుగానే పోలీసులకు సమాచారం అందించి.. పార్టీ కార్యాలయం వద్దే అరెస్టయ్యారు. అసలు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడితో సహా సీనియర్ నేతలు ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. మిగతా ఐదు నిరసన కార్యక్రమాలను తాము చేయలేమని చంద్రబాబుకు కరాకండిగా చెప్పేశారు. ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలకు విరుద్ధంగా రాజధాని అంశం నుంచి దృష్టి మరల్చేందుకు ఎటువంటి నిరసన కార్యక్రమాలు చేపట్టినా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని చంద్రబాబు నాయుడుకు స్పష్టం చేశారు. రాజధానిని అడ్డుకోవడం కోసం విశాఖలో ఏదో జరిగిపోతుందన్నట్లు తప్పుడు ప్రచారం చేసినా, నిరసనలు దీక్షలు చేపట్టినా ప్రజల నుండి వ్యతిరేకత తప్పదని పచ్చ పార్టీ బాస్‌ను హెచ్చరించారు. దసపల్లా భూముల్లోనే టీడీపీ ఆఫీసు అసలు చంద్రబాబు సూచించిన నిరసన కార్యక్రమాలకు సంబంధించిన తప్పులు, ఘోరాలు అన్నీ జరిగింది టీడీపీ పాలనా కాలంలోనే అంటూ ఉత్తరాంధ్ర నేతలు రివర్స్‌లో ఝలక్ ఇచ్చారు. విశాఖలో టీడీపీ నేతలే స్వయంగా భూ కబ్జాలకు పాల్పడ్డారంటూ బాబు హయాంలోనే మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సిట్‌కు ఫిర్యాదు చేసిన అంశాన్ని టీడీపీ నేతలు ప్రస్తావిస్తున్నారు. మరో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖ గంజాయికు అడ్డగా మారిందని మీడియా ముఖంగా మాట్లాడిన మాటలను గుర్తు చేస్తున్నారు. ఉత్తరాంధ్రలో చక్కెర కర్మాగారాలన్నీ టీడీపీ హయాంలోనూ మూతబడిన విషయాన్ని ప్రజలు ఇంకా మర్చిపోలేదంటున్నారు. దస్పల్లా భూముల్లో అధికారాన్ని అడ్డం పెట్టుకొని పార్టీ కార్యాలయాన్ని నిర్మించిన సంగతి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అంటున్నారు. ఉత్తరాంధ్రలో సాగునీటి ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురైంది, వలసలు పెరిగింది కూడా టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే అని తేల్చేశారు ఉత్తరాంధ్ర నాయకులు. తప్పులన్నీ తమ పాలనలోనే చేసి.. ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిందిస్తూ నిరసనలు, ధర్నాలు ఎలా చేయాలంటూ చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు. మీకో దండం బాబు ఉత్తరాంధ్రలో నిరసన కార్యక్రమాలు నిర్వహించలేమంటున్న పార్టీ నేతలపై చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ పిలుపునిచ్చిన నిరసన కార్యక్రమాలు చేపట్టాల్సిందేనని హుకుం జారీ చేస్తున్నారు. టీడీపీకి అమరావతి ఒక్కటే ముఖ్యమని వీలైనంతవరకు విశాఖ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీయాలని పార్టీ నేతలను ఆదేశిస్తున్నారు. ఎవరైనా పార్టీ ఆదేశాలను ధిక్కరిస్తే సహించేది లేదని హెచ్చరిస్తున్నారు. మరి ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు చంద్రబాబు ఆదేశాలను అమలు చేస్తారా? లేదంటే విశాఖ పరిపాలనా రాజధానిగా కావాలని పోరాటం చేస్తున్న ఉత్తరాంధ్ర ప్రజల సెంటిమెంట్ గౌరవిస్తారా అన్నది వేచి చూడాలి. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
ఉత్తమాంధ్రగా నిలుపుతామంటే...
ఉత్తరాంధ్ర అన్ని రంగాలలోనూ వెనకబడి ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే. పదుల సంఖ్యలో ప్రభుత్వరంగ సంస్థలు, రోడ్డు, రైలు, విమాన, నౌకా రవాణా వ్యవస్థలతో అనుసంధానమైన ప్రాంతం అయినప్పటికీ వెనుకబాటుతనం మాత్రం జనాన్ని వీడలేదు. ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలకు, పరిశ్రమలకు స్థానం కల్పించిన నేల ఇది. వ్యవసాయ, వాణిజ్య, వ్యాపార రంగాలకు ఆయువు పట్టుగా నిలుస్తూ ఆర్థిక వ్యవస్థకు ఇతోధికంగా దోహద పడుతున్న ప్రాంతం. సాంస్కృతిక రాజధానిగా విరాజిల్లిన విజయనగరం, పోరాటాల నేల శ్రీకాకుళం, ఆదివాసీ మన్యం తన సిగలో పెట్టుకున్న విశాఖ... ఈ మూడు జిల్లాల సమాహారమే ఉత్తరాంధ్ర ప్రాంతం. 2019లో ముఖ్యమ్రంతి అయిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంతో దార్శనికతతో విశాఖను పరిపాలనా రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసి న్యాయ రాజధానిగా చేయాలని నిర్ణయించారు. ఇది మూడు ప్రాంతాల అభివృద్ధికీ ఉప యుక్తంగా నిలుస్తున్న అంశం. రాష్ట్ర సమగ్ర వికాసం, అన్ని ప్రాంతాల అభివృద్ధి నినాదంతో తీసుకున్న ఈ నిర్ణయాన్ని కేవలం కొద్దిమంది వ్యతిరేకిస్తూ అడ్డుపడుతున్నారు. అమరావతి నుంచి అరస వల్లి వరకు రైతుల పాదయాత్ర పేరుతో పెట్టుబడిదారులు ఉత్తరాంధ్రపై దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రజా స్వామ్యానికి గొడ్డలిపెట్టు వంటి చర్య. ఒకవైపు పెట్టుబడి దారులను ప్రోత్సహిస్తూ, యాత్రను ఆకాశానికి ఎత్తేస్తున్నాయి ఎల్లో పత్రికలూ, ఛానళ్లూ అదే సమయంలో ఉత్తరాంధ్రపై విషపు రాతలు రాస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఉత్తరాంధ్ర నుంచి తన పత్రికా ప్రయాణాన్ని ప్రారంభించి నేడు అతిపెద్ద సామ్రాజ్యాన్ని విస్తరించిన ‘ఈనాడు’ రాతలు మహారోత పుట్టిస్తున్నాయి. కేవలం కొందరి కరపత్రంగా ఇది మారిపోయి ఇష్టారాజ్యంగా వారికి నచ్చినట్లు వండి వడ్డిస్తూ ఉత్రరాంధ్రపై విషం కక్కుతున్నది. ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన పత్రికలు, సమాచార మాధ్యమాలే అప్రజాస్వామిక విధానాలను అవలంబించడం బహుశోచనీయం. ఉత్తరాంధ్ర ప్రజల ఆలోచనలు, ఆకాంక్షలు, మనో భావాలు, అభివృద్ధి, వికాసం వంటివి ఈ పచ్చపత్రికలు, టీవీ చానళ్లకు, వాటిని నడిపిస్తున్న వారికి పట్టవు. కొందరికి దోచుకోవడానికి, దాచుకోవడానికి ఎన్నికల సమయంలో ఇక్కడ ప్రజల ఓట్లు, తద్వారా పదవులు పొందడానికి విశాఖ నగరం కావాలి. ఈ ప్రాంతం, ప్రజలు అభివృద్ధి చెందుతామంటే మాత్రం వీరు ఓర్వలేక పోతున్నారు. నేడు సాంకేతిక విప్లవం పుణ్యాన వీళ్లు చేస్తున్న కుట్రలు, కుతంత్రాలు రాష్ట్రంలో ప్రజలంతా చూస్తున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి అడ్డుపడే ప్రతీ వ్యక్తినీ, వ్యవస్థనూ ఉత్తరాంధ్ర ప్రజలు ఊరికే వదలరు. ఉత్తరాంధ్ర నుంచి ఉద్యమం ఆరంభం అయితే దానిని ఆపడం ఎవ్వరి తరమూ కాదు. పోరాటాల పురిటిగడ్డ శ్రీకాకుళం నుంచి ఉద్యమ స్ఫూర్తినీ, విజయనగరం నుంచి సాంస్కృతిక వారసత్వాన్నీ, విశాఖ నుంచి విజయగీతికనూ అందుకుని ఉత్తరాంధ్రను అభివృద్ధి పథంలో నడిపి ‘ఉత్తమ ఆంధ్ర’గా నిలిపే దిశగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలంతా వెన్నంటి నిలుస్తారు. కేవలం 29 గ్రామాల ప్రజల కోసం 26 జిల్లాలతో కూడిన రాష్ట్ర అభివృద్ధిని పణంగా పెట్టాలంటే ప్రజలు సహించరు. పరిపాలనా రాజధానిగా విశాఖ కాకుండా అడ్డుకునే ప్రతీ వ్యవస్థకూ, పార్టీకీ ఎదురొడ్డి నిలుస్తూ... అసాంఘిక శక్తులను, విద్వేషాలు రగిలించే వ్యవస్థలను కూకటివేళ్లతో పెకిలిస్తారు ప్రజలు. రాష్ట్ర సమగ్ర వికాసం లక్ష్యంగా, అభివృద్ధి మంత్రంగా... ప్రజలంతా ముందడుగు వేస్తారు. తూర్పు తీరం నవ చరిత్రకు నాందీ వాచకంగా నిలుస్తుంది! - డాక్టర్ టి. షారోన్ రాజు విభాగాధిపతి, విద్యావిభాగం ఆంధ్ర విశ్వవిద్యాలయం -
ఎన్ని పోరాటాలకైనా సిద్ధం
శ్రీకాకుళం న్యూకాలనీ: విశాఖ పరిపాలనా రాజధాని అయ్యేంతవరకు ఎందాకైనా వెళ్తామని, ఎన్ని పోరాటాలకైనా సిద్ధమని పలువురు వక్తలు ప్రకటించారు. పరిపాలన వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని వారు స్పష్టంచేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి చంద్రబాబు, ఈనాడు అధినేత రామోజీరావే ప్రధాన అడ్డంకిగా మారారన్నారు. వికేంద్రీకరణకు మద్దతుగా శ్రీకాకుళంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిల్వర్ జూబ్లీ ఆడిటోరియం వేదికగా వివిధ స్వచ్ఛంద సంస్థలు ‘మన విశాఖ–మన రాజధాని’ పేరిట సదస్సు నిర్వహించారు. సదస్సుకు హాజరైన బీఆర్‌ఏయూ విశ్రాంత రిజిస్ట్రార్, విశాఖ రాజధాని సాధన ఐక్యవేదిక అధ్యక్షులు ప్రొ. గుంట తులసీరావు మాట్లాడుతూ.. కొన్ని దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర వెనుకబడి ఉందని.. విశాఖను పాలనా రాజధానిగా చేయాలన్న సీఎం నిర్ణయం చాలా గొప్పదని కొనియాడారు. ఈ అవకాశాన్ని జారవిడుచుకుంటే మరో చారిత్రక తప్పిదం అవుతుందని.. విశాఖ రాజధాని వద్దన్న వారు చరిత్రహీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. విశాఖ రాజధాని సాధన ఐక్యవేదిక కన్వీనర్ డాక్టర్ దానేటి శ్రీధర్ మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనానికి స్వస్తి పలుకుతూ విశాఖ రాజధానే లక్ష్యంగా సీఎం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఉద్యమాన్ని పల్లెస్థాయికి తీసుకెళ్తామన్నారు. రెడ్‌క్రాస్ జిల్లా చైర్మన్ పి. జగన్మోహనరావు మాట్లాడుతూ.. రాయలసీమను వదిలి వెనుకబడిన ఉత్తరాంధ్రకు రాజధానిని ప్రకటించిన గొప్ప మానవతావాదిగా సీఎం జగన్ చరిత్రలో నిలిచిపోతారని చెప్పారు. అలాంటి ముఖ్యమంత్రి ఉండడం మనందరి అదృష్టమని.. భావితరాలకు విశాఖ రాజధాని అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని దూరం చేసేందుకు, భావితరాల భవిష్యత్ కోసం విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా ఉండాలని సంకల్పించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చిరస్మరణీయుడిగా నిలిచిపోతారని సదస్సుకు సంఘీభావం తెలిపిన రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. సీఎం జగన్ రాయలసీమకు చెందిన వారైనా, ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయాన్ని ఉత్తరాంధ్రులంతా సమర్థించి పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. అమరావతి పాదయాత్ర ముసుగులో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం దాగి ఉందని, ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఆరితేరిన ఘనుడని అన్నారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి. సురేఖ, లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షులు హారికాప్రసాద్, విద్యావేత్తలు దుప్పల వెంకట్రావు, సురంగి మోహన్‌రావు, శ్రీకాకుళం మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఎంవీ పద్మావతి, విశ్రాంత డీఈఓ బలివాడ మల్లేశ్వరరావు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యావేత్తలు పాల్గొన్నారు. -
విశాఖ రాజధాని కోసం విద్యార్థుల గర్జన
చోడవరం: వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతానికి విశాఖ రాజధాని ఎంత అవసరమో విద్యార్థి భేరి ఎలుగెత్తి చాటిందని, మూడు రాజధానులు ఏర్పాటుచేసే వరకూ ఉద్యమం ఆగదని ఉత్తరాంధ్ర జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ ఎం.లజపతిరాయ్ స్పష్టంచేశారు. వలస బతుకుల కష్టాల నుంచి విముక్తి కలగాలన్నా, విద్యార్థులకు మంచి భవిష్యత్తు లభించాలన్నా వికేంద్రీకరణ ఒక్కటే మార్గమన్నారు. అనకాపల్లి జిల్లా చోడవరంలో సోమవారం జరిగిన ‘విద్యార్థి భేరి’ రాజధాని నినాదాలతో హోరెత్తింది. వేలాదిమంది విద్యార్థులు తరలిరావడంతో పట్టణంలో ప్రధాన వీధులు కిటకిటలాడాయి. స్థానిక శివాలయం జంక్షన్ నుంచి ప్రభుత్వ జూనియర్ కాలేజీ వరకు సుమారు కిలోమీటరున్నర మేర భారీ ర్యాలీ జరిగింది. ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ, ఎంపీ సత్యవతి, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు పాల్గొన్నారు. విద్యార్థి సంఘాల నాయకులు, న్యాయవాదులు, డాక్టర్లు ర్యాలీని ముందుండి నడిపించారు. ర్యాలీ అనంతరం కాలేజీ గ్రౌండ్ వద్ద జరిగిన సభకు చోడవరం జేఏసీ కన్వీనర్ కాండ్రేగుల డేవిడ్ అధ్యక్షత వహించారు. ఈ సభలో ప్రొఫెసర్ లజపతిరాయ్ మాట్లాడుతూ ఈ ఉద్యమం ఇక్కడితో ఆగదని, మరింత ఉధృతం చేస్తామన్నారు. మూడు రాజధానుల కోసం ఇప్పటికే చిత్తూరు, కర్నూలు, ఉభయ గోదావరి జిల్లాల్లో ఉద్యమాలు ఉధృతమయ్యాయన్నారు. అడ్డుకునే వారి ఆటలు సాగవు కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అభివృద్ధిని కొన్ని శక్తులు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని, వాటి ఆటలు సాగవని హెచ్చరించారు. విద్యార్థులు మూడు రాజధానులకు తమ మద్దతు ప్రకటించడం అభినందనీయమన్నారు. ఎంపీ బీవీ సత్యవతి మాట్లాడుతూ ఊరే లేనిచోట పూర్తిస్థాయి రాజధాని నిర్మించడం ఎంత కష్టమో అందరికీ తెలుసునని, మూడుచోట్ల రాజధానులు ఏర్పాటుచేస్తే మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. ఉత్తరాంధ్ర ఓట్లు కావాలి గానీ ఈ ప్రాంత అభివృద్ధి మాత్రం కొన్ని పార్టీలకు అవసరంలేదని మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వంలో సాధించుకోలేకపోతే విశాఖ రాజ ధాని ఎప్పటికీ కాదన్నారు. విశాఖ–కాకినాడ పెట్రో కెమికల్ అండ్ పెట్రోలియం కారిడార్ చైర్పర్సన్ చొక్కాకుల లక్ష్మి, వైఎస్సార్సీపీ నేత చొక్కాకుల వెంకట్రావు, ఉత్తరాంధ్ర జేఏసీ వైస్ కన్వీనర్ దేముడు మాస్టారు తదితరులు పాల్గొన్నారు. -
ప్రాధాన్యతగా ‘తోటపల్లి’
సాక్షి, అమరావతి: ఉత్తరాంధ్రలో అత్యంత కీలకమైన తోటపల్లి బ్యారేజ్ కింద ఆయకట్టులోని మొత్తం 2 లక్షల ఎకరాలకు నీళ్లందించి, రైతులకు జలయజ్ఞ ఫలాలు అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. ఇందుకోసం తోటపల్లి ప్రాజెక్టులో మిగిలిన పనులను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతగా చేపట్టింది. నిర్వాసితులకు పునరావాసం కల్పించడం ద్వారా బ్యారేజ్‌లో పూర్తి స్థాయి సామర్థ్యం మేరకు 2.51 టీఎంసీలను నిల్వ చేయడం, ప్రధాన కాలువలు, డిస్ట్రిబ్యూటరీల (పిల్ల కాలువలు)లో మిగిలిన పనులను పూర్తి చేయడం ద్వారా జలయజ్ఞం ఫలాలను ఆయకట్టు రైతులందరికీ అందించనుంది. పార్వతీపురం మన్యం జిల్లాలో గరుగుబిల్లి మండలం తోటపల్లి వద్ద నాగావళి నదిపై 1908లో బ్రిటిష్ ప్రభుత్వం రెగ్యులేటర్‌ను నిర్మించింది. పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో 64 వేల ఎకరాలకు నీళ్లందించేలా కాలువల వ్యవస్థను అభివృద్ధి చేసింది. ఆ రెగ్యులేటర్ శిథిలావస్థకు చేరడంతో నాగావళి జలాలను గరిష్ట స్థాయిలో వినియోగించుకుని అదనంగా 1,36,191 ఎకరాలకు నీళ్లందించేలా 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి జలయజ్ఞంలో భాగంగా తోటపల్లి బ్యారేజ్ పనులను చేపట్టారు. 2,151 నిర్వాసితుల కుటుంబాలకు పునరావాసం బ్యారేజ్‌లో పార్వతీపురం మన్యం జిల్లాలోని 20 గ్రామాలు ముంపునకు గురవుతాయి. ఈ గ్రామాల్లోని 5,629 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించాలి. ఇప్పటిదాకా 13 గ్రామాల్లోని 3,478 కుటుంబాలకు మాత్రమే పునరావాసం కల్పించారు. దాంతో బ్యారేజ్‌లో పూర్తి సామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేయలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో మిగతా ఏడు గ్రామాల్లోని 2,151 కుటుంబాలకు పునరావాసం కల్పించి బ్యారేజ్‌లో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయాలని అక్టోబర్ 21న నిర్వహించిన సమీక్షలో జల వనరుల శాఖ అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. బ్యారేజ్‌లో ముంపునకు గురయ్యే భూమితోపాటు ప్రధాన కాలువ, డిస్ట్రిబ్యూటరీలలో మిగిలిన పనులు పూర్తి చేయడానికి అవసరమైన 291.12 ఎకరాల భూమిని యుద్ధప్రాతిపదికన సేకరించాలని ఆదేశించారు. బ్యారేజ్ కుడి కాలువలో అంతర్భాగమైన గజపతినగరం బ్రాంచ్ కెనాల్ నిర్మాణానికి అవసరమైన 219.31 ఎకరాలను సేకరించాలని దిశానిర్దేశం చేశారు. దాంతో నిర్వాసితుల పునరావాసం, భూసేకరణలో అధికారులు నిమగ్నమయ్యారు. ఆయకట్టంతటికీ సాగు నీరు తోటపల్లి బ్యారేజ్ కింద పాత ఆయకట్టు 64 వేల ఎకరాలకు నీళ్లందిస్తున్నారు. కొత్తగా కుడి, ఎడమ కాలువల కింద సుమారు 80 వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందిస్తున్నారు. మిగతా 50 వేల ఎకరాలకు నీళ్లందించాలంటే కుడి, ఎడమ కాలువల్లో, డిస్ట్రిబ్యూటరీల్లో మిగిలిన పనులు పూర్తి చేయాలి. కుడి కాలువలో 0 నుంచి 117.89 కిలోమీటర్ల వరకు 15,07,679 క్యూబిక్ మీటర్ల మట్టి పని, 17 కాంక్రీట్ నిర్మాణాలు, 88,636 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని మిగిలి ఉంది. రూ. 123.21 కోట్లతో కాంట్రాక్టర్లకు అప్పగించారు. 97.70 కి.మీ నుంచి 25 కిలోమీటర్ల గజపతినగరం బ్రాంచ్ కెనాల్‌ను తవ్వి 15 వేల ఎకరాలకు నీళ్లందించనున్నారు. ఈ పనుల్లో 2,67,847 క్యూబిక్ మీటర్ల మట్టి పని, 30 నిర్మాణాలు, 40 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని మిగిలింది. ఈ పనులను రూ.137.8 కోట్లతో చేపట్టారు. ఖరీఫ్ పంట కోతలు పూర్తవగానే ఈ పనులు చేపట్టి యుద్ధప్రాతిపదికన పూర్తి చేయడానికి అధికారులు చర్యలు చేపట్టారు. -
APSRTC: కార్గో కొత్త పుంతలు.. 48 గంటల్లోపే సరకు డెలివరీ
సాక్షి, విశాఖపట్నం: సరకు రవాణాలో ఏపీఆర్టీసీ కొత్త పుంతలు తొక్కుతోంది. రోజురోజుకు వినియోగదారుల ఆదరణను చూరగొంటూ ఆదాయాన్ని పెంచుకుంటోంది. కార్గో సేవలను మరింత విస్తృతం చేసేందుకు సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ఉత్తరాంధ్ర నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు 48 గంటల్లోపే సరకును డెలివరీ చేస్తోంది. కంటైనర్లలో రవాణా చేయడం వల్ల సరకు పాడవకపోవడమే కాదు.. కార్గో నాణ్యత కూడా దెబ్బతినే అవకాశం ఉండదు. ఇది వినియోగదార్లను బాగా ఆకట్టుకుంటోంది. తాజాగా ఆర్టీసీ అధికారులు ఫ్లిప్‌కార్ట్, బిర్లా వైట్, ఇతర సిమెంట్ కంపెనీలతో పాటు బిస్కెట్లు, ఆహార పదార్థాల తయారీ, కెమికల్స్ తయారీ సంస్థలతోను ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఆయా సంస్థలు, కంపెనీల సరకును కోరుకున్న చోటకు బల్క్ ఆర్డర్లతో కంటైనర్ల (డిపో గూడ్స్ ట్రాన్స్‌పోర్టు–డీజీటీల) ద్వారా రవాణా చేస్తున్నారు. అలాగే ప్లైవుడ్, బియ్యం, గోధుమ పిండి, మందులు, ఆటోమొబైల్స్ విడిభాగాలు, వస్త్రాలు, దుస్తులు వంటివి ఎక్కువగా వీటిలో రవాణా అవుతున్నాయి. సరికొత్తగా హౌస్ షిఫ్టింగ్‌కు కూడా ఆర్టీసీ కంటెయినర్లను (డీజీటీలను) సమకూరుస్తున్నారు. ప్రస్తుతం ఆర్టీసీ విజయనగరం కార్గో జోన్లో 42 కంటెయినర్ డీజీటీలున్నాయి. వినియోగదార్ల ఆదరణ బాగుండడంతో ఈ సంఖ్యను మరింత పెంచనున్నారు. ఆ బస్సుల్లో టన్ను సరకుకు జాగా అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, ఏసీ బస్సుల్లో ఒక టన్ను లగేజీకి సరిపడేందుకు వీలుగా జాగాను కేటాయిస్తున్నారు. వీటిలో ఒక నెల రోజుల పాటు రెగ్యులర్‌గా సరకు రవాణా చేసే వారికి తక్కువ ధరకే అంటే.. కిలోమీటరుకు రూ.3–4 చొప్పున కేటాయించే వెసులుబాటు కల్పించారు. ఇతర సంస్థల సరకు రవాణా చార్జీల కంటే ఈ ధర తక్కువ. ఆర్టీసీ సరకు రవాణాతో పాటు పార్సిల్ డెలివరీలోనూ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. దీంతో పార్సిల్/కొరియర్ బుకింగ్‌లు పెరుగుతూ ఆదాయాన్ని పొందుతోంది. విశాఖ ద్వారకా బస్‌స్టేషన్ వద్ద ఉన్న పార్సిల్ బుకింగ్ కౌంటర్‌ను 24 గంటలూ తెరిచి ఉంచేలా ఆర్టీసీ అధికారులు ఇటీవల చర్యలు తీసుకున్నారు. దీనికి స్పందన బాగుండడంతో త్వరలో మద్దిలపాలెం, విజయనగరం, శ్రీకాకుళంలో 24/7 బుకింగ్ కౌంటర్ల ఏర్పాటుపై దృష్టి సారించారు. ఆదాయం అదుర్స్ ఆర్టీసీ విజయనగరం కార్గో జోన్ పరిధిలో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోనే ఈ కార్గో జోన్ ఆదాయంలో అగ్రభాగాన ఉంది. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు (ఆరు నెలల్లో) పార్సిల్స్ ద్వారా రూ.6.75 కోట్లు, సరకు రవాణా (డీజీటీ) ద్వారా రూ.3.28 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఇదే సమయానికి గత ఏడాది పార్సిల్స్ ద్వారా రూ.4.67 కోట్లు, డీజీటీతో రూ.2.14 కోట్లను పొందింది. అంటే గత ఏడాదితో పోల్చుకుంటే పార్సిల్స్‌లో రూ.2.18 కోట్లు, డీజీటీలో రూ.1.14 కోట్లు పెరిగింది. ఆర్టీసీ కార్గో సేవలకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని మరిన్ని కార్గో బుకింగ్ పాయింట్లను, కంటెయినర్ డీజీటీలను పెంచుతామని విజయనగరం జోన్ డీసీఎం కణితి వెంకట్రావు ‘సాక్షి’తో చెప్పారు. (క్లిక్ చేయండి: విశాఖ నగర అందాలను చూస్తూ షిప్లో విహారం) -
యుద్ధ ప్రాతిపదికన ‘తారకరామతీర్థ’ పనులు
సాక్షి, అమరావతి: ఉత్తరాంధ్రలో అత్యంత కీలకమైన తారకరామతీర్థ సాగరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ ప్రాజెక్టులో అంతర్భాగమైన కుమిలి రిజర్వాయర్‌లో మిగిలిన పనులను పూర్తి చేయడానికి రూ.150.24 కోట్లతో జలవనరుల శాఖ అధికారులు జ్యుడిషియల్ ప్రివ్యూకు ప్రతిపాదనలు పంపారు. చదవండి: మరిన్ని కొత్త ఫీచర్లతో సీఎం యాప్ జ్యుడిషియల్ ప్రివ్యూ ఆమోదించగానే టెండర్ నోటిఫికేషన్ జారీ చేసి, ఎంపికైన కాంట్రాక్టర్‌కు పనులు అప్పజెప్పి, యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే విజయనగరం జిల్లాలో పూసపాటిరేగ, డెంకాడ, భోగాపురం మండలాల్లోని 49 గ్రామాల్లోని 24,710 ఎకరాలకు సాగు నీరందుతుంది. ఆ గ్రామాల్లో తాగు నీటికి కూడా 0.162 టీఎంసీలు సరఫరా చేస్తారు. విజయనగరం కార్పొరేషన్‌కు తాగునీటి కోసం 0.48 టీఎంసీలను సరఫరా చేస్తారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జలయజ్ఞంలో భాగంగా తారకరామతీర్థ సాగరం ప్రాజెక్టు చేపట్టారు. ఈ ప్రాజెక్టులో భాగంగా విజయనగరం జిల్లా గుర్ల మండలం కోటగండ్రేడు వద్ద చంపావతి నదిపై 184 మీటర్ల పొడవున బ్యారేజ్ నిర్మిస్తారు. అక్కడి నుంచి 13.428 కిలోమీటర్ల కాలువ ద్వారా కుమిలిలో నిర్మించే రిజర్వాయర్‌కు 2.7 టీఎంసీల నీటిని తరలిస్తారు. దీని ద్వారా కుమిలి చానల్ సిస్టమ్ పరిధిలోని 8,172 ఎకరాలను స్థిరీకరించడంతోపాటు కొత్తగా 16,538 ఎకరాలకు నీళ్లందిస్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులో అంతర్భాగమైన బ్యారేజ్ నిర్మాణం దాదాపు పూర్తయింది. మళ్లింపు కాలువ, కుమిలి రిజర్వాయర్ పనులు వేగంగా జరుగుతున్నాయి. కుమిలి రిజర్వాయర్ డైక్–2, డైక్–3లలో 2.2 కిలోమీటర్ల మట్టికట్ట పనుల్లో రూ.150.24 కోట్ల పనులు మిగిలాయి. వాటిని చేపట్టిన కాంట్రాక్టర్ చేతులెత్తేశారు. దీంతో 60–సీ నిబంధన కింద కాంట్రాక్టర్‌ను తొలగించి, ఆ పనులను మరో కాంట్రాక్టర్‌కు అప్పగించడానికి అధికారులు సిద్ధమయ్యారు. ఈమేరకు ప్రతిపాదనలను జ్యుడిషియల్ ప్రివ్యూకు పంపారు వడివడిగా భూసేకరణ, పునరావాసం తారకరామతీర్థ సాగరం ప్రాజెక్టుకు అవసరమైన 3,446.97 ఎకరాల భూమికిగాను ఇప్పటికే 3,243.28 ఎకరాలను సేకరించారు. మిగతా 203.69 ఎకరాల సేకరణపై అధికారులు దృష్టి పెట్టారు. కుమిలి రిజర్వాయర్‌లో మూడు గ్రామాలు ముంపునకు గురవుతాయి. ఇందులోని 2,219 కుటుంబాలకు పునరావాసం కల్పించాలి. భూసేకరణ, పునరావాసానికే రూ.209.88 కోట్లు అవసరం. ప్రాజెక్టు పనులు పూర్తయ్యేలోగా నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. నిర్వాసితులకు పునరావాసం కల్పించాక చంపావతి నుంచి నీటిని మళ్లించి, ఆయకట్టుకు నీళ్లందించడంతోపాటు విజయనగరం కార్పొరేషన్‌కు తాగు నీరు సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
‘కబ్జా చేసిన అయ్యన్నపాత్రుడు భూకబ్జాల గురించి మాట్లాడుతున్నాడు’
సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయడమే చంద్రబాబు నాయుడు లక్ష్యంగా పెట్టుకున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మండిపడ్డారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడికి ఇష్టం ఉండదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 'విశాఖ పరిపాలనా రాజధానిపై టీడీపీ నాయకులు విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. వచ్చే నెల 11,12 తేదీల్లో ప్రధాని మోదీ విశాఖలో పర్యటించి సీఎం జగన్‌తో కలిసి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. దీనిని టీడీపీ నాయకులు సహించలేకపోతున్నారు. ఉత్తరాంద్ర ప్రజల ఓట్లతో గెలిచిన టీడీపీ నాయకులు ఈ ప్రాంతానికి ద్రోహం చేస్తున్నారు. చంద్రబాబు ఆడమన్నట్లు ఆడి ఉత్తరాంధ్ర ప్రాంతానికి అన్యాయం చేస్తున్నారు. రుషికొండ ప్రాంతంలో టూరిజం ప్రాజెక్ట్ కడుతుంటే తప్పు ఏంటి?. పర్యావరణం అనేది కోర్టు పరిధిలో ఉంటుంది. కోర్టు నిబంధనలకు అనుగుణంగా నిర్మాణాలు జరుగుతాయి. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కొండలపై నిర్మాణాలు చెయ్యలేదా. టీడీపీ నాయకులు ఉత్తరాంద్ర ప్రాంతాన్ని దోచుకున్నారు. ఇరిగేషన్ భూములను కబ్జా చేసిన అయ్యన్నపాత్రుడు భూకబ్జాల గురించి మాట్లాడుతున్నారు. చంద్రబాబు ఇల్లే కరకట్టను ఆక్రమించి కట్టుకున్నారు. విశాఖ బ్రాండ్ ఇమేజ్ను చెడగొట్టే విధంగా టీడీపీ వ్యవహరిస్తోంది. సీఎం జగన్ గంజాయి నియంత్రణ కోసం ప్రత్యేకంగా సెబ్ అనే విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఉత్తరాంధ్రలో సీఎం జగన్ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు' అని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి పేర్కొన్నారు. -
ఇప్పుడు ఉత్తరాంధ్రకు వెన్నుపోటా?
సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్. అమరావతి యాత్ర క్యాపటలిస్టులు వెనక్కి వెళ్లారని, కానీ ఇంకా ఉత్తరాంధ్రకు చెందిన టీడీపీ నాయకుల్లో మార్పు రాలేదన్నారు. ఉత్తరాంధ్రకు ఏం కావాలో చెప్పాల్సింది పోయి అమరావతి కోసం పాకులాడుతున్నారని దుయ్యబట్టారు. టీడీపీ హయాంలో 22 సంవత్సరాలుగా ఉత్తరాంధ్రకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ‘రేపటి నుంచి టీడీపీ వారం రోజుల పాటు కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. ఉత్తరాంధ్రపై విషం చిమ్మి అమరావతి వైపు పెట్టుబడులు వెళ్లేలా చేస్తున్నారు. ఎంతకాలం ఉత్తరాంధ్ర టీడీపీ నాయకులు చంద్రబాబు బూట్లు నాకుతారు. ఉత్తరాంధ్ర అంటే గంజాయి సాగు జరుగుతుందని పంటలు పండవని టీడీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారు. మేం అమరావతికి అడ్డు పడటం లేదు.. అమరావతితో పాటు ఉత్తరాంధ్ర అభివృద్ధి చేయాలని కోరుతున్నాం. అది తప్పా? విశాఖ అభివృద్ధి చెందితే అమరావతి పెట్టుబడులకు నష్టం వస్తుందని చంద్రబాబు తాబేదార్ల భయం. విశాఖలో అన్ని రకాల సదుపాయాలున్నాయి. అమరావతి రైతులది వితండ వాదం.. భూములు ఇచ్చాం రాజధాని ఏర్పాటు చేయాలంటే ఎలా? త్యాగం అంటే పరిశ్రమల కోసం భూములు ఇచ్చిన రైతులది. మీ కోసం మీరు భూములు ఇవ్వడం స్వార్థం.’ అని పేర్కొన్నారు మంత్రి అమర్నాథ్. టీడీపీ హయాంలో రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి స్మగ్లింగ్, భూముల రికార్డ్ల ట్యాంపరింగ్ జరిగిందని అందరికీ తెలుసునన్నారు మంత్రి అమర్నాథ్. వెన్నుపోటు నాయకుని వెనుక ఉన్న నాయకులు అదే ఆలోచనతో ఉత్తరాంధ్రకు వెన్నుపోటు పొడుస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్ష విశాఖ గర్జనలో కనిపించిందని గుర్తు చేశారు. ఇదీ చదవండి: ఉద్దానంపై ప్రేమ కాదు.. ఉత్తరాంధ్రపై ఏడుపు.. ఈనాడు, టీడీపీపై మంత్రి మండిపాటు -
ఈ ప్రశ్నలకెవురు జెబాబు సెప్తారు?
ఆగండాగండి. దండయాత్ర కాదు, ధర్మయాత్ర అంటన్నారు కదా, యీ ప్రశ్నలకి జెబాబులు చెప్తారా? ఒకప్పుడు గోదావరి నుంచి మహానది దాకా కళింగదేశమట. ఇప్పుడంత లేదు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం మూడు జిల్లాల ఉత్తరాంధ్ర వుండీది, అదిపుడు ఆరుజిల్లాల ఉత్తరాంధ్ర అయ్యింది. ఈ ఆరుజిల్లాల ఉత్తరాంధ్ర ఈనాటి ఆంధ్రప్రదేశ్‌లో విద్య, వైద్యం, ఉపాధి, పశుసంపద, భూమి, సాగు నీటివసతులు, రోడ్లు, విద్యుత్... ఇలాగ యే రంగం తీసుకోండి... అన్ని జిల్లాలకంటే యెందుకు ఆఖరిస్తానాల్లో వున్నాయి? నాగావళి, వంశధార, జంఝావతి, వేగావతి, మహేంద్రతనయ వంటి పద్దెనిమిది జీవనదులుండగా మా సాగుభూముల్లో మూడు వంతుల నేలకి సాగునీటి సదుపాయాలెందుకు లేవు? రాష్ట్రంలోని యే ప్రాంతానికీ లేని మూడు వందల యాభయి కిలోమీటర్ల సముద్రతీర మున్నాది. వేలకోట్ల రూపాయల మత్స్యసంపద దొరక తాది? అయితే మా మత్స్యకారులెందుకు గుజరాత్, భివాండీ వంటి ప్రాంతాలకు వలసలు పోవాల్సివచ్చింది? గుడిసెల్లో గుండెలరచేతిల పెట్టుకొని మా మత్స్యకార మహిళలు సముద్రానికెందుకు దీనంగా మొక్కవల సొస్తన్నాది? ఎక్కడా లేని అయిదు వందల కిలోమీటర్ల అడవులున్నాయి మా ఆరు జిల్లాలలోన. రాష్ట్రంలోని మిగిలిన చోటనున్న ఆదివాసీలకంటే ఎక్కువ ఆదివాసీలున్నారు. అయినా ఎందుకక్కడ యింకా రోడ్లు లేవు, ఆసుపత్రులు లేవు. స్కూళ్లు లేవు, విద్యుత్ లేదు, ఉపాధి లేదు. ఆది వాసీలు కూడా ఎందుకు రెక్కలు కొట్టుకొని వలసలు పోవల సొస్తంది? పాతిక లక్షల ఎకరాల సారవంతమయిన సాగుభూమి వుంది. అయితే ఎందుకీ జిల్లాల రైతులు అప్పులపాలయి నారు? కారు చవగ్గా యీ భూముల్ని అటునిండొచ్చిన మీ జిల్లాల పెద్దరైతులు కొనేసి, పెద్దపెద్ద కమతాలు కట్టు కోలేదా? మా నేలలో మా రైతోళ్లని పాలేర్లు చేయలేదా? మాకున్న యేకైక నగరం విశాఖపట్నం. అదిపుడు మీ జిల్లాల నుండొచ్చిన వ్యాపారస్తుల దుకాణమయిపోలేదా? అక్కడి ఆసుపత్రులెవురివి? అక్కడి లాడ్జింగులెవురివి? అక్కడి కాలేజీలు, యూనివర్సిటీ లెవురివి? కాంట్రాక్టు లెవురివి? కంపెనీ లెవురివి? విశాఖపట్నంలో పాలనా రాజధాని యేర్పాటు మాత్రమే కాదు... ఉత్తరాంధ్ర జిల్లాల అభివృధ్దికి యీ ప్రాంతానికి చెందిన ప్రతినిధులతో ఒక ప్రత్యేక పాలనా వ్యవస్థ యేర్పాటు కావాలని కూడా అడుగుతున్నాం, తప్పంటారా? డార్జిలింగ్ అటానమస్ హిల్ కౌన్సిల్ పద్ధతిలో ఉత్తరాంధ్రాలోని ఆదివాసీ ప్రాంతాలైన భద్రగిరి, సీతంపేట, అరకు, పాడేరు, సాలూరు, మందస వంటి ప్రాంతాలతో హిల్ యేరియా కౌన్సిల్ యేర్పాటు చేయాలంటున్నాం, తప్పంటారా? ఆదివాసీ ప్రాంత సహజ వనరులనూ, ఖనిజాలనూ రకరకాల అభివృద్ధి ప్రణాళికల పేరిట కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పే చర్యలను విరమించుకోవాలి. గిరిజన యూనివర్సిటీని పూర్తిస్ధాయిలో ప్రారంభించాలంటున్నాం, తప్పంటారా? ఉత్తరాంధ్రా వెనకబడడానికి కారణం పారిశ్రామికీకరణ జరగకపోవడం. అందుచేత మూడు జిల్లాల్లో వ్యవసాయాధార పరిశ్రమలు, సహజ వనరుల వెలికిదీసే పరిశ్రమలు, ప్రాసెసింగ్ యూనిట్లు యేర్పాటు చేయాలి. మూసివేతకు గురయిన కర్మాగారాలనన్నీటినీ తెరిపించాలని నినదిస్తన్నాం, తప్పంటారా? ఉత్తరాంధ్రాకు ప్రత్యేక ప్రాంతమయిన ఉద్దానంలో... జీడి, మునగ, కొబ్బరి, పనస వంటి పంటలకు కిట్టుబాటు ధర కల్గించడమేగాక, జీడి, కొబ్బరి వంటి పంటలకు ప్రాసెసింగ్ యూనిట్లు, అనుబంధ కర్మాగారాలూ నిర్మిస్తే, ఉపాధి అవకాశాలూ కలుగుతాయి. ఉద్దానం మంచినీటి సమస్యను పరిష్కరించాలి. ఉద్దానం కిడ్నీవ్యాధికి సంబం ధించిన పరిశోధనలు జరపాలి. వ్యాధిగ్రస్తులకు ఉచిత వైద్యసదుపాయాలు అందించాలంటన్నాం, తప్పంటారా? మొత్తం కోస్తాంధ్రాలో 72 శాతం భూమికి సాగునీరు అందుతుండగా, ఉత్తరాంధ్రకు 42 శాతం భూమికి మాత్రమే సాగు నీరందుతుంది. 7 శాతం భూమి మాత్రమే రెండు పంటలకు అనువుగా వుంది. పెండింగులో వున్నటు వంటి అన్ని సాగునీటి ప్రాజెక్టులనూ తక్షణమే పూర్తిచేసే చర్యలను చేపట్టాలంటున్నాం తప్పా? పంటలకు గిట్టు బాటు ధరలు కావాలంటన్నాం. వేయికోట్లకు పైగా ఆదాయమొచ్చే మత్స్యసంపదను మల్టీనేషనల్ కంపెనీలు కాజేస్తున్నాయి. మత్స్యకారులకు తీరని నష్టం జరుగు తోంది. సముద్రజలాల్లో మత్స్యకారుల వేటకు సంబంధించిన ప్రాంతంపై మత్స్యకారులకే అధికారముండాలి. కోల్డ్‌స్టోరేజీలు నిర్మించాలి. తుఫానుషెల్టర్లు నిర్మించాలంటన్నాం, తప్పంటారా? విశాఖలో రైల్వే జోన్ ఉత్తరాంధ్రకు లబ్ది జరిగేవిధంగా యేర్పాటు కావాలంటున్నాం, తప్పా? ఏటకేటా ఉత్తరాంధ్ర నుంచి యాభయి వేలమంది ఉపాధికోసం వలసపోతన్నారు. వలసలు ఆగాలనడుగుతున్నాం. తప్పంటారా? మా నేల ఎవరెవరి పుణ్యానోయిన్నేళ్లు నిరాదరణకు గురయ్యింది, ఇంకా నిరాదరణకు గురి చేస్తామంటే ఎలా సహిస్తాం? పాలనా రాజధాని విశాఖకు వస్తే వైసీపీ నేతల రియలెస్టేట్కి లాభమంటన్నారుకదా, మరి అమరావతిలో రియలెస్టేట్ జరిగిందని అర్థం కదా మీ మాటలకి? (క్లిక్ చేయండి: ఏనాడైనా మంచిని చూస్తున్నారా?) అసలు విశాఖకు పాలనాకేంద్ర రావడం వలన మీకొచ్చిన నష్టమేమిటి? మీకు వచ్చే దేనిని మేము తీసుకుంటున్నాం? మీరిచ్చిన భూములకు ధరలు తగ్గించమని మేమడిగినామా? మీకిచ్చిన ప్లాటులను ప్రభుత్వం వెనక్కి తీసుకోమని అనంటన్నామా? మీ అమరావతిలో అసెంబ్లీ వొద్దుగాక వొద్దని మీలాగ మీ అమరావతికి యాత్ర తీసినామా? మీ జోలికి రాలేదు, మీ ఊసెత్తలేదు, మీ ముక్కు మీద మసి అననలేదు. మరేల మా నేల మీదకి దండయాత్ర కొస్తన్నారు? మీకిది దరమ్మా? మీకిది నేయమా? మీకిది తగునా? ‘విశాఖ ఉక్కు’ కోసం పోరాడుతున్నట్టే పాలనాకేంద్రం కోసమూ పోరాడతా.. అడ్డుగా వొస్తన్న మిమ్మళ్ని ఎందుకొదిలేస్తాం? ఎందుకొదిలీయాలి? (క్లిక్ చేయండి: ‘అలా’ అనకూడదంటే ఎలా?) – కళింగ కరువోడు -
పవన్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడటంపై ఉత్తరాంధ్ర ఆగ్రహం
-
పవన్ కల్యాణ్ తీరుపై ఉత్తరాంధ్ర జేఏసీ ఆందోళన
-
ఉత్తరాంధ్ర గొంతు నొక్కటానికే తప్పుడు రాతలు
సాక్షి, అమరావతి, శ్రీకాకుళం రూరల్: ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలు, ఆశయాల కోసం గొంతెత్తి మాట్లాడుతున్నందుకే తమలాంటి వాళ్ల పీక నొక్కాలని కొన్ని పత్రికలు ప్రయత్నిస్తున్నాయని రెవెన్యూ, స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖల మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు. తన నోరు మూయడం కోసమే తనపై తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎప్పుడో 2005లో కొన్ని ఎన్ఓసీలు ఇచ్చారని, అవన్నీ అప్పట్లో మంత్రిగా ఉన్న ధర్మాన ప్రయోజనాలకోసమే జరిగాయని పేర్కొంటూ ఇప్పుడు ‘ఈనాడు’ పత్రిక వరస కథనాలు వేస్తుండటంపై ఆయన స్పందించారు. ‘‘విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ఉండాలని కొన్ని గొంతులు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. అలాంటి గళాలన్నిటినీ నొక్కి ఆ పత్రికలు ఏం సాధించాలనుకుంటున్నాయో నాకైతే అర్థం కావటం లేదు’’ అని వ్యాఖ్యానించారు. ఇలా గొంతులు నొక్కటం ద్వారా అమరావతిలో ఒక రియల్ ఎస్టేట్ మాఫియాను నిర్మించాలనుకుంటున్నారని, అదే వారి ప్రయోజనమని చెప్పారు. రియల్ ఎస్టేట్ మార్కెట్‌ను సృష్టించి ఆస్తులు సంపాదించాలనే తాపత్రయం తప్ప వారి ఆలోచనల్లో ప్రజల కోణం ఏమీ లేదన్నారు. స్వల్ప ప్రయోజనాల కోసం వాళ్లు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని, తాము విశాల ప్రయోజనాల కోసం పోరాటం మొదలుపెట్టామని స్పష్టంచేశారు. ‘‘నాది 40 సంవత్సరాల రాజకీయ జీవితం. అలాంటి నా క్యారెక్టర్‌పై మచ్చ వేయటం వారి తరం కాదు. ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్న చంద్రబాబు కుట్రలను ఎదుర్కోవటమే మాకు ముఖ్యం. ఉత్తరాంధ్ర ప్రజల ప్రయోజనాలే మాకు ప్రధానం’’ అన్నారు. వాళ్లు ఆరోపిస్తున్న వ్యవహారాలను చూస్తే... ఎన్ఓసీలు ఇవ్వటం వంటివి మంత్రి నిర్ణయం తీసుకునేవి కాదని, కలెక్టర్ల స్థాయిలోనే ఆ నిర్ణయాలు జరుగుతాయని వివరించారు. ‘‘చంద్రబాబు కూడా రెవెన్యూ మంత్రిగా పనిచేశాడు. ఆయనకు ఇవన్నీ తెలియదా? మసిపూసి మారేడు కాయ చేయాలనుకుంటే ఎలా?’’ అని ప్రశ్నించారు. రెవెన్యూ మంత్రికి, జిల్లా స్థాయిలో కార్యకలాపాలకు సంబంధం ఉండదని, జిల్లా కలెక్టర్, ఇతర అధికారుల స్థాయిలోనే ఇదంతా జరుగుతుందని చెప్పారు. వికేంద్రీకరణ కోసం జరుగుతున్న ఉద్యమాన్ని పక్కదారి పట్టించడానికే ఈ తరహా తప్పుడు రాతలు రాస్తున్నారంటూ... ఉత్తరాంధ్ర ప్రయోజనాల కోసం ఇంకా గట్టిగా గళం వినిపిస్తానని స్పష్టం చేశారు. రాజధానికన్నా పదవి ముఖ్యం కాదు విశాఖ రాజధాని కావాలా.. మంత్రి పదవి కావాలా..? అని అడిగితే ఉత్తరాంధ్ర ప్రజల కోసం మంత్రి పదవినైనా వదిలేస్తానని ధర్మాన ప్రసాదరావు స్పష్టంచేశారు. శ్రీకాకుళంలోని ఓ కల్యాణ మండపంలో ఆదివారం ఆర్యవైశ్య సంఘం సమావేశంలో పాల్గొని ఉద్వేగంగా మాట్లాడారు. రాష్ట్రం విడిపోయాక శివరామకృష్ణన్ కమిటీ, శ్రీభాగ్ కమిటీ వంటివి అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి అవసరమని ప్రతిపాదించాయని గుర్తు చేశారు. కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం చంద్రబాబు తన ఇంటిలో స్కెచ్ వేసి అమరావతి, గుంటూరు, నూజివీడు ప్రాంతాలనే రాజధానిగా ప్రకటించి ఇతర ప్రాంతాల వారి నోట్లో మట్టి కొట్టారని దుయ్యబట్టారు. రాజధాని కోసం మద్రాసుకు 70 ఏళ్లు, కర్నూలుకు మూడేళ్లు, హైదరాబాద్‌కు 58 ఏళ్లు పరుగులు పెట్టామని, 130 ఏళ్లుగా ఉత్తరాంధ్ర వాసులు రాజధానికి దూరంగానే ఉన్నారని వివరించారు. విశాఖలో వాయు, జల, రైలు మార్గాలు అనువుగా ఉన్నాయని సీఎం వైఎస్ జగన్ నిర్ణయానికి అండగా ఉండాలని పిలుపునిచ్చారు. రాజకీయాలకు, ప్రాంతాలకు అతీతంగా ఉత్తరాంధ్రులంతా ఏకమై విశాఖకు రాజధాని తెప్పించుకోవాలన్నారు. డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ అమరావతిలో కేవలం చెట్లు, రేకులు తప్ప ఏమీ లేవన్నారు. విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని చెప్పారు. -
ఉవ్వెత్తున ఎగిసిన ఉత్తరాంధ్ర
-
పరిపాలన రాజధాని వచ్చే వరకూ విశ్రమించం
సాక్షి, విశాఖపట్నం: ‘ఉత్తరాంధ్ర వెనుకబాటుతనానికి స్వస్తి పలుకుతూ.. అభివృద్ధి బాటలో నడిపించేందుకు చేపట్టిన ఉద్యమంలో ఇది తొలి అడుగు. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ఏర్పాటు చేసుకునేంత వరకు ఊరూ వాడా ఏకమై ఉద్యమిద్దాం. మరోసారి రాష్ట్రం విడిపోకుండా సమగ్రాభివృద్ధిని కాంక్షిస్తూ సీఎం వైఎస్ జగన్ విప్లవాత్మక నిర్ణయానికి ప్రతి ఒక్కరం మద్దతు పలుకుదాం. ఉత్తరాంధ్ర అభివృద్ధిని వ్యతిరేకిస్తున్న వారిని ఈ ప్రాంతం లో నిషేధిద్దాం. ఉద్యమాల పురిటిగడ్డపై వేషగాళ్లు వెనకడుగు వేసేంత వరకూ గర్జిద్దాం..’ అంటూ నాన్ పొలిటికల్ జేఏసీ, మద్దతునిచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పిలుపునిచ్చారు. భారీ వర్షాన్ని సైతం లెక్కచెయ్యకుండా సాగిన విశాఖ గర్జన ర్యాలీ ముగింపు సభ బీచ్‌రోడ్డులోని వైఎస్సార్ విగ్రహం సమీపంలో జరిగింది. విశాఖ కేంద్రంగా పరిపాలన రాజధాని ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో ఏర్పాటైన జేఏసీ నేతృత్వంలో జరిగిన ఈ సభలో ప్రజా ప్రతినిధులు, మేధావులు, న్యాయవాదులు, ప్రజా, యువజన సంఘాల నేతలు పాల్గొని తమ ఆకాంక్షను చాటారు. జేఏసీ నేతలు దేవుడు, కొయ్య ప్రసాద్‌రెడ్డి, డిప్యూటీ సీఎంలు పీడిక రాజన్న దొర, బూడి ముత్యాల నాయుడు, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, జోగి రమేష్, సీదిరి అప్పలరాజు, ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, గొడ్డేటి మాధవి, భీశెట్టి సత్యవతి, బెల్లాన చంద్రశేఖర్, మాజీ మంత్రులు పేర్ని నాని, ధర్మాన కృష్ణదాస్, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కురసాల కన్నబాబు, మేయర్ జి.హరివెంకటకుమారి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. విశాఖకు రాజధాని రావాల్సిందే వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రజల అభివృద్ధి కోసం న్యాయంగా చేస్తున్న మా పోరాటానికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు పలకాలి. ఇప్పటికే మూడుసార్లు మన రాష్ట్రాన్ని విభజించారు. మళ్లీ అమరావతే ఏకైక రాజధాని అయితే.. భవిష్యత్తులోనూ మళ్లీ విభజన డిమాండ్ పురుడు పోసుకుంటుందనడంలో సందేహం లేదు. రాజధాని వచ్చేంత వరకూ పోరాటం సాగిద్దాం. భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకుందాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. విశాఖకు రాజధాని రావాల్సిందే. – ప్రొఫెసర్ లజపతిరాయ్, నాన్ పొలిటికల్ జేఏసీ చైర్మన్ టీడీపీ, జనసేనకు ఉత్తరాంధ్ర అభివృద్ధి ఇష్టం లేదు మన హక్కుల్ని మనం కాపాడుకుందాం. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ఇదే తరహాలో నినదిద్దాం. ఏపీ సువిశాలంగా.. మూడు ప్రాంతాలూ సమానంగా అభివృద్ధి చెందాలని సీఎం వైఎస్ జగన్ కాంక్షిస్తుంటే.. అమరావతి పేరుతో 29 గ్రామాలున్న ప్రాంతానికి మాత్రమే అభివృద్ధిని పరిమితం చేయాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్ కుతంత్రాలు పన్నుతున్నారు. పైన ఆకుపచ్చ చొక్కాలు.. లోపల పసుçపు పచ్చ ఆలోచనలతో.. తమ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం పాదయాత్ర పేరుతో వారు దండయాత్ర చేస్తుండటం సిగ్గు చేటు. అధికారంలో ఉండగా, అమరావతి ప్రాంతంలో రైతులను దోచుకున్న చంద్రబాబే.. అమరావతి రైతుల పేరుతో పాదయాత్ర చేయిస్తున్నారు. కేవలం విశాఖ మాత్రమే కాకుండా.. అమరావతి, కర్నూలు ప్రాంతాలు కూడా సమానాభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి జగన్ సంకల్పించినా.. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందడం ఇష్టం లేని టీడీపీ, జనసేన దాన్ని ఆపేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. మూడు రాజధానులే ఈ రాష్ట్రానికి శరణ్యం. – మేరుగు నాగార్జున, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఉత్తరాంధ్ర ప్రజలకు సెల్యూట్ విశాఖను రాజధానిగా చేయాలన్న ఆకాంక్ష ప్రజల మనసుల్లో బలంగా నాటుకుపోయింది. వర్షాన్ని లెక్క చేయకుండా వచ్చిన జనానికి సెల్యూట్ చేస్తున్నా. విశాఖ రాజధాని ఉద్యమానికి మద్దతిచ్చేందుకు ఇంత మంది జనం తరలివస్తారని ఊహించలేదు. విశాఖ గర్జనకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించేందుకు ప్రతిపక్షాలు తీవ్రంగా ప్రయత్నించినా, వారి కుట్రలు ఫలించలేదు. ఇప్పటికైనా టీడీపీ, జనసేన, ఇతర పార్టీల నేతలు ప్రజల మనోభావాలు, ఆకాంక్షలను గౌరవించి విశాఖ రాజధాని ఉద్యమానికి మద్దతివ్వాలి. – గుడివాడ అమర్నాథ్, ఐటీ శాఖ మంత్రి జగన్ ఉండగా.. మనకెందుకు భయం? విశాఖను పాలన రాజధానిగా చేయాలన్న తపన.. వేలాది మందిని ఇక్కడికి నడిపించింది. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలంటూ ప్రకృతి కూడా గర్జించి.. ఆమోదం తెలిపింది. తాత ముత్తాతలు మూడేళ్లు కర్నూలు రాజధానికి వెళ్లారు. మన తండ్రులు, మనం హైదరాబాద్ వెళ్లాం. ఇకపై అక్కడెక్కడికో వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తకూడదనే ఉద్దేశంతో.. ఉత్తరాంధ్రని వెనుకబాటు నుంచి అభివృద్ధి పథంలోకి తీసుకురావాలన్న సంకల్పంతో సీఎం వైఎస్ జగన్ విశాఖను పాలన రాజధానిగా ఎంపిక చేస్తూ అరుదైన అవకాశం కల్పించారు. ఈ అవకాశాన్ని మనం వదులుకోరారు. మా ప్రాంతానికి ఉద్యోగాలు రాకుండా, ఉపాధి లేకుండా, పరిశ్రమలు రాకుండా అడ్డుకోవాలనుకుంటున్న వారి ఆటలిక సాగవు. 130 ఏళ్ల నుంచి వస్తున్న వెనుకబాటుతనానికి వ్యతిరేకంగా ఉత్తరాంధ్ర ప్రజలు ఈ రోజు గర్జిస్తుంటే.. దాన్ని అడ్డుకోవాలని చూస్తున్న వారు మిత్రులు కాదు.. ఉత్తరాంధ్ర ద్రోహులు. విభజన చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ రాష్ట్రంలో భిన్నమైన అభిప్రాయాలు కలిగిన నేపథ్యంలో అన్ని ప్రాంతాల్లోనూ అభివృద్ధి అవసరమని సూచించింది. రాష్ట్రంలో అన్ని నగరాలకంటే విశాఖపట్నం రాజధానికి సరైనదని స్పష్టం చేసింది. దీనికి భిన్నంగా.. చంద్రబాబు తన తొత్తులైన నారాయణ, సుజనాచౌదరి, ఇతర నేతలతో కూడిన కమిటీ వేసి రాజధాని అమరావతి అని నిర్ణయించేశారు. ఈ అధికారం ఎవరు ఇచ్చారు? అప్పటికే రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం, ఏపీని తాకట్టు పెట్టడానికి 35వేల ఎకరాలు చుట్టేసి, చుట్టూ భూముల్ని చంద్రబాబు సన్నిహితులు, టీడీపీ నేతలు కొనుగోలు చేసేశారు. భవిష్యత్తులో హైదరాబాద్ మాదిరిగా.. అమరావతి నుంచి మనల్ని వెళ్లగొడితే దిక్కెవరు? ఇప్పటికైనా మనం గట్టిగా నిలబడదాం. బలమైన నాయకుడు సీఎం వైఎస్ జగన్ ఉండగా.. మనకెందుకు భయం? పోరాటాన్ని మరింత ఉధృతం చేద్దాం. – ధర్మాన ప్రసాదరావు, రెవెన్యూ శాఖ మంత్రి అందరూ బాగుండాలన్నదే మా ఆకాంక్ష విశాఖ వాసులు ఉక్కు సంకల్పంతో రాజధానిని సాధించుకోవాలనే కాంక్షతో భారీ వర్షాన్ని సైతం లెక్క చెయ్యకుండా గర్జించారు. విశాఖ రాజధానిని సాధించుకొని బానిస సంకెళ్ల నుంచి బయటపడాలి. కర్నూలు, హైదరాబాద్‌ని రాజధాని చేసినా ఉత్తరాంధ్ర ప్రజలు సరే అన్నారు. కానీ.. ఈసారి మాత్రం ఆ తప్పు చేయకూడదు. వికేంద్రీకరణ జరగాల్సిందే. విశాఖలో రాజధాని ఏర్పాటు కావాల్సిందే. నాది గుంటూరు జిల్లా అయినా.. వికేంద్రీకరణ మా అభిమతం. విశాఖ ప్రజల ఉగ్రరూపం ఎలా ఉంటుందో అందరూ చూశారు. ఈరోజు విశాఖ గర్జన చూస్తే చంద్రబాబు బ్యాచ్‌కు నిద్రపట్టదు. ఉక్కు సంకల్పంతో విశాఖను పరిపాలన రాజధానిగా ఉత్తరాంధ్ర ప్రజలు సాధిస్తారు. పెయిడ్ ఆర్టిస్టులతో చేస్తున్న పాదయాత్రతో దేనికి సంకేతమిస్తున్నారు? అందరూ బాగుండాలని మేము కోరుకుంటే.. అమరావతి మాత్రమే బాగుండాలని టీడీపీ, జనసేన, ఇతర నేతలు కోరుకోవడం సమంజసమేనా? – విడదల రజిని, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రూ.5 లక్షల కోట్ల ప్రజాధనాన్ని వృథా చెయ్యాలనుకుంటున్నారా? రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నది దివంగత వైఎస్సార్ కల. ఇవాళ విశాఖ గర్జన ర్యాలీకి ఇంత మంది తరలి రావడం చూసి ఆనందం ఉప్పొంగుతోంది. విశాఖలో రాజధాని ఏర్పాటు చేయాలన్న బలమైన ఆకాంక్షతోనే ఇంత మంది ప్రజలు విశాఖ గర్జనకు తరలివచ్చారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఇంత మంది వచ్చారంటే వారంతా విశాఖకు మద్దతిస్తున్నారనే అర్థం. విశాఖ రాజధాని కేవలం ఆ నగర ప్రజలకు మాత్రమే కాదు.. రాష్ట్రం మొత్తానికి అవసరం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను మెరుగు పరిచేందుకు విశాఖకు రాజధాని రావాల్సిన అవసరం ఉంది. పోర్టులు, రైల్వే ఫ్యాక్టరీ వంటి సదుపాయాలున్న విశాఖకు రాజధాని వస్తే పెట్టుబడులు పెరిగి నిధులు సమకూరుతాయి. ఇలాంటి నగరాన్ని వదిలేసి రూ.5 లక్షల కోట్లతో రాజధానిని కట్టి చంద్రబాబు ప్రజాధనాన్ని వృథా చేయాలనుకుంటున్నారు. అసలు అమరావతి ఎలా రాజధాని అవుతుంది? అది కేవలం దోపిడీ మాత్రమే. 29 గ్రామాలనే అభివృద్ధి చేసి దానిని రాజధాని అంటే ఎవరు నమ్ముతారు? అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే సీఎం జగన్ వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నారు. దానికి అందరూ మద్దతివ్వాలి. – బొత్స సత్యనారాయణ, విద్యా శాఖ మంత్రి టీడీపీ కార్యాలయాల్లో క్షుద్రపూజలు! ఉత్తరాంధ్ర ప్రజలు ఎన్నాళ్లీ బానిస బతుకులు బతకాలనే ఉద్దేశంతో సీఎం వైఎస్ జగన్ విశాఖని కార్యనిర్వాహక రాజధానిగా చేయాలని సంకల్పించారు. పరిపాలన రాజధాని వస్తే.. ఈ ప్రాం తంలో అభివృద్ధి జరుగుతుంది. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. కానీ.. మనం స్వతంత్రంగా ఉండకూడదనే కుటిలబుద్ధితో కొందరు లుచ్ఛాలు, పచ్చ నేతలు.. టీడీపీ, దానికి కొమ్ముకాస్తున్న పార్టీలు కలిసి.. టీడీపీ కార్యాలయాల్లో క్షుద్ర పూజలు చేస్తున్నారు. ఎన్ని క్షుద్ర పూజలు చేసినా.. ఈ పోరాటం ఆగదు. రాబందుల్ని ఇక్కడి నుంచి పంపించి.. ఉత్తరాంధ్రకు రాజధాని సాధించేంత వరకు చేయి చేయి కలుపుతూ.. సీఎం జగన్ ఇచ్చిన అవకాశాన్ని నెరవేర్చుకుందాం. – కరణం ధర్మశ్రీ, ప్రభుత్వ విప్ విశాఖ నుంచి త్వరలో పరిపాలన అన్ని ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేయాలని సీఎం జగన్ సంకల్పిస్తే.. అమరావతి ఒక్కటే రాజధానిగా ఉండాలని, ఆ ప్రాంతంలో తమ భూముల రేట్లు పెంచుకుని దోచుకోవాలని టీడీపీ, ఇతర ప్రతిపక్షాలు చూస్తున్నాయి. సీఎం జగన్ నిర్ణయం మేరకు మూడు రాజధానులను ఏర్పాటు చేసుకుంటాం. విశాఖ నుంచే సీఎం త్వరలో పరిపాలన సాగిస్తారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. పాదయాత్ర పేరుతో ఈ ప్రాంతంపై దండయాత్ర చేస్తున్న వారు, ఆ దండయాత్రకు మద్దతిస్తున్న టీడీపీ, చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు పవన్ కల్యాణ్‌లను ఉత్తరాంధ్ర ప్రజలు నిలదీయాలి. విశాఖను పరిపాలన రాజధానిగా సాధించుకునేందుకు, జేఏసీ ఏ పోరాటం చేసినా మద్దతు ఇస్తాం. – వైవీ సుబ్బారెడ్డి, టీటీడీ చైర్మన్, వైఎస్సార్సీపీ ఉమ్మడి విశాఖ ఇన్చార్జ్ మన ఆకాంక్ష నెరవేరే వరకు పోరాడుదాం ఈ ప్రాంతంపై దశాబ్దాలుగా పాలనా పరమైన వివక్ష చూపారు. ఈ కారణంగానే ఉత్తరాంధ్ర వెనుకబాటుతనానికి గురైంది. ఉద్యమాలకు పురిటిగడ్డ ఉత్తరాంధ్ర ప్రాంతం. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం నాడు ఉద్యమాలు జరిగితే.. ఈరోజు మళ్లీ మన బతుకుల బాగు కోసం విశాఖే పరిపాలన రాజధానిగా ఉండాలని ఉద్యమిస్తున్నాం. ఆకలి మంటలతో చచ్చే బదులు.. పోరాడి చద్దాం. ప్రతి పురుషుడు, ప్రతి మహిళ, ప్రతి యువకుడు.. ఈ కదన రంగంలోకి దిగాలి. మరో ఉద్యమం రాకుండా వికేంద్రీకరణ అనే పవిత్రమైన నిర్ణయాన్ని సీఎం జగన్ తీసుకున్నారు. ఏపీని సర్వతోముఖాభివృద్ధిగా తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. విశాఖ రాజధానిని వ్యతిరేకిస్తున్న రాజకీయ పార్టీల్ని నిలదీయాలి. మన హక్కుల్ని సాధించుకునే అవకాశం దశాబ్దాల తర్వాత సీఎం జగన్ ఇచ్చారు. పోరాడి తెచ్చుకుందాం. సీఎం ఇక్కడి నుంచి పాలన ప్రారంభించేంత వరకూ ఈ పోరాటాన్ని కొనసాగిద్దాం. – తమ్మినేని సీతారాం, శాసనసభ స్పీకర్ చంద్రబాబును, దత్తపుత్రుడిని తరిమికొట్టాలి రాయలసీమలో పుట్టినా ఉత్తరాంధ్ర ప్రజలకు మద్దతు ఇస్తున్నాను అంటే సీఎం జగన్ నిర్ణయం ఎంత బలమైనదో అర్థం చేసుకోవాలి. దేశంలో చక్రం తిప్పానని చెప్పుకుంటూ, తుప్పు పట్టిన సైకిల్ చక్రం అధినేత చంద్రబాబు మన రాష్ట్రానికి చేసిందేమీ లేదు. చంద్రబాబు అసమర్థ పాలన వల్లే ఉత్తరాంధ్ర, రాయలసీమలు అన్యాయానికి గురయ్యాయి. సీఎం జగన్ వికేంద్రీకరణ నిర్ణయానికి 26 జిల్లాల ప్రజలు మద్దతు తెలియజేస్తుంటే.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు.. అమరావతి రైతుల ముసుగులో వస్తున్న పెయిడ్ ఆర్టిస్టులకు మద్దతిస్తున్నారు. వారిని తమిరి కొట్టాలా.. వద్దా? చంద్రబాబు దత్తపుత్రుడు పవన్‌కల్యాణ్ పెళ్లి చేసుకోడానికి విశాఖ అమ్మాయి కావాలి. షూటింగులకు విశాఖ కావాలి. నటన నేర్చుకోడానికి వైజాగ్ కావాలి. చివరికి ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా విశాఖ కావాలి. కానీ.. వైజాగ్‌కు రాజధాని వద్దు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందకూడదా? గాజువాక ప్రజలు విజన్ ఉన్న వాళ్లు కాబట్టే.. ఈయన నిజ స్వరూపం ముందే తెలుసుకొని చిత్తుగా ఓడించారు. ఆకలి పోరాటం విలువ తెలిసిన ఉత్తరాంధ్ర ప్రజలు తొడగొడితే.. పవన్ కల్యాణ్ చిత్తు అవ్వడం ఖాయం. వికేంద్రీకరణ కోరుకున్న వాళ్లంతా పిచ్చికుక్కలంటూ ఉత్తరాంధ్రలో పుట్టిపెరిగిన అచ్చోసిన ఆంబోతులా అచ్చెన్న మాట్లాడుతున్నారు. 26 జిల్లాల అభివృద్ధిని 29 గ్రామాలకు మాత్రమే కావాలనుకుంటున్న వారే పిచ్చికుక్కలు, గజ్జికుక్కలు, ఊరకుక్కలు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్న చంద్రబాబు చెయ్యలేని అభివృద్ధిని సీఎం జగన్ మూడేళ్లలో చేసి చూపించారు. – ఆర్కే రోజా, పర్యాటక శాఖ మంత్రి ఇక్కడ పేపర్లు, పచ్చళ్లు అమ్మడం లేదా? హైదరాబాద్ తరహాలో రాష్ట్ర సంపదంతా ఒకే చోట అమరావతిలో ఖర్చు చేశాక, మిగతా ప్రాంతాల్లో ఉద్యమాలు వస్తే దానికి ఎవరు బాధ్యులు? ఇకపై ఇలా జరగరాదనే సీఎం జగన్ ముందు చూపుతో వ్యవహరిస్తున్నారు. విశాఖ గర్జన చూశాక అయినా, చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, టీవీ 5 బీఆర్ నాయుడు ప్రజల మద్దతు ఎవరికి ఉందో తెలుసుకోవాలి. అమరావతికే మద్దతు ఇస్తున్న తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్రలో లేదా? ఈనాడు రామోజీరావు ఇక్కడ పేపర్లు, పచ్చళ్లు అమ్ముకోవడం లేదా? రాధాకృష్ణ, టీవీ–5 చానళ్లు ఇక్కడ నడపడం లేదా? వీళ్లందరికీ అమరావతి మీదే ఎందుకు ప్రేమ అంటే, వీళ్లంతా ఆ ప్రాంతంలో భూములు కొనుగోలు చేసి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామనుకున్నారు. జగన్ సీఎం అయ్యాక వారి పప్పులు ఉడకడం లేదు. అమరావతిలో రూ.40లక్షలు పెట్టి కొన్న భూములు రూ.4 కోట్లు కాలేదన్న బాధతో వీరంతా మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్నారు. తమ ఆస్తుల కోసం ఉత్తరాంధ్ర మీద విషం చిమ్ముతున్నారు. చంద్రబాబు ఒక 420. పిల్లనిచ్చి, పార్టీలో చేర్చుకున్న ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి, పార్టీని, ముఖ్యమంత్రి పదవిని ఆక్రమించుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు ఎందర్నో వేధించి.. 210 లోకేష్ కోసం దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబుకు తన ఆస్తుల మీద, పార్టీ మీద, కొడుకు లోకేష్ మీద తప్పితే.. ప్రజల మీద ప్రేమ, దయ, బాధ్యత ఉండదు. ఉత్తరాంధ్ర ద్రోహులందరినీ బ్యాన్ చెయ్యాలి. వారి పేపర్లు, పచ్చళ్లు కొనొద్దు, చానల్స్ రాకుండా కేబుల్ ఆపరేటర్లతో మాట్లాడండి. కుక్కకాటుకు చెప్పుదెబ్బ అన్నట్లు.. వారు ఇటువైపు చూడాలంటే భయం కలిగేలా చేయండి. కృష్ణా, గుంటూరు జిల్లాలు కూడా ఉత్తరాంధ్ర అభివృది ్ధని కోరుకుంటున్నాయి. విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేస్తే ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందు తుంది. – కొడాలి నాని, మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే. -
వికేంద్రీకరణకు మద్దతుగా 'గర్జించిన విశాఖ'
ఒకవైపు సముద్రం హోరు.. ఇంకో వైపు వర్షం జోరు.. మరో వైపు ఈ రెండింటితో పోటీపడుతూ జన గర్జన పోరు.. వికేంద్రీకరణ కోసం ఉద్యమ కెరటం ఉప్పెనలా ఉవ్వెత్తున ఎగిసింది. పరిపాలన రాజధానికి ‘విశాఖ గర్జన’ జైకొట్టింది. వరుణ దేవుడి సాక్షిగా అశేష జనవాహిని గర్జనతో విశాఖ దిక్కులు పిక్కటిల్లాయి. థింసా నృత్యం, చెక్కభజన, కొమ్ము నృత్యం, కోలాటం, తప్పెటగుళ్లు వంటి ఉత్తరాంధ్ర ప్రత్యేక సాంస్కృతిక ప్రదర్శనల నడుమ ఆద్యంతం వికేంద్రీకరణ నినాదాలు హోరెత్తాయి. పాలన రాజధానిగా విశాఖను వ్యతిరేకిస్తే ఖబడ్దార్.. అంటూ ఉత్తరాంధ్ర జనం నిప్పులు చెరిగారు. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/ సాక్షి, విశాఖపట్నం/ డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ): వికేంద్రీకరణకు మద్దతుగా చేపట్టిన విశాఖ గర్జన అంచనాలకు మించి విజయవంతమైంది. విశాఖపట్నానికి పరిపాలన రాజధానిగా చేయాలన్న నినాదం మిన్నంటింది. నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన విశాఖ గర్జన పాదయాత్ర, సభ ఆద్యంతం భారీ వర్షంలోనే కొనసాగింది. ఒకే రాజధాని వద్దు.. మూడు రాజధానులు ముద్దు.. అనే నినాదాలతో పాదయాత్ర హోరెత్తింది. ఉదయం 9 గంటలకే ఎల్ఐసీ బిల్డింగ్ వద్ద గర్జన హడావుడి ప్రారంభం కాగా.. మొదట డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి జేఏసీ చైర్మన్ లజపతిరాయ్‌తో పాటు పలువురు మంత్రులు నివాళులు అర్పించిన అనంతరం పాదయాత్ర ప్రారంభమైంది. ఎల్ఐసీ బిల్డింగ్ నుంచి 10.30 గంటలకు ప్రారంభమైన పాదయాత్ర సెవన్‌హిల్స్ హాస్పిటల్ మీదుగా సర్క్యూట్ హౌస్, సిరిపురం జంక్షన్, పెదవాల్తేరు ఆంధ్రా యూనివర్సిటీ గేటు నుంచి బీచ్ రోడ్డులోని పార్కు హోటల్ వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహం వరకు 3.7 కిలోమీటర్ల మేర పాదయాత్ర మొత్తం వర్షంలోనే సాగింది. ఇసుకవేస్తే రాలనంతగా జన సందోహం మధ్య పాదయాత్ర గంటకుపైగా సాగింది. అక్కడ దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం గర్జన సభ మొదలైంది. రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షంలోనూ ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి జనం భారీగా హాజరయ్యారు. వికేంద్రీకరణలో భాగంగా విశాఖకు జై కొట్టారు. భారీగా కురుస్తున్న వర్షం తమను ఆశీర్వదిస్తున్నట్టుగా ఉందని ఆనందపడ్డారు. ఉత్తరాంధ్ర జోలికొస్తే ఉప్పు పాతరేస్తామని హెచ్చరించారు. ఈ గర్జనతోనైనా చంద్రబాబు, పవన్‌లకు కనువిప్పు కలగాలని ఆకాంక్షించారు. ఇప్పటికే రాష్ట్రాన్ని మూడుసార్లు విభజించారని.. మళ్లీ అమరావతి మాత్రమే రాజధాని అంటే భవిష్యత్‌లోనూ ఇబ్బందులు తప్పవని జేఏసీ నేతలు అభిప్రాయపడ్డారు. తమ పోరాటానికి అన్ని రాజకీయ పక్షాలు కలిసి రావాలని జేఏసీ పిలుపునిచ్చింది. ఏ కార్యక్రమం నిర్వహించినా తాము మద్దతు ఇస్తామని వైఎస్సార్సీపీ ప్రకటించింది. మొత్తంగా సముద్రపు కెరటాల్లా ఎగసిపడ్డ జన సమూహం.. విశాఖకు జై కొట్టింది. విశాఖ గర్జనకు భారీ ర్యాలీగా తరలివస్తున్న జన సందోహం.. భారీగా పాల్గొన్న యువత ప్రధానంగా ఇన్ని రోజులుగా ఉత్తరాంధ్ర వెనుకబాటులో ఎక్కువగా నష్టపోయింది యువతే. ఈ నేపథ్యంలో పాలన వికేంద్రీకరణ ద్వారా పరిపాలన రాజధానిగా విశాఖ అవతరిస్తే ఇటు విద్యా రంగంతో పాటు ఉపాధి రంగంలోనూ కొత్త అవకాశాలు వస్తాయన్న ఆశ వారి మాటల్లో ధ్వనించింది. తద్వారా ఉద్యోగాల కోసం పొట్ట చేత పట్టుకుని ఎక్కడికో పోవాల్సిన అవసరం ఉండదన్న అభిప్రాయం వారిలో వ్యక్తమైంది. ర్యాలీలో వర్షం జోరులో చిందేస్తూ.. జై విశాఖ అని నినదిస్తూ యువతీ, యువకులు పోటీపడుతూ నినాదాలతో హోరెత్తించారు. పాలిటెక్నిక్ కాలేజీతో పాటు డిగ్రీ, పీజీ విద్యార్థులు విశాఖ గర్జనలో భారీగా పాల్గొన్నారు. విశాఖ పరిపాలన రాజధాని అయితే తమ బతుకులు మారతాయని.. ఉద్యోగాలకు వలస వెళ్లాల్సిన బాధలు తప్పుతాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. యువకులతో పోటీ పడి మరీ యువతులు చిందేస్తూ నినాదాలతో పాదయాత్ర కొనసాగించడం విశేషం. తీన్మార్ డప్పులు.. కోబ్రా డ్యాన్స్‌లు.. సాగరతీరాన ఉత్తరాంధ్ర ఆవేదన కడలి ఘోషలా మారింది. విశాఖ పరిపాలన రాజధాని వద్దంటూ..తమ ప్రాంతంపైకి దండయాత్రగా వస్తున్న వారికి వ్యతిరేకంగా, ఉత్తరాంధ్ర ప్రజానీకం.. కళాకారులు కడలి తరంగంలా ఎగసిపడ్డారు. విశాఖకు పరిపాలన రాజధాని వద్దంటే..పరిణామాలు మునుపటిలా ఉండవని సత్తా చూపారు. ‘గురజాడ, శ్రీశ్రీ, వంగపండు ప్రసాదరావు, రావి శాస్త్రి వంటి గొప్ప వారిని కన్న నేల ఉత్తరాంధ్ర. అలాంటి మా ప్రాంతానికి రాజధాని వద్దా? ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధి మీకు పట్టదా? అమరావతి రాజధాని పేరిట మాపై దండ యాత్రకు వస్తారా? మాకు కడుపు మండదా? అంటూ నిప్పులు చెరిగారు. ఉత్తరాంధ్ర కళాకారులు పాటలు, నృత్యాలు, జానపద గేయాలు, గిరిజన నృత్యాలు, బిందెలు తలపై ఉంచుకుని డ్యాన్స్‌లతో ప్రదర్శననిస్తూ.. అందరూ బాగుండాలి.. అందులో మేముండాలంటూ నినదించారు. ‘మన విశాఖ.. మన రాజధాని’ పేరిట నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు వెల్లివిరిశాయి. విశాఖ గర్జనకు హాజరైన అశేష జన సందోహంలోని ఓ భాగం తప్పెటగుళ్లతో ఉత్తరాంధ్ర వెనుకబాటును వివరిస్తూ కళాకారుల ప్రదర్శన పలువురి మన్ననలు పొందింది. పులి వేషధారణతో కళాకారులు ఇచ్చిన ప్రదర్శన ఆకట్టుకుంది. పొడుగాటి మనుషులమంటూ కాళ్లకు కర్రలు కట్టుకుని..నెత్తిన బిందెలు పెట్టుకుని వేసిన బిందెల డ్యాన్స్‌లు మురిపించాయి. పాముల వేషాలతో రెల్లి కులస్థులు వేసిన కోబ్రా డ్యాన్స్‌కు యువత సై కొట్టింది. కళాకారులతో పాటు యువత కూడా ఆ నృత్యంలో భాగస్వాములై పలువుర్ని ఆశ్చర్యానికి గురి చేశారు. తీన్మార్ డప్పులు.. కాంగో డప్పులతో విద్యార్థులు కేరింతలు కొట్టారు. కళాకారులు వాయించిన డప్పులకు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా నృత్యాలు చేస్తూ విశాఖ గర్జనలో పలువురు పాలుపంచుకున్నారు. గిరిజనుల కోయ డ్యాన్సులు.. ఖాళీమాతా డ్యాన్సులు.. అష్టలక్ష్మి నృత్యాలు గర్జనకు తోడయ్యాయి. ఎటు చూసినా జన ప్రభంజనమే విశాఖలో శనివారం ఎటు చూసినా జన ప్రభంజనమే కనిపించింది. దీనికి భారీ వర్షం తోడు కావడంతో వీధులు, రోడ్లు ‘జన’ ‘సంద్రం’గా మారాయి. గత కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో ఏ ఉద్యమానికి రానంతగా విశాఖ గర్జనకు జనం పోటెత్తి సరికొత్త చరిత్ర సృష్టించారు. అంబేడ్కర్ సర్కిల్లో గంటన్నరకు పైగా జనం వర్షంలో నిల్చుని మన విశాఖ.. మన రాజధాని అంటూ నినదించారు. సర్వమత ప్రార్థనల అనంతరం జోరు వానలో తడిసి ముద్దవుతూ కొందరు.. గొడుగులు చేతబట్టి మరికొందరు అడుగులు ముందుకేశారు. ‘విశాఖే పరిపాలన రాజధాని’ అన్న నినాదాలతో ఉన్న జెండాలు ర్యాలీ పొడవునా రెపరెపలాడాయి. విశాఖ నగరంలో 9 సెంటీమీటర్ల భారీ వర్షం కురవడం గమనార్హం. అడుగడుగునా అదే ఆకాంక్ష విశాఖ గర్జనలో ఆసాంతం వికేంద్రీకరణ ఆకాంక్ష స్పష్టంగా కనిపించింది. ఓ వైపు భారీ వర్షం కురుస్తున్నప్పటికీ ఉత్తరాంధ్ర నలుమూలల నుంచీ జనం ఉదయమే బయలుదేరారు. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు దాటుకుని.. నిలువెల్లా తడుస్తూ తమ ఆకాంక్షను బలంగా చాటారు. ఉదయం 9 గంటలకే ఎల్ఐసీ బిల్డింగ్ జంక్షన్ వద్ద కోలాహలం మొదలైంది. ఉత్తరాంధ్ర ప్రత్యేక సాంస్కృతిక ప్రదర్శనలతో విశాఖ గర్జన ప్రారంభమైంది. ర్యాలీ ప్రారంభమైన తర్వాత వర్షం జోరు మరింత పెరిగింది. అయినప్పటికీ వర్షంలో తడుస్తూనే పాదయాత్ర కొనసాగించారు. కొద్ది మంది గొడుగులు పట్టుకుని పాదయాత్రకు రాగా.. ప్రధానంగా యువత మాత్రం వర్షంలో నినాదాలు చేస్తూ ముందుకు అడుగులు వేశారు. విద్యార్థులు, న్యాయవాదులు, విద్యుత్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రైతులు, కార్మికులు... ఇలా అన్ని వర్గాల వారు విశాఖ గర్జనలో తమ నినాదాన్ని వినిపించారు. ఎక్కడికక్కడ పాదయాత్రకు స్థానిక విశాఖ జనం సాదరంగా ఆహ్వానం పలికారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
అమరావతి పెట్టుబడిదారుల కోసం ఉత్తరాంధ్రులకు వెన్నుపోటు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: అన్ని ప్రాంతాలనూ అభివృద్ధి చేయాలని, అందరికీ సమన్యాయం చేయాలన్న సదుద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార వికేంద్రీకరణ తలపెట్టారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. కేవలం తన అనుయాయులను పెత్తందారులను చేయడానికే చట్టబద్ధంగా ఏర్పాటైన శివరామకృష్ణన్ కమిటీ సిఫారసులను చంద్రబాబు పక్కనబెట్టి నారాయణ, సుజనాచౌదరిల కమిటీ చెప్పిన అమరావతిని రాజధానిగా ఎంచుకున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రజలందరి సొమ్ముతో తమ మందిమాగధులకు మేలు చేసేది రాజధాని ఎలా అవుతుందని ప్రశ్నించారు. అమరావతి సహా మూడు ప్రాంతాలూ అభివృద్ధి చేయాలని తాము కోరుకుంటున్నామని, కానీ అమరావతి రైతుల ముసుగులోని పెట్టుబడిదారులు మాత్రం ఉత్తరాంధ్ర నాశనం అయిపోవాలని దేవుడికి మొక్కడానికి అరసవల్లి వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి స్థానిక టీడీపీ నాయకులు మద్దతు పలకడం తల్లిపాలు తాగి రొమ్ము గుద్దడమేనన్నారు. దశాబ్దాలుగా టీడీపీకి అండగా ఉన్న ఉత్తరాంధ్ర ప్రజల భవిష్యత్‌ను కాపాడాల్సింది పోయి చంద్రబాబు ప్రయోజనాల కోసం పణంగా పెడుతున్నారని విమర్శించారు. ఎన్నికలకు ముందు ఓట్ల కోసం హడావుడిగా శిలాఫలకాలు వేయడం తప్ప చంద్రబాబు జిల్లాకు చేసింది శూన్యమన్నారు. గతంలో మాదిరిగానే ప్రజలు అమాయకులని వెన్నుపోటు పొడుద్దామంటే కుదరదని హెచ్చరించారు. వికేంద్రీకరణపై టీడీపీ విషప్రచారాన్ని వారే తిప్పికొడతారని, కుట్రల్లో భాగమైన పాదయాత్రను అడ్డుకుంటారని స్పష్టం చేశారు. జెడ్పీ చాంబర్లో మీడియాతో ఆయన గురువారం మాట్లాడారు. టీడీపీ నాయకులు చేస్తున్న విషప్రచారాన్ని ఖండించారు. ఆ ప్రకటనల వెనుకనున్న అసలు విషయాన్ని వివరించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి... టీడీపీ ప్రచారం: భోగాపురం విమానాశ్రయానికి శంకుస్థాపన చేసినది మేమే. 400 ఎకరాల భూమిని వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసేసుకుంది. వాస్తవ విషయం: విమానాశ్రయం కోసం గత టీడీపీ ప్రభుత్వం 2,750 ఎకరాలను జీఎంఆర్‌కు ఇస్తూ ఒప్పందం చేసుకుంది. ఆ భూసేకరణపై 150 వరకూ కేసులు హైకోర్టు విచారణలో ఉన్నా వాటిని పరిష్కరించకుండానే, ఓ ఒక్క నిర్వాసితుడికీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వకుండానే చంద్రబాబు ఎన్నికల ముందు ఆదరాబాదరాగా శంకుస్థాపన చేసేశారు. అశోక్ గజపతిరాజు అప్పట్లో కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నా ఏ ఒక్క అనుమతీ తీసుకురాలేదు. రైతులతో మాట్లాడి ఆ కేసులన్నీ ఉపసంహరింపజేసినదీ, నిర్వాసితులకు న్యాయం చేసినదీ, కేంద్రం నుంచి అనుమతులన్నీ తెచ్చినదీ వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. త్వరలోనే శంకుస్థాపన కూడా జరగనుంది. విమానాశ్రయానికి అంత భూమి అవసరం లేదనే జీఎంఆర్ నుంచి 547 ఎకరాలను ప్రభుత్వం వెనక్కుతీసుకుంది. ఐదు గ్రామాల నిర్వాసితులకు అన్ని రకాల పరిహారం ఇచ్చింది. అన్ని సౌకర్యాలతో కాలనీలు సిద్ధం చేసింది. టీడీపీ ప్రచారం: గిరిజన యూనివర్సిటీకి టీడీపీ హయాంలోనే భూమి సేకరించేశాం. రూ.10 కోట్ల ఖర్చుతో కాంపౌండ్ వాల్‌నూ కట్టేశాం. వాస్తవ విషయం: ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో హామీ ప్రకారం కేంద్ర ప్రభుత్వం గిరిజన యూనివర్సిటీని మంజూరు చేసింది. ఇతర రాష్ట్రాల్లోని గిరిజన యూనివర్సిటీలన్నీ గిరిజన ప్రాంతాల్లోనే ఉన్నాయి. కానీ వాటి లక్ష్యాన్ని పక్కనబెట్టి టీడీపీ పాలనలో మైదాన ప్రాంతమైన కొత్తవలస మండలంలో స్థల సేకరణ చేశారు. సొంత కాంట్రాక్టర్లకు మేలు చేయడానికి రూ.10 కోట్లతో మంజూరు చేసిన చేసిన ప్రహరీ కూడా ఐదేళ్లలో పూర్తి చేయలేకపోయారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గిరిజనుల అభివృద్ధి, సాంస్కృతిక పరిరక్షణ ఉద్దేశంతో వారికి అందుబాటులో ఉండేలా సాలూరు నియోజకవర్గంలో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సమీపంలోనే రైలు, రోడ్డు, విమాన ప్రయాణ సదుపాయాలు ఉండేలా మెంటాడ మండలంలో సుమారు 500 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేస్తే, కేంద్ర కమిటీ దానికి మొగ్గు చూపించింది. దీన్ని పార్లమెంట్లో ఆమోదం పొందేలా ప్రధానమంత్రి, కేంద్ర హోమ్‌మంత్రితో మాట్లాడి సాధించిన ఘనత జగన్మోహన్రెడ్డికే దక్కుతుంది. ఆ యూనివర్సిటీకి వైస్ చాన్సలర్ నియమించినదీ, తరగతులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకున్నదీ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే. అన్ని గిరిజన ప్రాంతాలూ సమానంగా అభివృద్ధి చెందాలనే ఆయన కురుపాంలో గిరిజన ఇంజినీరింగ్ కళాశాల, సీతంపేటలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, పాడేరులో ప్రభుత్వ మెడికల్ కాలేజీ మంజూరుచేశారు. మరో మెడికల్ కాలేజీ త్వరలోనే పార్వతీపురం మన్యం జిల్లాకూ మంజూరు చేయనున్నారు. టీడీపీ ప్రచారం: అమరావతి రైతులకు మద్దతుగా అన్నివర్గాల వారితో రౌండ్ టేబుల్ సమావేశం పెడతాం. పాదయాత్రకు పూర్తిస్థాయిలో మద్దతు ప్రకటిస్తాం. ఉత్తరాంధ్రను తాకట్టు పెట్టడం తప్ప ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధీ చేయలేదు. వాస్తవ విషయం: జిల్లాలో సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉన్న అటు అశోక్‌కు తప్ప మిగతా టీడీపీ నాయకులెవ్వరికీ ఇక్కడ జరిగిన అభివృద్ధిపై అవగాహన లేదు. గణాంకాలు చూస్తే తెలుస్తుంది. టీడీపీ పాలనలో ఏమి జరిగిందో, వైఎస్సార్, వైఎస్ జగన్ హయాంలో ఏమి అభివృద్ధి జరిగిందో చర్చించడానికి మంత్రి బొత్స సత్యనారాయణ నాయకత్వంలో సిద్ధంగా ఉన్నాం. తోటపల్లి, జంఝావతి, పెద్దగెడ్డ ప్రాజెక్టులను పూర్తి చేసింది వైఎస్సారే. కాలువ, మిగులు పనులకు ఇటీవలే రూ.125 కోట్లను జగన్ ప్రభుత్వం కేటాయించింది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు టీడీపీ పాలనలో ఒక్క అడుగూ ముందుకు పడలేదు. తారకరామతీర్థ సాగర్ ప్రాజెక్టుకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. దీనికి అడ్డంకిగానున్న సారిపల్లి గ్రామ నిర్వాసితుల సమస్యను పరిష్కరించడానికి రూ.77 కోట్లను కేటాయించినది మా ప్రభుత్వమే. వీటన్నింటినీ విస్మరించి వైఎస్సార్సీపీ నాయకులు విజయసాయిరెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణలపై విషప్రచారం చేయడానికి టీడీపీ నాయకులకు తగదు. విశాఖ రాష్ట్ర పరిపాలన రాజధాని గాకుండా అడ్డుకోవడానికే జరుగుతున్న అమరావతి పాదయాత్రకు మద్దతు పలకడం సమంజసం కాదు. కాదని ఆ విధానానికే కట్టుబడి ఉంటే 2024 ఎన్నికల్లో ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారు. వికేంద్రీకరణ, విశాఖ పరిపాలనా రాజధాని వల్ల ఉత్తరాంధ్రకు ముఖ్యంగా ఉమ్మడి విజయనగరం జిల్లాలకు మేలు జరుగుతుంది. దాని కోసం అన్ని వర్గాలతో కలిసి పోరాటం చేయడానికి వైఎస్సార్సీపీ సిద్ధంగా ఉంది. -
విశాఖకు రాజధానికి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయి: అవంతి
-
రాబోయే తరాల కోసమే ఉత్తరాంధ్ర ప్రజల పోరాటం: మంత్రి అమర్నాథ్
-
విశాఖ గర్జన.. మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, విశాఖపట్నం: రాబోయే తరాల కోసమే ఉత్తరాంధ్ర ప్రజల పోరాటమని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. జేఏసీ మీడియా సమావేశంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ, రేపు(శనివారం) విశాఖ గర్జనలో ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షను తెలుపుతామన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆత్మ గౌరవాన్ని ఒక వర్గం మీడియా దెబ్బతీస్తోందన్నారు. మా పోరాటంలో భాగస్వామ్యం కాకపోయినా హాని చేయొద్దన్నారు. మేం అమరావతి, రాయలసీమ కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. అందరూ తమ పోరాటానికి సంఘీభావం తెలపాలని మంత్రి కోరారు. విశాఖను రాజధానిగా సాధించుకుని తీరతామన్నారు. చదవండి: టీడీపీ బినామీలు గో బ్యాక్.. వికేంద్రీకరణ ముద్దు అంటూ నినాదాలు విశాఖ రాజధాని ఉత్తరాంధ్ర ప్రజల హక్కు: అవంతి శ్రీనివాస్ మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ, విశాఖ రాజధాని ఉత్తరాంధ్ర ప్రజల హక్కు అన్నారు. విశాఖకు రాజధాని కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయి. విశాఖలో రూ.5వేల కోట్లు పెడితే బ్రహ్మాండమైన రాజధాని అవుతుందని ఆయన అన్నారు. అన్ని వర్గాల ప్రజల మద్దతు: జేఏసీ కన్వీనర్ ఉత్తరాంధ్ర దశాబ్ధాలుగా వెనుకబడి ఉందని జేఏసీ కన్వీనర్ లజపతిరాయ్ అన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షను తెలిపేలా విశాఖ గర్జన జరుగుతుందన్నారు. ఈ ర్యాలీకి అన్ని వర్గాల ప్రజల మద్దతు లభిస్తుందన్నారు. జేఏసీ ఉద్యమం అంతం కాదు.. ఆరంభం మాత్రమేనని జేఏసీ కో కన్వీనర్ దేవుడు అన్నారు. విశాఖను పరిపాలన రాజధానిగా సాధించుకుని తీరతామన్నారు. -
'విశాఖ రాజధాని'ని.. ఈసారి చేజార్చుకోం
సాక్షి, విశాఖపట్నం: అభివృద్ధిలో ఉత్తరాంధ్ర బాగా వెనుకబడిపోయింది.. 1956లో రాజధాని అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. ఇప్పుడు మళ్లీ ఆ పరిస్థితి తలెత్తకూడదనే అందరం ఏకతాటిపైకి వచ్చామని ఉత్తరాంధ్ర నాన్ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ హనుమంతు లజపతిరాయ్ వివరించారు. కుటిల బుద్ధితో చేస్తున్న పాదయాత్రని ఎలా స్వాగతించగలమని ఆయన ప్రశ్నించారు. ఈ నెల 15న జరిగే విశాఖ గర్జనతో రాజధాని పోరు మొదలవుతుందనీ.. భవిష్యత్తులో నాన్ పొలిటికల్ జేఏసీ అన్ని సమస్యలపైనా పోరాటం కొనసాగిస్తుందని ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రొఫెసర్ లజపతిరాయ్ పునరుద్ఘాటించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. అప్పటి నుంచి ఉత్తరాంధ్ర ఎదురుచూస్తోంది 1953లో ఆంధ్రరాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ ప్రాంతాన్ని రాజధాని చెయ్యాలనే అంశంపై ఓటింగ్ జరిగింది. ఇందులో 61 మంది ఎమ్మెల్యేలు విశాఖపట్నం అని.. 58 మంది కర్నూలు అని ఓటువేశారు. 20 మంది ఎమ్మెల్యేలు తటస్థంగా ఉన్నారు. అప్పటికే కర్నూలుని రాజధానిగా చెయ్యాలని నిర్ణయించుకున్న నాటి ప్రభుత్వం.. 1956 ఏప్రిల్ 1 నుంచి విశాఖపట్నంని రాజధానిగా చేస్తామంటూ అసెంబ్లీ తీర్మానించింది. కానీ, ఇది అమల్లోకి రాకపోయినా.. అప్పటి నేతలు పోరాడలేకపోయారు. అప్పటినుంచి అభివృద్ధి కోసం ఉత్తరాంధ్ర ఎదురుచూస్తూనే ఉంది. ఇప్పటికి సీఎం వైఎస్ జగన్ మరో అవకాశాన్ని కల్పించారు. దీన్ని వదులుకునే ప్రసక్తేలేదు. ఇప్పటికే రెండు తప్పులు చేశాం. మళ్లీ అమరావతిని మాత్రమే అభివృద్ధిచేస్తే.. చారిత్రక తప్పిదం అవుతుంది. ఇప్పుడైనా అభివృద్ధి వికేంద్రీకరణ దిశగా అడుగులువేయకపోతే.. భవిష్యత్తులో మరోసారి విభజన ఉద్యమం తలెత్తక తప్పదు. కుటిల బుద్ధితో వస్తే ఎందుకు స్వాగతించాలి? కొందరు కేవలం అమరావతి మాత్రమే రాజధానిగా ఎదగాలని.. మిగిలిన ప్రాంతాల్లో అభివృద్ధి జరగకూడదనే కుటిలబుద్ధితో పాదయాత్రలు చేస్తున్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందకూడదనే దుర్మార్గపు ఆలోచనలతో వస్తే ఎందుకు స్వాగతించాలి. ఇక రాజధాని కోసం చేస్తున్న పోరాటాన్ని ఉధృతం చేసేందుకు నాన్‌పొలిటికల్ జేఏసీ ఏర్పాటైంది. విశాఖలో రాజధాని ఏర్పాటయ్యేంత వరకూ పోరాటంచేస్తాం. 15న విశాఖ గర్జన ద్వారా ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షని చాటిచెబుతున్నాం. ఆ తర్వాత ప్రతి గ్రామంలోనూ విద్యార్థి నుంచి పింఛన్ తీసుకునే వృద్ధుల వరకూ.. వికేంద్రీకరణ తదనంతరం జరిగే అభివృద్ధిపై అవగాహన కల్పిస్తాం. దూర ప్రస్తావన అప్రస్తుతం? విశాఖ రాజధాని అయితే.. భౌగోళికంగా మిగతా ప్రాంతాలకు దూరంగా ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నారు. కానీ, ఈ వాదనలో బలంలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్ర సచివాలయంలో పనికోసం వచ్చే వారి శాతం 0.01 కూడా వుండదు. గ్రామ సచివాలయ వ్యవస్థ వచ్చాక.. ప్రజలకు పరిపాలన మరింత చేరువైంది. అందుకే దూర ప్రస్తావన అప్రస్తుతమనే చెప్పాలి. ఇక గత కొన్ని దశాబ్దాలుగా అనేక రాష్ట్రాల్లో రాజధానులున్న ప్రాంతాల చుట్టుపక్కలున్న జిల్లాల తలసరి ఆదాయం, ఆయా జిల్లాల వృద్ధిరేటు ఎక్కువగా ఉంటుంది. మూడు రాజధానులవల్ల రాష్ట్రంలో అన్ని జిల్లాల సమన్వయ అభివృద్ధికి దోహదమవుతుంది. క్రమంగా జీడీపీ కూడా పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. -
ఉత్తరాంధ్ర కోసం యువకుడి ఆత్మహత్యాయత్నం
చోడవరం (అనకాపల్లి జిల్లా): విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటు చేయాలని కోరుతూ ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించిన సంఘటన అనకాపల్లి జిల్లా చోడవరం పట్టణంలో జరిగింది. ప్రమాదంలో యువకుడితో పాటు ఆ సమయంలో అక్కడే ఉన్న ఒక ఎంపీటీసీ సభ్యుడు, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని కోరుతూ జేఏసీ ఆధ్వర్యంలో గురువారం చోడవరం మండలంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో చోడవరం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ కూడా పాల్గొన్నారు. బైక్ ర్యాలీ అనంతరం స్థానిక కొత్తూరు జంక్షన్ వద్ద మానవహారంగా ఏర్పడ్డారు. మానవహారంలో పాల్గొన్న పీఎస్‌పేటకు చెందిన సీహెచ్ శ్రీనివాసరావు అనే యువకుడు అకస్మాత్తుగా పక్కనే ఉన్న తన మోటారు సైకిల్‌ను తీసుకొచ్చి మానవహారం మధ్యలో పడేశాడు. అప్పటికే బాటిల్‌తో తెచ్చుకుని ఉన్న పెట్రోల్‌ను మోటారు సైకిల్‌పై, తన ఒంటిపై పోసుకున్నాడు. మానవహారంలో ఉన్న ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీతో పాటు మిగతా ఉద్యమకారులు పరుగెత్తుకుని వచ్చి అతని వద్ద ఉన్న పెట్రోల్ బాటిల్‌ను తీసుకున్నారు. ఇంతలో తన వద్ద ఉన్న అగ్గిపెట్టె వెలిగించి బైక్‌పై వేయడంలో మంటలు చెలరేగాయి. ఆ మంటల్లో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ఆ యువకుడు ప్రయత్నించగా అక్కడ ఉన్న ఉన్నవారంతా వారించి అతనిని దూరం లాక్కెళ్లి.. అతనికి అంటుకున్న మంటలను ఆర్పారు. ఘటనలో ఒక్కసారిగా బైక్ నుంచి మంటలు చెలరేగడంతో పక్కనే ఉన్న చోడవరం–8వ సెగ్మెంట్ ఎంపీటీసీ సభ్యుడు పుట్రేటి శ్యామ్‌ప్రసాద్‌కు అంటుకుని తీవ్రంగా గాయపడ్డాడు. మరో ఇద్దరు పుల్లేటి అప్పారావు, పతివాడ అప్పారావులకు స్వల్ప గాయాలయ్యాయి. ఆత్మహత్యకు యత్నించిన శ్రీనివాసరావుతో సహా వీరందరినీ చికిత్స కోసం చోడవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రాణత్యాగానికి సిద్ధం ఆత్మహత్యాయత్నం అనంతరం శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. ఉత్తరాంధ్ర ప్రాంతం ఎంతో వెనుకబడి ఉందని, తనలాంటి నిరుద్యోగులెందరో ఉపాధి కోసం వేరే ప్రాంతాలకు తరలిపోవాల్సిన దుస్థితి ఉందన్నారు. విశాఖలో పరిపాలన రాజధానిని ఏర్పాటు చేయాలన్నదే తన కోరికని.. ఇందుకోసమే ప్రాణత్యాగానికి సిద్ధమైనట్టు చెప్పారు. ప్రభుత్వ విప్ ధర్మశ్రీ మాట్లాడుతూ తమ సహనాన్ని పరీక్షించొద్దని, ఉత్తరాంధ్ర ప్రజలను రెచ్చగొట్టొద్దని కోరారు. ప్రజా ఉద్యమం ఉధృతం అవ్వకముందే అమరావతి పాదయాత్రను ఆపాలని డిమాండ్ చేశారు. -
పాదయాత్రను ఉత్తరాంధ్ర పొలిమేరల్లోనే అడ్డుకుంటాం
టెక్కలి: రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఉన్నతాశయంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజధాని వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టారని, అమరావతి యాత్ర పేరుతో పెయిడ్ ఆర్టిస్టులు వస్తే.. ఉత్తరాంధ్ర పొలిమేరల్లోనే అడ్డుకుని వారిని తరిమికొడతామని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ హెచ్చరించారు. ఆయన శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో గురువారం మీడియాతో మాట్లాడారు. 75 ఏళ్లుగా ఉత్తరాంధ్ర వెనుకబాటు తనంతో ఉందని, ఇప్పటికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనవల్ల పరిపాలన రాజధాని రాబోతోందన్నారు. అయితే ప్రతిపక్ష నేత చంద్రబాబు కుట్రలు పన్ని అడ్డుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలి.. అందులో అమరావతి ఉండాలి అనేది తమ నినాదమని.. కానీ, చంద్రబాబు మాత్రం కేవలం తన రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం.. తన వాళ్ల ప్రయోజనం కోసం కేవలం అమరావతిలో మాత్రమే రాజధాని ఉండాలనే కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర ప్రజల భిక్షతో దశాబ్దాలుగా రాజకీయంగా లబ్ధిపొందిన అచ్చెన్నాయుడు, రామ్మోహన్నాయుడు ఈరోజు అమరావతి ప్రాంతంలో వారి రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం.. పుట్టిన గడ్డకు తీరని ద్రోహం చేస్తున్నారని ఎమ్మెల్సీ మండిపడ్డారు. అమరావతిలో రాజధాని నినాదంతో ఉప ఎన్నికలకు సిద్ధం కావాలంటూ ఇప్పటికే అచ్చెన్నాయుడుకు 24 గంటలు సమయం ఇచ్చానని దువ్వాడ గుర్తుచేశారు. అధికార వికేంద్రీకరణకు మద్దతుగా ఉత్తరాంధ్ర అభివృద్ధి నినాదంతో టెక్కలి నియోజకవర్గంలో అచ్చెన్నాయుడుపై పోటీకి తానింకా సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. అమరావతే రాజధాని కావాలంటే ఆ ఒక్క ప్రాంతానికే మద్దతిస్తే.. ఉత్తరాంధ్ర ద్రోహి అచ్చెన్నాయుడు అంటూ ప్రతి గ్రామంలో బ్యానర్లు కట్టి ప్రచారం చేస్తామని హెచ్చరించారు. అధికార వికేంద్రీకరణకు మద్దతుగా ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఈ నెల 15వ తేదీన విశాఖలో జరగనున్న ర్యాలీకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరవుతున్నారని, ఉత్తరాంధ్ర సత్తాను దేశం మొత్తం చాటుతామని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. -
ఉత్తరాంధ్రలో మిన్నంటిన వికేంద్రీకరణ నినాదం
సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల్లో ప్రతి ఒక్కరి నోట వికేంద్రీకరణ నినాదం మార్మోగుతోంది. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రతిపాదించిన వికేంద్రీకరణ విధానానికి ఉత్తరాంధ్రలోని ప్రతి గ్రామం నుంచి మద్దతు లభిస్తోంది. మూడు రాజధానుల ఏర్పాటు ద్వారా వెనకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయని శ్రీకాకుళం నుంచి అనకాపల్లి జిల్లా వరకు అన్ని వర్గాల వారు ఏకమై నినదిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో మానవ హారాలు, రిలే నిరాహార దీక్షలు, భారీ ర్యాలీలు, పూజలు నిర్వహించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకుంటే చూస్తూ ఊరుకోమని మేధావులు, విద్యార్థులు, సామాన్య ప్రజలు, వర్తకులు, ఉద్యోగులు ఏకతాటిపై నిలిచి గర్జించారు. రాష్ట్రంలోని ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలని తపన పడుతూ చారిత్రక నిర్ణయం తీసుకున్న సీఎం వైఎస్ జగన్‌కు పూర్తి మద్దతుగా నిలుస్తామని ముక్త కంఠంతో స్పష్టం చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖ పరిపాలన రాజధాని కావాలి ► విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ ఆధ్వర్యంలో వికేంద్రీకరణకు మద్దతుగా బీచ్ రోడ్డులో సైకత శిల్పాన్ని ఏర్పాటు చేశారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ సందర్శించారు. విశాఖ పరిపాలన రాజధాని కావాలని ఆకాంక్షించారు. ► విశాఖ ఉత్తర నియోజకవర్గం తాటిచెట్లపాలెం జంక్షన్లో నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. ► గాజువాక నియోజకవర్గంలోని బీసీ రోడ్డు కాకతీయ జంక్షన్లో ఎమ్మెల్యే నాగిరెడ్డి ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. అంతకు ముందు టీఎన్ఆర్ ఫంక్షన్ హాల్ నుంచి శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు. టీఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో డ్వాక్రా మహిళా సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యేలు చింతిలపూడి వెంకట్రామయ్య, పంచకర్ల రమేష్‌బాబు పాల్గొన్నారు. 66వ వార్డులో కాలనీ వాసులతో సమావేశం నిర్వహించారు. ► భీమిలి నియోజకవర్గంలో ఆనందపురం, పద్మనాభం మండలాల్లో పలు సంఘాల నాయకులతో సమావేశాలు నిర్వహించి వికేంద్రీకరణకు మద్దతు తెలియజేశారు. ► విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో గోపాలప ట్నం కుమారి కల్యాణమండపంలో వైఎస్సార్సీపీ సమన్వయకర్త ఆడారి ఆనంద్ ఆధ్వర్యంలో బెహరా భాస్కరరావు విశాఖ గర్జన పోస్టర్ ఆవిష్కరించారు. గవర కమ్యూనిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. 52వ వార్డు శాంతినగర్‌లో డిప్యూటీ మేయర్ శ్రీధర్ ఆధ్వర్యంలో పలు సంఘాలతో సమావేశం నిర్వహించారు. శ్రీహరిపురం వైçష్ణవి ఫంక్షన్హాల్లో మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ ఆధ్వర్యంలో పారిశ్రామిక ప్రాంతవాసులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి వికేంద్రీకరణకు మద్దతు తెలిపారు. 59వ వార్డులో ఎక్స్ సర్వీస్‌మెన్ కాలనీలో అంబేడ్కర్ సేవా సంఘం సభ్యులు విశాఖ గర్జనకు సంఘీభావం తెలియజేశారు. ► పెందుర్తి నియోజకవర్గంలోని వేపగుంట జంక్షన్లో నాన్ పొలిటికల్ పెందుర్తి జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. అనకాపల్లి ఎంపీ భీశెట్టి సత్యవతి, ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లాలోనూ అదే జోరు ► పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు ఆధ్వర్యంలో పాయకరావుపేట నుంచి అడ్డురోడ్డు వరకు జాతీయ రహదారిపై 25 కిలోమీటర్ల మేర బైక్ ర్యాలీ నిర్వహించారు. నక్కపల్లి, ఎస్ రాయవరం, కోటవురట్ల, పాయకరావుపేట మండలాల నుంచి వందలాది మంది అన్ని వర్గాల వారు ఈ ర్యాలీకి తరలివచ్చారు. జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ చిక్కాల రామారావు పాల్గొన్నారు. ► వికేంద్రీకరణకు మద్దతుగా ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో గంధవరం నుంచి చోడవరం వరకు 10 కి.మీ.. రావికమతం మండలంలో కొత్తకోట నుంచి రావికమతం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. చోడవరం కొత్తూర్ జంక్షన్ వద్ద మానవహారం చేపట్టారు. ► అనకాపల్లిలోని బెల్లం మార్కెట్లో వర్తకులు వికేంద్రీకరణకు మద్దతుగా సమావేశం నిర్వహించారు. -
ఉత్త.. రాతల ప్రేమ
ఎంత ప్రేమ.. ఎంత ప్రేమ!!. రామోజీరావుకు ఉత్తరాంధ్ర అంటే మరీ ఇంత ప్రేమా!. గడిచిన ఆరు రోజుల్లో ఐదు రోజులు ఉత్తరాంధ్ర వ్యవహారాలే ‘ఈనాడు’ బ్యానర్‌గా మారాయి మరి!. ప్రభుత్వం ఉత్తరాంధ్రను పట్టించుకోవటం లేదంటూ పేజీలకు పేజీలు పచ్చి అబద్ధాలు!!. ఇదంతా ఎందుకు రామోజీరావు గారూ? విశాఖ వాసుల్లో వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై వ్యతిరేకత నింపి మీ చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ వచ్చేసరికి రంగం సిద్ధం చేయటానికా? వైఎస్సార్ సీపీ తలపెట్టిన బహిరంగ సభ విజయవంతం కాకూడదనే నిష్ఫల ప్రయత్నమా? లేక రాజధాని కోసం ఉద్యమిస్తున్న ఉత్తరాంధ్ర వాసుల దృష్టిని మళ్లించడానికా? ఎందుకిదంతా? మాకు తప్ప మీకెవ్వరికీ రాజధానిని అడిగే అర్హత లేదంటూ ఉత్తరాంధ్రపై దండయాత్రకు వస్తున్న చంద్రన్న ముఠాల కోసమేగా ఈ రాతలు? ఎవడ్రా మమ్మల్ని అడ్డుకునేదని తొడలు కొట్టుకుంటూ వస్తున్న నారీ మణుల కోసమేగా ఈ అబద్ధాలు? మరీ ఇంత దిగజారుడు తనమా? ఒక ప్రాంతం అభివృద్ధి చెందకూడదని మరీ ఇంత కక్ష చూపించాలా? వారం రోజులుగా మీరు గుప్పిస్తున్న వార్తారాజాల్లో వక్రీకరణ ఏ స్థాయిలో ఉందో తెలియనిదెవరికని? ఇదే... ఉత్తరాంధ్రపై ప్రేమ ఉత్తరాంధ్రపై చంద్రబాబు నాయుడు, ఆయన దత్తపుత్రుడు పవన్‌కల్యాణ్ చూపిస్తున్న ప్రేమకు మురిసిపోతున్నదెవరైనా ఉంటే... అందులో ‘ఈనాడు’ పత్రిక, దాని అధిపతి రామోజీరావుదే ఫస్ట్ మార్క్. ఎందుకంటే పవన్‌కల్యాణ్ పదేపదే శ్రీకాకుళం జిల్లా ఉద్ధానానికి వెళుతూ... అవసరాన్ని మించి ఆవేశపడుతూ ఉండేవారు. కానీ చంద్రబాబు ఏలిన ఐదేళ్లూ ఆవేశాన్ని ఆపేసుకున్నారు. రామోజీరావు కూడా తాత్కాలికంగా ఉద్ధానాన్ని, అక్కడి కిడ్నీ బాధితులను మరిచిపోయారు. మళ్లీ ఇప్పుడు మాత్రం... ఉత్తరాంధ్రకు ప్రస్తుత ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆవేశపడి డైలాగ్‌లు చెప్పేందుకు పవన్ సిద్ధం కాగా... పవన్ చెప్పేది నమ్మండని చెప్పటానికి రామోజీ రాతలు మొదలెట్టారు. ఐదేళ్లూ కిడ్నీ బాధితుల్ని చంద్రబాబు మరిచిపోవటం అబద్ధమా రామోజీరావు గారూ? కిడ్నీ వ్యాధులు ప్రబలుతున్నా మంచినీటి సమస్యను పట్టించుకున్నారా? పాదయాత్రలో బాధితులకిచ్చిన హామీ మేరకు... వై.ఎస్.జగన్ అధికారంలోకి వచ్చాకపలాసలో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, కిడ్నీ వ్యాధుల రీసెర్చ్ సెంటర్, 65 మంది రోగులకు ఏకకాలంలో ఉపయోగపడేలా అతిపెద్ద డయాలసిస్ సెంటర్‌ను మంజూరు చేయటం మీకు కనిపించదా? వాటి పనులు సైతం వేగంగా జరుగుతున్నాయి కదా? కొద్ది రోజుల్లో ఇది పూర్తయి వారి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తున్న విషయాన్ని మీ పత్రిక చెప్పదెందుకు? ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధులకు ప్రధాన కారణం తాగునీరేనని అన్ని కమిటీలూ చెబుతున్న నేపథ్యంలో పలాస, ఇచ్ఛాపురం పరిధిలోని 7 మండలాల్లోని 807 గ్రామాలకు రక్షిత మంచినీరు అందించడానికి రూ.700 కోట్లతో నిర్మాణాలు చేపడుతున్నది ఈ ప్రభుత్వమేగా? ఆసుపత్రి, డయాలసిస్ సెంటర్లకు మరో రూ.50 కోట్లు ఖర్చు చేస్తున్నది వాస్తవం కాదా? నిజాలు పక్కనబెట్టి అబద్ధాలతో ఎన్నాళ్లిలా చెలరేగిపోతారు? ఉత్తరాంధ్ర జిల్లాల సంఖ్యను 3 నుంచి 6కు పెంచటమే కాక జిల్లాకో మెడికల్ కాలేజీని తీసుకువస్తున్నది ఈ ప్రభుత్వమేనని జనానికి తెలియదనుకుంటున్నారా? ప్రాజెక్టుల ఘనత చంద్రబాబుదా? అసలు చంద్రబాబు ముఖ్యమంత్రయిందెప్పుడు రామోజీ? 1995లో ముఖ్యమంత్రి అయిన వ్యక్తి... పద్నాలుగేళ్లు సీఎం అని డప్పు కొట్టే మీరు... ఆయన హయాంలో ఒక్క ప్రాజెక్టయినా పూర్తయిందని చెప్పగలరా? ఇది తాను తెచ్చిన ప్రాజెక్టని ఒక్కటైనా చంద్రబాబు చెప్పుకునే పరిస్థితి ఉందా? పైపెచ్చు సీఎం అయిన 27 ఏళ్ల తరవాత ఆ ప్రాజెక్టులు, ఈ ప్రాజెక్టులు పూర్తి చేయలేదని కుప్పం నుంచి ఇచ్చాపురం వరకూ వేరొకరిపై నిందలేయటం కన్నా దౌర్భాగ్యం వేరొకటి ఉంటుందా? ఇవిగో... ప్రాజెక్టుల వాస్తవాలు ► వంశధార ప్రాజెక్టును మొదలుపెట్టింది దివంగత నేత వైఎస్సార్. అరవై శాతం పూర్తి చేశారు కూడా. టీడీపీ ఐదేళ్లలో మిగిలిన 40 శాతం పూర్తి చేయలేకపోయింది. వచ్చే 4–6 నెలల్లో ఈ ప్రభుత్వం వాటిని పూర్తి చేయబోతోంది. ► వంశధార–నాగావళి అనుసంధాన పనులు ఐదేళ్లలో కనీసం 30 శాతం కూడా టీడీపీ చేయని మాట అబద్ధమేమీ కాదు. ఈ ప్రభుత్వం వచ్చే 4–6 నెలల్లో పూర్తి చేయనున్నదనేదీ నిజమే. ► మహేంద్ర తనయ ఆఫ్‌షోర్ రిజర్వాయర్ వైయస్సార్ మొదలుపెడితే టీడీపీ ప్రభుత్వం కనీసం 40 శాతం కూడా చేయకుండా గాలికి వదిలేసింది. ఇపుడు రూ. 840 కోట్లతో రివైజ్డ్ శాంక్షన్ చేసి టెండర్లకు వెళుతోంది ఈ ప్రభుత్వం. ► తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టు పనులు టీడీపీ ప్రభుత్వం చేయకపోతే కోర్టుకెళ్లారు. అది కూడా ఈ ప్రభుత్వానికే అంటగట్టబోయారు రామోజీరావు. కోర్టు సమస్యను పరిష్కరించింది ఈ ప్రభుత్వమే. రివైజ్డ్ శాంక్షన్ ఇచ్చి ముందుకెళ్తున్నదీ ఈ ప్రభుత్వమే. ► గజపతినగరం బ్రాంచ్ కెనాల్ కూడా టీడీపీ ప్రభుత్వం వదిలేస్తే ఈప్రభుత్వం రివైజ్డ్ శాంక్షన్ ఇచ్చి ముందుకెళ్తోంది. ► ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని మంజూరు చేసింది వైయస్సార్. ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయనిది టీడీపీ. రూ.1700 కోట్లతో ప్రాజెక్టు శాంక్షన్ చేసి భూ సేకరణ వేగంగా చేస్తున్నది ఈ ప్రభుత్వమే. డిజైన్లు కూడా పూర్తవుతున్నాయి. ► తోటపల్లి ప్రాజెక్టు కాంగ్రెస్ హయాంలోనే 95 శాతం పూర్తయితే అది బాబు ఘనతగా చెబుతోంది ‘ఈనాడు’. మిగిలిన పనులు రెండు ప్యాకేజీలుగా చేసి పనులు చేపట్టింది ఈ ప్రభుత్వమే. -
ఉత్తరాంధ్ర ఇరిగేషన్ ప్రాజెక్టులపై తప్పుడు వార్తలు
-
అత్యంత ప్రాధాన్యతాంశంగా ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు
సాక్షి, అమరావతి: వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతంలో సాగు నీటి రంగం అభివృద్ధిని వైఎస్ జగన్ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతాంశంగా చేపట్టిందని, ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేస్తోందని జలవనరుల శాఖ ఇంజనీర్ – ఇన్ చీఫ్ సి.నారాయణ రెడ్డి చెప్పారు. ఉత్తరాంధ్రలోని నీటి ప్రాజెక్టులను ప్రభుత్వం పట్టించుకోవడంలేదంటూ ఈనాడు ప్రచురించిన కథనాన్ని ఆయన ఖండించారు. గత ప్రభుత్వ తప్పిదాలను దాచిపెట్టి ప్రస్తుత ప్రభుత్వం మీద బురదజల్లే ప్రయత్నం ‘ఈనాడు’ చేస్తోందని విమర్శించారు. మంగళవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నారాయణ రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జలయజ్ఞం కింద ఉత్తరాంధ్రలో పలు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారన్నారు. ఈ ప్రాజెక్టుల నిధులను గత టీడీపీ ప్రభుత్వం ప్రణాళికా రహితంగా ఖర్చు చేసి, కాంట్రాక్టుల రూపంలో అనుయాయులకు లబ్ధి చేకూర్చిందని చెప్పారు. వందల కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం చేశారని, పనులు మాత్రం జరగలేదని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రతి పైసా ప్రజా ప్రయోజనాల కోసం ఖర్చు చేస్తోందన్నారు. వంశధార నిర్వాసితులకు అదనపు ప్రయోజనం వంశధార ప్రాజెక్టు రెండో భాగం రెండో దశలో ఇప్పటికే 90 శాతం పనులు పూర్తయ్యాయని నారాయణ రెడ్డి తెలిపారు. దీని ద్వారా 27,800 ఎకరాలకు ఇప్పటికే నీటి వసతి లభించిందన్నారు. శ్రీకాకుళం జిల్లాల్లోని 9 మండలాల్లో 225 గ్రామాలకు ఈ ప్రాజెక్టు ద్వారా లబ్ధి కలుగుతోందని తెలిపారు. అదేవిధంగా 1.2 టీఎంసీల నీటిని హీరమండలం రిజర్వాయర్ ద్వారా కిడ్నీ వ్యాధి పీడిత ఉద్దానం ప్రాంతానికి సరఫరా చేసే అవకాశం కలుగుతుందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో వంశధార నిర్వాసితుల ప్రయోజనాలను గాలికి వదిలేశారన్నారు. ఈ నిర్వాసితులకు అదనపు ప్రయోజనం కల్పించేందుకు సీఎం జగన్ రూ. 217 కోట్లు మంజూరు చేశారని అన్నారు. వంశధార నదిపై గొట్టా బ్యారేజి నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా హీర మండలం రిజర్వాయర్‌కు 12 టీఎంసీల నీటిని అందించేందుకు రూ. 176 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. అనుసంధానంతో 18,527 ఎకరాల స్థిరీకరణ వంశధార–నాగావళి అనుసంధానం ద్వారా 18,527 ఎకరాల స్థిరీకరణకు, 4 మండలాల్లోని 38 గ్రామాల పరిధిలో 5 వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇందుకోసం ప్రస్తుత ప్రభుత్వం రూ.145 కోట్ల నిధులకు అనుమతిచ్చిందని, ఇప్పటికే 70 శాతం పనులు పూర్తయ్యాయని చెప్పారు. మిగతా పనులు 2023 జూన్ నాటికి పూర్తవుతాయని తెలిపారు. తోటపల్లి కుడి ప్రధాన కాలువను పొడిగించి విజయనగరం జిల్లాలోని ఆరు మండలాల్లో 15 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు గజపతినగరం బ్రాంచి కాలువ పనులు చేపడుతున్నామన్నారు. ఇందులో 43% పనులు పూర్తయ్యాయని, భూ సేకరణలో కొన్ని ఇబ్బందుల వల్ల మిగిలిన పనులు ఆగాయని చెప్పారు. మిగతా పనులకు రూ.137 కోట్లతో తయారు చేసిన ప్రతిపాదనలకు ఆర్థిక శాఖ ఆమోదం లభించిందన్నారు. ఈ పనులను కూడా 2024 జూన్ నాటికి పూర్తి చేస్తామన్నారు. తారకరామతీర్థ సాగరం ద్వారా 16 వేల ఎకరాలకు నీరు విజయనగరం జిల్లా గుర్ల మండలంలో చంపావతి నదికి అడ్డంగా తారకరామతీర్థ సాగరం బ్యారేజి నిర్మించి 2.75 టీఎంసీల నీటిని వినియోగించుకోవచ్చని, మూడు మండలాల్లోని 49 గ్రామాల్లో 16,538 ఎకరాలకు నీరు ఇవ్వచ్చని చెప్పారు. ఈ పనులు 59 శాతం పూర్తయ్యాయని, మిగతా పనులకు రూ.198 కోట్లతో చేసిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని చెప్పారు. త్వరలో కాంట్రాక్టర్‌ను ఎంపిక చేసి పనులు అప్పగిస్తామన్నారు. పునరావాస కార్యక్రమాలను ముందుగానే పూర్తి చేసేందుకు ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. తాగు, సాగు, పారిశ్రామిక అవసరాలకు నీరు ఉత్తరాంధ్ర జిల్లాలకు సాగు, తాగు, పారిశ్రామిక నీటి అవసరాలను తీర్చే లక్ష్యంతో మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.7,214 కోట్లతో బీఆర్ అంబేడ్కర్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని నారాయణ రెడ్డి గుర్తు చేశారు. దీనిద్వారా 8లక్షల ఎకరాలకు సాగునీరు, విశాఖతోపాటు ఇతర ప్రాంతాల తాగు నీరు, పారిశ్రామిక అవసరాలకు 23.44 టీఎంసీలు తరలించాలనేది లక్ష్యమన్నారు. తొలి దశలో రెండు ప్యాకేజీల్లో గత ప్రభుత్వం 2017–18లో రూ.2,022కోట్ల విలువైన పనులను కాంట్రాక్టర్లకు అప్పగించినా పురోగతి లేదన్నారు. 2019లో వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక ఈ ప్రాజెక్టుపై దృష్టి సారించి, అంచనాలను రూ.17,411కోట్లకు పెంచిందన్నారు. ఫేజ్–2 కింద రెండు ప్యాకేజీలను చేపట్టిందన్నారు. పోలవరం ఎడమ ప్రధాన కాలువ 63వ కిలోమీటరు నుంచి 102వ కిలోమీటరు పొడవున శ్రీకా కుళం జిల్లా నడిగెడ్డ వరకు నీటిని తీసుకు వెళ్లేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం 7,500 ఎకరాల భూసేకరణ త్వరగా జరుగుతోందని, 60 శాతం మేర డిజైన్లకు అనుమతి లభించిందన్నారు. మడ్డువలస రెండో దశ పనులు 79% పూర్తి మడ్డువలస రిజర్వాయర్ నుంచి కుడి ప్రధాన కాలువను విస్తరించి 12,500 ఎకరాల అదనపు ఆయకట్టుకు 1.5టీఎంసీల నీరిచ్చే లక్ష్యంతో రెండో దశ పనులను చేపట్టామని ఈఎన్సీ చెప్పారు. దీనివల్ల జి.సిగడాం, పొందూరు, లావేరు, ఎచ్చెర్ల మండలాల్లోని 21 గ్రామాలకు ప్రయోజనం కలుగుతుందన్నారు. ఇప్పటికే 79 శాతం పనులు పూర్తి చేశామన్నారు. మిగిలిన పనులను పాత కాంట్రాక్టరు చేయలేకపోవడంతో రూ.26.9కోట్లతో సవరిం చిన అంచనాలను ప్రభుత్వం ఆమోదించిందన్నా రు. వచ్చే ఖరీఫ్‌కు ఈ పనులు పూర్తవుతాయన్నారు. తోటపల్లి బ్యారేజి 83% పూర్తి విజయనగరం జిల్లా తోటపల్లి వద్ద నాగావళి నదిపై బ్యారేజి నిర్మించి 64 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణతో పాటు కొత్తగా 1,31,000 ఎకరాల ఆయకట్టుకు 15.89 టీఎంసీల నీరిచ్చేందుకు తోటపల్లి బ్యారేజ్ పనులను ప్రభుత్వం చేపట్టిందని నారాయణరెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టును రూ.1127.58 కోట్లతో చేపట్టగా, 83 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. రూ.123.21 కోట్లతో మిగిలిన పనులను రెండు ప్యాకేజిలుగా చేపట్టామన్నారు. ఈ పనులు 2023 జూన్‌కి పూర్తవుతాయన్నారు. రూ.854 కోట్లతో మహేంద్రతనయ ఆఫ్ షోర్ రిజర్వాయర్ మహేంద్రతనయ నది మీద చాప్రా గ్రామం వద్ద హెడ్ రెగ్యులేటర్ నిర్మించి 1,200 క్యూసెక్కుల నీటిని రేగులపాడు రిజర్వాయర్‌కు తరలించే ప్రధాన ఉద్దేశంతో ఆఫ్ షోర్ రిజర్వాయర్ నిర్మిస్తున్నట్టు నారాయణరెడ్డి తెలిపారు. 2.1 టీఎంసీల నీటిని నిల్వచేసే ఈ రిజర్వాయర్ ద్వారా 24,600 ఎకరాలకు సాగు నీరు అందుతుందన్నారు. భూసేకరణ, పునరావాస ప్రక్రియల్లో ఇబ్బందుల వల్ల ఈ ప్రాజెక్టు ముందుకు సాగలేదని పేర్కొన్నారు. అయితే వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించి, రూ.854.25 కోట్లతో మిగిలిన పనులు చేపట్టేందుకు అనుమతినిచ్చిందని చెప్పారు. త్వరలోనే రివర్స్ టెండరింగ్ ద్వారా పనులను చేపట్టి 2024 ఖరీఫ్ నాటికి ఆయకట్టుకు నీరిచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. -
పరిపాలన వికేంద్రీకరణకు మద్దతుగా 15న విశాఖ గర్జన
మహారాణిపేట (విశాఖ దక్షిణ): పరిపాలన వికేంద్రీకరణకు మద్దతుగా 15న నిర్వహించనున్న విశాఖ గర్జనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో మూడు రాజధానులను సీఎం జగన్ ప్రకటించారని చెప్పారు. ఉత్తరాంధ్ర జేఏసీ పిలుపు మేరకు గర్జనకు వైఎస్సార్సీపీ మద్దతు పలుకుతోందన్నారు. విశాఖ డాబా గార్డెన్స్ అంబేడ్కర్ విగ్రహం నుంచి బీచ్ రోడ్డు వైఎస్సార్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. దీనికి మద్దతుగా ఉత్తరాంధ్రలోని అన్ని జిల్లాల్లో ర్యాలీలు జరుగుతాయన్నారు. సోమవారం విశాఖ మద్దిలపాలెంలో పార్టీ విస్తృతస్థాయి సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రాంతీయ విద్వేషాలు సృష్టించాలని చంద్రబాబు, ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్ర ప్రజల ఓట్లతో గెలిచిన టీడీపీ నేత అచ్చెన్నాయుడు సొంత ప్రాంతం అభివృద్ధి చెందకుండా అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. ‘మీ వ్యాపారాలకు, నివాసానికి, పిల్లల చదువుల కోసం విశాఖ కావాలా? ఇక్కడి ప్రజల ఓట్లతో గెలిచి ఈ ప్రాంతం మాత్రం అభివృద్ధి చెందకూడదా?’ అని నిలదీశారు. ► టీడీపీ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. ఎన్నికల్లో పోటీ చేస్తే ఓడిపోతామనే భయం ఆ పార్టీ నాయకుల్లో కనబడుతోంది. ► 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు విశాఖలో చేసిన అభివృద్ధి శూన్యం. వెనకబడిన ప్రాంతమైన ఉత్తరాంధ్ర, విశాఖను అభివృద్ధి చేసింది దివంగత వైఎస్సార్ ఒక్కరే. విశాఖలో హెల్త్‌సిటీ, ఐటీ పార్క్, ఉత్తరాంధ్ర స్రుజల స్రవంతి, బీఆర్టీఎస్, విమ్స్, బీహెచ్ఈఎల్, ఫార్మా పరిశ్రమలను తెచ్చి ముందుచూపుతో నేటి యువతరానికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. -
పుట్టిన ప్రాంతానికే వెన్నుపోటు.. అచ్చెన్న తీరుపై జిల్లా ప్రజల ఆగ్రహం
సాక్షి, శ్రీకాకుళం: ‘గత ఎన్నికల్లో అమరావతి రాజధాని నినాదంతోనే టెక్కలిలో గెలిచా. ఉత్తరాంధ్ర ప్రజలు అమరావతికే మద్దతు పలకాలి. అమరావతి రైతుల పాదయాత్రకు ఘనస్వాగతం పలకాలి.’ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలివి. ఉత్తరాంధ్రలో పుట్టి. ఇక్కడే పెరిగి.. ఇక్కడి నుంచే ఎన్నిౖకైన అచ్చెన్నాయుడు విశాఖకు ఎగ్జిక్యూటివ్ రాజధాని వద్దంటే వద్దంటూ నినాదాలు చేస్తున్నారు. అమరావతికి మాత్రమే జై కొట్టాలని, రియల్ ఎస్టేట్ రైతులు చేస్తున్న పాదయాత్రకు ఘనస్వాగతం పలకాలని బహిరంగంగా చెబుతున్నారు. పుట్టి పెరిగిన ప్రాంతంపై విషం చిమ్ముతున్న అచ్చెన్న వైఖరిని జిల్లా ప్రజలు దునుమాడుతున్నారు. ఒక్క అచ్చెన్నాయుడే కాదు చంద్రబాబుతో అంట కాగే పెద్ద నాయకులంతా ఇదే స్వరం వినిపిస్తున్నారు. టీడీపీ ద్వితీయ శ్రేణి కేడర్‌లో మాత్రం అమరావతి అజెండాపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. అమరావతిలో రాజధాని వద్దని ఎవరూ అనడం లేదని, మన ప్రాంతానికొక రాజధాని ఇస్తామన్నప్పుడు అడ్డుకోవడమేమిటని అధిష్టానంపై గుర్రు మంటున్నారు. చదవండి: (టీడీపీలో వర్గ విభేదాలకు ఆజ్యం పోస్తున్న వాసు, బీటెక్ రవి) మరోవైపు పరిపాలన వికేంద్రీకరణను ప్రజలంతా ఆహ్వానిస్తున్నారు. మేధావులు స్వాగతిస్తున్నారు. రైతు, వ్యాపార, ఉద్యోగ, కార్మిక, ఇతరత్రా వర్గాలన్నీ మద్దతు పలుకుతున్నాయి. కానీ ప్రతిపక్షం టీడీపీ మాత్రం అమరావతే రాజధానిగా ఉండాలని కోరుకోవడమే కాదు గట్టిగా పట్టుబడుతోంది. వీరి స్వార్థాన్ని ప్రజలు మాత్రం గుర్తించారు. అమరావతిలో కొన్న భూముల విలువ పడిపోకుండా టీడీపీ నేతలు చేస్తున్న ప్రయత్నాలను తెలుసుకుని ఆగ్రహిస్తున్నారు. సిక్కోలులో ప్రస్తుతం ఎక్కడ చూసినా మూడు రాజధానుల చర్చే జరుగుతోంది. అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణపై మద్దతు పెరుగుతోంది. విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేయబోతున్నట్టు ప్రభుత్వం చేసిన ప్రకటనపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఉత్తరాంధ్రకు రాజధాని వస్తే వెనుకబడిన జిల్లాలైన విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం అభివృద్ధికి నోచుకుంటాయని స్థానికులు ఆశిస్తున్నారు. పొట్ట కూటి కోసం వలస పోయే పరిస్థితి తగ్గుతుందని భావిస్తున్నారు. అందుకనే అన్ని వర్గా లు మూడు రాజధానుల ప్రకటన, అభివృద్ధి వికేంద్రీకరణను స్వాగతిస్తున్నాయి. కానీ ప్రతిపక్ష టీడీపీ అగ్రనేతల చేష్టలు చూస్తుంటే వెనకబడిన జిల్లాలకు నష్టం చేసేలా ఉన్నారని, ఉత్తరాంధ్ర ద్రోహులుగా మిగిలిపోతారని జిల్లా ప్రజలంటున్నారు. ఉద్యమం తప్పదు ఉత్తరాంధ్రకు ద్రోహం చెయ్యాలని చూస్తే ఉద్యమం తప్పదు. అచ్చెన్నాయుడు అమరావతి రైతుల పాదయాత్రకు స్వాగతం పలకాలని చెప్పడం హేయం. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచన మేరకు వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరుగుతాయి. – జీవీ రెడ్డి మాస్టారు, మేధావుల ఫోరం అధ్యక్షుడు, టెక్కలి అచ్చెన్న వ్యాఖ్యలు అర్థరహితం అచ్చెన్నాయుడు వ్యాఖ్యలన్నీ స్వార్థపూరితమే. అమరావతి లో పెట్టుబడులు పెట్టిన టీడీ పీ నాయకులు వాటిని కాపాడుకోవడానికి కుటిల యత్నా లు చేస్తున్నారు. మూడు రాజధానులతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. విశాఖ రాజధానితో ఉత్తరాంధ్రకు ఎంతో మేలు జరుగుతుంది. కింజరాపు అచ్చెన్నాయుడు ఉత్తరాంధ్ర ద్రోహి. -యర్రగుంట్ల కృష్ణమోహన్, న్యాయవాది, మందస వాస్తవాలు తెలుసుకోవాలి అచ్చెన్నాయుడు జిల్లా అభివృద్ధి కోసం కాకుండా చంద్రబాబు అభివృద్ధి కోసం మాట్లాడుతున్నారు. మూడు రాజధానులలో అమరావతి ప్రాంతానికి కూడా ప్రాధాన్యం ఇస్తూ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అమరావతి అభివృద్ధికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదని చెప్పారు. అదే సమయంలో ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకుంది. ఇది తెలుసుకుని అచ్చెన్నాయుడు మాట్లాడితే మంచిది. – రెడ్డి శాంతి, ఎమ్మెల్యే, పాతపట్నం అధికార వికేంద్రీకరణతోనే ప్రగతి రాష్ట్రంలో అధికార వికేంద్రీకరణతోనే ప్రగతి సాధ్యం. భవిష్యత్‌లో ప్రత్యేక రాష్ట్ర నినాదాలు రాకుండా ఉండాలంటే అన్ని ప్రాంతాలు సమానంగా ప్రగతి సాధించాలి. మూడు రాజధానుల మోడల్ వికేంద్రీకరణ సిద్ధాంతం అమలు ప్రస్తుతం అత్యవసరం. – ప్రొఫెసర్ హనుమంతు లజపతిరాయ్, పూర్వ వైస్‌చాన్సలర్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం. -
మూడు రాజధానులు ఉండాల్సిందే
డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ): ‘రాష్ట్రం సొమ్మంతా తీసుకెళ్లి హైదరాబాద్‌ను అభివృద్ధి చేశారు. చివరకు కట్టుబట్టలతో పంపారు. సుపరిపాలన అందిస్తున్న సీఎం వైఎస్ జగన్ అన్ని జిల్లాలు అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో మూడు రాజధానులు ప్రకటిస్తే.. చంద్రబాబు మాత్రం తన స్వార్థ రాజకీయాల కోసం అమరావతే రాజధాని అంటూ ప్రాంతాల మధ్య చిచ్చు రేపుతున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలను అవమానిస్తున్నారు..’ అని వికేంద్రీకరణ పరిరక్షణ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు పాకా సత్యనారాయణ, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ డాక్టర్ ఎన్.ఎ.డి.పాల్ మండిపడ్డారు. విశాఖలో బుధవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. లేకపోతే ఉత్తరాంధ్ర జిల్లాలతో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కోవిడ్ సమయంలో ఏ ఒక్కరు ఆకలితో చనిపోకూడదని పేదలను ఆదుకుని దేశంలోనే ఉత్తమ సీఎంగా వైఎస్ జగన్ మంచి పేరు తెచ్చుకున్నారన్నారు. పరిపాలన వికేంద్రీకరణ పేరిట గ్రామ సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, గ్రామ ఆరోగ్యకేంద్రాలు, గ్రామరక్షణ వలయం పేరిట అనేక సంక్షేమాలు అమలు చేస్తున్నారని చెప్పారు. ప్రజలకు ఇంకా చేరువగా పరిపాలన సౌలభ్యం కోసం 13 జిల్లాలను 26 జిల్లాలు చేశారని, రాష్ట్రానికి కూడా మూడు రాజధానులు ఉంటే ప్రజలకు పరిపాలన చేరువవుతుందన్న అభిప్రాయంతో ముందడుగు వేస్తున్నారని పేర్కొన్నారు. ఈ సమయంలో 29 గ్రామాలకు చెందిన కొంతమంది మిడతల దండులా పాదయాత్ర పేరిట బయలుదేరారని ఎద్దేవా చేశారు. శాంతికి నిలయంగా ఉన్న ఉత్తరాంధ్ర జిల్లాల్లో దాడి చేయడానికి వస్తున్న ఈ దండును అడ్డుకోకపోతే సర్వం నాశనం చేస్తుందని చెప్పారు. ఆంధ్రా యూనివర్సిటీ, అంతర్జాతీయ విమానాశ్రయం, పోర్టు, డిఫెన్స్, షిప్‌యార్డ్, నేవల్ డాక్‌యార్డ్, ఎన్ఎస్టీఎల్, స్టీల్‌ప్లాంట్, రైల్వేస్టేషన్.. ఇలా జల, రోడ్డు, వాయుమార్గాలున్న విశాఖలో పరిపాలన రాజధాని పెడితే చంద్రబాబు అండ్ కోకు బాధ ఎందుకని ప్రశ్నించారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసి అధిక ఎమ్మెల్యే సీట్లు ఉత్తరాంధ్ర నుంచి పొంది, ఈ రోజున ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకుంటున్న చంద్రబాబు దుర్మార్గమైన చర్యను క్షమించరాదన్నారు. 29 గ్రామాల ప్రజలను రెచ్చగొట్టి ప్రశాంతగా ఉన్న ఉత్తరాంధ్రలో అశాంతిని సృష్టించడానికి చంద్రబాబు పూనుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నం పరిపాలన రాజధానిగా అన్ని వర్గాల ప్రజలు, మేధావులు, ప్రొఫెసర్లు కోరుకుంటే.. ఉత్తరాంధ్ర జిల్లాలోని తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎంపీ పాదయాత్రను స్వాగతించడం దారుణమని చెప్పారు. ఇక్కడి తెలుగుదేశం నాయకులు ఉత్తరాంధ్ర అభివృద్ధిని వద్దనుకుంటున్నారా? అని వారు ప్రశ్నించారు. ఈ సమావేశంలో సీనియర్ న్యాయవాది శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
శ్రీకాకుళం టు అమరావతి
సాక్షి, విశాఖపట్నం: పాలనా వికేంద్రీకరణతోనే రాష్ట్ర భవిష్యత్తు బంగారుమయమవుతుందని ఉత్తరాంధ్ర మేధావులు, విద్యార్థులు, ఉద్యోగులు ముక్తకంఠంతో చాటి చెప్పారు. ప్రాంతీయ విభేదాలకు సున్నితంగా తెరదించి మూడు రాజధానులకు మద్దతిస్తూ రాష్ట్రమంతా ఏకతాటిపై నిలిచేలా శాంతియుతంగా ఉద్యమాలను నిర్వహించే సమయం ఆసన్నమైందని అభిప్రాయపడ్డారు. ఉత్తరాంధ్ర వాసులు శ్రీకాకుళం నుంచి అమరావతి వరకూ పాదయాత్ర చేపట్టి కేవలం 29 గ్రామాలు ముఖ్యమా? లేక రాష్ట్రమంతటా అభివృద్ధి జరగడం ముఖ్యమా? అనే అంశంపై ప్రతి గడపలోనూ చర్చ జరిగేందుకు సమాయత్తమవ్వాలని పిలుపునిచ్చారు. దశాబ్దాలుగా వెనుకబాటుకు గురైన ఉత్తరాంధ్ర అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు. ఉత్తరాంధ్ర మేధావుల ఆధ్వర్యంలో ఆదివారం విశాఖలోని గాదిరాజు ప్యాలెస్‌లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. బీఆర్ అంబేడ్కర్ వర్సిటీ మాజీ ఉపకులపతి హనుమంతు లజపతిరాయ్ అధ్యక్షతన నిర్వహించిన సదస్సులో ఉపముఖ్యమంత్రులు పీడిక రాజన్నదొర, బూడి ముత్యాలనాయుడు, మంత్రులు బొత్ససత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్తో పాటు ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, డా.బీవీ సత్యవతి, గొడ్డేటి మాధవి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, వంశీకృష్ణ శ్రీనివాస్, దుంపల రవీంద్రబాబు, వివిధ కార్పొరేషన్ల చైర్పర్సన్లు, డైరెక్టర్లు, మేధావి వర్గాల ప్రతినిధులు, ఉద్యోగ, న్యాయవాద, వైద్య, అధ్యాపక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. తొలుత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్, అమరజీవి పొట్టి శ్రీరాములు, తెలుగుతల్లి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తొలి పంచవర్ష ప్రణాళికలోనే.. మద్రాస్ నుంచి విడిపోయిన సమయంలో తొలుత విశాఖనే రాజధానిగా ప్రతిపాదించారు. దీనికి 61 మంది ఎమ్మెల్యేలు మద్దతిచ్చారు. చివరి నిమిషంలో కర్నూలుకు మార్చారు. వికేంద్రీకరణ భావన ఇప్పటిది కాదు. 1951 మొదటి పంచవర్ష ప్రణాళికలో వికేంద్రీకరణ అంశాన్ని మూడో లక్ష్యంగా పేర్కొన్నారు. ఇప్పటికైనా మూడు రాజధానులను ఏర్పాటు చేయకుంటే భవిష్యత్తులో రాష్ట్రం మూడు ముక్కలయ్యే ప్రమాదం ఉందనే ఆందోళన అందరిలో ఉంది. ఒకేచోట రాజధాని ఉంటే ప్రకృతి విపత్తులు వస్తే మొత్తం నాశనమయ్యే ప్రమాదం ఉంది. ఉక్రెయిన్ రాజధాని విషయంలోనూ ఇటీవల అదే జరిగింది. – ప్రొ.హనుమంతు లజపతిరాయ్, మాజీ ఉపకులపతి 29 గ్రామాలా.. రాష్ట్రాభివృద్ధా? రాజధానిగా అమరావతి పనికిరాదని అన్ని కమిటీలు చెప్పాయి. 29 గ్రామాలు ముఖ్యమా? లేక రాష్ట్రం మొత్తం ముఖ్యమా? అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. 19 దేశాల్లో, 13 రాష్ట్రాల్లో రాజధాని వికేంద్రీకరణ జరిగింది. హైకోర్టు సీట్ ఒకచోట, బెంచ్ ఒక చోట ఉన్న రాష్ట్రాలు, దేశాలు చాలా ఉన్నాయి. ఎమ్మెల్యే క్వార్టర్లు కాకుండా మూడు చోట్లా ఎమ్మెల్యే హాస్టళ్లు నిర్మించాలి. – ప్రొ.బాలమోహన్‌దాస్, నాగార్జున యూనివర్సిటీ మాజీ వైస్ చాన్స్‌లర్ విశాఖ రెడీమేడ్ రాజధాని విశాఖ మహా నగరం అన్ని సదుపాయాలున్న రెడీమేడ్ క్యాపిటల్. అతి తక్కువ ఖర్చుతో రాజధానిని ఏర్పాటు చేయవచ్చు. దీన్ని ఎవరూ కాదనే ప్రసక్తే ఉండదు. టూరిజం, ఇండస్ట్రియల్, ఎడ్యుకేషన్ పరంగా ప్రధాన నగరం. ఇలాంటి నగరాన్ని విడిచిపెట్టి రాజధాని ఎక్కడో ఉండటం సరికాదు. మూడు రాజధానులే సబబు. ప్రభుత్వ నిర్ణయం పర్ఫెక్ట్. – జీఎస్ఎన్ రాజు, సెంచూరియన్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ 70 ఏళ్లుగా ఉత్తరాంధ్రపై నిర్లక్ష్యం అన్ని ప్రాంతాలు, మతాల వారికి విశాఖ భద్రమైన నగరం. ముఖ్యమంత్రి నిర్ణయానికి పూర్తి మద్దతు పలుకుతున్నాం. వైజాగ్‌లో హైకోర్ట్ బెంచ్ ఏర్పాటు చేయాలని గతంలో 200 రోజుల పాటు పోరాటం చేశాం. రాజధానితో పాటు బెంచ్ కూడా నెలకొల్పాలి. – కృష్ణమోహన్, బార్‌కౌన్సిల్ సభ్యుడు సులువుగా అభివృద్ధి రాష్ట్ర ప్రగతికి ఏది మంచిదో ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ దానికే మద్దతిస్తుంటుంది. వికేంద్రీకరణతో ఎన్నో ప్రయోజనాలుంటాయి. రాష్ట్రం మొత్తం ప్రగతి పథంలో పయనించేందుకు కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిందే. విశాఖ అన్నింటికంటే పెద్ద నగరం. దీన్ని అభివృద్ధి చేయడం చాలా తేలిక. ఒక రాజధానిని పునాదుల నుంచి అభివృద్ధి చేయాలంటే చాలా శ్రమతో కూడుకున్నది. హైదరాబాద్‌తో పోటీ పడాలంటే కచ్చితంగా విశాఖకే సాధ్యమవుతుంది. పరిశ్రమలు, ఐటీ సంస్థలు రావాలంటే విశాఖ కార్యనిర్వాహక రాజధాని కావాల్సిందే. దీనివల్ల వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలన్నీ ముందుకెళ్తాయి. – పైడా కృష్ణప్రసాద్, ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ రాష్ట్ర అధ్యక్షుడు సంక్షోభ రాష్ట్రంపై మరింత భారం అమరావతి నిర్మాణంతో ఇప్పటికే సంక్షోభంలో ఉన్న ఏపీకి ఎలాంటి ఉపయోగం ఉండదు. పుత్రజయని రాజధానిగా మలేషియా నిర్మించింది. అక్కడ ఇప్పటికీ ప్రజలు నివసించడం లేదు. అమరావతి కూడా అదే మాదిరిగా మారుతుంది. ఇలాంటి సదస్సులతో ప్రజలను చైతన్యం చేయాలి. శ్రీకాకుళం నుంచి అమరావతికి యాత్ర చేపట్టాలి. – శివశంకర్, ఉత్తరాంధ్ర రక్షణ వేదిక కన్వీనర్ ఉద్యమంలో ముందుంటాం.. విశాఖను రాజధానిగా ప్రతి ఒక్కరూ పరిగణించాలి. సీఎం నిర్ణయంతో మూడు ప్రాంతాలు అభివృద్ధికి నోచుకుంటాయి. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై గ్రామస్థాయి నుంచి అవగాహన కల్పించాలి. రాజధానిగా విశాఖకు సంబంధించిన ఏ ఉద్యమంలోనైనా మా ఉద్యోగుల సంఘం ముందు వరుసలో ఉంటుంది. – పోలాకి శ్రీనివాసరావు, ఏపీ ఎలక్ట్రికల్ బీసీ ఎంప్లాయీస్ రాష్ట్ర అధ్యక్షుడు భావితరాలు క్షమించవు.. విశాఖను రెండో ముంబైగా పోలుస్తూ హైదరాబాద్ తర్వాత అభివృద్ధి చెందే కీలక ప్రాంతమని దివంగత ప్రధాని రాజీవ్‌గాంధీ గతంలోనే చెప్పారు. అలాంటి నగరాన్ని వదిలేసి ఎక్కడో రాజధాని ఏర్పాటు తప్పిదమే. ఇప్పటికే హైదరాబాద్‌లో అన్నీ అభివృద్ధి చేసి ఒక తప్పు చేశాం. మరోసారి పునరావృతం చేస్తే భావితరాలు క్షమించవు. – షంషుద్దీన్, ముస్లిం సంఘాల ప్రతినిధి అందరి నగరం విశాఖ అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేలా ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. గత ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకొని ఉంటే విభజన తర్వాత ఇన్ని ఇబ్బందులు ఎదురయ్యేవి కాదు. దేశంలో అన్ని ప్రాంతాలకు చెందిన వారు విశాఖలో నివసిస్తున్నారు. – పల్లవి, ఏయూ చీఫ్ వార్డెన్, స్పోర్ట్స్ డైరెక్టర్ పాదయాత్ర ఎవరి కోసం.? అమరావతి రైతుల పాదయాత్ర ఎవరి కోసం? లోకేష్‌ను సీఎం చేయాలనే దుర్భుద్ధితో చంద్రబాబు ఈ పాదయాత్ర చేయిస్తున్నారు. మూడు రాజధానులు ఏర్పడితే రాష్ట్రం సమగ్రాభివృద్ధి చెందుతుంది. – పాకా సత్యనారాయణ, న్యాయవాది విద్వేషాలను రెచ్చగొడుతున్నారు.. అమరావతి రాజధానిని వ్యతిరేకిస్తూ 729 రోజులుగా మందడంలో నిరసన కార్యక్రమా లు చేస్తున్నాం. చంద్రబాబుకు పేదల అభివృద్ధి ఇష్టం లేదు. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని అడ్డుకుని కోర్టులో పిల్‌వేశారు. దుర్భుద్ధితో పాదయాత్రలు నిర్వహిస్తూ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. –పెరికె వరప్రసాద్, దళిత జేఏసీ నాయకుడు బాబు బినామీల యాత్ర అది చంద్రబాబు బినామీల యాత్ర. విశాఖ పరిపాలన రాజధానిగా మారితే ఉత్తరాంధ్రలో వలసలు ఆగిపోతాయి. గతంలో చంద్రబాబును విశాఖ ఎయిర్‌పోర్టు నుంచే వెనక్కి పంపించాం. పాదయాత్రను కూడా అదేమాదిరిగా తిప్పికొట్టాలి. – కాంతారావు, ఏయూ విద్యార్థి జేఏసీ నాయకుడు నాడు.. దొంగ లెక్కలతో రాజధానిని నిర్ణయించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉందని రాజ్యాంగంలో అంబేడ్కర్ స్పష్టం చేశారు. 2014–15లో రాజధానిపై ప్రజాభిప్రాయ సేకరణ చేపడితే 42 శాతం మంది విశాఖకు మద్దతిచ్చారు. 22 శాతం మంది విజయవాడ, 25 శాతం గుంటూరుకు మద్దతిచ్చారు. మిగిలిన వారు ఇతర ప్రాంతాల్ని ఎంపిక చేశారు. నాడు విశాఖను రాజధానిగా ఎందుకు ఎంపిక చేయలేదని చంద్రబాబు, నారాయణను నిలదీస్తే గుంటూరు, విజయవాడ కలిపి 47 శాతం అయిందంటూ దొంగ లెక్కలు చెప్పారు. అమరావతిని అభివృద్ధి చేయాలంటే రూ.లక్ష కోట్లు అవసరం. అంత డబ్బుతో 200 మెడికల్ కాలేజీలు, 200 స్టీల్ ప్లాంట్లు వస్తాయి. సీఎం జగన్ నిర్ణయానికి అంతా మద్దతు పలకాలి. – వాసుపల్లి గణేష్‌కుమార్, విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే క్షుద్రశక్తులు.. వెన్నుపోటు రాజకీయాలు రూ.3 లక్షల కోట్లు రెవెన్యూ వచ్చే విశాఖకు రాజధానిగా అన్ని హక్కులున్నాయి. కొన్ని క్షుద్రశక్తులు, ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు వికేంద్రీకరణను వ్యతిరేకిస్తూ వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్నారు. నెత్తిపై తన్నేవారిని చూస్తూ ఊరుకోలేం. ఉద్యమాల పురిటిగడ్డ ఉత్తరాంధ్రలో శాంతియుతంగా పోరాడతాం. – కరణం ధర్మశ్రీ, చోడవరం ఎమ్మెల్యే విస్తృతంగా చాటి చెప్పాలి.. వికేంద్రీకరణ ద్వారా ఉత్తరాంధ్రకు ఒనగూరే, ప్రయోజనం, మూడు రాజధానుల ఏర్పాటుతో రాష్ట్రవ్యాప్తంగా జరిగే అభివృద్ధిపై ప్రజలకు విస్తృతంగా తెలియచేయాలి. మేధావులు ఈ తరహా సదస్సులను నిర్వహించాలి. రాజకీయ అజెండాతో చేపట్టిన పాదయాత్ర లాంటి కార్యక్రమాలను విరమించుకోవాలని ఈ వేదిక ద్వారా పిలుపునిస్తున్నాం. ప్రాంతాల మధ్య చిచ్చు రగిల్చే చర్యలకు సున్నితంగా తెర దించాలని భావిస్తున్నాం. – గుడివాడ అమర్నాథ్, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి -
అది పాదయాత్ర కాదు.. ఉత్తరాంధ్రపై దండయాత్ర
గాజువాక: పరిపాలన రాజధానిని విశాఖలో ఏర్పాటు చేస్తేనే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని.. విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలంటూ విద్యార్థులు నినదించారు. పరిపాలన రాజధానికి మద్దతుగా స్టూడెంట్స్ జేఏసీ ఆధ్వర్యంలో గాజువాకలో బుధవారం ర్యాలీ, మానవహారం నిర్వహించారు. ఒక్క రాజధాని వద్దు.. మూడు రాజధానులు ముద్దు.. అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ కాంతారావు మాట్లాడుతూ అమరావతి రైతుల పేరుతో చేపట్టిన పాదయాత్ర పెట్టుబడిదారుల పాదయాత్ర అని, అది చంద్రబాబు బినామీల పాదయాత్ర అని.. అది ఉత్తరాంధ్రపై దండయాత్రగా చెప్పారు. చంద్రబాబు బినామీలు, ఆయన సామాజికవర్గానికి చెందినవారు అమరావతిలో భూములు కొనుగోలు చేశారని, వారి అభివృద్ధి కోసం ఆయన రాష్ట్ర సమగ్రాభివృద్ధిని అడ్డుకొంటున్నారని ఆరోపించారు. ఉత్తరాంధ్రలో బీసీ, ఎస్సీ, ఎస్టీల అభివృద్ధిని ఓర్వలేక ఈ ప్రాంత ప్రజలపై చంద్రబాబు దండయాత్ర చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతి రైతుల పాదయాత్రను విశాఖలోకి రానిచ్చేదిలేదని, పాయకరావుపేట దగ్గర అడ్డుకుని తీరతామని హెచ్చరించారు. అన్ని రాజకీయ పార్టీలు, ఇక్కడి నేతలు పరిపాలన రాజధానిగా విశాఖకు మద్దతు ప్రకటించాలని, లేకుంటే ఆయా నేతల ఇళ్ల వద్ద, పార్టీ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపడతామని కాంతారావు స్పష్టం చేశారు. గీతం విద్యా సంస్థల అధిపతి భరత్ అమరావతికి మద్దతు ప్రకటించడాన్ని ఖండిస్తున్నామని, గీతం ద్వారా ఉత్తరాంధ్రలో కోట్లాది రూపాయలు సంపాదించుకుని, ఈ ప్రాంత ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా మాట్లాడటం హేయమైన చర్యని చెప్పారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు నవీన్‌దాస్, సోమశేఖర్, బాలాజీ, ఉదయ్, జాని, చందు, రాఘవ, వివేక్, జగదీష్, సన్ని తదితరులు పాల్గొన్నారు. -
వికేంద్రీకరణతోనే ఉత్తరాంధ్ర అభివృద్ధి
సీతమ్మధార(విశాఖ ఉత్తర): వికేంద్రీకరణతోనే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని.. విశాఖను వెంటనే పరిపాలన రాజధాని చేయాలని విద్యార్థులు నినదించారు. ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే.. తగిన బుద్ధి చెబుతామని రాజకీయ పార్టీలను హెచ్చరించారు. ఉత్తరాంధ్ర నాశనమవ్వాలని అరసవల్లి దేవుణ్ని కోరతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిపాలన రాజధాని విశాఖకు మద్దతుగా శనివారం నగరంలో స్టూడెంట్ జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్టూడెంట్ జేఏసీ నాయకులు బి.కాంతారావు, టి.సురేష్‌కుమార్ మాట్లాడుతూ.. విశాఖపట్నం పరిపాలన రాజధాని కావడం వల్ల ఉత్తరాంధ్రకు పరిశ్రమలు వస్తాయన్నారు. ప్రజలు వలసలు పోవాల్సిన దుస్థితి తప్పుతుందన్నారు. రాజధానికి కావాల్సిన అన్ని అర్హతలూ విశాఖకు ఉన్నాయని చెప్పారు. గతంలో హైదరాబాద్ కేంద్రంగా అభివృద్ధి చేయడం వల్లే రాష్ట్ర విభజనప్పుడు నష్టపోయామనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. మరోసారి ప్రాంతీయ ఉద్యమాలు రాకుండా సీఎం వైఎస్ జగన్ తీసుకున్న వికేంద్రీకరణ నిర్ణయానికి ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలని కోరారు. అమరావతి యాత్ర పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు యాత్ర చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర సమానాభివృద్ధిని చంద్రబాబు అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర ప్రజల ఓట్లతో గెలిచిన టీడీపీ ప్రజాప్రతినిధులు.. ఇక్కడి ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా నడుచుకుంటే ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు. ఉత్తరాంధ్రలోని అన్ని పార్టీలు పరిపాలన రాజధానికి మద్దతు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా టీడీపీ నాయకులు మారాలని లేకపోతే.. అమరావతి యాత్రను పాయకరావుపేట వద్ద అడ్డుకుంటామని హెచ్చరించారు. ర్యాలీలో విద్యార్థి నాయకులు భరత్, హరీష్, బాలాజీ, జాని, వెంకటేష్, ఉదయ్, చందు, రాఘవ, వివేక్, జగదీష్, సన్నీ తదితరులు పాల్గొన్నారు. -
పాదయాత్ర కాదు.. ఉత్తరాంధ్రపై చంద్రబాబు దాడి
సాలూరు: అమరావతి పరిరక్షణ పేరుతో చేపట్టిన యాత్ర పాదయాత్ర కాదని, ఉత్తరాంధ్ర అభివృద్ధిపై చంద్రబాబు చేస్తున్న దాడి.. అని ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర చెప్పారు. ఆయన శనివారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర వెనుకబాటుకు టీడీపీయే కారణమని, ఇప్పుడు విశాఖను పరిపాలన రాజధాని కాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని అన్నారు. అన్ని వసతులు ఉండి, ఆసియా ఖండంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నంను పరిపాలన రాజ ధానిగా చేయడాన్ని టీడీపీ వ్యతిరేకించడం దారుణమన్నారు. చంద్రబాబు వేసిన కమిటీ తప్ప మిగతా ఏ కమిటీలూ అమరావతిని రాజధానిగా చేయాలని సూచించలేదని చెప్పారు. అమరావతి పరిరక్షణ సమితికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం చంద్రబాబేనన్నారు. బాబు ఉత్తరాంధ్ర ద్రోహిగా చరిత్ర పుటల్లోకి ఎక్కుతారని పేర్కొన్నారు. భారతదేశానికి స్వాతంత్య్రం కోసం పోరాడిన పార్టీ టీడీపీ అని చంద్రబాబునాయుడు అనడం ఆయనకు వయసు పైబడిందని చెప్పటానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. అమరావతి ప్రాంతంలో ఉన్న 29 గ్రామాలు, అక్కడ స్థిర, చరాస్తులు దోచుకున్న వారి పరిరక్షణే బాబు ధ్యేయమన్నారు. అక్కడి ఆస్తులు అధిక ధర పలకాలని, మిగిలిన ప్రాంతాలు ఆర్థికంగా, రాజకీయంగా, ప్రాంతీయంగా అన్యాయమైనా పర్వాలేదనే దుష్టబుద్ధితో చంద్రబాబు, టీడీపీ నేతలు చేస్తున్న కుటిల రాజకీయ యత్నాలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. కోర్టు తీర్పును తాము గౌరవిస్తున్నామని చెప్పారు. పాదయాత్రలో ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా మాట్లాడినా, ఏమైనా ఘటనలు జరిగినా.. దానికి ఈ డ్రామాను ఆడిస్తున్న చంద్రబాబే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా మూడు రాజధా నులు ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారని తెలి పారు. మూడు రాజధానుల తోనే సమన్యాయం, సమధర్మం, అభివృద్ధి సాధ్యమవుతుందని పునరు ద్ఘాటించారు. టీడీపీ కుటిల రాజకీయాన్ని ఉత్తరాంధ్ర ప్రజలు, మేధావులు, యువత అర్థం చేసుకోవాలని కోరారు. -
ఇద్దరు యువకుల కల ‘కర్ణపిశాచి’.. నటీనటులంతా వైజాగ్ వాసులే
మద్దిలపాలెం (విశాఖ తూర్పు): ఇద్దరు యువకులు కన్న కల...‘కళ’ర్‌ఫుల్‌గా తెరపైకి తెచ్చారు. వెండితెరపై సత్తా చాటుకోవాలని తహతహలాడుతున్నారు. టైటిల్‌తోనే ఆసక్తి రేపుతూ సినిమాపై మంచి అంచనాలు పెంచేశారు. త్వరలో ఓటీటీ ప్లాట్‌ఫారంపై విడుదల కానున్న కర్ణపిశాచి కేరాఫ్ ఐటీ ఆఫీస్ సినిమా గురించి...ఆ యువకుల గురించి తెలుసుకుందాం. ప్రణవి విశాఖ అమ్మాయి. ఇంజినీరింగ్ పూర్తి చేసింది. సినిమాలంటే పిచ్చి. ఇప్పటికే ఎన్నో షార్ట్ఫిల్్మలు చేసి మెప్పించింది. సీన్ చెప్పగానే లీనమైపోవడం ఈమె ప్రత్యేకత. మంచి హావభావాలు, నాట్యం ఈమెకు ప్లస్ పాయింట్... కర్ణపిశాచిలో మెయిన్ లీడ్ పోషిస్తోంది. తెరపై ప్రణవి భయపెట్టడం ఖాయం. నిఖిల్ శ్రీకాకుళం కుర్రోడు... ఏయూలో లా చదువుతున్నాడు. మంచి టైమింగ్ ఉన్న మిమిక్రీ ఆరి్టస్ట్. సినిమాలో విలన్‌గా నటిస్తున్నాడు. ఒక అద్భుతమైన శక్తిని ఒక మంచివాడు ఎలా ఉపయోగిస్తాడు..చెడ్డవాడు ఎలా దుర్వినియోగం చేస్తాడో చెప్పే ఈ చిత్రంలో హీరోకి దీటుగా అదరగొట్టాడు. భరత్ కుమార్ సిగిరెడ్డి ఈ యువకుడు సాఫ్ట్వేర్ ఇంజినీర్. సౌతాఫ్రికాలో ఉద్యోగం...కోవిడ్ కారణంగా సొంతూరు అనకాపల్లి వచ్చేశాడు. వర్క్ ఫ్రం హోం. సొంతూరు..చిన్ననాటి కలలు నెరవేర్చుకోవడానికి మంచి అవకాశం దొరికింది. భరత్‌కుమార్ చిన్నప్పటి నుంచి కథలు రాయడం ఇష్టం..ఆ రాసే కథలో తనను తాను ఊహించుకునేవాడు..అలా పలు షార్ట్ఫిల్మ్లకు కథలు రాయడం..అవకాశం ఉన్నప్పుడల్లా నటించడం చేసేవాడు. ఉద్యోగరీత్యా సౌతాఫ్రికా వెళ్లిపోవడంతో తాత్కాలికంగా తన కళకు బ్రేక్ పడింది. మళ్లీ ఇప్పుడు ఏకంగా హీరోగా...నిర్మాతగా మారి కర్ణపిశాచి అనే చిత్రానికి నాంది పలికాడు. ప్రస్తుతం సినిమా సెన్సార్‌కు వెళ్లింది. త్వరలోనే ఓటీటీ వేదికగా విడుదల కానుంది. చదవండి: ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్న షారుక్ ఖాన్ కుమారుడు నమావతి పేరే వెరైటీ. ఆమె నటన మరింత మెప్పిస్తుందని చిత్ర యూనిట్ చెబుతోంది. అందం..అభినయం కలగలిపిన వర్ధమాన నటి నమావతి. కర్ణపిశాచిలో మూడో హీరోయిన్గా నటిస్తోంది. అందివచ్చిన అవకాశాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకున్నానని, తెరపై తన నటన చూసి విజల్స్ గ్యారంటీ అని చెబుతోంది. విజయ్ మల్లాది షార్ట్ ఫిల్మ్‌లతో కెరీర్ మొదలు పెట్టాడు. సిరివెన్నెల సీతారామశాస్త్రికి బంధువు. విశాఖ వేదికగా చాలా షార్ట్ ఫిల్మ్స్ తీసి గుర్తింపు పొందాడు. మంచి ప్రతిభ ఉన్న కుర్రోడు. విజయ్ టాలెంట్‌ను గుర్తించి భరత్ కుమార్ రాసుకున్న కర్ణపిశాచిని అతని చేతిలో పెట్టాడు. సినిమాలో నటించిన వారంతా విశాఖ కళాకారులే. సినిమా మొత్తం మన ఉత్తరాంధ్రలోనే షూటింగ్ జరుపుకుంది. స్క్రీన్ ప్లే, దర్శకత్వ ప్రతిభతో చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు. -
ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ ప్రాంతాల్లో వర్షాలకు అవకాశం
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: ఉత్తర బంగాళాఖాతంలో శనివారం అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. ఈ అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ వచ్చే 12 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా, తర్వాత 24 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. దీని ప్రభావంతో ఆదివారం ఉత్తర కోస్తాంధ్రలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శనివారం రాత్రి విడుదల చేసిన నివేదికలో తెలిపింది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురవవచ్చని పేర్కొంది. మరోవైపు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ మీదుగా పశ్చిమ గాలులు వీస్తున్నాయి. వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో తీరం వెంబడి గంటకు 45–55 కి.మీ., గరిష్టంగా 65 కి.మీ., వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. సముద్రం అలజడిగా ఉంటుందని, ఆది, సోమవారాల్లో మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లవద్దని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం సూచించింది. -
Miss Uttarandhra 2022: మిస్ ఉత్తరాంధ్ర నిధి చౌదరి
బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): మిస్ అండ్ మిసెస్ ఉత్తరాంధ్ర–2022 గ్రాండ్ ఫైనల్స్ ఆదివారం ఘనంగా జరిగాయి. న్యూ హోప్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు నాగమల్లేశ్వరి ఆధ్వర్యంలో నగరంలోని ఒక హోటల్లో నిర్వహించిన ఈ వేడుకల్లో యువతలు, మహిళలు తమ ప్రతిభాపాటవాలను ప్రదర్శించారు. సంప్రదాయ వస్త్రాలు ధరించి, క్యాట్ వాక్ చేస్తూ అదరహో అనిపించారు. ఫైనల్స్‌లో 20 మంది పాల్గొనగా మిస్ ఉత్తరాంధ్రగా నిధి చౌదరి, మిసెస్ ఉత్తరాంధ్రగా భాగ్యలక్ష్మి నిలిచారు. విజేతలకు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ తోట నగేష్ బహుమతులు అందజేశారు. -
ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి పరిపాలనా అనుమతి
సాక్షి, అమరావతి: ఉత్తరాంధ్రను గోదావరి జలాలతో అభిషేకించి సుభిక్షం చేసేందుకు ప్రభుత్వం నడుంబిగించింది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాన్ని పూర్తి స్థాయిలో చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకు రూ.17,050.20 కోట్లతో పరిపాలన అనుమతి ఇస్తూ జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో తొలిదశ పనుల అంచనా వ్యయం రూ.2,022.20 కోట్లు కాగా రెండో దశ పనుల అంచనా వ్యయం రూ.15,028 కోట్లు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, విశాఖ జిల్లాల్లో ఎనిమిది లక్షల ఎకరాలకు సాగునీరు, 30 లక్షల మందికి తాగునీరు, పారిశ్రామిక అవసరాలను తీర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టింది. ప్రాజెక్టు కోసం 63.20 టీఎంసీల గోదావరి నికర జలాలను కేటాయించడం గమనార్హం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం తొలి, రెండో దశలో 63.99 కి.మీ. పొడవున ప్రధాన కాలువ, 3.98 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా డిస్ట్రిబ్యూటరీల పనులను ప్రభుత్వం ఇప్పటికే చేపట్టింది. ప్రధాన కాలువలో మిగిలిన పనులతోపాటు భూదేవి రిజర్వాయర్ (6.55 టీఎంసీలు), వీరనారాయణపురం రిజర్వాయర్ (6.2 టీఎంసీలు), తాటిపూడి రిజర్వాయర్ (3.8 టీంసీలు) నిర్మాణం, సబ్ లిఫ్ట్‌ల పనులను చేపట్టాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జలవనరుల శాఖను ఆదేశించారు. ఆ పనులకు టెండర్లు పిలిచేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. వేగంగా పూర్తి చేసేలా అత్యంత ప్రాధాన్యత ప్రాజెక్టుగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని ప్రభుత్వం చేపట్టింది. ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధికి ఈ ప్రాజెక్టు దిక్సూచిలా నిలుస్తుందని సాగునీటి నిపుణులు పేర్కొంటున్నారు. ఇదీ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి... ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను తరలించాలనే ముందుచూపుతో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పోలవరం నుంచి రోజుకు 17,561 క్యూసెక్కులు (1.51 టీఎంసీలు) తరలించేలా పోలవరం ఎడమ కాలువను చేపట్టారు. పోలవరం ఎడమ కాలువ కింద 4 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందిస్తూనే 162.409 కి.మీ. నుంచి రోజుకు ఎనిమిది వేల క్యూసెక్కులను తరలించేలా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకానికి 2009 జనవరి 2న వైఎస్సార్ శ్రీకారం చుట్టారు. అప్పట్లోనే టెండర్లు పిలిచినా ఆయన హఠాన్మరణంతో పనులకు గ్రహణం పట్టింది. ఆ తరువాత అధికారంలోకి వచి్చన పాలకులు చంద్రబాబుతో సహా ఎవరూ దీన్ని పట్టించుకోలేదు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టాక ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని ప్రాధాన్యతగా చేపట్టారు. డిస్టిబ్యూటరీల పనులు ప్రారంభం ♦పోలవరం ఎడమ కాలువ 162.409 కి.మీ. నుంచి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి తొలి దశలో భాగంగా 3.15 కి.మీ. పొడవున గ్రావిటీ కెనాల్, 13.5 కి.మీ. పొడవున లీడింగ్ కెనాల్తోపాటు జామద్దులపాలెం, తీడ వద్ద రెండు లిఫ్ట్‌లు, 3.15 టీఎంసీల సామర్థ్యంతో పెదపూడి రిజర్వాయర్ నిర్మాణం, 1.30 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా డిస్టిబ్యూటరీల ఏర్పాటు పనులను ప్రారంభించారు. ♦రెండో దశలో 20.05 కి.మీ. పొడవున గ్రావిటీ కెనాల్, పాపయ్యపాలెం లిఫ్ట్‌తోపాటు 63.995 కి.మీ. పొడవున ప్రధాన కాలువ, 2.68 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా డిస్ట్రిబ్యూటరీల పనులను ఇప్పటికే ప్రారంభించారు. మిగిలిన పనులు వేగవంతం.. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి రెండో దశలో మిగిలిన పనులు అంటే.. ప్రధాన కాలువలో మిగిలిన 37.585 కి.మీ. పొడవున తవ్వకం, ప్రధాన కాలువకు అనుబంధంగా 6.20 కి.మీ. వద్ద భూదేవి(అనకాపల్లి జిల్లా), 50 కి.మీ. వద్ద వీరనారాయణపురం(విజయనగరం జిల్లా), 69.10 కి.మీ. వద్ద తాటిపూడి(విజయనగరం జిల్లా) రిజర్వాయర్ల నిర్మాణం– వాటికి అనుబంధంగా ఎత్తిపోతలు, కొండగండేరు లిఫ్ట్, బూర్జువలస లిఫ్ట్, జి.మర్రివలస లిఫ్ట్, 4.02 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా డిస్ట్రిబ్యూటరీల పనులకు టెండర్లు పిలిచేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఒక వైపు భూసేకరణ చేస్తూనే మరోవైపు పనులు చేపట్టడం ద్వారా వేగంగా ప్రాజెక్టును పూర్తి చేసి ఉత్తరాంధ్రను సస్యశ్యామలం చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. -
SPL 2022: ఆద్యంతం ఉత్కంఠభరితం..
విజయవాడ స్పోర్ట్స్: సాక్షి ప్రీమియర్ లీగ్(ఎస్పీఎల్) క్రికెట్ రాష్ట్ర స్థాయి పోటీలు స్థానిక కేఎల్ యూనివర్సిటీలో మంగళవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఉత్తరాంధ్ర, మధ్య ఆంధ్ర, రాయలసీమ సీనియర్, జూనియర్ పురుషుల జట్లు ఈ చాంపియన్‌షిప్ కు ప్రాతినిధ్యం వహించాయి. రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో ఆరు జట్లు ఈ టోర్నీలో హోరాహోరీగా తలపడ్డాయి. సీనియర్స్ విభాగంలో మధ్య ఆంధ్రకు ప్రాతినిధ్యం వహించిన నెల్లూరు జట్టు రెండు ప్రత్యర్థి జట్ల చేతిలో ఓడి వెనుకంజ వేయగా, జూనియర్స్ విభాగంలో మధ్య ఆంధ్ర, ఉత్తరాంధ్ర జట్లు చెరో రెండేసి పాయింట్లతో ముందంజలో ఉన్నాయి. ఈ మ్యాచ్‌లను సాక్షి విజయవాడ బ్రాంచ్ మేనేజర్ కేఎస్ అప్పన్న పర్యవేక్షించారు. సీఆర్ రెడ్డి పాలిటెక్నిక్ కాలేజీ విజయకేతనం జూనియర్స్ విభాగం తొలి మ్యాచ్‌లో ఉత్తరాంధ్ర(సాయిగణపతి పాలి టెక్నిక్ కాలేజీ, విశాఖపట్నం) జట్టుపై, మధ్య ఆంధ్ర(సీఆర్ రెడ్డి పాలి టెక్నిక్ కాలేజీ, ఏలూరు) జట్టు ఆరు వికెట్ల తేడాతో గెలిచి రెండు పాయింట్లను సాధించింది. టాస్ గెలిచిన మధ్య ఆంధ్ర జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన ఉత్తరాంధ్ర జట్టు నిర్ణీత 10 ఓవర్లకు ఎనిమిది వికెట్లు నష్టపోయి 58 పరుగులు మాత్రమే చేసింది. బ్యాట్స్మెన్లు మధుసూదన్ 12, అవినాష్ 11 పరుగులతో రాణించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన మధ్య ఆంధ్ర జట్టు 8.4 ఓవర్లలోనే నాలుగు వికెట్లు నష్టపోయి 60 పరుగులు చేసి విజయం సాధించింది. బ్యాట్స్మెన్లు సంజయ్ 19 రన్స్ చేయగా సాయిచరణ్, సాయిశశికుమార్ చెరో 15 రన్స్ చేసి జట్టు విజయానికి దోహదపడ్డారు. 19 రన్స్ చేసి, ఒక వికెట్ తీసిన సంజయ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఐదు వికెట్ల తేడాతో ఎంజీవీఆర్ కాలేజీ గెలుపు సీనియర్స్ విభాగం తొలి మ్యాచ్‌లో ఉత్తరాంధ్ర(ఎంజీవీఆర్ కాలేజీ, విజయనగరం), మధ్య ఆంధ్ర(నారాయ ణ ఇంజినీరింగ్ కాలేజీ, నెల్లూ రు) జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన ఉత్తరాంధ్ర జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన మధ్య ఆంధ్ర జట్టు నిర్ణీత 10 ఓవర్లకు ఏడు వికెట్లు నష్టపోయి 57 పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్లు తవ్సీఫ్, వెంకటేశ్‌లు తొలి నాలుగు ఓవర్లు నిలకడగా ఆడి 28 పరుగులు చేశారు. అయితే ఆ తరువాత ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోవడంతో మధ్య ఆంధ్ర జట్టు తక్కువ స్కోర్‌ను సాధించింది. ఉత్తరాంధ్ర బౌలర్లు రవికిరణ్, సంతోష్ చెరో రెండు కీలకమైన వికెట్లు తీసి ప్రత్యర్థి బ్యాట్స్మెన్లను కట్టడి చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఉత్తరాంధ్ర జట్టు కేవలం 7.1 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసి సునాయాసంగా విజయం సాధించింది. ఓపెనర్లు రవికిరణ్ 18, సాయిప్రణీత్ 10 పరుగులతో రాణించి జట్టు విజయానికి దోహదపడ్డారు. రెండు వికెట్లు తీసి, 18 రన్స్ చేసిన ఉత్తరాంధ్ర బ్యాట్స్‌మెన్ రవికిరణ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించిన ఉత్తరాంధ్ర జట్టు రెండు పాయింట్లను తన ఖాతాలో వేసుకుంది. తిరుపతి సీకామ్ డిగ్రీ కాలేజీ విజయదుందుభి సీనియర్స్ విభాగంలోనే మరో మ్యాచ్‌లో మధ్య ఆంధ్ర(నారాయణ ఇంజినీరింగ్ కాలేజీ, నెల్లూరు) జట్టును ఓడించిన రాయలసీమ(సీకామ్ డిగ్రీ కాలేజీ, తిరుపతి) జట్టు రెండు పాయింట్లను సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాయలసీమ జట్టు నిర్ణీత 10 ఓవర్లకు ఏడు వికెట్లు నష్టపోయి 98 పరుగులు సాధించింది. బ్యాట్స్మెన్లు అఖిబ్ 20, ఫయాజ్‌అలీ 17, మనోజ్ 13, డి.సాయి12 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన మధ్య ఆంధ్ర జట్టు నిర్ణీత 10 ఓవర్లకు రెండు వికెట్లు నష్టపోయి 63 పరుగులు మాత్రమే చేసింది. 13 రన్స్, ఒక వికెట్ తీసిన రాయలసీమ జట్టు ఆల్‌రౌండర్ మనోజ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. సాయి గణపతి పాలిటెక్నిక్ కాలేజీ విజయం జూనియర్స్ విభాగంలోనే రెండో మ్యాచ్‌లో రాయలసీమ(ఎస్ఎస్బీఎన్ జూనియర్ కాలేజీ, అనంతపురం), ఉత్తరాంధ్ర(సాయి గణపతి పాలిటెక్నిక్ కాలేజీ, విశాఖపట్నం) జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాయలసీమ జట్టు నిర్ణీత 10 ఓవర్లకు ఆరు వికెట్లు నష్టపోయి 70 పరుగులు చేసింది. బ్యాట్స్మెన్లు విఘ్నేష్ 26, ప్రశాంత్ 20 పరుగులతో రాణించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఉత్తరాంధ్ర జట్టు 9.3వ ఓవర్ వద్ద ఐదు వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసి విజయం సాధించింది. బ్యాట్స్మెన్లు నూకేష్ 22, అవినాష్ 19 పరుగులతో రాణించారు. ఆరు పరుగులు, రెండు వికెట్లు తీసిన బి.కుమార్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించిన ఉత్తరాంధ్ర జట్టు రెండు పాయింట్లను తన ఖాతాలో వేసుకుంది. నేడు విజేతలకు ట్రోఫీల ప్రదానం సీనియర్స్ విభాగంలో ఉత్తరాంధ్ర, రాయలసీమ జట్లు బుధవారం తలపడతాయి. జూనియర్స్ విభాగంలో మధ్య ఆంధ్ర, రాయలసీమ జట్లు తలపడతాయి. పోటీల అనంతరం సాయంత్రం జరిగే బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పాల్గొని విజేతలకు ట్రోఫీలు అందజేస్తారు. చదవండి: IPL 2022: సెంచరీ మిస్.. అయితేనేం జట్టును గెలిపించాడు! జోష్‌లో బెంగళూరు! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } });