సాక్షి, విశాఖపట్నం: ఏపీలో కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు.. పశ్చిమ మధ్య బంగాళాఖాతం-వాయువ్య బంగాళాఖాతం సమీపంలో అల్ప పీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో ఉత్తరాంధ్రలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది
ఇక, అల్ప పీడనం ఉత్తర దిశగా కదులుతుండటంతో ఏపీలో ఉత్తరాంధ్రలోని కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే, కోస్తాంధ్ర అంతట విస్తారంగా వర్షాలు పడనున్నాయి. ఈ నేపథ్యంలో పార్వతీపురం మన్యం, అల్లూరి, ఏలూరు జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ విధించారు. అల్ప పీడనం కారణంగా తీరం వెంబడి 30-40 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. రానున్న మూడు రోజుల పాటు ఉత్తర కోస్తా మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment