bay of bengal
-
వైజాగ్ -కాకినాడ ఛాలెంజ్ : 52 ఏళ్ల తెలుగు మహిళ సాహసం
ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా సామర్లకోటకు చెందిన 52 ఏళ్ల గోలి శ్యామల అరుదైన ఘనతను సాధించారు. విశాఖపట్నం (వైజాగ్) నుండి కాకినాడ వరకు బంగాళాఖాతంలో 150 కిలోమీటర్లు ఈది చరిత్రకెక్కారు. ఐదు రోజుల పాటు సాగిన శ్యామల సాహస యాత్ర సాగింది. డిసెంబర్ 28న ఆర్.కె. వైజాగ్‌లోని బీచ్ నుంచి మొదలై కాకినాడలోని ఎన్టీఆర్ బీచ్‌లో జనవరి 1న ముగిసింది. ఇలాంటి విజయాలను అలవోకంగా అందుకోవడం ఆమెకు కొత్తేమీ కాదు. వైజాగ్-కాకినాడ ఛాలెంజ్ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్న శ్యామలకు సముద్రాలను ఈదడం హాబీ. తాజాగా బంగాళాఖాతంలో విశాఖపట్నం నుంచి కాకినాడ వరకూ 150 కిలోమీటర్ల దూరాన్ని విజయవంతంగా ఈదారు. వారం రోజుల తరువాత సూర్యారావుపేట ఎన్టీఆర్ బీచ్‌కు చేరుకోవడంతో ఆమె సాహస యాత్ర ముగిసింది. ఆమె భద్రత, విజయాన్ని నిర్ధారించేందుకు ఒక డాక్టర్, ఫిజియోథెరపిస్ట్, ఫీడర్లు, స్కూబా డైవర్లు , కయాకర్లతో సహా 12 మంది సభ్యుల, రెండు పెద్ద పడవలు ఒక చిన్న నౌక ఆమె వెంట సాగాయి.52-Year-Old woman Goli Shyamala Swims 150 km from #Visakhapatnam to #Kakinada, Inspiring GenerationsGoli #Shyamala, a 52-year-old #WomanSwimmer from Samalkot in Kakinada district, #AndhraPradesh successfully completed an adventurous swim of 150 kilometers in the sea from… pic.twitter.com/DenfvFaHgr— Surya Reddy (@jsuryareddy) January 4, 2025 అంతకుముందు- తమిళనాడు- శ్రీలంక నార్త్ ప్రావిన్స్‌ను అనుసంధానించే పాల్క్ స్ట్రెయిట్‌ను 13 గంటల 43 నిమిషాల్లో అధిగమించి ఈ ఘనతను సాధించిన రెండో మహిళగా శ్యామలనిలిచారు. గతంలో రామసేతు సమీపంలో అలవోకగా ఈ సాహసాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. అమెరికాలోని కాటలినా ఐలండ్ నుంచి లాస్ ఏంజిలిస్ వరకు ఇలాంటి సాహసాన్ని పూర్తి చేశారు. కాటలినా ఐలండ్ నుంచి లాస్ ఏంజిలిస్ వరకు గల 36 కిలోమీటర్ల దూరాన్ని 12 డిగ్రీల టెంపరేచర్లో 19 గంటల్లో అధిగమించారు. లక్షద్వీప్‌లో కీల్టన్ ఐలండ్- కడ్మట్ ఐలండ్, హుగ్లీ, గంగ, భాగీరథీ నదుల్లో రికార్డు సమయాల్లో ఈది రికార్డు సృష్టించిన చరిత్ర శ్యామలది. శ్యామల సృజనాత్మక దర్శకురాలు, రచయిత కూడా. అయితే తన యానిమేషన్ స్టూడియో సక్సెస్‌కాకపోవడంతో ఆమె స్విమ్మింగ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. వేసవి ఈత శిబిరాల్లో పాల్గొనడం ద్వారా మరింత ఆసక్తి పెరిగింది. ఓపెన్ వాటర్ స్విమ్మింగ్ గురించి అవగాహన కల్పించడం, ప్రజలను ప్రోత్సహించడం ఆమె లక్ష్యంగా మారింది. ఓపెన్ వాటర్ స్విమ్మింగ్‌లో విజయాలుపాక్ స్ట్రెయిట్: 13 గంటల 43 నిమిషాల్లో 30 కిలోమీటర్లు ఈదుతూ, ఈ ఘనత సాధించిన రెండో మహిళగా నిలిచింది.కాటాలినా ఛానల్: కాటాలినా ద్వీపం నుండి లాస్ ఏంజిల్స్ వరకు 36 కిలోమీటర్లు 19 గంటల్లో గడ్డకట్టే 12°C ఉష్ణోగ్రతల మద్య స్విమ్మింగ్ చేశారు.లక్షద్వీప్ : లక్షద్వీప్ టూరిజంను ప్రోత్సహించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుతో స్ఫూర్తి పొంది కిల్టన్ ద్వీపం నుండి కద్మత్ ద్వీపానికి 18 గంటల్లో 48 కిలోమీటర్లు ఈదారు.ఆమె స్విమ్మింగ్ చేసిన నదులు•కృష్ణా నది: 1.5 కి.మీ•హూగ్లీ నది: 14 కిలోమీటర్లు•గంగా నది: 13 కి.మీ•భాగీరథి నది: 81 కి.మీ -
AP Rains: ఏపీలో మరో రెండ్రోజులు వర్షాలు
విశాఖపట్నం, సాక్షి: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బలహీన పడిన వాయుగుండం.. అల్ప పీడనంగా నైరుతి దిశగా పయనిస్తోంది. ఈ క్రమంలో.. ఏపీకి మరో రెండ్రోజులు వర్షాలు తప్పవని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.ఇప్పటికే వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతున్నాయి. గడచిన 24 గంటల్లో పల్నాడులో కుండపోత వాన పడింది. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మరో రెండు రోజులపాటు విస్తారంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెబుతోంది.రేపు, ఎల్లుండి నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో భారీ వర్షాలు పడనున్నాయి. కోస్తా తీరం వెంబడి కొనసాగనున్న తీవ్రమైన ఈదురు గాలులు కొనసాగుతాయి. మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని ఇప్పటికే సూచించింది వాతావరణ శాఖ.ఇదీ చదవండి: అకాల వర్షం నిండా ముంచేసింది -
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం
-
తీవ్ర అల్పపీడనం ఎఫెక్ట్..ఏపీలో మూడు రోజులు వర్షాలు..!
సాక్షి,విశాఖపట్నం: నైరుతి బంగాళఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. రానున్న 24 గంటల్లో ఇది వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర తమిళనాడు,దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు పయనించే అవకాశం ఉంది. తర్వాతి 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి ఉత్తరం దిశగా పయనించే ఛాన్సుంది.రానున్న మూడు రోజులు పాటు ఉత్తరకోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో భారీ నుంచి ఒకటి రెండు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి.రాబోయే మూడు రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విశాఖపట్నం వాతావరణ కేంద్రం హెచ్చరించింది. -
ఏపీలో ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు
విశాఖపట్నం, సాక్షి: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. కోస్తా, రాయలసీమలపై తీవ్ర ప్రభావం చూపెట్టనుంది. ఇప్పటికే సముద్ర వాతావరణం అలజడిగా మారగా.. విశాఖ తీరం వెంట తేలికపాటి వర్షం మొదలైంది. రేపటి నుంచి నగరం సహా కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.ఓవైపు చలి తీవ్రత.. మరోవైపు తేలికపాటి వర్షం విశాఖను వణికిస్తోంది. అల్పపీడన ప్రభావంతో రేపటి నుంచి నాలుగు రోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. తాజాగా.. తీరం వెంబడి 35 -45 కిమీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. అలాగే.. రాబోయే మూడు రోజుల్లో కోస్తా, రాయలసీమ భారీ వర్షాలు పడొచ్చని అంచనా వేస్తోంది. ఇప్పటికే.. దక్షిణ కోస్తా మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మరోవైపు వాతావరణశాఖ అంచనాలకు తగ్గట్లే నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షం మొదలైంది. నెల్లూరు, తిరుపతి, కాకినాడ, అనకాపల్లి, విశాఖ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. రేపు ఆయా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. అలాగే.. రేపు కృష్ణా, బాపట్ల, ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు పడొచ్చని చెబుతూ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. -
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
-
AP: స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం: దక్షిణ అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. రాబోయే 24 గంటల్లో ఇది బలపడి తీవ్ర అల్పపీడనంగా మారనుంది. అనంతరం దిశ మార్చుకుని పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణిస్తుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.18వ తేదీన ఉదయం తమిళనాడు రాష్ట్రంలో తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించారు. దీని ప్రభావంతో మంగళవారం దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని తెలిపారు. తీరం వెంబడి 30 నుంచి 35 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని.. దక్షిణ కోస్తా జిల్లాల్లోని మత్స్యకారులు ఈ నెల 18 వరకూ వేటకు వెళ్లవద్దని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. -
AP : అమ్మో .. మళ్లీ వానలా
సాక్షి,అమరావతి: రాష్ట్రంలో మరోసారి వర్షాలు కురవనున్నాయి. బంగాళాఖాతంలో మంగళవారం అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణశాఖ పేర్కొంది. ఇది రేపటికి తమిళనాడు - శ్రీలంక తీరాలకు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. వీటి ప్రభావం దక్షిణ కోస్తా, రాయలసీమపై రెండు రోజుల పాటు ప్రభావం చూపనుంది. దీని ప్రభావంతో బుధవారం నుంచి శుక్రవారం వరకు కోస్తా, రాయలసీమలో జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో వర్షాలు ఎక్కువగా కురుస్తాయని తెలిపింది.మంగళవారం అల్లూరి, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. బుధవారం ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కొన్నిచోట్ల,గురువారం తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు, నెల్లూరు, వైఎస్సార్, శ్రీసత్యసాయి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా -
AP: ‘ఫెంగల్’ ప్రభావం.. 1,500 కి.మీ.
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: ఎక్కడో నైరుతి బంగాళాఖాతంలో తమిళనాడుకు దగ్గరలో ఏర్పడింది... పుదుచ్చేరి దగ్గర తీరం దాటింది... కానీ దాని ప్రభావం మాత్రం దాదాపు 1,500 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఒడిశాపైనా చూపించింది. ఇదీ... ఫెంగల్ తుపాను విరుచుకుపడిన తీరు. తుపానుగా మారిన కొద్ది సేపటికే బలహీనపడటం.. మళ్లీ తుపానుగా మారడం.. ఇలా భిన్న రూపాలతో ఫెంగల్ ఇబ్బంది పెట్టింది. నవంబర్ 30వ తేదీ ఉదయం 8 గంటలకు నైరుతి బంగాళాఖాతం నుంచి చెన్నై వైపుగా కదిలింది. అనంతరం 11.30 గంటలకు చెన్నై తీరానికి సమీపంలోకి వచ్చి అక్కడే దాదాపు 10 గంటల వరకు స్థిరంగా ఉండిపోయింది.చెన్నై దగ్గర తీరం దాటుతుందని భావించగా.. తర్వాత నెమ్మదిగా వెనక్కి కదులుతూ నైరుతి బంగాళాఖాతం వైపు వెళ్లిపోయింది. సముద్రంలోనే బలహీనపడుతుందని వాతావరణ శాఖ అధికారులు, నిపుణులు అంచనా వేశారు. కానీ.. ఎవరూ ఊహించనట్లుగా మళ్లీ దక్షిణ తమిళనాడు వైపునకు ముందుకు నెమ్మదిగా దూసుకొచి్చంది. కానీ ఈ నెల ఒకటో తేదీన రూట్ మార్చి మరక్కానం, పుదుచ్చేరి వైపు కదిలింది. ఆ తర్వాత తీరం దాటింది. అయితే.. సాధారణంగా తుపానులు తీరం దాటిన తర్వాత వేగాన్ని పుంజుకోవడంతోపాటు బలహీనపడతాయి. కానీ, ఫెంగల్ మాత్రం తీరం దాటినా.. 6 గంటల వరకు తుపానుగానే కొనసాగి పుదుచ్చేరిలో విధ్వంసం సృష్టించింది. నైరుతి బంగాళాఖాతంలో తుపాను ఏర్పడితే దాని ప్రభావం తమిళనాడు, పుదుచ్చేరితోపాటు దక్షిణ కోస్తా జిల్లాలపైనే ఉంటుంది. ఫెంగల్ తుపాను మాత్రం ఒడిశాలోని గోపాల్పూర్ వరకు చూపించింది. ప్రస్తుతం వాయుగుండంగా బలహీనపడి అరేబియా సముద్రం వైపుగా కదులుతోందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు వెల్లడించారు. దీని ప్రభావం మంగళవారం సాయంత్రంతో తగ్గుముఖం పడుతుందని, అప్పటి వరకు దక్షిణ కోస్తాలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఉత్తరాంధ్రలో ఒకటి, రెండుచోట్ల మోస్తరు వానలు పడే సూచనలు ఉన్నాయని తెలిపారు. కసుమూరులో 7.9 సెంటీమీటర్ల వర్షం తుపాను ప్రభావంతో సోమవారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, బాపట్ల జిల్లాల్లో వర్షాలు కురిశాయి. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కసుమూరులో అత్యధికంగా 7.9 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఆత్మకూరు, నెల్లూరు రూరల్, మర్రిపాడు, అనంతసాగరం మండలాల్లోను పలుచోట్ల భారీ వర్షాలుపడ్డాయి. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె, రాజంపేట, బాపట్ల జిల్లా నిజాంపట్నం, తిరుపతి జిల్లా వాకాడు, పుత్తూరు మండలాల్లోనూ వర్షాలు కురిశాయి. శ్రీకాకుళం జిల్లాలోను అక్కడక్కడా చిరుజల్లులు కురిశాయి. పలు గ్రామాల్లో ధాన్యం రాశులు తడిచిపోయాయి. పొలాల్లో వరి పనలు నీట మునిగాయి. మరో రెండు రోజులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం ఫెంగల్ తుపాను ప్రభావం, సహాయక చర్యలపై సోమవారం సీఎం చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో అధికారులతో సమీక్షించారు. మరో రెండు రోజులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. మొత్తం 53 మండలాల్లో తుపాను ప్రభావం ఉందని అధికారులు తెలిపారు. ప్రాథమిక అంచనాల ప్రకారం 6,824 హెక్టార్ల మేర వ్యవసాయ పంటలు దెబ్బతిన్నాయని వివరించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించాలని, దీనికి అవసరమైన ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పారు. వర్షం కారణంగా తడిచిన ధాన్యం కొనుగోలు చేయాలని సూచించారు. పొంచి ఉన్న మరో ముప్పు.!తుపాను ప్రభావం ఇంకా కొనసాగుతున్న తరుణంలో మరో ముప్పు ముంచుకొస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో ఈ నెల రెండో వారంలో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది బలపడి వాయుగుండంగా మారుతుందనీ, అయితే తుపానుగా బలపడుతుందా.. లేదా.. అనే దానిపై ఈ వారాంతంలో అంచనా వేయగలమని చెబుతున్నారు. దీని ప్రభావం కూడా దక్షిణ కోస్తా జిల్లాలపై ఎక్కువగా ఉంటుందన్నారు. -
ఏపీలో పిడుగులతో వర్షాలు
అమరావతి, సాక్షి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. వాయుగుండంగా మారి.. పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోంది. మరో 24 గంటల్లో తీవ్ర వాయుగుండగా మారే అవకాశం కనిపిస్తోంది. ఈ ప్రభావంతో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని ఐఎండీ హెచ్చరిస్తోంది.రేపటి నుంచి ఏపీపై వాయుగుండం ప్రభావం కనిపించనుంది. రాష్ట్రంలో మూడు రోజులపాటు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తాలో రేపు, ఎల్లుండి తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. ఈ నెల 28, 29న నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో వర్షాలు పడనున్నాయి.తీరప్రాంతాల్లో 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని.. దక్షిణ కోస్తాలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు.. కోస్తాంధ్రలో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కోస్తాంధ్ర రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచించారు. -
AP: బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: దక్షిణ అండమాన్ సముద్రం–ఆగ్నేయ బంగాళాఖాతంపై విస్తరించిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ–వాయవ్య దిశగా పయనిస్తూ దక్షిణ బంగాళాఖాతంలో 25న వాయుగుండంగా బలపడే సూచనలున్నాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. అనంతరం వాయవ్య దిశగా కదులుతూ తదుపరి రెండు రోజుల్లో తమిళనాడు–శ్రీలంక తీరాల వైపు వెళ్లి.. తీరం దాటనుందని వెల్లడించారు. దీని ప్రభావంతో నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో 27 నుంచి మూడురోజుల పాటు అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుతం తీరం వెంబడి గంటకు 35 నుంచి 50 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయనీ.. వాయుగుండంగా బలపడిన తర్వాత గాలుల ఉద్ధృతి పెరగనుందన్నారు. 26వ తేదీ నుంచి దక్షిణ కోస్తా తీరం వెంబడి గరిష్టంగా 65 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని 29వ తేదీ వరకూ మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. -
తీరం దాటిన వాయుగుండం.. సముద్రం అల్లకల్లోలం
AP Rains Updates..👉బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం గురువారం తెల్లవారుజామున తీరం దాటింది. నెల్లూరు జిల్లాలోని తడా వద్ద వాయుగుండం తీరం దాటినట్టు వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం అల్పపీడనంగా వాయుగుండం బలహీనపడనుంది. కోనసీమ: ఓడలరేవు వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది.సముద్రపు అలలు ఓఎన్జీసీ టెర్మినల్ గేటును తాకాయి.ఓఎన్జీసీ సిబ్బంది అప్రమత్తమయ్యారు.విశాఖ:విశాఖలో ముందుకొచ్చిన సముద్రంసముద్రపు అలలు ఎగసిపడుతున్నాయి.విశాఖ, గంగవరం పోర్టుల్లో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ.నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో మూడో ప్రమాద హెచ్చరిక 👉తిరుపతిలో భారీ వర్షాలు..వర్షాల నేపథ్యంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు, జూనియర్ కళాశాలలకు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవుభారీ వర్షాలతో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన కలెక్టర్ వేంకటేశ్వ ర్భారీ వర్షాలు కారణంగా ఈరోజు శ్రీవారి మెట్టు మార్గం మూసివేసిన టీటీడీ 👉గడిచిన ఆరు గంటల్లో 22 కిలోమీటర్ల వేగంతో వాయుగుండం తీరం దాటింది. వాయుగుండం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజుల పాటు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక, ఇప్పటికే అన్నమయ్య, చిత్తూరు, ప్రకాశం, వైఎస్సార్ జిల్లాల్లోనూ రెండు రోజులుగా ఎడతెగని వర్షాలు పడుతున్నాయి. వర్షాల తీవ్రతకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తిరుమల ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. నెల్లూరు నగరంతోపాటు పరిసర ప్రాంతాల్లో వర్షపు నీరు రోడ్లపై ఉండడంతో జన జీవనానికి ఇబ్బంది ఏర్పడింది. మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. అతి భారీ వర్షాల నేపథ్యంలో ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. వాయుగుండం కారణంగా తమిళనాడులో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే తమిళనాడు, కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. -
వణికిస్తున్న వాయుగుండం
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్ : బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం రాష్ట్రాన్ని వణికిస్తోంది. దీని ప్రభావంతో నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. అన్నమయ్య, చిత్తూరు, ప్రకాశం, వైఎస్సార్ జిల్లాల్లోనూ రెండ్రోజులుగా ఎడతెగని వర్షాలు పడుతున్నాయి. వర్షాల తీవ్రతకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తిరుమల ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. నెల్లూరు నగరంతోపాటు పరిసర ప్రాంతాల్లో వర్షపు నీరు రోడ్లపై ఉండడంతో జన జీవనానికి ఇబ్బంది ఏర్పడింది. మరో రెండ్రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. అతిభారీ వర్షాల నేపథ్యంలో ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.నేడు తీరం దాటనున్న వాయుగుండంఇక బుధవారం రాత్రికి చెన్నైకి 190 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 250 కిలోమీటర్లు, నెల్లూరుకి 370 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ తమిళనాడులోని పొన్నేరి–తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేట మధ్యలో బుధవారం అర్థరాత్రి 12 నుంచి గురువారం వేకువజామున 3 గంటలలోపు తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత అల్పపీడనంగా బలహీన పడే అవకాశం ఉందని వెల్లడించింది.దీని ప్రభావంతో గురువారం రాత్రి వరకు రాయలసీమలోని నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్సార్, ప్రకాశం జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది. కొన్నిచోట్ల భారీ నుండి అతిభారీ వర్షాలు, అక్కడక్కడా అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. గంటకు 40–50 కిలోమీటర్లు వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. అయితే సూళ్లూరుపేట, తడ మండలాలకే ఎక్కువ ప్రమాదం ఉన్నట్లుగా హెచ్చరిస్తున్నారు. తేరుకుంటున్న చెన్నై.. సాక్షి, చెన్నై/సాక్షి, బెంగళూరు : వర్షాలు తగ్గుముఖం పట్టడంతో చెన్నైలో బుధవారం క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. 450 ప్రాంతాల్లో వరద నీటిని పూర్తిగా తొలగించారు. కానీ, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలకు అవస్థలు తప్పలేదు. కొన్ని కుటుంబాలను పడవల ద్వారా శిబిరాలకు తరలించారు. వాయుగుండం గురువారం తీరం దాటే అవకాశాలతో రెడ్ అలర్ట్‌ను కొనసాగిస్తున్నారు. చెన్నై శివార్లలో ముంపునకు గురైన ప్రాంతాల్లో సీఎం స్టాలిన్ పర్యటించారు. బెంగళూరు విలవిల.. మరోవైపు.. భారీ వర్షాలకు ఐటీ రాజధాని బెంగళూరు వణికిపోతోంది. వర్షాల తీవ్రత మంగళవారం ఎక్కువగా ఉండగా, చాలావరకు లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. తిరుపతిలో భారీ వర్షాలు..వాయుగుండం ప్రభావంతో తిరుపతి జిల్లాలో లోతట్టు ప్రాంతాలు జలమయమవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సత్యవేడు, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లోని పలుచోట్ల చెరువు కట్టలు దెబ్బతిన్నాయి. తిరుపతిలో 16 పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేశారు. పిచ్చాటూరు మండలంలోని అరణియార్ ప్రాజెక్టుకు ఒక్కసారిగా 20 అడుగుల మేర నీటిమట్టం పెరిగింది. ఇప్పటివరకు జిల్లాలో సరాసరి 198.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.మరోవైపు.. తిరుమలలోనూ భారీ వర్షం కురుస్తోంది. దీంతో రెండో ఘాట్ రోడ్డులోని 15వ మైలు వద్ద, భాష్యకార్ల సన్నిధికి సమీపంలో, హరిణి వద్ద బుధవారం కొండచరియలు విరిగిపడ్డాయి. భారీ వర్షాలతో తిరు మాడవీధుల్లో, శ్రీవారి ఆలయం ఎదుట నీరు ప్రవహిస్తోంది. మరోవైపు.. వర్షాల కారణంగా తిరుమలలోని డ్యాముల్లోకి పెద్దఎత్తున నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ఐదు డ్యాములకు 250 లక్షల గ్యాలన్ల నీరు వచ్చిచేరినట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే.. బుధవారం ఉ.7.35 గంటలకు హైదరాబాద్ నుంచి తిరుపతి విమానాశ్రయానికి ప్రయాణికులతో ఇండిగో విమానం చేరుకుంది.ల్యాండింగ్ సమయంలో వాతావరణం అనుకూలించకపోవడంతో చెన్నైకు వెళ్లింది. అక్కడ రన్‌వేపై నీళ్లు ఉండటంతో తిరిగి రేణిగుంటకు చేరుకుని ప్రయాణికులను సురక్షితంగా దింపి మళ్లీ హైదరాబాద్‌కు వెళ్లిపోయింది. అలాగే హైదరాబాద్ నుంచి తిరుపతి రావాల్సిన మరో ఇండిగో విమాన సర్వీసు రద్దయింది. అన్నమయ్య జిల్లాలోని రైల్వేకోడూరుతోపాటు రాజంపేటలలో వరి, బొప్పాయి, అరటికి నష్టం జరిగింది.శ్రీవారి మెట్టు మార్గం మూసివేత..ఇక భారీ వర్షాల నేపథ్యంలో తిరుమలకు వెళ్లే శ్రీవారి మెట్టు నడక మార్గాన్ని గురువారం వరకు మూసివేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పాపవినాశనం, శిలాతోరణం మార్గాలను టీటీడీ మూసివేసింది. అలాగే, బుధవారం రాత్రి నుంచి భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో టీటీడీ ఈఓ శ్యామలరావు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమయంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అధికారులతో వర్చువల్‌గా జరిగిన సమావేశంలో ఆదేశించారు. కొండ చరియలపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. భక్తుల దర్శనాలు, వసతి, ప్రసాదం వంటి వాటికీ ఆటంకం కలగకుండా ప్రత్యామ్నాయం చూడాలన్నారు.నెల్లూరు జిల్లాలో అత్యవసర పరిస్థితి..మూడ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో కలెక్టర్ ఆనంద్ జిల్లాలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అధికారులు, రెవెన్యూ, పంచాయతీ ఉద్యోగులకు సెలవులను రద్దుచేశారు. పెన్నా పరీవాహక ప్రాంతాలు, సముద్ర తీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేçస్తూ కలెక్టర్‌తో పాటు ఎస్పీ కృష్ణకాంత్, అధికారులు ఆయా గ్రామాల్లో పర్యటిస్తున్నారు. తీర ప్రాంత గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇక నెల్లూరు నగరంలో వివిధ ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరంలోని సుమారు 8.50 లక్షల జనాభాలో దాదాపు 1.5 లక్షల మంది వర్ష ప్రభావానికి గురయ్యారు. ఇక పలుచోట్ల వాగులు పొంగిపొర్లడంతో ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.అలాగే, జిల్లాలో పలుచోట్ల సముద్రం ఐదారు మీటర్ల వరకు ముందుకొచ్చింది. మూడు నుంచి నాలుగు మీటర్ల వరకు అలలు ఎగసిపడుతున్నాయి. బాపట్ల జిల్లా సూర్యలంక సముద్రతీరం గతంలో ఎన్నడూ లేనివిధంగా ఒక్కసారిగా 120 అడుగుల మేర ముందుకు వచ్చింది. పౌర్ణమిరోజు వచ్చే పోటు సమయంలో సహజంగా 20 అడుగుల మేర సముద్రం ముందుకొస్తుంది. తీరంలోని వాచ్టవర్లు, తాత్కాలిక విశ్రాంతి బెడ్స్,, పర్యాటకులు కూర్చునే బల్లలను దాటుకుని సముద్రపునీరు ముందుకొచ్చింది. జిల్లాలో 14 పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేసి బాధితులను వీటిలోకి తరలించారు. ఉలవపాడు మండల పరిధిలోని మన్నేటికోట గ్రామంలోని పునరావాస కేంద్రంలో బాధితుల్ని గాలికొదిలేశారు. రెవెన్యూ సిబ్బంది కొంత బియ్యం, కూరగాయలు షెల్టర్ వద్ద ఉంచి వెళ్లిపోయారు. దీంతో గిరిజనులే వండుకున్నారు. అధికారులు బుధవారం మధ్యాహ్నం వరకు కూడా భోజనాల ఏర్పాట్లుచేయలేదు. బాధితులే వండుకున్నారు. కానీ, ఉన్నతాధికారులకు పంపే రిపోర్టులో మాత్రం పునరావాసంలో అన్నం వండి వారికి పెట్టినట్లుగా పేర్కొన్నారు. 8 ప్రకాశం జిల్లా అంతటా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. సింగరాయకొండ, కొత్తపట్నం, ఒంగోలు, సంతనూతలపాడు సముద్రతీర ప్రాంతాల్లో ఈదురు గాలుల ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. మత్స్యకారులు వేట నిలిపివేశారు. లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులకు గండ్లు పడటం, చెరువు కట్టలు తెగిపోవడం, పలుచోట్ల సప్టాలు మునిగిపోయాయి. ఆయా ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నివాస ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. -
ఎడతెరిపిలేని వాన
సాక్షి నెట్వర్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో సోమవారం తెల్లవారుజామునుంచి మధ్యాహ్నం వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో విద్యాసంస్థలకు అత్యవసరంగా సెలవు ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా సగటున 54.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం సాయంత్రానికి జిల్లాలో సగటున 25.8 మి.మీ. వర్షపాతం నమోదైంది.ఒంగోలు బస్టాండ్ సెంటర్ సహా నగరంలోని కాలనీలన్నీ జలమయం అయ్యాయి. జల వనరుల శాఖ ఎస్ఈ కార్యాలయ భవనంలోకి వర్షం నీరు చేరింది. వైఎస్సార్ జిల్లాలో చిరుజల్లులు కురిశాయి. సిద్ధవటంలో అత్యధికంగా 29.6 మి.మీ. వర్షం కురిసింది. తిరుపతి జిల్లా చిల్లకూరు, వాకాడు, తడ మండలాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. సముద్రం నుంచి భీకర శబ్దాలు వెలువడుతున్నాయి. సముద్రాన్ని చూసేందుకు వెళ్లే వారిని స్థానికులు అడ్డుకుని వెనక్కి పంపేస్తున్నారు.తిరుమలలో హై అలర్ట్ తిరుమల: భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో తిరుమలలో హై అలర్ట్ ప్రకటించారు. అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని టీటీడీ ఈఓ జె.శ్యామలరావు ఆదేశించారు. విపత్తు నిర్వహణ ప్రణాళికపై టీటీడీ అడిషనల్ ఈఓ సి.హెచ్.వెంకయ్య చౌదరితో కలిసి ఆయన అధికారులతో సోమవారం వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. 48 గంటల్లో తిరుమలలో విపత్తును ఎదుర్కొనేందుకు అధికారులంతా సంసిద్ధంగా ఉండాలని కోరారు.కొండ చరియలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, ఘాట్ రోడ్లలో ట్రాఫిక్ జామ్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విపత్కర పరిస్థితులను ఎదుర్కొనే చర్యల్లో భాగంగా వైద్య శాఖ అంబులెన్సులను అందుబాటులో పెట్టుకుని అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇంజనీరింగ్ విభాగం సిద్ధంగా ఉండాలన్నారు. రేపు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు భారీ వర్షాల హెచ్చరిక నేపథ్యంలో ఈనెల 16న బుధవారం శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఈ దృష్ట్యా 15న మంగళవారం తిరుమలలో సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని సహకరించాలని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.రైళ్ల రాకపోకలకు అంతరాయం తెనాలి రూరల్: భారీ వర్షాల కారణంగా చెన్నై–విజయవాడ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వర్షాలకు పొన్నూరు–బాపట్ల స్టేషన్ల మధ్య డౌన్ లైన్ వద్ద భూమి కుంగుతోంది. దీని కారణంగా పట్టాలు దెబ్బతిని రైళ్లు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉండడంతో ఈ డౌన్ లైన్లో మాచవరం స్టేషన్ వద్ద నుంచి రైళ్ల రాకపోకలను నిలిపివేసి మరమ్మతులు చేపడుతున్నారు. ఈ కారణంగా పలు రైళ్లను బాపట్ల, చీరాల, ఒంగోలులో నిలిపివేశారు. చెన్నైలో ఐటీ ఉద్యోగులకు వర్క్‌ఫ్రం హోం సాక్షి, చెన్నై: తమిళనాడులోని మధురై, కోయంబత్తూరు తదితర జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై నగరం, శివారులలోని చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాలకు అతి భారీ వర్ష సూచనతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మంగళవారం ఈ నాలుగు జిల్లాలలోని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. ఐటీ సంస్థలు తమ ఉద్యోగులకు ఈ నెల 18 వరకు వర్క్›ఫ్రం హోం ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. -
AP: బంగాళాఖాతంలో అల్పపీడనం.. 4 రోజులు వర్షాలే
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: ఈశాన్య రుతుపవనాలు ఆగ్నేయ ద్వీపకల్ప ప్రాంతంలోకి ప్రవేశించాయి. ఈ నేపథ్యంలోనే ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది మంగళవారం ఉదయానికి తీవ్ర అల్పపీడనంగా బలపడి దక్షిణ బంగాళాఖాతంలోకి ప్రవేశించనుంది. రాబోయే రెండు రోజుల్లో ఇది వాయుగుండంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.ఇది దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య భాగాలకు చేరుతుందని.. ఆ తర్వాత రెండు రోజుల్లో పశ్చిమ వాయవ్య దిశగా కదిలి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలవైపు చేరే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో మంగళవారం నుంచి నాలుగు రోజులపాటు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గురువారం వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. తీరం వెంబడి గంటకు 40నుంచి 60 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.నేడు వర్షం కురిసే జిల్లాలుఅల్పపీడనం ప్రభావంతో మంగళవారం పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, ఎన్టీఆర్, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.16న భారీ వర్షాలుదీని ప్రభావం వల్ల బుధవారం బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.17న వర్షాలు కురిసే జిల్లాలు17వ తేదీన గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.కలెక్టర్లకు సీఎస్ సూచనలుభారీ వర్షాల హెచ్చరికలతో నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌కుమార్ ప్రసాద్ సోమవారం తాడేపల్లిలోని విపత్తుల నిర్వహణ సంస్థ కంట్రోల్ రూమ్ నుంచి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియాతో కలిసి ప్రభావిత జిల్లాల కలెక్టర్లకు సూచనలు జారీ చేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పెన్నా పరీవాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండేలా చూడాలని ఆదేశించారు. భారీ వర్షాలతో పొంగిపొర్లే వాగులు, కాలువలు, రోడ్లు, కల్వర్టులు, మ్యాన్ హోల్స్‌కు ప్రజలు దూరంగా ఉండాలని సూచించారు. ఒరిగిన విద్యుత్ స్తంబాలు, తీగలు, చెట్లు, హోర్డింగ్స్ కింద ఉండరాదన్నారు. పాత భవనాలను వదిలి ముందుగానే సురక్షిత భవనాల్లోకి వెళ్లాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
AP: బంగాళాఖాతంలో అల్పపీడనం.. 24 గంటల్లో అతి భారీ వర్ష సూచన
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు.. పశ్చిమ మధ్య బంగాళాఖాతం-వాయువ్య బంగాళాఖాతం సమీపంలో అల్ప పీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో ఉత్తరాంధ్రలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందిఇక, అల్ప పీడనం ఉత్తర దిశగా కదులుతుండటంతో ఏపీలో ఉత్తరాంధ్రలోని కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే, కోస్తాంధ్ర అంతట విస్తారంగా వర్షాలు పడనున్నాయి. ఈ నేపథ్యంలో పార్వతీపురం మన్యం, అల్లూరి, ఏలూరు జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ విధించారు. అల్ప పీడనం కారణంగా తీరం వెంబడి 30-40 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. రానున్న మూడు రోజుల పాటు ఉత్తర కోస్తా మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. -
మరికొద్దిగంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం: మరికొద్ది గంటల్లో బంగాళాఖాతంలో సుస్పష్టమైన అల్పపీడనం ఏర్పడనుంది. క్రమంగా బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నేటి నుంచి మరో నాలుగు రోజులు కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అల్పపీడనం బలపడి వాయుగుండంగా ఉత్తరాంధ్ర వద్ద తీరం దాటే అవకాశ ఉంది. ఆదివారం వరకు మత్స్యకారుల హెచ్చరికలు కొనసాగనున్నాయి. ఉత్తరాంధ్ర సమీపంలో రుతుపవన ద్రోణి కొనసాగుతోంది.తూర్పుగోదావరి: ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరికి వరద పెరుగుతోంది. నీటిమట్టం 10.7 అడుగులకు చేరుకుంది. 8 లక్షల 37 వేల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. భారీగా నీరు బ్యారేజీ నుంచి విడుదల కావడంతో కోనసీమలో కాజ్‌వేలు నీటమునుగుతున్నాయి. గంటి పెదపూడి లంక, కనకాయ లంక కాజ్‌వేలు మీదుగా వరదనీరు ప్రవహిస్తోంది. పలు లంక గ్రామాలకు పడవలపై రాకపోకలు కొనసాగుతున్నాయి.చింతూరు ఏజెన్సీలో వరద భయం మరోసారి మొదలైంది. మూడు రోజులుగా ఏజెన్సీతో పాటు, ఎగువన కురుస్తున్న వర్షాలకు శబరి, గోదావరి నదులకు భారీగా వరదనీరు చేరుతోంది. విఆర్ పురం మండలం పరిధిలో 28 గిరిజన గ్రామాల్లో వరద ప్రభావం అధికంగా ఉంది. కొండవాగులు పొంగి ప్రవహించడంతో పలు గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. -
ఏపీకి మరో ముప్పు.! బలపడనున్న అల్పపీడనం
సాక్షి,విశాఖపట్నం: ఏపీకి మరో ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో తాజాగా ఏర్పడిన అల్పపీడనం బలపడే అవకాశాలున్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. అనంతరం ఇది తుపానుగా మారే ఛాన్స్ ఉన్నట్లు అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో ఏపీలో మరోసారి భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే ఛాన్సుంది. అల్పపీడనానికి సంబంధించిన వివరాలతో వాతావరణ శాఖ పూర్తిస్థాయి బులెటిన్‌ను త్వరలో విడుదల చేయనుంది. బంగాళాఖాతంలో ఇటీవల ఏర్పడి తీరం దాటిన వాయుగుండం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. ఈ వర్షాలకు ఏపీలోని విజయవాడ నగరంతో పాటు పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. ముంపునకు గురైన విజయవాడ తదితర ప్రాంతాలు పూర్తిగా కోలుకోకముందే మరో తుపాను ముప్పుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుండటం ఏపీ వాసులను కలవరపెడుతోంది. -
బంగాళాఖాతంలో మరో తుఫాన్
-
Sheikh Hasina: నాపై అమెరికా కుట్ర
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ ప్రధాని పదవి నుంచి తనను తప్పించడం వెనుక అమెరికా హస్తముందని చెప్పారు షేక్ హసీనా సంచలన ఆరోపణలు చేశారు. సెయింట్ మారి్టన్ ద్వీపాన్ని, బంగ్లా సరిహద్దుల వెంబడి బంగాళాఖాతంపై పెత్తనాన్ని అప్పగించాలని అమెరికా కోరింది. అలా చేసి ఉంటే నా పదవికి ఢోకా ఉండేది కాదు’’ అన్నారు. బంగ్లా ప్రయోజనాలకు గొడ్డలిపెట్టు వంటి ఆ డిమాండ్లకు ఒప్పుకోనందుకే తనను దింపేసి కీలుబొమ్మ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించాలని అమెరికా కుట్ర పన్నిందని మండిపడ్డారు. విద్యార్థుల శవాల మీదుగా అధికారం దక్కించుకోవాలని ప్రత్యర్థులు కుట్రలు చేశారని ఆరోపించారు. దేశంలో హింసాకాండను, మృతదేహాల ఊరేగింపులను చూడటం ఇష్టం లేకే రాజీనామా చేసినట్టు వెల్లడించారు. భారత్‌లో తలదాచుకుంటున్న హసీనా తాజాగా ఓ ఆంగ్ల పత్రిక ద్వారా బంగ్లాదేశ్ ప్రజలకు సందేశం విడుదల చేశారు. దేశం వీడే ముందు దీన్ని ప్రజలందరికీ చదివి విని్పంచాలని భావించినా వీలు పడలేదన్నారు. కుట్రదారుల వలలో చిక్కుకోవద్దని బంగ్లా ప్రజలకు పిలుపునిచ్చారు. అవామీ లీగ్ నేతలు, కార్యకర్తలపై దాడులు, హత్యలు, వారి ఆస్తుల విధ్వంసంపై ఆవేదన వ్యక్తంచేశారు. భగవంతుడి దయతో త్వరలో బంగ్లాదేశ్ చేరుకుంటానన్నారు.అమాయక విద్యార్థులను రెచ్చగొట్టారు విద్యార్థులను రజాకార్లుగా తానెప్పుడూ సంబోధించలేదని హసీనా తెలిపారు. స్వార్థ ప్రయోజనాల కోసం వారిని రెచ్చగొట్టడానికి తన వ్యాఖ్యలను వక్రీకరించారని మండిపడ్డారు. అమెరికాపై హసీనా గతంలోనూ ఆరోపణలు చేశారు. బంగ్లాదేశ్‌లో వైమానిక స్థావరం ఏర్పాటుకు అనుమతిస్తే ఎన్నికల్లో ప్రధాని పదవి నిలబెట్టుకోవడానికి సహకరిస్తామంటూ ఓ దేశం ఆఫర్ ఇచి్చందని గత మేలో ఆమె వెల్లడించారు.చీఫ్ జస్టిస్‌గా రెఫాత్ అహ్మద్ ఢాకా: బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తిగా జస్టిస్ సయ్యద్ రెఫాత్ అహ్మద్ ఆదివారం బాధ్యతలు చేపట్టారు. విద్యార్థి నేతల డిమాండ్‌తో సీజే, ఐదుగురు న్యాయమూర్తులు శనివారం రాజీనామా చేయడం తెల్సిందే. దేశంలో అశాంతికి ఆజ్యం పోసే వదంతుల వ్యాప్తిపై యూనుస్ ప్రభుత్వం కన్నెర్రజేసింది. వాటిని ప్రచారం చేసే, ప్రచురించే మీడియా సంస్థలను మూసేస్తామని హెచ్చరించింది.హసీనా ఎలాంటి ప్రకటనా చేయలేదు: కుమారుడు హసీనా ఓ ఆంగ్ల పత్రిక ద్వారా విడుదల చేశారంటున్న ప్రకటన పూర్తిగా అవాస్తమని ఆమె కుమారుడు సాజిబ్ వాహెద్ జాయ్ చెప్పారు. బంగ్లాదేశ్‌లో ప్రభుత్వాన్ని మార్చేందుకు అమెరికా కుట్ర పన్నిందని ఆమె చెప్పినట్టుగా వచి్చన ఆ కథనమంతా పూర్తిగా కట్టుకథ అని ఆరోపించారు. ‘‘దీనిపై నా తల్లితో మాట్లాడాను. బంగ్లాను వీడే ముందు గానీ, వీడాక గానీ ఏ పత్రికకూ తాను అలాంటి ప్రకటన విడుదల చేయలేదని ఆమె స్పష్టం చేశారు’’ అని తెలిపారు. ఏమిటీ సెయింట్ మారి్టన్ ద్వీపం? అమెరికాపై హసీనా ఆరోపణలతో సెయింట్ మారి్టన్ ద్వీపం ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కింది. ఇది ఈశాన్య బంగాళాఖాతంలో బంగ్లాదేశ్‌కు చెందిన కాక్స్ బజార్–టెక్నాఫ్ ద్వీపకల్పానికి దక్షిణంది 9 కి.మీ. దూరంలో ఉంది. కేవలం 3 చదరపు కి.మీ. విస్తీర్ణముండే ఈ ద్వీపాన్ని బెంగాలీలో నారీకేళ్ (కొబ్బరి) ద్వీపమంటారు. ఇందులో 3,700 మంది నివసిస్తున్నారు. చేపల వేట, వరి సాగు, కొబ్బరి తోటల పెంపకం వారి వృత్తి. ఈ ద్వీపం వ్యూహాత్మకంగా అతి కీలక ప్రాంతంలో ఉంది. చైనాతో వైరం దృష్ట్యా భావి అవసరాల దృష్ట్యా ఇక్కడ సైనిక స్థావరాన్ని ఏర్పాటుకు అమెరికా ప్రయత్నిస్తోంది. -
AP: బంగాళాఖాతంలో వాయుగుండం.. నేడు, రేపు భారీ వర్షాలు
సాక్షి, విజయవాడ: పశ్చిమ-వాయువ్య దిశగా ఒడిశా, ఛత్తీస్గడ్ మీదుగా వాయుగుండం కదులుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. వచ్చే 24 గంటల్లో క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని పేర్కొంది. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.ఏలూరు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు.. కర్నూలు అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సాఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.సహాయక చర్యల కోసం 3 ఎస్డీఆర్ఎఫ్, 2 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఏర్పాట్లు చేశామని.. వరద ప్రవహిస్తున్న వాగులు,కాలువలు దాటే ప్రయత్నం చేయవద్దని.. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి’’ విపత్తుల నిర్వహణ సంస్థ. మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. -
5 రోజులు వానలే
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: దక్షిణ ఒడిశా ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం దక్షిణ ఛత్తీస్‌గఢ్ వైపుగా కదులుతోంది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కి.మీ. ఎత్తు వరకూ విస్తరించి ఉంది. మరోవైపు రుతుపవన ద్రోణి విదర్భ, గోపాల్పూర్ మీదుగా ఆగ్నేయ దిశగా మధ్య బంగాళాఖాతం వరకూ విస్తరించి ఉంది.వీటి ప్రభావంతో బుధ, గురువారాల్లో ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని పేర్కొన్నారు. తీరం వెంబడి గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని.. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా.. మరో అల్పపీడనం ఆగ్నేయ మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. 19న మరో అల్పపీడనం!ఈ నెల 19 నాటికి వాయువ్య బంగాళాఖాతంలో ఇంకో అల్పపీడనం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. ఇది ఏర్పడితే రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అనేకచోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడతాయని పేర్కొంది. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది. విజయనగరం జిల్లా మెరకముడిదంలో మంగళవారం మధ్యాహ్నం 3.30 సెంటీమీటర్ల వర్షం కురిసింది.గజపతినగరం మండలం ముచ్చర్లలో 2.8 సెం.మీ., అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో 2.6 సెం.మీ. వర్షం పడింది. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు కృష్ణా జిల్లా నాగాయలంక మండలం భావదేవరపల్లిలో 6.8 సెం.మీ. వర్షం కురిసింది. అదే జిల్లా కృత్తివెన్ను మండల కేంద్రంలో 6.6, నంద్యాల జిల్లా ఆత్మకూరులో 5.9, కృష్ణా జిల్లా పెదఅవుటపల్లిలో 5.8, బాపట్ల జిల్లా రేపల్లె మండలం కామరాజుగడ్డలో 5.5 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. -
రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్, యానాంలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలోనే బంగాళాఖాతంలో ఈ నెల 26న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ అల్పపీడనం నెమ్మదిగా బలపడుతూ ఉత్తర దిశగా ప్రయాణించే అవకాశం ఉంది.అదే రోజున అల్పపీడనం ఏపీ తీరాన్ని తాకనుంది. దీని ప్రభావంతో 26వ తేదీ సాయంత్రం నుంచి రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో ముసురు వాతావరణం ఏర్పడనుంది. బుధవారం ఉత్తరాంధ్ర జిల్లాలోలతో పాటు కోస్తా జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. 27, 28 తేదీల్లో అనేక చోట్ల విస్తారంగా వానలు కురుస్తాయని వెల్లడించారు. -
తుపానుగా మారిన వాయుగుండం
సాక్షి, విశాఖపట్నం/సాక్షి నెట్వర్క్: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం గంటకు 12 కి.మీ. వేగంతో ఉత్తరం వైపు కదులుతూ ఉత్తర బంగాళాఖాతం మీదుగా శనివారం రాత్రి సమయంలో తుపానుగా మారింది. దీనికి రెమల్ అని నామకరణం చేశారు. రెమల్ అంటే అరబిక్ భాషలో ఇసుక అని అర్థం. తుపాను క్రమంగా ముందుకు కదులుతూ ఆదివారం ఉదయానికి ఈశాన్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా మారనుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.ఆదివారం అర్ధరాత్రి సాగర్ ద్వీపం, ఖేపుపరా మధ్య బంగ్లాదేశ్‌ని ఆనుకుని ఉన్న పశి్చమ బెంగాల్ వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తీరం దాటే సమయంలో గంటకు 110–120 కిలోమీటర్ల వేగంతో.. గరిష్టంగా 135 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీచే అవకాశాలున్నాయని వెల్లడించారు. మరోవైపు.. నైరుతి రుతుపవనాలు నైరుతి బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మిగిలిన భాగాలు, మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని భాగాలు, ఈశాన్య బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాలకు విస్తరించాయి.ఆదివారం నాటికి నైరుతి బంగాళాఖాతం, మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, ఈశాన్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 31లోగా కేరళ తీరాన్ని తాకే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయని పేర్కొంది. రాగల రెండు రోజుల్లో ఏపీలోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రెండు రోజుల తర్వాత మళ్లీ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడుతుందని తెలిపారు.పలుచోట్ల జల్లులు.. అక్కడక్కడా వర్షాలుమన రాష్ట్రంపై తుపాను ప్రభావం లేకపోయినా.. రాజస్థాన్, విదర్భ, తెలంగాణ మీదుగా బంగాళాఖాతం వరకు విస్తరించి ఉన్న ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని తూపిలిపాలెం సముద్ర తీరంలో భీకరమైన శబ్దాలతో అలలు ఎగసి పడుతున్నాయి. తీరంలో చీకట్లు కమ్ముకున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో పలుచోట్ల మోస్తరు వర్షం కురిసింది. కవిటి మండలంలో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంత ఇళ్లలో నీరు చేరింది. గుంటూరు జిల్లా వ్యాప్తంగా చిరు జల్లులు పడ్డాయి. తెనాలిలో తెల్లవారుజాము నుంచి ఈదురు గాలులతో వర్షం కురిసింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు పలుచోట్ల వర్షాలు కురిశాయి.అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలో అత్యధికంగా 86.4 మి.మీ. భారీ వర్షం కురిసింది. శ్రీసత్యసాయి జిల్లాలోని 18 మండలాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా మడకశిర మండలంలో 72.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఉమ్మడి కృష్ణా జిల్లా అంతటా ఓ మోస్తరు వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా 41.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. విజయవాడ నగరంలోనూ జోరు వాన కురిసింది. పల్నాడు జిల్లాలో శనివారం అక్కడక్కడా చిరు జల్లులు కురిశాయి. జిల్లా మొత్తం చల్లటి వాతావరణం ఏర్పడింది. నరసరావుపేటలో తెల్లవారుజామున మోస్తరు వర్షం కురిసింది.చిలకలూరిపేట, పెదకూరపాడు, సత్తెనపల్లి పట్టణం, గ్రామాల్లో జల్లులు పడ్డాయి. ఉమ్మడి పశి్చమగోదావరి జిల్లాలో పలుచోట్ల చెదురుమదురు వర్షాలు కురిశాయి. ఆకాశం మేఘావృతమై వాతావరణం చల్లబడింది. ఏలూరు, జంగారెడ్డిగూడెం, ఏజెన్సీ ప్రాంతం, నూజివీడు, కైకలూరు, ఆచంట, మొగల్తూరు, నరసాపురం తదితర ప్రాంతాల్లో తుంపర్ల వర్ష కురిసింది. కర్నూలు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిశాయి. దేవనకొండలో 62.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. -
నేడు బంగాళాఖాతంలో వాయుగుండం
సాక్షి, విశాఖపట్నం: దక్షిణ బంగాళాఖాతానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం గురువారం తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది ఈశాన్య దిశగా కదులుతూ శుక్రవారం నాటికి మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడనుంది. అనంతరం అదే దిశలో పయనిస్తూ శనివారం ఉదయానికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉంది. ఆ తరువాత ఉత్తరం వైపు వెళ్లి 26వ తేదీ ఆదివారం సాయంత్రానికి బంగ్లాదేశ్, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ తీరానికి చేరుకుని తీవ్ర తుపానుగా బలపడుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) గురువారం రాత్రి నివేదికలో వెల్లడించింది.దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమల్లో శుక్ర, శనివారాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉత్తర కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. శుక్రవారం పార్వతీపురం మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, శ్రీసత్యసాయి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, శ్రీకాకుళం, అనకాపల్లి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలకు ఆస్కారం ఉంది.శనివారం అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, శ్రీసత్యసాయి, వైఎస్సార్ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. ఆదివారం అల్లూరి సీతారామరాజు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వివరించింది. అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో పిడుగులు కూడా సంభవిస్తాయని తెలిపింది.నేడు, రేపు కొన్నిచోట్ల వడగాడ్పులుమరోవైపు పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. కొన్ని జిల్లాల్లో సాధారణంకంటే 3నుంచి 5 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వీటి ఫలితంగా రానున్న రెండురోజులు వడగాడ్పులు వీయనున్నాయి. శుక్రవారం శ్రీకాకుళం జిల్లాలో 9, విజయనగరం 11, పార్వతీపురం మన్యం 11, కాకినాడ 1, తూర్పు గోదావరి 1 మండలం చొప్పున 33 మండలాల్లోను, శనివారం శ్రీకాకుళం జిల్లాలో 5, విజయనగరం 7, పార్వతీపురం మన్యం 5, పశ్చిమ గోదావరి 1, ఏలూరు 2, కృష్ణా 2, బాపట్ల జిల్లాలో రెండు చొప్పున 24 మండలాల్లోనూ వడగాడ్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. -
రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం!
సాక్షి, హైదరాబాద్: నైరుతి బంగాళాఖాతంలో రేపు(బుధవారం) అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇది ఈశాన్య దిశగా పయనించి 24 గంటల్లో (మే24) మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించి అక్కడ వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నెల చివర వరకు తుఫాన్‌గా మారే ఛాన్స్ ఉందని వెల్లడించింది.ఈశాన్య దిశగా కదులుతూ బలపడనున్న అల్పపీడనం.. నైరుతి బంగాళాఖాతానికి అనుకుని తమిళనాడు పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగనుంది. దీంతో అయిదు రోజుల పాటు ఏపీలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి. కొన్నిచోట్ల క్రమంగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం కూడా ఉంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం. సముద్ర మట్టం నుంచి 3.1 కి.మీ ఎత్తు వరకూ ఆవరించింది. ఈ కారణంగా తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీతెలిపింది. -
హైదరాబాద్‌లో మళ్లీ దంచికొడుతున్న వాన
హైదరాబాద్, సాక్షి: నగరంలో మళ్లీ భారీ వాన దంచికొడుతోంది. సోమవారం మధ్యాహ్నాం పలు ప్రాంతాలు జలమయం కావడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది. నగరంతో పాటు రాష్ట్రంలో ఈ నాలుగురోజులపాటు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఇదిలా ఉంటే.. నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులను తాకాయి. బంగాళాఖాతంలో చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాలు.. మరిన్ని ప్రాంతాల్లోకి విస్తరించనున్నాయి. ఈనెల చివరి వరకు కేరళను తాకి, జూన్ 8 నుంచి 11 మధ్య తెలంగాణలోకి ప్రవేశించనున్నాయి. నేటి నుంచి మరో నాలుగు రోజుల పాటు తేలిక నుంచి ఓ మోస్తరు భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడతాయని , దక్షిణ ఈశాన్య జిల్లాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట నాగర్ కర్నూల్, వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం కనిపిస్తోంది. ఈనెల 22 న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒక అల్ప పీడన ఏర్పడే అవకాశం. ఈ అల్ప పీడనం ఈనెల 24 వ తారీఖు నాటికీ మధ్య బంగాళాఖాతం ప్రాంతం లో వాయుగుండం గా బలపడే అవకాశం ఉంది. -
ముంచుకొస్తున్న మిచాంగ్
సాక్షి, అమరావతి/తిరుపతి అర్బన్/సాక్షి, అమలాపురం/భీమవరం/సాక్షి ప్రతినిధి, నెల్లూరు/రేపల్లె/సాక్షి, విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఆదివారానికి తుపాను (మిచాంగ్)గా బలపడనుంది. ఇది ప్రస్తుతం పశ్చిమ వాయవ్య దిశగా గంటకు 17 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ఈ వేగం శనివారం రాత్రికి ఏడు కిలోమీటర్లకు తగ్గింది. తుపానుగా మారాక పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరింత శక్తిని పుంజుకునే అవకాశముంది. ఈ తుపాను పుదుచ్చేరికి 440 కి.మీ., చెన్నైకి 420 కి.మీ., నెల్లూరుకు 520 కి.మీ., బాపట్లకు 620 కి.మీ., మచిలీపట్నానికి 620 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఆదివారం రాత్రికి ఇది తుపానుగా మారే అవకాశమున్నట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. 4వ తేదీకి ఇది దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు తీర ప్రాంతాలకు విస్తరించనుంది. ఆ తర్వాత దక్షిణాంధ్ర తీర ప్రాంతానికి సమాంతరంగా ప్రయాణిస్తూ 5వ తేదీ ఉదయం బాపట్ల–మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మచిలీపట్నం సమీపంలో తీరం దాటేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి. మరోవైపు తుపాను తీరం దాటుతుందా.. లేకపోతే మచిలీపట్నం సమీపంలోనే తీరం వరకు వచ్చి మళ్లీ సముద్రంలోనే దిశ మార్చుకుంటుందా.. అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సముద్రంలో ఉష్ణోగ్రతలు, భూమి మీద ప్రస్తుతమున్న ఉష్ణోగ్రతలను బట్టి ఈ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ తీరం దాటితే తుపాను బలహీనపడి మళ్లీ కోనసీమ ప్రాంతంలో తిరిగి సముద్రంలోకి వెళ్లే అవకాశాలున్నాయి. దీనిపై పూర్తి స్పష్టత ఆదివారానికి వచ్చే అవకాశముంది. దీని ప్రభావం దక్షిణ కోస్తా జిల్లాలపై ఎక్కువగా ఉండనుంది. కోస్తా జిల్లాల్లో 4, 5 తేదీల్లో రెడ్ అలెర్ట్ ప్రకటించే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. నాలుగు రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు.. తుపాను ప్రభావంతో ఆదివారం నుంచి నాలుగు రోజులపాటు కోస్తాంధ్ర, రాయలసీమల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. గంటకు 75 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. తుపాను తీరాన్ని దాటే సమయంలో గంటకు 80–90, గరిష్టంగా 100 కి.మీ.ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయి. ఇక ఆదివారం నుంచి ఆరో తేదీ వరకు కోస్తాంధ్ర, రాయలసీమల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. అదివారం కృష్ణా, బాపట్ల, ప్రకాశం, ఎస్పీఎస్సార్ నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు.. కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, వైఎస్సార్, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. 4న కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, ఎస్పీఎస్సార్ నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు.. అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, చిత్తూరు, అన్నమయ్య, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే, 5న కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో ఒకటి, రెండుచోట్ల అత్యంత భారీ వర్షాలు.. విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, ఎస్పీఎస్సార్ నెల్లూరు, నంద్యాల జిల్లాల్లో ఒకటి, రెండుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, వైఎస్సార్ జిల్లాల్లో అక్కడక్కడా∙భారీ వర్షాలు కురవొచ్చని ఐఎండీ తెలిపింది. 6న శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ జిల్లాల్లో ఒకటి, రెండుచోట్ల్ల భారీ వర్షాలకు ఆస్కారం ఉందని వివరించింది. స్టేట్ ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్ ఏర్పాటు.. తుపాను నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో స్టేట్ ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేశారు. తుపాను ప్రభావిత జిల్లా కలెక్టరేట్లు, ఆయా రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లోనూ కంట్రోల్ రూములు ఏర్పాటుచేశారు. తుపాను సమాచారం, హెచ్చరికలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సమాచారం అందిస్తోంది. బాపట్ల జిల్లా నిజాంపట్నం హార్బర్లో 1వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీచేసినట్లు పోర్టు కన్జర్వేటర్ మోకా వెంకట రామారావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే సముద్రంలోకి వేటకు వెళ్లిన బోట్లు తిరిగి ఒడ్డుకు చేరాయన్నారు. తిరుపతి జిల్లాలో వర్షాలు.. కోనసీమలో బలమైన గాలులు.. మిచాంగ్ తుపాను ప్రభావంతో తిరుపతి జిల్లాలో ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లా యంత్రాంగాన్ని కలెక్టర్ అప్రమ్తతం చేశారు. మత్స్య కారులు సముద్రంలోకి వేటకు వెళ్లకుండా ఆదేశించారు. అవసరమైన చోట్ల పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేయిస్తున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఈదురుగాలులు బలంగా వీస్తున్నాయి. పలు ప్రాంతాల్లో సముద్ర కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. కొన్నిచోట్ల సముద్రం ముందుకు చొచ్చుకు వస్తుండడంతో తీరం కోతకు గురవుతోంది. సముద్రంలో కలిసే మొగల ద్వారా నీరు డ్రెయిన్లలోకి వస్తోంది. ఖరీఫ్ కోతలు జోరుగా సాగుతున్న నేపథ్యంలో భారీ వర్షాలు కురిస్తే నష్టపోతామని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలో 37 పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేశామని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలో అలలు ఎగసిపడుతున్నాయి. తుపానుతో పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మత్స్యకారులు సముద్రంలోనికి వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. సార్వా మాసూళ్లు ముమ్మరంగా సాగుతున్నందున ధాన్యాన్ని మెరక ప్రాంతంలో భద్రపర్చుకోవాలని రైతులకు సూచించారు. లోతట్టు గ్రామాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రచారం చేస్తున్నారు. నెల్లూరులో సముద్రం అల్లకల్లోలం తుపాను తీరం వైపు దూసుకొస్తుండడంతో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. చాలాచోట్ల దాదాపు యాభై మీటర్ల మేర సముద్రం ముందుకొచ్చింది. తీరప్రాంత మండలాలైన కావలి, అల్లూరు, ఇందుకూరుపేట, తోటపల్లిగూడూరు, ముత్తుకూరులలో శనివారం ఉదయం నుంచి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. జన జీవనం దాదాపు స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు, రహదారులు, ప్రభుత్వ కార్యాలయాలు ముంపునకు గురయ్యాయి. మరో 48 గంటల్లో బాపట్ల, నెల్లూరు మధ్య తుపాన్ తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేయడంతో జిల్లా కలెక్టర్ ఎం. హరినారాయణన్ జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ప్రత్యేక సూచనలు జారీచేశారు. జిల్లా అంతటా ఉదయం నుంచి ముసురుతో ఓ మోస్తరు వర్షాలు ప్రారంభమయ్యాయి. జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించడంతో కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ 24 గంటలు పనిచేసేలా ఏర్పాటు చేశారు. మత్స్యకారులను చేపల వేటకు వెళ్లరాదని సూచించారు. 144 రైళ్లు రద్దు రైల్వేస్టేషన్ (విజయవాడపశ్చిమ)/హైదరాబాద్: మిచాంగ్ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా ప్రాంతాల్లో ముప్పు పొంచి ఉండటంతో రైల్వే అధికారులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. రైళ్ల కార్యకలాపాలు, ట్రాక్‌ల పటిష్టత, ప్రయాణికుల భద్రతకు అవసరమైన అన్ని చర్యలను వేగవంతం చేయాలని డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కలిసి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మరోవైపు ముందుజాగ్రత్తగా ఈ నెల 3 నుంచి 6వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల మీదుగా నడిచే 144 ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేశారు. అన్ని ముఖ్యమైన రైల్వేస్టేషన్లలో హెల్ప్‌డెస్‌్కలు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ నుంచి మరికొన్ని రైళ్లు రద్దు తుపాను నేపథ్యంలో వివిధ ప్రాంతాల మధ్య నడిచే రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ నుంచి బయల్దేరే రైళ్లలో హైదరాబాద్–తాంబరం(చెన్నై), సికింద్రాబాద్–కొల్లాం, సికింద్రాబాద్–తిరుపతి, లింగంపల్లి–తిరుపతి, సికింద్రాబాద్–రేపల్లె, కాచిగూడ–రేపల్లె, చెన్నై–హైదరాబాద్, సికింద్రాబాద్–గూడూరు, సికింద్రాబాద్–త్రివేండ్రం తదితర ప్రాంతాల మధ్య నడిచే రైళ్లు రద్దు కానున్నాయి. -
‘ముందు జాగ్రత్తలు తీసుకోండి’
సాక్షి, అమరావతి: తుపాను నేపథ్యంలో ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ ఆదేశించారు. తుపానును ఎదుర్కోవడానికి చేపట్టాల్సిన చర్యలపై ఆయన శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులతోపాటు ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాను నేపథ్యంలో ప్రాణ, ఆస్తి నష్టాలను కనిష్ట స్థాయికి పరిమితం చేసేలా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని రాజీవ్ గౌబ సూచించారు. పూర్తి సన్నద్ధంగా ఉన్నాం.. తుపానును సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ముందు జాగ్రత్తలతో పూర్తి సన్నద్ధంగా ఉన్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి కేంద్ర కేబినెట్ కార్యదర్శికి వివరించారు. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్లను పూర్తి స్థాయిలో అప్రమత్తం చేశామని తెలిపారు. 2 ఎన్డీఆర్ఎఫ్, 6 ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచామన్నారు. అలాగే పౌరసరఫరాల విభాగం ద్వారా నిత్యావసర సరుకులను పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచామని వివరించారు. బలహీనంగా ఉన్న ఏటిగట్లు, వంతెనలు తదితర ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాల్సిందిగా ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. తుపాను ప్రభావంతో ఎలాంటి పరిస్థితులు తలెత్తినా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సన్నద్ధతతో ఉందన్నారు. ఈ నెల 4న చెన్నై– మచిలీపట్నం మధ్య తుపాను తీరాన్ని తాకొచ్చన్నారు. ఆ సమయంలో గంటకు 80 నుంచి 100 కి.మీల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం నుంచి మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి చేపల వేటకు వెళ్లవద్దని ఇప్పటికే హెచ్చరించామన్నారు. -
కోస్తాంధ్రపై ‘మిచాంగ్’ తుపాను పడగ!
సాక్షి, విశాఖపట్నం/ సాక్షి, అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడనున్న తుపాను కోస్తాంధ్రపై పడగ విప్పనుంది. రాయలసీమలోనూ పెను ప్రభావం చూపనుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తోంది. తుపాను ప్రభావిత జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించింది. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసింది. తాడేపల్లిలో రాష్ట్ర కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, ఫోన్ నంబర్లను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. విపత్కర పరిస్థితుల్లో ప్రజలను రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేసింది. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం శుక్రవారం రాత్రికి నెల్లూరుకు ఆగ్నేయంగా 790, బాపట్లకు దక్షిణ ఆగ్నేయంగా 860, మచిలీపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 850 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తూ శనివారం నాటికి తీవ్ర వాయుగుండంగా మారనుంది. అనంతరం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ ఆదివారం నాటికి తుపానుగా బలపడుతుంది. ఆపై వాయవ్య దిశగా పయనిస్తూ ఈనెల 4వ తేదీకి దక్షిణ కోస్తాంధ్ర తీరానికి చేరుకుంటుంది. అనంతరం ఉత్తర దిశగా కదులుతూ ఐదో తేదీ ఉదయం నెల్లూరు – మచిలీపట్నం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. రానున్న రెండు రోజులు గంటకు 50 నుంచి 60 కి.మీలు, తీరాన్ని దాటే సమయంలో గంటకు 80–90 కి.మీలు, గరిష్టంగా 100 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఈ తుపానుకు మయన్మార్ సూచించిన ‘మిచాంగ్’గా నామకరణం చేయనున్నారు. తుపాను ప్రభావం శనివారం నుంచి మొదలై ఈ నెల ఐదో తేదీ వరకు కొనసాగనుంది. కంట్రోల్ రూమ్ ఏర్పాటు తుపాను నేపథ్యంలో తాడేపల్లిలోని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో స్టేట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు ఆ సంస్థ ఎండీ బీఆర్ అంబేడ్కర్ తెలిపారు. ఇక్కడి నుంచి ఎప్పటికప్పుడు పరిస్థితులు పర్యవేక్షిస్తామన్నారు. జిల్లాల యంత్రాంగాన్ని ఇప్పటికే అప్రమత్తం చేసినట్లు తెలిపారు. ప్రజలు అత్యవసర సçహాయం, వాతావరణ సమాచారం కోసం 24 గంటలు అందుబాటులో ఉండే స్టేట్ కంట్రోల్ రూమ్ నంబర్లు 1070, 112, 18004250101లో సంప్రదించాలని తెలిపారు. -
బంగాళాఖాతంలో ఆవర్తన ప్రభావంతో పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు
-
నేడు అల్పపీడనం!
సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో మంగళవారం అల్పపీడనం ఏర్పడనుంది. అనంతరం పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తూ ఈనెల 16వ తేదీ నాటికిపశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడనుంది. మరోవైపు నైరుతి బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అలాగే రాష్ట్రంపైకి ఈశాన్య గాలులు వీస్తున్నాయి. వీటన్నిటి ఫలితంగా మంగళ, బుధవారాల్లో ఉత్తర కోస్తాలో ఒకట్రెండు చోట్ల, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుకురవనున్నాయి. కాగా.. మంగళవారం తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు అక్కడ క్కడ కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడింంది. అలాగే బుధవారం తిరుపతి, అన్నమయ్య, నెల్లూరు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలకు ఆస్కారం ఉందని తెలిపింది. వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు, పిడుగులు సంభవించే అవకాశం ఉన్నందున ప్రజలు, కూలీలు, పశువుల కాపరులు, రైతులు ఆరు బయట ఉండరాదని హెచ్చరింంది. లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించింది. -
బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష విజయవంతం
సింథియా(విశాఖ పశి్చమ): భారత నావికాదళంలోని తూర్పు నావికా విభాగం బ్రహ్మోస్ క్షిపణిని బుధవారం విజయవంతంగా పరీక్షించింది. బంగాళాఖాతంలో పరీక్షలో భాగంగా నావికాదళానికి చెందిన విధ్వంసకనౌక నుంచి ఈ క్షిపణిని ప్రయోగించారు. ఈ క్షిపణి నిర్దేశించిన కచి్చత పరామితులను అందుకుందని ఇండియన్ నేవీ ఒక ప్రకటనలో పేర్కొంది. పరీక్ష తాలూకు ఫొటోను భారత నేవీ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ఖాతాలో షేర్ చేసింది. -
బంగాళాఖాతంలో అతితీవ్ర తుఫాన్ హమూన్
-
ఈశాన్య వర్షాలకు వాయుగుండం బ్రేక్!
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాల చురుకుదనానికి వాయుగుండం బ్రేకులు వేసింది. మళ్లీ ఇవి చురుకుదనం సంతరించుకోవడానికి మరికొన్ని రోజుల సమయం పట్టనుంది. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని వాయుగుండం బలపడి మరో మూడు, నాలుగు రోజులు ఉత్తర ఈశాన్య దిశగా బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీరాల వైపు ప్రయాణించనుంది. ఈ వాయుగుండం గాలిలోని తేమను అటువైపు లాక్కుని పోతుండటంతో ఈశాన్య రుతుపవనాలు మన రాష్ట్రంపై ప్రభావం చూపలేకపోతున్నాయి. ఈ వాయుగుండం తీరాన్ని దాటే వరకు ఇదే పరిస్థితి కొనసాగనుంది. వాయుగుండం బెంగాల్ తీరాన్ని దాటడానికి ఇంకా నాలుగైదు రోజులు పడుతుంది. ఆ తర్వాత మరో రెండు మూడు రోజులకు గాని ఈశాన్య గాలుల్లో తేమ ఏర్పడే పరి స్థితి ఉండదు. అందువల్ల ఈశాన్య రుతుపవనాలు బలం పుంజుకోవడానికి కనీసం వారం రోజులైనా ప డుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నా రు. ఏపీలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవాలంటే అప్పటివరకు వేచి ఉండాల్సిందేనని చెబుతున్నారు. తీరానికి దూరంగా వాయుగుండం సాధారణంగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం గాని, వాయుగుండం గాని ఏర్పడితే ఏపీలో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయి. కానీ ప్రస్తుత వాయుగుండం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోనే ఏర్పడినప్పటికీ అది తీరానికి దూరంగా ఉంది. పైగా ఈ వాయుగుండం ఆంధ్ర తీరం వైపు కాకుండా బెంగాల్ వైపు పయనిస్తూ పునరావృతం) చెందుతుంది. ఫలితంగా ఏపీలో వర్షాలు కురవడం లేదని వాతా వరణ నిపుణులు అంటున్నారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలకు వారమైనా పట్టవచ్చని చెబుతున్నారు. బలపడిన వాయుగుండం.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ఆదివారం సాయంత్రానికి తీవ్రవా యుగుండంగా బలపడింది. ఇది ఒడిశాలోని పారాదీప్‌కు దక్షిణంగా 550, పశ్చిమ బెంగాల్‌లోని దిఘాకు దక్షిణంగా 710 కి.మీల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ తీవ్రవాయుగుండం సోమవారం వరకు ఉత్తర దిశగా కదులుతుంది. ఉత్తర ఈశాన్యంగా దిశ మార్చుకుంటూ రీకర్వ్ తీసుకుని బంగ్లాదేశ్ తీరం వైపు పయనిస్తుందని ఐఎండీ తెలిపింది -
బంగాళాఖాతంలో వాయుగుండం! తుపానుగా బలపడే అవకాశం?
సాక్షి, విశాఖపట్నం: మధ్య బంగాళాఖాతంలో ఆగ్నేయ బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న ప్రాంతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది వాయవ్య దిశగా పయనిస్తూ ఆదివారం నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారనుంది. అనంతరం ఈ వాయుగుండం ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీరాల వైపు పయనించనుంది. ఆ తర్వాత మూడు రోజుల్లో మరింతగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శనివారం నివేదికలో వెల్లడించింది. వాయుగుండంగా మారిన తర్వాత దిశ గమనం బట్టి ఏపీపై కురిసే వర్షాలపై అంచనా. ఈ నెల 24, 25 తేదీల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. తీరం వెంబడి గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు విస్తాయని, మత్స్యకారులు చేపలు వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ఈ వాయుగుండం తుపానుగా బలపడవచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఈశాన్య రుతుపవనాల ఆగమనానికి సూచికగా తమిళనాడులో శనివారం నుంచి వర్షాలు ప్రారంభమయ్యాయని ఐఎండీ తెలిపింది. నేడో, రేపో మన రాష్ట్రంలోనూ ఈశాన్య రుతుపవనాలు ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. చదవండి: దసరా పండుగకు ప్రత్యేక రైళ్లు -
నేడు బంగాళాఖాతంలో వాయుగుండం!
సాక్షి, విశాఖపట్నం: మధ్య బంగాళాఖాతంలో ఆగ్నేయ బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న ప్రాంతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది వాయవ్య దిశగా పయనిస్తూ ఆదివారం నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారనుంది. అనంతరం ఈ వాయుగుండం ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీరాల వైపు పయనించనుంది. ఆ తర్వాత మూడు రోజుల్లో మరింతగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శనివారం నివేదికలో వెల్లడించింది. ఈ వాయుగుండం తుపానుగా బలపడవచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఈశాన్య రుతుపవనాల ఆగమనానికి సూచికగా తమిళనాడులో శనివారం నుంచి వర్షాలు ప్రారంభమయ్యాయని ఐఎండీ తెలిపింది. నేడో, రేపో మన రాష్ట్రంలోనూ ఈశాన్య రుతుపవనాలు ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. రానున్న రెండు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. -
బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ అల్పపీడనం వాయవ్య దిశగా కదులుతూ ఆదివారం (22) నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. అనంతరం మూడు రోజులు ఉత్తర ఈశాన్య దిశగా పయనిస్తూ పశ్చిమ బెంగాల్ తీరం వైపు వెళ్తుందని తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. సముద్రం అలజడిగా ఉంటుందని, రానున్న మూడు రోజులు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని సూచించింది. మరోవైపు రానున్న రెండు రోజుల్లో ఈశాన్య రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించేందుకు పరిస్థితులు అనుకూలంగా మారాయి. ఈ రుతుపవనాల ఆగమనానికి సంకేతంగా భావించే తూర్పు, ఈశాన్య గాలులు రాష్ట్రంపైకి బలంగా వీస్తున్నాయి. సాధారణంగా అక్టోబర్ 18 – 22 తేదీల మధ్య ఈశాన్య రుతుపవనాలు తమిళనాడులో ప్రవేశిస్తాయి. ఆ వెంటనే దక్షిణ కోస్తాంధ్రలోనూ ప్రభావం చూపుతాయి. దీంతో అక్కడ వర్షాలు ప్రారంభమవుతాయి. అయితే ప్రస్తుత వాతావరణ పరిస్థితులను బట్టి ఈశాన్య రుతుపవనాల ప్రారంభ దశ బలహీనంగా ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది. ఫలితంగా వీటి ప్రవేశ సమయంలో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలే తప్ప భారీ వర్షాలకు ఆస్కారం ఉండదని వివరించింది. -
తెలంగాణలో ఐదు రోజులు వర్షాలే!
సాక్షి, హైదరాబాద్: తూర్పు మధ్య బంగాళాఖాతం, మయన్మార్ తీర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాబోయే 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు పడనున్నాయి. తెలంగాణలో ఐదు రోజులపాటు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది. పలు జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది. ఇక హైదరాబాద్‌కు యెల్లో అలర్ట్ జారీ చేసిన ఐంఎడీ.. ఓ మోస్తరు వర్షాలు ఉంటాయని తెలిపింది. అల్పపీడనం.. తీవ్ర అల్పపీడనంగా బలపడి వాయవ్య దిశగా ఉత్తర ఒడిశా, పశ్చిమ్ బెంగాల్ వైపు కదులుతుంది. దీని ప్రభావంతో ఏపీలోనూ మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. -
హైదరాబాద్‌లో భారీ వర్షం.. రోడ్లపైకి భారీగా చేరిన నీరు
సాక్షి, హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో.. తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం సాయంత్రం హైదరాబాద్ నగరంలో, శివారుల్లోనూ భారీ వర్షం కురిసింది. రోడ్లపైకి నీరు భారీగా చేరడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. జంట నగరం సికింద్రాబాద్‌లోనూ పలు ప్రాంతాల్లో వాన పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయం అయ్యాయి. విద్యాసంస్థలు, ఆఫీసుల సమయం ముగియడంతో రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. మాదాపూర్, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో కురుస్తున్న వర్షం మణికొండ, గచ్చిబౌలి, కొండాపూర్, హఫీజ్‌పేట్, చందానగర్‌లో వర్షం. ఫిల్మ్‌నగర్,పంజాగుట్ట, అమీర్‌పేట్, బేగంపేట్, ఎస్ఆర్ నగర్లో వర్షం మెహిదీపట్నం, మాసబ్‌ట్యాంక్, నాంపల్లి, ఖైరతాబాద్‌లో వర్షం కేపీహెచ్‌బీ, కూకట్పల్లి, జేఎన్టీయూ, నిజాంపేట్‌లో వర్షం పడింది. మరోవైపు.. వర్షం మరికొన్ని గంటలపాటు కొనసాగే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. #Filmnagar #hyderabadrains @balaji25_t @Hyderabadrains @TelanganaRains @ts_weather @MasRainman #Telangana #AppleEvent pic.twitter.com/cEcUitsmiT — Srikanth Marka (@SrikanthMarka6) September 14, 2023 #14SEP 5:30PM⚠️ Rain Intensity Reduced & Leaving the City 🌧️ #Rajendranagar Surroundings will see Heavy Spell.#HyderabadRains pic.twitter.com/ebtytBXkLN — Hyderabad Rains (@Hyderabadrains) September 14, 2023 @balaji25_t @Hyderabadrains @Salma90910310 Charminar Hyderabad pic.twitter.com/4T0oG88Evo — Rafai (@asocircle02) September 14, 2023 videos credit goes to the respected owners -
నేడు అల్పపీడనం!
సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలోని మధ్య భాగాలకు ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి సమీపంలో వాయవ్య బంగాళాఖాతంలో బుధవారం అల్పపీడనం ఏర్పడనుంది. అనంతరం ఇది మరింత బలపడి పశ్చిమ వాయవ్య దిశగా దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాల మీదుగా పయనిస్తుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం రాత్రి నివేదికలో తెలిపింది. మరోవైపు నైరుతి ఉత్తరప్రదేశ్ నుంచి ఉపరితల ఆవర్తనం ప్రాంతం వరకు మరో ద్రోణి పయనిస్తోంది. వీటి ఫలితంగా రానున్న రెండురోజులు ఉత్తరకోస్తాలో అనేకచోట్ల, దక్షిణకోస్తాలో కొన్నిచోట్ల, రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఉత్తరకోస్తాలో ఒకటిరెండు ప్రాంతాల్లో భారీవర్షాలు కురవవచ్చని పేర్కొంది. కోస్తాంధ్రలో గంటకు 40–45, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, సముద్రం అలజడిగా ఉంటుందని.. మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. -
మళ్లీ ఉక్కపోత..
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో వాతావరణం మళ్లీ సెగలు కక్కుతోంది. కొద్దిరోజుల నుంచి ఉష్ణ తీవ్రత అధికమై పగటి పూట ఎండ చుర్రుమంటోంది. వర్షాకాలంలో ఇలాంటి వాతావరణం అరుదుగా కనిపిస్తుంది. మరోవైపు ఉష్ణతాపానికి ఉక్కపోత కూడా తోడవుతోంది. ఇది ప్రజలను తీవ్ర అసౌకర్యానికి గురి చేస్తోంది. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడిన తర్వాత రాష్ట్రంలో ఈ వాతావరణం నెలకొంది. వారం రోజులుగా ఇదే పరిస్థితి ఉంటోంది. ఉదయం 9 గంటలు దాటితే చాలు.. ఎండ ఊపందుకుని సాయంత్రం వరకు కొనసాగుతోంది. కొన్నాళ్లుగా రాష్ట్రంలో తేలికపాటి జల్లులే తప్ప ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు. పైగా మేఘాలు కూడా అంతగా ఏర్పడటం లేదు. ఫలితంగా సూర్యుడి నుంచి నేరుగా కిరణాలు పడటం వల్ల ఉష్ణోగ్రతలు పెరిగి ఎండల ప్రభావం కనిపిస్తోందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితి మరో వారం రోజులపాటు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. సాధారణంగా ఆగస్టు మొదటి వారంలో అల్పపీడనాలు ఏర్పడి వర్షాలు విస్తారంగా కురుస్తాయి. కానీ.. అందుకు భిన్నంగా ఇప్పుడు వానలకు బదులు ఎండలు కాస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంపైకి నైరుతి గాలులు వీస్తున్నాయి. ఈ గాలుల్లో వర్షాలు కురిపించేటంత తేమ ఉండటం లేదు. దీంతో వానలకు ఆస్కారం ఉండకపోగా ఉక్కపోత కూడా ఇబ్బంది పెడుతోంది. 40 డిగ్రీలకు చేరువలో.. రాష్ట్రంలో ప్రస్తుతం సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఫలితంగా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరువలో రికార్డవుతున్నాయి. సోమవారం బాపట్లలో అత్యధికంగా 39 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సాధారణం కంటే 5.2 డిగ్రీలు అధికం. ఇంకా పలుచోట్ల 35నుంచి 38 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న మూడు రోజులు రాష్ట్రంలో ఉష్ణతీవ్రత కొనసాగుతుందని, అసౌకర్యంతో కూడిన వాతావరణం ఉంటుందని భారత వాతావరణ శాఖ సోమవారం తెలిపింది. సాధారణం కంటే 3–5 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. అదే సమయంలో కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా జల్లులు గాని కురిసే అవకాశం ఉందని వివరించింది. -
బలపడిన అల్పపీడనం.. నేడు వాయుగుండం
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. బుధవారానికి అది వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ (ఐఎండీ) తెలిపింది. రుతుపవన ద్రోణి ప్రస్తుతం జైసల్మేర్ నుంచి ఉత్తరాంధ్ర మీదుగా సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో అల్పపీడన ప్రాంతం మధ్యలో పయనిస్తోంది. మరోవైపు కోస్తాంధ్ర, రాయలసీమలపై నైరుతి రుతుపవనాలు కూడా చురుగ్గా ఉన్నాయి. వీటి ప్రభావంతో విస్తారంగా కురుస్తున్న వర్షాలు మరో మూడురోజులు కొనసాగుతాయని ఐఎండీ మంగళవారం రాత్రి బులెటిన్‌లో వెల్లడించింది. బుధవారం అల్లూరి సీతారామరాజు, పశి్చమ గోదావరి, ఎనీ్టఆర్, పల్నాడు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ అత్యంత భారీవర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ జిల్లాలకు రెడ్ అలెర్ట్‌ను ప్రకటించింది. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు, ఎస్పీఎస్సార్ నెల్లూరు, అనంతపురం, వైఎస్సార్ జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయని వివరించింది. వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు, పిడుగులు సంభవిస్తాయని, గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో గాలులు, తీరం వెంబడి 45 నుంచి 55.. గరిష్టంగా 65 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయంది. మూడురోజులు మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం హెచ్చరించింది. మంగళవారం భారీవర్షాలు కురిశాయి. ఎనీ్టఆర్, శ్రీకాకుళం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అనకాపల్లి జిల్లా గొలుగొండలో అత్యధికంగా 10.2, విశాఖ రూరల్‌లో 7.7 సెం.మీ. వర్షపాతం నమోదైంది. -
గోదావరిలో మళ్లీ పెరుగుతున్న వరద
సాక్షి, అమరావతి/పోలవరం రూరల్/ధవళేశ్వరం: పరీవాహక ప్రాంతం (బేసిన్)లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటం, ఉప నదులు ఉప్పొంగుతుండటంతో గోదావరిలో వరద ఉద్ధృతి పెరుగుతోంది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు భద్రాచలం వద్ద ప్రవాహం 7,59,015 క్యూసెక్కులకు పెరిగింది. దాంతో నీటి మట్టం 38.9 అడుగులకు చేరింది. పోలవరం ప్రాజెక్టు వద్దకు ఎగువ నుంచి వచ్చిన వరదను వచ్చినట్టుగా 48 గేట్ల ద్వారా అధికారులు దిగువకు వదిలేస్తున్నారు. పోలవరం నుంచి 7,62,000 క్యూసెక్కుల నీరు దిగువకు వెళుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్‌లోకి 6,86,660 క్యూసెక్కులు చేరుతుండగా.. నీటి మట్టం 9.40 అడుగులకు చేరింది. గోదావరి డెల్టాకు 9,900 క్యూసెక్కులను వదులుతూ మిగులుగా ఉన్న 6,76,760 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఎగువన వరద పెరిగిన నేపథ్యంలో బుధవారం ధవళేశ్వరం బ్యారేజ్‌కి చేరే ప్రవాహం పెరగనుంది. గోదావరిలో ఎగువన తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజ్‌లోకి 5,79,730 క్యూసెక్కులు, తుపాకులగూడెం వద్ద ఉన్న సమ్మక్క బ్యారేజ్‌లోకి 7.55 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా అంతే స్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ప్రభావం వల్ల బుధవారం, గురువారం బేసిన్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో గోదావరిలో వరద ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉంది. -
ఏపీలో ఐదురోజులపాటు భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. ఈ నెల 26వ తేదీన వాయిగుండంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తం చేస్తోంది వాతావరణ శాఖ. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మరో ఐదురోజులపాటు భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సైతం ధృవీకరించింది. భారత వాతావరణ శాఖ అంచనా ప్రకారం పశ్చిమ మధ్య & ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఉత్తరాంధ్ర -దక్షిణ ఒడిశా మీదుగా ఆవర్తనం కొనసాగుతుందని దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు ఏర్పడందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వెల్లడించారు. బుధవారం నాటికి అదే ప్రాంతంలో వాయుగుండంగా బలపడనున్నట్లు తెలిపారు. ఆతర్వాత ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరాల మీదుగా పశ్చిమ-వాయువ్య దిశగా నెమ్మదిగా కదిలే అవకాశం ఉందని వెల్లడించారు. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఐదు రోజుల పాటు విస్తారంగా వర్షాలు పడనున్నాయని వెల్లడించారాయన. బుధవారం అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు, గురువారం భారీవర్షాలు పడే అవకాశం ఉందన్నారు. మిగిలిన చోట్ల విస్తారంగా వర్షాలు పడనున్నట్లు వివరించారు. బుధవారం.. కృష్ణా,ఎన్టీఆర్,గుంటూరు,పల్నాడు,బాపట్ల,ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్నిచోట్ల మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. గురువారం.. అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో కొన్నిచోట్ల మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. భారీ వర్షాలు నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని , రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉరుములతో కూడిన వర్షం కురిసేపుడు వ్యవసాయ పనుల్లోని రైతులు, పొలాల్లో పనిచేసే కూలీలు, గొర్రెల కాపరులు చెట్ల క్రింద ఉండరాదన్నారు. సోమవారం నాటికి ఇలా.. రాత్రి 7 గంటల నాటికి జిల్లా వారీగా విశాఖ జిల్లా ఆనందపురంలో 96 మి.మీ, పెందుర్తి 84, పద్మనాభం 76 మి.మీ, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ లో 61.5మి.మీ ,అల్లూరి జిల్లా అనంతగిరిలో 61.5 మి.మీ , శ్రీకాకుళం జిల్లా లక్ష్మీనర్సుపేట 56.5 మి.మీ, విజయనగరం జిల్లా పూసపాటిరేగలో 55.7 మి.మీ, నెల్లూరుజిల్లా అనుమసముద్రంపేటలో 55.5 మి.మీ, అనకాపల్లి జిల్లా సబ్బవరంలో 49.7 మి.మీ, మన్యంజిల్లా సాలూరులో 47.5 మి.మీ అధిక వర్షపాతం నమోదైందని చెప్పారు. గోదావరి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి సోమవరం రాత్రి 7 గంటలకు గోదావరి వరద ప్రవాహం భద్రాచలం వద్ద 36.3 అడుగులు, పొలవరం వద్ద నీటిమట్టం 11.8 మీటర్లు ధవళేశ్వరం బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 9.12 లక్షల క్యూసెక్కులు ఉందని విపత్తుల సంస్థ ఎండి డా.బిఆర్ అంబేద్కర్ తెలిపారు. విపత్తుల సంస్థలోని స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తూ సంబంధిత జిల్లాల యంత్రాంగానికి సూచనలు జారీ చేస్తున్నామన్నారు. అత్యవసర సహాయక చర్యల కోసం కూనవరం ,పి.గన్నవరంలో 2ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, మామిడికుదురు, అయినవిల్లి, కుకునూర్, వేలేర్పాడులో 4ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నట్లు విపత్తుల సంస్థ ఎండి తెలిపారు. వరద ఉధృతి హెచ్చుతగ్గులుగా ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో తగ్గే వరకు గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీకి భారీ వర్షసూచన
సాక్షి, విశాఖపట్నం: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే వానలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇటు, ఎడతెరిపిలేని వర్షాల కారణంగా తెలంగాణలో స్కూల్స్‌కు కూడా సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. మరోవైపు.. ఇంకా రెండు రోజులు పాటు ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ► వివరాల ప్రకారం.. ఈనెల 24వ తేదీన బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్టు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో ఏపీలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలే కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ► ఇదిలా ఉండగా.. గోదావరిలో వరద ప్రవాహం తగ్గుముఖం పడుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 11.5 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. డెల్టా పంట కాల్వలకు 11వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇదే సమయంలో సముద్రంలోకి 9.32 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు.. రాజమండ్రి వద్ద గోదావరి ఘాట్లను ఆనుకుని నది ప్రవహిస్తోంది. గోదావరి పాయలు వశిష్ట, గౌతమి, వైనతేయలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో, విలీన మండలాల్లో కొండవాగులు పోటెత్తుతున్నాయి. నాలుగు మండలాల పరిధిలో 100 ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ► ఇక, పోలవరం వద్ద గోదావరి తగ్గుముఖం పట్టింది. స్పిల్‌వే వద్ద 32.315 మీటర్లకు నీటి మట్టం చేరుకుంది. 48 గేట్ల ద్వారా 6,75,910 క్యూసెక్యుల నీరు విడుదలవుతోంది. స్పిల్ వే దిగువన 23.470 మీటర్లకు నీటి మట్టం చేరుకుంది. ► కాగా, యానాం-ఎదుర్లంక వద్ద గోదావరి ఉప్పొంగుతోంది. యానాం వద్ద 2 మీటర్ల ఎత్తు వరకు గౌతమి నది చేరుకుంది. దీంతో, అధికారులు.. లంక గ్రామాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఇది కూడా చదవండి: తిరుమల: ఆగస్టు, సెప్టెంబర్‌కు 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల -
ఏపీకి చల్లని కబురు.. మరో రెండు రోజుల్లో..
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం : కేరళలోకి ప్రవేశించిన రుతు పవనాలు వేగంగా కదులుతున్నాయి. గత 24 గంటల్లో వాటి గమనంలో వేగం పెరగడంతో రెండు రోజుల్లోనే అవి రాయలసీమను తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కేరళ నుంచి రుతుపవనాలు ఆంధ్రా ప్రాంతానికి రావడానికి సాధారణంగా 4 రోజులు పడుతుంది. ఇప్పుడు ఒకరోజు ముందుగానే అంటే ఆదివారానికి వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని చెబుతున్నారు. అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్జోయ్ తుపాను ప్రభావంతో రుతుపవనాలు బంగాళాఖాతంలో శ్రీలంక కింది భాగం నుంచి విస్తరిస్తున్నాయి. 3 రోజుల్లోనే అవి పైభాగానికి వచ్చి శుక్రవారం తమిళనాడు, కర్ణాటక వరకు విస్తరించాయి. వచ్చే రెండు రోజుల్లో ఆంధ్రాకి వచ్చే అవకాశం ఉంది. నిప్పుల వానలా రాష్ట్రంలో ఎండలు రుతు పవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించి పూర్తిగా విస్తరించే వరకు ఎండల తీవ్రత కొనసాగనుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఎండలు నిప్పుల వానను తలపిస్తున్నాయి. జూన్ రెండో వారం మొదలైనా భానుడి ప్రతాపం కొనసాగుతోంది. రోహిణి కార్తె వెళ్లాక వచ్చే మృగశిర కార్తెతో వాతావరణం చల్లబడుతుంది. కానీ ప్రస్తుతం మృగశిర కార్తె ప్రవేశించినా రోహిణి కార్తె ఎండలనే తలపిస్తోంది. శుక్రవారం రాష్ట్రంలో అనేక జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 43–45 డిగ్రీల వరకు రికార్డయ్యాయి. ఆయా ప్రాంతాల్లో సాధారణంకంటే ఐదారు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో పలుచోట్ల వడగాడ్పులు, మరికొన్ని చోట్ల తీవ్ర వడగాడ్పులు వీచాయి. కోస్తాలో ప్రధానంగా కృష్ణా, గుంటూరు తీరంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వాతావరణం ఎగువ ప్రాంతంలో ఉన్న గాలుల్లో కూడా పొడి శాతం ఎక్కువ ఉంది. దీనివల్లే ఉష్ణోగ్రతలు బాగా ఎక్కువగా ఉంటున్నాయి. ఏప్రిల్‌లో వచ్చిన మోకా తుపాను బంగాళాఖాతంలో ఉన్న తడి గాలులన్నింటినీ లాగేసుకోవడంతో ఉష్ణోగ్రతలు, ఉక్కపోత తీవ్రమయ్యాయి. ఇప్పుడు అరేబియా సముద్రంలో ఏర్పడిన తుపాను వల్ల కొంత వేడి వాతావరణం ఉంటుంది. దీనికితోడు రాజస్థాన్ నుంచి వచ్చే గాలులు కూడా పొడిగానే ఉంటున్నాయి. దీంతో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. శుక్రవారం అన్ని జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరంలో అత్యధికంగా 45.5 డిగ్రీలు నమోదైంది. విజయనగరం జిల్లా నెల్లిమర్ల, కాకినాడ జిల్లా కరపలో 45.3, తూర్పు గోదావరి జిల్లా చిట్యాలలో 45.2, అల్లూరి సీతారామరాజు జిల్లా కొండాయిగూడెంలో 45.2 డిగ్రీలు, గుంటూరు జిల్లా జంగమహేశ్వరపురంలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. -
గురువారంకల్లా భీకర మోచా తుపానుగా అల్పపీడనం.. భారీ వర్షాలు
పోర్ట్ బ్లెయిర్/భువనేశ్వర్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మోచా తుపానుగా మారబోతోంది. దీని ప్రభావంతో అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. సంబంధిత వివరాలను భారత వాతావరణ శాఖ బుధవారం వెల్లడించింది. ‘అండమాన్, నికోబార్ దీవుల్లోని పోర్ట్ బ్లెయిర్ సమీపంలో అల్పపీడనం కేంద్రీకృతమైంది. అది గురువారంకల్లా భీకర మోచా తుపానుగా మారి ఆ దీవుల్లో భారీ వర్షాలకు కారణమవుతుంది. తర్వాత బంగాళాఖాతం ఆగ్నేయ, సమీప ప్రాంతాల్లో తుపాను ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మే 13న కాస్తంత బలహీనపడి బంగ్లాదేశ్‌లోని కాక్స్ బజార్, మయన్మార్‌లోని క్యావూక్ప్యూ పట్టణాల మధ్య తుపాను తీరం దాటనుంది. మే 14న గంటకు 130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో జాలర్లు చేపలవేట కోసం సముద్రంలోకి వెళ్లకపోవడం శ్రేయస్కరం’ అని కోల్‌కతా రీజియన్ డైరెక్టర్ జీకే దాస్ చెప్పారు. అత్యవసర నిర్వహణ కేంద్రాల ద్వారా నిరంతరం పరిస్థితిని అంచనావేస్తూ తీరప్రాంతవాసులను అప్రమత్తం చేస్తామన్నారు. -
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. ఏపీకి వర్ష సూచన
సాక్షి, అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతంలో శనివారం ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 8వ తేదీకి ఇది అల్పపీడనంగా ఆ తర్వాత వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. అనంతపురం ఆగ్నేయ దిశగా కదిలి 9వ తేదీకి తుపానుగా మారి, ఉత్తర దిశగా మయన్మార్ వైపు కదిలే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. అందువల్ల తుపాను ప్రభావం రాష్ట్రంపై పెద్దగా ఉండకపోవచ్చునని చెబుతున్నారు. అల్పపీడనం, వాయుగుండంగా ఉన్నంతవరకు కొద్దిమేర వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఇదిలా వుండగా తమిళనాడు తీరంలో నైరుతి బంగాళాఖాతంలోనూ ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో 2, 3 రోజులు రాష్ట్రంలో తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు శనివారం రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగలలో 7.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. శ్రీకాకుళం జిల్లా మెలియపుట్టిలో 6.4, ఏలూరు జిల్లా చాట్రాయిలో 5.9, బాపట్ల జిల్లా లోవలో 5, కొల్లూరులో 4.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. తిరుపతి జిల్లా కేవీబీపురం మండలంలో శనివారం పిడుగుపాటుకు ఇద్దరు గొర్రెల కాపరులు గాయపడ్డారు. 13 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. తిరుమలలో భారీ వర్షం తిరుమల: తిరుమలలో శనివారం మధ్యాహ్నం అకస్మాత్తుగా భారీ వర్షం కురిసింది. గత వారం రోజులుగా తిరుమలలో ఎండల తీవ్రత అధికంగా ఉంది. దీంతో భక్తులు ఇబ్బందిపడ్డారు. శనివారం వర్షంతో భక్తులు చల్లటి వాతావరణాన్ని ఆస్వాదించారు. ఇది కూడా చదవండి: వాయుగుండం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వానలు -
వాయుగుండం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వానలు
సాక్షి, అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. కాగా, ఈ నెల 7వ తేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం చోటుచేసుకోనుంది. ఇది 8వ తేదీన వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఇక, బంగాళాఖాతం వైపు కదులుతూ తుఫాన్‌గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అయితే, ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ద్రోణి కారణంగా తెలంగాణలో నేడు, రేపు మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఇక, ఏపీలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా.. ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో ఏపీలో నాలుగు రోజులుగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా గురువారం కూడా వర్షాలు కురిశాయి. జిల్లాలోని కాకుమాను మండలంలో 75, ప్రత్తిపాడులో 50.4, దుగ్గిరాలలో 41.2, వట్టిచెరుకూరులో 24.6, తెనాలిలో 23.8, మంగళగిరిలో 15, పెదకాకానిలో 13, చేబ్రోలులో 12.2 మి.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాను వానలు వీడలేదు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా 60 మి.మీ. సగటు వర్షపాతం నమోదైంది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో 46.6, ఇరగవరంలో 32.2, ఆచంటలో 20, పోడూరులో 19, పెంటపాడులో 17, తణుకులో 15 మి.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. రాయలసీమలోనూ పలుచోట్ల వర్షాలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 15 మండలాల్లో వర్షం కురిసింది. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు అనంతపురం జిల్లాలోని 10 మండలాల పరిధిలో 4 మి.మీ. సగటు వర్షపాతం నమోదైంది. శ్రీసత్యసాయి జిల్లాలోని 5 మండలాల పరిధిలో వర్షం కురిసింది. ఇది కూడా చదవండి: వెన్ను విరగని వరి! -
వచ్చే రెండ్రోజుల్లో తెలంగాణలో మోస్తరు వర్షాలు
సాక్షి, హైదరాబాద్: ఆగ్నేయ బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈనెల 7న ఇదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది క్రమంగా బలపడి ఈ నెల 8న తీవ్ర అల్పపీడనంగా ఆపై 8న వాయుగుండంగా మారే అవకాశముందని భారత వాతావరణ విభాగం పేర్కొంది. ఆ వాయుగుండం మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించి ఉత్తర దిశగా పయనిస్తూ తుపానుగా మారే అవకాశం ఉందని బుధవారం వెల్లడించింది. దీని ప్రభావంతో రానున్న రెండ్రోజులు తెలంగాణవ్యాప్తంగా అక్కడక్కడా తేలికపాటి వర్షాలు, కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు రానున్న రెండ్రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని పేర్కొంది. -
ఒడిశా మీదుగా ఉపరితల ద్రోణి.. వర్షాలకు అవకాశం
సాక్షి, హైదరాబాద్: ఒడిశా నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా సముద్రమట్టం నుంచి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వానలు, ఒకట్రెండు చోట్ల ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించింది. ఆదివారం రాష్ట్రంలోని పలుచోట్ల పగటి ఉష్ణోగ్రతలు 41 డిగ్రీ సెల్సియస్ నుంచి 43 డిగ్రీ సెల్సియస్ మధ్యన నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించింది. శనివారం రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే, గరిష్ట ఉష్ణోగ్రత భద్రాచలంలో 39.8 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 20.0 డిగ్రీ సెల్సియస్‌గా నమోదయ్యాయి. -
Rain Alert: కన్యాకుమారి తీరంలో వాయుగుండం
సాక్షి, చెన్నై: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శ్రీలంక తీరాన్ని దాటి కన్యాకుమారి తీరంలోకి సోమవారం ప్రవేశించనుంది. ఈప్రభావంతో 13 జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక, సముద్రంలో కెరటాలు ఉవ్వెత్తున ఎగసి పడుతుండడంతో వేటకు జాలర్లు వెళ్ల లేదు. ఈశాన్య రుతు పవనాల సీజన్ ముగింపు దశకు చేరింది. మరో వారం పాటు ఈ పవనాల ప్రభావం రాష్ట్రంపై ఉండనుంది. ఈ పరిస్థితుల్లో బంగాళాఖాతంలో శ్రీలంకకు సమీపంలో కేంద్రీకృతమైన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది ఆదివారం శ్రీలంకలోని యాల్పానం వద్ద తీరాన్ని తాకి మళ్లీ బంగాళాఖాతంలోకే ప్రవేశించింది. ఈ ప్రభావంతో శనివారం రాత్రి నుంచి చెన్నై, దాని శివారు జిల్లాల్లో మోస్తారుగా వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం ముసురు వర్షం పడింది. విల్లుపురం, పుదుచ్చేరి, కారైక్కాలో కొన్ని చోట్ల వరుణుడు బీభత్సం సృష్టించాడు. చెన్నైలో రాత్రంతా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఆగమేఘాలపై కార్పొరేషన్ సిబ్బంది ఈ నీటిని తొలగించారు. ఇక మెరీనా తీరంలోకి మళ్లీ వర్షపు నీరు చేరింది. ఫలితంగా ఇసుక మేటలు చెరువును తలపించాయి. అధికారులు అప్రమత్తం వాయుగుండం కన్యాకుమారి తీరంలోకి సోమవారం ప్రవేశించనుంది. ఈ ప్రభావంతో కన్యాకుమారి, తిరునల్వేలి, తెన్కాశి, తూత్తుకుడి, రామనాథపురం, శివగంగై, పుదుకోట్టై, నాగపట్నం తదితర 13 జిల్లాలో భారీ వర్షాలు కురవనున్నాయి. ఆయా జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. సముద్రంలో అలలు ఉవ్వెతున్న ఎగసి పడుతుండడంతో జాలర్లు తమ పడవలను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. రాష్ట్రంలోని హార్బర్లలో ఇప్పటికే ఒకటో నంబరు ప్రమాద సూచికను ఎగుర వేశారు. సముద్రంలో గాలి ప్రభావం అధికంగా ఉండడంతో లక్ష మంది జాలర్లు వేటకు వెళ్ల లేదు. -
స్థిరంగా కొనసాగుతున్న వాయుగుండం
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, పాడేరు: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం స్థిరంగా కొనసాగుతోంది. ఇది తూర్పు ఈశాన్య దిశగా గంటకు 15 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ఈ వాయుగుండం తమిళనాడులోని నాగపట్నానికి తూర్పున 570 కి.మీ.లు, చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 600 కి.మీ.ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది అదే ప్రాంతంలో నెమ్మదిగా పశ్చిమ నైరుతి దిశలో కదులుతూ రానున్న 24 గంటల్లో శ్రీలంక మీదుగా కొమరిన్ వైపు వెళుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శుక్రవారం రాత్రి నివేదికలో తెలిపింది. మరోవైపు రాష్ట్రంపైకి ఈశాన్య గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రానున్న రెండు రోజులు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఒకటి, రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఉత్తర కోస్తాంధ్రలో పొడి వాతావరణం ఉంటుందని పేర్కొంది. క్షీణిస్తున్న రాత్రి ఉష్ణోగ్రతలు... మరోవైపు రాష్ట్రంలో రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా క్షీణిస్తున్నాయి. ప్రజలను చలి గజగజ వణికిస్తోంది. గురువారం రాత్రి రాష్ట్రంలోనే అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగులలో 4.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అరకు 4.9 డిగ్రీలు, పాడేరు 5.6 డిగ్రీలు, కురుపాం (పార్వతీపురం మన్యం జిల్లా) 11.1డిగ్రీలు, గొలుగొండ (అనకాపల్లి జిల్లా) 12.3 డిగ్రీలు, బెలుగుప్ప (అనంతపురం) 12.3 డిగ్రీలు, పెదతిప్పసముద్రం (అన్నమయ్య) 12.3 డిగ్రీలు, మంత్రాలయం (కర్నూలు) 12.7డిగ్రీలు, రామభద్రాపురం (విజయనగరం) 12.7డిగ్రీలు, సోమల (చిత్తూరు) 13.1డిగ్రీలు, టి.నర్సాపురం (ఏలూరు) 14డిగ్రీలు, మద్దూరు (వైఎస్సార్ జిల్లా) 14 డిగ్రీల చొప్పున రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
బంగాళాఖాతంలో వాయుగుండం.. ఆ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం
సాక్షి, అమరావతి: నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఫలితంగా శుక్ర, శనివారాల్లో దక్షిణ కోస్తా, రాయలసీమలో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) గురువారం తెలిపింది. మిగిలిన చోట్ల వాతావరణం పొడిగా ఉండనుంది. ప్రస్తుతం ఆంధ్ర, యానాం దిగువ ట్రోపో ఆవరణలో ఈశాన్య గాలులు వీస్తున్నాయని పేర్కొంది. శ్రీలంకలోని ట్రింకోమలికి తూర్పు ఈశాన్యానికి 420 కి.మీ, తమిళనాడులోని నాగపట్టణం దక్షిణ ఆగ్నేయానికి 600 కి.మీ, చెన్నైకి ఆగ్నేయంగా 690 కి.మీ దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైంది. ఇది 24 గంటల్లో ఉత్తర వాయవ్య దిశగా కదిలి, ఆ తర్వాతి 48 గంటల్లో పశ్చిమ నైరుతి దిశగా శ్రీలంక మీదుగా కొమోరిన్ ప్రాంతం వైపు వెళ్లే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. చదవండి: (నెరవేరిన సీఎం హామీ.. దివ్యాంగుడికి ఎలక్ట్రిక్ స్కూటర్ మంజూరు) -
ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం: దక్షిణ అండమాన్ సముద్రానికి ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో బుధవారం మధ్యాహ్నం అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ దిశగా పయనిస్తూ గురువారం నాటికి తీవ్ర అల్పపీడనంగా మారనుంది. అదే తీవ్రతతో, అదే దిశగా 17వ తేదీ ఉదయం వరకు కొనసాగుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) బుధవారం రాత్రి నివేదికలో తెలిపింది. మరోవైపు కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆపై మూడు రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొంటుందని తెలిపింది. కాగా బుధవారం తూర్పు గోదావరి జిల్లా పోతవరంలో 4.1, అల్లూరి సీతారామరాజు జిల్లా కుంతలంలో 2.5 సెం.మీల వర్షపాతం నమోదైంది. చదవండి: (రాష్ట్రానికి విశాఖే భవిష్యత్.. త్వరలోనే వైజాగ్ నుంచి పరిపాలన) -
ఏపీ: 15న మరో అల్పపీడనం!
సాక్షి, విశాఖపట్నం: ఈనెల 13వ తేదీన దక్షిణ అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఆవిర్భవించనుంది. దీని ప్రభావంతో 15వ తేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి, బలపడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు రాష్ట్రంపైకి తూర్పు గాలులు వీస్తున్నాయి. ఫలితంగా ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా ఉన్నాయి. వీటి ఫలితంగా సోమ, మంగళవారాల్లో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్ని చోట్ల, ఉత్తర కోస్తాంధ్రలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఆదివారం రాత్రి వెల్లడించింది. -
నేడు, రేపు దక్షిణ కోస్తా, రాయలసీమలో వర్షాలు
-
Heavy Rains: భారీ వర్షాలకు అతలాకుతలం.. స్కూల్స్ బంద్
సాక్షి, చెన్నై: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తణ ద్రోణి ప్రభావం వల్ల.. తమిళనాడు భారీ వర్షాలతో అతలాకుతలం అవుతోంది. గురువారం కురిసిన వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, మరో నాలుగు రోజులపాటు వర్ష ప్రభావం ఉండడంతో అధికార యంత్రాగం అప్రమత్తం అయ్యింది. తమిళనాడుతో పాటు పుదుచ్చేరి పరిధిలో 14 జిల్లాల్లోని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. ఇక అర్ధరాత్రి భారీ వర్షంతో చెన్నై జలమయం అయ్యింది. రాజధాని చెన్నైలోని పలు కాలనీలు జలమయంకాగా, చాలా చోట్ల డ్రైనేజీ వ్యవస్థ ఘోరంగా దెబ్బతింది. రోడ్లపైకి నీరు వచ్చి చేరింది. ఉత్తర చెన్నైలోని పులియాంతోప్‌లో మోకాళ్ల లోతులో నీళ్లు చేరి.. పలు వాహనాలు నాశనం అయ్యాయి. స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక చెన్నైతో పాటు వెల్లూరు, తిరువళ్లూరు, కళ్లకురిచి, సేలం, రాణిపేట, తిరువణ్ణమలై జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. #ChennaiRains வடக்கு உஸ்மான் சாலை pic.twitter.com/bS8DUL6Sgz — GAVASKAR (@gavastk) November 11, 2022 శుక్రవారం ఈ జిల్లాలో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతవారణ కేంద్రం హెచ్చరించింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మొత్తం ఐదువేలకు పైగా సహాయక శిబిరాలు ఏర్పాటు చేయగా.. అందులో 169 శిబిరాలు చెన్నైలోనే ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. సహాయక చర్యల్లో పాల్గొనేందుకు 2 వేల మందికి పైగా సిబ్బందిని మోహరించారు అధికారులు. #ChennaiRains pic.twitter.com/9mIQs9SVJ7 — vikash baranwal (@vikashbaranwa15) November 11, 2022 ఉన్నట్లుండి మారిన వాతావరణం గురువారం ఉదయాన్నే భానుడు కాసేపు కనిపించినా.. ఆ తర్వాత వాతావరణం పూర్తిగా మారింది. నగరం అంతా మేఘావృతమైంది. సాయంత్రం అక్కడక్కడ భారీ వర్షం పడింది. ఇవాళ శుక్రవారం మధ్యాహ్నం తర్వాత చెన్నైలో కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. డెల్టా రీజియన్‌లోని చెన్నై, చెంగల్పట్టు, విల్లుపురం, కళ్లకురిచి, ఇతర జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురియవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాయుగుండం తీరాన్ని సమీపించే క్రమంలో శనివారం చెన్నైలో వరుణుడు బీభత్సం సృష్టించే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ ప్రభావంతో సముద్ర తీర జిల్లాలలో 4 రోజులు వర్షాలు కురవనున్నాయి. Heavy Rains in Chennai today !!! #rain #weather#ChennaiRains #TamilNadu #tamilnadurain pic.twitter.com/2ycPmvRlsr — SHIBA (@shibasahu2012) November 11, 2022 11 Nov. 10 am. Nehru Nagar, Korukkupet. A canal-side road is also a canal. Forgotten places. #ChennaiRains #NorthChennai #SocialJustice pic.twitter.com/jiOrvYofTt — NityanandJayaraman (@NityJayaraman) November 11, 2022 ఎలాంటి విపత్తులు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండే విధంగా ఆయా జిల్లాల యంత్రాంగాలు ముందు జాగ్రత్తలను విస్తృతం చేశారు. ఇక సముద్రంలో సుడిగాలుల ప్రభావం అధికంగా ఉంటుందని, వేటకు దూరంగా ఉండాలని జాలర్లకు హెచ్చరికలు జారీ అయ్యాయి. వాయుగుండం హెచ్చరికలతో రాష్ట్రంలోని పలు సముద్ర తీర జిల్లాలలోని జాలర్లు తమ పడవలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పలవేర్కాడు తీరంలో ఒకటో నెంబరు తుపాన్ ప్రమాద హెచ్చరిక సూచికను ఎగుర వేశారు. ఇదీ చదవండి: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు -
నైరుతి బంగాళాఖాతంలో ఈనెల 9న అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక తీరానికి చేరువగా ఈనెల 9న అల్పపీడనం ఏర్పడనుంది. అనంతరం 48 గంటల్లో అది బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శుక్రవారం తెలిపింది. ఈశాన్య రుతుపవనాల ప్రవేశం తర్వాత బంగాళాఖాతంలో ఏర్పడనున్న తొలి అల్పపీడనం ఇదే. దీని ప్రభావం ఎక్కువగా తమిళనాడుపై ఉంటుందని, దక్షిణ కోస్తాంధ్రతో పాటు రాయలసీమపైనా కొద్ది ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రం మీదుగా దిగువ నుంచి తూర్పుగాలులు వీస్తున్నాయి. రానున్న 2 రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. చదవండి: ఈ పరిశ్రమలే రుజువు.. ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? -
ఏపీకి తుపాన్ ముప్పు తప్పినట్టేనా..?
సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. రేపు(ఆదివారం) ఉదయానికి తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెందుతుందని విశాఖ వాతావరణ శాఖ డైరెక్టర్ సునంద తెలిపారు. ఎల్లుండి తీవ్ర అల్పపీడనం.. తుపాన్‌గా మారనుంది. 25న బంగ్లాదేశ్ వద్ద తీరం దాటే అవకాశం ఉంది. చదవండి: విషాద జీవితాల అనాథ బిడ్డలకు ‘అమ్మఒడి’ ఆలంబన తుఫాన్ ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఉండదని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. మత్స్యకారులు సముద్రం లోపలికి వేటకు వెళ్ళరాదని, శనివారం రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రానున్న రెండు రోజులపాటు వాతావరణం పొడిగానే ఉంటుందని వాతావారణ కేంద్రం వెల్లడించింది. -
బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతంలో గురువారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తూ శనివారానికి వాయుగుండంగా, 23వ తేదీకి తీవ్ర వాయుగుండంగా మారనుంది. ఆపై ఉత్తరం వైపుగా దిశ మార్చుకుని తూర్పు మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 24న తుపానుగా బలపడనుంది. అనంతరం ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ ఒడిశా తీరాన్ని దాటి 25వ తేదీ నాటికి పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరానికి చేరుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) గురువారం రాత్రి ఒక బులెటిన్‌లో వెల్లడించింది. ఈ తుపాను ప్రభావం రాష్ట్రంపై ఉండదని, రానున్న మూడు రోజులు రాష్ట్రంలోని కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మాత్రం కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, అక్కడక్కడ పిడుగులు సంభవించవచ్చని వివరించింది. రాబోయే రెండు రోజుల్లో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఉత్తర బంగాళాఖాతంలోని మిగిలిన భాగాలు, తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు, ఏపీ, యానాం నుంచి నైరుతి రుతుపవనాల ఉపసంహరణకు పరిస్థితులు అనుకూలంగా మారే అవకాశం ఉన్నట్టు తెలిపింది. గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు నర్సీపట్నం (అనకాపల్లి)లో 4.9 సెంటీమీటర్లు, జి.మాడుగుల (అల్లూరి సీతారామరాజు)లో 2.8, ముండ్లమూరు (ప్రకాశం)లో 2.8, ఆళ్లగడ్డ (నంద్యాల)లో 2.6, తొండూరు (వైఎస్సార్)లో 2.6, ఆస్పరి (కర్నూలు)లో 2.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
బలహీనపడ్డ తీవ్ర వాయుగుండం!
సాక్షి, హైదరాబాద్: బంగాళాఖాతంలో కొనసాగిన తీవ్ర వాయుగుండం ఆదివారం ఉదయం బలహీనపడింది. ప్రస్తుతం తెలంగాణ నుంచి దూరంగా వెళ్లడంతో రాష్ట్రానికి ప్రస్తుతం ఎలాంటి హెచ్చరికలు లేవని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రానికి పశ్చిమ, వాయవ్య దిశల నుంచి తక్కువ ఎత్తులో బలమైన గాలులు వీస్తున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో రానున్న రెండ్రోజులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు, ఒకట్రెండు చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని సూచించింది. ఇక రానున్న 48 గంటల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, రాష్ట్రంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల సెల్సియస్ నుంచి 23 డిగ్రీల సెల్సియస్ మధ్యన ఉంటాయని అంచనా వేసింది. -
రెండ్రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శుక్రవారం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. ఇది క్రమంగా పశ్చిమ వాయవ్య దిశగా కదులుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. గురువారం ఏర్పడిన అల్పపీడనం.. సాయంత్రానికి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది శుక్రవారం ఉదయం వాయుగుండంగా మారి.. అనంతరం ఆరుగంటల తర్వాత బలపడి తీవ్ర వాయుగుండంగా మార్పు చెందింది. ఇది శనివారం ఉదయం కల్లా తీరం దాటే అవకాశంఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. కుమ్రుంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతోపాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈదురు గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని వెల్లడించింది. అప్రమత్తంగా ఉండాలి.. ఇప్పటివరకు కురిసిన వర్షాలతో రాష్ట్రంలో చెరువులు, కుంటలు నిండుకుండలా మారాయి. ఇలాంటి పరిస్థితుల్లో వర్షాలు కురిస్తే జనజీవనం అస్తవ్యస్తం అవుతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈక్రమంలో అధికారయంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని చెప్పింది. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వరదలతో కలిగే నష్టాన్ని ముందస్తుగా అంచనా వేసి నివారణ చర్యలు చేపట్టాలని సూచించింది. నైరుతి రుతుపవనాలు జూన్ మొదటి వారంలో ప్రారంభం కాగా... జూలై నుంచి రాష్ట్రంలో భారీ వర్షపాతం నమోదైంది. కేవలం రుతుపవనాల ప్రభావంతో ఈ వర్షాలు రికార్డు స్థాయిలో కురిశాయి. ఈక్రమంలో జూలై ఆఖరు నాటికే రాష్ట్రంలో సీజన్ సగటు వర్షపాతం నమోదైంది. ప్రస్తుత నైరుతి సీజన్లో ఈనెల 19 నాటికి 51.5 సెం.మీ. వర్షపాతంనమోదు కావాల్సిఉండగా, 83.23 సెం.మీ. నమోదైంది. సాధారణ వర్షపాతం కంటే 62 శాతం అధికంగా వర్షాలు కురిశాయి. -
19న బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, హైదరాబాద్: ఉత్తర బంగాళాఖాతంలో ఈనెల 19న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. తదుపరి 24 గంటల్లో ఈ తుపాను బలపడనున్నట్లు అంచనా వేసింది. రాష్ట్రంలో రానున్న మూడు రోజులు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమ మీదుగా కొనసాగుతున్న ఉపరితల ద్రోణి బుధవారం బలహీనపడింది. రాష్ట్రానికి నైరుతి దిశ నుంచి బలమైన గాలులు వీస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాల సీజన్లో రాష్ట్రంలో ఇప్పటివరకు 49.92 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావలసిఉండగా, బుధవారం ఉదయం 8.30 గంటల వరకు 83 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం కంటే 66 శాతం అధిక వర్షపాతం నమోదైనట్లు రాష్ట్ర ప్రణాళిక శాఖ గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్రంలోని 27 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం, 6 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. -
కొనసాగుతున్న వాయుగుండం
సాక్షి, అమరావతి: బంగాళాఖాతంలో ఉన్న వాయుగుండం ప్రస్తుతం ఛత్తీస్గడ్, మధ్యప్రదేశ్ పరిసరాల్లో కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా ఛత్తీస్గడ్ వైపు కదులుతూ వచ్చే కొద్దిగంటల్లో బలహీనపడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. దీని ప్రభావంతో సోమవారం ఉత్తరాంధ్రలో జిల్లాల్లో అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు, కోస్తా, రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి జల్లులు పడ్డాయి. మంగళవారం కూడా వాతావరణం ఇలాగే ఉంటుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. -
తుపాను అలజడి: ఏపీ ప్రభుత్వం అప్రమత్తం
సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుపాను బలహీనపడింది. తీవ్ర తుపాను నుంచి తుపానుగా బలహీనపడినట్లుగా వాతావరణశాఖ పేర్కొంది. రేపు ఉదయానికి వాయుగుండంగా బలహీనపడనున్నట్లుగా వెల్లడించింది. మరికొన్ని గంటల్లో ఏపీ తీరానికి సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం చేరుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అనూహ్యంగా దిశ మార్చుకున్న అసని ఈశాన్యం వైపు కదులుతున్నట్లు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. అసని ప్రభావంతో కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురవనున్నాయి. తీరం వెంబడి గంటకు 85 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ప్రకటించారు. గరిష్టంగా 110 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని అంచనా. ప్రభుత్వం అప్రమత్తం అసని తుపాను ప్రభావంతో విశాఖ, తుర్పుగోదావరి, పశ్చిమగోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాలలో భారీ వర్షాలు పడనున్నాయి. విశాఖపై అసని తుపాన్ ప్రభావం ఎక్కువగా ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఏపీ తీర ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మొహరించారు. తీర ప్రాంత మండలాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. మత్స్యకారులను వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. మరోవైపు పలువురు మంత్రులు అసని తుపాను ప్రభారంపై ఎప్పటికప్పుడు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. సహాయక చర్యల కోసం సిద్ధంగా ఉండాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. పలు రైళ్లు, విమానాలు రద్దు బంగాళాఖాతంలో అసని తుపాన్ ప్రభావంతో దక్షిణ మధ్య రైల్వే నేడు పలు రైళ్లను రద్దు చేసింది. విజయవాడ- మచిలీపట్నం, విజయవాడ- నర్పాపురం, నిడదవోలు, భీమవరం జంక్షన్, కాకినాడ పోర్ట్, విజయవాడ సహా మరికొన్ని రైళ్లను బుధవారం రద్దు చేసింది. అదే విధంగా అసని తుపాన్ ఎఫెక్ట్ విమాన సర్వీసులపై కూడా పడింది.విశాఖ మీదుగా రాకపోకలు సాగించే పలు విమాన సర్వీసులు రద్దు చేశారు. గన్నవరం నుంచి రాకపోకలు సాగించే ఇండిగో విమానాలు కూడా రద్దయ్యాయి. కంట్రోల్ రూమ్ నంబర్లు కాకినాడ కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్: 18004253077 కాకినాడ ఆర్డీవో ఆఫీస్ కంట్రోల్ రూమ్ నంబర్: 0884-2368100 శ్రీకాకుళం: 08942-240557 తూర్పు గోదావరి: 8885425365 ఏలూరు కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్: 18002331077 విజయనగరం: 08922-236947 పార్వతీపురం మన్యం: 7286881293 మచిలీపట్నం కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్: 08672 252572 మచిలీపట్నంం ఆర్డీవో ఆఫీస్ కంట్రోల్ రూమ్ నంబర్: 08672 252486 బాపట్ల కంట్రోల్ రూమ్ నంబర్: 8712655878, 8712655881 ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్: 90103 13920 విశాఖ: 0891-2590100,102 అనకాపల్లి: 7730939383 (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
BIMSTEC summit: చట్టాల నిలకడపై కొత్త ప్రశ్నలు
న్యూఢిల్లీ: ప్రపంచంలో ఇటీవలి పరిణామాలు అంతర్జాతీయ చట్టాల నిలకడపై కొత్త ప్రశ్నలను రేకెత్తిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. బిమ్స్టెక్ (బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ–సెక్టోరల్ టెక్నికల్, ఎకనామిక్ కో–ఆపరేషన్) దేశాల మధ్య పరస్పర సహకారం పెంపొందాలని పిలుపునిచ్చారు. ప్రాంతీయ భద్రత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. బుధవారం ఆన్లైన్ ద్వారా నిర్వహించిన బిమ్స్టెక్ ఐదో శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రసంగించారు. ఆరోగ్యం, ఆర్థిక భద్రత విషయంలో ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి ఐక్యమత్యం, పరస్పర సహకారం తక్షణమే అవసరమని పేర్కొన్నారు. అనుసంధానం, సౌభాగ్యం, భద్రతకు బంగాళాఖాతాన్ని ఒక వారధిగా మార్చాలన్నారు. బిమ్స్టెక్ సెక్రెటేరియట్ ఆపరేషన్ బడ్జెట్‌కు మిలియన్ డాలర్లు అందజేస్తామని ప్రకటించారు. కోవిడ్–19 మహమ్మారి వ్యాప్తి వల్ల మన ప్రజలు, ఆర్థిక వ్యవస్థలు ఇప్పటికీ ప్రభావితం అవుతూనే ఉన్నాయని గుర్తుచేశారు. విజన్ డాక్యుమెంట్ రూపొందిద్దాం.. ఈ సదస్సులో బిమ్స్టెక్ చార్టర్‌ను తీసుకురావడం కీలకమైన ముందుడుగు అని మోదీ అభివర్ణించారు. ఈ చార్టర్‌ను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలన్నారు. విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించడానికి ప్రత్యేక గ్రూప్ ఏర్పాటు చేయాలన్న సెక్రెటరీ జనరల్ ప్రతిపాదనకు ప్రధాని అంగీకారం తెలిపారు. మన ఆకాంక్షలు నెరవేరే దిశగా బిమ్స్టెక్ సెక్రటేరియట్‌ను శక్తివంతంగా తీర్చిదిద్దాలని అన్నారు. అందుకోసం రోడ్‌మ్యాప్ సిద్ధం చేయాలని సెక్రెటరీ జనరల్‌కు సూచించారు. బిమ్స్టెక్ దేశాల వ్యాపారవేత్తలు, స్టార్టప్‌ల మధ్య అనుసంధానం పెరగాలని, వ్యాపార వాణిజ్యాల్లో అంతర్జాతీయ నిబంధలను పాటించాలని తెలిపారు. ప్రాంతీయంగా భద్రత లేకుండా అభివృద్ధి సాధ్యం కాదని మోదీ కుండబద్ధలు కొట్టారు. ఉగ్రవాదంపై పోరాటం కోసం గత ఏడాది తీసుకున్న నిర్ణయం చురుగ్గా అమలవుతోందని హర్షం వ్యక్తం చేశారు. బంగాళాఖాతంలో కోస్టల్ షిప్పింగ్ ఎకోసిస్టమ్ కోసం సాధ్యమైనంత త్వరగా లీగల్ ఫ్రేమ్‌వర్క్‌ను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. బిమ్స్టెక్ దేశాల నడుమ రోడ్డు మార్గంద్వారా అనుసంధానం పెరగాలని చెప్పారు. బిమ్స్టెక్ సదస్సులో పాల్గొనడం ఆనందంగా ఉందంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. సహకార అజెండాను ముందుకు తీసుకెళ్లడానికి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామని వెల్లడించారు. బిమ్స్టెక్లో భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్, మయన్మార్, థాయ్‌లాండ్, నేపాల్, భూటాన్ సభ్యదేశాలుగా ఉన్నాయి. -
తరుముకొస్తున్న మరో తుఫాను.. పేరేంటో తెలుసా?
న్యూఢిల్లీ: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ముందుగా తీవ్ర అల్పపీడనంగా మారి తుఫానుగా రూపాంతరం చెందే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ సోమవారం వెల్లడించింది. ఉత్తర అండమాన్ సముద్రం, దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా ఇది వ్యాప్తి చెంది ఉంది. మాయాబందర్ (అండమాన్ దీవులు)కి ఆగ్నేయంగా 110 కిలోమీటర్ల దూరంలో, యాంగోన్ (మయన్మార్)కి నైరుతి దిశలో 530 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమై ఉంది. వచ్చే 12 గంటల్లో తుఫానుగా మారనుందని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 48 గంటల్లో ఇది ఉత్తర దిశగా మయన్మార్ తీరం వైపు పయనించనుందని పేర్కొంది. బుధవారం తెల్లవారుజామున తాండ్వే (మయన్మార్) సమీపంలో తీరం దాటనుందని వెల్లడించింది. సైక్లోన్ 'అసాని' కాగా, ఆగ్నేయ బంగాళాఖాతంలో తాజాగా ఏర్పడిన అల్పపీడనం.. తుఫానుగా మారితే 'అసాని' అనే పేరుతో పిలుస్తారు. ఈ పేరును శ్రీలంక పెట్టింది. శ్రీలంకలోని అధికారిక భాషలలో ఒకటైన సింహళంలో 'అసాని' అంటే 'కోపం' అనే అర్థం వస్తుంది. అయితే 'అసాని' తుఫాను ప్రభావం అంత భయంకరంగా ఉండకపోవచ్చని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహపాత్ర తెలిపారు. 70 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నా.. అధిక తీవ్రత కలిగిన తుఫానుగా మారబోదని చెప్పారు. ఉష్ణమండల తుఫానులకు పేరు పెట్టే వాటిలో ప్రపంచవ్యాప్తంగా ఆరు ప్రాంతీయ వాతావరణ కేంద్రాలు ఉన్నాయి. ఈ ఆరింటిలో భారత వాతావరణ శాఖ కూడా ఒకటి. బంగాళాఖాతం, అరేబియా సముద్రం, ఉత్తర హిందూ మహాసముద్రం మీదుగా ఏర్పడే ఉష్ణమండల తుఫానులకు 13 సభ్య దేశాలు పేర్లు ప్రతిపాదించడానికి ఐఎండీ ఒక ప్రామాణిక విధానాన్ని అనుసరిస్తుంది. 13 దేశాలు.. 169 పేర్లు ఇండియాతో సహా బంగ్లాదేశ్, ఇండియా, ఇరాన్, మాల్దీవులు, మయన్మార్, ఒమన్, పాకిస్తాన్, ఖతార్, సౌదీ అరేబియా, శ్రీలంక, థాయ్‌లాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యెమెన్.. ఇప్పటికే పేర్లను ప్రతిపాదించాయి. ఒక్కో దేశం 13 పేర్లు చొప్పున ప్రతిపాదించగా.. మొత్తం 169 పేర్లతో 2020లో జాబితాను రూపొందించారు. దేశాల పేర్లను అక్షర క్రమంలో ఉంచారు. వీటి ఆధారంగా ఆయా దేశాలు పెట్టిన పేర్లను వరుసగా తీసుకుంటారు. ఉదాహరణకు గతేడాది అక్టోబర్‌లో ఏర్పడిన తుఫానుకు ‘షహీన్’ అని పేరు పెట్టారు. ఖతార్ ఈ పేరు పెట్టింది. డిసెంబర్లో వచ్చిన తుఫానుకు సౌదీ అరేబియా సూచించిన ‘జవాద్’ పేరు పెట్టారు. అక్షర క్రమంలో సౌదీ తర్వాత ఉన్న శ్రీలంక వంతు ఇప్పుడు వచ్చింది. కాబట్టి శ్రీలంక సూచించిన 'అసాని' పేరును తాజాగా వాడుతున్నారు. IMD issues new list of Names of Tropical Cyclones over north Indian Ocean. The current list has a total of 169 names including 13 names each from 13 WMO/ESCAP member countries. Detailed Press Release available at https://t.co/dArV0Ug8nh and https://t.co/wRl94BzRXr pic.twitter.com/ge0oVz4riD — India Meteorological Department (@Indiametdept) April 28, 2020 పేర్లు ఎందుకు పెడతారు? ఒకే సమయంలో తుఫానులు ఏర్పడినపుడు గందరగోళాన్ని నివారించడానికి తుఫానులకు పేర్లు పెడుతున్నారు. ముందస్తు పటిష్ట నిరోధక చర్యలు తీసుకోవడానికి.. ఏయే తుఫాను వల్ల ఎంత నష్టం జరిగిందనే వివరాలు నమోదు చేయడానికి ఈ విధానం తోడ్పతుంది. ఏ తుఫాను సందర్భంగా ఎలాంటి చర్యలు తీసుకున్నామో విశ్లేషించడం ద్వారా ముందస్తు చర్యలకు వీలు పడుతుంది. (క్లిక్: కంచు కోటలు బద్దలు కొట్టారు.. చరిత్ర సృష్టించారు!) 'అసాని'తో అప్రమత్తం! 'అసాని' తుఫాను ప్రభావంతో అండమాన్ నికోబార్ దీవుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ హెచ్చరించింది. ముందు జాగ్రత్తగా అండమాన్ నికోబార్ దీవుల్లో మార్చి 22 వరకు పర్యాటక కార్యకలాపాలు నిలిపివేశారు. అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలోకి వెళ్లవద్దని మత్స్యకారులకు ఐఎండీ సూచించింది. విద్యుత్, సమాచార వ్యవస్థలకు పాక్షికంగా అంతరాయం కలిగే అవకాశముంది. (క్లిక్: బ్లాక్ చెయిన్‌పై ఆసక్తి చూపిస్తున్న కింగ్ నాగార్జున?) -
10 మంది మహిళా సైనికులు సముద్రంలో 7 రోజులు
మనం నేల మీద మన రోజువారీ వ్యవహారాలు చూసుకుంటూ ఉండగా ఇటీవల నీటి మీద ఒక సాహసం జరిగింది. బంగాళాఖాతంలో పది మంది మహిళా ఆర్మీ ఆఫీసర్లు ఒక్క పురుషుడి తోడు కూడా లేకుండా చిన్న యాట్ (తెరచాపతో నడిచే చిన్న పడవ)లో చెన్నై నుంచి విశాఖపట్నంకు తిరిగి విశాఖపట్నం నుంచి చెన్నైకు 7 రోజుల్లో సాహస యాత్ర చేశారు. ఫిబ్రవరి 15న చెన్నైలో బయలుదేరిన ఈ యాత్ర ఫిబ్రవరి 23న ముగిసింది. ‘నిజానికి మా యాత్ర 4 రోజుల్లో ముగుస్తుంది అనుకున్నాం. కాని సముద్రం లెక్క సముద్రానికి ఉంటుంది. అలలు, గాలులు మనం ఎప్పుడు గమ్యం చేరాలో నిర్దేశిస్తాయి. అందుకే 7 రోజులు పట్టింది’ అంది ఈ బృందానికి కెప్టెన్‌గా వ్యవహరించిన ఆర్మీ ఆఫీసర్ మేజర్ ముక్త శ్రీ గౌతమ్. ‘ఆర్మీ అడ్వంచర్ వింగ్’ ఆధ్వర్యంలో ‘ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ సెయిలింగ్ అసోసియేషన్’ నిర్వహణలో ఈ సాహస యాత్ర జరిగింది. ఈ యాత్రలో ఆర్మీ నుంచి ఎంపిక చేసిన 10 మంది మహిళా ఆఫీసర్లను ఎంపిక చేశారు. కెప్టెన్ ముక్త శ్రీ గౌతమ్ కాకుండా మేజర్ సంజనా మిట్టల్, మేజర్ అర్పితా ద్వివేది, కెప్టెన్ మాళవికా రావత్, కెప్టెన్ శుభమ్ సోలంకి, మేజర్ ప్రియా సంవాల్, మేజర్ ప్రియా దాస్, కెప్టెన్ జ్యోతి సింగ్, మేజర్ రష్మిల్, కెప్టెన్ సోనాల్ గోయల్ ఉన్నారు. ‘నేటి మహిళలు స్త్రీల పట్ల మన దేశంలో ఉన్న మూస అభిప్రాయాలను బద్దలు కొడుతున్నారు. వారు ధైర్యానికి కొత్త ప్రమాణాలు లిఖిస్తున్నారు’ అని చెన్నైలో జెండా ఊపి ఈ యాత్రను ప్రారంభించిన తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. నిజమే. ఈ పదిమంది అలాంటి ధైర్యం చూపారు. ‘మాలో ఎక్కువమందికి ఇదే తొలి నౌకాయానం. కాని మాలో ఏదైనా సాహసం చేయాలన్న కోరిక ఎక్కువ. అందుకే ఈ యాత్రకు సై అన్నాం. మాకు 25 రోజులు ముంబైలోని మార్వెలో శిక్షణ ఇచ్చారు. అక్కడ పడవల గురించి, నౌకాయానం గురించి, సముద్రపు అలల గురించి తెలియ చేశారు. ఆ తర్వాత చెన్నైలో మేము ఏ యాట్ మీద అయితే ప్రయాణించాలో దాని మీద 10 రోజుల శిక్షణ ఇచ్చారు. కాని తీరంలో శిక్షణ వేరు. నిజమైన సముద్ర ప్రయాణం వేరు అని యాత్ర మొదలయ్యాక అర్థమైంది’ అంటారు ఈ బృంద సభ్యులు. చెన్నైలో ఫిబ్రవరి 15న బయలుదేరిన ఈ బృందం 330 నాటికల్ మైళ్లు (611 కి.మీ) ప్రయాణించి 54 గంటల్లో ఫిబ్రవరి 17న విశాఖ చేరుకుంది. అక్కడ యాట్‌ను ఒకసారి చెక్ చేసుకుని తిరిగి 18న బయలుదేరి 23న చెన్నై చేరుకున్నారు. వచ్చే సమయం కన్నా వెళ్లే సమయం ఎక్కువ పట్టింది. ‘కాకినాడ–కృష్ణపట్నం మధ్యలో ఉండే నూనె బావులను, చేపల వలల్ని తప్పించుకునేందుకు మేము బాగా సముద్రం లోపలికి వెళ్లాం. మా యాత్రలో ఒక పౌర్ణమి రాత్రి ఉంది. ఆ రాత్రంతా తీవ్రంగా ఉన్న సముద్ర అలలపై ప్రయాణం సవాలుగా మారింది’ అంది మేజర్ ముక్త. ఆమెది రాజస్థాన్. సముద్రమే లేని ప్రాంతం నుంచి సముద్రాన్ని ఈ యాత్రతో గెలిచింది. అయితే ఇదంతా సులభం కాదు. 44 అడుగుల పొడవు మాత్రమే ఉండే ఈ యాట్‌లో 150 చదరపు అడుగుల కేబిన్ ఉంటుంది. ఈ కేబిన్‌లోనే కిచెన్, టాయిలెట్లు, రెస్ట్ ప్లేస్ ఉంటాయి. పనిని బృందాలుగా విభజించుకుని ఒక బృందం డ్యూటీ దిగితే మరో బృందం డ్యూటీ ఎక్కితే డ్యూటీ దిగిన బృందం నిద్రకు ఉపక్రమించవచ్చు. కానీ అలల తాకిడికి కదిలే యాట్‌లో నిద్ర అంత సులభం కాదు. అయినా బృంద సభ్యులు లెక్క చేయలేదు. ‘మా యాత్రలో పెద్ద పెద్ద సముద్ర తాబేళ్లు చూశాం. ఒక డాల్ఫిన్ల గుంపు మా వెనుక చాలాసేపు వచ్చింది. అద్భుతం’ అంటారు మేజర్ ప్రియా దాస్. భారత నేవీ, తీర ప్రాంత గస్తీ దళాలు వీరి యాత్ర సాగినంత మేర వీరి యాట్‌ను ట్రాక్ చేస్తూ సాంకేతిక సహకారాన్ని అందించాయి. ‘నేను కేన్వాస్ మీద ప్రతిసారీ నీలి రంగును చిత్రించేదాన్ని. ఈ యాత్రతో జీవితకాలపు నీలిమను నేను గుండెల్లో నింపుకున్నాను’ అంది ప్రియా దాస్. స్త్రీలు నౌకాయానంలో రాణించాలని, సెయిలింగ్ క్రీడలో భాగస్వామ్యం తీసుకోవాలని వారికి సందేశం ఇవ్వడానికి ఈ యాత్ర చేశారు వీరంతా. 7500 కిలోమీటర్ల మేర తీరం ఉన్న మన దేశంలో నౌకాయానం వల్ల స్త్రీలు ఎంతో ఉపాధి పొందవచ్చు అని ఆలోచిస్తే ఈ సాహస యాత్ర పూర్తిగా విజయవంతమైనట్టే. -
సముద్రంలో స్వల్ప భూకంపం
సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో స్వల్ప భూ ప్రకంపనలు నమోదయ్యాయి. శనివారం మధ్యాహ్నం 2.16 గంటల ప్రాంతంలో శ్రీకాకుళం జిల్లాకు 121 కి.మీ. దూరంలోను, ఒడిషాకు 161 కి.మీ., పూరీకి 230 కి.మీ. దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.5గా నమోదైనట్లు తెలిపారు. అయితే.. భూమికి 100 కి.మీ. లోతులో ఈ ప్రకంపనలు రావడంతో పెద్దగా ప్రభావం చూపలేదని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ స్పష్టం చేసింది. భూ అంతర్భాగంలో శిలల మధ్య జరిగిన సర్దుబాటు కారణంగా ఈ ప్రకంపనలు వచ్చినట్లు జియాలజీ విభాగ నిపుణులు చెబుతున్నారు. -
Cyclone Jawad: దూసుకొస్తున్న ‘జవాద్’.. తుపానుగా మారిన తీవ్ర వాయుగుండం
సాక్షి నెట్వర్క్: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం శుక్రవారం ఉ.11.30 గంటలకు తుపానుగా మారింది. దీనికి జవాద్ అని పేరు పెట్టారు. ఇది ప్రస్తుతం విశాఖకు ఆగ్నేయంగా 280 కి.మీల దూరంలో.. ఒడిశాలోని గోపాల్‌పూర్‌కి 400 కి.మీ.లు, పూరీకి 460 కి.మీ, పారాదీప్‌కి 540 కి.మీ.ల దూరంలోనూ కేంద్రీకృతమై ఉంది. ఇది గంటకు 14 కిలోమీటర్ల వేగంతో ఉత్తరాంధ్ర తీరం వైపు వస్తుండగా.. శనివారం ఉదయం ఉత్తరాంధ్ర, ఒడిశా తీరాలకు సమీపంలోకి వెళ్లనుంది. తీరానికి దగ్గరయ్యే కొద్దీ గాలుల తీవ్రత పెరిగే అవకాశముందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారి సునంద, అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా తెలిపారు. అనంతరం ఇది దిశను మార్చుకుని ఒడిశా వైపుగా 5వ తేదీ మధ్యాహ్నానికి పూరీ వద్ద తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించారు. ఆ తర్వాత ఇది బలహీన పడి తీవ్ర వాయుగుండంగా ఒడిశా తీరం మీదుగా పశ్చిమ బెంగాల్ వైపు పయనించనుందని వివరించారు. దీని ప్రభావంవల్ల ఉత్తర కోస్తా తీరంలో గంటకు 80–90 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. అలాగే, శనివారం మధ్యాహ్నం 110 కి.మీ గరిష్ట వేగంతో కూడా గాలులు వీచే అవకాశాలున్నాయని వెల్లడించారు. తుపాను ప్రభావంతో సముద్రం అలలు ఎగిసిపడే ప్రమాదం ఉందని.. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఈ నెల 5 వరకూ మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు. తుపాను కారణంగా శనివారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో భారీ వర్షాలు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో అతిభారీ వర్షాలు పడే సూచనలున్నాయంటూ రెడ్ అలెర్ట్ ప్రకటించారు. అదేవిధంగా శనివారం తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే సూచనలున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో.. విశాఖపట్నం, భీమునిపట్నం, కళింగపట్నం, గంగవరం, కాకినాడ పోర్టుల్లో మూడో ప్రమాద హెచ్చరిక, మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో రెండో ప్రమాద హెచ్చరిక జారీచేశారు. సర్కారు అప్రమత్తం.. రంగంలోకి సహాయక బృందాలు తుపాను నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులను అప్రమత్తం చేసింది. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను ఆయా జిల్లాల్లో మోహరించింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తు నిర్వహణ సంస్థ కమిషనర్ కే కన్నబాబు తెలిపారు. మరోవైపు.. ఉత్తరాంధ్ర జిల్లాల్లోని అధికార యంత్రాంగం లోతట్టు ప్రాంతాల నుంచి జనాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. విద్యాసంస్థలకు శనివారం సెలవు ప్రకటించారు. గోదావరి నదిపై పాపికొండల విహార యాత్రను మూడ్రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు పర్యాటక శాఖ డీఎం వీరనారాయణ తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో 1,735 సహాయక బృందాలను ఏర్పాటుచేసింది. అలాగే, వాల్తేరు రైల్వే డివిజన్ పరిధిలో హెల్ప్లైన్లు ఏర్పాటుచేశారు. హెల్ప్‌లైన్ నెంబర్లు ఇవే.. – విశాఖపట్నం రైల్వేస్టేషన్లో : 0891–2744619, 2746330, 2746344, 2746338 – విజయనగరం : 08922–221202, 221206, 8500358610 – శ్రీకాకుళం : 0892–286213, 286245, 8500359367 – నౌపడ జంక్షన్ : 08942–83520, 85959, 8500172878 – రాయగడ స్టేషన్ పరిధిలో : 06856–223400, 223500 ఇప్పటికే 95 రైళ్లను రద్దుచేసిన వాల్తేరు డివిజన్, ఈస్ట్‌కోస్ట్ రైల్వే జోన్ అధికారులు.. తాజాగా మరో 24 రైళ్లని రద్దుచేస్తున్నట్లు ప్రకటించారు. నౌకాదళం సంసిద్ధత తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో సహాయక చర్యల నిమిత్తం తూర్పు నావికాదళం సైతం సన్నద్ధంగా ఉంది. నాలుగు నౌకలు, నేవీ ఎయిర్‌క్రాఫ్ట్‌లను సిద్ధంగా ఉంచింది. తూర్పు నావికాదళం ప్రధాన కార్యాలయం నుంచే కాకుండా రాష్ట్రంలో నేవల్ ఆఫీసర్స్ ఇన్ఛార్జ్, ఒడిశా అధికారులు తుపాను కదలికలు, దాని ప్రభావంపై రాష్ట్ర ప్రభుత్వంతొ నిరంతరం సమీక్షిస్తున్నారు. అలాగే.. ముందస్తు సహాయక చర్యల్లో భాగంగా 13 వరద సహాయక బృందాలను, నాలుగు డైవింగ్ బృందాలను, ఎయిర్‌క్రాఫ్ట్‌లను సిద్ధంచేసినట్లు తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ బిస్వజిత్‌దాస్ గుప్తా తెలిపారు. విజయనగరం జిల్లా వ్యాప్తంగా వర్షాలు తుపాను ప్రభావంతో విజయనగరం జిల్లా వ్యాప్తంగా శుక్రవారం సాయంత్రం వర్షాలు ప్రారంభమయ్యాయి. జిల్లా యంత్రాంగం తుపాను నష్టనివారణ చర్యలు చేపట్టింది. కలెక్టర్, జేసీలు తీరప్రాంత గ్రామాల్లో తిష్టవేశారు. శ్రీకాకుళంలో ప్రత్యేకాధికారి హెచ్. అరుణ్‌కుమార్, కలెక్టర్ శ్రీకేష్ బి. లాఠకర్లతో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ శుక్రవారం సమీక్షించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రత్యేకాధికారులు, ప్రజాప్రతినిధులు తీరప్రాంత గ్రామాల్లో పర్యటించారు. తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడలో కెరటాలు తీరాన్ని ముక్కలు చేశాయి. ఆధునిక టెక్నాలజీతో నిర్మించిన జియోట్యూబ్ రక్షణ గోడను సైతం ఛిన్నాభిన్నం చేశాయి. కెరటాలు దూసుకువచ్చి మత్స్యకారుల ఇళ్లపై విరుచుకుపడ్డాయి. మత్స్యకారులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. -
బలపడిన వాయుగుండం.. సాయంత్రం నుంచే అతి భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం.. ఉత్తరాంధ్ర దిశగా కదులుతోంది. శుక్రవారం తీవ్ర వాయుగుండంగా మారి తుపానుగా బలపడనుంది. ఈ కారణంగా సాయంత్రం నుంచే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. గంటకు సుమారు 100 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. విద్యుత్తు స్తంభాలు, చెట్లు కూలిపోయే ప్రమాదం ఉన్నందున లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని వాతావరణ శాఖ, విపత్తు నిర్వహణ సంస్థ సూచించాయి. చదవండి: (PRC CM Jagan: పీఆర్సీపై సీఎం వైఎస్ జగన్ కీలక ప్రకటన) 5వ తేదీ వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, సముద్రంలో వేటకు వెళ్లిన వారు తిరిగి రావాలని కోరాయి. సాయంత్రానికి ఆగ్నేయ, మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారి విశాఖపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 960 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 1,020 కిమీ దూరంలో కేంద్రీకృతమైంది. అది మరింత బలపడి, తుపానుగా మారి.. వాయవ్య దిశగా ప్రయాణిస్తూ పశ్చిమ మధ్య బంగాళాఖాతం తీరం వరకు ప్రయాణిస్తుందని వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం ఉదయానికి ఉత్తర కోస్తా- దక్షిణ ఒడిశా తీరానికి చేరుతుందని తెలిపింది. తుపానును ఎదుర్కొనేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ముఖ్యంగా తీర ప్రాంత జిల్లాలను అలర్ట్‌గా ఉండాలని సూచించారు. సమయం గడుస్తున్న కొద్ది.. తుపాను తీరాన్ని తాకే ప్రాంతంపై స్పష్టత రానుంది. 24 ఎన్డీఆర్ఎఫ్, 158 రాష్ట్ర అగ్నిమాపక సేవల బృందాలు, 33 ఓడీఆర్ఏఎఫ్ను ఆయా ప్రాంతాల్లో మోహరించారు. -
AP Rain Alert Today: అల్పపీడనం ముప్పు తప్పినట్టే..!
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతం దాని పరిసరాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారకుండా అలాగే కొనసాగుతూ తమిళనాడు, శ్రీలంక వైపు ప్రయాణిస్తుండడంతో రాయలసీమకు వర్షాల ముప్పు తప్పినట్లేనని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఇది అల్పపీడనంగా మారుతుందని అంచనా వేసినా.. అలాగే కొనసాగుతోంది. శ్రీలంక, తమిళనాడులోని కడలూరు, చెన్నై తీరం వైపు ఇది కదులుతుండడంతో అక్కడ భారీవర్షాలు కురుస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం లేదు. 26వ తేదీ నుంచి పలుచోట్ల భారీవర్షాలు మాత్రం కురిసే అవకాశం ఉందని, 28, 29 తేదీల్లో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పలుచోట్ల భారీవర్షాలకు అవకాశం ఉందని తెలిపారు. మరోవైపు దక్షిణ అండమాన్ సముద్రంలో 29వ తేదీనాటికి ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. (చదవండి: వైఎస్సార్ మరణంలో బాబు కుట్రపై అనుమానాలు..) -
AP Rain Alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతంలో దక్షిణ తమిళనాడు–శ్రీలంక తీరంలో బుధవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతం, దాని పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని, దీని ప్రభావంతోనే అల్పపీడనం ఏర్పడుతుందని పేర్కొంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి శ్రీలంక–ఉత్తర తమిళనాడు వైపు వెళ్లే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం మరింత బలపడి 26వ తేదీన తమిళనాడు, శ్రీలంక ప్రాంతాల్లోనే తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో 26, 27 తేదీల్లో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో, 27వ తేదీ వైఎస్సార్ జిల్లాలో భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెప్పారు. మరోవైపు నైరుతి బంగాళాఖాతం మధ్య ప్రాంతంపై ఉన్న ఉపరితల ఆవర్తనం దక్షిణ తమిళనాడు వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావం వల్ల రాష్ట్రంలో పలుచోట్ల ఓ మోస్తరు వర్షాలు పడే సూచనలున్నాయి. రైతులు, సాధారణ పౌరులు అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణశాఖ అధికారులు కోరారు. డిసెంబర్ 15వ తేదీ వరకు నైరుతి బంగాళాఖాతంలో వరుసగా ఉపరితల ఆవర్తనాలు, ద్రోణులు, అల్పపీడనాలు ఏర్పడే అవకాశాలున్నట్లు తెలిపారు. గడిచిన 24 గంటల్లో రాజమండ్రిలో 97.75 మిల్లీమీటర్లు, జంబుపట్నంలో 92.5, గాజువాకలో 64.5, కంటిపూడిలో 58.25, నిడదవోలులో 56.5, తాడేపల్లిగూడెంలో 55.25, భీమడోలులో 49.75, ప్రత్తిపాడులో 41, రెడ్డిగూడెంలో 39.25, నర్సీపట్నంలో 34.75, మాడుగులలో 34 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
AP: బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, అమరావతి/మహారాణిపేట(విశాఖ దక్షిణ): ఆగ్నేయ మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్‌లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలపడి మంగళవారం అల్పపీడనంగా మారనుంది. చెన్నైకి 400 కిలోమీటర్ల దూరంలో ఏర్పడే ఈ అల్పపీడనం మరో 24 గంటల్లో వాయుగుండంగా మారి పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ గురువారం తెల్లవారుజామున ఉత్తర తమిళనాడు తీరానికి చేరుకునే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. దీనిప్రభావం వచ్చే నాలుగు రోజులు దక్షిణకోస్తా, ఉత్తర తమిళనాడులపై తీవ్రంగా ఉండే అవకాశం ఉందన్నారు. తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, 11, 12 తేదీల్లో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయన్నారు. సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని రాష్ట్ర విపత్తుల నిర్వహణశాఖ కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు. భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విశాఖ ఏజెన్సీలో తగ్గిన ఉష్ణోగ్రతలు పాడేరు: విశాఖ ఏజెన్సీలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మూడురోజుల నుంచి చలిగాలులు అధికమవడంతోపాటు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. సాయంత్రం 5 గంటల నుంచే చలిగాలుల తీవ్రత నెలకొంటోంది. అర్ధరాత్రి నుంచే దట్టంగా పొగమంచు కురుస్తోంది. సోమవారం జి.మాడుగులలో 10.5 డిగ్రీలు, డుంబ్రిగుడలో 10.7, పెదబయలులో 11.1, అరకులోయలో 11.4, ముంచంగిపుట్టులో 11.5, హుకుంపేటలో 12.1, పాడేరులో 12.5, చింతపల్లిలో 13 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
Rain Alert: ఏపీలో నేడు, రేపు వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తమిళనాడు, శ్రీలంక మధ్య ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది. దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 కి.మీ. ఎత్తులో కొనసాగుతోంది. అల్పపీడనం ప్రభావంతో తూర్పు గాలులు తక్కువ ఎత్తులో రాష్ట్రం వైపు బలంగా వీస్తున్నాయి. ఈ కారణంగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. (చదవండి: AP: దైన్యాన్ని తరిమి.. ధాన్యం భరోసా) ఆది, సోమవారాల్లో కోస్తా, రాయలసీమల్లో చాలాచోట్ల మోస్తరు వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వెల్లడించారు. నవంబర్ మొదటి వారంలో కోస్తాంధ్ర జిల్లాల్లో ఎక్కువ వర్షాలు కురిసే సూచనలున్నాయని చెబుతున్నారు.(చదవండి: బాబు ఊగిపోతూ.. తమ్ముళ్లు తూగిపోతూ!) రెండో వారంలో అల్ప పీడనం నవంబర్ రెండో వారంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని.. ఇది వాయుగుండంగా మారే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ వైపు వస్తుందా లేక దిశ మార్చుకుంటుందా అనే విషయంలో ఇంకా స్పష్టత లేదంటున్నారు. గడచిన 24 గంటల్లో పెదకాకానిలో 79.75 మి.మీ., శృంగవరపుకోటలో 55.5, అద్దంకిలో 54.25, జీకే వీధిలో 53, అనంతగిరిలో 51, వేమనపురంలో 49, జగ్గయ్యపేటలో 48.25, చింతలపూడిలో 46.5, తాడిమర్రిలో 45.75 మి.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. -
6న మరో అల్పపీడనం.. తుపానుగా మారే అవకాశం
సాక్షి, అమరావతి/మహారాణిపేట (విశాఖ దక్షిణ): నైరుతి బంగాళాఖాతంలో తమిళనాడు, శ్రీలంక తీరప్రాంతం సమీపంలో అల్పపీడనం ఏర్పడింది. నవంబర్ 6వ తేదీన మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఇది బలపడి తుపానుగా మారే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న అల్పపీడనం మూడు, నాలుగు రోజుల్లో పశ్చిమదిశగా ప్రయాణించి బలహీనపడడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు వాతావరణ అధికారులు తెలిపారు. దీనికి అనుబంధంగా ఉత్తరాంధ్ర తీరంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వీటి ప్రభావంతో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే మూడు రోజులు దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఉత్తరాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం రాష్ట్రంలో 5.5 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. -
Rain Alert: ఏపీలో రెండు రోజులు వర్షాలు
మహారాణిపేట (విశాఖ దక్షిణ): దక్షిణ బంగాళాఖాతంలో 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం విస్తరించింది. ఇది పశ్చిమదిశగా ప్రయాణించే అవకాశం ఉందని, దీనివల్ల అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ఉపరితల ఆవర్తనం నుంచి ఉత్తర బంగాళాఖాతం వరకు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ద్రోణి విస్తరించింది. దీని కారణంగా రాగల 48 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. చదవండి: Extramarital Affair: ‘సంబంధం’ పెట్టుకుని.. సస్పెండయ్యారు! -
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
సాక్షి, అమరావతి/మహరాణిపేట (విశాఖ దక్షిణ): వాయవ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ తీరంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఇది రానున్న 24 గంటల్లో బలపడనుందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావం వల్ల రానున్న 48 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రధానంగా విశాఖ, తూ.గో.జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గులాబ్ తుపాను ప్రభావంతో కోస్తాలో పలుచోట్ల మంగళవారం కూడా వర్షాలు కురిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా సగటున 7.1 మి.మీ. వర్షపాతం నమోదైంది.