సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలోని అల్పపీడనం దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్రల సమీపాన వాయవ్య బంగాళాఖాతంలో పశ్చిమ మధ్య ప్రాంతానికి ఆనుకుని కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో తుఫాను ఆవర్తనం నెలకొంది. ఈ అల్పపీడనం ఈ రోజు సాయంత్రానికి వాయుగుండంగా బలపడవచ్చు. ఇది ఉత్తర వాయవ్య దిశగా ఒడిసా తీరం వెంబడి, వాయవ్య బంగాళాఖాతంలో పయనిస్తూ 48 గంటల్లో బెంగాల్ బంగ్లాదేశ్‌ల మీదకు వెళుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రేపు సాయంత్రానికి ఇది తీవ్ర వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. చదవండి: వదలని వరద
తూర్పు తీరం నుంచి పశ్చిమ తీరం వరకూ ద్రోణి కొనసాగుతోంది. ఇది మరో మూడురోజులు ప్రభావశీలంగా ఉంటుంది వీటి ప్రభావం తెలంగాణ కోస్తాంధ్రలమీద తక్కువగా కోస్తా రాయలసీమలో మాత్రం కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఉత్తరాంధ్ర సుముద్రతీరం అల్లకల్లోలంగా ఉంటుంది. మత్స్యకారులు వేటకు పోరాదనీ వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment